Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • శుభారంభం | Subharambham | Telugu Short Story | Susmitha Ramana Murthy | manatelugukathalu.com

     (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    శుభారంభం

    రచన : సుస్మితా రమణ మూర్తి

    నగరానికి దూరంగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీ పార్కులో విశ్రాంత జీవులు లోకాభిరామాయణంలో బిజీగా ఉన్నారు. ఉదయం, సాయంత్రం కలుసుకుని పలకరింపులు, కబుర్లు, వార్తలు, విశేషాలు, అందరి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం వారికి పరిపాటి.

    వారిది అరవై సభ్యులున్న సీనయర్స్ సంఘం. శ్రీరామ్ వారి ప్రెసిడెంట్. సంవత్సరానికి వెయ్యేసి రూపాయలు సభ్యుల నుంచి తీసుకుని, పుట్టిన రోజులకు, పిక్నిక్ పార్టీలకు ఖర్చు చేస్తూ మిగిలింది బేంకులో జమ చేసే బాధ్యత కేషియర్ సుదర్శనంది.

    ఉదయం తొమ్మిదిన్నరకే చాలామంది కమ్యూనిటీ పార్కులో బెంచీలపై కూర్చున్నారు.

    “ అందరికీ నమస్కారం! “ అంటూశ్రీరామ్ వచ్చి కూర్చున్నాడు .

    “తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!...”

    “పేపర్ల వాళ్ళు రాసేది వాతావరణ శాఖ వారి సమాచారమే!

    ఒక్కోసారి చినుకులు కూడా పడవు!...”

    “వారి లెక్కల ప్రకారం చెప్పిందే పేపర్లో వస్తుంది”

    “అంతే! అంతే! పడితే పడొచ్చు. లేకుంటే లేదు “

    “అవునవును. బొమ్మ బొరుసు వ్యవహారం!”

    మిత్రుల కబుర్ల ప్రవాహం సాగుతోంది.

    శ్రీరామ్ అందరిలో ఉన్నా, వారి మాటలపై ధ్యాస లేదు

    నిన్నటి లోకల్ పేపర్ వార్తల ఆలోచనల్లోనే ఇంకా.

    “ సహృదయులైన పాఠకులకు మనవి. ఈ సరస్వతీ పుత్రికకు

    దయచేసి సహాయం చేయండి. ఇంటర్లో తొంభై అయిదు

    శాతం మార్కులు వచ్చాయి పై చదువులు చదువుకోలేని పరిస్థితి!...”

    “ దయగల మారాజులు మా అనాథ శరణాలయంలోని

    పిల్లలకు, వృద్ధులకు సహాయం చేయండి. నిరాదరణకు గురైన వారిని ఆదుకోండి”

    ఆ వార్తలకు శ్రీరామ్ మనసు కకావికలమైంది

    ‘ డబ్బున్న వారికి చదువబ్బదు. బాగా చదువుకునే వారికి

    డబ్బుండదు…అనాథ పిల్లలు,..ఆఖరి దశలో దాతల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకుతున్న వృద్ధులు…. దయనీయమైన పరిస్థితి!...

    ఆశ్రమానికి, అమ్మాయి చదువుకి ఎలాగైనా సహాయం చేయాలి….

    పార్టిలకు పిక్నిక్కులకు వేలకు వేలు తగలేస్తున్నాం!….,ఎంతోకొంత సహాయం చేయగల స్థితిలో ఉన్నాం కనుక, మిత్రుల దృష్టి సహాయ కార్యక్రమాల వేపు మళ్ళించాలి!....’

    “ ఈరోజు అధ్యక్ష మహాశయులు దీర్ఘాలోచనలో పడ్డారు.

    విషయం ఏమిటో!?...” ఓ మిత్రుడు నవ్వుతూ అడిగాడు.

    శ్రీరామ్ లో స్పందన లేదు. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు.

    ‘ ముందుగా సామాజిక స్పృహ, సేవాబావం గల సుదర్శనం

    గారితోను, కవిగారితోను మాట్లాడాలి…’

    చినుకులు పడుతుంటే అందరూ వెళ్ళిపోయారు.

    శ్రీరామ్ కవిగారిని, సుదర్శనంని వారి ఇంటిలో కలిసి

    తన ఆలోచనలకు వారి ప్రశంసలు పొందాడు.

    *****

    మిత్రులు అందరూ మిర్చీ బజ్జీ పార్టీలో బిజీగా ఉన్నారు.

    “ వచ్చే నెలలో మన సుబ్బారావు గారు పుట్టిన రోజు పార్టీ

    స్టార్ హోటల్లో ఇస్తారట! “...


