
Sign up to save your podcasts
Or


(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ప్రేమ ‘భ్రమ’రం - 10
రచన: వసుంధర
వసుంధర గారి ప్రేమ ‘భ్రమ’రం ధారావాహిక పదవ భాగం
కథ చదివి వినిపిస్తున్న వారు: కే. లక్ష్మి శైలజ
గత ఎపిసోడ్ లో...
శివ శంకర్ బాకీ తీర్చడానికి, కవన్, భవన్‌లు ఇద్దరూ సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతుంది ముక్త. తాను వేరెవర్నో ప్రేమించినట్లు కూడా ఆమె చెప్పడంతో ఆశ్చర్య పోయాను నేను.
తన ప్రేమ కథను నాకు వివరిస్తుంది ముక్త.
ఇక ప్రేమ ‘భ్రమ’రం పదవ భాగం వినండి ...
నాలోని ప్రత్యేకత ఏమిటని ఆమెనడగలేదు- ‘‘ఈ విషయం కనీసం కవన్‌కీ, భవన్‌కీ చెప్పాల్సింది. ఇద్దరూ రంగంలోంచి తప్పుకునేవారు’’ అన్నాను.
‘‘ఆ తప్పు చెయ్యడం నాకిష్టం లేదు’’ అందామె.
అందులోని తప్పేమిటో - ఆమె వివరించింది.
శివశంకర్ ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు.
అతడు ఉత్తముడే కావచ్చు. కానీ ఇంచుమించు కూతురి వయసే ఉన్న ముక్తని పెళ్లి చేసుకోవడం వల్ల - అతడికి సామాజికంగా, సాంసారికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదురౌతాయి.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/JD9BSGzI71Q
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ఉషోదయం
రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
"ఒరేయ్ చింటూ… లేవరా బారెడు పొద్దుక్కిపోయింది, త్వరగా లేచి స్కూల్‌కు తయారవ్వండి”, కొడుకు దుప్పటి లాగేస్తూ అంది ఉష.
"అబ్బా.. అమ్మా! నన్నిప్పుడే లేపకు. ముందు అక్కను లేపు. అది గంటసేపు బాత్రూంలోనుండి రానేరాదు. అది వచ్చాక నన్నులేపు, "అంటూ దుప్పటి నిండా కప్పుకుని పడుకున్నాడు.
నిజమేలే ఇద్దరిని ఒకేసారి లేపితే అదివెళ్ళి బాత్రూంలో కూర్చుందంటే ఓ పట్టానరాదు.
వీడు అరుస్తుంటాడు ఎంతసేపు అని. రెండు బాత్రూంలున్నా ఒకటి అత్తయ్య రూంలో
ఉంటుంది. అందులోకి వెళ్ళండిరా అంటే ఎవరూ వెళ్ళరు. పెద్దావిడ కదా! ఎప్పుడు అర్జంటు అంటుందో తెలియదు.
వీళ్ళేమో లోపలకు వెళ్ళారంటే అరచి గీ పెట్టినరారు.
"చిన్నీ… స్కూల్‌కు టైం అవుతుంది. లేచి త్వరగా తయారవు, ఆటో వచ్చి ఇంటిముందు హారన్
కొడుతున్నా తెమలరు, రోజు మీరిద్దరు లేటు చేస్తున్నారని ఆటో అతను గొడవపడుతున్నాడు. ఇంకా చిన్నపిల్లలా చెప్పు, "కూతురిని లేపి కూర్చోబెట్టింది.
"అమ్మా అప్పుడే తెల్లారిందా… ఇంకా నిద్రవస్తుంది కాసేపు పడుకుంటాను మా అమ్మవు కదా, "అంది బతిమాలుతూ.
"చాలు చాలు నీ వేషాలు కానీ… హోం వర్క్ చాలా ఉంది అన్నావు. తొందరగా లేపితే చేసుకుంటా అన్నావు కదా! లే.. లేచి త్వరగా స్నానం కానిచ్చుకొనిరా, "రెక్కపుచ్చుకుని
మంచం మీదనుండి కిందకు దింపింది చిన్నిని. హోం వర్క్ గుర్తుచెయ్యగానే పరుగెత్తినట్టే వెళ్ళిపోయింది బాత్రూంలోకి. చిన్ని హడావుడి చూసి నవ్వుకుంది ఉష. లేడికి లేచిందే పరుగు అనుకుంది. కూతురు కొడుకు లేచి తయారై వచ్చేసరికి స్కూల్ టైం అయింది.
"ఓరేయ్ పిల్లలు రండిరా… ఆటో వచ్చేస్తుంది, "కేకవేస్తూనే పిల్లలకు టిఫిన్ ప్లేట్‌లో పెట్టుకుని వచ్చి ఇద్దరికి పెట్టసాగింది.
