Harshaneeyam

Harshaneeyam

By HarshaneeyamArtsBooksFiction
Download on the App Store

Harshaneeyam episodes

  • రచయిత దేవులపల్లి క్రిష్ణమూర్తి గారితో ఇంటర్వ్యూ! 'నల్లగొండ మల్లి' గారితో కల్సి
    
    తన డెబ్భైయ్యో ఏట రచనలు మొదలుపెట్టి తన జీవితంలోని అనేక ఆసక్తికరమైన అనుభవాలను అత్యంత ప్రతిభావంతంగా తన రచనల్లో చిత్రీకరించిన దేవులపల్లి కృష్ణమూర్తి గారు , ఈ ఇంటర్వ్యూలో తన రచనల గురించి , తనను ఇన్ఫ్లుయెన్స్ చేసిన అనేక విషయాల గురించీ, సాహితీలోకంలో తన పరిచయాల గురించీ వివరించడం జరిగింది.

    ఈ ఇంటర్వ్యూలో ఇంకో విశేషం యువ కథా రచయిత మల్లికార్జున్ , హర్షణీయం టీం తో బాటూ కృష్ణమూర్తి గారిని ఇంటర్వ్యూ చెయ్యడం. కృష్ణమూర్తి గారికి , మల్లికార్జున్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెల్పుకుంటోంది.

    ముందుగా ఈ ఇంటర్వ్యూ గురించి మల్లికార్జున్ గారి మాటల్లో -

    హర్షణీయం పాడ్‌కాస్ట్‌కు స్వాగతం. నా పేరు మల్లికార్జున్. ఇంతకుముందల మీరు ఇదే పాడ్‌కాస్ట్‌ల చానామంది రచయితల మాటలు విని ఉంటరు. ప్రతి రచయితతోటి ముచ్చట మనకు ప్రత్యేకమే. అయితే ఇయ్యాల నేను మీకు పరిచయం చేస్తున్న రచయిత మటుకు ఇంకొంచం ప్రత్యేకం అనొచ్చు. ఎట్ల అంటే - ఈ రచయిత తనకు డెబ్భై ఏండ్లు వచ్చేదాంక ఒక్క కథగూడ రాయలే. అట్లని ఆయనేం సాహిత్యమే తెల్వకుంటగూడ లేడు. చిన్నప్పటిసందే సాహిత్యకారులు, చిత్రకారుల మధ్యన తిరుక్కుంట, సాహిత్యమంటే ప్రాణంగ బతికిన మనిషి. కానీ కథలు రాసుడు మటుకు డెబ్భై ఏండ్లు వచ్చినంకనే మొదలువెట్టిండు. ఇప్పుడు ఆయన వయసు ఎనభై ఒకటి. గత పదేండ్ల కాలంల ఏడు పుస్తకాలు తీసుకొచ్చిండు ఆయన. గుర్తుపెట్టుకోండి ఏడు పుస్తకాలు తీసుకొచ్చిండు. ఆయన పేరు దేవులపల్లి కృష్ణమూర్తి.

    హర్షణీయం టీమ్ ఆయనతోటి ఇంటర్వ్యూ చేద్దామని నన్నడిగి, ఆయన పుస్తకాలు కొన్ని ఇచ్చిపోయినరు. అయి చదివినప్పుడు నాకు తెలంగాణ జీవితాన్ని చూసినట్టు అనిపిచ్చింది. అంటే ఇప్పటి తెలంగాణేగాదు, సాయుధపోరాటం నుంచి మొన్నటి ప్రత్యేక తెలంగాణ పోరాటం దాంక పోరాటమే ఊపిరిగ బతికిన తెలంగాణ జీవితం ఉన్నది ఈ కథలల్ల.

    మొన్న ఆదివారం దేవులపల్లి కృష్ణమూర్తి గారితో మాట్లాడినం. డెబ్భై ఏండ్ల వయసులో వచ్చిన రాయాల్నన్న ఆలోచన ఆయన జీవితాన్ని ఎట్ల మార్చిందో అడిగినం. దానికి ఆయన ఒక మాట చెప్పిండు - అది మీరు ఆయన మాటలల్లనే వినాలి. అట్లనే పుట్టిన ఊరిని తల్చుకొని తనకు ఆ ఊరి మీద ఎందుకో ఇప్పుడు ప్రేమ లేదన్నడు ఆయన. అంత మాట ఎందుకు అన్నడు?

    ప్రస్తుతం నల్లగొండ జిల్లా నకిరేకల్‌ల ఉంటున్న ఆయన, తను చూసిన జీవితం, రాయాలనుకున్న కథలు చానా ఉన్నయని, అయితే అవి రాస్తానికి ఇప్పుడైతే ఆరోగ్యం సహకరిస్తలేదని అంటున్నడు.

    ఆయన ఆరోగ్యం బాగయ్యి మనకోసం ఇంకెన్నో కథలు రాయాల్నని కోరుకుందాం.

    దేవులపల్లి కృష్ణమూర్తి గారితో హర్షణీయం ముచ్చట… వినండి!

    హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

    స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

    ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    41 min
  • part - 2 :పుస్తక ప్రేమికుడు అనిల్ బత్తుల గారితో హర్షణీయం

    Part - II

    అనిల్ బత్తుల ఒక పుస్తక ప్రేమికుడు. ప్రేమ అంటే పుస్తకాలు కొనడం, చదవడం తో ఆగిపోకుండా, లభ్యం కాని అరుదైన తెలుగు పుస్తకాలను వెతికి వెంటాడి వాటిని వెలుగులోకి తీసుకొచ్చేంత. ఇదికాకుండా, సోవియెట్ పిల్లల జానపద కథలను ప్రచురించారు. వేల పుస్తకాలను తన ఖర్చుతో సేకరించి, లైబ్రరీలకు అందచేశారు. పదేళ్లు ఐటీ రంగంలో పని చేసి, రిసైన్ చేసి , ఇప్పుడు నిజామాబాద్ పక్కనుండే ఒక పల్లెకు షిఫ్ట్ అయ్యి, వరల్డ్ సినెమా లో పిల్లల గురించి వచ్చిన సినిమా పై అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం పిల్లల సినిమాల్లో వచ్చిన అత్యుత్తమ సినిమాలను 25 చిత్రాలను ఎంపిక చేసి , వాటి మీద ఒక పుస్తకం రాసి ప్రచురించారు. ఇప్పుడు ఆ పుస్తకం రెండో భాగం రాస్తూ, దాంతో బాటూ తాను తీయబోయే పిల్లల సినిమా స్క్రిప్ట్ వర్క్ లో మునిగి వున్నారు.

    ఈ ఇంటర్వ్యూలో , అనిల్ తన జీవితంలో పుస్తకాల పాత్ర గురించి , తన మోటివేషన్ ఫాక్టర్స్ గురించి, తెలుగు పిల్లల సినిమా, పిల్లల సాహిత్యం , తాను తీయబోయే సినిమా గురించి మాట్లాడటం జరిగింది.

    అనిల్ గారు రాసిన పిల్లల సినిమా పుస్తకం కొనాలంటే ఈ లింక్ ని ఉపయోగించండి. : http://bit.ly/anilbattulapillalacinemakathalu

    ఆయన సేకరించిన సోవియెట్ పుస్తకాల ఫ్రీ డౌన్లోడ్ కి – http://sovietbooksintelugu.blogspot.com/

    ‘శారద’ నటరాజన్ గారి గురించి: https://sahithyabatasarisarada.blogspot.com/

    హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    34 min
  • part - 1 :పుస్తక ప్రేమికుడు అనిల్ బత్తుల గారితో హర్షణీయం

    Part - I

    35 min
  • కథానవీన్ గారితో హర్షణీయం Part - 6

    కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. విస్తృతంగా తెలుగు కథ గురించి వ్యాసాలు రాసారు. ' ప్రజాసాహితి ' పత్రిక సంపాదకునిగా పని చేశారు.. అనేక దేశాల్లో , తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు.1990 లో ‘తెలుగు కథా సాహితి’ అనే సంస్థ ను ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరంలో ప్రచురితమైన కథల్లో కొన్ని ఉత్తమమైన కథలనెన్నుకొని, ప్రతి సంవత్సరం 'కథ' అనే సంకలనాలను వెలువరిస్తున్నారు గత మూడు దశాబ్దాలుగా.

    ఈ ఇంటర్వ్యూ ఆరో భాగం ఇప్పుడు మీకు అందించడం జరుగుతోంది.

    హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

    స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

    ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    20 min
  • కథానవీన్ గారితో హర్షణీయం Part - 5

    కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. విస్తృతంగా తెలుగు కథ గురించి వ్యాసాలు రాసారు. ' ప్రజాసాహితి ' పత్రిక సంపాదకునిగా పని చేశారు.. అనేక దేశాల్లో , తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు.1990 లో ‘తెలుగు కథా సాహితి’ అనే సంస్థ ను ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరంలో ప్రచురితమైన కథల్లో కొన్ని ఉత్తమమైన కథలనెన్నుకొని, ప్రతి సంవత్సరం 'కథ' అనే సంకలనాలను వెలువరిస్తున్నారు గత మూడు దశాబ్దాలుగా.

    ఈ ఇంటర్వ్యూ ఐదో భాగం ఇప్పుడు మీకు అందించడం జరుగుతోంది.

    హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

    స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

    ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    22 min
  • కథానవీన్ గారితో హర్షణీయం Part - 4

    కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. విస్తృతంగా తెలుగు కథ గురించి వ్యాసాలు రాసారు. ' ప్రజాసాహితి' పత్రిక సంపాదకునిగా పని చేశారు.. అనేక దేశాల్లో , తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు.1990 లో ‘తెలుగు కథా సాహితి’ అనే సంస్థ ను ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరంలో ప్రచురితమైన కథల్లో కొన్ని ఉత్తమమైన కథలనెన్నుకొని, ప్రతి సంవత్సరం 'కథ' అనే సంకలనాలను వెలువరిస్తున్నారు గత మూడు దశాబ్దాలుగా.