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/0q4fiX7jeNE

    8 min
  • భవిష్య దర్శనం | Bhavishya Darsanam | Telugu Short Story | Kolla Pushpa | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    భవిష్య దర్శనం

    రచన:  కొల్లా పుష్ప

    2050వ సంవత్సరం, అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరం, పెద్ద అపార్ట్మెంట్స్ సముదాయం, అందులో 250 వ అంతస్తు, అందులో  ఒక గదిలో మంచం మీద  అవంతి పడుకుని ఉంది.

    తలుపు చప్పుడైన శబ్దానికి కళ్ళు తెరిచింది.  ఒక రోబో    వచ్చి, ప్లేట్లో ఉన్న రొట్టె లాంటి పదార్థాన్ని నోట్లో పెట్టింది. రెండు నిమిషాలాగి వాటర్ పైపు నోట్లో పెట్టింది. నాలుగు చుక్కల నీళ్లు నోటిలో పడ్డాయి.

    రోబో వెళ్ళిపోయింది.

    గదినిండా పైపులు..

    ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ పైపు,  నీళ్లకు వాటర్ పైపు,  ఏసీ ,అలాగే హీటర్, మలమూత్రాలు పోవడానికి  కూడా గొట్టాలు ఉన్నాయి.

    'ఇది  హాస్పటల్  కాదు, తన గది. కొడుకులు తన కోసం అమర్చిన గది.

    కొడుకుల్ని హాస్టల్ లో పెట్టి బాగా  చదివిస్తే అమెరికాలో ఉద్యోగాలు వస్తాయి తను కూడా అక్కడ అన్ని చూడొచ్చు వాళ్లతో పాటు అనుకొని వాళ్లని హాస్టల్ లో పెట్టి చదివించింది.

    వాళ్లు బాగా చదువుకొని అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికా చూద్దామని రెక్కలు కట్టుకుని ఇండియా నుంచి వచ్చింది..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/rJ5YctAHCgI



    7 min
  • శ్రీరామ నవమి సంబరాలు | Srirama Navami Sambaralu | Telugu Short Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    శ్రీరామ నవమి సంబరాలు

    రచన :  M R V సత్యనారాయణ మూర్తి

    శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం

    సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

    ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం

    రామం నిశాచర వినాశకరం నమామి . . . . .

    శ్రీరాముడు …

    ఈ పేరు చెబితే యావద్భారత దేశం పులకించిపోతుంది, పరవశించి పోతుంది.

    చిరంజీవి హనుమ నోట నిరంతరం పలికే మహిమాన్విత ‘రామ’ నామం ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుని  తమ జీవనగమనాన్ని సుసంపన్నం చేసింది. శ్రీరాముని అరణ్యవాస సమయంలో తెలుగు నేల లోని  భద్రాచలం కూడా శ్రీరాముని పవిత్ర పాదస్పర్శ తో పునీతం అయ్యింది.

    అటువంటి పుణ్యచరితుని కళ్యాణం శ్రీరామ నవమి నాడు భారతదేశం లోని ప్రతి పల్లె లోనూ  అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ క్రమం లోనే మా పెనుగొండలోనూ వీధి వీధినా శ్రీరామ నవమి  సంబరాలు వైభవంగా జరుగుతాయి.

    మా పెనుగొండలో జరిగే శ్రీరామ నవమి సంబరాలు

    చూడటానికి  చుట్టుపక్కల పాతిక గ్రామాల నుండి జనం వస్తారు. అదీ విశేషం . . అదీ మా పెనుగొండ ప్రత్యేకత.

    ఉగాది రోజునే శ్రీరామ నవమి పందిళ్ళకోసం మొదటి స్తంభాన్ని పాతుతారు. దీన్నే ‘స్తంభం  ముహూర్తం’ అని మా కుర్రకారు అంటారు. నగరేశ్వర స్వామి గుడికి దగ్గరగా ఉన్న బీళ్ళ వారి రామాలయం దగ్గర జరిగే శ్రీరామ నవమి సంబరాలు మా కుర్రకారుకి మాంచి ‘కిక్కిచ్చే’ రోజులు.

    అలా అని మీరు మా కుర్రకారుని ‘మరోరకంగా’ జమ కట్టేయకండి.

    ‘కిక్కు’అంటే మా పేర్రాజు గాడి భాషలో  హుషారు అని అర్ధం. మా కుర్ర బ్యాచ్ కి లీడర్ పేర్రాజే. శోభన్ బాబులా మావాడు మంచి అందగాడు. వాడు ర్యాలీ సైకిల్ ఎక్కి వెళ్తుంటే ఆడపిల్లలు కిటికీల్లోంచి తొంగి చూసేవారు. జమీందారు

    గారి హై స్కూల్  లో పదవతరగతి చదవుతున్న మావాడు పరుగు పందెం లో ఎప్పుడూ ఫస్టే.

