Harshaneeyam

Harshaneeyam

By HarshaneeyamArtsBooksFiction
Download on the App Store

Harshaneeyam episodes

  • మొదటి భాగం - స వెం రమేష్ గారితో హర్షణీయం

    స.వెం.రమేశ్ గారు జీవితమంతా తెలుగు భాషా ప్రాచుర్యానికే అంకితం చేసిన అపురూపమైన మనిషి. హర్షణీయంతో ఆయన మనం కోల్పోతున్న భాషా వైభవాన్ని సంస్కృతిని గురించి, మాట్లాడుతూ , ఈ ప్రయాణంలో తాను దాచుకున్న అనేక అనుభవాలను అనుభూతులను పంచుకున్నారు.

    పొరుగు రాష్ట్రాలలో , బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలలో లక్షల సంఖ్యలో వున్న తెలుగు వాళ్ళు అనుభస్తున్న అస్తిత్వవేదన మనకు కళ్ళకు కట్టినట్టుగా తెలియచేసారు రమేష్ గారు.

    రమేష్ గారికి హర్షణీయం హృదయపూర్వక కృతజ్ఞతలు.

    రమేష్ గారు ఇంటర్వ్యూలో ప్రస్తావించిన 'మొరసునాడు కథలు' పుస్తకం కొనాలంటే - https://kinige.com/book/Morasunadu+Katalu://bit.ly/2TXhEub

    ' తెలుగు వాణి' ప్రచురిస్తున్న 'అమ్మనుడి' పత్రిక చందా కట్టడానికి -

    సంవత్సర చందా - 300 రూపాయలు

    జీవిత చందా - 5000 రూపాయలు

    డాక్టర్. సామల లక్ష్మణ బాబు - 94929 80244



    హర్షణీయం పాడ్కాస్ట్ ని –


    ‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://bit.ly/harshagaanaa


    స్పాటిఫై (Spotify )యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam


    ఆపిల్ (apple podcast) ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5


    వెబ్ సైట్ : https://harshaneeyam.in/all


    హర్షణీయం ఫేస్ బుక్ లో - https://www.facebook.com/Harsha051271


    హర్షణీయం ట్విట్టర్ - @harshaneeyam


    హర్షణీయం యూట్యూబ్ లో - https://bit.ly/harshayoutube



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    34 min
  • రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో సంభాషణ

    ఆటా బహుమతి పొందిన 'యారాడకొండ' నవలా రచయిత శ్రీ . ఉణుదుర్తి సుధాకర్. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్ అయిన శ్రీ సుధాకర్ రాసిన 'తూరుపు గాలులు' కథాసంపుటం కూడా విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు కొత్తగా రాసిన ఇంకో కథల పుస్తకం ' చలిచీమల కవాతు. హర్షణీయం టీం ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ ఇప్పుడు మీ కోసం.

    'చలిచీమల కవాతు' కొనడానికి - https://amzn.to/3kXhuhK

    'చలిచీమల కవాతు' పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి - మీరు ఎంత కాలం నించీ కథలు రాస్తున్నారు? రచనకు మిమ్మల్ని ప్రేరేపించిన విషయం ఏమిటి?

    80లలో ఒకటి రెండు రాశాను. నాకవి అంతగా నచ్చలేదు. మళ్లీ అరవై ఏళ్ళ వయసులో మొదలు పెట్టాను. అంటే గత అయిదారేళ్లుగా రాస్తున్నాను. చిన్నప్పటినుండి సాహిత్యంలో ఆసక్తి ఉంది గానీ రాయాలనే ఆలోచన కొత్తగా వచ్చింది. కొన్ని కథలు ప్రచురింపబడ్డాక, పాఠకుల స్పందనలు తెలిశాక కొన్ని రకాల కథలు నేను రాయగలను అనే ధైర్యం, నమ్మకం కలిగాయి.

    మీరు హిస్టరీమీద పట్టు ఎలా సాధించడానికి మీ చిన్నతనంలో దోహదం చేసిన కారణాలేవైనా ఉన్నాయా? 

    పట్టు సాధించాను అని చెప్పుకోలేను గానీ, చిన్నతనం నుండీ చరిత్ర అంటే ఆసక్తి ఉండేది. అది కూడా ప్రధానంగా పుస్తక పఠనం ద్వారా ఏర్పడ్డదే. పుస్తకాలు కొత్త ప్రపంచాల్ని మన ముందుంచుతాయి. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి అనే చిన్న ఊళ్లోని ప్రభుత్వ లైబ్రెరీలో – ‘మొగలాయి దర్బారు కుట్రలు’, నార్వీజియన్ చరిత్రకారుడు రాసిన ‘కడలి మీద కోన్-టికి, రాహుల్ సాంకృతాయన్ రచనలు – ఇటువంటివన్నీ చదివాను. అవన్నీ అనువాదాలే. మా నాన్నగారు విల్ డ్యురాంట్ రాసిన ‘హిస్టరీ ఆఫ్ సివిలైజేషన్స్’లాంటి ఇంగ్లీషు పుస్తకాలను చదువుతూ ఆ వివరాలు మాకు చెప్పేవారు. ఆవిధంగా సాహిత్యంతో బాటుగా చరిత్ర పట్లకూడా ఆసక్తి పెరుగుతూ వచ్చింది.

    స్కూలు రోజుల తరువాత ఇంగ్లీషు పుస్తకాలు కూడా చదవడం మొదలుపెట్టాను. నెహ్రూ 'డిస్కవరీ ఆఫ్ ఇండియా, డీ డీ కోసంబి, ఈ. ఎచ్. కార్, రొమిల్లా థాపర్ ల ప్రభావం నాపైన పడింది. ‘చరిత్ర అంటే గతానికీ, వర్తమానానికి నిత్యం జరిగే సంభాషణ’ అంటాడు ఈ. ఎచ్. కార్. అందుకే చరిత్రని విడిగా కాకుండా, వర్తమానంతోనూ, తద్వారా భవిష్యత్తుతోనూ సంధించగలిగే సందర్భాలు నాకు ఎక్కువ ఆసక్తిని కలిగిస్తాయి.

    మీ రచనల్లో హిస్టారికల్ ఫిక్షన్ ముఖ్య ప్రక్రియగా ఎంచుకోడానికి కారణాలు ఏమిటి? మీరు మెరైన్ ఇంజనీర్ కావడం అందుకు తోడ్పడిందా?

    ఒక సమాజంలో అంతవరకూ లేనటువంటి టెక్నాలజీని ప్రవేశపెట్టినపుడు ఏమవుతుంది? ఎవరు లాభపడతారు? ఎవరు నష్టపోతారు? ఒక ఇంజినీరుగా నాకు ఆసక్తి కలిగించే ప్రశ్నలు ఇవి. ‘వార్తాహరులు’, ‘మూడు కోణాలు’ కథల్లో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించాను. మెరైన్ ఇంజనీర్ ని కావడం మూలాన నాకు వాణిజ్య నౌకారంగ చరిత్ర, అంటే మేరిటైం హిస్టరీలో ప్రత్యేకమైన ఆసక్తి కలిగింది. ముఖ్యంగా యూరోపియన్ నావికులు, వ్యాపారులు మనదేశంలో అడుగుపెట్టిన తొలిదశలో వచ్చిన మార్పుల్ని శోధించడం నాకు ఇష్టమైన పని. ఒక స్తభ్దతకు లోనై, ఎన్నో శతాబ్దాలపాటు నిద్రాణంగా ఉన్న మన ఫ్యూడల్ వ్యవస్థలో యూరోపియన్ల రాకతో కదలికలు మొదలయ్యాయి. 'ఆసియా ఖండం తన చరిత్రలో తానే మునిగి, సుదీర్ఘమైన నిద్రావస్థలో ఉంది’ అన్నాడు మార్క్సు. ఆనాడు మొదలైన మార్పులు మన దేశపు ఆధునిక చరిత్రలో చాలా కీలకమైనవి.

    యారాడ కొండ నవల రాసినప్పుడు ఇంతకు మునుపు విశాఖ పట్టణం ఎలా ఉండేదో తెలుసుకోడానికి మీరు చేసిన పరిశ్రమ గురించి వివరాలు చెప్తారా?

    ఇంట్లో వాళ్లు తాత ముత్తాతల కథలు చెప్తూనే ఉండేవారు. మిగతావి ఎక్కువగా నేను చూసినవి, నాకు తెలిసిన సంగతులే. కొన్ని వాస్తవాలను, వివరాలను, తేదీలను చెక్ చేసుకోవాల్సి వచ్చింది. అవి ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించినవి. కొంత మంది మిత్రులు, పెద్దలు సహకరించారు.

    విశాఖ వాసుల నించీ ‘యారాడకొండ’ పై వచ్చిన స్పందన ఏమిటి?

    మా తరం వాళ్లు, ఇంకా ముందరి తరం వాళ్లు - తమ చిన్ననాటి రోజుల్ని గుర్తుచేసిందన్నారు. యువతరం, 'మాకు తెలియని వివరాలు చాలా ఉన్నాయీ నవలలో’ అన్నారు. మొత్తనికి అన్ని వయసుల వాళ్లూ కనెక్ట్ అయ్యారు.

    త్రిపుర గారితో మీకున్న సాహితీ పరిచయాన్ని గురించి కొన్ని వివరాలు చెప్తారా? ఆయన సాన్నిహిత్యం మీకు రచనా పరంగా ఎంత మటుకు మేలు చేసింది?

    ఆయన నా రచనలేవీ చదవలేదు. నేను రాయడం మొదలుపెట్టేనాటికే ఆయన వెళ్లిపోయారు. అయితే ఆయనతో సాగత్యం మూలాన నాకు తెలియని ఎంతోమంది అంతర్జాతీయ రచయితల రచనలు పరిచయం అయ్యాయి. ఒక్కోసారి ఏదో పుస్తకం నా చేతిలోపెట్టి, 'ఇది చదువు, నీకు నచ్చుతుంది’ అనేవారు. అది చదివాక నేనేదైనా చెబితే వినడమేగానీ మళ్లీ దాని గురించి అడిగేవారు కాదు. ఎప్పుడైనా కొందరి రచనల గురించి తన అభిప్రాయం చెప్పేవారుగానీ సుదీర్థమైన సాహితీ చర్చలు జరపడానికి ఇష్టపడేవారు కాదు.

    కొన్ని కథలు మీరు మీ అబ్బాయితో కల్సి రాయడం జరిగింది? ఈ కొలాబరేషన్ గురించి వివరాలు చెప్తారా?

    మా అబ్బాయి జైదీప్ ఉణుదుర్తి, నేనూ కలిసి ఇంతవరకూ ఒకే కథ రాశాం. 'రెక్కలు చాచిన రాత్రి’ అనే ఆ కథలో ప్రత్యామ్నాయ చరిత్ర అనే ప్రక్రియను తీసుకున్నాం. జైదీప్ బాగా చదువుతాడు; స్వయంగా రచయిత. సైన్స్-ఫిక్షన్ రచనలు చాలా చదివాడు, కొన్నిటిని నాకు పరిచయం చేశాడు. ప్రత్యామ్నాయ చరిత్ర అనేది సైన్స్-ఫిక్షన్ కోవకి చెందే ప్రక్రియ. అయితే ప్రత్యామ్నాయ చారిత్రక రచనలను ఆస్వాదించాలంటే చరిత్ర తెలిసి ఉండాలి.  ఇది రాయడానికి మాకు సుమారు ఆరునెలలు పట్టింది. మరే కథకీ అంత కాలం పట్టలేదు.

    ఇప్పుడు ఎక్కువమంది ప్రొఫెషనల్ కోర్సులు చదవడానికి, అదే రంగాల్లో ఉద్యోగం చెయ్యడానికి ఇష్టపడ్తున్నారు. వీరికి తెలుగు సాహిత్యం చదవడం ఏ రకంగా ఉపయోగపడుతుంది?

    ప్రొఫెషనల్ కోర్సులకీ, సాహిత్యానికీ మధ్య వైరుధ్యం ఏమీలేదు. సాహిత్యం, కళలూ మనుషుల్ని సాటి మనుషుల పట్ల, సమాజం పట్ల మనల్ని సెన్సిటైజ్ చేస్తాయి. మన మూలాల పట్ల ఎరుకను కలుగజేస్తాయి. వాటిని వొదులుకుంటే మర మనుషులంగా మిగిలిపోతాం. ప్రజలకీ, సమాజానికీ మనల్ని దూరం చేసే చదువు నా దృష్టిలో చదువే కాదు. పై దేశాలలో, పై రాష్ట్రాలలో ప్రొఫెషనల్ కోర్సులు చేసేవాళ్లంతా సాహిత్యానికి దూరం అయిపోతున్నారా? లోపం మన విద్యావిధానంలో, సిలబస్ లలో ఉంది. దాన్ని సవరించడం పెద్ద కష్టం కాదు. ఇంగ్లీషు అవసరమే. కానీ తెలుగుని దూరం చేసుకోరాదని నా అభిప్రాయం. మాతృభాషని ఎలా కాపాడుకోవాలనేది మిగతా దేశాలనుండి, రాష్ట్రాలనుండి మనం నేర్చుకోవచ్చు - తప్పులేదు.

    మిగతా భాషలతో పోలిస్తే ఎక్కువమంది తెలుగు పుస్తకాలు కొనడం లేదు, చదవడం లేదు అనేది ఒక అబ్సర్వేషన్. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి? తెలుగు పుస్తకాలకు ఎక్కువ ప్రాచుర్యం రావాలంటే ఏమి చెయ్యాలి?

