Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • ది ట్రాప్ ఎపిసోడ్ 9 | The Trap Episode 9 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ది ట్రాప్ ఎపిసోడ్ 9

    రచన : పాండ్రంకి సుబ్రమణి

    (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

    కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' తొమ్మిదవ భాగం

    గత ఎపిసోడ్ లో

    గుడి దగ్గర భువనేష్ నుదుట కుంకుమ పెడుతుంది వరూధిని.

    ప్రభావతి ఆ విషయం గమనించదు.

    మందాకినీ కోసం కొన్న గిఫ్ట్ లు ఇచ్చి రమ్మని భువనేష్ ని వరూధిని ఇంటికి పంపుతుంది ప్రభావతి.

    పరమేశ్వర్ కి ఉద్యోగం రావడంతో ఇంటికి అవసరమైన చాలా వస్తువులు కొంటాడు.

    ఇక ది ట్రాప్.. తొమ్మిదవ భాగం చదవండి…

    నగరం నలుమూలలా ఉన్న ఆలయాలలో కార్తీక పూజలు జరుగుతున్నాయి. కార్తీక మాస వేడుకలు శుక్రవారం నుండి కోలాహలంగా ఆరంభమయ్యాయి. ఊరంతటా ఆధ్యాత్మిక శోభ అలుముకుంది. ఉదయమే ఆలయాల స్థానాచార్యులందరూ ప్రధాన అర్చకుల ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    రావి చెట్టు దగ్గర ముత్తయిదువులూ కన్యలూ కలసి కార్తీక దీపాలు వెలిగించారు. మరి కొద్ది రోజుల్లో శ్రీకృష్ణ తులసీ కళ్యాణం. ప్రభావతి భర్తతో బాటు బయల్దేరింది. పవిత్రోత్సవాలు కావున భాగ్యం కూడా వాళ్ళ వెంట వెళ్ళింది. అనంత పద్మనాభ స్వామికి మహాభిషేకం పూర్తయిన తరవాత ప్రసాదాలు అంది పుచ్చుకుని ఇల్లు చేరారు.

    ఇల్లు చేరిన తరవాత భర్త పరాకుగా ఉండటం గమనించిన ప్రభావతి కాఫీ కప్పు అందిస్తూ అడిగింది- “ఏమయింది అలా పరాకుగా పరధ్యానంగా కనిపిస్తున్నారు! ఏమయిందో కట్టుకున్న దానికి చెప్తే కదా మనసు తేలిక పడుతుంది. ఉఁ చెప్పండి”

    “నా తరపున చెప్పడానికి యేమీ లేదు. నిన్ను చూస్తుంటే, నావేపు చూపులు సారించే విధం చూస్తుంటే, యేదో చెప్పాలనుకుని తర్జన పడ్తున్నట్టు కనిపిస్తున్నావు”

    “ఉఁ చెప్పాలనే అనుకుంటున్నాను. మరి, మీ మూడ్ యెలాగుందోనని. మీ డిపీసీ వ్యవహారం పూర్తవలేదుగా!”

    “దానికేముంది? నీ గోడు నువ్వు చెప్పు. ఏదైనా నోము నోచాలనుకుంటున్నావా! వ్రతాలు పూనుకోవాలను కుంటున్నావా! వాటిలో నన్ను కలుపు కోవాలనుకుంటున్నావా?”

    “ఊఁహుఁ! అటువంటివి ఇప్పుడు ఉండవు, ఆలయ దర్శనాలు తప్ప— సుబ్రహ్మణ్యస్వామికి మహాపూజ ఒకటి ఉంది- అంతే--”

    “నువ్వింకా మేటర్ కి రావడం లేదు ప్రభా.. స్ట్రెయిట్ గా విషయానికి రా—’...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/8_N32Mcp5dI

    14 min
  • తీన్ దేవియా | Theen Devia | Telugu short Story | Ch CS Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    తీన్ దేవియా...

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    "బ్రహ్మన్నా! నమస్కారం!" నవ్వుతూ వరండాలో ప్రవేశించాడు. బలరామశాస్త్రి... "రారా బలరామా!... రా..." బ్రహ్మన్నగారి ఆహ్వానం...

    బ్రహ్మన్న ... ఎదురుగా వున్న కుర్చీని చూపుతూ.... "కూర్చో బలరామ!..." చిరునవ్వుతో చెప్పాడు.. ఆ ఇరువురూ.. ఇరుగు పొరుగు వారు.. మంచి స్నేహం...

    బ్రహ్మన్నగారికి ముగ్గురు కుమార్తెలు... లలిత.. పద్మిని... రాగిణి.. లలిత లాయర్... పద్మిని డాక్టర్... రాగిణి పాలీస్ ఇనస్పెక్టర్. రాగిణి వయస్సు ఇరవైమూడు, పద్మిని వయస్సు ఇరవై ఐదు.. లలిత వయస్సు ఇరవై ఏడు... ముగ్గురికీ వివాహం కాలేదు. బ్రహ్మన్నగారికి వున్న సమస్య కుమార్తెల వివాహం కాకపోవడమే...

