
Sign up to save your podcasts
Or


(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కోటి రూపాయలు
రచన: కిడాల శివకృష్ణ
ధర్మో రక్షతి రక్షితః- ఇది ఒకప్పటి సూక్తి.
నేడు డబ్బో రక్షతి రక్షితః- అంటున్నారు.
ఇలా ఎందుకు అంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటున్నారా.. అయితే మన కథలోకి వెళ్ళాల్సిందే.
ఒక పెద్ద గ్రీన్ హైటెక్ సిటీ ఉంది. ఆ సిటీలో అద్దాలు కలిగి ఆకాశాన్ని తాకే మేడలు ఉన్నాయి. కంటికి చూడ ముచ్చటగా ఉండే పార్కులు, కాలక్షేపం కోసం కోసం సినిమా హాళ్లు.. ఇలా వినోదాన్ని కలిగించే అంశాలు ఎన్నో.
ఇలాంటి అందమైన హరివిల్లు లాంటి సిటీ లో కొన్ని మధ్య తరగతి కుటుంబాలు కూడా జీవిస్తున్నాయి.
కాకపోతే ఇంతటి వినోదాన్ని చూస్తున్న ఒక పద్దెనిమిదేళ్ళ మధ్య తరగతి చెందిన కుర్రాడు తన మిత్రులతో, ఇరుగూ పొరుగూ వారితో, మరియు పెద్దలతో కూడా ఒక్కటే ప్రశ్న గురించి చర్చిస్తూ ఉండేవాడు.
ఆ ప్రశ్న ఏమిటి అంటే "ఇలా ధనవంతులుగా జీవితాన్ని అనుభవించాలి అంటే ఏమి చేయాలి?.." అని.
అపుడు చాలా మంది ‘డబ్బును సంపాదిస్తే ధనవంతులుగా అవుతారు. ఏమి చేయాలి అనుకున్నా చేసెయ్యొచ్చు’ అని చెప్పారు.
‘అయితే ఆ డబ్బును ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బును ఎలా కూడ బెట్టాలి’ అడిగేవాడు చాలా మందిని.
చాలా మందిని అడిగినప్పుడు చాలా రకాల ఆలోచనలు గురించి చెపుతారు కదా..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/WUw9iqPPo-M
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ప్రేమ‘భ్రమ’రం - 2
రచన: వసుంధర
వసుంధర గారి తెలుగు ధారావాహిక రెండవ భాగం
గత ఎపిసోడ్ లో...
నా పేరు విచల్.
నేను ఒక మందుల తయారీ కర్మాగారంలో మంచి పదవిలో ఉన్నాను.
నా కజిన్ పేరు పద్మ.
ఆమె తనకు బావ వరస అయిన కవన్ ని ప్రేమించింది.
కానీ తను ముక్త అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు చెబుతాడు కవన్.
ముక్త మనసును కవన్ మీదనుండి మళ్ళించమని నన్ను కోరుతుంది పద్మ.
ఆలా చేస్తే కవన్ తనను ప్రేమిస్తాడని ఆమె ఆశ.
ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాను నేను.
ఇక ప్రేమ‘భ్రమ’రం రెండవ భాగం చదవండి ...
ఆడవాళ్లంటే నాకు బిడియమని గట్టిగా నమ్ముతాను. కానీ ఒక ఆడపిల్ల పద్మతో నాకు దగ్గర స్నేహమే ఉంది. ఎంత దగ్గరంటే - ఆమెకి నావద్ద తన ప్రేమకథను వినిపించేటంత చొరవుంది.
బిడియమైతే ఆమెతో అంతసేపు ఎలా మాట్లాడతాను- అదీ ప్రేమ గురించి...
అది చాలదన్నట్లు - నేను కూడా ఆమె దగ్గర చొరవ చేసి - నాకో ప్రియురాల్ని వెదికిపెట్టమన్నాను. నిజంగా నేను బిడియస్థుణ్ణేనా?
నా మనసు నవ్వి, ‘‘ఈ సందేహం ఇప్పుడొచ్చిందా - ఎప్పుడో రావాలి కదా!’’ అంది.
అన్నది నా మనసు కాబట్టి - ఆ మాట సరయు గురించేనని నాకు వెంటనే అర్థమైంది.
సరయు మా పెదనాన్నగారమ్మాయి.