"ఏమిటే ఉషా… నువ్వు మరీ పాడుచేస్తున్నావు పిల్లలను, వాళ్ళు ఇంకా నీ కళ్ళకు పాలు తాగే పసిపిల్లనుకుంటున్నావు, కాస్తా వాళ్ళకు వాళ్ళ పనులు చేసుకోవడం నేర్పించవే, "అంది ఉష అత్తగారు సుశీలమ్మ పిల్లలను కోపంగా చూస్తూ.
"అదేంటత్తయ్యా అలా అంటారు… వాళ్ళు చిన్నపిల్లలే కదా! పాపం వాళ్ళకు ఎంతింత హోమ్ వర్క్ లు ఇస్తున్నారో చూసారా? అయినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటునే
ఉన్నారు, స్కూల్‌కు టైం అయిపోతుందని తినిపిస్తున్నాను అంతే కదత్తయ్యా, "అంది.
"ఏమో తల్లి … మా కాలంలో ఈ వయసు వచ్చేసరికి అన్ని పనులు నేర్చుకునేవాళ్ళం, కాస్తా మంచిచెడు పనిపాట వాళ్ళకు వచ్చేలా చూడు , ప్రతీది నువ్వే చేస్తున్నావు వాళ్ళకు అలానే అలవాటు అవుతుంది , ఏదో పెద్దదాన్ని చూస్తూ ఊరుకోలేను నీ మంచికోసమే చెబుతున్నా, "అంటూ గొణుగుతూ లోపలకు వెళ్ళిపోయింది.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/WkCGq4nXGTA
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కర్తవ్యం - ఎపిసోడ్ 5
రచన: వెదురుమూడి రామారావు
వెదురుమూడి రామారావు గారి సంక్షిప్త ధారావాహిక కర్తవ్యం ఐదవ ( చివరి ) భాగం
తెల తెలవారుతుండగా మనోహర్ సుధ లు లేచి ఆరు బయట దృశ్యాలని కళ్ళల్లో నింపుకొంటున్నారు. ఆ ప్రదేశం, వాతావరణం వదలి వెళ్ళాలి అనిపించటం లేదు. తప్పదుగా!
సామానులు అన్నీ కారులో ఎక్కించి గెస్ట్ హౌస్ కి వీడుకోలు చెప్తూ మెల్లగా వెనక్కి బయలు దేరారు. ఆపిల్ తోటల దగ్గర కారు ఆపించి కావలిసిన పళ్ళు ప్యాక్ చేయించారు.
గడచిన మంచి సమయం మరువలేని జీవితానందంగా నెమరు వేసుకొంటూ ఢిల్లీ వైపు బయలు దేరారు. విశ్వనాథం, సుమతి లు వీళ్లల్లో వచ్చిన మార్పు ని గమనిస్తూనే వున్నారు. నెమ్మదిగా వారి అసలు జీవితాలకు తిరిగి వచ్చే మానసిక స్థితికి చేరుకుంటున్నారు. వాళ్లకి ఇంతకాలం ఒక కలల ప్రపంచం లో ఉన్నట్టు, ఇప్పుడే బయట కి వస్తున్నట్టు అనిపిస్తోంది.
తారు రోడ్ మీద కారు నున్నగా జారిపోతోంది. ఏసీ చిన్నగా, మందంగా, చల్లగా వారికి సేవ చేస్తోంది. అకస్మాత్తుగా సుధ విశ్వనాథం గారి తో ఇలా అంది. మనోహర్ నిశ్శబ్దంగా వింటున్నాడు.
“అంకుల్! మనం బయలు దేరి వచ్చే రోజు ప్రయాణం లో మన సాంప్రదాయం, పెళ్ళిలో తంతుల గురించి చెపుతూ ఆపేసారు. మనకి ఇంకా ప్రయాణం లో టైం బాగా వుంది కదా. చెప్తారా ?” అని అడిగింది.
అంత కన్నా సంతోషం ఏం ఉందమ్మా! తప్ప కుండా చెప్తాను. మీకు బోర్ కొడితే ఆపేస్తాను. ఈ తంతులు ఏమిటి, వీటి అర్ధం ఏమిటి అని తెలిస్తే, వాటి మీద గౌరవం ఎక్కువ అవుతుంది. తప్పకుండా ఆచరించాలి అనిపిస్తుంది. జీవన సత్యానికి, మనుగడకి అర్ధం పరమార్ధం కూడా. అందుకే ఇన్ని వేల సంవత్సరాలైనా మన సంస్కృతి నిలబడి వుంది.
‘శౌనక స్మ్రుతి ధర్మ శాస్త్రం ‘ పెళ్లి లో జరిగిన తంతులని వివరిస్తోంది. మంగళ సూత్రం కట్టేటప్పుడు వరుడు చేత అనిపించిన మంత్రం అందరికి తెలిసినదే.
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా
కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం
అంటే వరుడు తన జీవితాన్ని ఆమె చేతుల్లో పెడుతున్నాడు అని అర్ధం.
