సమాచారం సమీక్ష - A Telugu News Podcast

సమాచారం సమీక్ష - A Telugu News Podcast

By Suno IndiaNewsNews Commentary
Download on the App Store

సమాచారం సమీక్ష - A Telugu News Podcast episodes

  • GHMC నుండి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? (What people want from GHMC?)
    డిసెంబర్ 1న జరగనున్న GHMC ఎన్నికల సందర్భంలో, పార్టీలు ప్రజలకు ఇచ్చే వాగ్ధానాల జాబితా రోజు రోజు కి పెరుగుతూ ఉంది. వీటిలో కొన్ని కలహాలు రేపే విధంగా ఉంటే, కొన్ని GHMC పరిధిలో లేనివి కూడా ఉన్నాయి. మూడు ప్రధాన పార్టీలు – తెరాస, ఎం.ఐ.ఎం, బీజేపీ – మధ్య హోరా హోరీగా  ఎన్నికల  ప్రచారం  సాగుతుంది. వీటన్నింటి నడుమ, అసలు ప్రజలు కోరుకునే సౌకర్యాలు, కనీస వసతులు ఏంటి అనే అంశాల గురించి నేటి చర్చ. ఈ వారాం సమాచారం సమీక్ష ఎపిసోడ్ లో, అయిషా మిన్హాజ్ ప్రజల నుండి సేకరించిన అభిప్రయాలని చర్చిస్తాము.

    (With GHMC elections scheduled to be held on December 1, the sops being showered are increasing, some growing absurd by the day. The three leading contenders — TRS, MIM, BJP — are engaged in a highly charged election campaign. Considering that this an election that impacts the basic amenities part of our lives, Suno India contributor Ayesha Minhaz spoke to people to find out what they want from this election and from GHMC. Excerpts from the contributions from the people are presented in this episode.)

    See sunoindia.in/privacy-policy for privacy information.

    19 min
  • హైదరాబాద్ జూ: లాక్డౌన్ అనుభవాలు (Hyderabad Zoo crawling back to normalcy)
    380 ఎకరాల వైశాల్యంలో నెలకొని ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ నగరానికి ఒక ముఖ్య ఆకర్షణ. సాధారణంగా విజిటర్లతో కళకళలాడే జూ, కోవిడ్-19 లాక్ డౌన్ వల్ల ఏడు నెలలపాటు మూసివేయబడి, ఈ మధ్యనే ప్రజలకోసం తెరవబడింది.

    ఈ వారం సమాచారం సమీక్షలో హోస్ట్ అయిషా మిన్హాజ్ క్యూరేటర్ యన్. క్షితిజ, వెటరినేరియన్ ఎం.ఏ హకీం, సీనియర్ జూ కీపర్ పాపయ్య గార్లతో మాట్లాడారు. కోవిడ్-19 నష్టాలు, ఈ కష్ట సమయంలో జంతువులను పెంచుకోవడం పట్ల చిన్నపిల్లలు చూపిస్తున్న ఆసక్తి, జంతువుల ఆరోగ్యం,‌ ప్రవర్తనల్లో మార్పుల వంటి అంశాలతోపాటు రోజువారీ జూ నిర్వహణలో ఎదురయ్యే ఆసక్తికరమైన అనుభవాల గురించి కూడా చర్చించారు.

    (Nehru Zoological Park of Hyderabad is a well-known landmark and tourist attraction spread over 380acres. Usually buzzing with activity, this was shut for over seven months due to the COVID19 lockdown. The Zoo recently opened for public again.

    In this week’s Samacharam Sameeksha, host Ayesha Minhaz spoke to curator N Kshitija, veterinarian MA Hakeem, and senior zookeeper R Paapayya. They discuss the COVID19 losses, the interest shown by children to adopt animals during the tough time, behavioural changes, and the health of the animals. Also discussed on the episode are the amusing details of the daily zoo keeping activities.)

    See sunoindia.in/privacy-policy for privacy information.

