
Sign up to save your podcasts
Or


వనవాసి ధారావాహికలో భాగంగా ఈ ఎపిసోడ్లో సిక్కింలో అనాదిగా నివసిస్తున్న ‘లేప్చా’ తెగ కు చెందిన ప్రజల కు తీస్తా నదితో వున్న సంబంధం , తీస్తా హైడ్రో డాం నిర్మాణం వల్ల వారు పడుతున్న ఇబ్బందుల గురించి మయాల్మిత్ లేప్చా గారు (Ms.Mayalmit Lepche) మనతో సంభాషిస్తారు.
Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.
వనవాసి ఆడియో ధారావాహిక ఇప్పటికి 15 భాగాలు ప్రసారం చెయ్యడం జరిగింది.
ఇంకొక 45 భాగాలు పూర్తి చెయ్యవలసి వుంది.
దాదాపు వందేళ్ల క్రితం ప్రచురింపబడ్డ ' వనవాసి' నవల, మానవుడికి ప్రకృతికి మధ్య , మారుతున్న సంబంధం గురించి, ఒక రచయిత స్పందన.
ఇందులో భాగంగా, దేశ వ్యాప్తంగా , పర్యావరణ సంరక్షణ కై కృషి చేస్తున్న కార్యకర్తలు , సామాజిక సంస్థల ప్రతినిధులు, వివిధ పర్యావరణ వ్యవస్థలపై పని చేస్తున్న నిపుణులు, ఇలా అనేకమందితో హర్షణీయం జరిపిన సంభాషణలు (నలభైకి పైగా ) ఈ శబ్ద రూపకం ద్వారా మీకు అందించడం జరుగుతుంది.
హర్షణీయంలో ఇప్పటిదాకా, ఛత్తీస్గఢ్ లో హస్దేవ్ అరణ్యంలో జరుగుతున్న కోల్ మైనింగ్ వాటి దుష్ప్రభావాలూ , దానిని ఆపడానికి తమ సంస్థద్వారా చేస్తున్న ప్రయత్నం గురించి , శ్రీ ఆలోక్ శుక్లా గారూ, నదుల పునరుజ్జీవనం పై మౌలిక్ సిసోడియా గారు , వనవాసి నవలపై తనదైన విశ్లేషణ తో సత్య శ్రీనివాస్ గారు, తెలుగు రాష్ట్రాలలో ఆదివాసీ హక్కుల గురించి ఈ ఏ ఎస్ శర్మ గారు, శక్తీ ఫౌండేషన్ శివరామకృష్ణ గారు, ఆదివాసీ జీవితాలపై శ్రీ పతంజలి శాస్త్రి గారు, మడ అడవుల పరిరక్షణ పై కృషి చేసిన తూపల్లి రవిశంకర్ గారు మనతో మాట్లాడటం జరిగింది.
ఈ విడత ప్రసారం చెయ్యబోయే భాగాలలో , హిమాలయ పర్యావరణ వ్యవస్థ ప్రత్యేకత , మానవ కట్టడాల వల్ల అక్కడ ఏర్పడుతున్న ప్రమాదకర పరిస్థితులపై మానసి అషేర్ గారు (Ms.Manshi Asher) , సిక్కింలో అనాదిగా నివసిస్తున్న 'లేప్చే' తెగ కు చెందిన ప్రజల కు తీస్తా నదితో వున్న సంబంధం , తీస్తా హైడ్రో డాం నిర్మాణం వల్ల వారు పడుతున్న ఇబ్బందుల గురించి మయాల్మిత్ లేప్చే గారు (Ms.Mayalmit Lepche), అలానే అరుణాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న కోల్ మైనింగ్ పై పోరాడుతూ కాల్పులకు గురైన ఆగ్నేస్ ఖార్షింగ్ గారు (Ms.Agnes Kharshiing) మనతో సంభాషిస్తారు.
ఈ సంభాషణలన్నిటిలో ప్రతిధ్వనిస్తున్న ముఖ్య అంశాలు :
అటవీ కొండ ప్రాంతాల్లో భూమిని నీటిని హస్తగతం చేసుకుని, గాలిని కలుషితం చేస్తూ, అక్కడి నివసించే వారి చట్టపరమైన హక్కులను కాలదన్ని వారి జీవితాలను ఛిద్రం చేస్తూ నాగరిక ప్రపంచం కడుతున్న హైడ్రో పవర్ డాంలూ , మైనింగ్ కోసం జరుపుతున్న తవ్వకాలూ, దీనివల్ల జరుగుతున్న పర్యావరణ విధ్వంసం, తద్వారా వాతావరణంలో వస్తున్న, రాబోయే పెను మార్పులూ.
మనదేశంలోనే కాక ప్రపంచ దేశాలన్నిటిలో, అభివృద్ధి పేరుతో ఇదే రకంగా పర్యావరణ వ్యవస్థ నాశనం కావటం , ప్రకృతి ఆలంబనగా జీవించే వారు తీవ్రమైన ఇబ్బందులకు గురికావటం అనేది చాలా ఆందోళన చెందవలసిన విషయం.
వనవాసి నవలలో ప్రస్తావించిన పర్యావరణ , సామాజిక అంశాలను , ఇప్పుడున్న పరిస్థితులకు అన్వయించడం, ఈ శబ్దరూపకం ద్వారా హర్షణీయం చేస్తున్న ఒక ప్రయత్నం.
వనవాసి ధారావాహిక లో భాగంగా పర్యావరణ సమస్యలపై 25 మంది పర్యావరణ వేత్తలతో సంభాషించి శ్రోతలకు అందించాలని హర్షణీయం సంకల్పించింది.
శ్రీ. మౌలిక్ సిసోదియా గారు ఈ ఎపిసోడ్లో పర్యావరణంలో వస్తున్న మార్పులు , నీటి కొరతను ఎదుర్కొనడం గురించి వివరించడం జరిగింది.
https://tarunbharatsangh.in/contact-us/
వనవాసి ధారావాహిక లో భాగంగా పర్యావరణ సమస్యలపై 25 మంది పర్యావరణ వేత్తలతో సంభాషించి శ్రోతలకు అందించాలని హర్షణీయం సంకల్పించింది.
శ్రీ. మౌలిక్ సిసోదియా గారు ఈ ఎపిసోడ్లో రాజస్థాన్ తూర్పు ప్రాంత గ్రామాలలో నీటి కొరత తీర్చడానికి, శ్రీ రాజేంద్ర సింగ్ గారు (The water Man of India )స్థాపించిన 'తరుణ్ భారత్ సంఘ్' గురించి , సరిస్కా టైగర్ రిసర్వ్ లో మైనింగ్ నిలిపివేయడానికి చేసిన కృషి గురించి వివరించారు.
నదీజలాల పరిరక్షణకై , ‘ తరుణ్ భారత్ సంఘ్’ సభ్యులను సంప్రదించాలంటే – https://tarunbharatsangh.in/contact-us/
ఈ ఎపిసోడ్ లో అతిధి, ముప్ఫయి ఏళ్ల పైబడి అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలకు పర్యావరణ విషయాలపై సలహాదారుగా వ్యవహరిస్తున్న శ్రీ. జి.సత్య శ్రీనివాస్ గారు. వనవాసి నవలను సామాజిక, చారిత్రక, సాహిత్య, పర్యావరణ కోణాల్లో విశ్లేషిస్తూ అనేక ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు శ్రీనివాస్ గారు.
పర్యావరణ కవిత్వం , చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, పుస్తక పఠనం ఆయన ఇతర అభిరుచులు.
శ్రీనివాస్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.
Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.
ఈ ఎపిసోడ్ లో అతిధి, ముప్ఫయి ఏళ్ల పైబడి అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలకు పర్యావరణ విషయాలపై సలహాదారుగా వ్యవహరిస్తున్న శ్రీ. జి.సత్య శ్రీనివాస్ గారు. వనవాసి నవలను సామాజిక, చారిత్రక, సాహిత్య, పర్యావరణ కోణాల్లో విశ్లేషిస్తూ అనేక ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు శ్రీనివాస్ గారు.
పర్యావరణ కవిత్వం , చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, పుస్తక పఠనం ఆయన ఇతర అభిరుచులు.
శ్రీనివాస్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.
Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.
వనవాసి ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకై, వివిధ రకాల సమస్యలపై కృషి చేస్తున్న వ్యక్తులను 25 మందిని ఇంటర్వ్యూ చేసి , తెలుగులోకి అనువదించి ప్రసారం చెయ్యాలని హర్షణీయం సంకల్పించింది.
ఇందులో భాగంగా
ఛత్తీస్గఢ్ రాష్త్రం లోని హస్దేవ్ అరణ్యం పరిరక్షణ కై , జనాభిగ్యాన్ అనే సంస్థను స్థాపించి, పోరాడుతున్న శ్రీ.ఆలోక్ శుక్లా ని ఇంటర్వ్యూ చెయ్యడం జరిగింది. అరణ్యంపై ఆధారపడిన గోండు ఆదివాసీ జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న ' కోల్ మైనింగ్ ' , దాని వల్ల పర్యావరణం పై పడుతున్న దుష్ప్రభావం - వీటిపై పోరాడుతున్నారు గత రెండు దశాబ్దాలుగా శ్రీ.శుక్లా.
ఈ ఇంటర్వ్యూలో ఆయన , హస్దేవ్ అరణ్యం ప్రత్యేకత గురించి , ఆదివాసీల జీవితం గురించి, చట్టంలో ఆదివాసీల హక్కుల గురించి, ఆదివాసీల చట్టపరమైన, శాంతియుత పోరాటాన్ని గురించి వివరించడం జరిగింది.ప్రస్తుతం ఇంటర్వ్యూ హిందీ లో ప్రసారం చెయ్యడం జరుగుతోంది. తొందరలో తెలుగు అనువాద పాఠం ఆడియో ద్వారా ప్రసారం చెయ్యడం జరుగుతుంది.
Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.
రండి ఛాయ కుటుంబంతో కాసేపు మాట్లాడదాం.
నచ్చిన పుస్తకాలు కొనుక్కుందాం.
Venue : 11th September from 3PM to 8PM at Ravindra Bharathi
కె.సభా (జూలై 1, 1923 – నవంబరు 4, 1980) రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి. జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా , నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు.
కథను మీకందించడానికి సహకరించిన శ్రీమతి రమణ గారికి కృతజ్ఞతలు.
ముక్కంటి సీమలో పెద్ద కాటకం వచ్చింది. క్షామ దేవత విలయతాండవంలో జన పదాలన్నీ అల్లల్లాడి పోయినవి. దప్పిక చల్లార్చుకోవడానికి చుక్కనీరు కూడా లభించని అసహాయ స్థితిలో కొంపాగోడూ వదలి దేశం ఎల్లలు దాటిపోతున్న కూలీల గోడు అవర్ణనీయమై పోయింది.
రోజూ పత్రికల్లో ఈ వార్తలే అచ్చు కావడం వల్లా మంత్రి వర్గం, అత్యవసర సమావేశంలో కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకొన్నది. మండలానికొక మంత్రి వెళ్లి అప్పటికప్పుడే కరువు నివారణ కార్యక్రమాలను ప్రారంభించాలని ఎన్ని కోట్లనైనా వెచ్చించి ప్రజలను కాపాడి తీరాలని అమాత్యులందరూ కంకణం కట్టు కొన్నారు.
మత్స్య శాఖామాత్యులు రాజాసుందర ప్రకాశ గోవర్ధన శతపధిగారు, కనకాచలం జిల్లా పర్యటనకు బయలుదేరారు. మంత్రిగారి పర్యటన కార్యక్రమాన్నంతా స్థానిక పత్రికలు ప్రముఖంగానే ప్రచురించాలనుకొన్నందున ఆ జిల్లా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అవసరమైన ముందు జాగ్రత్తలన్నీ తీసు కొన్నాడు. దిన వార పత్రికల విలేఖరులనే కాక మాసపత్రికల విలేఖరులను కూడా పిలిపించి కనకాచలంలో ప్రెస్సు కాన్ఫరెన్సును యేర్పాటు చేశాడు.
ఆరోజు కనకాచలం ట్రావెలర్సు బంగళాలో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో మత్స్యశాఖామాత్యులు రాజా సుందర ప్రకాశ గోవర్థన శతపధి గారనేక కొత్త విషయాలను వెల్లడించారు.
డైనమెట్ పత్రిక విలేఖరి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ మత్స్య శాఖామాత్యులు యిలా అన్నారు. –
‘మనం సామ్యవాద యుగంలో ఉన్నాము. రుచిలో బేడిసెలే బాగుంటాయి. నీ బుడ్డపక్కెలు బాగుండవనీ భేదాలుంచుకోరాదు. మనకు కొరదైనా ఒకటే కొరమేనైనా ఒకటే. పూజేపను పెంచుతూ మావురాయిని మరచిపోరాదు. మన నేతల వలె పీతలను కూడా సంరక్షించుకోవాలి. జపానులో నేను గమనించాను. వాళ్లు సీఫుడ్ ను బాగా ఉపయోగించుకొంటారు. ఈ కరువులో ప్రతి చెరువులో జెల్ల లనో ఇసుక దొందులనో పెంచుకోకుంటే దేశం దెబ్బతింటుంది,
“మన చెరువుల్లో నీళ్లుంటే గదసార్?” మధ్యలో ప్రశ్నించాడు, సౌదామిని విలేఖరి.
“ డోన్ట్ డిస్టర్బ్ మి, దటీజ్ అనదర్ ప్రాబ్లం” అంటూ అమాత్యులు సిగరెట్ ముట్టించి –
‘యుసీ … ఈ నత్తలున్నాయే వీటిని పుష్కలంగా పెంచాలి. వాటిలో కొవ్వు పదార్థం యెక్కువ. ప్రతి గుంటలోనూ పెంచే వీలుంది. అన్నట్టు మరచాను. నేను ఇండో చైనా వెళ్లినపుడు అక్కడొక మ్యూజి యంలో నాయెత్తు తాబేలును చూశాను. కాదూ కూడదంటే కొంత మసాలా ఎక్కు వవుతుంది. కాని అది బలే రుచిగా కూడా ఉంటుందని నా నాన్ వెజిటేరియన్ ఫ్రండొ కాయన చెప్పాడు. అతడిపుడు చికాగోలో ఉన్నాడనుకోండి. ఇక్కడ చెరువు లెక్కువేగా?’ ప్రశ్నించాడు గౌరవనీయులైన మత్స్య శాఖామాత్యులు.
అందరూ కాకున్నా ఇంచుమించు సగం మంది ఎక్కువనే చెప్పారు. కాని జాజిమల్లె పత్రిక కరస్పాండెంటు మాత్రం ‘అర్థం చెరువులకు పైగా కట్టలు తెగిపోయినవే’ అన్నాడు.
“ డజన్ట్ మేటర్. ఆ పని మనది కాదనుకోండి. ఇరిగేషన్ మినిస్టర్ చూస్తారు. మన చెరువుల్లోనే కాదు. ప్రతి బావిలోనూ చేపల్ని పెంచాలి. కరువులో చేపల్ని పెంచే కార్యక్రమం క్రింద కనీసం పది కోట్ల రూపాయలసైనా ప్రత్యేకించమని నేను సి.యం. తో గట్టిగా చెప్పాను. కానీ మా ఫైనాన్స్ మినిస్టర్ ఒప్పుకొంటేగా. చివరికి యాభై లక్ష లిచ్చాడు. కడకు నేను మొండిగా పేచీ పెడితే రెండుకోట్లు చేపలు పట్టే వలల్ని కొనడానికి అలాట్ చేశారు.”
“ పెంచకనే పడే పశ్న ఎక్కడుంటుందండీ ?” చిన్నగా నసిగాడు సిగ్నల్ పత్రిక విలేఖరి.
“మీ కదే అర్థం కాదు. ఒక్కసారిగా వలల్ని కొంటే, పెంచే చేపలనంతా పదుతూ ఉండవచ్చు. జాలర్లు వీకర్ సెక్షన్ కు చెందిన నాళ్ళు. అసలు మైనారిటీ కమ్యూనిటీస్ ని డెవలప్ చెయ్యడమే మన ధ్యేయం. సోషలిజం ముఖ్య సూత్రం ఒకటుంది. చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగివేసినట్లు మెజారిటీ కమ్యూనిటీస్ మైనారిటీ కమ్యూనిటీస్ ను మింగివేయడాన్ని చూస్తూ ఊరుకోరాదు. అందుకే మా డిపార్టు మెంటకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్సులో పెద్ద చేపలు చిన్న చేపల్ని మ్రింగి వెయ్యకుండా చూడాలి’ అన్నాము. ఒకే సైజా చేపల్ని పెంచమన్నాము. బొమ్మిడాయిలు వుండే బావిలో మావురాయిల్ని వదిల్తే ఏమవుతాయి చెప్పండి ? తాటాకు చేపలు పాము చేపల్ని పక్కెల్లో విడిస్తే, బతకవు! … “
అంటూ టైం చూచుకొని “వేర్ ఈస్ అవర్ ఇన్స్పెక్టర్” అన్నారు అమాత్యులు. ఏడుకొండలవాడికంటే వెడల్పైన నామాలు పెట్టుకొన్న బంట్రోతు వచ్చి “వారు పరిగిలగుట్ట లో తమ రాకకు యేర్పాట్లు చెయ్యడానికి వెళ్లారు, దేవరా” అన్నాడు.
పరిగిలగుట్ట అక్కడికి పాతికమైళ్లుంది. కార్యక్రమం ప్రకారం చెన్నారాయుడి చెరువు చేపల పెంపకం కేంద్రానికి మంత్రి ప్రారంభోత్సవం చేస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే ఉత్సవానికి కనకాచలం జిల్లా పరిషత్ అధ్యక్షులు, మచ్చా జీవానందంగారు అధ్యక్షత వహిస్తారు. అదే సభలోనే బెస్తలకు కొత్త వలలు పంచబడతాయి.
జిల్లా కలెక్టర్ కారు ముందు దారి తీసింది. వెనుక మత్స శాఖామాత్యుల కారు ఆ వెనుక పబ్లిక్ రిలేషన్సు డిపార్టుమెంటు వారి వ్యాను నిండుకూ పతికా విలేఖరులు, పరిగిలి గుట్ట సమితి అధ్యక్షుల జీపు ఇంకో యేవో కొన్ని వాహనాలు తుర్రు మంటూ దూసుకపోయాయి.
పరిగిలి గుట్టలో పెద్ద పందిరి వేశారు. భగ భగ నుండే ఎండను లెక్క చెయ్యకుండా ఆ పరిసరాలనుండి పంచాయతీ సర్పంచులు, మునసబులు, కరణాలు, కాంట్రాక్టర్లు, సమితి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వందల సంఖ్యలో సమావేశమయ్యారు. బాగా అలంకరించిన బండిపై పెద్ద గాజు తొట్టెలో లో రకరకాల చేపలు విలాసంగా విహరిస్తున్నాయి. వాటిలో బంగారు వన్నెల మీనులూ, కుచ్చుతోకల జలపుష్పాలు కూడా ఉన్నాయి.
