Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • దేశమును ప్రేమించుమన్నా | Desamunu Preminchumanna | Telugu Short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

    'Desamunu Preminchumanna' New Telugu Story Written By

    Gannavarapu Narasimha Murthy

    'దేశమును ప్రేమించుమన్నా' తెలుగు కథ

    రచన: గన్నవరపు నరసింహ మూర్తి

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


    ఆరోజు చంద్ర‌శేఖ‌రం పొలానికి వెళుతున్న స‌మ‌యంలో భార్య ఇందుమ‌తి వ‌చ్చి “త్వ‌ర‌గా రండి. ఇవాళ అబ్బాయి వ‌స్తునాడు. వాడికేదో మంచి ఉద్యోగం వ‌చ్చిందిట‌..” అని చెప్పింది.

    “రానీ.. వ‌స్తే ఎక్క‌డికి వెళ్ళిపోతాడు చెప్పు? వాడేమీ అల్లుడు కాదు రాగానే నేను లేకపోతే ఏమైనా అనుకోడానికి” అంటూ చంద్ర‌శేఖ‌రం పొలానికి వెళ్ళిపోయాడు.

    చంద్ర‌శేఖ‌రం ఎమ్మే చ‌దివి అదే ఊళ్ళో టీచ‌రుగా ప‌నిచేస్తున్నాడు. అత‌ని భార్య ఇందుమ‌తి మేన‌మామ కూతురే.. వాళ్ళ‌కి పెళ్ళైన ప‌ది సంవ‌త్స‌రాల‌కు పుట్టాడు సుభాష్‌.. ప్ర‌స్తుతం ఇంజ‌నీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల వేట‌లో ఉన్నాడు. కొడుకుని సివిల్ ఇంజ‌నీరింగ్ చ‌దివించి ఇక్క‌డే రాష్ట్ర ప్ర‌భుత్వంలో ఇంజ‌నీరుగా చెయ్యాల‌ని చంద్ర‌శేఖ‌రం కోరిక‌..

    కానీ సుభాష్ త‌ద్విరుద్ధంగా కంప్యూట‌ర్ సైన్స్ చ‌దివి అమెరికా వెళ్ళే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. అత‌ను త‌మ‌ని వ‌ద‌లి అమెరికా వెళ్ళ‌డం ఆ దంప‌తుల‌కు సుత‌రామూ ఇష్టం లేదు.. కానీ సుభాష్ ఈత‌రం కుర్ర‌వాడు..

    ఆధునిక‌త‌ను వంట ప‌ట్టించుకున్న‌వాడు కావ‌డంతో త‌ల్లిదండ్రుల మాట పెడ‌చెవిని బెట్టి అమెరికా వెళ్ళే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు.

    అందుకు తగ్గట్టుగా సుభాష్ చ‌దువు పూర్తి కాగానే హైద‌రాబాద్ వెళ్ళి అక్క‌డ ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్స్ ఆటోమేష‌న్‌, ఈ-కామ‌ర్స్ లాంటి కొత్త సాఫ్ట్ వేర్ లాంగ్వేజెస్ నేర్చుకునీ జీ అర్ ఈ ప‌రీక్ష వ్రాసేడు. అందులో మంచి స్కోర్ వ‌చ్చింది. ఈలోగా అత‌నికి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం వ‌చ్చింది.. అందులో చేరాలా లేక అమెరికా వెళ్ళి ఎమ్ఎస్ చ‌దివి అక్క‌డ ఉద్యోగం చెయ్యాలా అన్న మీమాంస‌లో ఉన్నాడు..

    అదే విష‌యాన్ని త‌న తండ్రి చంద్ర‌శేఖ‌రానికి చెబితే “నువ్వు ఇక్క‌డికి వచ్చిన తరువాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం” అని చెప్ప‌డంతో సుభాష్ గోదావ‌రిలో బ‌య‌లుదేరి ఈరోజు వ‌స్తునాడు.

    చంద్ర‌శేఖ‌రానిది స్వాతంత్య్ర స‌మ‌ర యోధుల కుటుంబం. అత‌ని తాత బాల‌గంగాధ‌ర్ తిల‌క్‌.. అత‌ను గాంధీతో క‌ల‌సి దండి ఉప్పు స‌త్యాగ్ర‌హంలో పాల్గొన్న గొప్ప దేశ‌భ‌క్తుడు. అత‌ని తండ్రి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడైన బాల‌గంగాధ‌ర తిల‌క్ మీద అభిమానంతో కొడుక్కి ఆ పేరు పెట్టాడు. అప్ప‌ట్లో దేశంలో చాలామంది స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల పేర్లు పెట్టుకునేవారు. అత‌ని కొడుకు అంటే చంద్ర‌శేఖ‌రం తండ్రి సుభాష్ చంద్ర‌బోస్ కూడా తండ్రి కంటే గొప్ప దేశ‌భ‌క్తుడు; బ్రిటిష్ వాళ్ళ‌ను ఎదిరించి లాఠీ దెబ్బ‌లు తిన్న‌వాడు.. చంద్ర‌శేఖ‌రం త‌ల్లి సుశీల‌కు ప‌ద‌హారేళ్ళ వ‌య‌సులో సుభాష్‌తో పెళ్ళైంది..

    అప్ప‌ట్నుంచి ఆమె భ‌ర్త అడుగుజాడ‌ల్లోనే న‌డిచింది. దేశం కోసం స్వాతంత్య్ర పోరాటం చేస్తూ త‌మ జీవితాల‌ను త్యాగం చేసారు ఆ దంప‌తులు.. పిల్ల‌లు ఉంటే త‌మ పోరాటానికి ఆటంక‌మౌతుంద‌ని స్వాతంత్య్రం వ‌చ్చేదాకా ఆ దంప‌తులు పిల్ల‌ల‌ను వ‌ద్ద‌నుకున్నారు. అందుకే చంద్ర‌శేఖ‌రం ఆ దంప‌తుల‌కు న‌ల‌భై ప‌దులు దాటిన త‌రువాత పుట్టాడు. కొడుక్కి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడైన చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ పేరు పెట్టుకొని త‌న దేశ‌భ‌క్తిని చాటుకున్నాడు సుభాష్ చంద్ర‌.

