
Sign up to save your podcasts
Or


(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కాకతి రుద్రమ ఎపిసోడ్ 18
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 18 వ భాగం
గత ఎపిసోడ్ లో…
రుద్రమదేవి, అన్నమాంబికతో కలిసి తన జైత్రయాత్రను ముగించి, కాకతి నగరానికి తిరిగి వస్తుంది.
చోళజాతి ప్రభువు తిరుగుబాటు ప్రకటించి, సామంతులు తనకే కప్పం కట్టాలని ప్రకటిస్తాడు.
ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 18 చదవండి..
రుద్రమదేవి అన్యమనస్కంగా వుంటున్నది. ఆమె మనస్సు చిక్కుబడిన దారమువలె గజిబిజిగా నున్నది. శివదేవయ్యామాత్యులు గ్రహించలేని అజ్ఞానులు కాదు.
కాలుతున్న పెనం వలెనున్న కాకతీనగర పరిస్థితి కళ్యాణములకు అనువైన సమయమా? కాదా? అన్నది మాత్రమే చర్చించవలెను. కానీ యిక రుద్రమదేవి వివాహమునకు ఆలస్యము చేయరాదు. ఆమె మనస్సును యింకనూ క్షోభ పెట్టరాదు. ఆమెయూ తనబిడ్డ వంటిది కాదా!
శివదేవయ్యామాత్యులు వున్నపడంగా తమ రాజ్యమునకు రావడము, చాళుక్య వీరభద్ర ప్రభువులు ఆశ్చర్యముతో తేరుకుని-
" స్వాగతము, మహామాత్యులకు- ఆశ్చర్యముగా నున్నది".
శివదేవయ్య నవ్వి- "తాము పిలవక పోయిననూ మేమే వచ్చితిమి" అని ఆయన ఉచితాసనం మీద కూర్చున్నారు.
కూర్చుని- "మీతో చాలా ముఖ్యమైన విషయము మాట్లాడాలని వచ్చాము".
" చిత్తము".
"వీరభద్రప్రభూ! రాజ్యము కత్తుల వంతెనవలె వున్నది. ఎవరు ముఖ్యులో, ఎవరు శత్రువులో అంతు చిక్కదు. సామంతులు కుక్కగొడుగులవలె తలఎత్తుతున్నారు.
అటు కాకతీచక్రవర్తులు అంతిమ ఘడియల అంచున వున్నారు. ఆయన శివ సాయుజ్యము ఏ క్షణములోనైనా చెందవచ్చును. తమ కుమార్తె వివాహము చూడవలెనన్న కోరిక మిక్కుటముగా నుండెను.
రుద్రమదేవి నా బిడ్డవంటిది. వంటిదే కాదు. ఆమె నా కుమార్తెయే. -ఆమె సుఖమును నేను సర్వదా ఆకాంక్షించు చున్నాను.
అదీగాక గణపాంబదేవి భర్త బేతరాజు ప్రభువులు సహృదయులు. వారు చిన్న సామంతరాజులే కావచ్చుగాక. గుణమునగానీ, ఠీవిలోగానీ బంగారు తునక.
మీరు రుద్రమదేవిని చక్రవర్తిణిగా చూడనక్కరలేదు. ఆమెను కర్కశత్వము నుంచి లలిత మృదు స్వభావినిగా, పురుషునినుంచి స్త్రీగా మార్చినది మీరు. మిమ్ములను మా రుద్రమదేవి చక్రవర్తిణిని మీ జీవిత భాగస్వామినిగా చేయవలెనని నా అభీష్టము. అది ఆమె మనస్సులోని కోరిక.
అదీగాక, ఈ వివాహ బాంధవ్యముతో ఈ రెండు రాజ్యములూ ఒకటి కావలెనని - ఇది చాళుక్య లక్ష్మికి నుదుట దిద్దిన కళ్యాణరేఖ కావలెనని మా అభీష్టము."
" ఔను."
"మీ యిష్టమే , మా యిష్టము, మీరు శాసించవలెను. మేము పాటించవలెను."
" మీ సహృదయతకు నా కృతజ్ఞతలు."
వీరభద్రప్రభువు నవ్వినాడు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/1XKsQb3kTYg
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
మరో సమిథ
రచన: ఆదూరి హైమావతి
కారు దిగి తలెత్తి చుట్టూ చూసింది సిరి. వెంటనే తలత్రిప్పి తండ్రికేసి చూసి "భయంగా ఉంది నాయనా! ఇంతపెద్ద భవనంలో నా క్లాసెక్కడో ఎలా తెల్సుకోనూ?" అంది భీతి గా.
"ఉండు తల్లీ! నిన్నొక్కదాన్నే ఎలాపంపుతానూ? నేనొస్తాగా" అంటూ కారు దిగి సిరి వెంట నడిచాడు ఆమెతండ్రి ఆనందయ్య.
ఇద్దరూ నడుస్తూ మైన్ ఆఫీస్ లోనికెళ్ళారు.
తనను పరిచయం చేసుకుని, తన పాప క్లాస్ ఎక్కడో అడగ్గా, ఆఫీస్ లో ఆ ఉద్యోగి ఒక వ్యక్తిని తోడుగా పంపాడు, క్లాస్ చూపను.
క్లాస్ లో ఒక మహిళా లెక్చరర్ ఉన్నారు. అక్కడ సిరి, వాళ్ళనాన్న గారూ ఆగగానే ఆమె తలెత్తి చూసింది.
"మేడం.. న్యూ అడ్మిషన్!" అనిచెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు.
