
Sign up to save your podcasts
Or


కన్నడ రచయిత వివేక్ శానభాగ రాసిన " ఒందు బది కడలు" నవల, తెలుగు అనువాదంలోని కొన్ని భాగాలు మీరిప్పుడు వింటారు . ఈ నవలను 'ఒక వైపు సముద్రం' పేరుతో తెలుగులోకి రంగనాథ రామచంద్ర రావు గారు అనువదించారు. ఈ పుస్తకం అమెజాన్ లో ఛాయా రిసోర్సెస్ సెంటర్ ద్వారా లభ్యమౌతోంది.(https://bit.ly/okaviaipusamudram).
నవల కొన్న మొదటి యాభై మంది పాఠకులకు, 'సంచారి బుర్రకథ ఈరమ్మ' పుస్తకం ఉచితంగా లభిస్తుంది.
ఉత్తర కన్నడ జిల్లా తీర ప్రాంతంలో చాలా నదులొచ్చి సముద్రంలో కలుస్తాయి. ఎంతో అందం గా వుండే ఈ ప్రదేశంలో నివసించే మనుషుల జీవితాలూ, వస్తున్న మార్పులూ, మార్పుల వల్ల వచ్చే సంఘర్షణ, వీటిని అద్భుతంగా ఒడిసిపట్టుకున్న, నవల 'ఒక వైపు సముద్రం'
నిర్మల మొగుడు ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.
తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.
పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. – http://bit.ly/tilaknavodaya
కథను –
‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
(Harshaneeyam on Gaana app)
స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam
(Harshaneeyam on Spotify)
ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5
(Harshaneeyam on Apple. Podcast)
నిర్మల మొగుడు:
ఖంగారు ఖంగారుగా భోజనం చేస్తున్న భర్త మానసిక పరిస్థితినీ, మొహంమీద పడుతున్న నల్లని వంకీల జుట్టునీ, అదో విధమైన ఆనందానీ అందాన్ని సూచించే అతని రూపాన్ని చూసేటప్పటికి జాలివేసింది నిర్మలకు. –
– “తాపీగా తినండి. మీకిష్టమని ఈ గోంగూరపచ్చడి కూడా వేశాను. మీరలాగ కంగారుగా తిని వెళ్ళిపోతే నా మనసంతా ఎంతో బాధపడుతుంది.”
“ఒళ్ళమ్ముకున్నాక తప్పుతుందా మరి! ఆ రావణాబ్రహ్మ ఈవేళ ఎలాగైనా నన్ను వదలడులే!”
ఈ రావణాబ్రహ్మ అన్న బిరుదు ఎవరికి చెందుతుందో నిర్మలకి తెలుసు. ఆ పేరు చెప్పితే తన భర్త హోరని వర్షములో తడిసి వచ్చికూడా గడగడా మరచెంబుడు నీళ్ళు తాగుతాడన్న విషయం కూడా తెలుసును. కాని ఎదురుగా తన భర్త అంత కంగారుగా భోజనం సరిగా చేయకుండా వెళ్ళిపోతుంటే ఆమె భరించలేకపోయింది. అందులోనూ జరిగిన రాత్రి అతనసలు భోజనమే చేయలేదు. దానికి కారణమైన కలహమూ, ఆ కలహములో మొండిపట్టుపట్టిన తనపాత్ర నిర్వహణా, ఆ కోపములోనే యిద్దరూ భోజనం మానేసి, ఒకే పెద్ద మంచంమీద ఒకరికొకరు తగలకుండా, ఒకరివైపొకరు తిరగకుండా పడుకొని జరిపిన అసిధారా వ్రత నిర్వహణమూ ఇవన్నీ నిర్మలని పశ్చాత్తప్తురాలినిగా భర్తయెడ మరీ సుముఖురాలిగా, ప్రేమచేత కరుణచేత ఆర్ద్రహృదయగా చేసివేశాయి. అందులోనూ అందమైనవాడు, జుట్టు ఆ విధంగా మొహంమీద పడేవాడు. అటువంటివాడు తనకి భర్త అయి, తన సర్వస్వమూ అయినప్పుడు. –
• “మీరు ఆ కూర మరోసారి కలుపుకుంటే కాని వీలులేదు. నా మీద ఒట్టే! బోడి ఉద్యోగం పోతేపోతుంది – దీని తాతలాంటిది వస్తుంది. ఊ, మరి కలపండి” అంది.
ఈసారి విసనకర్ర పుచ్చుకొని విసురుతూ అతని ప్రక్కన కూర్చుంది. నవ్వుతూ పట్టుదల పట్టుతూ లాలిస్తూ అతనిచేత తిరిగి కూర కలిపించింది. “అయిన ఆలస్యం ఎల్లానూ అయిందిగా? ఇంకో పావుగంట లేటయితే పీకలు తీస్తారా ఏమిటి? సంసారాల్లో ఎవళ్ళకి మాత్రం ఏదో అవసరాలు రాకుండా వుంటాయా, ఆలస్యాలవకుండా వుంటాయా?” అంటూ నొక్కులు నొక్కుతూ సన్నగా దీర్ఘం తీసింది. అసలు ఈ ఆర్గ్యుమెంటుని ఏ కోర్టులోనూ ఒప్పుకోరని తెలుసు. కాని కలహానంతరం అందులోనూ ఒక రాత్రి రాత్రి మౌనంగా వుండి, తిరిగి సంధి కలుపుకొన్న తర్వాత భార్యా భర్త లనుభవించే ఆనందం సరిక్రొత్త ప్రేమలనూ ఉద్రేకాన్ని స్వచ్ఛ పరిమళాన్ని కలిగి వుంటుంది. అటువంటి పునర్నవమైన ఆప్యాయతలో భోజనం పెడుతూంటే, భార్య సన్నవి గాజుల చప్పుడుతో విసురుతూ లాలిస్తూ ఉంటే వేరే కాంక్షించే స్వర్గమే లేకపోయింది గంగాధరానికి. ఆఫీసులూ, బాధలూ, సమస్యలూ అన్నీ చప్పున ఫేడౌట్ అయిపోయాయి. ఆ కాస్సేపట్లోను అతనికి నిత్యమూ, సత్యమూనైన బ్రహ్మానందం గోచరించింది.
ఈసారి వాళ్ళ కబుర్లు, ఒకసారి మనస్సులోంచి సమస్యా సందేహాలు దూరమైపోయిన తరువాత – ఏ అడ్డంకీలేని నదీ ప్రవాహంలాగా సాగిపోయాయి. వచ్చే సంక్రాంతి పండుగకి మామగారు ఏం బహుమతి యిస్తారో అన్న ప్రశ్ననుండీ, సినిమాలో ఫలానా నటి తాలూకు నటన విశేషమూ, కో – ఆపరేటివ్ స్కీములో తాము కట్టించబోయే చిన్న సైజు యింటికి యెన్ని గదులు ఉండాలి అన్నంతవరకు అనవసర అవసర సమాలోచనలన్నీ సాగిపోయాయి. అతను చెయ్యి కడుక్కొని లేచేటప్పటికి ఆమె వక్కపొడుం తీసుకొచ్చి ఇచ్చింది. అతను బనీను ధరించేటప్పటికి దువ్వెనతో వచ్చి అతని పాపిడితీసింది. అతను అమెరికన్ జాకెట్ వేసుకొనేటప్పటికి జోళ్ళు రడీగా ఎదురుగా పెట్టింది. అతను ఆమెను ముద్దు పెట్టుకొని “వస్తాను నిర్మలా” అని యధాలాపంగా అలవాటు చొప్పున గోడమీద టైము చూచేటప్పటికి అతనికి స్పృహవచ్చినట్టు – లేక తప్పినట్టు అయింది. కఠిన వాస్తవికత కొరడాతో కొట్టినట్లయింది. అతని నీడ అతని వెనకనే వచ్చి వెన్నుల్లో పొడిచినట్లయింది. ఉన్నపళంగా కుప్పగా కుర్చీలో కూలి “పదకొండుంబావు” అన్నాడు. అతని మొహంలో కత్తినాటుకు నెత్తురు చుక్కలేదు. తెల్లబడిన అతని మొహాన్ని, పిచ్చిగా చూస్తోన్న అతని కళ్ళను చూసి అర్ధాంగి కంగారుపడింది.
“గంటంపావు లేటు! ఆఫీసుకు వెళ్ళేటప్పటికి యింకో పావుగంటైనా పడుతుంది. ఇంక ఉద్యోగానికి నీళ్ళు వదులుకోవలసిందే. అసలే కోపిష్టిమనిషి, అందులోనూ దొరల పంక్చుయాలిటీ అంటో ఛస్తోంటాడు. అసలు మొన్నమీ వాళ్ళు వచ్చిన రోజున ఆలస్యమైనందుకే మండిపడ్డాడు. తుది హెచ్చరిక అని చెప్పాడు, మీసాలమీద చెయ్యివేసి. నా కొంప తవ్వేశావు. ఏ పావుగంటో, అరగంటో ఆలస్యం అయితే సర్దిచెప్పుకోవచ్చును. ఇప్పుడేమిటి చెయ్యటం?”
నిర్మలకి ఏమీ తోచలేదు. ససంభ్రమ సవిషాద సశంకిత అయి అలాగ నించునిపోయింది. అతను కణతల్ని రెండు చేతులతోనూ అదిమి పట్టుకొన్నాడు. ఈవిధంగా ఆలస్యంగా ఆఫీసుకు దయచేసి ఆ తప్పుని మళ్ళీ మళ్ళీచేసి ఉద్యోగం పోగొట్టుకొని, కొత్తది దొరక్క, మాసిన గడ్డంతో, లోతుకుపోయిన కళ్ళతో రోడ్లుకాస్తూ మిత్రుల్ని అణా, బేడా అడిగి బతుకుతున్న శంకరం స్మృతిపథంలో మెలిగేటప్పటికి అతనికి ఒక్క నిమిషం ఊపిరాడలేదు. అతన్ని లాలిస్తూ భోజనం పెడుతూ, అరగంటకన్న ఆలస్యం అవడంలోని వైప్లవ్యాన్నీ, విపత్తునీ చూడలేకపోయానే అని బాధపడుతోంది ఆమె!
“చీ చీ-మీ ఆడాళ్ళింతే! వెధవసొద వేసుక్కూర్చున్నావు. ఇప్పుడు చీవాట్లు తినాలి. డిస్మిస్ అంటే గొల్లుమని ఏడుస్తూ రావాలి. రేపటి నుండి మెతుకులు కూడా ఉండవు.”
“అయ్యో నాకేం తెలుసండీ” అంది నిర్మల.
“ఏం తెలుసు మరీ? నీ మొగుడేమైనా కలెక్టరనుకున్నావా? మినిష్టరనుకున్నావా! గుమాస్తా అంటే. ఏమిటనుకున్నావు? ఎన్నిసార్లు చెప్పాను నీకు తొమ్మిదింటికల్లా వంట అవ్వాలనీ” కోపంతో కేకలు వేస్తున్నాడు గంగాధరం.
“మరి మీరు తొమ్మిదింటికిగా బియ్యం పట్టించుకొని వచ్చింది?” అంది నిర్మల భయంగా.
మొదట తడితడిగా కనబడి తర్వాత బలం సంతరించుకొని బిందురూపం తాల్చికొని, కనుకొలకుల నుండి రెండశ్రువులు నిర్మల కపోలాల మీద మెల్లగా జారాయి. గంగాధరానికి గబుక్కున జాలి వేసింది. అతనికి ఏ వూహ తట్టినా, ఏ అనుభూతి కలిగినా గబుక్కున కలుగుతుంది. “ఏదో కోపంలో అన్నాను నిర్మలా. నీ తప్పేమీ లేదు. కాతాకొట్టు తెరిచేటప్పటికీ యీవేళ తొమ్మిదయింది. అవునుకాని యిప్పుడేమిటి చేయడం?” అన్నాడు గంగాధరం. –
నిర్మల తడికళ్ళు ఒకసారి మెరిశాయి. మంచుపడుతూన్న వేకువ పొద్దు మీద చటుక్కున సూర్యకిరణాలు పడ్డట్టు బిక్కపోయిన ఆమె మొహం ఒక్కసారి వెలుగుతో ఉద్దీపమయింది. తన భర్తకి నెల నెలా వచ్చే జీతపురాళ్ళని రక్షించే ఒక ఉపాయం ఆమెకు తట్టివుండాలి. .
గంగాధరం ఆశగా ఆమెకేసి చూశాడు. ఊపిరాడకుండా నదితో కొట్టుకుపోతున్న అతనికి ఆమెలో స్ఫురించిన ఊహ అనే పడవచెక్కని పట్టుకొని గట్టుకు చేరుకోవాలనుకున్నాడు.
“నాకో ఊహ తట్టిందంటీ” అంది నిర్మల. “నిజంగానా” ఆతృతగా అన్నాడు గంగాధరం.
“నిజమేనండీ. మా స్కూల్లో యిదివరకు ఓ మేస్టరు ఉండేవాడు. ఆయన చాలా కోపిష్టి, పెద్ద పెద్ద మీసాలతో గండుమొహంతో అచ్చంగా పెద్దపులిలాగ ఉంటాడు. ఓనాడు నేను స్కూలుకి బాగా ఆలస్యంగా వెళ్ళాను. ఆయన కళ్ళెర్రజేసి ఎందుకింత ఆలస్యమయిందని గర్జించాడు. ఒకవేళ ఆడపిల్లనని చేయిచేసుకోకపోయినా, అక్కడ ఎండలో ఇసుకలో నుంచోబెడతాడు. మగపిల్లలు ఏడిపిసారేమో అని నా భయం. నాకు భయంతో సిగ్గుతో ముచ్చెమటలు పోశాయంటే నమ్మండి. నాకు చటుక్కున జ్ఞాపకం వచ్చింది. ఆయనకి మాతృప్రేమ ఎక్కువనీ, మాతృపూజకన్నా జీవితంలో పరమార్థం మరొహటి లేదనీ – చూడండి మీరేదో కాంప్లెక్సూ, గీంప్లెక్సు అంటారు, అలాగ అన్నమాట. అంతే మా అమ్మ ఊరగాయలు కోసం అటక ఎక్కబోతూ నిచ్చెనమీదనుంచి పడిందనీ, ఆమె కాలికి మర్దనా, అదీ చేసి, ఆవిడకి భోజనం పెట్టి, నే నన్నం తిని వచ్చేటప్పటికి ఆలస్యమయిందనీ మాంచి వొడుపుగా అబద్ధం ఆడేశాను. దాంతో అంత పెద్దపులి అహింసావాది అయిన మేక అయిపోయాడనుకోండి. నన్ను దగ్గరకు పిల్చి నా తల నిమిరి, విద్యార్థులందరికీ నన్నొక ఆదర్శం కింద చూపించి గౌరవించాడు మా మేష్టారు.”
ఆమె ఆగింది భర్తకేసి భావయుక్తంగా చూస్తూ. పాపం భయావస్థలో నున్న – గంగాధరానికేమీ స్ఫురించలేదు.
“ఈ కథకీ నా ఏడుపుకి సంబంధం ఏమిటి?” అన్నాడు విసుగ్గా.
భర్త తెలివితేటల్ని గురించి కొంచెం నిరసనగా, జాలిగా నవ్వి, విడమర్చి యిలా చెప్పింది నిర్మల. “చూడండి, మీ ‘బాస్’లో ఎక్కడో వీక్ పాయింట్ ఒకటి ఉంటుంది. దానిమీద మీరు ‘ప్లే చెయ్యాలి. ఎంత కోపంలో ఉన్నవాడైనా, | అతనికి యిష్టమైన, ఆప్యాయమైన ప్రసక్తి తీసుకువస్తే చటుక్కున మెత్తబడిపోతాడు, మా మేష్టారులాగా, ధైర్యం తెచ్చుకోండి, ఆలోచించండి.”
గంగాధరానికి ఆమధ్య తోటి గుమస్తా ఒకడు చెప్పిన విషయం సమయానికి జ్ఞాపకం వచ్చింది. ఒక్క ఉదుటున లేచి ఆమెని కావలించుకొని “మై ప్రెషస్ ! నువ్వు నిజంగా నన్ను రక్షించడానికి వచ్చిన దేవతవు. అందుకే కార్యేషు మంత్రి, కరణేషు దాసీ (పాపం తిరగేశాడు కంగార్లో) అన్నారు పెద్దలు. మా అధికారికి ఓ పెద్ద వీక్నెస్ ఒకటి వుంది. అదేమిటంటే ఆయనకి చాలాకాలం పిల్లలు లేరు. ఈమధ్యే మూడు నాలుగేళ్ళ క్రితం ఒక పిల్లాడు కలిగాడు. ఆయనకు పిల్లలు అంటే ఎంతో పిచ్చట. ఆ రోజుల్లో మిఠాయీ బొమ్మలు కొని చుట్టుప్రక్కల ఉన్న పిల్లలకు వారం వారం పంచి పెట్టేవాడుట. ఇప్పటికీ ఈయన ఉన్న వీధిలో ఏ పిల్లవాడికి జబ్బుచేసినా స్వయంగా వెళ్ళి కష్టసుఖాలు విచారించి అవసరమైతే స్వయంగా డాక్టర్ని కూడా తీసుకు వెళతాడట. ఎవరికీ కానీ రాల్చనివాడు నిరుటేడు అనాథ శిశుశరణాలయానికి రెండువందలు – టూ హండ్రెడ్ అడగ్గానే యిచ్చి పారేశాడుట. ఏదీ, నా అమెరికన్ షర్టు ఇలా పడెయ్యి, ‘ఓహో బ్యూటిఫుల్ అయిడియా” అంటూ అతనోవిధమైన నాట్యం చేశాడు.
“మీరు షర్టు తొడుక్కునే ఉన్నారండీ” అంది నవ్వుతూ నిర్మల. గోధుమరంగు పాంటు మీద షార్కుస్కిన్ బ్లౌజు వేసుకొని, జుట్టు అందంగా మొహంమీద పడుతుంటే సైకిలెక్కి సంతోషంగా వెళ్ళే భర్తను చూసి నిర్మల ఒకసారి సరికొత్తగా ప్రేమించినంత ఆనందమును, గర్వమూ పొందింది.
గంగాధరం వచ్చినట్లు తెలిసిన మేనేజరు తన గదిలోంచి గంగాధరాన్ని పిలిచాడు. మాంచి ధీమాగా, ఏ సంకోచమూ లేకుండా వెళ్ళే గంగాధరాన్ని చూసి సోదర గుమాస్తాలంతా తమ కళ్ళను తామే నమ్మలేక ఒకసారి కళ్ళు నులుముకు చూశారు. వినయంగా మేనేజర్ ముందు నిలబడ్డాడు గంగాధరం.
“నీ ప్రవర్తన నాకర్థం కావటం లేదు. నీకు బొత్తిగా భయమూ, భక్తి లేకుండా పోయాయి. ఇది ఆఫీసని, ఇక్కడ నీవు జీతగాడివనే స్పృహ కూడా నీకు లేనటుంది. ఇదివరకు నీకు మూడుసార్లు వార్నింగు యిచ్చాను. నా మాట నీకు లక్ష్యం ఉంటేగా, ఇంక నీ విషయంలో కన్సిడరేషన్ ఎమి చూపలేను. ఇంక నువ్వు ఫలితం అనుభవించక తప్పదు.” అని కోపంగా నిక్కచ్చిగా ఆరోహణావరోహణలు పాటిస్తున్న గొంతుతో, మీసం కొనల్ని మెలివేస్తూ కళ్ళెర్రచేస్తూ మాటాడే మేనేజరును చూస్తూంటే ఠీవిగా వెనకాలే నడిచివెళ్ళి ‘జింకని, అమ్మని’ నోట కరుచుకునే పులిలోని ఒడుపూ, నిశ్చయమూ గంగాధరానికి స్ఫురించేటప్పటికి అతని గుండె కొన్ని సెకనులు పనిచెయ్యలేదు. భయం భయంగా వణికే గొంతుని సరిచేసుకుంటూ ఇలా అన్నాడు.
“చిత్తం…. ఏక్సిడెంటు జరిగిందంటే… తమరు క్షమించాలి.”
“ఏక్సిడెంటా?” ఎగాదిగా చూశాడు మేనేజరు. “నువ్వు బాగానే వున్నావే” అన్నాడు.
“ఆఫీసుకి ఆలస్యమవుతుందేమోనని తొందరగా వస్తున్నానండి. చటుక్కున్న దారికడ్డంగా ఒక చిన్నపిల్లవాడు వచ్చాడండీ. సైకిలు ఆ కుర్రవాణ్ణి ఢీకొన్నదండి.”
ఈసారి అధికారి మొహం మారిపోయింది. ఆ తరువాత ఆవేదన మొహంలో కనబడింది. “ఏమైంది….. ఏమైంది” అన్నాడు.
“తలకి, కాలికి గాయాలు తగిలాయండి. ఒకటే రక్తమండి. తక్షణం నా జేబురుమాలు తలకి కట్టి ఆ కుర్రవాణ్ణి ఎత్తుకొని హాస్పటల్ కి వెళ్ళానండి. అక్కడ చికిత్స చేయించి కట్టుకట్టించి, డాక్టరుగారు ఫరవాలేదన్న తరువాత ఆ కుర్రవాడింటికి ఫోనుచేయించి మరీ వచ్చానండి. ఇంటికెళ్ళి బట్టలు మార్చుకొని…..”
“ఏం డేంజరు లేదుగదా. డాక్టరు గట్టిగా చెప్పాడా” ఫైర్ అలారంలా మోగింది అతని గొంతు.
“మరేం ఫర్వాలేదండి. అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యం చేయించాకదండీ. సెప్టిక్ అవకుండా పెన్సిలిన్ ఇవీ అవీ ఇంజెక్షన్లు ఇచ్చాడండి డాక్టరు.”
“ఆ కుర్రాడు కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాడా?”
“చిత్తం….. మొదట్లో కొంత సేపు తెలివిలేదండి, ఇప్పుడు మా అమ్మ కావాలి అని అంటున్నాడండి. ఈపాటికీ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళే ఉంటారండి!”
