Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • మమతల మధువు ఎపిసోడ్ 13 | Mamathala Madhuvu Episode 13 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి


    మమతల మధువు ఎపిసోడ్ 13

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    సమయం పుదయం ఎనిమిది గంటల ప్రాంతం. ప్రేమ వేగంగా ఆదిత్య యింటిలో ప్రవేశించింది."అత్తయ్యా!... అత్తయ్యా!...”పూజ ముగించి హారతి యివ్వబోతువున్న గౌరి ప్రేమ కంఠం విని..."పూజగదిలోకి రా!...” పిలిచింది.ప్రేమ పూజగదిలోకి ప్రవేశించింది. గౌరి కర్పూర హారతిని యిచ్చి... ప్రేమ ముందుంచి "కళ్ళకద్దుకో... నీ కోర్కె తీరుతుంది.” నవ్వుతూ చెప్పింది గౌరి.ప్రేమ భక్తితో కర్పూర హారతిని కళ్ళకు అద్దుకొంది. హారతి తట్టను క్రింద వుంచి దేవుడికి నమస్కరించి ప్రేమ భుజంపై చెయ్యి వేసి..." పద, హాల్లో కూర్చొని మాట్లాడుకొందాం.”యిరువురూ హాల్లోకి వచ్చారు. భీమారావు ఆది ప్రేమ వారికి ఎదురైనారు. వీరమ్మ హాల్లోకి వచ్చి... “అమ్మగారూ!... టిఫిన్ రడీ...” నవ్వుతూ చెప్పింది. యింతలో... భవానీ... ధనుంజయరావు... సుశీలా లోనికి వచ్చారు.తన చెల్లిని చూచి భీమారావు ఆమెను సమీపించి... "చెల్లి రా కూర్చో” చేయిపట్టుకొని సోఫాను సమీపించాడు. సుశీల సోఫాలో కూర్చుంది.అమ్మ భవానీ తండ్రి ధనుంజయా, సోఫాలో కూర్చున్నారు. ప్రేమ వారిరువురినీ చూచి... ముఖం చిట్లించుకొంది.“అత్తా... ఆ అమ్మాయి ఎవరు?” అడిగింది ప్రేమఆది ప్రక్కన నిలబడి వున్న రామాచారి గారి కూతురు ప్రేమను చూచి."నేను నీ కళ్ళకు కనబడలేదా!..." నవ్వుతూ అడిగాడు ఆది."నీది పాత ముఖమేగా బావా!...”"ఎప్పుడొచ్చావని కూడా అడగలేదు?..."నీ కథంతా వారం వారం అమ్మ నాకు టెలికాస్టు చేస్తూనే వుంటుంది.” నవ్వింది ప్రేమ.“చాలా పెద్దదానివైనావే ప్రేమా నీవు!...”"నీవు ఎదిగావుగా ఆరడుగుల అందగాడిలా!...” కొంటెగా చూస్తూ అంది"అమ్మా!... అత్తా!... యిది ఎంత ఎదిగినా దీని నోటి వేగంలో ఏ మార్పూలేదు. అది తగ్గాలంటే దీనికి వెంటనే పెండ్లి చేసేయాలి... అత్తయ్యా!... మంచి కుర్రాణ్ణి చూడనా!...” నవ్వుతూ అడిగాడు ఆది."నీకు ఆ శ్రమ అవసరంలేదు. నేనే చూచుకొన్నాను. యిదిగో ఫొటో!..." ఆదికి దగ్గరగా వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ నుంచి ఆనంద్ ఫొటోను తీసి ఆది చేతికి అందించింది.“బావా!... నీకు శతకోటి వందనాలు... నా మనస్సులోని మాటను చెప్పి యీ ఫోటోను వీళ్ళందరికీ ఎలా చూపాలా అని నేను సతమతమౌతుండగా నీ మాటలతో నాకు సందర్భాన్ని కలిగించావు... నేను చేయాలనుకొన్నది చేసేశాను. యిక మీ అందరి నిర్ణయాన్ని మాత్రం వినాలి. ఓ... తిరుమల దేవుడా!... వీళ్ళంతా నా నిర్ణయంతో ఏకీభవించేలా చెయ్యి. నేను, నా వుడ్బే... కాలినడకతో నీ సన్నిధికి చేరి నిన్ను దర్శిస్తాము.” బిగ్గరగా అందరూ వినేలా చెప్పింది ప్రేమ.ప్రేమ ఈ చర్యకు అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరిముఖాలొకరు చూచుకొన్నారు. ఆది మెల్లగా భీమారావును సమీపించి..."తాతయ్యా... మన ప్రేమ సెలక్షన్!...” ఆనంద్ ఫొటోను అందించాడు భీమారావుకు."వెరిగుడ్ సెలక్షన్ తాతయ్యా!..." ఆనందంగా చెప్పాడు ఆది.గౌరి భీమారావును సమీపించింది. "ఏది మామయ్యా!.... నన్ను చూడనివ్వండి." చేయి చాచింది గౌరి.
    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/pr1mkImspRM


    12 min
  • నాకేమవుతోంది ఎపిసోడ్ 18 | Nakemavuthondi Episode 18 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    నాకేమవుతోంది..? ఎపిసోడ్ 18

    రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
    తన ఇంటికి వచ్చిన ఉదయ్ ని సాదరంగా ఆహ్వానించాడు డిటెక్టివ్ పురంధర్. అతని భుజం పై చేయవేసి తన గదిలోకి తీసుకొని వెళ్ళాడు. గది బయటే ఆగిన ప్రవల్లిక ను చూసి "నువ్వు కూడా రావచ్చమ్మా" అన్నారాయన. వెంటనే ప్రవల్లిక కూడా తండ్రి గదిలోకి ప్రవేశించింది. "కాఫీ రెడీగా ఉంచాను. తాగాక మాట్లాడుకోండి" అంటూ కిచెన్ లోకి వెళ్ళింది శారద. చిన్నగా నవ్వుకున్నాడు పురంధర్. తను ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు పొరపాటున కూడా మధ్యలో తన గదిలోకి రాదు శారద. మరీ అవసరమైతే గది బయటే నిలబడి తలుపు తడుతుంది. లేదా తనకు మిస్డ్ కాల్ ఇస్తుంది. "అలాగే శారదా! వెయిట్ చేస్తాను" అన్నాడు అతను. చెప్పినట్లుగానే రెండు నిమిషాల్లో వాళ్లకు కాఫీ అందించింది శారద. ఆమె బయటకు వెళ్లాక ఉదయ్, ప్రవల్లికలను కాఫీ తాగమని చెప్పాడు. తను కూడా కాఫీ సిప్ చేస్తూ చెప్పడం ప్రారంభించాడు. "రేపు ఢిల్లీ నుంచి హిప్నాటిస్టు భూషణ్, సైకియాట్రిస్ట్ త్రిపాఠి వస్తున్నారు. భూషణ్ తెలుగు వాడే. నాకు బాగా తెలుసు. గతంలో కొన్ని కేసుల విషయంలో అతని సహకారం తీసుకున్నాను. అతను నాకు క్యాజువల్ గా కాల్ చేశాడు. కనకారావు ఒక పేషంట్ విషయంగా తన సహకారం కోరినట్లు చెప్పాడు. అందుకోసం తను హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పాడు. నన్ను తప్పకుండా కలుస్తానని చెప్పాడు. దాంతో అతను వచ్చేది ప్రియా విషయంగా అని నాకు అర్థమైంది. ఈ కేస్ మీరు పరిశోధన చేస్తున్నట్లు ఆయనకు చెప్పాను. భూషణ్ చాలా మంచి వ్యక్తి. మనకు సహకరిస్తానని చెప్పాడు. త్రిపాఠి తో కూడా మాట్లాడతానని అన్నాడు. వాళ్ళిద్దరూ ప్రియాను పరీక్షించాక ఒక నిర్ణయానికి వస్తారు. ఆ తరువాత మీతో మాట్లాడి కనకారావుకు ఎంతవరకు చెప్పవచ్చు అనే విషయంలో మీ సలహా తీసుకుంటారు. కనకారావు మనుషులు భూషణ్ తో మాట్లాడుతూ అవసరమైతే ప్రియా కు సంబంధించిన మనుషుల మీద దాడికి ప్లాన్ చేస్తామని, ఆ సమయంలో ప్రియ లో కలిగే మానసిక మార్పులు గమనించవచ్చని చెప్పారట. ముందు ప్రాథమికంగా పరీక్షించనివ్వమని, అంతగా అవసరమైతే ఆ తర్వాత చెబుతానని భూషణ్ దాట వేసాడట"
    తనకు తెలిసిన విషయాలు చెప్పడం ముగించాడు డిటెక్టివ్ పురంధర్. ప్రవల్లిక మదిలో అప్పటికప్పుడు ఒక ఆలోచన రూపుదిద్దుకొంది. అయితే అది చెప్పడానికి సమయం కాదని ఊరుకుంది. ఉదయ్ మాట్లాడుతూ "డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రియను తన తల్లిదండ్రులకు గాని లేదా పోలీసులకు గాని అప్పగించడానికి సిద్ధపడ్డారు. కానీ ప్రియాకు తనకేం అవుతుందో తెలుసుకోవాలని ఉంది. అందుకోసం రేపు గెస్ట్ హౌస్ కు వెళ్లడానికి సిద్ధపడింది" అని చెప్పాడు.
    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/RfUEjqKwJwk


    16 min
  • మమతల మధువు ఎపిసోడ్ 12 | Mamathala Madhuvu Episode 12 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    మమతల మధువు ఎపిసోడ్ 12

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ధనుంజయరావు బెంగుళూరు చేరారు. హాస్టల్‌కు వెళ్ళి ప్రేమను కలిశారు. హాస్టల్ నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్పి.. ప్రేమతో నెల్లూరికి బయలుదేరాడు. కార్లో వారు నెల్లూరు చేరేటప్పటికి సమయం రాత్రి ఎనిమిదిగంటలు.ప్రేమ మౌనంగా తన గదికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొనీ.. తల్లిని.. నానమ్మను పలకరించి.. తనకు ఆకలిగా లేదని, నిద్రవస్తూ వుందని తన గదిలోనికి.. వెళ్ళి తలుపును మూసేసింది.ఆమె మదినిండా కలవరం. తన మాటలకు శాంతి ఏ నిర్ణయం తీసుకొంది?.. ఆనంద్ తో ఏం మాట్లాడి వుంటుంది? ఆనంద్ ఏ నిర్ణయాన్ని తీసుకొన్నాడు?.. తనతో ఎంతో చనువుగా సరదాగా తిరిగీ.. మనం పెండ్లి చేసికొందాం అని తను అన్నప్పుడు 'సరే' అని ఎందుకు అనలేదు?.. ఆనంద్ తన వివాహానికి తన తల్లిదండ్రులు అంగీకరిస్తారా!.. లేదా!.. వీరు కాదంటే తనేం చేయాలి?.. యీ ప్రశ్నలన్నీ.. ప్రేమకు ఎంతో ఆవేదనను కలిగించాయి. ఆలోచించి.. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. వుదయాన్నే లేచి.. తాతయ్యను.. మామ గోపాల్ ఆత్త గౌరీని కలిసి తన నిర్ణయాన్ని వారికి తెలియజేయాలి. వారు అమ్మా నాన్నలను ఒప్పించగలరు. తనంటే వారికి ఎంతో యిష్టం. తన సమస్యను వారు పరిష్కరించగలరు. యీ నిర్ణయం ప్రేమకు కొంత వూరట కలిగించింది. కళ్ళు మూసుకొంది.భవానీ.. ధనుంజయరావులు.. ప్రేమ చర్యకు.. ఆశ్చర్యపోయారు. పడకగదిలో చాలాసేపు ఆమెను గురించి చర్చించారు. తను ప్రేమించిన ఆ అబ్బాయి ఎవరు?.. అతని తల్లిదండ్రులు.. కులగోత్రాలు.. వూరు పేర్లు.. స్థితి గతులు ఏమిటి?.. ఈ వివరాలన్నీ ప్రేమను రేపు అడిగి తెలుసుకోవాలి. మనవాళ్ళందరితో.. కలసి మాట్లాడి దాని మనస్సు మారేలా చేయాలి. మనమంతా ఒకటై.. ఒక మాట మీద నిలబడితే.. తను మనమాట వినకుండా ఏం చేస్తుంది. వింటుంది. యీ నిర్ణయానికి వచ్చి వారూ శయనించారు. ***ప్రేమ తండ్రి.. ధనుంజయరావుతో బెంగుళూరు నుండి బయలుదేరే సమయంలో.. గోపాల్.. ఒక కాంట్రాక్టు ఫయినలైజేషన్ విషయంలో వైజాగ్ వెళ్ళాడు.
    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/cxrxOun00FE


