Harshaneeyam

Harshaneeyam

By HarshaneeyamArtsBooksFiction
Download on the App Store

Harshaneeyam episodes

  • సుప్రసిద్ధ కథకులు , దర్శకులు, వంశీ గారి తో హర్షణీయం! పార్ట్ - II

    సుప్రసిద్ధ కథకులు , దర్శకులు వంశీ గారి రచనా జీవితం గురించి తెలుసుకోడానికి, హర్షణీయం టీం ఆయనను కలవడం జరిగింది. ఇంటర్వ్యూలో పాల్గొని తమ రచనా అనుభవాలను , అభిప్రాయాలను పంచుకున్నందుకు వంశీ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    30 min
  • సుప్రసిద్ధ కథకులు , దర్శకులు, వంశీ గారి తో హర్షణీయం! పార్ట్ - I

    సుప్రసిద్ధ కథకులు , దర్శకులు వంశీ గారి రచనా జీవితం గురించి తెలుసుకోడానికి, హర్షణీయం టీం ఆయనను కలవడం జరిగింది. ఇంటర్వ్యూలో పాల్గొని తమ రచనా అనుభవాలను , అభిప్రాయాలను పంచుకున్నందుకు వంశీ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    29 min
  • వేలుపిళ్లై రామచంద్ర రావు గారు - హర్షణీయం తో!

    ఈ ఎపిసోడ్ లో సుప్రసిద్ధ కథకులు , 'వేలుపిళ్లై' రామచంద్ర రావు గారితో హర్షణీయం ఇంటర్వ్యూ వినండి. అరవై ఏళ్ల రచనా జీవితంలో , పదంటే, పదే కథలు రాసారు రావు గారు. అన్నీ కథలు తెలుగు పాఠకులకు అత్యంత సుపరిచితాలు.

    ఎక్కువ కథలు , నీలగిరి టీ ఎస్టేట్స్, నేపధ్యంగా రాసినవి. అక్కడ అసిస్టెంట్ మేనేజర్ గారి చేరి, చైర్మన్ గా రిటైర్ అయ్యిన రామచంద్ర రావు గారు, ఆంధ్రా, మైసూరు స్టేట్ టెన్నిస్ ఛాంపియన్ కూడా.

    ఈ ఇంటర్వ్యూలో ఆయన తన కథల గురించి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు పంచుకోడం జరిగింది. ఇంటర్వ్యూలో హర్షణీయం తో బాటూ, పాత్రికేయులు శ్రీ తాడి ప్రకాష్ గారు, రామచంద్ర రావు గారి సోదరులు , జగన్నాధ భూపతిగారు కూడా పాల్గొన్నారు.

    ఇంతకు ముందు ఎపిసోడ్స్ , రామచంద్ర రావు గారి రచనలపై 'శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ ' గారి అభిప్రాయం , 'ఏనుగుల రాయి' కథ కింద లింక్స్ లో చూడొచ్చు.

    మార్చి నెలలో 'అన్వీక్షికి' పబ్లిషర్స్ ద్వారా 'వేలుపిళ్లై' కథాసంపుటం కొత్త ఎడిషన్ మీ ముందుకు రాబోతోంది.

    https://harshaneeyam.in/2021/02/15/mulllapudi-garu/

    https://harshaneeyam.in/2021/02/14/velupillai-ramachandrarao-garu/

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    43 min
  • 'పల్లవి పబ్లికేషన్స్' వెంకట నారాయణ గారితో హర్షణీయం

    'పల్లవి' వెంకట నారాయణ గారు, గత ఐదు దశాబ్దాలుగా, పుస్తక ప్రచురణా రంగంలో వున్నారు. పల్లవి పబ్లికేషన్స్ సంస్థ అధినేత. విజయవాడ వాస్తవ్యులు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన గత యాభై ఏళ్ళుగా తెలుగు పుస్తక ప్రచురణ, విక్రయాల్లో వచ్చిన మార్పులు, ఇబ్బందులు, తదితర విషయాల గురించి విస్తారంగా మాట్లాడారు. వారికి హర్షణీయం కృతఙ్ఞతలు.

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    44 min
  • రెండో భాగం - 'ఎదారి బతుకులు' రచయిత్రి భారతి గారితో ఇంటర్వ్యూ !

    ‘ఎదారి బతుకులు’ రాసిన ఎండపల్లి భారతి గారు, చిత్తూరు జిల్లా, దిగువ బురుజు గ్రామానికి చెందిన వారు.

    ప్రాధమిక విద్యను అభ్యసించిన భారతి గారు, గ్రామీణ జీవిత సమస్యలను, వస్తున్న మార్పులను, దగ్గరగా గమనిస్తూ వచ్చారు.

    గత ఇరవై సంవత్సరాలుగా చిత్తూరుజిల్లా ‘వెలుగు’ మహిళా సంఘాల (SERP – సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) పత్రిక ‘నవోదయం’లో విలేఖరి గా పనిచేస్తున్నారు.

