Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • ఓ అమ్మాయి కథ | O Ammayi Katha | Telugu short story | N Dhanalakshmi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఓ అమ్మాయి కథ

    రచన: N. ధనలక్ష్మి

    చేసిన తప్పును తెలుసుకొని తనని తాను సరిదిద్దుకున్న ఓ ఇంతి కథ.

    పెళ్ళి నిశ్చయించారు పెద్దలు. పెళ్ళి రేపు అనగా ఇంట్లో డబ్బులు, నగలు తీసుకొని తను ఇష్టపడిన రాహుల్ తో పారిపోయింది పెళ్ళి కూతురు భాను.

    పెళ్ళికి మంచి ముహూర్తాలు లేవంటూ కొద్ది రోజులు జీవితాన్ని లవర్స్ గా ఎంజాయ్ చేద్దామని తనని నమ్మించి సొంతం చేసుకున్నాడు. కొద్ది రోజులు ఎటువంటి ఆంక్షలు లేకుండా సరదాగా గడిపారు. పెళ్ళి చేసుకుందాం అంటే ఎప్పుడూ మాట దాటేసేవాడు. మూడు నెలల తరువాత భాను నెల తప్పింది. ఆ విషయం రాహుల్ కి చెప్పి ‘పెళ్ళి చేసుకుందాం. ఆలస్యం అయితే ప్రమాద’మని చెప్పింది.

    రాహుల్ పెళ్ళికి కావాల్సినవి తెస్తానని చెప్పి బయటకి వెళ్ళిన వాడు తిరిగి రాలేదు. భాను కంగారు పడుతూ ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. భాను తెచ్చుకున్న నగలు, డబ్బులు కూడా లేవు. భానుకి అర్థమైంది తను మోసపోయానని!

    అమ్మ, నాన్నలకి తను ఒక్కటే సంతానం. వారి వద్దకు వెళ్ళాలి అనుకుంది. మోసపోయానని చెప్పితే ఆదరిస్తారు అనుకొని ఊరికి చేరింది. ఊర్లో వారికి తానెవరో తెలియకుండ ఉండేలా మొహానికి ముసుగు వేసుకుంది. తన ఇంటికి చేరుకుంది కానీ తాళం వేసి ఉంది

    . భాను లేచిపోవడం వల్ల ఊరిలో పరువు పోయింది. వారు ఆ బాధలో ఉండగా పెళ్ళి వారు తల ఓ మాట అనడం భరించలేక వాళ్ళ అమ్మ, నాన్న.. ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయారని చెప్పారు. తన వల్లే అమ్మ , నాన్న ఈ లోకం నుండి వెళ్ళిపోయారని, తట్టుకోలేక పోయింది. వారి ఊరిలొన్న బావిలో దూకి చనిపోవాలని అనుకుంది.

    ఆ ఊరికి మెడికల్ క్యాంప్ కి వచ్చి తిరుగు ప్రయాణం అవుతున్న సింధూ ఆ దృశ్యాన్ని చూసి భానును ఆపింది.

    ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావుని సింధూ అడగగానే తన గురించి చెప్పింది

    "మేడమ్! నేను చేసిన పనికి చావు తప్ప ఇంకో పరిష్కారం లేదు.. అవునా కాదా చెప్పండి!????”

    సింధూ భాను వైపు చూస్తూ...

    “మీరు చేసింది తప్పే! కాదు అనను.. కానీ చనిపోవడం కరెక్ట్ కాదు.... చూడండి భాను.. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. కాకపోతే అన్నిటినీ తట్టుకుని నిలబడే మనోదైర్యం ఉండాలి. అదే మీకు మార్గాన్ని చూపిస్తుంది.

    మీ ఇష్టపూర్వకంగానే కదా కలిశారు. ఆ ఫలితమే మీ కడుపులోని బిడ్డ. తనని చంపే హక్కు మీకు లేదు. బిడ్డ పుట్టాక, చనిపోవాలి అనుకునే నిర్ణయాన్ని మీరే మార్చుకుంటారు. కాస్త ప్రశాంతంగా ఆలోచించండి పరిష్కారం తప్పక దొరుకుతుంది....”

    భాను నవ్వుతూ....

    “ప్రశాంతత ఎక్కడుంది , ఎక్కడ దొరుకుతుంది....

    నా నిర్ణయం మార్చుకొమ్మని ఎంత బాగా చెప్తున్నారు.. మీకేమీ నాకున్న సమస్యలు లేవు కదా..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/U7b05exVZKA




    11 min
  • ది ట్రాప్ ఎపిసోడ్ 5 | The Trap Episode 5 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ది ట్రాప్ ఎపిసోడ్ 5

    రచన : పాండ్రంకి సుబ్రమణి

    పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' ఐదవ భాగం

    గత ఎపిసోడ్ లో

    దివాకర్ వెళ్ళాక విశ్వం కూడా వేదమూర్తి ఇంటికి వస్తాడు. అతను కూడా పరమేశ్వర్ గురించి ఆరా తీయడంతో ఆశ్చర్యపోతాడు వేదమూర్తి. వెళ్లే ముందు వేదమూర్తితో రహస్యంగా ఏదో చెబుతాడు విశ్వం.