"మా అమ్మాయండీ! కొత్తగా ఇక్కడ చేరను వచ్చింది." అని పరిచయం చేశాక, ఆమె "అలాగే! మీరు నిశ్చింతగావెళ్ళి రండి" అని ఆమె చెప్పాక,
"వస్తానమ్మా! సిరీ తల్లీ!, సాయంకాలం వచ్చి తీసుకెళతాగా! ధైర్యంగా ఉండు" అని చెప్పి, కూతురు తలమీద నిమిరి వెళ్ళారాయన.
క్లాసులో మేడం "రామ్మా! వచ్చి కూర్చో" అన్నాక వెళ్ళి ఖాళీగా ఉన్న మొదటి బెంచీలో కూర్చుంది సిరి.
ఆ మేడం అందరినీ పరిచయం చేసుకుంటూ, ఒక్కోరినీ లేపి పేరూ, ఊరూ, చదివిన హైస్కూల్, మార్కులూ మొదలైనవి అడుగుతుండగా, సిరి వంతు వచ్చింది.
"నీపేరేంటి!" అని ఆమె అడగ్గానే లేచి నిలుచుంది సిరి.
"నాపేరు సిరి" అంది.
"ఎక్కడ చదివావు ఇంతకుముందు?" అనగానే సిరి "మా ఊర్లోనే నండీ! ఒకటో క్లాస్ నుండీ పదోక్లాస్ వరకూ అక్కడే."
"మీ ఊరి పేరేంటమ్మా?"
"మా ఊరు చింతక్రిందిపల్లె" అనగానే క్లాసంతా నవ్వారు.
'పాత చింతకాయ పచ్చడన్నమాట '
'చూస్తే తెలీడంలా! ఆ పట్టు పరికిణీ, మోచేతుల వరకూ జాకెట్టూ, చుట్టూ త్రిప్పి దోపుకున్న పమిటా, నడుం దిగేలా జడ కుచ్చుల జడా, తల్లో పూలూ, చేతికి బంగారు గాజులూ, మెడలో నెక్లెస్, కళ్ళకు కాటుకా, మొహాన నల్లని బొట్టూ, అన్నీ చింతకింది పల్లె లక్షణాలే' అనే ఒక్కోరి కామెంట్స్ సిరికి విని పించాయి.
క్లాసులో మేడంకూడా అన్నీ విని మెల్లిగా నవ్వుకుని "సిరీ! మీ ఊళ్ళో హైస్కూల్ ఉందా!" అని అడిగాక " అవునండీ! ఉంది నేనక్కడే చదివాను."
"అలాగా! ఎన్నిమార్కులొచ్చాయి?" అనగానే సిరి “నాకు స్టేట్ ఫస్ట్ వచ్చిందండీ! ఇదిగోండి నామార్క్స్ షీట్" అని మేడం దగ్గర్కెళ్ళి చూపింది.
ఆమె ఆషీట్ అందుకుని పైకి పెద్దగా చదివింది.
"తెలుగు 99, ఇంగ్లీష్ 99, మాత్స్ హండ్రెడ్ ఔటాఫ్ హండ్రెడ్, కెమిస్ట్రీ, 98, ఫిజిక్స్ 99” ఇలా అన్నీ చదవి క్లాప్స్ ఇవ్వగానే అంతా క్లాప్స్ ఇచ్చారు.
"ఓహో! నీవేనా.. స్టేట్ ఫస్ట్ స్టూడెంట్ మన కాలేజ్ లో చేరబోతున్నదని మేనేజర్ గారు చెప్పారు, మీ నాన్నగారు ఫీజ్ కన్ సెషన్ కూడా వద్దన్నా రుట." అంది మేడం.
“ఔనండీ! మా నాయనగారు ప్రతి ఏడాదీ పది మందికి ఫీజ్ కడుతు న్నారు. నాకెందుకూ కన్ సెషన్" అంది...
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/2DruS5ElvFI
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
బ్రతుకు తెరువు
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
దిల్‌షుక్‌నగర్ చౌరస్తాలో రాబోయే దసరా, దీపావళి పండుగల హడావుడి కోలాహలంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బట్టలషాపువాళ్ళు రకరకాల ఆకర్షణలతో కొనుగొలుదారుల్ని సాదరంగా ఆహ్వనిస్తున్నారు.
ప్రముఖంగా నగరంలో పేరొందిన ఒకపెద్ద బట్టల దుకాణం ముందు ఒకపెద్ద జోకర్ బొమ్మ డెక్‌లో వస్తున్న మ్యూజిక్ కి అనుగుణంగా చక్కని డాన్స్ చేస్తూ జనాన్ని ఆనందపరుస్తోంది. అది చూసిన జనం చప్పట్లుకొడుతూ ఆనందిస్తూ వుంటారు. పిల్లలు ఆ జోకర్ బొమ్మతో ఆడుకుంటూ పకపకా నవ్వుతున్నారు. కొందరు ఆ బొమ్మతో సెల్ఫీలు దిగుతున్నారు.
ఆ జోకర్ బొమ్మ ఆహ్వానాన్ని నవ్వుతూ అందుకున్న కొందరు, ఆ దుకాణానికి వెళ్ళి బట్టలు కొనుగోలు చేస్తున్నారు. ఆ దుకాణం యజమాని, ఆ జోకర్ బొమ్మ మాస్క్ తగిలించుకున్న వ్యక్తి డ్యాన్స్‌కి, సమయస్ఫూర్తికి మనసులో అభినందించాడు.
"మేరా నామ్ జోకర్, మేరా నామ్ జోకర్" -
జోకర్ నండి బాబు, జోకర్ నండిబాబు”
అని స్టెప్పు లు వేస్తున్నాడు.
