Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • వెంటాడే నీడ ఎపిసోడ్ 16 | Ventade Nida Episode 16 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వెంటాడే నీడ ఎపిసోడ్ 16

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    సీఐ కిషోర్ ని వెనకనుండి అటాక్ చేస్తాడు అగంతకుడు.

    ఏసిపి ప్రతాప్ విజయవాడ పోలీసుల్ని అప్రమత్తం చేస్తాడు.

    లారీ కిందికి సుమంత్ ని తోసేయాలని ప్రయత్నించాడు గోవిందు.

    కుదరక పోవడంతో తనే కారు కిందకి దూకుతాడు.

    సుమంత్, తన తండ్రికి కాల్ చేసి తన పరిస్థితి వివరిస్తాడు

    ఇక చదవండి…

    గోవిందును హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన తరువాత హాస్పిటల్ మేనేజర్ సుమంత్ ను ఏం జరిగిందని అడుగుతాడు.

    "గోవిందు నా వద్దకు వచ్చి డాక్టర్ గోవర్ధన్ నాకు  విషం ఇంజెక్ట్ చెయ్యబోతున్నాడని చెప్పాడు. నా చెయ్యి పట్టుకొని నన్ను బలవంతంగా బయటకు తీసుకొని వచ్చాడు. అప్పుడతని చూపులు మామూలుగా లేవు. ఏదో మత్తులో ఉన్న వాడి చూపుల్లా  ఉన్నాయి. నన్ను రోడ్డు మీద వేగంగా వస్తున్న లారీ కిందకు నెట్టెయ్యాలని చూశాడు. అదృష్టవశాత్తు నేను పడిపోలేదు. మీరు రావడంతో అతను కారు కిందకు దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు" చెప్పాడు సుమంత్.

    "నాకు ఒక సందేహం. గోవిందు మిమ్మల్ని లారీ కిందకు నెట్టడానికి తన బలాన్నంతా ఉపయోగించాడు. మేము దూరం నుండే అది గమనించాము. కానీ మీరు ఎంతమాత్రం కదల్లేదు. మాకు చాలా ఆశ్చర్యం కలిగింది" అన్నాడు హాస్పిటల్ మేనేజర్.

    "నాక్కూడా అదే అర్థం కావడం లేదు. నిజానికి నాకు వంట్లో చాలా నీరసంగా ఉంది. గోవిందు నా చెయ్యి పట్టుకుని నన్ను బయటకు సులభంగా లాక్కొని వెళ్ళాడు. కానీ అతను తోసినప్పుడు నేను స్థిరంగా ఉన్నాను. ఇది ఖచ్చితంగా దైవానుగ్రహమే. మా మామయ్య శంకర శాస్త్రి నాకోసం పూజలు చేస్తున్నారు. ఆ ప్రభావమే నన్ను కాపాడి ఉండవచ్చు" అన్నాడు సుమంత్.

    తరువాత అతను రిసెప్షన్ లో ఉన్న ఒక ఫోన్ నుండి తన తండ్రికి కాల్ చేశాడు. తనకు యాక్సిడెంట్ అయిన విషయం తెలియజేశాడు.

    తరువాత హాస్పిటల్ మేనేజర్ తో "నేను అనుకున్నదే కరెక్ట్. సరిగ్గా గోవిందు నన్ను లారీ కిందకు తోసే సమయానికి మా మామగారు నా ఫోటో పైన విబూది ఉంచారట" అని చెప్పాడు..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/eUWKEYffn0A



    11 min
  • నేనే చిన్న కోడలు | Nene Chinna Kodalu | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    నేనే చిన్న కోడలు

    రచన: కిడాల శివకృష్ణ

    ఈసారి వెళ్ళిన దసరా పండుగను, దీపావళిని నా జీవితంలో ఎప్పుడు జరుపుకోని విధంగా మా అత్తమామలతో కలిసి చాలా సంబరంగా జరుపుకున్నాము. ప్రస్తుతానికి మేము సంక్రాంతి పండుగను ఎలా జరుపుకోవాలి అనే ప్రణాళికను తయారుచేస్తూ ఉన్నాము. అయినా నేటి ఆధునిక, కంప్యూటర్ ప్రపంచంలో అత్తమామలతో కలిసి కొడుకు కోడలు, అక్కా బావలతో కలిసి పండుగ జరుపుకోవడం ఏమిటీ అని మీ సందేహమా?? అయితే నా కథను చెపుతాను వినడానికి రండి!.

