Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • నీలో నువ్వే | Nilo Nuvve | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    నీలో నువ్వే

    రచన: కిడాల శివకృష్ణ

    ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో  బాధపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో......................

    అయితే నిత్య చర్చనీయ అంశాలకు చక్కని పరిష్కారాన్ని చూపేది ఒక్క మిత్రుడు మాత్రమే, ఎందుకంటే మిత్రుని దగ్గరే మనం కొంత చనువుగా ఉంటాము, అన్ని విషయాలను చర్చిస్తూ ఉంటాము, అటువంటి సమయంలోనే మన సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అదెలాగో మనం తెలుసుకుందాం....!!!!

    శివ

    సురేష్

    వినయ్

    సుంకన్న

    దశరథ

    ఈ ఐదుగురు ఒకే కళాశాలలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అంతే కాకుండా ఒకే గదిలోనే అద్దెకు కూడా కలిసి ఉండటం విశేషం. మొదట వీరి పరిచయం ఎలా జరిగినా  ఒకరంటే ఒకరికి గౌరవం, అభిమానం. ఇంతలా స్నేహాన్ని పెంచుకున్న వారి మధ్య కొన్ని అంశాలు చర్చలోకి వస్తుంటాయి. ఇలా వచ్చినపుడు అన్ని సమస్యలకూ  పరిష్కారం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది, ఎందుకంటే ఐదు మంది ఉన్నారు కాబట్టి ఎవ్వరికో  ఒకరికి అయినా సరైన సమాధానం ఆలోచనా రూపంలో వస్తుంది కదా....!!!! మరి ఆ సరైన ఆలోచనను అందరూ తప్పకుండా పాటిస్తారు, నిజమంటారా కాదంటారా??

    ఆ విధంగానే ఒక రోజు శివ ఒక సమస్యాత్మక  సందేహాన్ని  చర్చనీయాంశంగా తీసుకువచ్చాడు. ఆ విషయం ఏమిటి అంటే ‘సంతోషం ఎందులో ఉంది’ అనీ…

    ప్రతి ఒక్కరినీ అడుగుతూ చర్చిస్తూ ఉన్నాడు. అలా వారి గదిలో ఉండే మిగిలిన మిత్రుల దగ్గరకు తీసుకువచ్చాడు. గదిలోకి వచ్చి “సంతోషం ఎందులో ఉందో నేను తెలుసు కోవాలి అనుకుంటున్నాను. మీరు నాకు సమాధానం చెప్పాలి” అన్నాడు శివ.

    “నాకు తెలిసినంతవరకూ డబ్బు ఉంటే సంతోషం అదే  ఎగురుతూ వస్తుంది. ఎందుకంటే అన్ని సమస్యలను తీరుస్తుంది. అన్ని కొరికలని కూడా తీర్చుకోవచ్చు కదా” అన్నాడు సురేష్.

    “అదేం కాదురా! నీకు ఒక అమ్మాయి ప్రేమ దొరికింది అంటే చాలా సంతోషంగా ఉంటావు” అన్నాడు వినయ్.

    “లేదు లేదు… నీకు చాలా మంచి  కుటుంబం ఉంది అంటేనే అదృష్ట వంతుడు అవుతావు. నిత్యం సంతోషంగా ఉంటావు” అన్నాడు సుంకన్న.

    ఇవన్నీ విన్న శివ “ఏం దశరథా.. ఏమీ మాట్లాడకుండగా ఉన్నావు. నువ్వైనా చెప్పచ్చు కదరా ఏది సంతోషమో” అన్నాడు.

    అపుడు మిగిలిన  స్నేహితులు “మేము చెప్పింది అబద్ధం అనుకున్నావా రా..!! మళ్ళీ వాణ్ణి అలా అడుగుతున్నావ్?” అన్నారు...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/NzEZ_wiQGR0

    6 min
  • కాకతి రుద్రమ ఎపిసోడ్ 19 | Kakathi Rudrama Episode 19 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    కాకతి రుద్రమ ఎపిసోడ్ 19

    రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 19 వ భాగం

    గత ఎపిసోడ్ లో…

    శివదేవయ్యామాత్యులు,  చాళుక్య వీరభద్ర ప్రభువును కలుస్తాడు.

    రుద్రమదేవితో  అతని వివాహానికి గణపతి దేవులు విధించిన షరతులు వివరిస్తాడు.

    అన్నిటికీ అంగీకరిస్తాడు చాళుక్య వీరభద్రుడు.

    గణపతిరుద్రదేవ చక్రవర్తులు శివ సాయుజ్యం పొందుతారు.

    రాజ్యంలో తిరుగుబాట్లు జరగకుండా తగిన ఏర్పాట్లు చేస్తారు రుద్రమదేవి , శివదేవయ్య.

    ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 19 చదవండి..

    -----------------------------------------------------------------------

    " రామప్ప ఆలయం- మన వారసత్వ వైభవము"

    --------------------------------------------

    భారతావనిలో ఆలయాలు నిర్మించని రాజులు లేరంటే అతిశయోక్తి కాదు. చిన్నా, చితకా రాజులే ఆలయాలు నిర్మిస్తుంటే కాకతీయుల్లాంటి చక్రవర్తులు ఊరుకుంటారా!