    తెలుగంటే ఏర్పడ్డ చిన్నచూపుని మొదట వదులుకోవాలి. ఇంగ్లీషులో స్పెల్లింగు తప్పులు రాకుండా ఎంతో జాగ్రత్త తీసుకుంటాం. అలాగే ఉచ్చారణ విషయంలో కూడా. తెలుగు దగ్గరకు వచ్చేసరికి అందులో పదోవంతు శ్రద్ధ కనిపించదు. తల్లిదండ్రులు పిల్లలు తెలుగు మాట్లాడేలా ప్రోత్సహించడం లేదు. స్వానుభవం ఆధారంగా మూడు చర్యలు అవసరం. బోధనాభాషగా తెలుగు - కనీసం పదో తరగతి దాకా. రెండోది మన గ్రామీణ లైబ్రెరీలనీ, స్కూలు లైబ్రెరీలనీ పునరుద్ధరించడం. మూడవది - బాల సాహిత్యాన్ని ఆకర్షణీయమైన బొమ్మలతో రూపొందించి తక్కువ ధరకు అందజేయడం. 'చందమామ’, ‘బాలమిత్ర’, అమర్ చిత్ర కథ అలాగే బొమ్మల భారతం, బొమ్మల రామాయణం, శతకాలు, పద్యాలు, పాటలు, జానపద గీతాలు, హరికథ, బుర్రకథలు - ఇవన్నీ మా తరం వరకూ గట్టి పునాదిని ఏర్పరచాయి. ఒకప్పుడు సోవియట్ యూనియన్ పిల్లలకోసం ఎన్నో పుస్తకాలను ప్రచురించేది, అతి తక్కువధరకు దొరికేవి. ఇవాళ్టి డిజిటల్ ప్రపంచంలో ఇవేవీ సాధ్యపడవు. కొత్త మాధ్యమాల ద్వారా పిల్లల్ని, యువతరాన్ని చేరుకోవాలి. ఉదాహరణకి ఆడియో బుక్స్ అనేది అటువంటి ఒక సాధనం. అలాగే యానిమేషన్ చిత్రాలు కూడా. తెలుగుని కాపాడుకోవడానికి ఇది మనకున్న ఆఖరి అవకాశం అని మనమంతా గుర్తించాలి. రాబోయే తరాలకు నేర్పేవాళ్లు కూడా మిగలరు.

    రాబోయే పుస్తకం ‘చలిచీమల కవాతు’ గురించి వివరాలు చెప్తారా?

    2018లో ఛాయా రిసోర్సెస్ సెంటర్ వారు 'తూరుపు గాలులు’ సంకలనాన్ని ప్రచురించారు. దానికి పాఠకులనుండి, విమర్శకులనుండి మంచి స్పందన లభించింది. ఆ తరువాత రాసిన ఐదు కథల్ని ఇప్పుడు 'చలిచీమల కవాతు’గా అదే ప్రచురణకర్తలు తీసుకొస్తున్నారు. మరో వారం రోజుల్లో ఇది మార్కెట్లోకి వస్తుంది. అమెజాన్ లో దొరుకుతుంది. నేను చారిత్రక కథలే రాస్తాను అనే ముద్ర పడినట్లు తోస్తున్నది. 'చలిచీమల కవాతు కథలు’ ఆధునిక సమాజం గురించి రాసినవి. ఇందులోని 'గిట్టలు, గోళ్లు’ అనే కథ అలేగోరీ అంటే ఉపమాన రూపంలో అన్యాపదేశంగా చెప్పిన కథ. ఈ సంకలనంలోనే జైదీప్ తో బాటు రాసిన ప్రత్యామ్నాయ చారిత్రక కథ 'రెక్కలు చాచిన రాత్రి’ కూడా ఉంది. నిత్యం ప్రయోగాలు చేస్తూనే ఉండాలి అని నేను నమ్ముతాను. ఆ దిశగా చేసిన ఒక ప్రయత్నం – ‘చలిచీమల కవాతు’.  




    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    38 min
  • ఎన్ ఎస్ ప్రకాశరావు గారి రచనా జీవితంపై వారి సహచరి డాక్టర్ నళిని గారు!

    ఎన్ ఎస్  ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. 'ఎన్నెస్ కథలు' వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో  అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు.

    వారి రచనా జీవితంపై వారి సహచరి డాక్టర్ నళిని గారు ఈ ఎపిసోడ్ లో మాట్లాడతారు. శ్రీమతి నళిని గారికి  కృతజ్ఞతలు. 

    మరిన్ని కథల కోసం - హర్షణీయం పాడ్కాస్ట్ ని –

    ‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://bit.ly/harshagaanaa

    స్పాటిఫై (Spotify )యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam

    ఆపిల్ (apple podcast) ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5


    వెబ్ సైట్ : https://harshaneeyam.in/all


    హర్షణీయం ఫేస్ బుక్ లో - https://www.facebook.com/Harsha051271


    హర్షణీయం ట్విట్టర్ - @harshaneeyam


    హర్షణీయం యూట్యూబ్ లో - https://bit.ly/harshayoutube



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    17 min
  • కే. సభా గారి కథారచన పై మధురాంతకం నరేంద్ర గారి సమీక్ష.

    కె.సభా (జూలై 1, 1923 - నవంబరు 4, 1980) రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి.జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా, నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు.

    సుప్రసిద్ధ రచయిత మధురాంతకం నరేంద్ర గారు సభా గారి కథా రచనపై చేసిన సమీక్ష ఈ ఎపిసోడ్లో.

    నరేంద్ర గారికి కృతజ్ఞతలు.

    సభా గారి కథలు చదవడానికి - https://kathanilayam.com/writer/549?Story_page=2



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    46 min
  • త్రిపుర గారి గురించి డాక్టర్ మూలా సుబ్రహ్మణ్యం.

    ఈ ఎపిసోడ్లో శ్రీ మూలా సుబ్రహ్మణ్యం గారు, ప్రసిద్ధ రచయిత త్రిపుర గారి గురించి మాట్లాడతారు. శ్రీ సుబ్రహ్మణ్యం VLSI ఆర్కిటెక్చర్ లో డాక్టరేట్ తీసుకుని, ప్రస్తుతం పాలక్కాడ్ ఐఐటీ లో పని చేస్తున్నారు. స్వతహాగా, చక్కటి కవి రచయిత . ,'ఆత్మనొక దివ్వెగా' నవల , 'సెలయేటి సవ్వడి' కవితా సంపుటి వీరి ప్రసిద్ధ రచనలు.

    సుబ్రహ్మణ్యం గారికి హర్షణీయం కృతజ్ఞతలు.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    23 min
  • 'నాన్నతో ఒక్క రోజు' - తమిళ మూలం - సుప్రసిద్ధ కథారచయిత సుందర రామస్వామి గారు

    ‘నాన్న తో ఒక్క రోజు’ 

    తమిళ మూలం: సుప్రసిద్ధ కథా రచయిత  సుందర రామస్వామి గారు 

    నాన్నతో ఒక్కరోజు అనే కథకు తమిళ మూలం సుప్రసిద్ధ కథారచయిత సుందర రామస్వామి గారు. కథను మీ కందించడానికి అనుమతినిచ్చిన కణ్ణన్ గారికి, సహకరించిన గీతారామస్వామి గారికి కృతజ్ఞతలు. 

    నాన్నకున్న ఒకే ఒక దాయాది రాజు పెదనాన్న. పేరుకు దాయాదులన్న  మాటే గానీ ,  ఇద్దరూ, ఒకే కడుపున, పుట్టిన వాళ్ళ కంటే కూడా, ప్రేమగా సఖ్యంగా వుంటారు. 

    నాన్న అమ్మలకు పెళ్ళైన కొన్నాళ్ళకే , ఆస్తులన్నీ కరిగిపోయాయి. బతకడానికి ఏ ఆధారమూ లేక, నిస్సహాయంగా మా కుటుంబం నిలబడుంటే, రాజు పెద్ద నాన్నే  చెయ్యందించాడు. తనకు బాగా డబ్బులు తెచ్చిపెడుతున్న ఒక వ్యాపారాన్ని, నాన్నకిచ్చేసాడు, రాజు పెదనాన్న. 

    ‘అప్పట్నుంచే, డబ్బు సంపాదన అంటూ, ఒకటి మొదలై,  నలుగురిలో తలెత్తుకు తిరిగే స్థితికి చేరుకోగలిగాను. ఏమిచ్చినా ఆ ఋణం తీర్చుకునేది కాదు’ అంటారు నాన్న . అమ్మగూడా అదే అంటుంది. ఎప్పుడు రాజు పెదనాన్న   గురించి మాట్లాడుకున్నా, ఇద్దరికీ కళ్ళు తడవుతాయి.  నాతో, రమణి అక్కతో అమ్మ రాజు పెదనాన్న గురించి ఎంతలా చెప్పిందంటే, మేమిద్దరం ఆయన  ‘దేవుడి’ అంశ  అనుకోడం మొదలెట్టాం. 

    సంవత్సరానికి ఒక సారి, పెదనాన్న, మా ఇంటికి వచ్చేవాడు. ఆయన వస్తున్నట్టు ఉత్తరం అందగానే, ఇల్లంతా సందడి మొదలయ్యేది. పెదనాన్నకి,  నులక మంచం మీద పడుకోడం అంటే ఇష్టం. మొదట, ఆ మంచాన్ని పెరట్లోకి తీసుకెళ్ళి, మరిగే నీళ్ళు పోసి, నల్లులు లేకుండా, శుభ్రంగా, కడిగే కార్యక్రమం ప్రారంభం అయ్యేది. అమ్మ, ఆయన కిష్టమైన పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు తయారు చెయ్యడం మొదలెట్టేది. నాన్న బంగారు అంచుతో వుండే కొత్త విసనకర్రలు కొనుక్కొచ్చేవాడు. మధ్యాహ్నం పూట, భోజనం ఐన  తర్వాత, పెదనాన్న పడుకునుంటే, చెరో వైపు నిలబడి, విసరడం  రమణీ కి, నాకూ అలవాటు.  రమణి ఎప్పుడూ నన్ను ఆయన కాళ్ళ వైపు  నిలబడి విసరమనేది. ‘పెదనాన్న తల వైపు నిలబడి, ఆయన మొహానికి తగలకుండా, విసరడం నీకు చేతకాదు’ అని చెప్పేది. ఎప్పుడైనా అమ్మ పిలిస్తే,  రమణి అక్కడినించి వెళ్ళిపోయినప్పుడు, నేను పెదనాన్న మీదకి, బాగా  ముందుకు  వంగి, విపరీతంగా విసిరేవాణ్ణి.  అప్పుడు, రాజు పెదనాన్న, నీ సంగతి నాకు తెలిసిపోయిందన్నట్టుగా, మూసిన కళ్ళు తెరవకుండానే, నవ్వేవాడు.  ఆ నవ్వులో, తమలపాకులతో పండిన అందమైన ఎరుపు, లీలగా  మెరిసేది. వడసేరి తనుమాలయన్ నేసిన పంచెలు మాత్రమే, తన ఒడ్డూ పొడుగుకి  సరిపోతాయనే వాడు, రాజు పెదనాన్న.   ఆయన కోసమని, ప్రత్యేకంగా, నాణ్యమైన నూరో నంబరు నూలు పంచెలు కావాలని, దుకాణానికి కబురు పంపించేవాడు నాన్న.  అమ్మ, ఆనందత్త కల్సి పెరట్లోకి వెళ్ళి, ఏ అరటిచెట్టు నించి, ఏ ఏ  ఆకులు  కోసి, భోజనాలకు వాడాలో, నిర్ణయించే వాళ్ళు. ఎందుకోగానీ, ఎప్పుడూ రాజు పెదనాన్న రావడం, మా ఆవు ఈనడం ఒకే సారి జరిగేవి. ‘ఇలాటి  జున్ను తినాలంటే, రాజు లాగా పెట్టి పుట్టాలి,’ అనేవాడు గర్వంగా నాన్న. 

    రాజు పెదనాన్న కుటుంబం చాలా పెద్దది. ‘మా ఇంట్లో పన్నెండున్నర మందిమి మేము!’   అనేవారు పెదనాన, తమాషాగా. అది కొంచెం అతిశయోక్తి.  నిజానికి ఆయనకు పద్నాలుగు మంది పిల్లలు.  దాదాపు, ముప్పయి మంది మనవళ్ళు, మనవరాళ్ళూ. ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి వంటిల్లు . 

    కొన్నిరోజులైనా సరే, ఆ సందడంతా వదిలేసి వచ్చి, మా ఇంట్లో ఉండడం పెదనాన్నకి ఎంత కష్టమో, మా అమ్మానాన్నలకి  తెలుసు. ఆయనకు ఇంటికి వెళ్లిపోదామనే ఆలోచన వచ్చినట్టు గమనించగానే,  ’ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దానికి తొందరేముంది?’ అని అంటూ, ఇంకొన్ని రోజులు, ఉండమని బలవంతం చేసేవారు నాన్న. ఇద్దరూ కూచుని, వాళ్ళ చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకుంటూ, ‘ఇంతకు ముందు రోజులా ఇవి ? అన్నీ నాశనం అయిపోతున్నాయి’ అని ముక్తాయించే వాళ్ళు. రాత్రంతా మేలుకుని  అలా మాట్లాడుకుంటూనే వుండే వాళ్ళు. అయినా, మరుసటి రోజు పొద్దున్న లేచింతర్వాత గూడా, మాట్లాడుకోడానికి, వాళ్ళకు మాటలు ఇంకా మిగిలుండేవి. ప్రతిరోజూ పొద్దున్న, షాపు తెరవడానికి  వెడుతూ , ‘నాలుగు గింజలకోసం, పెదనాన్న తో సమయం గడపకుండా, వెళ్ళాల్సివస్తోందే’, అన్న  బాధ కనపరుస్తూ, నెమ్మదిగా బయలుదేరేవాడు నాన్న. 