    21 min
  • ప్రేమ చేజారితే 10 | Prema Chejarithe 10 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
    ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 10

    రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)
    నితిన్, కుమార్‌తో కలిసి కాన్ఫరెన్స్ హాలుకు వెళ్తూ ఇలా మాట్లాడసాగాడు, " నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనే నిన్ను ఇక్కడికి పిలిచాను. అదేమంటే, ఇప్పుడు మీ ప్రాజెక్టులో మా ప్రమేయముండే అసలైన ఘట్టం మొదలయ్యింది, ఇంతకాలం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు నాకూ, నిధికి మాత్రమే తెలుసు. ఇప్పుడు కాలనీలో చాలా మంది పిల్లలు కౌన్సిలింగ్ ఇచ్చేంత పెద్దయ్యారు. ఇంక ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వుంటుంది. దానికి ఇంకొంత మంది సైకియాట్రిస్టుల ప్రమేయ, సహాయాలు అవసరపడ్తాయి. అందుకే ఈ రోజు నా దగ్గర చదువుకున్న మరియు నాకు అసిస్టెంట్లలా వుండటానికి ఒప్పుకున్న ఒక ఆరుగురు సైకియాట్రిస్టులకు ఈ ప్రాజెక్టు గురించి వివరించాలనీ, దానికి మీరు కూడా వుండి మాట్లాడితే బాగుంటుందనీ మిమ్మల్ని కూడా ఇక్కడికి పిలిపించాను. మీరు భయపడక్కరలేదు వీళ్ళందరూ అన్ని విషయాలను రహస్యంగానే వుంచుతారు, అది వారి నైతికబాధ్యతగా భావించి, అన్నీ గోప్యంగా వుంచే వారినే వడగట్టి ఎంచుకున్నాను. మీరు ఏమాత్రం సందేహపడక్కరలేదు," అన్నాడు నితిన్ కుమార్‌తో.
    దానికి కుమార్, "సరే అయితే, వీరికి పిల్లల గురించిన డీటైల్స్ అయితే ఇవ్వద్దు జనరల్‌గానే పిల్లలందరికీ కౌన్సెలింగ్ ఇమ్మని చెప్పండి. కుశాల్ ఎవరు, ఏమిటీ అనే విషయం అందరికీ తెలియటం నాకేమాత్రం ఇష్టం లేదు. దీనివల్ల అందరికీ మా కుటుంబంలో జరిగినవి తెలియడం వలన కుశాల్ మనసు బాధపడుతుందేమో అన్నదే నా ఆలోచన, కొంచెం పెద్దయ్యాక తన ఇష్టంతో బయటపడితే పర్వాలేదు. అందుకే సాధ్యమైనంత వరకూ నేను వారితో కుశాల్‌కు తండ్రిగా కాకుండా ఈ ప్రాజెక్ట్ ను స్థాపించిన వ్యక్తిగానే మాట్లాడ్తాను, తెలిసిప్పుడు తెలుస్తుంది. అయినా మనం బయటపడలేదంటే అది గోప్యంగా వుంచాలనుకుంటున్నామనేది కూడా వారికి అర్థమవుతుంది," అన్నాడు.
    " 'కుమార్ గారూ! మీరు వీరి గురించి అస్సలు సందేహపడవద్దు,' అంటూ చేతిలో చేయి వేసి భరోసా ఇస్తున్నట్టుగా సున్నితంగా నొక్కి చెప్పాడు... 'అంతేకాక, కుశాల్ కూడా నా కౌన్సెలింగ్‌తో చాలా పరిణితితో ఆలోచిస్తున్నాడు, ఈ విషయం తెలిసినా కూడా ఇంతకు ముందులా బాధపడడని నేను కచ్చితంగా చెప్పగలను. నాకు తెలిసి ఆ రోజు జరిగిన ప్రమాదంలో కుశాల్‌కు షాలినిని అలా చూసి అర్థం కాని సందిగ్ధంలోనే మూర్చపోయాడనిపిస్తుంది. అంతేకాక కుశాల్‌ని హిప్నోథెరపీతో మర్చిపోయేలా చేసిన విషయాలు పదే, పదే అర్థం అయ్యీ కాని కలలుగా వస్తూ కుశాల్‌ను కలవరపరుస్తూ తలనొప్పిని కలిగిస్తున్నాయి. అందుకే ఇక కుశాల్‌కు అన్నీ చెప్పి కౌన్సెలింగ్ పూర్తి చేసే సమయం ఆసన్నమైంది,' " అని అన్నాడు నితిన్ ఎంతో దృఢంగా.
    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/Jk4KTO44C_c


    11 min
  • గరుడాస్త్రం - ఎపిసోడ్ 13 | Garudashram - Episode 13 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

    గరుడాస్త్రం - ఎపిసోడ్ 13

    రచన : గన్నవరపు నరసింహ మూర్తి

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ప్రణవి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని ప్రశ్నించడం మొదలు పెట్టింది.“మీ పేరు”?

    “హారిక”

    “ఏం చేస్తుంటారు”...

    "నేను ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంటాను. పెయింటింగ్స్ వేస్తుంటాను.”

    “ఈ నెల 10వ తారీఖు మంగళవారం నాడు సాయంత్రం మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు ఏం చూసారో చెప్పగలరా?”