‘ఇది పవిత్రమైన బంధం. గుణవంతురాలయిన నీ మెడలో నేను మంగళ సూత్రం కడుతున్నాను. నీవు సంతోషం గా వంద సంవత్సరములు జీవించు’ అని కోరుతున్నాడు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
వీరి మధ్యన... ఎపిసోడ్ 7
రచన: బివిడి ప్రసాదరావు
బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' ఏడవ భాగం
గత ఎపిసోడ్ లో…
సాహసి, జ్వాల ఇంటికి వెళుతుంది.
ఆమెను మేడపైకి తీసుకోని వెళ్లి, తనకూ సామ్రాట్ కూ మధ్య ప్రవేశించడానికి కారణం అడుగుతుంది.
ఇకపై తమ మధ్య జోక్యం చేసుకోవద్దని గట్టిగా చెబుతుంది.
ఒక సేల్స్ గర్ల్ సామ్రాట్ దగ్గరకు వచ్చి, కాస్త చనువుగా ప్రవర్తించ బోతుంది.
ఇక వీరి మధ్యన.. ఏడవ భాగం చదవండి...
"సారీ చెప్పను. కానీ, ఏదో మీ చేతిని తాకేను. అంతే." అనేసింది ఆమె నవ్వేస్తూ. సామ్రాట్ ఏమీ అనలేదు.
తన వద్ద ఉన్న నోట్లకి, సామ్రాట్ అందించిన నోట్లను చేరుస్తూ, "నా వద్ద హండ్రడ్సే ఉన్నాయి. ఛేంజ్ లేదు. మీరే ట్వటీ ఇస్తే, నేను రెండు వంద నోట్లు ఇస్తాను." చెప్పింది ఆమె.
"లేదు లేదు. ఏమీ ఇవ్వక్కర లేదు. అంతా ఉంచుకోండి." చెప్పాడు సామ్రాట్.
"అదేంటి." అనేసి, "ఆ మిగతాకి నేనేమైనా ఇవ్వాలా" అంది ఆమె చాలా హస్కీగా.
"లేదమ్మా. మీ అన్నయ్య ఇచ్చాడనుకో. ఉంచు. ఇంతగా హైరానా పడుతున్నారంటే, మీ అవసరం ఏమై ఉండొచ్చొ ఊహించుకోగలను. మరోలా భావించక, ఆ మిగతాది ఉంచుకో." చెప్పాడు సామ్రాట్. ఆమె అతనినే చూస్తుంది.
"ప్లీజ్. మీ సామాన్లును సర్దుకొని, మీ పనిని మీరు కొనసాగించుకోండి. ఆల్ ద బెస్ట్." చెప్పాడు సామ్రాట్.
ఆ వెంబడే, "ఎట్టి ఇబ్బంది పెట్టకూడదనే, నాకు ఇప్పటికిప్పుడు ఏమీ అవసరం కానివైనా వీటిని పర్చేజ్ చేశాను." చెప్పాడు సామ్రాట్ టీపాయ్ మీది తను కొన్న వాటిని చూపుతూ.
ఆమె తన బేగ్ లతో కనీసం 'థాంక్స్' కూడా చెప్పక, అక్కడ నుండి కదిలింది. సామ్రాట్ మైన్ డోర్ మూసేశాడు.
సేల్స్ గర్ల్ గా వచ్చిన ఆమె నేరుగా తన బాస్ రావ్ ను కలిసింది. జరిగింది చెప్పింది.
"వాట్. అవునా." అన్నాడు రావ్.
"అవును సార్. సామ్రాట్ సిసలైన మగవాడు. నా చూపులకు, నా వగలుకు ఏ మాత్రం టెమ్ట్ అవ్వలేదు. పైగా కచ్ఛితమైన స్పృహతో సరళంగా వ్యవహరించాడు. హీ ఈజ్ ఎ ఫైన్ మాన్ అండ్ పెర్ఫెక్ట్ జంటిల్ మాన్." చెప్పింది ఆమె. రావ్ ఇంప్రెస్ అయ్యాడు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/VCsy_5RwoZ4
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ఆమె పాదాలు!
రచన : కొత్తపల్లి ఉదయబాబు
''అమ్మా.. ధరణీ. దేవుడి మందిరంలో ఒక పసుపు పచ్చని పాదాల ఫోటో ఉండాలి కదా. ఏమైందమ్మా? కనిపించడం లేదు?'' పూజకు కూర్చోబోతూ కోడలిని అడిగాడు పూర్ణచంద్రరావు.
''దానిని తీసి మీ బట్టల బీరువాలో బట్టల మధ్య భద్రంగా దాచి పెట్టాను మామయ్య గారు. కొత్తగా గృహప్రవేశం అయిన ఇంట్లో పూజామందిరంలో దేవుళ్ళ పక్కన అలాంటి ఫోటోలు ఉండకూడదని యు ట్యూబ్ వీడియోల్లో ఒక పండితుడు చెప్పారండీ. అందుకే తీసేసాను. ఏమీ అనుకోకండి'' అంటూ పూజా మందిరం బయటే నిలబడి జవాబు చెప్పింది ధరణి.