    చంద్ర‌శేఖ‌ర్, అమ్మ సుశీల కోరిక మీద ఆమె త‌మ్ముడి కూతురైన ఇందుమ‌తిని పెళ్ళి చేసుకున్నాడు.


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/pOsr4HkIiWA

    10 min
  • సరదాగా సందడి కోసం | Saradaga Sandadi Kosam | Telugu Short Story | Pandranki Subramani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
    'Saradaga Sandadi Kosam' - New Telugu Story Written By Pandranki Subramani

    'సరదాగా సందడి కోసం' తెలుగు కథ

    రచన : పాండ్రంకి సుబ్రమణి

    (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఇప్పటి ఆందోళనకర పరిస్థితి యెలాంటిదో యెలా విస్తరిస్తుందో అందరికీ అవగతమే. నా బడిరోజుల్లో నేను చదివిన అపరాధ పరిశోధక నవల్సులో ఒక పదం తరచుగా కనబడేది- లాకప్. ఇప్పడు అదే రీతిన వినిపించే పదం- లాకవుట్. సామాజిక వాతావరణం యెంత జటిలంగా తయార యిందంటే; మనిషి తోటి మనిషిని మానవ రూపంలో చూడడం మానుకుంటున్నాడు. అల్లంత దూరం నుంచి పరికిస్తూనే కరోనా వైరస్ గానో మరొక కొత్తరకపు వైరస్ గానో తల పోస్తున్నాడు. కరోనాను కట్టెదుట చూస్తున్నట్లే బెరుకు బెరుకుగా చూస్తున్నాడు. ముఖ కవచాన్ని తరచుగా సర్దుకుంటున్నాడు. బిర్ర బిగించుకుంటున్నాడు.

    రోడ్డుపైన కనిపిస్తే చాలు నడచిపోతూన్న మనిషిని గుర్రుగా అదోలా కళ్ళు మిటకరిస్తూ దగ్గరకు వస్తున్నాడు రక్షక భటుడు. ఇటువంటి క్లిష్ట సమయంలో యిరుగ పొరుగు ప్రయాణాలకు దూరమయి యింట్లోనుంచి బైటకు కాలుపెట్టలేని స్థితికి లోనయిన ఒక విశ్రాంత ప్రభుత్వోద్యోగి పరిస్థితి యెలా ఉంటుంది? ఊహించడానికే కంపరం కలుగుతుంది కదూ! వెన్నెముకలో చలి పుడ్తుంది కదూ! ఇంటా బైటా వైరస్ కి మొదటి టార్గట్ అరవై యెళ్ళు పైబడ్డ విశ్రాంత జీవులే-- విశ్రాంత కేంద్ర ప్రభుత్వోద్యోగిగా దాదాపు నా పరిస్థతి కూడా అంతే-- అధ్యయనంలో మునిగి తేలడం యెంతటి ఆసక్తి గల అంశమైతే మాత్రం, రోజంతా పుస్తకం చేతబట్టుకుని కూర్చోలేము కదా! బిరబిర వ్రాస్తూ ఉండలేము కదా! అందులో వార్తా పత్రికల ప్రచురణలు కూడా కరువాయె--

    అటువంటి స్తబ్ధ వాతావరణంలో ఆ రోజు అందరిలాగే నేను కూడా యథాలాపంగా టీవీని ఆన్ చేసాను. ఉలిక్కిపడుతూ కళ్ళు మిటకరించాను, రివటలాంటి ఇద్దరమ్మాయిలు గెంతులు వేస్తున్నా రు. ఆడుతూ పాడుతూ చీరచెంగుల్ని ఉండలు చుట్టుకుంటూ గుట్టలపైకి యెక్కేస్తున్నారు. పూల చెట్ల పొదల్లోకి యెవరూ దూరలేని సందుల్లోకి దూకేస్తున్నారు. ఇద్దరూ చేతులు పైకెత్తి ఉద్వేగపూరితంగా పాడుతూ ఆకాశాన్ని దగ్గరకు రమ్మనమని ఆహ్వానిస్తున్నారు. అసలీ అమ్మాయిలిద్దరూ మానవ లోకానికి చెందినవారేనా! లేక టీవీ చానెల్ వాళ్ళు పొరపాటున ఎప్పటిదో ప్రాత కార్యక్రమాన్ని తిరిగదోడి చూపిస్తున్నారా, ఇప్పటి కాలమాన ఉద్రిక్త పరిస్థితుల్ని అలవోకగా విస్మరించి! చూసినవారు నవ్విపోదురు గాక—కాదు! అటువంటిదేమీ జరగ లేదు.

    యవ్వన ప్రాయంలో ఉన్న అమ్మాయిలిద్దరూ పూర్తి స్పృహతోనే ఉత్సాహాన్ని పుణికి పుచ్చుకునే చెంగు చెంగున నాట్యమాడుతున్నారు. టీ వీ చానెల్ వాళ్ళు కావాలనే ఆ కార్యక్రమాన్ని చూపిస్తున్నారు. ఇదెలా తెలుసుకున్నానంటే— చిట్ట చివరన ఒక వ్యాఖ్యానాన్ని చేసారు యాంకర్లు—కొద్ది సేపు కరోనాను మరచి సరదాగా ఉందామని-- అప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. ఉన్నపాటున గతంలోకి వెళ్ళిపోయాను. నా జీవితంలోనూ సరదాగా సంతోషంగా గడిపిన సంఘటనులు ఉన్నాయి కదా-- ఎప్పుడూ మార్కు లిస్టులా వస్తూన్న కరోనా కేసుల గురించే, వేసుకోబోబ బూస్టర్ డోసుల గురించే పదే పదే తలపోస్తూ ఉండేకన్నా నా కెదురైన ఒకటి రెండు నవ్వు పుట్టించే ఉదంతాలను తోటివారితో పంచుకోవచ్చు కదా! మనసుని అటునుంచి యిటు మళ్ళించ వచ్చు కదా! కథల రాయుడిగా ఇది నా కనీస సామాజిక కర్తవ్యం కాదూ!

