
Sign up to save your podcasts
Or


(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
మధ్య వయసు
రచన: M. భాను
(కథాపఠనం:కే. లక్ష్మీశైలజ)
ప్రతి ఒకరి జీవితంలో మధ్య వయసు పున్నాగ వనం లాంటిది. ఎన్నో సౌరభాలను తీసుకువస్తుంది. జీవితం మీద అవగాహనతో మరింత అందంగా తీర్చుకోవచ్చు. మధ్య వయసులో వచ్చే కష్టాలను చిన్న చిన్న చిట్కాలతో దూరం చేస్తే జీవితం నందనవనమే!సాధారణంగా 40 నుంచి 60 వరకు మధ్య జీవితాన్ని మధ్య వయసు అని పేర్కొంటారు. మధ్య వయసులో వచ్చే ముఖ్యమైన అనారోగ్యాలు, బీపీ షుగర్ లాంటివి.
లత వయసు 50 సంవత్సరాలు. ఆడపిల్లకు పెళ్ళి చేసింది మగ పిల్లవాడు ఉన్నాడు. కూతురు పుట్టినప్పుడు ఆరో నెలలోనే గర్భసంచి జారిపోయిందని డాక్టరు ఆపరేషన్ చేసింది. అప్పుడు పనులు ఒత్తిడిలో బాధ్యతలు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు ఈ వయసు వచ్చేసరికి ఈ మధ్య కొత్తగా యూరిన్ కంట్రోల్లో లేకపోవడం, కొంచెం చల్లగా ఉంటే యూరిన్ కి ఎక్కువగా వెళ్లవలసి రావడం, నిద్ర పట్టకపోవడం, చికాకు కోపం ఎక్కువ అవడం జరుగుతుంది.
భర్తకి లత విషయాలు ఏమి పట్టవు. తనకు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా ఒకటే చూసుకుంటాడు. భార్య ఆరోగ్యం గురించి పట్టదు. ఉన్న ఒక్క ఆడపిల్ల అత్తారింటికి వెళ్లిపోయింది చెప్పుకునే ఆడదిక్కులేదు. ఈ సమస్య ఈ మధ్య మరీ ఇబ్బంది పెడుతోంది. భర్తతో డాక్టర్ దగ్గరికి వెళ్తానంటే నీకేమి గుండ్రాయిలా ఉన్నావు అంటాడు తప్పితే మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/7W75cP3A47Q
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
'క్షమాశీలత' తెలుగు కథ
రచన : Ch. ప్రతాప్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
రామాపురం శివార్లలో స్వర్ణముఖి నది ఒడ్డున విద్యానందుడు అనే గురువు ఒక గురుకులం స్థాపించి శిష్యులకు విద్యాబోధన చేస్తున్నారు. ఆయన సకల శాస్త్ర పారంగతుడు. వేద శాస్త్రాలను, పురాణాలను, ఉపనిషత్తులను ఔపోసన పట్టిన దిట్ట. ఆయన శిష్యరికంలో అనేకమంది సకల శాస్త్ర కోవిదులుగా తీర్చి దిద్దబడి దేశంలో వివిధ ప్రాంతాలలో మంచి కొలువులలో స్థిరపడ్డారు.
శిష్యులకు విద్యాబోధనే కాక తన వద్దకు వచ్చే ప్రజానీకానికి సందేహాలు తీర్చడంతో పాటు వారి సమస్యలకు పరిష్కారం సైతం ఇవ్వగలడంలో దిట్ట అనిపించుకున్నారు. వేద వేదాంగాలలో వున్న అనేక అంశాలను స్పృశించడమే కాక, ఆనాటి కాలంలో ప్రబలంగా వున్న జంతుబలి, బానిసత్వం వంటి అమానవీయ పద్ధతులను మార్చుకోవాలని సూచించేవారాయన. ఈ కారణంగా సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రజానీకం వచ్చి ఆయనను దర్శించుకొని తమ తమ సమస్యలకు పరిష్కార మార్గాలు పొందుతుండేవారు.
విద్యానంద గురువు కి వచ్చిన అపూర్వ ప్రజాదరణ చూసి ఓర్వలేక అప్పడు రాజ్యపాలన చేస్తున్న పర మతస్థుడైన రాజుకి కంటగింపు కలిగింది. పైగా అతని దర్బారులో వున్న అనేకమంది విద్యానందుల వలన తమ మతానికి ఎంతో చెడ్డ పేరు రావడంతో పాటు ఆదరణ కూడా తగ్గిపోతుందని రాజుకు లేనిపోనివి కల్పించి చెప్పారు. వీటి వలన ప్రభావితుడైన రాజు మొదట్లో తన సైన్యాన్ని పంపించి విద్యానందుల వారిని హతమార్చి, ఆశ్రమాన్ని ధ్వంసం చేయద్దామని పధక రచన చేసాడు. అయితే గురువు కి వున్న జనాదరణ, ఆయన ఆశ్రమంపై విధ్వంసకాండ జరిపితే దానిని ఆయన భక్తులు మతం రంగు పులిమే ప్రమాదం వున్నందున ప్రత్యామ్నాయం కోసం తన సన్నిహితులతో సమాలోచనలు జరిపాడు.