పూర్ణచంద్ర రావు గారు వెంటనే లేచి పూజామందిరం లోంచి బయటికి వచ్చేసారు.
''అదేంటి మావయ్యగారు... దీపం పెట్టుకోకుండా వచ్చేసారు?'' అడిగింది ధరణి.
''అవి ఉన్న చోటే నాకు పూజా మందిరం అమ్మా.. ఈరోజునుంచి నువ్వు గాని, అబ్బాయి గాని దీపం పెట్టేసుకోండి. '' అని తన గదిలోకి వెళ్లిపోబోయారాయన.
''మీతో చెప్పకుండా తీసేశానని కోపం వచ్చిందా మామయ్యగారు?'' అడిగింది ఆమె
''లేదమ్మా. దానికి నాకు కోపం ఎందుకు? నా దృష్టిలో ఆ పాదాలే నాకు నిజమైన దేవుడు. నేనీవేళ ఇలా ఉన్నానంటే ఆ పాదాలే కారణం. ఉదయం అనగా ఆఫీసుకు పోయి ఎపుడో రాత్రి వస్తాడు వాడు. తెల్లవారి లేస్తూనే ఏ టిఫిన్ చేయాలా అన్న ఆలోచనతో వంటగదిలో కుస్తీ పడుతుంటావు నువ్వు. నిండు ఇంట్లో దీపం పెట్టుకోకపోతే అరిష్టం అని మాఅమ్మగారు చెప్పారు. నేను ఆపాదాలు దేవుడి మందిరంలో పెట్టిననాడు నువ్వు అభ్యంతరం చెప్పలేదని ఇంతకాలం దీపారాధన చేస్తూ వచ్చాను. అది అక్కడ లేకపోయిన తరువాత నాకు దేవుడి మందిరంలో పనిలేదమ్మా. ఎందుకంటే అది ఉన్నచోటే నాకు దేవుని మందిరం. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకమ్మా”.
ఆయన తన గదిలోకి వెళ్లిపోయారు.
''ఆ... యు ట్యూబ్ లో పంతులు గారికన్నా ఈయనకు ఎక్కువ తెలుసేమిటి? మీరు పెట్టకపోతే మానేయండి. వీలున్ననాడు పెట్టుకుంటాను.. లేనినాడు లేదు. అయినా అసలా ఫొటోలో ఏముందని? కాళ్ళకి చిక్కటి దేశవాళీ పసుపురాసుకుని, పారాణీ పెట్టుకుని, రెండు కాళ్ళ బొటన వేళ్ళకు పక్కనున్న రెండో వేళ్ళకు వెండి మట్టెలుపెట్టుకుని, వెండి పట్టీలు పెట్టుకున్న లేత తములపాకుల్లా మెరిసిపోతున్న రెండు కాళ్ళు ఉన్న బొమ్మ అది. ఇంతకాలం ఎక్కడ దాచారో... బయటకు వెళ్ళినపుడు లామినేషన్ చేయించి తెచ్చుకున్నారు కాబోలు పూజామందిరంలో పెట్టుకున్నారు. అలా ఉండకూడదని తెలుసుకున్నాకా తీసేసింది తానూ. ఇందులో తప్పేముంది? కొడుకు వచ్చిన వెంటనే పిర్యాదు చేస్తారేమో. చేస్తే చెయ్యనీ.. ఈయనకన్నా ముందు మొగుడికి తానే చెప్పేస్తే సరి అనుకుంది ధరణి.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/xvM0omU7fXk
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
యశోదమ్మ గారి బొమ్మల కొలువు
రచన : M R V సత్యనారాయణ మూర్తి
దసరా నవరాత్రులు వచ్చాయంటే మా పెనుగొండ వీధులన్నీ భక్తులతో కళ కళ లాడిపోతాయి.
నగరేశ్వర స్వామి గుడిలో ఉన్న మహిషాసుర మర్ధినీ అమ్మవారికి, కన్యకాపరమేశ్వరి అమ్మవారికి చాలా ఘనంగా పూజలు చేస్తారు. కంచి కామాక్షి అమ్మవారి గుడిలోని అమ్మవారికి కూడా నవరాత్రి ఉత్సవాలు చేస్తారు.
కామాక్షి గుడి దగ్గర రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా
ఉంటాయి తొమ్మిది రోజులూ. హరికథలూ, బుర్రకథలూ, డ్రామాలు, రికార్డింగ్ డాన్సులు... అబ్బో చాలా ఉంటాయి కామాక్షి గుడిదగ్గర. రాత్రి ఎనిమిది దాటాకా పిల్లలు,
కుర్రకారూ ఇక్కడే ఉంటారు మరి.