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/g-yQsHPwNm0



    10 min
  • మా తిరపతి పయానం | Ma Tirapati payaanam | Telugu Short Story | Varanasi Bhanumurthy Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    'Ma Tirapati payaanam' New Telugu Story Written By Varanasi Bhanumurthy Rao

    'మా తిరపతి పయానం' తెలుగు కథ

    రచన: వారణాసి భానుమూర్తి రావు

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


    మా నాయనకు తిరపతి బోవల్లని బలే ఆశగా ఉండేది. పుట్టినెంట్రుకులు పుట్టిన బిడ్డలకు తీసుకొనే పొయ్యేదానికి తిరపతికి పోయి గుండు కొట్టించే అలవాటు మా ఇంట్లో వుండేది. ‌ పుట్టినెంట్రుకలు తీయించే దానికి కొందరు గుర్రం కొండ కాడుండే రెడ్డమ్మ కొండకు, కొందరు చౌడేపల్లి కాడుండే చౌడమ్మ గుడికి పోతారు. మా నాయన అప్పో సప్పో చేసి తిరపతికి పోతా వుండె. తిరపతికి పోవల్లంటే కర్చు చ్యానా అవుతుంది. మా కుటుంబం పోవల్లంటే నూరు రూపాయలయినా గావల్ల. అంత దుడ్డు మా కాడ ఉండేది గాదు.


    మా నాయన నాకు ఆరేడేళ్ళు వచ్చినా పుట్టినెంటుకలు తీయించలా నాకు.


    "పాపం‌ మగ పిల్లోడు.. యాందీ దరిద్రము? ఆడ పిల్ల మాదిరి జుట్టు పెంచుకొని జడ ఏస్తావుంటే నాకు ఏడుపు వస్తా వుండాది. నాకు కోపమొస్తే మంగలోళ్ళ రామన్న పిలిపించి ఇంట్లోనే గుండు కొట్టిస్తా!" అని గట్టిగా మా నాయన్ను తిడ్తా వుండేది మా యమ్మ.


    మా నాయన నన్ను తీసుకొని ముద్దు చేసే వాడు. “సూడు నా కొడుకు! ఎంత అందంగా ఉండాడో! జుట్టు పెద్దదయినా గిరజాలు వేసుకొని, రిబ్బన్లు ఏసుకొని, చిన్ని కిట్టయ్య మాదిరి వుండాడు." అని నన్ను దగ్గరకు తీసుకొని ముద్దులు కురిపించే వాడు మా నాయన.


    "నాయనా! నాకు మగ పిల్లోళ్ళ మాదిరి క్రాపు చేయించు. నన్ను చూసి నా స్నేహితులంతా గేలి చేస్తా వుండారు. ఆడోడా.. అడోడా అని పిలుస్తా నవ్వతా వుండారు. నాకు బిరీన గుండు కొట్టిస్తావా ? లేదా?" అని నేను చానా కోపంగా అడిగినా.


    "తిరపతికి పోదాము నాయనా! ఈ సారి కూరగాయలు ఏసినాము గదా మన మడ్లో! వారం వారం అమ్మతా వుణ్డాము గదా మాలు సంతలో.. కలకడ సంతలో గూడా అమ్మతా వుండాము. ‌ఈ సారి మన ఆవులు ఈని నాయి గదా? పాలు గూడా బాగా యిస్తా వుండాయి. కవ్వం పెట్టి అమ్మ సిలికితే మస్తుగా వెన్న పడతా వుండాది. ఆ ఎన్న వుట్టి మీద ముంతలో పెట్టి వారానికి ఒక సారి మరగ పెడితే నెయ్యి వస్తా వుండాది. నెయ్యి గూడా సొలిగె పావలా లెక్కన అమ్మతా వుండాము. రూపాయికి నాలుగు సొలిగెల నెయ్యి. నూరు రూపాయలు సేతిలో పడితే తిరపతికి అందరమూ పోతాము నాయనా!" అని మా నాయన కథంతా సెప్పె.


    బియ్యం గూడా శేరు రూపాయి అని మా నాయన చెప్పినాడు. అందుకే మేము నూకలు కొనుక్కొని రాగి సంగటి చేసుకొని తింటాము. బియ్యం ధర ఎక్కువంట.


    నాకు ఏ ఇసయ మైనా మా నాయన పూస గుచ్చి నట్లు చెప్తాడు. ‌ అందుకే నాకు అన్ని ఇసయాలు మా అన్న, అక్క కంటే నాకే బాగా తెలుసు. ‌ చానా విసయాలు నేను మా నాయన దగ్గరే నేర్చు కొన్నా! ఎందుకంటే నేను సిన్న కొడుకును గదా! అందుకే మా నాయనకు నేనంటే స్యానా ఇష్టం.


    రెండు, మూడు నెలల తరువాత మా నాయన నూరు రూపాయలు సంపాయించి నాడు.


    ఒక మంచి రోజు సూసు కొని పొద్దున్నే ఆరు గంటలకు స్నానాలు చేసి, మంచి బట్టలు ఏసు కొని, నేను మా నాయన, మా అమ్మా, మా యన్న, మా యక్క ఇంటిలో ఎంకటేస్వర సామి పటానికి టెంకాయ కొట్టి అందరమూ తిమ్మాపురం క్రాసు కాడికి నడుసుకొంటా పోతిమి.