ఆ పధకం ప్రకారం కరటయ్య అనే వ్యక్తికి భారీగా సొమ్ము ఆశ జూపి విద్యానందుని ఆశ్రమానికి పంపించారు. కరటయ్య విద్యానందుని పాదాలకు మోకరిల్లి ఆశ్రమంలో లో చిన్నాచితకా పనులు చేసుకునేందుకు అనుమతి నివ్వవలసిందిగా ప్రార్ధించాడు. ఆనాటి నుండి అందరికీ అన్ని పనులలో సహాయం చేస్తూ, అతి విధేయత ప్రదర్శిస్తూ అందరికి తలలో నాలుకలా మెదులుతూ అందరి నమ్మకం సంపాదించుకున్నాడు. మూడు నెలల సమయం తిరిగేసరికి కరటయ్య లేనిదే ఆశ్రమంలో ఏ పని జరగని పరిస్థితి నెలకొంది. పధకం ప్రకారం రాజు ఇచ్చిన మందును నెమ్మదిగా గురువు ఆహారంలో కొంచెం కొంచెం కలపసాగాడు. మోతాదు తక్కువగా వుండడం వలన గురువు కి కూదా మొదట ఎలాంటి అనుమానం రాలేదు.
అయితే రెండు నెలల సమయం తర్వాత శరీరంలో నరాల పటుత్వం తగ్గ సాగింది. కొద్దిరోజులలోనే ఆ సమస్య హఠాత్తుగా పెద్దదై విద్యానందుడు మంచాన పడ్డారు. రోజు వారీ కార్యక్రమాలకు కూడా స్వయంగా లేవలేని పరిస్థితులు వచ్చాయి. పరిస్థితి దిగజారడం గమనించి శిష్యులు ఒక ప్రముఖ వైద్యుడిని రప్పించారు. ఆయన విద్యానందుడిని పరీక్షించి శరీరంలో విషప్రయోగం జరిగిన విషయం నిర్ధారించి, పరిస్థితి చేజారిపోయిందని, అయినా సడలని నమ్మకంతో విషానికి విరుగుడు మందు ఇచ్చి వెళ్ళిపోయారు. జరిగిన విషయాన్ని అర్ధం చేసుకున్న శిష్యగణం ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఆశ్రమంలోనే వుంటూ ఇంతటి నమ్మక ద్రోహానికి ఒడిగట్టినవారెవరా అని ఆలోచించసాగారు..
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/FlSb7Gp9kmI
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన, కథా పఠనం : కే. లక్ష్మీ శైలజ
"నీ పుట్టిన రోజు సందర్భంగా నేను చేసిన పాయసం నువ్వు తిని, 'చాలా బాగుంది,' అంటావు.
వెంటనే ఈ లెటర్ నీకిచ్చి నేను తలుపేస్తాను. నీ గదిలో, నీ ఫోన్ నీ దగ్గర లేకుండా ఉన్న నువ్వు, ఈ లెటర్ మొదలు పెట్టే సమయానికి, నేను బయట సోఫాలో కూర్చొని టి.వి. ఎక్కువ సౌండ్ పెట్టి, నీ గురించి, నీ స్కూల్ గురించి వార్తలు చూస్తుంటాను.
నీకు సపోర్ట్ వస్తున్న వారెవరైనా వుంటే, వాళ్ళు ధైర్యంగా అందరి ముందుకు రాలేరు. ఎందుకంటే నువ్వు చేసిన పని అంత నీచమైంది కనుక. పోలీస్ లు …..పంపితే నిన్ను జైలుకు పంపుతారు.
ఆ శిక్ష నీకు చాలదు. పెళ్ళైన తరువాత నీ చెడు తిరుగుళ్ల గురించి నాకు తెలుస్తున్నా పరువు మర్యాద కోసం నేను నిన్ను వదిలి నా పుట్టింటికి వెళ్ళలేదు. నా తల్లితండ్రులు ఎంతగానో బతిమిలాడుతున్నారిప్పటికీ…నీ లాంటి నికృష్టుడి దగ్గర జీవితం అవసరం లేదు, పుట్టింటికి వచ్చెయ్యమని.
అలా వెళ్ళనందుకు ఇప్పుడు చింతిస్తున్నాను.పైగా మీ అమ్మగారు నాతో 'నీ కెవరో తప్పు చెప్పారు. నా కొడుకు బంగారం' అన్నది.
అందుకని ఇప్పుడు నువ్వు పసికూన మీద చేసిన అఘాయిత్యానికి, వాళ్ళ బంగారానికి ఇప్పుడు నేను వేస్తున్న శిక్షను వాళ్ళు.. అంటే మీ అమ్మా, నాన్నలు కళ్ళారా చూస్తారు.
