Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • వీరి మధ్యన ఎపిసోడ్ 4 | Veeri Madhyana Episode 4 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వీరి మధ్యన... ఎపిసోడ్ 4

    రచన:  బివిడి ప్రసాదరావు

    గత ఎపిసోడ్ లో…

    తనను ప్రేమించమంటుంది జ్వాల.

    సామ్రాట్ అందుకు అంగీకరించడు.

    త్వరలో అతని ఎదుటికి వస్తానని చెబుతుంది జ్వాల.

    ఇక వీరి మధ్యన..   నాలుగవ భాగం చదవండి...

    సామ్రాట్ మెల్లిగా, "ఎందుకు." అన్నాడు.

    "మన మధ్య ఇట్టి చిలిపితనం ఉంటే, భలే మజా కదూ." అంది సాహసి ముచ్చటగా.

    "థాంక్స్. నువ్వు నా మాటలకి హర్ట్ అయ్యావనుకున్నాను." చెప్పాడు సామ్రాట్.

    "అయ్యో మహానుభావా. నన్ను మరీ గయ్యాళి అనుకుంటున్నావా, ఏంటీ." అంది సాహసి.

    "అబ్బెబ్బే. అలా అనుకోకు. జస్ట్ నెర్వ్స్ అయ్యా. అంతే." చెప్పాడు సామ్రాట్.

    "చాల్లే. నువ్వు మరిన్నూ." అంది సాహసి మురిపెంగా.

    "సాహసి." అన్నాడు సామ్రాట్.

    "మరోలా పిలు." చెప్పింది సాహసి చిలిపిగా. సామ్రాట్ వెంటనే ఏమీ అనలేదు.

    "మహానుభావా. నన్ను సాహసి కాక, మరోలా పిలు అంటున్నాను." చెప్పింది సాహసి.

    "ఉ. ఊ. ఎలా. అ. సాహ." అన్నాడు సామ్రాట్.

    "ఉహు. ఇంకా.. వేరేలా." అంది సాహసి.

    "హసి." అనేశాడు సామ్రాట్.

    "బాగుంది. బాగుంది కదూ. నువ్వు ఏమంటావు." అంది సాహసి హుషారుగా.

    "నీకు నచ్చిందా." అడిగాడు సామ్రాట్.

    "బాగా. ఇకపై నన్ను అలానే పిలుస్తుండు. ప్లీజ్." చెప్పింది సాహసి.

    "తప్పక హసి." చెప్పాడు సామ్రాట్ ఉత్సాహంగా.

    "థాంక్యూ వెరీ మచ్." అంది సాహసి నిండుగా.

    "మరి నన్ను నువ్వేలా పిలుస్తావు." అప్పుడే అడిగేశాడు సామ్రాట్.

    "చెప్పనా. ఎప్పుడో ఆలోచించి పెట్టుకున్నాను." చెప్పింది సాహసి.

    "చెప్పవా." అడిగాడు సామ్రాట్ కుతూహలంగా.

    "చెప్పేయనా." అంది సాహసి ఊరిస్తున్నట్టు.

    "చెప్పవా." అన్నాడు సామ్రాట్ మెలికలు తిరిగి పోతూ.

    "ఇప్పుడు కాదు." టక్కున అంది సాహసి.

    "అబ్బా." అన్నాడు సామ్రాట్ నీరు కారిపోయేట్టు.

    "చెప్తాలే." అంది సాహసి.

    "ఎప్పుడు." అడిగాడు సామ్రాట్.

    "ఉ. అట్టి సమయం రానీ." చెప్పింది సాహసి చిలిపిగా.

    "ఛీటింగ్. నువ్వు నాతో చెప్పించుకున్నావు." అన్నాడు సామ్రాట్ ఉడికిపోతూ.

    "నువ్వు నన్ను పేరుతో తొలుత పిలిచింది ఇప్పుడేగా.  అందుకే నేను కోరి మార్పించుకోగలిగాను." చెప్పింది సాహసి.

    ఫోన్ ని రెండో చెవి వైపుకు మార్చుకొని, "అబ్బా. నువ్వు మరిన్నూ." అనేశాడు సామ్రాట్..


    Read the full story on www.manatelugukathalu.com


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/ckJSEDG-izs

    15 min
  • వీరి మధ్యన... ఎపిసోడ్ 3 | Veeri Madhyana Episode 3 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వీరి మధ్యన... ఎపిసోడ్ 3

    రచన:  బివిడి ప్రసాదరావు

    గత ఎపిసోడ్ లో...

    సామ్రాట్ ని కలిసిన రమేష్, సాహసి డిగ్రీలో తన క్లాస్మేట్ అని చెబుతాడు. ఆమె చాలాపొగరుబోతని కూడా చెబుతాడు. జ్వాల అనే అపరిచిత యువతి సామ్రాట్ కి కాల్ చేసి, మాట్లాడుతూ ఉంటుంది.

    ఇక వీరి మధ్యన..  మూడవ భాగం చదవండి...

    "గుడ్. నౌ. నువ్వు ఓకే గా." అంది జ్వాల.

    "ఆ ఆ. హండ్రడ్ పర్సంట్. చెప్పు చెప్పు. చెప్పేయ్." అన్నాడు సామ్రాట్ గమ్మున.

    "ఏమిటి చెప్పేది." అడిగింది జ్వాల.

    "అదేమిటి. నువ్వు చెప్పింది చేస్తే, నీ గురించి చెప్తాను అన్నావుగా." అన్నాడు సామ్రాట్.

    "నో." అంది జ్వాల.

    "వాట్. ఈ తిరకాసేమిటి." అన్నాడు సామ్రాట్ గోలగా.

