
Sign up to save your podcasts
Or


(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
నవయుగంలో నారి
రచన: సీత మండలీక
"అమ్మా, ఒకటి అడుగుతాను. ఒప్పు కుంటావా"
"ఈ మధ్య రోజుకొకటి అడుగుతున్నావు చిట్టీ"
"పో అమ్మా.. నిన్ను కాక ఇంకెవరిని అడుగుతాను చెప్పు”
"ఇంతకీ ఏమిటి ఆ కోరిక తల్లీ "
"ఏమీ లేదు. పరీక్షలు అయిపోయేయి కదా. రిజల్ట్స్ వచ్చేక అందరం విడిపోతాం. మా క్లాస్ లో ఒక పదిమంది స్నేహితులం గోదావరి అందాలు, దాని చుట్టూ ఉన్న ఊళ్లు వెళ్లి చూసివద్దామని ప్లాన్ వేసేం. అందరూ ఒప్పు కునట్టే నువ్వూ, నాన్న ఒప్పు కుంటే, ఇంక నాలుగు రోజుల్లో బయల్దేరతాం"
"చిట్టీ, ఏమిటేమాట్లాడుతున్నా వు?"
"అంత ఆశ్చర్యపోతావేమిటమ్మా. ఒక స్కూ ల్లో ఒక క్లాసులో ఆడ మొగా కలిసి చదవచ్చా. కలిసి ఊరు వెళ్తేతప్పా ? నాకేమి తప్పనిపించడం లేదు. అదీకాక మేమందరం మంచి స్నేహితులం"
"ఆడ పిల్లకికొన్ని హద్దులుంటాయి. అవి దాటకూడదు. అదిఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి".
“అమ్మా! అది నేను కూడా నమ్ముతానమ్మా. నువ్వు, నాన్న అసలేమీ వర్రీ అవద్దు" .
ఆ రాత్రి గీత తన భర్త హరితో సమీర ప్రయాణం గురించి చెప్పింది. ‘లెట్ హెర్ గో అండ్ ఎంజాయ్’ అని సులువుగా జవాబిచ్చేడు.
"ఏమిటో ఈరోజుల్లో పేపర్ తిరగేస్తే ఆడ పిల్లలు ఎన్ని అత్యా చారాలకిగురి అవుతున్నారో చదువుతూనే ఉన్నాము కదా"
"అయినా గీతా.. ఈ రోజుల్లో కూడా నీకెందుకంత భయం? నీకు సమీర సంగతి తెలియదా గీతా. తన మీద నమ్మకం తో హాయి గా తిరిగి రమ్మని పంపు”
హరితో చర్చించేక తనకి కూడా ఎటువంటి సంశయం లేకుండా సమీర కి తన సమ్మతి తెలిపింది. ఆ సాయంత్రం గోదావరి ఎక్స్ ప్రెస్ లో పదిమంది స్నేహితులు ఎంతో సరదాగా ప్రయాణం ఆరంభించేరు. ప్రయాణం లో టీ కాఫీ బిస్కేట్ లు తింటూ అంతాక్షరి ఆడుతూ రైలు ప్రయాణం ఆనందం గా సాగింది. వీటన్నిటితో అందరూ సందడిలో ఉంటే, హరీష్ మాత్రం తన వేపే దృష్టి పెట్టడం సమీరకి నచ్చలేదు. సరే.. సమయం వచ్చినప్పుడు చెప్పచ్చులే అని ఊరుకుంది.
సమీర చదువులో, అందంలో మంచి మార్కులే సంపాదించింది. అమ్మమ్మ కాకినాడ లో ఉండడం వల్ల గోదావరి అందాలు చాల సార్లు అనుభవించింది సమీర. అయినా తృప్తిలేదు. అమ్మమ్మ పోయేక మళ్ళీ గోదావరి చూడడం కుదరలేదు. అందరూ కాకినాడలో ఒక మంచి హోటల్ లో దిగి, కార్ బుక్ చేసుకుని ముందు అయినివిల్లి వినాయకుడిగుడి తో ప్రారంభించేరు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/DR4uTrR7PLs
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
నాకేమవుతోంది…? ఎపిసోడ్ 2
రచన: మల్లవరపు సీతారాం కుమార్
మల్లవరపు సీతారాం కుమార్ రచించిన ధారావాహిక 'నాకేమవుతోంది' రెండవ భాగం
మీకు చదివి వినిపిస్తున్నది కే. లక్ష్మి శైలజ.
గత ఎపిసోడ్ లో…
ప్రియ అనే యువతి కొత్త కాపురంలో తన అనుభవాలను ఇలా వివరిస్తోంది.
