
Sign up to save your podcasts
Or


నేను ఇంతకుముందే చెప్పా, నావి ఎలాటి వానాకాలం చదువులో, ఇంటర్మీడియట్ ఎలా చావుతప్పి కన్ను లొట్ట పోయిన చందంగా గట్టెక్కానో, ఎంసెట్ లో ఎలా ఓ పెద్ద రాంక్ సాధించుకొని వాకాడు ఇంజనీరింగ్ కాలేజీలో పడ్డానో. ఈ పరిచయ వాక్యాలు చదవగానే మా గిరిగాడు యధావిధిగా విరుచుకు పడతాడు, నీ దొక బయోగ్రఫీ, అది ఇంతకు ముందు అందరూ చదివేసి ఉంటారన్న నీ ఎదవ అభిప్రాయమూ అని. వాడలాగే అంటూ ఉంటాడు, నేనిలాగే రాసి పారేస్తుంటా. ఇక్కడో రహస్యముంది, అబ్బా! నా పేరు వీడు కథలో వాడేసాడు అనే తృప్తితో వాడు ఈ కథని తక్కువ విమర్శిస్తాడు అన్నది నా ఎదవ అభిప్రాయము. కానీ ఈ కథ చదివి వాడు, చాలా భయం భయం గా రాసినట్టున్నావురా అనెక్కడ అనేస్తాడో నని నా భయం.
అవి నేను ఇంజనీరింగ్ చేరిన తొలి రోజులు. మా అనీల్గాడు మరియు నేను ఈ నాలుగు సంవత్సరాలు మాతో గడపబోయే మాబోటి దుర్లక్షణాలు మరియు మా తరంగ దైర్గ్యములు జత కలిసే మిత్రుల కోసం వెతుక్కుంటున్నాము. ముందే చెప్పాను కదా, మా వోడు హాస్టల్ మీద నేను ఊరి మీద పడ్డామని. మా వోడు అప్పటికే మావ!, నాకు ప్రశాంత్, భార్గవ్, జగ్గు, కోట మొదలగు వారు తెగ నచ్చేశారు అని అప్పటికే ప్రకటించేశాడు, నేను వెనకబడిపోయా మా వాడితో పోల్చుకుంటే. నాకూ అప్పటికే ఓ రూమ్ మేట్ దొరికాడు సుబ్రహ్మణ్యం అని, కానీ వాడు నాకు ఈ రెండు మూడు వారాల్లోనే అస్సలకి మనిషి అన్నవాడు ఇంతలా చదువుతాడా అనే సందేహం కలిగించేశాడు. వాడి చదువు తీరు మరియు వాడి క్రమశిక్షణా నాకు కడు దుర్లభంగా వున్నాయి. నాకు మిత్రుడయ్యే లక్షణాలు వాడిలో అస్సలకి లేవు అని అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసా.
ఆ రోజు మేము మొదటి సారిగా మెకానికల్ వర్క్ షాప్ కి వెళ్ళాము. మమ్మల్ని మూడు బ్యాచ్ లుగా విభజించారు. బ్లాక్ స్మితి, టిన్ స్మీతి మరియు వుడ్ కార్పెంటరీ బ్యాచ్ లుగా. ఇదేందిరా నాయనా నాలుగేళ్ళయ్యాక యీ పనులే చేసుకుంటా బతకాలా అని చతురోక్తులు వేసుకుంటూ ఎవరి స్థానాలకు వాళ్ళం వెళ్ళాము. నాది బ్లాక్ స్మితీ బ్యాచ్. నాతో వచ్చిన పక్కనున్న పిల్లగాడు కొంచెం పల్లెటూరు నుండి వచ్చిన వాడై కనపడటంతో మనకలవాటైన పట్టణపు అతి తెలివితో, నువ్వు కింద కుప్పలా పడున్న బొగ్గుల్ని ఎత్తుకొని కొలిమిలో వేస్తూ వుండు, నేను ఈ పొడవాటి టాంగ్స్ తో వర్క్ పీస్ ని కాలుస్తూ ఉంటా అని చెప్పా. ఆ పిల్లగాడు నన్ను పైనుండి కిందవరకూ ఓ మారు చూసి, పోరా! అదేదో నువ్వే ఆ బొగ్గులేరుకో, నీ చేతులే మసి జేసుకో అని గదమాయించాడు.
అప్పుడు ఇంకా గమనించా వాడిని, మనిషి మహా చురుగ్గా వున్నాడు, ముందు రెండు పళ్ళు చివర్ల విరగ్గొట్టుకొని వున్నాడు, మహా తులిపి తనానికి నిదర్శనంగా, నాకర్థమైయింది వీడు ఒకడికి చెప్పే వాడే కానీ వేరే వాడు చెప్తే వినేరకం కాడని, వెంటనే బుద్ధిగా వాడు చెప్పినట్టే చేశా. అలా నన్ను మొదటి రోజే ఏరా, పోరా అని, వాడి పెత్తనం కిందకు తెచ్చేసుకొని నన్ను ఇప్పటికీ ఆడేసుకొనే వాడే మా శ్రీధరగాడు.
ర్యాగింగ్ టైం లోనే మహాధైర్యంగా తిరిగేవాడు, ఎందుకంటే వాడు లోకల్. కాలేజీ కి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళ వూరు. వారంలోపలే మనం వాళ్ళ ఊరిని సందర్శించటం, వాళ్ళ కుటుంబ సభ్తులను మరియు బంధువులను వాడు ఏ-ఏ వరుసలతో పిలుస్తాడో మనమూ అలానే పిలిచెయ్యటం, అలాగే వాడు మా నెల్లూరుని సందర్శించటం, నేను మా వాళ్ళను ఏ వరుసలతో పిలుస్తానో వాడూ పిలిచెయ్యటం లాటి చర్యలతో మా స్నేహం బర్తృహరి చెప్పినట్టు సజ్జనుల స్నేహం ఉదయపు ఎండలా ఎలా పెరిగిపోతుందో అలా పెరిగి పోయింది.
మొదటి సంవత్సరం వాడు వాళ్ళ వూరునుండి ఒక బుడ్డ బులుగు సైకిల్ లో వచ్చేవాడు, రెండవ సంవత్సరం నుండి వాడు నేను ఒక రూమ్ కి మారిపోయాము. వాడు లోకల్ అవటం నాకు చాలా సౌఖ్యంగా ఉండేది. వారంలో ఒక రోజు వాళ్ళ ఇంటినుండి ఇద్దరికీ పిలుపు వచ్చేసేది, ఏ చేపల కూరో, లేక ఏదైనా స్పెషల్ చేసినప్పుడో. వెళ్ళేసి కుమ్మేసి రావటమే. వారానికోసారి వాడి బట్టలన్నీ వూరికెళ్ళిపోయి నీట్ గా ఉతకబడి, గంజి పెట్టబడి, ఇస్త్రీ చేయబడి పర పరలాడుతూ వచ్చేవి. వాడి చొక్కాలు నేను వేసుకొని పూలరంగడి లా తిరుగుతూ ఉంటే, కుళ్లుకొని మా గోపీ గాడు, ఏరా వాడివి చొక్కాలేనా లేక అండర్ వేర్ లు కూడా వాడేస్తావా అని ఏడిచేసే వాడ
ఎక్కడో మారు మూల పల్లెలో పుట్టాను. ఏకోపాధ్యాయ లేక ఆ పూటకి ఉపాధ్యాయుని రాక దైవాధీనాలు అనేలా వుండే ప్రాధమిక పాఠశాలలో పలకల మీద అక్షరాలూ దిద్దాను, నోటి లెక్కలు నేర్చాను, నాలుగవ తరగతి లోనో లేక ఆపై తరగతులలోనో ఆంగ్ల అక్షరమాలలు నేర్చుకున్నాను. అన్నీ పలకల మీదే, పుస్తకాల మీద రాయటమన్నదే ఎరుగను ఆరవ తరగతి వరకు. వానా కాలం చదువులంటారు ఎందుకో తెలియదు కానీ మా నావీ అట్టివే అనవచ్చు. అదేదో మేము అప్పటికే పొడిచేసి ఇంకా నవీన చదువులు చదవాలన్నట్టు మా బ్యాచ్ తోనే సిలబస్ మారటం మొదలవ్వటం మూలాన టెక్స్ట్ బుక్స్ అన్నీ ఆరు నెలల తర్వాతే లభ్యమయ్యేవి. కొనే స్తోమతు లేకనో లేక ఇక ఇంకో ఆరునెలలు కోసం కొనటం ఎందుకనో, నేనైతే టెక్స్ట్ బుక్ మొహం చూసి ఎరుగనబ్బా. మా అయ్యోర్లు ఏ నోట్స్ చెబితే అదే నాకు మార్గదర్శనం. అందుకే ఇప్పటికీ ఏదన్న టెక్నికల్ పుస్తకం చదవాలన్న అదేదో బ్రహ్మ విద్య లాగ మనస్సులో ఓ భయం. నా వల్ల కానే కాదబ్బా అనే అంతర్వాణి బలంగా వెనక్కి లాగుతుంది.
