Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • ది ట్రాప్ ఎపిసోడ్ 12 | The Trap Episode 12 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ది ట్రాప్ ఎపిసోడ్ 12

    రచన : పాండ్రంకి సుబ్రమణి

    (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    గత ఎపిసోడ్ లో

    భువనేశ్ కి ప్రమోషన్ తో పాటు కొత్త కారు కూడా వస్తుంది.

    ప్రభావతి ఇంట్లో లేని సమయంలో వరూధిని తన కూతురు మందాకినితో భువనేశ్ ఇంటికి వస్తుంది.

    ప్రభావతి వచ్చేవరకు అక్కడే ఉంటానంటుంది.

    ఇక ది ట్రాప్.. పన్నెండవ భాగం చదవండి…

    హోటల్ రాయల్ బేంక్వట్ హాలులో నగర ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు విందు భోజనం యేర్పాటు చేసారు. వరూధిని యెటువంటి సందిగ్ధావస్థకూ లోను కాకుండా కూతురుతో బాటు భువనేశ్ ని కూడా తెలిసిన వారైన కొందరికి, యెదురొచ్చిన మరి కొందరికీ పరిచయం చేసింది. వాళ్ళలో ఆమెకు బాగా పరిచయం ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ భార్య చనువుగా అడిగింది కూడాను-“ఈజ్ హి యువర్ బాయ్ ఫ్రెండ్? ”అని.

    నవ్వు చిలకరిస్తూ వయ్యారంగా ముందుకు సాగుతూ బదులిచ్చింది- ’జస్ట్ లైక్ దట్! ’

    “ అలాగంటే కుదరదోయ్! ఈజ్ హి ఆర్ నాట్?” అని రెట్టించిందామె.

    ‘అలాగే అనుకో-’ అంటూ కదలబోయింది వరూధిని.

    అతడూహించినట్లే ఆమె వదల్లేదు. నొక్కి అడిగింది చెప్పమని. అటువంటి విషయాలలో ఆడాళ్ళకు రొమాంటికి థ్రిల్ యెక్కువని అతడికి తెలుసు. ఇక తప్పదన్నట్టు అతడి వేపు ఓ చూపు విసిరి సంభాషణ కట్ చేసింది వరూధిని-- “హి ఈజ్ మై మ్యాన్. చాలా! ” అని విసురుగా అంటూ--

    దానితో ఆ బిజినెస్ మ్యాన్ భార్య తలవిదిలించి ఆహ్వానితుల్లో కలసిపోయింది. అదే రీతిన వరూధిని మరొక ఇద్దరు బ్రైట్ లేడీ పర్సనాలిటీస్ ని ముఖాముఖి పరిచయం చేసింది. అతడి చూపుని ఆకట్టుకున్నది సితారా అనే యంగ్ లేడీ స్టార్టప్ సి ఈ ఓ— విద్యుత్ తీగలా ప్రవహించే కొండ వాగులా చురుగ్గా సంభాషణ కొనసాగించింది. సింగల్ గా ఉన్న సితార మాటల్ని, విషయ ప్రాజ్ఞతను గమనించి అతడికి తన అమెరికన్ కంపెనీ సహచరుడు, కార్పొరేట్ మెయిన్ ఆఫీసు సహోద్యోగి రాము ఉన్నపళంగా గుర్తుకి వచ్చాడు.

    వ్యక్తిత్వంలో, డైనమిజమ్ లో ఇద్దరూ ఒకరికొరు మంచిజోడీ. ఇద్దరూ కలిస్తే వసంత కాలానికి చివుళ్ళు పల్లవించినట్లే— ఇంటా బయటా లైఫ్ టైమ్ అచీవ్మెంటే— ఒకటి కాదు, రెండు మూడు స్టార్టప్ లను విజయవంతమైన కంపెనీలుగా తీర్చిదిద్ది వాటిని సంయుక్తంగా నడిపించగలరు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/Dvu6m0ogw4U


    14 min
  • రేడియో కొన్నాము | Radio Konnaamu | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    రేడియో కొన్నాము

    రచన: లక్ష్మి మదన్

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఆ రోజుల్లో వినోదానికి రేడియోలు ఎక్కువగా ముఖ్యపాత్ర పోషించాయి. కొన్ని ఊళ్ళలో చిన్న చిన్న సినిమా హాళ్లు ఉండేవి. చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరూ వచ్చి ఆహాలులో సినిమాలు చూసేవాళ్ళు.. కానీ అందరికీ వీలు అయ్యే విషయం కాదు కదా! రేడియో అయితే ఇంటింటా ఉండేది కాబట్టి అందరికీ ఉపయోగపడేది.

    అయితే మా ఇంట్లో రేడియో ఉండేది కాదు. చుట్టుపక్కల అందరిళ్ళల్లో పాటలు వస్తుంటే మాకు రేడియో కావాలని ఎంతో ఆశగా ఉండేది... కానీ మా బాపు ఎందుకో రేడియో కొనడానికి సుముఖంగా లేడు....

    కొన్నాళ్లు గడిచాక మా ఇంటికి ఒక కోమట్ల ముసలమ్మ వచ్చేది. ఆమెను ఇంట్లో వాళ్ళు సరిగా చూసేవాళ్ళు కారట. అందుకని ఎవరో చెప్పారట మా ఇంటికి వెళ్ళమని.. అప్పటి నుండి రోజు పొద్దున మా ఇంటికి వచ్చి రాత్రి వరకు కూర్చొని వెళ్ళిపోయేది. ఉన్నంతలో అమ్మ ఆమెకు భోజనం పెట్టేది .