    ఇక ది ట్రాప్. . ఐదవ భాగం చదవండి…

    అనుకున్న ప్రకారం పనావిణ్ణి ఆ రోజుంతా యింట్లోనే ఉండమని చెప్పి భువనేశ్, ప్రభావతి యిద్దరూ కారుని యింట్లోనే విడిచి, ఆటోలో తిన్నగా ఉజ్జయినీ దేవి గుడికి వెళ్లారు. సహస్రనామ అర్చన, లక్ష కుంకుమార్చన ముగించి గుడి వెలుపల ఉన్న బిచ్చగాండ్రకు వరసగా చిల్లర డబ్బులు అందించారు. రాబోయే పుణ్యదినాన భిక్షువులకు, సాధువులకు ఆలయ చావడిలో భోజన సదుపాయం సమకూర్చడానికి గుడి ఇ ఓ గారికి విరాళం యిచ్చి రిసీప్టు తీసుకుని, రిజష్టరులో నమోదు చేయించుకుని, రోడ్డుపైకి వచ్చారు.

    నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ గుడి ప్రసాదం స్వీకరించి  దగ్గర్లో ఉన్న కాఫీ పాయింటు వద్ద కాఫీ తాగి, ఇద్దరూ మరొక ఆటోరిక్షా యెక్కి సనత్ నగర్ పార్కు చేరుకున్నారు.

    ప్రభావతికి ఐస్ క్రీమ్ కోన్ అందిచ్చి తను కూడా ఒకటి తీసుకుని చెట్టు చెప్టాపైన కూర్చున్నాడు భువనేశ్.

    ప్రభావతి మాత్రం ఐస్ క్రీము తినకుండా అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది- “ఉఁ ఇప్పుడు చెప్పండి- ఏం జరిగిందో! ఇంత వరకూ నేనెందుకు నోరుమెదప కుండా ఊరుకున్నానంటే -- గుడికెళ్ళిన మంచి మూడ్ మనిద్దరికీ చెదరకూడదనే—”

    అతడు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు- “ఎందుకలా అడుగుతున్నా వు? నాకేమీ జరగందే ఏదో జరిగిందని నేనెలా చెప్పను!”

    “కాదు. మీకేదో జరిగింది. ఇష్టపడి మిమ్మల్ని కట్టుకున్నదానిని. నాకు మీకేదో జరిగుంటుందని తెలవదా--”

    “అసలు నాకేదో జరిగుంటుందని నువ్వెందుకనుకుంటున్నావు ప్రభా?”

    “చెప్పేదా—సూటిగా అడిగేదా! ”

    ఉఁ అన్నాడతను మొదట చేతిలోని ఐస్ క్రీము తినడం ముగించమని సంజ్ఞ చేస్తూ--

    ఆమె మరేమీ అనకుండా ఐస్ క్రీము తినడం పూర్తి చేసి చేతి గుడ్డతో పెదవులు తుడుచుకుని అడిగింది-“ఆర్ యు రెడీ! ”..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/rpGk_bTMs70

    14 min
  • కాకతి రుద్రమ ఎపిసోడ్ 17 | Kakathi Rudrama Episode 17 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కాకతి రుద్రమ ఎపిసోడ్ 17

    రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 16 వ భాగం

    గత ఎపిసోడ్ లో…

    గణపతి దేవుడు రుద్రమ దేవిని పిలిచి, రాజ్యాధికారం రుద్రమ దేవి భర్తకు ఉండదని, అది కాకతీయ వంశజులకే చెందాలని ప్రమాణం చేయించుకుంటాడు.

    అన్నమాంబిక తను కూడా కదన రంగానికి వస్తానని కోరుతుంది.

    బాప్పదేవుడు యుద్ధంలో నాగయ్య నాయకుని సంహరిస్తాడు.

    ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 17 చదవండి..

    తొలి విజయం రుద్రమదేవిని ఆనందపరిచింది. ఆమె పేరుప్రఖ్యాతులు మండలాల వరకూ వ్యాపించినాయి. కాకతీ రాజ్యానికి కలలు కంటున్న వాళ్ళ కళ్ళంటుకున్నవి.... అదీగాక గోనగన్నారెడ్డి కాకతీ రాజ్యపాలనను సుగమం చేసి - చక్రవర్తిణికి నీడలాగా వుంటూ చాలా చిత్రంగా ఎదురు తిరుగుచున్న సామంత రాజులని అణచివేయటం- అభాసుపాలు చేయడం చేస్తున్నాడు.