    నా పేరు కావ్య, మా ఆయన పేరు హరి. మా పెళ్లి 2016 లో జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు. నాకు మేనమామ అవుతాడు హరి. అంటే మేనరికపు పెళ్లి అన్నమాట. నాకు పెళ్ళి అయిన కొన్ని నెలలు మాత్రమే చాలా మంచిగా సంతోషంగా జీవితం అత్తామామాలతో గడిచింది. తరువాత గొడవలు మొదలు అయ్యాయి. అంటే అత్తా మామ చెప్పే పనులు నాకు నచ్చడం లేదు. ఎందుకంటే ప్రతి రోజూ ప్రతి చిన్న పనీ నాకు చెప్పడంతో నాకు చాలా విసుగు వచ్చేది..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/8EqdGBO5Yfw


    4 min
  • ప్రేమ‘భ్రమ’రం - 1 | Prema Bhramaram - 1 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ప్రేమ‘భ్రమ’రం - 1

    రచన: వసుంధర

    నేను భావుకుణ్ణి కాను. ఉగ్రవాదినీ కాదు. చాలా మామూలు మనిషిని.

    మామూలుగా ఆలోచించినప్పుడు నాకు అనిపిస్తుంది - బంగారానికీ ప్రేమకూ గొప్ప సామ్యం ఉందని.

    జనతకు బంగారం విలువైనది. యువతకు ప్రేమ విలువైనది.

    జనత బంగారం కోసం ఏమైనా చెయ్యాలనుకుంటుంది. యువత ప్రేమకోసం ఏమైనా చెయ్యాలనుకుంటుంది.

    ఒకటి ధనజాలమైతే, మరొకటి ప్రేమ జాలం.

    ప్రేమజాలంలో పడకూడదని చాలా సార్లు మామూలుగా అనుకున్నాను. కానీ ఇటీవల అలా అనుకున్నప్పుడు - ముక్త గుర్తుకొస్తోంది.

    ముక్త మామూలు మనిషి కాదని - మొదటిసారి చూసినప్పుడే అనిపించింది నాకు.

    మొదటిసారి ఆమెని కలుసుకోవడం విచిత్ర పరిస్థితుల్లో జరిగింది.

    నా గురించి చెప్పాలంటే -

    ఒక మందుల తయారీ కర్మాగారంలో - సాంకేతిక పరంగా ఉన్నత పదవిలో ఉన్నాను. మేము తయారు చేసే మందుల్లో వాడే వివిధ లోహాల్లో బంగారం కూడా ఉంది..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/D-Wja2XXso8


    35 min
  • చెదిరిన స్వప్నం | Chedirina Swapnam | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    చెదిరిన స్వప్నం

    రచన: కిడాల శివకృష్ణ

    సముద్రపు అలలు తాకుతూ పద్దెనిమిది సంవత్సరాల వయస్సు గల ఒక కోమలిని తాకిన ఆ గాలి, విహరిస్తూ నా తనువును తాకి పోతూ ఉంటే, ఆ తాకిడికి చలించి పోయిన నా మనస్సు, నా తనువును కూడా మరిచి పోయింది.

    అటువంటి సమయంలో చంద్రుని వెన్నెల కాంతులను కూడకలుపుకుని నక్షత్ర కాంతిని విరజిమ్ముతూ, నా చెలి వయ్యారంగా హంస వలే అడుగులో అడుగు వేస్తూ నన్ను చేర వస్తోంది.

    అటువంటి సమయంలో తన కాలి అందెల సవ్వడికి నా హృదయం తాళం వేస్తూ, మనస్సులో రగిలించేను కొరికలేన్నో, తను చేరువయ్యే కొలది నాకు ఊపిరి కూడా ఆడనంత  ఉత్సాహంతో  తనువు తనను చేర వెళ్తోంది. కను రెప్ప కాలంలోనే తనను చేరుకున్న నా దేహం తన దేహంతో మల్లెతీగలా పెనవేసుకోవాలని తపన పడుతుంది.