    "అమ్మా! మీ బ్రాహ్మణుల సొమ్ము తింటున్నా నేను" అని బాధపడింది ..

    అయితే అమ్మ చెప్పింది.. “అట్లా అనుకోవద్దు. మాకు ఉన్నంతలో నీకు పెడుతున్నాము. తృప్తిగా భోజనం చేయి" అని చెప్పింది..

    ఆమె ఎంతో సంతోషంగా రోజు భోజనం చేసేది. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒకరోజు ఒక 100 రూపాయలు తీసుకుని వచ్చి మా అన్నయ్య చేతిలో పెట్టి నమస్కారం చేసింది..

    "అయ్యో ఎందుకమ్మా ఈ పైసలు మాకిస్తున్నావ్ ?” అని అందరము అడిగాం..

    కానీ ఆమె కళ్ళ నీళ్లు పెట్టుకొని “మా ఇంటి వాళ్లే నన్ను చూడలేదు.. మీరు ఇన్ని రోజులు నుండి నన్ను చూస్తున్నారు.. నాకు ఉన్నంతలో మీకు ఇస్తున్నా. నన్ను బాధ పెట్టకుండా తీసుకోండి" అని బ్రతిమిలాడింది. ఇంక చేసేది లేక ఆ డబ్బులు తీసుకున్నాము. అయితే ఆ రోజుల్లో 100 రూపాయలు చాలా గొప్ప విషయం.

    "అమ్మో! వంద రూపాయలా"😨😊 అని అనుకున్నాము.

    ‘వీటితో ఏం చేయాలి’ అని ఆలోచించుకున్నాము. తర్జనభర్జనలు చేసిన పిమ్మట ‘మనకు రేడియో లేదు కదా.. రేడియో కొనుక్కుందా’మని అనుకున్నాము. అనుకున్నదే తడవుగా మా అందరి గల్లా సొరుగుల నుండి డబ్బులు తీసాము. అన్నీ కలిపి దాదాపు 180 రూపాయలు అయ్యాయి... వాటిని తీసుకొని మా ఇంటికి ఎదురుగా ఉన్న మా బంధువుల మనిషికి ఇచ్చాము . అతని పేరు విశ్వన్న...

    "మాకు మంచి రేడియో తెచ్చి పెట్టు విశ్వన్నా..." అని అడిగాము..

    "ఏం కంపెనీ రేడియో తేవాలి " అని అడిగిండు...

    " ఏదైనా సరే ఈ డబ్బులకు వచ్చేది తీసుకొని రా "అని చెప్పాము.

    ఒక వారం తర్వాత ఆయన పట్నం వెళ్ళినప్పుడు ఒక రేడియో కొనుక్కొని తెచ్చాడు. ఫిలిప్స్ అనుకుంటా.. ఇంక మా సంతోషానికి అవధులు లేవు.

    ‘మా ఇంట్లో రేడియో ఉంది.. మా ఇంట్లో రేడియో ఉంది💃🏽💃🏽’ అని మురిసిపోతూనే ఉన్నాము.

    ఎదురుగా ఒక కొయ్య కొట్టి ఆ కొయ్యకు ఈ రేడియో తగిలించాము.. దాని చుట్టుపక్కలే కూర్చొని అన్ని కార్యక్రమాలను వినేవాళ్ళం ...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/JIudxOLEyZ4

    9 min
  • పెరటి చెట్టుపై వాలిన పక్షి | Perati Chettupai Valina Pakshi | Telugu Shot Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    పెరటి చెట్టుపై వాలిన పక్షి

    రచన : కొత్తపల్లి ఉదయబాబు

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    కోదండం గారు అన్న మాటలకి ఆంజనేయులు తలవంచుకున్నాడు.

    " తప్పు నాదే సార్. నన్ను క్షమించండి. చేతులారా నా పరీక్ష నేనే పోగొట్టుకున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఈసారి తప్పనిసరిగా పరీక్ష పాస్ అవుతాను. పదవతరగతి పాస్ సర్టిఫికెట్ వస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సర్. నాయందు దయవుంచి నాకు ఈ ఒక్కసారి లెక్కలు చెప్పండి సర్" అన్నాడు రుద్ధమైన కంఠంతో.

    "చూడు ఆంజనేయులు. ఇన్స్టంట్ పరీక్షకు కేవలం రెండు నెలలే సమయం ఉంది. సంవత్సరమంతా చదవలేనివాడివి ఈ రెండు నెలలలో చదివి ప్యాసవగలవా?"

    "ఖచ్చితంగా పాసయేలా కృషి చేస్తాను సర్. మీరు ఇచ్చే ఈ అవకాశాన్ని పాడు చేసుకోను. నా మీద దయ ఉంచండి సర్ "

    "సరే. నువ్వు రోజు ఉదయంమే వచ్చి లెక్కలు నేర్చుకోవాలి. నేను చెప్పినట్టుగా విని ఆచరిస్తే నువ్వు తప్పనిసరిగా 60 మార్కులతో పాస్ అవుతావ్.. కేవలం నీకోసం ఒప్పుకుంటున్నాను. ఫీజు 500. బాగా ఆలోచించుకో"

    "సార్. ఒక్కసారి గా అంత ఫీజు ఇచ్చుకోలేను. కానీ పరీక్షకు వెళ్లబోయే లోపుగా తప్పనిసరిగా మీ ఫీజు మొత్తం చెల్లిస్తాను. ఈ వంద అడ్వాన్స్ గా ఉంచండి సర్. ''అంటూ వందనోటు ఇవ్వబోయాడు వినయంగా ఆంజనేయులు.

