Harshaneeyam

Harshaneeyam

By HarshaneeyamArtsBooksFiction
Download on the App Store

Harshaneeyam episodes

  • 'ఏర్పాట్లు ' - ఇందిరా పార్థసారథి

    తమిళ రచయిత ఇందిరా పార్థసారధి రాసిన ‘ఏర్పాట్లు’ అనే ఈ కథ ను తెలుగులోకి అనువదించింది జిల్లెళ్ళ బాలాజీ గారు. ఛాయా పబ్లికేషన్స్ ప్రచురించిన ‘నీళ్ళ కోడి’ కథాసంకలనం లోనిది. 

    ఇందిరా పార్థసారధి సుప్రసిద్ధ తమిళ రచయిత. తన రచనలకు, సరస్వతీ సమ్మాన్, సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, పద్మశ్రీ లాంటి ఎన్నో పురస్కారాలను పొందారు.

    ‘నీళ్ళ కోడి’ కొనడానికి -

    https://amzn.to/44Jov9x

    *హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -

    https://bit.ly/3NmJ31Y

    *ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –

    స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam

    ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5

    *మమ్మల్ని సంప్రదించడానికి [email protected] కి మెయిల్ చెయ్యండి.

    హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల కథలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

    https://bit.ly/Storycollection

    హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల సంభాషణలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

    https://bit.ly/44v7CzW

    హర్షణీయంలో ప్రసారం చేసిన వనవాసి నవల అన్ని భాగాలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి

    https://bit.ly/vanavasinovel

    వనవాసి నవలలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యావరణ వేత్తలతో జరిపిన సంభాషణలు వినాలంటే కింది లింక్ ను ఉపయోగించండి.

    https://bit.ly/Ecovanavasi

    ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    14 min
  • కథ : యంత్ర విజయం - వీబీ సౌమ్య గారు.

    ఈ ఎపిసోడ్ లోని కథ ‘యంత్ర విజయం’ రాసింది, వి.బి. సౌమ్య గారు. Natural Language Processing (NLP) లో PhD చేసారు. ప్రస్తుతం కెనడాలోని నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్‌లో పని చేస్తున్నారు. అనువాదకురాలు, రచయిత. జులై నెల – సంచిక వెబ్ మ్యాగజైన్ లో ప్రచురించారు.

    కథను చదువుకోడానికి వెబ్ లింక్ – షో నోట్స్ లో వుంది.

    https://bit.ly/yantrav

    కృత్రిమ మేధ అంటే?

    https://bit.ly/AItelugu

    కర్బన పాదముద్రలంటే?

    https://bit.ly/carbonfprint

    *హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) –

    https://bit.ly/3NmJ31Y

    *ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –

    స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam

    ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5

    *మమ్మల్ని సంప్రదించడానికి [email protected] కి మెయిల్ చెయ్యండి.

    *హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -

    https://bit.ly/3NmJ31Y

    *ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –

    స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam

    ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5

    *మమ్మల్ని సంప్రదించడానికి [email protected] కి మెయిల్ చెయ్యండి.

    హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల కథలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

    https://bit.ly/Storycollection

    హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల సంభాషణలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

    https://bit.ly/44v7CzW

    హర్షణీయంలో ప్రసారం చేసిన వనవాసి నవల అన్ని భాగాలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి

    https://bit.ly/vanavasinovel

    వనవాసి నవలలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యావరణ వేత్తలతో జరిపిన సంభాషణలు వినాలంటే కింది లింక్ ను ఉపయోగించండి.

    https://bit.ly/Ecovanavasi

    ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    19 min
  • 'ప్రపంచ సినిమా చరిత్ర' - అరిపిరాల సత్యప్రసాద్ గారితో సంభాషణ

    అరిపిరాల సత్యప్రసాద్ గారు , ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ రూరల్ మానేజ్మెంట్, ఆనంద్ లో చదువుకున్నారు. గుంటూరు స్వస్థలం. ప్రస్తుతం ఐ డీ ఎఫ్ సీ ఫస్ట్ భారత్ లిమిటెడ్ లో, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ డివిజన్ కి జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నారు. జరుగుతున్నది జగన్నాటకం' , 'రూపాయి చెప్పిన బేతాళ కథలు' ఆయన రచనలు. కథల మీద, నవల మీద సమీక్షావ్యాసాలు రాస్తుంటారు. కొన్ని కథా సంకలనాలకు సంపాదకత్వం వహించారు. లఘుచిత్రాలను తీశారు. సినిమాలపై ఆయనకున్న ఆసక్తితో, ఐదేళ్ళ పై విషయ సేకరణ చేసి, 'ప్రపంచ సినిమా చరిత్ర' పుస్తకాన్ని రచించారు. అన్వీక్షికి పబ్లికేషన్స్ ద్వారా ఈ పుస్తకం ఇటీవలే విడుదలైంది.

