Harshaneeyam

Harshaneeyam

By HarshaneeyamArtsBooksFiction
Download on the App Store

Harshaneeyam episodes

  • 'East Wind' పుస్తక పరిచయం - ఉణుదుర్తి సుధాకర్ గారితో

    ఉణుదుర్తి సుధాకర్ గారు రాసిన 'తూరుపు గాలులు' పుస్తకం సౌత్ సైడ్ బుక్స్ పబ్లిషింగ్ ద్వారా ఇంగ్లీష్ లో 'East Wind' పేరుతో అనువదించబడింది. ఈ అనువాద ప్రక్రియలో తన అనుభవాన్ని సుధాకర్ గారు మనతో పంచుకున్నారు, ఈ ఎపిసోడ్లో. త్వరలో ఈ పుస్తకం Hyderabad book trust వెబ్సైటు ద్వారా, ఇతర పుస్తక విక్రేతల ద్వారా లభ్యం అవుతుంది.

    ఆటా బహుమతి పొందిన 'యారాడకొండ' నవలా రచయిత శ్రీ . ఉణుదుర్తి సుధాకర్. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్ అయిన శ్రీ సుధాకర్ రాసిన 'తూరుపు గాలులు' ' చలిచీమల కవాతు' కథాసంపుటాలు కూడా విశేష ఆదరణ పొందాయి.

    రచయిత పుస్తకాలు కొనడానికి - https://bit.ly/unudurthi



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    19 min
  • 'తెలుగు కథ స్థాయి' - పాత్రికేయులు, రచయిత మందలపర్తి కిషోర్ గారితో సంభాషణ

    మందలపర్తి కిషోర్ గారు గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు లోనూ ఇంగ్లీష్ లోనూ కవిత్వం రాస్తున్నారు. పుస్తక అనువాదాలు చేస్తున్నారు. తెలుగు కథను , ఇంగ్లీష్ కథను విస్తృతంగా చదివారు. పత్రికా రంగంలో విశేష కృషి చేశారు. సిఫీ, ఇండియా టుడే-తెలుగు పత్రికల సంపాదకునిగా వ్యవహరించారు. 'కన్యాశుల్కం పలుకుబడి' (గురజాడ పదకోశం - 1), పడమటి కిటికీ (పాశ్చాత్య సాహిత్య పరిచయం) , పెరటి చెట్టు (వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్ర-పరిచయం) అనే పుస్తకాలు ప్రచురించారు.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    40 min
  • 'డిస్టోపియా' కథలు - రచయిత్రి శ్రీసుధ గారితో పరిచయం

    గుంటూరు జిల్లాకి చెందిన శ్రీసుధ మోదుగు, వైద్యరంగంలో పనిచేస్తున్నారు. జమైకాలో నివాసం. 'అమోహం', 'విహారి', వీరి కవితా సంకలనాలు. రెక్కల పిల్ల, డిస్టోపియా అనే కథాసంపుటాలను ప్రచురించారు. 'అంతర్హిత' అనే నవల ఈ మధ్యనే విడుదల అయింది.

    'డిస్టోపియా' కొనడానికి కింది లింక్ ఉపయోగించండి.

    http://bit.ly/3wg2nUW



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    33 min
  • 'ఆట' - శ్రీసుధ గారు రాసిన 'డిస్టోపియా' నించి

    'ఆట' అనే ఈ కథ శ్రీసుధ మోదుగు గారు రాసిన 'డిస్టోపియా' అనే కథా సంపుటం నించి. రచయిత్రి, కవయిత్రి అయిన శ్రీసుధ గారు వృత్తి రీత్యా వైద్యులు. జమైకాలో నివాసం. వారికి కృతజ్ఞతలు.

    పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి.

    http://bit.ly/3wg2nUW



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    16 min
  • 'దేవుడమ్మ మరో పది కథలు' - రచయిత్రి ఝాన్సీ గారితో సంభాషణ

    ఝాన్సీ గారు రాసిన మొదటి కథల పుస్తకం 'దేవుడమ్మ మరో పది కథలు' ఈ మధ్యనే అందుబాటులోకి వచ్చింది. 'లా' లో డిగ్రీ తీసుకున్న ఝాన్సీ గారు, మాస్టర్స్ ఇన్ జర్నలిజం , మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేశారు. కొన్నాళ్ళు తిరుపతి లో ఆంధ్రజ్యోతి - స్టాఫ్ రిపోర్టర్ గా పని చేసి, ప్రస్తుతం ఒక ఐటీ కంపెనీని నడుపుతూ బెంగుళూరులో నివాసం వుంటున్నారు.

    అమెజాన్ ద్వారా పుస్తకం కొనడానికి ఈ లింకుని ఉపయోగించండి. - https://harshaneeyam.captivate.fm/devudamma

    హర్షణీయం స్పాటిఫై ఛానల్ -

    https://harshaneeyam.captivate.fm/spot



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    48 min
  • 'పార్వేట' రచయిత సురేంద్ర శీలంతో సంభాషణ

    కర్నూల్ జిల్లా కోవెలకుంట్ల ప్రాంతానికి చెందిన, ఇంజనీరింగ్ చదివిన, ఇరవై తొమ్మిదేళ్ళ సురేంద్ర శీలం రాసిన కథల పుస్తకం - పార్వేట’. గత మూడేళ్ళ క్రిందటే తెలుగు కథలు చదవడం రాయడం మొదలు పెట్టిన ఈ రచయిత మొదటి పుస్తకం ఇది.