    అమ్మ సిత్రాన్నము, గడ్డ పెరుగన్నము టిఫిన్ గిన్నెల్లో కట్టుకొని గుడ్డ మూత కట్టి బిగించె. ‌ ఇంకా మా యమ్మ మేము తినేదానికి అప్పచ్చులు, కారాలు, చుట్టలు, పప్పు బిళ్ళలు, కారం బెట్టి వేయించిన అనప కాయ గింజలు, వేయించిన చెనిక్కాయ గింజలు, పాగం పప్పు వుంటలు, జొన్న బొరుగుల బెల్లం కలిపిన వుంటలు అన్నీ ఎత్తుకొని తిత్తిలో పెట్టుకొని ఇల్లు బీగాలు వేసుకొని నడిస్తిమి. ‌


    ఈ రెండు రోజులూ గొడ్డూ గోదా తిండి కోసం మా ఇంటి పక్కనున్న మా మామోళ్ళకు జాగరత్త గా చూసుకోమని చెప్పితిమి. మాకు కోడి పెట్టలు, పుంజులు నాలు గైదు వుండాయి. వాటి కోడి పిల్లలు పదో ఇరవై వుండాయి. ‌రాత్రి అయిందంటే ఆటిని పెద్ద గంపల కింద చేర్చల్ల. ఆ పని మా అత్తోళ్ళకు చెప్పి నాము. నాలుగైదు మేకలుండాయి‌. ఆటిని మేతకు తీసుకొని పోవల్ల అని మా మామా వాళ్ళకు చెప్పితిమి.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/kAr2TiZ4a_U


    12 min
  • జనని భారతి | Janani Bharathi | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 

    'Janani Bharathi' New Telugu Story Written By M R V Sathyanarayana Murthy

    'జనని భారతి' తెలుగు కథ

    రచన: M R V సత్యనారాయణ మూర్తి

    (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    "మన బ్యాచ్ లో చాలా మంది యు. ఎస్. వెళ్ళడానికే మొగ్గు చూపుతున్నారు. ఇటీజ్ ఎ వైజ్ డెసిషన్. ఆ.. కావేరి, నీ నిర్ణయం చెప్పలేదు.. యు. ఎస్. కా.. ఆస్ట్రేలియా కా ?” అడిగాడు రాహుల్.

    అతని ప్రశ్నకి దీర్ఘంగా శ్వాస విడిచింది కావేరి. “నేనింకా ఎటూ డిసైడ్ అవ్వలేక పోతున్నాను. ఇంటికి వెళ్ళాక ఆలోచించి నీకు ఫోన్ చేస్తాను” అంది కావేరి.

    “ఓకే. టేక్ యువర్ ఓన్ టైం. కానీ ఇండియా లోనే ఉంటానన్న స్టుపిడ్ ఆలోచన మాత్రం పెట్టుకోకు” అన్నాడు రాహుల్ బిగ్గరగా నవ్వుతూ.

    అతని మాటలకి కావేరి మనసులో కొద్దిగా బాధ కల్గింది. బెంగళూరు లో మెడిసిన్ లో పి. జి. చేసిన తెలుగు వారి ఫేర్ వెల్ పార్టీ అది. రాహుల్ వాళ్ళు అందరికీ లీడర్. ప్రస్తుతం ఈ పార్టీ ని స్పాన్సర్ చేసింది అతనే. పార్టీ అయ్యాక రూమ్ కి వచ్చి లగేజి సర్దుకుని ట్రైన్ ఎక్కింది కావేరి. ఆమె స్నేహితులు చాలా మంది విమానంలో వెళ్ళిపోయారు.

    మర్నాడు ఉదయం తణుకు లో ట్రైన్ దిగి, నర్సాపురం బస్సు ఎక్కి శివాపురం వచ్చింది కావేరి. రమణమ్మ కూతుర్ని కౌగలించుకుని చాలా సంతోషపడింది. తన కూతురు ఇప్పుడు ఒక పెద్ద డాక్టర్! ఆ విషయం తలుచుకోగానే ఆమె కళ్ళ వెంట ఆనందభాష్పాలు జల జలా రాలాయి.

    “అమ్మా, ఇప్పుడు నీకు సంతోషమేనా?” తల్లి కన్నీళ్లు తుడుస్తూ అడిగింది కావేరి.

    “ఆ.. చాలా సంతోషం తల్లీ. నా మాట నిలబెట్టావు” అంది కూతురు నుదిటి మీద ముద్దుపెట్టుకుని.

    కావేరి స్నానం చేసి నగరేశ్వర స్వామి గుడికి వెళ్ళింది.

    పూజారి సూర్యనారాయణ గారు “కులాసానా కావేరి? ఎం. డి. పరీక్ష కూడా పాసయ్యావుట గదా, మీ అమ్మ నిన్న చెప్పింది” అన్నారు ఆప్యాయంగా.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/4yw8lB3763c


    13 min
  • ఆకలేస్తోంది బాబూ | Akalesthondi Babu | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 


    'ఆకలేస్తోంది బాబూ' తెలుగు కథ

    రచన: అల్లు సాయిరాం

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    టైం రాత్రి ఎనిమిదిన్నర అవుతుంది. సాయంత్రం నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షం తగ్గితే, నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్దామని ఎదురుచూస్తున్నాడు లోకేష్. ఎంతకీ వర్షం తగ్గకపోయేసరికి గొడుగు పట్టుకుని ఆఫీసుకి నడుచుకుంటూ వస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చేరిన బురదనీళ్ళలో, రోడ్లు తేలుతున్నట్లుగా ఉన్నాయి. కరెంటుపోయి చిమ్మచీకటిగా ఉంది. వచ్చేదారిలో పక్కనున్న ఓ టిఫిన్ సెంటర్ కి వెళ్లి, ఐదు ఇడ్లీలు టిఫిన్ పార్సిల్ చేయించుకుని గబగబా వస్తున్నాడు. రైల్వేస్టేషన్ పక్కనున్న బైక్ పార్కింగ్ స్టాండు దగ్గర నైట్ డ్యూటీకి వస్తున్న సతీష్ కనపడితే, కలిసి మాట్లాడుకుంటూ ఆఫీసుకి వస్తున్నారు. సతీష్ తనకి సీనియర్ ఆఫీసర్. పైగా, కొంచెం ఈగో మనిషి. ఏం మాట్లాడినా, ఏదో విధంగా జోకులు వేస్తూ, తానే నవ్వుతుంటాడు. అందుకని, సతీష్ ఏవేవో జోకులు చెప్తూ నవ్వుతుంటే, ముఖం మీద నవ్వుపూసుకుని మౌనంగా వస్తున్నాడు లోకేష్.

