
Sign up to save your podcasts
Or


చాలా పెద్ద కథని ఒక్క మాటలో చెప్పాలంటే నాకు గత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, ఆయుర్వేదము మరియు హోమియో వైద్యాలమీద నమ్మకం సడలింది. అదిగో మీకు వెంటనే కోపం వస్తుంది కదా! అయితే వినండి, నాకూ ఆయుధముంది, ఇది నా అభిప్రాయం మాత్రమే అని బుకాయించే ఆయుధము. సహజంగా నా అభిప్రాయాలు చివరకు తప్పని తేలుతుంటాయి, ఆ చివర ఎప్పుడు అని తెలుసుకోవాలంటే మీకు ఓపిక అనే గొప్ప గుణం ఉండాలి.
నేను గత మూడు సంవత్సరాలుగా ఎక్కువ ప్రయాణిస్తూ, మరియు యింటికి అర్థరాత్రి లేక అపరాత్రికి చేరుతూ, అప్పుడు ఏది పడితే అది మెసవుతూ, సరిగా ద్రవ పదార్థాలు మరియు పీచు పదార్థాలు తినక, ఫిస్టులా మరియు ఫిషర్ లని కలిపి తెచ్చుకున్న. గత సెప్టెంబర్ లో రెండవ అభిప్రాయము లేకుండా మరియు తీసుకోకుండా మరియు స్నేహితులెవ్వరికీ చెప్పకుండా కేవలం నా సతి మాత్రమే తోడురాగా శస్త్ర చికిత్సా బల్ల మీద పడుకునేశా.
శస్త్ర చికిత్స అనంతరం నా శరీరం లో సెటన్ అనే సైతానుని కూడా మూడు నెలలు భరించా. ఈ సెటన్ అన్నది ఒక దారపు ఉంగరం, అది ఫిస్టులాని సహజంగా కత్తి అవసరం లేకుండా కోసుకొని దానికై అదే బయట పడిపోతుంది అని మా వైద్యుడు ధృవీకరించాడు కూడా. కానీ దానికి నా శరీరమంటే మిక్కిలి ప్రీతీ అయ్యి, ఈ హర్షా గాడిని కోసి నేను బాధించలేను అని నా శరీరం లోనే ఉండి పోయింది.
దానికున్న జాలి మా వైద్యులుంగారికి లేదు కదా మరలా నన్ను డిసెంబర్ మాసంలో కోసిన దగ్గర మరలా కోసి సెటన్ బయటకి తీసి, ఇలా నూరుమందిలో పదిమందికి జరుగుతుంది, నీ మొహం చూసే అనుకున్న నువ్వు ఆ పదిమందిలో ఒకడివి అని చెప్పి, నొప్పి తగ్గక పోతే అప్పుడప్పుడు వచ్చి కనపడు అని చెప్పాడు.
ఆ ముక్క నేను శస్త్ర చికిత్సా బెంచి మీద పడుకోక ముందే చెప్పాలి అని అనుకొని ఆ నొప్పి తగ్గడానికి ఇంకో మూడు వారాలు మంచమెక్కా నేను. కానీ నాకు గత నాలుగు నెలలుగా హీల్ కావటం లేదు, నేను కూడా శపధం చేశా సుప్రియా దగ్గర లాక్ డౌన్ ఎత్తేసినా నేను నన్ను కోసిన వైద్యుడిని చూడను అని.
మా అనీల్గాడు కాల్ చేసి కనుక్కుంటాడు ఎలా ఉందిరా, తగ్గిందా లేదా అని. వాడు చేసినప్పుడల్లా నేను కళ్ళ నీళ్లు పెట్టుకుంటా. ఇక వాడు నా బాధ చూడలేక ఎలాగూ బాధ పడుతున్నావు కదా, నిన్ను కోసినోడిని చూడనంటున్నావు కదా , ఏమీ మందులు వాడకుండా ఏడ్చే బదులు నాకు తెలిసిన ఒక హోమియో వైద్యుడున్నాడు, ఆయన్ని కలిసి ఆయనిచ్చే ఆ నాలుగు తీపి గోళీలు నములుతూ కూడా నీ ఇప్పుడేడిచే ఏడుపు ఏడ్చుకోవచ్చు అని సలహా పడేశాడు. సలహాతోనే ఆగకుండా ఆ హోమియో ఆయనతో మాటలాడి ఈ లాక్ డౌన్ లో కూడా నన్ను చూసే ఏర్పాటు చేసాడు.
చెప్పొద్దూ మొదట దర్శనం లో ఆయన నన్ను ప్రొఫైలింగ్ చేసి పడేశాడు ఓ గంట కూర్చో పెట్టి. చలి అంటే ఇష్టమా లేక వేడి అంటే ఇష్టమా అన్నదానికి చలి ఉండటం వలన నాకు అమెరికా అంటే ఎంత ఇష్టమో కథలు కథలు గా చెప్పా. చిన్నప్పుడేదన్న నీకు బాధ కలిగే సంఘటన గురుంచి చెప్పమంటే మా లక్ష్మి కథ చెప్పేశా, చురుగ్గా వుండే వాడివా అంటే మా అమ్మ తప్పిపోయిన కథ చెప్పా,.
పరీక్షలంటే టెన్షనా అంటే అసలు టెన్షన్ ఎందుకు మొదలయ్యింది అని నాది మరియు అనీల్గాడి ఇంటర్మీడియట్ సోది కథ చెప్పేశా, నీ స్నేహితులు నీ గురుంచి ఏమనుకుంటారు అంటే నీలో నువ్వు అన్నిటికీ పీక్కుంటావెందుకురా అంటారని చెప్పా.
ఎవరన్నా బాధ పెడితే గుర్తు పెట్టుకంటావా అని అడిగితే ఎప్పుడో ఇరవై ఏళ్ళక్రితం మన గోపీ గాడు నాకు టైం ఉంటే మా యింటికి ఫోన్ చేసుకోకుండా నీకెందుకు చేస్తానురా అని అన్నాడని గుర్తుపెట్టుకొని వాడి మీద కథ రాసేసాను అని
ఈ రోజు తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తుంటే మా ఇంజనీరింగ్ అయ్యాక మాకు లభించిన ఒక సంవత్సరం ఖాళీ మనకు చాలా జీవుతానుభవాలనే నేర్పించి ఉంటుందని అనిపించింది. ఈ మధ్య ఒక సినిమాలో చూశా డిగ్రీ అయ్యి బయటకి రాగానే నెక్స్ట్ ఏంటి అని ప్రతీ వాడూ అడిగేవాడే అని కథానాయకుడు బాధగా పాడుకొనే పాటని. మేము బయటకు రావటం అందరిలా కూడా రాలేదు కదా, మీరు మర్చిపోయారా, పరీక్షలు ఎగ్గొట్టి ఒక్క సంవత్సరం కాజేసుకొని వచ్చిన బ్యాచ్ మాది అని.
అసలు మాకీ పరిస్థితిఎందుకు వచ్చిందబ్బా అని కొంచెం వెనక్కి వెళ్లి ఆలోచిస్తే, ఎక్కడో మేము మా నాలుగవ సంవత్సరపు చదువుని నిర్లక్ష్యం చేసి తీరా పరీక్షలు దగ్గర పడటంతో ఎక్కువ ప్రిపరేషన్ కావాలని, అలా కావాలంటే యూనివర్సిటీ వాళ్ళు ముందుగా షెడ్యూల్ చేసిన ప్రకారం ల్యాబ్ ఎగ్జామ్స్ థియరీ ఎగ్జామ్స్ కన్నా ముందు వద్దు, వెనకకి జరపమన్నామని నాకు గుర్తు. అలా చెయ్యటం వలన మాకు కొంచెం ఎక్కువ రోజులొస్తాయి థియరీ ఎగ్జామ్స్ రాయడానికి అని మా వాదన.
కానీ మేము మిస్ అయిన లాజిక్ ఏమిటంటే మాలో తొంబై శాతం మందిమి వన్ డే బాటింగ్ చేసేవాళ్ళమే, అలాటి మాకు ఎక్కువ రోజులుంటే ఏమి తక్కువ రోజులుంటే ఏమి. ఎందుకంటే మేము చదవ బోయేది సరిగ్గా పరీక్షకు ముందు రోజే కదా. వెళ్లి రాసి పడేసి వుండాల్సింది, స్ట్రైక్ అని మా తద్దినం మేమే పెట్టుకోకుండా.
పరీక్షలు రాయకుండా ఇంటికి వచ్చిన నన్ను చూసి ఇంటా బయటా హేళనలే, ఎవరూ జాలిపడలా, పిల్లకాయలేదో తప్పు చేసి వచ్చారు అని. ఆ తర్వాత పరీక్షలు రాసి వచ్చినా, మా అన్న హైద్రాబాదులో చూపిన వుద్యోగం చేయకుండా రెండవ రోజే పారిపోయి రావటం తో వీడు దేనికీ పనికి రాడు అనే ముద్ర పడిపోయింది మా వాళ్లకు.