    ఆ రోజుల్లో ఇంట్లో ఫోన్ ఉండడం అనేది చాలా అరుదు. ఓ రోజు తెల్లవారు ఝామున, ఫోన్ ఆఫీసునించి ఒకతను హడావుడిగా వచ్చాడు. నాన్నకు, కొచ్చిన్ నించీ ఏదో  ఫోన్ వచ్చిందనుకుంటా. విషయం విని అమ్మా నాన్నలకు నోట్లో మాట రాలేదు. కొచ్చిన్ లో ఉండేది రాజు పెదనాన్న.  నాన్న మొహాన్ని గమనిస్తూ , విషయం ఏమిటో  తెలుసుకోవాలని  ఆతృత  పడ్డాను. మామూలుగానే, నేనెళ్ళి  ఆయనకెదురుగా నిలబడే  ప్రశ్నే లేదు. ఇపుడేమో, నాలుకలు తెరుచుకుని ఇంటి కప్పు నంటే, మంటలా కనిపిస్తున్నారు  నాన్న.  ఇలాటప్పుడు ,  నేనెప్పుడూ వేసే ఎత్తు ఒకటే.  మా ఇంటికో పక్కన, గోడనానుకుని  వున్న,  వేపచెట్టుకొమ్మ మీద కెక్కి కూచున్నాను. 

    గాలి వీచి, కిటికీని మూసిన తెరలు, పైకి తెరుచుకున్నప్పుడల్లా, ముందువసారాలో, పడక్కుర్చీలో కూచుని వున్న, నాన్న ఎర్రబడిన మొహం నాకు కనపడుతోంది. ఇలా  నాన్న వైపు అపుడపుడూ చూస్తూ, ఏవనుకుంటున్నారో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే రమణికి ఈ ఇబ్బంది లేదు. నేరుగా తాను వరండాలోకి వెళ్ళగలదు. కావాలంటే, భయమనేదే లేకుండా  నడుచుకెళ్ళి,   నాన్న పక్కనే, నిలబడగలదు కూడా. ఒక్కోసారి, ఆయన చుట్టూచూసి,  ఎవరూ లేరు, అని నిర్ధారించుకుని, రమణిని దగ్గరకు తీసుకుని ప్రేమగా  తల నిమిరే వారు. వేపచెట్టుమీద కూచునప్పుడు, ఎన్నోసార్లు ఈ దృశ్యాన్ని నేను చూసాను. నేనెక్కడ ఉన్నానో, రమణికి తెల్సు కాబట్టి, నా వైపు తల తిప్పి , ‘ఇదంతా చూస్తున్నావా?’ అన్నట్టుగా మొహం పెట్టేది. నాన్నకు, తనంటే ఎంత ఇష్టమో, నాకు చూపించడం కోసం తహతహలాడేది. నన్ను ఏడిపించడం తన ఉద్దేశ్యం. నేను మటుకు, అందుకు బదులుగా,  నా మొహాన్ని చిత్రవిచిత్రంగా మారుస్తూ తనని వెక్కిరించేవాణ్ణి. గాలి సరిగా లేక కిటికీ తెరలు తగినంతగా  తెరుచుకోవడంలేదు  అనిపిస్తే,  రమణి చూసిందని తేల్చుకునేదాకా, పది పన్నెండు సార్లయినా సరే, ఈ ప్రదర్శనను  కొనసాగించే వాణ్ణి నేను. 

    అదేపనిగా, నాన్న మొహాన్ని తదేకంగా చూస్తున్నాను. బాగా ఎరుపెక్కి వుంది. చాలా బాధతో  వున్నపుడు, ఏదైనా తీవ్ర సమస్యల్లో ఉన్నప్పుడు, ఎడమ చేతి వేళ్ళు  గడ్డం కింద, ఆనించి, బుగ్గలు పైకి వెళ్ళిపోయేలా,  నొక్కి పెడతారు నాన్న. చూపు ఒకే చోట నిమగ్నమై,  కదలకుండా నిలబడిపోతుంది. ఒక్కోసారి, కళ్ళు రెండూ మూసి, దీర్ఘంగా నిట్టూరుస్తారు. బాధనంతా, శ్వాస ద్వారా బయటికి విడిచే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటుంది. మునుపెన్నడూ, ఆయన మొహంలో ఇంత బాధని నేను  చూడలేదు. లోపలుండే తీవ్రమైన నొప్పిని, అతికష్టం మీద,నిశ్శబ్దంగా, భరిస్తున్నట్టుగా వుంది ఆయన వాలకం. 

    చెట్టు దిగి,  ముందు  వరండాలోకి పరిగెత్తాను. మెట్లెక్కి వెళ్ళి, ఒక స్తంభానికి ఆనుకున్నాను. ఆయన నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  ఎప్పటిలా, ‘ఈయన నన్ను చూడగానే చిరాకు పడేట్టు లేరు’,  అన్న విషయం, నాకు అకస్మాత్తుగా స్ఫురించింది. 

    “ఇప్పుడు వెళ్ళి, ఆయన పక్కన కూడా నిలబడొచ్చు! కావాలంటే.”

    కానీ, అలా ఏవీ జరగలేదు. ‘మీ అమ్మని పిలు’ అన్నారాయన. అంత మృదువుగా ఆయన నాతో ఇంతకు ముందెప్పుడూ మాట్లాడలేదు. మళ్ళీ మెట్లు దిగెళ్ళి,నేల మీద పరిచివున్న పట్టా తోటి,  కాళ్ళు శుభ్రం చేసుకున్నాను. “నాన్న ‘వీడు చాలా తెలివైనవాడు’ అని నా గురించి  అనుకోవాలి. అసలు తెలివితేటలు చూపించే అవకాశం అంటూ ఒకటి, నాకు  ఇవ్వకపోతే, ఈ విషయం ఎవరికైనా  ఎలా తెలుస్తుంది? తెలివితేటలు అనేవి, ఒక్క రమణి సొంతమే కాదు. నా బుర్ర కూడా బాగా చురుకైనదే. కానీ, అది నిరూపించే అవకాశమే ఎప్పుడూ రాలేదు. అంతే.” 

    ఇంట్లోకి పరిగెత్తాను. 

    అమ్మ కిటికీ పక్కకొచ్చి నిలబడి గొంతు సవరించుకుంది.ఆ కిటికీ లోంచి వరండా అంతా కనిపిస్తుంది. మొదటగా , గొంతు సవరించుకోవడం అనేది, ఆమె రాకకు సూచన.  దాని తర్వాత నాన్న వీధి లోకి చూస్తూ, మొక్కలగురించి, తీగల గురించి, కొబ్బరి చెట్ల గురించి, ఎగిరే పక్షుల గురించి అనేకానేక ప్రశ్నలు సంధిస్తారు. 

    అమ్మ తన సమాధానాలన్నీ నాన్న వీపుకి చెప్తుంది.  ఏవైనా, అర్థంలేని, అర్థం కానీ ప్రశ్నలడిగినప్పుడు, ఆయనకు మటుకు,  ఓర్పుతో సమాధానాలు చెప్తూ, తన ముఖం చిట్లించడాలూ, తల కొట్టుకోవడాలూ లాంటివి, మా వినోదానికి వదిలేస్తుంది.  

    నాన్న కొంచెం గొంతు పెద్దది చేసి, అరిచారు. ‘ఒక్కడూ కనపడ్డం లేదు. నేనే  స్వయంగా అన్నీ చూసుకోవాలి’. 

    రమణి, నేను, చప్పుడు చేయకుండా, అమ్మ దగ్గరికి జరిగాం. కిటికీ తెరకున్న సందులోనించీ, నాన్న వీపు మీదున్న, పుట్టుమచ్చలు, లెక్కపెట్టగలిగినంత, స్పష్టంగా, నాకంతా కనపడుతోంది. ఒకరకంగా ఆయన ఆవేశపడటం సహజమే.  బయటకెళ్ళి పనులు చేసుకోవడం,  నాన్నకు అసలు అలవాటులేదు. నాన్నకు గానీ, ఇంట్లో కానీ,  బయటినించీ ఏదన్నా కావాల్సి వస్తే,  శీను మామో, నటరాజ్ మామో, చూసుకుంటారు. ఆనందత్త కూడా ఒక్కోసారి, అవసరం వచ్చినప్పుడు. వంట సగంలో వదిలేసయినా సరే , బయటకెళ్ళి,  నాన్న పనులు చేసుకవస్తుంది. పోస్ట్ ఆఫీసుకి , కరెంటు ఆఫీసుకి , పచారీ దుకాణానికి, కనీసం పిల్లల విషయంలో స్కూలుకి , ఆసుపత్రికి కూడా, ఆయన వెళ్ళడం అనేది  ఎప్పుడూ జరగలేదు. అంతెందుకు, తమలపాకులమ్మే దుకాణానికి కూడా ఆయన వెళ్ళిన దాఖలాలు లేవు. 

    “కొంచెం సేపు ఆగుదాం. ఎవరైనా వస్తారేమో చూద్దాం!” అంది అమ్మ. 

    “అసలు నాకు అత్యవసరంగా ఏదైనా  కావాల్సి వచ్చినప్పుడు, ఎవడైనా వచ్చి  తగలడ్డం చూసావా? ప్రతి చిన్న విషయం నేనే చూసుకోవాలి” అన్నారు నాన్న. 

    అలాంటి సందర్భంలో కూడా, నవ్వు ఆపుకోలేక పోయింది అమ్మ. అమ్మ చేతిని నోటికడ్డం పెట్టుకుంటే, వెంటనే రమణి కూడా అలానే చేసింది. నేను, వాళ్ళిద్దరి కంటే కూడా, నవ్వు ఆపుకోడం నాకే  ఎక్కువ  కష్టంగా ఉన్నట్టు, నోటికి,  ‘రెండు’ చేతులు అడ్డం పెట్టుకున్నాను. నాన్న మాటల్లోని హాస్యం, నాకు అర్థం కాలేదని, రమణి అనుకోవడం నా కిష్టం లేదు. అలా జరిగితే, జీవితాంతం అది పట్టుకు వేలాడి, నన్ను ఏడిపించేస్తుంది. నేనెక్కడ దొరుకుతానా? అని రమణి, ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటుంది కదా!

    అమ్మ మూడోసారి అడిగింది, “ ఫోన్ ఎక్కడనించీ వచ్చిందన్నారు?”. ప్రశ్నకు సమాధానం తనకు బాగా తెలిసినా, నాన్న ఆందోళనను కొంత తగ్గించేందుకు ,అమ్మ చేస్తున్న ప్రయత్నం అది. నాన్న సమాధానం ఇవ్వలేదు. ఆయన మౌనానికి అర్థం, “బుర్ర లేని వాళ్ళతో నేను మాట్లాడను” అని. 

    ఉన్నట్టుండి, ఏదో పూనకం వచ్చినవాడిలా, నాన్న చెప్పులేసుకుని, ముందు మెట్లు దిగారు. అమ్మ ఖంగు తింది. తర్వాత వెంటనే  సర్దుకుని, నా వైపు చూసి  “నువ్వెళ్ళరా! నాన్న తోటి” అంది.  అమ్మ నాన్నతో నన్ను వెళ్ళమనడం, నన్ను విపరీతమైన ఆశ్చర్యానికి గురిచేసింది. ‘నేను పైసాకి గూడా పనికి రాను” అనే నాన్న అభిప్రాయానికి,  అమ్మ వంత పాడటం అనేది, ఎప్పుడూ జరిగేదే  మా ఇంట్లో. 

    ఈ లోపల, నాన్న ముందు గేటు దాకా వెళ్ళి, వెనక్కి తిరిగి, “వీడేందుకు నా తోటి?” అని కేక పెట్టాడు. 

    “మీ గొడుగు పట్టుకొస్తాడు” అంది  అమ్మ. విపత్కర పరిస్థితుల్లో, మా అమ్మ బుర్ర ఆలోంచించినంత వేగంగా ఎవరి బుర్రా ఆలోచించలేదు. ‘అసలు ఏదో చిన్న, అల్పమైన అవసరానికి, పనికొస్తే తప్ప, నాన్న నన్ను వెంట రానివ్వడు,!’  అనే విషయం  అమ్మకు అంత బాగా ఎలా తెల్సు? ఒక్క ఉదుటున నేను నాన్న గదిలోకి పరిగెడుతూ వెళ్ళి, ఆయన గొడుగును తీసి నా గుండెలకదుముకున్నాను. ఆ క్షణం దాకా, ఆ గొడుగును వేరే వాళ్ళు, తాకడం అనేదే జరగలేదు. 

    నాన్న చాలా దూరం వెళ్ళారు. నేను, తన వేగాన్ని అందుకోడం, తన కిష్టం లేదన్నట్టుగా, నాన్న వడి వడిగా అడుగులేస్తున్నారు. నేను ఊరుకుంటానా? గాల్లో తేలుతూ  పరిగెత్తాను. నాన్న ఇంకా హై స్కూల్ గ్రౌండ్స్ దాకా కూడా వెళ్ళలేదు. ఈ లోపలే వేగంగా  పరిగెడుతూ , నాన్న మీద పడకుండా, అతికష్టం మీద, నన్ను నేను, సంబాళించుకున్నట్టుగా,   కొంచెం తూలి, ఆయన ముందుకెళ్ళి  ఆగాను. నన్ను చూడంగానే అడిగాడాయన. “వెర్రి వెధవా   ! చొక్కా వేసుకోకుండా బయటకెందుకొచ్చావ్?” అని. మామూలుగా ఆయన నన్ను  ‘వెర్రి వెధవా ’ అనే తిట్టే విధానానికి, దీనికీ చాలా   తేడా కనిపిస్తోంది. ఎంతో వాత్సల్యం రంగరించి వుంది ఇప్పటి పిలుపులో. 