    "తిరకాసు లేదు, సర్కాస్ లేదు. నేనేమన్నాను. నా ప్రశ్నకు జవాబు ఇస్తేనే, నా గురించి చెప్పుతాను అన్నాను. గుర్తు తెచ్చుకో." చెప్పింది జ్వాల.

    "సరే తల్లీ. అలాగే తగలడు." అన్నాడు సామ్రాట్ విసురుగా.

    "హేయ్. మళ్లీ టెన్షన్ అవుతున్నావు. మళ్లీ నేను చెప్పిన ప్రక్రియ చేయాలి." అంది జ్వాల.

    "అమ్మో. తల్లీ. నేను కూల్ గానే ఉన్నా. ఆ ప్రశ్న ఏదో అడిగేయవా. ప్లీజ్." అన్నాడు సామ్రాట్ మెల్లి మెల్లిగా.

    జ్వాల మాట్లాడలేదు.

    సామ్రాట్ తన ఫోన్ ని చెవి దరి నుండి ముందుకు తెచ్చుకొని దానిలోకి చూశాడు. కాల్ టైం జరుగుతుంది.

    వెంటనే తిరిగి చెవి దరిన ఫోన్ పెట్టుకొని, "ప్లీజ్." అన్నాడు.

    "నన్ను ప్రేమిస్తావా." ప్రశ్నించేసింది జ్వాల.

    సామ్రాట్ గతుక్కుమన్నాడు.

    అర నిమిషం పిమ్మట, "బోలో జీ." అంది జ్వాల.

    సామ్రాట్ మాట్లాడలేక పోతున్నాడు.

    "స్పృహలో ఉన్నావా. పడ్డావా." అంది జ్వాల.

    అప్పటికీ జవాబు లేక పోయే సరికి, "సామ్రాట్." అంది జ్వాల కాస్తా తికమకగా.

    మూడు మార్లు జ్వాల తనని పిలవగా, తేరుకుంటూ, "ఏమిటీ నీ ధోరణి. నాకు బోధ పడుట లేదు." చెప్పాడు సామ్రాట్.

    "ఏముంది. డొంక తిరుగుడు లేకుండా అడిగాగా." అంది జ్వాల.

    "ఏమడిగావు." సామ్రాట్ అన్నాడు విసురుగా.

    "నన్ను ప్రేమించమని." చెప్పింది జ్వాల నెమ్మదిగా.

    "నేను నిన్ను ప్రేమంచడం ఏమిటి. కుదరని పని." చెప్పేశాడు సామ్రాట్.

    "ఎందుకు కుదరదు. నాకు నీ గురించి అంతా తెలుసు. నువ్వు నౌ 'బేచిలర్' వే గా." అంది జ్వాల.

    "ఐతే, ప్రేమించేయాలా." అడిగాడు సామ్రాట్ విసురుగా.

    "ఆ. నువ్వు నన్ను చూస్తే, మరో మాట ఆడవు. క్షణం ఆగక, నువ్వే,   నన్ను అడిగేస్తావ్, నిన్ను ప్రేమించమని." చెప్పింది జ్వాల.

    "ఏం. అంత కాన్ఫిడెన్స్ ఏమిటో. నువ్వు ఏమైనా జిగేల్ రాణివా." అన్నాడు సామ్రాట్...


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/DVQU9Qkdi3A


    14 min
  • దేశం కోసం | Desam Kosam | Telugu Short Story | Sita Mandalika | manatelugukathalu.com

     (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    దేశం కోసం

    రచన: సీత మండలీక

    ఫిబ్రవరి నెల. గజ గజ వణికించే చలి. దానికి తోడు దట్టమైన పొగ మంచు వల్ల పక్కనున్న మనిషి కూడా కనబడని పరిస్థితి. ప్రజలంతా రగ్గులు రజాయ్ లు కప్పుకుని ఇళ్లల్లో వెచ్చగా పడుకుని ఉంటే మన సిపాయిలు దేశ రక్షణ కోసం చలిని, మంచుని లెక్క చెయ్యకుండా ఆఫీసర్లు మొదలుకొని జవానుల వరకు ఢిల్లీ స్టేషన్ లో తెల్లవారు ఝామున నాలుగు గంటలకి స్పెషల్ ట్రైన్ కోసం వేచి ఉన్నారు.

    ఢిల్లీ నించి జమ్మూ చేరేక అక్కడినించి వారి వారి నియమిత స్థలాలకి మిలిటరీ వాన్ ల లో చేరతారు. వార్ మొదలైందని అందరి సెలవు లు రద్దు చేసి ఢిల్లీ చేరమని ఆదేశాలు వచ్చేయి.

    ట్రైన్ వచ్చిన వెంటనే అందరూ తమ తమ స్థానాల లో సామానులు సద్దుకుని, చిరునవ్వు తో ఒకరినొకరు పలకరించుకున్నా మనసులో పేరుకొని పోయిన వారి బాధ పోదు.. తల్లి తండ్రులని, భార్య బిడ్డలిని వదిలి వచ్చిన వారు, కొత్తగా పెళ్ళైన వారు, త్వరలో పెళ్లి కాబోతున్నవారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ చుటూ తిరుగు తూనే ఉంటాయి.

    అది కేవలం బోర్డర్ లో కాలు పెట్టిన వరకే. ఒక సారి అడుగు పెట్టేక వారు వీరాధివీరులై పోతారు. వాళ్ళ కళ్ళ ముందు కనబడేది భారత మాత రక్షణ ఒకటే. అందరితో పాటు కాప్టెన్ సికందర్ సింగ్ కూడా ఢిల్లీ చేరి తెల్లారి నాలుగు గంటలకల్లా స్పెషల్ ట్రైన్ ఎక్కేడు. సికందర్ ఒక్కడూ సైడ్ సీటు లో కూర్చుని తన మనీ పర్సులో ఎంతో అపురూపం గా పెట్టుకున్న రజియా ఫోటో కన్నార్పకుండా చూసుకుంటూ కొత్త గా పెళ్ళైన తన భార్య ఎలా ఉందో అని ఆలోచనలో పడ్డాడు.