‘నా భర్త పేరు తరుణ్.
మా పెళ్ళై మూడునెలలు.
కొత్తకాపురం పెట్టి నెలే అయింది.
మంచి నిద్రలో ఉన్న నన్ను నా భర్త లేపుతాడు.
నా తలగడతో నాకు నేనే ఊపిరాడకుండా చేసుకోవడానికి ప్రయత్నించానని చెబుతాడు.
అతన్ని అనుమానించలేను. అలాగని పూర్తిగా నమ్మలేను’
ఇదీ ఆమె మానసిక పరిస్థితి.
తరువాత ఏం జరిగిందో
నాకేమవుతోంది…? ధారావాహిక రెండవ భాగంలో వినండి.
లెటర్ కోసం వెతుకుతూ అతని కంట పడ్డాను. ఒకవేళ అతనిలో ఏదైనా చెడు ఉద్దేశం ఉంటే తను దొరికి పోయానని భావిస్తాడు కాబట్టి ఇప్పుడతని నిజ స్వరూపం బయట పడుతుంది. భయం భయం గానే అతని కళ్ళ లోకి చూసాను.
"చెప్పవేం ప్రియా.. ఆ లెటర్ కోసమే వెతుకుతున్నావు కదూ!" నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు తరుణ్.
"అవును తరుణ్! నాకు ఏదైనా జరిగితే నీ మీద ఎవరికీ అనుమానం రాకూడదనే నా అంతట నేనే ఆ లెటర్ రాశాను. కానీ నువ్వు ఆవేశంతో దాన్ని నలిపి పారేశావు. ఆ లెటర్ ని తిరిగి డ్రాలో ఉంచుదామని వెతుకుతున్నాను" చెప్పాను నేను.
'ఫరవాలేదు.. ఇంతటి టెన్షన్ లో కూడా సమయస్ఫూర్తితో సమాధానం ఇవ్వగలిగాను' అనుకున్నాను.
చిన్నగా నవ్వాడు తరుణ్. "నేను కూడా అందుకే ఆ లెటర్ భద్ర పరిచాను. నువ్వు చెప్పినట్లు నీకు అనుకోని ఆపద కలిగితే అందరూ నన్ను అనుమానిస్తారు. తరువాత నేను ఆత్మహత్య చేసుకున్నా- ‘దొరికి పోయాననే అవమాన భారంతో చనిపోయాడు’ అంటారు. అందుకే నువ్వు రాసిన లెటర్ తో నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని, ఆ తర్వాత మరణించి నిన్ను చేరుకుంటాను” తన కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా చెప్పాడు తరుణ్.
నా మనసు ద్రవించింది. 'నా ముఖాన్ని దిండుతో అదుముకుంది నేనే. ఆ ఉత్తరం రాసింది కూడా నేనే. మరి తరుణ్ ని అనుమానించడానికి కారణం ఏముంది?' అనుకొని అతన్ని దగ్గరకు లాక్కొని కౌగలించుకున్నాను.
"సారీ తరుణ్! నీకు లేనిపోని టెన్షన్ పెట్టాను" అన్నాను.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/CZ07vPvKiYM
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కస్తూరి రంగ రంగా!! 5
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
సిహెచ్. సీఎస్. శర్మ గారి ధారావాహిక కస్తూరి రంగ రంగా ఐదవ భాగం
గత ఎపిసోడ్ లో
సుల్తాన్ జీప్ పైనా, రేపల్లెలో సయ్యద్ ఇంట్లో, బ్రహ్మయ్యగారి ఇంట్లో పన్నెండు ప్రాంతంలో బాంబు ప్రేలుళ్లు జరిగాయి. జీప్ లోని వారు.... సయ్యద్ భార్య ఫాతిమా, బషీర్.. బ్రహ్మయ్య, కుసుమ, శాలివాహన దారుణంగా మరణించారు.
ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 5 చదవండి...
సమయం.... రాత్రి పదిన్నర... భూషణ్ కుమార్ తన గార్డెన్ గెస్టు హౌస్ లో సిటీకి ముఫ్ఫై కిలోమీటర్ల దూరంలో ప్రియురాలితో త్రాగుతూ ఛలోక్తులు విసురుతున్నాడు. ఆమె పేరు మువ్వ. ఆ కాంతామణి అమృతాన్ని సేవించింది..... కైపులో తేలిపోతూ వుంది.
భూషణ్ సెల్ మ్రోగింది.
“హలో!...”
"సార్!... నేను సెక్యూరిటీని...."
"ఏంట్రా... ఈ సమయంలో ఫోన్ చేశావు?...".
