Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope.TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio.Our sh... more
FAQs about TALRadio Telugu:How many episodes does TALRadio Telugu have?The podcast currently has 942 episodes available.
June 27, 2023సంకెళ్లను బద్దలుకొట్టిన సిక్సర్… మిథాలీ రాజ్అది 1999. మహిళలకు ప్రత్యేక క్రికెట్ ఉంటుందనే విషయమే చాలామందికి తెలియని సందర్భం. అలాంటి సమయంలో రికార్డుల మీద రికార్డులు సృష్టించి… లోకం దృష్టిని ఆకర్షించారు మిథాలీ. ఎంతోమంది బాలికలకు ఆ క్రీడలో అడుగుపెట్టేందుకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ ప్రయాణం అంత తేలికగా సాగలేదు. రన్ ఛేజింగ్ అంత ఆసక్తికరంగా ఉంటుంది తన జీవితం. మీరే వినండి.In times when Women Cricket was considered a mere formality, Mithali is the one who added charisma to the sport with her unbeatable records. Here is the story of Mithali’s journey as a cricketer which is as interesting as a nail-biting finish.Script & Voice: Geetha#MithaliRaj #womencricket #touchalife #talradio #talpodcasts...more12minPlay
June 23, 2023పండంటి బిడ్డ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? | Know Your Plate - Epi 7ఆహారం శక్తిని అందించే ఇంధనం మాత్రమే కాదు… ఆరోగ్యానికి పెట్టుబడి. అందుకే పోషకాహార నిపుణులు కేవలం బలాన్ని అందించే ఆహారాన్ని మాత్రమే సూచించరు. మన జీవనశైలి, శారీరిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకుంటారు. అలాంటి ఓ ప్రత్యేకమైన స్థితి గర్భధారణ. ప్రెగ్నెన్సీ ముందు, కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే పండంటి బిడ్డకు ఆస్కారం ఉంటుందో ఈవారం నో యువర్ ప్లేట్ కార్యక్రమంలో ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రితగారు చెబుతున్నారు.Food isn’t just a fuel that drives us. It’s an investment to our health. This is why nutritionists won’t just suggest food that gives immense energy. They keep in mind, our lifestyle and requirements. One such unique situation is pregnancy. In this episode of Know Your Plate, our nutritionist is going to share some valuable information about the food to be taken for a healthy baby.Expert: Asritha VissapragadaHost: JayasreeNutritionist Asritha Contact Details: [email protected]#nutrition #pregnancy #knowyourplate #prepregnancy #touchalife #talradio...more27minPlay
June 22, 2023ఎలాంటి పరిస్థితిలో అయినా ప్రశాంతంగా ఉండటం ఎలా! | Smart To Wise - Episode 6చదరంగం ఆడుతూ అందులో పావుగా మారిపోతే కష్టమే. జీవితం కూడా అంతే. రకరకాల సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటూ… వాటిమధ్య మన ఉనికిని కోల్పోతూ ఉంటాం. ఎన్ని ఒడిదుడుకుల మధ్య అయినా ప్రశాంతంగా ఉండటం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ విషయంలో అనుభవజ్ఞులైనవారి మాటలు తప్పకుండా ఉపయోగపడతాయి. అందుకే ఈ వారం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రసాద్ కైప గారిని ఈ విషయమై అడిగి చూశాం. తన సుదీర్ఘ అనుభవంతో పాటు… ప్రాచీన విజ్ఞానం చెబుతున్న మాటలేమిటో తెలుసుకున్నాం. అవేమిటో మీరూ వినండి.Life isn’t an easy game and we often get lost in it’s riddles while playing it. We forget our true character and peace amidst the challenges thrown by life. This is why we have asked about the secret of maintaining serenity from renowned management guru Mr. Prasad Kaipa. It’s interesting to listen to his answers backed by immense experience and expertise on ancient knowledge.Expert: Prasad KaipaHost: Rama Iragavarapu#talradiotelugu #touchalife #talradio #prasadkaipa #smarttowise #touchalife #innerpeace #integrity #calmness...more37minPlay