    “ఇప్పుడే వేసుకొస్తాను” అంటూ నేను వెనక్కి తిరిగి గాల్లోకి ఎగరబోతూంటే, “పర్లేదులే, చిన్న వాడివి కదా నువ్వు!” అన్నాడాయన. ఆయన మాట నాకెంతో సంతోషాన్నిచ్చింది. నా శరీరంలో అప్పటిదాకా  మండుతున్న జ్వాల ఏదో, అకస్మాత్తుగా ఒక చల్లని మంచు గడ్డ కింద మారిపోయి, నన్ను ప్రేమగా స్పర్శించినట్టనిపించింది.  ఊహేమో! అనుకున్నాను. కాదు.  నిజంగానే నాన్న నా చేతిని, తన చేతిలోకి తీసుకున్నారు. పట్టరాని ఆనందం! ఎంత హాయిగా వుంది? ఒళ్ళంతా మత్తెక్కినట్టయి, పులకించి పోయింది. కొంచెం కూడా వెనక పడిపోకూడదని, నాన్న తోటే, ఆయన  పక్కనే నడిచాను. గొడుగును గట్టిగా పట్టుకున్నాను. 

    స్కూల్ దాటగానే టెలిఫోన్ ఆఫీసు. ముఖద్వారానికి ముందే, ఒక పెద్ద వరండా ఉండి, కుడివైపు, పొడుగాటి బెంచీ వేసి వుంది. ఎడమవైపు, అద్దాల బూతులోంచి, టెలిఫోన్ కనపడుతోంది. నాన్న బూతు లోపలికెళ్ళి, ఫోన్ తీసుకుని, మాట్లాడాలి. 

    నాన్న నా గురించి తర్వాత అమ్మతో చెప్పేటప్పుడు, నేను చేసిందంతా గర్వంగా చెప్పాలనే అతృతతో, చుట్టూ వున్న ప్రతి విషయాన్నీ చాలా జాగ్రత్తగా గమనించడం ప్రారంభించాను.. 

    ఆయన బెంచీ మీద కూర్చుని వున్నాడు.  పూర్తిగా అలసిపోయినట్టు కనపడుతున్నాడు.  ఆయన మొహం ఇంతకుముందుకన్నా, వాడిపోయి వుంది. మెడ మీదినుంచి, చెమటలు కారిపోతున్నాయి. నడిచొస్తున్నప్పుడు, ఎండలో ఆయనకు గొడుగు పట్టనందుకు నన్ను నేనే తిట్టుకున్నాను.  నిజంగా, నేను వెర్రి వెధవనే  అనిపించింది. ఇలాంటి సమయాల్లో, నాన్నను ఊరడించడానికి అమ్మ ఏమంటుందో, ఊహించడానికి ప్రయత్నించాను. కొచ్చిన్ నించీ వచ్చిన ఫోన్, నాన్నకి కాకపోతే ఎంత బావుంటుంది? అని ఆలోచించాను. 

    టెలిఫోన్ ఆఫీస్ లోకి తొంగి చూసాను. అక్కడ రెండు జడలు వేసుకున్న ఒక అమ్మాయి, డెస్క్ లో కూర్చుని వుంది. అమ్మ ఎవరిని అక్కా అనాలో? ఎవరిని అత్తా అనాలో? చాలా ఓపిగ్గా జాగ్రత్తగా నాకు నేర్పించింది. అమ్మ చెప్పిన పాఠం ప్రకారం గమనిస్తే , ఇక్కడున్న అమ్మాయి అక్కకు ఎక్కువగా, అత్తకు తక్కువగా కనపడుతోంది. విమానం పైలట్లలా చెవులకు ఏదో పరికరాన్ని తగిలించుకుని, ముందున్న బోర్డు మీది గుబ్బలను అటూ ఇటూ మారుస్తోంది. ‘అక్కా!’ అంటూ ఆమెని పిలిచి నాన్న పేరు చెప్పాను. తన నోరు తెరవకుండా, ‘మీరు  కొంచెం సేపు వేచి చూడాలి!’ అని సైగ చేసిందామె. వెళ్ళి నాన్న పక్కన కూర్చున్నాను. క్షణాలు గంటల్లాగా గడిచాయి. కొంత సేపటి తర్వాత  ఆ అమ్మాయి, నాన్న ని పిలిచి, ‘మీరిప్పుడు మాట్లాడొచ్చు’ అని చెప్పింది.  నాన్న ఒక్క ఉదుటున,  ఆదరా బాదరాగా పరిగెడుతూ, బూతు కున్న గ్లాస్ డోర్ ని, తోసుకుంటూ లోపలికెళ్ళి, రిసీవర్ ని చేతిలోకి తీసుకుని చెవికి ఆనించుకుని, ‘నేను! నేను! ‘ అని గట్టిగా అరవడం మొదలెట్టాడు. ‘ సార్ మీరు దయచేసి అరవొద్దు. ఒక్క క్షణం ఆగండి. నేనింకా లైన్ కలపలేదు” అంది ఆమె. నేను నా తల లోపలపెట్టడానికి తలుపు తీసి పట్టుకోడంతో, అందరికీ, నాన్న మాటలు వినపడ్డాయి. వరండాలోవున్న కొంతమంది, నవ్వుకుంటున్నారు అని అర్థమైంది. స్తంభానికి ఆనుకొని, సిగరెట్ తాగుతూ నిల్చుని ఉన్న ఒకతను, పక్కనున్న స్నేహితుడితో అంటున్నాడు, “నేను, నేను అని అరిచి ఏం లాభం? పేరు చెప్పాలిగదా?” 

    నాకు విషయం అర్థమైంది. “నాన్నా! మీ పేరు చెప్పండి”. వెంటనే నాన్న “నేను శంకరన్! శంకరన్” అంటూ ఏడెనిమిది సార్లు అరిచాడు. తర్వాత  నా వైపు చూస్తూ  “బాలూ ! ఒక్క ముక్క కూడా  వినపడలేదు రా “ అని నిష్టూరంగా, నిరాశతో చెప్పాడు. ఆయన ఇబ్బందులను, నాతో పంచుకోవడంతో నా ఆనందానికి అవధుల్లేవు. 

    “నేను మాట్లాడేదా? నాన్నా !” అని అడిగాను. 

    ఎంత అమర్యాద? 

    కానీ విచిత్రంగా, ఏదో పసిపిల్లాడిలా, రిసీవర్ నా చేతికిచ్చి, “మాట్లాడు” అన్నాడాయన. “హలో, హలొ “ అన్నాను. నాన్న ఆ పదం వాడకపోయినా, నేను ఒకేసారిగా ఆ పదం వాడేసాను!  అని ఎందుకో అనిపించింది. 

    “నాన్నా నాకు స్పష్టంగా వినపడుతోంది. శీను మాట్లాడుతున్నాడు.” అన్నాను. 

    నెమ్మదిగా తన కుడిచెయ్యి నా భుజం మీద వేసి, “ మాట్లాడు! మాట్లాడు!” అని ప్రోత్సహించాడు నాన్న.

     “ పెదనాన్న చనిపోయాడట. శీను ఏడుస్తున్నాడు”. 

    తట్టుకోలేక, మా నాన్న రిసీవర్ నా చేతిలోంచి తీసుకుని, “ అయితే రాజూ ఇక లేడా?” అంటూ గట్టిగా అరిచాడు. ఇంతలో  ఆ అమ్మాయి స్వరం ఆఫీసులోంచి వినపడింది. “ మీ మూడు నిమిషాలు అయిపోయాయి సార్ “ అని. 

    హై స్కూల్ దాటగానే, నాన్న ఉన్న పళంగా,  అక్కడున్న వరండాలో కూర్చుండిపోయాడు, పూర్తిగా అలసిపోయి. ముందుకు నడవలేక పోయాడు. కళ్ళు నిండుకుని, బుగ్గలు తడిసిపోయాయి. కంటి అద్దాలు తీసి, మడిచి, జేబులో పెట్టుకుని, రుమాలుతో మొహాన్ని కప్పుకున్నాడు. ఒక చేత్తో నన్ను దగ్గరికి లాక్కున్నాడు. ఆయన్ని చూస్తే, విపరీతంగా జాలి వేసింది. ఆయన మీద ప్రేమ, ఆయన లోని విషాదం, ఒక్కసారిగా నన్ను కమ్మేశాయి. సుచీద్రం గుడి హనుమంతుడి అంత, పెద్దగా అయిపోయి, నాన్నను భుజం మీద ఎక్కించుకుని, గాల్లోకి ఎగిరిపోయి, ఒక్కసారిగా మా ఇంటి డాబా మీద వాలాలనే కోరిక పుట్టింది. నాన్న చెయ్యి పట్టుకు లాగాను. మంత్రముగ్దుడిలా, లేచి నడవడం మొదలెట్టాడు. 

    మా నాన్న, ఇంటిలోకి నేరుగా  వెళ్ళకుండా , ప్రహరీ గోడ పక్కగా  నడుచుకుంటూ,  వెనకున్న బావి దగ్గరకెళ్ళి, నీళ్లు తోడి, నెత్తిన పోసుకున్నాడు. అనాలోచితంగా నా మీద కూడా కొన్ని నీళ్ళు పోసేసాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. రమణి పెరట్లోకివచ్చి మమ్మల్నిద్దరినీ చూస్తోంది. తన్ను తాను పూర్తిగా మరిచిపోయి, ఏదో సమాధి స్థితిలో ఉన్నట్టుగా, అలా తన మీద నీళ్ళు పోసుకుంటూనే వున్నాడు. అమ్మ ఎంత బతిమాలినా, ఏవీ తినకుండా, వెళ్ళి పడుకున్నాడు. ‘ వూరికే పదే పదే  కడుపు నింపుకోవడం వల్ల ఏం ప్రయోజనం?’ అన్నాడు. మామూలుగా కాకుండా కింద నేల మీద ఒక చాప వేసుకుని దాని మీద పడుకున్నాడు. విసనకర్ర తీసుకుని మెల్లగా,  విసరడం మొదలుపెట్టాను. రమణి నావైపే గుచ్చి గుచ్చి చూస్తోందని పసిగట్టాను. నేనేవీ తనను పట్టించుకోలేదు. ఇంక ఆ అవసరమే లేదు. ఆయన రమణి కి ఎంతో, నాకూ అంతే. 

    ఆయన లేచిన తర్వాత, అమ్మ ‘మీరు భోజనం చేస్తారా’ అని అడగలేదు. అరటి ఆకు వేసి, వడ్డించడం మొదలు పెట్టింది. ఆమె అన్నం వడ్డించే సమయానికి వచ్చి కూర్చున్నారు నాన్న. ఒక్క మాట మాట్లాడకుండా భోజనం పూర్తిచేసి, వెళ్ళి, ముందు వరండాలో కూర్చున్నారు. అమ్మ వచ్చి, కిటికీ పక్కన నిలబడింది. ‘టెలిఫోన్ ఆఫీసు, హైస్కూల్  పక్కనేగా?”అని అడిగిందమ్మ. దానసలు అర్థం, ‘మొదటినించీ చివరిదాకా, వివరంగా చెప్పమని.’ పెద్దగా నిట్టూర్చి చెప్పడం మొదలుపెట్టారు నాన్న. నేను వరండాలోంచి ముందు వసారాలోకి జారుకుని, ఆయన నన్ను చూడకుండా, ఇంటివెనక నించి, లోపలికొచ్చి, అమ్మ కాళ్ళ దగ్గర కూర్చున్నాను. నా సాహసాలన్నీ, అమ్మకు  చెబుతూంటే, ఆయన గొంతులో  అవన్నీ వినాలనుకున్నాను. కానీ ఆయన మాట్లాడుతోంటే, అంతా ఒక్కసారిగా తలకిందులైనట్టు అనిపించింది. నేను ఫోన్ తీసుకుని మాట్లాడిన విషయం చెప్పక పోవడమే కాకుండా, అంతా తన సామర్థ్యంతో తానే పని పూర్తి చేసినట్టుగా, చెప్పాడు. నా మటుకు నేను, చేసిందంతా అప్పటికే రమణికీ, అమ్మకీ  చెప్పేసాను. అమ్మ కాలుని గట్టిగా గిచ్చాను. అమ్మ అడిగింది, “బాలు మీ గొడుగు పట్టుకున్నాడా?”

    “అసలు వాణ్ణి ఎందుకు పంపించావు? నా గొడుగు నేను పట్టుకెళ్ళలేనా? వాడికి  ఏవి తెలుసనీ. పిల్లవాడు కదా? వాడెప్పుడైనా టెలిఫోన్ చూసాడా? ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసులో అడుగుపెట్టాడా? పాపం నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాడు”

    ఆ రోజు సాయంత్రం శీను మామ, నటరాజ్ మామ మమ్మల్ని కలవడానికి వొచ్చారు. మా నాన్న పూసగుచ్చినట్టు, రాజు పెదనాన్న చనిపోయిన వార్త మా కెలా తెలిసిందో వాళ్ళకు వివరించాడు. “చావు మనందరికీ వస్తుంది.తప్పదు. దాని గురించి ఎక్కువ విచారించడం అనవసరం” అన్నారు నాన్న. 

    నేను వరండాలో నిల్చోని  ఉండడం చూసి  ఆయనకు బాగా కోపం వచ్చింది. నా వైపు చూసి అరిచాడు, “లోపలికెళ్ళరా! పుస్తకాలు తీసుకుని చదువుకో ఫో!”. 

    అదే పాత నాన్న, అదే పాత అరుపు. 

    పెరటిలోనించి, వెళ్ళి వేప చెట్టు పైకి ఎక్కాను. రమణి వచ్చింది. ఎప్పటిలాగానే,  పైనున్న కొమ్మలు పట్టుకున్నాను. రమణి వైపు, నా కాలొకటి, కింది దాకా వేలాడేసాను. పట్టుకుని పైకెక్కింది ఆమె. 

    గౌను సర్దుకుని, “అన్నీ  అబద్ధాలే చెప్పడం మొదలు పెడితే,   ఒక్కటీ నిలబడదు” అంది. 

    నేనరిచాను. “ఆ హనుమంతుడి  మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఫోన్  నేనే పట్టుకుని  మాట్లాడాను. నాన్న నన్ను పట్టుకుని వున్నారు.  అంతే.”