    అసలు ఆలయ నిర్మాణశైలిని ప్రపంచానికిచ్చారు.

    కాకతీయుల శిల్పకళాచాతుర్యానికి పరాకాష్ట అని చెప్పదగ్గ నిర్మాణం 'రామప్ప ఆలయం'.  ఇక్కడున్న ప్రతిశిల్పం ఓ సజీవమూర్తిగానే తోస్తుంది చూపరులకి అందుకే.... ఎనిమిది వందల ఏళ్ళక్రిందట ఈ ఆలయాన్ని చూసిన ప్రఖ్యాత యాత్రికుడు మార్కొపోలో 'ఆలయాలనే నక్షత్రరాశిలో ..............ఇదో  వేగు. చుక్క!' అని రాశాడు.

    అంతగా ఏముంది ఇందులో అంటే..................

    మిగతా గుడుల్లాగా రామప్ప ఆలయం కేవలం భక్తి కోసం నిర్మంచింది కాదు.....దీని

    నిర్మాణం వెనక గొప్ప కళానురక్తి ఉంది.

    ఓ రకంగా చెప్పాలంటే నాట్యరీతుల్ని భావితరాలకోసం నిక్షిప్తం చేయాలనే తలంపుతో, ఆలోచనలతో కట్టిన ఆలయం ఇది.కాకతీయ గజసేనాధిపతి జాయప రాసిన ' నృత్తరత్నావళి' అనే గ్రంథానికి ఈ ఆలయం ఓ శిల్పరూపం.

    ఇప్పుడైతే ఎవరైనా ఏదైనా పుస్తకం ఇస్తే దాన్ని ఆడియో రూపంలోనో, డిజిటల్‌

    రూపంలోనో పదిలం చేస్తున్నారు.ఆ కాలంలో అవన్నీ లేవు కదా! అందుకే .....ఆ

    పుస్తకం కోసం ఇలా ఓ ఆలయాన్ని    నిర్మించి       శాశ్వతం చేశారు.

    అందుకే ఈ గుడిని ' నృత్తరత్నావళి' అన్న గ్రంథానికి ' లక్షిత'( Refrence)

    ఆలయం అంటున్నారు పరిశోదకులు.మనదేశంలో ఇలాంటి ఆలయం ఇంకొకటి

    కనిపించదు.అందుకే ఈ ఆలయం అడుగడుగునా నాట్యభంగిమలే కనిపిస్తాయి.

    ముఖ్యంగా ఇక్కడి శివతాండవ శిల్పాలను చూడడానికి రెండు కళ్ళూ చాలవు.24

    గంటలూ సరిపోవు.


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/IDsMEQkeoXI


    14 min
  • హేమంతం | Hemantham | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    హేమంతం

    రచన: యశోద పులుగుర్త

    'ఈ నాడు' దినపత్రికలోని ఒక వార్తను చూడగానే రామకృష్ణ దృష్టి అక్కడే ఆగిపోయింది.

    వైజాగ్ లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక ఇరవై సంవత్సరాలు నిండిన అమ్మాయి తన ప్రేమికుడు రోడ్ ప్రమాదంలో చనిపోయాడన్న వార్త విని తట్టుకోలేక ఫేన్ కి ఉరివేసుకుని చనిపోయిందట. ఈ వార్తవిన్న ఆమె తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా కుమార్తె మరణంపై విలపిస్తున్నారని ఆ వార్త సారాంశం..

    ఇటువంటి వార్తలు రోజూ ఎన్నో చదువుతున్నా టి.వి.లో చూస్తున్నా, ఎంతో భవిష్యత్ ఉన్న ఒక చిన్న అమ్మాయి అనాలోచితంగా తీసుకున్న నిర్ణయానికి ఆవేదనతోబాటూ ఒకలాంటి కోపంతో  ‘ప్రేమిస్తే మటుకు ఇటువంటి ప్రాణత్యాగం చేయలా’ అనుకుంటూ అక్కడే ఉన్న భార్యతో "విన్నావా హేమా" అంటూ మొత్తం విషయాన్ని చెపుతూ “ప్రేమ ను ప్రాక్టికల్ గా తీసుకుంటున్న ఈరోజుల్లోకూడా ఆ అమ్మాయి అనాలోచిత నిర్ణయం తొందరబాటు కాదా" అన్నాడు.

    హేమంత ఉలిక్కి పడుతూ మౌనం వహించింది.

    "ఏం మాట్లాడవే హేమా?”

    "ఏం మాట్లాడాలి ? చాలామందికి అనాలోచితం అనిపించవచ్చు. కానీ ఆ అమ్మాయికి అదే న్యాయమైనదిగా అనిపించవచ్చు. ఆ ప్రేమ విలువ ఏమిటో అనుభవించిన వారికి మాత్రమే తెలిసినంతంగా బయట వాళ్లకు అర్ధం కాకపోవచ్చేమో కృష్ణా”.

    "నీ ముఖం, ప్రేమించుకుని నీవు లేనిదే నేను జీవించ లేనంటూ చెట్టాపట్టాలేసుకుని పెళ్లి చేసుకుంటున్న జంటలు పెళ్లైన కొద్ది నెలలకే ఎందుకు విడిపోతున్నారు? నా దృష్టిలో ప్రేమించుకోవడం ఒక ఫాషన్ అంటాను. నాకు ఈ ప్రేమలు, త్యాగాలు పట్ల నమ్మకంలేదు హేమా!”

