Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • ప్రేమ‘భ్రమ’రం - 3 | Prema Bhramaram - 3 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ప్రేమ ‘భ్రమ’రం - 3

    రచన: వసుంధర

    వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ  ‘భ్రమ’రం మూడవ  భాగం

    గత ఎపిసోడ్ లో...

    నా పేరు విచల్.

    మా పెదనాన్నగారమ్మాయి సరయు.

    పై చదువులకు అమెరికా వెళ్లాలనుకుంది సరయు.

    తాను అక్కడ ప్రేమలో పడకూడదన్న షరతు మీద పెదనాన్నని ఒప్పిస్తాను.

    కానీ నేను ప్రేమ వివాహం చేసుకుంటే తను కూడా అలానే చేస్తానంది సరయు.

    నా  క్లాస్‌మేట్‌ కిషోర్‌ వాళ్ళ నాన్న రమణయ్య కాల్ చేసి, నన్ను రమ్మంటాడు.

    ట్రైన్ లో నాకు ఒక జంట పరిచయమవుతారు.

    ఇక  ప్రేమ  ‘భ్రమ’రం మూడవ భాగం చదవండి ...

    ‘‘భగవంతుడికీ భక్తుడికీ అనుసంధానం ప్రేమ. ప్రియుడికీ ప్రేయసికీ అనుసంధానం ప్రేమ’’

    ఈ మాట నాకు కిషోర్‌ చెప్పాడు. అది ఉపదేశం కాదు. నా ఉపదేశానికి సమాధానం.

    కిషోర్‌ నాకు కాలేజిలో క్లాస్‌మేటు. వేర్వేరు కంపెనీల్లోనే ఐనా ఒకే ఊళ్లో ఉద్యోగాలు చేస్తున్నాం.

    వాడు, స్వర అనే అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇరుపక్షాల పెద్దవాళ్లూ ఆ పెళ్లికి ఒప్పుకోలేదు.

    ఆ పెళ్లి జరిగితే రెండు కుటుంబాలూ వాళ్లని వెలేస్తాయి. అది తెలిసీ వాళ్లు పెళ్లికి సిద్ధపడ్డారు.

    ఆ పెళ్లి జరక్కుండా ఆపాలని రెండు కుటుంబాలూ తీవ్రంగా ప్రయత్నాలు మొదలెట్టాయి.

    ఏ పుట్టలో ఏ పాముంటుందోనని తెలిసినవాళ్లందరికీ చెప్పి రాయబారాలు పంపుతున్నారు.

    అంతవరకూ ఇది మామూలు ప్రేమ కథ.

    రాయబారానికి కిషోర్‌ తండ్రి ఎంచుకున్నవారిలో నేను కూడా ఉండడంతో - ఈ ప్రేమకథలో నేనూ ఒక పాత్ర కావాల్సి వచ్చింది.

    ‘‘మావాడూ నువ్వూ మంచి మిత్రులు. వాడి చెడు గుణాల్లో ఒక్కటీ నీకు అలవడలేదు. నీ మంచి గుణాల్లో ఒక్కటీ వాడికి వంటబట్టలేదు’’ అని ముందు నన్ను పొగిడాడు కిషోర్‌ తండ్రి.

    నా గురించి ఆయనకి అంతగా తెలియదని తెలిసినా, పోనీ పొగిడాడులే అని సంబరపడ్డాను. ఐతే - ‘పొగడ్తల్లో ఎప్పుడూ ఓ క్యాచ్‌ ఉంటుంది సుమా’ అని మనసు హెచ్చరించింది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/DJgSAZC8Urs


    37 min
  • తరాల_అంతరాలు | Tharala Antharalu | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    తరాల అంతరాలు

    రచన: నీరజ హరి ప్రభల

    " ఏమండీ! మన అమ్మాయి సుధకి రెండు రోజుల్లో పరీక్ష ఫీజు కట్టాలిట. ఇందాకే తను చెప్పింది." అంది శ్యామల, భర్త రామయ్యతో.

    "అలాగేలేవే! చూద్దాం. ఈనెల జీతం ఇంకా రాలేదు" అని ఆఫీసుకు వెళ్లాడు రామయ్య.

    ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రామయ్య- భార్య శ్యామల, కూతురు సుధతో ఉన్నంతలో సంతోషంగా జీవిస్తున్నారు. చదువంటే ఇష్టంతో చిన్నప్పటినుంచి కష్టపడి చదువుతూ ఇప్పుడు డిగ్రీ ఆఖరి సం.. చదువుతోంది సుధ. తమ ఇంటి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు తెలుసుకుని నడుచుకుంటూ తల్లి తండ్రులకు అనుకూలంగా ప్రవర్తించే సుధ అంటే వాళ్లకు ప్రాణం.

    ఆ సాయంత్రం ఆఫీసునుంచి వస్తూనే జీతం డబ్బులను తెచ్చి భార్య చేతికిచ్చి అందులో సుధకు ఫీజు కట్టమన్నాడు రామయ్య. శ్యామల సుధను పిలిచి ఫీజుకు డబ్బులు ఇచ్చింది. ఈ సం… చదువు పూర్తవగానే ఏదన్నా ఉద్యోగం చేసి సంపాదిస్తూ తండ్రికి చేదోడుగా ఉండాలని అనుకుంది సుధ. సుధ పెళ్లి కోసం ఒక చిట్ ఫండ్ కంపెనీలో చీటీ కట్టి డబ్బులు దాస్తున్నాడు రామయ్య. కాలం గడుస్తోంది. ఒక రోజున చిట్ ఫండ్ కంపెనీ వాళ్లు బోర్డ్ ఎత్తేసి పరారైనట్లు విని రామయ్య హతాశుడయ్యాడు. ఆదరాబాదరాగా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ తనలాంటి ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు ఆఆఫీసుకు సీల్ వేసి కేసు నమోదు చేసుకుని ఎవరెవరు ఎంతెంత కట్టారో తెలుసుకుని వ్రాసుకుంటున్నారు. రామయ్య కూడా తనెంత కట్టాడో వివరాలు చెప్పి ఇంటికి వచ్చాడు. జరిగింది భార్యతో, సుధతో చెప్పి బాధపడ్డాడు. వాళ్లిద్దరూ ఆయన్ని ఓదార్చారు..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/6Xi-l0PuVNw


    10 min
  • మురిసిన పసిహృదయం | Murisina Pasi Hrudayam | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    మురిసిన పసిహృదయం

    రచన: యశోద పులుగుర్త

    స్కూల్ కి టైమ్ అవుతోందని, స్కూల్ బస్ వచ్చేస్తుందని చక చకా తయారౌతోంది తొమ్మిదేళ్ల సితార.. బస్ మిస్ అయితే  స్కూల్ కి వెళ్లడం చాలా కష్టం.. నాన్న కారులో డ్రాప్ చేయాలి.. అసలుకే నాన్న చాలా బిజీ ..

    ఈ లోగా మూడేళ్ల 'సిద్దూ' వచ్చి తను స్కూల్ బేగ్ లో సర్దుకున్న పుస్తకాన్నీ బయటకు లాగి పారేసేసరికి సితారకు చాలా కోపం వచ్చి వాడి పిర్రమీద రెండు అంటించేసరికి వాడు గట్టిగా ఆరున్నొక్క రాగం ఎత్తుకున్నాడు..

    వాడి ఏడుపుకి కంగారపడుతూ నీరజ పరుగెత్తుకుంటూ వచ్చేసింది..

    " ఏయ్ మొద్దూ.. ఎందుకే తమ్ముడిని అంతలా కొట్తావు? చిన్న పిల్లాడు కదా.. నెమ్మదిగా బుజ్జగించి చెప్పలేవా?” అంది నీరజ.

    "నెమ్మదిగానా? వాడు నా పుస్తకాలన్నీ లాగేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా అమ్మా" అప్పటికే నీరజ చంకనెక్కేసిన సిద్దూ వైపే కోపంగా చూస్తూ అంది సితార.

    “అయినా ఏం కోపమే తల్లీ, పెద్దదానివౌతున్నావు, కాస్త నిదానం నేర్చుకోవే” అంటూ నీరజ కోపంగా సిద్దూని ఎత్తుకుని అక్కడనుండి వెళ్లిపోయింది..

    ఈలోగా సితార కంటే రెండేళ్ల చిన్నదైన ' సింధుజ'  తయారైపోయి తనవైపు ఓరగా చూసుకుంటూ బేగ్ ఊపుకుంటూ దర్జాగా “అమ్మా! బై..” అని చెపుతూ  వెళ్లిపోయింది. సింధూది కూడా సితార చదివే స్కూలే.. ఇద్దరిదీ ఒకటే బస్..

