
Sign up to save your podcasts
Or


ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
గీత కష్టాలు తప్పిస్తానని చెప్పదు. స్వర్గాలు చూపిస్తానని చెప్పదు. భ్రమ పెట్టదు. గీత చదివాక కష్టాలు ఉంటాయి. గీత చదివాక సవాళ్ళుంటాయి. గీత చదివాకసంక్షోభాలుంటాయి. అయితే ఆ సంక్షోభాలని, ఆ సవాళ్ళనీ ఎదురుకోవడానికి సరిపడా ధైర్యం వస్తుంది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన! మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ'నీ భాధ్యత నీవు నిర్వర్తించు. అంత వరకు మాత్రమే అధికారము ఉంది. ఫలితాలగురించి ఎందుకు ఆలోచిస్తావు. అధి నీ పని కాదు’ గీతను అర్థం చేసుకుంటే భయాలుండవు. మోహాలుండవు. ఊగిసలాటలుండవు. ధైర్యంగా, స్థిరంగా జీవితాన్ని ఎదురుకొంటాం. భాద్యతల నుంచి దూరంగా పారిపోతున్న మనలను ‘ఈ పిరికితనం మీకు ఎక్కడనుంచి వచ్చిందయ్యా’ అంటాడు. ఎన్ని మార్పులొచ్చినా స్థిరంగా ఉండమంటాడు. యతోధర్మస్తతోజయః - నీవు ధర్మపరుడవైతే జయం నీ వెంటే ఉంటుంది.
కురుక్షేత్రమహాసంగ్రామములో కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణుల సైన్యము, భీష్మ, ధ్రోణ, కర్ణ, శల్య, కృపాచార్య, భూరీశ్రవ, సోమదత్తాదులు, దుర్యోదన, దుశ్శాసనాది శత సోదరులు సమేతంగా యుద్దరంగంలో అశువులు భాశారు. ఏడు అక్షౌహిణిల సైన్యం, నిరాయుదుడుగా శ్రీకృష్ణుడు పాండవులచెంతన ఉండి విజయము అనుగ్రహింప జేసెను. ధర్మము ఎటు ఉంటే భగవానుడు కూడా అచ్చటనే ఉండును.
___________________________
గద్వాలుకు ' ధర్మసంస్థానం ' అని ప్రతిష్ట ఉన్నది. ఈ మాట రాజే అనుకున్నాడా, దానిని అహంభావం అంటాం. గద్వాల ఆస్థాన పండితులే అన్నారా అంటే ముఖ ప్రీతి వ్యవహారం అనుకుంటాం. ఆ సంస్థాన ప్రజలే అన్నారా, వాళ్ళంతా ' నా పృథ్వీపతిః' అనే పాతభావాల వాళ్ళంటాం. కానీ, గద్వాలును ధర్మసంస్థానం అన్నది శత్రు రాజనుకోండి. అందునా పరధర్మీయుడనుకోండి. గద్వాలును జయించి తన రాజ్యములో కలుపుకోవాలనే దురాశాపరుడైనా, పరమతస్థుడైనా శత్రురాజైనా సత్యం ఎంత చక్కగా గ్రహించాడు. ఎంత చక్కగా చాటి చెప్పినాడు! అనుకుంటాం.గద్వాలు సంస్థానం తెలంగాణలో ఉండేది. అది గోల్కొండ రాజుల సామంత రాజ్యం. సనాతన ధర్మాన్ని సంప్రదాయాలని చక్కగా రక్షిస్తున్న ముష్ఠిపల్లి శోభనాద్రి భూపాలుడు గద్వాలు సంస్థానం కోటను పరిపాలిస్తున్న రోజులు. అందువలన ఆ సంస్థానంలో పాడిపంటలు సమృద్ధిగా ఉండెడివి. ప్రజలు సుఖసంతోషాలతో నుండెడివారు. గోల్కొండ నవాబులు భోగలాలసులు. భోగాలకు ధనం కావాలి. ఆ ధనాన్ని శత్రువులను జయించి, సాధించాలి. ధనం లేని శత్రువులని ఎంతమందిని జయించి ఏమి లాభం? కాబట్టి గద్వాలును సాధించాలి అన్నారు మంత్రులు. నవాబు వినలేదు, అన్నాడు కదా గద్వాలు రాజు ఎంత ధనవంతుడైనా మనకన్నా ధనవంతుడా? మొత్తం దోచినా మన ఒకరోజు భోగానికి చాలదు అన్నాడు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
పెద్ద కథ 2/3
“కొంచెమే లేమ్మా, ”అన్నాడు చిన్నవాడు అజయ్.