మేనేజరు మొహంలోని బాధ క్రమేణా తగ్గింది. “మీరంతా వట్టి బ్రూట్స్. సైకిలెక్కితే ఏదో పెద్ద నిషా వచ్చేస్తుంది కాబోలు మీ అందరికీ. రోడ్డుమీద పిల్లలు – అమాయకులైన పిల్లలు – ఉంటారని ప్రాథమిక జ్ఞానం కూడా పోతుంది కాబోలు. ఇకనైనా జాగర్తగా మసులుకో. నిన్ను క్షమించాను. నువ్వు వెళ్ళి నీపని చూసుకో. నా మనసంతా అదోలా అయిపోయింది” అన్నాడు మేనేజరు.
శాల్యూట్ చేసి వెనక్కి తిరిగి తోటి గుమాస్తాల మధ్యకి పచ్చిపడ్డాడు గంగాధరం సగర్వంగా సహాసంగా. “ఏం జరిగింది? ఏం జరిగింది?” అంటూ చుట్టూ చేరి అడిగారు అందరూ. “భాయ్ వీడు గంగాధరం ఏమిటనుకున్నారో” అంటూ నవ్వుతూ ఫైల్సుతీసే గంగాధరాన్ని ఏదో మహిమాన్వితుడిలాగా, హఠాత్తుగా అణిమాది సిద్ధులు లభించిన యోగీశ్వరుడిలాగా, వెట్టిగా చూశారు. మనసులోనే నిర్మలని తలచుకొని ధన్యవాదాలర్పించాడు గంగాధరం.
ఈ ప్రమాదవార్త విని సగం డీలా అయిన మేనేజరు కాస్సేపట్లో తిరిగి కోలుకొని, ఒక్కసారి నిట్టూర్చి, తన పనిలో నిమగ్నుడయ్యాడో లేదో, గణగణమని టెలిఫోను మోగింది. తాపీగా చెవిదగ్గర పెట్టుకొని “హలో” అన్నాడు. అవతల కొననుండి కంగారుగా భార్య గొంతు “ఏమండీ మీరేనా, అయ్యో అర్జంటుగా రండి. ప్రమాదం అండి అబ్బాయికి ప్రమాదం జరిగిందండీ. ఎవడో సైకిలు మీదనుంచి పోనిచ్చాడండి. తలంతా రక్తమండీ. త్వరగా రండి.”
మేనేజరు గుండె ఆగి, తిరిగి ఎగిరి గొంతుకలోకి అడ్డంగా వచ్చేసింది.
అతని మొహం తెల్లబడిపోయింది. మాట వణికింది. “ఎవడా వెధవ ఆ సైకిలు తొక్కినవాడు?” అన్నాడు
“ఆ దుర్మార్గపు వెధవ సైకిలు ఆపకుండా దిగకుండా రయ్యిమని తొక్కుకొని పారిపోయాడండీ. వాడికాళ్ళు విరగ – త్వరగా రండి.”
మేనేజరు చేతులూ కాళ్ళూ ఆడలేదు. “బతికే ఉన్నాడా” అని ఒక్క కేక పెట్టాడు ఫోనులోకి.
“అవేంమాటలండీ మీరు మరీన్నూ తలమీద గాయంపడింది. అంతే. గాయంకడిగి గుడ్డతో కట్టాను. మన డాక్టరుకు ఫోనుచేస్తే లేడు. ఇంకొక డాక్టరిని ఎవరినైనా వచ్చేటప్పుడు తీసుకురండి. నెత్తురింకా కొంచెంగా వస్తూనే వుంది. ఆలస్యం చెయ్యకండి” అంది.
మేనేజరు కిప్పుడు శ్వాస ఆడింది. కాని క్షణంలోనే అతని మొహం కోపంతో కందగడ్డలా అయిపోయింది. కోటు చేత్తో తీసుకుని .ఆఫీసుగదిలోంచి ఇవతలికి వచ్చి గంగాధరంకేసి విషం కక్కుతూ చూశాడు.
“ఏయ్ – యిలారా.”
ఆ పిలుపుకీ చూపుకీ గతుక్కుమన్నాడు. గంగాధరం. “సార్” అన్నాడు దగ్గరగా వచ్చి.
“నువ్వెవరిమీదనుంచి పోనిచ్చావో తెలుసునా సైకిలి….?”
గంగాధరం ఏమిటన్నట్లు వెర్రిగా చూశాడు.
“మా అబ్బాయి మీదనుంచి, లేకలేక కలిగిన ఒక్క కొడుకుమీద నుంచి. మా ఆవిడ ఇప్పుడే ఫోను చేసింది. పైగా ఆగకుండా పారిపోయావుట. నీ అంత నీచుడూ, దుష్టుడూ, అల్పుడూ, అధముడూ ప్రపంచంలో ఉండడు. నామీద నీకున్న గడ్డి మూలాన్ని చెయ్యాలని చేసినట్టు కనబడుతోంది. నిన్ను అరెస్టు చేయించాలి న్యాయానికి. కాని నీపాపం నిన్నే కొడుతుంది. నిన్ను డిస్మిస్ చేశాను పో – ఆఫీసులోంచి పో.” అంటూ మేనేజరు ఊగిపోయాడు కోపంతో. గంగాధరం ఏమీ అర్థంకాక గుటక మింగాడు. ‘సార్’ అనబోయాడు.
“నువ్వేం చెప్పనక్కరలేదు. ఇంకొక నిముషం ఎదురుగా ఉంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు. ఏమయ్యా హెడ్ గుమాస్తా, ఇతనికి ఏదైనా ఇవ్వవలసింది ఉంటే తక్షణం ఇచ్చి పంపెయ్యి. మళ్ళీ నా కళ్ళకి కనబడ్డావంటే అరెస్టు చేయిస్తాను. జాగ్రత్త” అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అధికారి వెళ్ళిపోయాడు.
కాసేపటికి వెర్రివాడులాగా, సర్వం పోగొట్టుకొన్న వాడిలాగా మూర్తీభవించిన శోకంలాగ’ వచ్చిన గంగాధరాన్ని చూసి కలవరపడింది నిర్మల. అతని నోటినుండి జరిగినకథ విని నిశ్చేష్టురాలైంది. జాలిగా తల రెండు చేతుల్తో పట్టుకుని కుర్చీలో కూర్చున్న గంగాధరాన్నీ, అతని అందమైన మోహం మీదపడే నల్లని వంకీలజుట్టునీ చూసేటప్పటికి ఆమె కనుకొలకుల్లో తెల్లని నీటి బిందువు తళతళలాడింది.
అబ్బా నా చేతిలో సైకిల్ వుంటే, పొట్ట యిలా పెరిగిపోయేనా, రాకుండా ఆగున్న సిక్స్ ప్యాక్ ఈ పాటికి వచ్చి పొడి పొయ్యేనా , అని జోరీగలా పోరగా పోరగా, యిక వీడిని యిలా ఉపేక్షిస్తే కందిరీగలా కుడతాడు అని డిసైడ్ అయ్యి ఓ నెల కిందట మా ఆవిడ నాకు ఓ పదమూడు వేలు పెట్టి ఓ హైబ్రిడ్ సైకిల్ కొనిచ్చింది. అదే చేతితో, ఒక బెల్, గాలి కొట్టుకొనే పంప్, మెత్తగా వుండే సీట్, అలాగే రాత్రిళ్ళు కూడా తొక్కేస్తా అనే ఉత్సాహం చూపి, ఒక నైట్ లాంప్, రెండు రిఫ్లెక్టర్స్ కూడా కొనిపిచ్చేసుకున్నా.
మా ఆవిడ తరవాత రోజు ఆ సైకిల్ కి పసుపు పూసి, కుంకుమ బొట్టు పెట్టి, రెండు నిమ్మకాయలు తొక్కించి, తాను ఎదురొచ్చి నా సైకిల్ యాత్ర ప్రారంభించింది. సైకిల్ తొక్కటం మొదలు పెట్టిన నాకు ఆ తర్వాత కానీ వెలగ లేదు, నా యాత్రకి ఓ రూట్ మ్యాప్ తయారు చేసుకోలేదని. సరే ముందు కాలనీ లోనే తొక్కదామని బయలుదేరా! రెండు వీధులు తొక్కినాక గానీ అర్థం కాలేదు మా కాలనీ లో అడుగడునా స్పీడ్ బ్రేకర్స్ అని మేము భ్రమ పడేవి సిమెంట్ కట్టలు అనిచెప్పి . సైకిల్ ఎక్కి దిగుతుంటే కూసాలు కదిలిపోతున్నాయి. ఓ పదినిమిషాలు తొక్కాక లాభం లేదు రేపు కాలనీ బయటకి వెల్దాము అని ఇంటికొచ్చేసా. పాపం మా ఆవిడ ఆ ముందురోజే నాకు తెలియకుండా బూస్ట్ బాటిల్ తెప్పిచ్చి పెట్టింది నేను తొక్కి తొక్కి అలిసిపోతే అవి తాగి, “బూస్ట్ ఈజ్ సీక్రెట్ అఫ్ హర్షాస్ ఎనర్జీ అనడానికి”.
పదినిమిషాలకే తిరిగొచ్చిన నన్ను చూసి ముఖం ముడుచుకొని, నా ఎదురుగానే బూస్ట్ కలుపుకొని, ఉస్ ఉస్ అనుకుంటూ తాగేసింది.
నా సమస్యంతా ఏకరువు పెట్టి, రేపటి నుండి బయట తొక్కతా అని తనని తీసుకెళ్లి, ఒక హెల్మెట్, సైక్లింగ్ గాగుల్స్ కొనిపిచ్చేసుకున్నా. పాపం పిచ్చిది మా ఆయనకీ ద్వితీయ విఘ్నం కలగ కూడదని నా డిమాండ్స్ అన్నీ తీర్చింది. పక్కన రోజు , కొన్న సరంజామా తో నన్ను అలంకరించుకొని, నా సైకిల్ ని కూడా అలంకరించి, రాజూ వెడలె రభసకు అని పాడుకుంటూ యాత్ర మొదలు పెట్టా. వెనకనుండి మా ఆవిడ అరుస్తూ వుంది ఎక్కు తొక్కు అని. మన కాలనీ దాటిందాకా నడిపిచ్చుకుంటూ వెళ్లి, బయటకు వెళ్ళగానే తొక్కతా అని తనకి అభయం ఇచ్చి బయల్దేరా. వెనక నుండి తాను అరుస్తూనే వుంది, మన కాలనీ లో చాలా శునకాలు వుండాయి, అందులో ఒక నల్ల శునకరాజం కరుస్తుంది, అసలే అంతరిక్షం నుండి ఊడిపడ్డట్టున్నావు నువ్వు అంటూ. భయపడుతూ భయపడ్తూ కాలనీ దాటా.
కాలనీ బయటకు వచ్చి మెయిన్ రోడ్ మీద తొక్కటం మొదలెట్టా! నా వెనక నుండి బోయ్ మంటూ హార్న్ కొడ్తూ ఏమీ తోచని వాళ్లంతా వాళ్ళ సరదా అలా తీర్చుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి ఎక్కడి రోడ్ చాలటం లేదు, నన్నేదో వాళ్ళ అర్జెంటు పనులకు అంతరాయం కలిగించే శత్రువులాగా చూస్తూ వెళ్తున్నారు నన్ను దాటాక. ఒకరిద్దరైతే శుద్ధమైన రోడ్ వుండగా మట్టిలో దిగి నా మొహాన ఇంత దుమ్ము కొట్టీ మరీ వెళ్లారు.
చూద్దాం ఈ రోజు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్తున్న పట్టు వదలని విక్రమార్కుడిలా. ఆయాసపడుతూ రెండు మూడు కిలోమీటర్స్ వెళ్ళా. ఈ లోపు కొత్తగా కొన్న వాటర్ బాటిల్ లోంచి నాలుగు సార్లు నీళ్లు తాగా.
ఈ లోపల నా ముందర ఒక హెవీ లోడ్ తో వెళ్తున్న లారీ ముందు అప్ రావటం తో, డ్రైవర్ గాడు ఒక్క సారి ఆక్సిలేటర్ అంతా అదిమాడెమో, నేను, నా సైకిల్, నా వెనక వచ్చే నాలుగైదు వాహనాలు మాయమయ్యేలా ఒక నల్లని మేఘాన్ని గిఫ్ట్ గా ఇచ్చింది. అప్పుడర్థ మయ్యింది నాకు ఆరోగ్యం గా ఉండాలంటే ముందు మనం బతికుండాలి అని, ఇంక నేను ఎప్పుడు ఇలాటి మెయిన్ రోడ్ లో సైకిల్ తొక్క కూడదని.
నా మొహం చూడంగానే, మా ఆవిడక్కూడ అర్థమయ్యింది మనోడు ఎదో సీరియస్ డెసిషన్ తో ఇంటికొచ్చేసాడని.
సర్లే పో అని ఒక క్వార్టర్ కప్పు బూస్ట్ ఇచ్చి, ఏంటి కథ అంది. సుప్రీ ఒకటి అర్థమయ్యింది నాకు, సైకిల్ అస్సలు మెయిన్ రోడ్ లో తొక్క కూడదు అని. మరెక్కడ తొక్కాలని డిసైడ్ య్యావు స్వామీ అంది మా ఆవిడ, ఈ టాపిక్ మళ్ళీ తన చేత ఏమి ఖర్చుకు దారి తీస్తుందో అని చాలా క్లుప్తం గా మాట్లాడ దానికి ట్రై చేస్తూ.
హాయిగా ప్రశాంతం గా వుండే ప్రదేశాల్లో తొక్కాలి, కానీ అక్కడకు సైకిల్ ఎలా తీసుకెళ్ళాలి, మన కార్ లో పట్టదు గా అని చెప్తున్న నాకు, అడ్డు తగిలి, అనుకున్నా , నువ్వు నిన్న సైకిల్ షాప్ లో కార్ కి పెట్టుకునే స్టాండ్ ని తదేకం గా చూస్తున్నప్పుడే, నా బుజ్జి కార్ వెనకాల దిష్టి బొమ్మలు తగిలించబాక అని వార్నింగ్ కూడా పారేసింది.
సరే డియర్ , మన కార్ చిన్నది , సైకిల్ పట్టదు, దానికి స్టాండ్ పెట్టడానికి నువ్వు ఒప్పుకోవు, ఇప్పుడు కారు మార్చలేమో అంటూండగా, మా ఆవిడ ఒక్క సారి ఫిట్స్ వచ్చినట్టు విరుచుకు పడిపోయింది.
ఆ సాయంత్రం మా శీను గాడు ఇంటికి వచ్చాడు.
“అబ్బో హర్ష సైకిల్ కొన్నట్టున్నాడే, బాగా తగ్గినట్టున్నాడు తొక్కీ తొక్కీ, నేను కూడా పాపకి చాలా రోజుల నుండి చెబుతూ వున్నా సైకిల్ కొనుక్కో అమ్మా, అది తొక్కితే చాలు ఇంకేమీ అవసరం లేదు”
ఆ మాటలు వింటున్న మా ఆవిడకి కళ్ళు మెరిసాయి. . కొత్త సైకిల్ కొనటం ఎందుకన్నా, దీన్ని పట్టుకెళ్లండి అంటూ నా సైకిల్, దాని అలంకరణలు మరియు నా అలంకరణలు జాగ్రత్త గా ప్యాక్ చేసి మరీ రెడీ చేసింది.
శీను గాడి చేతిలో సైకిల్ పెడుతూంటే, పిల్ల పెళ్లి జరిగిన ఆనందం మా ఆవిడ మొహంలో.
మా వాడు ఎలా తొక్కి తొక్కి తగ్గిపోయాడో చూద్దామని క్రితం ఓ రెండు నెల్ల తర్వాత వాడింటికెళ్ళా . ఇంటి గేట్ తీస్తూంటే వాళ్ళావిడ విప్పారిన మొహంతో ఎదురొచ్చింది. ఎప్పుడు మీరు వొస్తారా అని ఎదురు చూస్తున్నా అన్నా, అంది.
దేనికమ్మా అన్నా !
“అన్నా ఇవిగో మీ దగ్గర లేని యాక్ససరీస్ అంటూ ఒక తాళం చెవి , రెండు ట్యూబులు , నాలుగు సైకిలింగు షార్ట్లూ నా చేతిలో పెడుతూ, దయచేసి తీసుకెళ్ళన్నా ఈ భూతాన్ని . ఇప్పుడు దీన్ని ఎత్తుకొని తిరగడానికి మా ఆయన ఎస్.యు.వీలు బేరం చేస్తున్నాడు అంది స్వరం తగ్గించి , మూలున్న సైకిల్ ని చూపిస్తూ. “
డ్రైవ్ చేస్తూ ఇంటికొస్తూంటే, పక్కనే, ఎవరో ఇద్దరు స్కూలు పిల్లలు బాగుల్తో సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నారు.
వెనకొచ్చే ఆటోలో సైకిల్ జాలిగా విరుచుకు పడుకునుంది, కారునే ఫాలో అవుతూ.
చిన్నప్పుడు మా ఇంట్లో వుండే హీరో సైకిల్ గుర్తుకొచ్చింది. ఇంట్లో వున్న ముగ్గురం అదే సైకిల్ వాడే వాళ్ళం వంతులేస్కుని. ఆరు నెలలకి ఒకసారి ఓవర్ హాల్ కి ఇస్తే పదో పదిహేనో తీసుకొని కొత్త కరుకులా చేసే వాళ్ళు రిపేర్ షాప్ లో. ఓ పదేళ్ళన్నా వాడి ఉంటాము ఆ సైకిల్ ని అపురూపంగా.
మారింది ఏమిటి? అని ఆలోచిస్తూ ఇంటి ముందర కారు ఆపా. కారు శబ్దం విని బయటికొస్తోంది, మా ఆవిడ గేట్ తీద్దామని.
కథను –‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
(Harshaneeyam on Gaana app)
స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam
(Harshaneeyam on Spotify)
ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5
(Harshaneeyam on Apple. Podcast)
హర్షణీయం ‘వనవాసి’ ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా 25 మంది పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతున్న ప్రముఖులను , శ్రోతలకు పరిచయం చెయ్యాలని హర్షణీయం పూనుకుంది.
ఈ ఎపిసోడ్లో విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి డాక్టర్ ఈ ఏ ఎస్ శర్మ గారు , మనతో మాట్లాడతారు. న్యూక్లియర్ ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న , ఆయన ఎనర్జీ ప్లానింగ్ లో డాక్టరేట్ తీసుకున్నారు. టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో సైంటిస్ట్ గా పని చేశారు. తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఐ ఏ ఎస్ అధికారి గా విశేషమైన సేవలందించిన ఆయన , ఎనర్జీ , ఫైనాన్స్ మంత్రిత్వ శాఖల్లో, ప్లానింగ్ కమిషన్‌కు సలహాదారుడిగా పని చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో నివసిస్తూ , ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.
ఈ ప్రసంగం ద్వారా ఆదివాసీ హక్కుల పరిరక్షణలో తనకున్న ఆసక్తికరమైన అనుభవాలు, ఆయన సూచనలు మనతో పంచుకున్నారు.
డాక్టర్ ఈ ఏ ఎస్ శర్మ గారికి హర్షణీయం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.
Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.
హర్షణీయం ‘వనవాసి’ ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా 25 మంది పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతున్న ప్రముఖులను , శ్రోతలకు పరిచయం చెయ్యాలని హర్షణీయం పూనుకుంది.
ఈ ఎపిసోడ్లో విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి డాక్టర్ ఈ ఏ ఎస్ శర్మ గారు , మనతో మాట్లాడతారు. న్యూక్లియర్ ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న , ఆయన ఎనర్జీ ప్లానింగ్ లో డాక్టరేట్ తీసుకున్నారు. టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో సైంటిస్ట్ గా పని చేశారు. తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఐ ఏ ఎస్ అధికారి గా విశేషమైన సేవలందించిన ఆయన , ఎనర్జీ , ఫైనాన్స్ మంత్రిత్వ శాఖల్లో, ప్లానింగ్ కమిషన్‌కు సలహాదారుడిగా పని చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో నివసిస్తూ , ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.
ఈ ప్రసంగం ద్వారా ఆదివాసీ హక్కుల పరిరక్షణలో తనకున్న ఆసక్తికరమైన అనుభవాలు, ఆయన సూచనలు మనతో పంచుకున్నారు.
డాక్టర్ ఈ ఏ ఎస్ శర్మ గారికి హర్షణీయం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.
Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.
'రెండు రెళ్ళ నాలుగు' చిలుకూరి దేవపుత్ర గారి రచన. అనంతపురం జిల్లాకి చెందిన ఆయన తన జీవిత కాలంలో , నాలుగు నవలలు, ఐదు కథాసంపుటాలను రచించారు. ఆయన నవల 'పంచమం' శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు ఎం.ఏ పాఠ్యాంశం గా చేర్చారు. దేవపుత్ర గారు అందుకున్న అనేక పురస్కారాలలో , చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం , విశాలాంధ్ర వారి స్వర్ణోత్సవ సాహితీ పురస్కారం వున్నాయి.
'రెండు రెళ్ళ నాలుగు', ఒక యదార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ.
దేవపుత్ర గారి కథను మీకు అందించడానికి అనుమతినిచ్చిన , అన్వేష్ గారికి , దీవెన గారికి కృతజ్ఞతలు.
దేవపుత్ర గారి కథల పుస్తకాలు కొనేందుకు - https://bit.ly/3uOdH7B
బస్సు వేగం పుంజుకుంది. వాచీ చూసుకున్నాను. ఒంటి గంట అవుతోంది. ఎండాకాలం అయినందువల్ల సూర్యుడు తన తాపాన్నంతా భూమి మీదే చూపిం చేస్తున్నాడు. షి సాగర్ చేరుకునేటప్పటికి ఎన్ని గంట లవుతుందో? మళ్లీ అక్కణ్ణించి గౌహతికి సాయంత్రం లోగా చేరుకోగలనా? నేను అస్సాం వచ్చాక గౌహతికీ చుట్టుపక్కల ఉన్న పట్టణాలకు మాత్రమే క్యాంపులు వెళ్ళాను. దాదాపు రెండు వందల కిలో మీటర్ల దూరం ఉన్న షబ్నగర్ కి క్యాంపు వెళ్ళటం ఇదే మొదటిసారి.
కిటికీ పక్కనే కూచుని ఉన్నందువల్ల అందాన్నంతా హాయిగా గమనిస్తున్నాను. ఒకవైపు లోయలూ, మరో వైపు కొండలూ చూస్తుంటే 'బస్సు నిలిపేసి ఇక్కడే ఉండిపోతే ఏం' అనిపిస్తోంది. ఇది దురాశేనని తెలుసు. గౌహతిలో నళిని రాత్రికల్లా వచ్చేస్తానని ఎదురుచూస్తూ ఉంటుంది.