    "పరీక్షకు వెళ్ళేలోపు ఇస్తానన్నావుగా... మొత్తం అపుడే ఇద్డువుగాని... రేపు మంచి రోజు. ఉదయమే రా. "అంటూ చనువుగా ఆ వంద నోటు ఆంజనేయులు జేబులో పెట్టేసారాయన.

    "నా దగ్గర ఏడాదిపాటు చదువు కొని పరీక్ష ఫెయిల్ అయ్యావ్ అంటే నాకే అవమానంగా ఉంది. ఐదు సబ్జెక్టులు పాస్ అయి లెక్కలు సబ్జెక్టు 34 మార్కులు తెచ్చుకుని మిగుల్చుకున్నావంటే నీ నిర్లక్ష్యానికి నాకు చాలా కోపంగా ఉంది. సరే రేపు ఉదయమే రా "

    ఆంజనేయులు మాష్టారి కాళ్ళకి సాష్టాంగ పడిపోయాడు.

    " మీరు ఒప్పుకున్నారు. నాకు అదే చాలు సార్ " అని వినమ్రంగా వెళ్ళిపోయాడు ఆంజనేయులు.

    "హూ వెధవ పిల్లలు. క్లాస్ లో మంచిగా చెప్పినప్పుడు వినిపించుకోరు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారు. "అనుకుని పేపర్లో తల దూర్చారు కోదండం గారు.

    *******

    మరుసటి ఉదయం నుంచే ఆంజనేయునికి కోదండం గారి శిక్షణ ప్రారంభమైంది.

    ఒక్కోసారి ఇచ్చిన హోంవర్క్ చేసుకుని వచ్చేవాడు కాదు ఆంజనేయులు.

    " ఏంటయ్యా! ఇంటి దగ్గరేం పని ఉంటుంది నీకు? రోజంతా ఖాళీయేగా. మరి హోం వర్క్ చేయడానికి ఏమి బాధ? "అని మాష్టారు కఠినంగా ఆడిగినప్పుడల్లా ఆంజనేయులు కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగేవి.

    "నువ్ ఇంటిదగ్గర చేసుకురావు అని నాకర్ధమైంది. ఇక్కడే చేసి వెళ్ళు "

    పరీక్ష ఉత్తీర్ణత అవ్వడానికి ఏ ఏ అధ్యాయాలలో ఏ లెక్కలు బాగా చేస్తే పాస్ అవుతాడో ఆ లెక్కలు ఒక్కొక్కటిగా ఎంతో వివరంగా అర్థమయ్యేలా చెప్పి, ఒక్కొక్క లెక్కని ఐదుసార్లు చేయించి, తన ఎదురుకుండా వాటినే పరీక్ష గా పెట్టి దిద్ది మార్కులు వేయడం మొదలుపెట్టారు కోదండం గారు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/MglWaX4TWag



    17 min
  • కాకతి రుద్రమ ఎపిసోడ్ 24 | Kakathi Rudrama Episode 24 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కాకతి రుద్రమ ఎపిసోడ్ 24

    రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    గత ఎపిసోడ్ లో

    గన్నారెడ్డి తన సేనలతో  మహాదేవుని మీద ఒత్తిడి పెంచుతాడు.

    కాకతీయ సైన్యాలు కంప కోటను  ముట్టిస్తారు.

    మంటల వెనుకనుండి బాణాలతో దాడి చేస్తారు.

    ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 24 చదవండి. .

    శివదేవయ్య అంతర్మథన చర్చలు----

    శివదేవయ్య అందరితో సహస్రావదానంలా ప్రశ్నోత్తరాలు జరుపుచున్నను, ఆ సాయంకాలము జరిగిన మహాయుద్దాన్ని గురించే ఆలోచిస్తున్నారు.

    తాను రుద్రప్రభువు కు ఆలోచనలు చెప్పగూడదు. ఆ ఉత్తమురాలు తన రాజ్యము తానే రక్షించుకోవాలి. తన సార్వభౌమత్వము తానే నిర్మాణము చేసుకోవాలి. స్త్రీలలోని

    పరిపాలనాదక్షత, కళాప్రపూర్ణము, శక్తియుతము. పురుషుని శక్తి అత్యంత బలయుతము. పురుషుడు విరోధులను లోబరుచుకున్నా, తన ప్రాభవం కోరతాడు. స్త్రీ ఇతరులను జయించినా వారి పూజ ఆశిస్తుంది.

    రెండు శక్తులూ రుద్రమాంబలో యమునా గంగా సంగమమయ్యాయి!

    ఈ తల్లి స్త్రీరాజ్య మెంత ఉత్కృష్టమో లోకానికి చాటగలదుగాక. పురుషుడు విభూతులను సంపాదించగలడు. వాటిని ఉత్తమంగా కాపాడవలసింది స్త్రీ గదా! పురుషుడు సృష్టికర్త. స్త్రీ సంరక్షణ కర్త్రి. ఇది మహాభావ విషయంలో, భౌతికంగా స్త్రీ బిడ్డలను కనాలి. పురుషుడు ఆ శిశువులను రక్షించాలి. ఈ భౌతిక సత్యంలో నుండే తాంత్రికవాద ముద్భవించింది.