    ఈ సంభాషణలో ఆయన ప్రపంచ సినిమా చరిత్ర పుస్తకం గురించి, రచనా ప్రక్రియ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

    ప్రపంచ సినిమా చరిత్ర పుస్తకం కొనడానికి లింక్ -

    https://bit.ly/3CHwxUa

    *హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -

    https://bit.ly/3NmJ31Y

    *ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –

    స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam

    ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5

    *మమ్మల్ని సంప్రదించడానికి [email protected] కి మెయిల్ చెయ్యండి.

    హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల కథలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

    https://bit.ly/Storycollection

    హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల సంభాషణలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

    https://bit.ly/44v7CzW

    హర్షణీయంలో ప్రసారం చేసిన వనవాసి నవల అన్ని భాగాలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి

    https://bit.ly/vanavasinovel

    వనవాసి నవలలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యావరణ వేత్తలతో జరిపిన సంభాషణలు వినాలంటే కింది లింక్ ను ఉపయోగించండి.

    https://bit.ly/Ecovanavasi

    ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    44 min
  • నిత్య యాత్రీకుడు ఆదినారాయణ గారితో పరిచయం

    ప్రకాశం జిల్లాకు చెందిన ఆదినారాయణ గారు ఆంధ్రా యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. గత నాలుగు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు సందర్శించి, తన యాత్రల గురించి పుస్తకాలను రాస్తున్నారు. భారతదేశం అంతా తన కాలినడకన తిరిగి 'భ్రమణ కాంక్ష' అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆరు ఖండాలలోని ముప్ఫయి ఐదు దేశాలలో తిరిగి 'భూ భ్రమణ కాంక్ష' అనే పుస్తకాన్ని రాసారు. తెలుగులో మొదటి యాత్రా సాహిత్యం గా ప్రసిద్ధికెక్కిన 'కాశీ యాత్రా చరిత్ర' ను ఆధునీకరించి ప్రచురించారు.

    ఎపిసోడ్ లో ముందుగా రచయిత సోలోమోన్ విజయకుమార్ గారు ఆదినారాయణ గారి గురించి మాట్లాడతారు.

    ఆదినారాయణ గారి పుస్తకాలు కొనడానికి -

    https://bit.ly/booksadi

    ఆదినారాయణగారి పై తాడి ప్రకాష్ గారు రాసిన వ్యాసం

    https://bit.ly/adinarayana

    *హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -

    https://bit.ly/3NmJ31Y

    *ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –

    స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam

    ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5

    *మమ్మల్ని సంప్రదించడానికి [email protected] కి మెయిల్ చెయ్యండి.

    హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల కథలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

    https://bit.ly/Storycollection

    హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల సంభాషణలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

    https://bit.ly/44v7CzW

    హర్షణీయంలో ప్రసారం చేసిన వనవాసి నవల అన్ని భాగాలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి

    https://bit.ly/vanavasinovel

    వనవాసి నవలలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యావరణ వేత్తలతో జరిపిన సంభాషణలు వినాలంటే కింది లింక్ ను ఉపయోగించండి.

    https://bit.ly/Ecovanavasi

    ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    20 min
  • సాహిత్యంలో కృత్రిమ మేధ (Artificial Intelligence) - వి బి సౌమ్య గారు.

    ఈ ఎపిసోడ్ లో సంభాషించిన  వి.బి. సౌమ్య గారు  Natural Language Processing (NLP) లో  PhD చేసారు. ప్రస్తుతం కెనడాలోని  నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్‌లో పని చేస్తున్నారు. అనువాదకురాలు, రచయిత. 

    కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ "నిర్జన వారధి" ని "ది షార్ప్ నైఫ్ ఆఫ్ మెమరీ" గా ఆంగ్లంలోకి - సత్యజిత్ రే వ్రాసిన Our Films, Their Films ను తెలుగులోకి అనువదించారు. pustakam.net అనే వెబ్సైటు నిర్వహిస్తున్నారు. ఈ సంభాషణలో భాగంగా, తాను రాసిన పుస్తకాల గురించి,  సాహిత్యంలో ‘Artificial Intelligence’  వాడకం గురించి, చాట్ జీపీటీ , Machine translation గురించి సౌమ్య గారు మాట్లాడారు. 

    నిర్జన వారధి ఇంగ్లీష్ అనువాదం కొనడానికి (  The sharp Knife of Memory) - 

    https://bit.ly/3qxrV02

    ఈ సంభాషణలో ప్రస్తావించిన కొన్ని విషయాలగురించి అదనంగా తెలుసుకోడానికి - 

    1.AI పై తెలుగులో వ్యాసం - 

    https://bit.ly/teluguAI

    2.About Toda buffalo vocabulary

     https://vbsowmya.wordpress.com/2017/09/03/buffalo-vocabulary/

    3.Using AI to enhance Icelandic language

    https://bit.ly/3MKTNp6

    *హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -

    https://bit.ly/3NmJ31Y

    *ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –

    స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam

    ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5

    *మమ్మల్ని సంప్రదించడానికి [email protected] కి మెయిల్ చెయ్యండి.

    హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల కథలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

    https://bit.ly/Storycollection

    హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల సంభాషణలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

    https://bit.ly/44v7CzW

    హర్షణీయంలో ప్రసారం చేసిన వనవాసి నవల అన్ని భాగాలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి

    https://bit.ly/vanavasinovel

    వనవాసి నవలలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యావరణ వేత్తలతో జరిపిన సంభాషణలు వినాలంటే కింది లింక్ ను ఉపయోగించండి.

    https://bit.ly/Ecovanavasi

    ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    46 min
  • నవోదయ బుక్ హౌస్ - హర్షణీయంలో

    నవోదయ బుక్ హౌస్ ని సాంబశివరావు గారు , కోటేశ్వర రావు గారు కలిసి, కాచిగూడ హైదరాబాద్ లో స్థాపించి, గత మూడు దశాబ్దాల పైబడి తెలుగు పుస్తకాలను పాఠకులకు అందచేస్తున్నారు. నవోదయ పబ్లిషింగ్ ద్వారా మంచి సాహిత్యాన్ని ప్రచురిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో సాంబశివరావు గారు పుస్తకాలతో తన కున్న దాదాపు యాభై ఏళ్ళ సాన్నిహిత్యాన్ని, అమ్మకంలో , ప్రచురణలో తన అనుభవాలను మనతో పంచుకున్నారు. గొంతు పూర్తిగా సహకరించకపోయినా ఈ సంభాషణలో పాల్గొని తమ ఆలోచనలను పంచుకున్నందుకు సాంబశివరావు గారికి కృతజ్ఞతలు. ఎపిసోడ్ చివరన కోటేశ్వర రావు గారు కూడా పాల్గొనటం జరిగింది. వారికి ధన్యవాదాలు.

    నవోదయా బుక్స్ ద్వారా తెలుగు పుస్తకాలు కొనడానికి - www.telugubooks.in

    *హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -

    https://bit.ly/3NmJ31Y

    *ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –

    స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam

    ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5

    *మమ్మల్ని సంప్రదించడానికి [email protected] కి మెయిల్ చెయ్యండి.

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    47 min
  • అచ్చ తెనుగు కథ, 'తలుపు' : తమిళ మూలం - కి. రాజనారాయణన్

    ఈ ఎపిసోడ్ లోని కథ 'తలుపు' - తమిళ మూలం రచయిత కి. రాజనారాయణన్. తెలుగు వారైన రాజనారాయణన్ తమిళంలో సుప్రసిద్ధ రచయిత. కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత. ఈ కథను స. వెం రమేశ్ గారు తెలుగులోకి అనువదించారు. ఈ కథ 'తెన్నాటి తెమ్మెర' కథా సంకలనంలో చోటు చేసుకుంది. ఈ సంకలనంలోని కథలన్నీ కూడా తెలుగు మూలాలున్న తమిళ రచయితలు రాసినవి. అన్ని తమిళ మూల కథలను రమేశ్ గారే తెలుగు లోకి అనువదించారు. 'తెన్నాటి తెమ్మెర' - కథాసంకలనం గురించి స. వెం రమేశ్ గారు హర్షణీయంతో చేసిన సంభాషణను మునుపటి ఎపిసోడ్ లో వినవచ్చు. (

    'తలుపు' ఈ నాటి తమిళనాడులోని తిరునల్వేలి పరిసరాలకు చెందిన కథ. తిరునల్వేలి కరువు ప్రాంతంగా ప్రసిద్ధికెక్కింది. అనేక గొప్ప రచయితలను తమిళ సాహిత్యానికి అందించిన నేల.

    ఈ కథల్లో ఇంకో ప్రత్యేకత , అనువాదంలో వాడిన ప్రతి పదం , అచ్చ తెనుగు పదం అయి ఉండటం. తెలుగులో మనం వాడటం మరిచిపోయి కోల్పోతున్న దాదాపు ఏడు వందల పదాలను రమేశ్ గారు మనకు గుర్తు చేశారు. ఈ పదాలన్నిటికీ పుస్తకం చివరలో అర్థాలను పొందుపరిచారు.

    ఈ కథలో వాడిన మనం మరిచిపోతున్న అచ్చ తెనుగు పదాలకు అర్థం షో నోట్స్ లో కింద జత చేయబడింది.

    ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని వాయిస్ మెసేజ్ ద్వారా తెలియచేయటానికి ఈ లింక్ ను ఉపయోగించండి. 

    https://www.speakpipe.com/Harshaneeyam

    కథలో వాడిన కొన్ని తెనుగు పదాలకు అర్థాలు

    తూరాకు = టికెట్

    పాత తరి గార ఇల్లు = పాత కాలపు గచ్చు ఇల్లు

    తెరువు = వీధి

    నిప్పు పెట్టి = అగ్గి పెట్టె

    తోమమయిందని = శుభ్రపడిందని

    గాసిపడి = శ్రమ పడి

    ఇచ్చుతో = సంతోషంగా

    వెక్కసపడి = నిష్టూర పడి

    ఒదవు లేదు = ప్రయోజనం లేదు

    ఎడువుకొంటున్నప్పుడు = ఏరుకొంటున్నప్పుడు

    పదరు పుట్టడం = కంపించడం

    అలమట = దుఃఖం

    ఏ మందలా లేదు = ఏ సమాచారం లేదు.

