Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • కాకతి రుద్రమ ఎపిసోడ్ 22 | Kakathi Rudrama Episode 22 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కాకతి రుద్రమ ఎపిసోడ్ 22

    రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 22 వ భాగం

    గత ఎపిసోడ్ లో

    అన్నమాంబిక ధనస్సు నందుకుని, మురారి దేవుని శిరస్సు ఖండించబోయినది.

    హరిహర దేవుడు, అన్నమాంబిక ధనస్సును ఖండించాడు.

    అక్కడికి చేరుకున్న వీరభద్రుడు దూరంనుండే ఒక బాణంతో హరిహరదేవుని శిరస్సు ఖండించాడు.

    రుద్రమ దేవి, తన బాణంతో మురారి దేవుని సంహరించింది.

    ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 22 చదవండి..

    మంజీర నదిని దాటడం బ్రహ్మప్రళయమే అయినది. మంజీర నదిని దాటి, కాకతీయుల నెగ్గినంత సంబరపడినారు. మహాదేవరాజునకు వచ్చేది వానాకాలమని తెలియును. అందుకు తగిన సన్నాహా

    లతో యుద్దయాత్ర ప్రారంభించినాడు. కోట్లకొలది చాపలను, వెదురు ఊచలను కూడా పట్టించుకొని వచ్చినాడు. దానితో లక్షలకొలది నివేశాలు నిర్మించడం, వానలు వెలిసిన వెనుక ముందుకు సాగడం, ఈ రీతిగా అంచెలుగా యుద్దయాత్ర సాగుచున్నది.

    గోనగన్నారెడ్డి బలాలు, చౌండుని బలాలు యాదవుని సేనావాహిని ముప్పుతిప్పలు పెడుతూ నాశనం చేయసాగినవి. ఎప్పుడు ఓరుగల్లు జేరుదామా, ఎప్పుడు మహానగరం చుట్టూవున్న పాళెములన్నీ

    ఆక్రమించుకొని, తాను నిశ్చయించుకున్న వ్యూహం ప్రకారం ముట్టడి సాగించడమా అని తహతహ జనించినది మహాదేవరాజునకు!

    నెల ముట్టడి సాగేసరికి ఆంధ్రులు కాళ్ళ బేరానికి వస్తారు. ఆడదాని రాజ్యం అంటే అసహ్యము కొలది తనతో కలిసి

    పోదురు. ఈ లాంటి ఆశతో ఏ మాత్రమూ పట్టుదల సడలకుండా మహాదేవరాజు ప్రయాణం చేస్తున్నాడు మహావాహినితో.

    గన్నారెడ్డి యుద్దతంత్రాలు అర్థం చేసుకుని మహాదేవరాజు, కొన్ని ఎత్తుగడలు, రక్షణలు సృష్టించాడు. రాళ్ళచక్రాలున్న కొండల్లాంటి బళ్ళు కట్టించాడు. ఆ బళ్ళపైన చిన్న చిన్న కర్రకోటలు, ఎనమండుగురు, పదిమంది పట్టేవి కట్టించాడు. ఆ రథాలను ఎనిమిది జతల ఎద్దులు లాగుతుంటాయి.

    బండిమీద చిన్న కర్రకోట గోడలతో ఉన్న వీరులు బాణాలు వేయడానికి పెద్దరంద్రాలు చేయించాడు. వీరిని సేనల చూట్టూ మహాదేవరాజు ఉంచినాడు. విరోధి కనబడగనే శత్రువును చూచి కోటలబండ్లు ఆపుచేయించి వారిని కోటగోడలా చేశాడు. ఈ ఏర్పాటు గన్నారెడ్డి బాగా అర్థం చేసుకున్నాడు. యుద్దచమత్కృతి అంతా ఎత్తుకు పై ఎత్తు వేయుటలోనే ఉంది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/oqMkMNkaB8c



    18 min
  • చంటబ్బాయ్ | Chantabbay | Telugu Short Story | Gorthi Vani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    చంటబ్బాయ్! 

    రచన : గొర్తి వాణిశ్రీనివాస్

    కథ చదివి వినిపిస్తున్న వారు: కే. లక్ష్మి శైలజ

    ఆమె పేరే రెండు జళ్ళ సీత. అందాల భరిణె.

    గుమ్మానికి జారగిలపడి ఒంటిజడ తిప్పుతూ వాకిట్లో నిలబడి, చంటబ్బాయ్ కోసం కళ్ళల్లో బ్యాట్రీ లైట్లు వేసుకుని ఎదురు చూస్తోంది.

    అతగాడు ఎంత సేపటికీ రాకపోవడంతో నీరసంగా మెట్లమీదే కూలబడి కునికిపాట్లు పడుతోంది.

    ఆమె ఊరికే కూర్చున్నా, మనసు ఊరుకోకుండా అల్లరిగా

    గెంతుతూ, సైకిల్ చక్రం తిప్పుకుంటూ.. గతంలోకి పరిగెత్తింది.

