Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • మా ఇల్లే ఒక బృందావనం | Maa Ille Oka Brundavanam | Telugu Short Story | Varanasi Bhanumurthy Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 


    మా ఇల్లే ఒక బృందావనం

    రచన: వారణాసి భానుమూర్తి రావు

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఉద్యోగాల వేటలో హైదరాబాదు కు వచ్చిన నేను ఒక బాంకులో మంచి వుద్యోగాన్ని సంపాయించడం, ఆ తరువాత నా ఇద్దరు తమ్ముళ్ళను హైదరాబాదుకు పిలిపించి కాలేజీలల్లో చేర్పించడం‌, చక చక మని జరిగి పొయ్యాయి. ‌ కాలేజీ తరువాత మొదటి తమ్ముడు ఏదో ప్రైవేటు కంపెనీలో మెటీరియల్స్ మేనేజర్ గా చేరాడు. ‌మంచి జీతం, హోదా ఉన్నాయి. ‌ ఇక రెండవ తమ్ముడు ఇంకా సీ. ఏ. చదువుతున్నాడు. ఒక రోజు నేను పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. మా తాత గారికి చాలా సీరియస్ గా ఉందని, వెంటనే బయలుదేర మని.. తాతగారికి మా అమ్మ గారు ఒక్కతే సంతానం. నేనూ, నా చిన్న తమ్ముడు హడావుడిగా ఆర్ టీ సీ ఎక్స్‌ప్రెస్ బస్సులో బయలు దేరాము. ఇంకొక తమ్ముడు పనుల ఒత్తిడి వలన రాలేక పొయ్యాడు. డ్రైవర్ ని అభ్యర్థించిన పిమ్మట మా వూరి క్రాస్ రోడ్ లో నిలిపాడు. ఎక్స్ ప్రెస్స్ బస్సు గాబట్టి మా వూర్లో బస్సు నిలబడదు. ‌ హైదరాబాదు నుండి తిరుపతికి వెళ్ళే బస్సులు కడప, రాయచోటి, పీలేరు మీదుగా తిరుపతికి చేరుతాయి. ఆ వూర్లల్లో మాత్రమే బస్సులు నిలుపు తారు. కానీ ఎక్కడంటే అక్కడ నిలబడవు. ఆఘ మేఘాల మీద బయలు దేరాము మేము. బస్సు దిగుతూనే మా తాతగారిని చూడాలని మనసు తహ తహ లాడింది. నేను పెద్ద మనమడిని గాబట్టి మా తాత గారికి నేనంటే చాలా ఇష్టం. మేము ఇంటికి చేరేసరికి హాల్లో తాతగారు నులక మంచం మీద పరచిన ఒక పాత దూది పరుపు మీద పడుకొన్నాడు. ఆ పరుపును మా తాత గారు ఎన్నో ఏళ్ళ నుండి వాడుచున్నాడు. ఆ పరుపు మీదనే నేను చిన్నప్పుడు తాత గారితో పడుకొని బోలెడు కథలు చెప్పించు కొనే వాడ్ని. అలాగే తాత గారు తత్వాలు బాగా పాడే వారు. మా తాత గారి పరుపు నుండి ఒక రకమైన వాసన వచ్చేది. అది మా తమ్ముళ్ళకు నచ్చేది గాదు. కానీ నాకు తాత గారంటే అమిత మైన ప్రేమ గాబట్టి, ఆ పరుపు వాసన వల్ల నా కేమీ ఇబ్బంది కలిగేది కాదు. మహా భారతం, రామాయణం కథ లన్నీ ఆ పరుపు మీద పడుకొనే తాతగారు