దుకాణంలో బట్టలు కొని వస్తున్న దంపతుల చేతిలోంచి పిల్లవాడిని లాక్కొని, ఎత్తుకుని డాన్స్ చేస్తోంది. ఈ హాఠాత్సంఘటనకు ఆశ్చర్యపోయిన బాబు తల్లిదండ్రులు బొమ్మ డాన్స్ చూస్తూ తమాయించుకున్నారు. జనం జోకర్ బొమ్మ చేస్తున్న డాన్స్ కి చప్పట్లతో తాళం వేస్తూ సంతోషిస్తూ ఉన్నారు. సమయం చాలా సేపు గడిచినా బొమ్మ, వాళ్ళ బాబుని వారికి ఇవ్వడములేదు.
బాబు తల్లి తన భర్తతో " బాబుని తీసుకోండి. ఎంత సేపు ఇక్కడ. వెళదాం" అని కోపంగా అంది. కాని జోకర్ బొమ్మ, బాబుకు ముద్దులు పెడుతూ , గట్టిగా పట్టుకుని ఇవ్వకుండా మారాం చేస్తోంది. బాబు తండ్రి నవ్వుతాడు.
అది చూసి తల్లి, ఒక్క ఉదుటున బాబుని లాక్కుని "చాల్లెండి సంబరం, రండిక" అని అతని చేయి పట్టుకుని లాక్కెళ్ళింది.
ఆ జోకర్‌బొమ్మ లో వున్న వ్యక్తి గుండెలనెవరో గట్టిగా పిండినట్లయింది. ప్రజలకు కనిపించని ఆ వ్యక్తి కళ్ళనీళ్ళు ధారావాహికంగా ప్రవహించాయి. ఆ బాబు వెళ్ళిన వైపే
చెయ్యిచాచి ప్రేమగా చూస్తూ ఉంది.
బాబు కనుమరుగైపోవడంతో , జోకర్ బొమ్మ మాస్క్ తీసి , కన్నీళ్ళు తుడుచుకుని , మళ్ళా ఆ మాస్క్ తగిలించుకుని డాన్స్‌లో నిమగ్నమైపోయాడా వ్యక్తి.
ప్రతిమనిషి లో బాహ్యరూపం ఒక మాస్క్. " దాని వెనక కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు,ఆవేదనలు, శోధనలు"- అనేక సమస్యలు దాచుకుని , ఈ లోకమనే రంగస్థలం మీద పాత్రోచితంగా నటిస్తుంటారు. ఆ మాస్క్ తొలగించితే వాస్తవం బయట పడుతుంది.
ఈ సారి జోకర్ బొమ్మ, తెల్లటి ఉంగరాల జుట్టు, కళ్ళజోడు పెట్టుకుని సన్నగా వుండే వ్యక్తిని దుకాణం లోంచి వస్తూండగా చెయ్యి పట్టుకుని ఆపి నిలబెట్టింది. ఆ వ్యక్తి విషయం అర్థం కాక అచేతనంగా నిలబడి ఆశ్చర్యంగా జోకర్ బొమ్మను చూస్తూ వుండిపోయాడు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/0TkQEro7I_E
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ప్రేమ ‘భ్రమ’రం - 8
రచన: వసుంధర
వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ ‘భ్రమ’రం ఎనిమిదవ భాగం
గత ఎపిసోడ్ లో...
ఉదయాన్నే అమోఘ్ ఇంటికి వెళ్లి తలుపు తట్టాను.
ఒక అందమైన యువతి తలుపు తెరిచింది.
ఆమే రిక్త అనుకున్నాను.
కానీ ఈమె పేరు రూప అని తెలుస్తుంది.
ముక్త అంగీకారంతో ఆమెను కలుస్తాను.
ఇక ప్రేమ ‘భ్రమ’రం ఎనిమిదవ భాగం చదవండి ...
‘‘మరి మీ ఆఫీసు....’’ అన్నాను ఏమనాలో తెలియక.
‘‘ఆఫీసుకి సెలవెట్టాను’’
‘‘సెలవా - ఎందుకు?’’ అది ఆశ్చర్యమో మరేమిటో చెప్పలేను.
‘‘మీరొచ్చిన పని అలాంటిది మరి’’ మాటలో ఉన్న నిష్ఠూరం గొంతులో లేదు.
‘‘సారీ! నా కారణంగా మీరు మీ ఆఫీసుకి సెలవెట్టాల్సి ఉంటుందనుకోలేదు’’ నొచ్చుకున్నాను.
‘‘సారీ చెప్పకండి. ఆఫీసుకి సెలవెట్టడానికి నా కారణం నాకుంది’’ అందామె.
‘‘అంటే?’’
‘‘మీరు కవన్, భవన్‌ల గురించి మాట్లాడ్డానికి నా దగ్గరికొచ్చారు. ఆ మాటలు ముందుకెళ్లేముందు నేను మీకు నా కథ చెప్పాలి’’ అంది ముక్త.
‘‘మీ కథ నాకు చెబుతారా? నిజంగా అవసరమా?’’ అన్నాను.
చెత్త ప్రశ్న....
అవసరం లేకపోతే తీరికూర్చుని నాకెందుకు వినిపిస్తుంది?
తను రచయిత కాదు. నేను సినిమావాణ్ణి కాదు.
భవన్‌కీ, కవన్‌కీ, ఆమె కథకీ ఏదో లంకె ఉండుంటుంది.