    పంజాబ్ లో ఒక చిన్న పట్నం సికందర్ పుట్టిన ఊరు. ఆ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఊరిప్రజల మధ్య జాతి మత భేదాలు లేవు. ఊరంతా ఒక ఫామిలీ లా జీవిస్తున్నారు. వాళ్ళ మతం ఒక దేశ భక్తి మాత్రమే. సికందర్, రజియా అల్లాంటి వాతావరణం లో పెరిగేరు. ఆ చిన్న ఊర్నించే ఎంతో మంది దేశ సేవ కోసం యుద్ధ వీరులయ్యేరు. అక్కడ ప్రతీ ఇంటా ఒకరో ఇద్దరో సైన్యం లో ఉన్నారు.

    రజియా అబ్బాజాన్ కల్నల్ గా రిటైర్ యేరు. రజియా పెద్దఅన్నయ్య ఎయిర్ ఫోర్స్ లో, చిన్నన్నయ్య ఆర్మీ లో కార్గిల్ వార్ లో పాల్గొని దేశానికి, ఊరికి కూడా మంచి పేరు తెచ్చేరు.

    సికందర్, రజియా మొదటినించీ పక్క ఇళ్లల్లో ఉన్నా ఇద్దరూ ఎప్పుడూ ఒకే చోట ఉండేవారు. చిన్నతనం నించి వారి స్నేహం అలాంటిది. వాళ్ళ స్నేహం ఇంట్లో వాళ్లకి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. రజియా తన కంటే రెండేళ్లు చిన్న. ఇద్దరూ కలిసి పెరిగేరు. ఒకే స్కూల్ లోను, కాలేజీ లోను చదువుకున్నారు.

    ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ అభిమానం. సికందర్ కి చిన్నప్పటినించీ ఆర్మీ లో చేరి పెద్ద ఆఫీసర్ అవ్వాలని కోరిక. సికందర్ ఎన్. డీ. ఏ ఎగ్జాం మంచి మార్కులతో పాస్ అయి ఇంటర్వ్యూ లో మంచి రాంక్ సంపాదించేడు. ఆర్మీ లో సెలెక్ట్ అయి ట్రైనింగ్ తరవాత పంజాబ్ రెజిమెంట్ లో ఆఫీసర్ గా చేరేడు...


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/hpD0FYDQNwI

    13 min
  • ది ట్రాప్ ఎపిసోడ్ 4 | The Trap Episode 4 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ది ట్రాప్ ఎపిసోడ్ 4

    రచన : పాండ్రంకి సుబ్రమణి

    పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' నాలుగవ భాగం

    గత ఎపిసోడ్ లో

    ఆఫీస్ పని ఒత్తిడిలో భోజనం కూడా సరిగ్గా చెయ్యడు భువనేష్.

    వేదమూర్తి ఇంటికి, అతని చిన్ననాటి స్నేహితుడు దివాకర్ కూతురితో సహా వస్తాడు.

    వేదమూర్తి కొడుకు పరమేశ్వర్ గురించి వివరాలు అడుగుతాడు.

    ఇక ది ట్రాప్. . నాలుగవ భాగం చదవండి…

    హాలు మధ్య కూర్చుని కాఫీ టీలు పూర్తయిన తరవాత మాటల మధ్యలో సంభాషణల హోరులో దివాకర్ అదను దొరికి నప్పడుడల్లా పరమేశ్వర్ గురించిన ప్రస్తావన తేవడం పెద్దరికంతో బాటు అనుభవ సారమూ పుణికి పుచ్చుకున్న వినాయకానికి మొదటి సారి చిత్రమైన భావ స్రవంతి సోకనే సోకింది; పెద్దలు ఊరకే రారు-అన్న సామెత గుర్తుకి వచ్చి--

    అంతేకాక-ఇంట్లోనున్న వాళ్ళ గురించి కాకుండా తమతో కలసి వచ్చిన పెద్దకూతరు వినోదిని గురించి ప్రస్తావిస్తూ-- మరొక వేపు పరమేశ్వర్ గుణగ ణాల గురించి తెలుసుకో వడానికి ప్రయత్నిస్తూ-- ఐనా , పెద్దతరపు వేదమూర్తి దంపతులిద్దరికీ విషయం అంతు పట్టకుండా మిగిలి పోతూంది. యింట్లోవాళ్ళే కాక , దివాకర్ సహితం మొదట్నించీ డాబుసరి దొరబాబులా ఉంటాడని వేదమూర్తి అల్లనల్లన అందరి ముందూ గట్టిగానే చెప్పినట్టు భార్య కామాక్షికి గుర్తు. అలాంటప్పుడు తమ ఆలోచనలో తప్పిదం దొర్లిపోవడం లేదూ!

    టూకీగా చెప్పాలంటే నక్కెక్కడ నాకలోకమెక్కడ! మాటల రాపిడిలో భార్యా భర్తలిద్దరూ పొరపాటుగా అందని ఆకాశం వేపు చేతులు చాస్తూ ఆలోచిస్తున్నారేమో!

    వాళ్ళలా పరిపరి విధాల తలపోస్తున్నప్పుడు దివాకర్ బాణంలా సర్రున ప్రశ్నను విసిరాడు-“నువ్వు మా పెద్దమ్మాయి వినోదినిని చూస్తున్నావు కదూ!”