    “ఆ రోజు రాత్రి 8 గంటలకు నేను ఆఫీసు నుంచి ఇంటికి వెళుతుండగా వర్షం పడుతుండటంతో గాంధీ సెంటర్ దగ్గర ఒక చెట్టు కింద ఆగినపుడు ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిలు మీద వచ్చి పిస్టల్ లో అక్కడికి దగ్గరలో వెళ్తున్న స్త్రీని కాల్చి పారిపోవడాన్ని నేను గమనించాను. అక్కడే లైటు ఉండటంతో వాళ్ళిద్దర్ని స్పష్టంగా చూసాను. ఆ విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను.ఇంతలో అంబులెన్స్ రావడంతో నేను ఇంటికి వెళ్ళిపోయాను.నాకు పెయింటిగ్స్ వెయ్యిడం వచ్చు కాబట్టి ఆ ఇద్దరి ముఖచిత్రాలను పెయింట్ చేసాను” అంటూ రెండు చిత్రాలను ప్రణవికి చూపించింది.

    ప్రణవి వాటిని తీసుకొని కొద్ది సేపు పరిశీలించి జడ్జిగారికి ఇచ్చింది.

    “యువరానర్. ఇప్పుడు నేనిచ్చిన చిత్రాలను హరిక అనే సాక్షి స్వయంగా చిత్రించింది... ఈ చిత్రాలలో ఉన్నవాళ్ళే నిజమైన హంతకులు. కానీ పోలీసులు వీరిని కాక ఈ ఇద్దర్నీ హంతకులనీ అరెస్ట్ చేసింది” అంటూ ఓ పేపర్లో ప్రచురించబడ్డ వారి ఫొటోలను జడ్డీ గారికి చూపించింది.

    "యువరానర్! పోలీసులు నకిలీ హంతకుల్ని అరస్ట్ చేసారనడానికి ఇంత కన్న వేరే సాక్ష్యం కావాలా?” అని అడిగింది.

    పీపీ జనార్ధన్ లేచి “అబ్జెక్షన్ యువరానర్! డిఫెన్స్ వారు ప్రవేశపెట్టిన సాక్షి చెబుతున్నది నిజం అనడానికి ఆధారాలు ఏమిటి? ఎవరినైనా తెచ్చి తమకనుకూలంగా కావలసిన సాక్ష్యాన్ని చెప్పించుకోవచ్చు. ఇది తప్పడు సాక్ష్యం అని చెబుతునాను..” అంటూ కూర్చున్నాడు. -

    "అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్”

    “యువరానర్. దానికి కూడా సాక్ష్యాలున్నాయి” అనీ చెబుతుండగా జడ్జిగారు “కోర్ట్ ఈజ్ ఎడ్జర్న్డ్! కేసుని ఎల్లుండికి వాయిదా వేస్తున్నాను “ అంటూ లేచి వెళ్ళిపోయారు.. కోర్టు సెషన్ ముగియడంతో ప్రణవి, శ్రీహర్ష బయటకొచ్చారు. కరుణాకరం వాళ్ళని కలిసారు..తండ్రికి ఆరోజు జరిగిన వాదనలు గురించి చెప్పింది ప్రణవి.

    “ప్రణవీ! మనం ఒకసారి పోలీస్టేషన్ కి వెళితే ఆ హంతకుల వివరాలు తెలుస్తాయి. అప్పుడు మనం మరింతగా కేసులో వాదనలు వినిపించవచ్చు” అని చెప్పాడు శ్రీహర్ష.

    “రేపుదయాన్నే వెళదాం!” అని చెప్పింది ప్రణవి.

    ఆ మర్నాడు పది గంటలకు ఇద్దరూ దగ్గర్లో ఉన్న పోలీస్టేషన్ కి వెళ్లారు. అప్పటికి రైటర్ ఒక్కడే వచ్చాడు. అతని పేరు వీరాస్వామి. శ్రీహర్ష ప్రణవి తమ గురించి చెప్పగానే వాళ్ళని గౌరవించాడు. ముఖ్యంగా ప్రణవి ప్రముఖ లాయర్ కరుణాకరం గారి కూతురనీ తెలియడంతో అతను చాలా సంతోషించాడు…

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/bmv4YxZhj5Y


    14 min
  • మనసంతానువ్వే 3 | Manasantha Nuvve 3 | Telugu Web Series | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 


    మనసంతా నువ్వే 3

    రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    "ఏయ్ కానిస్టేబుల్! ఒక్కరిని కూడా వదిలిపెట్టొద్దు. మీరంతా పైనకు వెళ్ళండి. దొరికవాళ్ళను దొరికినట్టు పట్టుకోండి, " అంటూ పరుగున సీత ఉన్న బంగళాలోకి వెళ్ళాడు.

    అటువైపు తిరిగివున్న సీతను చూసి, "చేతులు పైకెత్తు. కదిలావంటే కాల్చేస్తాను” తుపాకి సీత వీపుకు తగిలించి అన్నాడు ఎస్సై రఘు.

    ఒక్క క్షణం అర్ధం కాలేదు సీతకు. "ఫ్లీజ్ మా అమ్మ చనిపోయింది. ఏం చెయ్యాలో అర్ధం కాక అలా కూర్చుండిపోయాను. నేను మీరనుకున్నట్టుగా అలాంటిదాన్ని కాను. మంచి మనసుతో నాకు సహాయం చెయ్యండి ఫ్లీజ్, "అంది.

    అప్పుడు చూసాడు జయమ్మ వైపు. టక్కున తుపాకి వెనక్కి తీసుకున్నాడు. వీణమీటినట్లున్న ఆ గొంతులో ఏదో అధికారం ధ్వనించినట్టయింది.

    "సారి అండి.. నేను చూడలేదు. ఉండండి.. మా కానిస్టేబులందరు మీ వాళ్ళను పట్టుకోవడానికి పైనకు వెళ్ళారు. వాళ్ళందరిని జీపులో ఎక్కించాక ఈవిడ సంగతి చూస్తాము. ఇంతలో మీరు తప్పించుకోవడానికి చూడకండి, " అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.