    24 min
  • మహిళా కమిషన్ కోసం రెండేళ్లుగా నిరీక్షణ (Endless wait for a functioning Telangana women’s commission)
    తెలంగాణ ప్రభుత్వం, గత రెండుళ్లుగా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవిని ఖాళీగా ఉంచింది. గత రెండు సంవత్సరాలుగా, రాష్ట్రంలోని మహిళా హక్కుల కార్యకర్తలు, ఎన్జీవోలు, న్యాయవాదులు…. ఇలా అనేక మంది, తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయం గురించి తరచుగా అభ్యర్థిస్తూ వచ్చారు. రాష్ట్ర మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌ను నియమించాలని జాతీయ మహిళా కమిషన్ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. అయినప్పటికీ, ప్రభుత్వం వైపు నుండి ఇప్పటివరకు సరైన స్పందన రాలేదు..  అసలు రాష్ట్ర మహిళా కమిషన్ విధులేంటి, కమిషన్ చైర్‌పర్సన్‌ను నియమించకపోవడం వల్ల రాష్ట్ర మహిళలు కోల్పోతున్నదేమిటి, మహిళా కమిషన్ పనితీరులో లోటుపాట్లు…ఈ విషయాలన్నీ ఈ వారం సమాచారం సమీక్ష ఎపిసోడ్ లో చర్చ విషయాలు. ఈ వారం సమాచారం సమీక్ష ఎపిసోడ్ కోసం, అయిషా మిన్హాజ్ లాయర్ వసుధ నాగరాజ్ గారితో మాట్లాడారు.

    (For over two years now, the State Women’s Commission of Telangana hasn’t had a chairperson. For over two years, the women of Telangana haven’t been able to benefit from a fully functioning women’s commission. Activists, women’s organisations, lawyers and the media have been voicing concerns and submitting representations to the government of Telangana, but in vain.  This week’s Samacharam Sameeksha episode discusses the role and responsibilities of women’s commission, what a fully functioning commission can achieve, what the women of Telangana are losing out on and why we seem to have forgotten about the existence of this statutory body. Suno India contributor Ayesha Minhaz spoke to lawyer Vasudha Nagaraj for this episode. In October, the High Court of Telangana appointed Vasudha Nagaraj as amicus curiae in the PIL related to this.)

    See sunoindia.in/privacy-policy for privacy information.

    26 min
  • హైదరాబాద్ వరదలు, దుస్థితికి కారణాలు (Hyderabad floods)
    అక్టోబర్ నెలలో హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన వర్షం, వరదల కారణంగా ఎన్నో కాలనీలలో ఇళ్లలోకి నీళ్లు రావడం, ప్రజలు ఎంతో కష్టపడి కొనుక్కున్న సామాన్లు, వాహనాలు నాశనం అవ్వడం జరిగింది. దాదాపు వందేళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలో ఇంతటి వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. కానీ ఈ వరదలకు వర్షం మాత్రమే కారణం కాదు. ఈ సందర్భంగా నగరంలో అవసరమైన మేరకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు లేకపోవడం, చెరువులలో ఆక్రమణల వంటి సమస్యల‌ గురించిన చర్చ మరోసారి ప్రారంభమైంది.

    ఈ అంశాల గురించి తెలుసుకోవడం కోసం ఈ వారం సమాచారం సమీక్ష ఎపిసోడ్లో అయిషా మిన్హాజ్, ICLEI డిప్యూటీ డైరెక్టర్ సౌమ్య చతుర్వేదుల  గారితో మాట్లాడారు.

    (Heavy rains and floods lashed Hyderabad’s city in October, flooding homes in many colonies and destroying hard-earned goods and vehicles. The city of Hyderabad received heavy rains almost 100 years later, the Met office said. But rain is not the only cause of these floods.To discuss issues such as the lack of storm water drains in the city and encroachments of the ponds, Ayesha Minhaz spoke to ICLEI Deputy Director Soumya Chaturvedi during this week’s Samacharam Sameeksha episode.)

    See sunoindia.in/privacy-policy for privacy information.

    32 min
  • టీచర్లకి తీరని కరోనా కష్టాలు (Private Teachers agonize over pay cuts and job loss)
    ఉద్యోగాలు నుంచి తొలగించబడి పొట్టకూటికి ఎన్నో కష్టాలు పడుతున్న లక్షల్లో టీచర్లు. పని చేస్తున్న కొద్దిమంది మీద పెరుగుతున్న పని భారం, తరుగుతున్న జీతాలు, ఇవేవీ పట్టించుకోని ఇరు తెలుగు రాష్ట్ర ప్రభిత్వాలు. ఇక టీచర్ల కష్టాలు తీరేదెప్పుడు.