ఆ తరువాత రోజు పెద్ద రోట్లో చింతకాయలు, పసుపు ఉప్పు మెంతులు వేసి దంచి, చింత తొక్కు రెడీ చేశారు. దంచడానికి ఇద్దరు చెంచువాళ్ళు వచ్చారు. రాజ్యమ్మ, కుమారి తోస్తూ ఉంటే, వాళ్ళు దంచారు. ఆ పచ్చడిని పెద్ద పెద్ద జాడీలకు ఎత్తి పెట్టారు. అది మూడవ రోజు తీసి మళ్ళీ దంచి పెడ్తే, సంవత్సరం రోజులు ఉదయాన్నేబడికి వెళ్ళే పిల్లలకు చద్దన్నం లోకి మంచి అనుపానంగా ఉంటుంది. అందుకే ఒక జాడీకి పచ్చిమిరపకాయలు వేసి దంచిన పచ్చడి పెడతారు. పచ్చి మిరపకాయలు వెయ్యని పచ్చడిని అవసరమున్నప్పుడు చిన్న గిన్నెలోకి తీసుకొని, మిరపకాయలు వేసి నూరుకొని తిరగమోత వేసుకుంటారు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచి. తరువాత వారం చీకట్లో లేచి వడ్లు ఉడికించి, పని వాళ్ళతో దంపించి, అటుకులు తయారు చేశారు. వాటిని వడ్లు ఏరి, చెరిగి, చివరలో వచ్చిన రవ, పిండి తీసేసి ఎత్తి పెట్టుకున్నారు. ఇవి సంవత్సరం రోజులు వస్తాయి. అక్కడ చెంచు వాళ్ళు కూడా పనికి బాగా పలుకుతారు. అందువల్ల మామిడికాయ పచ్చడికి కారం, ఉప్పు, ఆవపిండి, మెంతి పిండి కూడా వాళ్ళతోనే దంపించి పెట్టుకుంటారు. టొమోటోలు తెచ్చి, తరిగి ఎండబెట్టి, పచ్చడి చేశారు. పెద్ద, పెద్ద బుట్టల టొమాటోలు అందరూ కూర్చొని తరుగుతుంటే చూడ్డానికి ఏదో పెళ్ళికి పని చేస్తున్నట్లుండేది. మరి అందరికి పంపడానికి కావాలికదా! పండుమిరపకాయలు కడగడం, తొడిమెలు తీయడం పెద్దవాళ్ళే చేశారు. పిల్లలు ఆ చేతులు కళ్ళకు పూసుకుంటారేమోనని వాళ్ళను దగ్గరికి రానివ్వలేదు. చింతపండు వేసి ఆ పచ్చడి దంచుకున్నారు. రెండు పచ్చళ్ళనూ జాడీలకు ఎత్తిపెట్టి, తెల్లని పంచెబట్టను వాసెన కట్టి, దానిమీద జాడీ మూత పెట్టారు. చిన్న పురుగులు కూడా లోపలి వెళ్ళకుండా ఆ ఏర్పాటు చేస్తారు. అలావాళ్ళు చింతకాయ, ఉసిరిక్కాయ, టమాటో, పండుమిరప పచ్చళ్ళు పెట్టుకున్నారు. హనుమావతమ్మ కూడా ఇక్కడే పచ్చళ్ళు, వడియాలు పెట్టుకునేది, తన సరుకులు తెచ్చుకొని. అందరి సలహాలు, సంప్రదింపులూ మధ్య సరదాగా పని చేసుకునేవాళ్ళు, అందరూ. డబ్బు సమస్య కాదు. