Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • Pole Star Of Physics - Suri Bhagavantham | భౌతిక శాస్త్ర ధృవ తార - సూరి భగవంతం | Telugu article On Science | N Sai Prasanthi | manatelugukathalu.com

    (వ్యాసం manatelugukathalu.com లో చదవడానికి వ్యాసం పేరు మీద క్లిక్ చేయండి)

    భౌతిక శాస్త్ర ధృవ తార - సూరి భగవంతం

    రచన: N. సాయి ప్రశాంతి

    భౌతిక శాస్త్రరంగంలో అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు భారతదేశం లో పుట్టారు. పూర్వకాలంలో అణువులపై పరిశోధనలు చేసిన కణాదుడు, మొదటి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అగస్త్యుడు మరియు తన పరిశోధనలతో నోబెల్ బహుమతిని సాధించిన సివి రామన్ అనేకులు ఉన్నారు

    అయితే కొందరి గురించి మాత్రమే మనకు తెలుసు.

    అలా ప్రపంచం మరిచిపోయిన శాస్త్రవేత్తలలో ఒకరు సూరి భగవంతం గారు

    ఆయన శాస్త్ర రంగం అభివృద్ధికి ఎంతో సేవ చేసారు.

    ఆయన చేసిన పరిశోధనలు ఇప్పుడు భౌతిక శాస్త్ర రంగంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి...

    Read the full article on www.manatelugukathalu.com

    ఈ వ్యాసం మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ వ్యాసాన్ని యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/fQCkzMkZCFE




    5 min
  • కాకతి రుద్రమ ఎపిసోడ్ 9 | Kakathi Rudrama Episode 9 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కాకతి రుద్రమ ఎపిసోడ్ 9

    రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    గత ఎపిసోడ్ లో…

    కుమార సంభవానికి యక్షగానం ఆడుతుంది మధుసాని.

    రాత్రిపూట అన్నమాంబిక వద్దకు వస్తాడు గోన గన్నారెడ్డి.

    ఇక చదవండి...

    రాజ ప్రాసాదము ఎత్తయిన గోడలను దాటి , ఇంతమంది కావలి  వారికంట కారముగొట్టి.... పహరా కాసేవాళ్ళను తప్పించుకుని.. ఎట్లా వచ్చాడు?

    దీక్షగా చూసినది.

    గుండె ఆగినట్లయింది.ఇంతటి చలిగాలిలోనూ వొళ్ళంతా చెమట!

    ఆమె ముందు నిలబడినాడు.

    గోన వంశాబ్ధి సోముడు ' గన్నారెడ్డి'.

    గంభీరంగా - హుందాగా - ధీర పురుషుని వలె -

    అతడు నవ్వినాడు.- నమస్కరించినాడు.

    "మీరు.......?"

    "నేను, 'గజదొంగ..' అని  లోకులు పిలిచే గన్నారెడ్డిని".

    ఆమె  ' ఆ' అనలేదు--" ఊ" అనలేదు.

    "భయపడుతున్నారా?"

    "లేదు".

    "ఇంత చీకటిలో ఎట్లా రాగలిగారు?"

    "దొంగను కదా!" అని స్నిగ్ధంగా  నవ్వాడు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/TuQxYNMOylA


    9 min
  • Love Challenge Episode 25 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 25 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 25

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    తన స్వంత ఊరు రామకృష్ణాపురం లో ఒక సభ ఏర్పాటు చేసి, రిత్విక్, జీవన్ లను ఆ గ్రామస్థులకు పరిచయం చేస్తాడు రాఘవేంద్ర.

    ఆ రోజు రాత్రి డిన్నర్ సమయంలో దీప్య మీద తనకు కోరిక ఉన్నట్లు సందీప్ తో చెబుతాడు చందూ.

    అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు కూడా చెబుతాడు.

    ఇక చదవండి…

    "నేను చెప్తున్నది మీకు అర్థమవుతోందా" అని అడిగాడు రిత్విక్.