మంత్రిగారు. పరిగిలి గుట్టకు చేరేలోగా గంట మూడు దాటింది. అక్కడి నుంచి రాయడి చెరువు అరమైలు. ఆ దారిపొడుగునా పెద్ద ఊరేగింపు, అమాత్యులను లారీపై అమర్చిన పూల పల్లకిలో కూర్చోబెట్టారు. ఆ పల్లకిని కూడా మత్స్యాకారంతో అతి రమణీయంగా పచ్చ చామంతి పూల తోనే జోడించారు.
‘కరువులో చేపల్ని విరివిగా పెంచండి’
‘ఎండుచేపల తిండి గుండె బలాన్నిస్తుంది’
‘పూజేవల్ని పెంచితే పుణ్యం వస్తుంది’
‘తాబేళ్లను పెంచండి కుబేరులై పోండి’
‘ఎండ్రకాయల కొవ్వులొ ఎంతో బలముంది.
‘అన్ని రకాల చేపల్ని పెంచడమే అసలైన సోషలిజం’
‘కరువు బరువు తగ్గా లంటే కరవాళ్లను వాడండి’
‘పప్పన్నం తినకండి. ఉప్పు చేపలు వాడండి”
ఇంకా రకరకాల నినాదాలు వ్రాయబడిన అట్టలతో కొమ్ములు, తుతార్లు, పిల్లనిగ్రోవులు, జాగంటలు, జవనికలు, తుడుములు, పలకలు, గోళ్లు, మేళాలు, నాగ స్వరాలు, కిలారినట్లతో భూనభోనాంతరాలు దద్దరిల్లేట్లు ఊరేగింపు ఆరంభమైంది.
మత్స్యశాఖామాత్యులు శ్రీ రాజా సుందర ప్రకాశ గోవర్ధన శతపధి గారు కోర మీసాలను మెలి వేసు కొంటూ సుఖాసీనులైన దృశ్యం నయనానందకరమైనా ఎండధాటికి తట్టుకోలేక విలేఖరులందరూ ముందుగ చెన్నారాయడి చెరువు వేపు దారి తీశారు.
పబ్లిక్ రిలేషన్సు ఆఫీసరు వారిని చెరువులో నున్న వేదిక వద్దకు తీసుకపోయి తలో కొబ్బరి బోండా ఇప్పించాడు. వారా నీటిని త్రాగి సిగరెట్లు కాల్చుకొంటూ వేదికకు దక్షిణం వైపుగా నున్న సిమెంటు తొట్టి దగ్గరకు వచ్చి నిలబడ్డారు. వంద అడుగుల పొడవు, నలభై అడుగుల వెడల్పున్న ఆ తొట్టిలో అర్థానికి పైగా, నీరున్నది. నునువెచ్చని ఆ నీటిని ఆ ఉదయమే తెచ్చిపోసినట్లు అతి ప్రయత్నం మీద కనుగొన్నారు. ఏడేండ్ల క్రితం మొరవ సాగిన చెన్సారాయుడి చెరువులో మూడేళ్ల నుండి నీటి చుక్క లేదు. నిరుడు చెరువు గర్భంలో జొన్నలు చల్లినా వాన బొట్టు లేక విత్తనాలు మాడిపోయాయట .
ఐనా మత్స్య శాఖామాత్యులు ఇటీవలే అనేక దేశాలలో పర్యటించి వచ్చిన విశేషానుభవాలతో కరువులో చెరువుల్లో చేపల్ని పెంచే విస్తృతమైన పధకాన్ని చేపట్టారు. అతి సాహసోపేతము, పరిశోధనాత్మకమూనైన ఈ పథకంతో ముక్కంటి సీమ లెక్కలేనన్ని టన్నుల చేపల్ని ఉత్పత్తి చెయ్యగలదని వారి విశ్వాసం. ఈ దెబ్బతో ఇంటర్నేషనల్ మార్కెట్టు లభించినా ఆశ్చర్యం లేదు. విలేఖరులలా విచిత్రమైన భోగట్టాలనంతా సేకరిస్తుంటే అప్పుడే జీపునుండి దిగిన ఫోటోగ్రాఫర్లు ఊరేగింపు దృశ్యాలను కెమెరాలలో సంక్షిప్తంగా దాచు కొంటున్నారు.
ఆకసమే చిల్లులుపడే అట్టహాసాలతో ఊరేగింపు చెన్నారాయడి చెరువులో ప్రవేశించింది.
బ్రహ్మాండమైన పందిరిలో అత్యంత శోభాయమానంగా అలంకరించ బడిన వేదికపై అమాత్య శేఖరులు, నాయకులు ఆశీనులైన వెనుక స్థానిక నియోజకవర్గం యం. యల్. ఏ. మైకు ముందు నిల బడ్డారు. రెండున్నర మీటర్లు వ్యాసంకల వారి బొజ్జపై హాయిగా శయనించి యుండిన వారి హస్తాలను అతి ప్రయత్నం మీద పైకెత్తి ఒక్క దండం పెట్టి సభాంగణము నుద్దేశించి వారిట్లా అన్నారు.
“ నా రైతు సోదరులారా ! కూలీ సోదరులారా ! హరిజన సోదరులారా ! ఈ దినం శుభదినం. ఎన్నో వ్యయ ప్రయాసలతో ఎంతో దూరం నుండి ఈ చండ్ర నిప్పులు కురిసే – బండలైనా చిట్లి పోయే
యెండల్లో మన మంత్రి మన మధ్యకి వచ్చారంటే ఏమనాలి. ఇది ప్రజా రాజ్యం . సోషలిజంలో ఇదే ఉంది. నా సేవ మీకు తెలిసిందే. గుండ్రాళ్ల పల్లె కుంటకట్టుకు దున్ను పోయించాను. పాపాది ఊరిబడిలో రెండో టీచర్ని వేశాను. నక్కావాళ్ల పల్లెలో మంచినీళ్ల బాయి తొవ్వించాను. ఇప్పుడు వేళ కాదు. ఎన్నో ఉన్నాయి. ముందు మంత్రిగారు మాట్లాడుతారు” అని అంటుండగానే –
“ సన్మాన పత్రాలు, సన్మాన పత్రాలు , సన్మాన పత్రాలు” అంటూ కేకలేశారు జిల్లా పరిషత్ చేర్మన్ మచ్చా జీవానందం గారు.
కోర్టులో విన్పించే నిశబ్దం వంటి ఆ కేకతో సభలో నుండి పది మంది వేదిక పైకి దుమికారు. వాటిలో ఒక్కటి మాత్రం చదివితే చాలన్నారు. అమాత్యులు.
పరిగిలిగుట్ట హైస్కూల్ సీనియర్ టెలుగు పండిట్ హానరబుల్ పోయట్ సుగ్రీవాచార్యులుగారు గస పోసుకొంటూ మైక్ దగ్గరికి వచ్చి వణుకుతూ గొంతును సవరించుకొని పఠనానికి ఉపక్రమించారు. ఆయనా పంచాయతీ సమితికి ఆస్థాన కవి.
“గౌరవనీయులు ముక్కంటి సీమ మత్స శాఖామాత్యులు శ్రీ రాజా సుందర ప్రకాశ గోవర్థన శతపథిగారికి పరిగిలి గుట్ట పంచాయతీ సమితి సమర్పించిన సన్మానపత్రము. అమాత్య సత్తమా! అత్యంత పరాక్రమోపేతులై, అరివీర భయంకరులై, అత్యధిక శౌర్య ధైర్య సాహసోపేతులై, అతల వితల సుతల తలా తల రసాతల పాతాళ లోక భయద వికటాట్టహాస వీరవిహారంలో అలనాటి భారత స్వాతంత్ర్య సంగ్రామ రంగము నందు దుమికి, విజయ దుందుభి మ్రోగించి స్వరాజ్యమును సాధించి…’
అనగానే సభాంగణంలో నున్న సౌదామినీ కరస్సాడెంటు “ ఆనాడీయన వయస్సు ఐదా రేండ్లుంటాయా’ అని ససిగాడు కానీ ఎవరికీ వినిపించలేదు.
“ స్వరాజ్యమును సాధించి నేడు సామ్య వాదమును స్థాపించుటకు కంకణము దాల్చి మత్స్య శాఖామా త్యులుగా మన ముక్కంటి సీమ లోని ఒక్కొక్క చెరువులోనూ లెక్క లేనన్ని చేపలను పెంచి దశదిశలకూ పంచి కరువును నివారించి కొత్త చరిత్రను సృష్టించుటకు అవతారమెత్తిన మత్స్యావతారుడైన మీ రాక మాడెందములకానందదాయకమై నోటమాట రాక యున్నది. మంత్రి శేఖరా ! మా చేద బావులలో చేపలు లేవు, నీరు లేకున్ననూ బ్రతికే చేపలను శాస్త్రజ్ఞులు పరిశోధించునట్టు ఉత్తరువులు దయచేయ ప్రార్ధన. మంత్రి పుంగవా ! మా వాగులలో అక్కడక్కడ మడుగులున్నవి. వాటిలో వదలుటకు తాబేళ్ళను నత్తలను సరఫరా చేస్తూ, వాటిని భక్షించడానికి వచ్చే కొంగలను కాల్చడానికి తుపాకులతో పాటు లైసెన్సులు కూడా ఇచ్చునట్లు కలెక్టర్ల కిప్పుడు అనుగ్రహించమని మా విజ్ఞప్తి!