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే, లేనిబలం కూడా వచ్చి ఎక్కువ పని చేసుకునే వాళ్ళు. సంక్రాంతికి సుభద్రమ్మ ఇంటికి వచ్చిన కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళతో ఇల్లంతా సందడిగా వుంటుంది. హనుమావతి, పిల్లలు కూడా ఎక్కువగా ఇక్కడికేవచ్చి కలిసి మాట్లాడుతూ, ఆటలాడుతూ వుండేవాళ్ళు. పిల్లలందరూ ఇల్లు పీకి పందిరేసినట్లుగా చేసేవాళ్ళు. సుబ్బమ్మ, వేణు గోపాలరావు కొడుకు రాజా, సత్యం కొడుకు సూర్యం తాతగారికి వచ్చిన ఉత్తరాలను ఇంట్లో కడ్డీకి తగిలించినవి రోజూ తీసుకెళ్ళి హనుమావతి వాళ్ళింటి ఎదురుగా ఉన్న పోస్ట్ ఆఫీస్ బయట ఉండే పోస్ట్ బాక్స్ లోవేసి వచ్చేవాళ్ళు. ఆ పోస్ట్ మాన్ తాతయ్యతో, "అయ్యగారూ మీ ఇంటికి ఇచ్చిన పాత ఉత్తరాలను మళ్ళీ ఎవరో పోస్ట్ బాక్స్ లో వేస్తున్నారు. కొంచెం చూడండీ" అని మొరపెట్టుకునే వాడు. తాతగారు ‘వెధవల్లారా ఎవర్రా వేసిందీ’ అని పిల్లలను దండిస్తే వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ ‘మేమే’ అని చెప్పేవాళ్ళు. బాల్యం ఎంత అపురూపం! పండుగకు వచ్చిన కూతుళ్ళకూ, సత్యం వాళ్ళకు తాము చేసిన నాలుగు పచ్చళ్ళతో పాటు చట్నీపొడి, కరివేపాకు పొడులు కూడా పెట్టి పంపించేది సుభద్రమ్మ. ఆ పోస్టాఫీసు లోనే పోస్ట్ మాస్టర్ గారి కుటుంబం కూడా వుండేది. వాళ్ళింట్లో నలుగురు ఆడపిల్లలు. అందరూ డిగ్రీలు చదువుతున్నారు. హనుమావతి వాళ్ళతో బాగా స్నేహంగా వుంటూ వారపత్రికలు చదువుకుంటూ వుండేది. ఆదివారం రోజు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ లో చిత్తు పేపర్ల మీద డేట్ ముద్రలు వేస్తూ, టెలిగ్రాఫ్ మిషన్ తో శైలజ, రాణి ఆటలాడుతూ వుండేవాళ్ళు. అవి ముట్టుకోకూడదని తెలియని అపురూప బాల్యమది. హనమావతమ్మ నిత్య నైవేద్యం పెట్టేది. ఎండాకాలం లో ఇంట్లో బావిలో నీళ్ళు అయిపోతాయి అప్పుడు పోస్ట్ ఆఫీస్ కు కొంచెం అవతలగా పెద్ద చేదు డు బావి వుండేది. అక్కడి నుండి వీధిలో తడి చీరతో మడి నీళ్ళు తెచ్చుకోలేక హనుమావతమ్మా రాణీ, అజయ్ లకు చిన్న చిన్న బిందెలు ఇచ్చి, తను నీళ్ళు బకెట్ తో తోడి ఇచ్చి, తాడుతో బకెట్ ను బయటికి తీసి కిండపెడ్తే, ఆ పిల్లలు ఇద్దరూ ఆ నీళ్ళు చిన్న బిందెలల్లో పోసుకొని పూజకు తెచ్చి ఇచ్చేవాళ్ళు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“రాఘవా !” పిలిచారు తండ్రి రామమూర్తి.. కొడుకు గొంతు సవరింపు విని..