“సార్ మన్నించండి... మల్లేష్ వచ్చాడు సార్... మిమ్మల్ని అర్జంటుగా కలవాలంటున్నాడు..." భయం భయంగా మెల్లగా చెప్పాడు సెక్యూరిటీ...
“వాడు ఇక్కడదాకా ఎలా వచ్చాడు రా!..."
"కాలినడకన అడ్డదారిలో సార్!..."
“సరే... గేటుకు తాళం వేసి వాణ్ణి తీసుకొనిరా!..." సెల్ కట్ చేశాడు.
“మువ్వా!...”
"ఆ... చెప్పు రాజా!...".
“ఆ కాంట్రాక్టు మనకు ఎలాగైనా రావాలి... నీవు ఎవరిని కలుస్తావో.. ఏం ఆశ చూపిస్తావో... అదంతా నీ సామర్థ్యం!... కాంట్రాక్టు మనకు వచ్చి తీరాలి....." అహంకారంగా అన్నాడు భూషణ్ కుమార్.
“అలాగే బాస్!.. వస్తుందిగా!..." పకపకా నవ్వింది మువ్వ... కొన్ని క్షణాల తర్వాత....
“మరి ఖర్చు!!!..”
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ది ట్రాప్ ఎపిసోడ్ 11
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' పదకొండవ భాగం
గత ఎపిసోడ్ లో
పవన్ ప్రేమ వ్యవహారం లో పడ్డట్లు అనుమానిస్తాడు వేద మూర్తి.
ఆ విషయం తను కనుక్కుంటానని సర్ది చెబుతాడు పరమేశ్వర్.
దివాకర్ దంపతులు వినోదినితో పాటు వేదమూర్తి ఇంటికి వస్తారు.
వెళ్ళేటప్పుడు ఏదో నెపంతో వినోదినిని అక్కడే వదిలి వెడతారు.
ఇక ది ట్రాప్.. పదకొండవ భాగం చదవండి…
భువనేశ్వర్ మేజర్ కంప్యూటర్ సిస్టమ్ అప్డేట్ చేసి రావడానికి కంపెనీ తరపున ఇండోనేషియా వెళ్ళి జూనియర్ టెక్నీకల్ స్టాఫ్ తో సెట్టింగ్సు అమర్చి అక్కడి కంప్యూటర్ సిస్టమ్ ని మెరుగు పరచి ఊరు చేరుకోవడానికి ఆరు రోజులు పట్టాయి. ఈలోపల అతడికి ఒకటి తరవాత ఒకటిగా లాభదాయకమైన సాను కూలమైన మార్పులు జరిగాయి. అతడు కొన్నిరోజులుగా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని యెదురు చూసిన హయ్యర్ పోస్టు విత్ హయ్యర్ గ్రేడేషన్ తో బాటు, కొత్త కంపెనీ రూల్స్ ప్రకారం కొత్త కారు కూడా తళతళ మెరుస్తూ యింటి వాకిట నిల్చుంది.
చాలా రోజులు తరవాత ఏతెంచిన భర్త కోసం ప్రభావతి రొయ్యల బిరియాని, కోడి గుడ్లు వేపుడు కూర చేసింది. ఆ తరవాత భాగ్యానికి చేతిలో చిల్లర డబ్బులు పెట్టి పెందలకడే యింటికి పంపించేసింది. ఆ తరవాత నాట్యంలో కాస్తో కూస్తో ప్రవేశం ఉన్న ప్రభావతి సంతో షంతో తేజరిల్లుతూ ఆమెకు యిష్టమైన జానపద గీతం-’సలలిత రాగ సుధా రససారం-సర్వకళాన్మయ నాట్య విలాసం! ’ నాట్య విలాసంతో పాడి వినిపించి ముద్దుల వర్షం కురిపించి ఉన్నపాటున అతణ్ణి కౌగలి సంకెళ్ళలో బంధిస్తూ అంది- “ఇది మంచి సమయం. వసంతోత్సవం విలసిల్లే వాతావరణం. రండి! మనం వరూధిని గారింటికి వెళదాం. ”
ప్రభావతి పెదవుల్ని తన పెదవులతో ఆక్రమించిన భువనేశ్ ఉలిక్కి పడ్డట్టయ్యి ఎందుకూ అన్నట్టు కనుబొమలెగరేస్తూ చూసాడు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/HHtRXfk9eG8
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
సైనైడ్ - ఎపిసోడ్ 10
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
గత ఎపిసోడ్ లో
ఏ-వన్, తనను తప్పించమని బి-వన్ ని కోరుతాడు.
అతనికి కావలసిన టికెట్స్ ఆరెంజ్ చేస్తానని, న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కమని చెబుతుంది బి-వన్.