    "బావా!..." "చెప్పు బలరాం! " "ఇది నేను మాములుగా ఐదేళ్లనుంచి పాడే పాత పాటే..." "పాడు... వింటాను... " స్వచ్ఛమైన చిరునవ్వుతో చెప్పాడు బ్రహ్మన్న....

    "బావా!... నీవు నిజంగా చాలా గ్రేట్.., ముఖంలో ఎలాంటి బాధ లేకుండా ఎంత ఆనందంగా నవ్వుతున్నావయ్యా!.. నీకు నీవే సాటి...." "ఈ పాత పొగడ్త నాకు వద్దు. వియషాన్ని చెప్పు!.." "తప్పుగా అనుకోకూడదు సుమా!...". "నీవు ఒప్పు చెబితే నేను తప్పుగా ఎలా అనుకొంటాను?..."

    బలరామశాస్త్రి తల వేలాడేశాడు.... ఆలోచనలో పడ్డాడు. 'విషయాన్ని బ్రహ్మన్నకు చెబితే ఎలా దాన్ని స్వీరిస్తాడు... ఏది ఏమైనా... నేను వారి శ్రేయోభిలాషిని... చూచినదాన్ని చూచినట్లుగానే వారికి చెప్పడం నా ధర్మం... బ్రహ్మన్న బలరామశాస్త్రి ముఖంలోకి చూచాడు... "ఏమిటి బావా!... దీర్ఘాలోచన!....

    బలరామశాస్త్రి తొట్రుపాటుతో.... "చెబుతున్నా!..."

    "ఆ... చెప్పు బావా!...". “మన... రాగిణి... ఈరోజు మఫ్టీలో వెళ్లిందా!" "అవును..." "నేను చూచాను..." "చూచివుండవచ్చు... ఆ పైన!" "రాగిణి ప్రక్కన ఓ అబ్బాయి.." "వీరాంజనేయులు..." బలరామశాస్త్రి పూర్తిచేయక ముందే నవ్వుతూ చెప్పినాడు బ్రహ్మ...

    "నీకు తెలుసా!..." "ఆ... అమ్మాయి చెప్పింది...". "ఏం చెప్పింది?..." “అతను తనని పెండ్లి చేసుకొంటానని చెప్పినట్లు చెప్పింది..."

    "అంటే!..." "లవ్ !.." నవ్వాడు బ్రహ్మన్న... "బావా!" "అడుగు..." "రాగిణి నిర్ణయం... నీకు సమ్మతమేనా?..." "ఆ... ఆయన పోలీస్ ఈమె పోలీస్.. చూచేదానికి ఈడు జోడు బాగున్నారు. పైన ఆయన మన కులస్థుడే..."

    "అంటే... నీవు ఒకే చేశావన్న మాట...".

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/-BmhSbqNNQk

    17 min
  • సైనైడ్ ఎపిసోడ్ 8 | Cyanide Episode 8 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సైనైడ్ - ఎపిసోడ్ 8

    రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి

    వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు  గారి  ధారావాహిక 'సైనైడ్' ఎనిమిదవ భాగం

    గత ఎపిసోడ్ లో

    ఏ - వన్, శేఖర్ తో మాట్లాడాక బి - వన్ కి కాల్ చేస్తుంది.

    శేఖర్ ని ఫినిష్ చెయ్యమని చెబుతుంది.

    తాను సేకరించిన వివరాల తాలూకు హార్డ్ డిస్క్ ను భార్యకు అప్పగించి, బి - వన్ ని కలుస్తాడు శేఖర్.

    శేఖర్ చేత సైనైడ్ కాప్సూల్ మింగిస్తాడు బి - వన్.

    ఇక సైనైడ్ ఎనిమిదవ  భాగం చదవండి

    ఆ తర్వాత జరిగిన సంఘటనలలో  'శేఖర్ మృతదేహం', ‘హత్య ఉదంతం’ అన్నీ బయట పడిన వెంటనే, శేఖర్ భార్య ఆ విషయాలన్నీ పేపర్లలో చదివి, టీవీలో చూసి, విపరీతమైన వేదనతో, వెంటనే మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి, అతి రహస్యంగా దాచిన 'హార్డ్ డిస్క్' 'ను ఒక సుత్తి తో ముక్కలు ముక్కలుగా కొట్టేసి, అది పిండి అయిపోయిన వరకు, తన మనస్సులోని బాధ అంతా కలిపి, ఆ గుండ ని కొంచెం పెట్రోల్ పోసి తగలబెట్టి, మసి అయిపోయిన తర్వాత, అంతా ఒక ప్లాస్టిక్ బ్యాగులో పెట్టి, ఆ సాయంత్రమే ఒక ఆటో చేయించుకుని, 'ఆర్కే బీచ్ 'లో కి వచ్చి, ఆ బూడిద అయిపోయిన మసిని  బ్యాగ్ లోంచి తీసి, సముద్రపు కెరటాలలో పోస్తు, శేఖర్ ని తలుచుకుంటూ వెక్కివెక్కి ఏడుస్తూ, “చూసారా అండీ! మీ చివరి కోరిక 'భారతదేశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ శత్రువుల చేతిలో పడకుండా’ మీరు చెప్పినట్టే సముద్రంలో కలిపేసాను...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/Rs0H_rcVsJ8

    8 min
  • కాకతి రుద్రమ ఎపిసోడ్ 21 | Kakathi Rudrama Episode 21 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కాకతి రుద్రమ ఎపిసోడ్ 21

    రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 21 వ భాగం

    గత ఎపిసోడ్ లో

    ఏరవీరాదేవి పూజ ముగించుకొని తన సహచరులతో తిరిగి వస్తోంది రుద్రమ దేవి.