    "మా హై స్కూల్ హెడ్మాస్టర్ గారు ఏ విషయమైనా అరటి పండు ఒలిచి పెట్టినట్టు చక్కగా వివరించి  చెబుతారు. మీరు చెప్పేది కూడా అలాగే ఉంది" అన్నారు గ్రామస్థులు.

    తిరిగి తన ప్రదర్శన కొనసాగించాడు రిత్విక్.

    ముందులాగే నలుగురు స్టూడెంట్స్ మెడలోని పలకల్లో 'ప్రజలు' అని రాసుకొని ఉన్నారు.

    వాళ్లు 'నాయకుడు' అని రాసి ఉన్న వ్యక్తికి వేలు చూపించి పనులు చెబుతూ ఉంటే అతను చేస్తూ ఉన్నాడు. మరి కొంత సేపటి తర్వాత నాయకుడు ఒకచోట కూర్చొని ఉండగా ప్రజలు అతని దగ్గరికి వచ్చి నమస్కరించడం ప్రారంభించారు. మరికొంతసేపటికి  ఆ నాయకుడు ప్రజల్లో ఒకరి మీద కోపం తెచ్చుకుని కాలితో బలంగా తన్నినట్లు నటించాడు. మిగిలిన ప్రజలు మౌనంగా ఉండిపోయారు.

    మళ్లీ స్టేజ్ ముందుకు వచ్చాడు రిత్విక్.

    "ప్రజలందరూ తన చుట్టూ తిరుగుతూ ఉండటంతో నాయకుడికి డిమాండ్ పెరిగింది. అతన్ని మంచి చేసుకుని తమ పనులు జరిపించుకోవాలి అని ప్రజలు ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతో నాయకుడి ఆధిపత్యం మొదలైంది. అతను ఒకరి మీద దౌర్జన్యం చేసినా మిగతావాళ్లు, ‘మనల్ని ఏమీ అనలేదు కదా’ అని  నిర్లిప్తంగా ఉండడం ప్రారంభించారు..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/m0dE-BU7cxk



    12 min
  • సు ధీర ఎపిసోడ్ 9 | Su Dheera Episode 9 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సు...ధీర ఎపిసోడ్ 9

    రచన:  బివిడి ప్రసాదరావు

    గత ఎపిసోడ్ లో…

    సు కి జ్వరం వచ్చి హాస్పిటల్ లో చేరుతుంది.

    అక్కడికి వస్తాడు ధీర.

    డిశ్చార్జ్ అయి ఇంటికి బయలుదేరుతుంది సు.

    ఆమె వెనుకే బైక్ లో బయలుదేరుతాడు ధీర.

    ఇక చదవండి...

    సు ఇంట్లో...

    "బ్రేక్ఫాస్ట్ ఏమిటి" అడిగాడు ధీర.

    "నాకు వద్దు." చెప్పింది సు.

    "నాకు కావాలి." అన్నాడు ధీర.

    "ఐతే వెళ్లు. లేదా తెప్పించుకో." అంది సు.

    ధీర.. "సర్లే. వాటర్ కావాలి." అన్నాడు.

    సు ఫ్రిడ్జ్ లోంచి వాటర్ బాటిల్ తీసి.. ధీరకి ఇచ్చింది.

    ఆ వెంబడే.. తన రూం లోకి వెళ్తూ.. "ఈ హాలులో ఉండు. నేను రిప్రెష్ కాగానే తిరిగి వస్తాను." చెప్పింది సు.

    పాపు గంట తర్వాత..

    సు వచ్చింది.

    హాలులో.. సోఫాలో కూర్చుంది.

    పక్కగా ఉన్న సింగిల్ సోఫాలో ధీర ఉన్నాడు.

    "టేబ్లెట్ వేసుకోవాలిగా" చెప్పాడు ధీర.

    "వేసుకున్నాను." చెప్పింది సు.

    "ఫ్రిడ్జ్ లో పళ్లు ఉంటే.. జాస్ ఇవ్వనా." అడిగాడు ధీర.

    "ఇప్పుడు అక్కర లేదు." చెప్పింది సు.