స్టేషన్ కి వెళ్లే దారంతా బలమైన నిఘా ఉంటుంది.
ఇక సైనైడ్ చివరి భాగం చదవండి
ఆరోజు ఏ-వన్ కి సాయంత్రం చీకటి పడుతున్న వేళ, ఒక వ్యక్తి వచ్చి ఒక కొరియర్ ఇచ్చాడు. కొరియర్ విప్పి చూసుకునే సరికి, తాను వెళ్లబోయే డెస్టినేషన్ కి అన్ని రైల్వే టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ కూడా వచ్చాయి. అంతకు ముందు రోజే ఏ-వన్ అకౌంట్లోకి చాలా పెద్ద మొత్తంలో లో మనీ ట్రాన్స్ఫర్ కూడా అయింది. ఇలా అన్ని విధాల బి-వన్ పంపించే సరికి ఎక్కడలేని ధైర్యం, ఉత్సాహం వచ్చాయి ఏ -వన్ కి. అయినా అంచెలంచెలుగా ఉన్న పోలీసు భద్రత వలయాన్ని ఎలా చేధించుకుని విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరుకోవాలో.. అన్న విధంగా ఆలోచిస్తూ, గ్లాసు లో ఉన్న విస్కీ తాగుతూ ఆలోచించసాగాడు ఏ-వన్.
ఆ మర్నాడు తెల్లవారుజామున ఏ-వన్ తయారై, తన ఉనికి తెలియకుండా మంచి క్యాప్ పెట్టుకున్నాడు. ఒక అఫీషియల్ లాగా వైట్ షర్టు టక్ చేసుకుని, నీటుగా తను కొన్న షూస్ వేసుకుని, తన కుంటినడక ను చాలా వరకు తగ్గించి, మెల్లగా నడుస్తూ మధ్య మధ్యలో అటు ఇటు గమనిస్తూ, షేర్ ఆటో కోసం మధురవాడ హైవే కి వచ్చాడు.
అప్పటికే రాత్రంతా గస్తీ తిరుగుతున్న పోలీసులు అలిసిపోయి, తమ తమ జీపుల్లోనే కూర్చుని NH-16, హైవే లో పోతున్న అన్ని వెహికల్స్ ని, "విశాఖపట్నంలో సిటీ లోకి ఎంటర్ అవుతున్న ప్రతి బస్సును, కార్లను , తనిఖీ చేస్తూ ఉండగా, సరిగ్గా అదే సమయానికి కి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ డ్యూటీ కి వెళ్ళవలసిన వారు, కనబడిన షేర్ ఆటోలను ఎక్కుతూ, తెల్లవారుజామున ఎంతో సందడిగా ఉంది మధురవాడ హైవే.
ఏ-వన్ మధురవాడ హైవే మీద ఉన్న బోర్డులకు తన ఊహ ముఖచిత్రం తానే చూసుకుంటూ, మనసులో బెంగగా ఉన్నా, అప్పుడే వచ్చిన ఒక షేర్ ఆటో ఎక్కి, తనకు తెలిసిన మద్దిలపాలెం జంక్షన్ దగ్గర దిగి పోయాడు. ఒకవేళ తనను ఎవరైనా పోల్చి పోలీసులకు చెబితే, ఆ షేర్ ఆటో ను వెంబడిస్తారు! కనుక మద్దిలపాలెం డిపో నుంచి NAD కొత్త రోడ్ వరకు, మరో షేర్ ఆటో ఎక్కి అలా ఎవరికీ అనుమానం రాకుండా, NAD జంక్షన్ నుంచి మళ్లీ విశాఖపట్నం రైల్వే స్టేషన్ కు మరో షేర్ ఆటో గాభరాగా ఎక్కుతున్న సమయంలో , కాలు సరిగ్గా పడక ఆటోలో కూర్చో లేకపోవడం వలన, రోడ్డు మీద పడిపోయాడు.
వెంటనే అక్కడ ఉన్న జనాలు అతని లేపి చూశారు. చెవి వెనుక భాగాన రక్తం కారడం గమనించి వెంటనే 108కి ఫోన్ చేశారు. అప్పటికే స్పృహతప్పి పడిపోయిన ఏ-వన్ ను గవర్నమెంట్ హాస్పిటల్ (K G H) కు తీసుకువచ్చారు అంబులెన్స్లో.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/fQpwFNrEAQw
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కలతల కెరటాలు
రచన: యశోద పులుగుర్త
హఠాత్తుగా ఉరుములేని పిడుగులా వస్తూనే “ అత్తా అంటూ" తనని హత్తుకుపోయిన వీణాధరిని చూస్తూనే ఆశ్చర్యపోయింది నీలవేణి.