నేను తలుపు వేసే సమయానికే నేను…నువ్వు కూర్చున్న కుర్చీకి, ఐరన్ సైకిల్ చైన్ కు కట్టి తాళం వేసి వుంటాను. నువ్వు గమనించకుండా చైన్ పైన టవల్ చుట్టేస్తాను. కుర్చీ వెనుక వైపు ఇంకో చైన్, కుర్చీని టేబుల్ కు కట్టేసి వుంటుంది. టేబుల్ మీది ఏ వస్తువూ నీకు అందదు. నువ్వు పోలీస్ లకు కనపడకుండా మన ఇంటి వెనుక వైపు వచ్చి దాక్కున్నప్పుడే నిన్ను చూసిన నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.
కానీ నీతో మంచిగా మసిలి, నిన్ను పోలీస్ ల నుంచి దాచిపెడ్తానని చెప్పాను. నువ్వు నిజంగానే దాచాననుకొని సంబరపడిపోయావు.చిన్న పిల్ల.. స్కూల్ లో చదివే చిన్నారి పువ్వు.. నీ కామానికి ఈ రోజు జీవితమంతా అందరూ వేలెత్తి చూపే పరిస్థితిలో వుంది. రేపు ఆపిల్ల ఎలాబతకాలి? దౌర్భాగ్యుడా….. జీవితానికి ఆశయం లేకుండా గాలికి తిరిగిన నిన్ను, డ్రైవర్ గా పని చేస్తున్నాడు అని చెప్తే …'సరే లే' అనుకొని అమాయకమైన నేను పెళ్ళి చేసుకున్నాను. 45 సంవత్సరాల వయసులో కూడా నీకు కామం తో కళ్ళు మూసుకు పొయ్యాయి.
నాకు పిల్లలు కలుగలేదని ఇన్ని రోజులూ ఎంతో బాధ పడ్డాను. పిల్లలు కావాలని భగవంతుని వేడుకున్నాను కూడా. కానీ భగవంతుని దయవల్ల నాకు పిల్లలు కలుగలేదనీ ఇప్పుడనుకుంటున్నాను. మనకు పిల్లలు ఉండి వుంటే ఈ రోజు వాళ్ళు ఎంతో తల వంచుకొని బ్రతక వలసి వచ్చేది. అందరూ 'అదుగో, వాళ్ళ నాన్న తప్పు పని చేశాడు' అని లోకం నిందిస్తూవుంటే పిల్లలు అవమానంతో తల వంచుకొని ఏడ్చే వాళ్ళు. ఆ బాధ నుంచి నాకు పుట్టని నా పిల్లలు తప్పించుకున్నారు. కానీ నేను ఎదుర్కోక తప్పదు. అందుకే నీకు శిక్ష కూడా నేనే వేస్తున్నాను. నిన్ను శిక్షించి నందుకు 'చట్టాన్ని నువ్వు చేతుల్లోకి తీసుకోకూడద'ని నన్ను ప్రభుత్వం వారు శిక్షిస్తారని నాకు తెలుసు. ఫరవాలేదు.
నేను చేసింది తప్పు కాదని నాకు తెలుసు. ప్రభుత్వానికీ తెలుసు. కానీ ఇలాంటి హత్యలను ప్రోత్సహించ కూడదని వారు నన్ను జైలుకు పంపుతారు. జైల్ లో ఉన్నందుకు నేను బాధపడను. నా తల్లి తండ్రులే కాదు, ఈ లోకం కూడా నేను చేసిన పనికి హర్షిస్తుంది.ఒక దోషికి సరైన శిక్ష విధించాననే తృప్తితో నేను జైల్ జీవితం గడుపుతాను.ఈ ఉత్తరం నువ్వు మొదలుపెట్టగానే నిన్ను కట్టేసి పోలీస్ లకు పట్టిస్తాననుకొని వుంటావు.
కానీ నేను నీకోసం డాక్టర్ అనామిక గారి సహాయం తో ( డాక్టర్ గారి పేరు చెప్పి వారిని ఇబ్బంది పెట్టను) నేను చేసిన కొత్తరకం పాయిజన్ కలిపిన పాయసం తిన్న నువ్వు, అరగంటకు యమధర్మ రాజు దగ్గరకు వెళ్ళిపోతావు. ఈ రాత్రి పూటనువ్వు టేబుల్ దగ్గర ఏం చేసినా, ఎంత అరిచినా ఎవ్వరికీ వినపడదు. రూం కిటికీల అద్దాలు కూడా వేశాను. టి.వి. సౌండ్ పెద్దగా వుంటుంది..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/-vfyJMiVkG4
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
నాకేమవుతోంది.. ? ఎపిసోడ్ 22(చివరి భాగం)
"నువ్వు బ్రష్ చేసుకుని రిఫ్రెష్ అయ్యి రా ప్రియా! ఈలోగా నేను వాచ్మెన్ ని పంపి అందరికీ కాఫీలు తెప్పిస్తాను" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.
తర్వాత వాచ్మెన్ ని పిలిచి ఫ్లాస్క్ నిండా కాఫీ తెమ్మని డబ్బులు ఇచ్చి పంపాడు.