    కథలన్నీ ఆ ప్రాంతపు మాండలికంలో రాసినవే. మాండలికం వాడిన పద్ధతి చదువుకోడానికి ఎక్కడా అడ్డం రాలేదు, అందాన్నిచ్చింది. అక్కడి గ్రామీణ జీవితాన్ని, సమస్యలనీ చక్కటి పాత్రలను సృష్టించడం ద్వారా మన ముందుకు తెచ్చారు రచయిత.

    పుస్తకం కొనడానికి -

    https://www.amazon.in/Parveta-Kathalu-Surendra-Seelam/dp/B0BQN7H7P5/ref=sr_1_1?crid=1H2NNIDX6SHRZ&keywords=parveta&qid=1672370986&sprefix=parveta%2Caps%2C236&sr=8-1



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    17 min
  • బతుకు సేద్యం నవలాపరిచయం

    బతుకు సేద్యం -  జహీరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న గ్రామీణ మహిళల   గురించి, ఒక ప్రభుత్వేతర సంస్థ సహాయంతో వారి జీవితాలను వారు  కష్టపడి ఎలా సరిదిద్దుకున్నారో, వివరిస్తూ రాసిన పుస్తకం. యదార్థ సంఘటనలనాధారం చేసుకుని రాసిన కాల్పనిక నవల. ఎపిసోడ్ లో ముందుగా ఛాయా మోహన్ గారు మాట్లాడతారు. తర్వాత రచయిత శాంతి ప్రభోదిని గారు నవల గురించి మరిన్ని వివరాలు అందిస్తారు.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    18 min
  • ఎండ గుర్తు - అజయ్ ప్రసాద్ గారి 'గాలి పొరలు' కథా సంపుటంనించి

    'ఎండ గుర్తు' అనే ఈ కథ అజయ్ ప్రసాద్ గారి 'గాలి పొరలు' అనే కొత్త కథాసంపుటంలో నుంచి. ప్రకాశం జిల్లా అద్దంకి ఆయన సొంత వూరు. ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో వుంటున్నారు. మంచి చదువరి. చక్కటి రచయిత. ఇది ఆయన రెండో కథాసంపుటం. పుస్తకం కొనడానికి కింది లింక్ ను ఉపయోగించండి.

    https://www.telugubooks.in/collections/telugubooks-new-releases/products/gaali-poralu



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    16 min
  • 'చెఖోవ్ కథలు - 1' పుస్తకం, అనువాదకులు అరుణ గారితో పరిచయం

    'Father of Modern short story' అని చెప్పబడే రష్యన్ రచయిత చెఖోవ్ , 1880 - 1905 ప్రాంతంలో ఆరువందలకు పైగా కథలను రాసారు. ఈయన కథలు ప్రపంచ వ్యాప్తంగా. అనేక భాషల్లో అనువదించబడి ప్రాచుర్యాన్ని పొందాయి. ఇంగ్లీష్ నించి చెఖోవ్ కథలను తెలుగులోకి అనువదించి మన ముందుకు తెస్తున్నారు శ్రీమతి అరుణ గారు. ఈ పుస్తకం గురించి ఈ ఎపిసోడ్ లో ఆమె మనకు వివరిస్తారు.

    ఎపిసోడ్లో ముందుగా ఈ పుస్తకాన్ని మనకు అందిస్తున్న పాత్రికేయులు, రచయిత కుమార్ కూనపరాజు గారు చెఖోవ్ గురించి మాట్లాడతారు.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    32 min
  • ప్రముఖ సామాజిక కార్యకర్త, రచయిత, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ గీతా రామస్వామి గారితో సంభాషణ

    గీతా రామస్వామి గారు ఒక ప్రముఖ సామాజిక కార్యకర్త, రచయిత్రి. వీరు  హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ని నిర్వహిస్తూ అనేక సంవత్సరాలుగా సామాజిక సేవా రంగంలో, పుస్తక ప్రచురణా రంగంలో పని చేస్తున్నారు. సామాజిక కార్యకర్తగా తన  అనుభవాలపై ఈ మధ్య వీరు  ఇంగ్లీష్ లో రాసిన  ‘Land, Guns, Caste, Woman: The Memoir of a Lapsed Revolutionary’ అనే పుస్తకం చాలా ఆదరణకు నోచుకుంది. ఈ ఇంటర్వ్యూలో  వామపక్ష ఉద్యమంలో, ఘజియాబాద్ లో పారిశుధ్య కార్మికులతో, ఇబ్రహీం పట్నంలో రైతు కూలీ సంఘంతో తన  అనుభవాల గురించి, తనను ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి గీతా రామస్వామి గారు మాట్లాడారు. 

    పుస్తకం కొనాలంటే ఈ లింక్ ని ఉపయోగించండి. https://www.amazon.in/Land-Guns-Caste-Woman-Revolutionary/dp/8194865417  





    ***Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything. 



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    54 min

About Harshaneeyam

From the publisher's feed

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast.

More shows like Harshaneeyam

KiranPrabha  Telugu Talk Shows by kiranprabha

KiranPrabha Telugu Talk Shows

52 Listeners