    తనకంటే రెండేళ్లమాత్రమే చిన్నదైన సింధూని ‘చిన్నపిల్ల’ అంటూ అమ్మ దానికి దగ్గరుండి అన్నీ సర్దిపెడ్తుంది. నోట్లో పెట్టి మరీ తినిపిస్తుంది. తను మాత్రం అమ్మా నాన్నా దృష్టిలో పెద్దది. సింధూకంటే ఎంత పెద్దదాన్నని అనుకుంటుంది అమ్మ! సితారలో ఎప్పుడూ కలిగే సందేహమే ఇది..

    ఆరోజు సాయంత్రం స్కూల్ నుండి రాగానే హోమ్ వర్కు చేసుకుంటున్న సితార నాన్న కేకలకు చివ్వున తలెత్తింది.. నాన్న ఆఫీసునుండి రావడం కూడా గమనించనే లేదు..

    వస్తూనే సితార తో " సీతూ! సిద్దూ మోకాలు చూడు ఎంతలా కొట్టుకుపోయిందో, ఆడుకుంటూ పడినట్లు ఉన్నాడు..  వాడిని కాస్త కనిపెట్టుకు చూడమని నీకెన్నిసార్లు చెప్పాను? పెద్దదానివి, వాడిని కాస్త చూసుకోవద్దూ” అంటూ  నాన్న కళ్ళెర్ర చేస్తుంటే బెదిరిపోయింది..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/iX2r709m08k


    12 min
  • మనశ్శాంతి | Manassanthi | Telugu Short Story | Dasu Radhika | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    మనశ్శాంతి

    రచన: దాసు రాధిక

    "అబ్బా ఆ దిండు కింద చూడవచ్చు గా... రోజూ వెతకటమే... తాళాల కోసం... ఒక్క నిమిషం ప్రశాంతంగా దేవుడికి  దణ్ణము కూడా పెట్టుకో నివ్వరు" ...

    ప్రసాద్కిది మామూలే…

    "రాజేష్, ఫోను మ్రోగుతున్నది, ఎత్తచ్చు కదరా ?"

    "సార్, ఒక్క నిమిషం, నేను ఇక్కడ చిమ్ముకొని అవతలకి పోతాను... నాకూ టైమ్ అవుతోంది"... పనిమనిషి కూడా ఊపిరి తీస్తున్నది…

    అటు పనిమనిషి చేతిలో ఉన్న చీపురు తనకు తగలకుండా ఇటు పెళ్లాంతో, కొడుకు తో మాట్లాడుతూ దేవుడి ని ఆ క్షణం తను అడగాలనుకున్నది కూడా మర్చిపోయాడు ప్రసాద్...

    ఒక్క నిమిషం ప్రశాంతంగా దేవుడి ముందు చేతులు జోడించి నిలబడ లేని పరిస్థితి... ప్రతీ రోజు అంతే... ఏంటో...

    కాస్త పలహారం నోట్లో పడుతుండగానే కాలింగ్ బెల్లు మ్రోగింది... ఆ నిమిషంలో ఇంట్లో ఉన్న మనుషులంతా మాయమైపోయారా ఏం? ఒక్కరూ వచ్చి తలుపు తియ్యలేదు అని టిఫిన్ తినకుండా చెయ్యి కడుక్కొని తలుపు తీశాడు ప్రసాద్...

    "ఎవరు నాన్న? " అని  లోపల నుండి అరిచాడు రాజేష్...

    "నీకెందుకు రా, ఆ కంప్యూటర్ దగ్గరే తగలడు" అన్నాడు ప్రసాద్.

    కొడుకు రాజేష్ కి పగలు రాత్రి తేడా లేకుండా పోయింది... ఆ కంప్యూటర్ మెడ కి కట్టు కొని తిరుగుతాడు... ఇప్పటికే స్టార్ట్ అప్ అని ఎంతో డబ్బు ఎన్నో సార్లు తగ లేశాడు ... ఇంట్లో ఏం జరుగుతున్నదో అతనికి సంబంధం లేదు...