“ఏమిటీ.. డాక్టర్ వీణాధరే.. ఇలా చెప్పా పెట్టకుండా ఈ అత్తను చూడాలని వచ్చింది?” బుగ్గల మీద చేయి వేసుకుంటూ, ఆశ్చర్యంగా చూస్తూ “ ఏడీ డాక్టర్ వంశీకృష్ణ” అంటూ వీణాధరి వెనుకనే ఉన్నాడేమోననుకుంటూ వెతకసాగింది నీలవేణి.
“లేదు అత్తా, నేను ఒక్కర్తినే వచ్చాను. ఏం.. వంశీ రాకపోతే నన్ను లోపలికి రానీయవా, వెళ్లిపోనా అయితే?” అంటూ వెనుతిరగబోయింది అత్తను ఏడిపించాలని.
'పిచ్చి పిల్లా' అంటూ వీణాధరి ని ఆప్యాయంగా హత్తుకుని సూట్ కేస్ అందుకోబోయింది.
మేనత్త ఆప్యాయతకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. సూట్ కేస్ తో అత్త వెనుకే లోపలకి నడిచింది..
పూజగదిలోనుండి వినిపిస్తున్న ఎమ్.. ఎస్.. సుబ్బలక్ష్మి విష్ణుసహస్రనామాలు మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తున్నాయి. అత్త ఇంటికి వస్తే మనసుకి ఎంతో హాయిగా ఉంటుందెప్పుడూ. కానీ ఈ మధ్య అత్త ఇంటికి వచ్చి చాలా రోజులే అయింది.
ఈ లోపుల మామయ్య లోపలనుండి వస్తూనే " ఏమ్మా వీణా ఎలా ఉన్నావు? వంశీ రాలేదా?” అని అడిగాడు.
“రాలేదు మామయ్యా” అంటూ బాత్ రూమ్ లోకి వెళ్లి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి వచ్చింది. అత్త వంటింట్లో హడావుడిగా వంట చేస్తూనే, మేనకోడలికు వేడి వేడి కాఫీ కప్పులో పోసి అందించింది..
వీణ అత్తను పరికించి చూసింది.. చామనచాయరంగులో, ఒకమోస్తరు ఎత్తులో, నిరంతరం పెదవులమీద నర్తించే అందమైన చిరునవ్వు తో ఎప్పుడూ కళ కళ లాడుతూ ఉండడమే కాదు, ఎటువంటి సమస్యనైనా అవలీలగా ఎదురుకొనే ఆత్మస్తైర్యం తో అందరినీ ఆకట్టుకుంటుంది..
ఎమ్.. ఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి పెళ్లికి ముందు కొద్దికాలం లెక్చరర్ గా పనిచేసింది.. అనర్గళన ఇంగ్లీషు మాట్లాడడమే కాదు, సొసైటీ లో స్త్రీలు ఎదుర్కొనే అనేక సమస్యలు గురించి, ఉద్యోగినులు ఆఫీసులలో ఫేస్ చేసే చెప్పుకోలేని పరిస్తితులను చక్కటి ఆర్టికల్స్ గా వ్రాసి రీడర్స్ డైజస్ట్, ఉమెన్ మేగజైన్స్ లాంటి వాటికి పంపిస్తూ ఉంటుంది. పైకి సాదాసీదాగా కనిపించే అత్త ఇంత చేస్తున్నా తన గరించి గొప్పగా ఎవరికీ చెప్పుకోదు. అందుకే అత్త అంటే తనకు ఆరాధన, గౌరవం.
పెళ్లితరువాత ఉమ్మడి కుటుంబం బాధ్యతలు, ఆ తరువాత తన పిల్లల బాధ్యతలను నిర్వర్తించడంలో తన ఉద్యోగానికి రిజైన్ చేసి పూర్తిగా కుటుంబ బాధ్యతలలో మునిగిపోయి తన కూతుళ్లిద్దరనూ బాగా చదివించి చక్కని సంబంధాలు తెచ్చి పెళ్లిచేసింది..
నీలత్త గురించి ఆలోచిస్తూనే అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గరనున్న కుర్చీలో కూర్చుని కాఫీ సిప్ చేయసాగింది..
నా అనుకునే ఒక మనిషి సమక్షం ఎంతో సెక్యూరిటీని ఇస్తున్నట్లుగా భావన కలుగుతోంది.. వీణాధరి కి గత కొద్దినెలలుగా తన వైవాహిక జీవితంలో చోటుచేసుకుంటున్న కలతలు గుర్తొచ్చి మనసు భారమైపోయింది..