    సీత తన స్నేహితురాలి పెళ్లికి వెళ్ళినపుడు, ఆ పెళ్లిలో పెళ్ళికొడుకు తలపై తలంబ్రాలు పడకుండా వెనక్కి లాగే వర్గంలో చంటబ్బాయ్,

    ఇటుపక్కన పెళ్లికూతుర్ని వెనక్కి లాగేసి, వెక్కిరించే గ్రూప్ లో సీత

    విజయవంతంగా పోటీ పడుతున్నారు.

    నువ్వా నేనా అన్నట్టు హుషారుగా సాగుతున్న తలంబ్రాల ఆటలో చంటబ్బాయ్ ఒకపక్క, సీత మరోపక్కా చేరి సందడి చేస్తుండగా ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి.

    చిలిపి ఊసులాడుకున్నాయి.

    ఆ చూపులు కలిసిన శుభవేళ లో చంటబ్బాయ్ సీతకి బాగా నచ్చేసాడు.

    కనులు కనులు కలిసాయంటే ప్రేమ అని దానర్థం అనుకుంటూ ఒకరి వెనకాల ఒకరు తిరుగుతూ పెళ్లి పందిరిలో మనసిచ్చి పుచ్చుకున్నారు.

    వివాహ భోజనంబు చేస్తున్నప్పుడు చంటబ్బాయ్ ఓరచూపులు, వడ్డిస్తున్న సీత వీపుకి గుచ్చుకున్నాయి.

    వెనక్కి తిరిగి చూసి, "పిలిచారా?" అంది కళ్ళెగరేసి.

    "ష్. . . గప్ చుప్ గా ఉండు. మనిద్దరం మాట్లాడుకున్నట్టు మా నాన్న చూస్తే నా తాట తీస్తాడు. మనం తెలుకుట్టిన దొంగలల్లే ఏం తెలీనట్టు వుండాలి” అని శ్రీకృష్ణుడిలా గీతోపదేశం మొదలు పెట్టాడు చంటబ్బాయ్.

    ఆమాటకి సీత హర్ట్ అయ్యింది. బోల్డంత కోపం కూడా వచ్చింది.

    ఆ కోపంతోనే విసురుగా వెళ్లి బుంగమూతి పెట్టుకుని, ఆ పక్కనే వున్న బాబాయ్ హోటల్ కి వెళ్లి కూర్చుంది.

    అప్పుడే అక్కడికి వచ్చిన చిన్ని కృష్ణుడు సీతని చూసాడు.

    ఆహా ఎంత బావుందో అనుకున్నాడు.

    దగ్గరకు వచ్చి మాట కలిపాడు.

    "ఈ లంగా ఓణీలో రెండు జళ్ళ సీతలా ఉన్నావ్" అన్నాడు.

    "నా పేరు సీతే" అంది సీత.

    "నువ్వింత సంప్రదాయ బద్ధంగా వుండికూడా మోడ్రన్ పేరు పెట్టుకున్నావే.

    సీత. . పేరు గుర్తుపెట్టుకోవాల్సిన పేరు. " అన్నాడు నాలుగైదుసార్లు అనుకుంటూ.

    ఇద్దరూ ఒకే పెళ్లికి వచ్చారని తెలుసుకుని

    నవ్వుకున్నారు.

    ఇదంతా దూరం నుంచి చూస్తున్న చంటబ్బాయ్ గుండె తుప్పుపట్టిన గ్యాస్ స్టవ్ బర్నర్ లా ఎర్రగా మండింది.

    ఈగలు ముసురుతున్న గాజుగ్లాసుపై తన ప్రతాపం చూపించాడు. దాన్ని కోపంగా నలిపేశాడు. అది చేతిలో పగిలి సున్నిపిండిలా జలజలమని నేల మీద కుప్పగా రాలింది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/eVng5mbZwXU

    7 min
  • ఆ రోజుల్లో... ఆ ఇద్దరు.... | Aa Rojullo Aa Iddaru | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఆ రోజుల్లో... ఆ ఇద్దరు....

    రచన: సిహెచ్. సీ. ఎస్. శర్మ 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    అది కరోనా సమయం.

    అయినా వాళ్లే ఒకరినొకరు దూరం పెడుతున్న రోజులు.

    అలంటి సమయంలో తమకు ఏమీకాని కూలీల కోసం ఒక లారీ డ్రైవర్, క్లీనర్ చూపిన మానవత్వం ఎంతో అభినందనీయం, అందరికీ ఆచరణీయం.

    మానవత్వపు విలువలను చాటి చెప్పే ఈ కథను చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారు రచించారు.

    2019 నవంబర్ ... డిశంబర్లో చైనాలో మహమ్మారి పుట్టి ప్రబలి వ్యాపించి 2020 ఫిబ్రవరి మార్చి నాటికి యావత్ ప్రపంచాన్ని కమ్ముకొని... లక్షల్లో వ్యాధి పీడితులు కాగా... లక్షల్లో మరణాలు సంక్రమించాయి.