    భయపడుతూ వెనక్కి తిరిగి చూసింది. ఇద్దరూ ఒకేసారి చూడడంవల్ల నాలుగుకళ్ళు కలుసుకుని విడిపోయాయి. రఘు కళ్ళల్లో ఏదో మెరుపు మెరిసినట్టయింది. ఎంతందంగా ఉంది! అచ్చు సీతకూడా పెద్దగా అయితే సరిగ్గా ఇలాగే ఉండేదేమో.. చిన్నప్పుడు పోతపోసిన బంగారంలా ఉండేది. అవును.. సీతలాగా ఉండడమేంటి.. సీతనే కాబోలు. తన పేరడిగితే! అనుకుంటూ నోరు తెరిచాడు అడగడానికని.

    "మీరు .. నువ్వు రఘు కదా! మీ నుదిటిమీద ఆ మచ్చ.. అవును మీరు మా బావ రఘునే కదా?, ” సగం అనుమానం సగం సంతోషంతో అడిగింది సీత.

    "అవును. నేను రఘునే.. అంటే .. అంటే నువ్వు సీతవా? సీతా.. నిజంగా నువ్వు సీతవేనా? అవును నువ్వు నా సీతవే.. అనుకుంటూనే ఉన్నాను.. కుందనపు బొమ్మలా ఉంది, సీతకూడా ఇలానే ఉంటుందేమోనని. నా అనుమానం నిజమైంది. ఎలా ఉన్నావు సీతా? ఇన్నాళ్ళు నీ కోసం వెదుకుతూనే ఉన్నాను, నా అన్వేషణ వృధా పోలేదు. పద.. నిన్ను ముందు మీ నాన్నవాళ్ళ దగ్గరకు తీసుకవెళతాను, ” ఆనందం, ఆత్రుతతో అన్నాడు రఘు.

    "బావా .. నా పిలుపు కొత్తగా ఉందికదా! చిన్నప్పుడు నిన్ను ఎప్పుడు కూడా ఇలా పిలవలేదు, మనిద్దరం ఒక దగ్గరనే పెరిగాం కానీ! నీతో నేనెప్పుడు మర్యాదగా ప్రవర్తించలేదు, నేను అందగత్తెనన్న అహంభావంతో నిన్ను అనరాని మాటలని చాలా బాధపెట్టాను. నిన్ను రెచ్చగొడితేనే కదా ఆ రోజు నా మెడలో అమ్మవారి దగ్గరున్న మంగళసూత్రం నా మెడలో కట్టావు.. నేను నాన్నకు చెపుతానేమోనని నువ్వు ఇంట్లోనుండి పారిపోయావు. ఇదంతా నావల్లనే కదా! నన్ను క్షమించగలవా బావా, " రెండు చేతులు జోడిస్తూ అడిగింది సీత.

    "సీతా .. నువ్వు .. నువ్వు నన్ను బావ అని పిలుస్తున్నావా? ఇది నిజమా.. కలకాదుకదా!, " ఆశ్చర్యంగా అడిగాడు రఘు.

    "ఇంకా ఎందుకు బావా చచ్చినపాము చంపుతావు, ఇప్పుడు నేను ఎవ్వరికి పనికిరాని దాన్ని, అందరూ ఉండి కూడా ఎవరికి లేని ఏకాకిని, " అంది ఏడుస్తూ.

    "ఛ ఛా.. ఏమిటామాటలు సీతా, నీ కోసం అత్తా మామ ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుసా? నువ్వు ఎప్పటికైనా తిరిగివస్తావనన్న కొండంత ఆశతో కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అక్కునచేర్చుకునే అమ్మానాన్నలుండగా అనాథగా ఉండిపోతావా సీతా? నిన్ను మీ అమ్మానాన్నలకు అప్పచెప్పితే తప్ప నా మీద పడిన నిందను నేను తుడుపుకోలేను. నా కోసమైనా నువ్వు రావాలి. తప్పదు, " అన్నాడు రఘు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/SZlCBB0pex4


    14 min
  • మమతల మధువు ఎపిసోడ్ 11 | Mamathala Madhuvu Episode 11 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
    మమతల మధువు ఎపిసోడ్ 11

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ
    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
    కొద్ది రోజులుగా ఎంతో ప్రశాంతంగా వున్న గోపాల్ మనస్సులో... బెంగుళూరు రెస్టారెంట్లో ఆనంద్ ప్రేమలను చూచినప్పటి నుంచీ కలవరం మొదలయింది. వారిరువురికీ పరిచయం ఎలా కలిగింది?... వారిది కేవలం స్నేహమేనా!... లేక ప్రేమనా?... ఒకవేళ వారిరువురూ ప్రేమించుకొంటే... తన పరిస్థితి ఏమిటి?... ప్రేమ అతన్ని ప్రేమించిన విషయాన్ని భవానీ... ధనుంజయరావులు అంగీకరించి.... శాంతిని కలసి... మీ వారు ఎవరు, ఎక్కడున్నారని అడిగితే శాంతి ఏం చెప్పగలదు?... విషయం ఆ స్టేజికి వస్తే గౌరికి... తెలియకుండా వుండదు కదా!... తనూ భవానీ... ఆమె భర్తతో కలసి బెంగుళూరుకు వెళ్ళి శాంతిని చూస్తే... యింకేమైనా వుందా!... సునామీ వచ్చేసినట్లే. గౌరీకి... ఎవరు ఏ రీతిగా నచ్చ చెప్పగలరు?...యీ పరిస్థితి ఏర్పడకుండా వుండాలంటే... ఆనందే... ప్రేమను కలవకూడదు. ప్రేమించకూడదు.వెంటనే మురారికి ఫోన్ చేసి విషయాన్ని వివరించి బెంగుళూరుకు వచ్చి ఆనందన్‌ను కలసి... వాడు యిక ముందు ప్రేమను కలవకుండా చేయవలసినదిగా చెప్పాడు. మురారి... గోపాల్ చెప్పిన విషయాన్ని విని... ప్రేమా ఆనందలు కలవకుండా వుండేలా తన ప్రయత్నాన్ని చేస్తానని గోపాల్ కి చెప్పాడు.