అందంగా ఉంటుంది. నోరారా నన్ను అన్నయ్యా అని పిలుస్తుంది. తోడబుట్టినది కాకపోయినా - వయసొచ్చేక కూడా నాకు తను చెల్లి అనిపిస్తుందే తప్ప - ఏ ఫీలింగ్సూ కలుగవు. వరసల సంప్రదాయంలో అదో ఉదాత్త భావం.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/l7SnYh9l32k
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
స్నేహం సాక్షిగా
కొత్తపల్లి ఉదయబాబు
దేశంలో కరోనా అనే ప్రాణాంతక మహమ్మారి వ్యాపిస్తోందని టీవీలలో ప్రచారం ప్రారంభమయిన మొదటి రోజులవి.
హైదరాబాద్ లో ప్రయివేట్ కంపెనీ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న శశాంకకు ఇంకా పెళ్లి కాలేదు. చదువుకున్న చదువుకు ఊళ్ళోనే ఏదైనా ఉద్యోగం చూసుకోరా అంటే హైద్రాబాద్ లో ఎన్నెన్నో అవకాశాలు ఉంటాయని వచ్చి, మొదటివారం స్నేహితుని రూంలో ఉన్న కాలంలోనే అతని చురుకుదనానికి, సమయస్ఫూర్తికి ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం ఇచ్చేసింది.
ఇద్దరు అక్కల తరువాత ఒక్కగానొక్క కొడుకుని వదిలి ఉండలేక, అలా అని అతని భవిష్యత్తు పాడవుతుందని మిన్నకుండి పోయారు అతని తల్లి తండ్రులు.
తల్లితండ్రులను చూద్దామని శనివారం ఉదయం బయల్దేరి ఆదివారం రాత్రికి మళ్లీ ఉద్యోగానికి తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని వచ్చిన శశాంక ఆ ఆదివారం రాత్రినుంచే లాక్-డౌన్ ప్రకటించడంతో ఆగిపోయాడు.
అప్పటికే కరోనా ఎలా వ్యాప్తి చెందుతుందో… అందుకు మనం పౌరునిగా పాటించవలసిన ధర్మాలేమిటో తెలుసుకున్నవాడుగా మరుసటి ఉదయమే రంగంలోకి దిగాడు.
ఇంట్లో పనికిరాని పాతచీరలన్నీ తీసుకుని స్వయంగా జేబురుమాలు సైజులో కత్తిరించి తమ పేటలో ప్రతి వ్యక్తికి 3 మాస్కులు కనీసం ఇచ్చేలా కుట్టించాడు.
తల్లి, తను వాడిన డిష్-వాష్ సీసాలన్నీ ఒక బస్తాలోవేసి, బస్తా నిండాక అమ్ముతూ ఉంటుంది. వాటిని తీస్తే ఎనభైకి పైగా ఉన్నాయి.
ఎదో టీవీలో చూసిన విధానం గుర్తుపెట్టుకొని డెట్టాల్ సబ్బులు కొని, వాటిని పెద్ద సీవండి దాబారా గిన్నెలో తురిమి, అందులో వెనిగర్ వేసి ఉడికించి, ఆ పేస్ట్ ను సీసాలన్నింటిలోను నింపాడు.
తనవయసు కుర్రవాళ్ళని పదిమందిని పిలిచి ఏ4 సైజు పేపర్లు, కార్బన్లు కొని, వాటిమీద కరోనా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వ్రాయించి… ప్రతి కుటుంబానికీ 3 మాస్కులు, ఒక సీసా, ఒక కరపత్రం అందించాడు.పేట పేటంతా, సామాజిక దూరం పాటించేలా ముగ్గుతో వృత్తాలు గీయించాడు.
తాను యూట్యూబ్ లో రకరకాల పచ్చళ్ళు చూసి, ఆ పదార్ధాలు కొనుక్కువచ్చి, తల్లిచేత దగ్గరుండి చేయించి,
ఆ విధివిధానాలన్నీ మనసులో ముద్రించుకున్నాడు.
తమపేటలోకి వచ్చిన అన్నార్తులకు ఆ పచ్చళ్ళు వేసి ఉన్నంతలో భోజన పొట్లాలు అందించాడు.