అది నా మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసింది. మీకు తెలుసనుకుంటా నాకిటువంటి అనుభవమే ఇంటర్మీడియట్ లో జరిగింది, రెండవ సంవత్సరం లెక్కల పరీక్ష తప్పటంతో. అక్కడో సంవత్సరం ఖాళీ మరలా ఇంజనీరింగ్ అయ్యాక ఇంకో సంవత్సరం ఖాళీ. ఈ దెబ్బతో మనకి అన్ని సంవత్సరాలు ఎగిరెగిరిపడి తీరా అసలు సమయమొచ్చాక చతికిల పడ్డ చందాన పేరు వచ్చింది. అందులోను మనల్ని మన తలితండ్రులు చూసే విధానం మనం చదువుల్లో ఎలా రాణిస్తాము అనే దాని బట్టి ఉంటుంది, దీనికి మినహాయింపు ఇవ్వ దగ్గ తలితండ్రులను వేళ్ళ మీద లెక్కించ వచ్చు. మా కుటుంబం ఇందుకు అసలుకే మినహాయింపు కాదు, మా కుటుంబ ఆర్ధిక పరిస్థుల దృష్ట్యా.
ఏమీ చేత కానీ వాడు అనే ముద్రనుండి బయట పడాలని, నేను నెల్లూరు లో ఒక ఏ.ఎం.ఐ.ఈ కి శిక్షణను ఇచ్చే సంస్థ వెనక పడ్డా, ఉద్యోగమివ్వండి నేను స్ట్రెంగ్త్ అఫ్ మెటీరియల్స్, థెర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ల వంటి సబ్జక్ట్స్ ని బాగా చెప్పగలను అని. నాకింకా గుర్తు మనకి సర్టిఫికెట్స్ కూడా రాలేదప్పటికీ, నేను నా గేట్ స్కోర్ కార్డు పట్టుకు తిరిగే వాడిని నన్ను నమ్మండి మహా ప్రభో అని.
వాళ్లేమో రేపురా లేక ఎల్లుండిరా అంటూ రెండు నెలల పుణ్యకాలం అరగ దీశారు. ఈ లోపు నేను అప్పట్లో మా నెల్లూరులో పుట్ట గొడుగులా వుండే ఇంటర్మీడియట్ కోచింగ్ సెంటర్ల చుట్టూ కూడా తిరిగా, లెక్కలు మరియు భౌతిక శాస్త్రం చెప్పగలనని. పేరు మోసిన సంస్థలు ఎలాగూ గేట్ లోపలక్కూడా రానివ్వవని తెలిసి, టెన్త్ పాస్ అయితే చాలు మీ వాడికి ఇంజనీరింగ్ గ్యారంటీ అని బోర్డు లు పెట్టి వుండే సంస్థలు లక్ష్యంగా.
సాధనా సంస్థ అని ఎక్కడో ఊరి బయట వున్న ఒక సంస్థలో అవకాశం వచ్చింది మా ఇంటి పక్కనుండే ఒక ఉపాధ్యాయుడి సిఫారసుతో, రోజుకు రెండు గంటలు చెబితే నెలకు ఐదొందలు ఇస్తామని. వెళ్లి చేరిపోయా, పిల్లలు ఇష్టపడటంతో రెండు గంటలు బదులు నాలుగు గంటలు చెప్పటం మొదలెట్టా ఫానులు కూడా లేని రేకుల షెడ్డుల్లో, ఎగుడు దిగుడు గోడలకు నల్ల రంగు వేసి బోర్డులుగా మార్చిన తరగతుల్లో. ఇంట్లో ఖాళీ అనే మాట బదులు అక్కడ అలా పడివుండటమే స్వర్గంలా అనిపించేది.
ఈ లోపల ఏ.ఎం.ఐ.ఈ శిక్షణా సంస్థ వాళ్ళు కూడా రోజుకు రెండు గంటలు చెప్పమని అవకాశం ఇచ్చారు నెలకు ఒక వెయ్యి రూప
మాది ఇంజనీరింగ్ లో 1988-1992 బ్యాచ్. మా బ్యాచ్ మొదటినుండి మిగతా బ్యాచ్ ల కన్నా విభిన్నం. మాలో మేము కలివిడిగా వుండేవాళ్ళము, ఆట పాటల్లోనూ, చదువు సంధ్యలలోను మెరుగ్గా రాణిస్తూ. మేము కాలేజీలో వున్నంత వరకు మేమే ప్రతీ సంవత్సరం ఓవరాల్ చాంపియన్షిప్ ని కైవసం చేసుకున్నది. మా అయ్యవార్లు కూడా మా బ్యాచ్ చాలా పద్ధతైన బ్యాచ్ అనే వారు మేము చివరి సంవత్సరం పరీక్షలు ఎగ్గొట్టక ముందు దాకా, ఎగ్గొట్టేసాక మీ అంత పనికి మాలిన బ్యాచ్ ని ఇంత వరకూ చూడలేదు, చూడబోము కూడా అని తేల్చేశారు.
మా సహాధ్యాయుడైన అశోక్ యెడ్లగాడు మొదటినుండి అందరికీ ఆత్మీయుడే. తన నవ్వుతో, కలివిడి తనంతో, మంచితనంతో అందరితోనూ చాలా ప్రేమపూర్వకంగా మెలిగేవాడు. మాలో చాలా మందికి వాడు సన్నిహిత మిత్రుడు. అందరిలాగే మేము కళాశాల చదువులు అయ్యాక వేళ్ళ మీద ఎంచదగ్గ వారితో తప్ప మిగతా వారితో సంబంధ బాంధవ్యాలు కోల్పోయాము. అప్పటిలో కొద్దిమందికే ల్యాండ్ లైన్ సదుపాయం ఉండెడిది, ఇప్పటిలా చరవాణులు మరియు వాట్స్ అప్ సమూహాలు లేవు.
క్రీ || శ 2000 సంవత్సరమనుకుంటా, నేను డెన్వర్లో ఉండగా, మామ! అంటూ ఫోన్ చేసాడు వాడు. నా ఫోన్ నెంబర్ ఎలా పట్టాడురా వీడు అని ఆశ్చర్యపోతూ, ఏరా! ఎక్కడున్నావు, ఏమిటి విశేషాలు అంటే, నేను గత వారమే డెన్వర్ వచ్చానురా, ఫ్రెంచ్ క్వార్టర్స్ లో వుండే మా కంపెనీ గెస్ట్ హౌస్ లో వున్నా, వచ్చి కలువు అన్నాడు. ఓరి నీ పాసు గూల, వచ్చి వారమయ్యాకరా! నువ్వు నాకు కాల్ చేసేది, వచ్చే ముందు చేయలేక పోయినా, రాగానే అన్నా చేయాలి కదరా అంటూ వాడిని కలవడానికి వెళ్ళిపోయా. సుప్రియాకి వాడిని పట్టకొస్తా మాకేమన్న ఉడకేసిపెట్టు అని చెప్పి.
వాడిని చూడగానే చాలా సంతోషం వేసింది, వాడు కూడా అలాగే వున్నాడు గల గలా మాట్లాడుతూ. వాడితో పాటే ఆ గెస్ట్ హౌస్ లో దిగిన సర్దార్జీని పరిచయం చేశాడు. కొంచెం సేపు మాటాడుకున్నాక అశోక్ గాడిని మా ఇంటికి పట్టకెళ్ళిపోయా నేను. దార్లో చెప్పాడు వాడు, ఇంజనీరింగ్ అయ్యాక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేసాడని, అటుపిమ్మట, అమెరికాలో ఉంటున్న కన్సల్టెంట్ H1 స్పాన్సర్ చేయటంతో, ఇక్కడ తేలాడు అని.
నాకు చెప్పొద్దూ! మనమేమో తెగ సూపర్ అయినట్టు ఆపైన ఇక్కడికి వచ్చి ఎదో సాధించేసినట్టు, వాడేదో చాలా అమాయకుడు, ఏమీ తెలియని వాడు అయినట్టు, ఎందుకు వచ్చాడురా నాయనా యీ .కామ్ బూమ్ అంతా ఢమాల్ అయిపోయిన కాలం లో, అదీ జావా మీద, కష్టాల్లో పడిపోతాడు అని దిగులేసిపోయింది. వాడిని తరచి తరచి అడిగా వాడి అనుభవం గురుంచి మరియు వాడి కంపెనీ గురుంచి, వాడు విసుక్కొనే దాకా నువ్వూ నీ ఎదవ అనుమానమని.