    రేచెర్ల రుద్రారెడ్డి, అనుచరులతో రక్షణగా ఆమె వెంట ఉన్నాడు.

    హఠాత్తుగా హరిహర మురారి దేవులు వారిని సైన్య సమేతంగా చుట్టుముడతారు.

    రుద్రమ దేవిని అప్పగించి పారిపొమ్మని రుద్రారెడ్డికి చెబుతారు.

    ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 21 చదవండి..

    వీరభద్రప్రభువు గుర్రము, నోటివెంట నురుగులు కక్కుచున్నది. అయినా వేగం తగ్గించ

    లేదు. అలసట లేదు. మార్గము రాను రాను - ఆ గుర్రము కాళ్ళ వెనుకకు జారిపోయి, దగ్గరవుచున్నది.

    వడ్డిపల్లె నుంచి మొగలిచెర్ల కూతవేటు దూరం. గుర్రమును ఇంక బాధ పెట్టదలచు కోలేదు. వడ్డిపల్లెలో పది గంటలయినది. సూర్యుడు అప్పటికే చురచుర లాడు

    చున్నాడు. గ్రామాధిపతి వీరభద్ర ప్రభువును చూసి, ప్రజలతో వచ్చి నమస్కరించి విధేయతతో నిలబడియున్నాడు.

    వీరభద్రప్రభువు కళ్ళు ఎర్ర గన్నేరులవలె వున్నవి. కంటికి కునుకెరుగడు. ఆత్మల పొరలలో, రుద్రమదేవికి ప్రమాదము జరగగలదని స్పందన మొదలైంది. కాలకృత్యములు తీర్చుకుని, స్నానమాచరించి, కాకతీదేవిని నిష్టగా అయిదు నిమిషములు ప్రార్థించినాడు. ప్రభువు ఆజ్ఞచేత గ్రామాధిపతి సుశిక్షితులైన వీరులనూ, ముఖ్యంగా విలువిద్యా ప్రవీణులను వెంటబెట్టుకుని బయలుదేరెను.

    ఆనాటి ఆంధ్రవీరులు విలువిద్యలో శబ్దమును విని, చోటును గురిచూసి ఒక్కబాణముతో కొట్టగల ధీమంతులు. ఈ విద్యను శబ్ధభేది అంటారు.

    ఇంతలో రథములోపల రుద్రమాంబిక కనుసైగను చూసి, అన్నమాంబిక విల్లును సిద్దము చేసి వుంచింది. రేచర్ల రుద్రసేనాని, ఎట్లా దెబ్బతీయాలా యని మధన పడుతున్నాడు.

    సైన్యం ఏమి చేసైనా- ఆఖరుకు ప్రాణాలు ధారపోసి అయినా తమ చక్రవర్తికి ఏ ప్రమాదమూ జరక్కుండా చూడాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

    వీరభద్రప్రభువు సైన్యంతో మొగలిచెర్ల చేరేసరికి, సాయంత్రం సూర్యుడు క్షీణిస్తున్నాడు. అప్పటికే రుద్రమదేవి ఓరుగల్లు వైపునకు బయలుదేరిందని తెలియవచ్చింది.

    ప్రభువు - ఒక్కక్షణం ఆగి ఏకవీరాదేవికి నిష్టగా ప్రణామం చేసి, మళ్ళీ గాలివేగంతో ఓరుగల్లు వైపునకు బయలు దేరినాడు. గుర్రాలు వేగం అందుకున్నవి. వీరభద్ర ప్రభువునకు చిన్నసైన్యం వెడుతున్నట్టు కనిపించింది.

    గుర్రాల గిట్టల చప్పుడువిని రుద్రమదేవి అన్నమాంబిక చెవిలో- ‘మన సైన్యం వస్తున్నది’ అన్నది . అన్నమాంబిక చిరునవ్వు నవ్వింది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/62z9pklak60


    17 min
  • ‘చిన్నదొర’ రియాలిటీ షో | Chinna Dora Reality Show | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ‘చిన్నదొర’  రియాలిటీ షో

    రచన, పఠనం : మల్లవరపు సీతారాం కుమార్

    "మైకం టీవీ ఎండీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు.. నేను వారి అసిస్టెంట్ సోనియాను మాట్లాడుతున్నాను..."

    ఫోన్ లిఫ్ట్ చెయ్యగానే అవతలి వైపునుండి వినపడ్డ మాటలకి కిరణ్మయి ఉబ్బి తబ్బిబ్బయింది.

    ఆమె ఒక యువ రచయిత్రి. ఇటీవలే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి కథలు రాయడంతో పాటు, తానే డైరెక్ట్ చేసింది. ఒక కొత్త టీవీ ఛానల్ వాళ్ళు వాటిని ప్రసారం చేశారు.