    తాడి బాబ్జి గారి మామిడి తోటలో మామిడికాయలు దొంగతనంగా కోసి పారిపోవడంలోనే వాడికి ఈ ‘విద్య’ బాగా పట్టుబడిందని  మా బ్యాచ్ అంటే కిట్టని వాళ్ళు అంటారు. అది మేం పట్టించుకోం. ఎందుకంటే ఓడిపోయినాడు అక్కసు

    పట్టలేక ఏదో ఒకటి అంటాడని మా ‘ఫిలాసఫీ’.

    బీళ్ల అప్పలస్వామి శ్రీరామ నవమికి ఊళ్ళో పెద్దల దగ్గర చందాలు తీసుకునేవాడు. అదిగాక తన  వ్యవసాయంలో వచ్చిన ఆదాయంలో కొంత రాములు వారి సేవకి ఖర్చు పెట్టేవాడు. ఐదు రోజులూ మంచి మంచి ‘ప్రోగ్రాములు’ పెట్టేవాడు. నవమినాడు హరికథ, రెండవ రోజు బుర్రకథ, మిగతా మూడురోజులూ నాటకాలు ఉండేవి.

    రామాలయం నుండి బెజవాడ సూర్యనారాయణ ఇల్లు దాటే వరకూ పెద్ద పందిరి. పందిరి స్తంభాలకు కొబ్బరాకులు చుట్టేవారు. ఆ పందిరిలో ఆడపిల్లలు ఒప్పుల కుప్ప

    ఆడుకునేవారు. ఇంకో పక్క పెద్ద గిరి గీసి మగపిల్లలు ‘బచ్చాలాట’ఆడే వారు. పందిరి మధ్యనుంచే సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు వెళ్తూ ఉండేవి. అయినా వీళ్ళ ఆటలకు ఆటంకం ఉండేదికాదు. ఎందుకంటే వాళ్ళే నెమ్మదిగా వెళ్ళేవారు, పిల్లలు ఆడుకుంటున్నారని..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/UFexntbPYiI



    18 min
  • ప్రేమ‘భ్రమ’రం - 5 | Prema Bhramaram - 5 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ప్రేమ ‘భ్రమ’రం - 5

    రచన: వసుంధర

    వసుంధర గారి తెలుగు ధారావాహిక  ప్రేమ  ‘భ్రమ’రం ఐదవ భాగం

    గత ఎపిసోడ్ లో...

    ముక్తకీ, భవన్‌కీ జరగబోయే పెళ్లి ఆపమని నన్ను కోరుతుంది స్వర.

    ముక్త ఫోటో చూపిస్తుందామె.

    నిజంగానే ముక్త ఓ అపురూప దివ్య సుందరి.

    ఇక  ప్రేమ  ‘భ్రమ’రం ఐదవ భాగం చదవండి ...

    నేనుంటున్న చోటుకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఓ చిన్న చెరువు పక్కన ఉందో పెద్ద రావిచెట్టు.

    దాన్ని బోధివృక్షం అంటాడు ఆఫీసులో నా కొలీగ్‌ శ్రీను.

    నేనైతే ఇక్కడికి ఉద్యోగంకోసం వచ్చాను కానీ, అతడిది చిన్నప్పట్నించీ ఇదే ఊరు.

    ప్రేమకథ కాదు కానీ, ఆడపిల్లతో జతపడ్డ ఓ తమాషా కథ అతడిది.

    హైస్కూల్లో చదివేటప్పుడు తన క్లాసు అమ్మాయి శరమ అంటే గొప్ప ఆకర్షణ ఉండేదిట.

    ఆ అమ్మాయి ఒకరోజున అతడు తన వంటిమీద చెయ్యేశాడని - టీచరుకి ఫిర్యాదు చేసింది.

    నిజానికి శ్రీనుకి ఏ పాపం తెలియదు. ఆమె అలా ఎందుకు చెప్పిందో తెలియదని టీచరుకి మరీమరీ చెప్పాడు.

    టీచరు నమ్మలేదు. ఫోన్‌ చేసి ఆ విషయం శ్రీను ఇంట్లో చెప్పేడు. తండ్రి శ్రీనుని చావగొట్టేసేడు.

    శ్రీనుకి ఉక్రోషమొచ్చింది. ఆ రాత్రి ఇంట్లోంచి పారిపోయి - ఆ చెరువు దగ్గరకెళ్లి రావిచెట్టుకింద కూర్చున్నాడు.