    జీరాపి నెల = కార్తీక మాసం

    నంజు గాలి = విషపు గాలి

    తొప్పరగా = బాధగా

    ఆబగా = ఆత్రంగా

    విరవిరగా = వేగంగా

    తలుపు : (తమిళ మూలం - కి రాజనారాయణ్)

    తలుపు ఆట మొదలయింది. పక్కింటి పిల్లలంతా గోలగోలగా వచ్చి కలుసుకొన్నారు.

    “అందరూ తూరాకును తీసుకోండీ,” అన్నాడు శీనివాసుడు. 

    వెంటనే, “నాకొకటి నీకొకటి," అంటూ గోల చేసినారు.

    "ఏ ఊరికి కావాలి? ఏయ్ ఇలా నెట్టి తోస్తుంటే ఎలా? ఇలాగయితే నేను ఆటకే రాను.”

    “లేదు లేదు తొయ్యంలే."

    “సరే ఏ ఊరికి తూరాకు కావాలి?" 

    పిల్లలు ఒకరి మొకాలను ఒకరు చూసుకొన్నారు.

    ఒకడు  తిన్నెవెల్లికి  అన్నాడు. అంతే, 'తిన్నెవెల్లికి తిన్నెవెల్లికి,' అని కూతపెట్టి కదలినారు అందరూ. లచ్చిమి ఒక గుడ్డతో తలుపును తుడుస్తూ ఉంది. శ్రీనివాసుడు వట్టి చేతులతోనే  తూరాకులను చింపి ఇచ్చినాక  కొందరు తలుపుమీద కెక్కి ఆనుకొన్నారు. కొందరు తలుపును ముందువెనకలకు ఆడిస్తున్నారు. తన మీదకు ఎక్కి తొక్కుతూ, నిలబడిన పిల్లలను, బరువయిన ఆ పెద్ద తలుపు వడివడిగా ఆడించి అలరించసాగింది. 

    తలుపును నెట్టినవాళ్లు తూరాకుల్ని తీసుకొని ఎక్కినారు. 

    “తిన్నెవెల్లి వచ్చేసింది దిగండి," అన్నాడు శీనివాసుడు. ఎక్కినవాళ్లంతా దిగేసినారు.  దిగినవాళ్లు నెట్టసాగినారు. మళ్లా తలుపాట మొదలయింది.

    అది పాతతరి గార  యిల్లు. పెద్దదయిన ఒంటిరెక్క తలుపును నిలుపుకొని ఉంటుంది. అందులో ఉంటున్న వాళ్ళు ఒకప్పుడు బాగా బతికినవాళ్లే, ఇప్పుడు చితికిపోయినారు. ఆ ఇంట్లోని ఆడపిల్లలో పెద్దదానికి ఎనిమిదేళ్లు, చిన్నది చంకబిడ్డ. అమ్మ చేను పనికి కూలికి పోతుంది. నాన్న మణిముత్తారుకు బతుకుతెరువు కోసం వెళ్తున్నాడు. లచ్చిమీ శ్రీనివాసుడూ కలిసి పసిబిడ్డను చూసుకొంటూ అమ్మ

    చేను నుండి వచ్చేవరకూ తలుపాటను ఆడుకొంటూ ఉంటారు.

    —

    ఒకనాడు తెరువులో ఒక నిప్పుపెట్టి అట్టబొమ్మను చూసి తీసుకొనింది లచ్చిమి. అదొక కుక్కబొమ్మ. మురికిగా ఉండేసరికి బొమ్మమీద ఉమ్మేసి పావడతో తుడిచింది. దాంతో అక్కడక్కడా ఉండిన మురికి, బొమ్మంతా అలుముకొనింది. కానీ లచ్చిమికి ఎంతో తనివి, బొమ్మ బాగా తోమమయిందని.

    బొమ్మను మొకానికి నేరుగా పెట్టుకొని తలను కాస్త వంచుకొని చూసింది. ఆనక తలను ఇంకొకవైపుకు వంచుకొని చూసింది. నవ్వుకొనింది. అది దొరికిన చోట ఇంకెవరయినా ఉన్నారా అని అటూ ఇటూ చూసింది. ఎవరూ లేరు. ఇంటి వైపుకు వడివడిగా గంతులేస్తూ వెళ్లింది, ఇచ్చును తట్టుకోలేక . 