ప్రజల పాలిటి పెన్నిదీ ! మా చెరువులు ఎండిపోయి ఉన్నందున ప్రతి చెరువులోనూ సిమెంటు తొట్లు కట్టించి వాటి నిండుకూ నీటిని పోయించి, చిన్న చేపలతో పాటు పెద్ద చేపలను కూడా తెప్పించి కొరదలు బతకడానికి వీలుగా సిమెంటు తొట్లలో బొ రియలు త్రవ్వించమని అభ్యర్థన.
మేరునగధీరా! సాగరాధీరా ! మా పెరళ్ళలో నీటి తొట్లలో కూడా చేపల్ని పెంచడానికి అనువుగా వారానికొక కిలో వంతున ఉలవల్ని సరఫరా చేసి, ఈ కరువులో ఆదుకోవాలనీ ఈ చేపలను పట్టుకోడానికి ఇంటింటికీ ఒక వల మంజూరు చేయాలనీ, ప్రార్థన.
ఇంత శ్రమతో ప్రయాసతో మా మొర ఆలకించిన మీకు ఆ దేవదేవులు , శివుడు, అల్లా , ఏసు ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములను ప్రసాదించు గాక !
ఇట్లు: పంచాయతీ సమితి అధ్యక్షులు మరియు సభ్యులు, పరిగిలి గుట్ట, 1- 10 – 1972.
చిరునవ్వులొలికిస్తూ, సమయోచితంగా తలనాడిస్తున్న మంత్రిగారు పైకి లేవగానే వంద పూల దండలు వారి మెడను అలంకరించాయి. పరిగిలి గుట్టంత పూల గుట్టను పక్కకు నెట్టి, అమాత్య వర్యులు గంభీర స్వరంతో ఇలా అన్నారు.
సోదరులారా! అనడంతోనే కెమెరాలు క్లిక్కు మన్నాయి. కరస్పాండెంట్లందరూ కలాలు తీసుకొన్నారు. ప్రేక్షకుల చెవులు నిక్క పొడుచుకున్నాయి.
‘ ముందు కావలసిన పని’ అంటూ మంత్రి ఉన్నట్టుండి వేదిక దిగారు. వారి వెంట నాయకులూ వచ్చారు. సిమెంటు తొట్లలోకి మంత్రి గారు గాజులు తోట్ల లోని చేపల్ని వదిలారు. అప్పటికే సుమారుగా
కాగిన ఆ వేడినీటిలో ప్రవేశించిన చేపపిల్లలు అల్లల్లాడుతుండగా అమాత్యులు వేదికవద్దకు వచ్చి ఉపన్యాసం ప్రారంభించారు.
ఇంగ్లాండు, స్కాట్లాండు ఐర్లాండు, పోలెండు, ఫిన్లాండ్, నార్వే, స్వీడెన్ , డెన్మార్క్ మొదలైన దేశాలలో తాను చూచిన చేపల్ని గురించి చెబుతూ ముక్కంటి సీమనంతా మత్స్య పరిశ్రమతో నింపి తన బాధ్యతను నెరవేర్చుకొంటానన్నారు. కరువులో చేపల్ని పెంచాలనీ, కరువు నివారణకి అదొక్కటే తరుణో పాయమనీ సెలవిస్తూ, పరిగిలి గుట్ట లోని బెస్తలకు వలలను బహూకరించారు. వలలతోపాటు సింగితాలు, కొడాలు, గాలాలను కూడా విరివిగా పంచిపెట్టి చేపల్ని ఎలా పట్టాలో కూడా పట్టి చూపెట్టారు. ఆయా శాఖ కు ఆధిపత్యం వహించే అమాత్యుడాయా పనులను స్వయంగా చేసి చూపడం ఆదేశంలో అనుశ్రుతంగా వస్తున్న సాంప్రదాయం.
మంత్రిగారు తొట్టిలోకి వదలిన చేప లన్నీ నీటిపై తేలుతూ ఉన్నందున స్వహస్తంతో దేవి దేవి పై కి తీశారాయన. చేపలల్లా వెల్లకిలా పడిపోవడం ఎందుకని జాజిమల్లె పత్రిక కరస్పాండెంట్ అడుగ బోతుండగా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అతని వెనుకనుండి చొక్కా లాగాడు! కరస్పాండెంటు మౌనంగా వ్యాన్ నైపు నడిచి పోయాడు.
మత్స్యశాఖామాత్యులు సరదాగా పట్టిన చేపల్ని ఆ జాలర్లకే యిచ్చి మళ్ళీ వేదిక పై ఆశీనులయ్యారు.
పంచాయతీ సమితి అఢ్యక్షుల కృతజ్ఞతతో సమావేశం ముగిసిపోయింది. ఆ సమయానికి సరిగ్గా పొద్దు కూడా పోయింది.
పరిగిలిగుట్టలో ఆ రాత్రి డిన్నరున్నట్లు విలేఖరులకు తెలిసింది. వెజిటేరియన్స్ కు కూడా మత్స్యాల ఆకారంతో కజ్జి కాయలు, రొయ్య రూపాలతో బూంది, వడ్డించబడుతాయని ఆ రాత్రికేదో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని పౌర సంబంధ శాఖాధికారి సెలవివ్వడంతో విలేఖర్లు అందరూ ఆలోచనలో పడ్డారు.
‘కరవులో విందులేమిటని” నసిగాడు సౌదామిని విలేఖరి.
“అసలు బస్సెక్కడుందయ్యా ! ఆయన బండే శరణ్యం అర్ధరాత్రయినా” అంటూ అంగీకరిస్తున్నట్టు తల ఊపాడు జాజిమల్లె కరస్పాండెంటు.
అందరూ పంచాయతీ సమితి అధ్యక్షుల వారి కొత్త భవనంలో ప్రవేశించేలోగా హాలంతా విస్తళ్లు కన్పించాయి.
ఆ విందును, ఎన్నో రకాల పిండివంటలతో పంచభక్ష్య పరమాన్నాలతో వడ్డించిన ఆ విందును, అరగించి తాంబూల ల ను సేవిస్తూ, అక్కడే అందిచ్చిన సిగరెట్లను కాలుస్తూ, అప్పుడే ప్రారంభమైన వినోద కాలక్షేపంతో నిమగ్నులైన విలేఖర్లు కరువునే కాదు ఈ లోకాన్నే మరిచి పోయారు.
మత్స్యశాఖామాత్యులు శ్రీ రాజా సుందర ప్రకాశ గోవర్థన శతపధిగారు మరునాటి కార్య క్రమాన్ని గురించి కలెక్టరుతో ముచ్చటిస్తూ, సోఫాలో పడుకొన్నారు.
చేపల మంత్రి పర్యటనలో తొలి కరువు నివారణ కార్యక్రమం నిర్విఘ్నంగా జయప్రదంగా జరిగిపోయింది. ముక్కంటి సీమ సామ్యవాద ప్రభుత్వ జైత్ర రథం ప్రగతి పధంలో ఒక కిలోమీటర్ ముందుకు సాగింది.
గత నలభై ఏళ్ల పైబడి రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న అల్లం రాజయ్య గారు తెలుగులో మనకున్న అత్యుత్తమ కథా రచయితల్లో ఒకరు. ఆయన రాసిన ‘మనిషి లోపలి విధ్వంసం’ ఇప్పుడు మీరు వినబోయే కథ. ఈ కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అల్లం రాజయ్య గారికి కృతజ్ఞతలు.
ఈ కథ వారి కథా సంపుటి, ‘ అతడు’ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి. https://bit.ly/3scvsxP
గత నలభై ఏళ్ల పైబడి రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న అల్లం రాజయ్య గారు తెలుగులో మనకున్న అత్యుత్తమ కథా రచయితల్లో ఒకరు. ఆయన రాసిన ‘మనిషి లోని విధ్వంసం’ ఇప్పుడు మీరు వినబోయే కథ. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అల్లం రాజయ్య గారికి కృతజ్ఞతలు.
ఈ కథ వారి కథా సంపుటి, ‘ అతడు’ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి. https://bit.ly/3scvsxP
అదొక చిన్నరైల్వే స్టేషన్. ఆ స్టేషన్ భవనాలు నైజాం కాలంలో కట్టినవి. ఈ ఏడు వానాకాలంలో కురిసిన ఎడతెరిపి లేని వర్షాలవల్ల స్టేషన్ భవనం, గోడలు పెచ్చులూడిపోయాయి. భవనం పైనుండి కారిన
నీటి ధారల మూలంగా గోడల మీద చారికలు ఏర్పడినాయి. రైల్వే స్టేషను కుడిఎడమల పాతిన సిమెంట్ పోల్స్, కట్టిన ఫెన్సింగు వైరు అక్కడక్కడ విరిగి పోయాయి. ఆ స్టేషన్లోకి వచ్చే ప్రయాణీకులు పోయే ప్రయాణీకులు సాధారణంగా స్టేషన్ ద్వారం నుండి కాక విరిగిన సిమెంట్ పోల్స్ ఫెన్సింగు నుంచే నడుస్తారు.
రైల్వే స్టేషన్ వెనుకవైపు, స్టేషన్ కట్టినప్పుడే కట్టిన క్వార్టర్లలో నాలుగు కూలిపోయి ఉన్నాయి. మిగతా క్వార్టర్లలో రైల్వేగ్యాంగు వాళ్లు తప్ప బుక్కింగు క్లర్కుగాని స్టేషన్మస్టరు గాని ఉండటం లేదు. వాళ్ళు దాదాపు అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో గల ఓ మాదిరి పట్నం నుంచీ రోజూ వస్తారు.