అలా వచ్చిన అశోక్ గాడు, సుప్రియాని అమ్మాయీ అని పిలుస్తూ, సుప్రియాకి మరియు పిల్లలకి చాలా దగ్గరైపోయాడు. నేను వాడిని తరచుగా కలిసే వాడిని మరియు వాడిని భోజనానికి ఇంటికి పట్టకెళ్లిపోయేవాడిని. ఒక రోజు వాడి రూమ్ కి వెళ్లిన నాకు, వాడి కొత్త రూమ్ మేట్ తలుపు తీశాడు, సర్దార్జీ లేడు రూమ్ లో, నాక్కూడా చాలా సంతోషమేసింది, వాడిక్కూడా వుద్యోగమొచ్చి వెళ్లిపోయాడేమో అని, ఎందుకంటే వాడు చాలా రోజులుగా బెంచ్ లో వున్నాడు కాబట్టి. అదే విషయం అశోక్ గాడిని అడిగా, వాడు నవ్వుతూ, హర్షాగా! వెళ్లి వాడిని ఇంకోమారు చూసి రారా అన్నాడు.
ఏందిరా సంగతి అని వెళ్లి చూద్దునుగా ఆ తలుపు తీసింది క్లీన్ షేవ్ లో వున్న మా సర్దార్జీనే. వాడికీ ఉద్యోగమొచ్చేసింది. అశోక్ గాడు తీరిగ్గా నవ్వుతూ చెప్పాడు, వాడసలు అమెరికా వచ్చింది దీనికోసమేరా, ఇప్పటి దాకా భరించాడట వాడు, ఇక వాడి వల్ల కాదని ఇలా అవతరించాడు అని. మా సర్దార్జీకి ఉద్యోగమొచ్చిన సందర్భం గా వాళ్ళ ఫ్రెంచ్ క్వార్టర్స్ కి మాత్రమే గర్వకారణమైన ఇన్డోర్ వార్మ్ వాటర్ పూల్ లో తెగ ఈత కొట్టేశాము ఆరోజు మేము ముగ్గురమూ.
అశోక్ గాడికి ప్రతిదీ ప్రశ్నయే, మన ముందు జుట్టు పెంచుకున్న మగవాడు వెళ్తుంటే, ఒరే, హర్షాగా! ఆ వెళ్ళేది అమ్మాయా లేక అబ్బాయా అనడిగే వాడు. నాకు మండి, నీది అమాయకత్వమా లేక ఇంకోటి ఏదన్నానా అని కయ్యి మనేవాడిని. సర్లేరా బాబూ! నీకంత కోపమైతే ఇలాటి ప్రశ్నలు అడగనులేరా అని చెప్పేవాడు వాడు.
ఈ మధ్య మా అనీల్గాడు ఓ వెధవ సలహా ఇచ్చేశాడు, వరస బెట్టి మన స్నేహితుల కథలు రాసెయ్యి, అవి ఓ ఇరవై అయిదు అయ్యాక మనం వాటిల్ని మన వాకాటి కథలు పేరున ఒక సంపుటిగా తీసుకొద్దాము అని.
ఇలా రాయటం మొదలు పెడితే అంతా మన స్నేహితుల గురుంచే రాయాల్సి వస్తుంది, నా రాతలతో ఎక్కడో వాళ్ళ మానాన బతుకుతున్న వాళ్ళని ఎప్పుడో జరిగిన జ్ఞాపకాలతో ఎక్కడ బాధ పెడుతానేమో అన్న భయం వ్యక్తం చేసిన నన్ను చూసి, వాడు నవ్వి, ముండా నీ అభిప్రాయాలకి వాళ్ళు అంత విలువిచ్చి తెగ బాధ పడిపోతారని నువ్వు మరీ అంతలా ఇదైపోకు, ముందు రాసెయ్యి అని వాడికలవాటైన విధంగా చెల రేగిపోయాడు.
నువ్వు ఈ కథలన్నీ నీ వైపునుండి వాళ్ళ మీద ఫిర్యాదుల పూర్వకంగా రాస్తే మేము ఇంకా సంతోషిస్తాము అన్నాడు, ఆ మాటల్ని బలపరుస్తూ మా గిరిగాడు, ఇరవై ఏళ్ల తర్వాత వాళ్ళ గతం మీద వాళ్లకు ఏమీ హక్కులుండవు అనే కావియట్ తో కథ మొదలెట్టు అని సలహా ఇచ్చి పారేశాడు.
ఆలా సంపుటిగా తీసుకొస్తే దానికి ముందు మాట మన గిరిగాడు రాయాలి, మరి మన శ్రీధరగాడు తన డబ్బులతో ప్రచురించి, ఇళ్ళుల్లు తిరిగి అమ్మాలనే షరతు మీద ముందు మన గోపీగాడితో మొదలెడుతున్నా.
కడప జిల్లా ఎర్రకుంట్లకు చెందిన కొంగని గోపీచంద్ మా వాకాటి ఇంజనీరింగ్ కళాశాలలో మా మైటీ మెకానికల్ బ్రాంచ్ లో మా సహాధ్యాయుడు, నా నాలుగు సంవత్సారాల బెంచ్ మేట్ మరియు నాలుగేళ్లు ప్రాక్టికల్స్ లో ల్యాబ్ మేట్. నాలుగేళ్లలోనూ వాడికి నాకు క్రమం తప్పకుండా నాలుగైదు మార్కులే తేడాగా ఉండేవి.
తెలుగు బాగానే మాటలాడుతాడు కానీ, మొదటి నుండి వాళ్ళ నాన్న గారి ఉద్యోగరీత్యా దేశమంతా సంచరిస్తూ తదనుగుణంగా సి.బి.ఎస్.యీ సిలబస్ లోనే చదవటం వలన, తెలుగు చదవటం, రాయటం రాదు. గూడూరులో బస్సు దిగి వాళ్ళనీ వీళ్ళనీ ఈ బస్సు వాకాటి వెళ్తుందా లేదా అని అడుగుతుంటే, ఒక ముసలవ్వ వీడికి ఏమయ్యా చూసేదానికి చదువుకున్న వాడిలాగే కనపడుతున్నావు ఆ మాత్రం ఊర్ల పేర్లు చదువటం రాదా అని క్లాస్ పీకింది అని మా గిరిగాడు వాకాడు కాలేజీలో టామ్ టామ్ చేసేసాడు. మా గిరిగాడు ఏదన్నా చెబితే మేమిక నిజనిర్ధారణ లాటి పనికిమాలిన పనులు పెట్టుకోము. నా కథల్లో చిన్న పిల్లల మొదలు పెద్ద వారి వరకూ తెలుగు చదవటం రాని పాత్ర వుంటే ఆ పాత్ర పేరు గోపి అనే ఉంటుందని మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చెయ్యండి.
వీడు, మా గిరిగాడు మరియు మేము ప్రెసిడెంటు అని ముద్దు గా పిలిచుకొనే నరేంద్ర గాడులు రూమ్ మేట్స్. వాళ్లిద్దరూ ఎలా చదివేవారో రూమ్ లో నాకు తెలియదు కానీ, వీడు మాత్రం మొదటి నుండి పద్ధతి గా చదివే వాడు, ఏ రోజు పాఠాలు ఆ రోజు. పరీక్షల రోజుల్లో కూడా ఏ మాత్రం కంగారు పడకుండా వాడి అలవాటు ప్రకారం పదిగంటలకు పడక వేసేసేవాడు ఎందుకంటే మొదట నుండి అన్నీ చదివేసుకొనే వాడు కనుక. మరీ ఇంత పద్ధతైన వాడిని నేను మొదట దూరం పెట్టేసే వాడినే కానీ, భిన్న ధృవాలు స్నేహం చేసినట్టు మా మధ్య స్నేహం అలా కుదురిపోయిందంతే మా ప్రమేయం లేకుండా.
ల్యాబ్ లో వీడు పద్ధతిగా పరిశోధనలు చేసి, పరిశోధనా విలువలు నాకు ఇస్తుంటే నేను కాల్కులేటర్ లో ఆ విలువలని ఎక్కించి ఫలితాన్ని రాబట్టి, ల్యాబ్ నుండి అందరికంటే ముందే బయటపడిపోయే వాళ్ళము. మా రోజుల్లో ల్యాబ్ నుండి ఎంత తొందరగా బయటపడితే అంత గొప్ప, ఈ సూత్రం మా మెషిన్ డ్రాయింగ్ కి వర్తించదు, ఎందుకంటే ఆ సబ్జెక్టు ఉండటం మా మెకానికల్ వాళ్ళు చేసుకున్న ఖర్మ. ఎవరో కొందరుండే వాళ్ళు మా బట్టల సత్తిగాడు లాటి వాళ్ళు డ్రాయింగ్ ని టప టప గీసేసి డ్రాయింగ్ హాల్ నుండి బయటపడిపోయేవాళ్లు.