    లోకేష్ తనతో వస్తున్నాడే కానీ, ఎవర్నో వెతుకుతున్నట్టు చూట్టూ చూడడం గమనించిన సతీష్ "ఏంటి! అంతలా చూస్తున్నావు లోకేష్! యిరోజు ఎవరికైనా అపాయింట్మెంట్ యిచ్చావేంటీ?" అని నవ్వుతూ అడిగితే "అదేం లేదులే అన్నా!" అని లోకేష్ అన్నాడు.

    యిద్దరూ నవ్వుతూ ఆఫీసురూంలోకి వచ్చి, బయోమెట్రిక్ హాజరు వేశారు. వెంటనే, టిఫిన్ పార్సిల్ పట్టుకుని బయటకు వస్తుంటే "యిప్పుడే వచ్చావు. మళ్లీ ఎక్కడికి వెళ్లిపోతున్నావు లోకేష్? కాసేపైనా డ్యూటీ చెయ్యబ్బా!" అని సతీష్ అడిగాడు.

    "ఐదునిమిషాల్లో వచ్చేస్తా అన్నా!" అని ఆత్రుతగా బయటికి వచ్చేశాడు లోకేష్.

    అంత ఆత్రంగా లోకేష్ ఎక్కడికి వెళ్తున్నాడని సతీష్ బయటికి వచ్చి చూస్తున్నాడు. లోకేష్ వెతుక్కుంటూ వెళ్లి, పడుతున్న వర్షానికి బాగా తడిసిపోయి, తడి బట్టలతో వణికిపోతూ, మూల కూర్చున్న ఒక పెద్దాయన దగ్గరికి వచ్చాడు. ఆ పెద్దాయనకి కంటిచూపు సరిగా లేకపోయినా, అంత చీకటిలో లోకేష్ రూపం చూడగానే, ఆప్యాయత పూర్వకమైన ముఖంలో నవ్వు వచ్చేసింది. లోకేష్ తినమని టిఫిన్ పార్సిల్ పెద్దాయన చేతికందించాడు.

    అదే నవ్వుతో పార్సిల్ తీసుకున్నాడు పెద్దాయన. వారిద్దరి మౌనంతో కూడుకున్న చూపుల్లో, మాటల్ని మించిన భావాలు పంచుకున్నారు. పెద్దాయన పార్సిల్ విప్పి తినడం మొదలుపెట్టిన తర్వాత అక్కడినుంచి ఆఫీసుకి వచ్చేశాడు లోకేష్.

    ఆఫీసు దగ్గర్నుంచి నిల్చుని యిదంతా చూస్తున్న సతీష్ కి ఏం అర్ధంకాక "అంత ఆత్రంగా ఆయనకి పార్సిల్ యిస్తున్నావేంట్రా? ఆ పార్సిల్ నువ్వు తినడానికి తెచ్చుకోలేదా? ఏం పార్సిల్ కట్టించావ్?" అని గ్యాప్ లేకుండా అడుగుతున్నాడు. "ఐదు ఇడ్లీలు!" అని ఆఫీసు లోపలికివస్తూ చెప్పాడు లోకేష్.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/CUZ-15C7YPY

    17 min
  • ప్రగతి ప్రేమికులు (ధారావాహిక పరిచయం) | Pragathi Premikulu | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ప్రగతి ప్రేమికులు (ధారావాహిక పరిచయం)

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    నా మాట.. మన భారతీయుల తత్వాన్ని, మన హైందవ సిద్ధాంతాలను, సనాతన హైందవ వైదిక ధర్మాలను, ఆధ్యాత్మిక విధానాలను,భక్తి యోగం, కర్మయోగం, రాజయోగాలను గురించి అమెరికాలోని చికాగో నగరంలో 1893 వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగిన విశ్వమత మహాసభలో ప్రపంచ పలు మతా ప్రాగ్యుల ముందు ఎలుగెత్తి చెప్పి, అచ్చెరువొందేలా చేసి, విశ్వవిఖ్యాతి గాంచిన హైందవ జాతి పితామహుడు శ్రీ వివేకానంద స్వామీజీ సుచరిత్ర భావి భారత పౌరులు అందరూ తెలుసుకోవాల్సి వుంది. ఆ తత్వాలకు వారసులైనప్పటికీ.. భిన్నంగా తమ స్వార్ధంతో సాటి మనుషులను చిన్నచూపు చూస్తున్నారు కొందరు. సాటి వారి ప్రాణాలను తృణప్రాయంగా భావిస్తున్నారు. పైశాచిక చర్యలను సాగిస్తున్నారు. ఈ తత్వం దేశప్రగతికి గొడ్డలిపెట్టు.నేరం చేసిన వారు ఎవరైనా శిక్షార్హులు. నేర పరిశోధన పోలీస్ వ్యవస్థ బాధ్యతే కాక, వారికి యదార్థాలను తెలియజేయడం అనేది అందరి కర్తవ్యం. ఈ తత్వాలను నమ్మి, ఆదరించి అభిమానించే కొందరు యువతీ యువకుల సఖ్యత, సాధనే యీ నా నవల ప్రగతి ప్రేమికులు. విన్నపము: వివేకానంద స్వామీజీ దివ్య చరిత్ర ను ది ప్రెసిడెంట్ రామకృష్ణ మట్ మైలాపూర్ చెన్నై పబ్లిష్ చేసి మన జాతి చదివేందుకు అందుబాటులో ఉంచారు. యువత, భావి భారత పౌరులు.. మనమందరం మననం చేయాలని స్వామి వారి దివ్య చరిత్ర ను ఆ అమూల్య గ్రంథం నుండి సంక్షిప్తంగా, యధాతథంగా రాశాను. ఆ మహనీయుల దివ్యచరిత్ర నా కల్పన కాదు. ఇట్లు రచయిత సి ఎస్ శర్మప్రగతి ప్రేమికులు ధారావాహిక 25/05/2023 నుండి ప్రారంభం.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/4XrsnNQZKVo

    3 min
  • ఎవరు నాన్నా ఆవిడ | Evaru Nanna Avida | Telugu Short Story | Penumaka Vasantha | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 


    ఎవరు నాన్నా.. ఆవిడ?