    అనూహ్యంగా ఆ ఛానల్ టీఆర్ఫీ బాగా పెరిగింది. మరికొన్ని  షార్ట్ ఫిలిమ్స్ చేసి పెట్టమని కోరారు వాళ్ళు.

    కానీ ఆ ఛానల్ చూసే వాళ్ళు కొద్దిమందే.

    ఏదైనా ప్రముఖ టీవీ ఛానల్ లో అవకాశం వస్తే బాగుండునని ఎదురు చూస్తోంది.

    ఈ రోజు ఇలా మైకం టీవీ వారినుండి కాల్ రావడంతో ఆనందంతో నోట మాట రాలేదు కిరణ్మయికి.

    "హలో మేడం... లైన్ లోనే ఉన్నారా.." అంటూ అటు వైపు నుండి సోనియా అడగడంతో, ఈ లోకంలోకి వచ్చింది కిరణ్మయి.

    "అనుకోని సర్ప్రైజ్ కదా.. మాట రాలేదు. చెప్పండి. ఎప్పుడు కలవాలి? కలవడానికి వచ్చేటప్పుడు ఏవైనా షార్ట్ ఫిలిం కథలు తేవాలా?" అతృతతో అడిగింది కిరణ్మయి.

    ఆమె ఎగ్జైట్మెంట్ కి కారణం ఉంది.

    గత ఏడాది వరకు టాప్ పొజిషన్ లో ఉన్న ఛానల్ అది.

    సాగతీత సీరియల్స్ దెబ్బకి ఇటీవల కాస్త వెనకపడింది.

    బహుశా తన షార్ట్ ఫిలిమ్స్ తో తిరిగి పుంజుకోవాలని అనుకుంటున్నారేమో...

    "మా ఎండీ గారిని కలిశాక మరింత సర్ప్రైజ్ అవుతారు. ఖాళీ చేతులతో రండి చాలు. వీలయితే ఇప్పుడే కలవండి. మీ అడ్రస్ చెబితే కారు పంపిస్తాము" చెప్పింది సోనియా.

    తన అడ్రస్ చెప్పి ఆనందంతో ఫోన్ పెట్టేసింది కిరణ్మయి.

    వెంటనే ఆఫీస్ లో ఉన్న భర్తకు కాల్ చేసి తనకు వచ్చిన ఫోన్ గురించి  చెప్పింది.

    "కంగ్రాట్స్ కిరణ్.. మంచి అవకాశం వచ్చింది. గో ఎహెడ్" అంటూ అభినందించాడు ఆమె భర్త ప్రవీణ్.

    హాల్లో టివి చూస్తున్న అత్తమామల దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పింది.

    "అయితే ఇక మీదట టివిలో నీ సీరియళ్ళే చూడొచ్చన్నమాట" అన్నారు కిరణ్మయి అత్త జానకమ్మగారు.

    "మాకు మాత్రం రాబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ముందుగానే చెప్పాలమ్మాయ్" అన్నారు మామ రాఘవరావు గారు.

    వాళ్ళిద్దరికీ నవ్వుతూ సమాధానం చెప్పి రెడీ కావడానికి తన గదికి వెళ్ళింది కిరణ్మయి.

    ఓ పావుగంటలో రెడీ అయి హాల్లోకి వచ్చి, అత్తగారి పక్కన కూర్చుంది.

    కోడలు టెన్షన్ పడుతున్నట్లు గమనించిన అత్తగారు టివి రిమోట్ కోడలి చేతికిచ్చి, "కారు వచ్చేవరకు ఏదో ఒక ప్రోగ్రాం చూస్తూ ఉండమ్మా" అంది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/4Tv0ZJKVHis



    19 min
  • సంపత్ సినిమా కథలు - 1 | Sampath Cinema Kathalu - 1 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సంపత్ సినిమా కథలు - 1

    రచన : S. సంపత్ కుమార్

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    S. సంపత్ కుమార్ గారి ధారావాహిక సంపత్ సినిమా కథలు ప్రారంభం

    రేపు సాయంత్రం 6 గంటలకు  అప్పాయింట్మెంట్

    ఇప్పుడు సాయంత్రం 6 గంటలు

    అబ్బా ఇంక 24 గంటలు

    ఒకపక్క ఆనందం మరోపక్క ఒకటే టెన్షన్

    అప్పాయింట్మెంట్  అంటే  డాక్టర్ది  కాదు

    అందరు అప్పాయింట్మెంట్ అంటే అదే అని సాధారణంగా అనుకుంటారు

    ఒక సినీ ప్రొడ్యూసర్ నా కథ వినడానికి ఇచ్చిన సమయం

    అది ఒక ప్రముఖ డైరెక్టర్ రేకమొండేషన్ ద్వారా.

    రాత్రంతా నిద్ర పట్టలేదు.

    కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి

    లేకుంటే ఏవో చిన్న చిన్న కథలు రాసుకొని వార పత్రికలకు  పంపి వాళ్ళు ఇచ్చే రేమునిరేషనుతో తృపిపడలి అనుకున్న నాకు ఇప్పుడు సువర్ణ అవకాశం వచ్చింది.

