
Sign up to save your podcasts
Or


(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ప్రసవ వేదన
రచన: కిడాల శివకృష్ణ
గోవర్ధనగిరి అనే ఒక చిన్న గ్రామం వుంది. ఆ గ్రామంలో మాధవయ్య అనే ఒక రైతు కుటుంబం నివసిస్తోంది. ఈ కుటుంబం ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంటిలో తాతయ్య, నాన్నమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నాన్న, పిన్నమ్మ, మామ్మయ, అత్తమ్మ, కొడుకు, కోడలు, అన్నలు, తమ్ములు, చెల్లెళ్ళు, అక్క గారు ఇలా అన్ని బంధాలు, భాందవ్యాలు, అనుబంధాలు, ఆత్మీయతలు కలిసి జీవిస్తున్న కుటుంబం అది. మమతానురాగాలతో నిత్యం సుఖసంతోషాలతో, భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో కల కల లాడుతూ జీవితాన్ని కొనసాగించారు ఆ కుటుంబ సభ్యులు.
మాధవయ్య కొడుకు కృష్ణయ్యకు, కూతురు శాంతమ్మకు మరియు ఇంటిలో వుండే అందరికీ పెళ్లి వయస్సు రాగానే వారు పెళ్లిళ్లు చేశారు. తరువాత మాధవయ్య కాలగమనంలో కలిసిపోయారు. కొంత కాలానికి ఆ కుటుంబంలో మనస్పర్థలు మొదలయ్యాయి. అందువలన బంధాలు, బాంధవ్యాలు మరుగున పడి పోయాయి. కాలానుసారంగా ఉమ్మడి కుటుంబాలు కాస్తా విచ్చిన్నం అయ్యాయి. తరువాత చిన్న కుటుంబాలుగా ఏర్పడ్డాయి...
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/2vvFT941lV8
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ప్రేమ‘భ్రమ’రం - 4
రచన: వసుంధర
వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ ‘భ్రమ’రం నాలుగవ భాగం
గత ఎపిసోడ్ లో...
రమణయ్య నాతో మాట్లాడుతూ తన కొడుకు కిషోర్, స్వర అనే అమ్మాయి ప్రేమలో పడ్డాడని చెబుతాడు. వాళ్ళను వేరు చెయ్యమని కోరుతాడు.
స్వర నాతో మాట్లాడుతూ తను కిషోర్ ని ప్రేమించడం లేదనీ, తన బావ భవన్ ని ప్రేమిస్తున్నాననీ చెబుతుంది.
కానీ భవన్, ముక్తను ఇష్టపడుతున్నాడని చెబుతుంది.
ఇక ప్రేమ ‘భ్రమ’రం నాలుగవ భాగం చదవండి ...
‘‘ముక్త ఎవరు?’’ అన్నాను మొదటిసారిగా ఆ పేరు విన్నట్లు.
‘‘ఎవరంటే ఏం చెప్పను? సాటి ఆడపిల్లనయుండీ - ఆమె అసామాన్య సౌందర్యవతి అని చెప్పడానికి సంకోచించనని చెప్పనా?’’ అంది స్వర.
ఫలానా హీరోయిన్ బాగుంటుందంటే - ‘నాకంటేనా?’ ఆని చిరాకు పడే చెల్లి గుర్తుకొచ్చింది.
ఇప్పుడు కాదు - పదేళ్ల వయసప్పుడే అదలా అనేది.
‘‘ఆడవాళ్లంరా - ఎవరికి వాళ్లమే అందగత్తెలం. నాటి వైజయంతిమాల, హేమమాలిని, శ్రీదేవి అయినా - నేటి ఐశ్వర్య, రాకుల్, రశ్మిక అయినా - ఎవరైనా మా తర్వాతే అనుకుంటాం’’ అని అమ్మ కూడా చెల్లిని సమర్థిస్తూ మాట్లాడేది.
‘‘అంటే ఆ ముక్త పరిచయం - అందమొక్కటేనా?’’ అన్నాను - నేను అందానికి ప్రాధాన్యమివ్వనన్న దర్పాన్ని గొంతులో పలికిస్తూ.
‘‘అందమంటే అది మామూలు అందం కాదు. ఆ అందాన్ని వర్ణించడానికి ఆడపిల్లలు కూడా కలం పడతారు. కుంచె అందుకుంటారు. గాత్రాన్ని సవరిస్తారు’’ అంది స్వర.