నా సీటు వెనకాల నుంచి గలగలమంటూ అమ్మాయి నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి. నేను తిరిగి చూడలేదు..
“ఇక జోకులు వెయ్యకు బాబూ, నా చేత కాదు. నవ్వలేక చస్తున్నా” నవ్వు నాపుకుంటూ అమ్మాయి గొంతు.
“అప్పుడే ఏమయింది.. ఇంకా ఎన్ని జోకులున్నా యని" మగ గొంతు.
“ఇక్కడ వీళ్ళంతా ఏమనుకుంటారు?" ఆడ గొంతు.
“వీళ్ళ మొహం... తెలుగు అర్థమయి ఛస్తేగా వీళ్ళకి” అంటోంది గర్వంగా మగగొంతు.
నేను వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేక పోయాను.
అమ్మాయి నల్లగా ఉన్నా - అందంగా ఉన్న మొహం, తళతళలాడే పలు వరుస, వెన్నెల చిందే కళ్ళూ ఉన్నాయి. అబ్బాయి మాత్రం వంకీల జుత్తుతో, లావాటి మీసకట్టుతో, ఎర్రగా బుర్రగా ఉన్నాడు చూడగానే కొంటె కుర్రాడు అనిపించేలా ఉన్నాడు.
“మన ముందు సీటులో మనిషి చూడూ... వెనక్కి తిరిగి మనల్ని..” అంది అర్దోక్తిగా ఆమె. "
“కోతిమొహం కొండముచ్చు వెధవ... ఎలా ఉన్నాడో చూడు" అంటూ నా భుజం తట్టి అస్సామీ భాషలో ఏదో మాట్లాడాడు. నాకా భాష అర్థమయి ఛస్తేగా, పళ్ళికిలించి వెర్రినవ్వు నవ్వాను. ఒకవేళ నేను తెలుగులోనే మాట్లాడేశాననుకోండి, వాడు ఇందాక తిట్టాడే 'కోతి మొహం' అన్న తిట్టు నాకు వర్తించినట్టు వాళ్ళెక్కడ అనుకుంటారోనని నా భయం. ఆ "నేను చెప్పలా ఇక్కడ ఎవ్వరికీ తెలుగురాదని... మనకిష్టమొచ్చినంత సేపు తిట్టినా ఏం ఫర్వాలేదు. “ఒరే! ముందుసీటు ముసంగి వెధవా! మేమిద్దరం ఆలు మగలంరా! ప్రేయసీ ప్రియులు అనుకు న్నావా! అంత అనుమానంగా చూస్తున్నావు” అతడు ఆ పద్ధతిలో వెటకరింపుగా మాట్లాడుతోంటే, ఆ అమ్మాయి పకపక పగలబడి నవ్వుతోంది.
వాళ్ళు సరదాగా, హాయిగా ఉండడం బాగానే ఉంది కానీ... వాళ్ళ సరదాకు నన్నే ఉపయో గించుకోవటం నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉంది.
నా భుజం మీద మళ్ళీ చేయి పడితే తిరిగి చూశాను. “భోజనం అయ్యిందా?” అన్నట్టు చేత్తో సైగచేస్తూ 'తన్నులు కావాలా?" అని తెలుగులో అడుగుతున్నాడు. ఆ అమ్మాయి గట్టిగా నవ్వుతోంది.
అంటే, అతను ఆమెను నవ్వించటానికి నన్ను తమాషా పట్టించే ప్రయత్నంలో చాలా ఫార్వర్డ్ అయిపోతూ ఉన్నాడన్నమాట. నేను గమ్మున చూస్తూ 'ఆఁ' అన్నాను. 2. "కమలా! చూడు వీణ్ణి ఇంకా ఎలా ఆడించేస్తానో!” అంటూనే అతను 'నీళ్ళు కావాలా?! అన్నట్టు సంజ్ఞ చేస్తూ - "కీళ్ళు విరిచేస్తా. ఏమిటలా చూస్తావు గుడ్లగూబలా... బుద్దుందా? పెళ్ళి చేసుకున్నావా? వెధవ నాయాలా... కాలేదూ... పోనీ ఉంచుకున్నావా ఎవర్నయినా?” అని అతడు వాగుతూ ఉంటే, 'ఆఁ ఆఁ జీహాఁ' అన్నాను - వెర్రినవ్వు ఒలక బోస్తూ తల తిప్పేసుకున్నాను. ఆ అమ్మాయి పడీ పడీ నవ్వుతోంది.
బస్సులో అందరూ తలలు తిప్పి ఆమె వైపు ఆసక్తిగా చూస్తున్నారు. - "ఏంట్రా కూస్తున్నావ్?" అని నేను తెలుగులో అడిగితే అతని పరిస్థితీ, ఆ అమ్మాయి పరిస్థితీ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నాను.
"నువ్వేమో అతని మీద ఇన్ని జోకులు వేస్తున్నావు. నేను నవ్వుతున్నాను. కొంపదీసి అతను 'ఉల్ఫా' తీవ్రవాది కాదు కదా!" అంది నవ్వు తగ్గించి ఆ అమ్మాయి.
. “నీ మొహం. ఉల్పాలు ఎలా ఉంటారో తెలీదా నాకు. వీడి మొహం, వీడు మాత్రం ఉల్ఫా కాదు - అల్ఫా కాదు” అన్నాడతను.
ఉల్పా టాపిక్ అతను జోకులు వేయడం కూడా మరచిపోయినట్లున్నాడనిపించింది. అతని కంఠంలో గంభీరత ధ్వనిస్తోంది.
“ఉల్పా వాళ్ళంటే మెడలో 'ఉల్ఫా' అని బోర్డు ఏమైనా వేలాడేసుకుని ఉంటారా? అతనే ఎందుకు కాకూడదూ... ప్లీజ్! ఇంక
జోకులు వేయకు అతని మీద" ఆ అమ్మాయి అతన్ని మందలింపు ధోరణిలో అంటోంది. నాకు మాత్రం నవ్వొస్తోంది.
“ఏమో కమలా. నీ అంచనా కరెక్ట్ కావచ్చు" అంటున్నాడు. రాముడు మంచి బాలుడు' అన్నంతగా ఉన్నాయి అతని మాటలు. ఇలా మాట్లాడే వాడేనా నా మీద ఇందాక జోకులు వేసింది! నిజంగా నాకు వాళ్ళమీద అపారమైన
జాలి పుట్టుకొచ్చింది. పైగా, వాళ్లు నన్ను ఉల్ఫా అనుకుంటూంటే నా మనసు విలవిలలాడింది. అంతకంటే ఇందాక నాపైన వేసిన
జోకులే నయమనిపిస్తోంది. అందుకే వాళ్ళ వేపొకసారి తిరిగి చూసి నవ్వుతూ “ఇదో చూడండి... నేను ఉల్ఫాని అల్ఫానీ కాదు” అన్నాను అచ్చ తెలుగులో.
ఆ మాట వింటూనే ఇద్దరూ పక్కలో బాంబు పేలినట్టు అదిరిపడ్డారు. అతనైతే మరీ తత్తరపాటుతో - "సా సా సా... సారీ సర్! క్ష... మీరు నన్ను క్షమించాలి.. ఏ ఏ ఏ... ఏదో కాలక్షేపం చేయాలని... అనవసరంగా మిమ్మల్ని అనరాని మాటలు... నన్ను క్షమించాలి సార్" అంటున్నాడు దొరికిపోయిన దొంగలా మొహంపెట్టి.
ఆ అమ్మాయి మొహం కందిపోయింది. మౌనంగా నా వేపు క్షమాపణలు అడుగుతున్నట్టు చూస్తోంది. - “ఫర్వాలేదులేండి... మీరు సరదాని అనుభవిస్తుంటే అభ్యంతర పెట్టలేక పోయాను" అంటూ నవ్వేశాను. ఆ
“అలాగా" అంటూ ఇద్దరూ మనసు తేలికపడ్డట్టు నవ్వేశారు. “మీరు ఎక్కడి వారు... అంటే మన ఆంధ్రదేశంలో.." అడిగాను.
“మాది బెజవాడ సార్... షిల్లాంగ్ స్టేట్ బ్యాంకులో ఆఫీసరుగా ఉన్నాను. మరి మీరు?" అడిగాడు అతను. నా గురించి చెప్పాను. - “మరి మీరు గౌహతికి వచ్చారేం సార్?" అడిగాను.
"గౌహతిలో రైల్వేలో మా కజిన్ టీసీగా ఉన్నాడు సార్! అందుకని ఇద్దరం వెళ్ళాం, ఇలాగే టీన్ సుక్యాలో నా ఫ్రెండు ఒకడున్నాడు. వాడిని చూడాలని వెళ్తున్నాం” అన్నాడతను.
“సార్! ఇక్కడేనా ఉల్పాలు ఉండేది... ఏఏ ప్రాంతాలలో ఉంటారు సార్?" అడిగిందామె. ఆమె మనసు ఉల్పాల నుంచి పక్కకు వెళ్ళినట్టు లేదు.
"నాకు అంత వివరంగా తెలీదు కానండీ, దిగువ అస్సాంలో - అంటే కామరూప్, కోకరాజ్ లోనూ, ఎగువ అస్సాంలో షిబ్ సాగర్, దిబ్రూఘర్, టిన్ సుక్యాలలోనూ ఉంటున్నారని వినికిడి" అన్నాను.
ఆమె ఆలోచనల్లో పడిపోయినట్లు మౌనంగా ఉండిపోయింది. బస్సు చిన్నచిన్న కుదుపులతో వెళుతోంది. దూరంగా బ్రహ్మపుత్ర నది విశాలంగా, నింపాదిగా పారుతూ కనిపిస్తోంది. జీవనదులంటే ఏమో తెలియని అనంతపురం జిల్లా వాడిని. అందుకేనేమో బ్రహ్మపుత్ర నదిని చూస్తే ప్రాణం లేచి వస్తుంది నాకు. అంతెందుకూ, బెంగుళూరు నుంచి గౌహతికి బదిలీ అయిన కొత్తలో మా హెడ్ ఆఫీసు వాళ్ళని ఎంత తిట్టుకున్నానో... గౌహతి నగరం మధ్యలో పారే బ్రహ్మపుత్ర నది నన్ను కొంత ఓదార్చినట్టు
అనిపించింది. సాయంత్రాలన్నీ దాదాపు బ్రహ్మపుత్ర ఒడ్డునే గడపటం, జీవితంలో గొప్ప వరంగా అనిపించేది నాకు.
బస్సు ఒక్క కుదుపుతో హఠాత్తుగా ఆగింది. కిటికీ లోంచి తొంగి చూశాను. సాయుధులయిన దాదాపు పదిమంది మిలటరీ వాళ్ళు బస్సులోకి ఎక్కుతున్నారు. ఒక్కో ప్రయాణీకుణ్ణి సామానులతో సహా చెక్ చేస్తున్నారు. ఇది కొత్త వాళ్ళకైతే ఆశ్చర్యమేమో కానీ, నాకయితే మామూలు విషయమే. --
“ఎందుకూ చెక్ చేయటం?" అంటోంది నా వెనకాల అమ్మాయి. -
"అంతేనండి ... ఉల్ఫాలుంటారని... ఈ ప్రాంతాలన్నీ అంతే. దాదాపు ఎక్కడ పడితే అక్కడ చెక్ చేస్తుంటారు. మీరు 'టిన్ సుక్యా' వెళ్ళేలోగా కనీసం రెండు మూడు చోట్లయినా బస్సు నిలబెట్టేసి చెక్ చేస్తారు" అన్నాను.
ప్రతి ఒక్క ప్రయాణికుణ్ణి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వచ్చిన ప్రతి సైనికుడూ ప్రతి ఒక్కర్నీ 'చెక్ చేస్తున్నారు. అంటే, ఒక ప్రయాణికుడిని పది మంది సైనికులు ఒకరి తర్వాత ఒకరు చెక్ చేస్తున్నారన్నమాట.
“ఎంత భయంకరమో చూడండి. ఇటు సైనికులకూ, అటు తీవ్రవాదులకూ మధ్య నలుగుతున్నాడు సామాన్యుడు. ఇరువర్గాల వాళ్ళూ కసి తీర్చుకునే వస్తువు సామాన్యుడు" అంటున్నాడు నా వెనకతను.
నా ముందు సీట్ల వాళ్లని చెక్ చేయటం అయిపోగానే నా వైపు వచ్చాడు ఓ సైనికుడు. నాకు భయమంటూ ఏమీ లేకున్నా అదోలా ఉంది. తాము ఎంత నిరపరాధులమని ధీమా ఉన్నా చెకింగ్, ఇన్స్పెక్షన్, తనిఖీ - ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఏదో భయం లాంటిది తొంగి చూడని మనిషంటూ ఎవరూ ఉండరేమో.
ఆ సైనికుడు నా జేబులు చెక్ చేశాడు. నా కాళ్ళ దగ్గరే పెట్టుకున్న సూట్ కేసుని బయటకు తీయమన్నాడు. నేను నెమ్మదిగానే సూట్ కేసుని చేతిలోకి తీసుకున్నాను. అయినా, సూట్ కేసులోని వస్తువులు దొర్లినట్టు దడదడమంటూ శబ్దం చేశాయి. ఈ
అంతే - వెంటనే అతను సూట్ కేసుని చేతిలోకి తీసుకుని అల్లాడించాడు. మరికాస్త ఎక్కువ దడదడ శబ్దం. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాడు హిందీలో గావుకేక పెట్టాడు. “వీరిని నేను అనుమానిస్తున్నాను. వెంటనే బయటికి తీసుకెళ్లాం పదండీ” అంటూ. -
నా గుండెలు దడదడ లాడాయి. “ఏమిటి మీరు అంటున్నది?' అన్నాను హిందీలో, అతడు నా మాటకి జవాబు ఇవ్వకుండా సూట్ కేసుని ఓ చేత్తో నన్ను మరో చేత్తో లాక్కుంటూ గబగబా నడిపించి బస్సు దించేశాడు.
బస్సులోంచి కొందరు ప్రయాణికులు నా వైపు అనుమానంగా చూస్తున్నారు. ఇద్దరు సైనికులు బస్సు దిగి వచ్చి నా జబ్బలు పట్టుకున్నారు. మొదటివాడు నా సూట్ కేసుని భద్రంగా పట్టుకుని నన్ను అనుమానంగా శత్రువుని చూసినట్టు చూస్తున్నాడు.
చుట్టూ చూశాను. అడవిలా ఉంది ఆ ప్రదేశమంతా. బస్సు నిలబడ్డ చోటుకి పదిహేను గజాల దూరంలో చిన్నకొట్టం హోటలుంది. దూరంగా కనుచూపు మేరలో పల్లె ఉన్నట్టు తెల్లటి మిద్దెలూ, గుంపులు గుంపులుగా చెట్లూ అవుపిస్తున్నాయి.
బస్సు కిటికీలోంచి దిగులుగా చూస్తున్నారు బెజవాడ దంపతులు.
'ఫర్వాలేదండి' అన్నట్టు కళ్ళతోనే వాళ్ళిద్దరికీ సైగ చేశాను. ఏమిటో, ఎదుటి మనుషుల ముందు ఎందుకీ మేకపోతు గాంభీర్యం? ఈ సైనికులు నన్ను ఏం చేస్తే ఏమిటి దిక్కు?
పావుగంటలో సైనికులంతా బస్సు దిగేశారు. బస్సు కదులుతోంటే ప్రయాణికులంతా నన్ను ఉల్పావాడిని చూస్తున్నట్టే అదో రకంగా చూస్తున్నారు. బెజవాడ దంపతుల దిగులు చూపులు అలానే ఉన్నాయి.
బస్సు వెళ్లిపోయింది. ఇద్దరు సైనికులు నన్ను లాక్కుపోతూ ఉంటే తక్కిన సైనికులు నావైపు తుపాకులు గురి పెట్టి నడుస్తున్నారు. అంతటి భయంలోనూ నవ్వు వచ్చింది నాకు.
కొట్టం హోటలుకి నన్ను తీసుకెళ్ళారు. పదిమంది సైనికుల్లోనూ నలుగురూ నాలుగు టేబుళ్ళను ఆక్రమించేశారు. తక్కిన ఆరుగురూ నా చుట్టూ నిలబడి ఉన్నారు. -
_ "ఎవరునువ్వు? మీ ఉల్ఫా వాళ్లు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? మర్యాదగా చెప్పావా సరేసరి - లేదంటే నీ ప్రాణం గాల్లో..." హిందీలో అంటూ భయంకరంగా నవ్వాడు లావు మీసాలవాడు.
“సార్! నేను ఫ్రిజ్ కంపెనీ ఉద్యోగిని. షిబ్ సాగర్ లో మా కంపెనీ ఫ్రిజ్ లకి కంప్లయింట్స్ వచ్చినందు వల్ల వాటిని రిపేర్ చేసేందుకు వెళుతున్నాను” అన్నాను హిందీలోనే! నా మూతి మీద టపీమని కొట్టాడు గంటు ముక్కువాడు - 'అబద్ధం' అని అరుస్తూ..
“రాస్కెల్. మాతో అబద్దాలు కూస్తావా? మిల్టరీ వాళ్ళంటే ఏమనుకున్నావు? నిన్ను ఇక్కడికిక్కడే తుపాకీతో కాల్చి పారేసి, ముక్కలు ముక్కలుగా కోసి కాకులకీ, గద్దలకీ వేసేసినా మమ్మల్ని ఎవరూ అడగరు. తెల్సిందా?" అన్నాడు నల్లటివాడు.
ఆ మాటలు జోకులు అయినట్టు అందరూ గట్టిగా నవ్వేస్తున్నారు. హోటలు వాడు అందర్నీ ఆశ్చర్యంతో చూస్తున్నాడు. వాళ్ళ తీరు చూస్తుంటే నా గుండె దడ మరింత పెరిగిపోయింది. ఒళ్ళంతా ఒకటే చెమటలు పట్టేస్తున్నాయి. చేతుల్లోనూ, కాళ్ళలోనూ వణుకు ప్రారంభమయింది. .
“ఒరేయ్ ఉల్ఫా! మా గవర్నమెంటునే ధిక్కరిస్తార్రా మీరు... మిమ్మల్ని కరకర నమిలి మింగేస్తా రోయ్!" అంటున్నాడు ఎర్రటివాడు.
లావాటి మీసాలవాడూ నా జేబుల్ని వెతికాడు.
రెండు కవర్లు దొరికాయి. వాటిని టేబులు మీద ఉంచారు. అందులో ఒకటి గులాబీ రంగు కవరు. దాన్ని చూస్తూనే నాకు ప్రాణం లేచి వచ్చింది. అమ్మయ్య మంచి సమయంలోనే దొరికింది. ఇక వీళ్ళు ఆ కవర్లోని ఉత్తరం చూసి నన్ను వదిలేయాల్సిందే. అందులో మా మేనేజరు నన్ను ఫ్రిజ్ రిపేరు పనిమీద పంపిస్తున్నట్లు ఆర్డరు వేసి ఉంది. "సార్, ఆ లెటరు చదవండి" అన్నాను. ఆత్రంగా లావు మీసాలవాడు ఓ నిమిషం సేపు ఆ ఉత్తరాన్ని చదివినట్టు తల ఆడిస్తూ "మీ ఉల్పా వాళ్ళు ఇలాంటివి ఎన్నయినా తయారుచేయగలరు" అన్నాడు. దాంతో ఉన్న ఒక్క ఆశ కూడా ఆరిపోయింది.
"సార్... సార్ నా మాట కొంచెం వినండి.... నిజంగా ఫ్రిజ్ మెకానిక్ ని... కావలసిస్తే మా డోల్విన్ కంపెనీకి ఫోన్ చేసి కనుక్కోండి సార్" బతిమాలుతూ అడిగాను.
“దిక్కుమాలిన ఉల్ఫావాళ్ళు చెప్పిన మాటలు వినడానికి కాదు, మేము ఉంటోంది. మేము అంటున్నాము - నువ్వు ఉల్ఫా వాడివేనని. ఇద్దీ హోటల్ వాలా! మాకు పది టీలు ఇవ్వు" అంటున్నా లావు మీసాల వాడు.
ఆ మాటలు వింటూ ఉంటే, నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. వాళ్ళంతా సైనికులా అనిపించడం లేదు. యమకింకరుల్లా కనిపిస్తున్నారు. అందర్లోకి ఆ ఎర్రటివాడిని చూస్తూ ఉంటే మహాక్రూరంగా కనిపిస్తున్నాడు.
“ఒరే ఉల్ఫా! నీ సూట్ కేసు తెరు” అన్నాడు ఎర్రటివాడు, నా కణతల మీద తుపాకీ గురిపెట్టి,
“అవును.... ఎంత మూర్ఖులం రా మనం! అసలయింది సూట్ కేసే కదా!" అంటూ లావు మీసాలవాడు నల్లటివాడికి సూట్ కేసుని అందిస్తూ, మళ్ళీ తనే అన్నాడు. “ఒరే, జాగ్రత్త! అందులో బాంబులు ఉంటాయి. నిజానికి ఆ పెట్టెలో ఏవో ఉన్నట్టు అనుమానించే కదా, వీడిని బస్సు దించేసింది. సూట్ కేసుని గాలికి వదిలేసి వీడిని సతాయిస్తున్నాం".
"అవునవును.... పగల కొట్టేస్తా సూట్ కేసును” అంటున్నాడు గంటు ముక్కువాడు, తుపాకి మడమ ఎత్తుతూ.
- “ఒరే పిచ్చోడా. నిన్ను అందుకేరా 'పూల్ అని హవల్దారు తిట్టేది. ఆ తుపాకీ మడమతో సూటికేసు పగల గొడితే అందులో ఉండే బాంబులు పగిలిపోవా?” అన్నాడు నల్లటి వాడు.
" "కరెక్టేరోయ్. బాగా చెప్పావ్, రేయ్, ఉల్ఫా, నీ తాళం చెవితో తియ్యి" అన్నాడు గంటుముక్కు వాడు నన్నుద్దేశించి.
మెల్లగా వణుకుతున్న చేత్తో సూట్ కేసు తాళం తీశాను. అందరూ ఒక్కసారిగా తొంగి చూశారు.