    "అరె. చాన్నాళ్లుగా చూస్తున్నా.. నువ్వు చాలా సూటిగా.. ముక్క ముక్కలుగా  మాట్లాడుతుంటావు.. మరి తెర మీద మాత్రం లొడలొడా మాట్లాడతావు. పైగా.. చలాకీగా.. చిలిపిగా మూవ్ అవుతావు." అన్నాడు ధీర.

    "చెప్పాగా.. తెర మీదిలా.. బయట నేను కానని." అంది సు.

    "చిత్రమే. నాకు అదే.. అలానైతే నచ్చుతుంది." చెప్పాడు ధీర.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/X6sJDElYPzw

    15 min
  • Love Challenge Episode 24 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 24 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 24

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    తన స్వంత ఊరు రామకృష్ణాపురం లో ఒక సభ ఏర్పాటు చేసి, రిత్విక్, జీవన్ లను ఆ గ్రామస్థులకు పరిచయం చేస్తాడు రాఘవేంద్ర.

    ఆ రోజు రాత్రి డిన్నర్ సమయంలో దీప్య మీద తనకు కోరిక ఉన్నట్లు సందీప్ తో చెబుతాడు చందూ.

    అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు కూడా చెబుతాడు.

    ఇక చదవండి…

    హ్యాండ్ వాష్ దగ్గరకు వెడుతున్న దీప్య తన వెనుకే చందూ వస్తున్నట్లు గమనించింది. అతడు తన వేగాన్ని పెంచి ఆమె పక్కకు చేరబోయాడు.

    ఇంతలో వెనకనుండి "హాయ్ చందూ!" అంటూ అతన్ని పలకరించింది శాన్వీ.

    చేసేది లేక ఆమె కోసం ఆగాడు చందూ, "హాయ్ శాన్వీ" అంటూ.

    "మాకంటే వెనగ్గా వచ్చావ్.. అప్పుడే భోజనం ముగించావా.." అడిగింది శాన్వీ.

    'తనని శాన్వీ గమనిస్తోందన్న మాట.. జాగ్రత్తగా ఉండాలి' అనుకున్నాడు.

    "ఎందుకో తినాలనిపించ లేదు" అన్నాడు చందూ.

    "లేనిపోనివి ఆలోచిస్తూ ఉండకు. ఆకలి తగ్గిపోయి, ఆరోగ్యం పాడవుతుంది" అంది శాన్వీ.

    "ఏంలేదు. నీ దగ్గర దాచడమెందుకు? పబ్ కి వచ్చిన రోజునుండి దీప్య నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. తనకు నామీద అనుమానం వచ్చినట్లు ఉంది. సారీ చెబుదామని వెనకే వెడుతున్నాను" అన్నాడు సంజాయిషీ ఇస్తున్నట్లుగా.

    "రిత్విక్ ఆ విషయాన్ని అప్పుడే వదిలేసాడు. పూర్నేష్ ని సరిగ్గా విచారిస్తే ఎవరు చేయించారో, ఎవరు సహకరించారో అంతా  బయట పడుతుంది. కానీ దీప్య పేరు నలుగురిలో నానగూడదని, అంతటితో వదిలేసారు. నువ్వు మళ్ళీ తవ్వుకుంటానంటే నీ ఇష్టం" అంది శాన్వీ.

    "అలా అని కాదు. జీవన్ మారాక, మునుపు  ఎలా ఉండేవాడో ఎవరూ పట్టించుకోవడం లేదు.

    ఆ రోజు హాస్టల్ రూమ్ లో జీవన్ నీ గొంతు పట్టుకోలేదా? కానీ ఇప్పుడు నువ్వు అతనితో మామూలుగానే  ఉండటం లేదా..

    అలాగే నన్ను కూడా దీప్య క్షమించేయవచ్చు కదా అని.." అన్నాడు చందూ.

    "జీవన్, తన గ్లాసు అడుగున వదిలేసిన  మందు తాగి ఆనందించే వాడివి.. ఇప్పుడేమిటి జీవన్ తోనే పోల్చుకుంటున్నావు?"  కాస్త గొంతు పెంచి అంది శాన్వీ.