అర్థమయింది.
భవన్ ముక్త అందానికి పడిపోయాడు.
అందుకు స్వర అతణ్ణి తప్పు పట్టడం లేదు. అంత అందానికి ఏ మగాడు పడడూ - అన్న భావాన్ని వ్యక్తపరుస్తూ సమర్థిస్తోంది.
‘‘మీరు ముక్తని చూశారా?’’ అన్నాను.
‘‘భవన్ ముక్తని చూసినప్పుడు నేను పక్కనే ఉన్నాను. నిజానికి నేనే ముందామెను చూసి, ‘ఎంత బాగుందో, చూడు’ అంటూ చూపించాను. అంతే! అంతకాలం నన్ను ప్రేమిస్తున్నాడనుకున్న భవన్‌కి - తొలిచూపులోనే ముక్తపై ప్రేమ పుట్టేసింది’’ అంది స్వర.
పద్మ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆమె చిన్నప్పట్నించీ ఇష్టపడ్డ కవన్ - ముక్తని చూసి ప్రేమలో పడ్డాడు..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/Z-Ry5_4zpfw
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన: యశోద పులుగుర్త
ఆముక్త- తన భర్త విక్రాంత్, కూతురు గేయ తో కలసి ప్రతీ రెండు సంవత్సరాలకు ఒక సారి అమెరికా నుండి ఇండియా వచ్చి వెడుతుంది. ఆరు సంవత్సరాల క్రితం చనిపోయిన తల్లి ప్రియంవద జ్ఞాపకాలెన్నో పూలసజ్జలో పేర్చిన పూల దొంతర్లలాగ కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి.
అమ్మా తనూ కలసి ఎన్నో సాయంత్రాలు తమ తోటలో కలసి తిరిగిన జ్ఞాపకాలనెన్నిటినో సన్నజాజుల మాలలా అందంగా అల్లుకుంటూ, పువ్వుల్లా పూసిన రోజులు రాలిపోయాక తొడిమల్లా మిగిలిన జ్ఞాపకాలతో భారంగా అమెరికా తిరిగి వెడ్తుంది.
అలాగే ఈ సారీ వచ్చారు. ఔట్ హౌస్ లో తోటమాలి శీనూ, అతని కుటుంబం ఆ ఇంటినీ, తోటనీ పర్యవేక్షిస్తూ అక్కడే ఉంటారు. ఆముక్తా వాళ్ళు వచ్చేసరికి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతారు. తాను ఆ తోటలో తిరుగుతూంటే అమ్మతో గడిపిన ఎన్నో జ్ఞాపకాలు మదిలో మెదులుతూ అమ్మతో గడిపిన జీవితంలో ప్రతీ సంఘటన కళ్లకెదురుగా కదలాడుతుంటే వాటినే తలచుకుంటూ అలాగే నిలుచుండి పోయింది.
ప్రియంవద పెళ్లైన నాటికే ఒక డిగ్రీ కాలేజ్ లో ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తూ ఉండేది. భర్త సుధాకర్ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లో సైంటిస్ట్ గా పనిచేస్తున్నాడు. తల్లితండ్రులకు ఒకర్తే కూతురు అయిన మూలాన ఎంతో గారాబంగా పెంచి పెద్దచేసి చదువు చెప్పించారు. కూతురూ అల్లుడూ తమ కళ్ల ఎదుటే ఉండాలన్న తాపత్రయంతో సుధాకర్ సంబంధాన్ని ఇరువైపుల పెద్దలే కాకుండా ప్రియంవద, సుధాకర్ కూడా ఇష్టపడడంతో పెళ్లి జరిపించారు.
ప్రియంవదకి తన పుట్టింటివారు బహుమానంగా ఇచ్చిన అందమైన విల్లాలో సుధాకర్ తో ఆనందంగా కాపురం చేసుకుంటోంది. అందమైన తోట మధ్యలో కట్టబడిన ఆ విల్లాని తన అభిరుచికి అనుగుణంగా మార్చుకుంది. తోటలో ఎన్నెన్నో పూలమొక్కలు తెప్పించి నాటించింది. ఆ తోటలో పూసిన గులాబీల రంగులను చూడడానికి రెండుకళ్లూ సరిపోవు. సాయంత్రం కాలేజ్ నుండి రాగానే ముందస్తుగా తోటలోకి వెళ్లి ప్రతీ మొక్కనీ, పూవునీ ప్రేమగా పరామర్శించేది.