“ఒరేయ్! టైం బాంబులు రోయ్ అన్నీ... వాట్ని తాకకండి - వీడు నిజంగా ఉల్పానే” అన్నాడు నల్లటి వాడు.
"సా సా సార్! ఇవి కావు.... ఇందులో ఉన్నవి బాంబులు కావు సార్. ఇవి ఫ్రిజ్ రిపేరు సంబంధించిన థర్మోస్టాట్, రిలే, స్మాల్ గ్యాస్ సిలిండర్ - తక్కినవి స్పానర్లు, స్క్రూడ్రైవరు, కటింగ్ ప్లేయర్ సార్' అన్నాను.
“ఒరేయ్, ఉల్ఫా! దాన్ని తీసుకో” అన్నాడు లావు మీసాలవాడు. నా, కణతల మీద తుపాకీ ఒత్తిడి మరింత పెరిగింది. వాడు తీసుకోమంటోంది థర్మోస్టాట్ ను. అది పసుపు రంగులో చదరంగా రెండు సెంటిమీటర్ల మందంతో ఉంటుంది. అందువల్ల దాన్ని టైమ్ బాంబు అనుకున్నారేమో ననుకుని చేతిలోకి తీసుకున్నాను. దాన్నించి వచ్చిన సిల్వర్ వైర్ ని భయం భయంగా చూస్తున్నారు. ఆ
నల్లటివాడు స్మాల్ గ్యాస్ సిలిండర్‌ని, ఎర్రటివాడు నల్లగా ఉన్న 'రిలే' పరికరాల్ని పట్టుకున్నారు. “వీటన్నిటిలోకి పవర్ ఫుల్ బాంబు ఏదిరా?" ప్రశ్నించాడు లావు మీసాల వాడు. “సార్! మీరు అనవసరంగా భయపడి పోతున్నారు. ఈ పరికరాల్లో ఏ ఒక్కటీ బాంబు కాదు."
“స్స్స్స్స్స ' మంటూ శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డారు అందరూ, అది గ్యాస్ సిలిండర్ లోంచి వచ్చింది.
"ఇది గ్యాస్ బాంబు కాదేమిట్రా" అంటూ నల్లటివాడు తుపాకీ మడమతో నా డొక్కలోకి పొడిచాడు. భరించలేని బాధతో కింద పడిపోయి 'అబ్బా' అన్నాను. రెండు నిమిషాల సేపు కోలుకోలేక పోయాను.
నా చొక్కా పట్టి లేపుతూ “మరేమిటిది?” అన్నాడు నల్లటివాడు.
“సార్! మీరు అనుమానంగా చూస్తే అన్నీ బాంబుల్లాగే కనిపిస్తాయి. నిజానికి అది ఫ్రిజ్ లో చల్లదనం ఉండేలా చూసే 'ప్రియల్-12' అన్న గ్యాస్ అందులో ఉంది" వణుకుతున్న గొంతుతో చెప్పాను.
అయినా, ఎవరూ నా మాటలు నమ్మటం లేదు. అనుమానంగా దానివైపే చూస్తున్నారు.
“సార్. నా మాటల మీద మీకు నమ్మకం లేదు. పోనీ ఒక పని చేయండి. వీటన్నిటిని మీరే ఎవరయినా బద్దలు కొట్టండి. వీటిలో ఏ ఒక్కటి పేలినా నన్ను నిర్దాక్షిణ్యంగా చంపి పారేయండి" అన్నాను దీనాతి దీనంగా మొహం పెట్టి..
వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలీదు. నన్ను పక్కనే ఉన్న కుర్చీలో కూచోమన్నారు. నిస్సత్తువగా కూచుండిపోయాను.
వాళ్ళు టీలు తాగుతూ నా సూట్ కేసునే చుట్టూ చూస్తూ ఉండిపోయారు. నల్లటివాడు నా పక్కనే కూచుని టీ తాగుతూ ఉన్నాడు.
"ఏం చేసేదిరా భగవంతుడా. నువ్వే దిక్కు!" అంటూ గట్టిగానే గొణుక్కున్నాను. “నీవు తెలుగువాడివా?" నల్లటివాడు అడిగాడు. అవునన్నాను, వాడి అరవయాస తెలుగుతో బిత్తరపోతూ, “మాది మదరాసు యా! మీ ఊరూ?" అడిగాడు.
నా ప్రాణం లేచి వచ్చింది..... ఆశలు చిగురించాయి. “నేను ఆంధ్రప్రదేశ్ వాడిని.... మా ఊరు అనంతపురం సార్" అన్నాను. "
“నాకు కొంజెం కొంజెం తెలుగు వచ్చు యా! మా బంధువులు శానామంది చిత్తూరులో ఉండారు యా!"
“అట్లానా - చూడండీ! మీ వాళ్ళు ఆంధ్ర వాడ్ని నన్ను ఉల్ఫావాడిని అని అంటున్నారు". “మరి ఇక్కడేం చేస్తున్నారు?” అడిగాడు నవ్వు మొహంతో.
నా ఉద్యోగాన్ని వివరించాను. 'నీకు కర్మ బట్టింది... మా కంటే ఈ ఆర్మీలో ఈ తిప్పలు తప్పవు. నీకేం యా? ఇంత దూరం వచ్చినావు" అంటూ సానుభూతి ప్రకటించాడు. “సార్, దేవుడిలా దొరికారు. ఎలాగైనా నన్ను రక్షించండి సార్" అన్నాను వణుకుతున్న గొంతుతో.
మేమిద్దరం ఇందాక వాళ్ళకు తెలియని మరో భాషలో మాట్లాడుకోవడాన్ని ఆశ్చర్యంగా గమనిస్తు న్నారు.
నల్లటివాడు వెంటనే లేచి లావు మీసాలవాడిని నాకు దూరంగా తీసుకుని పోయి ఏదో మాట్లాడాడు. పావు గంట గడిచాక నా దగ్గరికి వచ్చారు.
“నీవు వెళ్ళిపోయా" అన్నాడు నల్లటివాడు. దాదాపు పొద్దుగూకుతూ ఉంది. అందరికీ థ్యాంక్ చెప్పి 'బతుకుజీవుడా' అని రోడ్డుమీదకి వచ్చాను. అదృష్టం కొద్దీ వెంటనే గౌహతికి వెళ్ళే బస్సు వచ్చింది. గౌహతి చేరుకున్నా నాలో అదురూ, ఒళ్ళంతా వణుకూ పూర్తిగా మాయమవలేదు.
ఇంటికి వెళ్ళాక నళినితో జరిగినదంతా చెప్పాక గానీ మనసు కుదుట పడలేదు. నళిని కళ్ళలో నీళ్ళు పెట్టుకుంది.
“ఇంక ఆంధ్రకు వెళ్ళిపోదాం పదండి. ఊపిరుంటే ఉప్పు అమ్ముకోవచ్చు" అంటూ ఏడ్చేసింది. మౌనంగా సిగరెట్ కాలుస్తూ కూచున్నాను. -
“ఏమండీ, ఈయన మన ఇంటికి ఒకసారి వచ్చినాడు కదా - బెంగుళూరు అతను అని పరిచయం చేసినారు. వచ్చీరాని తెలుగు మాట్లాడా.....” అంటూ ఇంగ్లీషు డైలీ పేపర్ తెచ్చి చూపించింది.
"అవును, శివశంకర్... ఎందుకు వేసినారే ఇతని ఫొటోని" అంటూ పేపర్ని చేతిలోకి తీసుకున్నాను. అందులో ఫొటో కింద వార్త ఇలా ఉంది.
"ఉల్ఫా తీవ్రవాది మృతి... నిన్న జరిగిన పోలీసుల ఎదురుదాడుల్లో నవగాంగ్ జిల్లాకు చెందిన ఈ ఫొటోలోని వ్యక్తి చనిపోయాడు..”
అది చదివి నిలువెల్లా వణికిపోయాను.
తొలి ముద్రణ: ఇండియా టుడే 6-20-1992
"రేయ్! గిరి బావా! నువ్వూ, మీ తమ్ముడు వంశీ గాడు దేవళం దగ్గరకు రండిరా, ఆడుకుందాం" అని కేక వేశా నేను.
మా బ్యాచ్ లో ఏ రోజు ఏ ఆట ఆడాలో డిసైడ్ చేసేది వాడే. ఒక్కో రోజు గుడ్లు ఆట లేక గోళీలాట, లేక బొంగరాలాట, లేక కుందుడు గుమ్మ, పల్లంచి ఇవన్నీ కుదరక పోతే ఒక గదికి అంతా దుప్పట్లు కట్టేసి చీకటి చేసేసి బూతద్దం ఉపయోగించి ఫిలిం గోడమీద ఫోకస్ చేసి చూడటం. ఈ ఆటలకి పిల్లకాయల్ని తోలుకురావటం, పనిలో పనిగా పెద్దోళ్ల చేత అక్షింతలు వేయించుకోవటం మా ఇద్దరికీ అలవాటే.
"ఈ రోజు ఉప్పు ఆట ఆడుకుందాం రా కిరణు! నేను రఘు గాడిని వాడి తమ్ముడు రమేష్ గాడిని పిల్చుకొస్తా! నువ్వెళ్లి మురళి, సుధీర్, మధు, శీనడి ని కేకేసుకు రా" అని ఉత్సాహపడిపోయాడు వాడు.
నేను లగెత్తా. ముందు మురళిని వాడి తమ్ముడి సుధీర్ గాడి ని దేవళం దగ్గరకు తరిమి, మధూ, శీనళ్ల ను పిలచక రావడానికి వాళ్ళింటికి దౌడు తీశా !
వాళ్ళింటి ముందు ఆగి, గస తీర్చుకుంటూ, "ఒరేయ్! శీనా! ఇంట్లో ఉండావా" అని కేకేశా!. మధు గాడు బయటకి వచ్చాడు. నాకు విషయం అర్థమయ్యింది.
"ఒరేయ్! మధూ, ఉప్పాట ఆడుకుందాం బయటకురారా!" అని ఇంట్లోకి చూస్తూ మళ్ళీ గట్టిగా అరిచా. వస్తున్నా! వస్తున్నా! అంటూ శీనడు బయటకొచ్చాడు.
"వీళ్ళ పాసుగూల! వీళ్ళతో మాకు ఈ రోజు గూడా సావు తప్పదు" అనుకుంటా తోలుకు పోయా వాళ్ళని.
ఆటకి కావల్సిన పదిమంది పిల్లకాయలు పోగవ్వటం తో, ఆట మొదలు పెట్టాము.
ఆటలో భాగం గా ఒరేయ్ మధు, లగెత్తరా! అంటే శీనడు పరుగెత్తటం, ఒరేయ్ శీనా, ఉప్పు అందుకోరా, అంటే మధూ గాడు దిక్కులు చూడటం జరగిపోతున్నాయి.
మా వాళ్ళందరూ, చూశారు, చూశారు, యిక తట్టుకోలేక, అంబాలీస్ అని అరిచారు. ఆట ఆగిపోయింది. నా మీదకి యుద్ధానికి వచ్చారు, "ఒరేయ్! కిరణ్ గా, ఈ రోజు వాళ్ళింటికెళ్లి శీనా అంటే ఎవరొచ్చార్రా! మధు గాడేనా, ఆ సంగతి మాకు ఎందుకు చెప్పలేదురా" అని.
నాకు ఉక్రోషం ఎక్కువయ్యింది. ఏమైనా ఈ కన్ఫ్యూషన్ కి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టెయ్యాలిరా, ఈ సంగతేందో వాళ్ళ అమ్మతోనే తేల్చేద్దామ్ అని పిల్లకాయల్ని కూడగట్టి వాళ్ళింటికి తీసుకెళ్లా.
ఎంత వేగం గా అక్కడికి వెళ్ళామో, అక్కడ జరిగేది చూసేసరికి మేము అంతే వేగం గా బిక్క చచ్చిపోయాము.
మధూ, శీనయ్య వాళ్ళ అమ్మ అయిన జయక్క మరియు మురళి, సుధీర్ వాళ్ళ అమ్మ అయినా సరోజనక్క హోరా హోరీ గా పోట్లాడుకుంటున్నారు. వాళ్ళ చేలో ఉమ్మడి గెనం (కట్ట) మీద గడ్డి ఎవరు కోశారు అనే విషయం మీద. మాకర్థమయిపోయింది ఇది ఇప్పట్లో తేలే విషయం కాదు అని. అయినా వీళ్ళ మొగుళ్ళు అన్నతమ్ముళ్లే కదా, ఈ తోడికోడళ్లు ఎందుకు రోజూ ఎదో విషయం మీద ఇలా పోట్లాడుతూనే వుంటారో మా చిన్న బుర్రలు అర్థమయ్యేది కాదు.
ఇక చేసేది ఏమీ లేక ఈసురో మంటూ ఎవరి ఇళ్ల దారి వాళ్ళం పట్టాము ఆ రోజుటి.
మా ఆటలకి వాళ్ళు ఇద్దరూ కావాలి. వాళ్ళు వస్తే అంతా కన్ఫ్యూషన్. కన్ఫ్యూషన్ తెలుసుకోవడానికి వాళ్ళ అమ్మలు మాకు సందు ఇవ్వటం లేదు. ఒకరోజు గడ్డి మీద ఇంకో రోజు ఇక్కడ కోడి అక్కడ గుడ్డు పెడితే గుడ్డు మాయం అయ్యిందనో లేక ఒకరి పసరం ఇంకొకరి చేలో పడి మేసేసిందనో మాకు సందు ఇవ్వకూడదని వాళ్ళ మానాన వాళ్ళు బిజీ గా ఉంటుంన్నారు. మా ప్రాబ్లెమ్ వినాయకుడి పెళ్లి లా మారిపోయింది.
ఇలా జరుగుతుండగా, ఒకరోజు మా మధు గాడు అలియాస్ శీను గాడు (ఆ రోజు వాడి పేరు శీనయ్య), వాళ్ళ అమ్మ ని మా మూలకడ దగ్గర బస్సు ఎక్కిచ్చి వస్తూ కనపడ్డాడు.
"ఏరా! ఎక్కడికిరా" మీ అమ్మ వెళ్తుంది అంటే, "అల్లూరికి! మా అమ్మమ్మ కి బాగా లేదు. నాలుగు రోజులుండి వస్తుందట" అని చెప్పాడు వాడు.
"అరే! ఎలాగ రా ఈ నాలుగు రోజులు మీ అమ్మా పెద్దమ్మ ల తగవులుండవు. మనకి కాలక్షేపం వుండదే" అంటూ వాడు కోపం గా చూడటం తో ఆగిపోయా.
ఆ మాట సరదాకి అన్నా, మాకు ఆ నాలుగురోజుల కాలక్షేపం నిజం గానే కరువు అయ్యి తెగ విసుగొచ్చేసింది. ఎలాగో ఒకలా గా ఆ నాలుగు రోజులు గడిపేశాము.
అలా కాలక్షేపం లేకుండా నిస్సారం గా రోజులు గడవకుండా వున్న మాకు మా జయక్క రాక ఒక్కా సారి తెలిసిపోయింది, దిగటము దిగటమే మా సరోజనక్కతో, వాళ్ళింటి మునక్కాయలు ఆమె లేనప్పుడు ఎందుకు మాయం అయ్యాయి అనే సాకు మీద.
ఇక మాకు పండగే పండగ.
నాలుగైదు రోజుల తర్వాత ఆ సందడి కి మరలా బ్రేక్ పడింది ఈ సారి సరోజనక్క ఊరెళ్ళటం తో.
మా అమ్మనడిగా నేను, " సరోజినక్క ఎక్కడికెళ్లిందమ్మా! అని.
"అల్లూరుకి వెళ్ళిందిరా"
"అల్లూరా"
"అవునురా! సరోజినక్క వాళ్ళ అమ్మకి బాగా లేదంట"
నా బుర్ర కి ఎదో తడుతుంది. జయక్క! అల్లూరు! జయక్క! వాళ్ళ అమ్మ కి బాగాలేక వెళ్ళొచ్చింది. ఇప్పుడు సరోజినక్క! అల్లూరు! వాళ్ళ అమ్మకి బాగాలేదు. ఏమిటీ కనెక్షన్.
"అంటే! అంటే! జయక్క, సరోజినక్క ఏమవుతారమ్మా!"
"ఏమయ్యేదేముందిరా! నీ మొహం! ఎత్తి కుదేస్తే రెండవుతారు" అన్నది మా అమ్మ తన సెన్స్ అఫ్ హ్యూమర్ కి తానే మురిసి పోతూ.
"అబ్బా! చెప్పమ్మా! వాళ్లిద్దరు, అక్కా చెల్లెళ్ళా?"
"అవునురా! నీదుకు తెలీదా ఇంత వరకు, అన్నాతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ల ని పెళ్లి చేసుకున్నారు"
"ఇదెలా సంభవం, యీ ప్రపంచం లో! ఇంతలా తగవులేసుకొనే, అక్క చెల్లెళ్లు" అని మూలిగా నేను
"అయితే పెద్ద అయ్యాక, మీరు అలా వుండకండిరా" అన్నది మా అమ్మ.
సరే! సరే ! అంటూ అక్కడనుండి తుర్రుమన్నా నేను యీ రహస్యం నా స్నేహితులతో పంచుకోవాలి అనే తహ తహ తో.
ముందు అందరు బోల్డు హాశ్చర్య పోయారు. ఈ సీక్రెట్ కనుక్కున్న నన్ను ఈర్ష్యతో చూసారు.
వాళ్ళ కోపమంతా, మురళి, సుధీర్, మధు శీనయ్య ల మీద మళ్లింది. మా పెద్దమ్మ, మా చిన్నమ్మ అని వేళ్ళు చెబుతుంటే వాళ్ళ పెదనాయన, వీళ్ళ చిన్నాయనల పెళ్ళాలు అని అనుకున్నాం కానీ, వాళ్లిద్దరూ అక్క చెల్లెళ్లు అనే రహస్యం దాచి ఇన్నాళ్లు కుట్ర చేసారు అని.
విషయం పాత బడి పోయాక, మళ్ళీ మా అసలు సమస్య కి పరిష్కారం ఇంకా దొరక లేదు అని గుర్తు వచ్చింది మా జనాలకి. మాలో ఒకడు, "ఐడియా" అని అరిచాడు. "ఏమిటిరా! అలా పిచ్చి కేక పెట్టావు" అంటే, "సరోజినమ్మ! ఊర్లో లేదు అంటే జయమ్మ కి ఫ్రీ టైం చాలా ఉంటుంది! కాబట్టి మన సమస్య వెంటనే తేల్చేసుకోవచ్చు" అన్నాడు. "అబ్బా! నువ్వు సూపర్ రా" అని జయక్క వాళ్ళింటికి పరిగెత్తాము.
వెళ్లి, "జయక్కా! జయక్కా ! బయటికి రా" అని కేకలు వేశాం.
ఆమె అప్పుడే చేలో నుండి వచ్చినట్టుంది. వాళ్ళ పిల్లకాయలు దేవళం నుండి వచ్చేలోపల ఏదో ఉడకేసి పెడదామని, పొయ్యి రాజేస్తూ, మధ్యలో మేము అరిచేసరికి, చేత్తో వూదుడు గొట్టం పట్టుకొని, "ఏందిరా ! మీ గోల అంటూ" వచ్చింది.
మా జయక్క నోటికి చాలా మంది పెద్దకాయలే దడుచుకుంటారు, మా పిల్లకాయలకైతే నిక్కర్లు తడుస్తాయి. మా వాళ్లంతా నన్ను ముందుకు తోసి నా వెనక ఒక్కోడు ఒక్కో లైన్ లో పది లైన్ లు కట్టారు.
"ఈ రోజు నీ కొడుకుల పేర్ల విషయం తేలిపోవాలి. మేము ఈ గందరగోళం ఇక తట్టుకోలేం" అని మా జయక్క నోరు ఎంత పెద్దదో గుర్తు తెచ్చుకొని అంత కన్నా ఎక్కువగా నా గొంతు వినపడాలి అని నా గొంతు పగిలేలా అరిచా.
విచిత్రం గా జయక్క నవ్వింది. "నాకేం చెవుడు లేదబ్బాయ్యా, సంగతేందో చెప్పు"
"నీ కొడుకులే అసలు సంగతి. వాళ్లకి తోచినప్పుడల్లా! పెద్దోడి పేరు చిన్నోడు, చిన్నోడి పేరు పెద్దోడు మార్చుకుంటారు. ఆటల్లో మేము చస్తున్నాము వీళ్ళ వల్ల.
"నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అబయా! అందుకే చిన్నోడికి శీనయ్య అని పెట్టుకున్నా! వాడికేమో అది ఇష్టం లేదు. అందుకే వాళ్ళ అన్న పేరు లాక్కుంటాడు. వాడేమో వాడి పేరు వీడికి ఇచ్చి మరలా నా పేరు నాక్కావాలి అని లాక్కుంటాడు. సరే ఈ రోజు నుండి పెద్దోడు మధు, చిన్నోడు శీనయ్య" అని నామకరణ మహోత్సవం చేసేసింది ఆవిడ. మా పిల్లకాయలం పండగ చేసుకున్నాం అక్కడే.
ఆ తర్వాత మేము పెద్దోడ్ని ఎప్పడు మధూ అనే పిలిచే వాళ్ళం. పాపం చిన్నోడుకూడా ఇక చేసేది ఏమీ లేక వాడి పేరుకే వాడు ఫిక్స్ అయిపోయాడు. అలా మేము ఒక రహస్యాన్ని ఛేదించాము, ఒక ప్రాబ్లెమ్ ని సాల్వ్ చేసుకున్నాము. కానీ ఆ పెద్దోళ్లు మాత్రం వాళ్ళ మధ్య ప్రాబ్లెమ్ ని అలాగే ఉంచేసుకున్నారు. బహుశా ప్రోల్ సాల్వ్ అయిపోతే వాళ్లకు తోచదనే భయం తో.
వాడు అంటే ఆ చిన్నోడు ఆ తర్వాత వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. చిన్న వయస్సులోనే వాళ్ళ ట్రాక్టర్ తో దుక్కి దున్నటం లో తిరుగులేదు అనిపిచ్చుకున్నాడు. వూర్లో వాళ్ళు కూడా ట్రాక్టర్ తో పని ఉంటే వాడినే పిలిచే వాళ్ళు. అలాటి మంచి రైతుగా పేరు తెచ్చుకోవాల్సిన మా శీనయ్య, హెపటైటిస్ తో చిన్న వయస్సులోనే చనిపోవటం మాకు చాలా బాధ.