‘‘అవసరమే - అందుకే ఆఫీసుకి సెలవెట్టాను. మీరు నాకు ఫోన్ చేసినప్పుడే - ఇలా కథ చెప్పాల్సుంటుందని తెలుసు. అందుకే మీకు ఫలహారం, భోజనం వగైరాలకి ఏర్పాట్లు చేశాను. ఇంకా.....’’
ఏం చెబుతుందోనని కుతూహలంగా చూస్తున్నాను.
‘‘మిమ్మల్ని సారీ చెప్పొద్దన్నాను. ఎందుకంటే కథ చెప్పడంలో నా ప్రయోజనం కూడా ఉంది’’
మళ్లీ గాజు తలుపులు తెరుచుకున్నాయి. ఇందాకటి వ్యక్తి లోపలికొచ్చాడు. బల్లమీద గ్లాసులు, ప్లేట్లు ట్రాలీకి మార్చేసాడు. ఇద్దరిముందూ చెరో మినరల్ వాటర్ బాటిలూ పెట్టాడు.
‘‘టిఫిన్ తినేటప్పుడు ఫిల్టర్ వాటర్. ఉత్తప్పుడు దాహమేస్తే మినరల్ వాటర్. జస్ట్ ఫర్ కన్వీనియన్స్. అంతే’’ నవ్విందామె.
ట్రాలీ తోసుకుంటూ ఆ మనిషి వెళ్లిపోయాడు.
‘‘ఈ పద్ధతి బాగుంది. నేనూ ఫాలో ఔతాను’’ అన్నాను మర్యాదకి.
ఆమె చిన్నగా నవ్వి, ‘‘విషయానికి వస్తాను. నా కథలో - నావాళ్లకి కూడా తెలియని రహస్యాలున్నాయి. అవి కూడా మీకు చెబుతాను...’’ అందామె...
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/7W4Ay34xNs0
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కర్తవ్యం - ఎపిసోడ్ 3
రచన: వెదురుమూడి రామారావు
వెదురుమూడి రామారావు గారి సంక్షిప్త ధారావాహిక కర్తవ్యం మూడవ భాగం
గత ఎపిసోడ్ లో
మనోహర్, సుధలతో కలిసి షాపింగ్ కి బయలుదేరుతారు విశ్వనాథం దంపతులు.
అక్కడ వారిద్దరినీ కలపడానికి చాల ప్రయత్నాలు చేస్తారు.
పిల్లలిద్దరూ కలిసి బోట్ షికార్ చేసేలా ప్లాన్ చేస్తారు.
ఇక కర్తవ్యం మూడవ భాగం చదవండి.
ఇదేకదా కావలసింది. ఇది మూడవ స్టెప్. ట్రిప్ ముగిసిన తరువాత సంతోషంగా అందరూ మద్రాస్ కేఫ్ వైపు దృష్టి మళ్లించారు. మంచి సౌత్ ఇండియన్ భోజనం ముగించారు. ఇంటికి బయలు దేరే వేళకి అందరు ప్రసన్నంగా వున్నారు. ఇదే సమయం అని విశ్వనాథం గారు మరో ప్రస్తావన తెచ్చారు.
"ఇది మంచి సీజన్. మనం కులు, మనాలి, రోతహంగ్ పాస్ కి వెళ్ళితే చాలా ఎంజాయ్ చెయ్యచ్చు. మేం ఇద్దరం ఎప్పటినించో వెళదాం అని ప్రయత్నించాం. కుదర లేదు. మాకు సాయంగా ఎవరైనా ఉంటే బాగుంటుంది అని ఆగి పోయాం. ఎటూ ఇప్పుడు శలవలే కదా . మీరు కూడా ఎప్పుడు చూడ లేదు కదా ఈ ప్రదేశాలు అన్నీ. కోర్ట్ కి ఇంకా టైం వుంది. అంచేత మీరు మాకు సాయంగా వస్తే చాలా బాగుంటుంది. అరెంజ్మేట్స్ అన్నీ నేను చేస్తాను. నిజంగా జన్మలో మరచి పోలేని ట్రిప్ ఇది. వస్తారు కదా. అలోచించి రేపు చెప్పండి.” అన్నారు. ఒక్క సారి ఈ ప్రతిపాదన వచ్చే సరికి వాళ్లకి ఏం చెప్పాలో తెలియ లేదు. ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చోండి పోయారు.
మనసులో ఆ సాటిలేని ప్రదేశాల మీద ఊహలకి అందని వివరణలు విన్నారు. మంచి ప్రతిపాదనే. కానీ మౌనంగానే వున్నారు ఇద్దరూ.
పరిస్థితి తేలిక చెయ్యడానికి విశ్వనాథం గారు "రాత్రి అంతా బాగా ఆలోచించి రేపు మీ నిర్ణయం చెప్పండి. ఇన్నాళ్లూ మాకు తోడు లేక ఇద్దరమే వెళ్ళ లేక మానేస్తున్నాం. మీరిద్దరూ మాకు సాయం అని అడిగాను” అని, అక్కడ వదిలేశారు.
వాళ్లకి తెలుసు నిర్ణయం ఏంటో. వాళ్ళను కలపడానికి మరొక ప్రయత్నం ఇది. చిన్న దంపతులు ఇద్దరు రాత్రంతా ఆ విషయం మీద మాట్లాడుకుని వెళ్ళడానికే నిర్ణయించుకున్నారు. చాలా కాలం తరువాత వాళ్ళు మాట్లాడుకున్న సందర్భం ఇదే. ఇద్దరు రాజీ పడి ‘కులు మనాలి’ ట్రిప్ కి వెళ్ళడానికి సిద్ధమైయ్యారు.