“రండి..” కోడలు కాత్యాయని ఆహ్వానం.. తన పతిదేవుడు రాఘవయ్యను చూచి..రాఘవ వరండాలో ప్రవేశించాడు.కుడివైపున వున్న అరుగుపై వాలుకుర్చీలో రామమూర్తిగారు వున్నారు. వారికి చూపు పోయింది. వయస్సు డెబ్బై ఎనిమిది.ఐదేళ్ల క్రిందట పొలంలో ఉండగా పెద్ద వురుములు, మెరుపులతో వచ్చిన గాలీవానలో ఆయన ఇరుక్కున్నారు. క్షణాల్లో.. నిముషాల్లో.. గంటల్లో.. ఆ ప్రకృతి విచిత్ర వైపరీత్యంగా మారిపోయింది. కొంత సమయం తర్వాత అంతా మూమూలే.. ప్రశాంతత..కానీ.. ఆ భీకర వాతావరణ ప్రభావం.. పిడుగులు.. మెరుపుల వికటాట్టహాసం.. కారణంగా రామమూర్తికి కనుచూపు పోయింది.. కొడుకు.. రాఘవయ్య.. ఇద్దరు డాక్టర్లకు చూపించాడు.. ఒకరు ఆపరేషన్ చేస్తే.. చూపు రావచ్చు.. రాకపోవచ్చు.. గ్యారంటీ లేదన్నారు.. మరొకరు ఎవరైనా నేత్రదానం చేస్తే.. ‘రీ ప్లాంటేషన్ ఆఫ్ ఐ’ తో చూపు వస్తుంది అన్నారు.
ఇరువురు డాక్టర్ల స్టేట్ మెంట్లు విన్న రామమూర్తిగారు..“నాయనా !.. రాఘవా !.. నేను ఈ వయస్సులో.. ఆ హాస్పటల్స్ లో ఆపరేషన్స్.. చికిత్సలు.. వాటిని.. తట్టుకోలేను. ఆ దైవానుగ్రహంతో.. నా ధర్మాలు అన్నింటిని పూర్తి చేశాను.. మీ అమ్మ సంవత్సరం క్రింద వరకు నాకు సాయంగా వుండింది. మన సంసార నాటకంలో తన పాత్ర ముగిసిందని గౌరి.. నా ఇల్లాలు తాను నాకన్నా ముందుగా వెళ్లిపోయింది. నాకు అండగా ప్రస్తుతంలో వున్న నీ భార్య నా కోడలు కాత్యాయని.. నా ముద్దుల మనుమరాలు శాంతి.. మనుమడు మురళి వున్నారుగా !.. నాకు ప్రస్తుతం ఫరవాలేదు.. కాబట్టి నాకు చూపు కరవైన విషయంగా నీవు బాధపడవద్దు.. అంతా.. అంటే అన్ని బాధ్యతలను ముగించుకొన్న వాణ్ణి.. తిరుగు పయనం ఎపుడైనా కావచ్చు.. దానికి నేను ఆనందంగా సిద్ధం.. ఈ విషయంలో నేను ఆ సర్వేశ్వరుడుని కోరుకొనేదేమిటో తెలుసా!.. చిత్రమైన రోగాలతో మంచంపాలు చేసి.. నరకయాతనను.. నాకు.. నావారికి.. నావలన కలిగించకుండా.. ఇదిగో వున్నాడు అరె లేచిపోయాడా!.. అనే రీతిలో నా కథను ముగించమని ప్రతి నిత్యం.. నేను ఆ దైవాన్ని వేడుకొంటున్నాను..” రామమూర్తి చెప్పడం ఆపాడు..