లెక్కలు కూడా బట్టీయమే నేను. మిగతా సబ్జెక్టులు పరవాలేదు గాని, నాకు బడిలో లెక్కల రావు అని పేరు. రావు అంటే రావనే అర్థం. అలా లెక్కలంటే ఒక మానసిక భయం పెంచుకున్నా నేను. మా ముందు బ్యాచ్ వాళ్లకి ఎనిమిదో తరగతి నుండి లెక్కల్లో రెండు ఆప్షన్స్ ఉండేవి , ఒకటి కంపోజిట్ అని రెండోది జనరల్ అని. లెక్కల్లో మా శ్రీధర్గాడిలా వుండే మేధావులంతా కంపోజిట్ తీసుకొనే వారు, నా బోటి బట్టీయమ్ గాళ్ళంతా జనరల్ తీసుకొనే వాళ్ళు. నేను కూడా ఫిక్స్ అయిపోయా జనరల్ తీసేసుకుందామని. కానీ మన అకాడెమీ వాళ్ళు ఇలా లెక్కల్ని రెండు విధాలుగా డిస్క్రిమినేట్ చేయరాదని నిశ్చయించి రెండిటినీ కలిపి కలగూర గంప చేసి నా లాటి వాళ్లకు లెక్కల్ని ఓ జీవన్మరణ సమస్య చేసిపారేసారు. లెక్కలంటే ఇంత భయపడే నేను సామాన్య శాస్త్రము మరియు భౌతిక శాస్త్రము లాటి విషయాల్లో చురుకుగానే వుండే వాడిని. ఇప్పటికీ మైటోకాండ్రియా, హైడ్రా గమనము లాటివి పటము సహాయముతో వివరించగలను, ఏ మూలకముల ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమిటో ఇప్పటికీ చెప్పగలను అబ్బా.
పదవ తరగతి గట్టెక్కగానే వెళ్లి నా అన్నీ లెక్కల పుస్తకాలు కిలోల లెక్కన మా అంగటాయనకి తూకం కింద అమ్మేసి , ఆయన రెండు రూపాయలు తక్కువిచ్చినా గీకి బేరమాడకుండా, ఆ డబ్బుల్తో సినిమాకి కూడా వెళ్ళొచ్చా. అలాగే మన నెల్లూరు వి.ఆర్.కాలేజీ వాళ్ళిచ్చే ప్రవేశ పత్రం తెచ్చుకున్న బై .పి .సి కి. ప్రవేశ పత్రానికి మా నాయన సంతకం పెట్టలా అప్పట్లో. ఎంసెట్ లో 500 లోపలే ర్యాంకు రావాలి ఎం.బి.బి.ఎస్ లో సీట్ కావాలంటే, అదే ఇంజనీరింగ్ అయితే ఏ ఐదు వేలొచ్చినా పర్వాలేదు అనే అవగాహన ప్రతీ నాయనలకుంది ఆ రోజుల్లో. నేను బతిమాలా మా నాయన్ని , ఆయన కరగాలా. వెళ్లి మళ్ళి నాకు మరియు మా అక్కకి ఎం.పీ.సి ప్రవేశ పత్రం తెచ్చుకున్న.
అక్కడ దొరికాడు మా అనీల్హాడు నా సహాధ్యాయుడిగా. మా వీ.ఆర్. కాలేజి చాలా ప్రజాతంత్య్ర కళాశాల. తరగతులెప్పుడూ జరగవు. భౌతిక శస్త్ర తరగతులకు హాజరైతే చాలు ప్రాక్టీకల్స్ కి రానిస్తారు, మిగతా క్లాసులన్నీ ఎగ్గొట్టొచ్చు. అప్పుడు నెల్లూరు ఎంసెట్ కోచింగ్ కి చాలా ప్రసిద్ధి. కోరా , నారాయణ , అమీరుద్దీన్ , ఆదిత్య , రత్నం లాటి కోచింగ్ సెంటర్స్ అన్నీ కోచింగ్ తీసుకొనే విద్యార్థులతో కిట కిట లాడుతూ ఉండేది. అలా మేము తంతే వెళ్లి కోరా లో పడ్డాము. బాగా చదువుకొనే వాళ్ళు చదువుకున్నారు , నేను-మా అనీల్గాడు మరికొంత గాంగ్ చదువుని చట్టుబండలు చేసి రోజుకో ముప్పై గంటలు క్రికెట్ ఆడేవాళ్ళము. ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి వాడు పాసయ్యాడు, నేను లెక్కల్లోనే తప్పాను. మొత్తానికి 150 మార్కులకు గాను నాకు 44 వచ్చాయి. మా అనీల్గాడు పాసైపోయాడు. గుడ్డిలో మెల్ల నాకు ఎంసెట్లో 3047 రాంక్ రావటంతో మా వాళ్లంతా బిడ్డ బాగా చదివాడమ్మా!, ఆ పేపర్లు దిద్దినవాడి చెయ్యి పడిపోను, అని వాడిని తిట్టుకున్నారు, నన్ను నమ్మేశారు. మనం కూడా మొహం దీనంగా పెట్టుకొని ప్రపంచమే నన్ను ముంచేసినట్టు కొన్నాళ్ళు జీవించేశాను.
మా అనీల్గాడేమో నా వల్లే వాడి ఎంసెట్ రాంక్ దొబ్బిందని, నా దగ్గరుంటే మళ్ళీ దొబ్బద్దని తలచి, నన్ను ఒంటరిని చేసి, వాళ్ళ నంద్యాల వెళ్ళిపోయాడు, ఎంసెట్ కాదు దాని జేజెమ్మ ఐ.ఐ.టి కొడతానని శపధం చేసి మరీ. సరే బాగుపడే వాడినెవరూ చెడగొట
వేంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో, కథానాయకుని తండ్రి, ఒక కుటుంబ రాజ్యాంగం రాసిపడేసి, ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారి ఉల్లంఘనలను లెక్కపెడుతుంటాడు. ఇక్కడ కథానాయకుడు అనగానే నీకా లక్షణాలు లేవు అంటారని తెలుసు నాకు, ఇక్కడ కర్త కథానాయకుడు కాదు, కథానాయకుని తండ్రి. అలాగే మా నాన్నగారు (ఇక మీదట ప్రతీ దగ్గర నాన్న అనే వ్రాస్తానని మనవి, నా దగ్గర గారు గారు అని పలుమార్లు వస్తే మీరే అనగలరు, అతి వినయం దూర్తలక్షణమని) రాసిన రాజ్యాంగాన్ని నేనూ ఉల్లంఘించాను పలుమార్లు.