ఒకరోజు ఆమె పున్నాగ చెట్టుకింద నిలబడి ఏదో ఆలోచిస్తున్న తరుణంలో సుధాకర్ వచ్చాడు అక్కడకు.
“నీకు నామీద కంటే ఈ తోటమీదే ఎక్కువ ప్రేమ కదూ ప్రియా..” అన్న సుధాకర్ మాటలకు " అసలు ప్రేమంటే ఏమిటి సుధా" అంటూ ప్రశ్నించింది..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/E0fIIbyJTS8
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కాకతి రుద్రమ ఎపిసోడ్ 14
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
గత ఎపిసోడ్ లో…
గణపతి రుద్రదేవులు అంతిమక్షణాల్లో వున్నారు.
శివదేవయ్యమంత్రులు తీరికలేని పనులతో సతమతమవుతున్నారు.
ప్రసాదిత్యనాయకులు, రేచెర్ల ప్రభుపులు వచ్చి శివదేవయ్యను కలిశారు.
రుద్రమదేవి స్త్రీ కాబట్టి ఆమెకు రాజ్యార్హత లేదని కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని తెలుసుకుంటాడు శివదేవయ్య.
అది ఎవరో కనిపెట్టమని తన ముఖ్య గూఢచారి సోమనాధాచార్యుల వారిని కోరుతాడు శివదేవయ్య.
ఇక చదవండి..
ప్రజలు ఆశ్చర్యంగా యితిమిద్దంగా చెప్పుకునే వార్త సామ్రాజ్యమంతా వెలుగువలె వ్యాపించింది.
అది 'శ్రీ రుద్రదేవచక్రవర్తి రాజ్య నిర్వహణకోసం ధరించిన వేషం కానీ- నిజానికి ఆమె రుద్రమదేవి' అని.
నిండుసభలో ఈ వార్త నానా రాజ్య ప్రముఖుల ముందు ప్రకటించ బడినా, అంచెలంచెలుగా సామ్రాజ్యమంతా పాకింది.
ఆ తరువాత-
జయజయధ్వానాల మధ్య రెండేళ్ళతరువాత యింతమంది ప్రముఖ, ప్రముఖుల
ఎదుటకు వృద్ధసింహం వలె తెల్లగా, యింకా మరణించని వీరత్వంతో, సేనానాయకులు మెల్ల
గా నడిపించుకురాగా, కాకతీ సామ్రజ్యలక్ష్మి నుదుట సింధూరతిలకం దిద్దిన, అపార వీరత్వ ప్రభంజనంతో శత్రురాజ్యాలను గజగజలాడించిన శ్రీ గణపతి దేవచక్రవర్తులు వచ్చి, సింహాసనం మీద ఠీవిగా కూర్చున్నారు.
రుద్రమదేవి యువరాజు సింహాసనం అధిష్టించారు.
వంగిమాగధుల పాటలతో, ఆ మందిరం మార్మ్రోగింది.
నానా విధాల వాద్యాలతో, పెద్దశృతితో చెవుల తుప్పు వదిలింది..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/zFfH0bKB43M
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
పిట్ట కథ
రచన : పాండ్రంకి సుబ్రమణి
నేను కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుండి ఉద్యోగ విరమణ చేసినప్పుడు నా సహ పెన్షన్ ధారులకు నేనొకటి చెప్తుంటాను, దివ్య ధీమాగా-- “ఇక నుంచి మనం కాలమనే సుందర సామ్రాజ్యానికి రారాజులం. ఇకపైన మనం యెప్పుడైనా లేస్తాం. ఎప్పు డైనా ముస్తాబవుతాం. ఎక్కడికైనా వెళతాం. ఎంతసేపైనా పచార్లుస్తాం. కార్యాలయ హాజరు పుస్తకంలో మనల్ని సంతకం చేయమని అడిగే దమ్మూ యెవడికీ లేదు. అదే రీతిన మనం యెప్పుడైనా మన యిఛ్ఛానుసారం లేచి వాహ్యాళికి వెళతాం.