కారు ఢిల్లీ సిటీ లిమిట్స్ దాటి హర్యానా లోంచి దూసుకు పోతోంది. ఆ రెండు జంటలు చాలా ఉత్సాహంగా వున్నారు. కొంత దూరం తర్వాత డ్రైవింగ్ సీట్స్ మార్చుకోవాలి అని నిర్ణయించుకొన్నారు. మొత్తం సుమారు 650 కిలోమీటర్స్ దూరం. దాదాపు 14 నించి 15 గంటలు ప్రయాణం. దారిలో చాలా ప్రసిద్ధి గాంచిన స్థలాలు వున్నాయి.ఎక్కడ పడితే అక్కడ టిఫన్ కి కాఫీ కి బోల్డన్ని డాబాలు. మొత్తము మీద ప్రయాణం చాలా ఆసక్తికరంగానే వుంది.
‘పానిపట్టు’ దగ్గర ఒక రెస్టౌరెంట్ లో మంచి పరోటాలు పెరుగు తో బ్రేక్ఫాస్ట్ కానిచ్చి కొంచం రెస్ట్ తీసుకొన్నారు. అక్కడి చారిత్రాత్మికమైన విషయాలు మళ్ళా మననం చేసుకొని ముందుకు బయలుదేరారు. విశ్వనాథo దంపతులు వెనక సీట్లో కి మారి కొంచం విశ్రాంతిగా స్థిరపడ్డారు..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/WUudJreSBxI
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
సైనైడ్ - ఎపిసోడ్ 5
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ధారావాహిక 'సైనైడ్' ఐదవ భాగం
గత ఎపిసోడ్ లో
హత్య చేయబడిన శేఖర్ కంప్యూటర్ మేధావి.
అతను డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఆర్మీలోనూ, నేవీలోనూ, ఎయిర్ ఫోర్స్ లోనూ వాడుతున్నారు.
అతనికి పాత స్నేహితుడు ఏ - వన్ తో పరిచయం పెరుగుతుంది.
అతని ద్వారా బి - వన్ అనే యువతి పరిచయమవుతుంది.
ఆమె అతన్ని ఆకర్షిస్తుంది.
ఇక సైనైడ్ ఐదవ భాగం చదవండి.
ఒకరోజు బి - వన్ ఫోన్ చేసి తన తియ్యని మాటలతో, “శేఖర్! ఈ జీవితంలో అనుకోని అదృష్టం వచ్చింది, మీ డిపార్ట్మెంట్ లోని సాఫ్ట్వేర్, ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ లో డెవలప్మెంట్ అప్డేట్ చేస్తున్న కంపెనీలు 'eastern naval command,(navalbase),Hpcl,Indian Air force, Atomic reserch centres, Artillery departments.
'DRDO', ఇలాంటి వాటికి, భారతదేశపు రక్షణ వ్యవస్థకు అంత మంచి సాఫ్ట్వేర్ ఇచ్చి, దిగ్విజయంగా నడిపిస్తుంది, దాన్లో 'DRDO' ఎంతో ఎక్కువ టెక్నాలజీ తో డెవలప్ చేసిన 'ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ missiles' కూడా 'లాంగ్ రేంజ్ ఫైరింగ్' లో మీ 'కంప్యూటర్ టెక్నాలజీతో' బాగా అభివృద్ధి చెందింది.
కనుక నువ్వు ఈ అన్ని డిపార్ట్మెంట్ల కి వెళుతూ, సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తూ చాలా బిజీగా ఉన్నావు! అదే టైంలో లో నువ్వు చేసిన ప్రోగ్రామింగ్, వాటి సమర్ధత, నువ్వు చేసే విధానం.. నాకు గాని ఇవ్వగలిగితే, నేను కూడా మరో 'రెండు దేశాలకు ఆ టెక్నాలజీ ఇస్తాను. భారతదేశంలో లాగే వారు కూడా అభివృద్ధి చెందుతారు. ఇందులో దేశద్రోహం ఏమీ లేదు. జస్ట్ నాకు నువ్వు ఎలా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అప్ డేట్స్ చేస్తావో, ఆ విషయాలు నాకు అందజేస్తే, నేను ఆ దేశాలకి అదేవిధంగా తయారు చేసి ఇస్తాను.
దానివల్ల మనకు ఆఫర్ చేసిన మొత్తం 100 కోట్లు. ఇలాంటి అవకాశం మరి ఎప్పుడూ, ఎక్కడా రాదు! నువ్వు ఆ సాఫ్ట్వేర్ డీటెయిల్స్ అన్నీ నాకు పంపించి, ఆ తర్వాత నీ భార్యకు విడాకులు ఇచ్చి, కెనడాకు వచ్చేయి. నువ్వు రాగానే మనం పెళ్లి చేసుకుని, ఆ డీటెయిల్స్ తో ప్రాజెక్ట్ తయారుచేసి, ఆ దేశాలకు ఇస్తే ముందుగా మనకు 50 కోట్లు ఇస్తారు.
ఆ తర్వాత మరో 50 కోట్లు ఆ ప్రోగ్రామ్స్ ని వాళ్ల దేశాలలో మనం ఇన్స్టాల్ చేసి, సక్సెస్ ఫుల్ గా నడిపిస్తే ఇస్తారు. ఈ డబ్బు మనకు జీవితంలో కూర్చొని తిన్నా, పది తరాలకు సరిపోతుంది. కనుక బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో!