చెబుతుంటే శ్రద్ధగా వినేవాడిని. ఆయన పెద్దగా చదువు కోక పోయినా మన పురాణాల్లో ఉన్న ధర్మ సూక్ష్మాలను విపులంగా చెప్పేవాడు. వేసవి కాలంలో మేమందరం వరండాలో పడుకొనే వాళ్ళం. ‌‌ మా చిన్నతనం లో మా వూర్లో అప్పటికి ఇంకా కరెంటు రాలేదు. ఇప్పటి లాగా ఫాన్లు గూడా వుండేవి కావు. కాబట్టి వెదురు విసన కర్రలు వాడే వాళ్ళం. ‌ దోమలు ఎక్కువయితే దోమ తెరలు వాడే వాళ్ళం. మంచి కుండలో నీళ్ళు పోసి రాత్రి పూట దప్పికయినప్పుడు ఆ చల్లటి నీరు త్రాగే వాళ్ళం. మా వూర్లో త్రాగు నీటికి గూడా కరువే! వూరి కంతటికీ ఒకే ఒక దిగుడు బావి వుండేది. దానిలో ఎక్కడో లోతున మెల్లగా దిగాలి. అక్కడ సన్నటి ధారగా వూట వూరి నీరు వచ్చేది. వంతుల వారీ ఒక్కొక్క బిందె పట్టుకొనే వారు మా వూర్లోని ఆడ వారు. ఒక్క బిందె నీటికి ఎన్ని కష్టాలు పడే వారో ఆ దేవుడికే తెలియాలి. ‌ ఒక తెల్లని గుడ్డ బిందె మూతికి కట్టి నీటిని పట్టే వారు. పురుగులు, మట్టి లాంటివి ఏమైనా వుంటే వడగట్ట దానికి ఆ తెల్లని బట్టను వాడే వారు.. ఆ కాలంలో బ్రతక డానికి ఎన్ని కష్టాలు పడినారో ఆ భగవంతుడికే తెలియాలి. ప్రభుత్వం వారు ఒక బావిని తవ్వించారు. ఆ బావి లోతు ఆరేడు వందల అడుగులు వుండేది. అంత లోతు తవ్వినా అక్కడ ఉప్పు నీళ్ళు పడినాయి. ఆ నీటిని చేదాలంటే తల ప్రాణం తోకకు వచ్చేది. అయినా మా అమ్మ గారికి మేము పిల్లలంతా సాయం చేసే వాళ్ళం. నీటిని చేంతాడుతో చేది, అండాలల్లో, గంగాళాల్లో నింపడం మా పని. అమ్మ ఆ నీరు బిందెల్లో తీసుకొని మా బచ్చట్లో ఉన్న నీటి తొట్టిని ఇ నింపేది. ఆ నీరు మేము స్నానాలకు వాడే వాళ్ళం. ఎండా కాలంలో నీటి కొరత చాలా వుండేది రాయల సీమ పల్లెల్లో. రాత్రి పూట మరీ ఎక్కువ ఉక్క బోస్తే తాత గారు ఇంటి ముందర పడుకొనే వారు. చల్లని గాలి, ఆకాశంలో మిణుకు మిణుకు మంటున్న నక్షత్రాలను చూస్తూ నేనూ, మా తాతగారు ఆ మంచం మీద పడుకొని కథలు చెప్పుకొంటూ నిద్ర పొయ్యే వాళ్ళం. కొత్త పరుపు కొనమని ఎన్ని సార్లు చెప్పినా కొనే వాడు గాదు మా తాత. సూది, దారం తీసుకొని ఎక్కడన్నా చినుగులు పడితే కుట్టుకొనే వాడు. అప్పుడప్పుడు మాత్రం దూదేకుల సాయబూలు వస్తే పత్తిని ఏకించి, ఆ పత్తిని పరుపులో దురిగి మళ్ళీ అదే పరుపును వాడుకొనే వారు మా తాతగారు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/ldtYu78AEBQ