    బలమైన లకుమయారెడ్డి, కాచమనాయకుడు లాంటివారే అతని చేతిల శృంగ భంగం చెందితే తామెంత? అని రెక్కలు విప్పిన సామంతులు కొందరు మళ్ళీ రెక్కలు ముడుచుకుని గూళ్ళలో దూరాల్సొచ్చింది.

    యిది యిట్లా వుండగా-

    రుద్రమదేవి తన అపార బలగంతో, సమధికోత్సాహ సైన్యంతో, సామంత రాజ్యాల మీదుగా, పక్కన అన్నమాంబికను కూర్చుండబెట్టుకుని ప్రయాణాలు చేయసాగింది.

    ఆమె ఎటు వెళ్ళినా గౌరవపురస్కారమైన అభినందనలే- విజయధ్వానాలే. కోట పేర్మినాయుడు  సిగ్గుతో తల చిదికిన పామువలె నిలబడి "కాకతీచక్రవర్తిణీ! నన్ను క్షమించవలెనని ప్రార్థన" అని వేడుకున్నాడు.

    కాటమనాయకుడు మాటరాక- ఆమె పాదాలదగ్గర నిలబడి పోయినాడు- ఆమె ఏమీ అనలేదు. చిరునవ్వు నవ్వింది. క్షమా హృదయము కాకతీయులకు తొలినుంచీ

    వున్నది. ఆమె ఎంతటి చక్రవర్తిణి అయినా, స్త్రీ గనుక హృదయలాలిత్యము వుండటం చేత క్షమించగలిగింది.

    పొనుగంటి సామంతప్రభువు జన్నిగదేవుడూ, ఆయన కుమారుడు, త్రిపురాంతక ప్రభువు రుద్రమహారాజు ఆమెకు దోవ పొడుగునా అఖండ స్వాగతాలు ఇచ్చారు. స్త్రీలు మంగళహారతులు ఇచ్చారు. నృత్య -గాన వినోద విభావరి ఆది. అంతులేని సంతోషహేల. ప్రజలకు తమ చక్రవర్తిణిని చూసిన సంరంభము.

    ఆమె శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించింది.

    సింహపురి రంగనాయకస్వామిని కొలిచింది. కంచి కామాక్షిని ప్రార్దించింది. ప్రతిరోజూ ఆమె ఎక్కడుంటే అక్కడ తిరునాళ్ళే. అంతులేని - అదుపు చేయలేని జన

    సందోహమే.

    ఆమె కర్నూలు లో కాలిడినది. ఆదవోనిలో ఒకపూట ఆగినది. కోటారెడ్డి  ప్రభువుతో మాట్లాడినది. అన్నమాంబిక భయము మీకు వలదని అభయ మిచ్చింది. బుద్ధపురం ప్రభువులను పరామర్శించినది.

    వర్ధమానపురంలోని రాజకీయ జీవితమును ప్రత్యక్షముగా వీక్షించినది. ఆమె స్నేహ సౌశీల్యత, మృధుస్వభావము, మధుర భాషణా అందరినీ చకితులుగా చేసింది. అన్నమాంబిక మాత్రం ఆదవోని ప్రభువుల, ప్రజల కంట పడలేదు.

    తరువాత పదిదినములకు కాకతీనగరము చేరినది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/PS6vcOEQ5n0


    11 min
  • రెంటికీ చెడ్డా | Rentiki Cheddaa | Telugu short Story | Siriprasad | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    రెంటికీ చెడ్డా

    రచన :  శిరిప్రసాద్

    వేగంగా వెళుతోంది రవి ప్రయాణిస్తున్న కారు. వెనక సీట్లో తలపట్టుకుని కూర్చున్న రవి తీవ్ర ఆలోచన లో వున్నాడు. అతని గుండె లో మంటలు భగ్గుమంటున్నాయి. దానికి విరుద్ధంగా కళ్ళనించి కన్నీరు కారుతోంది.

    రామాపురం ప్రయాణాన్ని విరమించుకుని తిరిగి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి పోతున్నాడు.

    'నాన్నా రవీ!... యేమైందిరా ? అంత త్వరగా అంత మంచి పొజిషన్ లోకి వెళ్ళి, ఆ తప్పు చేశావెందుకురా?... అంత మంచి జాబ్ కి రిజైన్ చేసావు!... ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు?... ' తండ్రి ఆరా.

    'ఈ రోజు మన వూళ్ళో మీటింగ్ వుంది అన్నావుగా!... అందుకే ముంబయి నించి వస్తున్నాను... అక్కడికి వచ్చాక అన్నీ విషయాలు చెప్తాను నాన్నా!'