    ‘దీనికి సరైన సమయం చూసి వాత పెట్టాలి’ అనుకున్నాడు చందూ.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/r34ah7FSKFA




    12 min
  • Maharaju Maharani | మహారాజు మహారాణి | Telugu Short Story | K Lakshmi sailaja | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    మహారాజు .. ..  మహారాణి

    రచన: కే. లక్ష్మీ శైలజ

    “ మా వంశానికి యువరాజు," అంటూ ఫోన్ లో గేమ్ ఆడుతున్న పదిహేడేళ్ల రాజేంద్ర నోట్లో చిన్న లడ్డూ కుక్కింది, నాన్నమ్మ భూదేవి.

    అది చూస్తూ, "అయ్యా యువరాజావారూ, ఇప్పటికే రెండుసార్లు చెప్పాను, వాషింగ్ మెషీన్ పని చూడమని. ఒక ఐదు నిముషాల్లో నువ్వు ఆ పని చెయ్యలేదనుకో,  నీ బట్టలు

    వెయ్యకుండా మావి మాత్రమే వేసుకుంటాము," అంది వాళ్ళమ్మ వసుధ  బౌల్ లోనుంచి బీన్స్ వలిచి  వేరే గిన్నెలో వేసి, పీచులు చిన్న కప్ లో వేస్తూ.

    వసుధ వైపుగుర్రుగా చూసి  వాషింగ్ మెషిన్ వెయ్యడానికి లోపలికి వెళ్ళాడు రాజేంద్ర.

    "నాన్నమ్మా, నేను ఈ ఇంటి యువరాణి నీ, మహాలక్ష్మిని కూడా కదా, మరి నాకు

    లడ్డూ ఏదీ?," అంది మహిత వేస్తున్న సైన్స్ రికార్డును పూర్తి చేసి, పక్కన పెడుతూ.

    "ఆ.. నువ్వు తీపు ఎక్కువ తినవు కదా!”  మనవడితో పని చేయిస్తున్నందుకు  చేతులు తిప్పుతూ కినుకగా అంది భూదేవి.

    వసుధ, మగపిల్లలు కూడా ఇంట్లో పని నేర్చుకోవాలని కొడుకుతో చిన్న చిన్న పనులు చేయిస్తూ ఉంటుంది.

    భోజనాల టైం లో మహిత అందరి ప్లేట్స్ లో కూర, వడ్డిస్తూవుంది.

    "రాజా నువ్వు ఫ్రిడ్జ్ లో పెరుగుతీసుకొని  మజ్జిగ చెయ్యి,"అంది వసుధ ప్లేట్స్లోఅన్నం పెడ్తూ..

    "నేను చేస్తాలేవే," అంది భూదేవి కుర్చీలోంచి లేవబోతూ.

    "అదేమీ కష్టమయిన పని కాదు లే అత్తయ్యా," అని వసుధ ఆమెను వారించింది.

    "నాకు రాదు, నేనేమైనా ఆడపిల్లనా? "అన్నాడు రాజేంద్ర తల అడ్డంగా ఊపుతూ.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/fG2UWH93tso


    5 min
  • లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 23 | Love Challenge Episode 23 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 23

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    న్యూస్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చక్కగా సమాధానం చెబుతుంది ఆద్య. జీవన్ మాట్లాడుతూ ఈ మోడల్ ఎలక్షన్స్ లో సాధారణ ఎన్నికల్లో జరిగే పొరపాట్లు జరగవని చెబుతాడు. రిత్విక్ మాట్లాడుతూ ఈ ఛాలెంజ్ ని సరైన దారిలో రాజకీయ ప్రవేశం చేయడానికి ఒక ట్రైనింగ్ లా భావిస్తున్నానని చెబుతాడు

    ఇక చదవండి…

    ఆ గ్రామ సర్పంచ్, ఇతర ప్రముఖులు, స్థానిక పోస్ట్ మాస్టర్, ఆ ఊర్లోనే నివసిస్తున్న హై స్కూల్ హెడ్మాస్టర్.. హాస్టల్ దగ్గర రాఘవేంద్ర గారిని, లెక్చరర్స్ ని, స్టూడెంట్స్ ని రిసీవ్ చేసుకున్నారు. వాళ్లకు రిత్విక్, జీవన్ లను పరిచయం చేశాడు రాఘవేంద్ర.