    20 min
  • ఆవకాయ అదిరిందోచ్ | Avakaya Adirindoch | Telugu Short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఆవకాయ అదిరిందోచ్

    రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
    అబ్బా.. ఎండలు మండుతున్నాయి. వైశాఖమాసమంటే భరించుకోలేని ఎండలు. బయటకు వెళ్ళాలంటే మాడి మసిబొగ్గు అవుతామేమోనని భయం. పోనీ ఇంట్లోనే ఉంటే సుఖముందా అంటే అదీలేదు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతాము. పంకా ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. తిరిగి తిరిగి వేడిగాలి వస్తుంది. పాపం అది మాత్రం ఏం చేస్తుంది.. ఎండలు అంతగా ఉన్నాయి. కానీ.. దేనికదే చెప్పుకోవాలి. ఎండకాలం వచ్చిందంటే గుమగుమలాడే కొత్త మామిడికాయ ఆవకాయ, అబ్బా.. దాని వాసన వస్తుంటే నోరూరుతుందంటే నమ్మండి. అంతే కాదండోయ్! కొత్తావకాయతో పాటుగా బంగినపల్లి మామిడిపళ్ళుగాని, రసాలు గాని అన్నంతోపాటు తింటుంటే ఆ ఆనందమే వేరు. అవును, ఈసారి మా ఇంట్లో పచ్చడి పెట్టిన జాడే కనిపించడం లేదు.. అనుకుంటూ నోరు కొత్త పచ్చడికోసం ఆరాటపడుతుండడంతో ఇంటికి వస్తూనే అడగాలనుకున్నాడు. “ఏమోయ్ సుజా .. మామిడిపళ్ళు పుష్కలంగా వచ్చాయి, నువ్వేంటి ఇంకా కొత్త ఆవకాయ పెట్టలేదు? నాకు ఎప్పుడెప్పుడు తినాలాని ఉంది. చెప్పు ఎప్పుడు పెడుతున్నావు?రేపు ఆదివారం కదా! సంతకెళ్ళి మామిడికాయలు తెస్తాను ఈ లోపల నువ్వు దానికి కావలసిన సరంజామంతా తయారు చేసుకో. ఈసారి పచ్చడి అదిరిపోవాలి తెలిసిందా, ”అడిగాడు ఇంటికి వస్తూనే ప్రసాద్.
    “ఇంకా నయం! మీరేదో గొప్ప విషయం చెబుతున్నా రనుకున్నాను,మీ హడావుడి చూస్తుంటే.. ఏమండి.. ఉండేది మనిద్దరం. మనకెంత పచ్చడి కావాలి చెప్పండి, ” అంది. “అదేమిటి సుజాత అలా అంటున్నావు? అమ్మాయికి అబ్బాయి వాళ్ళకు పంపొద్దూ, సంవత్సరమంతా వచ్చే ఆవకాయ పచ్చడి పెట్టకపోతే ఎలా? అదేం కుదరదు కచ్చితంగా మనం పెట్టుకోవలసిందే, ” అన్నాడు పట్టుదలగా. “మహానుభావ.. మీకంతా తొందరనే.. నేను చెప్పేది పూర్తిగా విననే వినరు. ఆవకాయ పెట్టాలంటే ఆషామషి కాదు. ఎన్ని సవరించుకుంటే పచ్చడి జాడిలోకి వచ్చి పడుతుందనుకున్నారు.. ఊరకే అవుతుందనుకున్నారా.. ఊరగాయలంటే ఊరించుకుంటూ తిన్నట్టుకాదు, ” అంది మూతి మూడు వంకరలు తిప్పుతూ. “ఆ.. ఆ.. నాకు తెలుసులేవోయ్ .. మా అమ్మ చేతితో పెట్టిన ఆవకాయంటే నాకు ప్రాణం, మా ఇంట్లో ఆవకాయ సీజన్ వచ్చిందంటే అందరికంటే ముందే మా అమ్మ పెట్టేది తెలుసా? చుట్టుపక్కల వాళ్ళందరు మా ఇంట్లోనుండి గుమగుమ వాసన వస్తుంటే, ‘మాకు పెట్టివ్వవూ.. మాకు నీలాగ పెట్టరాదు’ అని అడిగి మరీ పిలుచుకునేవారు.మా అమ్మకు నేను దగ్గరుండి అన్ని అందించేవాడిని. మంచి మడి కట్టుకుని పెట్టేది కదా! ఎవ్వరిని ముట్టనిచ్చేది కాదు, దూరంనుండి తనకు కావలసినవన్ని ఇచ్చేవాడిని, ” తల్లి గొప్పతనం గురించి చెప్పాడు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/UqERrHbgmi8



    12 min
  • మాతృదేవోభవ | Mathrudevobhava | Telugu Article On Mother's Day | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)


    మాతృదేవోభవ

    రచన: నీరజ హరి ప్రభల 

    (పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    మాతృదినోత్సవము" అంటూ ప్రత్యేకంగా ఈ ఒక్క రోజు మాత్రమే కాదు. ప్రతి రోజూ మననం చేసుకుంటూ తల్లిని పూజించాలి. పూజించకపోయినా ఫరవాలేదు ఆమెనీ, ఆమె మనసుని నొప్పించకుండా ప్రేమానురాగాలను అందిస్తూ కడదాకా కంటికిరెప్పలా చూసుకుంటే అంతకన్నా అమ్మకు ఇంకేం కావాలి ?

    దేవతే మరో రూపంలో అమ్మగా మనకు దర్శనమిస్తున్నది. దేవుడు తనకు మారుగా అమ్మను సృష్టించాడు.

    కనిపించే, కని పెంచే ప్రత్యక్ష దైవం అమ్మ. అనిర్వచనీయమైన రూపం అమ్మ.

    "అమ్మ" అన్నది అమృతము.

    అమ్మతనము లోనే ఉంది ఆ కమ్మదనము. అప్పుడే స్త్రీ జన్మకు పరిపూర్ణత సిధ్ధిస్తుంది.

    అమ్మను గురించి ఏం చెప్పగలము ? ఎంత చెప్పినా తక్కువే. అసలు చెప్పనలవికాదు. అది అనంతం.

    ఎన్ని జన్మలెత్తినా తల్లి ఋణమును తీర్చుకోలేము.🙏 తీర్చనలవి కాదు..


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/QsDUqhQHnyQ



    6 min
  • విరిసిన మొగ్గ | Virisina Mogga | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 


    విరిసిన మొగ్గ

    రచన : Ch. ప్రతాప్

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    మధ్యాహ్నం నాలుగు గంటలవుతోంది. వర్కింగ్ లంచ్ పూర్తి చేసి ఐ టి టవర్స్ లో తొమ్మిదో అంతస్తు లోని క్యాబిన్ లో క్లయింట్ మీటింగుకు మాధవ్ లాగిన్ అవబోతుండగా మొబైల్ రింగయ్యింది. చూస్తే గ్లోబల్ కార్పొరేట్ స్కూలు నుండి కాల్. ఈ టైములో స్కూలు నుండి ఫోన్ ఏమిటా అనుకుంటూ చికాకుగా ఫోన్ ఎత్తి హల్లో అన్నాడు.