    ప్రముఖ స్టిల్ లైఫ్ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్త , కిరణ్ కుమారి గారి ప్రోత్సాహంతో, కథలు రాయడం మొదలుపెట్టారు. వీడియోగ్రఫీ నేర్చుకుని కొన్ని వీడియో ఫిలిమ్స్ కూడా భారతి గారు తీయడం జరిగింది.

    ఇంటర్వ్యూలో భారతి గారు, తన కథల గురించే కాక, గ్రామీణ జీవితం గురించి, పాఠశాలల్లో విద్యావిధానం గురించి, ఇతర సమస్యల గురించి కూడా మాట్లాడటం జరిగింది.

    భారతి గారి రెండో కథల పుస్తకం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా త్వరలో మన ముందుకు రాబోతోంది.

    ఈ ఎపిసోడ్ కు తమ సహకారాన్ని అందించిన , కిరణ్ కుమారి గారికి , అపర్ణ తోట గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.

    ఇంటర్వ్యూ లో కి వెళ్లబోయే ముందు, ‘ ఎదారి బతుకులు ‘ కథలపై , సొలొమోన్ విజయకుమార్ గారి అభిప్రాయం విందాం.

    ఈ పుస్తకం కొనడానికి – https://hyderabadbooktrust.com/product/edari-batukulu-endapalli-bharathi-2

    ‘హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

    స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

    ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    34 min
  • సింగమనేని నారాయణ గారి రచనా జీవితం పై ఓల్గా గారు!

    2021 ఫిబ్రవరి 25 వ తేదీన , సింగమనేని నారాయణ గారి మరణం, తెలుగు సాహితీ ప్రేమికులకు తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. సుప్రసిద్ధ కథా రచయిత , విమర్శకులు నారాయణ గారు, తెలుగు కథ కు చేసిన సేవ అనన్య సామాన్యం. ఆయన కథారచన పై ప్రసంగించాలని , హర్షణీయం ప్రముఖ రచయిత్రి ఓల్గా గారిని కోరడం జరిగింది. వారు వెంటనే సమ్మతించి, చాల చక్కనైన వివరణాత్మకమైన సమీక్షను మనకందించారు. ఓల్గా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

    'సింగమనేని నారాయణ కథలు' అనే పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి.

    https://www.logili.com/short-stories/singamaneni-narayana-kadhalu-singamaneni-narayana/p-7488847-29345400079-cat.html#variant_id=7488847-29345400079

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    37 min
  • మొదటి భాగం - 'ఎదారి బతుకులు' రచయిత్రి భారతి గారితో ఇంటర్వ్యూ !

    ‘ఎదారి బతుకులు’ రాసిన ఎండపల్లి భారతి గారు, చిత్తూరు జిల్లా, దిగువ బురుజు గ్రామానికి చెందిన వారు.

    ప్రాధమిక విద్యను అభ్యసించిన భారతి గారు, గ్రామీణ జీవిత సమస్యలను, వస్తున్న మార్పులను, దగ్గరగా గమనిస్తూ వచ్చారు.

    గత ఇరవై సంవత్సరాలుగా చిత్తూరుజిల్లా ‘వెలుగు’ మహిళా సంఘాల (SERP – సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) పత్రిక ‘నవోదయం’లో విలేఖరి గా పనిచేస్తున్నారు.

    ప్రముఖ స్టిల్ లైఫ్ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్త , కిరణ్ కుమారి గారి ప్రోత్సాహంతో, కథలు రాయడం మొదలుపెట్టారు. వీడియోగ్రఫీ నేర్చుకుని కొన్ని వీడియో ఫిలిమ్స్ కూడా భారతి గారు తీయడం జరిగింది.

    ఇంటర్వ్యూలో భారతి గారు, తన కథల గురించే కాక, గ్రామీణ జీవితం గురించి, పాఠశాలల్లో విద్యావిధానం గురించి, ఇతర సమస్యల గురించి కూడా మాట్లాడటం జరిగింది.

    భారతి గారి రెండో కథల పుస్తకం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా త్వరలో మన ముందుకు రాబోతోంది.

    ఈ ఎపిసోడ్ కు తమ సహకారాన్ని అందించిన , కిరణ్ కుమారి గారికి , అపర్ణ తోట గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.

    ఇంటర్వ్యూ లో కి వెళ్లబోయే ముందు, ‘ ఎదారి బతుకులు ‘ కథలపై , సొలొమోన్ విజయకుమార్ గారి అభిప్రాయం విందాం.

    ఈ పుస్తకం కొనడానికి – https://hyderabadbooktrust.com/product/edari-batukulu-endapalli-bharathi-2

    ‘హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

    స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

    ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    20 min
  • 'ఛాయా మోహన్' గారితో హర్షణీయం

    ఛాయా మోహన్ గారు, గత కొన్నేళ్ళుగా, తెలుగు ప్రచురణా రంగంలో వున్నారు. ఛాయా పబ్లికేషన్స్ పేరుతో ఇప్పటిదాకా దాదాపు డెబ్భయి పుస్తకాల దాకా ప్రచురించారు. మంచి చదువరి. ఈ ఇంటర్వ్యూలో ఆయన, తెలుగు సాహిత్యం మీద ఆయన అభిప్రాయాల గురించి, ఛాయా ప్రచురణల గురించి, అనువాద సాహిత్యం గురించి మాట్లాడటం జరిగింది.