    ఆ గ్రామం లోని పేదలకి ప్రతి సంక్రాంతి పండుగకీ ఉచితంగా బట్టలు పంపిణీ చేయడం రాఘవేంద్ర గారికి అలవాటు. ఆద్య చాలా సార్లు ఆ కార్యక్రమానికి హాజరు అయి ఉండడంతో,  ఆమెను ఆ గ్రామస్థులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం రాలేదు.

    అందరూ ఆద్యను గుర్తుపట్టి, ఆప్యాయంగా పలకరించారు.

    రాఘవేంద్ర రావు గారు మాట్లాడుతూ "సాయంత్రం గ్రామస్థులకు వీళ్ళను పరిచయం చేయడం కోసం, మోడల్ ఓటింగ్ గురించి చెప్పడం కోసం ఒక చిన్న మీటింగ్ లాంటిది ఏర్పాటు చేస్తున్నాం. వీలైనంత మంది ఆ కార్యక్రమానికి వచ్చేలా చూడండి" అని ఆ గ్రామ ప్రముఖులకు విజ్ఞప్తి చేశాడు.

    ఆ గ్రామ పోస్ట్ మాస్టర్ మాట్లాడుతూ "నమూనా ఎలక్షన్ల గురించి మీరు నాకు ఫోన్ చేశారు కదా! నేను అప్పుడే చాలామంది గ్రామస్థులతో ఈ విషయం మాట్లాడాను. 'రాఘవేంద్ర గారు మన గ్రామానికి ఎంతో సహాయం చేస్తున్నారు. వారు అడిగిన చిన్న కోరికను కాదంటామా..'  అని చాలా మంది గ్రామస్థులు అన్నారు" అని చెప్పాడు..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/OSKBxk2RflM




    13 min
  • లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 22 | Love Challenge Episode 22 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 22

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    సెమిస్ లో రిత్విక్, జీవన్ లు బాగా రాణించడంతో నిత్యా కాలేజ్ టీం సులభంగా గెలుస్తుంది.

    ప్లేయర్స్ కి ట్రీట్ ఇస్తాడు రాఘవేంద్ర.

    అక్కడికి మీడియాను పిలిచి లవ్ ఛాలెంజ్ టాస్క్ ఏమిటో చెబుతుంది ఆద్య.

    ఇక చదవండి…

    న్యూస్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తోంది ఆద్య.

    "మీరు అడిగిన ప్రశ్న సరైనదే .మాక్ అసెంబ్లీ, మాక్ పార్లమెంట్, మాక్ ఎలక్షన్స్.. ఇలాంటివి ఒక స్కూల్లోనో,  కాలేజ్ లోనో కండక్ట్ చేయవచ్చు. ఆ టీచర్ల, లెక్చరర్ల ఆదేశంతో స్టూడెంట్స్ దాంట్లో పాల్గొంటారు.

    కానీ పొద్దున లేచి తమ వ్యవసాయ పనుల్లో, కూలి పనుల్లో నిమగ్నమై ఉంటారు గ్రామస్తులు. తమ పనులు మానుకొని నమూనా ఎలక్షన్ లో ఓట్ చేయడానికి రావడం కష్టమే. కానీ ఆ ఊరు మా నాన్నగారికి సొంత ఊరు. ఆయన చాలా ఏళ్ళ నుంచి ఆ ఊరిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

    నిన్న ఈ ప్రతిపాదన నాన్నగారితో చెప్పినప్పుడు ఆయన ఆ గ్రామస్థులు కొందరికి ఫోన్ చేసి కనుక్కున్నారు. ఖచ్చితంగా మాకు సహకరిస్తామని వాళ్ళు చెప్పారు. ఏ పనికైనా ప్రయత్నం మొదలు పెడితే దారులు వాటంతట అవే కనిపిస్తాయి.