    భర్త మాటలకు సమాధానమివ్వకుండా వంటింట్లోకి వెళ్లిపోయింది హేమంత.

    రామకృష్ణ హేమంతను ఒక పెళ్లిలో చూసి ఇష్టపడి తల్లితండ్రులతో ఆ అమ్మాయినే చేసుకుంటానని చెప్పి ఇరువైపుల పెద్దల అంగీకారంతో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నాడు. ఎవరైనా స్నేహితులు సరదాగా నీది ప్రేమవివాహమే కదా అంటే నాకు ప్రేమపట్ల నమ్మకంలేదు, కాని హేమంతను చూసి ఇష్టపడి ఈ అమ్మాయిని చేసుకుంటే నా జీవితం బాగుంటుందనిపించి పెళ్లిచేసుకున్నాక ప్రేమించడం మొదలు పెట్టానంటాడు...


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/fWdmu_l3Wbo

    13 min
  • అగమ్యం | Agamyam | Telugu short Story | Allu Sairam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    అగమ్యం

    రచన: అల్లు సాయిరాం

    ప్రసాదరావు రోజులాగే తన ఆఫీసు పనులు తొందరగా ముగించుకొని, ఐదుగంటలకి బ్యాగులో  లంచ్ బాక్స్ సర్దుకొని, ఆఫీస్ నుండి గబగబా బొబ్బిలి రైల్వేస్టేషన్ కి బయల్దేరాడు. స్టేషన్ కి చేరుకునేసరికి తను వెళ్ళాల్సిన ఎక్స్ప్రెస్ ట్రైన్ కదిలిపోతుంటే, పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కేశాడు ప్రసాదరావు. నీళ్లుతాగి ఆయాసం తీర్చుకున్నాక, కోచ్ లోపల చూస్తే ప్రయాణికులతో నిండిపోయింది. పక్క సీట్లో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్న రాహుల్ కొంచెం సీటు  ఎడ్జస్ట్ చేసుకోని ఆయాసపడుతున్న ప్రసాదరావుని చూసి కూర్చోమన్నాడు. ప్రసాదరావు సర్దుకుని కూర్చున్నాడు.

    "ఎంతవరకండీ?" అని రాహూల్ అడిగాడు.

    ప్రసాదరావు గొంతు సవరించుకుని "పార్వతీపురం వరకు!" అని చెప్పాడు.

    "మేం పార్వతీపురమేనండీ! ట్రైన్ టైం కి కొంచెం ముందు వస్తే బాగుణ్ణు కదండీ!" అని చెప్పాడు రాహుల్.  ఎదురుగా మూడేళ్ల కొడుకు చింటూతో కూర్చున్న రాహుల్ భార్య శరణ్య లాప్-టాప్ లో తన పనిచేసుకుంటూ, వాళ్ళిద్దరి మాటలువింటుంది.

    ప్రసాదరావు కిందపడిన న్యూస్ పేపర్ అందుకుంటూ "నేను రోజూ ఈ బండిలో వెళ్లివస్తుంటాను. రోజు కరెక్ట్ గా వచ్చేస్తాను.  ఈరోజే కొంచెం లేటయింది" అని చెప్తూ పేపర్ చదువుతున్నాడు.

    "గరమ్. గరమ్ సమోసాలే. 10 రుపాయిలకి 4 సమోసాలు" అంటూ  సమోసాలవ్యాపారి నిలబడి ఉన్న మనుషుల సందుల్లోంచి వస్తున్నాడు.

    "మమ్మీ! సమోసా!! " అంటూ శరణ్య పక్కన విండో సీటు దగ్గర కూర్చున్న చింటూ లేచి వస్తున్నాడు. సమోసాలవ్యాపారి గబగబా నాలుగు సమోసాలు తీసేసి, ఒక పేపర్లో పొట్లంకట్టేసి, బాబు చేతిలో పెడుతున్నాడు. చింటూ ఆశగా తీసుకోవడానికి వెళ్తున్నాడు.

    " హే చింటూ! డోంట్ డూ దట్! సీ దేర్.. యాక్.. వెరీ ఆగ్లీ. కమ్ హియర్ " అని శరణ్య గట్టిగా అరుస్తూ,  తనఒడిలో ఉన్న లాప్-టాప్ పక్కనపెట్టి, చింటూని తనదగ్గరికి తీసుకుంది.

    శరణ్య చెవిలో ఇయర్-ఫోన్స్ పెట్టుకుని అరిచిన అరుపులు, ట్రైన్ శబ్దాన్ని మించి, ఆ కోచ్ మొత్తం వినిపించాయి. దాంతో, అంతకుముందు అదే వ్యాపారి దగ్గర సమోసాలు తీసుకున్న ఆ కోచ్ లో  వాళ్ళందరూ  ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. శరణ్య మాటలకు కొందరు, యాసలో మాట్లాడుతున్న ఇంగ్లీష్ కి కొందరు తొంగితొంగి చూస్తున్నారు...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/3uI_JxmPc00

    10 min
  • సమానం కంటే ఎక్కువే | Samanam Kante Ekkuve | Telugu short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సమానం కంటే ఎక్కువే! 

