సమాచారం సమీక్ష - A Telugu News Podcast

సమాచారం సమీక్ష - A Telugu News Podcast

By Suno IndiaNewsNews Commentary
Download on the App Store

సమాచారం సమీక్ష - A Telugu News Podcast episodes

  • COVID19- మహిళా, కౌలు రైతుల ఎదుర్కొన్న ఇబ్బందులు (Difficulties faced by women and tenant farmers)
    COVID19 లాక్డౌన్ అమలు చేసినప్పటి నుండి, రైతులు, ముఖ్యంగా మహిళా ఇంకా కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రైతుల హక్కుల కార్యకర్తలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో కొన్నిటికి పరిష్కారం దొరకలేదు. ఖరీఫ్ ప్రారంభంలో రైతులకు సంబంధించిన ఇంకో అంశం చర్చనీయంశంగా మారింది - తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు విధానం.
    మహిళా, కౌలు రైతుల ఇబ్బందులు, ఇంకా నియంత్రిత సాగు గురించే ఈ వారం చర్చ.

    ఈ వారం సమాచారం సమీక్ష ఎపిసోడ్ లో, మహిళా రైతుల హక్కుల కార్యకర్త ఎస్ ఆశాలత గారితో, ఇంకా మహిళా, కౌలు రైతుల హక్కులు, భూ సమస్యల పరిశోధకురాలు ఉషా సీతాలక్ష్మి గారితో షో హోస్ట్ అయేషా మిన్హాజ్ మాట్లాడారు. ఆశాలత గారు, ఇంకా ఉషా సీతాలక్ష్మి గారు మహిళా రైతుల హక్కుల వేదిక తో కలిసి పని చేస్తారు.

    (Since the implementation of COVID19 lockdown, farmers' rights activists have been flagging issues being faced by farmers, especially women and tenant farmers during this period. This, in addition to the longstanding prevailing problems.

    This week's Samacharam Sameeksha discusses this with this along with another farmers’ rights concern that garnered a lot of attention in Telangana in recent times. Ahead of Kharif season, Telangana government’s decision to impose regulated cropping became contentious as flouting it would mean giving up Raithu Bandhu input subsidy, and minimum support price.

    In this episode, Samacharam Sameeksha host Ayesha Minhaz spoke with women farmers' rights activist S Ashalatha and activist and academic Usha Seethalakshmi about these two themes: impact of COVID19 on women, tenant farmers and regulated cropping. Both Ashalatha and UshaSeethalakshmi are associated with Mahila Raithula Hakkula Vedika (a forum known as MAKAAM at the national level)).

    See sunoindia.in/privacy-policy for privacy information.

    33 min
  • కరోన కల్లోలం లో సురభి నాటక మండలి కి చేయూత కావాలి (Surabhi Theatre Group caught in COVID storm)
    సురభి నాటక సమాజం  తెలుగు నాటక రంగంలో అత్యంత ప్రముఖమైనది. నాటకమే జీవితం గా భావించి అంకితభావం తో తరతరాలుగా నటిస్తున్నారు. నాటకాన్ని సజీవం గా ఉంచుతున్నారు.
    130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ప్రపంచం లోనే  కుటుంబ నిర్వహణలో సభ్యులతో ఉన్న ఒకే ఒక నాటక సమాజం గా చెబుతారు.

    ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలబడి న సురభి సంస్థ ప్రస్తుత కోవిడ్ విలయ తాండవం లో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఈవిధమైన సహాయం సాటి మనుషులుగా మన నుండి ఆశిస్తారో సురభి ఆరవ తరం దర్శకులు శ్రీ జయచంద్ర వర్మ గారు సునో ఇండియా ఫౌండర్ పద్మ ప్రియ గారితో మాట్లాడిన ఇంటర్వ్యూ లో విందాము.
    (Surabhi Theatre group is one of the most prominent names in Telugu theatre. Actors in Surabhi have been acting in plays for generations with dedication. With a history of over 130 years, it is said to be the only theatre in the world with family members managing it.
    This theatre group which survived the world wars over ages is now in the brink because of COVID. For this episode, our editor Padma Priya spoke with Mr. Jayachandra who is the sixth-generation director of Sri Venkateswara Surabhi Theatre group.)

    See sunoindia.in/privacy-policy for privacy information.