    ఈసారి వేదమూర్తి నవ్వుతూనే రిటార్ట్ చేసాడు- “ఇక నువ్వు చూపించడానికే ముందోయ్! చూస్తున్నాం కదా— చూసి మాట్లాడుతున్నాం కదా-- ఐనా వినోదినితో బాటు యింట్లోని మిగిలిన అమ్మాయిల్ని కూడా తీసుకొచ్చి ఉంటే అందరమూ చూసుండే వాళ్ళం కదా! మీ ఆవిణ్ణి తీసుకొచ్చి ఉంటే మరీ బాగున్ను దివాకర్-- వినోదినిని దీవించినట్లే మా అమ్మానాన్నా వాళ్ళను కూడా దివ్యంగా ఆశీర్వదించి ఉండే వారు కదా! ”

    “ఏం—నువ్వూ మా చెల్లీ నా పెద్దకూతుర్ని ఇప్పుడు ఆశీర్వదించరా! ”

    “అవేం మాటల్రా దివాకర్! అంత పెద్దగా యెదిగిపోయావు గాని చిన్నతనపు కొంటెతనం నీలో కొంచెం కూడా తగ్గలేదురా! అదలా విడిచి పెట్టు గాని.. ఇంతకీ వినోదినిని ఎంతవరకు చదువుకుంది? ఫారిన్ కి వెళ్ళి వచ్చినట్టుంది. ఇంకా ఎగ్జామ్స్ ఒత్తిడిలోనే ఉందా?”..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/2YpE4UeQhWA


    16 min
  • కాకతి రుద్రమ ఎపిసోడ్ 16 | Kakathi Rudrama Episode 16 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కాకతి రుద్రమ ఎపిసోడ్ 16

    రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ

    16 వ భాగం

    గత ఎపిసోడ్ లో…

    గన్నారెడ్డి గురించి సరైన అవగాహన కలిగి ఉంటాడు శివదేవయ్య.

    అదే విషయాన్ని రుద్రమ దేవికి వివరిస్తాడు.

    శివ సాధువు వేషంలో లకుమయారెడ్డిని, అతని అనుచరులను స్పృహ తప్పిస్తాడు గన్నారెడ్డి.

    లకుమయారెడ్డిని బంధించి ఆ వర్తమానాన్ని శివదేవయ్యకి చేరవేస్తాడు.

    ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 16 చదవండి..

    ఓరుగల్లులో  ఎక్కడ చూసినా

    ఆనందమే. కోలాహలమే. సంరంభమమే.

    సంరంభ ఆనంద కోలాహలమే.

    విజయదశమి..........

    అమ్మవారి అలంకరణలు చూచుటకు వెయ్యి కన్నులు కావలెను.

    పగలు- వేడుకలు, జాతర.

    రాత్రి అమ్మవారు ఏడు గుర్రాలు పూనిన రధముమీద ఊరేగుతున్నది.

    అమ్మవారితో పాటు ఊరు ఊరేగుచున్నది.

    ఎటు చూసినా సందడి.

    సైనికులు, సేనాపతులు, ప్రజలు అమ్మవారి వెంట వున్నారు. మేళతాళములు

    ముందు మదగజము మీద రుద్రమదేవి. ఆమెను ఆ వేషంలో చూడటం ప్రజలకు అదే మొదలు. ఎంత అందముగా నున్నది.. తమ చక్రవర్తిణీ!

    ఎటు విన్నా అదే మాట.

    ఆ వెనుక ఏనుగు మీద వున్నది 'అన్నమాంబిక' కోటారెడ్డి ప్రభువుల కొమరిత యట.

    ఈమె నేనట గన్నారెడ్డి తెచ్చినది.

    ప్రజలు ఎవరి ఆనందంలో వారున్నారు.

    మధ్యరాత్రఐనది- వూరంతా కాగడాల వెలుగు.

    లకుమయారెడ్డి మీద యివాళ ఎవరికీ భయాలూ, అనుమానాలూ లేవు. అతనూ స్వేచ్ఛగా బయటికి వచ్చాడు. కాకతమ్మ గుడి వెనక అంతా చీకటి మయము.

    ఆ చీకటిలో వారు నలుగురు

    రుద్రయ్యమంత్రి, లకుమయారెడ్డి, హరిహ,ర మురారిదేవులు.

    వారి సంభాషణలు యిది:

    "మీరు యుద్ద ప్రయత్నాలుచేసి, కాకతీయ సామ్రాజ్యమును త్వరగా ఆక్రమించవలెను”

    అని లకుమయారెడ్డి అన్నాడు.

    "మేమునూ ఆ ప్రయత్నములోనే వున్నాము"

    "యాదవరాజులు, మహాదేవరాజు ప్రభువులు ఏమంటున్నారు"

    తమ తండ్రిగారు కృష్ణభూపతులు ఆఖరి దశలో వున్నారు. వారు హరీ అనటమూ, వీరు వురికి రావటము"

    "సైన్యములు సిద్దమా?"

    "ఆ.... ఆ ప్రయత్నము లన్నీయూ ఎన్నడో జరిగినవి".

    "ముందు రుద్రమదేవిని, ఆ తరువాత గణపతిదేవ చక్రవర్తినీ హతమార్చవలెను. "

    "తప్పక"

    "మరి యాదవ రాజులకు ఏమివ్వవలెను".

    "గెలిచిన తరువాత పదికోట్ల బంగారునాణెములు ".

    "అది ధర్మమే" అన్నాడు లకుమయారెడ్డి.