    “నువ్వు గొప్పలు, గప్పాలు  చెప్పుకునేటప్పుడు, హనుమంతుడి పేరు తీసుకోకపోతే బావుంటుంది.” అని మూతి తిప్పుతూ చెప్పింది రమణి. 

    నేను కొంతసేపు ఏవీ మాట్లాడలేదు. లోపల వుడికిపోతున్నాను. 

    “రమణీ! అప్పుడప్పుడూ మనింటికి వచ్చే ఆ మామ వున్నారు కదా! ఆయన రాజు పెదనాన్న కంటే పెద్ద వాడా? చిన్న వాడా?”

    “ఓ, చాలా పెద్ద!’

    “చూస్తూ వుండు. ఆయన చచ్చిపోయినప్పుడు మళ్ళీ  ఫోన్ వస్తుంది. నేనే  నాన్నతో పాటూ  వెళ్ళి ఆ ఫోన్ మాట్లాడతాను. అప్పుడు నువ్వు కూడా వచ్చి చూడు. నీకు బాగా తెలుస్తుంది.”

    “ “పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు. వెర్రి వెధవా!” అంది రమణి. 

    -------------------------------------------



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    26 min
  • సద్గతి - శ్రీ మధురాంతకం నరేంద్ర

    రచయిత తన రచనా వ్యాసంగాన్ని నలభై ఆరేళ్ళ క్రితం ప్రారంభించారు. వారిది సాహిత్య కుటుంబం. వారి తండ్రి గారు మధురాంతకం రాజారామ్ గారు , సోదరుడు మహేంద్ర గారు కూడా సుప్రసిద్ధ తెలుగు కథా రచయితలు.ఇది గాక , ఆయన ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన చేసి , అధ్యాపక వృత్తిలో ప్రవేశించి, నలభై ఏళ్ల పైన, వేలమంది విద్యార్థులకి విద్యా దానం చేశారు.మన సమాజంలో, మన వ్యక్తిత్వాలలో వుండే వైచిత్రిని , అనేక రకాలైన సంఘర్షణలని అతి సుతారమైన తనదైన శైలిలో , అత్యంత సహజంగా చిత్రీకరించడమే ఆయన రచనలలో వుండే ప్రత్యేకత.ఒక సకారాకాత్మకమైన మార్పు , కథ చదివే ప్రతి వ్యక్తిలో, తద్వారా మన సమాజంలో తీసుక రావాలని నిరంతరమూ కృషి చేసే హాలికుడాయన.అత్యంత ప్రతిష్టాత్మకమైన 'కథ' అవార్డు తో బాటూ ఎన్నో పురస్కారాలు అందుకున్నారాయన, ఈ ప్రయాణంలో.

    ఈ కథ కు ఆడియో అందించింది శ్రీమతి స్వాతి గారు . వారికి నరేంద్ర గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.

    స్వాతి గారి యూట్యూబ్ ఛానల్ లో మీరు మరిన్ని తెలుగు కథలు వినవచ్చు.

    https://www.youtube.com/c/SwathiPantula



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    41 min
  • ట్రిగ్గర్

    ట్రిగ్గర్

    అశోకరాజు సోఫాలో  కూచుని కాఫీ తాగుతూ  టీవీ ఆన్ చేసాడు. 

    ‘ ముగ్గురు కాలేజీ పిల్లలు ఓ నగల దుకాణం మీద దాడిచేసి   పట్టుబడ్డారని బ్రేకింగ్ న్యూస్ కింద  చూపిస్తున్నారు. సంఘటనలో గాయపడ్డ వాచ్ మెన్ చావు బతుకుల్లో వున్నాడు.  జరిగిందంతా ఊహించి 3 -డీ యానిమేషన్ సాయంతో, నేపధ్య సంగీతంతో కలిపి ఛానల్ వాళ్ళు  ప్రేక్షకులకు అందచేస్తున్నారు.  దీనికి అదనంగా స్టూడియోకి వచ్చి కూచున్న  మేధావులు ‘నేటి యువత - సినిమాలు’ అనే చర్చా కార్యక్రమంలో ఒళ్ళు మరచి  పాల్గొంటున్నారు. 

    టీవీ ఆఫ్ చేసాడు. కాఫీ గ్లాసు పక్కన బెట్టేసి, బయలుదేరబోతూ  భార్యని అడిగాడు, “వీడింకా లేవలేదా?”

    “లేదు. అదేదో తాడో, పేడో కొని చేతిలో పెట్టారుగా,  రాత్రంతా దాన్ని ముందరేసుకుని  కూర్చోనుంటాడు. స్కూల్ బస్  టైం కి అరగంట ముందు లేచి పరిగెడతాడు” అందావిడ. 

                                           

    *****

    అన్న, చేతులు అటూ ఇటూ చాపుతూ   రకరకాల పోజులు ఇస్తూంటే, తమ్ముడు మొబైల్ తోటి ఫోటోలు తీస్తున్నాడు. గదిలో ఓ మూల బంకర్ మంచం వేసుంది. ఇంకో పక్క పుస్తకాల అలమరలు, వాటి పక్కనే రెండు స్టడీ టేబిల్స్. 

    చేస్తున్న పని ఆపి  “అన్నా నేనూ  పట్టుకుంటా. నాకు గూడా ఫోటో  తీయవా” అన్నాడు తమ్ముడు. 

    “నీ చేతి కొద్దు చిన్నా.  నాన్న గూడా కింది నించీ వచ్చేస్తూంటారు ఈపాటికి” 

    చిన్నా మొహం ముడుచుకుని ఫోటో షూటింగ్ మళ్ళీ  కంటిన్యూ చేసాడు. అలా ఓ  ఐదు నిమిషాలు  గడిచింతర్వాత,  చెయ్యి కుర్చీకి  తగిలి, అన్న చేతిలో ఉన్న తుపాకీ,  జారి, బెలూన్ చిట్లినట్టుగా శబ్దం వచ్చింది. మొబైల్ పట్టుకునున్న, చిన్నా  కుప్పకూలాడు. మెడ మీంచి రక్తం, సన్నటి ధారగా స్రవించడం మొదలైంది. 

    పదేళ్ళ తమ్ముణ్ణి ఒళ్ళోకి తీసుకుని  చిన్నా! చిన్నా!  అని అరవడం మొదలెట్టాడు అన్న. ఏ మాత్రం కదలిక లేదు.  కుదిపి కుదిపి అలిసిపోయి, గోడకు చేరగిలబడ్డాడు. కళ్ళు మూతబడ్డాయి. తలమీద  కన్నీళ్ళ కుండ ఒలికిందా అన్నట్టు, ఒళ్ళంతా తడిసిపోయి వుంది. మరుక్షణంలో గదిలో నిండిన నిశ్శబ్దాన్ని తొలుస్తూ, నేల మీద పడున్న మొబైల్ మోగడం మొదలైంది. బుగ్గ మీది చారికలు తుడుచుకొని, కనపడే ఎర్రచుక్కను బలంగా  పక్కకు తోసి ఫోను చెవికి తగిలించాడు. 

     “రే! నాన్నని ఫోన్ చెయ్యమని చెప్పు?  ఫోన్ తీట్లేదు.” 

    “హలో….  హలో… . మాట్లాడవేం రా?  టైం అవుతోందక్కడ. వెళ్ళాలి నేను. చిన్నాగాడు ఏం చేస్తున్నాడు? టిఫిన్లు తిన్నారా?” ఆమె కంఠం ఆగకుండా  మోగుతోంది. 

     ఫోన్ పక్కన పెట్టేస్తూంటే చెయ్యి వణుకుతోంది. పక్కన పడున్న రివాల్వర్ తీసుకుని తన  కణతకు గురిపెట్టాడు.  ఇంతలో తలుపు తోసిన శబ్దం. నాన్న… లైటర్ మంటను సిగరెట్ దగ్గరకు తీసుకొస్తూ లోపలికొస్తున్నాడు. కనపడిన దృశ్యం చూసి, కాళ్ళు ఘనీభవించిన కాంక్రీట్ లో ఇరుక్కు పోయినట్టుగా  ఆగిపోయాడు. మరుక్షణం ఈ లోకంలోకి వచ్చి కేకలు పెడుతూ పిల్లల వైపు  పరిగెత్తాడు. 

    *****

    రాజు  స్టేషన్కి వచ్చి,  కూచుని ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసాడు. కరకరమని శబ్దం చేస్తూ,  చెంగీజ్ ఖాన్ కాలం నాటి ఆ యంత్రం  వేగంగా తిరగడం మొదలైంది.  కుడివైపున్న  కిటికీలోంచి బైటికి చూస్తే, సూర్యుడు ఇప్పుడల్లా బయటికొచ్చేటట్లు కనపడ్డం లేదు. ఆకాశం నలుపెక్కి పోయివుంది. 

    స్వింగ్ డోర్ ధడాల్న తెరుచుకుని  కానిస్టేబిలు ఆనందరావు  వచ్చి  ఎదురుగా నిలబడ్డాడు. తల పైకెత్తాడు  రాజు. 

    “సార్, గాంధీనగర్ లో , షూటింగ్ జరిగిందట సార్.”

    “గాంధీనగర్ లోనా?“ కనుబొమలు పైకెత్తాడు.  

    “అవును సర్. ఫోన్ వచ్చింది. పది పన్నెండేళ్ల  పిల్లలంట.”

    “పిల్లలా?” కంఠం మారుమోగింది. 

    సమాధానం వచ్చే  లోపలే, కుర్చీని ఒక్క ఉదుటున వెనక్కి తోసి వున్న పళంగా బయటికి కదిలాడు రాజు.  ఆనందరావు, లెధర్ బాగ్ భుజానేసుకుని మఫ్టీలో వున్న ఇంకో కానిస్టేబులు జీపు వెనుకభాగంలో కూర్చున్నారు. 

    కొత్తగా రంగులేసున్న అపార్ట్మెంట్ కాంప్లెక్. కిందున్న లాన్ లో, మగా ఆడా కల్సి పోయి, రెండు  చిన్న గుంపులుగా విడిపోయి మాట్లాడుకుంటున్నారు. జీపు దిగగానే ఒక  నడివయసు వ్యక్తి వచ్చి జాయిన్ అయ్యాడు. 

     అడిగాడు రాజు  “మీరేనా ఫోన్ చేసింది?”

     “అవునండీ.  ఈ మధ్యనే దిగారు ఈ ఫ్యామిలీ.”

    “ఎవరెవరు వుంటారు”

    “భార్యా, భర్తా ఇద్దరు పిల్లలు. మా ఫ్లోర్ లోనే వుంటారు” చెప్పాడు ఆ నడి వయస్కుడు. 

    “ఏంచేస్తూ వుంటారు”

    “ఆవిడ హౌస్ వైఫ్ అండీ. ఈయన ఏదో రియల్ ఎస్టేట్ లాటిదనుకుంటా..”

    అటూ ఇటూ కలిపి మొత్తం నాలుగు ఫ్లాట్లు ఆ ఫ్లోర్లో.  కారిడార్లో నడిచి వెళ్తూంటే  ఆ నడివయసు మనిషి చెప్పాడు. 

    “ఇది మాదండీ. అటుపక్క ఆ చివరన  వాళ్ళ ఫ్లాట్.” 

    “ఎంత సేపైంది జరిగి?” 

    “ఓ పదిహేను నిమిషాలు కూడా  అయ్యుండదండీ . పిల్లల్ని  హాస్పిటల్కి వెళ్ళగానే, మీకు ఫోన్ చేశాను. “

    “ఎవరైనా వాళ్ళ ఫ్లాట్ వైపు వెళ్ళడం మీరు చూసారా?”

    “లేదండీ. నేను మా హాల్లోనే కూచుని టీవీ చూస్తున్నాను. ఇది జరగడానికి ఓ  పదిహేను నిమిషాల ముందర వాళ్ళ ఫాదర్  లిఫ్ట్ వైపు వెళ్ళడం, మళ్ళీ  తిరిగిరావడం  నేను చూసాను.”

    “పిల్లల మదర్…  ఆవిడా ?”

    “ఆవిడ ఏదో ఫంక్షన్ ఉందని, మొన్న వూరెళ్ళిందండీ. మధ్యాన్నం బయల్దేరి మేము కూడా వెడతాం అని  చెప్పాడు అతను.”

    ఫ్లాట్లో ఎంటర్ కాగానే, ఓ పెద్ద హాలు , ఫ్రంట్ డోర్ ను ఫేస్ చేస్తూ ఓ రూమూ. అటూ ఇటూ ఇంకో రెండు రూమ్లున్నాయి. ఇంకో పక్క వంటగది. హల్లో టీకుతో చేసిన సోఫాలు.మధ్యలో ఒక టీపాయ్. రిమోట్, టీపాయ్ కింద నేల మీద పడుంది. గోడ మీద తగిలించివున్న, భారీ LED టీవీ,  పాస్ చేసుంది. ‘స్టోన్ బాయ్’ అని కనపడుతోంది  స్క్రీన్ పైభాగంలో. రాజు,  జీపెక్కివచ్చిన లెథర్ బాగ్ మనిషి,  ఎదురుగా కనపడుతున్న బెడ్ రూమ్ లోకి వెళ్లారు.అక్కడక్కడా చిక్కటి జేగురు రంగు ద్రవం గడ్డకట్టి  పడుంది. నేల మీద మొబైల్, రెండు బులెట్ షెల్స్ కనిపించాయి. రివాల్వరు బంకర్ మంచం కిందకెళ్ళిపోయి  కనపడింది.   

     “అన్నీ  కలెక్ట్ చేసి, ప్రింట్స్ అవీ తీస్కో”  చెప్పాడు పక్కనున్నతనికి రాజు.  

    చేతికి గ్లోవ్స్ వేసుకుని రివాల్వర్నీ సీసం ముక్కల్నీ ఓ  పాలిథీన్ సంచీలో  వేసాడు, అతను. 