    'ఇంకెక్కడి మీటింగ్ రా!... క్యాన్సల్ చేసారు . ఏ బీ సీ కంపెనీ లో డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎదిగావు. ఈ వూరి యువతకి స్ఫూర్తి కలిగించావు. నువ్విచ్చిన స్పూర్తితో   ఐదుగురు యువకులు మంచి చదువులు చదువుకుని జీవితంలో గొప్ప విజయాలు సాధించారు. ఇంకా ఎంతోమంది అదే ప్రేరణ తో చదువుకుంటున్నారు. ఊరి జనం అంతా నిన్ను సన్మానించుకోవాలన్నారు. నువ్వు నన్ను అడగకుండా బయల్దేరావేంట్రా?...

    నువ్వు షేర్ మార్కెట్ లో మోసం చేసి విచారణ ఎదుర్కుంటున్నావని, వుద్యోగానికి రాజీనామా చేసావని చెప్పుకుంటున్నారు. అందుకే నీ సన్మాన సభని క్యాన్సల్ చేసార్రా !... ఇప్పుడు యిక్కడికి రావడం మంచిది కాదురా. నేను, అమ్మా ముంబై కి వస్తున్నాం. ఎల్లుండికి రిజర్వేషన్ అయింది...'

    'సరే... నాన్నా...' గద్గద స్వరంతో అన్నాడు రవి. ఇంకా అంతకు మించి మాట పెగల్లేదు. కష్టంగా, ఆన్నాడు  'మీరు ముంబై రండి... ఏం జరిగిందీ ..... అక్కడ చెప్తాను...'

    ***

    రామాపురం హైదరాబాద్ కి దగ్గిరలో వొక కుగ్రామం. అక్కడ సరైన స్కూల్, పీ హెచ్ సి, రక్షిత నీటి సరఫరా యిలాంటి కనీస సౌకర్యాలు యేవీ లేవు. శిధిలావస్థలో వున్న పంచాయితీ స్కూల్లోనే పిల్లలు చదువుకునే వారు. టీచర్లు సీనియర్స్ కావడం వల్ల చదువు మీద ఆసక్తి వున్నవాళ్లు బాగా చదువుకునే వాళ్ళు.

    రవి తండ్రి వ్యవసాయం చేస్తుంటాడు. తన చిన్నతనంలో పట్నంలో తాత దగ్గిర వుండి పీ యూ సీ వరకు చదువుకున్నాడు. వర్షాధారిత వ్యవసాయం వల్ల వుపయోగం లేదని, తన పిల్లలు బాగా చదువుకుని మంచి వుద్యోగాలు చేసుకు బ్రతకాలని అనుకున్నాడు..


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/W9AvSdcq-WI

    15 min
  • పొదరిల్లు | Podarillu | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    పొదరిల్లు

    రచన: లక్ష్మి మదన్

    వర్ధని స్కూల్ నుండి వచ్చే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఇంటి ముందుకు వచ్చి అరుగు మీద నిలబడి, సందు చివరి వరకు చూస్తోంది... ఆ రోజుల్లో ఇప్పటి నర్సరీలాగా ఎవరైనా ఇంటి దగ్గర ఓనమాలు నేర్పించే వాళ్ళు ఉంటే పంపించేవారు, స్కూల్ వెళ్లే వరకు ఏదో కొంత నేర్చుకుంటారని.  ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆ బడి నడిచేది.  దానిని కానిగీ బడి అని కూడా అంటారు.

    పొద్దున చద్దన్నంలో చింతకాయ పచ్చడి, నెయ్యి వేసి కలిపి పిల్లలకు పెట్టి పంపించింది వర్ధని.  యూనిఫాంలు బూట్లు ఇవన్నీ వేసుకునే పని లేదు కదా అప్పటి రోజుల్లో! చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని, చద్దన్నం తినేసి దేవుడికి దండం పెట్టుకొని పిల్లలంతా బడికి వెళ్లేవారు.  పిల్లలు కూర్చోవడానికి అక్కడ ఒక గోడ మీద ఎవరి గోనేసంచి వాళ్లు తెచ్చి పెట్టుకునేవారు. వెళ్ళాక అది పరుచుకుని కూర్చునేవారు.

    శ్రావణి, సంగీత, మరియు శ్రీనివాస్ ముగ్గురు కలిసి స్కూలుకు వెళ్లేవారు.  అందరికన్నా చిన్నది శ్రావణి చాలా బెరుగ్గా ఉండేది. స్కూల్లో టీచర్ అంటే విపరీతమైన భయం.  ముగ్గురు వెళ్లి వరండాలో నిలబడ్డారు. ఇంతలో టీచరు రంగమ్మ వచ్చి..

    "లోపలికి వచ్చి మీ గోనెసంచి పరచుకొని కూర్చుని, పలకలు తీసి ఓనమాలు, ఒంట్లు రాయండి" అని చెప్పింది.