    "మనసేనలకు ఏల అంతరాయము కలిగినది. ?"  అన్నాడు మురారిదేవుడు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/0uLohMsVlgM



    20 min
  • ప్రేమ‘భ్రమ’రం - 6 | Prema Bhramaram - 6 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ప్రేమ ‘భ్రమ’రం - 6

    రచన: వసుంధర

    వసుంధర గారి తెలుగు ధారావాహిక  ప్రేమ  ‘భ్రమ’రం ఆరవ భాగం

    గత ఎపిసోడ్ లో...

    రావి చెట్టు దగ్గర తన అనుభవాలు చెబుతాడు నా స్నేహితుడు శ్రీను.

    నేను కూడా ఆ చెట్టు దగ్గరకు వెళ్లాను.

    అక్కడ ఉన్న వ్యక్తి నా కోసమే ఎదురు చూస్తున్నట్లు చెబుతాడు.

    ఇక  ప్రేమ  ‘భ్రమ’రం ఆరవ భాగం చదవండి ...

    ‘‘మీరెవరో నాకు తెలియదు....’’ అన్నాను.

    ఆ విషయం అతడికి తెలియదనా - తన గురించి ఏమైనా చెప్పడానికి ఓ పలకరింపు, అంతే!.

    ‘‘కూర్చోండి’’ అన్నాడతడు నవ్వుతూనే.

    గొంతు మృదువుగా మనోహరంగా ఉంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి గొంతు అలాగే ఉండేదేమో!

    కూర్చుందుకు అతడి అనుమతి అవసరం లేదు. కానీ అతడు చెప్పకపోతే, అలాగే నిలబడి ఉండిపోయేవాణ్ణేమో అనిపించింది.

    కూర్చున్నాను.

    ‘‘నా పేరు అమోఘ్‌’’ అన్నాడతడు.

    ‘‘నేను విచల్‌’’ అన్నాను.

    ‘‘మీరిక్కడికెందుకొచ్చారు?’’ ఆన్నాడతడు.

    నేనా ప్రశ్నకి బదులివ్వకుండా, ‘‘నేనిక్కడికొస్తానని మీకెలా తెలుసు?’’ అన్నాను.

    అతడు మళ్లీ నవ్వాడు, ‘‘నేనడిగిందానికి బదులిస్తే, జవాబు అందులోనే ఉండొచ్చు’’ అన్నాడు.

    తిరకాసుగా మాట్లాడుతున్నాడు. కానీ నాకు కోపం రావడం లేదు.

    ‘‘నిజం చెబుతున్నాను. నేనెందుకొచ్చానో నాకు తెలియదు’’ అన్నాను.

    ‘‘అంటే నా సంకల్పబలమే మిమ్మల్నిక్కడికి రప్పించిందన్న మాట! ఐతే నేను చెప్పేది మీరు వినాలి’’ అన్నాడతడు.

    అప్పుడు నాకూ అనుమానమొచ్చింది. నేనొచ్చింది ప్రశాంతత కోసమా? లేక అతడి సంకల్పబలాన్ని అనుసరించా?

    అతడు నాకేదో చెప్పాలనుకుంటున్నట్లు నాకు అర్థమౌతోంది.

    ఏమో - అతడు చెప్పేది వినడంవల్ల నాకు ప్రశాంతత లభిస్తుందేమో! ‘‘చెప్పండి’’ అన్నాను.

    ‘‘నేనొక ప్రేమికుణ్ణి’’ అన్నాడతడు.

    అంటే - అతడు నాకు వినిపించబోయేది ప్రేమ కథ అన్న మాట! కొంపదీసి ఇతడు కూడా ముక్తను ప్రేమించడం లేదు కదా!

    ‘‘చెప్పండి. మీ కథ విని చేతనైతే సాయం చేస్తాను’’ అన్నాను.

    ‘‘సాయమంటే, ఎలాంటి సాయం?’’ చప్పున అడిగేడతడు.

    ‘‘సాధారణంగా ప్రేమకథల్లో అవసరపడే సాయమే! పెద్దల్ని ఒప్పించడమో, వాళ్లొప్పుకోకపోయినా మీ పెళ్లికి సాయపడ్డమో, మీ జంటకి ఆశ్రయంఇవ్వడమో - వగైరా వగైరా....’’ అన్నాను.

    ‘‘నా ప్రేమ ఆ కథలన్నీ దాటిపోయింది’’ అన్నాడు అమోఘ్‌.

    ‘‘అంటే?’’ అన్నాను.


    Read the full story on www.manatelugukathalu.com

    నేను రాస్తున్న వెబ్ సిరీస్

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/tKPbCzi0_28

    20 min
  • కర్తవ్యం - ఎపిసోడ్ 1 | Karthavyam - Episode 1 | Telugu Web Series | Vedurumudi Ramarao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కర్తవ్యం - ఎపిసోడ్ 1

    రచన: వెదురుమూడి రామారావు

    వెదురుమూడి రామారావు గారి మినీ సీరియల్ ప్రారంభం

    ‘లాయర్ విశ్వనాథం’ గారికి హై కోర్ట్ లోనే కాదు, సుప్రీమ్ కోర్టు లో కూడా మంచి పేరుంది. సుమతి అయన సతీమణి. మంచి జంటగా, అందరికి మంచి చేసే మంచి మనసు గల పెద్దలుగా, వాళ్లు మహా మంచి వాళ్లుగా పేరు తెచ్చు కొన్నారు. ఎవరు ఢిల్లీ వెళ్లినా వాళ్లను కలవకుండా, వారి ఆతిధ్యం తీసుకోకుండా రారు. పిల్లలు ఆస్ట్రేలియా లో సెటిల్ ఐపోయారు. అందుకని ఎవరైనా వాళ్ళ ఇంటికి వస్తే వాళ్లకు పండగ. వచ్చిన వాళ్ళను ఎంతో ఆప్యా యంగా చూసుకొని వాళ్ళు ఉన్నన్నాళ్ళు సరదాగా గడిపేస్తారు. వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉండి తీరతారు.