    అటువంటి సమయంలో తను, తన మృదు హస్తాలతో నా హృదయాన్ని తాకింది. ఆ తాకిడికి తాళలేని నా మనస్సు విరహయాతన పడుతూ  కోర్కెను తీర్చమని ఆరాటపడుతోంది...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/hpdec_9a-pk


    6 min
  • రవ్వ కేసరి |Ravva Kesari | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    రవ్వ కేసరి

    రచన: లక్ష్మి మదన్

    శ్రావణమాసం- నోములకి, వ్రతాలకి ప్రశస్తం. అందరిలోనూ పండగ వాతావరణం కొలువై ఉంటుంది.

    శ్రీవల్లి కూడా పొద్దున్నే చాలా హడావిడిగా ఉంది. వంట, పూజ, నైవేద్యం.. అన్నీ కావాలి. పిల్లలకి, భర్తకి బాక్సులు సర్దాలి. అందుకే రోజు కన్నా ముందే లేచి స్నానం చేసుకుని వంట మొదలెట్టింది. త్వరగా అవుతుందని నిమ్మకాయ పులిహోర, రవ్వ కేసరి, టమాటో పప్పు, అన్నం, చారు చేయడానికి సిద్ధపడింది.

    ముందుగా వంట పూర్తి చే, దేవుడి పూజ చేసి, నైవేద్యం పెట్టేసింది. ఇంతలో పిల్లలు స్నానాలు చేసి స్కూల్ యూనిఫామ్ వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు.

    "అమ్మా! త్వరగా  అన్నం పెట్టు. స్కూల్ కి టైం అవుతోంది" అని కూతురు నీరజ, కొడుకు కార్తీక్ ఒకేసారి అడిగారు.

    "పెట్టేస్తున్నా! ఒక్క ఐదు నిమిషాలు రా నాన్నా"అంటూ గబగబా ప్లేట్లలో పులిహోర, రవ్వ కేసరి పెట్టి ఇచ్చింది.

    "ఎప్పుడు చూసినా పులిహోర, రవ్వ కేసరి.. ఇదే చేస్తావు" అని చిరాకు పడ్డాడు కార్తీక్.

    తమ్ముడికి వంత పలుకుతున్నట్టుగా నీరజ కూడా ‘అవును’ అన్నట్లుగా తల ఊపింది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/Q5uWqIU1PXQ


    7 min
  • కాకతి రుద్రమ ఎపిసోడ్ 11 | Kakathi Rudrama Episode 11 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కాకతి రుద్రమ ఎపిసోడ్ 11

    రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    గత ఎపిసోడ్ లో…

    రామప్ప దేవాలయ ప్రాభవం కళ్ళకు కట్టినట్లు వివరించడం జరిగింది.

    ఈ ఎపిసోడ్ లో ఉద్యానవనంలో వీరభద్ర, రుద్రమ దేవి ల కలయిక గురించి ..

    .. చదవండి

    ఇవాళ అపురూపమైనరోజు. తనను మార్చబోతున్న రోజు. తను మారబోతున్న రోజు.

    కానీ ఆమెకు తెలియదు.

    ఆమెకు అత్యంత ఆప్తుడైన ప్రియుడు శ్రీశ్రీశీ చాళుక్యవీరభద్రుడు, రాజ్యకార్యలని చర్చించటానికి ఏకశిలానగరానికి  విచ్చేశాడని. శివదేవయ్య మహామాత్యులకు,

    "రుద్రదేవులు, ఏకాంత ఉద్యానవనంలో  వంటరిగా విహరిస్తున్నారని, వారు ప్రస్తు

    తము ఎవరినీ చూడరనీ " ముఖ్య మైన ఆంతరంగిక చెలికత్తె చెప్పిన వార్త.

    ఆమెకూ చెలికత్తె చాళుక్యవీరభద్రులు  వచ్చారనే వార్త తెలియనివ్వలేదు. స్వచ్చం

    దంగా,వొంటరిగా, ఉద్యానవనంలో విహరిస్తున్న ఆమెన యిబ్బందిపెట్టడం ఎవరికీ  యిష్ఠం లేదు.