    "మాధవ్ గారు.. మీ అబ్బాయి చేతి నరం కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడే ఆస్పత్రికి తరలించాము. మీరు అర్జంటుగా యశోదా హాస్పిటల్ కు రండి” అవతలి వైపు కరస్పాండెంట్ మాటలు విన్న వెంటనే మాధవ్ తలపై పిడుగు పడ్డట్టు అనిపించింది.

    తల కింద భూమి కంపిస్తున్నట్లనిపించి శరీరం వణకగా కుర్చీ ఆసరాగా చేసుకొని నిల్చున్నాడు. రెండు నిమిషాల తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చి, రెండు గ్లాసుల మంచి నీళ్ళు త్రాగగా కొంచెం కుదుట పడ్డాడు.

    వెంటనే శ్రీమతికి ఫోన్ చేసాడు మాధవ్. ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. క్లయింట్ తో మీటింగులో వున్నప్పుడు ఫోన్‌లను ఎయిరోప్లేన్ మోడ్ లో పెట్టాలన్నది సాఫ్ట్ వేర్ రంగంలో ఒక రివాజు.

    వెంటనే వాట్సప్ లో మెసేజ్ పెట్టి ఆఘమేఘాల మీద ఆసుపత్రికి బయలుదేరాడు. ఆఫీసుకు ఆసుపత్రికి దాదాపుగా నలభై కిలోమీటర్లు ఉంటుంది. ట్రాఫిక్ రద్దీని దాటుకుంటూ అక్కడికి చేసేసరికి రెండు గంటలు పట్టింది.

    రిసెప్షన్ లో కనుక్కుంటే బాబు ఐ సి యు లో వున్నాడని తెలిసింది. అయిదో అంతస్తులో వున్న ఐ సి యు కు చేరుకున్నాడు. బయట గ్లోబల్ స్కూల్ స్టాఫ్ ఒకతను వున్నాడు. బయట నుండే అద్దాల తలుపు నుండి ఒక మూల పడుకొని వున్న బాబును చూపించాడు. ఇద్దరు డాక్టర్లు, ఒక నర్స్ హడావిడిగా మాట్లాడుకుంటూ బాబుకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. అక్కడ ఏమవుతోందో మాధవ్ కు అర్ధం కావడం లేదు. లోపలికి ఎవ్వరినీ అనుమతించడం లేదు.

    తలపట్టుకొని బెంచిపైన కూర్చున్న మాధవ్ కు, స్టాఫ్ కుర్రాడు జరిగినదంతా క్లుప్తంగా చెప్పాడు.


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/oIk2rP-nt0s



    15 min
  • తోడ్పాటు | Thodpatu | Telugu Short Story | M. Bhanu | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 


    తోడ్పాటు

    రచన: M. భాను

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    “ఇలా నువ్వు వoటచేయటానికి వెళ్తుంటే నాకు ఎoత ఇబ్బంది గా ఉoదో తెలుసా" అన్నాడు శ్రీధర్ తన భార్య మాలతి తో.

    మాలతి: నాకు మాత్రం ఇష్టమా చెప్పoడి, ఇప్పుడు మనకి డబ్బులు అవసరం చాలా ఉoది. నాకు ఈ పని తప్ప వేరే ఏమీ రాదు. అయినా మనము ఎవరినీ యాచించడం లేదు. కష్టపడి సoపాదిస్తున్నాము. ఎవరు ఏమన్నా బాధ అవసరం లేదు. మీ ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం చాలా కష్టం. సంపాదించే మామగారు మంచం పట్టారు. ఆడబడుచుకి పెళ్ళి చెయ్యాలి. మీ ఒక్కరివల్లా అయ్యే పనికాదు.

    పైగా మన పిల్లల చదువులు ఉన్నాయి. అందుకే ఇవేమీ మనసులో పెట్టుకోకుండా మీ ఉద్యోగం మీరు ప్రశాంతంగా చెయ్యoడి. అయినా ఇప్పుడు వంట చెయ్యడం ఒక హోదాగా భావిస్తున్నారు అందరూ, ఇందులో తప్పేమీ లేదు.