    సువిశాల భారత దేశంలో.... నిర్విరామంగా కొనసాగే అనేక రకాల కట్టడ నిర్మాణాల్లో పనిచేసేటందుకు కూలీలు... ఒక ప్రాంతాన్నుంచి మరో ప్రాంతానికి (పనిదొరికే చోటికి) వెళ్లి పనిచేసుకొంటూ పొట్ట నింపుకుంటారు. అలాగే అనేక రకాల వస్తువులను లారీ ట్రాన్స్‌పోర్టు సర్వీస్లు... ఒక వూరి నుండి మరొకపూరికి చేరవేస్తుంటాయి.

    దేశంలో కరోనా వ్యాధి తీవ్రత వలన 'లాక్డౌనును గవర్నమెంటు అమలు పరచింది. మాస్కులు... సోషల్ డిస్టెన్స్... విధిగా జనం అంతా పాటించవలసిన సమయం... వ్యాధి తీవ్రతగా సంక్రమించిన ప్రాంతాలను రెడ్ జోన్స్... నలువైపు కట్టుదిట్టాలతో ఇతరులు... ఆ ప్రాంతానికి రాకుండా రక్షకభటుల బందోబస్తులు నిర్దేశింపబడిన సమయం... రాముడు లారీ డ్రయివర్....

    అతని శిష్యుడు క్లీనర్ అంజి... ప్లయ్‌వుడ్‌ను హైదరాబాద్ ఎల్.బి.నగర్. గోడౌన్లో దించారు. తిరుగు ప్రయాణం వయా కడప తిరుపతి... మీదుగా చెన్నైకి చేరాలి...

    కరోనా కారణంగా కట్టడ నిర్మాణాలు అపివేయబడ్డాయి. వలసగా వచ్చిన కూలీలకు పనిలేని కారణంగా కూలీ డబ్బులు రానందున... మహానగరంలో పప్పు నిప్పు నీరు... కూడా కొనవలసి వచ్చినందున నగరంలో నిలువలేక... ప్రయాణ సౌకర్యాలు రైళ్లు... బస్సులు... ప్రైవేట్ వాహనాలు అన్ని ఆగిపోయినందున... వీరభద్రుడి లేబర్ నలభైమంది స్వగ్రామమైన రేణుగుంటకు కాలినడకన బయలుదేరారు. హైదరాబాద్ నుండి తిరుపతి 560 కిలోమీటర్లు... వీరభద్రుడి ముఠాలో ఐదుగురు చిన్నపిల్లలు... పదిహేనుమంది. పాతికేళ్లవాళ్లు... పదిమంది యాభైకి లోపు... పదిమంది అరవై లోపు... వయస్సు వారున్నారు.

    మొత్తం నలభైమందిలో పాతిక మంది మగ... పదిహేనుమంది స్త్రీలు. వారిలో... మంగమ్మ గర్భిణీ నవమాసాలు... మొగుడు రాజయ్య... బరువునంతా తను మోస్తూ... భార్యచేతిని పట్టుకొని మెల్లగా నడుస్తున్నాడు.

    అందరూ కాలి నడకలో... దేవుని మీద భారం వేసి హైదరాబాదు నుండి బయలుదేరారు. చిన్ని... మణి అక్కా చెల్లెళ్లు... కవలలు... ఇరవై సంవత్సరాలలోపు... అందరికీ సాయంగా వరస కలిపి ఆప్యాయంగా మాట్లాడుతూ.. ముందుకు నడుస్తున్నారు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/A4_HzZBNXnY

    19 min
  • సంపత్ సినిమా కథలు - 2 | Sampath Cinema Kathalu - 2 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సంపత్ సినిమా కథలు - 2

    రచన : S. సంపత్ కుమార్ 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    గత ఎపిసోడ్ లో

    డైరెక్టర్ నన్ను ప్రొడ్యూసర్ వద్దకు తీసుకొని వెళతాడు.

    ప్రొడ్యూసర్ నన్ను కథ చెప్పమంటాడు.

    నా కథ ప్రకారం ఫ్రెండ్ చెల్లెలి పెళ్లి కోసం బెంగళూరు వెళ్లిన కిరణ్ అనే యువకుడు కనపడకుండా పోతాడు. అదృశ్యమైన కిరణ్ ఒక మానసిక చికిత్సాలయం లో ఉంటాడు.

    అతడు రాజారావు అనే ఒక కోటీశ్వరుడి కుమారుడు.

    మొదటి భాగం విన్న నిర్మాత కథ నచ్చినట్లు చెబుతాడు.

    ఇక 'సంపత్ సినిమా కథలు రెండవ' భాగం చదవండి.

    కొన్ని రోజుల తర్వాత…

    హాస్పటల్(ప్రకృతి మానసిక ఆరోగ్య చికిత్సాలయం)

    వాతవరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది.

    బయట సన్నని వర్షం..

    తన తలకు అడ్డుగా ఉన్న గొడుగు తీస్తూ తన అందాలను కనువిందుగా ఒక్కసారి గుమ్మరించింది కావ్య, వయసు 20.

    తెల్లని పలుచని ఓణీ, పరువాలు కనబడేటట్టు ఆకు పచ్చని డిజైన్ వేసిన బ్లౌజు.. ఇంకా నాభి కింద ఆదే ఆకు పచ్చ డిజైన్ చేసిన లంగా. ఆమె అందానికి తగ్గట్టు ఆ డ్రస్ ఉంది.