    సాయంత్రం కోర్ట్ నుంచి హడావిడిగా ఇంటికి వస్తూనే కాఫీ కూడా తాగకుండా       "సుమతీ! నీకు.. మనోహర్, సుధా, హైదరాబాద్ లో కలిసాం.. వాళ్ళు గుర్తు వున్నారా? వాళ్ళ పెళ్లి కి కూడా మనం వెళ్ళాం.. మీ రఘు మావయ్య కొడుకు, కోడలు. వాళ్ళు రేపు పొద్దున్నే వస్తున్నారు. కొన్నాళ్ళు మన దగ్గర ఉంచుకొందాం. ఎలాగూ కోర్ట్ కి కూడా సెలవలు వస్తున్నాయి కదా. అందరం కలసి ఎక్కడికైనా సరదాగా వెళ్ళచ్చు కూడా" అంటూ గాలి పీల్చుకొన్నారు.

    మర్నాడు వాళ్లు వచ్చిన దగ్గర నుంచి ఎంతో ఆప్యాయంగా వాళ్ళకి అన్నీ అమర్చి, సంతోషంగా చూసుకొన్నారు. ఒక రోజు రెస్ట్ ఇచ్చి తరువాత వాళ్ళ కి కావలసిన విధంగా ప్రోగ్రాము వేద్దాము అని నిర్ణయించారు. బ్రేక్ఫాస్ట్, లంచ్ , డిన్నర్ అన్నిటికీ మంచి ‘డిషెస్’ చేసి పెట్టారు.

    మర్నాడు బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద ఢిల్లీ లో తన సాయం ఏమైనా అవసరం వుందా అని అడిగారు విశ్వనాథం గారు.

    “లేదు అంకుల్! కొంచం చేంజ్ కోసం, కొన్నాళ్ళు మీతో ఉందాము అని వచ్చాము. అంతకన్నా ఏమీ లేదు” అని ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు మనోహర్.

    వచ్చిన దగ్గరనుంచి వాళ్లని గమనిస్తూనే వున్నారు దంపతులిద్దరూ. ఏదో ముభావంగా, యెడ మొహం పెడమొహంగా వున్నట్టు సూచనగా అనిపించింది. ప్రయాణం బడలికే అని సర్దుకున్నారు. కానీ ఏదో దాస్తున్నారు అని అర్ధమైంది. శాంత పడ్డానికి కొంచం సమయం వాళ్లకి ఇవ్వాలి అని అర్ధమైంది . మరేం మాట్లాడకుండా వాళ్లని రెస్ట్ తీసుకోమని చెప్పి పంపారు.

    డిన్నర్  టైంలో, ‘వాతావరణం అనుకూలంగా వుంది. అసలు విషయం ఏమిటో తెలుసుకొందాం’ అని విశ్వనాథం గారు, భార్య  కూడబలుక్కొన్నారు. వాళ్ళు కూడా కొంచం స్థిమిత పడినట్టే వున్నారు.

    మిగతా విషయాల తర్వాత మెల్లగా విశ్వనాథం గారు మంద్రస్వరం తో "విషయం ఏమిటో మాతో చెప్పుకొంటే బాగుంటుంది. మీరిద్దరూ ఎందుకిలా వున్నారు? మేము ఏమైనా చేయగలిగితే చేస్తాము. మాకు చెప్పండి " అని అడిగారు..


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/MRHURcIxbyA

    9 min
  • అనామిక | Anamika | Telugu Short Stories | Bhagavathula Bharathi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    అనామిక

    రచన: భాగవతుల భారతి

    "ఇంతవరకూ  తెరచాటున ఉండి...

    మెసేజెస్ ద్వారా మాట్లాడింది చాలు. మీరెవరో ఇదంతా ఎందుకు చేస్తున్నారూ?... ఫోన్ లో అడిగింది స్వప్న.

    అవతలివైపు మౌనం ....

    "మౌనం మాట్లాడుతుందని తెలుసు...

    కానీ మీరు మాట్లాడే భాష మాకు అర్థం కావట్లేదు... మీరెవరూ?...రోజూ మెసేజెస్ పెడుతున్నారు?.... అప్పుడప్పుడు డబ్బులూ పంపుతున్నారు... కారణం ఏమిటీ? "

    మళ్ళీ మెసేజ్ " టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. అయినా పరస్పరం అభిమానం

    సంపాదించటానికి ఆస్తులూ, అంతస్థులతో పాటే, పేరూ, ఊరూ తెలియాల్సిన అవసరమూలేదు "

    "మీరు మగవారా? ఆడవారా?"

    సమాధానం లేదు కానీ ఐదువేల రూపాయల గూగుల్ పే రసీదు... వాట్సప్ లోకి వచ్చింది. స్వప్న నిట్టూర్చింది దీర్ఘంగా.

    కాలం తనపనితను చేసుకొంటూ పోతూనే

    స్వప్న పెద్దకూతురు కార్తీకను ఐ. ఎ. యస్ ను చేసింది.

    చిన్నకూతురు ప్రదీపను డాక్టర్నూ చేసింది.

    కొడుకు షణ్ముఖ.... ఇంకా చదువుతూనే ఉన్నాడు.

    గతంలోంచి  నడిచివచ్చిన దారిచూసుకుని.... ఇన్ని మైలు రైళ్ళు ఇంత ఒంటరిగానే కష్టపడి దాటి వచ్చానా?  అనుకుంటూ గతంలోకి అవలోకనం చేస్తే...