    వచ్చింది పేపర్ బిల్లు తీసుకొని న్యూస్ పేపర్ బాయ్... వాడికి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు తయారైపోతాడు ... ఎన్ని సార్లు మొత్తుకున్నాడో ప్రసాద్... వీడి మొహాన ఆ బిల్లు డబ్బులు ఇచ్చేస్తే టిఫిన్ తిన్నంత ఫలితం... ఒట్టి పేచి కోరు... మొత్తం చిల్లర తో సహా చెల్లించాడు అతనికి ప్రసాద్... లేకపోతే ఏదో బాకీ వాడు ఇంటి ముందు గోల చేసినట్టు చేస్తాడు వెధవ…

    ఈ తలనొప్పి తనకే ... పేపర్ అందరూ చదువుతారు కాని తన అర్ధాంగి ప్రమీల ఏ రోజు నెల వారీ బిల్లులు కట్టదు... అర్ధాంగి అనే మాట కు తన జీవితం లో అర్థం లేదు, (అదే అర్ధం కాలేదు ఇన్ని ఏళ్లు గా)అంగీ మటుకు ఉంది... అర్ధం కాలేదా? అదేనండి…

    కొన్నేళ్లుగా ఉద్యోగానికి రోజూ ఆడవాళ్లందరి లాగా చీరెలకు స్వస్తి చెప్పి పంజాబీ డ్రస్సులు వేసుకుంటోన్ది..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/1iyCJHpUHok


    16 min
  • కాకతి రుద్రమ ఎపిసోడ్ 13 | Kakathi Rudrama Episode 13 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కాకతి రుద్రమ ఎపిసోడ్ 13

    రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    గత ఎపిసోడ్ లో…

    గొంక ప్రభువు రుద్ర దేవుడిని కలుస్తాడు.

    గన్నారెడ్డి, మైలవనాయకుని ఓడించి సంహరించిన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు వివరిస్తాడు.

    గన్నారెడ్డి, మార్కాపురం ప్రభువైన సోమనాధప్రభువుని వధించిన వార్తకు సంబంధించిన వివరాలు అడుగుతాడు రుద్ర దేవుడు.

    ద్వంద యుద్ధంలో గన్నారెడ్డి, సోమనాధుడిని ఆలా చంపాడో చెబుతాడు గొంక ప్రభువు.

    ఇక చదవండి..

    ఓరుగల్లు, నాగరికతా ప్రాభవాలకు పుట్టినిల్లు.

    కోటలు,

    బాటలు,

    వీధులు,

    రాచనగరులు,

    మంత్రి, సేనానాయకుల నివాసగృహాలు,

    బ్రాహ్మణ, వైశ్య వీధులు.

    గుర్రపుశాలలు, ఏనుగుల నివేశన స్థలములు,

    అంగళ్ళు, రకరకాల అలంకరణ సామగ్రులు, సుగంధ ద్రవ్యాలు.. అన్నీ విరివిగా దొరుకుతూ వుంటాయి. ఓరుగల్లులో దొరకని వస్తువు లేదు.

    ఆ నాళ్ళలోనే కవిత్వ, సంగీత, సాహిత్య, చిత్రలేఖనా, శిల్పకళ లు వుద్భవిల్లినాయి.

    ...... కమనీయ భరతనాట్య భంగిమలకు ఓరుగల్లు పెట్టిన పేరు.

    ఎన్నో శత్రురాజుల ఆటు పోట్లకు నిలబడిన కాకతీసామ్రాజ్యము తిన్నన్నీ ఢక్కా

    మొక్కీలు మరే సామ్రాజ్యము తినలేదు. గణపతి రుద్రదేవుల విశాలహృదయము , ఈవి, ఠీవి, ఔదార్యము, చరిత్రపుటలలో శాశ్వతకీర్తులతో నిలబడిపోయాయి.

    అలాగే రుద్రమదేవి కళాసహృదయత కూడా.

    ఒక సామ్రాజ్య ప్రాభవాలు ఆ ప్రభువుల దక్షతమీద, సిద్దహస్తత మీద నిలుస్తాయి.......

    ఇది రుద్రమదేవి తాతముత్తాతలనుంచి నిలుపుకున్న మగటిమి.

    అయితే గణపతి రుద్రదేవులు, తమసామంతరాజుల విషయంలో ఎంత ఉదారంగా ఉండేవారో, అవసరం వచ్చినప్పుడు అంత కఠోరంగాను వుండేవారు.

    తప్పు చేస్తే, వారు ఎవరైనా శిక్షించటానికి ఎన్నడూ వెనుకాడేవారు కాదు.