    శ్రీనుకి ఈత రాదు. ఆ చెరువులోపలికి వెళ్లి ములిగిపోదామని అనుకున్నాడు.

    చెరువులో అడుగెడుతుండగా ఎవరో వెనక్కి లాగేరు.

    చూస్తే ఓ ముసలాయన.

    లాక్కెళ్లి చెట్టుకింద కూర్చోబెట్టి తనూ పక్కన కూర్చున్నాడు. ‘‘ఈ సమయంలో ఇక్కడికెందుకొచ్చావ్‌?’’ అని ఆయన శ్రీనుని అడిగేడు.

    ‘‘ఈ సమయంలో మీరిక్కడికెందుకొచ్చారు?’’ అని శ్రీను ఆయన్ని ఎదురుప్రశ్న వేసేడు.

    ‘‘వారానికొకసారి, పాతాళలోకంనుంచి నాగకన్యలు ఇక్కడికొచ్చి స్నానం చేసి వెడుతుంటారు. నేను వాళ్లని చూడ్డానికి వస్తుంటాను’’ అన్నాడు ముసలాయన.

    శ్రీను నమ్మలేదు. ‘‘ఏరీ నాగకన్యలు?’’ అనడిగాడు.

    ‘‘నువ్వున్నావుగా - వాళ్లిప్పుడు పాముల్లా మారిపోయారు. ఎవరైనా చెరువులో అడుగెడితే - కరిచి చంపేస్తారు. అందుకే నిన్ను చూసి వెనక్కి లాక్కొచ్చాను’’ అన్నాడు ముసలాయన.

    శ్రీనుకి వళ్లు జలదరించింది. ‘‘మీకు కన్యల్లా కనబడ్డవాళ్లు నాకెందుకు అలా కనబడరు?’’ అన్నాడు.

    ‘‘ఈ ప్రశ్నకి జవాబు దొరకాలంటే - నీకు నా వయసు రావాలి’’ అని నవ్వాడు ముసలాయన.

    శ్రీనుకి కొంత అర్థమైంది. పైకి కాకుండా మనసులో నవ్వుకున్నాడు.

    ‘‘చావంటే నాకు భయం లేదు. ఓసారి చెరువులోకి వెళ్లాలనుంది’’ అన్నాడు..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/zr3m2apyVfw


    18 min
  • కాకతి రుద్రమ ఎపిసోడ్ 15 | Kakathi Rudrama Episode 15 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కాకతి రుద్రమ ఎపిసోడ్ 15

    అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ

    15 వ భాగం

    గత ఎపిసోడ్ లో…

    నిండు సభలో మహామాత్యులు శివదేవయ్య రుద్రమ దేవి స్త్రీ అనీ, ఆమెకు ముందులా సహకారం అందించాలనీ కోరుతాడు. ముమ్ముడాంబిక కి తాను స్త్రీనని చెబుతుంది రుద్రమ దేవి.

    ఇక చదవండి..

    శివదేవయ్యలు యిప్పటినుంచి కాదు. ఎప్పటినుంచో గన్నారెడ్డిని రాజభక్తిగల వీరుడుగా గ్రహించ గలిగారు. ఆ మాత్రమన్నా ఆకళింపు చేసుకొనలేక పోయినట్లయితే ఈ అఖండ కాకతీ సామ్రాజ్యమునకు మహామాత్యు లెట్లు కాగలరు. గోనబుద్దారెడ్డి ప్రభువుల దగ్గరనుంచి వీక్షించినట్లయితే, ప్రభుభక్తికి వారు పెట్టని కోటలని జగద్విదితమైన విషయమే.

    తనకి అన్యాయం జరిగిందని గన్నారెడ్డి సోదరులు కృంగిపోలేదు.గణపతి రుద్రదేవులతో, తమ రాజ్యం తమకిప్పించమని యాచించలేదు. పట్టుమని పాతికేళ్ళయినా నిండకుండానే అరణ్యాల్లో చేరారు. కొండలను పిండి చేయగల వీరులను సేకరించారు. ఖడ్గచాలనం నేర్పాడు. ద్వంద యుద్దము నేర్పారు. మల్లవిద్యలో ప్రవీణులు గావించారు.

    విలువిద్యలో శబ్ధభేరుల్ని చేసి శరపరంపరలతో వళ్ళు తూట్లు గొట్టగల నేర్పరులను చేశారు. గదావిద్యలో నేర్పులను చేశారు. ఇక వారి గుర్రపు స్వారి అనన్య సామాన్యమట. కన్ను తెరిస్తే కనిపించే గుర్రం, కన్ను మూస్తే కనిపించదట.