    పైగా నేను వెళ్ళేది వృద్ధ దంపతులకు సహాయం చెయ్యటానికి. పైగా వాళ్లు మన దగ్గర బంధువులు కూడా. వారికి సహాయం చేసినట్లు ఉంటుంది, మనకి కాస్త సంపాదన పెరుగుతుంది. వేరే ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా హాయిగా ఉండండి

    శ్రీధర్ మాట్లాడుతూ “నువ్వు చెప్పింది నిజమే కానీ ఇంటి పని, నాన్నగారి పని చేస్తూ బయటికి వెళ్లి వంట చేయడం అంటే కాస్త కష్టమేమో ఆలోచించు. పైగా పిల్లలను చూసుకోవాలి. నాది ఒక సమయం సందర్భం లేని ఉద్యోగం. ఎప్పుడు అంటే అప్పుడు వెళ్ళాలి రావాలి. ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు కాస్త ఇబ్బందిగా ఉంది మాలతీ!” అన్నాడు.

    మాలతి: అన్ని విషయాలు ఆలోచించాను, మీరా విషయాల గురించి గాబరా పడకుండా అందరికీ సమయానికి అన్ని ఉండేలా ఏర్పాటు చేసుకున్నాను అదీకాకుండా నేను వెళ్లే సమయానికే జానకి ఎటూ వస్తుంది, తను చూసుకుంటుంది మిగతా విషయాలు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/xB0niE0HKxk



    4 min
  • ఆత్మ న్యూనత | Athma Nyunatha | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 


    ఆత్మ న్యూనత

    రచన : Ch. ప్రతాప్

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    విజయనగరంలో రామయ్య అనే ఒక బట్టల వ్యాపారి వుండేవాడు. నాణ్యమైన బట్టలను దూర ప్రాంతాల నుండి తీసుకువచ్చి, తక్కువ లాభాలను వేసుకొని అమ్ముతుండడంతో అతని వ్యాపారం వృద్ధి చెందడంతో పాటు, అతనికి నిజాయితీ గల వర్తకుడన్న మంచి పేరు కూడా వచ్చింది.

    అతనికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. అయితే పుట్టుకతోనే ఆ పిల్లవాడికి ఎడమకాలు అవలక్షణం ఏర్పడింది. అది ఎముకల బలహీనత వలన సన్నగా వుండి, నిలబడలేక పోయేవాడు. అప్పుడు రామయ్య ఆ ఊరి వైద్యుడి సలహాతో పట్నం వెళ్ళి ఆ కాలుకు లోహంతో చేయబడిన ఒక కవచాన్ని వేయించాడు. దాని సహాయంతో ఆ పిల్లవాడు ఎలాంటి బాధ లేకుండా నడవగలిగేవాడు. అయితే నడకలో మాత్రం అవలక్షణం ఏర్పడి కుంటుతూ నడిచేవాడు.

    అయితే అయిదేళ్ళ ప్రాయంలో విద్యాభ్యాసం కోసం పాఠశాలకు వెళ్ళినప్పుడు అతనికి ఇబ్బందులు ఎదురవసాగాయి. చిన్న క్లాసులలో అతని తోటి వారు ఈ కాలును చూసి నవ్వేవారు. కుంటివాడు అన్న పేరు కూడా పెట్టారు. అయితే ఈ ఇబ్బందులు పెద్ద క్లాసులకు వెళ్ళినప్పుడు మరింత ఎక్కువయ్యాయి.

    నవ్వడం, అవహేళన చేయడం తో పాటు అతని ఎదురుగా కుంటి నడక అనుసరించడం లాంటి పనులు చేస్తుంటే ఆ అబ్బాయి ఎంతో బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంత సర్ది చెప్పినా ఆ ఆత్మన్యూనత నుండి బయటపడలేక పోయాడు. ఇదంతా చూసాక రామయ్య ఈ సమస్య నుండి బయటపడేందుకు తన స్నేహితులను, తోటి వ్యాపారస్థులను సంప్రదించాడు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/SMDZ2XQghrs




    5 min
  • Anuvanuvuna Jwalinchina O hrudayana 4 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 4 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    అణువణువున జ్వలించిన ఓ హృదయాన- ఎపిసోడ్ 4

    రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


    సభా కార్యక్రమం మొదలు పెట్టినప్పట్నంచీ మంగళాదేవి అదోలా బేల చూపులు సారిస్తూ- పలకరించి నప్పుడల్లా అరువు తెచ్చుకున్న నవ్వుని కళ్ళలో పోసుకున్నట్టు ముభావంగా ఉండటం గమనించిన అశ్వథ్ తన వంతు ప్రసంగం పూర్తి చేసిన తరవాత సభా సందడిలో తెరపి దొరకపుచ్చుకుని- మేటర్ ఆఫ్ నో ఇంపార్టెన్స్- అన్న ముఖభావాన్ని చూపిస్తూ భార్యను నిలదీసాడు-

    “అదేమిటోయ్- ఇంతవరకూ బాగానే ఉన్నావుగా! కుతూహలంగానే ఫామ్ అంతటా చూసొచ్చా వుగా! ఇప్పుడేమిటి- అలా ముఖం వ్రేలాడదీసుకుని కూర్చున్నావు?”