    రచన: కే. లక్ష్మీ శైలజ

    ఆ రోజు రవళి తో పాటు ఆమె ఇంటికి రమ్య కూడా వెళ్ళింది, వాళ్ళ పాపను చూడటానికి. తల్లీ కూతుళ్ళు ఇద్దరికీ వారం రోజులనుంచి జ్వరమని సెలవు పెట్టి రవళి ఆ రోజే ఆఫీస్ కు వచ్చింది.

    'ఆడవాళ్ళు ఎప్పుడూ సెలవు పెడ్తారు. అలాంటప్పుడు ఇంట్లో వుండొచ్చు కదా. పని చెయ్యకుండా జీతం తీసుకుంటారు' అని ఆఫీసర్ బాగా అరిచేటప్పటికి రవళి బాగా ఏడ్చేసింది. అందుకని రమ్య కూడా రవళి తో పాటు వాళ్ళింటికి వచ్చింది, రవళిని ఇంట్లో వదిలి, బాబు ను చూసి పోవచ్చని.

    అప్పుడు రవళి ఆఫీస్ లో జరిగిన విషయాన్ని భర్త రమేష్ కు చెప్పి, కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

    రమ్య కూడా "మేము ఎదిరించి మాట్లాడలేక పోతున్నాము. ఇలాంటి మాటల వల్ల ఆఫీస్ పని సరిగా చెయ్యలేక పోతున్నాము. ఇంటికి వెళ్ళినా మనసుకు కష్టంగానే వుంటోంది. ఆఫీస్ లో పనిచేసే ముప్ఫై మందిలో మేము ఇద్దరమే అమ్మాయిలమవడం కూడా మగవాళ్ళు మమ్ములను ఇలా ఎగతాళి మాటలు మాట్లాడే దానికి కారణమయ్యిందేమో. కేరళ, ఉత్తరప్రదేశ్ లల్లో పనిచేసే అధికారులలో ఆడవాళ్ళే ఎక్కువట. అక్కడికి వెళ్ళి పనిచేస్తే మాకు గౌరవంగా వుంటుందని అనిపిస్తోంది, " అంది ఆవేదనగా.

    "దిగులు పడకండి. మీరు బాధపడుతున్నారని తెలిస్తే అవతలి వాళ్ళు ఇంకా ఎక్కువ మాటలు అనగలరు. అతను మారాలంటే ముల్లును ముల్లుతోేనే తీద్దాం. మీ ఆఫీసర్ కూతురు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ప్రిన్సిపల్ గా చేసే కాలేజ్ లో సైన్స్ లెక్చరర్ గా పని చేస్తోంది. ఆ అమ్మాయి ద్వారా మనం అతనికి బుధ్ధి చెబ్దాం, " అన్నాడు రమేష్.

    " కొంచెం త్వరగా మాట్లాడండి, " అని రవళి బ్రతిమిలాడింది.

    "అలాగే. ఇప్పుడే మా ఫ్రెండ్తో మాట్లాడతాను, " అన్నాడు రమేష్ మొబైల్ చేతిలోకి తీసుకుంటూ. రమ్య ఇంటికి వెళ్ళింది.

    మర్నాడు సాయంత్రం ఆఫీసర్ కూతురు మౌనిక కాలేజ్ నుంచి ఎనిమిది గంటలకు లేటుగా ఇంటికి వచ్చింది.

    వస్తూనే, హ్యాండ్ బ్యాగ్ సోఫాలో విసిరేసి ఏడుస్తూ కూర్చుంది.

    అక్కడే టి.వి. చూస్తున్న ఆఫీసర్,

    "ఏమైంది మౌనికా, "అన్నాడు ఆదుర్దాగా.

    "చూడు నాన్నా, మా ప్రిన్సిపల్ ఈరోజు, 'మీరు వంటింట్లో వంట చేసుకుంటూ వుండక, తగుదునమ్మా అని ఉద్యోగాల కెందుకు వస్తారు?' అన్నాడు, " అంది గట్టిగా అరుస్తూ.

    ఆ అరుపులకు కిచెన్ లో నుంచి వాళ్ళమ్మ మహేశ్వరి బయటకు వచ్చింది. "అదేమిటి? ఎమ్మెస్సీ చదివావు, ఉద్యోగం చేస్తే తప్పేంటి?" అంది.

    "ఎవరామాట అన్నది? " కోపంగా అన్నాడు ఆఫీసర్.

    "ఇంకెవరూ! మా ప్రిన్సిపల్, " అంది రోషంగా.

    "ఏం జరిగిందో కాఫీ తాగి నిధానంగా చెప్పమ్మా, " అందామె అనునయంగా.

    ఒకపది నిముషాల తరువాత ఇలా చెప్పింది మౌనిక.

    "ఈ రోజు మా కాలేజ్ లో మీటింగ్ జరిగిందమ్మా. ఒక్కో సబ్జెక్ట్ లో ఏ పద్ధతి లో ఎలా టీచ్ చేస్తున్నారు. లాస్ట్ మంత్ జరిగిన ఎగ్జామ్స్ కు ఈ మంత్ జరిగిన ఎగ్జామ్స్ కు స్టూడెంట్స్ ఎంత ఎక్కువ మార్క్స్ స్కోర్ చేశారు. ఇంక వేరే ఏ పద్దతి లో ఉన్నతంగా మనం విద్యను అందించవచ్చు అనే విషయంగా చర్చించాము...