    లచ్చిమి ఇంటికి వచ్చేసరికి శ్రీనివాసుడు చేపట్టుకు ఆనుకొని వాకిలి మెట్ల మీద కూర్చుని ఉన్నాడు. వాడిని చూస్తూనే బొమ్మను వెనుకవైపున దాచి పెట్టు కొంటూ, “రేయ్ నేను ఏం తెచ్చినానో చెప్పుకో చూద్దాం," అనింది. “ఏం తెచ్చినావో నాకెలా తెలుస్తుంది?"

    “చెప్పేమి చూద్దాం.”

    “నాకు తెలియదు.”

    లచ్చిమి ఎడంగా నించునే బొమ్మను చూపించింది.

    "అక్కా అక్కా నాకు ఇయ్యవా?" అని అడుగుతూ దిగి వచ్చినాడు శీనివాసుడు.

    . 'కుదరదు అన్నట్లుగా తలను అడ్డంగా ఆడించి, బొమ్మను పైకి లేపి పట్టు కొంది. శ్రీనివాసుడు అక్క చుట్టూ తిరిగినాడు.

    "ఊహూఁ కుదరదు, ఇవ్వను... నేను ఎంతో గాసిపడి వెతకి తెచ్చుకొన్నాను తెలుసా?" అనింది.

    "ఒకే ఒక్కసారి చూసేసి ఇచ్చేస్తాను. అక్కా అక్కా అని బతిమాలినాడు. 

    “చూసేసి ఇచ్చేయాలి.”

    “సరే.”

    “చింపకూడదు.” 

    “సరే సరే.”

    శ్రీనివాసుడు బొమ్మను తీసుకొని చూసినాడు. ఎలమితో వాడి మొహం వెలిగిపోయింది.

    “రేయ్, లోపలకు వెళ్లి కాస్త సజ్జ మెతుకుల్ని తీసుకొనిరా, దీనిని మన తలుపుకు అంటిద్దాం,” అనింది.

    “అలాగలాగే,” అంటూ లోపలికి పరుగెత్తినాడు శీనివాసుడు.

    ఇద్దరూ కలసి బొమ్మను తలుపుకు అంటించినారు. బొమ్మను చూసి ఇచ్చుతో చప్పట్లు చరుస్తా ఎగిరినారు. ఆ చప్పుడు విని పక్కింటి పిల్లలు పరుగెత్తి వచ్చినారు. మళ్లా తలుపాట మొదలయింది.

    ఆ తలుపును కాస్త గమనించి చూస్తే, పిల్లలు అంటించిన బొమ్మకు కాస్త పైన ఇలాగే అంటించున్న ఇంకొక బొమ్మ కనిపిస్తుంది. దానిని అంటించి ఎన్నాళ్ళో  అయినట్లుగా మురికీ పొగా పట్టి మాసిపోయి ఉంటుందది. ఒకవేళ దానిని, లచ్చిమివాళ్ల నాన్న చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అంటించుండవచ్చు.

    పిల్లలు తలుపాటను ఆడుకొంటూ ఉన్నపుడు ఊరి తలారి అక్కడకు వచ్చినాడు.

    "లచ్చిమీ మీ నాన్న ఎక్కడే?” “ఊరికి వెళ్తున్నాడు.” "మీ అమ్మా?”

    “చేనుపనికి పోయుంది.”

    “మీ అమ్మ వస్తే ఇంటిపన్నును తెచ్చిచ్చి పొమ్మను. తలారి వచ్చి అడిగేసి

    వెళ్లినాడని చెప్పు, సరేనా!”

    సరేనన్నట్లుగా తలను ఆడించింది లచ్చిమి.

    —

    మరునాడు, లచ్చిమి వాళ్ల అమ్మ ఉన్నపుడే వచ్చి పన్ను కట్టమని వచ్చి కూర్చున్నాడు తలారి. 

    అయ్యా, ఆయన ఊర్లో లేడు. మణిముత్తారుకు వెళ్లి అయిదు నెలలు అయింది. ఏ మందలా లేదు. మూడేళ్లుగా చుక్క చినుకు లేదే. మేము ఎక్కడి నుండి తెచ్చి కట్టేది పన్నును? ఏదో కూలికినాలికి పోయి ఈ బిడ్డల్ని కాపాడుకోవడమే పెద్దపనిగా ఉంది. మీకు తెలియనిదా?" అనింది.

    ఈ మాటలు తలారి గుండెల్ని తడమలేదు. ఇలాంటి పలుకుల్ని ఎందరో పలుకగా విన్నవాడు కదా అతడు.

    “మేమేం చేయగలం తల్లీ ఈ ఏడాది ఎలాగైనా పన్ను కట్టే తీరాలి. ఆనక మామీద వెక్కస పడి   ఒదవులేదు," చెప్పేసి వెళ్లినాడు. 