    (Lakhs of teachers lost their jobs and those who continue to work huge face pay cuts, plus burden of additional work. Governments of the two Telugu States are hardly bothered about the continued suffering of the teachers who struggle to feed their families. Will there be an end to their troubles?)

    See sunoindia.in/privacy-policy for privacy information.

    29 min
  • గ్రంథాలయ ఉద్యమం మరోసారి (Revisiting the Library Movement)
    (ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం 1914 లో గ్రంథాలయ ఉద్యమం సందర్భంగా స్థాపించబడింది. 20 వ శతాబ్దం ప్రారంభంలో, స్వతంత్ర ఉద్యమంతో పాతే  'గ్రంథాలయ ఉద్యమం' ఒక ముఖ్యమైన సామాజిక ఉద్యమం గా మారింది. ప్రజలను చైతన్య పరిచే ఉద్ధేశంతో పలు ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. కానీ ఈరోజు పరిస్థితులు వేరు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లలో మొత్తమ్మీద 1600 గ్రంథాలయాలు మాత్రమే ఉన్నాయి. ఉన్నవి కూదా దయనీయమైన పరిస్తితిలో ఉన్నాయి. అంతేకాక 2014 లో విభజన తరువాత, ఆంధ్రప్రదేశ్‌కు ఇంకా రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం లేదు. 

    ఈ నేపథ్యంలో, సాయి ప్రియా కొడిదల, ఆంధ్రప్రదేశ్ఘ్ గ్రంథాలయ సంఘ కార్యదర్షకులు, డాక్టర్ రావి శారద గారితో మాట్లాడారు. )
    (The Andhra Pradesh Library Association was established in 1914 during the Library Movement. At the turn of the 20th century, Telugu people took to a literary movement—The Library Movement, to support the larger Indian Freedom Struggle. They set up libraries with a strong belief that only empowered individuals can benefit the freedom movement. Soon, they formed the Andhra Pradesh Library Association to spread to different parts of the Telugu regions aiding various people’s movements.. However, the situation is different today. Between Andhra Pradesh and Telangana, there are only 1600 libraries. Those which exist are in dire need of attention in Andhra Pradesh and Telangana. Further, post the bifurcation in 2014, Andhra Pradesh does not yet have a State Central Library.  

    In this backdrop, Sai Priya Kodidala speaks to Dr. Raavi Sarada, Secretary of the century-old Andhra Pradesh Library Association to understand the Library movement and why it is relevant for us to remember today. Sai Priya Kodidala also runs The Telugu Archive tracing Telugu literature, art and history. )

    See sunoindia.in/privacy-policy for privacy information.

    41 min
  • ప్రజల కోసం, ప్రజల చేత: ప్రజా అసెంబ్లీ (For the People, By The people - People's assembly)
    ఇటీవల, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, న్యాయవాదులు కలిసి ప్రజా సమస్యలు చర్చించడం కోసం ప్రజా అసెంబ్లీ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో నెలకొన్న స్తబ్ధత, తాత్కాలిక మరియు దీర్ఘకాలిక సమస్యలు, వాటిని పరిష్కరించడానికి తీసుకోవలసిన చర్యల గురించి సుదీర్ఘంగా మూడు రోజులు పాటు చర్చించి, నాలుగో రోజు ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యి, వారికి తీర్మానాలు అందించారు.
    ప్రజల కోసం ప్రజా సంఘాలు నిర్వహించిన ఈ అసెంబ్లీ వివరాలు ఈ వారం సమాచారం సమీక్ష ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
    ఈ వారం ఎపిసోడ్‌లో, హోస్ట్ అయిషా మిన్హాజ్, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ రవి కన్నెగంటి గారితో ఈ విషయాల గురించి చర్చించారు. ఈ ఎపిసోడ్‌లో, తెలంగాణ హిజ్రా ఇంటర్సెక్స్ ట్రాన్స్ జెండర్ సమితి వ్యవస్థాపక సభ్యురాలు రచన ముద్రబోయిన, తెలంగాణ గృహ కార్మికుల సంఘం (టిడిడబ్ల్యుయు) సయోలా రేణుక ప్రజా అసెంబ్లీలో మాట్లాడిన అంశాలు కూడా ఉన్నాయి.
    (Ahead of the Telangana assembly sessions, recently, a Praja Assembly was held to discuss public issues. Civil society organisations, social activists, intellectuals and lawyers in the state came together to organise three full-day sessions with experts from each sector. The stagnant growth, long-standing problems, temporary problems, actions to be taken in various sectors in the state were discussed at length and on the fourth day a meeting was held with the public representatives and resolutions were presented to them.