ముందు నువ్వు వైజాగ్ లో ఉన్న naval base, HPCL లో ఉన్న 'కంప్యూటర్ సాఫ్ట్వేర్ 'ఎలా పనిచేస్తుంది?, నేవల్ బేస్ లో ఎన్ని వార్ షిప్స్ ఉన్నాయి,? అందులోనే ‘న్యూక్లియర్ submarines’ ఎన్ని ఉన్నాయి? వాటి కెపాసిటీ, ఒకవేళ యుద్ధం వస్తే ఎన్ని రకాల ‘Torpedos’ (నీటిలో ప్రయోగించే యుద్ధ బాంబులు) వాడతారు? అలాగే మొత్తం 'అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్' కూడా కావాలి...
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/5D2K6Z8-SwA
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కన్నమ్మ
రచన : M R V సత్యనారాయణ మూర్తి
పెనుగొండలో లింగాలవీధి లో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఒక పెద్ద నుయ్యి ఉంది. దాని వెనుకే ఓ పది ఇళ్ళు ఉన్నాయి. ఎనిమిది పాకలు, రెండు పెంకుటిళ్ళు. వాటికి పక్కనే గున్నయ్య మాస్టారి బడి ఉంది. అది మాస్టారు కన్యకాపరమేశ్వరి అమ్మవారి పేరు మీద నడుపుతున్న ప్రాథమిక పాఠశాల.
కొన్ని ఏళ్ళ క్రితం శ్రీకాకుళం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన కొన్ని కుటుంబాలు ఉంటున్నాయి అక్కడ.
తెల్లారిలేస్తే ఆ పది కుటుంబాలవారు ఆ నూతి దగ్గర సందడి చేస్తూ ఉంటారు. కొందరు నూతి లోంచి నీళ్ళు బకెట్లతో తోడుకుంటూ ఉంటారు. మరి కొందరు తమ పిల్లలకి అక్కడే స్నానాలు చేయిస్తూ ఉంటారు. కన్నమ్మ అక్కడకు రాగానే పిల్లలు అందరూ గోల గోలగా అరుస్తారు, తమకి స్నానం చేయించమని.
ఎందుకంటే కన్నమ్మ చిన్న పిల్లలకు స్నానం చేయించడంలో ఎక్సుపర్టు. చిన్నగా నవ్వుతూ అక్కడ ఉన్న పిల్లలకు ఎంతో ఓపికగా స్నానాలు చేయిస్తుంది కన్నమ్మ. ఆ పని అయ్యాకే తను మంచినీళ్ళు తోడుకుని ఇంటికి పట్టుకెల్తుంది.
కన్నమ్మ భర్త దుర్గారావు దుబాయిలో ఉంటాడు. అక్కడ తాపీ పని చేస్తున్నాడు. రెండేళ్ళకో, మూడేళ్ళకో ఒకసారి పెనుగొండ వచ్చి నెలరోజులు ఉండి వెళ్తాడు. పన్నెండేళ్ళ వారి వైవాహిక జీవితానికి గుర్తుగాముగ్గురు పిల్లలు కలిగారు. కన్నమ్మ, భర్త కన్నా రెండు అంగుళాలు పొడుగు ఉంటుంది.
దుర్గారావు తల్లి సింహాచలం ‘కోడలు పొడుగ్గా వుంటే నువ్వు పొట్టి బుడంకాయలా ఉంటావు. ఈ సంబంధం వద్దు’ అని చెప్పినా, అందంగా తెల్లగా ఉన్న కన్నమ్మని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాడు దుర్గారావు.
తమకు పుట్టబోయే పిల్లలు పొడుగ్గా, అందంగా ఉంటారని అతని ఆశ. అతని ఆశ నిరాశ కాలేదు. వాళ్లకి కలిగిన ముగ్గురు పిల్లలకీ కన్నమ్మ రంగే వచ్చింది, కను ముక్కూ తీరు బాగుంటుంది.
భర్త దుబాయి నుండి పంపిన డబ్బు జాగ్రత్తగా దాచి, ఈ మధ్యనే రెండెకరాలు పొలం కొంది కన్నమ్మ. ఒక పాలేరుని పెట్టుకుని తనే స్వంతంగా వ్యవసాయం చేస్తోంది. ఇంటి దగ్గరే ఒక గేదెని మేపుతూ పాలు కూడా అమ్ముతుంది. తమ పది కుటుంబాల వారికే కాకుండా, ఎవరికీ ఏ సాయం కావాల్సి వచ్చినా చేస్తుంది కన్నమ్మ...
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/FZNFAITx_cQ
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ఇచ్చినమ్మా వాయనం
శ్రీనివాసరావు జీడిగుంట
ఏమిటో మా వైపు నలుగురు, మీ వైపు ఆరుగురు అన్నదమ్ములు వున్నా, ఒక్కపూట ఆదరించి భోజనం పెట్టే వాళ్ళు లేరు. మా తమ్ముడు వాళ్ళు పిలిచినా, వాళ్ల వంటలు బాగుండవని రారు, మీ వాళ్ళు పిలవరు, రోజూ ఏమి వండాలి అని అడగటం, మీ కిష్టమైంది వండటం, విసుగెత్తిపోతోంది ఈజీవితం అంటూ గోనుగుకుంటున్నట్టు కొద్దిగా పెద్దగానే అంటోంది సుకుమార్ భార్య సీత.
చూడు, ఎవ్వరి పనిలో వాళ్ళు వుంటారు. పూర్వం లాగా ఆప్యాయతలు లేవు. తమ గొప్ప చూపించుకోవడానికి పెళ్లిళ్ళకి పిలుస్తున్నారు, అనవసరంగా బాధపడక, ఆ దరిద్రపు గోరుచిక్కుడు కాయలు వండక, ఈ రోజు బంగాళాదుంప ఉల్లికారం, చల్లపులుసు వండు. నేను స్నానం చేసి వచ్చి పప్పులోకి నాలుగు చల్లమిరపకాయలు వేయించుకుంటానులే అన్నాడు సుకుమార్.