లింగాలవీధి మొగలో ఉంది సుబ్బన్న పంతులుగారి ఇల్లు. ఐదు వందల గజాల స్థలంలో కట్టిన పెద్ద డాబా. ఇంటి చుట్టూ జామ, పనస, సపోటా, మామిడి చెట్లు ఏపుగా పెరిగి
ఉంటాయి. వాటితో పాటే పూల మొక్కలూనూ. ఒక మూలగా ఉన్న పాకలో ఒక ఆవు, గేదె ఉంటాయి. పంతులు గారు
చుండూరి సూర్యనారాయణ గారి ఎలిమెంటరీ స్కూల్ లో హెడ్ మాస్టర్. ఊళ్ళో జామీన్దారులు అందరూ ఆయన
స్నేహితులే. వాళ్ళ ఇల్లు ఎప్పుడూ ఆయన స్నేహితులతో సందడిగా ఉంటుంది.
వాళ్ళ ఇంటికి రెండిళ్ళ అవతల స్వాతంత్ర సమరయోధులు దగ్గుబాటి సీతారామయ్య గారి పెద్ద పెంకుటిల్లు ఉంది.
పంతులుగారి భార్య యశోదమ్మ. వాళ్లకి ఏడుగురు సంతానం. అత్తగారు మంగమ్మ, కోడలికి ఏడు పురుళ్ళు తానే పోసింది. కారణం యశోదమ్మ పెళ్లి అయిన రెండేళ్లకే వాళ్ళ అమ్మ చనిపోయింది. తండ్రి సీతారామ సోమయాజులు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఆడ దిక్కు లేని సంసారం అవడం
వలన మంగమ్మ తానే యశోదమ్మ కి తల్లిగా మారి, అన్ని పురుళ్ళు పోసింది.
యశోదమ్మ గారు ఏటా నవరాత్రులకి బొమ్మలకొలువు పెడతారు. ఆ బొమ్మల కొలువు లోని బొమ్మలు చాలా అందంగా ఉంటాయి. తనకు తెలుసున్న వాళ్ళు అందరినీ
ఆవిడ పేరంటానికి పిలుస్తారు. ఈ బొమ్మలకొలువు విశేషం ఏమిటంటే ప్రతిరోజూ కొన్ని కొత్త బొమ్మల్ని తయారుచేసి
బొమ్మలకొలువు లో పెడతారు యశోదమ్మ గారు. అవి చూడటానికి పెద్దలతో పాటు పిల్లలు కూడా వస్తారు వాళ్ళ ఇంటికి.
పొద్దున్నే యశోదమ్మ వాళ్ళ అత్త మంగమ్మ కొత్త బొమ్మల్ని దొడ్లో తయారు చేస్తారు. వాటికి రంగులు వేయడం యశోదమ్మ గారి పిల్లల డ్యూటీ. ఒక రోజు దశావతారాలు, మరో రోజు నవదుర్గలు, ఇంకోరోజు అష్టదిక్పాలకులు ఇలా రక రకాల బొమ్మలు చేసి కొలువులో పెడతారు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/5jprIMU8t-U
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ఫస్ట్ డే ఫస్ట్ షో
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
మూర్తి, గోపాల్, కుమార్, రాజు- నలుగురూ చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులు. మూర్తి, గోపాల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్స్ గా పని చేసి రిటైర్ అయ్యారు. కుమార్, రాజు పెద్ద బ్యాంకులలో పనిచేసి రిటైర్ అయ్యారు. నలుగురూ హైదరాబాద్ లో పక్క పక్క ఇళ్ళు కొనుక్కుని, ఆడుతూ పాడుతూ కాలం గడుపుతున్నారు.
ఈ నలుగురికీ కాలేజీ రోజులలో తమ అభిమాన నటుడి సినిమా మొదటి రోజు మొదటి ఆట కి వెళ్లడం అలవాటు. నలుగురూ అభిమానించేది ఒకే నటుడు అవడం తో, ఏ గొడవా లేదు. ఉద్యోగం లో వున్నప్పుడు తప్పా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అలవాటు మానుకోలేదు ఆ నలుగురు.
గురువారం రానే వచ్చింది, తమ హీరో పిక్చర్ కి అంతకముందే మూర్తి తమ పోలీస్ కానిస్టేబుల్ ని పంపించి ఫస్ట్ డే ఫస్ట్ షో కి అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్నాడు. గురువారం ఉదయం 8 గంటలకు మొదటి షో, నలుగురు ఫ్రెండ్స్ బయలుదేరి ఉడిపి హోటల్ లో, వేడి వేడి ఇడ్లీ సాంబార్, తలో సింగల్ పూరి తిని, కాఫీ తాగి, హాలు కి చేరుకున్నారు. అప్పటికే జనం తండోపతండాలు గా వుండి హాలు లోపలికి తోసుకుంటూ వెళ్తున్నారు.