రైల్వే స్టేషను దక్షిణాన నీలగిరి చెట్లు పెరిగి ఉన్నాయి. నీలగిరి చెట్ల కింద ఆకులుపడి ఆ స్థలమంతా తెల్లగా మెరుస్తున్నది. స్టేషన్కు ఎదురుగా పసిరిక చెట్లు, వేపచెట్లు, తుమ్మచెట్లు పెరిగి ఉన్నాయి. ఆ చెట్లకింద రైలు పట్టాలకు ఆవలి వైపున ‘తాటికల్లు’ కుండల్లో నురుగు వస్తుండగా నలుగురు గౌండ్ల వాళ్ళు గిరాకి లేక దిగాలు పడి కూర్చున్నారు. వాళ్ళకు కొంచెం దూరంలో పసుపుపచ్చ ప్లాస్టిక్ ట్రేలో సారా ప్యాకెట్లు పెట్టుకొని పేడి మూతి ఉపేంద్ర కూర్చున్నాడు.
పొద్దున తయారుచేసిన ‘మిరపకాయ బజ్జీలు’ చల్లారిపోగా షేక్ దావూద్ గొణుగుతున్నాడు.
వేపచెట్టు కింద కాల్చిన మొక్కజొన్న కంకులు పెట్టుకొని ముగ్గురు పల్లెటూరి ఆడవాళ్ళు ఒకరినొకరు
తిట్టుకుంటున్నారు.
పరికి పండ్లు అమ్మే ముసలవ్వ ఎందుకో విచారంగా కూర్చున్నది.
ఆ చెట్ల కింద దుమ్ములో కూర్చుండలేక, అలాగని ఎంతో సేపు నిలబడలేక ఒక కుటుంబం దిక్కులు చూస్తున్నది.
“అట్ల పోయి రైలెప్పుడు కాలవడ్తదో తెలుసక రాపోరాదు!” భార్య భర్త మీద విసుక్కున్నది. భార్య పేరు గంగమ్మ. ఆమె గులాబిరంగు పాలిస్టర్ చీర కట్టుకున్నది. చెవులకు బంగారు జూకాలున్నాయి. కాళ్ళకు పట్ట గొలుసులు, వెండి మట్టెలున్నాయి. భర్త రాయేశం తన అంగీజేబులో చెయ్యి పెట్టి, భార్యకేసి చూసి వంకర నవ్వు నవ్వాడు.
రాయేశం తెల్లటి పాలిస్టర్ కమీజు తొడిగి ధోవతి కట్టుకొన్నాడు. కాళ్ళకు సింగరేణి బొగ్గుగని బూట్లు వేసుకున్నాడు. మెడకు మఫ్లర్, ఎడమచేతికి గడియారమున్నది. .
“అమ్మా పరికి పండ్లే!” వారిద్దరి పదేండ్ల కొడుకు అడిగాడు. “మీ బాపు నడుగుపో” గంగమ్మ పిల్లవాడ్ని కసిరింది. రాయేశం వంకర నవ్వుకు గంగమ్మ ఎలాంటి అడ్డంకి చెప్పకపోయేసరికి ఉపేంద్రం దగ్గరికి నడిచి “ఎంతకోబత్త (సారా ప్యాకెటు) పిలడా?” అడిగాడు.
“మీ కాలేరు (కాలరీ) లెంత?” ఉపేంద్రం.
“మా బొగ్గుబాయిల కాడ అమ్మినట్టే అమ్ముతానవా?”
“ఈడ అంతరేటు కమ్ముతె బొక్కలిరువరా?” ఒక గౌండ్లాయన కోపంగా అన్నాడు.
“ఎవలు?” రాయేశం.
“ఇంకెవలు పాముకోరలిరిసినోళ్ళే” ఇంకో గౌండ్లాయన. పాము కోరలిరిసినోల్లెవరో రాయేశం అడుగలేదు. వాళ్లు చెప్పలేదు.
“రెండున్నర” ఉపేంద్రం.
“లావు సస్తనే ఉన్నది. మా వూల్లే సార మావులా పట్టిన కొత్తల నాలుగు రూపాయలన్నరు. లొల్లయి నంక గిప్పుడు గిదేధర”.
“మీ వూల్లేంది ఈ సుట్టు పక్క అన్ని ఊళ్ళల్లగిదే ధర – ఈసారి మావుల (కంట్రాక్ట్) పట్టినోడు మన్నై పోయిండనుకో.”
“మా కాలేరుమీద దోసుకుంటండ్లు – ఆడ బత్తకు అయిదు రూపాయలు” రాయేశం. రెండు సారా ప్యాకెట్లు తీసుకొని ఒకటి కట్టుక్కున కొరికి నోట్లో పోసుకొని ఇంకొకటి జేబులో వేసుకున్నాడు. అయిదు రూపాయల నోటు తీసి ఇచ్చాడు.
ఆ వాసన తనకే వచ్చినట్లుగా ఒక అంగన్వాడి టీచరమ్మ అటేపు జరిగింది.
ఒక ముసలమ్మ చెవుల గంటీలు ఊగుతుండగా “రైలెప్పుడత్తది పిలడా! సిటక్కున సీకటైనంకనా?” అన్నది. “
ఆ ముసలమ్మ మనవడు “ప్యాసెంజర్ రైలు గంట కొట్టేదనుక తెలువదే” బియ్యం సంచి మీద కూర్చుండి జవాబు చెప్పాడు. అతను ప్యాంటు వేసుకొని ఉన్నాడు.
కొంచెం దూరంలో అదివరకే తాగి ఉన్న ఒక బతికి చెడ్డ రైతు ఎవరినో అంతూ పొంతూ లేకుండా తిడుతున్నాడు.
రైలు కిందబడి కాలు ఎప్పుడో తెగిపోయిన కుంటి ముసలి బిచ్చపాయన“నిన్ను సిలువకు గట్టిరిబిడ్డా నా యేశయ్యా!కీలుకీలున మొలలు గొట్టిరి తండ్రీ యేశయ్యా!” అంటూ యేసుక్రీస్తు మరణఘట్టాన్ని తను ‘నిజంగా’ చూసినట్లుగానే వర్ణించి పాడుతున్నాడు.
ఆ గొంతులో విచిత్రమైన “వణుకు” అక్కడి వాళ్ళకు దుఃఖాన్ని కలిగిస్తోంది. ఆ పాటలోని నాదం వారికి అనుభవంలో ఉన్నట్టే ఉంది. అందరికీ చేయిచాపుతూ కర్రకాలు పొడుచుకుంటూ తిరుగుతున్నాడు.
రైలు టైం కనుక్కోవడానికి బయలుదేరిన రాయేశం ఇరువై అయిదు పైసల బిళ్ళ తీసి కుంటాయన చిపులోవేసి “ఏసయ్యను కాదు గరీబోని” అని పాటకు అర్థం చెప్పి కదలబోయాడు.
ఇంతలోనే పెనుకేక వేస్తూ ఏదో ఎక్స్ ప్రెస్ రైలు దూసుకపోయింది.
రైలు వెళ్లేదాకా ఆగి రాయేశం పట్టాలు దాటాడు. అతని వెనుకనే రాబోయిన కొడుకు భయపడి తల్లి దగ్గరికి పరుగెత్తాడు.
రాయేశం స్టేషన్లోకి అడుగుపెట్టాడు. టికెట్లిచ్చే కిటికీ మూసున్నది. స్టేషన్ మాస్టర్ గదిలోకి తొంగిచూశాడు.
ఒక పాతటేబుల్ ముందు అంతకన్నా పాతగీలిన స్టేషన్ మాస్టర్ విచారంగా కూర్చున్నాడు.
ఇంతలోనే స్టేషన్ ద్వారం నుంచీ ఆదరబాదరగా వచ్చిన రైల్వే పోలీసు స్టేషన్ మాస్టర్ రూంలోకి నడిచాడు. టోపి తీసి ఉఫ్మనుకున్నాడు.
“వాని వివరాలు తెలుసుకునేసరికి తాతలు దిగొచ్చిండ్లు సార్” ఆ కష్టమంతా ముఖంలో తొంగి చూస్తుండగా మాట్లాడసాగాడు పోలీసు.
“సార్ వాన్ని వారం రోజుల క్రితం మన రైలు స్టేషన్లో రాత్రి చలికి వణుకుతుంటే పోలీసులు పోలీస్ స్టేషను పట్టుక పోయిండ్లట. అసలే ఈ ఏరియాల డేంజర్ గున్నది కదా! మల్ల వీడు పడుసు పోరడాయె. ఏదడిగిన నోరు తెరువకపాయె. పొద్దటినుంచి సాయంత్రం దాకా ఎంత తన్నినా ఏం మాట్లాడలేదట. ఆఖరుకు వాని తల్లి గురించి చెప్పిండట. ఎంక్వయిరీల వీళ్ళది కుద్దు రాములపల్లెనట. తండ్రి బేవార్సు గాడట. భూములమ్ముకొని పెద్దపెల్లిల తిరుగుతున్నడట. వాడు పాతకాపేనట. ఏడాది కరీంనగర్ సబ్ జైల్ల ఉండచ్చిండట. తల్లి కూలినాలి చేసి వీన్ని పెంచి పెద్దజేసిందట. ఆవార కేసని విడిచి పెట్టిండ్లట” రైల్వే పోలీసు గుక్క తిప్పుకున్నాడు. –
వాడు ఏదైతే మనకేమిటి గని – మన నెత్తిమీదికి తెచ్చాడు. ప్యాసింజర్ వెళ్ళిపోతే ఈ చలిలో రాత్రంతా చావాల్సిందే” స్టేషన్ మాస్టర్..
