
Sign up to save your podcasts
Or


ధనవంతులు ఎప్పుడూ నేర్చుకుంటూ ఎదుగుతారు,మిగతా వారు "మాకు అంతా తెలుసు" అనుకుంటూ అలాగే ఉండిపోతారు.
మనం ఉన్న స్థాయిని స్ట్రెచ్ చేస్తేనే సంపాదన పెరుగుతుంది. ఎందుకంటే సంపాదనకు కావలసినది మోటివేషన్ కాదు, ఒకే ఒక్క కారణం కావాలి. అది కనుక సరిగ్గా వెతుక్కోగలిగితే చాలు.
దానికి మీరు ఎంత మారడానికి సిధ్ధంగా ఉన్నారు? మన దగ్గర ఉన్న నైపుణ్యాలతో ఎంత సంపాదించగలమో అంత ఆల్రెడీ సంపాదిస్తూ ఉంటాము. మరి సంపాదన పెరగాలంటే నైపుణ్యాలు పెరగవలసిన అవసరం ఉంది.దానికి మీరు ఏమి చేస్తున్నారు?
మీ నేటి ఖర్చులే రేపటి సంపాదనని తెస్తాయి
కనీస అవసరాల తరవాత మీరు పెట్టే ఖర్చు భవిష్యత్తులో సంపాదనని పెంచే విధంగా ఉందా అనేది చూసుకుని ఖర్చు చేయగలిగితే భవిష్యత్తు బంగారు మయమవుతుంది.
అటువంటి కారణం ఏర్పడాలంటే మనకు అటువంటి మానసిక స్థితిని పొందవలసి ఉంటుంది. అలాంటి మానసిక స్థితిని పెంచేదే మా కార్యక్రమం
ఏదైనా విషయం మనల్ని ఇబ్బందికి గురి చేస్తుందంటే అర్ధం: దాని పట్ల మనకి పూర్తి అవగాహన రాలేదని. అది డబ్బు అయినా మరేదయినా
మరి అలాంటి డబ్బు గురించి అవగాహన కావాలంటే?
కొన్ని కోట్లు కావాలనుకుంటే కనీసం కొన్ని వేలయినా మన మీద మనం పెట్టుబడి పెట్టుకోవడానికి సిధ్ధపడాలి. అలా సిధ్ధ పడలేక పోతున్నామంటే మనం ఐశ్వర్యవంతులయ్యే అవకాశాలని మనమే పోగొట్టుకుంటున్నామని లెక్క.
టాలెంట్ కలిగి ఉండటం కన్నా ఆ టాలెంట్ ని ఎక్కడ ప్రదర్శించగలుగుతున్నాము అనే దాన్ని బట్టి మన సంపాదన ఆధారపడి ఉంటుంది.
శరీరంలో రక్తం, జీవితంలో డబ్బు సరిగా ప్రసరించడం ఒకేలా అవసరం
శరీరంలో రక్తం ముఖ్యం కాకపోతే, జీవితంలో డబ్బు కూడా ముఖ్యం కానట్లే
ఉచితంగా ఆశించే వారు ఎప్పటికీ ఉన్నత స్థితికి చేరలేరు. మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే ధనవంతులు ఎప్పుడు ఉచితంగా స్వీకరించకపోగా అవసరమయితే ఎక్కువ అయినా ఇవ్వడానికి సిధ్ధపడతారు. మిగతా వారికి మూర్ఖులలాగా కనిపిస్తారు కానీ వారికి అలా ఉండటం వల్ల ఉపయోగం తెలియడం వల్లనే అలా ఉంటారు. డబ్బు ప్రపంచంలో ఏ పెట్టుబడి లేకుండా లాభాలు ఆశించడం , విత్తనం నాటకుండా కాయ ఆశించడం లాంటిదే
From the publisher's feed