    “ఏదీ ఇలా ఇవ్వు “ అంటూ ఆ సంచీని తన చేతిలోకి తీసుకుని జాగర్తగా రివాల్వర్ని పట్టుకున్నాడు  రాజు.  ‘కంట్రీ మేడ్’.   

    గది బయటకొచ్చాడు రాజు. హాల్లో  డైనింగ్ టేబిల్ మీదున్న ఐపాడ్లు  రాజు  కళ్ళబడ్డాయి. వాటితో బాటూ  సగం తినేసి  మధ్యలో వదిలేసిన సాండ్ విచ్ లూ, ఓపెన్ చేసి వున్న టొమాటో కెచప్ పాకెట్లూ.   రెండు కుర్చీలు, ఎవరో కూర్చుని, వొదిలెళ్ళినట్టుగా  కొంచెం దూరం జరిపి వున్నాయి. రివాల్వర్ సంచీ టేబిల్ మీద పెట్టి,   ఒక ఐపాడ్ చేతిలోకి తీసుకున్నాడు. లాక్ చేసి వుంది. ‘1…. 2… 3…’  ప్రయత్నించాడు. తెరుచుకుంది. మిలిటరీ డ్రెస్సులో వున్న వాడు ఒకడు  మెషిన్ గన్ పట్టుకుని పరిగెత్తడం మొదలెట్టాడు.  టప టపా ఎదురొచ్చిన వాళ్ళని కాల్చేస్తున్నాడు.  రెండో ఐపాడ్ లోనూ అదే దృశ్యం. వెనకనే వున్న ఆనందరావు అన్నాడు, “ మా పిల్లలు గూడా మొబైళ్ళు తీసేసుకుని, ఇదే ఆడుతుంటారు సర్ పొద్దస్తమానం. ఏ చైనా వాడో తయారు చేసాట్ట. ప్రపంచంలో వున్న అన్ని రకాల గన్లూ వాడుకోవచ్చు.  ఎంత మందిని ఏసేస్తే అన్ని పాయింట్లు. కాలేజీ పిల్లలూ స్కూలు పిల్లలూ .. అందరికీ ఇదే పిచ్చ!”

    అప్రయత్నంగా, తాను టేబిల్ మీద ఉంచిన రివాల్వర్ వైపు రాజు చూపులు మళ్ళాయి. 

    “ఏ హాస్పిటలో తెలుసా?”

    “కనుక్కున్నా సార్!”    

    *****

    నేరుగా కాజువాలిటీ వార్డుకి వెళ్ళాడు రాజు. ఇద్దరు  వ్యక్తులు ఖద్దరు చొక్కాలేసుకుని, వార్డు డోరు పక్కనే వేసున్న కుర్చీల్లో కూర్చుని వున్నారు. ఒకతను మొహం చేతుల్లో పెట్టుకుని వున్నాడు.అతని పొట్ట ఎగిరెగిరి పడుతోంది. రెండో అతను ఏడుస్తున్న అతని భుజం మీద చేయి వేసి డోర్ వైపే చూస్తున్నాడు. కొంచెం దూరంలో నిలబడ్డాడు రాజు. చూడగానే లేచి దగ్గరికొచ్చాడు రెండో అతను. “పిల్లల తండ్రి ఫ్రెండ్ని”  అని పరిచయం చేసుకున్నాడు. 

    “ఏవిటి పరిస్థితి?”

    “ఇంకా ఏం తెలీదండీ. లోపలి తీసుకెళ్లారు.”

    “పిల్లల మదర్ ఎక్కడున్నారు?” 

    కళ్ళు దించుకుని భారమైన గొంతుతో చెప్పాడతను, “వార్త వినగానే ఆవిడకు స్పృహ తప్పిందండీ. వాళ్ళ వూర్లోనే ప్రస్తుతం హాస్పిటల్లో వుంది.” 

    “ఎలా జరిగిందో  మీకేవన్నా చెప్పాడా” అడిగాడు ఏడుస్తున్న  పిల్లల తండ్రి వైపు చూపు సారిస్తూ. 

    వివరమంతా చెప్పాడతను.కంటిన్యూ చేస్తూ చెప్పాడు,“నిన్న రాత్రే గన్ చేతికొచ్చిందటండీ. బీరువాకు తాళం కూడా వేసి ఏదో ధ్యాసలో  అలవాటు ప్రకారం బీరువా పైన పెట్టేడట తాళాన్ని . ఆయన కిందికి వెళ్లొచ్చే  లోపలే తీసేసినట్టున్నారు పిల్లలు. మరీ పెద్దవాడైతే కళ్ళముందే..... ” అని చెప్తూ ఆగిపోయాడతను. 

    డోర్ తెరుచుకుంది. అప్పటి దాకా కూర్చుని ఏడుస్తున్న ఆ పిల్లల తండ్రి, కళ్ళు తుడుచుకుని దగ్గరకొచ్చి నిల్చున్నాడు. డాక్టర్ మొహంలో ఏ భావమూ కనపడట్లేదు. ఆదుర్దాగా డాక్టర్ వైపు చూస్తున్నారు అందరూ. 

    “పెద్దబ్బాయిని సేవ్ చెయ్యలేక పొయ్యామండీ. రెండో అబ్బాయికి మాత్రం డీప్ స్క్రాచ్ పడింది. షాక్ లోకెళ్ళాడంతే. హి విల్ బీ ఆల్రైట్”. 

    ఓ రెండు క్షణాలు  నోరు తెరిచి  డాక్టర్ వైపే చూసాడు ఆ పిల్లల తండ్రి.  భోరున ఏడుస్తూ  కుప్పకూలిపోయాడు. 


    *****

    బయటకొచ్చి జీప్ పక్కనే నిలబడి సిగరెట్ వెలిగించాడు రాజు.   ఎదురుగా రోడ్డు మీదున్న  హోర్డింగ్  కి అతుక్కుపోయిన పిల్ల హీరో గారు, మారణాయుధం ఒకటి  భుజానేసుకుని ఆహ్లాదంగా నవ్వుతున్నాడు. 

    “ ఇంట్లో తెచ్చిపెట్టుకోడం ఏంది సార్ తుపాకుల్ని, బుర్ర లేని పనులు కాకపోతే “ అన్నాడు ఆనందరావు. 

    సమాధానం ఏమీ ఇవ్వలేదు రాజు. 

    అప్పుడే కార్లోంచి దిగిన,  తెల్లకోటు డాక్టర్ గారు మొబైల్ ఫోన్ లో మాట్టాడుకుంటూ, గట్టిగా నవ్వుతూ  హాస్పిటల్ లోకి వెళ్తున్నాడు. 

     “ఇరవైనాలుగుగంటలూ  నొప్పినీ,  రక్తాన్నీ చూడాలి. మనకంటే భయంకరమైన ఉద్యోగాలు ఈళ్ళవి. ” అన్నాడు రాజు. 

    "మొదట్లో నాకు లాఠీని వాడినా, రక్తపు మరకలు చూసినా,  అన్నం తినబుద్ధయ్యేది కాదు సార్. ఇప్పుడు తలలు తెగి పడున్న మొండాలు చూసినా, ఇంటికెళ్ళి బిర్యాని తిని హాయిగా నిద్ర పోతున్నా. అయినా టీవీలు, సినిమాలు, మొబైళ్ళు….  ఎక్కడ బట్టినా ఇదే గోలగా?” అన్నాడు ఆనందరావు. 

    ఓ క్షణం ఆగి అన్నాడు రాజు “ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం కదా!”. 

    బుర్ర గోక్కుంటూ, నెమ్మదిగా తల పైకీ కిందికీ ఆడించాడు, ఆనందరావు.  

    ఎదురుగా వున్న  ఖాళీ స్థలంలో గాలి సుళ్ళుగా మారడం మొదలైంది. ఐపాడ్ లో గన్ పేలుస్తూ పరిగెడుతున్న మిలిటరీ వాడు,  రూంలో నేల మీద చూసిన రక్తపు మరకలు, కుప్పకూలిన తండ్రి మొహం, ఆ దృశ్యాలన్నీ న్యూస్ రీలు తిరిగినట్టు బుర్రలో గిర్రున తిరిగాయి. 

    మొబైల్  మోగింది. అవతల్నించీ భార్య, కొడుక్కి స్కూల్ బస్సు  మిస్ అయ్యిందనీ, ఆటోలు దొరకలేదు కాబట్టి ఇంట్లోనే ఉండిపోయాడనీ!  అసంకల్పితంగా  నడుముకి తగిలించి వున్న సర్వీస్ రివాల్వర్ ఓసారి తడుముకున్నాడు.  ఓ దుమ్ము తెర వేగంగా వచ్చి  రాజు మొహాన్ని తాకింది. గాలిదుమారం రాను రాను పెద్దదౌతూ మీదికొస్తోంది. సిగరెట్ మంట చివరికంటా వచ్చి,  వేలు చురుక్కుమంది, అశోకరాజుకి.    

    *****



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    13 min
  • స్వింగ్ - ఛాయా మోహన్ గారి 'ఒంటరి పేజీ' కథ

    స్వింగ్

    -----------------------------

    వేసవి సాయంత్రపు ఎండ, కాలం చీకటిలోకి జారిపోకుండా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. 

    పార్కులో పిల్లల సందడి అలల అల్లరిలా  ఉంది.

    చాలా సేపటి నుంచి నా చూపు కొంచెం దూరంగా ఉయ్యాల ఎక్కి ఊగుతున్న పిల్లలు , అక్కడే తచ్చాడుతున్న ఓ ముసలాయన దగ్గర ఆగిపోయింది. 

    ఓ పది మంది దాకా పిల్లలు వంతులు వంతులుగా ఉయ్యాల ఊగుతున్నారు. ఓ పిల్లాడు దిగంగానే ముసలాయన ఏదో అడుగుతున్నాడు.  వాళ్ళు అడ్డంగా బుర్ర ఊపుతున్నారు. అంతలో ఉడతలా మరో కుర్రాడు ఉయ్యాల మీదికి ఉరుకుతున్నాడు. 

    నేను రోజూ సాయంత్రం పార్క్ కి వస్తా. తను పనినుంచి రావడానికి ముందే నేను ఇంటికొస్తా, తనొచ్చేదాకా పార్క్ లో గడుపుతా. నేనెప్పడూ ఈ ముసలాయన్ని చూసిన గుర్తులేదు.

    నెమ్మదిగా చీకటి బలానికి వెలుగు లొంగక తప్పలేదు. కొందరు పిల్లలు వెళ్లి పోయారు.

    ఇంతలో మా అపార్టమెంట్ అబ్బాయి ఒకడు ఉయ్యాల దగ్గర నుంచి పరిగెత్తుకొస్తూ కనబడ్డాడు.

    " ఏయ్ విశేష్ ఆ ముసలాయన ఇందాకటి నుంచి మిమ్మల్ని ఏంట్రా అడుగుతున్నాడు. "

    " ఏం లేదంకుల్ ఆయన ఉయ్యాల ఎక్కుతాట్ట మేం హెల్ప్ చేయ్యాల్ట , ఏమైనా చిన్న పిల్లాడా అంకుల్ !? " సమాధానం ఇస్తూనే ట్యూషన్ కి టైం అవుతోందని పరుగెత్తాడు.

    నే నెమ్మదిగా ఉయ్యాల దగ్గరికి వెళ్ళా. పిల్లలు ముగ్గురో, నలుగురో ఉన్నారు. చీకటి పడుతుండటంతో వాళ్ళు వెళ్ళి పోయే మూడ్ లో ఉన్నారు.

    నెమ్మదిగా నే ముసలాయన దగ్గరికి వెళ్ళా. కొంచెం మావయ్యలా ఉన్నాడు. ఒకసారి ఆయన మొహంలోకి చూసి నవ్వా, ఆయనా నవ్వాడు. 

    " ఉయ్యాల ఊగడం చాలా ఇష్టమా ? "

    మొహమాటంగా నవ్వాడు.

    " ఎక్కుతారా ? "

    " నే నేమైనా చిన్న పిల్లాడినా " కొంచెం చికాగ్గా మొహం పెట్టి అన్నాడు.

    " పర్లేదు రండి "

    దగ్గరుండి ఉయ్యాల మీద కూర్చోబెట్టా. బాలన్స్ చేసుకోలేక జారిపోబోయాడు. పట్టుకుని సర్ది కూర్చో బెట్టి నెమ్మదిగా ఊపసాగాను.

    " చిన్నప్పుడు మావయ్య ఇలాగే ఉపేవాడు " నాలో నేనే గొణుక్కున్నా.

    ఆ ముసలాయన మొహం నిండా బాల్యం ఆవహించింది. కొద్ది నిమిషాలు ఊగాక నెమ్మదిగా దిగిపోయాడు.

    " థాంక్యూ " అని కొంచెం సిగ్గుగా, నెమ్మదిగా అంటూ చీకట్లోకి నడిచాడు

    " అమ్మ గుర్తొచ్చిందా " అన్నా నవ్వుతూ.

    --- * ------



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    3 min
  • 'పది రోజులు' - శ్రీ అప్పాదురై ముత్తులింగం

    'పది రోజులు' అనే ఈ కథకు మూలం ‘పట్టు నాట్కళ్’ అని   శ్రీ అప్పాదురై ముత్తులింగం రచించినది. తమిళంలో ఈయన రాసిన కథలను, అతి చక్కగా తెలుగులోకి అనువదించారు శ్రీ అవినేని భాస్కర్ గారు. ఛాయా ప్రచురించిన ఈ పుస్తకం పేరు 'ఐదు కాళ్ళ మనిషి'.