"నాయనా..నీ ఉద్యోగం?" అడిగింది తల్లి.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/6_s-e2mosvk
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి
ఆదర్శ, సౌందర్యమూర్తి భార్యా భర్తలు.హైదరాబాద్ లో సాఫ్టవేర్ ఉద్యోగులు. మంచి జీతం. కానీ సంసారమే..?
బస్సుదిగి నడుస్తున్న ఆదర్శకు ఇంటికి వస్తున్నాము అనే సంతోషం కలగలేదు. భర్త ఇంటికి ఎలా వస్తాడో తెలుసు. తాగుడు అతని ఫ్యాషన్ కాదు, వ్యసనం. తన అందం, ప్రేమానురాగాలు అలవాటును మాన్పించ లేకపోయాయి. అసంతృప్తితో ఈడ్చుకు రావాల్సిందే, తప్పదు.. అనుకుని గాఢ నిట్టూర్పు వదిలింది.
కోవిడ్ సమయంలో ఇద్దరూ ఇంటి దగ్గరనుంచే పని చేసేవారు. అప్పుడూ తాగుడు వదలలేదు. దొంగచాటుగా అమ్మే వాళ్ళ దగ్గరనో, ఆర్మీలో ఉండే తన స్నేహితుల దగ్గరనో తెచ్చుకుని మామూలు కంటే కాస్త తక్కువ తాగేవాడు.
జీడిపప్పు పప్పు, మిరపకాయ బజ్జీలు, పకోడీలు చేసి పెట్టలేక విసుక్కునేది. అధికారం చెలాయించే వాడు. ఇంట్లో ఉంటూ ఎడముఖం పెడ ముఖం ఎందుకని పడి ఉండేది. మరి తాగుతున్నాడని ఎవ్వరూ భర్తను వదిలేసినట్లు వినలేదు.
తాగుబోతు, తిరుగుబోతు భర్తలను నేటి స్త్రీలు ఆదర్శవంతంగా మన్నించేస్తున్నారు. తమ స్వాతంత్రానికి అడ్డనో నేటి పాతివ్రత్యానికి సరి అనో!!? ఆడదాని అభ్యతరం ఎప్పుడూ సంతలోనే ఉంటుంది.
ఇప్పుడు కోవిడ్ తగ్గింది. సౌందర్యమూర్తి ఆఫీసుకు వెళుతున్నాడు. ఆదర్శ ఇంకా ఇంటి నుంచే పని. వారానికి ఒకసారి వెళ్లి రిపోర్టు చెయ్యాలి..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/kP8KsjmuIDg
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
మనసున్న మనిషి
రచన: పతి మురళీధర శర్మ
"పార్వతీ! టిఫిన్ తయారయిందా?” వంటింట్లో ఉన్న భార్యని అడిగేడు భాస్కరరావు.
"ఇంకా లేదు. అయినా ఈవేళ ఆదివారం కదా! ఆఫీసు ఉండదన్న సంగతి మర్చిపోయేరా?"
గుర్తుచేసింది భార్యామణి.
"ఆ సంగతి గుర్తులేక కాదు. ఆఫీసుకి సెలవు గాని ఆరగింపుకు సెలవు ఉండదు కదా! ఆఫీసు లేదని ఆకలి వెయ్యడం మానేయదు కదా! "సంజాయిషీ ఇచ్చేడు సదరు భర్త గారు.
"పనిమనిషి ఎన్ని గంటలకు వచ్చిందనుకున్నారు? 7 ½ కి. ఉదయాన్నే వచ్చి చెయ్యగలిగితే చెయ్యి. లేకపోతే మానేయమని చెప్పేసేను. ఈవేళ ఆదివారం కాబట్టి సరిపోయింది. లేకపోతే టిఫినే తయారు చెయ్యనా? లేక వంట చేసి మీకు కేరేజీయే కట్టనా? పైగా ప్రతి ఏడాదీ జీతం పెంచమంటుంది." పనిమనిషి మీద పార్వతి ఫిర్యాదు.