    రచన: పెనుమాక వసంత

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    "ఎవరూ అదీ" అన్నం తిని నీళ్ళు పుక్కిలించడానికి బయటకు వచ్చిన చారి, బయట ఎవరో గేట్ దగ్గర చీకట్లో తచ్చట్లాడుతుంటే చూసి కేక పెట్టాడు.

    వచ్చిన వాళ్ల దగ్గర నుండి సమాధానం లేకపోతే ఈసారి ఇంకాస్త గట్టిగా "ఎవరు?.. అంటే పలకరేం" అన్నాడు.

    ఒక స్త్రీ.. దాదాపు యాబై యేళ్లు పై మాటే.. పైన ముసుగు, మూతికి మాస్క్ ఉన్నాయి. కాటన్, జరీ చీరలో ఉన్న ఆమెను "ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి.. లోపలికి రండి" అన్న చారితో కళ్ల నీళ్ళు తుడుచుకుంటూ లోపలికి వచ్చి "శారద" అనేలోపు..

    "శారద.. అది నా భార్య పేరు. చనిపోయింది గా! ఇంకో శారద అయితే ఈ వీధిలోనే ఆ మూడో ఇంట్లో ఉంటారు, వెళ్లండి. "

    మాస్క్ తీసి "ఏమండీ! నేను శారదను. గుర్తు పట్ట లేదా?" అంది.

    అపుడు శారద ను గుర్తు పట్టిన చారి “అవునూ.. శారదే! ఏంటి ఇలా అయింది.. చిక్కి శల్యం లాగా ఉంది.. బొద్దుగా, తెల్లటి రంగులో ఉండే శారదేనా! నా ఎదురుగా ఇపుడు ఉంది. శత్రువైయినా, ఇంట్లో కి పిలిచి మంచినీళ్లు ఇవ్వటం ఆచారం. ఇంట్లోకి రా!” అని వరండా లో కూర్చోమని కుర్చీ చూపించి, లైట్ వేసి లోపలికి వెళ్ళాడు.

    'అమ్మయ్య! నామీద కోపం లేదు' అనుకుంటూ.. కుర్చీ లో కూర్చుంది. అప్పటి లాగానే ఉంది ఇల్లు ఏమి? మారలేదు. అదే పెద్ద సింహద్వారం, పైన దేముడి ఫోటోలు.. ఇంకొంచం లోపల కి చూసిన శారదకు హల్ గుమ్మం పై అత్త, మామ ఫోటోల కి దండలు. ఆ ఇద్దరూ పోయారన్నమాట!? అపుడు నన్ను ఎంత వేపుకు తిన్నారు.. ఆ పక్కన ఉన్నది ఎవరు..? అని కళ్ళ జోడు సరి చేసుకుని చూసింది శారద.

    నేనే! నా ఫోటో కి దండ.. అలాగే ఆశ్చర్యపోతూ ఆ ఫోటో ను చూస్తూ ఉంటే చారి వచ్చి మంచి నీళ్ళు ఇచ్చాడు.


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/dxaVBYRo0_g


    10 min
  • అశ్వ మేధం - ఎపిసోడ్ - 5 | Aswamedham - Episode - 5 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 


    అశ్వ మేధం ఎపిసోడ్ 5

    రచన : గన్నవరపు నరసింహ మూర్తి

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    చరణ్ ఇంటికి వచ్చి వ్యవసాయ పనుల్లో మునిగిపోయాడు. వారం రోజుల తరువాత ఒకరోజు అతనికి సౌదామిని నుంచి ఫోన్ వచ్చింది. తాను ఫ్లైట్ కి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి కోనసీమకి బయలుదేరుతున్నానీ, మీరు కూడా బయలుదేరి రావాలనీ చెప్పడంతో చరణ్ ఆలోచనలో పడ్డాడు. మొదట్లో వెళ్ళాలా వద్దా అనీ సంశయించినా ఆమె అంతగా చెప్పడంతో కాదనలేక వెళ్ళాలని నిర్ణయించు కున్నాడు. విశాఖ దాకా స్కార్పియోలో వచ్చిన తరువాత అతనికో ఆలోచనవచ్చింది. మళ్ళీ బస్సుకి బయలుదేరడం, అక్కడనుండి ఇంకెన్నో మారి ఆఊరుకి వెళ్ళడంకన్నా జీపులోనే వెళ్లిపోతే తిన్నగా ఆ ఊరెళ్ళిపోవచ్చు. మళ్ళీ పని అయ్యాక తిరిగి వచ్చేయవచ్చు అని జీపు లోనే బయలు దేరాడు; ఆ విషయాన్ని సౌదామిని కి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఆమె తను రాజమండ్రిలో ఎదురుచూస్తూ ఉంటాననీ, కలిసి వెళ్లిపోవచ్చనీ చెప్పింది. విశాఖ నుంచి రెండున్నర గంటల్లో రాజమండ్రి చేరుకున్నాడు. ఆమె చెప్పిన ప్రకారం వెళ్ళి ఆమెని ఎక్కించుకొని మళ్ళీ బయలుదేరింది స్కార్పియో..