    ప్రేమకు విముఖుడయిన శివుడు కాముని దహిస్తే దేవి ఏమవుతుంది? విశ్వసౌందర్యాన్ని ప్రేమించి భోగించగల ఆమె దివ్యరాగము పురుషునిలో లేకపోతే విశ్వానికే

    నాశనం! పరమేశుని ఇచ్ఛ సృష్టిస్థితి లయాలు. నాశన శక్తి భంఢాసురుడయినది.

    ఆ నాశన శక్తి ని పురుషుడు నాశనం చేయలేక పోవుట విచిత్రం. దేవిని ధ్యానించినాడు పరమేశుడు. తాను ఏమి చేయలేడు. దేవి ఎక్కడ? సర్వమూ ఆహుతి అయిపో

    యినది. తానే ఆహుతి అయినాడు. తన ఇచ్ఛ ఆహుతి అయినది.

    ఆ దివ్యాగ్ని లో నుంచి దివ్యకామ అయిన దేవికామేశ్వరిగా ఆవిర్భవించింది. ఉపాధి లేని శక్తి ఎట్లు? పురుషుడే కామేశ్వరుడు. కామకామేశ్వరి, రాజరాజేశ్వరి అనేభావం విశ్వవిశ్వాలకు, అనంతకాలానికి మూలమంత్రం. ఆ మంత్రానికి అధిదేవత కాముడేఅయినాడు.


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/t9lt8zNobXE


    19 min
  • శాంతి కోసం | Santhi Kosam | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    శాంతి కోసం

    రచన: సిహెచ్. సీ. ఎస్. శర్మ

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ప్రతి ఒక్కరికీ జీవితగమనంలో శాంతి, మనస్సుకు చాలా అవసరం. వివాహితులకు ఆ శాంతి లభ్యపడాలంటే... వారు జీవిత నాటకాన్నిచాలా శ్రద్దగా ఎదుటివారికి (అర్ధాంగికి, ఆఫీస్ కి) ఆనందాన్ని కలిగించే రీతిగా నర్తించాలి మరి... రంజిత్, రేవంత్ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. రంజిత్ సీనియర్. రేవంత్ జూనియర్. యిద్దరూ యం.కాం గ్రాడ్యుయేట్లు. ఒకే వూరి వారు. ఒకే స్కూలు... కాలేజిలో చదివినవారు. మంచి స్నేహితులు.

    రంజిత్ కన్న రేవంత్ మూడేళ్ళు చిన్న. యిరువురికీ వివాహం అయింది. రేవంత్ సహన సంపన్నుడు. రంజిత్ అసహనభూషణుడు.

    రేవంత్ భార్య కాపరానికి వచ్చింది. ఆసమయానికి రంజిత్ భార్య అమ్మగారి యింటికి వెళ్ళివుంది. ఆ రోజు యిద్దరూ ఆఫీసుకు వచ్చారు. "గురూ!... ఈ రాత్రికి మీ డిన్నర్ మా ఇంట్లో. సాయంకాలం నీవు నాతో మా యింటికి రావాలి." సాదరంగా ఆహ్వానించాడు రంజిత్‌ను రేవంత్. "ఏంట్రా విశేష?..." "మా ఆవిడ నిన్న వచ్చింది గురూ!..." "వస్తే!..." ఆశ్చర్యంగా రేవంత్ ముఖంలోకి చూచాడు రంజిత్. "వదిన ఊర్లో లేదు కదా!... ఈరోజు మా యింటికి వచ్చి మీ మరదలి వంటకాలను సేవించాలని నా కోరిక.." నవ్వుతూ చెప్పాడు రేవంత్. "నిన్ననేగా తను వచ్చింది. కొద్దిరోజులు గడవనీ." "ఏం ఫర్వాలేదు గురూ!... మొహమాట పడకు. యీ సాయంత్రం నీవు నాతో మాయింటికి వస్తున్నావు..." "తప్పదంటావా!..." "తప్పదు. నీవు నాతో వస్తున్నట్లుగా యింట్లో చెప్పి వచ్చాను." "అలాగా!" "అవును"  "సరే వస్తాను..." గురువుగారు తన కోర్కెను మన్నించినందుకు రేవంత్ ఆనందించాడు. యిరువురూ వారి వారి పనుల్లో మునిగిపోయారు.   ***  యింటర్ కమ్‌లో రంజిత్ ‌ను బాస్ రామదాసు పిలిచాడు. ఆయన యిల్లు ఆఫీసుకు దగ్గరలోనే. ప్రతిరోజు ఆఫీస్ బాయ్ తిరుపాలు ఒంటిగంటకు వారి యింటికి వెళతాడు. రామదాసుగారి అర్ధాంగి అనసూయ క్యారియర్ చేసి వుంచుతుంది. తిరిపాలు దాన్ని తీసికొని వచ్చి రామదాస్ గారి టేబుల్  పైన పెట్టి వెళ్ళిపోతాడు. రంజిత్ బాస్ క్యాబిన్ లో ప్రవేశించాడు. "రంజిత్ భోంచేశావా?..."