"చూడు పార్వతీ! మన ఇంట్లో మన పనే మనం చేసుకోలేక పనిమనిషిని పెట్టుకుంటున్నాం. అలాంటిది వాళ్ళు వాళ్ళింట్లో పని చేసుకుని వచ్చి నాలుగిళ్ళల్లో పని చేస్తేనేగాని వాళ్లకు గడవదు. ముందొస్తేనేమో 'తెల్లారేసరికి వచ్చేసేవు.. పడుకోనివ్వకుండా' అంటారు. ఆలస్యంగా వస్తే 'ఇప్పుడా వస్తావు?' అంటారు. మరి అందరిళ్ళకీ ముందూ కాకుండా, ఆలస్యం కాకుండా ఒకే టైమ్ కి రావాలంటే వాళ్ళకి మాత్రం ఎలా అవుతుంది చెప్పు? వాళ్ళకిచ్చే నెల జీతం మనం ఒక రోజు రెస్టారెంట్ కీ, సినిమాకీ వెళ్తే అవుతుంది."
అని చెప్పుకుంటూ పోతున్న భర్తతో అంది పార్వతి.
"తెల్లారిందా మీ సూక్తిముక్తావళికి? అయినా పనిమనిషి తరఫున మీరు వకాల్తా పుచ్చుకున్నారా ఏంటి? మీరు చెప్పిందల్లా వింటూ కూచుంటే అవతల వంటింటి పని ఎవరు చేస్తారనుకున్నారు?"
"పోనీ నేనూ ఓ చెయ్యి వెయ్యనా?” అడిగేడు ఆయనగారు.
"చెయ్యి వెయ్యొద్దు గాని నన్ను చేసుకోనివ్వండి చాలు." అంది అర్థాంగి.
"ప్చ్! ఇప్పుడేం మాట్లాడకూడదు."అనుకుంటూ అక్కడనుండి నిష్క్రమించేడు పతిదేవుడు.
∙ * *
భోజనాలయిపోయేక పార్వతి అడిగింది భర్తని "అవునూ! టాయ్ లెట్లు క్లీన్ చేయడానికి వచ్చిన ఆ పనివాడితో మీ పలకరింపులేంటి? వాడు వచ్చిన పని వాడు చేసుకుపోతాడు. వాడు చేసిన పనికి వాడికి మనం డబ్బులిస్తాం. అంతే. అంతవరకే. కాని వాడి యోగక్షేమాలు మీకెందుకు?"
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/_6CR9CW9Gk8
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
వెంటాడే నీడ ఎపిసోడ్ 17
రచన: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
ఎస్సై శ్రీకాంత్ కి జరిగిన సంఘటనలు వివరిస్తాడు సుమంత్.
శ్రీకాంత్ - విశాల్ నంబర్ కి కాల్ చేసినా, వికాస్ నంబర్ కి కాల్ చేసినా గోవర్ధన్ అనే వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.
హాస్పిటల్ లో కరెంట్ పోవడంతో పాటు వింత శబ్దాలు వినిపిస్తాయి శ్రీకాంత్ కి.
ఇక చదవండి…
సీఐ కిషోర్ ఆదేశాల మేరకు ఇద్దరు కానిస్టేబుల్స్ గుడిసె వద్దకు వెళతారు. వాళ్లు వెళ్ళేటప్పటికి ఆ అగంతకుడు గుడిసె తలుపు బలంగా తడుతున్నాడు.
“ఆ డాక్టర్లను బయటకు నెట్టేయండి. మిగతా వాళ్ళను వదిలేస్తాను” అని కేకలు పెడుతున్నాడు.
ఇంతలో అలికిడి కావడంతో వెనక్కి తిరిగాడు.
తనను సమీపిస్తున్న కానిస్టేబుల్స్ ని చూసి “దగ్గరకు రాకండి. పారిపోయి ప్రాణాలు కాపాడుకోండి” అన్నాడు.
గుడిసె లోపల ఉన్న కానిస్టేబుల్, షణ్ముగంతో “బయట మా వాళ్ళు వచ్చినట్లు ఉన్నారు. నేను కూడా వెళ్లి అతన్ని పట్టుకోవడంలో మా వాళ్లకు హెల్ప్ చేస్తాను. నేను బయటకు వెళ్ళగానే తిరిగి తలుపు వేసుకో” అన్నాడు.
“ఇలా ఎంతసేపని భయపడుతూ కూర్చుంటాం? పదండి.. నేను కూడా వస్తాను” అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా గుడిసె తలుపు తెరిచాడు షణ్ముగం.