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/WiAS-_rGeu4


    7 min
  • సైనైడ్ ఎపిసోడ్ 6 | Cyanide Episode 6 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సైనైడ్ - ఎపిసోడ్ 6

    రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి

    వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు  గారి  ధారావాహిక 'సైనైడ్' ఆరవ భాగం

    గత ఎపిసోడ్ లో

    బి - వన్ తన తియ్యని మాటలతో  శేఖర్ ని లోబరుచుకుంటుంది.

    మన దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన రహస్యాలు తెమ్మని అడుగుతుంది.

    తనకు సహకరిస్తే వంద కోట్లు సంపాదించుకోవచ్చని ఆశ పెడుతుంది.

    ఇక సైనైడ్ ఆరవ భాగం చదవండి.

    శేఖర్ ఎంతో ఆలోచించిన పిమ్మట, 'బి - వన్ చెప్పినది ఏమీ కష్టమైనది కాదు. నేను ఎలాగో అన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం, కొత్త డి ఆర్ డి ఓ అప్డేట్స్ కోసం  వెళ్తూ వుంటాను. అవి చాలా గోప్యంగా చేయవలసిన ప్రాజెక్టుల గనుక నాకు ఒక్కడికే ఆ పర్మిషన్స్ ఉన్నాయి. అందులోని కొన్ని బి - వన్ అడిగిన వివరాలు నేను తేగలను. అవన్నీ రికార్డ్ చేసి ఒకవేళ నేను బి - వన్ కి ఇస్తే.. దాని వల్ల దేశానికి ఏమైనా ఆపద వాటిల్లుతుందా.. ? అదేమైనా దేశద్రోహమా?..' అన్న విధంగా కూడా ఆలోచించి. తనలో తానే ‘పర్వాలేదులే! నేను బి - వన్ ని వదిలి ఉండలేను. ఆమాత్రం వివరాలు సేకరించి, నా భార్యకు విడాకులు ఇచ్చి, కెనడా వెళ్లి ఆ వివరాలతో  బి - వన్ తో కలిసి ఆ ప్రాజెక్టులు చేసి 100 కోట్లు  సంపాదించవచ్చు. దానివల్ల ఆ దేశాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి పరవాలేదు! నా జీవితం ఆనందమయం అవుతుంది..' అనుకుంటూ తనలో తానే సమర్ధించుకుంటూ, తాను బి - వన్ తో కలిసి స్వర్గసుఖాలు అనుభవించవచ్చు! అన్న ఆలోచనలు తప్ప మరి ఏ ఇతర విషయాలు ఆలోచించలేదు శేఖర్.

    శేఖర్ అలాగే విశాఖపట్నం లోని నేవల్ బేస్ సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్ అప్డేట్ కోసం ఆ తర్వాత ముఖ్యమైన HPCL refinery  లో అనుకోకుండా గ్యాస్ లీకై, స్టోరేజ్ ట్యాంకులు రెండు పేలి పోవడంతో ఆ పక్కనే ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో మొత్తం కంప్యూటర్ సాఫ్ట్వేర్ కాలిపోవడంతో మళ్లీ వాటిని రిస్టోర్ చేయడానికి, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి కూడా వెళ్లాలి. అంటూ తన కంపెనీ చెప్పడంతో ఒక నెల రోజుల పాటు ఆ పనుల మీద విశాఖపట్నం వచ్చాడు. అంతకుముందే తన సొంత ఊరైన విశాఖపట్నంలో డెలివరీ కోసంభార్య ను పంపించాడు శేఖర్.

    ఎంతో హుషారుగా తన పనులన్నీ చేసుకుంటూ భార్యతో కూడా అన్యోన్యం నటిస్తూ పాపం.. ‘భార్య డెలివరీ అయిపోయిన తర్వాత మెల్లిగా విడాకులకు అప్లై చేసి.. కెనడా  వెళ్ళిపోవచ్చు!’ అనుకుంటూ ముందుగా నేవల్ బేస్ లో సాఫ్ట్వేర్ పనులు చేస్తూ తన హార్డ్ డిస్క్ లో ఎవరూ చూడకుండా కొన్ని అంతర్గత విషయాలు దేశ రక్షణ కు సంబంధించినవి కూడా సేకరించి బివాన్ చెప్పిన విధంగా  నేవల్ వార్ షిప్స్ డీటెయిల్స్ న్యూక్లియర్ submarines లోని ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి? ఎలా ప్రపంచంలోనే అగ్రగామిగా భారతదేశం  గర్వంగా చెప్పుకునే విధంగా అవి తయారౌతున్నాయో.. 

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/NlVL4CEf0tU



    5 min
  • ప్రేమ‘భ్రమ’రం - 9 | Prema Bhramaram - 9 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ప్రేమ ‘భ్రమ’రం - 9

    రచన: వసుంధర

    వసుంధర గారి తెలుగు ధారావాహిక  ప్రేమ  ‘భ్రమ’రం తొమ్మిదవ భాగం

    గత ఎపిసోడ్ లో...