June 22, 2023విలక్షణ సాహితీవేత్త డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి (Part 1) | మన రచయితలు - 19డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి. సాహితీ వాతావరణంలో పెరిగారు. అక్షరం పట్ల ఆసక్తితో, ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. వేలమందికి ప్రాచీన, ఆధునిక సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించారు. ఓ రచయిత్రిగానూ… అద్భుతమైన రచనలెన్నో చేశారు. విశ్లేషకురాలిగానూ తనదైన ముద్ర అందుకున్నారు. ఈ విశిష్టమైన సాహితీవేత్తతో ఈ వారం మన రచయితల శీర్షికన సంభాషణ!Veeralakshmidevi Vadrevu is known for her extensive knowledge in ancient as well as modern Telugu literature. Her love for literature has inspired her to take the teaching profession through which she has inspired numerous students. Devi is also a recognized writer and analyst. Here is an interesting talk with her.Host: KL Surya#manarachayitalu #touchalife #talradio #vadrevu #teluguwriter...more31minPlay
June 20, 2023ఎదుగుదలే నిజమైన జవాబు… అని నిరూపించే కథ!గమ్యం ఒకసారి రహదారిలా సాఫీగా సాగిపోతుంది. మరోసారి ముళ్లబాటగా మారి సవాలు చేస్తుంది. ఈ ప్రయత్నంలో ముందుగా సాగుతుండగానే… మనల్ని నిరుత్సాహపరిచే మాటలూ వినిపిస్తాయి. రెచ్చగొడుతూనో, లోకువచేస్తూనో… దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తాయి. ఆగి… జవాబులు చెప్పడం మొదలుపెడితే, ప్రయాణం అర్థంతరమే. ఇలాంటి సమయంలో ఏం చేయాలో ఈ చిన్న కథ వింటే తెలిసిపోతుంది. Script & Voice: GeethaHere is the story of a crow that challenged the eagle. It tries to distort and insult the huge bird. What happens next is a reminder of how we should deal with such provocations. This small story keeps suggesting that victory is the best revenge and ambition is the best way to add value to our lives.#talradiotelugu #touchalife #talradio #talpodcast #moralstory #victory...more4minPlay
June 19, 2023లోకాన్ని కాపాడే సైంటిస్ట్… విష్ణు రెడ్డి | The Asteroid Hunterఆకాశంలోకి చూసే పిల్లలు… తాము పెద్దయ్యాక సైంటిస్ట్ అవుతామని అనుకుంటారు. రోజులు గడిచేకొద్దీ చూపులు నేల మీదకి వచ్చేసి... అసలు ఆకాశం వంక చూసే తీరికే ఉండదు. రకరకాల పోటీలు మొదలవుతాయి. ఎన్నో వృత్తులు ఆకర్షిస్తాయి. కానీ ఓ కుర్రాడు మాత్రం తన చిన్ననాటి కలను మర్చిపోలేదు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, అంతరిక్షం మీద ఆసక్తిని వదులుకోలేదు. ఆస్టరాయిడ్స్ మీద పరిశోధనలు చేస్తూ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. అతనే విష్ణురెడ్డి. యాక్టర్ చేయాలని ఇంట్లో ప్రయత్నిస్తే, జర్నలిస్టుగా మారి… చివరికి తను అనుకున్న వృత్తిలోనే ఆత్మతృప్తిని అందుకుంటున్న ఈ విలక్షణ వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిందే.Script & Voice: GeethaMany love space in their childhood, but few keep their passion burning deep enough to pursue such career despite many hurdles and deviations. Here is an interesting person, Vishnu Reddy… who despite his humble background kept walking further towards his dream and realized it. Fondly called as Vishnu Reddy, he is one of the renowned scientists who has extensive knowledge in the field of asteroids.#talrdiotelugu #touchalife #talradio #asteroids #space #VishnuReddy...more14minPlay
June 16, 2023ఓ పని విజయవంతంగా పూర్తిచేయడం ఎలా!పని ఆరంభించకుండానే… ఏవైనా అడ్డంకులు వస్తాయేమో అని చెప్పి ఊరకుండిపోయేవారు కొందరు. పని చేయాలి అనే లక్ష్యంతో మొదలైనప్పటికీ, ఏదన్నా ఆటంకం ఎదురవగానే దాన్ని వదిలేసేవారు కొందరు. తుదికంటూ లక్ష్యం కోసం శ్రమించేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటివారి గురించి చెప్పే ఓ చిన్న కథ ఇది. కథ చిన్నదే కానీ ఎప్పటికీ మర్చిలేం. ఓసారి మీరే విని చూడండి.Many have goals but only few succeed in reaching them. Here is an interesting story of how a Guru has taught his disciples about sticking to ones journey and reaching his goal. Do follow our Spotify channel for more interesting and inspirational stories.Script & Voice: Geetha#talradiotelugu #touchalaife #talradio #goal #motivation #inspiration...more4minPlay