    ఆ అందాలను చూస్తే- బ్రహ్మ కైన పుడుతుంది రిమ్మ తెగులు అంటారు కదా… అంత అందంగా ఉంది కావ్య. ఇక వయసులో ఉన్న కుర్రాళ్ళు చూస్తే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.

    అప్పుడప్పుడే కాస్త కళ్ళు తెరచి రిలాక్స్ గా బెడ్ మీద కదులుతూ కిరణ్ తన రూం కిటికీలో నుంచి ఒక్కసారిగా కావ్యను చూసేసరికి ఆమె అందానికి ముగ్దుడై పోయాడు. ఇంక అతనికి తెలియకుండానే ఏదో లోకంలో తేలిపోయాడు. కాసేపుయ్యక కిరణ్ కళ్ళు మూతపడిపోయాయి.

    కావ్య తన పుట్టిన రోజు సందర్భంగా అక్కడ ఉన్న పేషెంట్లకు పండ్లు ఇవ్వడానికి వచ్చింది.

    కావ్యది ఈ రోజు పుట్టినరోజు అని ముందే కావ్య చెప్పడం వలన, పండ్లు తెచ్చి పెట్టాడు అక్కడ పనిచేసే నారాయణ.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/dUnn9Ubr9Zw


    14 min
  • ప్రేమ‘భ్రమ’రం - 12 | Prema Bhramaram - 12 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ప్రేమ ‘భ్రమ’రం - 12

    రచన: వసుంధర

    కథ చదివి వినిపిస్తున్న వారు: కే. లక్ష్మి శైలజ

    వసుంధర గారి ప్రేమ ‘భ్రమ’రం ధారావాహిక చివరి భాగం

    గత ఎపిసోడ్ లో...

    అమోఘ్‌, రిక్తలతో మాట్లాడాను. వాళ్ళిద్దరితో సెల్ఫీ తీసుకున్నాను.

    రూపను వాళ్లింటి దగ్గర డ్రాప్‌ చెయ్యమని కోరుతాడు అమోఘ్‌.

    వెళ్ళేదారిలో రిక్త పేరుతో అక్కడ ఎవరూ లేరని, అంతా అమోఘ్‌ భ్రమ అని చెబుతుంది రూప. తను ఇంతవరకు రిక్తను చూడలేదని కూడా చెబుతుంది.

    కానీ అమోఘ్‌ ఇంట్లో నాకు రిక్త కనిపించి ఉండటంతో  షాక్ కి గురయ్యాను.

    ఇక  ప్రేమ  ‘భ్రమ’రం చివరి భాగం చదవండి ...

    నేనూహించిన దానికంటే విచిత్రమైన కథ.... ‘

    ‘‘చక్రధర్‌ ఎవరు?’’ అన్నాను ఆశ్చర్యంగా.

    ‘‘ఎందుకండీ ఇంకా నటిస్తారు? చక్రధర్‌గారే కదా, మిమ్మల్నిక్కడికి పంపారు?’’ అంది రూప.

    చక్రధర్‌ ఎవరో నాకు తెలియదు. ఆయన నన్నిక్కడికి పంపడమేమిటి?

    అడుగుదామనుకున్నవాణ్ణే - అడుగలేదు.

    నాకిప్పుడు పెద్ద అనుమానం వచ్చింది.

    నా వెనుక ఏదో గూడుపుఠాణీ నడుస్తోంది. ఎవరో నన్ను గజిబిజికి గురి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.

    అందువల్ల ఎవరికి ఎందుకు ప్రయోజనమో తెలియదు కానీ - రూప ఇప్పుడు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని ఖచ్చితంగా చెప్పగలను.

    ఎందుకంటే అమోఘ్‌ ఇంట్లో నేను రిక్తని స్పష్టంగా చూశాను. అందులో నాకు సందేహం లేదు.

    ఐతే అదే రిక్తని - ట్రయిన్లో కూడా చూశాను.

    ముఖం బాగా గుర్తుండడంవల్ల - ఇద్దరూ ఒకరేనని నమ్మకంగా ఉంది.

    అదీకాక ట్రయిన్లో ఆ ముసుగు యువతికి ఫొటో కూడా తీసుకున్నాను. దాంతో నాకు మళ్లీ పనుంటుందని అప్పుడు తెలియదు.ఐనా డిలీట్‌ చెయ్యలేదు. లాప్‌టాప్‌లోకి మార్చాను.

    ఆ ఫొటోకి ‘వెయిల్డ్‌ టెర్రరిస్ట్‌’ (ముసుగులో తీవ్రవాది) అని పేరు కూడా పెట్టాను.

    ఇంటికెళ్లి ఆ ఫొటోని చెక్‌ చేస్తే అనుమానం తొలగిపోతుంది.

    ఇంతకీ ఇందరు ప్రేమకథల్లో నేనే ఎందుకు జోక్యం చేసుకుంటున్నాను?

    నేను జోక్యం చేసుకుంటున్నానా - లేక ఎవరో నన్ను ఇరికిస్తున్నారా?

    ఇరికిస్తే - ఎందుకు?