    ఈ రాచకార్యాలు ఎప్పుడూ వుండేవే. ఎన్నడూ తెమలవు. తరగవు. అంతా గజిబిజి.

    వీరభద్రప్రభువు ఆంతరంగిక వ్యవహారమని, కాస్సేపు ఏకశిలానగరపు వీదుల

    గుండా, గుర్రం స్వారీ చేశాడు.

    అతనికి ఎందుకనో రుద్రదేవుణ్ణి వెంటనే చూడాలనే గాఢమైన కోరిక  కలుగుతు

    న్నది. కానీ వీలపడదే. ఎట్లా అతన్ని కలవటం! ఇద్దరూ వొకర్ని గురించి మరొకరు

    ఆలోచిస్తున్నారు. తీరికలేని ఆలోచనలు.

    రుద్రమదేవి ఆకాశం వంక చూసినది..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/bQmCY2e-i5A



    12 min
  • సు ధీర ఎపిసోడ్ 11 | Su Dheera Episode 11 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సు...ధీర ఎపిసోడ్ 11

    రచన:  బివిడి ప్రసాదరావు

    గత ఎపిసోడ్ లో…

    ఫోన్ చేసి ధీరని రమ్మంటుంది సు.

    సు కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని చెబుతాడు ధీర.

    ఇక చదవండి...

    చెప్పుతున్న ధీరకి టక్కున అడ్డై..

    "నీది..  వయస్సుకు మించిన మెచ్యూరిటీ. ఐ లైక్ ఇట్." చెప్పేసింది సు.

    "అదేమి కాదు.. నీ మీది నా అభిప్రాయం నన్ను స్టేబుల్ పరుస్తుంది." చెప్పాడు ధీర.

    "టీ టైం.." అంటూ లేచింది సు.

    ఫ్రిజ్ లోని రెండు నారింజల్ని తీసింది.  వాటి రసాలతో జ్యూస్ చేసి.. రెండు గ్లాసుల్లో సర్దింది. వాటిని ఒక ప్లేట్ లో పెట్టింది. కప్ బోర్డ్ లోంచి బిస్కెట్ల ప్యాకెట్టు తీసి.. నాలుగేసి బిస్కెట్లు చొప్పున ఆ ప్లేట్ లో సర్దింది.

    ధీర చెంతకి వచ్చింది సు. తన చేతిలోని ప్లేట్ ని టీపాయ్ మీద పెట్టింది.

    "తీసుకో" అంది సు. తను నాలుగు బిస్కెట్లును తీసుకుంది.

    ధీర రెండు బిస్కెట్లు తీసుకున్నాడు.

    "నీది కంప్యూటర్స్ లో డిగ్రీయా." అడిగింది సు.

    "బిటెక్ లో." చెప్పాడు ధీర.

    చిన్నగా నవ్వింది సు.

    "నీ కుటుంబం ఏమిటి." అడిగింది సు.

    "యాక్చువల్ గా.. నాది రాజమండ్రి. జాబ్ వలన హైదరాబాద్ వచ్చాను. నాతో పాటు అమ్మా నాన్నలని తీసుకొచ్చేశాను. నేను ఒక్కడ్నే వాళ్ల సంతానం." చెప్పుతున్నాడు ధీర.

    "బిస్కెట్స్ తింటూ మాట్లాడు." నవ్వింది సు.

    "అమ్మ నాన్నల తరుపు వారంతా రాజమండ్రి చుట్టు పక్కల ఉన్నారు. నాన్న బట్టలు వ్యాపారం చేసేవారు. అతనిది అంతంత బిజినెస్.. నేనే మానిపించేశాను. రెండు అద్దెలు ఎందుకు.. దూరాలు ఎందుకు.. నా వద్ద హాయిగా ఉండ మన్నాను." చెప్పుతున్నాడు ధీర బిస్కెట్లు తింటూ.

    ఒక జ్యూస్ గ్లాసు తీసుకుంది సు.

    "రాజమండ్రిలో మాకే ఆస్తులు లేవు. నేను ఇక్కడ.. ఇప్పుడు మేము ఉంటున్న ప్లాట్ ని.. బ్యాంక్ ఇచ్చిన అప్పుతో కొనుక్కున్నాను. ఇంత కంటే నా గురించి మరేమీ లేదు." చెప్పాడు ధీర.