ఆయన ఇంటికి వచ్చేసరికి పిల్లలం పుస్తకాలు పట్టుకొని ఉంటే చాలు మహా సంతోష పడిపోయే వారాయన. చదువు లేక ఆయన పడే కష్టాలు, మేము పడకూడదని ఆయన బలమైన కోరిక, అదే విషయం మాకు పదే పదే చెప్పేవారు. మా ఇల్లు వీధికి ఎదురుగా ఉండటంతో ఆయన వీధి మొదలులో ఉండగానే ఆయన రాక మాకు కనపడిపోయేది, ఇక చూడాలి మా హడావుడి, ఎక్కడి ఆటలు అక్కడ బంద్, ఎక్కడి నవలాపఠనం అక్కడ బంద్, పుస్తకాలు పట్టుకొని మహా నటించేవాళ్ళము. నేనైతే అక్క, ఈ లెక్కతో గంట నుండి కుస్తీ పడుతున్న, రావటంలా, కాస్త చెప్పవా అనే అతి నటన కూడా. అలాగే ఏ పరీక్ష అయిన తర్వాత, ఎలా రాశావురా అని అడిగితే తొంబై వస్తాయని చెప్పేవాడిని, మా అక్కైతే ఓ అరవై వస్తాయని చెప్పేది, ఫలితాలు వచ్చాక మార్కులు తయారు మారయ్యేవి. అప్పుడాయన చెప్పేవారు, తక్కువ చెప్పి ఎక్కువ తెచ్చుకోరా అని. ఈ నియమాన్ని నేను ఇప్పటికీ ఉల్లంఘిస్తూనే వున్నా.
మా వూర్లో వేరుశెనగ ఎక్కువగా వేసే వాళ్ళము. విత్తనాలకు కాయలు వొలవటం పెద్దపని మాకు. అలా పిల్లలం అందరం కలిసి ఎవరి ఇళ్లల్లో అయితే విత్తనాలు వొలవాలో అక్కడ చేరే వాళ్ళం. ఒక లోటా విత్తనాలు, చచ్చు పప్పులు మినహాయించుకుని, వోలిస్తే పదిపైసలు. ఒకసారి మా స్నేహితులమందరం మా ఇంట్లోనే వొలుస్తున్నాం, నా లోటా పప్పులు అప్పుడే జమచేసి పదిపైసలు తెచ్చుకున్న, నేను కూర్చున్న ప్రదేశానికి రాగానే, నా స్నేహితుడొకడు ఒక లోటాడు ఒలిచి, ఈ లోపల ఉత్సపోసుకొద్దామని బయటకెళ్లినట్టున్నాడు, ఆ పప్పులు నా లోటాలో పోసుకొని మళ్ళీ జమచేద్దామని వెళ్లాను. అక్కడ చిత్రగుప్తుని లా పట్టుకున్నారు మా నాన్న, ఇప్పుడే జమ చేసేవు కదా అంతలోపు ఇంకో లోటాడు ఎలా వలిచావు అని. ఏవో కథలు చెప్పా, నమ్మలా, అంతలో మా వాడు రానే వచ్చాడు, నా పప్పులెవరో మాయం చేసేసారు అని ఏడుస్తూ. మా నాన్న నా జమ వాడికి బదలాయించి, అంతటి తో ఊరుకోకుండా ఎదో మునిగిపోయినట్టూ అక్కడ కూర్చున్న వాళ్ళకందరికీ నా ఘనకార్యం గురుంచి చాటింపు వేయించి, నా చేత బహిరంగ క్షమాపణ చెప్పించాడు. ఆయనకేమో పెద్ద పేరు, అబ్బా! సుందరయ్య చూడు కొడుకుని కూడా క్షమించడు అని. ఆయనకప్పటికీ మన మెగాస్టార్ ఇంకా చెప్పలేదేమో, తప్పులుంటే చెవిలో చెప్పు, మంచి ఉంటే మైక్ లో చెప్పు అని. ఇలా మా నాన్న చెప్పిన మాట, తప్పు చేస్తే వెంటనే ఒప్పుకొని క్షమాపణ అడుగు మరియు ఇతరులది లాక్కోకు అని. ఆ తర్వాత ఇతరుల కష్టాన్ని లాక్కోలేదు కానీ, ఈ తప్పు చేస్తే వెంటనే క్షమాపణ అడుగు అనే నియమాన్ని నేను ఉల్లంఘిస్తూనే వున్నా. సుప్రియా కూడా అంటుంది నాతో వాదించి వాదించి ఇక లాభం లేదనుకొని, “కిందపడ్డా, మూతిపళ్ళు రాలినా, నువ్వే గెలిచానంటావబ్బా!” అని.
సుప్రియా వాళ్ళ ఉరు కూడా నెల్లూరు అవటంతో, మేము నెల్లూరు వచ్చినప్పుడల్లా, మా ఇంట్లో కానీ లేక వాళ్ళింట్లో కానీ వరుసగా ఎక్కవ రోజులుండకుండా అక్కడికీ, ఇక్కడికీ గాలి తిరుగుళ్ళు తిరిగేవాళ్ళం. మా నాన్న ఒక నియమం పెట్టారు, వచ్చాక ఎక్కడైనా తిరగండి, కానీ మీరు నెల్లూరుకొస్తే మాత్రం మొదట మన ఇంటికే రావాలి, ఆ తర్వాతే సుప్రియా వాళ్ళ ఇంటికెళ్ళాలి అని. వాళ్ళింటికెళ్ళటం ఒకరోజు తర్వాత కావొచ్చు లేక తిధులు వారాలు బాగా లేక పోతే కొన్నిరోజులు కూడా పట్టవచ్చు. నాకు ఈ నియమం కాస్త అమానుషమనిపించేది. ఎందుకంటే సంవత్సరం తర్వాతో లేక రెండేళ్ల తర్వాతో నెల్లూరుకు వచ్చినప్పుడు, తనకి కూడా తనవాళ్ళని, ముఖ్యంగా తన చుట్టుపక్కల వారిని, తాను పెరిగిన పరిసరాలను ఎప్పుడెప్పుడు చూద్దామన్న కోరిక ఉంటుంది కదా. అయినా ఈ నియమం మా పెళ్లయిన నాలుగైదు ఏళ్ళు పాటించాము. ఈ లోపు నాకు ఇద్దరు కూతుర్లు పుట్టారు, నాకూ కొమ్ములు మొలిచాయి. ఓ రోజు మా నాన్న దగ్గరకెళ్ళి, తలెత్తి సూటిగా కళ్ళల్లోకి చూసి, మీకు తెలుసా నేను కూడా ఇప్పుడు మీ లాగే నాన్న నయ్యా, ఇక మీదట నెల
నాకు మేనత్త రవణమ్మకిన్ను మా నాన్న మేనమామ రవణయ్యకిన్నుపెళ్లి చేసేసారు, మా తాత ఆదెయ్య మరియు మా నాన్నమ్మ ఆదెమ్మ లు కలిసి. మా నాయనకి, మా చిన్నాయన కి, నాకు, మా అన్నకీ ఆఖరుకి మా అమ్మ అక్కల పిల్లకాయలకి అందరికీ ఆయన రవణ మావే. ఆయన మాకు ఇల్లరికపుటల్లుడు. మాటల్లోనే కాదు చేతల్లో కూడా మహాదూకుడు. ఆయన నడిస్తే పక్కనోళ్లు పరిగెత్తాలి, ఇద్డుమ్ వడ్ల బస్తా భుజం మీద నుండి విసిరేస్తే ఆరడుగుల దూరంలో పడాల్సిందే. పండగలొస్తే నిప్పట్లు వొత్తాలంటే రవణయ్యే, కట్టెలు పేళ్ళుగా చీల్చాలంటే రవణయ్యే, భోజనంలో సింహభాగం కూడా ఆయనదే.
