
Sign up to save your podcasts
Or


ఎన్నో ఊహలు ఆశలతో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన మహిళలకు కాలక్రమం లో ఎదురయ్యే ఇబ్బందుల పట్ల సరైన అవగాహన తక్కువే.ముఖ్యం గా భార్యాభర్తల దాంపత్యం గురించి.అన్నింటా సర్దుకుపోవటమే పరమావధి అనే సలహాలే ఎక్కువ.ఒకవేళ గృహహింస ముఖ్యం గా మారిటల్ రేప్ కి
గురైతే ఏలా? ఎవర్ని సాయం అడగాలి?ఎక్కడ.ఎలా రిపోర్ట్ చెయ్యాలి? రేప్ కి మారిటల్ రేప్ కి లీగల్ పరిభాషలో ఉన్న తేడా ఏంటి? మహిళల రక్షణకు ఉన్న చట్టాల అమలు ఎంతవరకు జరుగుతోంది.
గత కొద్ది రోజుల కిందట మారిటల్ రేప్ కేసు లో కేరళ హై కోర్ట్ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు గురించి మారిటల్ రేప్ ,చట్టాల గురించి వివరంగా సమాచారం సమీక్ష లో D.చాముండేశ్వరి తో legal expert Mrs.Unnava Rajeswari గారి ఇంటర్వ్యూ లో తెలుసుకుందాము.
(Many women who get married with hopes and aspirations know little about the problems that they may foresee, mainly about the relationship between a husband and a wife. Many will advise the women to adjust without realising the gravity. What if the woman is subjected to domestic harassment and marital rape? Who should she ask for help? What is the difference between rape and marital rape in the eyes of law? Are the laws that are supposed to be helping women implemented?
In this episode of Samacharam Sameeksha, host D Chamundeswari spoke with legal expert Mrs. Unnava Rajeswari to discuss a judgement delivered by Kerala high court on Marital rape as grounds for divorce.)
See sunoindia.in/privacy-policy for privacy information.
గత కొద్ది దశాబ్దాలుగా డిగ్రీలు అంటే engineering medicine లాంటివి మాత్రమే అందరి దృష్టి లో. పదవ తరగతి వరకు మొక్కుబడిగా చదివే చరిత్ర ను మరింతగా అధ్యయనం చేయాలనే కోరిక కలగటం అంటే ప్రస్తుత రోజుల్లో అదొక వింత.విదేశాల్లో బహుశా మామూలు విషయం కావచ్చు.వారికి చారిత్రిక కట్టడాల పరిరక్షణ పట్ల ఉన్న శ్రద్ధ వల్ల.
అలాంటి పురాతత్వ శాస్త్రం చదువుతూ పిన్నవయస్సులో తెలంగాణ చరిత్ర నీ తెలిపే శిథిలాలు శాసనాలను వెతికి వెలుగులోకి తీసుకు వస్తున్న యువ ఔత్సాహిక చరిత్ర పరిశోధకులు అరవింద్ ఆర్య d.చాముండేశ్వరి గారి తో చరిత్ర పట్ల తనకి ఉన్న ఆసక్తి పరిశోధన గురించి వివరించిన interview.
(For the past few decades, a degree meant engineering or medicine. History is only taught till the tenth standard and wanting to pursue history is left to one's imagination. It is more common in foreign countries where there is more interest in conserving heritage.
In times like this, Arvind Arya took up studying about Archeology and Telangana Heritage after his engineering out of interest. In this episode, he talks to host D. Chamundeswari about how he developed an interest and why it is important to protect Telangana heritage.)
See sunoindia.in/privacy-policy for privacy information.
పరిసరాలలో పేరుకుపోయే అనేక రకాల వ్యర్ధాలను వేరుచేసి రీసైకిల్ చెయ్యటంలో చెత్త నుండి ఆదాయాన్ని క్రియేట్ చెయ్యటం లో ,waste management లో pioner అనదగిన waste picker గురించి మనకి తెలిసింది ఎంత?దేశం లో ఒక అంచనా ప్రకారం వీరు 1.5 నుండి 4 మిలియన్ల సంఖ్యలో ఉంటారు.దేశ ఆర్థిక కార్యకలాపాల్లో వీరి వాటా 3200కోట్లని అంచనా.urban waste management లో 20%వీరి ద్వారా రీసైకిల్అ వుతుంది అని మరో అంచనా. సమాజానికి హెల్ప్ చేస్తున్న వీరికి ప్రజలు ప్రభుత్వాలు నుండి అందే సహకారం ఎంత?సమస్యలు ఏంటి? Dalit Bahujan Resource Centre (DBRC) India ఇండియా సంస్థ కు చెందిన అనిల్ కుమార్ మరియు waste picker హరి కృష్ణ గారు, D. చాముండేశ్వరి తో వివరంగా ముచ్చటించారు.