    రాసుకున్న కథ ఇప్పటికే వందసార్లు చదవుకున్నాను.

    ముందు స్టోరీ లైన్ చెప్పి, నచ్చితే కథ ఎలా చెప్పాలి అనేది ప్రిపేర్ అయ్యాను.

    ఇంక కథ నచ్చితే స్క్రిప్ట్ వర్క్ తయారు చేసుకోవచ్చు .

    తెల్లారింది.

    సమయం ఉదయం 6 గంటలు.

    రాత్రి నిద్రరాక  2  గంటలు తర్వాత నిద్రపట్టింది.

    ఇప్పుడు ఉదయం 6 గంటలు

    ఇంక సాయంత్రం 6 గంటలు ఎప్పుడవుతుందా  అని ఎదురుచూస్తున్న

    మధ్యలో ఫ్రెండ్స్ నుండి కాల్స్ వస్తున్న అసలు విషయము చెప్పలేదు.

    ముందుగా  చెబితే అయ్యే పని కాకుండ పోతుందని.

    సమయం సాయంత్రం 5 గంటలు.

    రెకమెండ్ చేసిన డైరెక్టర్ కాల్.

    రెడీగా ఉండు కారు వస్తుందని.

    15 నిమిషాల తర్వాత కారు వచ్చి నా రూమ్ ముందు ఆగింది.

    కారు వస్తుందని తెలుసు.

    వచ్చే ముందే నీటుగా  రెడీ అయివున్న.

    నేను ఎక్కిన కారు  డైరెక్టర్ ఇంటిముందు ఆగింది.

    అప్పటీకే ఆయన కూడ రెడీగా ఉన్నాడు.

    కారు జూబ్లీహిల్లుసులో ఒక అపార్ట్మెంట్ దగ్గర ఆగింది.

    అప్పుడు టైం సాయంత్రం పది నిమిషాలు తక్కువ 6 గంటలు.

    కరెక్ట్   టైముకు  వచ్చాం.

    నీవు కథ చెప్పబోయే ప్రొడ్యూసర్  అపార్ట్మెంట్ ఇదే అన్నాడు డైరెక్టర్.

    చిరునవ్వుతో  " అవునా" అంటూ తల ఊప.

    లిఫ్టులో సెకండు ఫ్లోర్, ఫ్లాట్ నెంబర్ 15 దగ్గర కొచ్చి కాలింగ్ బెల్ నొక్కగానే,

    ప్రొడ్యూసర్ పర్సనల్ అసిస్టెంట్  డోర్ తీసి , డైరెక్టరును చూడగానే నవ్వుతు నమస్కారం  పెట్టాడు .

    ప్రొడ్యూసర్ ఆపీసు రూంలో కూర్చున్నాము.

    ఇంతలో కాఫీ వచ్చింది.

    కాఫీ మేము తాగిన వెంటనే ప్రొడ్యూసర్ వచ్చాడు.

    నమస్కారాలు అయిన వెంటేనే,

    "ప్రముఖ హీరోతో నేను తీసిన  క్లాస్ మూవీ అనుకుంతా రిజల్ట్ ఇవ్వలేదు .ఇప్పుడు  ఉన్న కొత్తతరం మాస్ ఫాలోయింగ్ బట్టి అన్ని హంగులు ఉన్న కమర్షియల్ సినిమా ఇప్పుడు ఉండే ప్రముఖ హీరోలతో చెద్దామంటున్నాను మరి వైరెటి గా ఉండే కథ

    నీ దగ్గర ఉంది అని మా డైరెక్టర్  అన్నాడు. అయితే ముందు నేను ఆ కథ విన్న తర్వాత బాగుంటే మనం ఇప్పుడు ఉండే ఏ హీరో బాగుంటడో చూసి ఆ హీరోకు కథ వినిపిద్దాము" అంటూ  ప్రొడ్యూసర్ నా వంక చూస్తూ  కథ చెప్పమన్నాడు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/6rYgXQUSH0w

    12 min
  • ఇల్లు అద్దెకు ఇవ్వబడును | Illu Addeku Ivvabadunu | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఇల్లు అద్దెకు ఇవ్వబడును

    రచన : జీడిగుంట శ్రీనివాసరావు

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    అది ఆరు ఫ్లాట్స్ కలిగిన అపార్ట్మెంట్. మంచి డిమాండ్ వున్న ఏరియా లో వుంది. అందులో ఒక ఫ్లాట్ అమెరికాలో వున్న ప్రవీణ్ ది. దాని బాధ్యతలని హైదరాబాద్ లో వున్న మామగారు కుమార్ కి అప్పగించారు. రెంట్ కి యివ్వడం, రిపేర్స్ వుంటే చూడటం కుమార్ పని. పక్క ఫ్లాట్ లో వున్న రాజేష్ కి మా ఫ్లాట్ కూడా చూసుకోమని చెప్పి, కుమార్ రెంట్ పడిందో లేదో చూసుకునే పని పెట్టుకున్నాడు.