“సార్ మనము కూడా ఆవారా కేసు కింద పంచనామా చేస్తే?” రైల్వే పోలీసు.
“అసలే రోజులు బాగాలేవు. వెధవ పెంట మనమీదికొస్తే! అచ్ఛా నువ్వు పోయి శవం దగ్గర కావలి వుండు. రంగయ్య టీకి పోయి వస్తాడు! ఈ లోగా నేను వాడి తల్లి, తండ్రి కోసం ట్రై చేస్త”. స్టేషన్ మాస్టర్.
రైల్వే పోలీసు గది బయటకు వచ్చాడు.
“ఏందేంది?” రాయేశం. “ఏమున్నదివయ్యా! మర్డర్లు, కూలీలు, చావడాలు, చంపడాలు – ఆజ్ కల్కా దునియా ఖుద్మర్ నా కిసీ కో మార్ డాల్ నా (ఇయ్యల్ల రేపు ప్రపంచంల తను చావడం ఇంకోన్ని చంపడం)”
“దాసుకోవయ్యా! అమ్మమ్మ నీ ఉచ్చ మందులకు గావాలంటె చింతకొమ్మ లెక్కి చిమ్మిచ్చి పోసిందట” రాయేశం.
“పొద్దటి నుంచి చెప్పలేక నోరు పోతంది. అగో క్యాబిన్ దగ్గర ఓ మాదెర్ చోదుగాడు రైలుకింద తలకాయ బెట్టిండు. పంచనామా చేసి పారేత్తమంటే మా స్టేషన్ మాస్టర్ ఉచ్చపోసుకుంటుండు – వాని తండ్రి వీనికన్నా ఆవారా ఉన్నడు”. చెమట పట్టిన ఖాకీ బట్టలు మాటిమాటికి లూజు చేసుకుంటూ ఉత్తరం వేపు క్యాబిన్ కేసి నడిచాడు.
స్టేషన్ మాస్టర్ పెద్దపల్లికి ఫోన్ చేశాడు
“ఇంతకు ముందు వైర్ లెస్ ల ఇక్కడి పోలీస్ స్టేషన్ కు కబురు వచ్చింది. వాళ్లి పోలీసు వాళ్లు వెతికి పట్టుకున్నారు. సింగరేణి రైలులో తీసుకు వస్తున్నారు” ఆవలి కంఠం.
మళ్ళీ తల్లి ఉండే ఊరు ఓదెలకు ఫోన్ చేశాడు. అదృష్టవశాత్తు ఆ ఊరులో రైల్వే స్టేషనున్నది. “వాని తల్లి, బంధువులు ఎడ్ల బండిలో వస్తున్నారు” అక్కడి నుంచి.
స్టేషన్ మాస్టర్ ఈ కబురు శవం దగ్గర కావలున్న రైల్వే పోలీసులకు తెలుపాలనే ఉద్దేశంతో గది బయటకొచ్చాడు.
“సార్ ప్యాసెంజర్ టైమెంత?” రాయేశం.
“ఉండవయ్య మగడా!” స్టేషన్ మాస్టర్ దిక్కులు చూస్తూ చిరాకుగా అని గ్యాంగుమన్ కోసం వెతకసాగిండు.
“నేను శవాన్ని సూసత్తసార్! ఏం చెప్పమంటారు?” రాయేశం. “వాని తండ్రి సింగరేణి రైలులో వస్తున్నడని చెప్పు” స్టేషన్ మాస్టర్. రాయేశం చేతులూపుకుంటూ ప్లాట్ఫారం మీద నుండి ఉత్తరం వేపు పోవడం చూసి “రైలచ్చే యెల్లయ్యింది మల్లేడ కాల్వడ్తన్నవ్ ?” రైలు పట్టాల ఆవలి నుంచీ రాయేశం భార్య గంగమ్మ కేకేసింది. ఆ కేకను పట్టించుకోకుండానే రాయేశం చరచరా నడుస్తున్నాడు.
రాయేశం బూట్లకింద ఇసుక కరకర లాడుతోంది.
ప్లాట్ఫారంకు వందగజాల దూరంలో క్యాబిన్ కు ప్లాట్ ఫారంకు మధ్యన పదిమంది మనుషులు కన్పించారు.
అక్కడ నలుగురు చేతి సంచీలు పట్టుకొని విచార వదనాలతో నిలబడి వున్నారు.
రైల్వే పోలీసులిద్దరు అక్కడ శవం వున్నదన్న మాట మరిచిపోయి బీడీలు పీలుస్తూ లోక రివాజు గురించి మాట్లాడుకుంటున్నారు.
ఢిల్లీ వెళ్లే రైల్వేలైను పక్క కంకరరాళ్ళ మీద ఒక మొండెం పడుకోబెట్టి వున్నది. శవం మీద చాలీచాలని తెల్లని గుడ్డ కప్పి వున్నది. పట్టాల మధ్య కండ్లు భయంకరంగా తెరుచుకున్న తల వున్నది. తలకు మొండానికి మధ్య రక్తం మడుగుకట్టి జొబ్బజొబ్బ పెద్ద ఈగలు ముసురుతున్నాయి.
– ఇంకా మీసం సరీగ మొలువని లేత ముఖం – ఎత్తు దవడలు – ఎంత అందమైన ముఖం! నెత్తిమీద రక్తంతో తడిసి పిడుచగట్టిన వెంట్రుకలు – మొండెం మీద కప్పిన గుడ్డ సరిపోక పిక్కలు పాదాలు కన్పిస్తున్నాయి. మడిమెలు గిలగిల తన్నుకోవడం వల్ల పగిలున్నాయి. ప్యాంటు చిరిగి వుంది.
రాయేశం నిషా దిగిపోయింది. కడుపులో చెయ్యేసి ఎవరో దేవినట్లనిపించింది. “ఛీ మనిషి జల్మంత పాపకారి జల్మ మరోటి లేదు” అన్నాడు. ..
రాయేశంకు తమ బొగ్గు గనిలో పైకప్పు కూలి చనిపోయిన కార్మికుల శవాలు కండ్ల ముందు మెదిలాయి.
‘రాయేశం కాళ్ళమీద కూలబడి “అయ్యో బిడ్డా! కట్టం సుకం సూడాల్సినోడివి ఎంత కర్మాని కెత్తుకున్నవ్” అని బొటబొట కన్నీళ్ళు కార్చాడు.
“ఖర్మమేమున్నది బై – ముచ్చు దొబ్బుకత్తె ఎవడైన గంతే” రంగయ్య అనే రైల్వే పోలీసు.
“ఛ….” చుట్టు మూగుతున్న మందిని ఇంకో పోలీసు దూరం కొట్టాడు. “ఏ తల్లి గన్న బిడ్డో ! ఊళ్లో బతుకు గడవక సింగరేణి గనుల్లో పరుగుపందెంలో నౌఖరికోసం పోతున్నవాడన్నాడు.
“కట్టాలలో జెనుకక (భయపడక) సీతమ్మ తీర అగ్గినుంచి బయటి కచ్చినోడే మనిషి” ఒక ముసలయ్య.
“అరె! కష్టాలుంటయి. సుఖాలుంటయి, మనిషి పుటుకే అసొంటిది. ఈ కాలపు పోరగండ్లకు అన్ని ముంగటికి రావాలె” రంగయ్య.
“ఔ బాంచెన్ – నీ తీర అందరికి కొలువు దొరకద్దా” ఒక ముసలమ్మ. “ఔ బై కొలువు దొరకలే, సచ్చుడేనా?” రంగయ్య వాదంలోకి దిగుతూ.
“సావకుంటే ఏం జేసుడువయ్యా! అడుక్క తినమంటావా? ఊళ్ళమీద బడి దోసుకు తిన మంటావా?” ఎవరో మందిలోనుంచి.
“అయిరెండూ బమ్మకట్టాలే” యువకుడు. ఇంకో రైల్వే పోలీసు బీడి విసిరికొడుతూ “ఔ” నంటూ ఒప్పుకున్నాడు.
“ఆ దమ్మున్నోడు సావడు. అడ్డమచ్చినోన్ని సంపుతడు” రంగయ్య తన అనుభవం నుంచి నిగ్గుతీసిన సత్యాన్ని చెప్పి రైల్వే స్టేషన్ కేసి నడిచాడు.
“ఏ రైలుకు పడ్డడు బిడ్డా?” ముసలవ్వ. రాయేశం కండ్లకు చీకట్లు కమ్ముతున్నాయి. తోటి కార్మికులు గనిలో చనిపోయినప్పుడు మిగతా కార్మికుల్లో చెలరేగిన కోపం లాంటి కోపం అతని ముఖంలో చిమ్ముకొచ్చింది. “వారం రోజుల క్రితం ఆవారా కేసు క్రింద పోలీసులు పట్టుకుపోయినారట.” ఇందాక రైల్వే పోలీసు స్టేషన్ మాస్టర్కు చెప్పినమాట జ్ఞాపకం వచ్చింది. కంఠంలో కోపం దుఃఖం మిళితం కాగా “మనిషి జల్మంత ఈనం జెల్మ లేదు. బంచత్-గీడనియ్యతి గలోన్ని, నోట్లో నాలిక లేనోన్ని బతుకనియ్యరు. అరే కోమలిపోరడు ఇంట్ల నుంచి ఎటచ్చిండో? కొట్లాడే అచ్చెనో? మనసు చెంచాల్లమైతేనో? బుద్ధులు గ్యానాలు చెప్పే నాయిన్నే తనకే దోసక దేశాలు బట్టుకపోయిండట. ఆడది ఏం చెలాయించుకత్తది? ఇటుసూత్తే తల్లి కొట్టిపోసుకునుడు. అటు తండ్రి ఏమయ్యిందో సమఝుకాక ఎంతకొట్టి పోసుకున్నడో? పోరడు! అరరె! ఎవల్లన్న మనిషి దగ్గరికి తీసి కడుపుల ఆయత్తం అడుగుతె బతికిపోవు. ఎంతపని జర్గిపాయె. పోలీసోల్లన్న దగ్గరికి దియ్యకపోయిరి. ఆళ్లు దొరికిందే బరికినట్టు మనసుపుండై పోయినోన్ని మళ్లీ కొట్టిరి. ఇదేమన్న నాయెమా …?” రాయేశం కోపంగా.