మా మేనత్త ఆయన దూకుడుకి బాగా వ్యతిరేకం, మెత్తనిది , ప్రేమ పాత్రురాలు, మేము గాడిదల్లా పెరిగినా మా ఏడవ తరగతి వరకూ మమ్మల్ని సంకనేసుకొనేది. ఆయనేది మాటలాడిన నువ్వే రైట్ నువ్వే రైట్ అంటూ ఆయన వాక్యం పూర్తిగాక ముందే అనేసేది. ఆ విషయం లో మా మేనత్త లౌక్యం నాకు చాలా ఇష్టం. మా వూర్లో మాకొక అంగడి ఉండేది అది మా మేనత్త మరియు మా మామ నడిపేవాళ్ళు. పండుగ దినాల్లో చేతిలో డబ్బులాడక పండుగ చేసుకోలేరు అన్న ఇళ్ల కల్లా మా మేనత్త బియ్యం, బెల్లం, నూనె లాటివి మా మావకు తెలియకుండా పంపేది. అందుకే ఊరందరకి ఆమె మా రవణమ్మ.
వాళ్లకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతుర్ని మరలా మా చిన్నాన్నకిచ్చారు. మా నాన్న, చిన్నాయన, మా మామల వ్యవసాయం భలే ఉండేది. వడ్లు విలువ ఇక పెరుగదు అని కళ్లాల్లో అమ్మేసుకుంటే అవి వెంటనే పెరిగేవి, మిరపకాయలకి రేట్లు వస్తాయనుకుని బొట్టల్లో ఉంచితే తీరా రేట్లు పడిపోయేవి. అమ్మబోయే సరికి రేటు సగం, కాయ తెల్లబడి బరువు సగం అయ్యేవి. ఇలా వ్యవసాయం చేసి ముగ్గురూ మా తాతని కాజేసేసారు. మేము ఎదో బావుకుందామని, మా అమ్మమ్మోళ్ల ఊరు ఉప్పలపాడు చేరి పోయాము. కొన్నేళ్ళకి మా మావ, మా మేనత్త, ఇద్దరి కొడుకులతో, మా చిన్న నాన్నమ్మోళ్లకి హోటల్ మరియు బి.హెచ్.పీ.వి లో కాంట్రాక్టులు ఉంటే అక్కడికి విశాఖకి వలస పోయారు.
మా మేనత్త కొడుకులు గోపాలయ్య, భాస్కరయ్య లు చిన్నప్పటి నుండి రామలక్ష్మణుల్లా పెరిగారు. ఇద్దరిదీ ఒకే మాట. నేను మా అన్న ఇద్దరం, సుందోపసుందుల్లా పెరిగాము. ఇద్దరికీ ఎడ్డెమంటే తెడ్డెము. అన్నిటికీ కొట్లాటలే మా మధ్య. ఆయనస్నేహితులతో నేను స్నేహం చేయకూడదు, మాటలాడకూడదు, అంతెందుకు ఆయన ఆయన స్నేహితులు ఆడే చుట్టుపక్కల నేను కనపడకూడదు. ఆయనకి మార్కులు సంకనాకొచ్చు, నాకు తగ్గితే ఆయనకీ ఎక్కడ లేని పెద్దరికం వొచ్చేస్తుంది, నా మీద దౌర్జన్యానికి . అందరూ పోలవటమే వాళ్ళని చూసి నేర్చుకొండిరా అని.
వాళ్ళు విశాఖ వెళ్లి చాలా కష్ట పడ్డారు. మామ బి.హెచ్.పీ.వి కాంటీన్ కి సరకులు కొనుగోలు చేసేవాడు, భాస్కరయ్య బి.హెచ్.పి.వీ లో కాంటీన్ మైంటెనెన్సు, గోపాలయ్య హోటల్ మైంటెనెన్సు చేసేవారు. ఈ క్రమం లో వచ్చిన అనుభవం తో శ్రీకాకుళం లో హోటల్ స్వప్న, ఏడు లాంతరుల వీధిలో మొదలు పెట్టారు. ఎదో సినిమా లో చెప్పినట్టు ఉప్పు దొరికే దగ్గర మామిడికాయలు తెచ్చి ఆవకాయ పెట్టి అమ్మడమే వ్యాపార లక్షణమని, అలా శ్రీకాకుళ మోళ్ళకి నెల్లూరు భోజనం రుచి చూపటమే వాళ్ళ వ్యాపార విజయం. వాళ్ళు ఇక వెనక్కి చూసుకోలేదు ఇక. డబ్బుకు డబ్బు పేరు కు పేరు వాళ్ళ హోటల్ కి.
గోపాల మామ సమర్ధుడు భాస్కర మామ కష్ట జీవి. అన్న నీడలో నే బతగ్గల సామాన్య జీవి. కలిసే వుండే వారు ఇద్దరి పెళ్లిళ్లు అయ్యాక కూడా. ఆ తర్వాత మొదలయ్యాయి మనఃస్పర్ధలు. మేము అందరం చెప్పాము కనీసం కలిసే వ్యాపారం చేసుకోండి, కలసి ఒకే ఇంట్లో ఉండక పోయినా అని. భాస్కర మామే అడిగాడు హోటల్ నువ్వన్నా తీసుకో లేక నాకన్నా ఇవ్వు అని వాళ్ళ అన్నని. వాళ్ళ అన్నకి తెలుసు మా భాస్కర మామ కి కొత్త హోటల్ నడిపే సమర్థత లేదని. అందుకే బాగా జరిగే హోటల్ ఇచ్చేసి విజయనగరం లో కొత్త స్వప్న హోటల్ పెట్టుకున్నాడు. మొదట బాగా కష్టపడ్డా తర్వాత అది బాగా జరగటం మొదలెట్టింది.