    --------------

    గణపతి రుద్రదేవులు అంతిమక్షణాల్లో వున్నారు. మృత్యువు     ఆయనను   తనవెంట తీసుకు వెళ్ళడానికి అన్ని సంరంభాల్లోనూ సిద్దంగానే వున్నది. ఆయన, మహాభినిష్క్రమణము చెందబోయే వృద్దసింహంలాగా వున్నాడు. శరీరం క్షీణించింది. రాచకార్యాలకు విముఖంగా వున్నారు.

    శివదేవయ్యమంత్రులు తీరికలేని పనులతో సతమతమవుతున్నారు. సర్వసేనానులు తమ సైన్యాలతో సిద్దంగా వున్నారు. ఈ క్షణాల్లోనే ఎటు చూసినా , ఎటువైపు నుంచయినా శత్రువులు చుట్టుముట్టుకు రావచ్చు..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    17 min
  • ఉత్తమ శిష్యః | Utthama Sishyaha | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఉత్తమ శిష్యః 

    రచన: అల్లు సాయిరాం

    ప్రభుత్వ హైస్కూల్లో ఉదయం ప్రార్ధన ముగిసింది. విద్యార్థులు వారివారి తరగతి గదులకు వెళ్లి కూర్చున్నారు. ఉపాధ్యాయ సిబ్బంది ఆఫీస్ రూమ్ కి వెళ్లి, టైంటేబుల్ ప్రకారం వారివారి నియామక  తరగతి గదులకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. రెండేళ్లలో రిటైర్మెంట్ అవ్వబోతున్న తెలుగు మాస్టారు జనార్ధనరావు ఎప్పటిలాగే ఆఫీసురూం వెనుకున్న చెట్టుకింద నిల్చుని, నోట్లోంచి గాల్లోకి పొగ గింగిరాలు వదులుతున్నాడు. స్వతహాగా జనార్దనరావు మాష్టారు చాలా బాగా పాఠాలు నేర్పించేవారు. ఉపాధ్యాయుడిగా ముప్పై యేళ్ల అనుభవం వలనో, లేక స్కూల్లో అందరి కంటే తాను సినీయర్ అవ్వడం వలనో, లేక స్కూల్ హెడ్మాస్టర్ చిన్నంనాయుడు మాష్టారు తన బంధువు కావడం వలనో, రానురాను జనార్ధనరావు మాష్టారిలో నిర్లక్ష్య ధోరణి అక్కడక్కడ  కనిపిస్తుంది. ఆనోటాఈనోటా వినిపిస్తుంది. ఆయన విద్యాబోధనశైలిపై విద్యార్థులకి, ఆయన వ్యవహారశైలిపై తోటిఉపాధ్యాయులకి అసంతృప్తిగా ఉన్నా, వారిలో వారు గుసగుసలాడుకోవడం తప్ప, బయటకు ఎవరూ చెప్పరు! చెప్పలేరు!  హెడ్మాస్టారు చిన్నంనాయుడు మాష్టారు కూడా జనార్ధనరావు మాష్టారి సినీయారిటీని గౌరవించి, సందర్భానుసారంగా సలహాలు, సంపద్రింపులు చేస్తుంటారు. కాబట్టి, జనార్ధనరావు మాష్టారు తనకు నచ్చినట్లుగా వ్యవహరిస్తుంటారు.

    మొదటి పీరియడ్ గంట మ్రోగి, పదినిమిషాలు అవుతుంది. అందరూ ఉపాధ్యాయులు చకచకా ఆయా తరగతిగదులకు చేరుకుని విద్యార్థుల హాజరు తీసుకుంటున్నారు.

    "గుడ్ మార్నింగ్ సార్! మీదే సార్ ఫస్ట్ పీరియడ్!" అని అంటూ జనార్ధనరావు మాష్టారి దగ్గరికి వచ్చాడు తొమ్మిదోతరగతి లీడర్ నరేష్.

    "ఊఁ తెలుసురా! ఆఁ హాఫ్ఇయర్లీ పరీక్షపేపర్లు దిద్దమని చెప్పానే! దిద్దడం అయిపోయిందా?" అని జనార్ధనరావు మాష్టారు అడిగితే "ఆఁ అన్ని పేపర్లు దిద్దేశాను సార్!" అని  చనువుగా చెప్పాడు నరేష్.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/Ur85_OJOvnY

    22 min
  • కలియుగ నీతి | Kaliyuga Neethi | Telugu Short Story | Kolla Pushpa | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కలియుగ నీతి

    రచన:  కొల్లా పుష్ప

    ఒరేయ్ రాజా ఇవాళ నాకు ఫస్ట్ సాలరీ వచ్చింది నాగార్జునసాగర్ వెళ్లి ఎంజాయ్ చేద్దాం" అన్నాడు వేణు.