(How much do we know about the waste pickers who help in recycling and are pioneers of waste management? According to an estimate, there are 1.5 to 4 million waste pickers in India. Their contribution to the economy is expected to be around 3200 crores. They recycle approximately 20% of urban waste. What are the benefits that the government is providing to these waste pickers who are helping society? To know more about this, host, D Chamundeswari talks to Samuel Anil Kumar of Dalit Bahujan Resource Centre (DBRC) India in this episode.)
See sunoindia.in/privacy-policy for privacy information.
శరీరం చెప్పే లక్షణాలు ,హెచ్చరికలు వింటాము.వైద్యం తో ఆరోగ్యం కాపాడుకొంటాం, మరి మనస్సుకు కుంగుబాటు ఆందోళన ఒత్తిడి కలిగితే వచ్చే సూచనలు లక్షణాలు ఏమిటో సరిగ్గా తెలియదు. ఒకవేళ ఎవరైనా depressed గా ఉందంటే సరైన సలహా కంటే నీకేం సమస్య?అంతా బావుంటే .అంటూ మనసు చెప్పే మాట వినరు.విననివ్వరు.
దానికి తోడు గత ఏడాదిన్నర గా వేధిస్తున్న కరోనా. Lockdowns,social distancing,work from home గందరగోళం మధ్య ఆందోళన అయోమయం తో మానసికం గా బెదిరిపోయిన ప్రజలు. మానసిక సమస్యలు mental health. అంటే నే చిన్న చూపు చూసే సొసైటీ లో మనసు గతి ఇంతే.మనిషి బ్రతుకింతే.అని కుంగిపోవాలా?
మేమున్నము మీ మనోవేదన విని సహాయపడటానికి అంటూ భరోసా ఇస్తున్నారు తెలంగాణ సైకాలజిస్టులు. 30 మంది సభ్యులు ఫోన్ ద్వారా టెలి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.Dr. లక్ష్మి నిప్పాని గారు D.Chamundeswari తో మానసిక ఆరోగ్య సమస్యల గురించి వివరించారు.
మీరు సైకాలజిస్టులు సలహాలు సూచనలు పొందాలంటే క్రింద ఇచ్చిన ఫోన్ no లో contact చెయ్యవచ్చు.
లక్ష్మి నిప్పాని (Laxmi nippani) -9440684805
హిమ బిందు (Himabindu) - 8919508522
M. కృష్ణ సాహితీ (Krishna Saahiti) - 7993715081
See sunoindia.in/privacy-policy for privacy information.
బడి గంటలు విని ఎంత కాలం అయ్యింది ? School కి ఆలస్యం అవుతోందని ఆటో వచ్చింది పద పద మనే మాటలు గతం.మళ్ళీ ఆ రోజులు వస్తాయా? పిల్లల భవిత ఏమిటి?
Covid దెబ్బకు మూతపడిన వాటిలో విద్యారంగం ఒకటి.లక్షల మంది విద్యార్థులు, టీచర్స్,ఇతర staff ఉన్న వ్యవస్థలో పేద ,దిగువ మధ్య తరగతి విద్యార్థుల కోసం స్కూల్స్ నడుపుతూ , స్టాఫ్ అందరినీ సమన్వయం చేస్తూ మంచి చదువును అందించే ప్రయత్నం నిరంతరం చేస్తున్న చిన్న స్కూల్ యాజమాన్యాల పరిస్థితి ఇబ్బందులు గురించి,ఆశిస్తున్న వెసులు బాటు గురించి చాముండేశ్వరి తో గోపి మెమోరియల్ స్కూల్ యాజమాన్య ప్రతినిధి శ్రీ .శ్రీనివాస్ రెడ్డి గారు వివరించారు.
(Schools are one sector that has been shut down because of COVID. Running schools and paying teachers and staff with schools shut and without support from the government is a challenge for small schools which cater mainly to the lower middle class and poor. In this episode host, Chamundeswari talks to Mr. Srinivas Reddy, Principal of Gopi memorial school in Hyderabad.)
See sunoindia.in/privacy-policy for privacy information.
తప్పెట్లు తాళాలు పందిళ్ళు పసందైన వివాహ భోజనము తిని వంటకాల రుచులు ఆస్వాదించి మెచ్చుకుని కేటరింగ్ వారి విజిటింగ్ కార్డ్ జేబులో పెట్టుకొని వచ్చిన రోజులు గుర్తున్నాయా? ఆ జ్ఞాపకాలు చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం అంచులో ఉండి అల్లాడుతున్న కేటరింగ్ రంగం.