వెంటనే కానిస్టేబుల్ తో పాటు తను కూడా బయటకు దూకాడు. పరిస్థితి గమనించిన ఆ అగంతకుడు తనను సమీపిస్తున్న ఒక కానిస్టేబుల్ ను పక్కకు నెట్టి, తోటలోకి పరుగుతీశాడు..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/7Oa5V_4o5QU
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
మన ఇల్లు
రచన: లక్ష్మి మదన్
ఇల్లు అంటే ఒక అందమైన ప్రదేశం అది గుడిసె అయిన మేడైనా ఇంద్ర భవనమైనా ఇల్లు ఇల్లే... మనకంటూ ఒక ప్రశాంతతని, స్వేచ్ఛని ఇచ్చేది మన ఇల్లు మాత్రమే. ఎన్నెన్ని ప్రదేశాలు తిరిగి వచ్చినా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా అనిపిస్తుంది ఇంటికొచ్చాక తినే ఆవకాయ అన్నమో... పెరుగన్నమో ఇచ్చే ఆనందం మరిన్ని అధరువులు తిన్నా ఆ రుచి రాదేమో... అందుకే ఇల్లే కదా స్వర్గసీమ అన్నారు.
ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒకప్పుడు మనం పుట్టి పెరిగిన ఇళ్లు తరతరాల చరిత్రకు ఆనవాళ్లుగా ఉండేవి.. తల్లిదండ్రులు మనము ముందు తరాలు పుట్టి ఆ ఇళ్లల్లో ఆడుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని తరలి వెళ్లేవారు పెళ్లిళ్లు చేసుకొని లేదా ఉద్యోగరీత్యా !
ఇక ముందు ముందు తరాలకి అలాంటి ఇళ్ళ తాలూకు జ్ఞాపకాలు ఎక్కువగా ఉండవేమో... ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక ఒక 10 ఏళ్లు దాంట్లో ఉన్న తర్వాత మళ్లీ మరొక కొత్త గూడు కోసం ప్రయత్నం చేసి ఇంకా మంచి లైఫ్ అంటూ వెళ్లిపోవడం జరుగుతుంది ఏది ఏమైనా ఆనాటి మన తరం పెరిగిన ఇళ్ల జ్ఞాపకాలు ఎంతో అద్భుతం.
మా ఊళ్లో మా వీధిలో మా ఇల్లు కాస్త ఎత్తుగా ఉండేది వీధిలో మిగతా ఇళ్లన్నీ కొంచెం క్రిందికి ఉండేవి ఎంతో రాజసంగా ఉండే మాఇల్లు ఈ వాడకట్టును చూసే బాధ్యత అంతా నాదే! అనుకునేది పాపం! చాలా మంచి మనసు ఎందుకంటే పెంకులతో పరిచుకుని పచ్చని చెట్ల కట్టెలతో కట్టిన చక్కని ఇల్లు ..మట్టి గోడలతో ప్రకృతితో మమేకమైన మట్టి ఇల్లు... ఎంత చల్లదనం ఆ ఇళ్లల్లో అసలు వేసవి ఎప్పుడు వచ్చిందో తెలిసేది కాదు చలికాలం ఎప్పుడొచ్చిందో తెలిసేది కాదు, ఒక్క వర్షా కాలం మాత్రం తెలిసేది... ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఇంటి మధ్యలో గవాక్షం ఉండేది కదా దాని ద్వారా వచ్చే వానలు గచ్చులో పడి ఇల్లంతా తుంపర్లు తుంపర్లుగా నిండేది. అయినా ఎక్కువ చలి అనిపించేది కాదు... ఆ వర్షాన్ని చూస్తూ మనసాల ( మండువా)లో పడుకొని ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయా? అని ఆలోచిస్తూ అప్పుడప్పుడు మెరిసిన మెరుపులకి ఆకాశం కనబడుతుంటే నల్లని మేఘాలు కొంచెం భయం కలిగించేలా ఉరుముతుంటే ఏదో తెలియని ఆలోచనలు చుట్టుముడుతుంటే అలా చూస్తూ నిద్రలోకి జారుకున్న మధుర క్షణాలు ఎలా మరువగలం?..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
సరికొత్త నడక
రచన: మొహమ్మద్ అఫ్సర వలీషా
అందమైన ఆ ఇంటి ముందు మరింత అందమైన ముగ్గును చూసి ముకుంద రావు అన్నాడు " ఎవరో కొత్త వాళ్ళు అద్దెకు దిగారటుగుంది" అని.