    ఆ గ్రామానికి యాభై లక్షలు  విరాళంగా ఇవ్వాలని నాన్నగారు ఎప్పటి నుండో అనుకుంటున్నారు..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/CdbHWqA4XtY



    13 min
  • Pedda Githa - Chinna Githa |పెద్ద గీత – చిన్నగీత | Telugu Short Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    పెద్ద గీత – చిన్నగీత

    రచన : కొత్తపల్లి ఉదయబాబు

    ‘’ఈవేళ సాయంత్రం కళాకేంద్రంలో మా నాన్నగారి కార్యక్రమం ఉంది మాష్టారు. నాన్నగారే స్వయంగా వచ్చి ఆహ్వానిద్దామనుకున్నారు. పండగ సీజన్ వల్ల  కొంచెం బిజీగా ఉన్నారు" అంటూ నా శిష్యులు శ్వేత, స్వాతి అందించిన కరపత్రం తీసుకుని చూడనైనా చూడకుండా పక్కన పెట్టి...

    "ముందు బోర్డ్ మీద లెక్క ఎక్కించేసుకొండమ్మా. ఆతరువాత మీకు దానిని వివరించి బోర్డ్ చేరిపేస్తాను. ట్యూషన్ అయిపోయాక ఒక పదినిమిషాలు ఉండడమ్మా. మీతో మాట్లాడాలి. " అన్నాను చిరాకును బయటపడనీయకుండా.

    ట్యూషన్ అయిపోయాక పిల్లలందరూ వెళ్లిపోయాక శ్వేత, స్వాతి కూడా లేచి నిలబడ్డారు.

    "మీరు ప్రైవేటు లో చేరినప్పటి నుంచి నుంచి చూస్తున్నాను.. రోజు ఆలస్యంగా వస్తారేమిటమ్మా?" అడిగాను..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/91HkA0lQpEg



    8 min
  • లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 21 | Love Challenge Episode 21 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 21

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    పూర్నేష్ ఊరికే ఫోన్ చేసి విసిగిస్తుండడంతో చికాకు పడతాడు జీవన్.

    రిత్విక్ సలహా పై , మ్యాచ్ ఫిక్సింగ్ విషయంగా ప్లేయర్స్ చేసిన డిమాండ్ ని హిడెన్ కెమరాతో రికార్డ్ చేస్తాడు.

    దాంతో వాళ్ళు దారిలోకి వస్తారు.

    సెమీస్ లో గెలిస్తే వన్ వీక్ టూర్ ప్లాన్ చేస్తానంటుంది ఆద్య.

    ఇక చదవండి…

    ఎదురు చూస్తున్న ఆదివారం రానే వచ్చింది.

    ఆ రోజే సెమీస్.

    అందరూ ఎంతో ఉత్కంఠతో ఉన్నారు.

    చక్రధరం, రాఘవేంద్ర, గురుమూర్తి ఆ రోజు ఉదయాన్నే లేచి వాళ్ళ వాళ్ళ ఇంట్లో పూజలు చేశారు.

    రిత్విక్ అండ్ టీం కాలేజ్ కి దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.

    9 గంటలకల్లా అందరూ కాలేజ్ కి చేరుకున్నారు.

    సెమీస్ లో వీళ్ళతో తల పడబోయే నెహ్రూ కాలేజ్ టీం వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అంపైరింగ్ కోసం మాజీ రంజీ ప్లేయర్స్ ఇద్దరు వచ్చారు.

    లోకల్ న్యూస్ టీవీ ఛానల్ వాళ్ళు ఈ మ్యాచ్ ని లైవ్ కవరేజ్ ఇవ్వడానికి వచ్చారు.

    నేషనల్ టీం నుండి రిటైర్ ఐన ఇద్దరు హైదరాబాదీ ప్లేయర్స్ కామెంటరీ ఇవ్వడానికి వచ్చారు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/YoF6jxGsobc


    13 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world