    కరోనా టైం లో ఖాళీ అయిన ఫ్లాట్ కరోనా తగ్గిన చాలా రోజులకి ఒక బిజినెస్ మ్యాన్ కి యిచ్చి, అమ్మయ్య అనుకున్నాడు. మొదటి నెల నుంచే అద్దె యివ్వడం లేట్ చేయడం, ఆలస్యం కి ఏదో కారణం చెప్పడం మొదలుపెట్టాడు టెనంట్.

    ప్రతీ నెలా అడుకుంటే గాని అద్దె రావటం లేదు. అమెరికా నుంచి కూతురు 'అటువంటి వాడికి ఎలా యిచ్చారు డాడీ, ఇల్లు కదలకుండా ఎవడికి పడితే వాళ్ళకి యిస్తే యింతే', అంటూ నిష్ట్ఠురం గా మాట్లాడటం తో, అద్దెకు వున్న అతనికి నోటీసు యిచ్చి ఖాళీ చేయమని చెప్పి, మళ్ళీ అద్దెకు ఇవ్వబడును బోర్డు తగిలించాడు.

    బోర్డు పెట్టిన రోజు నుంచి ఫోన్ కాల్స్ ఎక్కువ అయిపోయాయి. రాజేష్ వచ్చిన వాళ్ళకి చూపించడం, చూసిన వాళ్ళు మళ్ళీ వస్తామని చెప్పడం, రాకపోవడం..

    మొత్తానికి ఒక ఆదివారం, ఒకళ్ళు ఇల్లు చూసి, కుమార్ కి ఫోన్ చేసి ఇల్లు నచ్చింది మాకు, మీ అడ్రస్ యిస్తే వచ్చి వివరాలు మాట్లాడి అడ్వాన్స్ యిస్తామని చెప్పారు.

    మొత్తానికి ఎవరో తీసుకుంటామని ముందుకు వచ్చారు అనుకుని, వాళ్ళని రమ్మన్నాడు కుమార్.

    ఒక గంట తరువాత కారులో నుంచి యిద్దరు ఆడవాళ్లు, ఒక మొగతను దిగి లోపల కి వచ్చి కూర్చున్నారు.

    "మీరు ఎక్కడ పని చేస్తున్నారు, మీ వివరాలు చెప్పండి" అన్నాడు కుమార్.

    ఆ వచ్చిన అతను ఒక స్త్రీ ని చూపించి, "ఈవిడ నా భార్య, రెండవ ఆమె నా చెల్లెలు. నేను అమెజాన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని" అన్నాడు.

    "మేము మా ఇల్లు ఫ్యామిలీ కే యిస్తాము. మీరు ఫ్యామిలీ కాబట్టి మీకు యివ్వడానికి యిబ్బంది లేదు. అద్దె ప్రతీ నెల 5 వ తేది కి యివ్వాలి. లేట్ చేయడానికి వీలులేదు" అని చెప్పాడు కుమార్.

    వాళ్ళు కుమార్ చెప్పిన కండిషన్స్ కి ఒప్పుకుని, అడ్వాన్స్ యిచ్చి, "ఫస్ట్ కి వచ్చి జాయిన్ అవుతాము. ఇల్లు క్లీన్ చేయించండి" అని చెప్పి వెళ్లిపోయారు.

    వాళ్ళు వెళ్లిన ఒక అర గంటకి, ఒకతను ఫోన్ చేసి, "కుమార్ గారితో మాట్లాడాలి" అన్నాడు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/GeVNvGXtxcI


    9 min
  • ప్రేమ‘భ్రమ’రం - 11 | Prema Bhramaram - 11 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ప్రేమ ‘భ్రమ’రం - 11

    రచన: వసుంధర

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    వసుంధర గారి ప్రేమ ‘భ్రమ’రం ధారావాహిక పదకొండవ భాగం

    గత ఎపిసోడ్ లో...

    ముక్త నన్ను అర్జునుడికి గీతాబోధ చేసిన  శ్రీకృష్ణుడితో పోలుస్తుంది.

    ముక్త ప్రేమించింది అమోఘ్ అని తెలుసుకొని ఆశ్చర్య పోయాను. అమోఘ్‌, రిక్తలు కలిసిఉన్న ఫోటో తీసి, తనకు చూపమంటుంది ముక్త.

    అమోఘ్ ఇంటికి వెళ్లి రిక్తను చూపమంటాను.

    ఇక  ప్రేమ  ‘భ్రమ’రం పదకొండవ భాగం వినండి ...

    రిక్త.

    నా ఎదురుగా ఉంది.

    భ్రమ కాదు. నిజంగా మనిషే!

    ఈ విషయం తెలిస్తే - ముక్త ఏమౌతుంది?

    ‘‘నమస్తే’’ అన్నాను.

    ఆమె బజ్జీ చేతిలోకి తీసుకుంది.

    నేను, అమోఘ్‌ ఆమె ననుసరించాం.

    ఆమెకి చాలా ఇష్టంలా ఉంది. వరుసగా నాలుగు బజ్జీలు తినేసింది.

    ఇస్సు ఉస్సనలేదు. ముఖంలో చిరునవ్వు చెదరలేదు.

    నాకు మిర్చిబజ్జీ ఇష్టమే కానీ - కాస్త కారంగా ఉంటే చాలు - నోరు మండుతుంది. తట్టుకోలేను.