    "సౌదామిని గారూ! ఆమె అంటే మీ స్నేహితురాలు; ఆమె పెళ్ళికి మీరు వెళ్ళడం సహజం. కానీ మీతో పాటు నేను వస్తే వాళ్ళేమనుకుంటారో? మీకు ఇబ్బందికాదా? మన గురించి ఎవరు తప్పుగా అనుకున్నా బాధపడాలి” అన్నాడు చరణ్;

    "మనం ఎలా ఉన్నా సమాజం ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటుంది. దానిగురించి మీరు పెద్దగా ఆలోచించకండి. అయినా వరూధినితో నేను అన్నీ చెప్పాను. మీరు నాకు తోడుగా వస్తున్నారనీ, ఈప్రదేశం నాకు కొత్త అనీ దానితో చెప్పాను. కాబట్టి అదేమి సమస్యకాదు. దానిగురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి" అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు చరణ్;

    ఆ తరువాత ఆమె చెప్పిన ప్రకారం ప్రయాణం కొనసాగింది. ముందుగా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం చేరుకుంది. అక్కడనుంచి అమలాపురం దారిపట్టింది. పచ్చటి కొబ్బరి తోటల మధ్యలోంచి, కాలవగట్టుమీదనుంచి వెళుతుంటే అతనికి చాలా ఆనందం కలగసాగింది. ఇంక సౌదామిని కైతే ఆపచ్చటి ప్రకృతిని చూసి మనస్సు పులకించిపోసాగింది. ద్రాక్షారామం గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అక్కడ శివుడిలింగం చాలా పొడవుగా ఉంది. ఆగుడికూడా చాలా పురాతనంగా ఉంది. చాలా సేపు ఆగుడి సౌందర్యాన్ని చూసిన తరువాత కోటిపల్లి రేవుకి చేరుకున్నారు. అది గోదావరి ఒకపాయ గౌతమి; .. ఒడ్డుని రాసుకుంటూ ప్రవహిస్తోంది;

    గట్టంతా పచ్చటి కొబ్బరిచెట్లు.. కనుచూపు మేరంతా సముద్రంలా గోదావరి; దూరంగా తెరచాపలతో పడవులు రేవువైపు వస్తున్నాయి. సూర్యుడి కిరణాలు గోదావరి తరగలపైపడి పరావర్తనం చెందుతున్న దృశ్యం సౌదామినికి చాలా నచ్చింది. కోటిపల్లి రేవంటే ఆమెకి చాలా ఇష్టం. చాలా సినిమాల్లో ముఖ్యంగా బాపు సినిమాల్లో ఎక్కువగా చూసింది; ఎత్తైన గోదావరి ఒడ్డు, ఒడ్డు మీదనే విశాలమైన వటవృక్షం, దాని కింద కాంక్రీటు చవటా.. నిర్మలంగా పారే గౌతమి; కోనసీమకి గోదావరంటే ప్రేమ. వాళ్ళకి అది జీవనాధారం..


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/QLxswShOWww


    18 min
  • Anuvanuvuna Jwalinchina O hrudayana 6 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 6 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 


    అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 6

    రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఖైదీ నెంబర్- 203 పవన్ కుమార్ విషయమై భార్య తెచ్చిన ప్రస్తావన అనాసక్తంగా అదేదో అంటీ అంటనట్టు వింటున్నట్టు కనిపించాడే గాని, మనసున మాత్రం ఎర్రసిరాతో గీత గీసి గుర్తుపెట్టుకున్నాడు. డిప్యుటీ జైలు సూపరింటెండెంట్ అశ్వథ్. గురి తప్పని బుల్లెట్ లా పనిచేయడం అతడికి అలవాటు. అంచేత తను ఆఫీసు రూముకి వెళ్ళీ వెళ్ళిన వెంటనే తన పర్సనల్ అసిస్టెంటు ద్వారా పవన్ కుమార్ ప్రొఫైల్ దస్త్రం తెప్పించుకున్నాడు.

    మంగళ అంతగా స్పందించి చెప్పినప్పుడు తను మాత్రం ఎలా నిమ్మకుండిపోతాడు! తనకున్న విధుల ప్రకారం జైలు చుట్టూ రౌండ్సుకి వెళ్లి వచ్చి, అప్పుడే లీవునుండి డ్యూటీలో చేరిన సూప రింటెండెంట్ గారిని ఒక భారీ సెల్యూట్ తో పలకరించి రాష్ట్ర ప్రభుత్వ జైలు శాఖనుండి వచ్చిన కొన్ని ముఖ్యమైన ఆదేశాలను వివరించి కాఫీటైముకి తీరుబడిగా వచ్చి తన చేంబర్ లో కూర్చున్నాడు. ఒక వేపు కాఫీ సేవిస్తూనే మరొక వేపు దస్త్రంలో పొందుపర్చబడ్డ అనుబంధ పత్రాలను కూడా చూసాడు. కేసు ఫైలులోని కొన్ని ముఖ్యమైన విషయ వివరాలను గుర్చుంచు కోవడం మరచిపో లేదు.

    కాని—పనిలోపనిగా మరొకటి కూడా తలపోసాడు. తను అకారణమైన ఆరాటానికి లోనవుతు న్నాడే మో! తన మాటల సాంరాశాన్ని మెల్లమెల్లగా అర్థం చేసుకుని జీర్ణం చేసుకుని ఓ అభిప్రాయానికి వచ్చే లోపల ఖైదీ నెంబర్- 203 పట్ల కనబరచిన మునుపటి ఆసక్తి తగ్గి ఆ ప్రస్తావన ఇక తేకుండానే ఉండిపోతుందేమో మంగళ! అలాగ్గాని జరిగితే అది తనకు బోనస్ పాయింటే కదా! అయితే—అతడనుకున్నట్టు అలా జరగలేదు.