    This week’s Samaacharam Sameeksha episode looks at the details of these sessions.

    For this episode, Ayesha Minhaz discussed these issues with the convener of Raithu Swarajya Vedika Ravi Kanneganti. The episode also carries parts of the Praja Assembly sessions: founding member of Telangana Hijra Intersex Transgender Samiti Rachana Mudraboyina, Telangana Domestic Workers' Union (TDWU) Sayola Renuka, and testimony of a family member of a farmer who died by suicide. )

    See sunoindia.in/privacy-policy for privacy information.

    33 min
  • స్త్రీలకి ఆసరా - భూమిక కలెక్టివ్ (A profile of the Bhumika helpline)
    స్త్రీవాద దృక్పథాలను ముందుకు తెచ్చేందుకు 1990లలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో భూమిక పత్రిక ప్రారంభించారు. పత్రిక పెద్దదిగా పెరిగి చివరికి 'భూమిక ఉమెన్స్ కలెక్టివ్‌'గా మారింది. నేడు, అనేక ఇతర విషయాలతోపాటు, వారు గృహ హింస బాధితుల కోసం ఒక హెల్ప్‌లైన్ నడుపుతున్నారు. నేటి ఎపిసోడ్ గృహ హింస బాధితుల కోసం భూమిక చేసే పని, మహిళలకు ఇస్తున్న మద్దతు, భూమిక సమిష్టిగా చేస్తున్న పోరాటం గురించి. ఈ వారం సమాచారం సమీక్ష ఎపిసోడ్ కోసం సునో ఇండియా ఎడిటర్ పద్మ ప్రియ కొండవీటి సత్యవతి గారితో మాట్లాడారు. అయిషా మిన్హాజ్ ఎపిసోడ్ హోస్ట్ చేశారు.
    (Bhumika was started as a magazine in the 1990s in erstwhile Andhra Pradesh to put forth feminist perspectives. The magazine grew bigger and eventually became Bhumika Women's Collective. Today, among several other things, they also run a helpline for women in distress. Today's episode is about the work Bhumika does in helping survivors of domestic violence, how the women are supported, the fight that Bhumika collective has been putting up.

    For this week's Samacharam Sameeksha episode, Suno India editor Padma Priya spoke to Kondaveeti Satyavati of Bhumika collective. Ayesha Minhaz hosted the show. )

    See sunoindia.in/privacy-policy for privacy information.

    36 min
  • పాలగుట్టపల్లె బ్యాగ్స్: ఊరిని నిలబెట్టిన కథ (The story of Paalaguttapalle bags)
    పాలగుట్టపల్లె, ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో పాకాల మండలం లో దళిత వాడ. పాలగుట్టపల్లెలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలే. కొన్నేళ్ల క్రితం కరువు రావడం, వ్యవసాయ పనులు మందగించడంతో, గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు కలిసి పాలగుట్టపల్లె బాగ్స్ స్థాపించారు. ఈ వారం సమాచారం సమీక్ష లో వారి కథ తెలుసుకుందాం: పని ఎలా ప్రారంభించారు, తొమ్మిది మంది బృందానికి ఎలా ఎదిగారు, ఇంకా మారుమూల ప్రాంతం నుండి వ్యాపారం నడపడం లో ఉన్న కష్టాలు. ఈ కథను పాలగుట్టపల్లె మహిళలు అయిషా మిన్హాజ్ కి వివరించారు.