    ఆమెను చూసి ప్రభావితుణ్ణై - ఒక బజ్జీ కొరికాను.

    చుర్రుమంది - మరో బైట్‌  తీసుకోవాలంటే భయం పుట్టేలా -

    అమోఘ్‌ చెప్పినట్లు బజ్జీలో కొరివికారం కానీ కూరేరా?

    కానీ రిక్త ఏమిటి - అంత సుకుమారంగా కనబడుతున్న ఆడపిల్ల - బజ్జీల్ని కసకస నమిలేస్తోంది.

    నేను అసహాయంగా అమోఘ్‌ వంక చూశాను.

    ‘‘మేం కారం బాగా తింటాం. మీకు నప్పకపోతే - మొహమాటపడి తినద్దు’’ అన్నాడు అమోఘ్‌.

    ఆ మాట రిక్తను సమర్థించడానికి అన్నట్లుంది.

    ఎందుకంటే - తను కూడా మొదటి బజ్జీ సగమే తిన్నాడు.

    నా అవస్థ కనిపెట్టిన అమోఘ్‌ రూప వంక చూస్తే - ఆమె లోపలికెళ్లి - మరో గిన్నెడు బజ్జీలు తెచ్చింది.

    ‘‘భయపడద్దు. ఇవి అరటికాయ బజ్జీలు’’ అన్నాడు అమోఘ్‌.

    మేమిద్దరం వాటిమీద పడ్డాం...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/HFj-5Cmc3nI

    23 min
  • వీరి మధ్యన ఎపిసోడ్ 8 | Veeri Madhyana Episode 8 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వీరి మధ్యన... ఎపిసోడ్ 8

    రచన: బివిడి ప్రసాదరావు 

    బివిడి ప్రసాదరావు గారి  ధారావాహిక 'వీరి మధ్యన..' ఎనిమిదవ భాగం

    గత ఎపిసోడ్ లో…

    సేల్స్ గర్ల్ గా వచ్చిన ఆమె తనతో ప్రవర్తించిన తీరును సాహసితో చెబుతాడు సామ్రాట్.

    అతని నిజాయితీకి సంతోషిస్తుంది సాహసి.

    ఆ సేల్స్ గర్ల్,  సామ్రాట్ ని పరీక్షించడానికి తాను ఏర్పాటు చేసిన వ్యక్తి అనే విషయం అతని ముందు అంగీకరిస్తుంది.

    స్నేహితుల పెళ్లికోసం ఇద్దరూ తిరుమల వెళ్తారు.

    ఇక వీరి మధ్యన..   ఎనిమిదవ భాగం చదవండి...

    "ఈ టైంకి నాకు టీ పడాలబ్బా." అన్నాడు సామ్రాట్ గుణుస్తూ.

    "ఓకే బాబూ. నువ్వు తెప్పించుకో." అంది సాహసి చొరవగా.

    "నిన్ను ఎదురుగా పెట్టుకొని ఒంటరిగా తాగడమా. నో. వద్దులే." అనేశాడు సామ్రాట్ సరదాగా.

    "కాదు బాబూ. తెప్పించుకో" చెప్పింది సాహసి.

    "ఒక పని చేస్తా. టీ తెప్పించుకుంటా. నీకు కొద్దిగా షేర్ చేస్తా." చెప్పాడు సామ్రాట్.

    "మొండిగా అగుపిస్తున్నావు. సర్లే. కానీ." అనేసింది సాహసి.

    బోయ్ ని పిలిచి, "ఒక టీ. ఒక ఖాళీ గ్లాస్." చెప్పాడు సామ్రాట్.

    సామ్రాట్ ని ఎగదిగా చూసి వెళ్లి పోయాడు బోయ్.

    "ఒన్ బై టూ అనవలసింది." అంది సాహసి. తను బోయ్ చేష్టని చూసింది.

    "అబ్బే. ఐ వాంట్ సమ్ థ్రిల్." అన్నాడు సామ్రాట్ నవ్వేస్తూ. సాహసి కూడా నవ్వేసింది.

    పావు గంట పిదప, కాఫీ కేఫ్ నుండి ఆ ఇద్దరూ బయటికి వచ్చారు. తిరిగి తమకు కేటాయించిన వసతుల వైపు నడుస్తూ మాట్లాడుకుంటున్నారు.

    "ఆ జ్వాలను లంచ్ టైంలో చూశాను. తను ఈ పెళ్లికే వచ్చినట్టు ఉంది." చెప్పాడు సామ్రాట్.

    "మరి. తనూ కవితకు తెలిసిందే." చెప్పింది సాహసి.

    ఆ వెంబడే, "ఏం. ఏమైనా మాట్లాడిందా." అడిగింది.

    "అబ్బే. నన్ను చూస్తూనే చరచరా ఎటో వెళ్లి పోయింది." చెప్పాడు సామ్రాట్ నవ్వుతూ.

    సాహసి నవ్వుకుంది.

    తర్వాత, ఆ ఇద్దరూ విడిపోయి, ఎవరి తోవన వారు నడిచారు.