    తమ్ముడు అన్నకు తగినవాడు. అన్న ' ఆ' అంటే చాలు, తమ్ముడు ' సై' అంటాడు. సూరారెడ్డి, వీరారెడ్డి, ఎలమరెడ్డి, దామరెడ్డి అందరూ అందరే నట. సింహపు కూనలట.

    అతగాడు నాలుగేళ్ళనాడు ఇరవై వొక్క సంవత్సరమన్నా రాని పాలుగారే వయస్సులో కాకతి ప్రభువులకే కమ్మ పంపగలిగిన ధీరుడు. అందులో

    ‘కాకతీ రాజ్యక్షేమం కోసం మేము దొంగలమై అరణ్యాల్లో మంచికి మంచి- చెడుకు

    చెడు. ఊళ్ళేలినా, అరణ్యాల్లో వున్నా ప్రభుభక్తి మా ఊపిరి' అని.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/Qeu9D_C-XtM

    17 min
  • అతని కొమ్ములు విరిగిపోయాయి | Athani Kommulu Virigipoyayi | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    అతని కొమ్ములు విరిగిపోయాయి

    రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

    ప్రద్యుమ్నరావు, తను ఎంతటి కోటీశ్వరుడో అతను ఎప్పుడూ లెక్కలు చూసుకోలేక పోయాడు..... ఆ లెక్కలు చూసుకునే ఆ సమయంలోనే... అతను మరొక... కోటి సంపాదించగల దిట్ట.. !

    ఆ మహానగరంలో అతడు బస చేసిన ఫైవ్ స్టార్ హోటల్లో అప్పుడే నిద్ర లేచిన ప్రద్యుమ్నరావు...

    కుళాయిల నుండి నీరు రాకపోవడంతో.....

    బజర్ నొక్కాడు......

    కాసేపటికి ఒకతను డోర్  జరిపి లోపలికి వచ్చాడు.

    ''సార్.. మొత్తం సిటీలో ఈ రోజునుంచే నీటి ఎద్దడి ప్రారంభమైంది. నా సర్వీసులో ఎప్పుడూ ఇలాంటి గడ్డు పరిస్థితి నీటి విషయంలో చూడలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని అనుకునేవాళ్ళం ... కానీ ఆ పరిస్థితి  ఇంత తొందరలో  వస్తుందని మాత్రం  అనుకోలేదు సార్. సరే.. అన్ని రోజులు, అన్ని కాలాలు మనవి కాదు కదా... సృష్టి తో పోరాటం చెయ్యలేము సార్.. రెండు మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడే వరకు కుళాయిలనుండి నీళ్లు రావు. మాకు  వచ్చిన కోటా ప్రకారం.. ఉన్న వాడైనా, లేని వాడైనా.. ఒక మనిషికి ఉదయం ఒక్క వాటర్ టిన్ మాత్రమే. మంచి చెడులన్ని ఆ ఒక్క టిన్ తోనే సరి పెట్టుకోవాలి సార్.. అలాగే సాయంత్రం ఒక టిన్ను.... ఈ విషయం ప్రతిరూమ్కి వెళ్లి ఇలాగే చెప్తున్నాను సార్"

    అంటూ  రన్నింగ్ ట్రే తో తెచ్చిన ... వాటర్ టిన్ను లోపల పెడుతూ అన్నాడు ఆ హోటల్ వాటర్ సప్లై అండ్ మెయింటనెన్స్ ఆఫీసర్ శరభేశ్వరo.

    ప్రద్యుమ్నరావు కు ఎక్కడో కాలినట్లు అయింది..

    తన ఎదురుగా  ఇంతసేపు  ఏమాత్రం జంకు లేకుండా మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఇత నొక్కడే  అనుకున్నాడు ప్రద్యుమ్నరావు.

    భ్రుకుటి ముడిచి శరభేశ్వరo  వైపు   ఏగాదిగా చూస్తూ... అతనిని వెళ్ళిపోకుండా ఆగమని, తన సెల్ ఆన్ చేశాడు..

    "హలో.. ఎమ్మెల్యే సుబ్బరాజు... ఏం చేస్తున్నావ్.

    నేను  ఈ సిటీలోనే ఉన్నాను.... హోటల్ త్రినేత్ర లో ఉన్నాను. వివరాలు అడగొద్దు.. నాకు ఈ హోటల్ కావాలి .. అర్జెంటు.. డీల్ ఎంతైనా పర్వా లేదు... పదినిమిషాల్లో పని పూర్తవ్వాలి... " .