కానీ భాస్కర మామే విశాఖలో ఒక హోటల్ ఓపెన్ చేసాడు జరగలేదు, బట్టల కొట్టు పెట్టాడు జరగలేదు. శ్రీకాకుళం హోటల్ మీద ధ్యాస పెట్టలేదు, అప్పులయ్యాడు. బాగా క్రుంగి పోయాడు. ఆస్తులు అమ్మేశాడు. ఒక రోజు ఫోన్ వచ్చింది భాస్కర మామ ఇక లేరు అని. హార్ట్ ఎటాక్ అని. మనిషి ఆరోగ్యం మీద మంచి అవగాహన వున్నవాడు. చెడ
మా చిన్నది ఈ రోజున తన సహాధ్యాయుడైన ఒక అబ్బాయిని, దున్నపోతు, పనికిమాలిన వెధవ అంటూ తిట్టటం మొదలుపెట్టింది. వినీ, వినీ ఇక వినలేక, ఏమయ్యిందమ్మా అనడిగా. మా స్నేహితురాలి చరవాణి నంబరుని మా బస్సు డ్రైవేరొకడు అడిగాడని ఇచ్చేసాడు మరో ఆలోచన లేకుండా. ఇప్పుడా డ్రైవర్, నా మా చిన్నది ఈ రోజున తన సహాధ్యాయుడైన ఒక అబ్బాయిని, దున్నపోతు, పనికిమాలిన వెధవ అంటూ తిట్టటం మొదలుపెట్టింది. వినీ, వినీ ఇక వినలేక, ఏమయ్యిందమ్మా అనడిగా. మా స్నేహితురాలి చరవాణి నంబరుని మా బస్సు డ్రైవేరొకడు అడిగాడని ఇచ్చేసాడు మరో ఆలోచన లేకుండా. ఇప్పుడా డ్రైవర్ నా స్నేహితురాలి నంబరుకి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడు అని చెప్పి. ఆలోచన లేని నెలతక్కువ వెధవ వాడు, మరలా ఎక్కువ తిట్టాలంటే వాడి పేరు కూడా హర్షానే, అందుకే వాడిని ఇంత కన్నా ఎక్కువ తిట్టలేకున్న అంటూ ముక్తాయించింది. తిట్టవలసినదంతా తిట్టి, ఇంకా తిట్టలేను అంటావేమమ్మా అంటే, మీరూరుకోండి నాన్న, వాడినా మాత్రం తిట్టవచ్చులే అంటూ, నాకు చెప్పకనే చెప్పేసింది నన్ను కూడా ఎంత వరకూ తిట్టగలదో.
ఓయ్ వాషింగ్ మెషిన్ లో నా చీరలు వేసున్న వెళ్లి ఆరవెయ్యి అంది మా ఆవిడ. ఇలా అడపా దడపా నాలో ఎమన్నా పురుషాహంకారం లేచి బుసలు కొడుతుందో లేదో అని పరీక్ష పెడుతుంది తను. గుడ్ బాయ్, అని మెచ్చుకుంది ఆరేసి వచ్చాక. ఆరేసుకో పోయి పారేసుకున్నావు హరీ, నీ కోకెత్తికెళ్లింది కొండగాలీ అంటూ ఆరెయ్యటంలో ఆనందం ఎందరికి తెలుసు. మా అన్న అయితే, ఛీ ! నువ్వు మరీ హెన్ను పెక్కుడు హస్బెండువి (పరమ భార్య విధేయుడివి) అని ఈసడిస్తాడు అప్పుడప్పుడు. ఆయనకు పెద్ద ఫీల్ అంతా ఆయన కంట్రోల్ లోనే నడుస్తుందని. వీళ్లకు తెలీదు, అంతేగా అంతేగా అంటే, వాళ్ళు ఎంత సంతోషించి ఎన్ని సేవలు చేసేస్తారో. నాకైతే ఇంట్లో కంప్యూటర్ ముందు పనిచేస్తుంటే టిఫిన్లు భోజనాలు కూడా నోటికే. తిని నా మూతి నేను కూడా కడగనబ్బా.
జీతం రాగానే ఇంత అని తన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయటమే నా పని. ఇంట్లోకి అన్నీ, అమ్మ నాన్నల మందులు, పిల్లల పికప్ డ్రాప్ ఆఫ్, వాళ్ళ హాస్పిటల్ విజిట్స్ అన్నీ తనే. అబ్బా నువ్వు సూపర్ అంటే, కార్ తోలటం నేర్చేసి అన్నీ తనే వన్ వుమన్ ఆర్మీ లాగా. ఎవరన్నా బంధువులు వచ్చినా పిక్ అప్ డ్రాప్ ఆఫ్ అన్నీ ఆమెనే. మన పని ఆఫీస్ కి వెళ్ళటం, రావటం పిల్లల చదువు చూడటం అంతే. మీరు ఏమంటారు, అంతేగ అంతేగ అని వాళ్ళ చిన్న మాటలను ఓపిగ్గా వింటూ వింటే కలిగే బోలెడు లాభాలు . ఇక మీకు తెలుసు అనుకుంటా మీ ఇంట్లో కూడా మీరు ఎలా ఉండాలో. కాదూ కూడదు నేను పురుష పుంగవుడిని నేనింతే అని మా అన్నలా వున్నారా, దేవుడే కాపాడాలి మిమ్మల్ని. నా మాట విని కనీసం లాక్ అవుట్ అయినదాకా అన్నా నటించండి, ఆ తర్వాత మీకే అలవాటైపోతుంది.
నా అమెరికా ప్రయాణం మరియు డెన్వర్ కి చేరటంలో పడ్డ అష్టకష్టాలు నేను ఇదివరకే మీకు నా అమెరికా యాత్రలో వివరించాను. నా డెన్వర్ కష్టాలు అంతటితో ఆగలేదు. నేను మరియు మన నాయుడుపేట వాసి అయిన బుడ్డ రాజేషు ఒక సంక్లిష్టమైన ప్రాజెక్ట్ ని చేపట్టాము. అదేమియనగా మా ఖాతాదారుని యొక్క ఖాతాదారుల వివరాలను ఒక పాత డేటాబేస్ నుండి కొత్త డేటా బేస్ కి వలస యొనర్చటం. ఈ క్రమంలో మేమిద్దరం కలిసి ఒక ఇరవై లక్షల ఖాతాదారుల వివరాలలో దాదాపు ఒక లక్ష (అక్కడ లక్ష అనకూడదు, ఓ వంద వేలు అనాలి) ఖాతాదారుల వివరాలని కృష్ణార్పణం చేసేసాము. ఒక లక్షే కదా అని ఊరుకోవొచ్చుగా మా ఖాతాదారుడు, ఊరుకోకుండా మా చేత ఆ తప్పిపోయిన వివరాలను వెతికించి, వలస చేయించి మాకు ఉద్వాసన పలికాడు. ఈ ఉద్వాసన పర్వం గురించి రాస్తే ఓ భారతమంత అవుతుంది ఈ కథ. ఆ విధంగ నా డెన్వర్ కొలువు మూన్నాళ్ళ ముచ్చట అయ్యింది.
మా రెసిడెంట్ మేనేజర్ పెద్దాయన మంచివాడు కాబట్టి, నన్ను డెన్వర్ కి ఓ ముప్పై మైళ్ళ దూరం లో వున్నబౌల్డర్ అనే వూరిలో వున్న జి.ఈ కంపెనీలో పడేసాడు. అందరూ చల్ల కదలకుండా డెన్వర్లో కొలువు చేసుకుంటూ వుంటుంటే నేను మాత్రం, ఓ సంవత్సరం పాటు డెన్వర్ కి బౌల్డర్ కి మధ్య బంతిలాగ దొర్లా. అట్టి ఆ జి.ఈ లో మా మేనేజర్ ఉమేష్ నారాయణస్వామి. చాలా సదాచార సంపన్నుడు మరియు కొంచెం చాదస్తుడు. ఏడు గంటలకల్లా ఆఫీసులో ఉండేవాడు, కొంపలేదో మునిగేటట్టు. నేను పడుతూ లేస్తూ డెన్వర్ నుండి ఎప్పుడన్నా, ఎనిమిది కన్నా ఓ పదినిమిషాలు మాత్రమే, ఆలస్యంగా వెళితే నా కుర్చీ వరకు వచ్చి శుభమధ్యాహ్నం అని చెప్పి వెళ్లేవాడా దుర్మార్గుడు. ఏమాటకామాట చెప్పుకోవాలి పనిమాత్రం బాగా నేర్పాడు నాకు దగ్గరుండి మరి. మా పనిలో ఎమన్నా పొరపాటు వుంటే ఉగ్రనరసింహావతారమెత్తే వాడు.