    ఆలోచిస్తున్నాను. బైక్‌ ముందుకెడుతూనే ఉంది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/HboYo_OuChU

    22 min
  • వీరి మధ్యన ఎపిసోడ్ 9 | Veeri Madhyana Episode 9 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వీరి మధ్యన... ఎపిసోడ్ 9

    రచన: బివిడి ప్రసాదరావు

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    బివిడి ప్రసాదరావు గారి  ధారావాహిక 'వీరి మధ్యన..' తొమ్మిదవ భాగం

    గత ఎపిసోడ్ లో…

    విజయవాడలో ఉన్న సామ్రాట్ మేనత్త మరణిస్తుంది.

    సామ్రాట్, సాహసిల పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తుంది.

    పెళ్లి వాయిదా వేయవద్దని సాహసి తల్లిదండ్రులతో పాటు, సామ్రాట్ కూడా అభ్యర్థిస్తాడు.

    అందుకు అంగీకరిస్తాడు సామ్రాట్ తండ్రి గోపాలస్వామి.

    సాహసి, సామ్రాట్ ల వివాహం జరుగుతుంది.

    ఇక వీరి మధ్యన..   తొమ్మిదవ  భాగం చదవండి...

    ఆ ఇద్దరి మధ్య మంచి పరిచయం ఉంది. బాగా చనువు ఉంది. బ్యాంక్ లో లంచ్ ఇద్దరూ కలిసే చేస్తుంటారు. వీక్ ఎండ్స్ లో ఇద్దరూ కలిసే షాపింగ్ చేస్తుంటారు. వ్యక్తిగత ముచ్చట్లు బిడియం లేకుండా ముచ్చటించుకుంటారు. ఫ్రెండ్స్ లా మెసులుకుంటారు.

    చంద్రికకు పెళ్లైంది. ఆమె భర్త లోకల్ ప్రయివేట్ కాలేజీలో లెక్చరర్. వాళ్లకు రెండేళ్ల బాబు ఉన్నాడు.

    చంద్రిక, ఆమె భర్త జాబ్ లకు వెళ్తుంటే, వాళ్ల బిడ్డ సంరక్షణ, ఇంటి పరివేక్షణ చంద్రిక అత్తమామలు చక్కదిద్దుతున్నారు ఎంచక్కా.

    సాహసి చెప్పిందంతా విన్న చంద్రిక, "అవునా. ఈ ఆషాఢ మాసం రోజులు ఇక్కడే జాబ్ చేయాలనుకుంటున్నావా. నిజానికి నా రిక్వెస్ట్ తో హెడాఫీస్ లో నాకున్న పరిచయాలతో, నీ ట్రాన్స్ఫర్ కు సహకరించగలుగుతున్నాను. సికింద్రాబాద్ బ్రాంచ్ కు రానున్న ఫస్ట్ తారీఖుకు నువ్వు వెళ్లాలి. మళ్లీ రిక్వెస్ట్ పెడితే, ఆ సికింద్రాబాద్ బ్రాంచ్ లో  ఉన్న ఆ వెకెంట్ ను ఇంకా కొన్నాళ్ల పాటు కొనసాగించ లేరు. ఆ బ్రాంచ్ మేనేజర్ ఆ వెకెంట్ ను భర్తీ చేయమని బాగా ఒత్తిడి చేస్తున్నాడట." చెప్పింది.

    సాహసి మాట్లాడలేక పోతుంది.

    "అన్నట్టు. సికింద్రాబాద్ బ్రాంచ్ దగ్గరన మీ వారు పోర్షన్ తీసి పెట్టారని చెప్పావుగా. మరేంటి ప్రొబ్లమ్. అక్కడికి నువ్వు వెళ్ల వచ్చుగా. మీ ఆయన నువ్వు అక్కడ ఉండొచ్చుగా. పైగా మీ అత్తవారు వేరేగా ఉంటున్నారుగా." అంది చంద్రిక చకచకా.

    సాహసి గమ్మున మాట్లాడలేక పోతుంది. చంద్రికనే చూస్తూ ఉండిపోయింది.

    "ఏంటాలా చూస్తున్నావ్." అడిగింది చంద్రిక.

    "మరే. అదే అదే. మా వాళ్లతో అదే చెప్పాను. కానీ వాళ్లు కుదరదన్నారు." చెప్పింది సాహసి.

    "ఏం." అంది చంద్రిక విస్మయంగా.

    "మరే. మాకు ఇంకా శోభనం కాలేదు." చెప్పగలిగింది సాహసి.

    "వాట్. అదేంటి. పెళ్లి తర్వాత పదహారు రోజుల పండగలో అదొక వేడుకగా. అలా కాకపోవడమేంటి." అంది చంద్రిక చిత్రంగా.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/cmDAHF6sWco






    15 min
  • నమ్మకం | Nammakam | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    నమ్మకం

    రచన : జీడిగుంట శ్రీనివాసరావు

    నమ్మకం అనే ఈ చక్కటి  కథను జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించారు. చదివి వినిపిస్తున్నది మల్లవరపు సీతారాం కుమార్.

    కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు ఆ ఇంట్లో ఎలా ఉండాలో, ఆమెతో అత్తమామలు ఎలా ఉండాలో తెలియజేసే కథ ఇది. ఇక కథలోకి వెడదాం.

    రజిత కాపురానికి వచ్చి వారం రోజులు అయ్యింది. భర్త శంకర్ కి సెలవు లేదని ఆఫీస్ కి వెళ్లిపోతున్నాడు. యింట్లో మామగారు, అత్తగారు, తను వుంటారు. మామగారు భోజనం చేసిన వెంటనే పడుకుని నిద్ర పోతారు. అత్తగారికి సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తి టీవీ తో సరిపోతుంది.

    తనతో మాట్లాడే వాళ్ళు లేకపోవడం తో, పుట్టింటి నుంచి తెచ్చుకున్న నవలలు చదువుకుంటూ టైం గడుపుతోంది రజిత.

    ఒకరోజు ఉదయం, మామగారు, అత్తగారు క్యాలెండరు చూస్తో, ‘ఈ రోజు మంచిది, ఈ రోజు చేయిద్దాం’ అనుకోవడం విన్న రజిత, ‘పోనిలే.. పెళ్ళిలో పెద్దగా నగలు పెట్టక పోయినా, యిప్పుడు చేయిద్దామనుకుంటున్నారు’ అని సంతోషం పడింది.

    టిఫిన్ తినేసిన రజిత భర్త శంకర్, ‘రాజీ.. నేను ఆఫీస్ కి వెళ్తున్నా’ అని చెప్పి, అక్కడే కుర్చీలో కూర్చొని వున్న తండ్రికి చెప్పక పోతే బాగుండదని, ‘వెళ్ళొస్తా డాడీ’ అని వెళ్ళిపోయాడు.

    ‘అదేమిటి, వీళ్ళు ఏదో నగలు చేయిద్దాం అని అనుకుంటూవుంటే, యియన ఆఫీస్ కి వెళ్ళాడు, బహుశా సాయంత్రం తీసుకొని వెళ్తారేమో’అని సర్దుకుంది రజిత.

    11 గంటలయ్యింది, అత్తగారు రజిత గది లోకి తొంగిచూస్తూ, “రజితా! ఒకసారి యిలా రా అమ్మా” అని పిలిచింది.

    అత్తగారి పిలుపు విని ‘వుందిలే మంచికాలం’ అనుకుంటూ బయటకు వచ్చి, “ఏమిటి అత్తయ్యా!” అంది వినయం గా..

    “ఈ రోజు మంచిది. వంటగది లోకి వెళ్లి, స్టవ్ కి కొద్దిగా పసుపు, కుంకం పెట్టి, దణ్ణం పెట్టుకుని వంట మొదలుపెట్టమ్మా. ఈ రోజు నుంచి వంటగది నీది, ఏమి వండాలో మీ మామయ్యగారు చెపుతారు. నువ్వు వండితే, నేను నాలుగు మెతుకులు తిని కృష్ణా రామా అనుకుంటూ టీవీ సీరియల్స్ చూసుకుంటా” అంది.

    అత్తగారి మాటలకి కొయ్యబారి పోయింది రజిత. ‘ఇందుకా మంచిరోజు చూసింది’ అని మనసులో అనుకుని, “సరే అత్తయ్యా” అంటూ వంటగది లోకి నడిచింది, కావాలనే ఎడమ కాలు ముందుగా పెడుతూ.

    అత్తగారు చెప్పినట్టు స్టవ్ శుభ్రపరిచి, మామగారిని అడిగింది ఈ రోజు ఏమి వండాలని.

    “మొదటి రోజు కదమ్మా నువ్వు వంట చేయడం! ఎక్కువ శ్రమ పడకుండా బీరకాయ పొడిపప్పు, బెండకాయ వేపుడు చేస్తే చాలు. మీ అత్తయ్య మాత్రం రసం లేందే అన్నం తినదు. ఆవిడకి టొమోటో వేసి రసం పెట్టు చాలు. సాయంత్రం నీ మొగుడికి యిష్టమైనవి చేసిపెడుదువు గాని” అన్నాడు పేపర్ లోనుంచి తలఎత్తకుండా.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/brRw4KuNsUw


    10 min
  • ఊపనా ఊయల | Upana Uyala | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఊపనా ఊయల 

    రచన: సిహెచ్. సీ. ఎస్. శర్మ 

    కథ చదివి వినిపిస్తున్న వారు: కే. లక్ష్మి శైలజ

    "రంగా !!..." "ఏం అమ్మా !!...". "నిన్న మామయ్య వచ్చి వెళ్లాడు. ..." తల్లి శాంతి ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూచాడు రంగ…

    తన తండ్రి శ్యామ్... తన వయస్సు పది సంవత్సరాలుగా వున్నపుడే మరణించాడు. కారణం విషజ్వరం. అప్పటినుండి... మామయ్య గోపాల్.. తనను, చెల్లెలు సుధను అమ్మ శాంతిని... ఎంతో అభిమానంతో సాయం చేస్తూ తనకు, చెల్లెలికి నాన్న లేని లోటును తెలినీయకుండా... పెంచి... చదివించి పెద్ద చేశారు.