    తను ఉంటున్న ఇంటి ఓనర్ శివశంకర్ గురించి చెబుతుంది ముక్త.

    అతను తమకు చేసిన సహాయం గురించి, అందుకు అతడు విధించిన షరతు గురించి కూడా చెబుతుంది.

    తరువాత తన ప్రేమ గురించి చెప్పడం ప్రారంభిస్తుంది.

    ఇక  ప్రేమ  ‘భ్రమ’రం తొమ్మిదవ భాగం చదవండి ...

    ‘‘ఎక్కడిదాకా చెప్పానో గుర్తుందా?’’ అడిగింది ముక్త.

    ‘‘గుర్తుంది. శివశంకర్‌ తెలివిగా మీకో ఆప్షనిచ్చినట్లు చెప్పారు’’ అన్నాను.

    ముక్త నావంక చురుగ్గా చూసింది. ‘‘ఆప్షనిచ్చినట్లు చెప్పాను కానీ, ‘తెలివిగా’ అన్న మాట నేను వాడిన గుర్తు లేదే’’ అంది.

    ఆమె అన్న పద్ధతినిబట్టి నేనలాగనడం తనకి నచ్చలేదని గ్రహించాను. కానీ -

    ‘‘ఇందులో మీరనడానికేముంది? అంతడబ్బు బాకీ తీర్చడానికి మూడంటే మూడేళ్లు గడువిచ్చాడాయన. అది తెలివి కాదా?’’ అన్నాను.

    ‘‘అంటే మూడేళ్లలో ఆ అప్పు తీరదని మీ అభిప్రాయమా?’’ అందామె.

    ‘‘ఊఁ’’ అన్నాను నమ్మకంగా.

    ఆమె నవ్వి, ‘‘తీరకపోవడం ప్రసక్తే లేదు. నాకొచ్చే జీతంలోంచే ఏడాదికి అరవై డెబ్బై వేలు నిలవెయ్యగలను’’ అంది ముక్త.

    ఆమె జీతమెంతో తెలియదు. ఆయనకి ఎంత బాకీ పడిందో తెలియదు. అడిగే ఉద్దేశ్యం కూడా నాకు లేదు.

    ‘‘ఐనా మూడేళ్లలో ఆయన బాకీ తీర్చెయ్యగలరా?’’ అన్నాను.

    ‘‘మూడేళ్లెందుకు? ఏడాదిలోగానే ఆయన బాకీ తీర్చేయడానికి - నాకు కవన్‌, భవన్‌లు కూడా సాయం చేస్తామంటున్నారు’’ అంది ముక్త.

    వాళ్లిద్దరికీ ఒకరికొకరు తెలుసో తెలియదో కానీ - ముక్త కథలో - వాళ్లు కుశలవుల్లా, నకుల సహదేవుల్లా జంటగానే వినిపిస్తున్నారు.

    అప్పటికి అర్థమయింది నాకు - కవన్‌, భవన్‌ - ముక్త కథలో ఎలా చోటు సంపాదించారో!

    శివశంకర్‌నుంచి తప్పించుకుందుకు ఆమె వాళ్లని ఆకట్టుకుని ఉంచింది...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/Awf-CcSDyL8

    25 min
  • వీరి మధ్యన ఎపిసోడ్ 6 | Veeri Madhyana Episode 6 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వీరి మధ్యన... ఎపిసోడ్ 6

    రచన:  బివిడి ప్రసాదరావు

    బివిడి ప్రసాదరావు గారి  ధారావాహిక 'వీరి మధ్యన..' ఆరవ భాగం

    గత ఎపిసోడ్ లో…

    వెయ్యి స్తంభాల గుడి దగ్గరకు రమ్మని సామ్రాట్ కి, సాహసికి  విడివిడిగా కాల్ చేసి చెబుతుంది.

    తనకు అపరిచిత యువతి నుండి కాల్ వచ్చిన విషయం సాహసితో చెబుతాడు సామ్రాట్.

    ఇక వీరి మధ్యన..   ఆరవ భాగం చదవండి...

    ఇంట్లోకి వెళ్లగానే, తన ఇంటి హాలులో, తన తల్లితో ఉన్న సాహసి కనబడగానే, జ్వాల మరింత బేజారైపోతుంది.

    "వచ్చావా. ఆలస్యమైందేం. నీ కోసమే సాహసి వచ్చి చాలా సేపు ఐంది." చెప్పింది జ్వాల తల్లి.

    జ్వాల ఏమీ మాట్లాడలేకపోతుంది.

    "రిప్రెషై రా జ్వాలా. నీతో పర్సనల్ గా మాట్లాడాలి." చెప్పింది సాహసి.

    "పర్వాలేదు. చెప్పు." అనేసింది జ్వాల.

    "డాబా మీదికి పద." అంటూనే అటు కదిలింది సాహసి.

    వెనుకే కదిలింది జ్వాల.

    అప్పుడే, "మీరు పైన మాట్లాడుకుంటూ ఉండండి. నేను మీకు కాఫీలు కలిపి ఇస్తాను." చెప్పింది జ్వాల తల్లి.

    జ్వాల ఇంటి డాబా మీద - ఎదురెదురుగా నిల్చుని ఉన్నారు సాహసి, జ్వాలలు.