అంతలో ఏదో సందేహం వచ్చి వెళ్తున్న అతన్ని పిలిచి, "నిన్న మీ అయ్యగారు నీకు ఫోన్ చేసి మేము వచ్చిన విషయం అడిగారా? ఏమని అడిగారు.." అని ప్రశ్నించాడు.
వాచ్మెన్ మాట్లాడుతూ "ఢిల్లీ నుంచి వచ్చినవాళ్ళని అయ్యగారి కారు డ్రైవర్ ఇక్కడ దింపి వెళ్ళాడు. అయ్యగారు నాకు ఫోన్ చేసి మిమ్మల్ని, మీతో పాటు వచ్చిన వాళ్ళని ఆపవద్దని చెప్పాడు. ఇంకెవరు వచ్చినా గెస్ట్ హౌస్ లోకి రానివ్వ వద్దని చెప్పాడు. నిన్న నేనే ఒకసారి అయ్యగారికి ఫోన్ చేశాను. తీయలేదు.తర్వాత ఆయన పిఏ సెల్ నుండి ఫోన్ చేసి, ఏదైనా అవసరం ఉంటే ఆ నెంబర్ కి చెయ్యమన్నాడు. ఆ పిఎ నాకు మామ వరసవుతాడు. నాకు ఇక్కడ పని ఇప్పించింది కూడా ఆయనే. అయన రెండు రోజుల నుంచి ఇంటికి రాలేదని మా అత్త నాకు ఫోన్ చేసి చెప్పింది" చెప్పడం ఆపి ఒకసారి అటూ ఇటూ చూసి "ఈ దుర్మార్గుడు మా మామను ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉంది" అన్నాడు.
"ఏమీ కాదులే, ధైర్యంగా ఉండు. ముందు కాఫీ తీసుకొని రా. నీతో కొంచెం మాట్లాడాలి" అన్నాడు శ్రీనివాస్.
"అలాగేనయ్యా" అంటూ నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు అతను.
ఆ వాచ్మెన్ పేరు రంగయ్య. గతంలో అతని భార్యకు అనారోగ్యంగా ఉన్నప్పుడు శ్రీనివాస్ భార్య డాక్టర్ శ్రీదేవి ఆమెకు ట్రీట్ చేసింది. ఆ పరిచయంతోనే శ్రీనివాస్ తో తన అనుమానం చెప్పాడు రంగయ్య. అతను కాఫీ తేవడానికి వెళ్ళగానే లోపలికి వచ్చిన శ్రీనివాస్, అందరితో అతను చెప్పిన విషయం చెప్పాడు.
"ప్రియ కల నిజం కాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. నా అంచనా ప్రకారం ఆమె కలలో కనకారావును చంపింది అతని పి ఏ ఏకాంబరం". చెప్పాడు ఉదయ్.
అప్పుడే అక్కడికి రిఫ్రెష్ అయ్యి వచ్చిన ప్రియకు తన లాప్టాప్ లో కనకారావు, ఏకాంబరం ఉన్న వీడియో చూపించాడు శ్రీనివాస్.. చూస్తున్న ప్రియా కళ్ళు పెద్దవయ్యాయి.హత్య కావింపబడింది కనకారావు అనీ, హత్య చేసింది అతని పిఏ ఏకాంబరం అనీ తేల్చి చెప్పింది ప్రియ.
"ఇది ఎలా సాధ్యం? తన పీయేని కనకారావు బంధించి ఉన్నాడు కదా!" అంది డాక్టర్ శ్రీదేవి.
"వాచ్మెన్ రంగయ్య కు కనకారావు, తన పిఏ ఏకాంబరాన్ని తన ఇంటి కాంపౌండ్ లో ఉన్న ఒక సర్వెంట్ క్వార్టర్ లో బంధించి ఉన్న విషయం చెబుదాము. కల నిజం కావాలంటే అతను ఏకాంబరాన్ని విడిపిస్తాడు" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.
ఉదయ్ మాట్లాడుతూ "ఐడియా బాగానే ఉంది. కానీ ఏకాంబరాన్ని విడిపించడం పరోక్షంగా కనకారావు హత్యకు సహకరించినట్లే కదా.. విషయం తెలిస్తే మా బాబాయ్ ఏసిపి ప్రతాప్ గారు కానీ డిటెక్టివ్ పురంధర్ గారు కానీ మనల్ని తప్పు పడతారేమో" అన్నాడు.
ప్రవల్లిక మాట్లాడుతూ "ప్రియా కల నిజమవుతుందని నిరూపించే ఏ ఆధారాలు మన దగ్గర లేవు. ప్రస్తుతానికి అది కేవలం ఊహ మాత్రమే. ఏకాంబరాన్ని కనకారావు బంధించి ఉన్నాడనేది వాస్తవం. ఆ మాట అతనే డాక్టర్ శ్రీనివాస్ గారితో చెప్పాడు. అతనికి కచ్చితంగా ప్రాణహాని ఉంటుంది. కాబట్టి మన ఊహ ప్రకారం కనకారావు హత్య చేయబడతాడు అనుకోవడం కంటే ఏ ఏకాంబరం బంధించబడ్డ సంగతి రంగయ్యకు చెప్పడం మంచిపని. తరువాత జరగబోయే పరిణామాలకు మన బాధ్యత లేదు. పైగా కనకారావు లాంటి దుర్మార్గుడి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. తనకు ఏ హాని చెయ్యకపోయినా ప్రియాను చంపాలని చూస్తున్నాడు అతను" అని చెప్పింది.