    "లేదు బాస్. బయటికి వెళ్ళాలి..." "తెచ్చుకో లేదా!..." "లేదు సార్..." "మా ఆవిడ వూరెళ్ళింది..." "బయట తిండి తింటే ఆరోగ్యం పాడవుతుందని తెలీదూ?..."  "తెలుసు సార్... కానీ పరిస్థితి..." "నీ సమస్య నాకు అర్థమైంది. చేతులు కడుక్కొని రా... నా క్యారియర్ వచ్చింది. యిద్దరం షేర్ చేసుకొందాం" అప్యాయంగా చెప్పాడు రామదాసు. "వద్దు సార్... నేను బయటికి వెళతాను. మీరు భోంచేయండి..." అనునయంగా చెప్పాడు రంజిత్.  "బాస్ మాటను కాదంటావా?...." కాస్త కఠినంగా వినిపించాయి ఆ పలుకులు రంజిత్ చెవులను.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/2pClXgTGFeU

    11 min
  • వీరి మధ్యన ఎపిసోడ్ 11 | Veeri Madhyana Episode 11 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వీరి మధ్యన... ఎపిసోడ్ 11

    రచన: బివిడి ప్రసాదరావు 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    బివిడి ప్రసాదరావు గారి  ధారావాహిక 'వీరి మధ్యన..' పదకొండవ భాగం

    గత ఎపిసోడ్ లో…

    రమేష్, కవితలతో బయలు దేరుతుంది సాహసి.

    దారిలో సామ్రాట్ కారులోకి మారుతుంది.

    వాళ్ళు  అద్దెకు తీసుకున్న ఫ్లాట్ కు చేరుకుంటారు.

    ఇక వీరి మధ్యన..  పదకొండవ  భాగం చదవండి...

    "కాల్ చేయ్. నేను వస్తాను. ఈ రోజు ఇంట్లోనేగా నేను ఉండేది." చెప్పాడు సామ్రాట్.

    "అంకుల్ కు కారు అవసరం ఉంటుందిగా." అంది సాహసి.

    "అక్కడ నా బైక్ ఉందిగా." చెప్పాడు సామ్రాట్.

    కారు ముందుకు సాఫీగా పోతుంది.

    "రూట్ చూస్తుండు. నువ్వు నీ స్కూటీ మీద బ్యాంక్ కు వెళ్లి రావడంలో తడబడవు." చెప్పాడు సామ్రాట్.

    "రూట్ మ్యాప్ పెట్టుకుంటాలే." చెప్పింది సాహసి.

    "థట్స్ ఫైన్." అన్నాడు సామ్రాట్.

    "సాయంకాలంకి నా స్కూటీ వచ్చేస్తుంది." అంది సాహసి.

    సామ్రాట్ ఏమీ అనలేదు.

    "నువ్వు కారు మీద నీ ఆఫీసుకు తిరిగేస్తావా." అడిగింది సాహసి.

    "లేదు లేదు. కారు ఐతే ట్రాఫిక్ ఛేదన కష్టం. సకాలంలో ఆఫీసును చేరలేను. ఇంటికి రాలేను. రేపు కారును ఇంటి వద్ద వదిలేసి, నా బైక్ తీసుకుంటాను." చెప్పాడు సామ్రాట్.

    సాహసి ఏమీ అనలేదు.

    ***

    సిక్స్ పియం దాటుతుంది.

    సాహసి, సామ్రాట్ ఇంట్లో సామాన్లు సర్దుకుంటున్నారు.

    గంట ముందు మోహనరావు పంపిన సామాన్లును ఫ్లాట్ లోకి చేర్పించుకున్నాడు సామ్రాట్.

    అప్పటికే సామ్రాట్ చేతతో సాహసి బ్యాంక్ నుండి ఇంటిని చేరి ఉంది.

    తండ్రికి ఫోన్ చేసి సామాన్లు చేరాయని చెప్పింది. తర్వాత తల్లితో మాట్లాడింది.

    ఆ సమయంలోనే సాహసి నుండి ఫోన్ తీసుకొని, మోహనరావుతో సామ్రాట్ మాట్లాడేడు. సామాన్లు పంపినందుకు తన ఇబ్బందిని ప్రస్తావించేక, 'థాంక్స్' కూడా తెల్పాడు.

    సమయం నైన్ పియం దాటింది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/YVfBUK8ELvM

    14 min
  • భలే మొగుడు... భలే పెళ్ళాం | Bhale Mogudu Bhale Pellam | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    భలే మొగుడు... భలే పెళ్ళాం

    రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    లంబోదరం బీకాం భోజన ప్రియుడు. తీయ తీయని లడ్డూలు, హాట్ హాట్ పకోడీలు జిహ్వకు చంచలం పుట్టించే ఏ జీడి పాకం శాల్తీ నయనా చొంగలు కార్చుకుంటూ లాగించేస్తాడు. ఖచ్చి తంగా చెప్పాలంటే కారుతున్న చొంగని సైతం చూపుడు వేలుతో అందిపుచ్చుకొని మరీ జుర్రే స్తాడు. అంతా బాగానే ఉంది అదృష్టమే కలిసి రాలేదన్నట్లు అతని ఒక్కగా నొక్క భార్యామణి పేరు… అనుకూలవతి అతనికి అననుకూలంగా తయారైంది!

    సమస్యల్లా ఏమిటంటే పెళ్లి అయిన తర్వాత ఈ ఆరు సంవత్సరాల కాలంలో అనుకూలవతి భర్తకి ఇష్టమయ్యేలా ఏ వంట చేసి పెట్టలేకపో యింది.

    ఇంకా పిల్లలు పుట్టలేదు కదా బోల్డంత ఖాళీ సమయం.. వంటలు భలే భలే పసందుగా.. మసాలావిందుగా.. తీపి గుమగుమలతో ఎందుకు వండలేకపోతుంది.. ఇదీ భార్య విషయంలో లంబోదరం సమస్య.