తండ్రిని కొన్ని క్షణాలు పరీక్షగా చూచి రాఘవయ్య ఇంట్లోకి నడిచాడు. వారు హైస్కూలు హెడ్ మాస్టర్. గత సంవత్సరమే ఆ ప్రమోషన్ వచ్చింది. వారికి ఆవూరు సొంత వూరు.. ఆరు ఎకరాల భూమి.. రెండు ఎకరాల మెట్టతోట.. బావి.. పంపుసెట్టు.. వున్నాయి.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఆ ఊరు పేరు మహారాజ గోపాలపురం. బాగా డబ్బు ఉన్న చాలామంది ఆ ఊర్లో ఉన్నారు. పచ్చని వరిచేలు, ప్రతి ఇంటి దొడ్డి ప్రాంతంలో పాలు సమృద్ధిగా ఇచ్చే ఆవులు, గేదెలు, ఊరంతా కళకళ లాడే పూలమొక్కలు. ఎక్కడపడితే అక్కడ ఏపుగా పెరిగే ఆకుకూరలు, కూరగాయల చెట్లు, రకరకాల పాదులు, ఊరంతా కొబ్బరి చెట్లు, చాలా దేవాలయాలు అందులో పూజలతో, హోమాలతో అలరారు తుంటుంది ఆ ఊరు. ఆ ఊరిలో సత్యనారాయణ స్వామి గుడి పక్కగా ఆంజనేయ స్వామి గుడి వెనుక సాయిబాబా గుడి ప్రక్కన ఉన్న పెద్ద మండువా లోగిలి ఇల్లు వసుంధరమ్మగారిది. ఆమె ఆజానుబాహురాలు. తెల్లని శరీర ఛాయా గుండ్రని కళ్ళు ఉంగరాల జుట్టు. చూడడానికి దేవతామూర్తి విగ్రహంలా కనిపిస్తుంది. ఆమెకు 80 ఏళ్ల వయసులో 90 ఏళ్ల ఆమె భర్త చక్ర మహీధరరావు కాలచక్రంలో కలిసిపోయాడు. ఆమె అక్కలు, చెల్లెళ్లు అన్నలు తమ్ములు, చిన్నాన్నలు పెదనాన్నలు చాలా సుదూర ప్రాంతాల్లో ఉంటున్నారు. కూతుర్లు ఎవరూ కలగని ఆమె ఒక్కగా నొక్క కొడుకు విజయబాబుని అల్లారుముద్దుగా చూసుకునేది. విజయబాబు తన ఆస్తిపాస్తులు పుట్టబోయే తన కొడుకుకు మనవాళ్లు కు కూడా సరిపోయేటన్ని ఉన్నవి అని తెలిసినప్పటికీ..ఉద్యోగం చేయాలి అన్న ఉత్సా హంతో ఢిల్లీలో ఉద్యోగం చేయాలి అన్న మోజుతో అది సంపాదించి అక్కడ చేస్తున్నాడు గత 6 సంవత్సరాల నుండి. ఇక్కడ పాడి పంటల పొలాల వ్యవహారాలు ఇంకా ఇంటికి సంబంధించిన మిగిలిన వ్యవహారాలు అన్ని 30 సంవత్సరాల నుంచి నమ్మినబంటుగా ఉన్న ఆంజనే యులు చూస్తున్నాడు. విజయబాబు అతి కష్టం మీద సంవత్సరానికి ఒక్క సారి వచ్చి రెండే రెండు రోజులు ఉండి వెళ్ళిపోతుం టాడు అలా గత ఆరు సంవత్సరాల నుండి జరుగు తుంది. అతని వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు. రెండు సంవత్సరాల క్రితమే దగ్గర సంబంధం అమ్మా యితో పెళ్లి కూడా అయ్యింది. ఒక అబ్బాయి పుట్టాడు. నాలుగో సంవత్సరం కాన్వెంట్లో చేర్చే వయసు. అయితే విజయబాబు ఎప్పుడు తల్లిని చూడడానికి వచ్చిన భార్యను