    శ్రీలంకలో జన్మించిన శ్రీ ముత్తులింగం శ్రీ లంక లో ఛార్టర్డ్ అకౌంటెన్సీ లో , ఇంగ్లాండ్ లో మానేజ్మెంట్ అకౌంటెన్సీ లో పట్టా పుచ్చుకున్నారు. శ్రీలంక పాకిస్తాన్ లతో పాటూ అనేక యూరోపియన్ దేశాల్లో , నార్త్ అమెరికా లో కూడా ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేశారు. చాలా మంచి కథారచయిత. ఆయాదేశాల్లో తనకు  ఎదురైన జీవితాలపై, అనుభవాలపై కథలు రాసారు. 

    ఇప్పుడు  మీరు వినబోయే కథ పాకిస్తాన్ లో ఇస్లామాబాద్ లో ఆయనకెదురైన ఒక వ్యక్తి గురించి.


    పుస్తకం కొనడానికి కింది లింక్ ని ఉపయోగించండి.  https://harshaneeyam.captivate.fm/aidu


    ‘పది రోజులు’


    ఇస్లామాబాద్ ఎనిమిది భాగాలుగా నిర్మించబడ్డ నగరం. అక్కడ ఎఫ్ ప్రాంతంలో అద్దె ఇళ్ళు దొరకడం అన్నది బ్రహ్మ ప్రళయం అనే చెప్పాలి. ప్రభుత్వోద్యోగులు, మిలిటరీ అధికారులు, రాజకీయంగా పలుకుబడి ఉన్నవారూ మాత్రమే అక్కడ ఇళ్ళు కట్టుకుని నివసిస్తుంటారు. కాబట్టి అద్దె వాటాలన్నవి తక్కువ. ఉన్న కొన్నిటికీ అవి ఖాళీ కాక ముందునుండే టెనంట్లు ఎదురు చూస్తుంటారు. ఏ గొప్ప ప్రభుత్వాధికారికో ముందరే చెప్పివుంచి ఓ ఐదారు నెలలు కాచుకునుంటే ఇల్లు దొరకచ్చు. అలాంటి ఒక ప్రయత్నంతోనే నేను అక్కడొక ఇల్లు వెతుక్కుని అద్దెకు దిగాను.


    ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. ఎండగా వున్నప్పుడు డాబా మీదకెక్కిచూస్తే మర్గెల్లా  కొండలు కనబడుతాయి. వీధులు, రోడ్లు ఒకదానికొకటి సమకోణంలో ఉంటాయి. ఎత్తయిన మేడ మీదనుండి చూస్తే ఊరంతా చతురస్రాల్లా కనబడుతుంటుంది. మావీధి మొత్తం నేరేడు చెట్లు వుండటం వల్ల ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. మార్కెట్టూ, షాపులూ లేకపోవడంతో వాహనాల రద్దీ, కాలుష్యం, దుమ్ము ఉండవు. వీధులు శుభ్రంగా ఉంటాయి. అలా ఉండటం ఒకరకంగా మంచిదే అయినప్పటికీ ఏ వస్తువు కావాలన్నా దూరానున్న బజారుకు వెళ్లాల్సివుంటుంది. ఒక మంచి ఇల్లు దొరికేప్పుడు ఒకటి ఉంటే మరొకటుండదన్నది తెలిసిందే కదా!


    సాయంకాలం సరిగ్గా ఆరవ్వగానే ఒక్కొక్క ఇంటికీ ఒక్కో చౌకీదార్ వచ్చేవాడు. వారి చేతుల్లో ఒక రూళ్ళ కర్ర, రగ్గు, రాత్రి భోజన సంచీ, టార్చిలైటు ఉండేవి. ఒకరికొకరు అభివాదం తెలుపుకుని, కుశల ప్రశ్నలు పూర్తయ్యాక గుంపుగా నమాజ్ చేసేవాళ్ళు. తర్వాత, గుంపులు గుంపులుగా కూర్చుని తెచ్చుకున్న భోజనం సంచులు ముందు పెట్టుకుని తినేవాళ్ళు. నిలబెట్టివుంచిన నులక మంచాలు వాల్చుకుని దమ్ము  కొట్టేవాళ్ళు. ఇంటి యజమానులు నిద్రపోయిన ఐదో నిముషం నిద్రపోయేవాళ్ళు.  మరుసటి రోజు తెల్లవారుఝామున ఇంటి యజమాని లేవడానికి ఐదు నిముషాలు ముందే నిద్రలేచి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయేవారు.


    మా వీధిలో ఒక బడ్డీ కొట్టు ఉండేది. నాకు ఆ వీధిలో దొరికిన మొదటి స్నేహితుడు ఆ కొట్టతనే. పేరు నవాజ్. ఉదయం ఆరు గంటలకి కొట్టు తెరిస్తే రాత్రి ఎనిమిదికి కట్టేసేవాడు. వారంలో ఏడు రోజులూ వ్యాపారం జోరుగా సాగేది. ఉదయం నుంచీ వాడి దగ్గరకు పేపరు, పాలు, పాన్, సిగరెట్, బ్లేడ్- ఇలా ఏదో ఒకటి కొనేందుకు ఆ వీధివాసులు వస్తూనే ఉంటారు. నవ్వు ముఖంతో హుషారుగా వస్తువులందిస్తూ డబ్బు తీసుకుంటూ ఉంటాడు నవాజ్.


    1960లో అయూబ్ ఖాన్ ఇస్లామాబాద్ నగరాన్ని నిర్మించి పాకిస్తాన్ రాజధానిగా చేశాడు. అన్ని రకాలుగానూ ప్లాన్ చేసి అన్ని సౌకర్యాలతోనూ నిర్మించబడిన నగరం కాబట్టి పచ్చని చెట్లతోను, చుట్టూ కొండలతోనూ కళకళలాడుతుంటుంది. నగరం నిర్మించిన తొలి రోజుల్లో నవాజ్ తండ్రి ఆ బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు. అతనికి జబ్బు చేయడంతో నవాజ్ ఈ కొట్టు బాధ్యతని తన భుజాలకెత్తుకుని నడుపుతున్నానని నాతో చెప్పాడొక రోజు.


    ఎన్నేళ్ళయిందని అడిగాను. “నా పద్దెనిమిదో ఏటనుండి ఉన్నానిక్కడ. ఇప్పుడు నాకు ముప్పై ఎనిమిది. ఇరవైయేళ్ళు! సంవత్సరంలో 365 రోజులూ పనిచేస్తున్నాను. ఇక్కడ నివసించే అందరూ, వాళ్ళ పిల్లలూ, మనవళ్ళూ అందరూ తెలుసు నాకు!” అన్నాడు.


    నవాజ్ స్వగ్రామం లైలాపూర్. అది ఇస్లామాబాదు నుండి 160 మెళ్ళ దూరానుంది. ముసలివాళ్లయిన తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళేవాడు కాడు నవాజ్. వాళ్ళేవచ్చి చూసి వెళ్ళేవారు. 'సంవత్సరమంతా విరామం లేకుండా పని చేసేవాడు, ఎలా వెళ్ళగలడు?” అని నన్నే అడిగేవాడు.


    “నవాజ్, నువ్వెందుకు పెళ్ళి చేసుకోలేదు?" ఒక రోజు అడిగాను. .


    “పేదవాళ్ళు ఉన్నపళంగా పెళ్ళి చేసుకోలేరు. అమ్మాయికి కన్యాశుల్కం ఇవ్వడానికి డబ్బులు కూడబెట్టాలి,” అన్నాడు.


    అలా చెప్తున్నప్పుడు వాడి కళ్ళు కొట్టు పలకలకు అంటించివున్న ఎందరో  హిందీ సినిమా నటీమణుల పోస్టర్ల మీద ఒక క్షణం వాలి తిరిగొచ్చాయి. డింపుల్ కపాడియా, నీతూ సింగ్, పర్వీన్ బాబి, పూజా భట్, శ్రీదేవి, నీలమ్ అని అప్పట్లో పాకిస్తాన్ లో కూడా ప్రసిద్ధులైన నటీమణులందరూ అక్కడ వరుసగా వాడికోసం వేచివున్నారు.


    “నిన్ను మీ అమ్మానాన్నలు బడికి పంపించలేదా?” అడిగాను.


    “ఏదో పంపించారు. ఉర్దూ కొంచం రాయడానికీ చదవడానికి వచ్చు. లెక్కల్లో కూడిక, తీసివేత మాత్రమొచ్చు. గుణించడం రాదు. మా తలిదండ్రులకి ఆర్థిక స్తోమత లేదు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు, మా ఇంట్లో కోడి మాంసం తినాలంటే నాకైనా జబ్బు చెయ్యాలి, లేదా కోడికైనా జబ్బు రావాలి...” 


    నేరేడు పళ్ళ అదనులో ఆ వీధంతా నేరేడు పళ్ళు నేల రాలేవి. అయితే వాటిని ఏరుకోడానికి పిల్లలు ఉండరక్కడ. అక్కడ నివసించే పిల్లలందరూ నాగరికులు. వీధిలో పడిన వాటిని ఏరుకునే స్వతంత్రం లేదు వాళ్ళకు. కొట్టు బయట నిల్చుని సరుకులమ్మే  నవాజ్ నెత్తిన రోజుకు వంద పళ్ళయినా రాలేవి. దాంతో వాడి తెల్లటి సల్వార్ కమీజ్ ఊదా రంగులోకి మారిపోయేవి. అలాంటప్పుడు ఎండకి ఎర్రగా మెరిసే దేహంతో, వెనక్కి దువ్విన పొడవాటి జుట్టుతో పంజాబి నటుడిలా అందంగానే కనిపించేవాడు.


    అలాంటొక నేరేడు పళ్ళ సీజన్ లో నేను ఆఫీసునుండి వెనక్కి వచ్చేసరికి నా ఇల్లు కనిపించలేదు. వీధి పేరు చూస్తే, నేనుంటున్న వీథే! అయితే వీధినంతా ఆక్రమించి పందిరి వేసేశారు. నేను కారునలా నిలబెట్టి ఏం చెయ్యాలా అనిఆలోచిస్తుంటే, నా ఇంటి ఓనర్ పదవీ విరమణ చేసిన మిలిటరీ మేజర్, నగిషీ పనిచేసి వున్న ఖరీదైన చెప్పులు వేసుకుని, చేతికర్ర తిప్పుకుంటూ నాదగ్గరకొచ్చాడు. నాకు వణుకు మొదలైంది.


    వచ్చిన కొత్తల్లో కొన్నిసార్లు మేజర్‌తో మాట్లాడాను. మనం ఏది చెప్పినా దానికి విరుద్ధంగా ఒక అభిప్రాయం చెప్పేవాడతను. అలా ఒక ఎన్నటికీ కొలిక్కిరాని వివాదమొకటి మొదలయేది. సంభాషణల్లో పొరపాటున కూడా బంగ్లాదేశ్-పాకిస్తాన్యుద్ధం గురించిన ప్రస్తావన తీసుకురాకూడదు.  తెస్తే, మనిషిలో భావావేశం కట్టలు తెంచుకుని పొంగిపొరలుతుంది. మనిషి నేలమీద నుండి ఒక అడుగు పైనే తేలిపోగలడు. మనం అతని అభిప్రాయాలన్నిటితో ఏకీభవించాక కూడా ఓ అర్ధగంట చర్చని కొనసాగించగలడు.


    అతను మిలిటరీలో పని చేసినవాడన్న సంగతి చూడగానే ఎవరికైనా తెలిసిపోతుంది. దృఢమైన దేహం, తగిన ఎత్తు. ముఖం మాత్రం అప్పుడే ఎవరినో కొరికేసి వచ్చినవాడిలా ఉంటుంది. అయితే ఆ పూట మాత్రం దరహాసాన్ని తెచ్చి పెట్టుకుంటూ 'తన కొడుకు పెళ్ళి ఏర్పాట్లకని పందిళ్ళవీ వేశామనీ, శ్రమ కలిగించుతున్నందుకు క్షమించమనీ కారు వీధి చివర్లో పెట్టి ఇంటికి నడిచి రమ్మని  ప్రాధేయపడ్డాడు. నా ఒక్కడి కారే కాదు,  ఆ వీధిలో అందరి కార్లూ వీధి చివర  ఉన్నాయి. కార్లను చూసుకోడానికని ప్రత్యేకించి ఒక మనిషిని కూడా ఏర్పాటు చేసుంచాడు.


    మరుసటి రోజు పొద్దున నాకు మరో ఆశ్చర్యం ఎదురయింది. బడ్డీకొట్టు  కనిపించలేదు. అదున్న చోటు ఖాళీగా ఉంది. నవాజ్ ఎక్కడ అంటే జవాబివ్వడానికి నసుగుతున్నారు. ఆ వీధి వాసులకు ఆ రోజు పేపర్, పాలు, పాన్, సిగరెట్-ఏవీ దొరకలేదు. దూరానున్న బజారుకెళ్ళాల్సొచ్చింది. పందిరి వెయ్యడానికి అడ్డంగా ఉందంటూ బడ్డీని తీసేయమని చెప్పారట. నవాజ్ రెండు రోజులు వ్యవధి అడిగాడట. వాళ్ళు ఇవ్వకపోగా, బడ్డీ కొట్టుని పగలగొట్టి అతణ్ణి తరిమేశారట. పాకిస్తాన్లో మామూలుగా మాట్లాడేప్పుడు ఉర్దూలో మాట్లాడుకుంటారు. ఎవరినైనా తిట్టాలనుకుంటే మాత్రం పంజాబీ అందుకుంటారు. ఎందుకంటే పంజాబీ తిట్టడానికే సృష్టించబడిన భాష అన్నది వాళ్ళ అభిప్రాయం. ఆ రోజు మేజర్ పంజాబీలో తిట్టాడు అన్న విషయం ముఖ్యాంశంగా మాట్లాడుకున్నారు జనం.