    'మామయ్య నాకు చెల్లికి తండ్రిలాంటి వారు. వారి ఋణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను... వారి మనస్సులోని కోర్కెను తీర్చలేక పోయాను. ఇప్పుడు ఎందుకు వచ్చారో !...' అనుకొన్నాడు రంగ…

    "అమ్మా !. మామయ్య ఏం చెప్పాడమ్మా ?...!!" "నిన్ను ఒకసారి వాడిని కలమవన్నాడు నాన్నా!..."

    "విషయం ఇదని ఏమీ చెప్పలేదా ?..." "లేదు..." కొన్ని క్షణాల తర్వాత... "ఎపుడు వెళతావు ?..." అడిగింది శాంతి.

    "ఫ్రష్ అయి వెళతానమ్మా !..." రంగా రెస్టు రూమ్ లోకి వెళ్లాడు. సుధ కాలేజీనుండి వచ్చింది. వాకిట్లో వున్న రంగా బూట్లను చూచి... "అమ్మా !... అన్నయ్య వచ్చాడా ?..."

    " ఆ... శనివారం కదా... వచ్చాడమ్మా !...".

    "ఆ... నాకు సబ్జెక్టులో కొన్ని సందేహాలు వున్నాయి... అడిగి... తెలుసుకుంటాను...." చిరునవ్వుతో తన గదిలోకి వెళ్లిపోయింది సుధ…

    రంగా ఫ్రష్ అయి హాల్లోకి వచ్చాడు. "అమ్మా !..."

    వంటింట్లోవున్న శాంతి కాఫీ గ్లాసుతో హాల్లోకి వచ్చి... గ్లాసును రంగకు అందించింది.

    "నాన్నా !... మామయ్యగారి ఇంటికి వెళుతున్నావా ?....."

    కాఫీ త్రాగుతూ... "అవునమ్మా..." చెప్పాడు రంగా.

    సుధ తన గదినుండి బయటికి వచ్చింది. "అన్నయ్యా !... మామయ్యా వాళ్ల ఇంటికి నేనూ రానా?" అడిగింది.

    రంగా క్షణం సేపు సుధ ముఖంలోకి చూచి... తల్లి ముఖంలోకి చూచాడు. ఆ చూపుల్లో సుధ తనతో రావడం ఇష్టం లేదన్న భావన.. స్పష్టంగా సుధకు, శాంతికి అర్థం అయింది.

    "నీవు ఇప్పుడు వద్దులేవే... వాణ్ణి వెళ్లిరానీ! మనం తర్వాత వెళదాం..." అనునయంగా కూతురుకు చెప్పింది శాంతి.

    "సరే అమ్మా.." తల ఆడించి సుధ తన గదిలోనికి వెళ్లిపోయింది..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/iIrry5txsIo

    17 min
  • కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 3 | Kasthuri Ranga Ranga Episode 3 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కస్తూరి రంగ రంగా!! 3

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    సిహెచ్. సీఎస్. శర్మ గారి  ధారావాహిక కస్తూరి రంగ రంగా మూడవ భాగం

    గత ఎపిసోడ్ లో

    బ్రహ్మయ్య ఇరవై లక్షలు కిడ్నాపర్లకు ఇచ్చి , తన మనవడు శాలివాహనను విడిపించుకుంటాడు.

    ఇంటికి వచ్చి, జరిగిన కథను వివరిస్తాడు.

    ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 3  చదవండి...

    పోలీస్టేషన్...

    సుల్తాన్ కుర్చీలో కూర్చొని, క్రింద తనకు దగ్గరలో కూర్చొనివున్న ఒక వ్యక్తిని విచారిస్తున్నాడు. అతని కాలికి తుపాకి గుండు తగిలింది. హాస్పటల్ కు  తీసుకెళ్లి తుపాకీగుండును తీయించి డ్రసింగ్ చేయించి... ఇంజక్షన్, మందులు ఇప్పించి జైలుకు తీసుకొని వచ్చారు పోలీసులు....

    "రేయ్!... నిజం చెప్పు... నీతో ఎంతమంది వచ్చారు?....

    “ఇద్దరు సార్!...”

    “వాళ్ల పేర్లు?...”

    "తెలీదు సార్....”

    "నిజం చెప్పు...”

    “చెప్పింది నిజమేసార్!...”

    “వాళ్లది ఏవూరు?...''

    “తెలియదు సార్!..."

    "నిజంగా!...."

    "నిజంగానే సార్... నేను సెప్పింది నిజం..." భోరున ఏడ్చాడు…

    "గంగరాజూ!..." సుల్తాన్ హెడ్ కానిస్టేబుల్ని పిలిచాడు.

    "సార్!..."

    “వీడు ఈరీతిగా నిజాన్ని చెప్పడు... సెల్లోకి తీసుకెళ్లి మన ట్రీట్మెంట్ ను ప్రారంభించండి... నిజాన్ని వాడి నోటితో కక్కించండి..." నవ్వుతూ చెప్పాడు సుల్తాన్.