    "సరే పంతులమ్మా!" అని పిల్లలు లోపలికి వచ్చి గోనెసంచి పరచుకొని కూర్చున్నారు.  ఇంతలో మిగతా పిల్లలు కూడా వచ్చి వారి వారి సంచులు పరచుకొని కూర్చున్నారు....

    ఆరోజు రంగమ్మ టీచర్ కి ఇంట్లో పని ఆలస్యమైంది అనుకుంటా.. వంటింట్లోనే ఎక్కువసేపు పని చేస్తూ కనబడింది.  ఇంకా టీచర్ లేదని పిల్లలకి ఆటవిడుపుగా ఉంది. అల్లరి చేస్తూ మాట్లాడుతూ కూర్చున్నారు. ఇంతలో టీచర్ బయటకు వచ్చి "అందరూ పలకలు పట్టండిరా" అని అన్నది.  అందరూ పలకలు పట్టి చూస్తున్నారు. అందరి పలకల మీద గుప్పెడు గుప్పెడు బియ్యం పోసి "ఇందులో రాళ్లు చక్కగా ఏరేసి పెట్టండి" అని చెప్పింది...


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/Xj4fCp7zp6k

    16 min
  • కర్తవ్యం యోగ ఉచ్యతే | Karthavyam Yoga Uchyathe | Telugu short Story | Aduri Hymavathi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కర్తవ్యం యోగ ఉచ్యతే

    రచన: ఆదూరి హైమావతి

    కారు పార్క్ చేసి తలపైకెత్తి చూశాను. నాకళ్ళు మెరిశాయి. నేను ప్లాన్ చేసి   కట్టించిన  భవనం. 'హృదయాలయ' ఆభవనం  హృదయం ఆకారంలో  ఉంటుంది. డాక్టర్. హృదయ్   కోరికమేరకు ఆభవనం నా  అధ్వర్యంలో నిర్మించబడింది. హృదయంలో ధమనులు, సిరల ద్వారా రక్త ప్రసరణ జరిగుతున్నట్లు, కొత్త టెక్నాలజీ ఉపయోగించి లైట్స్ ద్వారా  రంగుల వెలుగులు ప్రవహించే లాగా చేసాము.

    గేట్ నెంబర్ 1   వైద్యంకోసం రోగులు వచ్చేందుకు, రెండో గేటు నయమైన వారు ఆనందంగా వెళ్ళడంకోసం. మూడో గేటు ఎమర్జెన్సీ రోగులతో వారి బంధువులు ఏడుస్తూ  లోనికి పరుగులు తీసేది. నాలుగో గేటు ప్రపంచం లోనే ఉత్తమ వైద్యుడైన హృదయ్  చేతిలో విఫలమై, ఇక ఆయుస్సు తీరిన  వారి భౌతిక కాయాలు తరలించేగేటు.

    ఎంత చిత్రం, ఆనందం, ఆందోళన, సుఖం, కష్టం  సంతోషం, దుఃఖం, వైరాగ్యం, అన్నీ ఒకే భవనంలో వేర్వేరు ద్వారాలలో, మానవ జీవన సరళి ని, కళ్ళకు కట్టే దృశ్యాలు. అన్నీ గమనిస్తూ  తలెత్తి పైకి చూసి  ఏదో మార్పు కనిపించి ఆశ్చర్యపోయాను.

    వి. ఐ. పీ. గేటు నుంచీ వెళ్లబోగా, వాచ్ మెన్ ఆపాడు. నేనూ, హృదయ్  కలసి ఉన్న ఫోటోతో ఉన్న విజిటింగ్ కార్డ్ చూపాక వెళ్ళనిచ్చాడు, నేరుగా లిఫ్ట్ లో మూడో అంతస్తులోని హృదయ్ గది వద్ద ఆగి, విజిటింగ్ కార్డిచ్చి పంపాను.

    ఒక్క నిముషంలో తలుపు తెరుచుకుని వచ్చినతను, నన్ను లోపలికి వెళ్ళమని   సైగచేశాడు. లోనికి అడుగు పెట్టగానే  హృదయ్ వచ్చి చేతులు పట్టుకుని ఊపీ ఊపీ మన సారా ఆనందం వ్యక్తపరుస్తూ, ఆశ్చర్యంగా చూశాడు. నా ఒళ్ళు పులకరించి పోయింది..


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/b09lx5lGAzw

    15 min
  • ప్రేమ‘భ్రమ’రం - 7 | Prema Bhramaram - 7 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ప్రేమ ‘భ్రమ’రం - 7

    రచన: వసుంధర

    వసుంధర గారి తెలుగు ధారావాహిక  ప్రేమ  ‘భ్రమ’రం ఏడవ భాగం

    గత ఎపిసోడ్ లో...