ఏం- మధ్యాహ్నం వెళతాం లేదా సాయంత్రమైనా వెళతాం. అదీ లేదా- టీవీ ప్రోగ్రాములు గట్రా చూసిన తరవాత అర్థరాత్రి తీరుబడిగా గాలివాటంగా నడక సాగిస్తాం. మనల్ని అడ్డుకునేవాడెవటంట? ఇకపైన స్వేఛ్ఛ మనకు స్వంతం. మనకు మాత్రమే స్వంతం. ఇంటి ముంగిట వాలే పెంపుడు పావురంలా నెలనెలా చేరే పెన్షన్ మన గతకాల సేవలకు గుర్తింపుగా వచ్చే కిరీటం...
“కాని- ఇక్కడే నేను కాస్తంత అధికంగా వాగానేమోనని తరవాత తట్టింది. తత్తరపాటు కలిగంది. ఎప్పు డైనా లేస్తాను- ఎప్పుడైనా వాకింగ్ చేస్తాను- ఎప్పుడైనా తింటాను- అన్న వాక్యాన్ని నా శరీర యాంత్రిక వ్యవస్థ లోపలనుంచి రహస్యంగా వినినట్లుంది. అది తిన్నగా మా ఫ్యామిలీ డాక్టరు వద్దకు మోసుకు వెళ్ళినట్లుంది.
“నీకు ఉద్యోగ బరువు బాధ్యతలనుండి స్వేఛ్ఛ లభించిందే గాని—ఆదినుండి అంతం వరకూ మునుపులాగే జీవన క్రమం పాటించాలయ్యా! ఉదయం ఒకసారి సాయంత్రం మరొకసారి నడక సాగించడం తప్పని సరి. ఎక్కడ బడితే అక్కడ కాదు. స్వఛ్ఛమైన గాలి ప్రవాహం ఉన్నచోట. అంతేకాదు— రుచిగా ఉంటే యెకబిగిన లాగించేయకుండా మితంగా భోజనం చేయడం- సమయానికి మరచిపోకుండా మందుబిళ్ళలు వేసుకోవడం తప్పని సరి.
అంతే కాదండోయ్. మూడు నెలలకొకసారి షుగర్ బిపీ చెక్ చేసుకోవడం అంతకంటే తప్పని సరి--”
దానితో ఉత్తుంగ తరంగ మంతటి నా ఉత్సాహానికి, స్వేఛ్ఛా ప్రియత్వానికి ఆనకట్ట పడింది. బ్రతుకు బాట బ్రైట్ గా సాగాలంటే వీటిని పాటించడం అనివార్మమేనేమో!..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/YFgPxbVqzrU
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన : M R V సత్యనారాయణ మూర్తి
కాటన్ దొర పుణ్యమా అని ధవళేశ్వరం వద్ద గోదావరి నదికి ఆనకట్ట వచ్చింది.
ఉభయగోదావరి జిల్లాలలో సాగునీటికోసం పెద్ద పెద్ద కాలువలు తవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే మా పశ్చిమ గోదావరి జిల్లాకు విజ్జేశ్వరం నుండి నర్సాపురం వరకు పెద్ద మంచినీటి కాలువ వచ్చింది. ఈ కాలువ కింద వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది.
లారీలు అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. సరుకుల రవాణా ఈ కాలువ మీద తిరిగే
పడవల ద్వారా బాగా జరిగేది. ప్రజలు కూడా ఈ కాలవలమీద తిరిగే పడవలలో తరచూ ప్రయాణాలు సాగించేవారు. అప్పుడప్పుడు పుణ్య క్షేత్రాలకు కూడా పడవలమీద నిడదవోలు వరకూ వెళ్లి అక్కడనుంచి రైలు ఎక్కి వెళ్ళేవారు. ఉప్పు పప్పు కాదండోయ్, బెజవాడ నుంచి
సిమెంట్ కూడా పడవలమీద మా పెనుగొండ సిమెంట్ కొట్టులకు వచ్చేది.
ఇంకో గొప్ప విషయం కూడా ఉందండోయ్, పాలగుమ్మి పద్మరాజు గారి పేరు
తెలుసు కదండీ, అదేనండి బాబూ ‘గాలివాన’ కథతో మన తెలుగువాడి సత్తాని ప్రపంచానికి చాటిన మహానుభావుడు.