    డిన్నర్ సమయంలో సాహసి, సామ్రాట్ లు ఒకర్ని ఒకరు చూసుకున్నారే తప్పా, మాట్లాడుకునే అవకాశం వాళ్లకి చిక్కలేదు.

    పెళ్లి మండపంలో, వేదిక మీద, కవిత పక్కకి సాహసి, రమేష్ పక్కకి సామ్రాట్ చొరవగా చేరిపోయి, ఇద్దరూ అక్కడ చక్కగా, చలాకీగా మెసులుకున్నారు.

    కవిత, రమేష్ ల పెళ్లి ముచ్చటగా ముగిసింది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/ErrUWT7W6Go

    15 min
  • సంస్కృతి | Samskruthi | Telugu Short Story | Kiran Jammalamadaka | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సంస్కృతి

    రచన: కిరణ్ జమ్మలమడక

    పుట్టినరోజు ప్రతిఒక్కరి జీవితంలో గొప్ప క్షణాలలో ఒకటి.

    ధరణి , శేఖర్ లకు ఒక రెండేళ్ల పాప ‘పావని’.

    పావని పుట్టినరోజు అనాధాశ్రమం లో జరపాలని

    ధరణి ఏర్పాట్లు చెయ్యటం మొదలు పెట్టింది. శేఖర్ ఒకరిద్దరు మిత్రులను కూడా ఆహ్వానించాడు. అంతా కలిపి ఒక పదిమంది అయ్యారు.

    ఆ ఆలోచన వచ్చిన దగ్గరనుంచి ధరణి కి ఎంతో ఆనందం గా వుంది. ఒక వారం క్రితమే తమకు దగ్గర్లో వున్న ఆశ్రమానికి ఫోన్ చేసి, అక్కడ వార్డెన్ సరస్వతి గారితో మాట్లాడింది. వార్డెన్ కూడా సరే అని అక్కడ పిల్లల వివరాలు చెప్పారు.

    అప్పటినుంచి నుంచి ధరణి ఆ ఏర్పాటుల్లోనే వుంది.

    అక్కడ పిల్లలకి కొన్ని బొమ్మలు కొంది. శేఖర్ కేటరింగ్ ఇద్దామన్నా , తనకు తృప్తి గా ఉండదని తానే చేస్తాను అని మొత్తం తానే చెయ్యటానికి పూనుకుంది. రేపటికి ఒక్క భోజనం తప్ప అన్ని రెడీ.

    తెల్లవారుజామునే లేచి , యేభై మందికి బిర్యానీ చేసి , పాపని తయారు చేసి, భోజనం సమయానికి ఆశ్రమం చేరుకున్నారు. చెప్పినట్టుగానే శేఖర్ మిత్రులు కూడా వచ్చారు రాగానే శేఖర్, ధరణిలను వాళ్ళ మంచి ఆలోచనకు మెచ్చుకున్నారు.

    అందరూ వెళ్లి వార్డెన్ని కలిసి, కేక్ కటింగ్ చేద్దామని పిలిచారు. వార్డెన్, అక్కడ ఉన్న సిబ్బందిలో ఒకరికి చెప్పి ఏర్పాట్లు చూడమని పురమాయించింది. ధరణి మొదటిసారి, ఫోన్ చేసినప్పటినుండి ఆ వార్డెన్ కొంత ముభావంగానే వుంది. ఆమెకు ఇష్టంలేదా? అన్న అనుమానం ఇప్పుడు మరింత బలపడింది ధరణికి.

    కానీ ఎవరైనా ఎందుకు వద్దంటారు? పనిగట్టుకొని వొచ్చి పిల్లలకి బొమ్మలు, బిర్యానీ పెడతామంటే? అని తనని తానే

    సముదాయించుకొని పనిలో పడింది.

    పిల్లలంతా ఒక చిన్న హల్లో చేరారు. అక్కడ ఒక టేబుల్ పెట్టారు. దాని మీద ధరణి తెచ్చిన దుప్పటి పరిచి, ఒక అడుగున్నర ఎత్తున్న కేక్, దానిమీద ఒక అమ్మాయి బొమ్మ.. చూడడానికి చాలా బావుంది. అది దానిమీద పెట్టగానే, పిల్లలు అంత నోరెళ్ళబెట్టి చూడటం ధరణి గమనించి

    నవ్వుకుంది సంతోషంగా. పాప చేత కేక్ కటింగ్ కి అన్ని సిద్ధం చేసారు.

    కానీ వార్డెన్ సరస్వతి ఇంకా రాలేదు. ఆమెని పిలిస్తేకాని రాదనుకుంటా అని ధరణి కొంచెం అసహనంతో ఆమె దగ్గరకు వెళ్లి, పిలుచుకొచ్చింది. ఆమె రావటం, పాప కేక్ కట్ చేయటం, బుడగలు, కాగితపు బాణాసంచ కాల్చడము, శేఖర్, ధరణి పాపని ఆశీర్వదించటం.. శేఖర్ మిత్రులు పాప పైన అక్షింతలు వేసి గిఫ్ట్స్ ఇవ్వటం.. అంతా చక

    చక జరిగిపోయాయి...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/od6V9GwmNPw

    9 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world