ఇంతసేపైనా తన రాకకి కారణాన్ని ఆరాతీయని నీలత్త వ్యక్తిత్వం ఎంతగొప్పది..
" ఏమిటే వీణా ఆ మూగనోము? నేను మాట్లాడుతున్నా పరాకుగా ఉన్నావు?”
“నీ గురించే ఆలోచిస్తున్నాను. మా నీలత్త అలాగే ఉంది, ఏ మార్పూ లేదని.. అవునూ, ఎప్పుడూ అలా నవ్వుతూ ఎలా ఉంటావు అత్తా?”
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/WPtXdADghKM
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కాకతి రుద్రమ ఎపిసోడ్ 23
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 23 వ భాగం
గత ఎపిసోడ్ లో
మహాదేవుడి సైన్యాన్ని గన్నారెడ్డి దారిలోనే అటకాయించి, బాగా చికాకు పెడతాడు.
అయినా అతడి సైన్యం ఓరుగల్లును చుట్టుముడుతుంది.
దాడిని ఎదుర్కోవడానికి రుద్రమదేవి సైన్యం సన్నద్ధమౌతుంది.
కోట పరిరక్షణ వ్యూహాలను రుద్రమ స్వయంగా పర్యవేక్షిస్తుంది.
ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 23 చదవండి. .
రుద్రదేవి తన సేనాపతులనందరినీ, ఆ రాత్రి తన ఆలోచనా మందిరానికి పిలిచింది.
"మీరు తెలుగువీరులు. పగరకు వెన్నిచ్చి పారిపోయే వారుకాదు. నేటి మేటి శూరులు. విరోధిని పూర్తిగా ఓడించడానికి నెలదినాలకన్నా ఎక్కువకాలం పనికిరాదు. పదిరోజుల లోపు మనం విజయం పొందగలం అని నేననుకోను.
"మన యుద్దవిధానం మనకోటను రక్షించుకోటం కాదు. అని మీరు నిస్సందేహంగా నమ్మండి. శత్రువును సర్వనాశనం చేసి ఓడించడమే మన కర్తవ్యము. అది ఒక్కటే మన ధర్మము. మన కోటబలం అందుకే ఉపయోగపడాలి.
"ఒక్క నిమిషము కూడా శత్రువునకు విశ్రాంతి తీసుకునే అవకాశం ఈయకూడదు. గవనులు వెడలి వారిపై బడి నాశనం చేస్తూ ఉండడము, వారి ఒత్తిడి ఎక్కువైతే కోటలోకి వచ్చేయడము! అన్ని గవనుల నుండీ ఒక్కసారి ముందుకు దుమికి వెనక్కురావడం, ముందుకుపోతే జాగ్రత్తతో పోవాలి!
"ఈ నాటికి మూడవ దినం శత్రువులను కంపకోటకడకు రానిచ్చి, పోరు మంచిపట్టు ఉన్నసమయంలో కంపకోట అంటించాలి. అంటించేముందు తక్కిన సైన్యం మట్టికోటలోనికి వచ్చివేయాలి! అగ్నిహస్తులు మాత్రం అగ్ని ముట్టించి లోపలికి వచ్చేయండి. శత్రువు రక్షణకోసం వెనక్కు తగ్గగనే, అగ్ని ఆరిపోయే సమయం లో అన్ని సింహద్వారాల నుంచి, దిడ్లనుంచీ లక్షమంది పైకురికి శత్రువును చీకాకు పరచండి.
శత్రువు బలం ఎక్కువ అయ్యే విషయం మేము కోటగోడలమీదనుంచీ చూచి మహాకాహళాలు ఊదిస్తాము. కాహళాల ధ్వని విని నెమ్మదిగా వెనక్కు అడుగువేయండి...
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
మానవత్వం
రచన: సిహెచ్. సీ. ఎస్. శర్మ
ప్రతి యుగంలోనూ దేవదానవులు వున్నారు. ఈ కలియుగంలోనూ మానవాకృతిలో... దేవతలు దానవులు వున్నారు. ఈ రెండు వర్గాలకు సదా విరోధం... గెలుపు దేవతలదే... అదే మానవత్వం...