పెద్దోడు మధు చక్కగా చదువుకొని, హైదరాబాద్ లోనే స్థిరపడ్డాడు. వాడికి ఫోన్ చేసి నేను మాటల్లో పడి ఒక్కోసారి సీనయ్యా అంటా. వాడు కూడా నవ్వేసి నన్ను ఒక్కోసారి కిరణన్నా అనో, ఇంకో సారి హర్షన్నా అనో అంటాడు. నీ పేరు నాలుగో క్లాస్ దాకా కిరణన్న, నువ్వు నాలుగు నుండి ఆరుకి జంప్ చేసినప్పటినుండి నీ పేరు హర్షన్న అని గుర్తు చేస్తాడు. పేరు లో ఏముందిరా పెన్నిధి అని అనుకున్నా కొన్ని పేర్ల వెనక కొన్ని జ్ఞాపకాలు. అంతే.
'వార్తాహరులు' అనే కథ, రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు.
'తూరుపు గాలులు' అనే సంపుటం లోనిది.
మనదేశంలో బ్రిటిష్ వారు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఏర్పరచడానికి దారి తీసిన పరిస్థితులను ఆధారంగా తీసుకొని రాసిన కథ.
మెరైన్ ఇంజనీర్ గా పని చేసిన సుధాకర్ గారు రాసిన 'యారాడ కొండ' ఆటా నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నవల.
'హిస్టారికల్ ఫిక్షన్' రాస్తున్న అతి కొద్దిమంది రచయితల్లో సుధాకర్ గారు ముందు వరసలో వుంటారు.
కథను మీకందించడానికి అనుమతినిచ్చిన సుధాకర్ గారికి కృతజ్ఞతలు.
'తూరుపు గాలులు' పుస్తకం కొనడానికి కావాల్సిన లింక్ - https://amzn.to/3wGaJmX
'యారాడ కొండ' కొనడానికి -
https://amzn.to/3fwoQW9
ఆనాటి వేసవికాలపు ఆదివారం రోజున సూర్యోదయం కాగానే మార్నింగ్ సిక్నెస్ ని తాజా గాలులతో విదిలించుకోవాలని సూజన్ తన హౌస్ కోటులోనే వరండా మీదకి వచ్చి వాలుకుర్చీలో జేరబడింది. దూరంగా చెట్ల వెనుక తళతళా మెరు స్తూన్న గంగానదిపై బద్దకంగా కదులుతోన్న తెరచాప పడవల్ని చూస్తూ మైమరచి పోయింది. అదే అలనాటి అధ్యాయపు ఆఖరి మనోహర ప్రశాంత దశ్యం అని ఆమెకు అప్పుడు తెలియలేదు. ఖాళీ కుండలతో నదివైపు నడుస్తున్న స్త్రీల నవ్వులూ, తనకు అర్థం కాని వారి హిందుస్తానీ మాటలూ గాలివాటాన స్పష్టంగా వినిపించ సాగాయి. వాటిని నెమ్మదిగా, నిర్దాక్షిణ్యంగా చీలుస్తూ దగ్గరవుతున్న గుర్రపుడెక్కల చప్పుడుతోనే తన జీవితం పూర్తిగా తలక్రిందులవుతుందనీ, ఇండియాలో తన కాపురం కుప్పకూలుతుందని ఆమె అప్పుడు ఊహించలేదు.
అతడు స్వారీ చేస్తున్న గుర్రంతోబాటు మరో గుర్రాన్ని వెంటబెట్టుకొని వచ్చిన రౌతు రెండింటినీ గేటు ముందున్న వేపచెట్టుకి కట్టి లోపలికి బిరబిరా రావడం ఎందుకో సూజన్కి ఆందోళన కలిగించింది. మళ్లీ కడుపులో వికారంగా అనిపిం చింది. గుబురు మీసాల రౌతు 'కమాండర్ సాబ్ మర్రేసాబ్ ని వెంటనే తీసుకు రమ్మని పంపించారు' అన్నాడు.
రెండో గుర్రం ఎందుకో సూజన్ కి అర్థమైంది. అంటే ఈ ఆదివారం కూడా చర్చికి వెళ్లడం కుదరదన్నమాట. ఫాదర్ మార్లిన్ మెత్తగా పెట్టబోయే చివాట్లు తినక తప్పదు. తనకు ఈ నాలుగు నెలల్లో పట్టుబడిన హిందుస్తానీ ముక్కల్ని తడబడ కుండా ప్రయోగిస్తూ
'ఠీక్ హై' అని లోపలికి నడిచింది. జాన్ ఇంకా గుర్రుపెడుతూ నిద్రపోతున్నాడు. రాత్రి విస్కీ ఎక్కువైనట్లుంది.
ఆదివారం కదా ఆలస్యంగా లేవొచ్చు అనుకున్నాడు పాపం. లేపక తప్పదు. ఉలిక్కిపడి తటాలున లేచి కూర్చున్నాడు.
‘సీఓ నిన్ను వెంటనే రమ్మన్నాట్ట. గుర్రం ఇచ్చి సిపాయిని పంపించాడు. ఏమయ్యింది మళ్లీ?' అడిగింది.
దోమతెరను తప్పించి తన భారీకాయాన్ని బయటకు తెస్తూ 'ఏముంది? ఈ సిపాయిల గొడవే అయ్యింటుంది' అన్నాడు జాన్.
వంటవాడు కాలియా పొద్దున్నే బజారుకి పోయాడు. ఆదివారం కదాని మాంసం తేవడానికి తనే పంపింది. పనమ్మాయి మరియమ్ చేసిన చాయ్ తాగి, గబగబా షేవ్ చేసుకొని డ్రెస్సు వేసుకొని బయటకు పరుగెత్తాడు జాన్. క్రికెట్ మాచ్ ఆడడానికి బయిల్దేరిన బడిపిల్లవాడి ఉత్సాహం జాన్‌లో కనిపించింది సూజన్ కళకి. ఈ సిపాయిల అలజడి కాదుగానీ జాన్ విల్ఫ్రెడ్ మర్రే, సీనియర్ టెలిగ్రఫీ ఆఫీసర్, నార్త్ వెస్టర్న్ ప్రావెన్స్ గారికి మునుపెన్నడూ లేనంత గిరాకీ, ప్రాముఖ్యత ఏర్పడి పోయాయి. కొత్తగా నెత్తిన పడ్డ ఈ కిరీటకాంతుల ధగధగల్ని పూర్తిగా అస్వాదిస్తున్నాడని సూజన్కి అర్థం అవుతూనే ఉంది. భర్తకి సర్వత్రా లభిస్తూన్న గుర్తింపుని చూస్తూంటే తొలిదినాల్లో ఆమెకు ఒకింత గర్వంగా కూడా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం రోజురోజుకీ పరిస్థితి మారిపోతోంది.
మొదట్లో అక్కడక్కడ జరుగుతున్న సిపాయీల అల్లర్లు', 'కొంతమంది సిపాయీల ఆగడాలు' అంటూ వచ్చిన కుంఫిణీ అధికారులే ఇప్పుడు ఏకంగా 'సిపాయిల తిరుగుబాటు' అని యథాలాపంగా వాడేస్తున్నారు. 'మొత్తం ఉత్తర హిందూస్తాన్ అంతా అల్లకల్లోలంగా ఉంది' అనేస్తున్నారు. అంతేగాని మిగతా వివరాలేవీ చెప్పడం లేదు. 'ఢిల్లీ తిరుగుబాటుదార్ల స్వాధీనంలో ఉంది' అంటున్నారు. మరో పక్క 'అంతా తమ కంట్రోల్లోనే ఉంది' అంటున్నారు. ఢిల్లీ, కాన్పూర్, మీరట్‌లలో పరిస్థితి పూర్తిగా విషమించినా తాముండే మిర్జాపూర్ పరిసరాలు చాలా వరకూ ప్రశాంతంగానే ఉన్నాయి. గంగానదీ తీరాన తిరుగుబాటుదార్ల కదలికలను గమనిస్తూ వారిని అడ్డుకొనే బాధ్యతను తమ బెటాలియన్ కి అప్పగించారనీ, అందు చేత పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా తిరుగుబాటుదార్లతో తలపడే అవసరం ఉండబో దనీ జాన్ ధైర్యం చెప్పాడు. తను ఇప్పుడున్న స్థితిలో ఎక్కువ చెప్పడం ఇష్టంలేక కాబోలు, జాన్ కూడా అంతగా ఏమీ చెప్పడం లేదు. ఏం దాస్తున్నాడో తెలీదు. దీంతో సూజన్ ఆందోళన మరింత ఎక్కువైంది.
'మీ ఆయన టెలిగ్రఫీ ఆఫీసర్ కదా అన్నీ తెలుస్తాయే! నీకేమీ చెప్పడా?' అని సూజన్ మొహం మీదే అన్న ఆఫీసర్ల భార్యలూ ఉన్నారు.
ఆఫీసర్ల భార్యల నడుమ, సిపాయీల బారకాసుల్లో, నవుకర్ల సంభాషణల్లో, బజార్లలో, వీధుల వెంటా పుకార్లు రాజుకుంటున్నయి. చెలరేగి వ్యాపిస్తున్నాయి. అయితే సూజన్ చెవులకి తరచూ వినిపించే వ్యాఖ్యలు రెండే: ఆడవాళ్లనీ, పిల్లల్నీ త్వరలోనే కలకత్తా పంపించేస్తారనీ, ఇళ్లల్లో పని చేసే నవుకర్లని ఒక కంట కనిపె డుతూ ఉండాలనీను. ఒక పక్క ఈ ఆందోళనల్లో, అనిశ్చితుల్లో తను మగ్గుతూ ఉండగా మరోపక్క జాన్‌లో ఉబికివస్తోన్న అత్యుత్సాహాన్ని చూస్తూంటే సూజన్ కి కంపరం వస్తోంది. కమాండింగ్ ఆఫీసర్‌తో ఎడతెగని మంతనాలు, తరచూ సాయం త్రాలు మెస్‌లో అతిగా తాగడాలూ, రోజూ ఆలస్యంగా ఇంటికి రావడం, వేళా పాళా లేకుండా బారక్సుకి పరుగులు తీయడం ఇవన్నీ దుర్భరంగా తయారయ్యాయి.
'ఈ వేసవిలో కలకత్తాకి బదిలీ కావడం ఖాయం. అక్కడ మంచి డాక్టర్లున్నారు, నీ ప్రసవం అక్కడే' అంటూ ఉండిన జాన్ ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. తను ఇలా మొదటిసారిగా గర్భిణిగా ఉన్నప్పుడు జాన్ తనకు మరింత దగ్గరవుతాడనీ, ధైర్యం చెబుతాడనీ అనుకుంటే ఇలా అయింది. ఈ సిపాయీల తిరుగుబాటేదో జాన్ని తన నుండి దూరం చెయ్యడానికీ, ఇద్దరి మధ్యా అగాధాన్ని సష్టించడానికి వచ్చిన ట్లుంది తప్ప మరోటి కాదు అనుకుంది సూజన్.
నిన్న రాత్రి జాన్ ని 'ఈ గొడవలన్నీ ఎప్పటికి ఓ కొలిక్కి వస్తాయి? మునపటి ప్రశాంతత మళ్లీ ఎప్పుడు తిరిగొస్తుంది?' అని అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం ఆమెను మరింత కంగదీసింది.
“ఇదిగో సూజన్! నా మాటలు జాగ్రత్తగా విను. ఈ తిరుగుబాటు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అయితే దీని మూలంగా ఒక గొప్పమంచి జరిగింది. టెలిగ్రఫీ తడాఖా ఏమిటో కుంఫిణీలో ప్రతీ ఒక్క బడుద్దాయికీ తెలిసొచ్చింది. క్రిందటి సంవత్సరం నాటికి కలకత్తాలో కొంతమంది సీనియర్ ఆఫీసర్లు మాత్రమే దీని విలువ తెలుసుకున్నారు. ఇప్పుడో ? మారుమూల పోస్టింగుల్లో ఉన్న జూనియర్ ఆఫీసర్లు కూడా తమ ప్రాంతాలకి టెలిగ్రఫీ సర్వీసులు కావాలని పై అధికారుల్ని బతిమాలుకుంటున్నారు. ఈ గొడవల మూలంగా గంగానదీ ప్రాంత మంతటా ఇరవై కొత్త టెలిగ్రఫీ స్టేషన్లు నెలకొల్పమని నిన్ననే ఆదేశాలు వచ్చాయి. శుక్రవారానికల్లా యంత్రాలూ, తీగెలు వచ్చేస్తున్నాయి కలకత్తా నుంచి పడవల మీద. ఈ పనికి నన్నే ఇన్-ఛార్జ్ చేసారు. ఇది సరే, ఈ సిపాయీల గొడవలు కడ తేరనీ అప్పుడింక చూసుకో. కొత్త స్టేషన్లని ఏర్పరచడంలో నాకున్న అనుభవం ఇంకెవరికీ ఉండబోదు. ఈ దేశం మొత్తాన్ని పెషావర్ నుండి రంగూన్ వరకూ, మలబార్ నుండి సిమ్లా వరకూ టెలిగ్రఫీ తీగెలు ఎలా పెనవేసుకు పోతాయో నువ్వే చూస్తావు, డాట్-డాష్ డాట్ల మార్ఫ్ కోడుతో ఈ దేశం మార్మోగిపోతుంది. అసలీ దేశం ఎంత పెద్దదో ఊహించగలవా? మొత్తం గ్రేట్ బ్రిటన్‌కి ఓ ఇరవై రెట్లు ఉంటుంది. అంతే కాదు, ఈ దేశంలో ఉన్న వైవిధ్యమైన జాగ్రఫీ, వాతావరణ మండలూ ఏ ఒక్క దేశంలోనూ లేవు- నాకు తెలిసి. నదులూ, సముద్రాలూ, అడవులూ, కొండలూ, హిమాలయాలూ, ఎడారులూ సర్వం ఒకే ఒక్క దేశంలో, ఇలాంటి చోట తపాలా, రైల్వే, టెలిగ్రఫీ వ్యవస్థల్ని సృష్టించి నిర్వహించాలంటే అదేమన్నా సామాన్యమైన విషయమా? మారుమూల ప్రాంతాలకి ఉత్తరాలు బట్వాడా కావాలంటే రైల్వేలుండాలి. రైళ్లు నడవాలంటే ప్రతీ స్టేషన్లోనూ టెలిగ్రఫీ ఉండాలి. అందు చేత టెలిగ్రఫీయే అన్నిటికీ మూలం. టెలిగ్రఫీయే భవిష్యత్తు.
ఇంత పెద్దదేశాన్ని చెప్పుచేతల్లో పెట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు తాజా సమాచారం కావాలి. అంటే విస్తారమైన టెలిగ్రఫీ వ్యవస్థ ఉండి తీరాలి. అదే నాడీవ్యవస్థ. ఇవాళ నన్నంతా నెత్తిన పెట్టుకుంటున్నారంటే అదంతా టెలిగ్రఫీ మహిమ. ప్రస్తుతం ఇది సరికొత్త శాస్త్రం. దీని గురించి ఎవడికీ ఏమీ తెలీదు ముఖ్యంగా కుంఫిణీలో. అందుచేత మన భవిష్యత్తు దివ్యంగా ఉంది. నీ భర్త ఇండియన్ టెలిగ్రఫీ సర్వీస్ కి డైరెక్టర్ జనరల్ గా రిటైర్ అయినా నువ్వు ఆశ్చర్య పోనక్కర్లేదు. అదే జరిగితే కలకత్తాలో హుగ్లీ నది ఒడ్డున ఓ పెద్ద బంగాళాలో ఉంటాం వచ్చే పోయే స్టీమర్లని చూస్తూ. ప్రతీ గది లోనూ పంఖాలూ, వాటిని లాగేందుకు మనుషులూ, నవుకర్లూ, చాకర్లూ, గుర్రపు బగీలూ, గుర్రాలకి మాలిష్ చేసే వాళ్లు....' అంటూ నిద్రలోకి జారుకోబోతూ ఆ 'అన్నట్టు నీకెలా ఉంది? మళ్లీ వాంతులయ్యాయా? డాక్టర్ కిల్బర్న్ కి చెప్పాను. రెండు రోజుల్లో మన ఇంటికే వచ్చి చూస్తానన్నాడు. రేపు ఎలానూ చర్చిలో కలుస్తాం అనుకో' అని ముగించాడు.
సూజన్ కి చిర్రెత్తుకొచ్చింది. 'ఇప్పుడా నా గురించి అడగడం?' అందామను కొని, తమాయించుకొని, - 'పొద్దున్న మాట్లాడదాంలే, ఇంక నోర్మూసుకొని పడుకో. విస్కీ తగ్గించు. ఈ వేడికీ విస్కీకీ నప్పదు' అంది. దోమతెర నాలుగు మూలల్నీ సర్ది తనూ జేరబడింది గాని నిద్ర ఎగిరిపోయింది. ఇవాళ జాన్ అన్నదాంట్లో ఒక కొత్త విషయం తెలిసింది. ఈ గొడవలు ముగిసాక యినా జాన్ వేళకి వస్తాడనీ, ఇంటిపట్టున ఉంటాడనీ తను పెట్టుకున్న ఆశలు కాస్తా అడుగంటాయి.
అలా గడిచిన నిద్ర చాలని రాత్రిని గుర్తుచేసుకుంటూండగా మరియమ్ వరండాలోకి వచ్చి 'నాస్తా లగాదియా, మేమ్ సాబ్' అంది.
అప్పటికే ఎండ ఛుర్రుమంటోంది. వాలు కుర్చీమీంచి లేచి లోపలికి నడుస్తూ, 'కాలియా కహాగయా?' అనడిగింది సూజన్. 'పొద్దున్నే బజారుకి వెళ్లి తాజా మేకమాంసం తెమ్మని మీరు నిన్న చెప్పారుకదా. తేవలసిన మిగతా వస్తువులు కూడా చాలానే ఉన్నాయి. బజార్లో ఆలస్యం అయినట్లుంది. అందుకని నేనే నాస్తా తయారు చేసాను'
'ఈ రోజు సాబ్ భోజనానికి రాడు. చర్చికి వెళ్లేది కూడా లేదు. కాలియా వసే ఈ పూటకి కిచిడీ చెయ్యమని చెప్పు. మాంసం రాత్రికే'
'అలాగే, మేమ్ సాబ్' అని మరియమ్ వంటింట్లోకి వెళ్లిపోయింది కూరలు తరగడానికి,
మరియమ్ ఉడికించి పెట్టిన దలియా తిని కాఫీ తాగాక తన తల్లికి ఉత్తరం రాద్దామని మేజా వద్ద కూర్చుంది సూజన్. ఇంగ్లాండులో ఉన్న తల్లీ, అక్కా ఈ మధ్య తరచూ గుర్తిస్తున్నారు. కాని రెండు వాక్యాలు రాసాక ఇక ఉత్తరం ముందుకి సాగ లేదు. ఉక్కపోత మొదలైపోయింది. బారెడు పొద్దెక్కిందిగాని ఈ కాలియా ఇంకా రాలేదు. జాన్ భోజనానికి రాడు కాబట్టి సరిపోయింది. అయినా వీడికీ మధ్య వ్యాపకాలెక్కువైపోయాయి. మరియమ్ వాణ్ణి బాగానే వెనకేసుకుంటూ కాపాడుకుంటూ వస్తోంది. వీళ్లరిమధ్యా ఏదో వ్యవహారం సాగుతున్నదని ఈ మధ్య సూజన్కి అనుమానం కలుగుతోంది.
మరియమ్ పాతికేళ్ల ముసల్మాన్ అమ్మాయి. బక్కపల్చగా, తెల్లగా ఉంటుంది. కాలియా హిందువు. ముప్పై అయిదు ఉంటాయేమో. నల్లగా, దృఢంగా ఉంటాడు. ఈ ఇద్దరికీ ఎలా కుదిరిందో? ఏమైతేనేం, ఇద్దరికిద్దరూ మంచి పనిమంతులు. ఒక్కసారి చెబితే గ్రహించేస్తారు. కాలియాని ఆఫీసర్ల మెస్ నుండి తప్పించి తమకు వంటవాడిగా కుదర్చడానికి సీఓగారి చలవే కారణం. సీనియర్ ఆఫీసర్ల భార్యలు కొంతమంది కాలియా సేవల కోసం విశ్వప్రయత్నం చేసినా అవి తమకే దక్కేటట్టు చేయడం నాలుగు నెలల క్రితం ఈ పోస్టింగ్ రాగానే సూజన్ కోసం జాన్ మర్రే సాధించిన మొదటి ఘనవిజయం.
మరియమ్ ఈ మధ్యనే వచ్చింది. రెండు నెలలై ఉంటుందేమో. కాలియాకు అంత గిరాకీ ఏర్పడడానికి కారణాలున్నాయి. మెస్ లో మొదట బేరర్ గా , ఆ తర్వాత పెద్ద వంటవాడికి అసిస్టెంటుగా చాలాకాలం పనిచేసి దొరల అలవాట్లు, వంటలూ మహా చక్కగా నేర్చుకున్నాడు. హిందువులు గొడ్డు మాంసం ముట్టరు. ముసల్మాన్లు పంది మాంసం తినరు. ఈ సంగతి తనకు ఇంగ్లండులో ఉన్నప్పుడే తెలుసు. కాలియా హిందువేగాని బాగా కింది కులం వాడట. వాళ్లకి అలాంటి పట్టింపులు ఉండవుట. ఈ ముక్క జాన్ చెప్పాడు.
ఏమైతేనేం ఈ వెసులుబాటు దొరలకి మాబాగా ఉపయోగపడింది. అయినా ప్రపంచంలో ఇంకెక్కడా లేని కులాలు ఈ హిందూస్తాన్లో ఎందుకున్నాయో? ఫాదర్ మార్టిన్ ని అడగాలి. ఫాదర్ అన్నట్లు ఈ దేశం అంతటా క్రైస్తవం వ్యాపిస్తేనే కులాలు మాయమవుతాయేమో. మొన్న ఇదేమాట జాన్ అంటే “ఈ దేశపు మతవ్యవహా రాల్లో కలగజేసుకుంటే మొత్తం బెడిసికొడుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే' అన్నాడు.