ఆయన పోరగా పోరగా సంవత్సరం తర్వాత నేను డెన్వర్ కి మరియు బౌల్డర్ కి మధ్యనున్న లూయిస్విల్ కి మకాం మార్చేసాను. అక్కడ మన భారతీయ సమూహం అస్సలుండే వారు కాదు. మేమైతే అక్కడ నివసించటమొక శిక్షగా భావించే వారము. ఎప్పుడెప్పుడు తిరిగి డెన్వర్ లో పడుదామా అని ఎదురుచూసే వారము. మా ఉమేష్ ఆ సంవత్సరము తనకు తానుగా కల్పించుకొని అందరు ప్రోడక్ట్ వెండార్స్ తో బేరాలు ఆడి ఒక మిలియన్ డాలర్స్ మిగిల్చాడు, జి.ఈ కి, లైసెన్సుల ఖరీదు మీద. అవన్నీ పూర్తి అయ్యాక వచ్చి చెప్పాడు, “హర్ష తట్ట బుట్ట సర్దుకో నువ్వు కూడా, నేను కూడా సర్దుకుంటున్నా”, అని. అదేమిటి ఉమేష్, నువ్వు జి.ఈ కి ఒక మిలియన్ మిగిల్చావు నిన్నెందుకు సాగనంపుతారు అంటే, “లేదు హర్ష ! నీకు తెలియదు ఈ జి.ఈ నాయకత్వపు జనాల ఆలోచన, నేను ! ఈ సంవత్సరానికి ఒక మిలియన్, మిగల్చటంతో ఇక ఈ సంవత్సరమంతా నా దగ్గర నుండి ఇక కొత్త ఉత్పాదకత ఏమి ఉండదు, నేను కూడా ఈ ఘనకార్యాన్ని గురుంచే డప్పుకొట్టుకుంటానని వాళ్లకు తెలుసు”, అని చెప్పాడు. నిజమే, ఆయన అన్నట్టే ఆయన్ని మేనేజర్ పదవి నుండి జి.ఈ తొలిగించింది. నాకొక ఆర్నెల్ల పొడిగింపు వచ్చింది. కానీ నాకు మా ఉమేష్ లేని అక్కడ పని చేయాలని అనిపించలేదు. అదియును కాక, ఎప్పుడెప్పుడు డెన్వర్ లో పడదామా అన్న కోరిక మాకు.
సరే ఆ ప్రయత్నాలు మొదలు పెట్టాము. ముందు మా పెద్దదానికి డెన్వర్ లో ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం కింద నాలుగు ఏళ్ళు నిండితే సీట్ ఇచ్చే స్కూల్ లో ప్రవేశం కోసం ప్రయత్నిద్దామని అనుకున్నాము. అందుకని ఓ రోజు మంచి ముహూర్తాన డెన్వర్ కి మా ఇంజనీరింగ్లో సీనియర్ అయినా శివకోటన్నఇంటికి వచ్చాము. పిల్లలు కాస్త తేరుకున్నాక, స్కూల్ కి పోదామని కార్ దగ్గరకొచ్చాము. పిల్లలిద్దర్నీ వెనక కార్ సీట్స్ లో కూర్చోపెట్టే క్రమంలో నేను తెచ్చిన ఫైల్ ని కార్ మీద పెట్టి, వాళ్ళని కుర్చోపెట్టాక, ఆ ఫైల్ తీసుకొని లోపలపెట్టుకోవటం మరచి అలాగే బర్రుమని స్కూల్ కి వెళ్లిపోయాం. అక్కడికెళ్లి చూసుకుంటే ఫైల్ కనపడలేదు. మా సర్వ సమస్తం ఆ ఫైల్ లోనే, మా పాస్పోర్ట్స్, నా సర్టిఫికెట్స్, పిల్లల బర్త్ మరియు వాక్సినేషన్ రికార్డ్స్, ఒకటేమిటి సమస్తం అందులోనే. మా గుండెలు జారిపోయాయి, వెంటనే పరుగు పరుగున శివకోటన్న అపార్ట్మెంట్ కి వచ్చాము. అక్కడ మాకు మా ఫైల్ కనపడలేదు, ఒక్క సారి కుప్పకూలిపోయాము. దేశంగాని దేశంలో సంబంధిత కాగితాలన్నీ పోగొట్టుకొని, ఏమిరా ఈ శిక్ష అనుకుంటూ. సరే ధైర్యం తెచ్చుకొని శివకోటన్న వా
నేను చాల రోజుల నుండి మన మధ్య నుండి మాయమై పోయిన ఒకప్పటి వినోదాల గురుంచి రాయాలనుకుంటున్న. కాక పోతే గత పల్లెవాసిగా నావన్నీ ఒకప్పటి గ్రామాల్లో కనిపించి ఇప్పుడు మాయమయ్యినవి అయ్యుంటాయి. మొదట మనందరికీ ఇష్టమైన ఆసక్తికర మైన రికార్డింగ్ డాన్స్ లతో మొదలెడుతా. మా వూరిలో శ్రీరామనవమి నాలుగు రోజులో ఐదు రోజులో జరిగేది. ఒక్కో రోజు ఒక్కొక్కరి ఉభయం. ఒక రోజు బలిజ వాళ్ళది , ఒక రోజు గొల్ల వాళ్ళది , ఒక రోజు సాలె వాళ్ళది , కళ్యాణం రెడ్లది ఇలా అన్న మాట. ఉభయం ఎవరిదైతే ఆ రోజు దేవుడి అలంకరణ , అన్న ప్రసాదాలు , వినోదాల ఏర్పాట్లు వాళ్లవే. మా వూరు అంటే ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ వూరు. అమ్మమ్మ వూరు అంటే ఆత్మ బంధువుల వూరు అంటారుగా. ఈ ఉభయాల సందర్భం గా జరిగే వినోద సమర్పణలో మేము ఎదురు చూసేది రికార్డింగ్ డాన్స్, కీలు గుర్రాలు, నెమలి వేషాలు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రము ఎప్పుడవుతుందా అని ఎదురు చూడటం, ఈ లోపల డాన్స్ పాపలు వచ్చారా అని ఎంక్వయిరీ లు చేయటం, కుతూహలం చంపుకోలేక జట్లు జట్లు గ పిల్ల కాయలం వెళ్లి వాళ్ళు బస చేసిన ఇంటి చుట్టూ గిరికీలు కొట్టటం . ఈ లోపల ఎవడో పిల్లకాయ చెప్తాడు, నేను చుశానురా డాన్స్ పాపని కిటికీ తొర్రలోంచి అని. వాడు కన్ఫర్మ్ చేయగానే హమ్మయ్య అని తృప్తి పడటం.