“నీకెందుకువయ్యా తీస్ మారాఖాన్ (ముప్పయి మందిని కొట్టేవాడు) – ఊ అంటే తీసుకపోయి పోలీసు స్టేషన్ల అప్పజెప్పివస్త” రైల్వేపోలీసు.
“ఏది అప్పజెప్పుసుద్దాం” జేబులో సారా ప్యాకెట్లు తీసి కటుక్కున కొరికి గటగటా తాగి రాయేశం
అన్నాడు కోపంగా.
“ఏం చేస్తవ్ బే – అందరి తీర్గ నువ్వుచూడక – లావులావు మాట్లాడన్నవ్. సచ్చినోని బావవా? అన్నవా?” రైల్వే పోలీసు.
“అంతకన్న ఎక్కువ” రాయేశం పోలీసుమీది కురికాడు. అక్కడ గుమికూడిన వాళ్ళంతా వాళ్ళిద్దరిని విడదీశారు.
దూరం నుంచి ఈ గొడవంతా చూస్తున్న రాయేశం భార్య గంగమ్మ పటాలమీదుగా పరుగెత్తికొచ్చి శవాన్ని చూసి ఆమెకు నోట మాట రాలేదు.
తిట్టుకుంటూ వచ్చిన గంగమ్మ భర్త చెయ్యి పట్టుకొని తీసుకపోయింది. రాయేశం బియ్యం బస్తామీద
కాసేపు తలపట్టుకొని కూర్చున్నాడు. గనిలో చనిపోయిన శవాల దగ్గర కార్మికులు కోపంగా అరుస్తున్న దృశ్యం. చివ్వున లేచి వెళ్ళి మరో రెండు సారా ప్యాకెట్లు తెచ్చుకున్నాడు.
గంగమ్మ తను చూసిన దృశ్యాన్ని అక్కడివాళ్ళకు వర్ణించి చెప్పడంలో భర్తను మరిచిపోయింది.
అదివరకే చూసి వచ్చినవాళ్లు వివరాలు చెప్పారు. కొత్తగా వచ్చిన వాళ్ళు శవాన్ని చూడడానికి కదిలారు.
అప్పుడు సాయంత్రం అయిదు గంటలయ్యింది. చలికాలపు పొద్దు క్రుంకడానికి సిద్ధంగా వున్నది. పడమటి ఆకాశం ఎలుగడిపడిన అడివిలాగా వున్నది. ఏడ్చేడ్చి సొమ్మసిల్లిన పసిపిల్ల జేవురించిన ముఖంలా సూర్యుడు. స్టేషన్ ఆవలి ప్రక్కన గల ముసలి పచ్చిరిక, వేప, తుమ్మచెట్ల నీడలు ఆ చోటంతా కప్పేశాయి. చలి విషాదంలా కమ్ముకుంటోంది. .
ఆ చిన్న స్టేషన్లో జనసంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆ స్టేషన్లో చేరుతున్న జనమంతా చుట్టుపక్కల పల్లెటూళ్ళ వాళ్లు – పైగా సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళ తాలూకూ బంధువులు ఎక్కువగా వున్నారు. ఆ స్టేషన్ నుంచి ఖాజీపేటకు పోయేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఆ తక్కువలో కూడా ఈ మధ్య కొత్తగా రైల్వేలైను విద్యుద్దీకరణ, రైల్వే కార్మికులే ఎక్కువ మంది వున్నారు.
స్టేషన్ లోకి వచ్చిన వాళ్ళందరూ శవాన్ని చూసి వచ్చారు. అక్కడ చాలా మంది ముఖాలల్లో నిర్లిప్తత చోటు చేసుకున్నది. అటు తెల్లకల్లు (తాటికల్లు), సారా అమ్మకం జోరుగా సాగుతోంది. అందరి మనసుల్లో ఆ శవం ఒక పెనుకల్లోలం లేపుతోంది. మంటను ఎగదోస్తోంది. ఆ మంట మీద ఏదో ఒకటి పోసే ప్రయత్నం.
షేక్ దావూదు మిరపకాయ బజ్జీలు అయిపోయాయి. చావు బతుకుల మధ్య తచ్చాడే మాటలు – సుళ్లు తిరిగే మాటలు –
ఒక ముసలి రైల్వే మొఖద్దమ్ అక్కడే పాత క్వార్టర్లో వుండేవాడు, డ్యూటీ దిగి స్నానంచేసి ధోవతి కట్టుకొని వచ్చి స్టేషన్లో తిరుగుతూ “ఆ పొల్లగాడు పది దినాల కింద నుంచి గీ స్టేషన్లనే తిరుగుతున్నడు. ఎవలతోని మాట్లాడడు. సకులం దోసుకపోబడ్డాని తీర్గ కూకుండెటోడు. అప్పుడప్పుడు పిచ్చోని తీర ఒర్రుకుంట అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఫ్లాటుఫారం మీద ఉరికెటోడు. సొమ్మసిల్లి పడిపోతేమేం మొన్న బువ్వబెట్టినం – ఆనాడు పొల్లగాని తల్లి, ఎవలో సెప్పుతే అచ్చి తీసుక పోయింది. మల గిదే సూసుడు” తనకు తెలిసిన వివరాలు చెప్పసాగాడు.
ఆ వివరాలు అందరికీ తెలిసినట్టుగానే వున్నవి. అందరూ ఆ పిలగానిలాగే దగ్ధమైన మనసులతో ఎక్కడెక్కడో దిక్కుతోచక పరుగెత్తిన వాళ్ళలాగే వున్నారు. అందరి లోలోపల ఏదో తొలుచుకపోతోంది. అదేమిటో కొద్ది కొద్దిగా తెలిసినట్టే తెలిసి మళ్ళీ చిక్కుపడుతోంది. పల్లెల కడుపుల్లో ఏదో కల్లోలం మరిగిమరిగి బుసబుస పొంగుతోంది. ఇల్లు, పిల్లలు, భూమి, పంటలు, పెండ్లిల్లు ఎండావానా అన్నిరకాల మానవబంధాలు, సెంటిమెంట్లు తెగిపోతున్నాయి. అన్నిటికన్నా బలీయమైన భూమి సంబంధం తెగిపోయి పల్లెలను విడిచి బతుకు తెరువుకోసం చెల్లా చెదరుగ చెదిరిపోయిన వాళ్ళు, పిల్ల పేగు సంబంధాలు తెగినవాళ్లు అస్తుబిస్తుగా తచ్చాడుతున్నారు.
గొణుగుడు, విచిత్రమైన కొత్తమాటలు చితిమంటల చిటపటల్లా – కూలిపోయిన వేదాంతాలు స్టేషనంతా గగ్గోలుగా అర్థం కాకుండా వున్నది.
మోకాళ్ళదాకా నెక్కరేసుకున్న రైల్వే కార్మికుడు వచ్చి “ఠనారన్” మంటూ గంట కొట్టాడు. విచిత్రం అతను పండ్లు బిగపట్టి పూనకం వచ్చిన వానిలాగా గంట కొట్టాడు! |
రైల్వే బుకింగ్ కిటికీ దగ్గరికి జనం పరుగెత్తారు.
బుక్కింగ్ క్లర్కు అప్పుడే నిదురలేచిన వానిలాగా టికెట్ల కెగబడుతున్న ముఖాల కేసి చూడకుండా టికెట్టు నింపాదిగా ఇస్తున్నాడు. రాయేశం “పాసెంజరు ఎంత లేటు మారాజా” అన్నాడు పరాచికమాడే ధోరణిలో. బుక్కింగు క్లర్కు ఈ పరాచికాల కతీతుడులా కన్పిస్తున్నాడు. అతను జవాబు చెప్పలేదు. “రామగుండం రెండు పెద్దయి, రెండు సిన్నయియ్యి ” అన్నాడు రాయేశం. రాయేశం టిక్కెట్లు తీసుకొని బయటకు వచ్చేసరికి – సింగరేణి రైలు వస్తున్నదని – స్టేషన్ లోని వాళ్ళు వేగిరపడుతున్నారు. ఆ
మరికొద్ది సేపట్లోనే ధనధనలాడుతూ సింగరేణి రైలు వచ్చింది. దిగేవాళ్లు తక్కువ. ఎక్కేవాళ్లు అంతకన్నా తక్కువే. రైలు వెళ్లిపోయింది. – సింగరేణి రైలులో నుంచి ఒక పొడుగాటి నడీడు మనిషి దిగాడు. అతని ముఖం కోలగా వున్నది. పండ్లు కందుపండ్లు (గారపట్టిన) – కమీజు భుజాలమీద చిరిగి ఉన్నది. ధోవతి సన్నపుదేకాని చాలా పాతది. కాళ్ళకు చెప్పులు లేక మోకాళ్ళదాకా దుమ్ము పేరుకున్నది. మడిమెలు ఎండిన వరిమళ్ళలా పగిలున్నాయి. ఎముకలు తేలి ఆరడుగుల అస్తిపంజరం లాగున్నాడు. అతని ముఖం బండబారి వున్నది. కండ్లు – ఆ కండ్లు అక్కడున్నవాళ్ళకు తెలియకుండా వున్నాయి. మొత్తానికి అతను విధ్వంసమైన సేనానాయకునిలాగా ఉన్నాడు. అతని చేతిలో మూలలు చిరిగిన పాత క్యాష్ బ్యాగున్నది. కుడిచేతిలో బాగా నలిగిపోయిన రెండు తెలుగు వార్తాపత్రికలున్నాయి. అవి ఏనాటివో, తెలియకుండా మాసి వున్నాయి.