June 16, 2023పిల్లలకు ఎప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలి? లంచ్ బాక్సులో ఏం పెట్టాలి?పిల్లల ఆహారం పెద్ద సమస్యే. వాళ్ల అవసరానికి తగినంత శక్తి అందాలి. ఎదుగుదలకు సాయపడే పోషకాలు ఉండాలి. జంక్ ఫుడ్స్ దూరంగా ఉంచాలి. వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా… అది వారి మీద శాశ్వతమైన ప్రభావం చూపిస్తుంది. ఇక వారి లంచ్ బాక్సులో ఏం ఉండాలనేది మరో సమస్య. ఇలాంటి విషయాలన్నింటినీ ప్రముఖ పోషకాహార నిపుణురాల ఆశ్రితగారి ముందు ఉంచింది టాల్ రేడియో. దానికి చాలా ఆసక్తికరమైన, పాటించదగిన జవాబులు వచ్చాయి. అవేంటో మీరే వినండి!Meeting the food requirement of children is indeed a huge problem. The food we provide has to give them enough strength for day to day activities and help in their growth. Junk and unhealthy food has to be avoided. Any negligence in this care would result a long term devastating effect on their health. Planning their lunch box is yet another challenge. Here is our nutritionist sharing her unique vision about such issues.Expert: Asritha VissapragadaHost: JayasreeNutritionist Asritha Contact Details: [email protected]#talradiotelugu #knowyourplate #nutrition #asritha #touchalife #talradio #jayasree...more30minPlay
June 15, 2023What Is A Perfect Life? How To Achieve It? Smart To Wise - 5పరిపూర్ణమైన జీవితం అనే మాట చాలాసార్లు వింటూ ఉంటాం. ఇంతకీ పరిపూర్ణమైన జీవితం అంటే ఏమిటి? అది సాధించడానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి. ఈ విషయమై మన పెద్దలు చెబుతున్న మాటేమిటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో సాగిన ఎపిసోడ్ ఇది. ఈ విశ్లేషణ మనకు అందిస్తున్న ప్రసాద్ కైప, ప్రముఖ మేనేజ్ మెంట్ గురువు మాత్రమే కాదు… భారతీయ ప్రాచీన విజ్ఞానం పట్ల ఆసక్తితో లోతైన అధ్యయనం చేసిన వ్యక్తి.We keep hearing about the word perfect life / perfect man. Many wonder what perfection in life is and what is needed to achieve such state. Here is Mr. Prasad Kaipa, renowned management guru and seeker of ancient Indic wisdom sharing some interesting aspects about this issue.Expert: Prasad KaipaHost: Rama Iragavarapu#talradiotelugu #smarttowise #CompleteMan #touchalife #talradio #prasadkaipa #ramairagavarapu ...more38minPlay
June 15, 2023మన మనసుకి ప్రపంచానికి మధ్య ఒక ఫిల్టర్ ఉండాలినిరంతరం మన మనసు, మన భావోద్వేగాలు అదుపులో ఉండాలి అంటే కష్టమే కాదు అసాధ్యం కూడా! రకరకాల సమస్యలు, కష్టాలు తొలుస్తూ ఉంటాయి. ప్రశ్నిస్తుంటాయి. మరి ఆ చిరాకునంతా మన చుట్టూ ఉండేవారి మీద ప్రదర్శిస్తే? ఇతరులను బాధపెట్టడమే కాదు, బంధాలను కూడా పోగొట్టుకున్నవారం అవుతాము. కష్టంగా తోచే ఈ స్థితికి చాలా సులువైన పరిష్కారాలు చెబుతున్నారు నిపుణులు. అవేంటో వినేయండి మరి!Script And Voice: Rama IragavarapuOur Daily lives are critical with many problems to solve and challenges to resolve. This continuous struggle would certainly have an effect on our emotions. However expressing our displeasures and difficulties would ruin the peace around us. Here are some interesting techniques suggested by the experts to cope with such situations.#talradiotelugu #moodswings #emotions #touchalife #talradio #talpodcasts...more4minPlay
FAQs about TALRadio Telugu:How many episodes does TALRadio Telugu have?The podcast currently has 942 episodes available.