ప్రతి ఆడపిల్ల ప్రతినెలా అనుభవించే రుతుస్రావం, తన జీవితంలో చాల ముఖ్యమైన ఘట్టం. అలంటి సున్నితమైన సమయంలో ఆరోగ్యం, శుచి-శుభ్రత చాల ముఖ్యం. రసాయనాలతో కూడిన సింథటిక్ సానిటరీ నాప్కిన్స్ వాడటం వల్ల దీర్ఘకాలంలో కలిగే నష్టాలను గూర్చి తెలుసుకున్న అరుణ గారు, సమాజానికి తనవంతుగా ఏదైనా సహాయం చేయాలనుకున్నారు. ఆ దిశగా ఆలోచిస్తుండగా మరొక స్నేహితురాలి సహకారంతో, "అప్నా గ్రీన్" అనే సంస్థను స్థాపించి, దాని ద్వారా సహజ పదార్థాలతో, రసాయన రహితమైన సానిటరీ నాప్కిన్స్ తయారీని మొదలుపెట్టారు. దీని ప్రయోజనాల గురించి జనానికి తెలిసేలా అవగాహన ప్రచారాలు చేస్తున్నారు. ఆడపిల్లలను రోగాలనుండి కాపాడడమే కాకుండా, మన భూతల్లిని కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మన TALRadio వ్యాఖ్యాత, నిఖిత గారితో కలిసి, ఇంతటి గొప్ప సంకల్పం కోసం కృషి చేస్తున్న "అప్నా గ్రీన్" వ్యవస్థాపకురాలు అరుణ దారా గారి ప్రయాణం విందాం ఈ వారం స్త్రీ-శక్తి సంచికలో.
Menstruation is a very delicate phase for girls and women. Being healthy and hygienic is of utmost importance during this phase. However, when Hyderabad based employee Aruna Dhara has noticed the harmful affects of synthetic sanitary napkins on a woman's health, she decided to do something about it. After trying to create awareness about stopping the usage of these sanitary napkins, she realised there is a need to develop natural sanitary napkin that is chemical-free and earth-frinedly. With the help of a friend, she has started her own company "Apna Green" which manufactures sanitary napkins using natural ingredients and making it chemical-free. Along with helping women to use natural sanitary napkins at affordable prices, they are also doing their best on protecting our Mother Earth. To know more about her journey as an entreprenuer, join our host Nikhita in this week's episode of Stree-Shakthi.