    జ్వాల 'ఏం మాట్లాడాలి' అనక ముందే, "ఈ ఆదివారం వెయ్యి స్తంభాల గుడికి వెళ్లేది ఫిక్సా." అడిగేసింది సాహసి.

    జ్వాల తడబడింది.

    "సామ్రాట్ వస్తాడుగా." అంది సాహసి సడన్ గా.

    జ్వాల తల గిర్రు మంది. సాహసినే చూస్తూనే అయోమయంలో పడ్డది జ్వాల.

    "ఏంటా చూపు. మాట్లాడు." గట్టిగానే అంది సాహసి.

    జ్వాల మాట్లాడలేక పోతుంది.

    "సామ్రాట్ నాతో మాట్లాడేడు. అన్నీ చెప్పాడు. ఏంటి కత." అంది సాహసి.

    ఇంకా జ్వాల మాట్లాడలేక పోతుంది.

    "పిచ్చా. ఏంటి నీ ఆలోచన. ఏం చేయాలనుకుంటున్నావు. మాట్లాడు." అంది సాహసి విసురుగా.

    "అది అది. మరి మరి." నీళ్లు నములుతున్నట్టు మాట్లాడగలుగుతుంది జ్వాల.

    "ఏంటి అది, మరి. సరిగ్గా చెప్పు. ఏంటి నీ ప్లాన్." అడిగింది సాహసి.


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/v8d_Qq-Jmrk




    15 min
  • కర్తవ్యం - ఎపిసోడ్ 4 | Karthavyam - Episode 4 | Telugu Web Series | Vedurumudi Ramarao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కర్తవ్యం - ఎపిసోడ్ 4

    రచన: వెదురుమూడి రామారావు

    వెదురుమూడి రామారావు గారి సంక్షిప్త ధారావాహిక  కర్తవ్యం నాలుగవ భాగం

    గత ఎపిసోడ్ లో

    మనోహర్, సుధలు దగ్గర కావడం చూసి సంతోషిస్తారు విశ్వనాథం దంపతులు.

    కులు, మనాలి, రోతహంగ్ పాస్ కి వెళదామని ప్రపోజ్ చేస్తారు విశ్వనాథం గారు.

    రాత్రంతా ఆలోచించుకొని సరేనంటారు మనోహర్, సుధలు.

    ఇక కర్తవ్యం నాలుగవ  భాగం చదవండి.

    పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అవగానే మనాలి కి ప్రయాణం సాగించారు. పిల్లలు ఇద్దరూ కొంచం సుముఖంగా నే మారారు. ఇందాక రోప్ వే లో చేతులు పట్టుకొని ఏవేవో మాట్లాడుకున్నారు. దారిలో ఒక ఎత్తయిన శిఖరం దగ్గర "స్కై డైవింగ్" జరుగుతోంది. గాలి వాటం సరిపోతే ఒక్కొక్క వ్యక్తి ని వాళ్ల నిపుణుల సాయం తో వాళ్ళే ‘డైవింగ్’ కి తీసుకొని వెళుతారు. లేకపోతే కొంచం ప్రమాదకరం.

    మనోహర్ కి ఇదంటే చాలా ఇష్టం. తాను డైవింగ్ చెయ్యడానికి రెడీ ఐ పోయాడు. వేసుకోవాలిసిన సరంజామా అంతా వేసుకొని రెడీ గా కూర్చున్నాడు. సుధ మొహం లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఎంత సేపు కూర్చొన్నా గాలివాటం ఆతని బరువు కి సరిపోయినంత అవటం లేదు. వాయు దేముడి కి వీళ్ళ ప్రస్తుత పరిస్థితి అర్ధమైనట్టుగా తన వంతు సాయంగా కొంచం పక్కకు తప్పుకున్నాడు. ఇలాంటి అప్పుడు డైవింగ్ చెయ్యడం ప్రాణాంతకం. అయినా సరే మనోహర్ గెంతడానికి ఉత్సాహంగా వున్నాడు. సడన్ గా సుధ గబగబగా మనోహర్ దగ్గరకి వెళ్లి చెయ్యి పట్టుకొని "ఇది వొద్దండీ. ముందుకి పోదాం" అంటూ అతనిని గట్టిగా పెట్టుకొంటూ ప్రాధేయ పడింది.

    “డబ్బులు పొతే పొయ్యాయి. పోదాం. నాకు భయంగా వుంది” అని ప్రాధేయ పడింది. మనోహర్ మొహం వెలిగి పోయింది. ఆమె చెయ్యి పట్టుకొని ఆప్యాయంగా వెనుదిరిగాడు.

    ఇదేగా కావలిసింది.