మొగుడు వంక అదో రకంగా చూసి, ఈ గోరుచిక్కుడు కాయలు ఎవరు తెమ్మన్నారు, మీకు యిష్టం లేకపోతే. తెచ్చి పడేస్తే గోళ్లు ఊడేడట్లు వలవడం, నేనే తినడం. మీకు మాత్రం రుచులు కావాలి అరవై దాటినా అంది సీత.
వంటింటి మహారాణివి, నీకు కావలిసినవి వండుకుంటే నేను కాదన్నానా అన్నాడు నవ్వుతు సుకుమార్.
మీకే ఎంతసేపైనా మాట్లడుతూ కూర్చుంటారు. వండలేక నేను చావాలి. ముందు ఆ బుట్టలోనుంచి నాలుగు పెద్ద బంగాళాదుంపలు అందివ్వండి, లేవలేను నడుములాగేస్తోంది అంది సీత.
యింకా నయం నడుము నొప్పి రాత్రి నుంచి అనలేదు, ఎవరైనా వింటే నన్ను హేళన చేసేవాళ్ళు అన్నాడు చిలిపిగా నవ్వుతూ...
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/exOtuMy859I
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
వీరి మధ్యన... ఎపిసోడ్ 5
రచన: బివిడి ప్రసాదరావు
బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' ఐదవ భాగం
గత ఎపిసోడ్ లో…
సాహసికి ట్రాన్స్ఫర్ అయ్యే బ్రాంచ్ కి దగ్గర్లో ఇల్లు తీసుకొని ఉంటామని తల్లిదండ్రులతో చెబుతాడు సామ్రాట్.
మనం మాత్రం ఇక్కడే ఉందామని భర్తతో చెబుతుంది మాలతి.
తనకు బదులుగా సామ్రాట్ కి ఎదురుపడమని జలజని కోరుతుంది జ్వాల.
ఇక వీరి మధ్యన.. ఐదవ భాగం చదవండి...
"చూశావా, అదీ మంచితనం అంటే." అనేశాడు మోహనరావు.
శైలజ ఏమీ అనలేదు.
కొద్ది సేపు పిమ్మట, "మనం ఆ కొత్తింటికి సరంజామా అమర్చవలసి ఉంటుంది." శైలజే అంది.
"కాదా మరి. సొంతిల్లు ఐనా, అమ్మాయి వెంట అట్టివి పెట్టాలిగా." అన్నాడు మోహనరావు.
"లేదు లేదు. వాళ్ల మధ్య ఆ మాటలూ జరిగాయట. సామ్రాట్ చెప్పాడు. అట్టి వేమీ మన నుండి వాళ్లు వద్దు అన్నారట." చెప్పింది సాహసి.
"అది వాళ్ల పెద్ద మనసు. అలా కుదరదుగా. మన తృప్తి మేరకు మనం అట్టి వాటిని కానిచ్చేయాలి." చెప్పాడు మోహనరావు.
శైలజ ఏమీ అనలేదు.
"లేదు లేదు. సామ్రాట్, నేను మాట్లాడుకున్నాం. ఆ కొత్త ఇంటికి కావలసినవి, మా ఇద్దరం సమకూర్చి పెట్టుకుంటాం. ఇంత వరకు కూడిన మా శాలరీల నిల్వల నుండి కొంత కొంత చొప్పున వినియోగించుకోవాలనుకున్నాం. సో, నో ప్రోబ్లమ్స్, నో పార్మాలిటీస్." చెప్పింది సాహసి.
"అది కాదురా.." అంటున్న మోహనరావుకు అడ్డై -
"ప్లీజ్. మీ పెద్దలు మాకు అడ్డవ్వకండి. మాకు స్వేచ్ఛ ఇవ్వండి. సామ్రాట్ అన్నట్టు మేము చేపట్టబోయేవి మీకు తెలియచేస్తుంటాం, సరి కానివి చెప్పి సరి దిద్దండి. చాలు." అనేసింది సాహసి.
ఆ భార్యాభర్తలు మొహాలు చూసుకున్నారు.
"నేను తయారవుతాను." అంటూ లేచింది సాహసి. టీపాయ్ మీద ఖాళీ కాఫీ కప్పులతో ఉన్న ట్రేని తీసుకొని కదిలింది.
ఆ తల్లిదండ్రులు కూతురునే చూస్తున్నారు.
***
శనివారం రాత్రి - సామ్రాట్ ఫోన్ మోగింది. అతడు తన గదిలో ఉన్నాడు. లాప్టాప్ టేబుల్ మీది ఫోన్ ని తీసుకొని, స్క్రీన్ మీదికి చూశాడు. కొత్త నెంబర్. టైం చూసుకున్నాడు. పది రెండు నిముషాలు. వెంటనే జ్వాల అతడికి గుర్తుకు వచ్చింది.
కాల్ కలిపి, "ఏం. ఇన్నాళ్లు ఆగావ్. ఒప్పందంలో ఓడిపోతానన్న భయమా." అడిగాడు.
"చాల్లే. నాకు వేరే పనులు ఉండవా ఏం. ఇప్పటికైనా కాల్ చేశాను. సంతోషించు. నా దారికి రాకపోతే ఇక తగ్గేదేలే. రోజూ నీకు వాయింపే." అంది జ్వాల.
"అదేం లేదు. నీ నుండి ఫోన్ రాకపోవడమే నాకు హేఫీ ఐంది." చెప్పాడు సామ్రాట్.