    "సరే" అన్నాడు రాజా.

    వేణుది విజయవాడ దగ్గర చిన్న పల్లెటూరు. తండ్రి, తల్లి, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.   కూలి పనులు చేసుకుంటూ వేణుని చదివించారు. వేణు చదువు పూర్తవగానే ఉద్యోగం వచ్చింది,  జీతం 40,000 రూపాయలు.

    డబ్బులు చూడగానే చాలా సంతోషం వేసింది. తండ్రికి డబ్బులు పంపిద్దాము అనుకున్నాడు కాని 'అన్ని డబ్బులు వాళ్ళు ఏం చేసుకుంటారు.. పల్లెటూరు కదా!' అని కేవలం 5000 రూపాయలు పంపించాడు.

    ఇద్దరూ బైక్ మీద బయలుదేరారు. కొంతసేపటికి "ఆకలి వేస్తుందిరా! ఈ దారిలో ఏమీ లేనట్టు ఉన్నాయి" అన్నాడు రాజా.

    ఇంతలో ఒక పెద్దాయన "ఉడకబెట్టిన గుడ్లున్నాయి బాబూ. తింటారా? గుడ్డు 20 రూ/లు" అన్నాడు.

    "ఎందుకు? 15 రూ/లు ఇస్తాను,  ఇవ్వు. లేకపోతే లేదు" అన్నాడు వేణు.

    "బాబూ! గుడ్డు ఖరీదు పన్నెండు రూపాయలు. ఉడక పెట్టి ఇంతదూరం తెచ్చాను కదా బాబూ!" అన్నాడు పెద్దాయన.

    "15 రూ/లు అయితే తీసుకుంటాను. లేకపోతే వెళ్ళు" అన్నాడు వేణు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/6Cbr1AVHtUw




    4 min
  • సొట్టలు | Sottalu | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సొట్టలు

    రచన: భాగవతుల భారతి

    "టాంగ్ ఠాంగ్.. ఏమిటీ సౌండ్ పొల్యూషన్

    ఆపవయ్యా..నీగోల" అంది చెవులు మూసుకుంటూ వనజ.

    "అదేంటమ్మగారూ!? ఈ రోజుల్లో ఇత్తడి, రాగి

    సామాన్లు ఎవరు వాడుతున్నారండీ...

    ఈ రాగి బిందెకు సొట్టలు తీయమని మీరేగా నన్ను పిలిచారూ... సొట్టలు తీయాలంటే సుత్తితో సుతిమెత్తగా కొట్టాలి గదండీ!? అవునూ! సొట్టలుతీసి, చింతపండూ ఉప్పూవేసి తోమేసి, మీ బామ్మగారి గుర్తుగా వాడుకోవచ్చు బ్రహ్మాండంగా " అన్నాడు సొట్టలు తీసే అతను.

    ఆలోచనలో పడింది వనజ.

    ఫోన్ రింగైతే లిఫ్టు చేసింది.

    "హలో వనజా ఏంచేస్తున్నావ్?" అంది వనజ స్నేహితురాలు.

    "నా పెళ్ళికి బామ్మ అందరిలా కాకుండా వెరైటీగా, పాత రాగి బిందెను గిఫ్ట్ గా ఇచ్చింది. ఇస్తూ, ‘వనజా! నేనున్నా లేకున్నా ఈ బిందె చూడగానే ఈ బామ్మే గుర్తురావాలి నీకు.... ఇవాళా రేపు రాగి, ఇత్తడీ ఎవరూ వాడట్లేదు. అందుకని ఆ వంకతో ఈ బిందె ఎప్పుడూ అమ్మాలని గానీ, మార్చి వేరే వస్తువు తీసుకోవాలని గానీ ప్రయత్నించకు’ అని చెప్పింది. అందుకని నేను ఇల్లు మారినప్పుడల్లా, దీన్ని కూడా, నాతో తెస్తూనే ఉన్నా. ఇప్పుడు... నేనూ, సందేష్ విడిపోవాలనుకున్నాం గా..