    యీ పరిస్థితి ఏర్పడకుండా వుండాలంటే... ఆనందే... ప్రేమను కలవకూడదు. ప్రేమించకూడదు.వెంటనే మురారికి ఫోన్ చేసి విషయాన్ని వివరించి బెంగుళూరుకు వచ్చి ఆనందన్‌ను కలసి... వాడు యిక ముందు ప్రేమను కలవకుండా చేయవలసినదిగా చెప్పాడు. మురారి... గోపాల్ చెప్పిన విషయాన్ని విని... ప్రేమా ఆనందలు కలవకుండా వుండేలా తన ప్రయత్నాన్ని చేస్తానని గోపాల్ కి చెప్పాడు.
    తర్వాత... శాంతికి ఫోన్ చేసి... తను చెప్పి వచ్చిన విషయాన్నే మరోసారి చెప్పి... ఆనంద్, ప్రేమను కలవకుండా చేయమని చెప్పాడు. ఎవరికి ఏం చెప్పినా, వారు గోపాల్‌కు హామీ యిచ్చినా... ఆనంద్‌కు తనపై వున్న కోపం కారణంగా వాడు ప్రేమకు మరీ చేరువ అవుతాడనే అనుమానం అతని మదిలో నిలచిపోయింది.***భవానీ... పిలవగా భీమారావు కూతురు యింటికి వచ్చాడు. అల్లుడు, చెల్లెలు, కూతురు హాల్లో కూర్చొని వున్నారు. వారి వదనాల్లో ఎంతో విచారం.భవానీ... ప్రేమను గురించి తన భర్త చెప్పిన విషయాన్ని... తను రాత్రి ఫోన్లో మాట్లాడినప్పుడు ప్రేమ చెప్పిన సమాధానాన్ని... తండ్రికి వివరించింది.

    తర్వాత... శాంతికి ఫోన్ చేసి... తను చెప్పి వచ్చిన విషయాన్నే మరోసారి చెప్పి... ఆనంద్, ప్రేమను కలవకుండా చేయమని చెప్పాడు. ఎవరికి ఏం చెప్పినా, వారు గోపాల్‌కు హామీ యిచ్చినా... ఆనంద్‌కు తనపై వున్న కోపం కారణంగా వాడు ప్రేమకు మరీ చేరువ అవుతాడనే అనుమానం అతని మదిలో నిలచిపోయింది.***భవానీ... పిలవగా భీమారావు కూతురు యింటికి వచ్చాడు. అల్లుడు, చెల్లెలు, కూతురు హాల్లో కూర్చొని వున్నారు. వారి వదనాల్లో ఎంతో విచారం.భవానీ... ప్రేమను గురించి తన భర్త చెప్పిన విషయాన్ని... తను రాత్రి ఫోన్లో మాట్లాడినప్పుడు ప్రేమ చెప్పిన సమాధానాన్ని... తండ్రికి వివరించింది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/9Ep0yQMugiA


    17 min
  • మమతల మధువు ఎపిసోడ్ 10 | Mamathala Madhuvu Episode 10 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
    మమతల మధువు ఎపిసోడ్ 10

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    గోపాల్ తనలో జరుగుతున్న సంఘర్షణకు... ముగింపు కలగాలని నిర్ణయించుకొని ఆ గతరాత్రి గౌరి నిదురించిన తర్వాత.. యింట్లోని ఆఫీస్ గదిలోనికి వెళ్ళి... తను ఏ పరిస్థితుల్లో శాంతిని వివాహం చేసికొన్నది... వారిరువురి పరిచయాన్ని గురించి వివరంగా వ్రాసి... తను చేసిన ఆ నేరాన్ని క్షమించవలసినదిగా భీమారావును కోరాడు... వుదయాన్నే జాగింగ్‌కు బయలుదేరి... ఆఫీస్‌కు వచ్చి తను వ్రాసిన ఐదు పేజీల కథను కవర్ ను తండ్రి భీమారావుగారి రూమ్‌లో వారు చూడవలసిన కాగితాలలో వుంచి యింటికి వెళ్ళిపోయాడు. ముగ్గురూ కలసి తొమ్మిది గంటలకు ఆఫీసుకు వచ్చారు.తన గదికి వచ్చిన గోపాల్, ఆది రూమ్‌లో తన తండ్రి తన విషయంలో అన్న మాటలు అతనికి ఎంతో ఆనందం కలిగించినా... తను వ్రాసిన దాన్ని చదివి తండ్రి ఏమంటాడో... అనే భయం అతని హృదయంలో నిండి వుంది. తన రూమ్‌లో సీట్లో కూర్చొని ఆ విషయాన్ని గురించే ఆలోచిస్తూ వున్నాడు.భీమారావు తన గదికి వెళ్ళి కాగితాలను ఫయిల్సును ఆఫీస్బయ్ ద్వారా ఆదిత్య గదికి... పంపేశాడు. చాలా కాలంగా కన్స్ట్రక్షన్ కంపెనీని ఓపన్ చేయాలనేది వారి ఆశయం. యిప్పుడు... ఆదిత్య కూడా వచ్చాడు కాబట్టి... తన నిర్ణయాన్ని గోపాల్ కి చెప్పి అతని వుద్దేశ్యాన్ని తెలుసుకోవాలని యింటర్కమ్ గోపాల్ ని పిలిచాడు.గోపాల్... తను వ్రాసిన దాన్ని నాన్నగారు చూచి పిలుస్తున్నారని భావించి... భయంతో మెల్లగా... భీమారావుగారి క్యాబిన్ ని సమీపించాడు. కర్చీఫ్ తో ముఖాన్ని తుడుచుకొని... భీమారావుగారి గదిలో ప్రవేశించాడు.గోపాల్ని చూడగానే భీమారావు... నవ్వుతూ...“నాన్నా! రా కూర్చో.” అన్నాడు.గోపాల్ క్షణంసేపు తండ్రి ముఖంలోకి చూచి... మౌనంగా కుర్చీలో కూర్చున్నాడు."గోపూ! చాలా రోజులుగా నాలో ఒక కోర్కె వుంది. వారానికో ధర అమ్మే యీ పెట్రోలు... డీజిల్ ధరల వల్ల యింక కవర్డ్ కార్లో ట్రక్సును పెంచాలని నాకు లేదు. మనకు యిప్పుడు వున్న బండ్లు చాలు. నా కోర్కె ఏమిటంటే... మనం కన్స్ట్రక్షన్ వింగ్ ఒకదాన్ని ప్రారంభించాలని, యిప్పుడు మన ఆది మనతో వున్నాడుగా.... ట్రక్సు బిజినెస్ నీవు చూచుకో... క్రొత్తగా ప్రాంభించనున్న కన్స్ట్రక్షన్ బిజినెస్ అది చూచుకొంటాడు. నేను వర్క్ష్కాప్ను చూచుకొంటాను. యీ నా ప్రపోజలు నీ అభిప్రాయం ఏమిటి నాన్నా!...” ప్రశ్నార్థకంగా గోపాల్ ముఖంలోకి చూచాడు భీమారావు.గోపాల్ గుండె దడ తగ్గింది. ముఖంలో చిరునవ్వు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/r4-dN4wy9YQ