ల్యాబ్ లో గోపీగాడు తీసే రీడింగ్స్ మీద నేను ఎంత ఆధారపడిపోయానంటే మా మూడవ సంవత్సరపు థెర్మోడైనమిక్స్ యూనివర్సిటీ ప్రాక్టికల్ పరీక్షలో, నాకసలు రీడింగ్ తీయటమే రావటంలా, నేను రీడింగ్ తీసి రిజల్ట్స్ చూపితే మరలా వైవాకి అటెండ్ అవ్వాలి. అసలే చండశాసనుడు అయిన మా నాగేశ్వర రెడ్డి
“ఈ రోజు నేను, కమల గూడూరు నుండి వాకాటికి బస్సులో ప్రయాణిస్తూ సరదాగా ఒక జూనియర్ పిల్లగాడిని ర్యాగింగ్ చేశాము”, అని ప్రకటించింది, ఒకనాటి సాయంత్రం నేను తనని కలవడానికి వెళ్లిన సందర్భంలో మా ప్రమీల .
ప్రమీల మరియు కమల నాకు ఒక సంవత్సరం జూనియర్లు. ఓహో! అని అనుకున్నా. అవి కాలేజీకి కొత్త ప్రవేశాలు జరుగుతున్న తొలి రోజులవ్వటం మూలాన, ర్యాగింగ్ చేయాలన్న అత్యుత్సాహం చాలా మందిలో అప్పుడప్పుడే ఉరకలెత్తుతూవుంది. మేము అప్పటికే నాలుగవ సంవత్సరానికి చేరుకోవటంతో మాకు ఈ ప్రక్రియ పట్ల అంత వ్యామోహం లేదు. నా ఈ ఆలోచనలని భంగపరుస్తూ, “అబ్బబ్బా! ఏమున్నాడు వాడు, ముట్టుకుంటే మాసిపోయేలా అచ్చు అమీర్ ఖాన్ కి మల్లె”, అంటూ కొనసాగించింది ప్రమీల.
పైగా వాడికి ఎంత ధైయిర్యం మాతో ఏడిపించుకొని, “మాలా డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ ఆడపిల్లలని తాను ఎక్కడా చూడలేదని, ఇలా మీ డైనమిజం అంతా అడవి కాచిన వెన్నెలలా బస్సుల్లో వృధా కాకూడదని, అలా కాకూడదంటే మీరు వచ్చి నన్ను మా తరగతి నుండి బయటకు పిలిచి మరీ ర్యాగింగ్ చేశారంటే అప్పుడు మీరు గొప్ప అని ఒప్పుకుంటాను సవాల్ విసిరాడని” చెప్పింది తను.
వీడెయ్యా! వీడెవడో మరీ గుండెలు తీసిన బంటులా వున్నాడే, చేరీ చేరక ముందే ఇన్ని వేషాలు వేస్తున్నాడంటే వీడు ఖచ్చితం గా హైదరాబాదోడే అయ్యుంటాడు అనుకుంటూ అడిగా తనని, అయితే తమరు ఆ సవాలును ప్రతిసవాలు చేయడానికే నిశ్చయించుకున్నారా అని. “అవును రేపు నేను, కమల వాడి తరగతి అయిన MH4 కి వెళ్లి వాడిని బయటకు లాగుతాము. అబ్బబ్బా! వాడున్నాడు చూడు అచ్చు అమీర్ ఖాన్ కి మల్లె”, అంటూ తన ధోరణిలోకి వెళ్ళిపోయింది. నాకు ఆ అమ్మాయి వాడిని చూసి ముచ్చట పడటం, ముద్దుగా వుండే ఓ చిన్ని కుంకను చూసి మనమెలా ముద్దు చేస్తామో అచ్చు అలాగే అనిపించింది.
“MH4 అంటే మెకానికల్ హాల్ 4 అది మా ఫైనల్ ఇయర్ మెకానికల్ వాళ్ళ తరగతి గది అంటే మా తరగతి, ఏమోలే క్లాస్ రూమ్స్ అప్పుడప్పుడు ఎక్స్చేంజి అవుతుంటాయని సర్ది చెప్పుకున్నా, నాకేదో ఎక్కడో తేడా అనిపిస్తుంది, ఎందుకంటే మా కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు మరియు వసతి గృహాలు, సీనియర్స్ వుండే ప్రదేశాలకు కాస్త దూరం లో ఉంటాయి, జూనియర్స్ ని ర్యాగింగ్ నుండి రక్షింపపడడానికి. మరి ఈ అమ్మాయేమో వాడి తరగతి MH4 అంటుంది”, లాటి ఆలోచనలు తిరుగుతున్నాయి, ఆ అమ్మాయి వాడిని వర్ణిస్తున్నంత వరకూ. అయినా మనం చాలా విషయాల్లో మాశ్రీధర్ గాడిలా ఎక్కువ బుర్ర పెట్టము కదా అందుకే ఎక్కువగా ఆలోచించ కుండా వదిలేశా, ఆ విషయాన్ని అంతటితో.
మరుసటి రోజు మా అనీల్గాడు హడావిడిగా వచ్చాడు. వచ్చీ రాగానే ఎప్పుడూ ముందు వరుసలో కూర్చొని పాఠాలు తెగ వినేసే మా శ్రీధర గాడిని మరియు నాలుగో బెంచీలో కూర్చొనే నన్నూ తెగ ప్రేమగా, ఒరే నాకు ఈరోజు మా యింటి మీద బెంగయ్యింది, నేను ఈ రోజంతా మీతోనే ఉండాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఈరోజు నా నివాస స్థలమైన ఆఖరు బెంచీకి రండిరా అని.
అబ్బా ఛా! వీడికి ఈ కళలు కూడా ఉన్నాయా అని అనుకునేలా మా హృదయాలను ద్రవింపచేసేలా బ్రతిమాలుకొని మమ్మల్ని చివర బెంచీకి బదిలీ చేయించుకున్నాడు. ఎప్పుడు వాడి పక్కన పడివుండే ప్రశాంత్ గాడినేమో మా శ్రీధర గాడు ఖాళీ చేసిన మొదటి బెంచీలో కుర్చోపెట్టాడు. నాకు ఇదంతా ఎదో తేడా అనిపిస్తున్నా, మమ్మల్ని అడిగిందెవరు మా అనీల్గాడు కాబట్టి నా సందేహాలు పక్కన పెట్టా. మా శ్రీధర గాడితో ఏమన్నా ముందే చెప్పుంటే వాడెప్పుడో ఈ చుక్కలన్నీ కలిపేసి ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో చెప్పేసేవాడు.
అది మా హెడ్డు అఫ్ ది డిపార్ట్మెంట్ మరియు ఆ సంవత్సరమే ప్రిన్సిపాల్ హోదా లభించిన మా ప్రభాకర రావు గారి క్లాస్. ఆయన ఎప్పటిలాగే ఆయన మానాన బోర్డు మీద ఓ బొమ్మని చెక్కి ఆ చెక్కటం లోని ఆయన ప్రావీణ్యానికి ఆయనే తన్మయులై, ఆ బొమ్మకే పాఠం చెప్పుకుంటున్న వేళ, ఆయనకి తపో భంగం కలిగిస్తూ, తలుపు దగ్గర
నాకు శైలేంద్ర అని ఇంజనీరింగ్ లో దొరికిన స్నేహితుడున్నాడు. వాడి ఎత్తు అయిన ఐదడుగుల ఆరంగుళాల కన్నా ఎక్కువ వుండి ఉంటే మన చలన చిత్రాలలోని కథానాయకులకేమీ తీసిపోడు. మొదటి సంవత్సరమంతా వాడికి మా వాకాటి కాలేజీని వాడికి తగ్గ కాలేజ్ కాదు అని తిట్టుకోవటంలోనే సరిపోయింది. నాకు తెలిసి వాడు మా గోపీచంద్ గాడు మా కాలేజ్ లో చేరాక కూడా మళ్ళి ఐ.ఐ.టి కి ప్రిపేర్ అయ్యారు అని నా అనుమానం.
నేనూ మా శ్రీధర గాడు, పరీక్షలకు ముందర ఒక ఓవర్ చూసి వద్దామని, వన్డే క్రికెట్ మ్యాచ్ అంతా చూసి సాయంత్రమయ్యేసరికి ఆ మర్నాడు జరగబోయే పరీక్షకు తగ్గ ప్రిపరేషన్ చాలలేదని కంగారు పడే వాళ్ళం. ఆ కంగారులో కూడా మనకి మన శైలేంద్ర గాడు తోడున్నాడులే అని ఊరట పడుతూ వాడి రూమ్ కి వెళ్లే వాళ్ళం. మేమెళ్ళేసరికి వాడు మంచిగా తల స్నానం చేసి, నీట్ గా ఒక కుర్చీలో కూర్చొని, పైన ఒక పెద్ద పాడ్ పెట్టుకొని మొదటి చాప్టర్ మొదటి పేజీలోని వుండే వాడు. హమ్మయ్య వీడు మనకన్నా ముందుకెళ్ల లేదు అనుకోని తృప్తిపడి రూమ్ కి వెళ్లే వాళ్ళము.