"మీరు చెప్పింది కరెక్టే" అన్నాడు ఉదయ్.
అక్కడ ఉన్న అందరూ కూడా ప్రవల్లిక మాటలకు ఆమోదం తెలిపారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/sr8yvLkrqcg
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
టీ కప్పులో పెను తుఫాను
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
బ్రతుకుబాటలో దిగ్భ్రాంతి కరమైన వాస్తవాలను ఎదుర్కున్నప్పుడు— ఎదుర్కుంటున్నప్పుడు కొందరు- కొందరేమిటి చాలా మంది షాక్ తగిలిందంటారు. దిమ్మ తిరిగి పోయిందంటారు. ఇదొక మాటకందని మౌనం వంటిదే. ఇందులో నకారాత్మక భావ ప్రభంజనం ఉంటుందనేది తెలుస్తూనే ఉంది. ఇంకొందరేమో— ఊహకందని రీతిన అతీతమైన ఆనందం పాలపొంగులా పొంగి పొర్లినప్పుడు — మాటల పొందికను సయయానికి సమకూర్చుకోకుండా“నమ్మలేకపోయాను— నిలువెత్తు విద్యుత్ షాక్ తగిలిందనుకో! ”అంటుంటారు.
నిజానికి ఇందులో సకారాత్మక భావన ఉంది. కాని పొసగని పదాల మాటున ఆ ఉదాత్త భావప్రక టన మరుగున పడిపోతుంది. ఈ రెండు భావస్రవంతుల్నీ శ్రావణి ఒకేదశన జలపాతపు ఉధృతి మల్లే ఎదుర్కుంది;చెరువు గట్టున పూలమొగ్గలు తెంచుకుంటూ మనో రాగాల ఆలాపనలతో మైమరచి ఏరుకుంటూ వెళ్తున్నదల్లా అదాటున గట్టునుండి కాలుజారి లోతైన నీళ్లలో పడ్డట్లు-- అనుకోనిది అనుకోని విధంగా ఎదురవడమేగా మానవ జీవన ప్రయాణంలో అణగి ఉన్న అండపిండ బ్రహ్మాండ జీవన గణితం— దూరదృష్టి గల మహాపురుషులే కాక— మహర్షులు సహితం ఇంతవరకూ ఛేదించలేని చిదంబర రహస్యం!
జుత్తుచిక్కు తీసుకుంటూ ఇంటి వాకిట వరకూ వచ్చిన శ్రావణి అల్లంత దూరాన వస్తూన్న రామలింగేశ్వరరావు ఎవరో వ్యక్తిని వెంటబెట్టుకుని చకచకా నడుస్తూ రావడం చూసి కళ్లింతలు చేసుకుని చూసింది. తన కోసమే వస్తున్నాడు— వివాహపత్రి క అచ్చు వేయడం గురించి, వాటి వివరాలు పొందుపర్చడం కోసం మాట్లాడటానికే వస్తున్నాడు— అతడికి కావలసిన మిత్రుడు ఎవరినో వెంటబెట్టుకుని-- ఆమె మనసు తుళ్ళింతకు లోనైంది. నిర్ణీత సమయానికి ముందే వర్కు టార్గెట్ ముగించిన ఐ. టీ. ఉద్యోగి మూడ్ లా ఉరకలు వేసింది.
కాని— ఉత్సా హంతో ఊగిస లాడిన ఆమెకు తరవాత తెలిసింది వాళ్లిద్దరూ వచ్చిన వ్వవహారమే వేరని. వచ్చీరావడంతోనే ఇద్దరూ తనను చూసి కూడా చూడనట్లు తిన్నగా లోపలకు దూసుకువెళ్ళారు ఒంటి పైన నిప్పులు పోసుకున్నట్టు.
రామలింగేశ్వరరావయితే-- అరచినంత పని చేసాడు- “ఎక్కడా పెద్ద మనిషి? ఎక్కడా పెద్ద మనిషి? పిలవండి. నేను వెంటనే చూడాలి! “
ఇంటికి కాబోయే అల్లుడు అలా ఆక్రాశంతో గొంతెత్తి పిలవడం చూసిన విమలమ్మ అదరిపోయింది. ”ఏమైంది నాయనా! ఏమైంది?’ ”
రామలింగేశ్వరరావు ముఖం చిట్లించాడు. “నేను మీతో మాట్లాడటానికి రాలేదండీ! ఆ పెద్దమనిషితో మాట్లా డి తేల్చుకోవడానికే వచ్చాను“.