    38 min
  • వైద్యులే కరోన బారినపడితే? (What if doctors fall sick with Corona?)
    తెలంగాణ ప్రభుత్వ స్వీయ ప్రకటన ప్రకారం, వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 143 మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులు కోవిడ్‌కు పాజిటివ్ గా తేలింది వారిలో సగం మందికి గత రెండు వారాలలో మాత్రమే వ్యాధి సోకింది. ఈ సంఘటనలు ఆరోగ్య సంరక్షణ కార్మికులకు అందుబాటులో ఉంచబడుతున్న భద్రతా సామగ్రి లభ్యత మరియు నాణ్యత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి. పిజి విద్యార్థులకు కవిడ్ పరీక్షలను నిరాకరించిన ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిపాలనపై కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్యలు వెలుగులోకి వస్తున్నప్పటికీ, రోగి చనిపోయినట్లు ప్రకటించిన తరువాత రోగి బంధువులు తమ సహోద్యోగిని కొట్టడంతో గాంధీలో పనిచేసే వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ వైద్యులు మరియు ఇతరులు వైద్యులకు భద్రత లేకపోవడం, ఎక్కువ పని గంటలు, ఇతర సమస్యలలో మంచి నాణ్యమైన PPE lu  లేకపోవడం పై నిరసన వ్యక్తం చేశారు. పిజి పరీక్షలు కూడా ఆలస్యం కావాలని వారు కోరారు. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లోని జూనియర్ వైద్యులు కేసుల వికేంద్రీకరణ కోసం, వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్య మంత్రి ఇ టల రాజేందర్, వారి డిమాండ్లన్నింటినీ పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో, జూనియర్ వైద్యులు తమ సమస్యలను పరిష్కరించడానికి 15 రోజుల సమయం ఇచ్చారు.

    సమాచారం సమీక్ష యొక్క ఈ ఎపిసోడ్ కోసం, సునో ఇండియా ఎడిటర్ పద్మ ప్రియా వారి సవాళ్లను అర్థం చేసుకోవడానికి టిజుడా (తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్) ప్రెసిడెంట్ డాక్టర్ విష్ణు మరియు టిజెయుడా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మి ప్రియాతో మాట్లాడారు.

    See sunoindia.in/privacy-policy for privacy information.

    28 min
  • ఆరోగ్య సేతు - కోవిడ్‌పై పోరు, ప్రైవసీ ప్రశ్నలు (Aarogya Setu - Fighting COVID, Privacy Questions)
    రాబోయే నెలల్లో, మన దేశంలో COVID-19 కేసులు పెరుగుతాయని ఒక అంచనా ఉంది.
    దానికి అనుగుణంగా, ఆరోగ్య సేతు వాడకం కూడా పెరగవచ్చు. ఇప్పటికే అనేక సంస్థలు తమ కార్యాలయాలు, మాల్స్, షాపులు మొదలైన వాటిలో ప్రవేశించడానికి ఆరోగ్య సేతును తప్పనిసరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ యాప్ ఉపయోగం ఏంటి, దీని అవసరం, లోటుపాట్లు, ప్రైవసీ గురించి ఇవాళ తెలుసుకుందాం. ఇవాళ్టి 'సమాచారం సమీక్ష' ఎపిసోడ్ కోసం శ్రీనివాస్ కొడాలి మరోసారి ‘సమాచారం సమీక్ష’ చర్చకి వచ్చారు.
    (In the coming months, there is an expectation that COVID-19 cases will increase in our country. Accordingly, the use of health care can also increase. Already, many companies are mandating the Health Service to enter their offices, malls and shops. Against this backdrop, let's learn about the use of this app, its need, deficits and privacy. In today's episode of our podcast "Samacharam Sameeksha" Srinivas Kodali has once again come to explain this.)

    See sunoindia.in/privacy-policy for privacy information.

    22 min
  • ఆర్థిక సంక్షోభం, ప్రొడక్షన్‌లో మార్పులు - టాలీవుడ్‌పై కోవిడ్ ప్రభావం (Impending financial Crisis and changes in Production - COVID's Influence on Tollywood)
    మార్చి మూడవ వారంలో, భారతదేశంలో COVID-19 కేసులు పెరుగుతున్నందున, తెలుగు చిత్ర పరిశ్రమలో పనులు ఆగిపోయాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సినిమా థియేటర్లు మూసివేశారు. సినిమా షూటింగులు ఆగిపోయి, దాదాపు రెండు నెలలుగా సినిమా విడుదలలు లేక, పరిశ్రమ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ సంక్షోభం కార్మికులు, కళాకారులు, దర్శకులు, స్టూడియోలు, నిర్మాతలు. ఇలా ఎంతో మందికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించింది. ఇవాళ్టి సమాచారం సమీక్షలో, వీటన్నిటి గురించి చర్చిస్తూ, బాహుబలి చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ గారితో అయిషా మిన్హాజ్ ఇంటర్వ్యూ.

    (In the third week of March, as the number of COVID-19 cases in India increased, work in the Telugu film industry stopped. Movie theatres have been shut down to keep the virus from spreading. After nearly two months of no film releases, the industry is facing a financial crisis.
    The crisis has caused a serious financial loss for the workers, artists, directors, studios, producers and so on. In this episode of Samacharam Sameksha, Ayesha Minhaz interviews Baahubali producer Shobhu Yarlagadda, to discuss these and more.)