    --

    ఒకనాటి పొద్దుటిపూట ఇంటి ముందున్న బయలులో పిల్లలంతా కూర్చుని మాట్లాడుకొంటూ ఉన్నారు. నలుగురుని  పిలుచుకొని ఆ తలారి ఇంటివైపుకు వచ్చినాడు. వాళ్లు బిరబిర ఇంటి దగ్గరకు వెళ్లి చూసినారు. తలారి చేదోడుతో వచ్చిన వాళ్ళందరూ  కలసి ఆ తలుపును విప్పి, తలమీద పెట్టుకొని వెనుతిరిగినారు. 

    చూస్తున్న పిల్లలకు ఇదంతా ఒక వేడుకగా అనిపించింది. ఒకడు సన్నాయిని వాయిస్తున్నట్లుగా చేతుల్ని ముందుకు చాచి పీప్పీ... పీ... పీ అని సద్దు చేసినాడు. ఇంకొకడు వేళ్లను చాపి, ఒళ్లును వెనక్కు వంచి, తొడలమీద డోలు కొడుతున్నట్లుగా కొట్టుకొంటూ డుండుం డుండుం అని చప్పుడు చేసినాడు. శ్రీనివాసుడు కూడా అందులో పాలు పంచు కొన్నాడు. అలా ఆ పిల్లలు తలుపును ఎత్తుకెళుతున్న వాళ్ల వెనక ఉవ్వాయిగా ఊరేగుతూ వెంబడించినారు.

    తలారి ఆ గోలను తట్టుకోలేక, “వెళతారా లేదారా పిల్ల గాడిదల్లారా,” అని అరచినాడు.

    పిల్లలు వెనక్కు పరుగుపట్టినారు. వాళ్లంతా ఇంటికి తిరిగి వచ్చేసరికి, లచ్చిమి వాకిలి గుమ్మంలో కూర్చుని ఏడుస్తూ ఉంది. అందరూ గోల చేయకుండా వచ్చి లచ్చిమి దగ్గర కూర్చున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అలా ఎంతోసేపు ఉండలేకపోయినారు. తనకు తానే చెప్పుకొంటున్నట్లుగా ఒక అమ్మాయి, “నేను మా ఇంటికి వెళుతున్నా,” అంటూ లేచింది. వెంటనే బిలబిలమని అందరూ లేచి వెళ్లిపోయినారు. లచ్చిమీ శీనివాసుడూ మట్టుకే అక్కడ మిగిలినారు. చాలాసేపటి వరకూ వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. 

    పసిబిడ్డ ఏడుపును విని, లచ్చిమి లోపలకు చూసింది. ఆ లోపలే శీనివాసుడు బిడ్డను ఎత్తుకోడానికి వెళ్లినాడు. బిడ్డను తాకి చేతిని చటుక్కున వెనక్కు లాక్కున్నాడు. అక్కను చూసినాడు. లచ్చిమి కూడా చూసింది.

    "పాపను తాకి చూడక్కా, ఒళ్లు కాలిపోతూ ఉంది," అన్నాడు. లచ్చిమి తాకి చూసింది. నిప్పులాగా కాలుతూ ఉంది.

    —

    పొద్దు మునిగిన చాలాసేపటికి, తలమీద పుల్లల మోపుతో వచ్చింది అమ్మ. పుల్లల్ని ఎడువుకొంటున్నపుడు ఆమె చేతిని తేలు కుట్టింది. నొప్పిని అణచుకొంటూ నెమ్మదిగా వచ్చి పిల్లలు పక్కన కూర్చుని పసిబిడ్డను ఎత్తుకొనింది. " ఒళ్ళు  కాలిపోతున్నదే,' అని లోలోపల సణుక్కొనింది. అంతలోనే పిల్లలు పొద్దున జరిగిన దానిని అమ్మతో చెప్పినారు.

    వినిన రంగమ్మకు ఊపిరి ఆగినట్లయింది. ఒళ్లంతా పదరు పుట్టింది.  కడుపులో తట్టుకోలేనంత అలమట కలిగి, పిల్లల్ని గట్టిగా పొదువుకొనింది. పిల్లల ముందు ఏడవకూడదనుకొని ఎంతగా అణచుకొన్నా ఆగలేదు. 'అయ్యయ్యో' అంటూ అలమటించిపోయింది. బెదరిపోయిన పిల్లలు ఎడంగా జరిగినారు. ఏదో తెలియని జడుపుతో వాళ్లు కూడా ఏడుపునెత్తుకొన్నారు.

    మణిముత్తారు నుండి ఏ మందలా రాలేదు. నాళ్లు జరిగిపోతూనే ఉన్నాయి. రేయిపూట చలికి తాళలేక పిల్లలు వణుకుతూ ఉన్నారు. తలుపు లేకపోవడంతో ఇల్లుండీ ఒదవు లేనట్లయింది. జీరాపి నెల  చలి, నంజుగాలిలాగా ఇంట్లోకి జొరబడి వాళ్లను గుద్దుతూ ఉంది. పసిపిల్ల ఒళ్లు పాడవుతూ ఉంది. ఒకనాటి రేయి చలిని తట్టుకోలేక అది ఆ ఇంటినీ తనవాళ్లనీ వదలి వెళ్లిపోయింది. రంగమ్మ అలమటను ఇంతని చెప్పలేము. లచ్చిమి కోసం శీనివాసుడి కోసమే ఆమె ఊపిరిని నిలుపుకొనుంది.