    ఈ ఇంటర్వ్యూ నాలుగో భాగం ఇప్పుడు మీకు అందించడం జరుగుతోంది.

    హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

    స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

    ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    18 min
  • కథానవీన్ గారితో హర్షణీయం: part -3

    ‘కథానవీన్’ గారితో హర్షణీయం ఇంటర్వ్యూలో హర్షణీయం టీం తో బాటూ, ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్ర గారు పాల్గొనడం జరిగింది. నవీన్ గారికి, నరేంద్ర గారికి కృతజ్ఞతలు.

    కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. ఎన్నో వ్యాసాలు , కథలూ , కవితలూ రాసారు. అనేక దేశాల్లో , తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు.1990 లో ‘తెలుగు కథా సాహితి’ అనే సంస్థ ను ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరంలో ప్రచురితమైన కథల్లో కొన్ని ఉత్తమమైన కథలనెన్నుకొని, ప్రతి సంవత్సరం ‘కథ’ అనే సంకలనాలను వెలువరిస్తున్నారు గత మూడు దశాబ్దాలుగా.

    ఈ ఇంటర్వ్యూ లో నవీన్ గారు, తెలుగు కథా సాహిత్యం గురించి , వారు ప్రచురించే ‘కథ’ సంకలనం గురించి మాట్లాడారు. మొత్తం ఆరు భాగాలుగా రాబోయే ఈ ఇంటర్వ్యూ నుంచి, మూడు భాగాలు ఈ వారం మీకు అందిస్తున్నాం.

    మొదటి భాగం : ఆధునిక కథ అంటే , తెలుగులో మొట్టమొదటగా వచ్చిన కథల గురించి, మంచి కథ అంటే

    రెండవ భాగం : హాస్యం థ్రిల్లర్ కథలు ‘కథ’ వాల్యూమ్స్ లో ఉండని కారణం, ‘కథ’ వాల్యూమ్ లో సెలక్షన్ అఫ్ స్టోరీస్ పై నవీన్ గారి వామపక్ష నేపధ్య ప్రభావం, తెలుగు కథకులు స్పృశించని అంశాలు

    మూడవ భాగం: తెలుగు కథలో గత వందేళ్లుగా వచ్చిన మార్పులు, డయాస్పోరా కథల గురించి, నవీన్ గారి తో మధురాంతకం నరేంద్ర గారు.

  • కథానవీన్ గారితో హర్షణీయం : Part - 2

    16 min
  • కథానవీన్ గారితో హర్షణీయం : Part - 1

    24 min
  • రెండో భాగం - స వెం రమేష్ గారితో హర్షణీయం

    స.వెం.రమేశ్ గారు జీవితమంతా తెలుగు భాషా ప్రాచుర్యానికే అంకితం చేసిన అపురూపమైన మనిషి. హర్షణీయంతో ఆయన మనం కోల్పోతున్న భాషా వైభవాన్ని సంస్కృతిని గురించి, మాట్లాడుతూ , ఈ ప్రయాణంలో తాను దాచుకున్న అనేక అనుభవాలను అనుభూతులను పంచుకున్నారు.

    పొరుగు రాష్ట్రాలలో , బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలలో లక్షల సంఖ్యలో వున్న తెలుగు వాళ్ళు అనుభస్తున్న అస్తిత్వవేదన మనకు కళ్ళకు కట్టినట్టుగా తెలియచేసారు రమేష్ గారు.

    రమేష్ గారికి హర్షణీయం హృదయపూర్వక కృతజ్ఞతలు.

    రమేష్ గారు ఇంటర్వ్యూలో ప్రస్తావించిన 'మొరసునాడు కథలు' పుస్తకం కొనాలంటే - https://kinige.com/book/Morasunadu+Katalu://bit.ly/2TXhEub

    ' తెలుగు వాణి' ప్రచురిస్తున్న 'అమ్మనుడి' పత్రిక చందా కట్టడానికి -

    సంవత్సర చందా - 300 రూపాయలు

    జీవిత చందా - 5000 రూపాయలు

    డాక్టర్. సామల లక్ష్మణ బాబు - 94929 80244

    హర్షణీయం పాడ్కాస్ట్ ని –

    ‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://bit.ly/harshagaanaa

    స్పాటిఫై (Spotify )యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam

    ఆపిల్ (apple podcast) ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5

    వెబ్ సైట్ : https://harshaneeyam.in/all

    హర్షణీయం ఫేస్ బుక్ లో - https://www.facebook.com/Harsha051271

    హర్షణీయం ట్విట్టర్ - @harshaneeyam

    హర్షణీయం యూట్యూబ్ లో - https://bit.ly/harshayoutube

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    39 min

About Harshaneeyam

From the publisher's feed

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast.

More shows like Harshaneeyam

KiranPrabha  Telugu Talk Shows by kiranprabha

KiranPrabha Telugu Talk Shows

52 Listeners