"అవునవునని" వంత పాడారు మన్మధరావు , రామ్మూర్తి, రమణా రావు. పార్క్ లో వాకింగ్ చేస్తుంటే కొత్త ఆకారం ఎవరిదా అని నలుగురికీ కాస్త తెలుసు కోవాలనే కుతూహలంతో అతని దగ్గరకు వెళ్ళబోతుండగా వీళ్ళ కంటే ముందు అతనే ముందుకు వచ్చి "నా పేరు శ్రీపతి నిన్న నే కొత్తగా దిగాము. పార్క్ దగ్గర లో మీరూ నా వయసే వారని చూడగానే సంతోషం కలిగి పరిచయం చేసుకోవాలనిపించింది. మాది విజయవాడ .పిల్లలు అమెరికాలో ఉన్నారు." అంటూ ఆగాడు.
" చాలా సంతోషం మీ పరిచయం శ్రీపతి గారు, మేము నలుగురం స్నేహితులం నా పేరు రామ్మూర్తి, అని మిగతా ముగ్గురిని పరిచయం చేశాడు. మేము నలుగురం ప్రాణ స్నేహితులం , నలుగురి ఉద్యోగాలు వేరైనా నలుగురం రిటైర్ అయ్యాము.ప్రస్తుతం పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి .కాస్తంత బాధ్యతలు తీరి ఏదో ఇలా పార్క్ లో కలుసుకుని వాకింగ్ చేస్తూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటాము."
"సరే సాయంత్రం మళ్ళీ పార్క్ లో కలుద్దాం అన్నారు నలుగురూ".
"చూస్తాను వీలైతే అన్నాడు " శ్రీపతి.
దారిలో ఇంటికి కావలసిన కూరగాయలు కొన్నాడు శ్రీపతి.అన్నిటికీ దగ్గరగా ఉంది ఇల్లు .పార్క్, బస్ స్టాప్, కూరగాయలు, పళ్ళు పూలు, కిరాణా , హాస్పిటల్. చాలు ఈ జన్మకు ఇది చాలు అనుకున్నాడు.సీతకు ఎంత ఇష్టమో ఇలా ఉంటే అనుకున్నాడు తృప్తిగా..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/AneQUVrJUUM
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కాకతి రుద్రమ ఎపిసోడ్ 12
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
గత ఎపిసోడ్ లో…
చాళుక్య వీరభద్రుడు, రుద్రమ దేవి ఉద్యానవనం లో కలుస్తారు.
వారి కలయిక చూసిన శివదేవయ్య సంతోషిస్తాడు.
ఇక చదవండి..
తెల్లారింది.
తూర్పు మబ్బు రాగరంజితమైంది.
రుద్రదేవుడికి రాత్రంతా నిద్రలేదు.
ఎడతెగని ఆలోచనలు.
శత్రువులు దుమకటానికి సిద్దంగా వున్నారు.
ఇటు చూస్తే కాకతీయ సామ్రజ్యం కత్తుల వంతెనవలె వున్నది.
శత్రువులు యెంతమంది వున్నారో, కొమ్ముకాసే మిత్రులూ అంతే వున్నారు.
గన్నారెడ్డి వార్తలు తెలియరావటం లేదు.
లకుమయారెడ్డి - యాదవరాజులతోనూ, హరిహర మురారి దేవులతోనూ, కళింగులతోనూ ఈ సామ్రాజ్యలక్ష్మి ని చేపట్టాలనే పాచికలు వేస్తున్నాడనేది వేగులు తెచ్చిన వార్తలు.
అయితే మురారిదేవుల మహామంత్రి రుద్రయ్యను గోన గన్నారెడ్డి బంధించినాడనీ- అతను యింకా బంధీగానే ఉన్నాడని మరొక్క నిర్దారితమైన కబురు.
గన్నారెడ్డికి తమమీద వున్న అపారమైన ప్రేమకు, ప్రభుభక్తికి యిది మరొక మచ్చు తునక. ఉదాహరణ. అదీగాక, అన్నమాంబిక ను వలచినవాడు, నిండు మనసుతో
ప్రేమను పంచుకున్నవాడు.