సూజన్ కునికిపాట్లు పడసాగింది. రాత్రి సరిగ్గా నిద్రలేకపోయినదాని ఫలితం. ఉత్తరం రాసే ప్రయత్నం మానుకొని లేచి పడకగదివైపు నడుస్తూ 'మరియమ్, కాసేపు రెస్టు తీసుకుంటాను, వంట కాగానే లేపు' అంది.
మరి కొద్దిసేపట్లోనే కాలియా ఇంట్లోకి వచ్చాడు కావడితో సామాన్లు మోసుకొచ్చిన కూలీని వెంటబెట్టుకొని. కూలీ అతను మంచినీళ్లు తాగి పైసలు తీసుకొని బయటకు నడవగానే మరియమ్ ఆత్రుతగా అడిగింది: ''ఏమైంది, కాలియా ? బషీర్ భాయిని కలిసావా ? ఏమన్నాడు?"
'ష్! ఇక్కడేమిటీ మాటలు? వంటయ్యాక మాట్లాడుకుందాం'
“'ఫరవాలేదు. మేమ్ సాబ్ మంచి నిద్రలో ఉంది. ఈ పూటకి కిచిడీయే. చేయడం కూడా అయిపోయింది. వంటింట్లోకి పద. త్వరగా చెప్పు"
'బషీర్ భాయిని కలిసాను. కొత్త టెలిగ్రఫీ యంత్రాలు వస్తున్నాయనీ వాళ్లింక తొందరగా ఏదో ఒకటి చెయ్యాలని చెప్పాను'
'ఏమన్నాడు?"
'అమీనుద్దీన్ సాబ్ దగ్గరకు తీసికెళ్లాడు. ఆయనకీ అదే ముక్క చెప్పాను. ముసలాడు ఏమన్నాడో తెలుసా? సైతాను కనిపెట్టిన సాధనం టెలిగ్రఫీ అన్నాడు. సమాచారం అందించేవరకే అయితే తన పావురాల ముందు ఇవేవీ పనికి రావన్నాడు. హిందువుల గుడి, ముసల్మాన్ల మసీదు, అలాగే శ్మశానం, సమాధి అని చూడకుండా ఈ దొరలు ఎక్కడ పడితే అక్కడ స్తంభాలు పాతి తీగెలు లాగు తున్నారు, ఈ పాపం ఊరికే పోదన్నాడు. తూటాల మీది కొవ్వులాగా ఇది కూడా అందరి మతాల్ని భ్రష్టు పట్టించేందుకు దొరలు చేస్తున్న కుట్ర అని మండిపడ్డాడు'
'బషీర్ భాయి అక్కడే ఉన్నాడా?'
బషీర్ మరియమ్ కి పెద్దనాన్న కొడుకు. అతనంటే చిన్నప్పటి నుండి ఆమెకు గొప్ప గురి. ఇటీవల అతని తమ్ముళ్లు ఇద్దరు కుంఫిణీ కొలువు వొదులుకొని పారి పోయి నానాసాహెబు సైన్యంలో చేరిపోయారు. చిన్నప్పుడు ఆ కుటుంబంలోనే మరియమ్ ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్యా ముద్దుగా పెరిగింది. పట్టుబట్టి వాళ్లతో బాటు కత్తిసాము, గుర్రపుస్వారి, తుపాకి కాల్చడం నేర్చుకుంది.
‘ఇది చాలా ముఖ్యమైన పని, నువ్వే చేయగలవు' అంటూ జాన్ ఇంట్లో మరియమ్ ని పనిలో కుదిర్చింది కూడా బషీరే.
టెలిగ్రఫీ వల్లనే దొరలు నిమిషాల మీద సిపాయీల రాకపోకలు తెలుసుకుం టున్నారనీ, కుంఫిణీ సైనికుల్ని హుటాహుటిన తరలిస్తున్నారనీ బషీర్ ఎప్పుడో గ్రహిం చాడు, తిరుగుబాటు నాయకులు పంపే పావురాలేవీ సరిగ్గా గమ్యం చేరడం లేదని కూడా అతనికి తెలుసు.
ఆ రోజు నానాసాహెబు, తాంతియా తోపేలకు రహస్యంగా సహకరిస్తున్న బషీర్ భాయితోనూ, తిరుగుబాటుదార్లకు మద్దతుగా నిలిచిన స్థానిక పెద్దమనిషి అమీనుద్దీన్ సాబ్ తోనూ జరిగిన సమావేశం గురించి మరియమ్ కు వివరించ సాగాడు కాలియా.
'నానాసాహెబు సైన్యంతో కలవడానికని బయలుదేరిన మన సిపాయిల ఆచూకీ టెలిగ్రాఫీ ద్వారా తెలిసిపోయిందనీ, మనవాళ్లు గంగానదిని ఎక్కడ దాటాలని అనుకున్నారో అది కూడా దొరలకి తెలిసిపోయిందనీ టెలిగ్రాంలు ఇచ్చి కుంఫిణీ సైనికుల్ని అక్కడికి ముందుగానే తరలించి, మాటు వేసి మనవాళ్లని సునాయాసంగా చంపేశారనీ, కొద్దిమంది మాత్రమే అవతలి ఒడ్డుకు చేరారనీ బషీర్ భాయికీ, అమీనుద్దీన్ సాబ్ కీ వివరంగా చెప్పాను'
'వాళ్లేమన్నారు?
'ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బషీర్ భాయి అయితే వలవలా ఏడ్చేశాడు. నాకూ దుఃఖం ఆగలేదు. అమీనుద్దీన్ సాబ్ కోపంతో మండిపడ్డాడు."
మరియమ్ కాసేపు మాట్లాడలేక పోయింది. చివరికి ఆమె నోరు పెగిలింది'ఇప్పుడిక ఏం చెయ్యాలని నిశ్చయించారు?'
'కొత్త యంత్రాలు రాకుండా ఒకటి రెండు నెలలైనా అడ్డుకోవాలని చివరికి వాళ్లు ఒప్పుకున్నారు'
'ఎలా అడ్డుకుంటాం?"
'కలకత్తా నుండి యంత్రాలతో వచ్చే పడవలు శుక్రవారానికల్లా దినాపూర్ వరకూ వస్తాయి. అక్కడి రేవులో కూలీలు వాటిని దింపి ఎడ్లబళ్ల మీదికి ఎక్కిస్తారు. ఇక్క డికి రావడానికి ఒకపూట పైనే పడుతుంది. దారిలో మాటువేసి యంత్రాలని ధ్వంసం చెయ్యాలి. రాగి తీగెల్ని మోసుకొచ్చి ఎక్కడైనా దాచి పెట్టాలి. తరవాత కరిగించి వాడుకోవచ్చు. ఎడ్లబళ్ల వెంట ఒక సార్జెంటు దొర, ఆరుగురు సిపాయీలూ ఉంటారు. వీలైనంత మట్టుకు సిపాయీలని చంపొద్దన్నాడు అమీనాబ్. సార్జంట్ ని మాత్రం ఖతం చెయ్యాలి. అన్నిటికంటే ముఖ్యంగా యంత్రాలని పూర్తిగా నాశనం చెయ్యలి. ఇదీ పథకం."
'బషీర్ భాయి వస్తున్నాడా?
'లేదు. అతనికి వేరే ముఖ్యమైన పని ఉందిట. అదేమిటో చెప్పలేదు. నేనూ అడగలేదు. నలుగురు తిరుగుబాటుదార్లను తుపాకులిచ్చి పంపుతానన్నాడు. కానీ నేనూ వెంట ఉండాలన్నాడు. నేను కత్తి తిప్పి చాలాకాలం అయిందనీ, ఈ మధ్యంతా గంటలే తిప్పుతున్నాననీ చెబితే వినిపించుకోలేదు. మరో విషయం, ఈ ఘటన కాగానే నువ్వు కూడా ఇక్కడ పని మానెయ్యాలన్నాడు'
'నేనూ నీ వెంట వస్తాను. కత్తి తిప్పడం, తుపాకీ పేల్చడం నాకు వచ్చు."
కాలియా నివ్వెరపోయాడు. 'అదేమిటి మరియమ్, నాకీ సంగతి ఎప్పుడూ చెప్పనే లేదు?'
'నీకు దొరల భాష అర్థం అవుతుందని నాకు మొదట్లో చెప్పావా? ఇదీ అలాగే మరి'
మేమ్ సాబ్ గదిలోకి మరియమ్ తొంగి చూసింది. సూజన్ మంచి నిద్రలో ఉంది. కాలియాకి మజ్జిగలో ఉప్పు కలిపి ఇచ్చింది. వాళ్లిద్దరూ బజారు నుండి వచ్చిన సామాన్లను కొట్టుగదిలో పేర్చసాగారు. కాలియా ఆనాటి సమావేశాన్ని గుర్తు చేసు కుంటూ మరియమ్ తో అన్నాడు--
‘ఇవాళ బషీర్ భాయికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. టెలిగ్రఫీ యంత్రాలని ధ్వంసం చెయ్యకుండా స్వాధీనం చేసుకొని మనమే ఎందుకు వాడుకోకూడదు అంటాడు. కానీ ఈ విషయం మీద అతనికి సవాలక్ష సందేహాలున్నాయి.'
'అంటే?' కాలియా మాటలని ఆసక్తిగా వింటూనే మేమ్ సాబ్ ఎక్కడ లేస్తుందో అని ఒక చెవి అటు పడేసింది మరియమ్.
'టెలిగ్రాపు తీగెలకి రంధ్రం ఉంటుందా? లేకుంటే మరి వాటిల్లోంచి మాటలు ఎలా ప్రయాణిస్తాయి? మీ మర్రేసాబ్ తీగెల కొసల్ని పట్టుకొని అరుస్తుంటాడా? అలా అయితే పక్కనే నిలబడి వినొచ్చు కదా? లేదంటే ఎక్కడో ఓ చోట ఆ తీగెల్ని కత్తిరిస్తే మనకి కూడా ఆ మాటలు వినబడాలి కదా? ఇలాంటి యక్షప్రశ్నలు వేసి నన్ను వేధించాడు. నాకొకటి తెలిస్తేకదా ఏం చెప్పడానికయినా?'
'మరి?"
“మనం స్వయంగా ఈ యంత్రాల్ని వాడుకోవడం ఇప్పట్లో జరిగేపని కాదని ఒప్పుకున్నాడు"
ఆ రోజు రాత్రి బాగా పొద్దు పోయాక మరియమ్ పక్క మీద నుండి లేచి తన గదికి వెళ్లబోతూ,
'ఈ వారంతో ఇక్కడి కథ ముగిసిపోతుంది. తరవాత ఎలా ఉంటుందో?'
అన్నాడు కాలియా.
'మనవాళ్లు గెలుస్తారు, ఇన్స్ అల్లాహ్ ! మళ్లీ మొఘల్ హుకూమత్ వస్తుంది. మనకి ఎక్కడో ఒక చోట పని దొరికిపోతుంది. ఏది ఏమైనా మనం ఇద్దరం కలసి ఒక చోట ఉంటాం. అది చాలు' అన్నది మరియమ్,
'అవును మరియమ్. నిజం చెప్పావు. నాకైతే మనవాళ్లు గెలవగానే పెళ్లి చేసుకొని లక్నో వెళ్లిపోయి అవధ్ వంటలు నేర్చుకోవాలని ఉంది. ఈ దొరల వంట లతో విసుగొచ్చింది. కాని ఒకవేళ ఓడిపోతే?
'తోబాతోబా ! నిజంగా మన కిస్మత్ అలా రాసిపెట్టి ఉంటే దక్కన్ వెళిపోయి పెళ్లి చేసుకొని అక్కడే ఉందాం, 'బాగా చెప్పావు. హైదరాబాదు వంటలు మాత్రం ఏం తక్కువ?'
ఇద్దరూ బిగ్గరగా నవ్వుకున్నారు. వారి ఆందోళనలు మబ్బుల్లా చెదిరిపోయాయి. ఒక ఆశాకిరణం వికసించింది. నిద్రపట్టక దొర్లుతున్న సూజన్ కి వీళ్ల నవ్వు లీలగా వినిపించింది. ఆమె అనుమానం మరింత దృఢపడింది.
కలకత్తా నుండి వస్తున్న టెలిగ్రఫీ యంత్రాలను ధ్వంసం చేసే పథకం అనుకున్నట్లుగా సాగలేదు. అమీన్‌సాబ్ పంపించిన నలుగురిలో ఒకాయన బాగా వయసు మీరినవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా కనిపించదు. పేరు రాణా. అతనో రాజపుట్. అతనికి మందుగుండు పేల్చడం బాగా వచ్చనీ కాబట్టి వెంట ఉండి తీరాలనీ అమీన్‌సాబ్ పట్టుబట్టాడు. మిగతా ముగ్గురూ ఈ మధ్యనే తర్ఫీదు పొందిన యువకులు. వాళ్లని లక్నో పంపేముందు ఈ విధంగా వినియోగిస్తే మంచి తిరుగు బాటు సైనికులవుతారని బషీర్ భాయి ఆలోచన. అయితే ఈ నలుగురిలో ఇద్దరికే తుపాకులున్నాయి. మిగతా ఇద్దరూ కత్తులు పట్టుకున్నారు. ఇవి కాక కాలియాకీ, మరియమ్ కీ చెరో బాకూ ఇచ్చారు.
ఈ మరో ఊహించని పరిణామం ఏమిటంటే- ఈ యంత్రాలు తన శాఖకు చెంది నవి గనక వాటిని సురక్షితంగా చేరవేసే బాధ్యత తనపై కూడా ఉందని భావిం చిన జాన్, సీఓని ఒప్పించి తాను కూడా కుంఫిణీ దళంతో బాటు దినాపూర్ బయిలుదేరాడు. ఈ సంగతి తిరుగుబాటుదార్లెవరికీ తెలియలేదు.
ఆ సాయంత్రం దినాపూర్ శివార్లలో తుపాకులు పేలగానే కుంఫిణీ దళం అప్రమత్తం అయి జవాబుగా కాల్పులు జరిపింది. ఎడ్లబళ్లు అదుపు తప్పాయి. తలో దిక్కూ అయ్యాయి. తిరుగుబాటుదార్లని వెంట తరిమితే, లేదా చంపితే బళ్లలోని సామగ్రి సురక్షితంగా ఎక్కడో ఒకచోట ఉంటుందని అనుభవం కలిగిన కుంఫిణీ దళసభ్యులకు తెలుసు. ఈ విషయాల్లో బొత్తిగా అనుభవంలేని జాన్ మాత్రం తొంద రపడి బళ్లను ఒంటరిగా అనుసరించాడు. అదే అతను చేసిన పెద్ద తప్పిదం.
రాణా, ఒక యువసైనికుడూ, కాలియా ఈ ముగ్గురూ కలిసి వీలైనన్ని ఎడ్లబళ్లని తొందరగా ధ్వంసం చెయ్యాలనీ, మిగతా ముగ్గురూ కుంఫిణీ దళాన్ని నిలువ రించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే రాణా బృందం మూడు బళ్లను ధ్వంసం చేసింది. మరో బండిని పేల్చబోతూ ఉండగా జాన్ వాళ్లని సమీపించాడు. పిస్తోలు రాణాను వెనకనుండి కాల్పాడు. రాణా అక్కడే కుప్పకూలాడు.
కాలియా వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా జాన్! 'నువ్విక్కడ ఏం చేస్తున్నావ్, కాలియా?' అని అరిచాడు జాన్.
కాలియా నిశ్చేష్టుడై నిలబడ్డాడు. జాన్, కాలియాపై తన పిస్తోల్ని గురిపెట్టాడు. సార్జంట్ ఒక్కడే కాకుండా మరో తెల్లదొర కూడా ఉన్నందుకు మొదట ఆశ్చర్యపో యిన మరియమ్ బృందం, దొరల పైనే దష్టి పెట్టాలనే లక్ష్యం ప్రకారం, జాన్ని అనుసరించింది. కాలియా ప్రాణానికి ఏర్పడ్డ ముప్పును గమనించిన మరియమ్, తన బాకును బలంగా విసిరింది. అది వీపున గుచ్చుకొని జాన్ నేలకొరిగాడు. కాలియా తేరుకొని, జాన్ చేతిలోని పిస్తోల్ని లాక్కున్నాడు. అతని తలపై గురిపెట్టి కాల్చాడు.
పిల్లల సినిమాల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఇరవై ఐదు , ఎంపిక చేసి , వాటి కథలను పరిచయం చేస్తూ ' పిల్లల సినిమా కథలు ' అనే ఒక పుస్తకం రాసి ప్రచురించారు రచయిత అనిల్ బత్తుల.
ఈ పుస్తకంనించి, 'బ్లూ అంబ్రెల్లా' అనే సినిమా కథా పరిచయాన్ని మీరు ఈ ఎపిసోడ్లో వింటారు.
'Blue Umbrella' కథకు రచయిత శ్రీ రస్కిన్ బాండ్.
అనిల్ గారు రాసిన పిల్లల సినిమా పుస్తకం కొనాలంటే ఈ లింక్ ని ఉపయోగించండి. :
http://bit.ly/anilbattulapillalacinemakathalu
భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ లోని ఒక గ్రామంలో 9 యేళ్ల బినియా అనే అమ్మాయి, వస్తాదు ఐన తన అన్నయ్య, వాళ్ల అమ్మతో కలిసి నివసించేది. వాళ్ల గ్రామం కొండప్రాంతంలో వుండేది. బినియా వాళ్లకి గోరీ, నీలూ అనే రెండు ఆవులు వుండేవి. పాప ఆ ఆవుల్ని కొండ వాలులోని పచ్చ గడ్డితో మేపేది. పాడి వాళ్ల జీవనాధారం. బినియాకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అదే గ్రామంలో నంద కిషోర్ అనే 50 యేళ్ల వ్యాపారి, రహదారి పక్కన 'ఖాత్రి టీ దుకాణం నడిపేవాడు. ఇతను పరమ లోభి. బడికెళ్లే పిల్లలకు చాక్లెట్లు, బిస్కట్లు ఆశ చూపి అప్పు ఇచ్చేవాడు. నెల అవ్వగానే పిల్లలకు తప్పు లెక్కలు చెప్పి వాళ్ల దగ్గర ఏదో ఒక వస్తువు (ఉదాహరణకు బైనాక్యులర్స్ లాంటివి) లాక్కునేవాడు. ఇతని దగ్గర రాంగోపాల్ అనే దొంగ పిల్లవాడు పనిచేసేవాడు.
ఒక రోజు బినియా ఆవుల్ని మేపటానికి కొండపైకి వెళ్తుంది.. అక్కడ తనకి ఒక అందమైన పెద్ద నీలంరంగు జపనీస్ గొడుగు దొరుకుతుంది. అది ఒక జపనీస్ టూరిస్ట్ బృందం వాళ్లది. వాళ్లు పాప మెడలోని ఎలుగుబంటి గోరుతో చేసిన దండని తీసుకుని దానికి బదులుగా ఈ అందమైన నీలంరంగు జపనీస్ గొడుగును ఇస్తారు. ఎలుగుబంటి గోరుతో చేసిన దండని అదృష్టచిహ్నంగా భావిస్తారు. అది దుష్ట శక్తులను పారద్రోలుతుందని ప్రజల నమ్మకం. గొడుగు కోసం దండను ఇచ్చినందుకు అమ్మ పాపను మందలిస్తుంది. ఆ నీలంరంగు గొడుగు రాగానే బినియా ఆ వూర్లో ఒక సెలబ్రిటీ అవుతుంది.. ఎందుకంటే ఆ వూర్లో వున్నవన్నీ నల్లని సాధారణ గొడుగులే. ఇంత అందమైన నీలంరంగు జపనీస్ గొడుగుని గ్రామ ప్రజలెప్పుడూ చూడలేదు. ఎండలో, వానలో, మంచులో ఎళ్లవేళలా పాప గొడుగుతోనే వుండేది. నీలంగొడుగు లేని బినియాను మనం వూహించలేము. ఊరివాళ్లు పాప గొడుగుని ఎంతో మెచ్చుకునేవాళ్లు. వ్యాపారి నందూ కన్ను, నీలంరంగు గొడుగుపై పడుతుంది. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు. బినియాకు చాక్లెట్లు, బిస్కెట్లు, డబ్బు ఇలా రకరకాల ఆశలు చూపుతాడు. గొడుగు తనకు అమ్మమంటాడు. పాప అస్సలు ఒప్పుకోదు. వ్యాపారి నందూ ఈర్ష్య పడతాడు. వ్యాపారి నందూ సిటిలో ఒక గొడుగుల దుకాణానికి వెళ్లి రంగుల జపనీస్ గొడుగు గురించి వాకబు చేస్తాడు. దాని వెల 2500 రూపాయలని డబ్బు మొత్తం ముందే కడితే ఒక పది రోజుల్లో ఢిల్లీ నుండి తెప్పిస్తారు అని తెలుస్తుంది. లోభి, పిసినారి ఐన నందూకి అంత డబ్బు పెట్టి గొడుగు కొనడం ఇష్టం లేదు.
నందూ నిరాశగా బలో తిరిగి వస్తుంటే, గ్రామసమీపంలో వున్న జలపాతం కింద నీలం గొడుగుతో నిలబడివున్న బినియా కనిపిస్తుంది. నందూ బస్ ని ఆపి అక్కడే దిగి పాప వద్దకు పరిగెత్తుకుని వెళ్తాడు. 'బెలూన్ల గుత్తి 50 రూపాయలు ఇస్తాను, నీ గొడుగు నాకు అమ్మేయి' అంటాడు. పాప అందుకు ఒప్పుకోక, అక్కడి నుండి వెళ్లిపోతుంది. కోపంతో నందూ బెలూన్ల గుత్తిని గాలిలో ఒదిలేస్తాడు. తరువాతి రోజు పాప నీలం గొడుగుతో ఒక పాముతో పోరాడి వాళ్ల అన్నయ్యను కాపాడుతుంది.. ఈ విషయం గురించి గ్రామంలో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇలావుండగా ఒక రోజు పాప కొండపై ఆవులు కాస్తున్నప్పుడు నందూ దుకాణంలో పనిచేసే రాంగోపాల్ అనే పిల్లవాడు నీలం గొడుగుని దొంగిలిస్తాడు. ఈ పని తను యజమాని జీతం పెంచుతానన్నాడని చేస్తాడు. ఈ దొంగతనం గురించి పాపకు కానీ ఊరి ప్రజలకు కానీ తెలియదు. పాప భోరున ఏడుస్తుంది. అన్నం తినదు.