    @@@

    స్వప్న చిన్న ప్రయివేట్ స్కూల్ టీచర్ గా

    పనిచేస్తూ, పిల్లలను చదివించటం తలకుమించిన భారమైపోయింది.

    ఆ సమయంలో ఓ మెసేజ్... " మీకు ఇబ్బంది కలిగించకుండా మీతో ఫ్రెండ్ షిప్ చేస్తే మీకేమయినా అభ్యంతరమా?! " అని.

    సమాధానం ఇవ్వలేదు స్వప్న.

    కొన్నాళ్ళు వాళ్ళే మెసేజెస్ పెట్టేసుకుని మానేస్తారులే అనుకుంది.. మానలేదు.

    పైగా అవతలి వారి వల్ల తనకు ఇబ్బందేం లేదు కాబట్టి....కంటిన్యూ చేసింది.

    తర్వాత ఫోన్ పే లో చిన్న మెుత్తంలో డబ్బులు రావటం మెుదలయింది.

    స్వప్నకి భయం వేసింది. ఒంటరి ఆడదాన్ని ఇలా ఆటపట్టించి... చివరిలో ఎమౌంట్ అంతా ఇమ్మంటే గతేంటి?! ఆలోచనలు పసిగట్టినట్లుగా....

    "మీరు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మీ శ్రేయోభిలాషినే. " మెసేజ్.

    బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ ద్వారా.. వివరాలు సేకరించే తెలివితేటలు, ఓపిక స్వప్నకు లేవు. తన చిన్నసంపాదనకు ఆ చిన్నమెుత్తాలూ జతకూడటంతో కొంత ఊరట....

    గతంలోంచి బయటకువచ్చి....

    "ఇన్ని సంవత్సరాలుగా,ఆదుకున్న అపరిచితులా (రాలా) మిమ్మల్ని ఓ సారి చూసి, మీకు నమస్కారం చేసుకోవాలని ఉంది. ప్లీజ్ దర్శనం ఇవ్వండి " మెసేజ్ పెట్టింది...


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/VDa4HlCekP4



    7 min
  • సైనైడ్ ఎపిసోడ్ 3 | Cyanide Episode 3 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సైనైడ్ - ఎపిసోడ్ 3

    రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి

    గత ఎపిసోడ్ లో

    ఈ కేసుని పరిశోధించడానికి ప్రభుత్వం క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారిని నియమించింది.

    పోస్టుమార్టం చేసిన డాక్టర్ కిరణ్ ని పూర్తి వివరాలు అడుగుతాడు రాజశేఖర్.

    ఇక సైనైడ్ మూడవ భాగం చదవండి..

    రాజశేఖర్ గారు మాట్లాడుతూ, “డాక్టర్ గారూ! ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయమై మన దేశ భద్రత కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, ఇంకా దేశం లోకి ఇలాంటి నిషేధ పూరితమైన మందులు రాకూడదని, నన్ను ఈ కేసుని కూలంకుషంగా పరిశీలించమని పంపించారు! కనుక మీరు మొత్తం పోస్టుమార్టం ఎలా జరిగిందో వివరించండి” అన్నారు.

    డాక్టర్ కిరణ్ గారు తన గొంతు సవరించుకుని, “సార్! పోస్టుమార్టంలో సాధారణంగా, బాడీలో ఎక్కడైనా కత్తి గాట్లు, బుల్లెట్ రంధ్రాలు, ఉన్నాయా? అని పరీక్ష చేస్తాను. ఆ తర్వాత మెడ దగ్గర 'ఉరి వేయడం' వల్ల చనిపోయాడా! అనే పరీక్ష చేస్తాను. కానీ ఒక ఆరోగ్యంగా ఉన్న శేఖర్ అనే వ్యక్తికి ఎలాంటి దెబ్బలు గాని, కత్తిపోట్లు, గాని ఉరి లాంటివి గాని ఏమీ జరగలేదు. అసలు ఎలా చనిపోయాడో? అని నిశితంగా పరిశీలించాకే, ఆయన మెడ దగ్గర నుంచి హార్ట్ వరకు రంగు నీలంగా మారి ఉంది. ఇది విష ప్రయోగం అని , అదే రోజు కెమికల్ టెస్ట్  చేశాను. అప్పుడు తెలిసింది, ఇది ఏ పాముకాటు కాదు, అత్యంత విషపూరితమైన ద్రవం శరీరం లోకి వెళ్లి మొత్తం 3 నిమిషాలలో శరీరాన్ని పారలైజ్ చేస్తుంది. గుండె ఆగిపోతుంది.

    ఆ చేసిన కెమికల్ టెస్ట్ లో మందుల్లో వాడే ప్లాస్టిక్ రేణువుల వల్ల ఇది సైనైడ్ క్యాప్సిల్ గా నిర్ధారించుకున్నాము, అదే రిజల్ట్స్ డిల్లీ ల్యాబ్ నుంచి కూడా వచ్చేసరికి దిగ్భ్రాంతి చెందాము” అంటూ డాక్టర్ గారు నుదిటి మీద పడ్డ చెమట తుడుచుకుంటూ, ఏకబిగిన మాట్లాడడం వలన, దాహంతో గ్లాసుడు నీళ్లు తాగి స్థిమిత పడ్డారు.

    "ఓకే డాక్టర్ గారు! నేను అన్ని విషయాలు పరిశీలిస్తాను, థాంక్  యూ  ఫర్  యువర్  వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్” అని చెప్పగానే డాక్టర్ గారు వెళ్లిపోయారు.