అప్పుడు రామలింగేశ్వరరావు సహోద్యోగి సుందరం కలుగచేసుకున్నాడు- “మధ్యన మీరెందుకండీ హైరానా పడిపోతారు? మీ వారిని పిలిచి వ్యవహారాన్ని తేల్చుకోవచ్చు కదా!”
అప్పుడు గాభరాగా— గడ్డం గీసుకుంటున్న వాడు గీసుకుంటున్నట్టుగా పరుగు వంటి నడకతో అక్కడకి చేరాడు శివానందం- “ఏమైంది అల్లుడూ? ”అంటూ.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/71dgRUDH0-s
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
నా హృదయంలో నిదురించే చెలి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి.. వయ్యారి వై.." అని పాత సినిమా పాట పాడుతూ బైక్ తుడుచుకుంటున్నాడు సుందరం.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/T0O_rAgu54E
దూరం కావాలి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“అదేంట్రా ఊరు చివర ఇల్లు తీస్కుంటున్నావు మళ్లీ?” అని నా మిత్రుడు సురేష్ అడగ్గానే నేను ఒక్కసారిగా గతం లోకి వెళ్లిపోయాను.
సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రిందట నేను ఓ స్థలం తీసుకున్నప్పుడు కూడా వాడిదే మాటన్నాడు. హైదరాబాద్ లో ఇప్పుడున్నంత కాలుష్యం లేకపోయినా, కాలుష్యం బాగా పెరిగిపోయింది అని అనుకునే రోజులవి. నా పిల్లలు నాకు లాగా కాకుండా సొంతింట్లో పెరగాలని నేను, నా భార్య కలిసి ఇళ్లు వెదకడం మొదలుపెట్టాం.ఇల్లు బాగుంటే ధర మరీ ఎక్కువుండేది, ధర బాగుంటే ఇల్లు బాగుండేది కాదు. ఇదంతా కాదు, ఓ స్థలం కొని మనమే మనకి కావాల్సినట్టుగా కట్టుకుందాం అని అనుకున్నాము. ఓ మధ్య తరగతి కుటుంబానికి నగరం లో అయితే స్థలం దొరకడం కష్టమే. మాకు కూడా అంతే!మాకు అనుకూలమైన ధరకి ఊరు చివర అప్పుడప్పుడే స్థాపిస్తున్న కాలని లో మాకో స్థలం దొరికింది. స్థలం దొరికిన ఆనందం లో కొనే ముందర సురేష్ కి చూపిద్దాం అని వాడిని అక్కడికి తీసుకువెళ్ళాను.
ఓ చిన్న విషయం వాడికి చెప్పడం మరిచిపోయినట్టే మీకు కూడా చెప్పడం మరిచిపోయాను – ఆ కాలని కి వెళ్ళే దారి. కాలని చేరుకోవాలంటే ముందుగా ఓ అడవి దాటాలి, దాని తర్వాత కొన్ని పొలాలు దాటాలి, అప్పుడు ఓ కొండ లాంటి రోడ్డు లేదా రోడ్డు లాంటి కొండ కనిపిస్తుంది. అది ఎక్కగానే మా కాలని గేటు కనిపిస్తుంది. కాలని లోపలికి అడుగు పెట్టాకా ఇంకో కొండ లాంటి రోడ్డు ఒకటి కనిపిస్తుంది, అది ఎక్కగానే కుడి వైపుకి మా స్థలం కనిపిస్తుంది.అక్కడికి చేరుకోగానే వాడు నా వైపు జాలి గా చూసాడు.
“ఒరేయ్! తక్కువకి దొరికిందని టెంప్ట్ అయిపోకు. మనమింకా మంచి ఇల్లు చూద్దాం.”
“మరీ అంత తక్కువకి కూడా దొరకలేదులే. నచ్చే కొంటున్నాను.” అని జవాబిచ్చాను.
“స్థలం కొంటే ఆత్మలు ఫ్రీ అని ఆఫర్ ఏమైనా ఇచ్చాడా? కాలని లో తిప్పికొడితే పదిళ్లు కూడా లేవు. పొద్దున్న పూటే భయంకరం గా వుంది. ఇంక రాత్రిళ్లు ఎలా ఉంటాయో?”“ప్రస్తుతానికి పదే ఇళ్లు ఉన్నాయి. ఎప్పటికీ ఇలాగే ఉంటుందేంటి?”
“ఇక్కడ బుద్ధున్నవాడేవ్వడు ఇల్లు తీసుకోడు.”వాడలాంటి వంకలు పెడతాడని నాకు ముందే తెలుసు. అందుకనే వాడి పెట్టే ప్రతి వంక కి నా దగ్గర జవాబు రేడీ చేసి పెట్టుకున్నాను.“పిల్లల స్కూలు?”
“నమ్మకస్తుడైన ఆటో వాడున్నాడు. అయిదారేళ్లుగా పిల్లల్ని అతనే స్కూల్ దగ్గర దిగిపెట్టి తీస్కొస్తున్నాడు.”
“మరీ మీ ఆఫీసులు?”