    ... అంటూ ఆర్డరేశాడు..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/sqLFgpktBk8



    18 min
  • నమ్మక ద్రోహం | Nammaka Droham | Telugu Short Story | B Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    నమ్మక ద్రోహం

    రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

    తూరుపున తెలతెలవారుతోంది. పక్షుల కిలకిలారావాలతో పచ్చటి ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నలేలేత సూర్య కిరణాలు . ఆలయగోపురంలో గణగణ గంటల ధ్వనిలో రామచంద్రమూర్తికి మేలుకొలుపు రాగయుక్తంగా పాడుతున్నాడు సుందరయ్యగారు.

    “ కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్ధూలం కర్తవ్యం దైవమాన్నికం, ”అంటూ మేలుకొలుపు పాడి, “ ఏమయ్యా రామయ్యా … లోకాలను నీ కనుసన్నలలో నడిపించే నిన్ను మేలుకొలుపు పాడి నిద్దురలేపడం మా తరమా, నువ్వు కళ్ళు మూసుకుంటే ప్రపంచమే జలసమాధి అయిపోతుంది, అటువంటి నిన్ను లేపడం అనేది మాకు మేము నిర్ణయించుకున్న భక్తి మార్గం అంతేకదయ్యా, తండ్రి … ఈ జన్మకు ఇది చాలయ్యా, నీ సేవచేసుకునే భాగ్యం పొందిన నేను అదృష్టవంతుడిని, ” అంటూ భక్తితో రామచంద్రమూర్తి పాదాలకు నమస్కారం చేసాడు సుందరయ్యగారు.

    “ ఏంటి పంతులుగారు… హారతిచ్చి శఠగోపం పెట్టేది పెడతావా ? నువ్వు నీ రామయ్యతోనే ముచ్చట లేసుకుంటావా ఏంటి, ”? నవ్వుతూ అడిగాడు ఆ ఊరిలో మంచి పలుకుబడి ఉన్న సదానందం.

    “ అయ్యో మీరా… ఎంతసేపయింది వచ్చి, ” అడిగాడు మోహమాటపడుతూ.

    “ ఇప్పుడే వచ్చానులేవయ్యా …నువ్వు ఆర్తిగా రామయ్య వైపు చూస్తుంటే అలా అన్నాను, సరే కానీ… మీ పెద్దబ్బాయి ఏదైనా పనిలోకి వెళుతున్నాడా? నాకు తెలిసిన ఒకతను గుమాస్తా పనికి మనిషికావాలన్నాడు, జీతం ఓ వెయ్యిరూపాయలదాక ఇస్తా అన్నాడు, నాకు మీవాడు గుర్తుకువచ్చాడు, అది చెప్పిపోదామని ఇలా వచ్చాను ఏమంటావు పంతులు”.

    ఆనందంతో ఒక్కపరుగులో బయటకు వస్తూ, “ ఎంతమంచి వార్త చెప్పారు, ఆ రామచంద్రుడే మీ మనసులో చేరినట్టున్నాడు, ఎంతమాట… మీరు చెప్పాలేగానీ మావాణ్ణి ఈ పూట మీ ఇంటికి తీసుకవస్తాను, ” చెప్పాడు సంతోషంతో..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/K0vTGi17tis




    18 min
  • సైనైడ్ ఎపిసోడ్ 2 | Cyanide Episode 2 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సైనైడ్ - ఎపిసోడ్ 2

    రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి

    గత ఎపిసోడ్ లో

    విశాఖపట్నం లోని ఒక మాల్ లో ఎస్కలేటర్ కింద ఒక శవం దొరుకుతుంది.

    ఆ శవం ఒక ప్రముఖ ప్రభుత్వ ఉద్యోగిదిగా గుర్తిస్తారు పోలీసులు.

    పోస్టుమార్టం చేసిన డాక్టర్ లు అతను సైనైడ్ తో చంపబడ్డాడని నిర్ధారిస్తారు.

    ఇక సైనైడ్ మూడవ భాగం చదవండి

    అదే సమయంలో పోలీస్ శాఖ వారు విశాఖపట్నం లోని మెయిన్ రోడ్ లో ఉన్న పెద్ద హోటల్స్, బిజీ ట్రాఫిక్ జంక్షన్స్ - NAD జంక్షన్, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్,పెందుర్తి మధురవాడ జంక్షన్.. అన్నిచోట్ల సీసీ ఫుటేజ్ ఆధారంగా హంతకుడి ఊహా ముఖచిత్రం అంటించి ఆచూకీ చెప్పిన వారికి భారీ బహుమానం ప్రకటించారు.