ఆరోజు నైట్ మా తంటాలు మేము పడి, గంట చదివి, ఓ గంట సెంటర్ దాకా వెళ్లి టీ తాగటంలో గడిపి మొత్తానికి ఓ నాలుగైదు చాఫ్టర్లు కంప్లీట్ చేసే వాళ్ళం. పరీక్షలు మధ్యాహ్నం పూట జరిగేవి కాబట్టి, ఉదయం పొట్టకి కాస్త బ్రేక్ ఫాస్ట్ పట్టిచ్చి, మరలా మా శైలేంద్రగాడు ఎక్కడున్నాడబ్బా అని వాడి రూమ్ కి వెళ్లే వాళ్ళం, మేము వెళ్లే సరికి మా వోడు తెగ ఆలోచనా నిమగ్నుడయ్యి ఆకాశం లోకి చూస్తూ ఉండేవాడు, కాకపోతే పేజీలు మొదట చాప్టర్ మధ్య వరకూ తిప్పబడి. ఏరా ఏమి చేస్తున్నావురా అంటే, ఉదాహరణకి ఈ బ్యాంకింగ్ యాంగిల్ అఫ్ ది కర్వుడ్ సర్ఫేస్ మీద దీర్ఘంగా ఆలోచిస్తున్నానురా, ఆలోచించగా ఆలోచించగా ఈ బుక్ లో రాసింది తప్పురా హర్షాగా అనేవాడు.
మా ఇద్దరికైతే బి.పి పెరిగిపోయేది. ఒరే శైలేంద్రగా నువ్వు ఈ రీసెర్చ్ అంత నువ్వు డాక్టరేట్ చేసేటప్పుడు చేద్దువురా, ఇప్పుడంతా మనం జవాబులు ముక్కున పెట్టుకొని వెళ్లి రాయాలిరా నాయనా, అని మా శ్రీధర గాడిని రూమ్ కి పంపి వాడికి నేను చదివిన అరాకొరా పరిజ్ఞానంతో ఓ నాలుగైదు ఇంపార్టెంట్ ప్రశ్నలకి జవాబులు వాడి చేత బట్టీ పట్టించి రూమ్ కి వెళ్లి, ఈ లోపల మా శ్రీధర గాడు చదివిపెట్టిన ప్రశ్నలకి జవాబులు వాడితో ఎక్స్ప్లెయిన్ చేయించుకొని, ఎదో విధంగా సిలబస్ అయ్యిందనిపించి పరీక్షకి హడావిడిగా వెళ్ళేవాళ్ళం.
పరీక్షా హాల్ కి వెళ్లే దారిలో మాకేమన్న ప్రశ్నలకి జవాబులు తట్టక పోతే మా విశ్వవిద్యాలయ ప్రథముడైన మా సుబ్బూ గాడిని బతిమాకునే వాళ్ళం, జవాబులు చెప్పరా అని. వాడు మాత్రం, అబ్బా హర్షా! శ్రీధరా మీరు టెన్షన్ పడకుండా పరీక్షా హాలుకి వెళ్ళండిరా నాయనా, అక్కడ మీకు వాటికవే గుర్తొచ్చేస్తాయి అనే వాడే కానీ ఒక్క క్లూ అంటే ఒక్క క్లూ కూడా ఇచ్చే వాడు కాదు. మా టెన్షన్ మేము పడుతూ పరీక్షా హాలుకి నడుస్తుంటే మాకు ఇంకో టెన్షన్, మా ఎలక్ట్రానిక్స్ బ్యాచ్ మేట్ అయిన స్నేహలత, వెళ్లే దార్లో పుస్తకం చదువుతూ చదువుతూ అడ్డొచ్చిన తుప్పల మీదకెళ్ళి పోయి ఎక్కడ పడిపోద్దో అనే ఆదుర్దా మాకొకటి. అసలే ఆ అమ్మాయి గెడ కర్రలా ఉండేది, తట్టుకొని కిందపడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అమ్మాయా! మమ్మల్ని చూడు ముందే అన్నీ చదివేసి ఎంత హాయి గా పరీక్షా హాలుకెళ్తున్నామో అని ఒక క్లాస్ పీకాలనే కోరిక మాకు మనసులో.
మా శైలేంద్ర గాడు నేను చెప్పిన జవాబులు ముక్కున పట్టి సుద్ధంగా పరీక్షల్లో రాసొస్తే నేను తప్పులు చేసొచ్చేవాడిని. మనకసలే పరీక్షా హాల్లో తింగరి డౌట్స్ వచ్చి జవాబులు చెడకొట్టి వచ్చే వాడిని. మా శైలేంద్ర గాడు ఇప్పటిక్కూడా వాడి ఇంజనీరింగ్ మార్కుల్లో నాలుగో వంతు వాటా హర్షా గాడితే అని ప్రకటిస్తాడు, నాకు అమిత సంతోషం కలిగేలా. ఒకసారి కలిసినప్పుడు చెప్పేడు మా శైలేంద్రగాడు, ఒరే! నాకు ఎక్సెలారై లో ఎం.బి.ఏ లో ప్రవేశం వచ్చిందిరా, కానీ నేను చేరలేదురా అని. అదేందిరా శైలేంద్ర అంటే, అడ్మిషన్ కార్డుని మా పోస్ట్ మాన్ ఆరు నెలల తర్వాత తెచ్చిచ్చాడురా అని చెప్పాడు. ఒరే నాతో చెప్పావు కానీ ఎవరితో చెప్పుకోకురా అని చెప్పా నేను
నేను నా కథలతో మా ఇంట్లో కనిపించిన పుస్తకాన్నంతా నలుపు చేసేస్తున్నానని, ఈ రోజు మా అమ్మ నాకో మందపాటి పాత డైరీ ఇచ్చి, దీంతో రాసుకో, రాసుకొని ఎక్కడంటే అక్కడ పారేసుకోకుండా జాగ్రత్త పెట్టుకో అని చెప్పింది. ఆ పాత డైరీ తీసుకోగానే, ఏదైనా ఓ పాత మధురంతో వెంటనే నలుపు చేసెయ్యాలన్న కోరిక నన్నావహించింది. ఎవరి గురుంచి రాయాలబ్బా అని ఆలోచిస్తుంటే మా సత్యగాడు గుర్తొచ్చాడు.
ఇప్పగుంట వెంకట సత్యనారాయణ, మా స్నేహితులకందరికీ ఐ.వి.ఎస్ గా సుపరిచితుడు, కానీ నాకు మాత్రం సత్య గానే, మా ఇంట్లో వాళ్లకు సత్యంగా. జీవితం లో కష్టాలు పడి పైకి వచ్చిన వాళ్ళని మనం కథలలో చదువుతూ లేక సినిమాలలో చూస్తూ లేక నిజ జీవితం లో ఎవరి ద్వారా అయినా వింటూ చాలా ఉత్తేజితుల మవుతాము, కానీ అలాటి ఒక వ్యక్తి మన సమకాలీనికుడు అయినప్పుడు మన జీవనక్రమంలో పడి తన ఎదుగుదలని మనము పెద్దగా గమనించలేము. అలా మా సమకాలీనుకులలో జీవనక్రమాన్ని మొదలుపెట్టిన స్థితితో పోలిస్తే ప్రస్తుత స్థితి ఎంతో అందలేనంత ఎత్తులో నిలుపుకున్న వ్యక్తే మా సత్య. కానీ ఈ క్రమంలో వాడేమి బావుకున్నాడో లేక ఏమి కోల్పోయేడో వాడికే తెలియాలి.
మనిషి ఐదడుగుల ఆరంగుళాల ఎత్తుతో, చక్కటి వర్ఛస్సుతో, అప్పటికే ఎన్నో ఆటుపోటులను చవిచూసిన కారణంతోనో లేక బాల నెరుపు వల్లనో అక్కడక్కడా తెలుపు లేక ఎరుపు కానీ జుట్టు ఉండేవాడు సత్య. తన చురుకుతనంతో, తెలివితేటలతో, మహా కలివిడి తనంతో మరియు సహజ సిద్ధంగా అలవడిన వేణుగానంతో వాడు మా కాలేజీ చేరిన కొద్ది దినాల్లోనే బాగా పాపులర్ అయిపోయాడు. నాకు, శ్రీధర గాడికి వాడు ఎప్పుడు స్నేహితుడైపోయాడో కూడా తెలియనే లేదసలు. తెలిసే సరికి వాడు కూడా శ్రీధర గాడిలాగే మా కుటుంబ సభ్యుడైపోయాడు, వాళ్ళని నే పిలిచే వరసలతోనే పిలిచేస్తూ. రోజుల తరబడి తినకపోయినా, నిద్రపోకపోయినా, అలుపెరగని దేహం, చెక్కు చెదరని నవ్వు వాడి సొంతం. కాలేజీ లో పగలంతా లేక చాలా పొద్దుపోయిన దాకా అందరి రూములూ కలియ తిరుగుతూ, సందడి సందడి చేస్తూ, అందరూ పడుకున్నాక, తెలవారు ఝాము వరకూ చదువుకోవటం వాడి అలవాటు.