ఆయన రాసిన మరో గొప్ప కథ ‘పడవ ప్రయాణం’ మా విజ్జేశ్వరం – నర్సాపురం కాలువ
మీదే నడిచిందండి. అంతటి పేరూ, ప్రఖ్యాతి ఉన్న మా కాలువమీద ఎన్నెన్ని సరదాలు,
సిత్రాలు,చమక్కులు జరిగేయో తెలుసుకుంటే మీరు ‘అవాక్కు’ అవడం ఖాయం.
మా పెనుగొండలో సహం మంది మొగాళ్ళు కాలవలోనే స్నానాలు చేస్తారు. స్నానం
అవగానే ప్రత్యేక్షనారాయుడు ఆ సూర్నారాయుడికి దణ్ణం పెట్టుకుని మరీ ఇంటికి వెళ్ళరు. ‘ఆ
మీకు మళ్ళీ నీళ్ళు తోడిఇచ్చే ఖాళీ ఎవరికుంది? పోయి కాలవలో మునిగి రండి’ అని ఆళ్ళ ఆడంగులు అంటారని కిట్టని వాళ్ళు అంటారు. అయన్నీ మీరు పట్టించుకోకండి. ఎందుకంటే మనం అన్నీ మంచిగా ఆలోచించాల.
అప్పుడే మన వళ్ళూ ,మనసూ ప్రశాంతంగా ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీషులో కూడా పెద్ద
పెద్ద వాళ్ళు అదే అంటన్నారుకదండీ, ‘పాజిటివ్ థింకింగ్’ అని. అదన్నమాట..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/t2o4jCv6epg
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
సింగినాదం జీలకర్ర
రచన: దాసు రాధిక
కారు గరాజులోకి తీసుకొచ్చి ఆపాడు ఆనంద్. కుడి పక్కకు వెళ్లి కారు డోర్ తీసి నిలబడ్డాడు... ఒక అరవైఐయిదేళ్ల పెద్దావిడ అందులోంచి తన హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకొని దిగింది.
"వెల్కమ్ హోమ్ అమ్మా" అన్నాడు ఆనంద్ తల్లి వైపు వెలిగిపోతున్న మోహముతో, సంతోషము పట్టలేక...
" ముందు మీ నాన్న కు ఫోన్ చేసి చెప్పు రా, నేను క్షేమంగా చేరానని... కాసేపట్లో మాట్లాడుతా నేనె" అన్నది ఆనంద్ తల్లి శ్రీదేవమ్మ.
ఇంతలోకే కారు చప్పుడు కి గరాజు లోనుండి ఇంట్లో కి వెళ్లే తలుపు తెరుచుకొని కోడలు పద్మ గబగబా వచ్చి పెట్టెలు లోపల పెట్టేందుకు తన భర్తకు సాయము చేస్తూ, అత్తగారిని పలకరించింది, " హాయ్ అత్తయ్య, బాగున్నారా, ప్రయాణం బాగా జరిగిందా" అని. శ్రీ
దేవమ్మ బానే జరిగిందని నవ్వుతూ సమాధానము చెబుతూనే లోపలికెళ్లింది.
ముందుగా వచ్చింది భోజనాల గది, పక్కనే వంటిల్లు. అందుకని శ్రీదేవమ్మ కాళ్ళు కడుక్కోవాలంది.
ఆనంద్ ఆమె కు ఇంట్లో వేసుకునే చెప్పులు చూపించి వేస్కోమన్నాడు.
"ఎంత తక్కువ తడి లోకి వెళ్తే అంత మంచిది" అన్నాడు ఆనంద్.
"అయినా నువ్వు కూడా ఇలా అయిపోయావెంటమ్మా , ఇది నాన్న పద్ధతి కదా" అన్నాడు.
" కాదురా, ముందే తినే చోటికీ వచ్చాం... అందుకే అడిగాను.. దొడ్డి దోవన ఇంట్లోకి జొరబడ్డట్లుందిరా, ఇంటి వాకిలేది?" అడిగింది శ్రీదేవమ్మ.
"ఇక్కడ ఇన్తేనమ్మా" అన్నాడు కొడుకు..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/JUfRVf1OiB4
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
సైనైడ్ ఎపిసోడ్ 1
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
విశాఖపట్నం లోని అతిపెద్ద బిజీ సెంటర్లో ఒక పేరుగాంచిన నాలుగు అంతస్తుల ఏసీ మాల్ ఉంది. అందులో దగ్గర దగ్గర 50 షాపులు ఉన్నాయి. పొద్దున పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అత్యంత రద్దీగా ఉండే ఈ మాల్ లో మొత్తం ఎస్కలేటర్ లు ప్రతిక్షణం పైకి - కిందకి జనాలని తీసుకువెళుతూ, ఆ మాల్ కి కొత్తగా వచ్చిన వారిని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతాయి.
చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చిన యాత్రికులు కూడా మొదట ఆర్కే బీచ్, రుషికొండ లాంటి పర్యాటక ప్రాంతాలలో సముద్రపు ఒడ్డున ఆనందించి, ఆ తర్వాత ముఖ్యంగా హోటల్స్, సినిమా హాల్స్ ఉన్న ఈ ఏసీ మాల్ కు వచ్చి తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటారు.
అసలే దసరా పండుగ రోజులు.. ఆ సెంట్రల్ ఏసి మాల్ జనాలతో కిక్కిరిసిపోయింది.
చిన్న పిల్లల గోల.
యుక్తవయసులోని వారు తమ అందచందాలతో, ఓర చూపులతో కుర్రకారు మతిని పోగొట్టేస్తున్నారు.
ఆ రోజు ఎందుకో మాల్ అంతా మూసేసి ఉంది. అక్కడకు వచ్చిన జనాలు ఆశ్చర్యంతో “ఏమైంది సార్! అంతమంది పోలీసులు ఉన్నారు? ఈ మాల్ చూడడానికి చాలాదూరం నుంచి వచ్చాము” అంటూ అక్కడ కాపలా కాస్తున్న పోలీసులను వేధిస్తున్నారు.
అంతలో అక్కడికి వచ్చిన పోలీస్ సూపరింటెండెంట్ మైక్ లో “ఇవాళ నుంచి వారం రోజుల పాటు ఈ మాల్ తెరవకూడదు” అని చెప్పగానే, ఎంతో నిరాశకు గురయి, కారణం తెలియని జనాలు తిరిగి వెళ్ళిపోయారు.
అదే రోజు ప్రెస్ మీట్ లో పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ “నిన్న రాత్రి మాల్ కు వచ్చిన ఒక వ్యక్తి హత్యకు గురై ఎస్కలేటర్ క్రింద భాగం లో పడి ఉన్నారు. ఆయన పేరు శేఖర్ అని, ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని ఆయన ఐడి కార్డు ద్వారా తెలుసుకున్నాము. ఆ మృతుని కుటుంబ వివరాలు, ఉద్యోగ విషయాలపై ఆరా తీస్తున్నాము. మాకు తెలిసిన వివరాలను బట్టి ఆయన ఢిల్లీలో DRDO office లోని అత్యంత సీనియర్ గెజిటెడ్ ఆఫీసర్ అని, చాలా మంచి వాడు అని, తన సొంత ఊరు విశాఖపట్నం అని, నెల రోజుల పాటు కుటుంబంతో పాటు వచ్చాడని తెలిసింది..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/8dAQ6Rb0xno
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
వీరి మధ్యన... ఎపిసోడ్ 1
రచన: బివిడి ప్రసాదరావు
బివిడి ప్రసాదరావు గారి కొత్త ధారావాహిక 'వీరి మధ్యన..' ప్రారంభం
"వీడియో లింక్ పంపడం ఏంట్రా.." అశ్చర్యమయ్యాడు గోపాలస్వామి.
"మెయిల్ లో 'బయోడేటా బదులు' అని మెన్షన్ చేశారు నాన్నా." చెప్పాడు సామ్రాట్.
"భలే. చోద్యంగా ఉంది." అంది మాలతి.
వారం రోజుల క్రితం పెళ్లిళ్ల పేరయ్యను కలిసి, తన కొడుకు బయోడేటా, ఫోటో ఇచ్చి, మంచి పెళ్లి సంబంధం చూడమని కోరాడు గోపాలస్వామి.
నిన్న ఉదయం ఆ పేరయ్య ఫోన్ చేసి, "మీ అబ్బాయ్, ఒక ఆడ పెళ్లి వారికి నచ్చాడు. అమ్మాయి వివరాలు నేరుగా వాళ్లే మీకు పంపుతామని చెప్పారు. ఆ వివరాలు వచ్చేక మీరు నాకు ఫోన్ చేయండి. మిమ్మల్ని కలుస్తాను." చెప్పాడు గోపాలస్వామితో.