COVID ఆర్థికంగా ఎందరినో ఎన్నో సంస్థల్ని వ్యాపారాలను కోలుకోలేని దెబ్బతీసింది. వాటిలో అన్నపూర్ణ కి మారుపేరైన కేటరింగ్ రంగం ఎదుర్కుంటున్న ఇబ్బందులు కష్టనష్టాలను ప్రముఖ కేటరింగ్ తిరుమల caterers యజమాని శ్రీనివాస్ గారు డి.చాముండేశ్వరి తో వివరంగా చెప్పారు.
(COVID has hit many industries and organisations very hard. One of the industry that is hit very hard is the catering industry. To discuss the issues faced by the catering industry Host Chamundeswari spoke with Mr.Srinivas of Tirumala Caterers.)
See sunoindia.in/privacy-policy for privacy information.
(కోవిడ్ 19 గత ఏడాది పాటుగా ప్రపంచవ్యాప్తం గా చేసిన చేస్తున్న విలయ తాండవం నుండి ఉపశమనం కలిగించే Covid టీకా రాకకోసం చూసిన ఎదురుచూపుల కు తెరపడింది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఆసుపత్రులలో దేశప్రజలకు వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. టీకా కోసం ఎలా ఎక్కడ రిజిష్టర్ చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, టీకా సెంటర్ లో వసతులు వంటి విషయాలను మనం ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో టీకా వేసుకున్న వారి అనుభవం షో హోస్ట్ D.chamundeswari తో శ్రీమతి G.Vijaya , రాజేశ్వరి ఉన్నవ వివరించారు.)
The wait of the last one year COVID-19 vaccine has finally come. The public is finally being vaccinated in government and private hospitals. In this episode host D. Chamundeswari talks to G.Vijaya and Rajeswari Unnava who have got themselves vaccinated on how to register for the vaccination, which documents need to be carried, how are the facilities in the vaccination centres among other general questions.
See sunoindia.in/privacy-policy for privacy information.
చరిత్ర అడక్కు చెప్పింది విను కాకుండా చరిత్ర పుటల్లోకి తొంగిచూసి నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం ప్రస్తుతం అవసరం. హిస్టరీ లోని మిస్టరీని సరైన పద్ధతి లో సాల్వ్ చెయ్యటానికి ఉన్న శాస్త్రీయ దృక్పథం పద్ధతులు ,ప్రాచీన కట్టడాలు శిధిలాల పరిరక్షణ ,చరిత్ర వక్రీకరణ ఆపటం ఎందుకు అవసరమో భిన్నురి మనోహరి గారు హోస్ట్ చాముండేశ్వరి గారి తో చెప్పారు.
(Instead of just listening to versions of history, it is necessary to investigate and try to find out the facts. Bhinnuri Manohari told host Chamundeshwari about the scientific approach to solving the mystery of history in the right way, the need to stop the destruction of ancient monuments and the distortion of history.)
See sunoindia.in/privacy-policy for privacy information.
COVID-19 ని పాండెమిక్ గా ప్రకటించి తొమ్మిది నెలలు పూర్తయాయ్. ఈ వ్యాధి గురించి కొన్ని నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఒక అంశం – లాంగ్ కోవిడ్.
సాధారణంగా ఈ వ్యాధి సోకినా వాళ్ళు రెండు లేదా మూడు వారాల్లో కోలుకుంటారు. కొద్దిమంది పేషెంట్స్ లో మాత్రం ఈ వ్యాధి తాలూకు లక్షాణాలు, లేదా ఈ వ్యాధి వళ్ళ వచ్చిన complications రెండు-మూడు నెలలు లేదా ఇంకా ఎక్కువ కాలం కనిపిస్తున్నాయి. లాంగ్ కోవిడ్ గా పిలవబడుతున్న ఈ వ్యాధి గురించి సమాచారం సమీక్ష ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
సమాచారం సమీక్ష ఈ ఎపిసోడ్ కోసం హోస్ట్ అయిషా మిన్హాజ్ ఇంటర్నల్ మెడిసిన్ ఎక్సపర్ట్ డాక్టర్ ఎస్. వి. ప్రశాంతి రాజు గారి తో మాట్లాడారు. డాక్టర్ ప్రశాంతి గారు రెండు దశాబ్దాలకు పైగా ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిటీ లో పని చేస్తున్నారు. ప్రస్తుతం, అపోలో హాస్పిటల్ లో COVID-19 రికవరీ క్లినిక్ కి ఇన్-ఛార్జ్ గా భాద్యత వహిస్తున్నారు.