నెల్లూరు జిల్లాలోని కావలి వాడి స్వస్థలం. పుట్టింది పేద బ్రాహ్మణ కుటుంబములో. చదువుకున్నది కావలి బ్రాహ్మణ సంఘము వారి సహకారంతో మరియు వారాలు చేసుకుంటూ. వాడు పదవ తరగతి ఉత్తీర్ణుడయ్యాక, ఆ సంఘము వారు వాడి బతుకేదో బతికేస్తాడని వాడిని ఓ టైపు ఇన్స్టిట్యూట్లో చేర్చారట, అక్కడ ఆ ఇన్స్టిట్యూట్ యజమాని వీడి తెలివితేటలు చూసి పైచదువులు చదువుకోమని ప్రోత్సహించాడట. అలా ఎంసెట్ రాసి ఆయన సహకారంతో వీడు మా కాలేజీలో పడ్డాడు. అలాగే వీడు వీడి చదువులతో ఎప్పుడు ఆయన్ని నిరాశ పరచ లేదు.
మేము మా రెండవ సంవత్సరంలో ఉండగా వాళ్ళ నాన్నగారు పోయారు. వీడు మాకెవరికీ చెప్పకుండా కావలికి వెళ్ళిపోయాడు. మేము ఒక పదిమంది స్నేహితులం తెలుసుకొని కావలికి చేరే సరికి అర్థరాత్రి అయిపొయింది. మాకు వాడి ఇల్లు ఎక్కడో కూడా తెలియదు. నాకు ఓ చిన్న జ్ఞాపకం, ఎక్కడో జనతా పేటలో వాళ్ళ ఇల్లు అని. మా దురదృష్ట వశాత్తు మేము దిగిన రోజే కావలిలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళ రాష్ట్ర మహా సభలు జరుగుతున్నాయి. మేము బస్సు దిగి నాలుగు అడుగులు వేసేమో లేదో, ఒక పోలీసు జీప్ వచ్చి మమ్మలన్దరినీ కట్టగట్టి పోలీస్ స్టేషన్లో పడేసింది. మేము ఇలా స్నేహితుడి నాన్నగారు చనిపోతే వచ్చాము అన్నా నమ్మే నాథుడే లేదు, మాలో కనీసం ఒక్కడి దగ్గర కూడా కాలేజ్ ఐడెంటిటీ కార్డు లేదు. మాతో పాటే జీపులో ఎక్కించుకొచ్చిన ఒక దొంగని మా కళ్ళ ముందరే సెల్ లో నాలుకు పీకుతుంటే బిక్కు బిక్కుమని గడిపాము.
మా అదృష్టవశాత్హు ఆ దొంగని బాదిన ఒక కానిస్టేబుల్ మా సత్యకి ఇంటర్లో సహాధ్యాయుడు అవటంతో, ఇన్స్పెక్టర్ కి చెప్పి సత్య వాళ్ళింటికెళ్లి వచ్చి మేము చెప్పింది నిజమే అని నిర్ధారణ చేయటంతో, ఆ కానిస్టేబుల్ సహాయంతోనే మేము సత్య వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. వాళ్ళ ఇంటికెళ్లాకే మాకు తెలిసింది, సత్యాకి ఒక అక్క ఉందని, ఆ అక్క అప్పటికే ఒక ముస్లింని పెళ్లిచేసుకొని ఇంటినుండి వెళ్ళిపోవటంతో వీడు తనతో సంబంధ బాంధవ్యాలు తెంచేసుకున్నాడని. మేము ఉన్నంత వరకు వాళ్ళ బావ గ
నేను ఇంతవరకూ రాసిన కథల పాత్రల జీవితంలో ఎదో ఒక సంఘర్షణ ఉండేది. అలా సంఘర్షణ వున్న పాత్రల గురుంచి రాస్తేనే ఓ మంచి కథ అవుతుంది అని నమ్మేవాడిని. కానీ ఆర్ధిక పరమైన కొన్ని సంఘర్షణలు తప్ప వ్యక్తిగతమైన సంఘర్షణలు లేకుండా జీవితాన్ని గడిపి, ప్రేమలను మాత్రమే పంచిన మన పెద్దమ్మలు, పెద్ద నాన్నలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, మామలు, అత్తలు మొదలగు వారి గురించి కూడా రాయాలి. వీళ్లంతా మనమెక్కడో వెతుక్కోవాల్సిన పనిలేకుండా మనపక్కనే వుంటూ వాళ్ళ జీవితాల్ని ఎంతో కొంత మనకు ధారపోసిన నాయకులూ లేక నాయికలు. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇందరి సహాయ సహకారాలు, ప్రేమానురాగాల వల్లనే మనం పెద్దవారి మయ్యామన్న స్పృహ కలుగుతుంది. ఇక నేను ఇటువంటి కథలకు విక్రమాదిత్యుడు-బేతాళుడుల కథలకు మల్లె పైన రాసిన వాక్యాలు పరిచయ వాక్యాలుగా వస్తాయి.
మా మేనత్తని తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసింది మా నాయనమ్మ. మరలా మా మేనత్త తన కూతురిని తన తమ్ముడు అంటే మా చిన్నాన్న కిచ్చి పెళ్లి చేసింది. అలా మా పిన్నమ్మ మరియు చిన్నాన్నల పెళ్లి రెండవ తరపు మేనరికం. మా పిన్నితో మాకు చాలా మంచి అనుబంధం వుంది. ఆవిడ పని చేయటం లో మహా చురుకు, మాటల్లో మాత్రం మహా నిదానం. మా అమ్మ ముక్కీ మూలిగి ఇంటి వెనక ఉండే చిన్న లోగిలి ఊడ్చే లోపలే మా పిన్ని ముందున్న చాలా పెద్దదైన లోగిలి అంతా చిమ్మేసి, కళ్ళాపి చల్లేసి, ముగ్గులు కూడా పెట్టేసి వచ్చేసేది. మాతో రక రకాల ఆటలు ఆడటం అంటే తనకి చాలా ఇష్టం. చిన్నా చేయి చాపు తాయిలం పెడతా అని, అని నేను చేయి చాపగానే, బతికున్న కప్పనే చేతిలో పెట్టి పారిపోయేది, మా కేకలకు ఎక్కడ మా అమ్మ వచ్చి చీవాట్లు పెడుతుందో అని. అలాగే రబ్బరు బల్లిని అందరూ నడిచే చోట గోడలకి అంటించి అది వాళ్ళు నడిచేటప్పుడు సరిగ్గా వాళ్ళ నెత్తిన పడేలా చేయటం వాళ్ళు భయంతోనో అసహ్యం తోనో కేకలు పెడుతూ దులుపుకుంటుంటే పక పక లాడటం, వాళ్ల మీద బొద్దింకలేయటం లాటి ఆటలతో మా ఇల్లు సందడే సందడి. తాను మమ్మల్ని భయపెట్టడానికి తన కను రెప్పల్ని వెనక్కి ముడుచుకొని, గాలి నోటితో లోపలి పీల్చుకుంటూ బొంగురు గొంతుతో భయపెడితే నాకు దడుపుతో ఆ రాతిరికి జ్వరం కాసేది.
దానికి తోడు మా చిన్నాన్న కూడా చాలా సరదా మనిషే. మా ముందు గోళీలను మాయం చేసి మా చెవుల్లోంచి, ముక్కుల్లోంచి తీయటం, మనసులో ఓ అంకెను అనుకొని, దాన్ని రెండుతో పెంచి, ఓ పది కలిపి లాటి కంగాళీ లెక్కలు చేసి మనసులో మేము అనుకున్న అంకెను ఆయన చెప్పటం లాటి సరదా లెక్కలు చేయించటం, మమ్మల్నివీపు మీద ఎక్కించు కొని బావిలో ఈదటం, మా వూరిలో వేసే నాటకాల్లో ఎప్పుడు పంతులు వేషం వేసినా మా చిన్నాన్నే వేశాడు అని మేము ఎప్పటికీ గుర్తుపట్టలేనట్టు మమ్మల్ని మాయ చేయటం, నేను ఒకటి రెండు మూడు అనే లోపల మీరు మంచం దిగుతారు అని పందెం కట్టి మేము పందేనికి ఒప్పుకోగానే, మూడు అని ఎప్పటికీ అనకుండా మమ్మల్ని విసిగించి మేమే దిగేలా చేయటం లాటి పనులతో మా చిన్నాన్న అంటే మేము ప్రాణం ఇచ్చేలా చేసుకున్నాడు ఆయన. అసలు ఆయన మమ్మల్ని ఎప్పుడు సందడిగా, ఉత్సాహం గా ఉంచడానికి చాలా చిట్కాలు, పాటలు మరియు పద్యాలు నేర్చుకున్నాడు అని అనుకుంటే ఆ ఇష్టం ఇంకా ఎక్కువయ్యేది.