    రావి చెట్టు దగ్గర నాకు అమోఘ్ పరిచయం అవుతాడు.

    అమోఘ్‌, రిక్తలు ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించక  పోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

    ఎవరికీ తెలియకూడదని రిక్త పురుష వేషంలో ఉంటుంది.

    నేను వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది.

    ఇక  ప్రేమ  ‘భ్రమ’రం ఏడవ భాగం చదవండి ...

    ఐదింటికల్లా లేచిపోయాను. క్షణాలమీద తెమిలాను. డ్రెస్సు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఒకటికి రెండు సార్లు తల దువ్వాను.

    బైక్‌ తియ్యకుండా క్యాబ్‌ బుక్‌ చేశాను.

    చెప్పినకంటే ముందుగా పావు తక్కువ ఏడుకి అమోఘ్‌ ఇల్లు చేరి తలుపు తట్టాను.

    తలుపు తెరుచుకుంది.

    అమోఘ్‌ తీస్తాడనుకున్నాను. కానీ కళ్లముందు ఓ మెరుపు తీగ.

    కళ్లు జిగేల్మన్నాయి.

    ‘‘విచల్‌ గారా?’’ అందామె.

    కలస్వనం. చెవులని తాకిన శబ్దతరంగాలు - వంటిని జలదరింపజేశాయి.

    ఏదో అందామనుకున్నాను. నోట మాట రాలేదు.

    ‘‘కూర్చోండి - ఆయన స్నానం చేస్తున్నారు’’ అని లోపలకు వెళ్లిపోయిందామె.

    రిక్త.

    అపురూప సౌందర్యవతి. మీనాక్షి థియేటర్లో అమోఘ పక్కన చూసిన వ్యక్తి ఈమే అంటే చచ్చినా ఒప్పుకోను.

    వెళ్లి సోఫాలో కూర్చున్నాను.

    రిక్త రూపం నన్నింకా వెంటాడుతోంది. ఎంత బాగుంది!

    ‘ఈమధ్య- వయసులో ఉన్న ఆడపిల్లలు మరీ ఎక్కువ అందంగా కనిపిస్తున్నారు నీకు’ అంది మనసు.

    అది నిజమనుకోను.

    రోజూ ఎందరో అమ్మాయిల్ని చూస్తున్నాను. బాగుంటే ఒకటికి రెండుసార్లు చూస్తాను. తర్వాత మర్చిపోతాను.

    కానీ రిక్త సౌందర్యం ఎందుకో నన్ను వెంటాడుతోంది.

    ఆమె గురించి ఎక్కువగా ఆలోచించడంవల్ల కలిగిన కుతూహలమేమో!

    ఆమోఘ్‌ వచ్చేసరికి ఏడు కావడానికింకా ఓ నిముషముంది.

    నన్ను చూస్తూనే, ‘‘నాకు టైమంటే టైమే కానీ - బిఫోర్‌ టైం వచ్చేవాళ్లు నాకెక్కువ నచ్చుతారు. థాంక్స్‌ ఫర్‌ ఆనరింగ్‌ మై ఇన్విటేషన్‌ అండ్‌ ఆనరింగ్‌ మీ విత్‌ యువర్‌ ప్రిజెన్స్‌’’ అన్నాడు.

    రొటీన్‌ మర్యాద. మాట మార్చడానికి, ‘‘నిన్న సినిమా ఎంజాయ్‌ చేశారా?’’ అన్నాను.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/bPTRGGJl8LM



    26 min
  • ఎందుకు? అందుకే! | Enduku? Anduke! | Telugu Poem | A Annapurna | manatelugukathalu.com

    ( కవిత manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి )

    ఎందుకు? అందుకే!

    ఏ.అన్నపూర్ణ.

    మల్లెలు అన్ని కాలాలలోనూ పూయవు.. ఎందుకు?

    చలి గాలిని, వానల జోరును తట్టుకోలేక!

    కలువలు, రాత్రివేళలోనే వికసించడం ఎందుకు?

    వెన్నెల రేడు - చీకటి అంటే ఇష్టం కనుక!

    కమలం ఉదయమే వికసించడం ఏమిటి.. వేడిని ఎలా తట్టుకుంటుంది?

    ఆమె వదనానికి చెక్కిలి ఎరుపే అందమని కాబోలు!

    పారిజాతాలకు, చెట్టు నుండి రాలిపోవడం శాపమా?..


    Read the full poem at www.manatelugukathalu.com

    ఈ కవిత మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కవితను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/n-TESV3SqMY


    2 min
  • కర్తవ్యం - ఎపిసోడ్ 2 | Karthavyam - Episode 2 | Telugu Web Series | Vedurumudi Ramarao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కర్తవ్యం - ఎపిసోడ్ 2

    రచన: వెదురుమూడి రామారావు

    గత ఎపిసోడ్ లో

    విశ్వనాథం మంచి పేరున్న లాయర్.