చీకటి పడగానే మొదలయ్యేది వాళ్ళ ఊరేగింపు, బస దగ్గర నుండి గుడికి. కీలు గుర్రాలు , నెమలి వేషాల వాళ్ళు, రికార్డిండ్ డాన్స్ ట్రూప్ లు, దారి పొడవునా వాళ్ళతో పెట్రోమాక్ లైట్స్ వెలుగులో మేము. మొదట కీలు గుర్రాల ఆట, తర్వాత నెమలి వేషాలు, ఆ తర్వాత అసలు సిసలు రికార్డింగ్ డాన్స్ లు. ఈ రికార్డింగ్ డాన్స్ లకు నార్మల్ గా స్టేజి, ట్రాక్టర్ తొట్టి. మొదట డాన్స్ లన్నీ క్లాసికల్ పాటలకి. కుర్ర
నా సరికొత్త వాహనానికి నెంబర్ ప్లేట్ బిగించుకుందామని రవాణాశాఖ కార్యాలయానికి వెళ్ళా. అక్కడ నా వంతు రావడానికి సమయం పట్టింది కొంత. ఈ లోపల అక్కడ చిన్న చితకా పిల్లకాయలు గాలి పటాలు ఎగరేస్తుంటే వాళ్ళని గమనించటం మొదలెట్టా. వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందం వర్ణనాతీతం అది చరవాణుల్లో కదలక మెదలక ఆటలాడే మన పిల్లలకు బహుదూరం. వాళ్ళలో ఒక పిల్లవాడు బహు నేర్పరి అనుకుంటా, చిన్న పిల్ల లు వాడిని బతిమాలుతున్నారు, అన్నా మా పటానికి డీల్ వేయకన్నా అనో, నా మాంజా బాగా రాలేదన్నా చూడు అనో. వాడు కూడా చాలా కలుపుగోలుగా, సరే లేరా! నేను తెంచనులే నీ పటాన్ని అంటూనో, లేక రారా నా మాంజా ఇస్తాననో అందర్నీ కలిపేసుకుంటున్నారు. నాకనిపించింది ఆహా ఇది కదా పిల్లలు నేర్చుకోవటమంటే అని. అదే పిల్లలు రేపు గొడవ పడొచ్చు ఎల్లుండి ఒకటొవ్వొచ్చు. కానీ ఎంత మంచి బతుకు కళలు నేర్చుకుంటున్నారు.
బతుకు కళలు నేర్వటం అంటే నా చిన్న తనానికి వెళ్ళాలి అలాగే మీ చిన్న తనానికి.
మా వెంకట్స్పర్లన్న చేతిలో పడిందంటే ఏ గాలి పటమైన రిపేరై సర్రుమనాల్సిందే. అన్నా! నా పటం ఎగరటం లేదు అని మా పిల్లకాయలం వెళ్తే, అబ్బాయిలూ సూత్రం సరిగ్గా లేదురా అంటూ, రెండు-నాలుగు కాకపోతే రెండు-ఐదు పెట్టాలిరా అంటూ సరి చేసిచ్చే వాడు. రెండు-నాలుగు అంటే రెండు బెత్తెల దారం పైన, నాలుగు బెత్తెలు దారం కింద కలిపి కట్టడం. అలాగే మా శీనన్న బొంగరాలు తిప్పటం లో నేర్పరి. ఆయన దగ్గర రకరకాల పరిమాణంలో బొంగరాలుండేవి. వాటికి జాలీలు పేనటం (ఇక్కడ జాలీ అంటే ఏంటి పేనటం అంటే ఏంటి అని మీరే తెలుసు కోవాలి), గుమ్మా కొట్టటం నేర్వటం, ఆయన దగ్గరే మేమంతా. బొంగరంతో గుమ్మా కొడితే పెద్ద ఘాతాలు పడాల్సిందే అవతల వాళ్ళ బొంగరాలకి. గిరి లోంచి బొంగరం బయటకి రావాలంటే దానికి పెద్ద పడగ ఉండాలని నేర్చుకోవటం లాటి చిన్న చిన్న విషయాలు గ్రహించాము.
అలాగే సిగరెట్ ప్యాకెట్ లని చించి, వాటితో యూనో లాగ ఆడటం. ఒక్కో సిగరెట్ బ్రాండ్ కి ఒక్కో వేల్యూ. చార్మినార్ బ్రాండ్ లోయెస్ట్ వేల్యూ ఆపైన సిసర్స్ తర్వాత విల్స్. ఈ సిగరెట్ కార్డ్స్ మాకు యూనో ముక్కలు. మళ్ళీ వీటిల్ని ఎక్స్చేంజి చేసుకునే వాళ్ళం, రెండు ఛార్మినార్స్ కి ఒక సిసర్స్, రెండు సిసర్లుకి ఒక విల్స్, అలా అన్నమాట. ఇవి మా ఖజానాలు. మా మల్లికార్జున అన్న వీటికోసం ఒక పెద్ద ఎక్స్చేంజి నే నడిపేవాడు. అలాగే గోళీలు ఆట. రక రకాలు గా ఆడే వాళ్ళం. ఒడి పోయిన వాళ్ళు మోచేతులతో నేలమీద డోకాలి. గోళీలాటలో నేను నేర్పరిని మా వూరికే. అలాగే కర్ర బిళ్ళ లేక గిల్లి దందా, ఉప్పు ఆట, కుందుడు గుమ్మా, పల్లంచి లాటి ఆటల్లో ఒక్కొక్కళ్ళు నేర్పరులు మా ఊర్లో.
అలాగే మా పిల్లకాయలం యానాది రెడ్డి చేలో, నేలబాయిలో ఈతకొట్టే వాళ్ళని తొంగి చూస్తావుంటే, మాకన్నా పెద్దోళ్ళు మమ్మల్ని ఎత్తి ఆ బాయిలో తోసేస్తే భయంతో కేకలు పెడుతూనే ఈతకొట్టేసే వాళ్ళం. నాకు అప్పుడే తెలిసింది అందరూ అన్నిట్లో మేటి కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్కొ ఆట లో మేటి అని. వాళ్ళ దగ్గర ఎలా నేర్చుకోవాలి అని చూసే వాళ్ళం, లేకపోతే వాళ్ళని మా జట్లలో చేర్చుకొని వాళ్ళం. అన్నీ నేర్పింది మాకు వయసులో పెద్దయిన మా సీనియర్స్, అలాగే మేము మా జూనియర్స్ కి. అది ఒక పరంపర . సీజన్ మారే సరికి తెలియకుండానే ఆటలు మారిపోయేవి . అప్పటికి ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఎలా తెలియకుండానే ఆటలు అలా మారిపోతాయబ్బ అని. అది నిజం గా పెద్ద సైన్స్.
అలాగే ఆరో తరగతి చదవాలంటే మా ఊరి నుండి మూడు కిలోమీటర్ల దూరం లో వుండే పెదపుత్తేడుకి వెళ్ళాలి. మాకు అలవాటు అయ్యేవరకూ మా సీనియర్స్ మమ్మల్ని గమనిస్తూ తీసుకెళ్లేవారు. మా హైస్కూల్ లో చదువుల్లో ఫస్ట్ అంటే మా వూరే ఉండాలి. అది మా సీనియర్స్ నుండి వచ్చిన పరంపర. మన ఊరి పేరు నిలబెట్టాలిరా అంటూ, మాకు మార్కులు తగ్గితే వాళ్ళే ఉక్రోష పడే వాళ్ళు, మాకన్నా. ముందే అన్నా అన్నా అంటూ వాళ్ళ పుస్తకాలు రిజర్వు చేసుకొనే వాళ్ళం. కాస్త పెద్దయ్యాక కొన్ని రోజులు మా సీనియర్ అన్నలు అక్కల మధ్య ఉత్తరాలు చేరవేత కూడా. అన్నా! చెప్పన్నా, ఆ అక్క నీ ప్రేమని ఒప్పుకుందా లేదా అని మేము అడిగితే, రే! ఓపికుండాలి రా, అంత త్వరగా కుదరవురా, అంటూ ఓపిక కూడా నేర్పారు మా అన్నలు. ఇవన్నీ పుస్తకాలు పాఠశాలల ఆవల మేము నేర్చుకున్న బతుకు కళలు.