అతని వెంటే నల్లగా బలిష్టంగా ఉన్న రైల్వేపోలీసు దిగాడు. అతను బాగా వంగిపోయి వున్నాడు. అతని ముఖం భూమి పొరల్లో నలిగిన నేల బొగ్గులాగున్నది.
రైల్వేపోలీసు ఆ పొడుగాటి వ్యక్తిని స్టేషన్ మాస్టర్ రూంలోకి తీసుకపోయాడు. “బండి కింద పడ్డ పిల్లగాని తండ్రి వచ్చిండనే వార్త’ అతి తొందరలోనే అందరికి తెలిసిపోయింది. అతన్ని చూడడం కోసం స్టేషన్మస్టర్ రూం కేసి చాలామంది నడిచారు. • “వచ్చావా నాయనా?” స్టేషన్ మాస్టర్ పాత నల్లకోటు తొడుక్కొని బయలుదేరాడు.
పొడుగాటి వ్యక్తి కొడుకును కోల్పోయిన తండ్రిలా లబోదిబోమని రోదించడం లేదు. శవంగా మారిన తన రక్తాన్ని చూసుకోవడానికి పరుగెత్తలేదు. ఆ మొత్తం వ్యవహారం అదివరకే అనుభవించిన వాడి లాగా – “అంత తొందరేం లేద”న్నట్లుగా స్టేషన్ మాస్టర్ టేబుల్ ఎదురుగా గల కుర్చీమీద కూర్చున్నాడు.
కిటికీలోంచి దరువాజాల్లో నుంచి చూస్తున్న జనం మొదట విస్తుపోయారు. ఆ తరువాత “బండ తీరుగున్నడు”, “మనిషికి గింత సెమట లేదు”, “నెనరులేదు” తలో రకంగా గుసగుసలాడారు.
పొడుగాటి వ్యక్తి తలతిప్పి వెనక్కి చూశాడు. అనేక ముఖాలు సగం సగం కాలిపోయినట్టుగా అతనికి కనిపించాయి. మొత్తం ఆ ప్రాంతమంతా మనుషులు కాలిన కమురు వాసన వ్యాపించినట్టుగా
అతనికి తోచింది.
“అరె నడువయ్యా రాజారాం” రైల్వే పోలీసు యాతనగా, “ఎక్కడికీ?” పొడుగాటి వ్యక్తి రాజారాం .
“ఎక్కడికంట వేందయ్యా! నా కొడుకు పెండ్లి కచ్చినవా? నిన్ను పెద్ద పెల్లంత తిరిగి దొరుకుబట్టేటాల్లకు తాతలు దిగచ్చిరి”.
“అయితేం జెయ్యిమంటవు?” “చనిపోయిన నీ కొడుకును చూసుకోవా?”
రాజారాం తన కొడుకు ముఖం స్టేషన్ మాస్టర్దే అన్నట్టుగా అతని ముఖంలోకి చూసి “చూసేదేమున్నది?” అన్నాడు.
“కాలాంతకపు ముండ కొడుకున్నట్టున్నది.”
స్టేషన్ మాస్టర్ కు మతి పోతోంది. తన సర్వీసులో చావులు చాలా చూశాడు. జంతువులు, మనుషులు – చనిపోయింది – మనిషైతే స్టేషనంతా ఏడుపులు పెడబొబ్బలతో నిండి పొయ్యేది. శవాలకేసి పరుగెత్తేవాళ్ళు – ఆ ఏడుపులు తగ్గి పంచనామా చేసేసరికి తాతలు దిగొచ్చే వాళ్ళు. కాని ఈ మనిషికి ఆ ధ్యాసే లేదు. వీడు మనిషేనా? జంతువా? రాయి కాదు కదా? ఇంతకూ చనిపోయిన పిల్లవాని తండ్రేనా?
స్టేషన్ మాస్టర్ మీమాంసలో ఉండగానే – రాజారాం ముఖం రుద్దుకున్నాడు.
“అది కాదయ్యా! ఎంతసేపు శవాన్ని ఉంచుతాం. పొద్దున నాలుగున్నరకు చనిపోయాడు. ఇప్పటికే ఖరాబయ్యింది. పంచనామా చెయ్యాలి” స్టేషన్ మాస్టర్ నచ్చ చెప్పే ధోరణిలో,
“చెయ్యండ్లి” రాజారాం.
“అక్కడికే పోదాం ” స్టేషన్ మాస్టర్.
“పోయి?”
“అక్కడ నువ్వు నీ కొడుకును చూసుకొని నవ్వేవు. మేం ఏడుస్తం” అన్నాడు రైల్వే పోలీసు కోపంగా,
రాజారాం లేచి నిలబడి రైల్వే పోలీసు ముఖంలోకి చూశాడు. అక్కడ అతనికి కాలిపోయిన తునికి చెట్టు మొదలు కన్పించింది.
ఈ వాదనలు ఇష్టం లేని వానిలాగా రాజారాం లేచి నిలుచున్నాడు. నిజానికి కొడుకు శవం అతని మనసులో ఎప్పుడో చూసుకున్నాడు. కొడుకు చనిపోవడం ఎప్పటినుంచి ప్రారంభమైంది అన్న చిత్రమైన ఆలోచన కలిగింది. మనుషుల చావు ఒక ఘడియలో జరుగగలదన్న దాని కన్నా, సంవత్సరాల తరబడి జరుగుతుందనేది అతని నమ్మకం.
స్టేషన్ మాస్టర్, రైల్వేపోలీసు రూంలో నుంచి బయటకు నడిచినా కూడా రాజారాం కొడుకు చావు ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైనదనేది తెలియక అక్కడే నిలుచున్నాడు.. ..
“ఏమయ్యా రాజారాం !” రైల్వేపోలీసు పిలిచాడు. ఆ రాజారాం కలలో నడుస్తున్నట్టుగా రూం బయటకు వచ్చాడు. అక్కడి వాళ్ళంతా రాజారాంను చుట్టుముట్టారు.
“పాప కర్ముడున్నట్టున్నది” ఎవరో ముసలమ్మ గొణిగింది.
“ఏమయ్యా ముఖం సూత్తే సదువు సాత్రం వచ్చినోని తీరుగున్నవ్ – ఇయ్యల్లటి రేపటి కోమలి పోరగండ్లు మాటంటెబడ్తలేరు. కొడుకును కొట్టినవా? తిట్టినవా?”
“నీకు అక్కల్ (బుద్ధి) లేదా?” –
ఇలాంటి తిట్లు దీవెనలెన్నెన్నో – పిల్లలను ఎట్ల పెంచుకోవాలో సలహాలు – ఆ తిట్లమీద రాజారాంకు ధ్యాసలేదు. మనుషులందరికి చావడం ఎప్పుడు మొదలయ్యిందోనన్నట్టుగా, చావును జయించిన వాళ్లున్నారా అన్నట్టు చూశాడు.
రాయేశం తలవంచుకొని నడుస్తున్న రాజారాం పక్కకు వచ్చి “నీకెందరు కొడుకులే?” అన్నాడు తడి గొంతుతో ఆప్యాయంగా.
“ఒక్కడే” రాజారాం .
జనంలో కొందరికి మరీకోపం పెరిగింది. “ఓరి జెష్టమ్మా ! ఒక్క కొడుకును సాది సవరచ్చెన చేసుకోలేంది నువ్వేం మనిషివిరా?” ఒక ముసలయ్య.
“ఛత్తెరి ఏ పాపకర్ముడన్నా గీదునియల కొడుకుల, బిడ్డల సాదుకోని వాడుంటడా?” ఒక నడీడువాడు.
“ఇగో ఈడున్నడు గదా?”
“ఇయ్యల్లరేపు ఎవలరచ్చెన ఆళ్ళ సేతుల్లున్నదా? అంత మంచిగనే బతుకుదామనుకుంటరు. కని నొస్టరాసిన రాత – ఆ పిల్లగానికి గీ కొరత రాసిండు బమ్మదేవుడు” మరొక నడీడు మనిషి.
“మన గీతలన్నీ రాసేది మనుషులే-” రాయేశం అన్నాడు. రాజారాం ఏం మాట్లాడకుండా నడుస్తున్నాడు. అతని వెంట మంది నడిచారు. రైల్వే పోలీసు, స్టేషన్ మాస్టర్ ముందు నడుస్తున్నారు.
పొద్దుగూకింది. పడమటి దిక్కుకాలి కూలిన గ్రామం దూరంగా కనిపించినట్టుగా నలుపు ఎరుపుల సంగమం.
రాజారాం బోరింగు నీటి పంపుదగ్గర ఆగాడు. ఎవరో బోరింగు కొట్టారు. రాజారాం ముఖం కడుక్కున్నాడు. కొన్ని నీళ్ళు తాగాడు. జేబులు వెతుక్కున్నాడు. ఎవరో బీడికట్ట, అగ్గిపెట్టె ఇచ్చారు. ఎవరో సిగరెట్టివ్వబోతే తీసుకోలేదు.
From the publisher's feed

52 Listeners