    See sunoindia.in/privacy-policy for privacy information.

    12 min
  • లాక్ డౌన్ - COVID 19 విధుల్లో ఉన్న ఆశా వర్కర్ల సమస్యలు (Lockdown: Problems of ASHA workers in COVID19 duty)
    నేటి సమాచారం సమీక్షలో, అయిషా మిన్హాజ్ COVID19 విధుల్లో ఉన్న ఆశా వర్కర్లు  ఎదుర్కొంటున్న సమస్యల గురించి రిపోర్ట్ చేశారు. ఆశాలు సర్వేకి వెళ్ళేటప్పుడు మాస్క్‌లు, గ్లవ్స్ లేకపోవడం, ప్రజలు సహకరించకపోవడం, రవాణా సౌకర్యాలు లేకపోవడం వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ప్రస్తుత సమస్యలతో పాటు  జీతాలు ఆలస్యంగా అందటం, శాశ్వత ఉద్యోగాలు లేకపోవడం వంటి దీర్ఘకాలిక సమస్యల గురించి కూడా చర్చించారు.
    ఫీల్డ్ రిపోర్టింగ్: ఆయిషా మిన్హాజ్, సునో ఇండియా ఎడిటర్ పద్మప్రియ
    (In Today’s Samacharam Sameeksha, Ayesha Minhaz and Suno India editor Padma Priya report on the difficulties faced by ASHA workers while on COVID19 frontline duty. ASHA workers were roped in to do door-to-door surveys with hardly any protective gear in several places. Further, with public transport services shut, they have been facing difficulty travelling too. We spoke to union leaders and ASHA workers on the issues they are facing currently, and the longstanding issues such as delays in salaries, lacking permanent jobs etc.)

    See sunoindia.in/privacy-policy for privacy information.

    22 min
  • లాక్ డౌన్: వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు (Lockdown: Problems faced by migrant workers)
    కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మార్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, దేశంలో అనేక ప్రాంతాల్లోని వలస కార్మికుల జీవితాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. దేశవ్యాప్తంగా రైళ్ళు, బస్సు సర్వీసులు నిలిపివేయడంతో, వలస కార్మికులు, వారి స్వస్థలాలకి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికుల కోసం కొన్ని సహాయక చర్యలు ప్రకటించినప్పటికీ, వాటి అమలులో లోటుపాట్ల వల్ల అవి ఇంకా అందరికీ చేరలేదు.

    వలస కార్మికులు ఎదుర్కొంటున్న  సమస్యల తీవ్రతను గురించి "రైతు స్వరాజ్య వేదిక" తెలంగాణ రాష్ట్ర కమిటీ  మెంబర్ కిరణ్ విస్సాతో నేటి చర్చ.

    (A nationwide lockdown was announced in March to curb the spread of the coronavirus. The decision, which was taken suddenly, has caused a serious crisis in the lives of migrant workers in many parts of the country with trains and bus services all over the country, migrant workers are unable to return to their hometowns. While the central and state governments have announced some relief measures for migrant workers, they have not yet reached the public due to deficits in their implementation.

    Today's discussion with Telangana State Committee Member Kiran Vissa on the seriousness of the problems faced by migrant workers.)

    See sunoindia.in/privacy-policy for privacy information.

    24 min
  • లాక్ డౌన్ కారణంగా రానున్న రోజుల్లో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులు ఏమిటీ (What are the difficulties farmers face in the coming days due to the lockdown?)
    ప్రముఖ వ్యవసాయ నిపుణులు శ్రీ రామాంజనేయులు గారితో సునో ఇండియా ఎడిటర్ పద్మప్రియ ఇంటర్వూ లో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అమలు అవుతున్న లాక్డౌన్ కర్ఫ్యూ నేపథ్యం లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతారు.

    లొక్డౌను నేపథ్యం లో రైతులు తమ తమ పంటలు ,కూరగాయలు వంటి వాటిని వినియోగదారుల కు చేర్చే క్రమం లో ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు ,వారికి ఇవ్వాల్సిన లేదా ఇస్తున్నామని చెబుతున్న వెసులుబాటు చర్యల ఆదేశాలను అధికారులు క్రింది స్థాయి అధికారుల కి చేరి సరిగా అమలుపరిచెలా చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు. అంతే కాకుండా ప్రభుత్వం తాము ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను వినియోగదారుల కోణం లోనే కాకుండా రైతుల కోణం లోంచి చూసి సరైన వేగవంతమైన చర్యలు చేపట్టాలన్నారు. రానున్న మూడు వారాలు కీలకం వ్యవసాయ పరంగా.అదీగాక వ్యవసాయం కూడా అత్యవసరసేవల క్రిందకు వస్తుంది.
    (In this episode, Suno India Editor Padmapriya talks to leading agriculture scientist Mr.Ramanjaneyu about the difficulties farmers face in the wake of the lockdown curfew that is being implemented as part of coronavirus prevention.
    In the wake of the lockdown, farmers are facing challenges delivering their crops, vegetables to the consumers. Moreover, the government should look at the welfare programs introduced by the government from the perspective of the consumer and not the farmers, and take appropriate action. The next three weeks will be crucial in terms of agriculture says Mr Ramanjaneyulu.)