“పద పద, మన హీరో ఎంట్రన్స్ సీన్ మిస్ అవ్వకుడదు” అంటూ తాము చేసిన ఉద్యోగాల విషయం కూడా మర్చిపోయి తోసుకుంటూ లోపలకి వెళ్లారు.
అప్పుడే న్యూస్ రీలు మొదలైంది, హాలంతా చీకటి.
సెల్ లైట్ సహాయం తో తమ సీట్లు దగ్గరికి చేరి, “అమ్మయ్య మొత్తానికి టైంకి చేరుకున్నాం” అన్నాడు మూర్తి.
సినిమా మొదలైన పదినిమిషాలలోనే హీరో పెద్ద ఫైటింగ్, జనం ఈలలతో హాలు రీసౌండ్ యిస్తోంది.
ఇంతలో మూర్తి మొహం మీద టార్చి లైట్ వెలుగు పడింది. చిరాకు గా వాళ్ళని “అడ్డం తప్పుకోండి. మంచి సీన్ జరుగుతున్నప్పుడు అడ్డంగా రావడమే కాకుండా లైట్ వేస్తారేమిటి?” అన్నాడు మూర్తి.
“హలో సార్, ఈ సీట్స్ మావి, మా సీట్స్ లో కూర్చొని మమ్మల్ని దబాయిస్తున్నారు, లేవండి” అన్నాడు ఆ నలుగురు లో ఒకడు చిరాకు గా.
“ భలే వాడివే, ఈ సీట్స్ మావి, కావాలంటే మా టికెట్స్ యివిగో... చూడు” అంటూ టికెట్స్ చూపించాడు మూర్తి.
ఆ వచ్చిన వాళ్లలో ఒకడు, “ఈ టికెట్స్ ఈ రోజు ఫస్ట్ షో కి, యిది మార్నింగ్ షో.. లేవండి” అన్నాడు.
అందులో ఒక రౌడీ కుర్రాడు, “అరే! ఉటో బే.. మా సీట్స్ లో కూర్చొని నకరాలు పోతున్నావు” అన్నాడు.
అంతే! ఏమైందో తెలియదు, మూర్తి కళ్ల ముందు నుంచి గోపాల్ చెయ్యి వెళ్లి వాడి మొహాన్ని తాకడం, వాడు కింద పడటం ఒకే సారి జరిగింది. ఇంతలో హీరోయిన్ చెలరేగిపోతో పాడుతున్న సాంగ్ వస్తోంది. ఏమి జరిగిందో పట్టించుకోకుండా మిగిలిన ముగ్గురు స్క్రీన్ వంక చూస్తో వుంటే, మేము తేలు కుట్టిన దొంగలు లాగా బయటకు నడిచాము...
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/LYoQiIqJAcI
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 1
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
సిహెచ్. సీఎస్. శర్మ గారి కొత్త ధారావాహిక కస్తూరి రంగ రంగా ప్రారంభం
“బ్రహ్మయ్యా..”
పుండరీక పిలుపు…
ఇరువురూ ఇరుగుపొరుగులు.... స్నేహితులు.... బంధువులు... సహెూపాధ్యాయులు...
భార్య కుసుమ అందించిన కాఫీ త్రాగి గ్లాసును ఆమెకు అందించి ఇంటి వరండాలోకి వచ్చాడు బ్రహ్మయ్య.
వరండా మెట్లముందు నిలబడివున్న మిత్రుడు పుండరీకను చూచాడు. "పుండరీకా!... రా.. రా!..." ప్రీతిగా పిలిచాడు.
పుండరీక వరండా మెట్లు ఎక్కి తన చేతిని బ్రహ్మయ్య చేతితో కలిపాడు....
"మిత్రమా... నీ అల్లుడు మిలిటరీ సర్వీసు సెలక్టు అయ్యాడు. ఆర్డర్ వచ్చింది. ట్రైనింగ్ నిమిత్తం డెహ్రాడూన్ కు పైవారం బయలుదేరాలి..." ఆనందంగా నవ్వుతూ చెప్పాడు పుండరీకయ్య.
"చాలా చాలా సంతోషంరా!...అంతా నీ ఆశీర్వాద బలం.."
తృప్తిగా నవ్వాడు పుండరీకయ్య....
"నాదేం లేదురా!... వాడి పంతం... పట్టుదల... క్రమశిక్షణ... కారణంగానే వాడు అనుకొన్నదాన్ని సాధించాడు..."
ఇరువురూ కూర్చున్నారు. ఆనందంగా ఒకరి ముఖాన్ని ఒకరు చూచుకొంటూ నవ్వుకొన్నారు.
పుండరీక గారి కంఠస్వరాన్ని విన్న కుసుమ కాఫీ గ్లాసుతో వరండాలోకి వచ్చింది. నవ్వుతూ గ్లాసును పుండరీకయ్య గారికి అందిస్తూ...