    మంగళ మూడవరోజు సాయంత్రం పవన్ కుమార్ కేసు సంగతి మరచిపోకుండా ప్రస్తావించింది. ఒక మామూలు రిమాండ్ ఖైదీ పట్ల అంతటి అక్కర చూపిస్తూన్న భార్య పట్ల అతడికి అసహనం వంటిది కలిగింది. ఇంగితంతో దానిని అణచుకుని ప్రతిస్పం దించడానికి కొన్ని క్షణాలు పట్టాయతడికి. ముక్కూ మొహం ఎరగని మూడో వ్యక్తి కోసం- అదీను సీరియస్ నేరారోపణ సూచించే సెక్షన్ ల క్రింద శ్రీకృష్ణ జన్మస్థలానికి వచ్చిన వ్యక్తి పట్ల ఇంతటి ఆరాటం ఎఁదుకు చూపిస్తుందో మంగళ! ఇక పొల్లుపోనివ్వకుండా విషయ వ్యవహారాల రెక్కల్న విప్పి చూస్తే అతడు మంగళకు నిజంగానే మూడో మనిషేనా? ఆ తలంపు నిప్పుకణికై తాకింది. ఖైదీ పూర్తి పేరు- పోకల పవన్ కుమార్. కాలేజీ డ్రాప్ అవుట్. స్వస్థలం భీమవరం ప్రక్కనున్న దిబ్బల పాలెం. వయసు ఇరవై ఎనిమిది. కమిట్ చేసింది సీరయస్ క్రైమ్. అప్పటికి మైనారిటీ తీరని అమ్మాయిపైన అత్యాచారం చేసాడు. అదీను ఆమెను బెదిరించి మెంటల్ టార్చర్ ఇస్తూ వరసగా ఆరునెల్లపాటు అత్యాచారం చేసాడు. కేసు ఫైనల్ స్టేజీ లో నిరూపించబడితే ప్రాత సెక్షన్ ల ప్రకారమయితే తక్కువలో తక్కువ పది సంవత్సరాలు. ఇప్పటి నిర్భయ్ శాసనానుసారం- కోర్టువారు వివిధ కేసు ల్లో ఇచ్చిన చట్టపూర్వక నిర్వచనాల ప్రకారమైతే శిక్షాకాలం ఇంకెన్నేళ్ళో! జీవితకాల కారాగార శిక్ష కూడా పడవచ్చు. అలా తగినంత తీవ్ర దశన శిక్షపడకపోతే విమన్ రైట్స్ యాక్టివిస్టులు ఊరుకోరు. వివిధ కోర్టుల కోరిడార్లను అదరగొడ్తారు.

    వివరణంతా విన్న తరవాత మంగళ కనురెప్పల్ని అల్లార్చి చూస్తూ ఉండిపోయి, రవంత విరామం ఇచ్చిన తరవాత భర్త ముఖంలోకి కళ్ళెత్తి చూసింది. “అంతటి ఘోర అకృత్యం చేసాడా! ఇంపాజిబుల్! ”

    “ఎన్నో కొత్త కొత్త అకృత్యాలు చోటుచేసుకుంటూన్న ఈ రోజుల్లో అది మాత్రం ఎందుకు ఇంపాజిబుల్? ”

    “ఎందుకంటే- ముఖం చూస్తే కళ్లల్లోని కాంతుల్ని చూస్తుంటే అలా అనిపించదని చెప్పాకదండీ! ”

    “ముఖాన్ని బట్టి వేషాన్ని బట్టి వ్యక్తి గుణగణాలను అంచనావేయడం మానుకొమ్మని హెచ్చరించాను కదా మంగళా! ”“ఓకే ఓకే! అతడికి అనుకూలంగా వెళ్ళేలా ప్రాసిక్యూషన్ వాదనల్లో గ్యాప్స్ వంటివేవీ గోచరించలేదా? ”అంటే- అన్నట్టు విస్మ యంగా చూసాడు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/Bt_k23Z9fh8


    12 min
  • ఆ రాత్రి ఏమి జరిగిందంటే | Aa Rathri Emi Jarigindante | Telugu Short Story | Varanasi Bhanumurthy Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఆ రాత్రి ఏమి జరిగిందంటే

    రచన: వారణాసి భానుమూర్తి రావు

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఆ రాత్రి ఎవ్వరో తలుపు తట్టారు. నాకు భయం వేసింది, ఇంత అర్ధ రాత్రి వేళ ఎవ్వరయి ఉంటారబ్బా అని!

    ఏ దొంగలో దోపిడీకి వచ్చారేమో అని భయ పడి పొయ్యాను. నేను వేరే వూరికి ట్రాన్స్ ఫర్ అయినందువల్ల, ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఒక్కడే ఉంటున్నాను. బాంకు మేనేజర్ కావడం వలన బాంకుకు దగ్గరగా ఇల్లు తీసుకొన్నాను.

    మళ్ళీ తలుపు కొట్టిన శబ్దం. బయట వర్షం పడుతోంది. బిగ్గరగా వాన చినుకు ల శబ్ధం వినబడుతోంది. దేవుడి మీద భారం వేసి తలుపు తీశాను. ఎదురుగా ఒక పదహారేళ్ళ అందమైన ఆడపిల్ల. ఆమె ముఖంలో భయం, వళ్ళంతా వణుకుతూ ఉంది.

    ఆమె బట్టలంతా తడిచి పొయ్యాయి. దబుక్కున నన్ను లోపలికి తోసి, తలుపు గడియ పెట్టింది. ఆమె చొరవ కు ఆశ్చర్య పొయ్యాను. " ఏమయ్యిందమ్మా?" అని అడిగాను. ఆమె చలికో, భయానికో గడ గడ మని‌ వణికి పోతూ రెండు చేతుల్తో ముఖాన్ని కప్పుకొని ఏడుస్తోంది. వెంటనే నేను ఒక తువ్వాలు తెచ్చి ఇచ్చాను. మళ్ళీ అడిగాను, ఏమయిందని..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/3T_TbgmGRes


    3 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world