బిడ్డను తీసుకొనిరాడు. ***ఒక్కగా నొక్క కొడుకు విజయబాబు తనను చూడ డానికి వచ్చి ఇది రెండవ రోజు. సాయంత్రం తిరుగు ప్రయాణమై వెళ్ళబోతున్నకన్న కొడుకుకి పిండివంట తయారు చేస్తుంది వసుం ధరమ్మ. ఆమెకు వెనుకగా వచ్చి నిలబడ్డాడు ఆంజ నేయులు. ''అబ్బాయి విజయబాబు గారు వచ్చి రెండు రోజులు అయ్యింది. ఈ రెండు రోజులలో మిమ్మల్ని ఒక్కసారి కూడా అమ్మ అని నోరార పిలిచినట్టు నేను చూడలేదు మీకు బాధగా లేదా తల్లి'' అంటూ అడిగాడు.. అక్కడ ఉన్న వెండి సామాను తుడుస్తూ. ''ఆంజనేయులు అవన్నీ నీకెందుకురా పని చూసుకో” అంది ఆమె కొంచెం నర్మగర్భంగా. ''అదికాదమ్మా ఏడాదికి ఓ తూరి వస్తారు. ఉన్న రెండు రోజులలో ఒక్కసారయినా మిమ్మల్ని అమ్మ అని అంటారేమోనని ఆశగా నేను చూస్తుంటాను. నా ఆశ తీరడం లేదు. ప్రొద్దుట నుండి సందేళ దాకా రెండు మూడు మాటలు అతి బలవంతంగా మాట్లాడతారు. ఆ సెల్ ఫోన్ లోనే మిగిలిన టైం అంతా ఉంటారు. నాకు చాలా బాధగా ఉంది మీరు ఎలా తట్టుకుంటున్నా రమ్మా.'' అంటూ మళ్లీ అడిగాడు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
మనసంతా నువ్వే పెద్ద కథ 1/3
“సీతా … ఎక్కడున్నావే, స్కూల్ టైయమయితుంది తొందరగా రావే” అంటూ కేకవేసింది సీత తల్లి కామాక్షి.
“అత్తా … సీత పెరటిలో నందినితో ఆడుకుంటుంది, వస్తుందిలే అత్తా నేనువెళ్ళి పిలుచుకొని వస్తాను,” చెబుతూనే పరుగెత్తాడు రఘు.
“ఏమిటో ఈ పిల్ల ఒక్కమాట వినిపించుకోదు, తండ్రి గారాబం ఎక్కువ అందుకే నా మాటవినదు, అన్ని తండ్రితోనే చేయించుకుంటుంది, రేపు పెద్దవుతుంటే తెలుస్తుంది నా అవసరం ఏంటో, పాపం తల్లిలేని పిల్లాడు రఘు ఎలా చెబితే అలా వింటాడు, వాణ్ణిచూస్తేనే ఈసడించుకుంటుంది సీత, ఈ పిల్లకు ఎలా చెప్పాలో నాకర్ధం కావడంలేదు,” అని తన మనసులో తానే గొణుక్కుంటుంది కామాక్షి.
“ఏయ్ నల్లోడా నన్ను వదులు నువ్వు నన్ను ముట్టుకోవద్దు,” అంటూ ఏడుస్తూ రఘు చేతిని విడిపించుకోవాలని చూస్తుంది సీత.
“చూడత్తా… ఎన్నిసార్లు రమ్మని పిలిచినా రానుపో అంటూ వెక్కిరిస్తుంది, అందుకే చెయ్యిపట్టి తీసుకొస్తున్నాను,” చెప్పాడు సీతమీద సంజాయిషీ ఇస్తూ.
రఘు చెయ్యిపట్టుకున్నాడని చెయ్యినంతా సబ్బుపెట్టి రుద్దుకుంటుంది సీతా.
అంటే నేను నల్లగా ఉన్నానని నా నలుపు తనకంటుతుందని అనుకుంటుందేమో అది చూసి రఘు మనసు కలతచెందింది.