    అసలు ఎందుకు ఒక మామూలు హత్య గురించి మొత్తం వైజాగ్ పోలీస్ ఫోర్స్ వెతుకుతుంది అంటే అది హత్యకు గురైన విధానం. ఒక సాధారణ వ్యక్తిని సైనేడ్ క్యాప్సిల్ తో అంత మొందించడం! అది అంతర్జాతీయంగా నిషేధించబడిన మందు కావడం వలన, అది కూడా అత్యవసర పరిస్థితులలో టెర్రరిస్టులు, ఆత్మాహుతి దాడులకు పాల్పడేవారు చివరి క్షణంలో పోలీసులకు, దొరకకుండా తమకు తామే హత్య చేసుకోవడానికి ఉపయోగపడే ప్రమాదకరమైన సైనైడ్  క్యాప్సూల్. అందులోనూ దేశంలో అత్యంత సుందరమైన, ప్రశాంతమైన విశాఖపట్నం సిటీ లో మొట్టమొదటిసారి జరగడంతో  దేశమంతా కలకలం రేగింది..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/Ge051SHMCW8




    8 min
  • ది ట్రాప్ ఎపిసోడ్ 2 | The Trap Episode 2 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ది ట్రాప్ ఎపిసోడ్ 2

    రచన : పాండ్రంకి సుబ్రమణి

    పాండ్రంకి సుబ్రమణి గారి  ధారావాహిక 'ది  ట్రాప్' రెండవ భాగం

    గత ఎపిసోడ్ లో

    అమెరికా వెడుతున్నాడు భువనేశ్.

    మార్గమధ్యంలో అబుదబీ ఎయిర్పోర్ట్ లో పిల్లలతో వెడుతున్న ఒక జంటను చూస్తాడతను.

    అందులోని  యువతిని చూసి తన భార్య ప్రభావతిని గుర్తుకు తెచ్చుకుంటాడు.

    గతంలోకి వెడతాడు.

    తన ఒక్కగానొక్క కూతురు సుభాషిణి ఏడేళ్ల వయసులో మరణించడం జ్ఞాపకం చేసుకొని బాధ పడతాడు.

    ఇక ది ట్రాప్..

    రెండవ భాగం చదవండి...

    “ఓకే ఓకే! ఇప్పుడు పెదవి విప్పి నా పెదవులతో కలప వచ్చు కదా! ”

    “ పెదవి విప్పుతున్నాను వినండి. ఎక్కడ చూపు సారించినా మీ బంగారు కూతురే కనిపిస్తూంది, నా చుట్టూ అదే కొంగు పట్టుకుని తిరుగుతూంది, లాగుతూంది. మీరుంటే సరే, ఫీలింగుని మరల్చుకోగలను. మీరిప్పుడు నా యెదుట లేరుగా-- నన్నేమి చెయమంటారో చెప్పండి”.

    అప్పుడు పెదవి మూయడం భువనేశ్ వంత యింది. ఈ కారణాల వల్లనే అతడు సాధ్యమైనంత మేర భాగ్యనగరం విడిచి బైటకు కదలడు.చివరకు బాబాయింటికి గాని, తాతయ్యా బామ్మలను చూడటానికి కూడా కదలి వెళ్ళడు. సుభాషిణి తమను విడిచి పైలోకాలకు వెళ్ళిపోయిన తరవాత ప్రభావతి యేకాంతం భరించలేకుండా ఉంది. నిజానికామె ఆ కరాళ రాత్రివంటి ఒంటరి తనం నుండి విడివడటానికి ఊళ్ళోని అమ్మానాన్నల వద్దకు, స్కూలునాటి మిత్రురాండ్ర వద్దకు వెళ్ళి కొన్నాళ్ళు గడిపి రావడానికి ప్రయత్నించింది. కాని అక్కడ గడప లేకపోయింది. అక్కడి సందడికి అలవాటు పడలేక పోయింది..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/fOD4JampeVU


    15 min
  • వీరి మధ్యన... ఎపిసోడ్ 2 | Veeri Madhyana Episode 2 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి

    వీరి మధ్యన... ఎపిసోడ్ 2

    రచన:  బివిడి ప్రసాదరావు

    గత ఎపిసోడ్ లో

    పెళ్లి చూపులకు ముందుగా సాహసి పంపిన వీడియో చూస్తాడు సామ్రాట్.

    ఇద్దరికీ పెళ్లి చూపులు జరుగుతాయి.

    పెళ్లి చూపుల్లో సామ్రాట్ అడిగిన కొన్ని ప్రశ్నలు తనకు నచ్చనట్లు చెబుతుంది సాహసి.

    ఇక వీరి మధ్యన.. రెండవ భాగం చదవండి...