    See sunoindia.in/privacy-policy for privacy information.

    15 min
  • సత్వర న్యాయం (Quick Justice)
    ప్రస్తుత కాలంలో తరచుగా అడిగే ప్రశ్న సత్వర న్యాయం ఏది అని. దేశవ్యాప్తంగా ఆందోళన ఆగ్రహం ఆవేదన కలిగించిన నిర్భయ అత్యాచార సంఘటన ,తరువాత చెప్పబడిన న్యాయ తీర్పు అమలులో జాప్యం  జరిగిందని భావించిన కారణంగా  తలెత్తిన ప్రశ్న. అసలు సత్వర న్యాయం అంటే ఏమిటీ అనే ప్రశ్నకు సమాధానంగా మాడభూషి శ్రీధర్ గారి వివరణ వినండి
    (Nowadays, a frequently asked question is what is quick justice? The Nirbhaya rape incident, which caused outrage across the country, raised the question of what would be considered a delay in the execution of judiciary. Listen to Madhabushi Sridhar, ex-Central Information Commissioner, answer the question of what quick justice actually means?)

    See sunoindia.in/privacy-policy for privacy information.

    13 min
  • మీడియా ప్రమాణాలు - కులతత్వం, రాజకీయ ప్రయోజనాలు (Media standards: casteism and political interests)
    పత్రికల్లో ఇంకా న్యూస్ చానల్స్ లో ప్రశ్నార్థకంగా మారిన ప్రమాణాల గురించి కొందరు మీడియా విమర్శకుల చాలా కాలంగానే చర్చిస్తున్నారు.
    కులాధిపత్యం, ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, ఇంకా సోషల్ కాపిటల్ (social capital) లాంటి  కారణాల వల్ల పతనమవుతున్న నిశ్పాక్షికత గురించి నేటి చర్చ.
    ఇవాల్టి చర్చ పద్మజ షా గారితో. పద్మజ షా గారు జర్నలిస్ట్, మీడియా విమర్శకురాలు, విద్యావేత్త. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.

    (For a long time now, media critics have been raising alarm about the falling standards in newspapers and news channels.Today's debate is about the content and the reasons for the media's credibility crisis.
    Padmaja Shaw, an academic, media critic and activist, talks to Ayesha Minhaz about the influence of caste hegemony, financial and political benefits, intangible social capital on the independence of news organisations.)

    See sunoindia.in/privacy-policy for privacy information.

    30 min

About సమాచారం సమీక్ష - A Telugu News Podcast

From the publisher's feed

ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఉంటుంది. మీ సలహాలు, తెలుగులొ మీరు వినాలి అనుకునె విషయాలు గురించిన వివరాలు మాకు తెలపాలి అనుకుంటె, [email protected] (mailto:[email protected]) కి email పెట్టండి.

More shows like సమాచారం సమీక్ష - A Telugu News Podcast

Dear Pari by Suno India

Dear Pari

6 Listeners

Eshwari Stories for kids in Telugu by Suno India

Eshwari Stories for kids in Telugu

13 Listeners

Rare Lives by Suno India

Rare Lives

0 Listeners

The Suno India Show by Suno India

The Suno India Show

9 Listeners

Gasping For Breath by Suno India

Gasping For Breath

0 Listeners

Climate Emergency by Suno India

Climate Emergency

3 Listeners

Beyond Charminar by Suno India

Beyond Charminar

10 Listeners

Raah – A Career Podcast by Suno India

Raah – A Career Podcast

0 Listeners

Cyber Democracy by Suno India

Cyber Democracy

2 Listeners

Pinjra Tod Kar by Suno India

Pinjra Tod Kar

1 Listeners

ईश्वरी जी की कहानियां  (Eshwari Stories for kids in Hindi) by Suno India

ईश्वरी जी की कहानियां (Eshwari Stories for kids in Hindi)

0 Listeners

Her Story of Dance Podcast by Suno India

Her Story of Dance Podcast

5 Listeners

Baat - Mulakaat by Suno India

Baat - Mulakaat

0 Listeners

Indian Economy Explained by Suno India

Indian Economy Explained

0 Listeners

Beyond Nation & State with Smita Sharma by Suno India

Beyond Nation & State with Smita Sharma

1 Listeners

Pride and Prejudice by Suno India

Pride and Prejudice

1 Listeners

Science & Us by Suno India

Science & Us

0 Listeners