    (Paalaguttapalle is a Dalit hamlet in Chittoor District of Andhra Pradesh. Most people in Paalaguttapalle are agricultural labourers. As drought struck a few years ago and agricultural work slowed down, a few women of the village got together to make cloth bags. How they grew to a team of nine today, how they operate, the journey of their bags from Paalaguttapalle to places across India and even the UK, is the story Ayesha Minhaz speaks about today. The story is narrated by the women of Paalaguttapalle themselves.

    Here’s where you can buy the masks, bags, and pickles made by them and find more information about them: http://paalaguttapalle.com/.)

    See sunoindia.in/privacy-policy for privacy information.

    14 min
  • గ్రామీణ ఉపాధి హామీ: నిధుల కొరత, సమస్యలు (Rural Employment Guarantee scheme: Lack of funds & problems)
    గత ఆరు నెలలుగా, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతన ఉపాధికి డిమాండ్ పెరిగింది. COVID19 లాక్ డౌన్ తర్వాత, ఈ ఉపాధి కోసం దరఖాస్తు పెట్టుకున్న వారి సంఖ్యతో పాటు పని దినాలు కూడా గతంతో పోల్చుకుంటే పెరిగాయి. కాగా, నిధుల కొరత వల్ల రాబోయే రోజుల్లో ఈ పథకం అమలు కష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇంకా సరైన సమాధానం అందడం లేదు. ఈవారం సమాచారం సమీక్షలో, అయిషా మిన్హాజ్, దళిత బహుజన ఫ్రంట్ కార్యకర్త పి. శంకర్, ఇంకా Libtech India పరిశోధకులు చక్రధర్ బుద్ధతో ఈ విషయం గురించి చర్చించారు.

    (Over the past six months, NREGA has become a support to not just the regular job seekers, but those who returned to the villages post COVID-19 and lockdown. With increased demand, most states have nearly exhausted the funds for this financial year. This includes Andhra Pradesh and Telangana. However, there haven't been many efforts to tackle this from the state or central governments. In this episode of Samacharam Sameeksha, Ayesha Minhaz spoke to activist P Shankar of Dalit Bahujan Front and researcher Chakradhar Buddha of Libtech India to understand the issues with NREGA in the two Telugu states.)  

    See sunoindia.in/privacy-policy for privacy information.

    24 min

About సమాచారం సమీక్ష - A Telugu News Podcast

From the publisher's feed

ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఉంటుంది. మీ సలహాలు, తెలుగులొ మీరు వినాలి అనుకునె విషయాలు గురించిన వివరాలు మాకు తెలపాలి అనుకుంటె, [email protected] (mailto:[email protected]) కి email పెట్టండి.

More shows like సమాచారం సమీక్ష - A Telugu News Podcast

Dear Pari by Suno India

Dear Pari

6 Listeners

Eshwari Stories for kids in Telugu by Suno India

Eshwari Stories for kids in Telugu

13 Listeners

Rare Lives by Suno India

Rare Lives

0 Listeners

The Suno India Show by Suno India

The Suno India Show

9 Listeners

Gasping For Breath by Suno India

Gasping For Breath

0 Listeners

Climate Emergency by Suno India

Climate Emergency

3 Listeners

Beyond Charminar by Suno India

Beyond Charminar

10 Listeners

Raah – A Career Podcast by Suno India

Raah – A Career Podcast

0 Listeners

Cyber Democracy by Suno India

Cyber Democracy

2 Listeners

Pinjra Tod Kar by Suno India

Pinjra Tod Kar

1 Listeners

ईश्वरी जी की कहानियां  (Eshwari Stories for kids in Hindi) by Suno India

ईश्वरी जी की कहानियां (Eshwari Stories for kids in Hindi)

0 Listeners

Her Story of Dance Podcast by Suno India

Her Story of Dance Podcast

5 Listeners

Baat - Mulakaat by Suno India

Baat - Mulakaat

0 Listeners

Indian Economy Explained by Suno India

Indian Economy Explained

0 Listeners

Beyond Nation & State with Smita Sharma by Suno India

Beyond Nation & State with Smita Sharma

1 Listeners

Pride and Prejudice by Suno India

Pride and Prejudice

1 Listeners

Science & Us by Suno India

Science & Us

0 Listeners