    19 min
  • గరుడాస్త్రం - ఎపిసోడ్ 12 | Garudashram - Episode 12 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి
    గరుడాస్త్రం - ఎపిసోడ్ 12

    రచన : గన్నవరపు నరసింహ మూర్తి
    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
    ఆ మర్నాడు సీఐడీ ఒక ప్రకటన చేస్తూ భావన హత్య కేసులో పురోగతి సాధించామని, హంతకుల వేట కొనసాగుతోందనీ రెండు రోజుల్లో వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఆ ప్రకటన చూసి శ్రీహర్ష ప్రణవి ఆశ్చర్యపోయారు. హారిక ఫోన్ చెయ్యగానే ఇన్ స్పెక్టర్ రవీంద్ర స్పందించి ఉంటే ఆ హంతకులు దొరికేవారు. కానీ ఎందుకో ఆయన ఆ ప్రయత్నం చేయలేదు.. అదే రోజు ఒక పత్రిక సంచలనమైన వార్త ప్రచురించింది. “భావన హత్యలో పాక్ గూఢచారుల హస్తం? హత్య ఇంటి దొంగల పనే? “ అన్న శీర్షిక కింద ఆ హత్యోదంతాన్ని వివరంగా వ్రాసింది. రక్షణ శాఖలో కొన్ని పత్రాలు, కొన్ని ముఖ్యమైన ఆయుధాలకు సంబంధించిన డిజైన్స్ మాయమైన వ్యవహరంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గరుడ అనే మిసైల్ డ్రాయింగు వ్యవహారంలో శ్రీహర్ష అనే యువీ శాస్త్రవేత్తను అరెస్ట్ చేసిన సీఐడీ అసలు చేపలను వదిలేసిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. దీనికి రక్షణ శాఖలో పనిచేస్తున్న కొందరు పెద్ద అధికారుల హస్తం ఉన్నట్లు విశ్వశనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికైనా రక్షణ శాఖ ఈ విషయంలో ప్రతిస్పందించి అసలు దొంగలను పట్టుకొని అరెస్ట్ చేయాలని ప్రజలు కోరుతునారు . " అని ఆ పేపర్ వివరంగా వ్రాసింది.. శ్రీ హర్ష ఆ వార్తని చదివి ప్రణవికి ఇచ్చాడు . ప్రణవి ఆ వార్తను చదివి "ఏదైనా భావన హంతకులు దొరికిన తరువాతే సీఐడీ ఛార్జ్ షీట్ వెయ్యగలదు ;వాళ్ళ ఛార్జ్ షీట్ చూ సిన తరువాతే మనం కేసులో ఎలా వెళ్లాలో ఒక క్లారిటీ వస్తుంది" అని చెప్పింది. “డిఫన్స్ మినిస్ట్రీ కేంద్రప్రభుత్వ ఆధీనంలో వుంది కనుక సీబీఐ ఎంక్వయిరీ చేస్తేనే అసలు విషయాలు తెలుస్తాయి. స్టేట్ సీఐడీ అయితే అంతర్రాష్ట్రాల విషయంలో ముందుకి వెళ్ళలేదు " అని శ్రీహర్ష చెప్పాడు. ఆ మర్నాడు సీఐడి భావన హంతకులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. హంతకుల ఫొటోలను ప్రెస్ కి రిలీజ్ చేసారు. ఆశ్చర్యంగా ఆ హంతుకులిద్దరూ హారిక చిత్రించిన ఫోటోల్లోని వారు కారు. వారు వేరే వ్యక్తులు.. అదే విషయం శ్రీహర్ష ప్రణవికి చెప్పేడు.. “ఈ విషయాన్ని మనం పోలీసులకు ఛార్జిషీట్ వేసిన తరువాత కోర్టులో ప్రస్తావిద్దాం. అప్పుడు నిజనిజాలు తెలుస్తాయి” అంది ప్రణవి.

    ఆ తరువాత హారికకు ఫోన్ చేసి హంతకులను పోలీసులు పట్టుకున్నారన్న విషయాన్ని చెబితే ఆమె ఆశ్యర్చపోతూ” ఆ పట్టుకున్న వ్యక్తుల ఫోటోలను నేను కూడా పేపర్లో చూసాను.. కానీ వాళ్ళు కాదు. ఈ విషయంలో పోలీసులు ఘోరమైన తప్పిదాన్ని చేసారు. అవసరం అయితే నేను కోర్టు కొచ్చి అసలు హంతకులు ఎవరో కోర్టు కొచ్చీ చెబుతాను. అంతేకాక వాళ్ళు ఏ బండి మీద వచ్చారో కూడా ఆధారాలతో చెబుతాను” అని చెప్పింది..
    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/legpxR1w4Uo




    16 min
  • కలసి ఉంటే కలదు సుఖము 3 | Kalasi Unte Kaladu Sukhamu 3 | Telugu Web Series | K. Lakshmi Sailaja | manatelugukathalu.com