    —

    శీనివాసుడు ఇప్పుడు బడికి వెళుతున్నాడు. ఒకనాటి నడిపొద్దులో బడి నుండి ఇంటికి వస్తున్నపుడు, వాడికొక నిప్పుపెట్టి అట్టబొమ్మ దొరికింది. తెచ్చి అక్కకు చూపించినాడు. లచ్చిమి పట్టించుకోలేదు.

    "అక్కా నాకు తొందరగా గంజి పోయి, ఆకలవుతున్నది. తాగేసి ఈ బొమ్మను అంటించాలి.”

    “తమ్ముడూ, గంజి లేదురా. ఈ మాటను ఎంతో తొప్పరగా చెప్పింది. "ఏం? నువ్వు పొద్దున కాస్తుంటే నేను చూసినానే?”

    అవునన్నట్లు తలనాడించి, “నేను బయటకు వెళ్లున్నపుడు ఏదో కుక్క వచ్చి గంజినంతా తాగేసి పోయిందిరా, తలుపు లేదుకదా,” అనింది అలమట అంగ లారుపూ పొంగుతుండగా. అమ్మ ఆకలితో చేను నుండి వస్తే ఏం చెప్పాలి అనే తలపును అణచుకొనింది లచ్చిమి.

    శ్రీనివాసుడు అక్కడ చింది పడున్న ఒకటి రెండు సజ్జ మెతుకుల్ని ఏరి, బొమ్మ వెనకాల పూసి అంటించడానికి వచ్చినాడు. తలుపు లేదు, ఏం చేయాలో తోచలేదు. గోడకు అంటించినాడు. బొమ్మ కింద పడిపోయింది. మరో చోటా మరో చోటా అంటించి చూసినాడు.  అంటుకోలేదు.ఏమరుపు వల్లా, ఆకలివల్లా వాడు ఏడవడం మొదలిడినాడు.

    —

    మాపటేళ లచ్చిమి కుండా చట్టిని రుద్ది కడుగుతూ ఉంది. మొకంలో ఆబ పొంగుతూ ఉండగా, ఎగూపిరి దిగూపిరిగా పరుగెత్తి వచ్చినాడు శీనివాసుడు. "అక్కా అక్కా మన బడి పక్కన చావడి ఉంది చూడూ... దాని వెనక మన ఇంటి తలుపు ఉంది, నేను నా కళ్లారా చూసినాను,” అన్నాడు.

    “అలాగా, నిక్కమేనా? ఎక్కడ రా చూద్దాం,” అని శీనివాసుడి చేతిని కొనింది. ఇద్దరూ చావడివైపుకు పరుగు తీసినారు.

    నిక్కమే!  అదే తలుపు పడి ఉంది. దూరం నుండి తమ నేస్తాన్ని కనిపెట్టేసి నారు ఆ చిన్నారులు. పక్కన ఎవరైనా ఉన్నారా అని చుట్టుపక్కల చూసినారు. ఎవరూ లేరు.

    వాళ్లకు కలిగిన ఎలమిని మాటలతో చెప్పలేము.

    అక్కడ మొలిచున్న వామింటా మెట్టతామరా చెట్లు వాళ్ల కాళ్ల కింద పడి పరపరమని నలిగినాయి. విరవిరగా ఆ తలుపు పక్కకు పరుగెత్తినారు. దగ్గరకు పోయి దానిని తాకినారు, తడిమినారు. దానికి అంటుకొనున్న చెదమన్నును తన పావడతో తట్టి తుడిచింది లచ్చిమి.

    తలుపుకు తన మొకాన్ని ఆనించుకొనింది. ఏడవాలనిపించేలాగా ఉంది ఆ పిల్లకు. 

    శీనివాసుడిని గట్టిగా పట్టుకొనింది. ముద్దు పెట్టుకొనింది. నవ్వింది. కళ్లలో నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి. శీనివాసుడు కూడా లచ్చిమిని చూసి నవ్వినాడు. వాళ్ల ఇద్దరి చేతులూ తలుపు నేస్తాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాయి.

    (ఈ కతలోని 'శీనివాసన్' అనే పేరును కీరాగారి కోరిక మేరకు తెలుగులో 'శీనివాసుడు'గా మార్చినాను - స వెం రమేశ్ )

    —--------

    *హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -

    https://bit.ly/3NmJ31Y

    *ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –

    స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam

    ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5

    *మమ్మల్ని సంప్రదించడానికి [email protected] కి మెయిల్ చెయ్యండి.

    హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల కథలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

    https://bit.ly/Storycollection

    హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల సంభాషణలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

    https://bit.ly/44v7CzW

    హర్షణీయంలో ప్రసారం చేసిన వనవాసి నవల అన్ని భాగాలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి

    https://bit.ly/vanavasinovel

    వనవాసి నవలలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యావరణ వేత్తలతో జరిపిన సంభాషణలు వినాలంటే కింది లింక్ ను ఉపయోగించండి.

    https://bit.ly/Ecovanavasi

    ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    16 min
  • తెలుగు వారి తమిళ కతలు - 'తెన్నాటి తెమ్మెర' కథాసంకలనం గురించి స.వెం. రమేష్ గారితో...

    ఈ ఎపిసోడ్ లో శ్రీ. స. వెం. రమేశ్ తాను సేకరించి సంపాదకీయం వహించిన 'తెన్నాటి తెమ్మెర' కథాసంకలనాన్ని మనకు పరిచయం చేస్తారు. ఈ కథలన్నీ కూడా తెలుగు మూలాలున్న తమిళ రచయితలు రాసినవి. తమిళ మూల కథలను రమేశ్ గారే తెలుగు లోకి అనువదించారు.

    స. వెం. రమేశ్ తెలుగు భాషాభిమాని,  తెలుగు భాషా పరిరక్షణ సమితిలో చుఱుకైన సభ్యులు. వీరు వ్రాసిన ప్రళయ కావేరీ కథలు చాలా ప్రసిద్ధి పొందాయి. ప్రస్తుతం పులికాట్ సరస్సుగా వ్యవహరింపబడుతున్న ప్రళయకావేరీ తీరాన రచయిత గడిపిన బాల్యంలోని కొన్ని సన్నివేశాలను రచయిత కథలుగా మలిచి చదువరులకు అందించారు.తెలుగు భాషాలోకంలో అచ్చ తెలుగు పదాల వేట కొనసాగిస్తున్న అన్వేషకుడు, అలుపెరగని భాషాభిమాని.

    సవెం రమేష్ గారి తెలుగు భాషోద్యమ కృషి మీద హర్షణీయంలో సంభాషణ

    https://harshaneeyam.in/2021/07/16/savem-garu-interview/

    తెన్నాటి తెమ్మెర పుస్తకం కొనడానికి -

    https://bit.ly/thennati

    *హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -

    https://bit.ly/3NmJ31Y

    *ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –

    స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam

    ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5

    *మమ్మల్ని సంప్రదించడానికి [email protected] కి మెయిల్ చెయ్యండి.

    హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల కథలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

    https://bit.ly/Storycollection

    హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల సంభాషణలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

    https://bit.ly/44v7CzW

    హర్షణీయంలో ప్రసారం చేసిన వనవాసి నవల అన్ని భాగాలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి

    https://bit.ly/vanavasinovel

    వనవాసి నవలలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యావరణ వేత్తలతో జరిపిన సంభాషణలు వినాలంటే కింది లింక్ ను ఉపయోగించండి.

    https://bit.ly/Ecovanavasi

    ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    17 min
  • అనిల్ అట్లూరి గారితో సంభాషణ - రెండవ భాగం

    ఈ ఎపిసోడ్ లో రచయిత, అనువాదకులు, కాలమిస్ట్ అనిల్ అట్లూరి గారు తన సాహితీ జీవితం గురించి, పుస్తక ప్రచురణ రంగంలో వస్తున్న అనేక మార్పుల గురించి విస్తారంగా హర్షణీయంతో మాట్లాడారు. అనిల్ అట్లూరి గారి తండ్రి ప్రముఖ సినీ రచయిత, కథా రచయిత అట్లూరి పిచ్చేశ్వర రావు గారు. తల్లి చౌదరాణి గారు స్థాపించిన 'రాణి బుక్ సెంటర్' ద్వారా అనిల్ అట్లూరి తెలుగు పుస్తకాలను అనేక దశాబ్దాలు మద్రాసులోని పుస్తక ప్రేమికులకు అందించారు. అనిల్ గారి మాతామహులు కవి రాజు త్రిపురనేని రామస్వామి గారు. ప్రస్తుతం కథాసాహిత్యంపై ప్రతి నెలా రెండో శని వారం వేదిక అనే ఆన్లైన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వేదిక బ్లాగ్లో సాహితీ వ్యాసాలు రాస్తున్నారు.

    అనిల్ గారు ప్రచురించిన 'అట్లూరి పిచ్చేశ్వర రావు కథలు' పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి.

    https://bit.ly/Atluri

    అలాగే ప్రతి నెలా కథ సాహిత్యం గురించి వారు నిర్వహించే చర్చా క్రమం గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోడానికి కింది లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో చేరండి.

    https://bit.ly/kathavedika

    41 min
  • అనిల్ అట్లూరి గారితో సంభాషణ - మొదటి భాగం

    48 min

About Harshaneeyam

From the publisher's feed

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast.

More shows like Harshaneeyam

KiranPrabha  Telugu Talk Shows by kiranprabha

KiranPrabha Telugu Talk Shows

52 Listeners