    పెళ్ళి ఇంటి ఏర్పాట్లు బహు ఘనంగా, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రకరకాల షామియానాలూ, జరీ తెర అలంకారాలూ, రంగురంగుల లైట్లూ కళ్ళకు కొడుతున్నాయి. లాహోర్  నుండి తెప్పించిన ఎరుపు, తెలుపు, పచ్చ రంగు గులాబీలు కుప్పలు కుప్పలుగా పోసివున్నాయి. ఈ వేడుకలన్నీ నాలుగు రోజులు జరుగుతాయని ప్రకటించారు. నా పోర్షన్ మీటర్ బాక్స్ నుండి కరెంటు తీసుకుని స్తంభాలకూ చెట్లకూ లౌడ్ స్పీకర్లు కట్టి సినిమా పాటలు మ్రోగించారు. పాటల మోతకి ఇళ్ళలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా వినిపించేది కాదు. ఆ మోత ఇరవై నాలుగు గంటలూ నిర్విరామంగా సాగింది. అప్పుడే విడుదలయిన మాధురీ దీక్షిత్, సంజయ్ దత్ నటించిన ఖలనాయక్ సినిమా ఇస్లామాబాద్లోని థియేటర్లలో విజయవంతంగా ఆడుతూఉంది. అందులోని చోళీకే పీచే క్యా హై అన్న ప్రసిద్ధమైన పాటని కనీసం రెండు వందల సార్లయినా మోగించారు. ఎవరైనా వచ్చి చోళి విప్పి చూపితేగానీ ఆపరేమో అనిపించింది. నా మీటర్ బాక్స్ నుండి అరువుకు తీసుకున్న కరెంట్ తోనే ఈ పాటలు మోగిస్తున్నారు. దీన్ని ఎప్పుడైనా ఆపించే శక్తి నాకుంది అనుకోగానే నాకు నవ్వొచ్చింది.


    ఇన్ని ఇబ్బందుల మధ్యన కూడా ఒక ఊరట ఏంటంటే, సాయంత్రమయ్యే సరికి పెద్ద పెద్ద ఇత్తడి పళ్ళాల్లో రకరకాల ఆహార పదార్థాలు వడ్డించి, వాటి మీద అందమైన వెండిరేకు కప్పి ఆ వీధిలో ఉన్న అందరి ఇళ్ళకీ సరపరా చేయబడ్డాయి. పెళ్ళికని వీధిని ఆక్రమించుకున్న ఆ నాలుగు రోజులూ రుచికరమైన ఆహార పదార్థాలు ఎన్నోరకాలు, మేజర్ గారి ఇంటినుండి అందరి ఇళ్ళకీ వచ్చాయి. వీధివాసులెవరూ వారివారి ఇళ్ళల్లో వంటలు చెయ్యలేదు. చౌకీదార్లు వారి భోజనాల సంచులు తెచ్చుకోలేదు. నందికోట్ నుండి రప్పించబడిన వంటవాళ్ళు వండిన ఆహార పదార్థాల రుచి జీవితాంతం మరిచిపోలేమన్న విషయంలో ఆ వీధిలో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు.


    పెళ్ళికూతురిని ఇంటికి తీసుకొచ్చిన మరుసటి రోజు రాత్రి, ప్రసిద్ధ ఖవ్వాలి గాయకుడు నుస్రత్ ఫతే అలీఖాన్ తన పరివారంతో వచ్చాడు. తను పాడటానికి రాలేదు. మేజర్ కి బాగా దగ్గరివాడు అని చెప్పుకున్నారు. అయితే ఈ వార్త నిప్పులా నలుమూలలా పాకింది. చుట్టుపక్కల జనాలంతా మా వీధికొచ్చేశారు. మేజర్, అతణ్ణి ఒకే ఒక్క పాట పాడమని వేడుకున్నాడు. నుస్రత్ ఇలాంటి పెళ్ళి వేడుకల్లోనో మరోచోటో పాడడు అన్నది అందరికీ తెలుసు. అయితే తన స్నేహితుడి కోరిక మేరకు తన నియమాన్ని పక్కనబెట్టి ఒకే ఒక ఖవ్వాలి పాడాడు. అతని కంఠం నుండి వెలువడిన పాట అక్కడి జనాలని మంత్రం వేసినట్టు కట్టిపడేసింది. పాట పూర్తవ్వగానే జనాలు కొట్టిన చప్పట్లు ఆగడానికి చాలా సమయం పట్టింది. వీధిలోనే కాదు వీధికి అవతలవరకు నిల్చుని విన్నారు ఆ పాటని. 'మరొక పాట!' అని అరిచారు. నాకు మాత్రం తిల్లానా మోహనాంబాళ్ సినిమాలో సింగపూర్ జమీందార్ బంగ్లా  ముందు శివాజీ గణేశన్ నాదస్వరం వాయించిన దృశ్యం గుర్తొచ్చింది.


    ఐదారు రోజుల తర్వాత ఆ పందిరి విప్పినప్పుడు ఉన్నట్టుండి ఇది మన వీధికాదేమో అన్నట్టు బోసిపోయింది. నాలుగు రోజుల వేడుకలనంతరం మేమెవరం మామూలు స్థితికి రాలేకపోయాం . నా ఇంటి మీటర్ బాక్స్ నుండి కరెంట్ తీసుకుని మోగించిన మోత ఆగిపోయింది. ఆ మోతకి అలవాటుపడిన చెవులకి ఈ నిశబ్దం అలవరుచుకోడానికి సమయం పట్టింది. ఇత్తడి పళ్ళాల్లో వచ్చే రుచికరమైన భోజనాలు ఆగిపోయాయి. తెల్లవారంగానే ప్రతి ఇంటివారూ బడ్డీ కొట్టు నవాజ్ వచ్చేశాడా అని వచ్చిచూసేవారు. పది రోజులుగా వాడు లేడు. సరిగ్గా పదకొండవ రోజు ఉదయం కొత్తగా ఒక బడ్డీ కొట్టు వెలిసింది. నవాజ్ ఏమీ జరగనట్టే ఊదా రంగులోకి మారిపోయిన తన తెల్ల సల్వార్ కమీజ్ వేసుకుని, దువ్విన తన పొడవు జుట్టుతో, పందుంపుల్లని నోట్లో పెట్టుకుని పళ్ళు తోముతూ కనిపించాడు. ఆ రోజు వాడి దగ్గరకి వెళ్ళిన మొదటి కస్టమర్ నేనే. పేపరూ పాలూ కొన్నాను. వాడు ఇన్ని రోజులూ ఎక్కడికెళ్ళాడూ ఎందుకెళ్ళాడూ అన్నదాని గురించి నోరే తెరవలేదు. అయితే వాడడిగిన మొదటి ప్రశ్న, “ సార్, ఫతే అలీఖాన్ ఖవ్వాలీ పాడాడట కదా! నిజంగానా?”


     “అద్భుతమైన సంగీతం. అర్ధగంట ఆపకుండా పాడాడు!” అన్నాను. ఆ కళ్ళల్లో వర్ణించలేనంత నిరాశ. “అవునా? అతను మా ఊరి వాడే. అతను తాగిన  నీళ్ళనే నేనూ తాగాను. అతను పీల్చిన గాలే నేనూ పీల్చాను. అతను నడచిన మట్టిలోనే  నేనూ నడిచాను. అయితే అతని పాటను ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా కచేరీలో వినలేదు...” అని అంటుండగానే అతని గొంతుని దుఃఖం కమ్మేసింది.  ముఖాన్ని నిరాశ అలముకుంది.


    నవాజ్ నా ముఖం చూసి మాట్లాడలేదు. అడిగిన ప్రశ్నను కూడా చేతిలో ఉన్న పందుంపుల్లని చూస్తూనే అడిగాడు. కొత్తగా పెళ్ళయిన మేజర్ కొడుకుని తన భుజాల మీద ఎత్తుకున్నట్టు నవాజ్ అదివరకే ఒకసారి చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి మేజర్ కొడుకు నిద్ర కళ్ళతో ఊగుతూ వచ్చాడు. నవాజ్ హుషారుగా సర్దుకున్నాడు. వచ్చిన యువకుడు 'సిగరెట్' అన్న ఒక్క మాట మాత్రమే పలికాడు. ఒంటె బొమ్మ ఉన్న సిగరెట్ పెట్టి తీసి ఒంటెలా ఒళ్ళు వంచుకుని నవాజ్ చేయి చాచి పెట్టె అందించాడు. యువకుడు సిగరెట్ ప్యాకెట్ మీదున్న మైకా పేపర్ ని ఒక్కసారికే చించిపడేసి ఒక సిగరెట్ తీసి నోట్లో పెట్టుకున్నాడు. లైటర్తో  నవాజ్ దాన్ని వెలిగించాడు. యువకుడు ఏదో గొణిగాడు. నాకప్పుడు అమెరికాని నిర్మించిన వాళ్ళలో ఒకడైన బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నమాట గుర్తొచ్చింది: 'ఆత్మాభిమానం వదులుకోవడం వల్ల పేదలెప్పుడూ నడుం వంచుకున్నట్టే కనబడతారు. ఖాళీ గోనెసంచి నిటారుగా నిల్చోగలదా?”. 


    పాలూ, పేపరూ పట్టుకుని నేరేడు పళ్ళమీద నడుచుకుంటూ ఇంటివైపుకు వెళ్ళాను. ఆ రాత్రి పడుకునే ముందు టీవీలో డిస్కవరీ చానెల్ చూస్తూ ఉన్నాను. చలికాలం మొదలయ్యే ముందు కారిబూ జింకలు ఉత్తర ధృవం నుండి దక్షిణంగా వలసపోవడాన్ని చూపించారు. నేల  కనిపించనంతగా అవి గుంపులు గుంపులుగా నడుస్తున్నాయి. దూరంగా రాతిబండ మీద ఒక తోడేలు ఏం తోచనట్టు  కూర్చుని ఉంది. వెంటనే ఆ ముప్పై లక్షల జింకలూ కట్టలు తెంపుకున్న నీళ్ళలా వేరే దిక్కుకు పరుగులు తీశాయి. విలేకరి, 'ఎందుకివి ఇలా భయపడి పరిగెడుతున్నాయి?” అని అడిగాడు. దానికి సైంటిస్టు, 'వాటి జీన్లో 'భయపడు' అన్న విషయం రాయబడి ఉంది' అని అన్నాడు. మనుషుల్లోనూ కొందరిలో ఇలాంటి ఆజ్ఞలు వాళ్ళ జీన్ లో రాయబడి ఉన్నాయేమో అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను.


    ఏడాదిలో 365 రోజులూ పనిచేసే నవాజ్, ఆ సంవత్సరం 355 రోజులు మాత్రమే పనిచేశాడు. నేరేడు పళ్ళ సీజన్ వెళ్ళిపోయి చలికాలం మొదలయినపుడు నవాజ్ కొట్టుకు వచ్చే జనం స్వెట్టర్లేసుకుని వచ్చేవారు. సాయంత్రం వేళలో వాకింగ్ చేసేవారు. అప్పుడప్పుడూ ఆ కొత్త దంపతులూ కనిపించేవారు. పెళ్ళిరోజు ఆ అమ్మాయిని నేను సరిగ్గా చూడలేదు. ఆమె ఆకర్షణీయంగా అందంగా ఉంది. కరాచీ నుండి తెచ్చుకున్న నాజూకైన కోడలు మరి! ఛాతీ విరుచుకొని ఆమె ముందు నడుస్తోంటే, అతను ఆమె వెనక నడిచాడు.


    చాలా రోజుల తర్వాత ఒక రోజు పొద్దున ఆశ్చర్యకరంగా మేజర్ వీధిలో కనిపించాడు. వదులైన కమీజ్ ని పంటితో పట్టుకుని సల్వార్ బొందుని బిగించుకుంటూ నవాజ్ కొట్టువైపుకి నడుస్తున్నాడు. ప్రసవించిన స్త్రీ పొట్టమీది చారల్లా ఒక నల్లటి చార ఇతని తెల్లటి దేహం మీద కనబడింది. అతని దేహానికి వయసయినప్పటికీ పొట్ట మాత్రం ముప్పై ఏళ్ళు దాటలేదేమో అనిపించేలా వుంది. బంగ్లాదేశ్ యుద్ధంలో అతను గొప్ప సాహసాలు చేశాడని విని ఉన్నాను. అయితే, అతను సాధించిన గొప్ప ప్రతాపం ఏమీ లేదు. యుద్ధంలో చెరపట్టబడిన 91,000 మంది పాకిస్తానీల జాబితాలో ఇతని పేరు లేకపోవడమే ఆ గొప్ప!


    పదడుగుల దూరంలో మేజర్ ని చూసిన నవాజ్ ఎముకల్లేని జంతువులా మారిపోయాడు. పాకుతున్నట్టు అతని వైపుకి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. బట్టలు కుట్టేవాడు సూది నోట్లో పెట్టుకుని మాట్లాడినట్టు మేజర్ ఏదో చెప్పగా, నవాజ్ పొట్టని చేత్తో పట్టుకుని ఇంకాస్త వంగి గట్టిగా నవ్వాడు. 1582వ సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రపంచ క్యాలెండర్ నుండి పది రోజులను పోప్ గ్రెగరీ చించేసినట్టుగా, ఇక్కడ కూడా ఎవరో ఆ ఏడాదిలోని పది రోజుల్ని నవాజ్ క్యాలెండర్ నుండి చించిపడేశారనిపించింది.


    మూలం: అమెరిక్కక్కారి (2009) కథా సంపుటంలోని 'పత్తు నాట్కళ్’ కథ. 


    హర్షణీయం పాడ్కాస్ట్ వినడానికి -


    https://harshaneeyam.captivate.fm/apl - Apple


    https://harshaneeyam.captivate.fm/spot - Spotify


    https://harshaneeyam.captivate.fm/gaana - Gaana


    https://harshaneeyam.captivate.fm/jio - Jiosavn



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    20 min

About Harshaneeyam

From the publisher's feed

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast.

More shows like Harshaneeyam

KiranPrabha  Telugu Talk Shows by kiranprabha

KiranPrabha Telugu Talk Shows

52 Listeners