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    44 min
  • part II - మనసు ఫౌండేషన్ ఎం.వి.రాయుడు గారితో ఇంటర్వ్యూ

    మనసు ఫౌండేషన్ వెబ్సైటు అడ్రస్ : http://www.manasufoundation.com/works/

    మనసు ఫౌండేషన్ ఇమెయిల్ - [email protected]

    ఆఫీసు అడ్రస్:

    MaNaSu Foundation

    Kaniampadu Village

    Near Varikuntapadu

    SPSR Nellore District

    Andhra Pradesh

    PIN Code : 524227

    https://goo.gl/maps/dTiBnbd7g842

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    27 min
  • part I - మనసు ఫౌండేషన్ ఎం.వి.రాయుడు గారితో ఇంటర్వ్యూ

    ఇంజనీరింగ్ డిగ్రీ , M.Sc through research , ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ లో పూర్తి చేసిన ఎం. వి రాయుడు గారు, పవర్ ఎలక్ట్రానిక్స్ లో డాక్టరేట్ తీసుకున్నారు . మనసు ఫౌండేషన్ ని 2006 వ సంవత్సరం లో తన సోదరులైన డాక్టర్ గోపీచంద్ , డాక్టర్ చంద్ర మౌళి గార్లతో కలిసి స్థాపించారు.

    తెలుగులో ఇప్పటిదాకా ప్రచురితమైన అన్ని పుస్తకాలను డిజిటల్ ఆర్కైవింగ్ చేసి భద్రపరచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మనసు ఫౌండేషన్ , ఇప్పటి దాకా 55 లక్షల పేజీల తెలుగు సాహిత్యాన్ని తన డేటాబేస్ లో ఉంచింది. ఇంకో మూడేళ్లలో తన లక్ష్యాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది.

    ఎవరైనా సరే తమ వద్ద వున్న అరుదైన తెలుగు పుస్తకాల పేర్లను , మనసు ఫౌండేషన్ కి పంపిస్తే, అవి వారి డేటాబేస్ లో లేకపోతే , మీ నుంచి సేకరించి స్కాన్ చేసి , భద్ర పరిచి, మళ్ళీ పుస్తకాలను వెనక్కి పంపించడం జరుగుతుంది.

    కింద ఇచ్చిన లింక్ లో మనసు ఫౌండేషన్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు చూడొచ్చు.

    ఇదేకాకుండా , తెలుగులో సుప్రసిద్ధులైన రచయితల సమగ్ర లభ్య రచనలను కూడా ప్రచురిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా, గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీశ్రీ, కాళీపట్నం రామారావు, రావి శాస్త్రి, బీనా దేవి, జాషువా, ఎన్ వై పతంజలి, పఠాభి గార్ల సమగ్ర లభ్య రచనలను ప్రచురించింది.

    2018 వ సంవత్సరం నించి, నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం - కనియంపాడు కేంద్రం గా, మనసు ఫౌండేషన్ డిజిటైజేషన్ సెంటర్ ను నడుపుతోంది.

    ఈ ఇంటర్వ్యూలో రాయుడు గారు, మనసు ఫౌండేషన్ స్థాపించడం గురించి, ఫౌండేషన్ ద్వారా జరిగే అనేక కార్య క్రమాల గురించి, సాహిత్య ప్రచురణ లో వచ్చిన మార్పుల గురించి వివరించడం జరిగింది.

    ఇంటర్వ్యూ లో మొదట - 'గురజాడ సమగ్ర రచనలు' ప్రాజెక్టు లో పనిచేస్తున్నప్పుడు రాయుడి గారితో తన అనుభవాలను రచయిత , చారిత్రక పరిశోధకులు నెల్లూరు సర్వోదయ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్. కాళిదాస్ పురుషోత్తం గారు మనతో పంచుకుంటారు.

    * ఈ ఇంటర్వ్యూ కి తమ సమయాన్ని ఇచ్చిన రాయుడు గారికి, ఎపిసోడ్లో ప్రసంగించిన కాళిదాస్ పురుషోత్తం గారికి , మనసు ఫౌండేషన్ గురించి వివరాలు అందించిన అనిల్ బత్తుల గారికి , ఛాయా మోహన్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు.

    మనసు ఫౌండేషన్ వెబ్సైటు అడ్రస్ : http://www.manasufoundation.com/works/

    మనసు ఫౌండేషన్ ఇమెయిల్ - [email protected]

    ఆఫీసు అడ్రస్:

    MaNaSu Foundation

    Kaniampadu Village

    Near Varikuntapadu

    SPSR Nellore District

    Andhra Pradesh

    PIN Code : 524227

    https://goo.gl/maps/dTiBnbd7g842

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    37 min

About Harshaneeyam

From the publisher's feed

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast.

More shows like Harshaneeyam

KiranPrabha  Telugu Talk Shows by kiranprabha

KiranPrabha Telugu Talk Shows

52 Listeners