నాకున్నూ నా పిల్లల మధ్య జరిగి నొక సంభాషణ నిక్కడ రాస్తున్నా. చిన్నది టెన్త్ లోను పెద్ద దింటర్లో నున్నప్పటి మాట. వాళ్ళు వాళ్ళ స్కూల్ లోను లేక కాలేజీ లో జరిగిన సంఘటనలు మాతో చెబుతూ వుంటారు. ఒక రోజు చిన్నది వచ్చి , ‘నాన్నా, నాకీ మధ్య అబ్బాయిలతో మాటలాడటం ఉత్సుకత గాను, అమ్మాయిలతో మాటలాడడం విసుగ్గాను వుంది. అమ్మాయిలు ప్రతి దానికి ముఖం మాడ్చుకుంటూ వున్నారు. అదే అబ్బాయిలైతే ఉత్సాహంగా సరదాగా ఉంటూ, మాట్లాడడానికి చాలా హాయిగా వున్నారు’, అని చెప్పింది. సహజంగా నేను కానీ సుప్రియ కానీ వాళ్ళు ఎమన్నా ఇటువంటివి చెబితే వాళ్ళని ఖండించము. వాళ్ళు వాళ్ళ భావాలని బయట పెట్టనిస్తాం. కాబట్టే వాళ్ళు అన్నీ దాయకుండా చెప్పేస్తారు.
అదే సమయంలో మా పెద్దది ఓ కథతో వచ్చింది. నాన్నా! మా కాలేజీ లో మా సహాధ్యాయిని వాళ్ళ అమ్మ, మా కాపలాదారుడి కొడుకుని కొట్టింది చూడూ అంటూ! ఏమి జరిగిందిరా! అంటే ఈ విధం గ చెప్పుకొచ్చింది. “మా సహాధ్యాయిని ని వాళ్ళ అమ్మే రోజూ తనను కాలేజీ లో దింపేది. అలా దింపడానికి వచ్చినప్పుడల్లా, మా కాపలాదారుడి కొడుకు ఆమెకి నమస్కారం కూడా చెప్పేవాడట. ఈ మధ్య ఆవిడ రావటం లేదు, ఆ అమ్మాయే ఒంటరిగా వచ్చేస్తుంది, కాలేజీకి రావటం మరియు పోవటం అలవాటు పడిపోయింది కనుక. కొన్ని రోజులకి, అమ్మాయి వాళ్ళ అమ్మకి కాలేజీ నుండి ఫోన్ కాల్ వెళ్ళింది, వాళ్ళ అమ్మాయి క్లాస్ కి సరిగా రావటం లేదని. వాళ్ళ అమ్మగారు, కాదు మా అమ్మాయి క్రమం తప్పకుండా వస్తుంది కాలేజీకి అని చెప్పి, వెంటనే వచ్చేసారు కాలేజీ దగ్గరకు. అమ్మాయి గారు కాలేజీ లో లేరు. అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఒక డి.ఎస్.పి. ఆయన వెంటనే తన బెటాలియన్ తో రంగంలోకి దిగి, కనిపెట్టారు ఆ అమ్మాయీ, మా కాపలాదారుని కొడుకు పక్కనున్న పార్కు లో తేలి వున్నారని. వాళ్ళ నాన్నగారు వాడినేమీ అనలేదు, కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం వాడిని కుమ్మేసింది” అని. పైగా తేలిందేమిటంటే ఆ పిల్ల కూడా వాళ్ళ అమ్మ నెంబర్ మారిందని, బదులుగా తన స్నేహితురాలి నెంబర్ కాలేజీలో ఇచ్చి, ఇన్ని రోజుల గైరు హాజరు మేనేజ్ చేసింది. ఆ పిల్ల ఖర్మకాలి రిసెప్షనిస్ట్ గావేరే ఆమె రావటం, వచ్చినావిడ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారి పాత నెంబర్ కి ట్రై చేయటంతో అసలు భండారం బయట పడింది.
మేము మా పిల్లల్ని అడిగాము, పైన కథలో మీరు ఏమి గ్రహించారు అని. వాళ్లు తమకలవాటైన శైలిలోనే చెప్పారు, ఆ అమ్మాయిదే తప్పు అని, అలా వాళ్ళ పేరెంట్స్ నమ్మకాన్ని, ఆశల్ని ఆ అమ్మాయి వమ్ము చేసింది అని. మేము అడిగాము మరి చెల్లి కూడా, అబ్బాయిలతో మాటలాడటం చాలా ఉతసాహంగా వుంది అన్నది కదా, మరి ఆ అమ్మాయి చేసినది తప్పు ఎలా అని. ఆ అమ్మాయికి కూడా వాడు చెప్పిన కబుర్లు ఉత్సాహంగానే వున్నాయి కాక పోతే స్కూల్ బదులు పార్క్ అంతే తేడా అని. నాన్నా, మేము ఇలా ఆ అమ్మాయిదే తప్పు అన్నామని మాకు వ్యతిరేకంగా మీరు చెప్తున్నారు, మేము ఆ అమ్మాయే కరెక్ట్ అంటే మీరు ఇంకోలా చెప్పేవాళ్ళు అంటూ నా మీద విరుచుకు పడ్డారు మా మా అమ్మాయిలు.
మాకు అర్థమయ్యింది మేము మా స్టాండ్ చెప్పే సమయం వచ్చిందని. మీలో కొందరికి నచ్చినా నచ్చక పోయిన నేను ఇలా చెప్పా. మొదటిది, మీరు ఒప్పులు చేస్తేనే నేను మీకు అండగా ఉండేదని అనుకోవొద్దు, మీరు తప్పులు చేసి కష్టాల్లో పడ్డా నేను మీకు వున్నా, కాబట్టి నన్ను ఏ సమయం లో నైనా సహాయం కోసం అడగటంలో సంకోచించ వద్దు. నా దృష్టి మీ సమస్యని పరిష్కరించటం మీదనే కానీ మిమ్మల్ని ఎత్తి పొడవటం మీద ఉండదు. ఇంకా సంభాషణను పొడిగిస్తూ, ఈ విధంగా కొంచెం సుత్తి కొట్టాం, ‘ మీకు ఒకడు నచ్చొచ్చు, వాడు చెప్పే కబుర్లు నచ్చవచ్చు, కానీ కథ అంతటి తో ముగియదు. వాడు కొంత కాలానికి బయటకెళ్దాం అంటాడు. ఒక సినిమా కో, ఒక పార్క్ కో, లేక ఎక్కడైనా ఒంటరి ప్లేస్ కో. మీకు కొన్ని సార్లు వెళ్లాలని అనిపించ వచ్చు. కానీ మీరు అన్నీసార్లు వేళ్ళ లేరు. మీరు వెళ్లలేనప్పుడు వాడు ఎమోషనల్ గా మిమ్మల్ని మానిప్యులేట్ చేస్తాడు. చచ్చినట్టు వెళ్ళాలి, వాడి మాట వినాలి. ఈ ప్రాసెస్ లో మీరు కోల్పోయేది మీకు నచ్చినట్టుండ గలిగే మీ ఫ్రీడమ్. మీకు అవసరమా ఇదంతా. మీకు ఎక్కడికైనా వెళ్లాలంటే తీసుకు వెళ్లే అమ్మా, నాన్న, నాన్నమ్మ మరియు తాతయ్య లాటి ఇందరం వున్నాము. మీ ఎమోషన్స్ వినడానికి, భరించడానికి, ఏమీ ఆశించకుండా చేయడానికి. మీకు మీ ఫ