    మళ్ళీ అదే పెట్టుడు నవ్వుముఖంతో తిరిగి చూసి అదేమీ లేదని చెప్పింది-

    “నిన్ను తాకి మూడు ముళ్ళూ వేసిన వాణ్ణి. నువ్వెప్పుడు ఎలా ఉంటావో- ఏ నవ్వు ముఖంతో ఎప్పుడెలా ఉంటావో నాకు తెలీదూ!”

    మంగళాదేవి బదులివ్వకుండా ఊరకుండిపోయింది. కాని అశ్వథ్ మాత్రం ఊరకుండలేక పోయాడు. “చీరకట్టుకే అందం వచ్చేలా డిజైనర్ సారీలా అలంకరించుకొచ్చిన నిన్నే తోటి ఆఫీసర్ల భార్యలందరూ గమనిస్తున్నారన్న వాస్తవాన్ని గుర్తించవద్దూ! సైకలాజీ చదివిన విద్యావంతురాలివి, దేహభాష పట్ల అంతటి అనవగాహన ఉంటే ఎలాగోయ్? ”

    భర్త మాటల్ని విన్న మంగళ వెంటనే అలార్టయి తేరుకుంది. వెండి మబ్బులా ఫెళ్ళున నవ్వి ముఖంలోకి గ్లో తెచ్చుకుంది-


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/dUqsNQECS20


    18 min
  • అశ్వ మేధం - ఎపిసోడ్ - 3 | Aswamedham - Episode - 3 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 


    అశ్వ మేధం ఎపిసోడ్ 3

    రచన : గన్నవరపు నరసింహ మూర్తి

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఆరోజు ఆదివారం కావడంతో ఉదయాన్నే బయలుదేరి తన ఊరు వచ్చాడు చరణ్; ప్రతీ ఆదివారం తన ఊరువచ్చి వ్యవసాయ పనులు చూడటం  చరణ్ కి   అలవాటు; అతనికి ఆఊళ్ళో వారసత్వంగా వచ్చిన పాతికెకరాల పల్లం పొలం ఉంది. అందులో అతను వరి, చెఱకు పండిస్తాడు. వాటికోసం నలుగురు రైతులు వున్నారు. పకీరు, పోలన్న, సోమన్న, రావుడు.. వీళ్ళు  చరణ్  అంటే ప్రాణం పెడతారు. పల్లానికి తోడు ఏటికి అవతల ఐదెకరాలు మామిడితోట ఉంది. ఏటి నుంచి మోటార్ల  ద్వారా తోటలోకి నీరు వెళ్ళేటట్లు పైపులైను వేయించాడు. ప్రతీ సంవత్సరం ఐదారు వేల మామిడి కాయలు.. ముఖ్యంగా బంగినపల్లి, కలెక్టర్   మామిడి కాయలు పండుతాయి.

    పల్లం పొలాల్లో రెండు ట్యూబ్ వెల్స్ వేయించి మొత్తం మడు లన్నిటికీ పైపుల ద్వారా, బట్టీల ద్వారా  అనుసంధానం చెయ్యడంతో వరి పంట సమృద్ధిగా పండుతోంది ;

    వాళ్ళ తాతగారు  ఏభై సంవత్సరాల క్రితం కట్టిన పాత పెంకుటిల్లు స్థానంలో పెద్ద డాబా ఇల్లు కట్టి  చుట్టు మొక్కలు వేసాడు. పెరడు రెండెకరాలుంటుంది. పెద్ద ట్యూబ్ వెల్.. రోజూ చరణ్  అమ్మ విమల ఆతోటలోని అన్ని పాదులకు నీళ్ళు పెడుతుంది. దొండ, బీర, వంగ, బెండ, చిక్కుడు, ఆనప, గుమ్మడి, పొదులతో పాటు చింత, వేప, నేరేడు చెట్లు కూడా ఉన్నాయి.

    ఇంత పొలం, ఇల్లు ఉండటం అదీకాక తను ఒక్కడే కొడుకు కావడంవల్ల చరణ్  లా చదువుకున్నా దగ్గరలో ఉన్న చిన్న పట్టణంలో కేసులు చూస్తూ ఇంటి దగ్గర వ్యవహారాలు చూసుకోవలసి  వచ్చింది. అతని నాన్నగారు చనిపోయిన తరువాత అమ్మ తనిని పెంచి పెద్ద చెయ్యటానికి ఎంత కష్టపడిందో చరణ్ కి బాగా తెలుసు;


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/m15P3ulRH5I




    19 min
  • నాకేమవుతోంది ఎపిసోడ్ 21 | Nakemavuthondi Episode 21 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
    నాకేమవుతోంది.. ? ఎపిసోడ్ 21
    ప్రియను చంపేస్తానంటూ కనకారావు చెప్పిన మాట విన్న శ్రీనివాస్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు.