"అబ్బ. అచ్ఛా. ఆ. తెలుస్తుందిగా. రింగ్ కాగానే టక్కున నా కాల్ కి వచ్చేశావు. చాల్లే మరి." అంది జ్వాల.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/drHEp_uvZ08
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
పని-మని-షీ
రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
అబ్బబ్బా చస్తున్నాను పని చెయ్యలేక! ఒక్కరు కూడా ఇటున్న పుల్ల అటు పెట్టేవాళ్ళులేరు, అంతా తిని కూర్చునేవాళ్ళే. ఏమిటో ఈ చాకిరి.. హాయిగా పెద్ద చదువులు చదువుకుంటేనన్నా ఉద్యోగం చేసుకుంటుండేదాన్ని. ఈ అడవచాకిరి తప్పేది”.. గట్టిగా అంటూనే కడిగిన గిన్నెలను పెద్దచప్పుడు వచ్చేటట్టు బుట్టలో వేస్తోంది అరుణ.
“ అరుణా.. కాస్తా టీ ఇస్తావా!” హల్లోనుండే కేక వేసాడు చైతన్య.
“ ఆహా… ఏది తప్పినా ఇది మాత్రం తప్పరు తమరు. ఎంతపనిలో ఉన్నా అడిగిందే తడవుకావాలి. పాపం
పనిలో ఉన్నట్టుందే.. కాస్తా సహాయం చేసినట్టుంటింది అని టీ పెట్టుకొని నా మొహానా ఇంతపొద్దామే అనే ఆలోచననే రాదు ఈ మనిషికి”.
గొణుస్తూనే రుసరుసలాడుతూ టీ తీసుకొచ్చి భర్త చేతికిస్తూ అక్కడే ఉన్న కూర్చిలో కూర్చుంది అరుణ.
“ అరే.. ఏమైందిరా? ఎందుకంత కోపంగా ఉన్నావు? తలనొప్పిగా ఉందా.. టాబ్లెట్ వేసుకున్నావా.. ” కంప్యూటర్ లో నుండి తల ఎత్తకుండానే అడిగాడు.
“ అవును. నాకేం పనిపాటలేదుగా! ఎప్పుడు కోపంగానే ఉంటాను మరీ, మీకంటే బోలెడు పనులాయే, ” ముక్కు ఎగబీలుస్తూ.
“ అరుణ…. అసలేమయిందో చెప్పకుండా ఈ వ్యంగ్యాలేంటో అర్ధంకాలేదు, ఏమైందో చెప్పురా
నీ బాధేంటో, ” కంప్యూటర్ పక్కన పెట్టి అరుణ దగ్గరకు వచ్చి అరుణ చుబుకం పట్టుకుని
అడిగాడు.
“ అదికాదండి… పని చేసుకోలేక చస్తున్నాను, ఒక్కపనిమనిషి దొరికిచావడం లేదు, మీ అమ్మానాన్నలకు సకలం అందించాలి, ఒంటినిండా బీపిలు షుగర్లు అందుకోసమని, రెండుగంటలకోసారి వాళ్ళకు ఏదో ఒకటి అందిస్తూనే ఉండాలి, కరోనా కాలం వచ్చినప్పటినుండి మీరు ఇంటినుండే పని చేస్తున్నా, హాడావుడి తగ్గుతుందనుకున్నా ఇంకా ఎక్కువే అయింది, మాటిమాటికి టీ అంటారు తినడానికి ఏదో అడుగుతూనే ఉంటారు, ఇక పిల్లలైతే రోజుకో వెరైటి చేస్తే తప్పా టిఫిన్ బాక్స్ లు తీసుకపోరు, ఇంటికి వచ్చాక ఇంకోరకం చేయ్యాలి, ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే గంపెడు గంపెడు గిన్నెలు అవుతున్నాయి, పొద్దుకు పదిసార్లు కడుగుతున్నా సరిపోవడంలేదు, నేను చెయ్యలేనండి మీరు ఏం చేస్తారో ఏంటో నాకు అర్జంటుగా పని
మనిషిని తీసుకరండి, లేదంటే ఎవ్వరి పనులు వాళ్ళుచేసుకోండి, ” చేతులుతిప్పుతూ చెప్పింది అరుణ ఆయాసపడుతూ.
“ సరే నీకు కావలసింది పనిమనిషి అంతేకదా ! నా స్నేహితులను అడుగుతాను, నీకు తెలిసిన వాళ్లింట్లో
పనిమనుషులు ఉండరా వాళ్ళను అడిగి మాట్లాడుకోవచ్చు కదా అరుణ, డబ్బులగురించి ఆలోచిస్తున్నావా ? బయటకు వెళితే ఎంతమంది కనిపిస్తారు పనివాళ్ళు, ఎవరినో ఒకరిని మాట్లాడుకో నీకు ఇబ్బంది తగ్గుతుంది, ” చెప్పాడు చైతన్య
“ అయ్యో రామా… రామాయణం అంతా విని రాముడికి సీతేం కావాలి అన్నట్టుంది మీ తీరు, ”
కాలింగ్ బెల్ మ్రోగడంతో మాట్లాడుతున్నదల్లా ఆపింది. వెళ్ళి తలుపుతీసాడు ఎదురుగా ముప్పై
ఏళ్ళుంటాయేమో ఒకావిడ నిలబడి ఉంది. చూడడానికి బాగుంది జార్జెట్ చీరకట్టింది. జుట్టుకు
రబ్బర్ బ్యాండ్ పెట్టి జుట్టువదిలేసింది...
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/4tEnJc1du6c
From the publisher's feed