చాటుమాటున తమకు సహాయం చేస్తున్నాడు కానీ, తమ సహాయాన్ని అతనెన్నడు ఆశించలేదు. అతడు వీరుడు. మెరుపు యుద్దతంత్రంలో దిట్ట. శత్రువును నిర్జించుటలో సిద్ధహస్తుడు. ఏమైనా అతడు మహావీరుడైన బుద్దారెడ్డి కుమారుడు కదా!..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/0c-iFJdXX-k
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
సు...ధీర ఎపిసోడ్ 12
రచన: బివిడి ప్రసాదరావు
గత ఎపిసోడ్ లో…
సు కోరినట్లు, తన తలిదండ్రుల వద్ద ఆమె ప్రస్తావన తెస్తాడు ధీర.
వాళ్ళు ఆమె నటనను అభిమానిస్తున్నట్లు తెలుసుకొని ఆనందిస్తాడు.
ఇక చదవండి...
వెంకటరావు మాట్లాడలేక పోయాడు.
"మనం ఇంతిదైపోవడమే తప్పా.. వీళ్లేమైనా మనల్ని పట్టించుకుంటారా.. పైగా మనల్ని ఎరుగుదురా." అంది సావిత్రి.
"ఈ అమ్మాయి నన్ను పట్టించుకుంది.. ఈ అమ్మాయి నన్ను ఎరుగును." చెప్పేశాడు ధీర.
ఆ తల్లిదండ్రులు మొహాలు చూసుకున్నారు.
"నేను ఈ అమ్మాయితో మాట్లాడేను.. ఈ అమ్మాయితో కల్సి తిళ్లు.." చెప్పుతున్న ధీరకి అడ్డై..
"ఏమిట్రా నువ్వు అంటుంది." అన్నాడు వెంకటరావు గాభరాగా.
"ఈ అమ్మాయితో నీకు పరిచయం ఉందా." అడిగింది సావిత్రి వింతగా.
"అవును. చాలా ఉంది." చెప్పాడు ధీర.
"మేము నమ్మాలి." అనేశాడు వెంకటరావు.
"నేను నమ్మిస్తానుగా." చెప్పేశాడు ధీర.
ఆ తర్వాత.. తన గది లోకి వెళ్లి పోయాడు.
ఆ తల్లిదండ్రులు విస్మయంలో ఉన్నారు.
"వీడికి తొందరగా పెళ్లి కానిచ్చేయాలండీ." అంది సావిత్రి.
ధీర ఫోన్ తీసుకొని.. సు కి వాట్సాప్ మేసేజ్ పెట్టాడు.
'నిన్ను అర్జంట్ గా కలవాలి. పర్మిషన్ ఇవ్వు.' ధీర పెట్టిన మేసేజ్ ఇది.
షూటింగ్ బ్రేక్ లో.. లంచ్ కై తన కారు లోకి వచ్చిన సు.. అప్పుడు ఆ మేసేజ్ ని చూడగలిగింది.
'లోకేషన్ స్పాట్ పంపుతున్నాను. అర్జంట్ ఐతేనే రా.' అంటూ తను రిప్లై మేసేజ్ పెట్టింది.
ధీర అది చూసుకొని.. వెంటనే బయలు దేరి.. సు సూచించిన స్పాట్ కి వచ్చేశాడు.
"ధీర వచ్చాడని చెప్పండి." అంటూ సు కి కబురు పంపగా.. 'తనని తన కారు వద్ద ఉండమ'ని సు తిరిగి సమాధానం పంపింది.
సు కై ధీర.. సు కారు వద్ద వేచి ఉన్నాడు.
సుమారు అర గంట తర్వాత.. సు వచ్చింది.
"ఏమిటి. అంత అర్జంట్." అడిగింది.
"మా వాళ్లు.. 'నువ్వు నాకు తెలుసు'.. అంటే నమ్మడం లేదు. అందుకే.. నాతో నీ సెల్ఫీ ఫోటో కావాలి. అది చూపి.. వాళ్లని నమ్మించ గలను." చెప్పాడు ధీర.
సు చిన్నగా నవ్వింది.
ధీరతో కల్సి.. సెల్ఫీ ఫోటో.. తనే తీసింది.. ధీర ఫోన్ తోనే..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/OEjg-3XPPaw
From the publisher's feed