“ఒరేయ్. నువ్వింకా ఎడ్లబండి కాలం లోనే ఉన్నావురా. ఇదంతా ఆటోమొబైల్ జమానా – దూరం అనే ఆలోచనలు ఇక్కడ నడవవు, కార్లూ, బైక్లూ మాత్రమే నడుస్తాయి.”
“అది సరే! నువ్విక్కడ ఇల్లు కట్టుకుంటే మనం నెలకోసారైనా కలవలేము రా!” అని వాడు విచారించాడు.
“ఇప్పుడు మాత్రం నెలకోసారి కలుస్తున్నామేమిటి?” అని తిరిగి వాడిని ప్రశ్నించడం తో వాడు మునిగిపోవాలనుకునే వాడిని ఆ దేవుడు కూడా కాపాడలేడని చెప్పి ఊరుకున్నాడు.
మొత్తానికి దాచుకున్న డబ్బులతో స్థలం కొని లోన్ తీసుకొని మరీ అక్కడ ఇల్లు కూడా కట్టించుకున్నాము. గృహ ప్రవేశానికి వచ్చిన వారంతా సురేష్ చెప్పిన మాటలను నాకు మళ్లీ చెపారు.
“ఇల్లు చాలా బాగుంది. కానీ మరీ దూరంగా ఉంది. రావడానికే గంట పైన పట్టింది. ఇంక పిల్లలు రోజు స్కూల్ కి ఎలా వెడతారు? నువ్వు ఆఫీసు కి ఎలా వెడతావు?” అందరూ అలా భయపెట్టేసరికి నేను ఓ సారి కాలని లో ఉంటున్న వారందరిని ఇక్కడ ఎలా ఉంటుందో అడుగుదామనుకున్నా.
వారందరూ చెప్పింది ఒక్కటే – దూరం కానీ, చాలా బాగుంటుంది ఇక్కడ. వారి హామీ తో ధైర్యం గా మా కొత్తింటికి వచ్చాము. వచ్చిన నెల రోజుల్లో ఆ పది ఇళ్లల్లో వున్న వారితో మా పరిచయాలు బాగా పెరిగాయి. వాళ్ల పిల్లలు, మా పిల్లలు మంచి ఫ్రెండ్స్ అయిపోయి రోజూ ఆడుకునేవారు కూడా.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/zFk9sqqHYkk
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/Ou2kyEtuAoI
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“మనోతత్వ విశ్లేషనన్నమాట! ఇక ముందుకెళ్ళి చెప్పండి మేడమ్- వింటాను“
“అసలా ఖైదీ డ్రెస్సు ఆ మనిషికేమాత్రమూ కుదరదనిపించింది. ముఖ్యంగా అతడి చూపుల్లో ఎక్కడా ఎప్పుడూ చూడలేని నిబ్బ రం కనిపించింది. అతడి కళ్ళల్లోని కాంతి చూస్తే- ‘మీరు నన్నేమి చేసుకుంటారో చేసుకోండి!’ అని అడుగుతున్నట్లు ఉంది. నేనిప్పుడు చెప్పొచ్చేదేమంటే, ఒకసారి అతడి కేసు ఫైలు తిరగదోడితే అసలు విషయం పైకి పొక్కవచ్చేమో! జస్ట్—యాజ్ యే మాటర్ ఆఫ్ అకాడమిక్ ఇంట్రెస్టు-- ”.
అది విన్న అశ్వథ్ వెంటనే బదులివ్వలేదు. విస్ఫారిత నేత్రాలతో చూస్తూండి పోయాడు. భార్య కళ్ళల్లో కానవచ్చే ఆర్ద్రత, దీర్ఘ భావ స్రవంతిలో ద్విగుణీకృ తమవుతూన్న ఉద్విగ్నత అతణ్ణి ఆలోచింపచేసింది. అంతేకాక, తననింత వరకూ నిశ్శబ్ద ఢమరుకంలా అలజడికి లోనుచేస్తున్న విషయం తననుకున్నంత ఆషా మాషీ వ్యవహారం కాదనిపించింది. అసందర్భంగా ప్రేలకుండా, అకారణంగా ఆవేశానికి లోనుకాకుండా- తొందరపడి ‘మంగళ మనసుని గాయపర్చకుండా చూడు సుమా’! - అని అతడిలోని సిక్స్తు సెన్స్ హెచ్చరించింది. కొన్ని చిన్నచిన్న తడబాటులే, చిటపటి చినుకుల్లా యెదురు కావచ్చు-- కాని కాల ఘట్టాన యెదురు చూడని రీతిన అవి భారీ ఖరీదు కట్టమంటాయి!
అశ్వథ్ నిదానంగా స్పందించాడు-- “అతడెవరో చూసుంటాను మంగళా! నెంబర్ని బట్టి అతడెవరో.. అతడెటువంటి వాడో.. ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం. వాళ్ళందరూ సాధారణంగా డిప్యుటీ జైలర్ల అదుపాజ్ఞలలో ఉంటారు. అయితే- నేనిప్పుడు ఒకటి చెప్తాను. వింటావా మంగళా?”