"అన్నయ్యగారూ... తీసుకోండి...” అంది.
పుండరీకయ్య కుసుమ అందించిన గ్లాసును చేతికి తీసుకొన్నాడు. "అమ్మా!... నీ అల్లుడికి మిలటరీ సెలక్షన్ ఆర్డర్ వచ్చింది..." సంతోషంగా చెప్పాడు పుండరీకయ్య.
“అలాగా!... చాలా చాలా సంతోషం అన్నయ్యా!... ఆ దేవుడు వాడి కోర్కెను తీర్చాడు..." ఆమె ముఖంలో ఎంతో ఆనందం...
పోస్ట్ మేన్ వీరయ్య...
వండాలోకి వచ్చి బ్రహ్మయ్యగారికి నమస్కరించాడు... "సార్.... పెద్దాయన దగ్గరనుంచి పుత్తరం!..." అందించి వెళ్లిపోయాడు.
బ్రహ్మయ్య ఆ కవర్ ను రెండువైపులా త్రిప్పి చూచి... ఏదో సందేహంతో...
ఒకవైపు చించి లోని కాగితాన్ని బయటికి తీశాడు.
"ఎవరండీ వ్రాసింది?...” అడిగింది కుసుమ.
`బ్రహ్మయ్య సెల్ మ్రోగింది...
“హలో!...” మెల్లగా అడిగాడు...
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/UKWLqVTqwiY
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
శ్రీరామ నవమి
రచన: భాగవతుల భారతి
"సురుచితా నీకోసం ఎవరో వచ్చారు. "
జైల్ సెంట్రీ చెప్పగానే.. ధిగ్గున లేచి, మళ్ళీ
ముఖం వివర్ణమై, నిర్వికారం కమ్మేసి,
ఈ పాపిష్టి దానికోసం వచ్చేవాళ్ళుకూడా ఉన్నారా? ఐనా నేనింకా బతికేఉన్నానా?
చచ్చిపోయాగా! మరి ఈ జీవచ్ఛవం కోసం....
'అంటే నా మనసులో ఇంకా ఆలోచనలు
పుడుతూనే ఉన్నాయా? ఐతే నేను బతికేఉన్నా'.... కలలో నడుస్తున్నట్లుగా
జైల్లోని విజిటింగ్ హాల్ మెస్ డోర్ వరకూ వచ్చి, గాజుకళ్ళతో శూన్యంలోకి
చూస్తున్నట్లు చూసింది. ఎదురుగా
వెలుతురులో ఓ ఆకారం...
గుబురుగడ్డమూ, చింపిరిజుట్టూ
మాసినబట్టలూ, గుర్తుపట్టటానికి నిమిషం పట్టింది. ఆశ్చర్యపోయింది. ఓ ఉప్పెనే
దు:ఖసంద్రమై పొంగుకొచ్చింది.
మెస్ డోర్ చువ్వలు పట్టుకుని ఏడుస్తోంది.
ఆ ఏడుపుకు ఆ హాలు ప్రతిధ్వనించింది.
ఇలాంటి ఏడుపులు శోకాలు అక్కడ సహజమే ఐనా, సెంట్రీ పెద్దగా అదిలించింది. సురుచిత కళ్ళు తుడుచుకోవాలని ప్రయత్నించినా అది సాధ్యం కావట్లేదు.. ఎంతసేపు ఏడ్చిందో తెలీలేదు. ఎన్నేళ్ళనుండో గూడుకట్టుకున్న దు:ఖం, కన్నీరై జైలు గోడల్ని కుదిపేస్తోంది.
"టైం ఐపోయిందమ్మా! "ఇంకో సెంట్రీ చెప్పాడు.
"మాటకూడా మాట్లాడకుండానే టైం" అన్నట్లు బేలగా చూసిందామె.
"నువ్వు పుట్టెడు దు:ఖం లో మునిగిపోయావ్. నేను మళ్ళీ వస్తాను "
వెనుదిరిగాడతను.
"మరి పిల్లలూ?" ఏడుస్తూనే అడిగింది.
"వాళ్ళు నా పిల్లలు. నాదగ్గరే ఉంటారు " వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.
అప్పుడు కళ్ళుతుడుచుకుని స్థిమితంగా
వెనుదిరిగి చూస్తే... సెంట్రీ... ఆశ్చర్యం గా...
"ఇన్నిరోజులుగా నీ గొంతే వినని ఈజైలు గోడలూ... ఈరోజు నీ ఏడుపు తో ప్రతిధ్వనింప జేసిన అతనెవరూ?" అడిగింది
"నాభర్త" అంది.
" ఎన్నో భర్త... నువ్వతనికి ఎన్నో భార్య... భర్తను హత్యచేసిన కేసులో కాదూ నువ్వు జైలుకి వచ్చిందీ?".....