    కలసి ఉంటే కలదు సుఖము 3

    రచన, కథా పఠనం : కే. లక్ష్మీ శైలజ

    పెద్ద కథ 3/3

    “ఏమత్తా, మాకు అన్నం పెట్టేదుందా, లేదా?” అనేవాడు వీళ్ళ పనులు చూసి రామసుబ్బారావు.“రాముడూ, ఈ నాలుగు రోజులూ అందరికీ ఇక్కడే భోజనాలు, ” అనేది సుభద్రమ్మ. “హైమా, మరి మాకు టిఫన్ అయినా చేసి పెడతావా?” అన్నాడు రామసుబ్బారావు. “అలాగే..చేస్తాను” అన్నది హనుమావతి. హనుమావతి పేరును పెళ్ళిలో రామసుబ్బారావు వాళ్ళు హైమావతి అని మార్చుకున్నారు. ఒకాదివారం రోజు స్కూల్ గ్రౌండ్ కు వెళ్ళి రామ్మూర్తికి, విజయ్ కూ ఫుట్ బాల్ నేర్పించాడు, రామ సుబ్బారావు. రామసుబ్బారావు మంచి ఫుట్‌బాల్ ప్లేయర్. వాళ్ళ నాన్న పేరు మీద ట్రోఫీ కూడా పెట్టారు. "నువ్వు బలే ఆడావు బావా!" రామ్మూర్తి అడ్మైరింగ్ గా చూశాడు, రామసుబ్బారావు వైపు. ఆడపిల్లలకు కొద్దిరోజులు బాడుగ సైకిల్ కూడా నేర్పించాడు, రామ సుబ్బారావు. ఆ స్ఫూర్తి తోనే నేమో రాణీ ' కోకో ' ఆటలో స్కూల్ తరఫున కర్నూల్ వెళ్ళి ఆడి వచ్చింది.పేలాలు, బియ్యంపిండి వడియాలప్పుడయితే అటు హనుమవతమ్మ ఇంట్లోనూ, ఇటు సుభద్రమ్మ ఇంట్లోనూ సందడే సందడి. ఆడవాళ్లు తెల్లవారు ఝామున నాలుగు గంటలకే లేచి, స్నానాలు చేసి పెద్ద గంగాళాలకు పిండి ఉడికించే వాళ్ళు. వాటిని స్పూన్ తోనూ, కారాల చిట్లతోనూ పెట్టేవాళ్ళు. అలా పెట్టడం కోసం నేత చీరలు, పంచెలు వాడనివి ముందు రోజు తీసి రెడీగా పెట్టుకునే వాళ్ళు. ఉదయాన్నే రాంమూర్తి బావిలో నీళ్లు తోడిపెడితే..... కుమారి, రాజ్యమ్మ ఆ చీరలు, పంచెలు పిండి పెట్టేవాళ్ళు. ఎండాకాలం అందరూ రాత్రి పూట మిద్దెలమీద నులక మంచాలు వేసుకొని దోమతెరలు కట్టుకొని పడుకునే వాళ్ళు కాబట్టి, ఆ మంచాల మీద ఈ తడి బట్టలు పరిచి ఉంచేవాళ్ళు. చెక్క నిచ్చెనలు అందరూ చక్కగా ఎక్కే వాళ్ళు, ఒక చేతిలో కొంచెం వేడిగా ఉన్న పిండి గిన్నెలు కూడా పట్టుకొని. మట్టి మిద్దెలయినా ఎవరూ ఫీలయ్యే వాళ్ళు కాదు. హాయిగా కిందనే కూర్చునే వాళ్ళు. “అమ్మా, నేనూ వడియాలు పెడతా, ” అని పేలాల వడియాలు పెడ్తున్న హనుమావతమ్మను బ్రతిమిలాడుతోంది, శైలజ. “ఇవి నీకు సరిగా రావు గానీ, బయ్యం పిండి వడియాలు పెడుదువులే, ” అని అనునయంగా చెప్పింది హనుమావతమ్మ. “పిల్లలందరూ ఇక్కడ రండీ, ” అని పిలిచి సుబ్బమ్మ బియ్యంపిండి వడియాల రోజు ఒక చిన్న చాప మీద పంచ పరిచి, చిన్న పిల్లలను దానిమీద స్పూన్ తో పెట్టుకోమన్నది. చిన్నపిల్లలు సంతోషంగా ఆ పంచ చుట్టూరు చేరి వడియాలు పెట్టారు, సుబ్బమ్మ ఆధ్వర్యంలో. అందరూ పెడు తున్నారు నేను కూడా పెట్టాలని, వాళ్ళమధ్యలోకి వెళ్ళి రెండు సార్లు పిల్లలు వడియాలు పెట్టిన ఆ పంచ మీద జారీ, వడియాల పిండి వళ్ళంతా పూసుకున్నాడు, ప్రమీల, సుబ్బారావు ల రెండు సంవత్సరాల కొడుకు బాబు. అది చూసి ముందు ‘అయ్యో, ’, అని అరిచేసినా, తరువాత అందరూ పడీ పడీ నవ్వారు. వడియాలు పెట్టడం అయిన తరువాత, గిన్నెలో అడుగున ఉన్న కొంచెం గట్టిగా, కొంచెం మాడినట్లున్న పిండిని అందరూ ఇష్టంగా తలా పిడికెడు తిన్నారు. మధ్యలో ఒకరోజు రాత్రి రెండు కిలోల గోధుమ పిండి తడిపి చపాతీలు చేశారు అందరికీ. పెద్దవాళ్ళు పిండి తడిపితే, మిగతావాళ్ళు ఒకరు ఉండలు చేస్తే, ఒకరు రౌండ్ గా రేకు వత్తిస్తే, ఒకరు ఆ రేకును చిన్న త్రికోణంగా వత్తిస్తే, ఇంకొకరు ఆ త్రికోణాన్ని పెద్ద త్రికోణంగా వత్తిస్తే ఇంకొకరు ఆ చపాతీలను నూనె వేసి కాల్చారు. అలా అందరూ కలిసి చపాతీలు చేశారు.


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/PcE4h4NOQ6Y


    8 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world