ఉదయం ఆ అమ్మాయి వాళ్ల నుండి, సామ్రాట్ బయోడేటాలో ఇచ్చిన ఇ-మెయిల్ ఐడికి, ఆ అమ్మాయి వివరాలు వీడియో రూపంలో చేరాయి.
మెయిల్ చూసిన సామ్రాట్, తన తల్లిదండ్రులతో ఆ ముచ్చట చెప్పాడు.
"సర్లే. ఆ వీడియో చూపు." అన్నాడు గోపాలస్వామి.
ఆ ముగ్గురు తమ ఇంటిలో, హాలులో ఉన్నారు.
గోపాలస్వామి, మాలతి లాంగ్ సోఫాలో కూర్చుని ఉన్నారు. వాళ్లకు ఎదురుగా సామ్రాట్ సింగిల్ సోఫాలో కూర్చుని ఉన్నాడు.
లాప్టాప్ తో లేచి, టివి ముందుకు వెళ్లాడు సామ్రాట్. డివైజ్స్ కనెక్టివ్స్ తర్వాత, వచ్చి కూర్చున్నాడు.
టివిలో ఆ వీడియో ప్లే అవుతుంది.
'నా పేరు సాహసి..' తో మొదలై, ఆ అమ్మాయి వాయిస్ తోనే ఆ వీడియో నడుస్తుంది.
ఆ ముగ్గురు మౌనంగా దానినే చూస్తున్నారు.
తన జాతకం పేపరు చూపుతూ, 'తన పుట్టిన తేది, తను పుట్టిన స్థలం, తన పుట్టిన నక్షత్రం, దాని పాదం' చెప్పింది సాహసి.
తన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ చూపుతూ, "నేను కామర్స్ లో డిగ్రీ చేశాను." చెప్పింది సాహసి.
తన అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీని చూపుతూ, "నేను బ్యాంక్ ఎంప్లాయిని" చెప్పింది సాహసి.
తను కనబడుతూ, "నా ఎడ్యుకేషన్ సాగింది, నా జాబ్ వచ్చింది, వరంగల్ లోనే కావడం విశేషం." చెప్పింది సాహసి..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/1jnhNuaxZFg
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ది ట్రాప్ ఎపిసోడ్ 1
రచన : పాండ్రంకి సుబ్రమణి
పాండ్రంకి సుబ్రమణి గారి కొత్త ధారావాహిక 'ది ట్రాప్' ప్రారంభం
కామ్స్ కార్పొరేట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ భువనేష్ మొదటి ఎయిర్ టెర్మినల్ అబుదబీలో దిగి లాంజ్ లోకి వచ్చి బ్రీఫ్ కేసుని మాత్రం తనతో తెచ్చుకుని ఓసారి సరిచూసుకుని అనువైన చోటు చూసుకుని కూర్చున్నాడు.
అబుదబీ విమానాశ్రయం, ఖరీదైన తళుకుల్ని డేషింగ్ డ్యాన్సర్ లా అంగరంగ వైభవంగా సంతరించుకుని, అధునాతంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నతంగా లగ్జూరియస్ గా ఉంటుంది.
శంషాబాదు లో మనోడు తెలుగోడు కట్టిన మెరుగులు దిద్దుకుంటూన్న విమానాశ్రయం దీనికి సరితూగ వచ్చు. . ఏం, కొన్నిటితో పోల్చి చూస్తే హంగుల్లో పొంగుల్లో మించి పోవచ్చు కూడా-- ఎవరు చెప్పొచ్చారు ఈ వేగంతో వెళితే భాగ్యనగరం చాలా విషయాలలో పలు విదేశాలతో సరితూగుతూ, చూపులో ఊపులో మిరుమిట్లు గొలుపుతూ త్వరలో మించిపోవచ్చునేమో—
మెల్లగా లేచి లాంజ్ బయట బిల్లు చెల్లించి క్రీమ్ కాఫీ తీసుకుని వస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక భారతీయ కుటుంబం ఎదురొచ్చింది. చేతిలోని బ్రీఫ్ కేసుతో ఉన్నపళంగా నిల్చుండిపోయాడు. కదలకుండా చూస్తూండిపోయాడు. భార్యాభర్తలిద్దరూ దక్షిణ భారతీయులే-- ఒక కొడుకు- ఒక కూతురు..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/3oFcr5OTM1g
From the publisher's feed