ఆయన బావిలో మమ్మల్ని వీపునెక్కించుకొని ఈతలు కొట్టే ఆటలకి మా అమ్మ తన అనుమతి ఇచ్చేస్తే మా పిన్ని మాత్రం తన కొడుకుని సంకనేసుకొని తోటలోంచి ఇంటికి పరిగెత్తేసేది వాడిని ఆయనకు దొరకనీయకుండా. వాడు రెండు తరాల మేనరికాల వలన పుట్టటమే కొంచెం బలహీనప్రాణి. వాడంటే మా ఇంటిల్లిపాదికీ గారాభమే. వాడికైతే స్నానం చేయించడం, అన్నం పెట్టడం, కథలు చెప్పడం లాటి అన్నీ పనులకి వాళ్ళ పెద్దమ్మ అంటే మా అమ్మే ఉండాలి. వాడు ఒకరోజు అత్యుత్సాహం తో నన్ను మా దొడ్లో వుండే నీళ్ల తొట్టిలో దించమన్నాడు, నేను ఉత్సాహం గా దించేసా, దిగాక వాడు నాకలివి గాలా, ఎంతకూ రాడు బయటకి, నేను వాడిని నా చేతులతో మునిగిపోకుండా అలాగే పట్టుకొని కేకలు వేస్తూనే వున్నా, ఎప్పటికో మా అమ్మా పిన్ని వాళ్ళు విని పరిగెత్తుకొచ్చారు, ఆ రోజు మా పిన్ని భయపడి ఏడ్చిన విధానం, ఇంక నేను వాడితో ఎప్పటికీ అలాటి ప్రయోగాలు చేయకుండా చేసింది. అలాగే వాడేమన్నా తులిపి పనులు చేసి ఆమె చేతిలో తన్నులు తిని, వాడు ఏడవటం, వాడితో పాటూ ఆమె ఏడవటం, అందరూ తిరిగి ఆమెని తిట్టేవరకు జరిగేది, అంతలా ఏడ్చేదానివి వాడిని కొట్టటం ఎందుకు మొద
నేను ఇంతవరకూ రాసిన కథల పాత్రల జీవితం లో ఎదో ఒక సంఘర్షణ ఉండేది. అలా సంఘర్షణ వున్న పాత్రల గురుంచి రాస్తేనే ఓ మంచి కథ అవుతుంది అని నమ్మేవాడిని. కానీ ఆర్ధిక పరమైన కొన్ని సంఘర్షణలు తప్ప వ్యక్తిగతమైన సంఘర్షణలు లేకుండా జీవితాన్ని గడిపి, ప్రేమలను మాత్రమే పంచిన మన పెద్దమ్మలు, పెద్ద నాన్నలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, మామలు, అత్తలు మొదలగు వారి గురించి కూడా రాయాలి. వీళ్లంతా మనమెక్కడో వెతుక్కోవాల్సిన పనిలేకుండా మనపక్కనే వుంటూ వాళ్ళ జీవితాల్ని ఎంతో కొంత మనకు ధారపోసిన నాయకులూ లేక నాయికలు. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇందరి సహాయ సహకారాలు, ప్రేమానురాగాల వల్లనే మనం పెద్దవారి మయ్యామన్న స్పృహ కలుగుతుంది.
ఈ మధ్య మా అమ్మతో మాట్లాడుతుంటే, తన చిన్ననాటి స్నేహితురాలైన ఈదల పద్దమ్మ గారి గురుంచి చెప్తూ, తన చిన్నతనంలో తనంతటి వయస్సు వుండే ఆవిడ చాలా పెద్దదైన వాళ్ళ పెరడు అంతా ఊడ్చి, కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టి, ఆ తర్వాత అంట్లు అన్నీ తోమేస్తే మా అమ్మ తనకి సహాయం చేసేది అంట్లు కడగటంలో. మా అమ్మనడిగా నేను, మరి మీ ఇంట్లో ఈ పనంతా ఎవరు చేసేవారు అని. మా చిన్నక్క ఐన సరోజినక్క అని చెప్పింది. చెప్తూ మన పనంతా గోసంగిలా ఊరంతా స్నేహితురాళ్ళతో తిరగటమే, అంత మా అక్కే చూసుకొనేది అని సెలవిచ్చింది. ఈ ఒక్క వాక్యం చాలు మా చిన్న పెద్దమ్మ ఎంత కష్ట జీవో, మరియు తన చెల్లెలైన మా అమ్మ కూడా పని చేయాలి కదా అని వంతుల కోసం ఎదురు చూడకుండా తన పని తాను ఎలా చేసుకొని పోయేదో చెప్పడానికి.
మా సరోజన పెద్దమ్మ మరియు మా శేష పెదనాన్నలకి నలుగురు సంతానం. ముగ్గురాడపిల్లలు మరియు ఒక మగ నలుసు. మా పెదనాన్నకి అందర్నీ ప్రేమించటం, వ్యవసాయప్పనులు చూసుకోవటం తప్ప ఏమీ తెలియదు మా పెద్దమ్మే అన్నీ చక్కబెట్టుకోవాలి. వాళ్లిద్దరు వాళ్ళ నలుగురు పిల్లలతో పాటు మాకు, అంటే మా అన్నకి, అక్కకి మరియు నాకు, సమానంగా ప్రేమని పంచారు, ఇంకా ఒక పాళ్ళు ఎక్కువే, మేము చిన్న పిల్లలమవటంతో. మా పెదనాన్న వాళ్ళ నాన్నగారు మా అమ్మమ్మ వాళ్లకి బంధువులు మరియు వాళ్ళకి మొదటినుండి ఉప్పలపాటిలో పొలాలు ఉండటం తో మా పెద్దనాన్న ఉప్పలపాటికే వచ్చేశారు. అలా మా సొంత అక్క ఉప్పలపాటిలో మా పెద్దమ్మ పెద్ద నాన్నల దగ్గరే పెరిగేసింది. మా నాన్నమ్మ వాళ్ళ వూరైన ఉలవపాళ్లలో మా నాన్నకసలు ముగ్గురు పిల్లలని తెలీనే తెలియదు. మా అక్క మా ఉలవపాళ్ళకి అప్పుడప్పుడు వచ్చి పోయే ఇందిరమ్మ. ఎందుకో తెలియదు మా ఉలవపాళ్ళ జనాలు మా అక్క పేరు సుమతి అయినా, ఇందిరమ్మ, లేక ఇందిరా గాంధీ అనే పిలిచే వాళ్ళు.
అలాగే నేను ఉప్పలపాటి వచ్చి ఎక్కడికైనా వెళ్లాలంటే మా పెదనాన్న భుజాలమీద ఎక్కి వెళ్లాల్సిందే, నాకు బాగా లేనప్పుడు ఎత్తుకెళ్ళి చీటీలు కట్టించటం, లేక కామెర్లకి పక్కూరికి తీసుకెళ్లి మందు పెట్టించటం, అంత ఎందుకు మా ఊరి పొలాల వెనక పారే వాగులో దొరికే అతి రుచికరమైన అర్జులు అనబడే చేపలు తెచ్చుకోవాలన్న నేను మా పెదనాన్న భుజం ఎక్కాల్సిందే. ఆయనకి ప్రేమ ఎక్కువైతే నా బుగ్గలు కొరికేసేవారు. అదొక్కటే నేను ఆయన మీద చేయగలిగిన ఫిర్యాదు. ఆఖరకు మేము ట్యూషన్లో లేట్ అయినా లాంటర్న్ ఎత్తుకొని వచ్చేవాడు మా పెదనాన్న నన్ను మా అక్కనీ ఇంటికి తీసుకెళ్లడానికి. నాకు తెలీదు అంత ప్రేమ ఆయన ఎలా పంచగలిగాడో అని.