ఊర్లో వాళ్లంతా బతిమిలాడతారు. పాపకు నందూ మీద అనుమానం. పోలీస్ అంకుల్ని తీసుకెళ్లి నందూ దుకాణం అంతా వెతుకుతారు కానీ నీలం గొడుగు దొరకదు. తన పరువుని పాప బజారుకీడ్చిందని నందూ కోప్పడతాడు. తను కొత్త రంగుల జపనీస్ గొడుగు కొన్నదాకా పచ్చడి ముట్టనని గ్రామ ప్రజల ముందు శపథం చేస్తాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఊరి పోస్ట్మ న్ నందూకి ఒక పెద్ద అట్ట పెట్టెను తెచ్చిస్తాడు. నందూ గ్రామ ప్రజల మధ్య ఆ అట్టపెట్టెను తెరుస్తాడు.. మిలమిలా మెరిసిపోయే ఎర్రటి జాపనీస్ గొడుగు. నందూ ఆనందం వర్ణనాతీతం. నందూ అందరి ముందూ గర్వంగా పచ్చడి తింటాడు. ఆ ఎర్రటి గొడుగు వేసుకుని వూరంతా తిరుగుతాడు. పాపను వూరిస్తాడు. పాప ఏడుపు మొహంతో వుంటుంది. నందూ పట్నం వెళ్లటానికి బస్ ఎక్కుతుంటే, ఎర్ర గొడుగు బస్ ద్వారం దగ్గర ఇరుక్కుపోతుంది. అందరూ కలిసి అతి కష్టం మీద దాన్ని బయటకు లాగుతారు. నందూ గొడుగుని మూయటానికి ప్రయత్నిస్తాడు కానీ అతనికి చేతకాదు. బినియా సాయం చేస్తుంది. ఈలోగా గ్రామంలో కుస్తీ పోటీలు జరుపుదామని దానికి ముఖ్య అతిథిగా వుండాలని గ్రామ పెద్ద నందూని ఆహ్వానిస్తాడు. కుస్తీ పోటీలో పాల్గొనే వారికి భోజనం సగం ధరకే సరఫరా చేస్తానని నందూ ప్రకటిస్తాడు. అందరూ చప్పట్లు కొడతారు. బినియా పోస్ట్‌మన్ వద్దకు వెళ్లి నందూకి పార్సల్ ఎక్కడి నుండి వచ్చిందని వాకబు చేస్తుంది. ఆ పార్సల్ ఢిల్లీ నుండి రాలేదని ఆ గ్రామానికి దగ్గరలోనే వున్న బనికేట్ అనే గ్రామంలోని రంగులేసే దుకాణం నుండి వచ్చిందని తెలుస్తుంది.
పాప పోలీస్ అంకుల్ని వెంట పెట్టుకుని వెళ్లి ఆ రంగుల వ్యాపారిని వీళ్ల వూరికి పట్టుకొస్తుంది. ఈ లోగా కుస్తీ పోటీలు జరుగుతాయి. విజేతలను ప్రకటిస్తూ నందూ ఉపన్యసిస్తుంటాడు. వర్షం కురుస్తుంది.. గొడుగు రంగు వెలిసి ఎర్రరంగు కారిపోయి లోపల వున్న నీలం రంగు బయటపడుతుంది. నందూ 'గొడుగు దొంగ' అని ఊరంతా తెలుస్తుంది. అందరూ నందూని తిడతారు. గొడుగుని బినియాకు తిరిగి ఇస్తారు. నందూ దుకాణంలో ఏదీ కొనకూడదని గ్రామస్తులు నిర్ణయించుకుంటారు. రాంగోపాల్ నందూ దగ్గర పని మానేసి వెళ్లిపోతాడు. నందూని అందరూ వెలివేయడంతో ఒంటరి వాడవుతాడు. ఒక రోజు రాత్రి నందూ దుకాణం పైకప్పుపై ఎలుగుబంటి దాడి చేస్తుంది. తరువాతి రోజు ఉదయం నందూ పైకప్పు బాగు చేసుకుంటుంటే ఎలుగుబంటి గోరు దొరుకుతుంది. దాంతో నందూ ఒక దండ తయారుచేయిస్తాడు.
పిల్లలు నందూని దొంగ, దొంగ అని ఏడిపిస్తుంటారు. ఇదంతా బినియా నిశబ్దంగా గమనిస్తూ వుంటుంది. నందూని బాధ పెట్టడం ఇష్టం లేక పాప దుకాణం ముందు నీలంగొడుగు మూసేసి నడిచి వెళ్తుంటుంది. గ్రామపెద్ద కొడుకు వివాహ ఊరేగింపు జరుగుతుంటుంది. నందూ వెళ్లి పెళ్లికొడుక్కి ఎలుగుబంటి గోరు దండ బహుమతిగా ఇవ్వబోతాడు. పెళ్లికొడుకు తీసుకోడు. నందూని దొంగ అని అందరూ అవమానిస్తారు. ఇది చూసి బినియా చాలా బాధ పడుతుంది. తరువాతి రోజు బినియా నందూ దుకాణం కెళ్లి బిస్కెట్లు కొనుక్కుంటుంది. నీలం గొడుగుని అంగడి వద్ద వదిలేస్తుంది. నందూ పరిగెత్తుకుంటూ వచ్చి 'పాపా.. నువ్వు గొడుగు మర్చిపోయావ్' అని తిరిగివ్వబోతాడు. పాప తీసుకోదు.. 'అది ఇక నుండి మీదే అంకుల్' అంటుంది. 'జీవితంలో గొడుగే కాకుండా చాలా వున్నాయి' అని వెళ్లిపోతుంది.
ఈ విషయం తెలిసి గ్రామస్తులు నందూని క్షమిస్తారు. అతని దుకాణంలోజనాలు నందూని పొగుడుతారు. నందూ గొడుగుని చూపించి ఇదివరకటిలాగనే కొంటుంటారు. నందూ ఆ నీలం గొడుగుని దుకాణం మీద నిలబెట్టి గట్టిగా కడతాడు. దుకాణం పేరు 'గొడుగు టీ అంగడి' అని మారుస్తాడు. నందూ మంచివాడిగా మారి అందరితో బాగుంటాడు.
బినియాగా శ్రేయశర్మ, నందూగా పంకజ్ కపూర్ చాలా బాగా నటించారు. ఈ సినిమాను రస్కిన్ బాండ్ రాసిన 'ద బ్లూ అంబిల్లా' అనే కథ ఆధారంగా విశాల్ భరధ్వాజ్ దర్శకత్వం వహించాడు. ద బ్లూ అంజిల్లా కథను 'నీలం రంగు గొడుగు' పేరుతో సురేష్ కొసరాజు తెలుగులో అనువదించారు. ఈ సినిమా 2007 లో ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డ్ గెలుచుకుంది. సినిమాలో భాష హిందీ కానీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా వున్నాయి.
'బ్లూ అంబ్రెల్లా' నెట్ ఫ్లిక్ లో చూడొచ్చు - https://www.netflix.com/title/70075775
మరిన్ని వివరాలు అనిల్ బత్తుల గారితో హర్షణీయం చేసిన ఇంటర్వ్యూ లో మీరు వినవచ్చు.
https://gaana.com/song/part-1-
‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
(Harshaneeyam on Gaana app)
స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam
(Harshaneeyam on Spotify)
ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5
(Harshaneeyam on Apple. Podcast)
రిటైరై, కొడుకూ కోడలితో జీవించే నాయుడు గారు. వృత్తి రీత్యా ఒక మెకానిక్. చుట్టూ వుండే ప్రపంచాన్ని ఆశావహ దృక్పధంతో చూస్తూ, ఓపిగ్గా, చుట్టూవుండే పరిస్థితులను కావలసిన విధంగా మలుచుకుంటూ, జీవించడాన్ని ఇష్టపడతారు.
ఆయనకు పూర్తిగా విరుద్ధ స్వభావం వుండే ఆయన కొడుకు కృష్ణ , తన జీవితంలో వుండే అసంతృప్తిని వస్తువులపై చూపించడమే కాక , తన భార్యను కూడా వాటి గాటన కట్టేసే మనిషి.
కథలోవుండే ఇంకో ముఖ్యపాత్ర ‘అమ్మతల్లి’ - స్నేహితుడు పనికి రాదని పారేస్తూంటే నాయుడుగారు అతన్ని ఆపి తన ఇంటికి తెచ్చుకున్న, పాడుబడ్డ ఒక మెషీను.
చెప్పదల్చుకున్న విషయాన్ని పాఠకుడికి చేరవేయడానికి , ఒక శిల్పాన్ని చెక్కినట్టు కథను చెక్కుతూ మెల్లగా పాఠకుణ్ణి తనకు కావలసిన ఆవరణంలోకి తీసుకువెళతారు, శాస్త్రిగారు.
నా కథలన్నీ అనుభూతి ప్రధానమైనవి, కథ నుంచి ఏమి తెల్సుకోవాలో, పాఠకుడే అలోచించి అందిపుచ్చుకోవాలి అంటారు ఆయన.
పతంజలి శాస్త్రి గారు రాసిన అనేక గొప్ప కథల్లో ఇప్పుడు మీరు వినబోతున్న ‘జెన్’ ఒకటి.
హర్షణీయం టీం తరఫున ఆయనకు డెబ్భై ఐదవ జన్మ దిన శుభాకాంక్షలు . Happy Birthday Sir.
హర్షణీయం’ పాడ్‌కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)
ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)
‘జెన్’ :
గేటు ముందర స్కూటరు భయంకరంగా పొరబోయి దగ్గుతోంది. కిక్ కొట్టే కొద్దీ పొడి దగ్గే తప్ప ప్రాణం పోసుకుంటున్న జాడలేదు. కృష్ణ మొహం చెమటతో తడిసిపోయింది. తన భార్యని మానభంగం చేసిన దుర్మార్గుడిలా కనిపించింది స్కూటరు. ఆఖరిసారి కసి కొద్దీ కిక్ కొట్టి, దగ్గి ఆగిపోయిన వాహనాన్ని, అదే వేగంతో ఓ తాపు తన్ని నాలుగు బూతులు తిట్టాడతను.
“నీడలోకి రండి” గేటు వెనక నిలబడి అంది అతని భార్య, డాబానీడ ఆమె మీద పడుతోంది. మొహం తుడుచుకుంటూ ఆమె పక్కన నించున్నాడు కృష్ణ. స్కూటర్ని చంపేయాలనిపించిందతనికి.
“ఛీ ఎదవ స్కూటరు. సరిగ్గా టైముకు పెంట పెట్టింది. పది రూపాయలక్కూడా ఎవడూ తీసుకోడు.” తరువాత స్కూటరు శీలం గురించి అతని అభిప్రాయం వెలిబుచ్చాడు.
సరళ కొంచెం సిగ్గుపడి నవ్వుతూ అంది “చీ. మామయ్యగారు వింటారు”
"వింటే విన్నీ, మధ్యలో నీకేం? ఆఫీసుకెళ్ళేదినువ్వా? నేనా? దరిద్రం. నా కంటే ఎదవ ఎవడూ దొరక్క నాకమ్మాడు. నాకీ చండాలం పట్టింది"
"కృష్ణ ఇంకా వెళ్లలేదా?" భుజం మీది తువాలుతో కళ్లజోడు తుడుచుకుంటూ గేటు దగ్గరకొచ్చాడు నాయుడుగారు.
"స్టార్టవట్లేదండి” పక్కకి తొలుగుతూ చెప్పింది సరళ.
కొడుకు వైపు చూశారు నాయుడుగారు. ఆగ్రహంతో స్కూటర్‌నే చూస్తూ మాట్లాడలేదు కృష్ణ. గేటు తోసుకొని బయటికొచ్చి గూడకట్టు చుడుతూ వాహనం దగ్గరికి వెళ్లారాయన.
“ఎండ్‌లో మీరెందుకు. మీ వల్లకాదు. నే చూస్తాలేండి.”
ఆగమన్నట్టు చెయ్యి చూసింది. స్కూటరు కింద చెయ్యి పెట్టి చూశారు నాయుడుగారు. ట్యూబు సరిచేసి పైకి లేస్తూ కొడుకు వైపు చూసి నవ్వారు.
“ఓవర్ ఫ్లో. చూసుకోలేదేవీ?".
ఆశ్చర్యపోయాడు కృష్ణ. దగ్గరికొచ్చి నుంచున్నాడతను. “కంగార్లో చూసుకోలేదు.”
“కంగారెందుకు? బండి ఆగిపోతే జాగ్రత్తగా చూసుకోవాలి. కాలిరిగేలా కిక్కిస్తే లాభం లేదు. బయలుదేరు.”
నీలి ధూపం సమర్పించి బయలుదేరింది, స్కూటరు.
ఇద్దరూ నవ్వుకుంటూ వరండాలోకి వచ్చారు.
"ఆఫీసుకు లేటయిందని కంగారండి" భర్త తరఫున అంది సరళ.
“ఆఫీసుల గొడవ స్కూటర్లకి తెలీవు. బయలుదేరే ముందు మనమే చూసుకోవాలి. ఆదివారం పూట ఓ అరగంట బండి దగ్గర కూర్చుని శుభ్రంగా అన్నీ సరిగా ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవాలి."
సరళ నవ్వింది. అంటే 'మీ అబ్బాయికి అంత ఓపిక ఎక్కడుందని అర్ధం’.
“కొంచెం కాఫీ ఇవ్వు. ఓ అరగంట అమ్మతల్లి దగ్గర కూర్చుని తరవాత స్నానం చేస్తాను”
తల ఊపి లోపలికి వెళ్లిపోయింది సరళ. చిన్న డాబా ముందు మూడు లుంగీల స్థలం. ఉద్యోగంలో ఉండగానే జాగ్రత్తగా కట్టించుకున్నాడు నాయుడుగారు. డాబా పిట్ట గోడ మీద కుండీలు పెట్టి మొక్కలు వేశారు. గేటు పక్కన అటూ ఇటూ రెండు రోజా మొక్కలు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ నీళ్లు పోస్తూ వాటితో నాయుడుగారు మాట్లాడతారని కృష్ణ గట్టి నమ్మకం. ఎన్ని పువ్వులు పూసినా, కోడలికి రెండూ పక్కింటిపాపకు ఒకటి, దేవుడి దగ్గర ఒకటి, మొత్తం నాలుగు పువ్వులు మొక్కలవి. గోడ బయట తురాయి
మొక్క నాటారాయన. చైత్రమాసం నుంచీ కెంపులు పూస్తుందది. ఉదయం సాయంకాలం నాయుడుగారు గోడవతల పెరిగిన ఎర్ర నెమల్ని చూస్తూ కూచుంటారు. ఆయన్నలా చూసి చూసి కోడలు కాసేపట్లో మామగారే ఎర్రగా పూసుకొస్తారను కుంటుంది. ఇంకొంచెం పెద్ద స్థలం లేదని ఆయన బెంగ.
మధ్యాహ్నాలు భోజనం చేస్తూ కోడలితో ఆయన చిన్నతనాన్ని, యవ్వనాన్నీ నెమరేస్తుంటారు నాయుడుగారు. సరళ ఓపిగ్గా వింటుంది. మామగారి బాల్య, కౌమార, మౌనవ జీవిత విశేషాలు ఆమెకి కామా చుక్కలతో సహా నోటికి వచ్చేశాయి. గడచిన పది సంవత్సరాల్లో చెప్పినవే చెప్తున్నానని తెలీదాయనకు.
కాకినాడ దగ్గర చిన్న పల్లెటూరు. ఊరికి కొంచెం దూరంగా దట్టంగా పచ్చటి ముద్దల్లా పెరిగిన మడచెట్ల అడవుల్ని చీలుస్తూ ఏర్లు సముద్రంలోకి జారుకుంటాయి. నదిలో మెత్తగా ఆయన జ్ఞాపకాల పడవలో ఊగుతూ బయల్దేరతారు నాయుడుగారు. తెల్లటి పెద్ద ఏటి కొంగలు, ఆశ్చర్యపడ్డ నీటి పిల్లి, డైనింగు టేబులు మీద ప్రత్యక్షం అవుతాయి. ఒకసారి సముద్రపు ఆటు సమయంలో మడచెట్ల ఏట్లో పడవలో చిక్కుకుపోయి నీరు తీస్తుండగా పడవ తోసుకుంటూ పడ్డ అవస్థను సరళ అయిదువందల నలభైరెండోసారి వింటూ ఓపిగ్గా నవ్వుకుంటుంది. ఆమె నిజానికి పదహారోసారి నుంచే వినడం మానేసింది కానీ, నాయుడుగారు ఆమెతో మాట్లాడరు. ఆమె వైపు చూస్తూ ములక్కాడ చప్పరిస్తూ మాట్లాడతున్నా ఆయన కళ్లలో సముద్రం, అడవి, కొంగలూ పాత సినిమాలా కనిపిస్తాయి. చిన్నతనం గురించి చెప్తుంటే ఒక్కోసారి ఆయన కళ్లజోడు పెట్టుకున్న కొంగలా కనిపిస్తారు కోడలికి.
కాఫీ తీసుకుని వరండాలోకి వచ్చింది సరళ. చేతిలో సిగరెట్ తో పరధ్యానంగా చూస్తూ కాఫీ అందుకున్నారాయన. కాఫీ చప్పరించి సిగరెట్టు పారేసి అమ్మతల్లి వైపు చూశారు. నాయుడుగారు.
వరండా ఓ చివర సగం కిందికీ, మిగతా వరండాలో చెక్కల మీద బైఠాయించింది అమ్మతల్లి. స్టూలు మీదకూచుని రెంచి అందుకుని చిన్న చక్రాన్ని విప్పడం మొదలు పెట్టారు. కొంచెం నైవేద్య తైలం; గ్రీసు, పాత ఇనప రంగుతో కళకళ లాడుతూంటుంది తల్లి.
తోలు తీసి పేగులు బైటపడేసినట్టు మరలూ, ప్లాస్టిక్ గొట్టాలు, పెద్ద చక్రం, రెండు చిన్న చక్రాలూ, స్క్రూలతో వరండాలో వేంచేసిన పాత యంత్రం అమ్మతల్లి.
ఈ యంత్రం దేనిదో, ఎందుకు ఉపయోగపడుతుందో, ఎందుకు బాగు చెయ్యాలో ఆయన ఎప్పుడూ చెప్పలేదు. (“ఇనుం దరిద్రం గూడా. చెప్తే ఇనరుగా")
దానికి నామకరణం చేసింది ఆయనే. జానపదుల పూజారిలా నాయుడుగారు భక్తిగా, ప్రేమగా, ఓపిగ్గా అమ్మతల్లిని సేవిస్తుంటారు. చిన్న చిన్న స్కూలూ, వాషర్లూ నూనెలో ఊరబెట్టి మళ్లీ బిగిస్తుంటారు.
చక్రం చేతిలోకి ఊడొచ్చింది. రెంచి పక్కనబెట్టి కాఫీ తాగుతూ చక్రాన్ని పరిశీలించారు. ఎక్కడా వెంట్రుకవాసి బీటలేదు. త్రెడ్లు బాగానే ఉన్నాయి. నిన్ననే గ్రీసు పెట్టారు. మళ్లీ చక్రం బిగించి యంత్రం అవతలివైపు కరెంటు సరిగ్గా వస్తుందో, లేదో పరిశీలించారు. అంతా సవ్యంగావున్నట్టే. ప్లగ్ తీసి మళ్లీ బిగించారు. మళ్లీ స్టూలు మీద కూర్చుని జాగ్రత్తగా చక్రాన్ని బిగించి పాత గుడ్డతో చెయ్యి తుడుచుకుని స్విచ్చి నొక్కారు నాయుడుగారు. ముందు గొంతు సవరించుకుని కసకసమంటూ ఒక్కసారి ఊగి ఆగిపోయింది అమ్మతల్లి. స్విచ్చి ఆపి తేరిపార చూస్తూ కూర్చున్నారాయన.
నాయుడిగారి అనుభవంలో ఎన్నో యంత్రాలు మొరాయించి మాట వినక తప్పలేదు. ఆయన స్పర్శ తగలగానే నాడి కొట్టుకుని ప్రాణంతో కెవ్వుమంటాయి యంత్రాలు. చెడిపోయిన యంత్రం చూడగానే ఆయనకి ప్రాణం లేచొస్తుంది. ఆయన కింద మెకానికులు పడుకునీ. దొర్లీ, కూర్చునీ వాటితో కుస్తీ పడుతుండేవారు. (మెషీనూ మనిషి లాటిదే! మనం అర్థంజేసుకోవాలంతే") రెండు రోజులు చూసి సరదాగా ఆయనే గ్లోవ్స్ తొడిగి రెంచి పట్టుకు తయారయ్యేవారు. ఇంజక్షన్ తీసుకుంటున్న రోగిలా యంత్రం నీరసంగా మూలిగి, కాసేపట్లో పూర్ణారోగ్యంతో బయటపడుతుంది.
"మొత్తం చూసుకోవాలయ్యా నువ్వు. కరెంటు వస్తానే ఉంది. లోపల ఏవైందో చూడాలి. నీకసలా సౌండ్ వింటే అర్ధం గావాలి. ఇప్పుడు జూడూ. పెర్ఫెక్ట్ సౌండు ఉంటే మెషీను పెర్ఫెక్ట్ గా ఉందన్నమాట.స్థిమితం ఉండాలయ్యా"
శ్రీశైలం నీటిమట్టం వల్లా, ప్రభుత్వం వల్లా కరెంటు పోవాలి తప్ప నాయుడిగారింట్లో గీజరూ. లైట్లూ, కుళాయిలూ, పనిచెయ్యకపోవడం ఉండదు. సరళ స్నానం చేసి వచ్చేసరికి మామగారింకా అమ్మతల్లి దగ్గరే ఉన్నారు. ప్లాస్టిక్ గొట్టం తీసి శుభ్రం చేసి మళ్లీ బిగిస్తున్నారు. ఒక్క క్షణం ఆయన వేపే చూస్తూండిపోయిందామె. ఆయన బాల్యం, కౌమారం ఆమెకి కొంచెం అర్ధమైనాయి కానీ పాతబడి చెడిపోయిన ఈ యంత్రాన్ని ఆయన అంత ఓపిగ్గా ఎందుకు బాగు చెయ్యాలో తెలీలేదామెకు. ఒక్కసారికూడా ఆయన చీకాకు పడ్డం, విసుక్కోవడం చూడలేదు సరళ. ఒకటి రెండుసార్లు చటుక్కున ప్రాణం వచ్చి మెషిను తిరగడం మొదలుపెట్టి మరుక్షణంలో ఆగిపోయింది. నాయుడుగారు తల అడ్డంగా ఊపుతూ నవ్వుకున్నారు.