    ఈ బిందెకూడా నాతో తెచ్చా. సొట్టలు పడి, మకిలి పట్టిందిగా.... కాస్త రిపేర్ చేసీ.... " అంటూ ఆగి ఎందుకో ఆలోచనలలో పడింది వనజ.

    "నీ విడాకులు ఎక్కడిదాకా వచ్చినాయ్? నువ్వడిగిన భరణం ఇస్తానన్నాడా? గురుడు. " అడిగింది స్నేహితురాలు.

    సమాధానం చెప్పని వనజని....

    "ఏంటీ.. ఫోన్ చేతుల్లోనే ఉంచుకుని ఏంటంత పరధ్యానం ? ఏమాలోచిస్తున్నావ్ " రెట్టించింది.

    "అదీ! … విడాకుల కేస్ వాపస్ తీసేసుకుందామను కుంటున్నాను." అంది వనజ.

    "అదేమిటే!? డైవోర్స్ తీసుకుని, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తా వనుకున్నాము" ఆశ్చర్యంగా అంది వనజ స్నేహితురాలు..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/UPqeNBaiNzU


    4 min
  • నా మది మెచ్చిన చెలికాడు | Na Madi Mechhina Chelikadu | N Dhanalakshmi | Telugu Short Story | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    నా మది మెచ్చిన చెలికాడు

    రచన: N. ధనలక్ష్మి

    “వావ్! ఇంటర్లో 90% రావడం అంత ఈజీ కాదు స్వేచ్ఛా .. కానీ నువ్వు సాధించావు. నెక్స్ట్ ఏమి చదవాలను కుంటున్నావు?” అడిగింది సిరి.

    “సిరీ... ఇంకేమీ  చదవాలి అనుకోవడం లేదు” చెప్పింది స్వేచ్ఛ.

    “ఎందుకు స్వేచ్ఛా ....” ఆశ్చర్యంగా అంది సిరి.

    “నాన్న ఇప్పటికే మా గురించి చాలా కష్టపడ్డారు. నేను ప్రభుత్వ కొలువులో ఏదైనా ఉదోగ్యం తెచ్చుకొని ఇంటికి కొంచం చేదోడు వాదోడుగా ఉంటూ తమ్ముడ్ని, చెల్లిని చదివించాలని అనుకుంటున్న సిరి…” అంది స్వేచ్ఛ.

    “సరే నే! నీకున్న ప్రతిభకు తప్పకుండా జాబ్ తెచ్చుకుంటావ్ ఆ నమ్మకం నాకుంది..” అంది సిరి.

    “అల్ది బెస్ట్ స్వేచ్ఛా. నాన్నకి ట్రాన్స్ఫర్ రావడంతో మేము గుంతకల్లుకి వెళ్ళిపోతున్నాము. ఈ రోజు సాయంత్రమే వెళ్తున్నాము. అప్పుడప్పుడు నీకు ఫోన్ చేస్తుంటాను. బై …”

    “బై సిరి....”

    స్వేచ్ఛ నాన్న కృష్ణ ప్రసాద్  గారిది కూరగాయల వ్యాపారం. అమ్మ ఇంటి దగ్గర చిల్లర అంగడి పెట్టుకొని జీవితం కొనసాగిస్తున్నారు...

    తన ఆలోచనను తల్లి, తండ్రితో పంచుకోవాలని ఎంతో అరాటపడుతు ఇంటికి చేరుకుంది స్వేచ్ఛ. ఇంటి దగ్గర కార్ ఆగి ఉంది.. లోపలకి వెళ్లి చూస్తే ఎవరో వచ్చి ఉన్నారు. తన రాక కోసమే ఎదురు చూస్తున్నట్టుగా అందరి మొహంలో చిరునవ్వు ...

    తల్లి ఆత్రంగా చీర కట్టి, చేతికి కాఫీల ట్రే ఇచ్చి, వారికి ఇవ్వమ్మని చెప్పారు.. తన ఇష్టం లేకుండానే పెళ్ళి చూపులు జరిగిపోయాయి..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/bLz560ClgY4


    9 min
  • వెంటాడే నీడ ఎపిసోడ్ 18 | Ventade Nida Episode 18 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వెంటాడే నీడ ఎపిసోడ్ 18

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    మామిడి తోట దగ్గర పోలీసుల్ని చూసిన అగంతకుడు పారిపోవడానికి ప్రయత్నిస్తాడు.