మా పెద్దమ్మైతే పొలం పనుల అజమాయిషీలో పడి అలిసి సొలిసి వచ్చినా దాలి గుంత వేసి కాగు నిండా నీళ్లు కాచి ఆ వేడినీళ్ళతో మాకు స్నానాలు చేయించేది. నేను పెద్ద వాడినయ్యా నేనే చేస్తా అని హఠం వేసే వాడిని అప్పుడప్పుడు. ఆమె ఎప్పుడన్నా నెల్లూరు వెళ్తుంటే పనుల మీద కాళ్లకడ్డం పడి ఆమె వెంట వెళ్లే వాడిని. నెల్లూరులో ఆమె ఎన్ని పనులున్నా ఓపికగా నడిచే వెళ్లే వారు, నేను కొంచెం నడిచి రిక్షా ఎక్కుదామని మారాం చేసే వాడిని. ఎన్నిటికని ఎక్కగలం, ఆమె అలాగే నన్ను బతిమాలుతూ నడిపిస్తూ, నడిస్తే షోడాకొని పెడతానని చెబుతూ, తనకి ఓపిక వున్న వరకూ నన్ను మోస్తూ పనులు చక్క బెట్టుకొనేది.
ఇక మా పెద్దక్క సి. గాన పెసూనాంబ అయితే మా పిల్లకాయల్ని మాయ చేసి అన్నాలు పెట్టటంలో మహా నేర్పరి. అప్పట్లో మాకు ఇన్ని రకాల కూరగాయలు లభ్యం అయ్యేవి కావు. మహా అయితే పల్లెల్లోనే పండిన సొరకాయో, పొట్లకాయో, పందిరి చిక్కుడ్లో, లేక పో
నేను కథలు రాయాలనుకున్నప్పుడు, మొదట స్నేహితుల గురుంచి రాద్దామనుకున్నాను. కానీ ఇలా రాయటం లో తెలియని ప్రమాదముంది. మొదట యీ రాయటం సరదాగా మొదలయినా, పోను పోను అవి నా అభిప్రాయ వ్యక్తీకరణ సాధనాలుగా మారుతాయేమో అన్నది నా భయం. అప్పటికీ నేను నా స్నేహితులతో వాదించవచ్చు ఈ కథ నేను నా కోణంలోనుంచి మాత్రమే రాస్తున్నాను అని. అలా వాదించటం నన్ను నేను మోసం చేసుకున్నట్టే అవుతుందేమో. కాబట్టి నాకు తెలిసినంత వరకూ తటస్థం గానే రాస్తాను. మా శ్రీధర గాడు మాత్రం దీనికి మినహాయింపని మీకిది వరకే బోధపడిందను కుంటా. వాడో మంచి స్నేహితుడు మరి. ఈ కథ నా ఇంకో స్నేహితుడు సుబ్రహ్మణ్యం గురుంచి.
నేను, సుబ్రహ్మణ్యం మరియు చంద్రశేఖర్ మా వాకాటి కాలేజీ వుండే విద్యానగర్ అనే పల్లెకి ఎక్కువ, పంచాయితీకి తక్కువ లాటి ఊర్లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరపు కాలంలో రూమ్ మేట్స్ మి. ఆ వూర్లో పేరుమోసిన ఆర్ట్స్ కాలేజీ మరియు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటంతో రూమ్స్ కి డిమాండ్ ఎక్కువే. ఆ ఊరి మోడల్ హై స్కూల్ లో పని చేసే గరటయ్య అనే లెక్కల మాస్టారు, కోటలో పని చేసే మా బావకి స్నేహితుడు కావటం మూలాన, మా బావ కోరికతో, ఆ మాస్టారు మాకు రూమ్ అని ఏకోశానా గుర్తింప మనస్కరించని ఓ సగం కూలి వంగిపోయిన కప్పుగల ఒక పూరి గుడిసె చూపించి పుణ్యం మూటకట్టుకున్నారు. మరి మేము ముగ్గురము ఎలా రూమ్ మేట్స్ మి అయ్యామంటే, చంద్రశేఖర్ గరటయ్య మాస్టారి ప్రియ శిష్యుడు మరియు మా సుబ్రహ్మణ్యం యొక్క చెడ్డీ మిత్రుడు, నన్ను గరటయ్య మాస్టారు వీళ్ళతో కలిపాడు. మా చంద్రశేఖరుడు ఇంజనీరింగ్ విద్యార్థి కాదు, ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి. మేము ఆ గుడెసెనే దేవాలయంగా ఆ ఓనరమ్మనే దేవత గా కొలిచాము. మరలా అప్పుడప్పుడూ ఆవిడ రూమ్ ని నీట్ గా పెట్టామా లేదా అని ఇన్స్పెక్షన్ కి వచ్చేది. ఆవిడకి మా సుబ్బూ మాట అంటే తెగ గురి, చదుకొని బాగుపడే లక్షణాలు ఉన్నాయని.
కానీ మా సుబ్రమణ్యాన్ని చూసాక అసలు ఒక వ్యక్తి ఇంతలా చదువుతాడా అన్న ప్రశ్నకి సమాధానం ఇప్పటికీ దొరకలా. స్వయం పాకం చేసుకునేవాడు. ఉదయం లేచి స్టవ్ మీద అన్నం పెట్టి, అది అయ్యేలోపల చదువుతూ, చదివినది పలక మీద పర పరా రాస్తూ మొదలెట్టి, మరలా కాలేజీ నుండి వచ్చాక అన్నీ సబ్జెక్టులు, అన్నీ టెక్స్ట్ బుక్కులు, ఆ బుక్కుల్లో అన్నీ పేజీలు చదివేసే వాడు, చదివింది మరలా యధావిధిగా పలక మీద పర పరా రాసేసేవాడు. మా గుడిసెలో ఒకే బల్బ్ హోల్డర్ వుండేది కాబట్టి మా చదువులన్నీ ఒక దగ్గరే. చాలా శ్రద్దగా చదివే సుబ్రహ్మణ్యం అవతలి వాడు చీమని చిటుక్కుమనిపించినా చిరాకు పడిపోయేవాడు. నాకది చాలా వింతగా వుండేది మరియు వాడిని ఇరిటేట్ చేయడానికి సాధనంగానూ కూడా. నేను కూడా అప్పుడప్పుడు కొంచెం పెద్దగా చదువుతూ వాడిని గీరే వాడిని తగువుకి.
సుబ్రహ్మణ్యం నాయుడుపేట మండలంలో ఓజిలి దగ్గరైన అన్నమేడు గ్రామస్థుడు. మొదటి నుండీ అన్నీ తరగతుల్లో ప్రధముడే. వాళ్ళ నాన్నగారు వాడికి ఊహ రాక ముందే గతించడంతో, తన ఇద్దరి పిల్లల్ని వాళ్ళ అమ్మగారు తన రెక్కల కష్టంతో చదివించుకుంటున్నారు. వీడు మూడు వారాలకో లేక నెలకొకసారో సైకిల్ మీదనే వాళ్ళ ఊరెళ్ళి తనకి కావాల్సిన సామగ్రి తెచ్చుకొనే వాడు. వాడి ధ్యాస అంతా చదువే. నాకు మొదటి నుండీ ప్రశ్న-అర్ధకమే, వీడు మా వాకాటి కాలేజీలో ఎలా పడ్డాడురా నాయన శాపవశాత్తూ, ఎక్కడో ఐ.ఐ.టి లో ఉండాల్సినోడు అని. అలా చదవటమే తిండీ నిద్రలాగా భావించే మా సుబ్రహ్మణ్యం మొదటి సంవత్సరంలో మా కాలేజీకి ప్రధముడిగా నిలిచాడు. మా కాలేజీ మా యూనివర్సిటీలో చదువుల్లో మేటి కాబట్టి, మా యూనివర్సిటీకి ప్రథముడు వాడు. మాకూ ఎదో గుర్తింపు యూనివర్సిటీ ప్రధముడి రూమ్ మేట్ గా. కొందరు చదువుల ఔత్సాహికులు వాడితో పాటూ నాతో మాట మంతీ కలిపేవారు, మా సుబ్రహ్మణ్యం రాంక్ యొక్క రహస్యం చెప్పమని. అక్కడ రహస్యమేమీ కనపడలా నాకు అస్సలు సాధ్యం కానీ కఠోర శ్రమ తప్ప.
సుబ్బూ చదువు చూసి ఉత్తేజితుడైన మా చంద్రశేఖరుడు కూడా నా మడత కూడా పడని మరియు కొత్త కరుకులా మిగిలిపోయిన ఇంజనీరింగ్ మెటీరియల్ నాచేతనే తెప్పించుకొని, మా చేత సందేహాలు నివృత్తి చేసుకుంటూ ఎంసెట్ లో రాంక్ తెచ్చుకొని తదుపరి సంవత్సరం ఇంజినీరింగ్ లో చేరటం మాకు మిగిలిన గొప్ప అనుభూతి. కానీ ఇలా చదివే సుబ్బుని నేను రెండవ సంవత్సరంలో భరించలేక మా శ్రీధరగాడితో కల