పన్నెండు సంవత్సరాలు వయసుకే ఇది ఇలా ఉంది అంటే రేపురేపు రఘు ఉనికినే సహించుకోదేమో. చూడడానికి నలుపైనా పిల్లవాడు మంచివాడు. ఎలా చెబితే అలా వినేరకం. ఒక్కతే కూతురు కదా బయటకు పంపడమెందుకని రఘును అల్లుడిగా చేసుకోవాలనుకున్నాము. వాడు ముట్టుకున్నందుకే సబ్బుతో చెయ్యిరుద్దిపెడుతుంది ఇంకా వాడినేం భరిస్తూంది. ఆలోచిస్తూ కంచం ముందు కూర్చున్న రఘుకు అన్నం పెట్టడం మరిచిపోయింది. “అత్తా… అన్నంపెట్టు తొందరగా వెళ్ళాలి,” “అయ్యో నా మతిమండా, ఏదో ఆలోచిస్తూ మరిచేపోయాను అదెక్కడా,” అంటూ అటుఇటు చూసింది. కిసుక్కున నవ్వాడు రఘు.
"అయ్యో అత్తా…. సీత స్కూల్ కు వెళ్ళిపోయింది గదా! మామ సీతకు అన్నంకలిపి తినిపించి తీసుకునిపోయాడత్తా,” అన్నం తింటూ చెప్పాడు.
“ఏమండి … మీరు సీతను మరీ గారాబం చేసి చెడగొడుతున్నారు, ఈ రోజు ఏం చేసిందో తెలుసా? ఉదయం జరిగిన సంగతి చెబుతూ, “చూడండి మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్న సామెత ఊరికే రాలేదండి, నా మాటెలాగు వినదు మీ గారాబం చూసుకుని కనీసం మీరైనా చెప్పండి దానికి, ఇదిలాగే ఆ అబ్బాయిని మాటకు మొదలు నల్లోడా అనడం మానేయ్యమని చెప్పండి, రఘు మాత్రం ఎన్ని రోజులు భరిస్తాడు చెప్పండి, ఎప్పుడో చెప్పాపెట్టకుండానే ఇంట్లోనుండి వెళ్ళిపోతాడు,” అంది బాధపడుతూ.
“ఏమిటి కాముడు నువ్వు మరీ చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నావు, అదీ వాడు చిన్నపిల్లలు ఏదో అనుకుంటారు వెంటనే కలిసిపోతారు, మన పెద్దవాళ్ళము పిల్లల విషయాలు పట్టించుకోకూడదు, నువ్వు అనవసరంగా మనసు పాడుచేసుకోకు,” భార్యను మందలించాడు ప్రకాశం.
“అంతేలెండి, “పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగున్నట్లు” మీకు మీ కూతురు ఏం చేసినా మురిపెంగానే ఉంటుంది, లేకలేక పుట్టినకూతురాయే ఈగవాలనివ్వరు,” అంది మూతితిప్పుతూ.
“భలేదానివి కాముడు నువ్వు… అది నా ఒక్కడికే కూతురు నీకు కాదన్నట్టు చెబుతున్నావు, నువ్వు మాత్రం తక్కువ గారాబం చేస్తావా ఏంటి ? ఏదో రఘును అలా అంటుందని గానీ, లేకపోతే పల్లెత్తుమాట అననిస్తావా నాకు తెలియనట్టు చెబుతున్నావు, సరే నీ మాటలెందుకు కాదనాలే ఇప్పుడు పిలిచి చెబుతాలే సీతకు,” అంటూ “ అమ్మా సీతా… ఏం చేస్తున్నావు తల్లి ఒకసారి ఇలా వస్తావు,”మురిపెంగా పిలిచాడు. బయట స్నేహితులతో తొక్కుడుబిళ్ళ ఆడుతున్న సీతను.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన: M R V సత్యనారాయణ మూర్తి (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“ఏరా శేఖర్ బాగున్నావా?” పుస్తకం చదువుకుంటున్న నేను తల ఎత్తి చూసేసరికి ఎదురుగా చిన్నాన్న. వచ్చి నా పక్కనే కూర్చున్నాడు చిన్నాన్న. లోపలనుంచి నాన్నా, అమ్మా వచ్చారు.