    ఆ ప్రయత్నంలో కాలుజారి, కింద పడతాడు. అతని తల, ఒక రాయికి కొట్టుకుని తీవ్రంగా గాయపడతాడు.

    అతన్ని చికిత్స కోసం విజయవాడ తరలిస్తారు.

    చలపతిరావు ఇంటి దగ్గర శంకర శాస్త్రి కోసం మాటువేసి వ్యక్తిని గ్రామస్థులు పట్టుకుని, తీవ్రంగా గాయపరుస్తారు.

    అతన్ని కూడా చికిత్స కోసం విజయవాడ తరలిస్తారు.

    సుమంత్ ఆచూకీ తెలుసుకున్న విశాల్, అతని కోసం విజయవాడ బయలుదేరుతాడు.

    ఇక చదవండి…

    హోమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసిన శంకరశాస్త్రి, తన బావమరిది చలపతిరావు తో కలిసి, హాస్పిటల్ లో ఉన్న సుమంత్ ని కలుస్తాడు. కొడుకును చూడగానే చలపతిరావు పట్టరాని ఆనందంతో అతన్ని కౌగిలించుకున్నాడు. తండ్రిని ఓదార్చిన సుమంత్ శంకరశాస్త్రి పాదాలకు నమస్కరించ బోతాడు.

    అతన్ని వారించిన శంకరశాస్త్రి “భగవంతుడి అనుగ్రహం ఉండబట్టే నువ్వు క్షేమంగా బయటపడ్డావు” అన్నాడు.

    “నేను స్పృహలో లేనప్పుడు ఒక వింత ఆకారం నన్ను వెంటాడుతున్నట్లు అనిపించేది. ఆ ఆకారం నన్ను అగాథంలోకి తోస్తున్న సమయంలో మీరు కాపాడినట్లు అనిపించేది” అని చెప్పాడు సుమంత్.

    “ నిజమే బాబూ!  నిన్ను కాపాడుతున్నందుకు ఏదో దుష్ట శక్తి ఆయన మీద పగబట్టింది. దాడికి ప్రయత్నించింది” అని చెప్పాడు చలపతిరావు.

    శంకరశాస్త్రి, సుమంత్ తో మాట్లాడుతూ “నీ కోసం మృత్యుంజయ హోమం చేశాను. ఇక నీకు ఏ భయమూ ఉండదు”అన్నాడు.

    ఇంతలో డాక్టర్ గోవర్ధన్ అక్కడికి వచ్చాడు. ఆయనకు నమస్కరించాడు సుమంత్.

    చలపతిరావు కూడా ఆయనకు నమస్కరిస్తూ “చక్కటి వైద్యం అందించి మా అబ్బాయి తొందరగా కోలుకునేలా చేశారు” అంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాడు.

    డాక్టర్ గోవర్ధన్, సుమంత్ తో మాట్లాడుతూ “హైదరాబాద్ నుండి ఏ సి పి ప్రతాప్ గారు వస్తున్నారు. ఆయన వచ్చాక నేరస్తులను గుర్తుపట్టే కార్యక్రమం ఉంటుంది. ఈలోగా విశ్రాంతి తీసుకోండి. ఎక్కువ స్ట్రెయిన్ కావద్దు” అన్నాడు.

    తరువాత చలపతిరావు వైపు తిరిగి “పోలీసులు వచ్చాక ఎంత కాదనుకున్నా సుమంత్ ని ప్రశ్నలతో ముంచెత్తుతారు. కాబట్టి అంత వరకైనా అతన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి” అని చెప్పాడు.

    శంకర శాస్త్రి డాక్టర్ తో "ఒక్క నిముషం. ఈ మంత్రించిన ఆంజనేయ స్వామి తాయత్తు సుమంత్ చేతికి కట్టేసి వెడతాను" అన్నాడు.

    ఒక్కసారిగా డాక్టర్ గోవర్ధన్ ముఖం వికృతంగా మారింది.

    "ఇదిగో పెద్దాయనా! చెబుతుంటే అర్థం కాదా? పేషేంట్ ని ఇబ్బంది పెట్టొద్దు. ముందు అందరూ బయటకు వెళ్ళండి" అన్నాడు కఠినంగా.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/1xc3nTd8xpE


    24 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world