    కారు ‘మనాలి’ వైపు మెల్లగా సాగిపోతోంది. ఘాట్ రోడ్ మెలికలు, చల్లటి వాతావరం, ప్రకృతి దృశ్యాలు వాళ్లని ఎక్కడికో సశరీరంగా తీసుకొని పోతున్నాయి. 'హిడింబి' టెంపుల్ అక్కడి ఆకర్షణల లో ఒకటి. అల్లాంటి టెంపుల్ ఇంకెక్కడా లేదు. ఆలు పరోటాలు, పెరుగు తో ఆరగించి ఆ టెంపుల్ చూడ్డానికి వెళ్లారు. మాయ బజార్ సినిమా లో సూర్యకాంతం ఘటోత్కచుడి అమ్మ. " సుపుత్రా !! మంచి పని చెయ్యరా కుమార. సంతోషిస్తాను" అనే డైలాగ్ వెంటనే గుర్తుకొచ్చింది. ఆ టెంపుల్ అంతా మంచి కర్ర చెక్క తో నే కట్ట బడి ఉండటం ఒక ఆకర్షణ. ఎన్నాళ్ళో ఇయినా కర్ర చెక్కడాలు చెక్కు చెదరకుండా అలానే వున్నాయి. అక్కడనించి ‘రోతంగ్ పాస్' కి మన కార్ లో వెళ్లడం కష్టం. స్పెషల్ డ్రైవింగ్ అనుభవం అవసరం. అక్కడి వాళ్లు ప్రత్యేకంగా వాళ్ళ కార్ లోడ్రైవింగ్ చేసి తీసుకొని వెళుతారు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.




    9 min
  • ది ట్రాప్ ఎపిసోడ్ 6 | The Trap Episode 6 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ది ట్రాప్ ఎపిసోడ్ 6

    రచన : పాండ్రంకి సుబ్రమణి

    పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' ఆరవ భాగం

    గత ఎపిసోడ్ లో

    భువనేష్, ప్రభావతిలు   ఉజ్జయినీ దేవి గుడికి వెళ్లారు.

    దర్శనం పూర్తి అయ్యాక భువనేశ్ ఎందుకు దూరంగా ఉంటున్నాడో ఆరా తీసింది ప్రభావతి.

    పని ఒత్తిడే కారణమని చెబుతాడు అతను.

    వాళ్లకు వరూధిని, ఆమె కూతురు పరిచయమవుతారు.

    ఇక ది ట్రాప్. . ఆరవ భాగం చదవండి…

    “ఉఁ  తీసుకోండి. మీకోసం స్పెషల్ గా చేసి తీసుకువచ్చాను. త్వరగా భోజనాలు చేసి నిద్రపోవాలి, మరచిపోకండి”.

    ఆ ఒక్కమాటతో అతడిలోని నకారాత్మక మూడ్ పటా పంచలయిపోయింది. పనిగత్తె అలికిడి అక్కడుందేమోనని చూపులతో పర్యవేక్షించి కాఫీ కప్పుల్ని టీపాయ్ పైన ఉంచి భార్యను రెండు చేతుల్లోకి తీసుకుని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ; ఆరోజు చాలా బాగున్నావని కితాబు యిస్తూ-

    “నిజంగా అంత బాగున్నానండీ!" అంటూ ఆమె మరింత గాఢంగా తమకంతో అతడి మెడను పెనవేసుకుని ముద్దుల వర్షం కురిపించింది. అప్పుడు భాగ్యం వస్తూన్న అడుగుల చప్పుడు విని ఇద్దరూ తొలగిపోయారు, కాఫీ కప్పుల్ని చేతుల్లోకి తీసుకుంటూ-

    ఇద్దరు కాఫీలు తాగిన తరవాత, భాగ్యం వచ్చి ఖాళీ కప్పుల్ని తీసుకెళ్ళిపోయిన తరవాత ప్రభావతి ఆశ నిండిన కళ్ళతో చూస్తూ అడిగింది- “ఆ పాపను బాగా చూసారండీ!"

    ఈసారి అతడిలో విసుగుదల పుట్టు న బయటికి వచ్చింది. "అబ్బ! మళ్ళీ  వాళ్ళ సంగతేనా? ఇకపైన కూడా టాపిక్ మార్చవేంటి? ”

    “తప్పకుండా మార్చి వేస్తాను. మీ మూడ్ ని రెట్టింపుగా ఉద్దీపింప చేస్తాను-- ఐ-ప్రామిస్. దీనికి మాత్రమే మీరు బదులిస్తే—“ అతడు నోరుమెదపకుండానే తలాడించాడు అడగమన్నట్టు.

    "ఆ అమ్మాయి ముఖంలోకి నిదానంగా చూసారా!"

    అతడు ప్రభావతి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాడు-

    “ఏ అమ్మాయి? ఆ చిన్న పాప గురించి అడుగుతున్నావా లేక ఆ పాప తల్లి గురించి అడుగుతున్నావా--”

    "ఏమయిందండీ మీకు? ఈ డిపిసీ ప్రమోషన్ల గొడవలో పడి మీ బుర్ర  బాగా చెదరిపోయినట్లుంది. ముందు దాని సంగతి మరచిపొండీ, కార్పొరేట్ వ్యవస్థని ప్రక్కన పెట్టండి. ప్రమోషన్ వచ్చినప్పుడు వస్తుంది. రానప్పు డు రాదు. దాని కోసం కలత చెందుతూ గజిబజిగా ఆలోచనల్ని పెంచుకోకండి. బిడ్డ తల్లి భర్తను కోల్పోయిన వితంతు స్త్రీని అమ్మాయంటానా! నేనిప్పుడు ఆవిడ కూతురు మందాకిని గురించే మాట్లాడేది—ఇప్పుడు చెప్పండి. సరిగ్గా చెప్పండి. ఆ పిల్ల యెలా ఉంది?”...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/P4C2X1RXX-w

    12 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world