    అయన భార్య సుమతి.

    అందరికీ మంచి చేసే స్వభావం ఉన్న వారు వాళ్లిద్దరూ.

    వాళ్ళ ఇంటికి వచ్చిన మనోహర్, సుధ ల మధ్య మనస్పర్థలు ఉండటం గమనిస్తారు.

    ఎలాగైనా వాళ్ళను కలపాలనుకుంటారు.

    ఇక కర్తవ్యం రెండవ భాగం చదవండి.

    పెసరట్టు ఉప్మా, వేడివేడిగా కొబ్బరిచట్నీ తో రెడీగా బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద నోరు ఊరిస్తున్నాయి. చేతిలో న్యూస్ పేపర్ తో విశ్వనాధం గారు "అందరు తొందరగా రండి. చల్లారి పోతుంది మళ్ళీ" అంటూ గబగబా వచ్చి కూర్చొన్నారు.

    ‘పిల్లలు రాకుండా మీరు ఏంటి తొందర పడుతున్నారు’ అంటూ సుమతి మళ్ళీ మనోహర్, సుధా లని బ్రేక్ఫాస్ట్ కి ప్రేమగా పిలిచారు. మెల్లగా ఉప్మా ని ఆస్వాదిస్తూ విశ్వనాధం గారు ప్రస్తావన తెచ్చారు. పిల్లలిద్దరూ ఇంకా అటు ఇటు చూస్తూనే వున్నారు. భావోద్వేగాల లో ఏమీ మెరుగు కనిపించలేదు..

    "ఎలాగా కోర్ట్ కి సెలవలు కదా. సోమ వారంవరకు మనకు టైం వుంది. డివోర్స్ విషయం మళ్ళీ కోర్ట్స్ తీసే వరకు వాయిదా వేద్దాం. మనం కోర్ట్ కి అప్లై చేసినతరువాత కూడా ఎలాగా వాళ్ళిద్దరినీ కొంత కాలం దగ్గరగా గడపమనీ, ఆ తరువాత హియరింగ్ కి రమ్మనీ చెపుతారు. ఈ లోపున మీరు మాకు చిన్న సహాయం చెయ్యాలి. చాలా కాలం నించి నేను, మీ ఆంటీ షాపింగ్ చేద్దాం అనుకొంటున్నాము. సరయిన కంపెనీ లేక బయటికే పోలేదు.

    మీరు మాకు కావలిసిన సెలెక్షన్స్ చేయాలి. ముందుగా మనం షాపింగ్, తరువాత ఢిల్లీ దర్శన్ చేద్దాం. మద్రాస్ కేఫ్ లో లంచ్ చేద్దాం. సాంబార్ బాగుంటుంది. ప్లీజ్." అన్నారు.

    మనోహర్ తాను ఇంట్లో వుంటాను సుధ ని తీసుకు వెళ్ళండి అని కొంచం సౌమ్యంగా చెప్పడానికి ప్రయత్నించాడు. సుధ కూడా అలాగే మొహం పెట్టింది.

    విశ్వనాధం గారు కొంచం నిరాశ తో "అయితే మేము కూడా మానేస్తాం. చాలా రోజుల నించి సాయం లేక మేం వెళ్ళలేదు. మనోహర్- నాకు, సుధ- ఆంటీ కి విడి విడిగా సాయం చేస్తారు, మంచి ఐటమ్స్ కొనుక్కోడానికి సాయపడతారు అని ఆశ పడ్డాం. మాకు కొంత మంచి టైం ఇస్తారని అనుకొన్నాం”. అంటూ టేబుల్ దగ్గరనుంచి లేచి వెళ్ళడానికి తయారు అయ్యారు.

    ఇరుకులో పడ్డ చిన్న దంపతులు సరే అని ఒప్పుకోక తప్ప లేదు. ముందుగా ‘కన్నాట్ ప్లేస్’, ‘పాలిక బజార్’, లంచ్ తరవాత ‘స్వామినారాయణ్’ ఈ ట్రిప్ లో భాగాలు.

    కార్ పార్కింగ్ లో పెట్టి,  "రండి వెళదాం” అని అందరినీ పిలిచారు విశ్వనాథం. ఆయన చిన్నపిల్లాడికన్నా ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా వున్నారు. మర్యాదగా ఉండదు అని మనోహర్ అయన వెనకనే రెడీ ఐపోయాడు. సుధ మాత్రం సడెన్ గా " నేను కార్ లో కూర్చుంటాను, మీరు వెళ్లి రండి" అని అందరిని ఉద్దేశించి చెప్పి బ్యాక్ సీట్ లో వాలి పోయింది.

    ఏంచెయ్యాలో అర్ధం కాలేదు సుమతి కి...