    ఖాళీ గ్లాస్ ని టీపాయ్ మీద పెట్టింది సు.

    ధీర జ్యూస్ ఉన్న గ్లాస్ ని తీసుకున్నాడు.

    అతడు జ్యూస్ తాగే వరకు ఆగింది సు.

    ధీర ఖాళీ గ్లాస్ ని టీపాయ్ మీద పెట్టేక..

    "నేను.. నీ వాళ్లకి తెలుసా.. ఐ మీన్.. నా ప్రొగ్రామ్స్.. నీ పేరెంట్స్ చూస్తుంటారా." అడిగింది సు.

    "వాళ్ల కాలక్షేపమే టివి.. నీవీ చూస్తుంటారు." చెప్పాడు ధీర.

    ఆగి.. చిన్నగా నవ్వుతూ.. "నా గురించి ఏమనుకుంటారు." అడిగింది సు.

    "అంత పర్టిక్యూలర్ గా.. నీ గురించి.. వాళ్ల నుండి.. నేనేమీ ఆలకించ లేదు.. బట్.. నీ ప్రొగ్రామ్స్ ఐతే చూస్తుంటారు." చెప్పాడు ధీర.

    ఆ వెంటనే.. "ఈ మధ్య నీ కొత్త సీరియల్ చూస్తున్నారు.. వాళ్లు చూస్తుండడం నేను చూశాను." చెప్పాడు ధీర.

    నవ్వేసింది సు.

    తర్వాత.. "మరి.. నేను.. నీకు తెలుసు అని.. వాళ్లకి తెలుసా." అడిగేసింది సు.


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/7Nq8VI7n2bY



    14 min
  • ఈ మనిషి రిపేరు చేయబడ్డాడు | Ee Manishi Repair Cheyabaddaadu | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఈ మనిషి రిపేరు చేయబడ్డాడు!

    రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

    ఆనందరావు తన కొడుకును చదువు నిమిత్తం చెన్నై హాస్టల్ లో ఉంచడానికి వచ్చి, తగిన ఏర్పాట్లు చేసి... తను తిరిగి తన ఊరు కాకినాడ వెళ్ళిపోతూ.. కొడుకుకు చాలా విష యాలు చెప్పడం ఆరంభించాడు... ఆ ప్లాట్ ఫారం మీద.

    ఇది రమారమి మూడు సంవత్సరాల క్రితం సంఘటన......

    ***

    జనవరి, 2020... "కోవిడ్".. ప్రజా జీవనాన్ని అల్లకల్లోలం చేస్తున్న సమయమది.

    "ఒరేయ్.. రవీ.. నిన్ను ఈ చెన్నై లో ఉంచటం నాకసలు ఇష్టం లేదురా. ఏదో.. నీ ఫ్రెండ్స్ ఇక్కడే చదువుతున్నా రన్నావని 'సరే'... అన్నాను.

    నాకసలు ఏమాత్రం ఇష్టంలేని వ్యక్తి… అదేరా.. మీ బాబాయ్ వెధవ.. ఇక్కడే ఉంటున్న విషయం నీకూ తెలుసుగా... ఇక్కడకుదగ్గరే... అదే........

    అది... అది... " చెట్టియార్ స్ట్రీట్ ".. ఏదో అను కుంటాను... అక్కడ ఏడుస్తున్నాడట.

    వాడు నాకు పరమశత్రువు. ఇరవైఏళ్ల క్రితం మాట.... నీకు అప్పుడు ఐదేళ్లు ఉండొచ్చు. విషయాలు నీకు గుర్తుండి వుండవులే.

    ఆస్తి పంపకాల్లో అప్పట్లో మాకు- మాకు, చాలా చాలా పెద్ద పెద్ద గొడవలు వచ్చి విడిపోయాం. ఆ వెధవ పోలీస్ స్టేషన్, కోర్టు ల వరకు నన్ను తిప్పాడు. తిట్టాలని కాదుగాని... వాడు దుర్మార్గుడు.. నీచుడు.. పాపాత్ముడు..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/L1yLeYvg0oY


    20 min
  • మరచిపోవాలని మరచి తలుస్తున్నా | Marachi Povalani Marachi Thalusthunna | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    మరచిపోవాలని మరచి, తలుస్తున్నా.. 