    పోలీసు సోము వాణ్ణి గదిలోకి తీసుకొని వెళ్లారు... తోటే గంగరాజు కూడా వెళ్లాడు.

    “ఒరేయ్!... వాళ్లిద్దరూ ఎవరో... ఏవూరో... వాళ్లకు నీకూ వున్న సంబంధం ఏమిటో చెప్పు. నీ కాలికి దెబ్బ తగిలినందున నిన్ను మంచి మాటలతో నిజం చెప్పమని అడుగుతున్నాము. నీ కాలిగి గాయం కాకపోతే నీచేత ఈపాటికి నిజాన్ని చెప్పించేవాళ్లం... మమ్మల్ని బుకాయించి మోసం చేయాలనుకొంటే... నీకు నరకాన్ని చూపిస్తామ్... చూడు... బుద్ధిగా నిజం చెప్పరా... నీ మంచి కోరి చెబుతుండా!... దెబ్బలు తినకుండా నిజం చెప్పు!..." అనునయంగా చెప్పాడు హెడాకానిస్టేబుల్ గంగరాజు.

    సుల్తాన్ అతన్ని పిలిచాడు.

    అతని గొంతును విన్న గంగరాజు సుల్తాన్ని సమీపించాడు.

    "సార్!...”

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/wGsFi4ycn0M

    13 min
  • పుష్ప విలాపం | Pushpa Vilapam | Telugu Short Story | Gorthi Vani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    పుష్ప విలాపం

    రచన : గొర్తి వాణిశ్రీనివాస్

    (కథ చదివి వినిపిస్తున్నది కే. లక్ష్మి శైలజ)

    ఓ వేసవి సాయంత్రం.

    కాస్త చల్లబడ్డాక రుక్మిణి గిన్నె పట్టుకుని మేడ మెట్లెక్కింది.

    ఒక అంతస్తుని దాటి రెండో అంతస్తుకు దిగ్విజయంగా ఎగబాకిన ఆనందంలో మల్లెతీగ విరగ పూస్తోంది.

    ఎన్నిపూలో..

    ఇంతింత మొగ్గ..

    విచ్చుకుంటే చిట్టి గులాబీ అంతుంటుంది.

    రుక్మిణి ఒక్కొక్క కొమ్మా జాగ్రత్తగా ఒంచి మొగ్గల్ని తుంచి గిన్నెలో వేసింది.

    గిన్నె సగానికి నిండింది. రుక్మిణి మనసులా సగం మాత్రమే.

    మల్లె మొగ్గల్ని కోశాక ఆ వేళ్ళని వాసన చూసుకుంది రుక్మిణి.

    'అబ్బ.. ఎంత మంచి సువాసన' అని తన్మయత్వంలో మునిగిపోయింది.

    చెట్టు మొదట్లో మట్టిని కుళ్లగించి నీళ్లుపోసి, కూరగాయల పెచ్చులు, అరటిపండ్ల తొక్కలు వెయ్యడం వల్ల పూలు బలంగా పూశాయి.

    గుబురుగా వచ్చిన చెట్టుని తృప్తిగా చూసుకుంది.

    కిందకొచ్చి పూలన్నింటినీ పొదంగా మాల కట్టింది.

    మూరకి కాస్త తక్కువ వచ్చినా దొడ్లో పూల విలువే వేరు. మాలవంక మురిపంగా చూస్తూ

    "సౌమ్యా... "అని పిలిచింది.

    సౌమ్య గది తలుపు మెల్లిగా తెరిచి

    "ఉష్... "అని నోటిమీద వేలు పెట్టుకుని "ఏంటి?" అంది.

    సారీ అన్నట్టు సైగచేసి పూలమాల చూపించింది కోడలు సౌమ్యకి.

    "ఇప్పుడొద్దు.. తర్వాత. మీటింగ్ లో వున్నాను". అంది సౌమ్య.

    "ఎంతసేపు?"

    "పావుగంటలో అయిపోతుంది"

    పావుగంట సేపు ఈ పూలు నీకోసం ఎదురుచూడాలా. పెట్టేసుకోవచ్చుగా.

    జడ పాన్పుమీద హాయిగా సేదదీరుతాయి.

    అవి ఊసులాడుకుని రాత్రికల్లా మనసు దాటని మాటల్ని సువాసనతో

    తెలియజేస్తాయి.

    ఏం పిల్లల్లో ఏంటో. పూలు పెట్టుకోమంటే నీలుగుతారు. అని మెల్లిగా వెళ్లి బల్లమీద పెట్టి

    "త్వరగా పెట్టుకో వాడిపోతాయ్. " అంది రుక్మిణి.

    "సరే సరే, మీరు వెళ్ళండి" అంది. సాఫ్ట్వేర్ కోడలు సౌమ్య.

    అరగంట గడిచాక రుక్మిణి గదిలోకి తొంగి చూసింది. మల్లెలు ఆ బల్లమీదే దుఃఖిస్తున్నట్టు కనబడ్డాయి.

    కోడలు అర్జెంట్ ఆఫీస్ కాల్ లో ఉన్నట్టుంది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/r0u9F-yA0hs

    17 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world