    "తొందరపడకండి కనకారావు గారూ! ఆ అమ్మాయి మిస్ అయినట్లు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. మీ రిసార్ట్ మేనేజర్ సందీప్, అతనికి సహకరించి సస్పెండ్ అయిన రంగనాథం పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చాక కనిపించడం లేదు. వాళ్లను పోలీసులే దాచి టార్చర్ పెట్టి ఉంటే, వాళ్లు ఈపాటికి మీ పేరు చెప్పే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి హత్యకు గురైతే, కచ్చితంగా పోలీసులు మిమ్మల్నే అనుమానిస్తారు" కనకారావు ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్.

    అటువైపు నుండి వికృతంగా నవ్వాడు కనకారావు.

    "పోలీసులు అనుమానిస్తారనీ, పత్రికల్లో ఏదో రాస్తారనీ భయపడే స్థాయి దాటిన వాడే రాజకీయ నాయకుడు అవుతాడు. పట్టపగలు నడిరోడ్డు మీద నేను స్వయంగా ఎవరినైనా చంపినా నన్నేమీ చేయలేరు. ఒక వారం రోజులు పేపర్లలోనూ, టీవీల్లోనూ నా గురించి వార్తలు వస్తాయి.

    నన్ను అక్రమంగా అరెస్టు చేశారంటూ నా మనుషులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారు. కొద్దిరోజులకు నేను బెయిల్ మీద బయటకు వస్తాను. కోర్టులో నాకు వ్యతిరేకంగా ఎవ్వరూ సాక్ష్యం చెప్పకుండా చూసుకుంటాను కొంతకాలానికి కేసు కొట్టివేయబడి నిర్దోషిగా విడుదలవుతాను. ఇవన్నీ నాకు చిన్న విషయాలే. ఢిల్లీ నుంచి వచ్చిన ఆ ఇద్దరినీ రేపు ఈవినింగ్ ఫ్లైట్ కి పంపించేస్తాను. రేపు రాత్రికి ఆ అమ్మాయి పని పూర్తి చేస్తాను" చెప్పాడు కనకా రావు.

    "కానీ ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఇప్పుడు ఏముంది? ట్రాన్స్ లో ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి మీ గురించి ఏమీ తెలియదని చెప్పింది. అసలే సిబిఐ ఎంక్వయిరీ లో తప్పించుకోలేక అవస్థ పడుతున్నారని నాకు తెలుసు. ఇప్పుడు మరో సమస్య సృష్టించుకోవడం ఎందుకని చెప్పాను. అంతే" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.

    "సిబిఐ ఎంక్వయిరీ ఎందుకు జరిగింది? నా గుట్టుమట్లు బయట వాళ్లకు చేరాయి కాబట్టి జరిగింది. టీవీలో, న్యూస్ పేపర్లలో రావడంతో నా మినిష్టర్ పదవి పోయి మాజీని అయ్యాను. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా?" ప్రశ్నించాడు కనకారావు.

    "పార్టీలో మీరంటే గిట్టని వాళ్ళు చేయించి ఉంటారు" అన్నాడు శ్రీనివాస్.

    "అది నిజమే అయి ఉండవచ్చు. కానీ వాళ్లకు నా రహస్యాలని చెప్పింది ఎవరో ఊహించగలవా?" అడిగాడు కనకారావు.

    లేదని చెప్పాడు శ్రీనివాస్.

    "ఇంతసేపూ నా పిఎ ఫోన్లో నేను ఎందుకు మాట్లాడుతున్నానో ఊహించగలవా.. నా రహస్యాలు అతనే బయట వాళ్లకు చేరవేస్తున్నాడని నా అనుమానం. అందుకే వాడిని బంధించి, వాడి ఫోను నా కస్టడీలో పెట్టుకున్నాను. వీడికి ఎవరెవరి దగ్గర నుండి ఫోన్లు వస్తాయో గమనిస్తాను. ఇక నీ సంగతి చెప్పు. నా గురించి నీకు బాగా తెలుసు. నేనెంత దుర్మార్గుడినో నా నోటితో చెప్పించవద్దు. కొద్దిరోజులు ట్రీట్మెంట్ చేశావు కాబట్టి నీకు ఆ అమ్మాయి మీద జాలి ఉండవచ్చు. కానీ ఏదైనా నీ ప్రాణం తరువాతే అని తెలుసుకో.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/bm7TM1pLpoE



    14 min
  • Anuvanuvuna Jwalinchina O hrudayana 3 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 3 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

    అణువణువున జ్వలించిన ఓ హృదయాన- ఎపిసోడ్ 3

    రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    అప్పుడతను కాళ్ళకు ఇనుప గొలుసులు పడ్డట్టు ఆగిపోయాడు. ఆమ ముఖంలోకి ఓపారి నిదానంగా చూసి- మౌన నివేదన సమర్పించుకున్నట్టు కళ్ళను అల్లార్చాడు.