    భార్య అనుకూలవతి బెల్లం గారెలు చాలా బాగా చేస్తుంది కానీ బెల్లం మాత్రం ఏబులానికి బదులు 50 గ్రాములే వేస్తుంది.. ఇక కూరల విషయాని కొస్తే కోడి మాంసం కూర సూపర్ గా వండేస్తుంది… అందులో కారం మాత్రం ఆరు స్పూనులకు బదులు అర స్పూనే వేస్తుంది. గుత్తి వంకాయ కూర అదరహో వండేస్తుంది. కానీ అందులో ఉప్పు మాత్రం మూడు స్పూనులకు బదులు ముప్పావు స్పూనుడే వేస్తుంది... ఇక రుచి ఎక్కడ ఏడుస్తుంది?

    పెళ్లయిన కొత్తలో లంబోదరం పెళ్ళానికి కొత్త కదా.. అని ఇవేవో సరికొత్త వంటకాలేమోనని సరిపెట్టు కున్నాడు.. కొత్త మోజుతో. కానీ బయట హోటల్ తిండికి, తన ఇంట్లో తిండికి ఏదో తేడా కొట్టొచ్చినట్లు కనపడడమే కాకుండా.. ఈమధ్య తినలేక తినలేక తిన్నప్పటికి అరగక ఒకవేళ అరిగిన.. మళ్లీ పెళుక్కున భళక్కున వాంతులు కూడా అయిపోతున్నాయి.

    ఒకరోజు భార్యను దగ్గరగా పిలిచి.. '' ఏమోయ్ అనుకూలవతి.. పెళ్లికి ముందు నీ పేరు విని మోసపోయానోయ్. ధర్మారావు అంటారు ధర్మా లు చేయడు.. శ్రీరామచంద్రమూర్తి అంటారు అతగాడేమో కృష్ణుడిలా శృంగారపు పురుషుడు అవుతాడు. సరే సతి అనసూయ అన్న పేరు పెడితే సూర్యకాంతంలా దడదడ లాడించేస్తుంది.

    అక్కడికి నీ సంబంధం కుదుర్చుకోపోయే ముందు మా అమ్మతో అన్నాను.. 'అమ్మా! పెళ్లి కూతురు పేరు అనుకూలవతి అట. అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందేమో అని.. దానికి మా అమ్మ ఏమందో తెలుసా.. ‘నీకు అనుకూలంగా లేకపోయినా పర్వా లేదురా భడవా! మాకు అనుకూలంగా ఉంటే చాలు’ అంటూ నా మెడలు వంచి ఒప్పించేశారు. నేనే వేసానో ఇంకెవరైనా వేశారో తెలియదు కానీ మొత్తానికి మూడు ముళ్ళు పడిపోయాయి నీ మెడలో.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/oJqHvFuqwG8

    19 min
  • రంగుల లోకం | Rangula Lokam | Telugu Short Story | Veluri Prameela Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    రంగుల లోకం

    రచన: వేలూరి ప్రమీలాశర్మ

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    నేనెప్పుడూ చూడని మా నాన్నకి ప్రేమతో,

    ఈ  రంగురంగుల లోకంలో ఎన్నో ఆశలతో ఎదగాలని ఉంది నాన్నా! కానీ ఈ విశాలమైన ప్రపంచంలో ఏ మూలకి పోయినా, నా కేర్ ఆఫ్  అడ్రస్ అడుగుతున్నారు. ఏమని చెప్పను. అమ్మని అడిగితే నీ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడదు. "మోసగాడు" అంటుంది. ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంటుంది. ఓదార్చే ధైర్యం చేస్తే, దూరంగా వెళ్లిపోతుంది. నీరక్తం నాలో ఉందని అసహ్యమేమో... అలాగని నాపై ప్రేమను చంపుకోలేకపోతోంది. అంటే నీమీద కూడా తన మనసులో ఏదో ఒక మూలన ప్రేమ ఉందనే కదా!

    ప్లీజ్... ఒక్కసారి వచ్చి ప్రేమగా మమ్మల్ని దగ్గరకి తీసుకోవూ... ఓ తండ్రి కన్న కూతురుగా అమ్మ... తన జీవితంలో ఓడిపోయి ఉండొచ్చు. కానీ, ఈ తండ్రి... తాను కన్న కూతురిని గెలిపించడానికి వస్తాడని ఆశతో చూస్తున్నాను. వస్తావు కదూ! నిన్ను తీసుకు వస్తానని అమ్మకి మాటిచ్చాను. కానీ, నీకోసం ఎక్కడని వెతకాలి? అందుకే ఈ లెటర్, దేవుడి హుండీలో వేస్తున్నాను. తప్పకుండా వస్తావు కదూ!

    ఇట్లు,

    నీ  చిట్టితల్లి.

    లక్ష్మీ నృసింహస్వామి గుడిలో పరకామణి సేవలో హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సుదర్శనానికి, నగదూ కానుకలతో పాటు, హుండీలో ఉన్న ఈ లేఖ దొరికింది.

    "ఎవరు రాసి ఉంటారబ్బా?" అందమైన దస్తూరీతో ఉన్న ఆ తెల్లకాగితాన్ని అటూ ఇటూ తిప్పి చూసాడు. రాసినవారి పేరు లేకపోయినా, ఆర్ద్రత నిండిన అక్షరాల వెంబడి అతని కళ్ళు పరిగెత్తినప్పుడు, కళ్ళవెంట అప్రయత్నంగా నీళ్లు ఉబికి వచ్చాయి. మసకబారిన జ్ఞాపకాల వైపు ఆలోచన మళ్లింది.