    రచన: కిడాల శివకృష్ణ

    సాయంత్ర కాలంలో చెరువు గట్టుపై మిత్రులతో కలసి, శివ మిరపకాయ బజ్జీలు తింటూ ఉన్నాడు. ఆ సమయంలోనే మంచి చల్లని గాలి తాకుతూ ఉంది. ఏదో తెలియని ఉత్సాహంతో మనసు ఉరకలు వేస్తూ ప్రశాంతంగా ఉంది.

    బజ్జీలు తిన్న తర్వాత మాటలలో తమ ప్రేమ వ్యవహారాల గురించి చర్చిస్తూ ఉంటే, ఒక్కసారిగా శివకి తన ప్రేయసి కళ్యాణి గుర్తుకు వచ్చింది. ఎందుకో శివ కళ్ళలో శివకే తెలియకుండా సముద్రం కనిపిస్తోంది.

    ఆ ఘటనను చూసిన శివ మిత్రులు “ఏరా.. ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు..” అంటూ ఓదార్చ సాగారు.

    అప్పుడు శివ “ఏమీ లేదురా! గాలి ఎక్కువగా రావడం వలన నా కంట్లో నలుసు పడి కన్నీళ్లు వచ్చాయి” అంటూ నచ్చచెప్పి అందరినీ ఇంటికి పంపి అక్కడే కూర్చుండిపోయాడు.

    అయినా తన ప్రేయసి అయిన కళ్యాణిని మరచి పోవాలని  సులభంగా నిర్ణయించుకున్నా, ఆ విషయాన్ని మాత్రం శివ మరచిపోయి మరలా తలుచుకుంటూ తన ఊహాలలోకి వెళ్లి పోసాగాడు.

    తన ఊహా ప్రపంచంలో మూడు సంవత్సరాల వెనక్కి పోయాడు శివ.

    పదేడేళ్ళ  వయసున, తరగతి గదిలో కళ్యాణిని చూసేసరికి శివకి మతి పోయింది. చామంచాయ రంగుతో, చంద్రబింబం లాంటి ముఖంతో, చిరునవ్వులు పూయిస్తూ కిలకిల నవుతూ ఉంది కళ్యాణి.  ఆ సమయంలోనే శివ మనసులో నిలిచి పోయింది కళ్యాణి. తనతో మాట్లాడాలని అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శివ. ఆ ప్రయత్నాలలో మూడు సార్లు విఫలం అయ్యాడు..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/qWrwWv3eVBs




    7 min
  • కాకతి రుద్రమ ఎపిసోడ్ 10 | Kakathi Rudrama Episode 10 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కాకతి రుద్రమ ఎపిసోడ్ 10

    రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    గత ఎపిసోడ్ లో…

    వరదారెడ్డి తో వివాహం ఇష్టం లేదని చెబుతుంది అన్నమాంబిక. పురుష వేషంతో కోటను దాటి గన్నా రెడ్డి ని చేరుకుంటుంది.

    ఇక చదవండి…

    ఈ దేవాలయాన్ని 1213 లో గణపతిదేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించెను. ఈ ఆలయం నిర్మాణానికి 40 ఏళ్ళు పట్టిందట. ఈ ఆలయం గోపురం నిర్మాణానికి వాడిన ఇటుకలు నీటిలో వేస్తే తేలియాడుతాయి. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయంలో దైవం పేరు మీద కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పిపేరు మీద గా ఉండటం విశేషం.

    ఈ పేరుకు శివుని పేరు  కూడా కలిపి రామలింగేశ్వరఆలయం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయంలో ప్రదాన దైవం రామలింగేశ్వరుడు. విష్ణువు అవతారం రాముడు, శివుడు కలిసి ప్రధాన దైవం గా వున్న ఆలయం.

    ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేకశైలి, ఎత్తైనపీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి వుంటుంది. ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగాన మూడు వైపుల ప్రవేశద్వారం తో కలిగి  మహామండపం వుంది..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/JsE9itxW0Qk



    7 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world