ఆమె నిదానంగా తలూపింది.
”నాకు తెలుసు, నువ్వు మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న స్త్రీవని. ట్రైనింగ్ పీరియడ్ ని సగంలో ఆపేయకుండా పూర్తి చేసుకుని లీగల్ ప్రొఫెషన్ లోకి వెళ్ళి ఉంటే ఒక ప్రముఖ లేడీ లాయర్ గా ఓ సోషియల్ యాక్టవిస్టుగా ఓవెలుగు వెలిగుండేదానివని. గొప్ప ఆలోచనలు హృదయవైశాల్యం గల వాళ్ళకే వస్తాయన్నది నాకు బాగా తెలుసు. అందుకేగా ఇన్ స్టీన్ మహాశయుడు అన్నాడు- ‘నాకు వచ్చే గొప్ప ఆలోచలన్నీ భవగవంతుడి వద్దనుండే వస్తాయి‘ అని.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/tBNzZ_N-ADQ
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
చెత్త బుట్టలో చరిత్ర
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
రాము పట్టు బట్టి మరీ పోలీసు ఉద్యోగం సాదించి ఐదేళ్లు అయినా.. తన కంటే వెనుక వచ్చిన వాళ్ళు పదోన్నతులు పొందారు కానీ అతను మాత్రం కానిస్టేబుల్ గానే కొనసాగుతున్నాడు. బహుశా నిజాయితీ గా ఉండటమే కారణం కావచ్చు. పొలిటిషియన్ తో సంబంధాలు ఉన్న వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుకోవటంతో సస్పెండ్ అయి ఇంటికి వెళ్ళాడు రాము. ఇంట్లో తన ఇద్దరు కవల కుమారులు అనారోగ్యంతో ప్రాణాలు విడవగా భార్య రాధ స్పృహ తప్పి పడి ఉంది. రాము కి విషయం అర్థం అయి ఎంతో శోకంతో భార్యకు సవర్యలు చేసి ఓదార్చాడు. లోలోపల కుమిలిపోతు చేరొకరు తమ చేతులతో విగతజీవులైన పిల్లలను ఎత్తుకొని స్మశానవాటికకు వెళ్లి, పూడ్చి పెట్టి తిరిగి వస్తుండగా.. ముళ్ళ పొదల్లో పసిబిడ్డ అరుపు వినిపించింది రాముకు. దుఃఖం లో ఉన్న రాము తన పిల్లల అరుపు గుర్తుకు వచ్చినట్లు బావించుకుని బాదపడుతూ ముందుకెళ్ళగా మరలా ఏడుపు వినిపిస్తుంది. భార్యభర్తలు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని కవలలను కప్పిన ప్రదేశానికి వెళ్తారు. తర్వాత ఏడుపు శబ్దం వినిపించిన వైపు వెళ్ళి చూడగా అప్పుడే పుట్టిన ఒక ఆడబిడ్డ ముళ్ళ తుప్పల్లో ఏడుస్తూ కనపడింది. క్షణం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్ళి రక్షించారు రాము దంపతులు.
" ఏవండీ! దేవుడే మగపిల్లలను కాదని ఆడపిల్ల ని మనకిచ్చాడు. పెంచుకుందామండీ " కొంగుతో కన్నీరు తుడుచుకుని అంటుంది.
"నాకూ అదే కోరిక " అన్నాడు రాము.
తల్లి పేరు పోలిన పేరే రాధిక అని పెట్టి పెంచారు.
పదేళ్ల వయసుకి వచ్చిన రాధిక ఒక రోజు పాఠశాల లో తన తోటి విద్యార్థి ఐన ఒక అబ్బాయిని కొట్టడంతో వాళ్ళ తండ్రి వచ్చి రాధికను వారిస్తాడు. "ఏమే.. ఆడపిల్లవై ఉండి మగాడి మీద చేయి వేస్తావా".. గద్దించి అడుగుతాడు అతడు.
"తప్పు చేస్తే ఆడపిల్ల మగాడిని కొట్టకూడదని ఎక్కడైనా రాసి ఉందా? అయినా ఆడదాన్ని మగాడిని వేరేగా చూస్తున్నావు. నీ కూతుర్ని, కొడుకుని ఒకేలా పెంచటం లేదా.. అసలు మీ అబ్బాయి ని పాఠశాల కు పంపిస్తుంది ఆడపిల్లను ఏడిపించమనా".. దైర్యంగా అంటుంది రాధిక.
ఆ మాటలకు ఫిదా అయిన ఆ వ్యక్తి "భవిష్యత్ లో ఐపీఎస్ అవుతావని" అన్నాడు. ఆ మాటలు దూరం నుండి గమనించిన తండ్రి రాము ఎంతోగానో ఆనందించాడు. దేవుడు రాముకి జరిగిన అన్యాయానికి కరిగాడేమో.. రాధిక ఐపీఎస్ సాధించింది. తండ్రి తన గతాన్ని రాధికకు తెలియనివ్వలేదు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
From the publisher's feed