    'అంటే... ఛాయ ఇక్కడే ఎక్కడో ఉందన్నమాట. ఈ లెటర్ ఛాయ కూతురే రాసి ఉంటుంది' అనుకుంటూ ఆ కాగితం పట్టుకుని ఆలయ ప్రధాన అర్చకుడిని కలవడానికి వెళ్ళాడు.

    "చూడండి బాబూ! నిత్యం ఎంతోమంది ఈ గుడికి వస్తూ, పోతూ ఉంటారు. అందులో ఈ లేఖ రాసినది ఎవరని చెప్పగలం? మీ ఆత్రుత నాకు అర్థమవుతోంది. కానీ ఈ విషయంగా నేనే సహాయమూ చెయ్యలేను" హుండీలో దొరికిన లేఖను ఆసాంతం పరీక్షగా చూస్తూ చెప్పాడు పూజారి.

    కళ్ళు మూసుకుని, మనసులో ఆ నృసింహస్వామిని తలచుకొని, పూజారికి నమస్కరించి, అక్కడ్నుంచి కోనేరు వైపు వచ్చాడు సుదర్శనం. కోనేరులో దిగి, ఆ పవిత్ర జలాన్ని తలపై చల్లుకుని, తిరిగి మెట్లు ఎక్కుతుండగా, ఓ పక్కగా మెట్లపై విచారంగా కూర్చున్న ఓ పదహారేళ్ళ అమ్మాయి కనిపించి, ఆగిపోయాడు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/P6WHsjclgNY

    9 min
  • మా నాన్నకు సన్మానం | Ma Nannaku sanmanam | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    మా నాన్నకు సన్మానం

    రచన : జీడిగుంట శ్రీనివాసరావు

    (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    “యిదిగో, యిటు రావోయ్! మా నాన్నకి ఈ నెల 30 వ తేదీన  రవీంద్రభారతి లో సన్మానమట, తప్పకుండా రమ్మని ఫోన్ చేసారు” అన్నాడు కిరణ్, వంటింట్లో వున్న భార్య వినత తో.

    “పదేళ్ల క్రితం చేశారుగా, మళ్ళీ యిప్పుడు ఎందుకు?” అంది అక్కడ నుంచే.

    “అది మా నాన్న రిటైర్ అయినప్పుడు ఆఫీస్ వాళ్ళు చేసింది. యిప్పుడు ఒక పెద్ద పత్రిక వాళ్ళు చేస్తున్నారు, కొంతమంది ప్రముఖ రచయితలకు” అన్నాడు సంతోషంతో కిరణ్.

    “ప్రముఖ రచయితలకా, మరి మామయ్యగారి కి ఎందుకు?” అంది, సన్నాయి రాగం తీస్తో వినత.

    “అవునులే.. నీకు మా నాన్న రాసిన కథలు చదవటానికి తీరిక ఎక్కడా పాపం, ఎంతసేపు ఆ టివీలో ‘అత్తగారి హత్య, మామగారి వింత రోగం’ లాంటి సీరియల్స్ చూడటానికి టైం చాలదు” అన్నాడు కోపంగా కిరణ్.

    “అబ్బా.. ఊరుకోండి నాన్నా! మీ యిద్దరి పొట్లాటలతో నాకు చదువు సాగడం లేదు. నేను చెపుతున్నా.. మనం తాతయ్య సన్మానానికి వెళ్తున్నాం, అంతే”  అంటున్న కూతురు వంక ఆనందంగా కిరణ్, కోపంగా వినత ఒకేసారి చూసారు.

    మొత్తానికి హైదరాబాద్ వెళ్లడం మానేసి., తండ్రికి తనకి ఆఫీసులో ఇన్స్పెక్షన్ వుంది రాలేను అనిచెప్పి తప్పించుకున్నాడు. ఆ విషయం తెలిసిన కూతురు, తండ్రితో, “నువ్వు అమ్మ ఏమంటే దానికి ‘అంతేగా… అంతేగా… ‘ అని తాత సన్మానానికి వెళ్లకుండా చేసావు.  యింట్లో అమ్మ చేత నీకు జరిగే సన్మానం తప్పా, యింతవరకు నేను నిజమైన సన్మానం చూడలేదు. అంతా చెడగొట్టారు” అంది.

    ‘చివరికి నీకు కూడా లోకువ అయ్యాను’ అనుకుంటూ ఆఫీస్ కి వెళిపోయాడు కిరణ్.

    యింకో గంటలో ఆఫీస్ అవుతుంది అనగా, వినత ఫోన్ చేసి కిరణ్ కి, “ఏమండోయ్! మా అమ్మ కాలు జారిందిట, మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి. పనిలో పని, మామయ్యగారి సన్మానం కూడా చూసినట్టు వుంటుంది. మా అమ్మకి సహాయం చేసినట్టు వుంటుంది. పాపం నాన్న ఎంత బాధ పడుతున్నారో..” అంది.

    “అదేంటి, మీ అమ్మ యిప్పుడు కాలు జారడం ఏమిటి, మీ నాన్న వుండగా, ఛీ ఛీ” అన్నాడు.

    “అయ్యో రాత! తెలుగు సినిమాలు చూసి పాడైపోయారు. బాత్రూం లో కాలు జారి పడిపోయింది. లేవలేకపోతోందిట. త్వరగా రండి” అంది.

    “పూర్తిగా వినరు. వీలుంటే ఫ్లైట్ లో వెళ్దాం” అని కంగారు పెట్టేసింది వినత.