    ”మీరిక్కడేం చేస్తున్నారు పవన్? మీ కోసం మీ ఉనికి కోసం నేనెంతగా వెతికానో తెలుసా? ” ఉద్వేగాన్ని ఆపుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ అడిగిందామె.

    ఇంకా కాసేపు అలా మిటకరించి చూస్తూనే ఎట్టకేలకు గొంతు విప్పాడు “ఖైదీలు ఎక్కడెలాగుండాలో అలాగే ఉన్నాను మంగళ గారూ! “

    “మీరిక్కడ జైలు ఖైదీనా! ఎలా? ఎలా?” ఆమె కంఠస్వరం హెచ్చించి అడిగింది.

    అప్పుడు నరాల బిగింపుని అణచుకుంటూ ఎర్ర బడ్డ ముఖాన్ని దాచుకునందుకు ప్రయత్నిస్తూ- పేలవంగా నవ్వుతూ బదులిచ్చాడతడు- “నేను వేసుకున్న యూనిఫాం చూస్తుంటే తెలియటం లేదూ నేనూ ఒక ఖైదీనేనని! మీరు గొప్పింటి స్త్రీ. ఇక్కడి సీనియర్ ఆఫీసరుగారి భార్యగా వచ్చినట్టు న్నారు. నేరారోపణ ఎదుర్కుంటూన్న ఖైదీతో అంతలావు ఉద్వేగంతో మాట్లాడటం చూసేవారికి బాగుండదు.

    నేర చరితను మూటగట్టుకుని అయినవాళ్ల వద్దా-- కాని వాళ్ల వద్దా దుష్టుడినన్న పేరుని సంపాదించుకున్నాను. చెరగని నలుపు ముద్ర వేసుకున్నాను. గుడ్డిలో మెల్లలా ఇక్కడ కొంచెం మెరుగే. అప్పటికి సరైన స్థాయిన సత్ప్రవర్తన గల ఖైదీల కొరత వల్ల నాకు ప్రమోషన్ వంటి ఈ స్థానాన్ని ఇచ్చారు. దినభత్యం కూడా కాస్త ఎక్కువగానే నా పద్దులో కూడుతుంటుంది. మొదట-- సారీ చెప్తాను మిమ్మల్ని ఓసారి కలవకుండా చెప్పకుండా ఊరికి వెళ్లిపోయినందుకు--

    ఇక అసలు విషయానికి వస్తే మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు- ఉండలేరు కూడా-- అదే కదా మంగళా- సారీ- మేడమ్ గారూ! ఋతురాగాలను మంద్ర స్థాయిలో ఉంచాలంటే- రాగద్వేషాలకు అతీతంగా సాగాలంటే ప్రకృతితో మనిషి నిత్యమూ ధ్యానాత్మక స్థితిలో నిలవాలి. అలా నిరంతరంగా అధ్యాపనం చేస్తుండాలి. మరైతే- ఇవన్నీ నావంటి సగటు మనిషికి అసాధ్యాలేగా! “

    “ఆ ఉపోద్ఘాతాల మాటకేం గాని, యిప్పుడిప్పుడు మీరన్నారుగా నన్నిక్కడ ఎవరైనా చూస్తే బాగుండదని. చూస్తే చూడని. ఇప్పుడు దీనికి బదులివ్వండి. బృందావనంలో కృష్ణుడిలా ఉండాల్సిన మీరు ఇక్కడ శ్రీ కృష్ణ జన్మస్థానానికి ఎలా వచ్చారు? ”

    “విడి విడిగా చెప్తాను. మొదటిది- ఎవరైనా చూస్తే బాగుండదని చెప్పానే- అది మీ కోసం మాత్రమే కాదు. నా కోసమూ చెప్పాను. ఇక నేను యెదుర్కుంటూన్న నేరారోపణ గురించి చెప్తే- ఈ ప్రపంచంలో ఎవరెలా స్పందిస్తారో నాకు తెలియదు గాని- మీరు మా త్రం తప్పకుండా విపరీతమైన విస్మయానికి లోనవుతారు. అయినా తక్కువలో తక్కువగా మీకు షాక్ తగలకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నిదానంగా చెప్తాను. అవసరం కలిగింది కదానని నేను పరుల బ్యాంకు ఖాతాలో ఫ్రాడ్ చేసి డబ్బు దోచుకున్నానంటే నమ్ముతారా మంగళా!”

    దానికి ఏమనాలో ఎలా స్పందించాలో తెలియక కళ్ళు అల్లార్చుతూ ఉండిపోయిందామె.

    “నమ్మశక్యం కాకుండా ఉంది కదూ! ”

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.


    Video linkhttps://youtu.be/-U9bxHAnB1Q



    13 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world