సామాన్యంగా ఆదివారాలు భార్యాభర్తలిద్దరూ సాయంకాలం బయటికి వెడతారు. టీ టైముకి లేవగానే ఇద్దరికీ ఆయన అమ్మతల్లి దగ్గరో, స్కూటరు పేగులు సవరిస్తూనో కనిపిస్తారు. సామాన్యంగా రాత్రి ఇద్దరూ తిరిగి రాగానే గొడవ పడతారు.
స్నానం చేసి బట్టలు మార్చుకుని పేపరుతిరగేస్తూ కూర్చున్నారు నాయుడుగారు. మార్చి నెల ఎండలు ముదరలేదు. హైదరాబాదు నీటి కరువుకి సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రిగారు వీలయితే హిమాలయాల్లోంచి నీళ్లు తెచ్చి రాజధాని దాహం తీర్చే పథకం తన దగ్గర రహస్యంగా ఉందని తెలియచేస్తున్నారు. ఈలోగా కృత్రిమ వర్షాలు కురిపిస్తారుట. ప్రధానమంత్రిగారు మెక్సికో అధ్యక్షుణ్ణి పిలుస్తూండగా నాయుడిగారికి చిన్న కునుకు పట్టింది. పేపరు చేతిలో ఉండిపోయింది. మధ్యలో ఒకసారి సరళ వచ్చి చూసి వెళ్లింది.
ఆయన్ని అలా చూస్తూ అప్పుడప్పుడు ఆమెకి భయం వేస్తుంది.
“మామయ్యగారండీ! భోజనం వడ్డించాను” చటుక్కున మెళకువ వచ్చిందాయనకి.
“సాయంకాలం మలక్ పేట వెళ్లాలటండి”
“దేనికి!”
“ప్రసాద్ గారి అబ్బాయి పుట్టిన రోజు, ఇద్దరం వెళదాం. రెడీగా ఉండమని చెప్పేరండి.”
“వెళ్లిరండి. మరీ లేటవుకుండా వచ్చెయ్యండి."
“అబ్బే. పిల్లాడి చేతిలో ఏదైనా పెట్టి త్వరగానే వస్తాంలెండి”
“వాణ్ణి బండి జాగ్రత్తగా తీసుకెళ్లమనిచెప్పు"
సరళ నవ్వింది. తండ్రీ కొడుకులు ఎక్కువ మాట్లాడుకోకపోయినా కృష్ణకి తండ్రి అంటే గౌరవం ఆయన ఎప్పుడూ ఒక్కమాట అనడం గుర్తులేదతనికి. చిన్నప్పుడు కూడా చెయ్యి చేసుకునేవారు కాదు. కోడలు రావడం వల్ల పొరపొచ్చాలు రాలేదు. స్కూటరు వల్ల వస్తుంటాయి. కృష్ణ గేరు మార్చడం దగ్గర్నించీ ఆయనకి నచ్చదు. గాలి దుమారంలా వెళ్లడం, కీచుమని ఆగడం నాయుడుగారికి గిట్టదు. (“బ్రేకు వెయ్యకుండా బండి నడుపుకోవాలి") దూరాన్ని వేగాన్ని అంచనా వెయ్యడం రాదని ఆయన అభిప్రాయం.
“ఈ ఎదవ ట్రాఫిక్కులో బండి నడపడం అంత బుద్ది తక్కువ లేదు."
“సిటీల్లో ట్రాఫిక్‌కు అలాగే ఉంటుంది. నీ బండి నువ్వు సరిగ్గా ముందు చూసుకోవా లంటున్నాను. బ్రేకు మీద కాలు ఆనగానే మెత్తగా ఆగిపోవాలి. బండి మీద పోతుంటే పర్ ఫెక్ట్ స్మూత్ గా ఉండాలి. బండి నడిపించేటప్పుడు హాయిగా ఉండాలి. శుభ్రంగా ఉంచుకోవడమే గాదు. పరిగెట్టేటప్పుడు సుఖంగా ఉండొద్దూ? అసలు కిటుకు అదీ. ట్రాఫిక్‌కు ఎంతుంటే నీకేం. దాని మధ్యలో మెత్తగా వెళ్లిపోవాలంతే!”
“అదంతా ఇక్కడ గాదు . అమెరికాలో."
"అమెరికాలో హైదరాబాదైనా ఒకటేనయ్యా. అమెరికాలో ట్రాఫిక్‌కు ఉండదా? అదిగాదు అసలు."
"కాదులెండి నాన్నా! మీరిప్పుడోసారి స్కూటరు మీద వెళ్తే తెలుస్తుంది. చేతులు బొబ్బలెక్కుతాయి. ఈ ఎదవబండి మొన్నో రోజు సరిగ్గా మధ్యలో ఆగిపోయింది. అయిదు నిమిషాలు పట్టింది. ఇసిరి హుస్సేన్‌సాగర్‌లో పారేద్దామనుకున్నా... డబ్బాలో కారం ఉందా, అంతా కూరలోనే పారేశావా?"
“నువ్వు బండికి, ట్రబులిస్తున్నట్టుంది. హాండిల్ బారు మీద చెయ్యేస్తే ఆకాశంలో కొంగలా వెళ్లాలి. " ("నాన్నని కాకినాడెళ్లి కొంగను పట్రమ్మను.")
తువ్వాల్తో చెయ్యి తుడుచుకుని రెండు పలుకులు వక్కపొడి నోట్లో వేసుకునీ సిగరెట్ వెలిగించారు. నాయుడుగారు. సరళ భోజనానిక్కూచుంది.
“కోడిగుడ్లలో బాతుగుడ్డు కలిపేస్తున్నారు.”
“అంతే మరి. అన్నీ కలిపేస్తున్నారు."
తలెత్తి చూసి అన్నారాయన. బాతు గుడ్లనగానే నాయుడిగారికి బాతులూ, కొంగలూ భుజం మీద వాలాయి. వక్కపలుకు మెల్లగా చప్పరిస్తూ చటుక్కున అడిగారు. మనస్సులోంచి చిన్న నవ్వు ఒడ్డున పడింది.
“తాబేలు గుడ్లుగాని చూశావా ఎప్పుడైనా?"
“లేదండి. అసలు తాబేల్నే చూళ్లేదు”
“అంటే, ఓసారి చూశానండి"
“తాబేళ్లలో చాలా రకాలున్నాయి. ఈ డైనింగు టేబులంత కూడా ఉంటాయి తెలుసా?”
“అయ్ బాబోయ్."
“అవేం జెయ్యవు. ఓసారి తాబేళ్లు గుడ్లు పెట్టడం చూడ్డానికి ఎళ్లాను. దొరయ్యగాడని మరకాడుండేవాడు(జాలరి) వాడు చెప్పాడు. వాణ్ని చంపి ఓ రోజు రాత్రి సముద్రం దగ్గరికి పోయాను.”
“ఒక్కరే!”
“నేనూ, ఆడూనూ."
అర్ధరాత్రి దాటగానే సముద్రం నల్లగా ఉద్రేకపడుతుంది. పోటులో అలల కుచ్చెళ్లు తెల్లగా మెరుస్తుంటాయి. ఒడ్డున దూరంగా దొరయ్య పడవ ఊగిపోతోంది. నక్షత్రాల్ని ఎవరో కడిగి పొదిగినట్టు మిలమిలమంటున్నాయి. త్రయోదశి చీకట్లో సర్వితోట నిశ్చల సముద్రంలా కలవరపడుతోంది. లైట్ హవుసు తెల్లకన్ను టపటప కొట్టుకుంటోంది. సముద్రం అప్పుడప్పుడూ పచ్చగా తళుక్కుమంటోంది. మధ్యాహ్నం ఎప్పుడో బయలుదేరి అర్ధరాత్రి దాటింతర్వాత అలల మీంచి చిన్న నల్లపడవల్లా కడుపునిండా గుడ్లతో సముద్రపు తాబేళ్లు తీరం చేరుకున్నాయి. మెత్తటి తడి ఇసక మీంచి బరువుగా తూలుతూ, జాడలు వేసుకుంటూ పొడి ఇసకలో బొరియ చేసుకుని గుడ్లు పెడుతూ గర్భభారాన్ని దించు కుంటున్నాయి. నిశ్శబ్దంలో గుడ్లు పెట్టినప్పుడల్లా 'టప్ మని శబ్దం వినబడుతోంది. నక్షత్రాలు, కెరటాలు, పొదల్లో నక్కల కళ్లూ మెరుస్తున్నాయి తాపీగా బొరియ కప్పి మళ్లీ నిర్వికారంగా సముద్రంలోకి తేలిపోయాయి తాబేళ్లు
“అన్నీ నక్కలు తినేస్తాయి. బతికి బట్టగడితే పిల్లలు మళ్లీ రాత్రిళ్లు సముద్రంలోకి పోతాయి. పీతలు కూడా తినేస్తాయనుకో.”
నాయుడిగారి కాళ్లకి తడి ఇసక తగుల్తోంది.
నాలుగున్నరకల్లా వచ్చాడు కృష్ణ, గాలి దుమారం తలుపుతోసినట్టు ముందు గేటుకు గుద్ది ఆగింది స్కూటరు. హారన్ మోగింది. సరళ వెళ్లి తలుపు తీసింది.
"త్వరగా బయల్దేరు"
వరండా చివర నాయుడుగారు స్టూలు మీదకూచుని అమ్మతల్లిని పరిశోధిసున్నారు భార్యాభర్తలిద్దరూ లోపలికి వెళ్లిపోయారు. నూనెలోంచి స్క్రూ తీశారు నాయుడుగారు . తుప్పు వదిలిపోయింది. దాన్ని జాగ్రత్తగా బిగించి, మెషిను ఒక చివర నుంచి మరో చివరకు వెళ్లే వైరు ఇవతలికి తీశారు. కత్తెరలో చిన్న ముక్క కత్తిరించి మళ్లీ కనెక్షనిచ్చి లేచి స్విచ్ ఆన్ చేశారు. ఈసారి యంత్రం అంతా పూనకం వచ్చినట్టు ఊగిపోయింది. రెండు అంగల్లో స్విచ్ ఆపి, పెదాలు బిగించి మోటారు వైపు నిశితంగా చూస్తూ ఉండి పోయారాయన. మోటారు రీవైండ్ చేసిందే. అందులో పొరబాటు ఉండదు. ఓ క్షణకాలం తరవాత మెషిను కడుపులో ఏదో కాలుతున్న వాసన వచ్చింది. చిన్న నవ్వుతో నాయుడిగారి నల్ల పెదాలు విచ్చుకున్నాయి. స్టూలు దగ్గరికి జరుపుకుని రెంచి అందుకున్నారాయన.
“నాన్నా! మేం ఎళ్లొస్తాం. జాగ్రత్త మీరు”
“పదండి”
గేటు వరకు సాగనంపారు నాయుడుగారు. స్కూటరు బయటికి తియ్యబోతూ వరండాలో వేంచేసిన అమ్మతల్లిని చూశాడు కృష్ణ. అలాగే తండ్రి వైపు చూశాడతను. ఆయన వీధి వైపు చూస్తున్నారు. చేతులింకా నూనె మరకలతో ఉన్నాయి ఓ చేతిలో మసిగుడ్డ. వాహనం బయట పెట్టి స్టాండు వేశాడు. తలుపు గడియ వేసి వెళ్లి నాయుడుగారు అమ్మతల్లి కడుపులో చెయ్యి పెట్టారు. చేత్తో జాగ్రత్తగా తడుముతూ చిన్న వైరు బయటికి లాగారు.
కృష్ణ మొహం చెమటపట్టింది. నాలుగు కిక్కులకి వాహనానికి ప్రాణం వచ్చింది. అతని చెప్పు తెగినంత పనైంది. విసురుగా స్కూటరు లాగాడతను.
“ఎక్కదల్చుకోలేదా, చూస్తూ నుంచుటావేటి?”
“ఇప్పుడే గదండీ.” సరళ కొంచెం చిన్నబుచ్చుకుని వెనక కూచుంది. ఒక్క ఉదుటున గుర్రంలా ముందుకి దూకింది చేతక్. గట్టిగా అతని భుజం పట్టుకుందామె.
“నీకు తయారవడానికి ఎంత టైమైనా చాలదు."
ఆమె ఏమీ అనలేదు. సమాధానం చెప్తే మలక్ పేట వెళ్లి వచ్చే వరకూ దెప్పుతూనే ఉంటాడు కృష్ణ.
వాళ్లు వెళ్లిన గంట వరకూ నాయుడుగారు అమ్మతల్లి దగ్గరే ఉన్నారు. ఆయనకి యంత్రం అర్ధమైంది కానీ ఎక్కడో ఏదో చిన్న మెలిక చేతిలోంచి జారిపోతోంది. సమస్య మెషిన్లో ఉందో, తనలో ఉందో తెలీడం లేదు. అది మెరాయించే కొద్దీ అదే మోతాదులో ఆయనకి ఓపిక ఎక్కువవుతోంది. అలిగిన స్నేహితుడిలా కనిపించిందతనికి. కాసేపు టీవీ చూసి పెన్సిలూ, పెద్ద కాగితం, స్కేలూ తీసుకని డైనింగ్ టేబులు మీద పరిచారు. ముందు రెండు దీర్ఘచతురస్రాలూ, తరవాత గీతలతో సున్నాలతో కాగితంనిండా యంత్రం తయారైంది. లోపలి భాగాన్ని విడిగా కాగితం కింద గీశారాయన. కొలతలు తగ్గిస్తూ, వేస్తూ, గీసినవి తుడుపుతూ ప్రాణప్రతిష్టకి కీలకం వెతుకుతూ ఉండిపోయారు నాయుడుగారు.
గోడ మీద వాద్యగడియారం అయన్నీ లోకంలోకి తెచ్చిపడేసింది. ఎనిమిది. కళ్లజోడు తీసి మొహం తుడుచుకుని వరండాలోకి వెళ్లి సిగరెట్టు వెలిగించారు. ఈ పాటికి వస్తూండాలి. ఎక్కువసేపు ఉండవనే చెప్పారు. సిగరెట్టు కాలుస్తూ నుంచుండిపోయారాయన. కార్లూ, బస్సుల, స్కూటర్ల, సైకిళ్ల పద్మవ్యూహంలోకి వేగంగా, అసహనంగా చొచ్చుకుపోతున్న కొడుకు కనిపించాడు. అతని చేతిలో గేర్లు హింసబడుతున్నాయి. కళ్లు చికిలించి, ముక్కుపుటాలెగరేస్తూ నడుపుతున్నాడతను. అతనికీ, రోడ్డుకీ ఇతర వాహనాలకీ సంబంధం ఉన్నట్టు కనిపించదు నాయుడుగారికి. వాహనాన్ని శిక్షిస్తూ వెళ్లిపోతాడు. స్కూటరు అతని శరీరానికి అతుక్కున్న ఇనపముక్కలా, దాన్ని త్వరగా వదిలించుకోవాలనే ఆదుర్దాతో కనిపిస్తాడతను. స్కూటర్ని అతను నడిపిస్తాడో, అతన్నే స్కూటరు నడిపిస్తుందో నాయుడుగారికీ ఎప్పుడూ సరిగా అర్ధం కాలేదు. ఎనిమిదన్నర అయినా ఇద్దరూ రాలేదు. ఈసారి ఫోన్ కి పెట్టుకోవల్సిందే. స్కెచ్ పరిశీలిస్తూ కూచుండిపోయారాయన.
తొమ్మిది అవుతుండగా స్కూటరుగేటు దగ్గర ఆగడం వినిపించింది. భళ్లున గేటు తెరుచుకుంది. సరళ తలొంచుకుని లోపలికి వెళ్లిపోయింది. కృష్ణ కుర్చీలో కూలబడ్డాడు.
“ఇంత ఆలస్యం అయిందేం?"
ఒంటి మీద చొక్కాను తొక్కలా ఊడదీస్తూ విసుగ్గా అన్నాడతను.
“ఆళ్లు వదల్లేదు. ఈవిడెగారు వాళ్లని వదల్దు. ఎదవ కబుర్లు. దార్లో మామూలే. ఎదవబండి రెండుసార్లు ఆగింది. పంచరైందనుకున్నాను. ఏదో తెగులు.”
బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్లాడతను. కాయితం నిలువుగా చుట్టి అలమరలో పెట్టారు నాయుడుగారు. క్షణంలో లోపల్నించి భార్యాభర్తలు గొంతు తగ్గించి గొడవపడుతున్నారు. ఇది కొత్తకాదాయనకి. కృష్ణ కోపం భార్య మీద కాదని తెలుసు... నాయుడుగారికి. అందులో సందేహం లేదు.
మళ్లీ ఎందుకో, అనుకోకుండా అమ్మ తల్లిని ఇంటికి తీసుకొచ్చిన రోజు జ్ఞాపకం వచ్చింది. అంతకుముందు జగన్నాథం ఇంటికి వెళ్లారు నాయుడుగారు. కాసేపు కబుర్లు చెప్పుకుని రెండు సిగరెట్లు కాల్చి ఇంటికి వెడతానంటూ లేచాడు. మెట్లు దిగుతుండగా “నాయుడూ! మర్చిపోయాను. నీకోటి చూపించాలి. రా చెప్తా” అంటూ జగన్నాథం ఇంటి పక్కకి తీసుకెళ్లాడు.
గోడనా పాత బడిపోయిన మెషిను నిర్జీవంగా పడి ఉంది.
"ఓల్డు బ్రిటీష్ మోడలు చూసావా ?"
“ఎక్కడిదయ్యా బాబూ!"
“దీని కథ చాలా ఉందిలే. అదెందుగ్గానీ అసలు నువ్వోసారి చూడు. నాకయితే పీచు మిఠాయి కొనుక్కోవడానిక్కూడా పనికిరాదనిపిస్తోంది”.
నాయుడుగారు మెషిన్ దగ్గరికెళ్లి జాగ్రత్తగా, నిశితంగా చూశారు. కాసేపు చూడగానే నాయుడుగారి చేతులూ, వేళ్లూ ఉత్సాహంగా చలించాయి.
'ఏం జేస్తావు మరి?"
"ఆ! అణాకో, బేడకో అమ్మి పడేస్తాను." -
ఓ క్షణం ఆలోచించి నాయుడుగారన్నారు.
“వద్దులే. ఇంటికి పంపించు చూద్దాం. బావుంది. దాని గొడవలోబడితే నాకూ బావుంటుంది.”
అణా బేడా కాకుండానే రెండ్రోజుల తరవాత ఓ మధ్యాహ్నం అమ్మతల్లి నాయుడుగారి వరండాలో తయారైంది. లోపల్నించి కరెంటు వైరు బైటికి లాగి స్విచ్ బోర్డు తగిలించి సిద్ధం చేశారాయన.
“ఏంటండి మామయ్యగారూ?"
ఆమెకీ అర్ధం కాలేదు. దాని వాలకం చూస్తే బాగయ్యేలా కనిపించడం లేదు. ఉత్సాహంగా చేతులు రుద్దుకున్నారు నాయుడుగారు.
“బాగవుతుందండీ?”
"తెలీదమ్మా. అవుతుందనుకుందాం.”
టీ తాగి మెషిన్ దగ్గర కూచున్నారు నాయుడుగారు. పాత బట్టతో మొత్తం శుభ్రం చేసి అక్కడక్కడా నూనె వేసి వైర్లు, ట్యూబులు బయటికి లాగడం ప్రారంభించారు. సాయంకాలం ఆఫీసు నుంచీ వస్తూనే వరండాలో మెషిన్ కళేబరాన్ని చూశాడు కృష్ణ వాహనాన్ని ఒక్కలాగుతో స్టాండు వేసి దగ్గరకొచ్చాడు. కొడుకు రావడం గమనించలేదాయన.
"ఏమిటిది?
ఉలిక్కిపడి తలెత్తి చూశారు నాయుడుగారు.
“జగన్నాథం పంపించాడు. చూస్తున్నాను. బాగానే ఉంది."
“దీన్ని రిపేరు చేద్దామనే?”
“అందుకేగా. చేస్తావుంటే బావుంటుంది.”
“ఎందుకు నాన్నా అది? నయాపైస కూడా పనికిరాదు. ఎందుకు బాగుజెయ్యడం?"
“లాభం గురించి కాదయ్యా. అసలు ట్రబులు ఏమిటో చూస్తున్నాను. అప్పుడే తెలీదు."
“మీరనవసరంగా హైరానాబడ్డం తప్ప ఎందుకిదీ?”
“రన్నింగులో పెడితే మంచిది. పెర్ ఫెక్ట్ గా స్మూత్ గా నడిపించాలని.”
“మీ చాదస్తం అంతే.”
తలుపు తీసిన శబ్దం అయింది. వెనుక. సరళ ఒక్కత్తే వచ్చింది. టేబులు మీద భోజనం వడ్డించి అంది.
“ఆలస్యం అయిపోయింది. మీరు రండి. ఆయనగారికి తలపోటుగా ఉందండి.”
సరళ మొహం వాడిపోయి కనిపించిందాయనకి. రెండుచపాతీలు తిని లేచారాయన. బయటికి వెళ్లి సిగరెట్టు వెలిగించారు నాయుడుగారు.
బాగా పదిన్నర దాటింతరవాత మెళకువ వచ్చింది సరళకి. కృష్ణ అటు తిరిగి పడుకుని నిద్రలో ఉన్నాడు. ముందు గది తలుపు మామయ్యగారు వేశారో లేదో! సడగ్గది తలుపు తీసిందామె. ముందు గదిలో లైటు వెలుగుతూనే ఉంది. పెద్దకాగితం టేబులు మీద పరిచి ఓ చేత్తో స్కేలు పట్టుకుని పెదాలు బిగించి అమ్మతల్లి బొమ్మవైపే చూస్తున్నారు నాయుడుగారు. అప్రయత్నంగా చెయ్యి చాపి సిగరెట్ తీసి వెలిగించారాయన.
From the publisher's feed

52 Listeners