    Read the full story on www.manatelugukathalu.com


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/GYqG5T6aT0I

    12 min
  • సైనైడ్ ఎపిసోడ్ 4 | Cyanide Episode 4 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సైనైడ్ - ఎపిసోడ్ 4

    రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి

    వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు  గారి  ధారావాహిక 'సైనైడ్' నాలుగవ  భాగం

    గత ఎపిసోడ్ లో

    తాను చేసిన పోస్ట్ మార్టం వివరాలు రాజశేఖర్ కి చెబుతాడు డాక్టర్ కిరణ్.

    తరువాత మాల్ దగ్గరికి వెళతాడు రాజశేఖర్.

    చనిపోయిన శేఖర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటాడు.

    ఇక సైనైడ్ నాలుగవ భాగం చదవండి..

    హత్య చేయబడిన శేఖర్ నిజానికి ఒక మంచి విద్యావంతుడు. బిట్స్ పిలానీలో తన కంప్యూటర్ ఇంజనీరింగ్ లో ఎన్నో మంచి ఆవిష్కరణలు చేసి ప్రాక్టికల్స్ లో అందరికన్నా ఎంతో తెలివిగా ర్యాంకులు సాధించడంతో అగ్రగణ్యుడయ్యాడు. క్యాంపస్ సెలక్షన్స్ లో అత్యధిక వేతనంతో ఒక ప్రైవేట్ కంపెనీలో లో నియమింపబడ్డాడు శేఖర్. అలాగే "యూపీ ఎస్సీ గ్రూప్ వన్ "లో సెలెక్ట్ అయ్యి "Defence reaserch development org ."! Delhi లో సీనియర్ ఆఫీసర్ గా అపాయింట్మెంట్ రావడంతో తన జీవిత ధ్యేయం సాధించినట్టు భావించి, అదే ఉద్యోగంలో కొనసాగ సాగాడు.

    అన్ని కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ డిపార్ట్మెంట్ లకి ఎలాంటి సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వచ్చినా స్వయంగా శేఖర్ తన నైపుణ్యంతో ఆ సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్స్ ని మళ్లీ ఆక్టివేట్ చేసి ఎంతో చాకచక్యంగా మిలటరీ ఆర్మీ బేస్ లు, నేవల్ బేస్ లు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్న కంప్యూటర్ సాఫ్ట్వేర్.. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అందరి అభిమానాన్ని చూర గొన్నాడు. అంచెలంచెలుగా ఎదిగి గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకింగ్ పొంది అత్యున్నత స్థాయి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కి వెన్నుముకగా నిలిచాడు శేఖర్.

    సరిగ్గా అదే సమయంలో తను మొదట పనిచేసిన సాఫ్ట్వేర్ కంపెనీలో శేఖర్ కి ఆత్యంత సన్నిహితంగా మెలిగే స్నేహితుడి పేరు ఏ - వన్ (పేరు రాయడం లేదు). ఆ ఇద్దరూ కలిసి రెండు సంవత్సరాల పాటు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కలిసిమెలిసి ఉండేవారు. శేఖర్ కి డి ఆర్ డి వో లో ఉద్యోగం వచ్చాక కొంచెం ఎడబాటు కలిగింది.

    అయినా ప్రతివారం ఇద్దరూ కలుస్తూ బార్ కి వెళ్లి ఓ గంట సేపు హాయిగా కూర్చుని తాగుతూ ఉండేవారు. అసలు ఏ - వన్ ఒక ప్రాజెక్టు పని మీద కెనడా నుంచి వచ్చి, అదే కంపెనీలో శేఖర్ తో కలిసి పనిచేయడం జరిగింది.

    అలా వారి స్నేహం ఘాడమై శేఖర్ కు పెళ్లయిన తర్వాత కూడా వారి ఇంటికి వచ్చి ఏ - వన్ మన మన సౌత్ ఇండియా రుచులన్నీ మరిగి ఎంతో క్లోజ్గా ఉండే వాడు.

    ఆరోజు ఏ - వన్ ఇంటికి వచ్చి “ఒరేయ్ శేఖర్! ఇవాళ మీ ఆవిడ ఇడ్లీ సాంబారు చేస్తానన్నది కదా! దాన్లో కొబ్బరి చెట్నీ కూడా వేయించు. ఆ రుచి నేను జన్మజన్మలకు మర్చిపోను. ఇదే విషయం మా కజిన్ సిస్టర్  బి - వన్(పేరు పెట్టలేదు) కి కూడా చెప్పాను. ఆమె నీతో ఎలాగైనా మాట్లాడాలి అని అంటున్నది” అంటూ ఫోన్ కలిపి తన కజిన్ సిస్టర్ బి - వన్ చేత మాట్లాడించాడు..


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/2XgD_058qyg

    7 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world