    "నేను మంచోడ్ని అని స్టాంపు వేసుకోను కానీ, చెడ్డవాడ్ని మాత్రం కాదు. నిన్నే కాదు ఎవర్నీ ఇబ్బంది పరిచే వాడిని కాదు. ప్రామిస్. నమ్ము." చెప్పాడు సామ్రాట్.

    "థాంక్యూ" ఆగి చెప్పింది సాహసి.

    "సంతోషం." అన్నాడు సామ్రాట్.

    "కాల్ కట్ చేస్తాను." చెప్పింది సాహసి.

    "ఒన్ మినిట్. నీ ఫోటో పంపరాదూ." అన్నాడు సామ్రాట్ మెల్లిగా.

    "ఫోటోనా." అంది సాహసి వెంటనే.

    "ప్లీజ్. డోన్ట్ థింక్ అదర్వైజ్. నీకు ఇష్టమైతేనే. సరేనా." అనేశాడు సామ్రాట్.

    అర నిమిషం తర్వాత, "వాట్సాప్ కు పంపుతా." చెప్పేసింది సాహసి.

    "మహా భాగ్యం. థాంక్యూ." చెప్పాడు సామ్రాట్.

    ఆ కాల్ కట్ చేసేక, నిండుగా ఊపిరి పీల్చుకుంది సాహసి.

    ***

    "అన్నా నమస్తే." అంటూ సామ్రాట్ కేబిన్ లోకి వచ్చాడు రమేష్.

    సామ్రాట్ కో ఎంప్లాయ్ రమేష్.

    "టీ టైం. రా. బయటికి వెళ్లి వద్దాం." చెప్పాడు రమేష్.

    "ఫ్యూ మినిట్స్." అంటూ తిరిగి వర్క్ ను కొనసాగించాడు సామ్రాట్.

    ఐదు నిమిషాలు లోపే, ఇద్దరూ టీ కై కదిలారు.

    టీ తాగుతూ, "రేపు మా ఊరు వెళ్తున్నాను." చెప్పాడు రమేష్.

    "వీక్ ఎండ్ కూడా కాదు. ఏంటీ అర్జంట్." అడిగాడు సామ్రాట్.

    "మా వాళ్లు ఏదో పెళ్లి సంబంధం చూశారట. పిల్లను చూడ్డానికి ఊరెళ్లాలంటే, వెళ్తున్నాను." చెప్పాడు రమేష్,

    "గుడ్. గో హెడ్. అన్నట్టు, ఈ మధ్య నేనూ పిల్లను చూశాను. సంబంధం కుదిరింది." చెప్పాడు సామ్రాట్ చిన్నగా నవ్వుతూ.

    "కంగ్రాట్స్ అన్నా." చేయి చాచాడు రమేష్.

    ఆ చేతిని అందుకుంటూ, "థాంక్యూ." చెప్పాడు సామ్రాట్.

    "ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయేనా. నేను మాత్రం మన ఫీల్డ్ అమ్మాయినే ఎంపిక చేసుకుంటాను." అన్నాడు రమేష్.

    ఖాళీ కప్పును పక్కన పెట్టి, "బ్యాంక్ ఎంప్లాయి." చెప్పాడు సామ్రాట్.

    రమేష్ ఖాళీ కప్పును పక్కన పెట్టాడు. ఏమీ అనలేదు.

    ఇద్దరూ తిరిగి అక్కడ నుండి తమ పనులకై కదిలారు.

    "అమ్మాయిది ఏ ఊరు.  పెళ్లి తర్వాత ఇక్కడకు ట్రాన్స్ఫర్ కాగలదా. లేదా ఉద్యోగం మానేస్తుందా. లేదా మానిపించేస్తున్నావా." అడిగాడు రమేష్.

    "వరంగల్. ఇక్కడ బ్రాంచీకి మారొచ్చట. తనకు ఉద్యోగం చేయడమంటే ఇష్టమట" సామ్రాట్ చెప్పాడు.

    "అచ్ఛా. అమ్మాయి ఎలా ఉంటుంది. ఫోటో చూపుతావా." నవ్వేడు రమేష్.

    సామ్రాట్ తన వాట్సాప్ లోకి ఉదయమే చేరిన సాహసి ఫోటోను రమేష్ కు చూపాడు.

    ఫోటోలోని సాహసిని చూస్తూనే, "ఈమా." అన్నాడు రమేష్.

    "ఈమె నీకు తెలుసా." అడిగాడు సామ్రాట్.

    "య. ఈమె డిగ్రీలో నా క్లాస్మేట్." చెప్పాడు రమేష్.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/nAQeQwn6GHE



    13 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world