(It’s been nine months since COVID-19 was declared a pandemic. One issue that came to light a few months ago about this disease is Long COVID. Most COVID-19 patients usually recover in two to three weeks. In a few patients, the symptoms of the disease, or complications from the disease, last for two to three months or even more. This episode of Samacharam Sameeksha tries to answer a few basic questions about the occurrence of Long COVID, care, and caution. For this episode of Samacharam Sameeksha, Ayesha Minhaz spoke to internal medicine expert Dr. SV Prashanthi Raju. Dr. Prashanthi has experience of over two decades and is currently leading the COVID-19 recovery clinic at Apollo, Hyderabad.)
See sunoindia.in/privacy-policy for privacy information.
ఏలూరు వింత వ్యాధిపై వైద్య నిపుణులు కారణాలు ఇంకా తేల్చలేదు. అయితే సునో ఇండియా గ్రౌండ్ రిపోర్ట్ లో ప్రాధమికంగా తాగునీరు, ఆహారం కలుషితం కావడం వల్లే ప్రజలు అనారోగ్యాలపాలు అవుతున్నట్లు తెలుస్తోంది.
సక్రమమైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, స్వచ్ఛమైన తాగునీరు లేకపోవడం, కూరగాయాల్లో పురుగుమందుల అవశేషాలు మోతాదుకు మించి ఉండటం, ఆక్వా సాగు లో వినియోగిస్తున్న ఎరువులు మోతాదుకు మించడం ప్రమాద ఘంటికలు మ్రోగిస్తుందన్నది ఈ సంచలన సంఘటన రుజువు చేస్తోంది.
నిపుణులు అంతిమంగా ఇచ్చే నివేదికల్లో అసలు విషయాలు ఈ మిస్టరీని ఛేదించనున్నాయి.
ఏది ఏమైనా ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ప్రజారోగ్యంపై నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలిసిన బాధ్యత ను ఏలూరు వింత వ్యాధి పాలకులకు గుర్తు చేస్తుంది.
(Medical experts have not yet determined the causes of the Eluru mystery disease.
However, the Suno India Ground Report shows that people are getting sick primarily due to contamination of drinking water and food. This sensational event proves that the lack of proper drainage system, lack of clean drinking water, overdose of pesticide residues in vegetables and overdose of fertilizers used in aquaculture are ringing the alarm bells.
The real issues in the final reports given by the experts will solve this mystery.
Eluru outbreak reminds us of the responsibility of the government to be constantly vigilant about public health and make sure that it doesn’t get repeated. This episode was reported by Ram Narayanana, independent journalist, Rajamundhry.)
See sunoindia.in/privacy-policy for privacy information.
From the publisher's feed
ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఉంటుంది. మీ సలహాలు, తెలుగులొ మీరు వినాలి అనుకునె విషయాలు గురించిన వివరాలు మాకు తెలపాలి అనుకుంటె, [email protected] (mailto:[email protected]) కి email పెట్టండి.
(Samacharam Sameeksha will bring to you news and views of all the latest developments from Telangana and Andhra Pradesh. The podcast will also analyse news coverage and bring in seldom heard perspectives and will help you cut through the noise. Priority will be given to issues from the two Telugu states. Write into us at [email protected] with your suggestions and feedback.)

6 Listeners

13 Listeners

0 Listeners

9 Listeners

0 Listeners

3 Listeners

10 Listeners

0 Listeners

2 Listeners

1 Listeners

0 Listeners

5 Listeners

0 Listeners

0 Listeners

1 Listeners

1 Listeners

0 Listeners