    “ఆ.. వస్తాను” అని ఫోన్ పెట్టేసాడు కిరణ్.

    మొత్తానికి రెండవ రోజు అంటే గురువారం ఫ్లైట్ లో బయలుదేరారు హైదరాబాద్. యిద్దరి అత్తగారి ఇళ్ళు హైదరాబాద్ అవడం తో కొంత సుఖం గా వుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు వచ్చి క్యాబ్ లో డైరెక్టుగా అత్తగారి ఇంటికి బయలుదేరారు.

    క్యాబ్ లో వినత, వాళ్ల అమ్మకి ఎలా వుందో అని ఒకటే కంగారు పడుతోనే వుంది. గంట ప్రయాణం తరువాత బీరంగూడ చేరుకున్నారు. క్యాబ్ లో నుంచి దిగి, అక్కడ దృశ్యం చూసి కొయ్యబారి పోయాడు కిరణ్.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/1hJ-yNfbtfc

    13 min
  • బామ్మగారూ-సెల్ ఫోనూ | Bammagaru-Cell Phone | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    బామ్మగారూ.. సెల్ ఫోనూ

    రచన: భాగవతుల భారతి

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    మానవీయ కోణాన్ని ప్రసార మాధ్యమం

    ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూనే ఉంది.

    చాపక్రింద నీరులా ~

    నేనుఆలోచిస్తున్నాను. ఏంజరుగుతోంది

    మనచుట్టూ, కాలంతోపాటు మనం మారామా?  మన మూలంగా కాలం మారుతోందా? మూడు తరాల అంతరంగాలనూ అంచనావేస్తూ ఆలోచిస్తున్నాను. ఇదివరకు ఈ ఇల్లు

    ఎలాఉందీ? ఇప్పుడెలా ఉందీ? ప్చ్!

    ///////////////

    "సౌదా! అయిందా?" మామగారి పిలుపుకు

    "వచ్చేస్తున్నా మామయ్యా" జవాబు చెప్పి~

    "స్వస్తిశ్రధ్ధాం మేధాం యశ: "~ ~

    అగ్నిహోత్రపు ఆఖరిమంత్రం కూడా చదివేసి

    తర్వాతి మంత్రాలు నోట్లో చదివేస్తూ,

    చకాచకా అన్నీ సర్దేసి, పరుగులాంటి నడకతో, ఇంట్లోకి వచ్చేదాన్ని, మామయ్యగారికి కాఫీ ఇవ్వడానికి.

    "ఏమిటే చాదస్తం, తెల్లవారేటప్పటికి, వంటలూ, టిఫిన్లు, బాక్సులు, పిల్లల్ని స్కూల్ కి రెడీ చేయటాలూ, ఇన్నీ చాలవనీ ఈ అగ్నిహోత్రం ఒకటీ ,పనులు ఎక్కడ

    తెములుతాయీ, ఇవన్నీకాక మళ్ళీ స్కూల్.

    ఏదీ ఆపవుకదా? కానీయండీ టైం అవుతోందీ "

    నాకు చేదోడువాదోడుగా ఉంటూనే ముద్దుగా విసుక్కుంటోంది అత్తయ్య.

    గబగబా తెమిలి, స్కూల్ కి పిల్లలతో వెళ్ళిపోయేదాన్ని. మావారు రమణశర్మ కూడా, నా సాయంతో, ఆత్తయ్య సాయంతో రెడీఅయి కాలేజీకి వెళ్ళిపోయారు. ఇంట్లో అత్తయ్యా మామయ్యా ప్రశాంతం.

    సాయంత్రం అవగానే ,మళ్ళీ హడావిడి గా ఇల్లు చేరేదాన్ని పిల్లలతో.

    అప్పటికే బయటి పిల్లలు ఇంటి కొచ్చి ఎదురు చూస్తుండేవారు. వాళ్ళు తరగతి గదిలో పాఠాలకు ప్రైవేట్ ట్యూషన్ కి వచ్చిన వాళ్ళుకారు.

    ప్రాచీన సంస్కృత, తెలుగు భాషాభిమానంతో, ఎలాగైనా తమ పిల్లలకు ఓ సంస్కృతీ, సాంప్రదాయం నేర్పాలీ.

    ఈరోజుల్లో అవన్నీ, భాషా రూపంగాగానీ, సాంప్రదాయ రూపంగా గానీ మృగ్యమై పోతున్నాయ్, వాటిని చేతులొడ్డి ఐనా కాపాడాలనుకునే, కొంత మంది సత్సాంప్రదాయ వాదులైన తల్లిదండ్రులకు

    ప్రతీకలు వాళ్ళు. సాంప్రదాయాన్ని, శ్లోకం,

    పద్యం రూపంలో వల్లెవేసేసి, మళ్ళీ యధాతధంగా తరగతి పుస్తకాలతో కుస్తీ పట్టడానికి, గంటలో ఎవరిదారిన వారు వెళ్ళి పోయేవారు.

    నేను, పి, జి డిగ్రీ తోపాటుగా వేదమంత్రాలు కూడా కొన్ని నేర్చుకున్నాను. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు, నాదగ్గరకు

    తర్ఫీదు కోసం పంపిస్తారు. ప్రతిఫలాపేక్షగానీ

    ధనాభిలాషగానీ, ఆశించని ఓ ఆదర్శవంత మైన, ఉదాత్తమైన ప్రక్రియ.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/PMcapsWrpdo

    14 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world