భువనగిరి రామారాయుడు ఆ ప్రాంతంలో ఆ గ్రామానికి చుట్టూ వున్న పది పన్నెండు గ్రామాల్లో మంచి పేరున్న మనిషి. వారి తాతతండ్రులూ అదే పేరుతో బ్రతికినవారు.. సత్యం, ధర్మం, నీతి, న్యాయం, నిజాయితీలకు ప్రతిరూపం రామారాయుడు. వీరి తండ్రి గారు గోవింద రాయుడు, వారి తండ్రిగారి చివరి రోజుల్లో వారి యిష్టానుసారంగా నూరు ఎకరాల పంట భూమిని ఆ గ్రామ పేద ప్రజలకు పంచారు. ఆ వూరిలో వీరి సొమ్ము తినని వారులేరు. తాతతండ్రులు కీర్తిశేషులు. రాయుడి అర్థాంగి జానకమ్మ. రాయుడిగారికి అన్ని విధాల తగిన యిల్లాలు. వీరికి ఒక కూతురు. పేరు పల్లవి. అమెను డాక్టర్ చేయాలని, ఆ ప్రాంతంలో ఒక హాస్పిటల్ నిర్మించి తన కూతురి చేత ఆ ప్రాంత ప్రజలకు సేవ చేయించాలనే తన చిరకాల వాంఛ కారణంగా... యం.బి.బి.ఎస్ పాసైన తర్వాత... అమెరికాలో వున్న తన పినతండ్రి కొడుకు... తమ్ముడూ అయిన డాక్టర్.. డీన్ అయిన మోహనరాయుడు వద్దకు పల్లవిని పంపాడు. యిరువురు అనాథ బాల బాలికలను దత్తు తీసుకొని వారిని తమ కన్న బిడ్డల్లా చూచుకొంటూం చదివిస్తున్నారు ఆ దంపతులు. వీరి పాలేరు కనకయ్య... గుమాస్తా ఆదిశేషయ్య. పువ్వుకు వున్న వాసస, కట్టిన నారకు సంక్రమించినట్లుగానే... వారిరువురికీ యజమాని గుణగణాలు అలవడ్డాయి. వారి ఆదేశాలను తు.చ తప్పకుండా నిర్వర్తిస్తూ, రాయుడికి తగిన బంట్లని... వారూ మంచి పేరు తెచ్చుకొన్నవారే. పాలేరు కనకయ్య భార్య సుమతి. వీరికి ఒక మొగబిడ్డ. పేరు రఘు. హై స్కూలు
చదువు పూర్తి కాగానే రఘు యిష్ట ప్రకారం... అతన్ని బి.యి. సివిల్ యింజనీరింగ్‌లో చేర్పించాడు. రాయుడు. గుమాస్తా ఆదిశేషయ్యకు ఒక కూతురు. పేరు సంధ్య. యీమె తల్లి పదేళ్ళ క్రిందిట. మరణించింది. నాయనమ్మ శాంతమ్మ, ఆమెను పెంచి పెద్ద చేసింది. సంధ్య బి.యిడి చదువుతూ వుంది. కనకయ్య... ఆదిశేషయ్యలు మంచి స్నేహితులు. వీరి సఖ్యతను చూచిన రాయుడు ఆదిశేషయ్య కుమార్తెను, కనకయ్య కుమారుడికిచ్చి వివాహం చేసి వారి స్నేహాన్ని బంధుత్వంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని వేరు వేరుగా ఆ యిరువురితో ప్రస్తావించారు. రాయుడి గారి అభిప్రాయానికి వారు సంతోషించారు. సమ్మతించారు. అప్పటికి రఘు యింజనీరింగ్ చదువు పూర్తయింది.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/kjc0FPnxayI
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధం
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"రమ్యా! రెడీనా? నా ఆఫీసుకి టైమవుతోంది. త్వరగా తెములు. నిన్ను కాలేజీకి డ్రాప్ చేయడంకాదుగానీ, నీ మూలాన నాకు ఆఫీసుకి ఆలశ్యం అవుతోంది." పెద్దగా అరిచాడు విజయ్ తన చెల్లెలు రమ్యని.
"వస్తున్నా అన్నయ్యా! " అంటూ వచ్చి అతని స్కూటర్ మీద కూర్చుని తల్లితండ్రులకు 'బై' చెప్పి వెళ్లింది రమ్య.
వాళ్లు వెళ్లినవైపే చూస్తూ ఉండి లోపలికి వెళ్లారు రామయ్య, సుశీల. లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయిన రామయ్య భార్య సుశీల, కూతురు రమ్య, కొడుకు విజయ్ లతో స్వంత ఇంట్లో ప్రశాంతజీవితం గడుపుతున్నారు.
డిగ్రీ పూర్తి చేసిన విజయ్ బాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. రమ్య ఇంటర్ చదువుతోంది. ప్రతిరోజూ చెల్లెలిని కాలేజీవద్ద దింపి తను ఆఫీసుకి వెళతాడు విజయ్.