    ఆ తర్వాత రాజశేఖర్ గారు అన్ని సీసీ కెమెరాస్ ఫుటేజ్ లు అణువణువు పరిశీలించాక, మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత పోలీస్ కమిషనర్ గారి తో మాట్లాడుతూ, “నన్ను ఒక్కసారి హత్య జరిగిన ప్రాంతానికి.. అదే.. షాపింగ్ మాల్ కు తీసుకు వెళ్ళండి!” అని అనగానే ఇద్దరు 'సీనియర్ ఆఫీసర్స్' ని పంపిస్తూ 'చూడండి, రాజశేఖర్ గారికి ఆ ప్రాంతంలో అన్ని చూపించి, ఏ అవసరం ఉన్న కాల్ చేయండి” అని చెప్పి “సార్! నాకు మీటింగ్ ఉంది, మీరు అన్ని సావకాశంగా పరిశీలించండి” అని ఒక రెడ్ లైట్ వెలుగుతున్న అఫీషియల్ పోలీస్ కార్ లో వారిని పంపించారు.

    సరిగ్గా ఆ సమయంలో వైజాగ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉన్నా, పోలీస్ ఎస్కార్ట్ తో వస్తున్న కార్ కి సిగ్నల్స్ ఆపి సెల్యూట్ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ని చూస్తూ తిరిగి తను కూడా సెల్యూట్ చేస్తూ, "ఆహా.. వైజాగ్ ఎంత అభివృద్ధి చెందింది!, ఎంతో సుందరమైన నగరం, రిటైర్మెంట్ అయిపోయాక వైజాగ్ లోనే ఇల్లు కట్టుకొని స్థిరపడతాను” అన్న ఆలోచనలతో రాజశేఖర్ గారు తనలో తనే ఆనంద పడసాగారు...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/w6mamPKzEV0

    6 min
  • ది ట్రాప్ ఎపిసోడ్ 3 | The Trap Episode 3 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

    ది ట్రాప్ ఎపిసోడ్ 3

    రచన : పాండ్రంకి సుబ్రమణి

    గత ఎపిసోడ్ లో

    త్వరగా  వివాహం చేసుకొమ్మని రాముకి సలహా ఇస్తాడు భువనేష్.

    అంగీకరిస్తాడు రాము. కానీ ఎప్పుడో మాత్రం చెప్పలేనని అంటాడు.

    భార్య పక్కన ఉన్నా ఆఫీసు విషయాలు ఆలోచిస్తుంటాడు భువనేష్.

    ది ట్రాప్ ఎపిసోడ్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

    ది ట్రాప్ ఎపిసోడ్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

    ఇక ది ట్రాప్. . మూడవ భాగం చదవండి…

    ఉదయమే కార్పొరేట్ కార్యాలయానికి వెళ్ళిన భువనేష్ సాయంత్రం వరకూ పని రద్దీలోనే ఉండిపోయాడు.

    “భోజనం పంపించాను. తీసుకున్నారా!” అని అడగడానికి కూడా ప్రభావతికి ఆస్కారం లేకుండా పోయింది.

    మధ్యాహ్నం ఖాళీ చేయని కేరియర్ యింటికి తీసుకొచ్చిన కారు డ్రైవరుకి అదే కేరియర్ నిచ్చి పంపించేసింది.

    దీపాలు పెట్టే వేళ దాటింతర్వాత ఇల్లు చేరిన భువనేష్ కి అప్పుడు కూడా అదే పోకడ. మలి స్నానం చేసి రాత్రి భోజనం చేసిన భర్త, అదే రీతిన పెందలకడే మేను వాల్చడం గమనించిన ప్రభావతి, అతణ్ణి కదపకుండానే గుసగుసలు పోయినట్లు అడిగింది- “మళ్ళీ ఏమయిందండీ! అంతలావు టైమింగ్ పాటించ కుండా పని చేస్తే ఆరోగ్యం యేమవుంది? ఎండార్ఫిన్ వంటి సంతోషదాయకమైన హార్మోనులు శరీరంలో పుట్టుకు రావద్దూ! కనీసం కట్టుకున్న పెళ్ళాంతో రెండు మాటలు కలపొద్దూ? “

    “ఉష్! రిచార్జ్ చేసుకోనివ్వు. రేపు లీవు వేసాను-ఎందుకో చెప్పుకో—“

    “ఇందులో చెప్పుకోవడానికి యేముందండీ! అలసి సొలసి డీలా పడిపోయారు. ఫీవరిష్ గా ఫీలయుంటారు. అందుకే రేపు—“

    “ కాదు.  కానే కాదు. నిన్ను మొదటిసారి చూసిన రోజు. నిన్ను యిష్టపడ్డ రోజు. మావాళ్ళూ మీ వాళ్ళూ తాంబూలాలు పుచ్చుకున్నరోజు.”

    ఆ మాట విన్నంతనే ప్రభావతి ఆనందంతో అరచినంత పని చేసింది.

    “అరెరే—అదన్న మాట—రేపటి కోసం మూడ్ చెదరిపోకుండా కూడగట్టుకుంటున్నారు—ఆ మాట ముందే చెప్పవచ్చుగా—“

    “ఇదొక్కటే కారణం కాదు. నిజంగానే మెంటల్ స్ట్రెయిన్ తో బాగానే అలసిపోయాను. అదంతా రేపు నీతో ఔటింగుకి వచ్చి చెప్తాగా!

    ఇప్పుడు నన్నొకసారి మనసార గుండెలకు హత్తుకుని అడుగుల చప్పుడు కూడా వినిపించనీయకుండా వెళ్ళిపో”

    ఆమె అలాగే నవ్వుతూ భువనేష్ ని గుండెలకు హత్తుకుని నుదుట మృదువుగా ముద్దుపెట్టుకుని వెళ్ళిపోయింది...


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/LAQzP7c4sf0


    11 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world