మాటల్లోని వెటకారం... గుండెల్ని గుచ్చేస్తున్నా.... "వాళ్ళు నా పిల్లలు నా దగ్గరే ఉన్నారు ".... అనే మాట చెవుల్లో ప్రతిధ్వనించి... మనసులో ఆవరించిన నిశ్చింతతో... తనసెల్ గదిలోకి వెళ్ళిబోతూ
ఆలోచిస్తోంది.
బంగారమంటి జీవితాలు.. క్షణంలో ఎంతనాశనమైపోతాయ్? వ్యసనాలకి ఆడామగా తేడాలేదు. వ్యసనం రూపుమారుతుందేమో గానీ అర్ధం ఒకటే.
రెండు తప్పులూ చిన్నవేం కాదు. దిద్దుకోటమూ సాధ్యం కాదు.
సెల్ కివచ్చి కింద కంబళీమీద కూర్చుని గతం లోకి జారిపోయింది.
$$$$$$$
"రాత్రీ తాగేవచ్చావా?మారవానువ్వూ?!
నలుగురు ఆడపిల్లల తండ్రివి!...
పిల్లలు పెరుగుతున్నారు. చదువులూ పెళ్ళిళ్ళు, ఖర్చులూ, చేతిలో పైసాలేదు. "
సురుచిత బాధగా భర్తను నిలదీసింది.
"అవునే తాగాను... నా సంపాదనా నాయిష్టం... నీకూ... పిల్లలకీ ఇంత తిండి పారేస్తూనే ఉన్నాగా... పెళ్ళిళ్ళూ గిళ్ళిళ్ళూ తర్వాత చూద్దాం " విసురుగా వెళ్ళిపోయాడు సదాశివ.
ఏమిటిదీ?!తిండి పారేయటమేమిటీ? ముష్టివాళ్ళకి వేసినట్టూ! ఎన్నాళ్ళిలా?
ఆలోచిస్తుండగానే...
ఫోన్ మోగింది... చూస్తే అగర్వాల్.. "మీఆయన షాప్ కి బయలుదేరాడా?! " అడిగాడు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/Cn44bU-FuRE
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ది ట్రాప్ ఎపిసోడ్ 7
రచన : పాండ్రంకి సుబ్రమణి
పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' ఏడవ భాగం
గత ఎపిసోడ్ లో
భర్త ముందు మందాకిని ప్రస్తావన తెస్తుంది ప్రభావతి.
మందాకినికి చనిపోయిన తమ కూతురు పోలికలు ఉన్న విషయం అతనితో చెబుతుంది.
మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చిన పరమేశ్వర్ ని ప్రశ్నలతో చుట్టు ముడతారు అతని కుటుంబ సభ్యులు.
ఇక ది ట్రాప్.. ఏడవ భాగం చదవండి…
చెప్పడం పూర్తయిన తరవాత చివరి మలుపుగా కామేశ్వరరావు మరొకటి జోడించాడు. “బాగా గుర్తుంచుకో! ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పడున్నట్టు మనం కాలమంతా పడుండలేం. పడుండ కూడదు. సరుకులు హోల్ సేల్ మార్కెట్టు నుండి తెచ్చుకోవడానికి మనం చిన్నపాటి జీపునో- టేంపో వంటి బండో తెచ్చుకోవడానికి అవస్థ పడుతున్నాం. ఔనా? ”
పరమేశ్వర్ తలూపాడు.
“ఇప్పుడు దివాకర్ అంకుల్ గారి ఆఫర్ యేమిటో తెలుసా-- మనతో పార్టనర్ గా చేరి మనకు మిగిలిపోయిన స్థలంలో మినీ సూపర్ మార్టెట్ గా విస్తరించడానికి ముందుకు వచ్చాడు”.
పరమేశ్వర్ ముఖం అదోలా పెట్టాడు- ”అది సరేరా అన్నయ్యా! వినడానికి అప్పటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలా ఆసక్తికరంగానే ఉంది. మరి— ఇదంతా నాకెందుకు చెప్తు న్నట్టు—”
ఈసారి కమల సంభాషణలోకి జోరుగా వచ్చింది- “అవేం మాటల్రా అన్నయ్యా— రామాయణమంతా విని రాముడికి సీత యేమవుతుందని అడిగినట్లు! నువ్వు గాని, అంకుల్ గారి పెద్ద కూతురు వినోదినిని చేసుకుంటానంటే మన కిరాణా దుకాణం మాత్రమే విస్తరించదు. నిన్ను ఆయన ఫార్మాకంపెనీ ఇన్నర్ సర్కిల్ లోకి తీసుకుంటాడు. ప్రొఫెషనల్ ట్రైనింగు కూడా యిచ్చి నిన్ను నిచ్చెనెలా మెట్టుపైన మెట్టుగా పైకి తీసుకెళ్ళి పోతారు"...
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/JM-m6dLuJPI
From the publisher's feed