విజయ్ అంటే రమ్యకు చాలా ప్రేమ. విజయ్ కు కూడా అంతే. ప్రతి సం… తన అన్నకు రాఖీ కట్టి అతని ఆశీర్వాదము తీసుకోందే రమ్య మనసు ఊరుకోదు. ఆ అన్నా చెల్లెళ్లను చూస్తే చూడముచ్చటగా ఉంది అనుకుంటారు అందరూ.
వాళ్లిద్దరి ఐకమత్యాన్ని చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు రామయ్యదంపతులు. రోజులు గడుస్తున్నాయి. ఇంటర్ మంచిమార్కులతో పాసయి ఇంజనీరింగ్ లో చేరింది రమ్య . రోజూ సాయంత్రం ఆఇంట్లో అందరూ ఒకచోట చేరి హాయిగా నవ్వుతూ, తుళ్లుతూ సంతోషంగా కబుర్లు చెపుతూ గడుపుతారు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/c77KKLMmyds
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
మలిప్రేమ
B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“చూడండి సుభద్రగారు… మీరు చెప్పేది నాకొక్క ముక్క కూడా అర్ధం కావడంలేదు, కాస్త అర్ధం అయ్యేలా చెప్పండి,” అన్నాడు జడ్జి ప్రసాదరావు.
“అదేంటయ్యా … ఇంతవిడమరిచి చెప్పినా నీకు అర్ధంకావడంలేదా? సరే విను మళ్ళి చెబుతాను, మా
ఆయన ఉన్నాడుకదా ! ఆయనకు నాకు విడాకులు కావాలి, ఆయనను భరించడం నావల్ల కావడంలేదు.
రోజూ కీచులాటలే, మాకు ఎంత తొందరగా విడాకులిప్పిస్తే అంత ప్రశాంతంగా ఉందామనుకుంటున్నాం”
ఎదురుగా ఉన్న భర్తవైపు కోపంగా చూస్తూ చెప్పింది.
ఒక్కసారిగా కోర్టు హాలంతా నవ్వులతో ధ్వనించింది. జడ్జి కూడా కడుపుపట్టుకుని మరీ నవ్వుతున్నాడు. సుభద్రమ్మకు , ఆనందరావుకు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్ధంకాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
“సైలెన్స్” అంటూ జడ్జిగారు టేబుల్ పైన టకటకమని శబ్ధంచేసారు.
“సుభద్రగారు … మీ ఇద్దరిని చూస్తుంటే ఆరుపదులు దాటినవాళ్ళలా ఉన్నారు. తెల్లగా పండిపోయిన తల, ముడతలుపడిన శరీరం.. బాధ్యతలన్నీ తీరిపోయి ఒకరిమీద ఒకరు ఆధారపడే వయసులో, ఈ విడాకుల గోలేంటో మాకు
తోచడంలేదు, మీ ఆరోగ్యం బాగానే ఉందికదా? లేకా ఏమైనా చిత్త చాంచల్యంలాంటిదేమైనా వచ్చిందా?,”
అడిగాడు జడ్జి ప్రసాదరావు.
“జడ్జిసారు … మేము మంచిగానే ఉన్నాము, మా ఇద్దరికి పెన్షన్లు వస్తాయి. ఒకరిమీద ఒకరం ఆధారపడవలసిన అవసరంలేదు. మాకు మేముగా విడివిడిగా ఉండాలని అనుకున్నాము. అంతేకదా సుభద్రా” భార్యవైపు చూస్తూ అన్నాడు ఆనందరావు.
“ఆ … అవునవును అంతే,” అంది ఆవిడ తలూపుతూ.
“విడాకులంటే ఏదో తమలపాకులు.. మామిడాకులు అనుకుంటున్నారా ఏంటి మీరు?” అడిగాడొక
లాయరు నవ్వుతూ.
“నీకెందుకయ్యా మా విషయం… మాకా మాత్రం తెలియదనుకున్నావా? మామిడాకులకు తమలపాకులకు
తేడా తెలియదనుకున్నావా? మేము తెలుగుపండితులమే, అవసరంలేని విషయంలో జోక్యం చేసుకోవడం పద్ధతి కాదని తెలుసుకుంటే మంచిది,” చెడామడా అనేసింది.
వస్తున్న నవ్వాపుకుంటూ, “ సరే సరే , మరీ ఇంతకు అసలు విషయం చెప్పలేదు , మీరెందుకు విడిపోవాలనుకుంటున్నారు.. మీకు వచ్చిన కష్టాలు ఏంటి? అనేది చెబితే, విడాకులు మంజూరు చెయ్యడానికి ఉంటుంది,” చెప్పాడు జడ్జి.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/nDmVOJ-prng
From the publisher's feed