“ఏరా శివా, ఇదేనా రావడం?” నాన్న ఆప్యాయంగా చిన్నాన్న భుజం మీద చేయివేసి అడిగారు.
“ఇప్పుడే వచ్చాను అన్నయ్యా. నీ ఆరోగ్యం ఎలావుంటోంది? వదినా, కులాసానా?” ఇద్దర్నీ ఒకేసారి అడిగాడు చిన్నాన్న.
“ఆ ...మేం బాగానే ఉన్నాము.నువ్వు ఎలా ఉంటున్నావు? హైదరాబాద్ లో ఒక్కడివీ ఎందుకురా, మన ఊరు వచ్చేయ్. అందరం కలిసి ఉందాం” అన్నారు నాన్న.
“అవును శివా. నీ గురించి మీ అన్నయ్య అస్తమానం బాధపడుతూ ఉంటారు. వాడు ఒక్కడూ ఎలా ఉంటున్నాడా?అని. ఇక్కడికి వచ్చేయ్ .నలుగురం కలిసిఉందాం” అంది అమ్మ.
“అలాగే వదినా. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి.అవి పూర్తీ అవగానే మన ఊరు వచ్చేస్తాను. నా ఆఖరి గమ్యం మన ఊరే కదా” చిన్నగా నవ్వుతూ అన్నాడు చిన్నాన్న.
“మీరు మాట్లాడుతూ ఉండండి. నేను టీ పట్టుకు వస్తాను” అని లోపలకు వెళ్ళింది అమ్మ. చిన్నాన్న కాఫీ తాగడు , టీ తాగుతాడు. బాగ్ లోంచి ఖరీదైన స్మార్ట్ ఫోన్ తీసి నాకిచ్చాడు చిన్నాన్న. ఆ ఫోన్ చూడగానే నా కళ్ళు ఆనందంతో మెరిశాయి. నా ఫ్రెండ్స్ అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. నాకే లేదు. నాన్నని కొనమని చాలా సార్లు అడిగాను, అలాగే అని వాయిదా వేస్తున్నారు నాన్న.
వెంటనే ఫోన్ తీసుకుని “థాంక్స్ చిన్నాన్నా” అన్నాను.
“మనలో మనకి థాంక్స్ ఏమిట్రా. బాగా చదువుకో శేఖర్ ” అన్నాడు చిన్నాన్న.
నేను ఫోన్ పట్టుకుని నా గదిలోకి వెళ్ళిపోయాను. నాన్నా,చిన్నాన్నా వ్యవసాయం గురించి , ఊళ్ళో విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. నేను నా ఫోన్ లోని సిం కార్డు తీసి కొత్త ఫోన్ లో వేసి మా ఫ్రెండ్స్ తో మాట్లాడ సాగాను. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మధ్యాహ్నం భోజనాల దగ్గర చిన్నాన్న నా పక్కనే కూర్చున్నాడు. నేను భోజనం చేస్తున్నంతసేపు నాకేసే చాలా ప్రేమగా చూసాడు. చిన్నాన్న వచ్చిన ప్రతిసారీ నా పక్కనే కూర్చుంటాడు. మామూలగా అయితే నేనూ, నాన్నా పక్క పక్కనే కూర్చుంటాం.
ఒకసారి నేను నాన్న పక్కన కూర్చోపోతే, అమ్మ “శేఖర్ , చిన్నాన్న పక్కన కూర్చో నాయనా” అంది. అప్పటినుంచీ నాకు అది అలవాటు అయిపోయింది.చిన్నాన్న ఆరోజు రాత్రి బస్సు కి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. చిన్నాన్న మా నాన్న కంటే ఎత్తుగా ఉంటాడు. అయిదు అడుగుల పది అంగుళాలు ఉంటాడు. చాలా అందగాడు. సినిమాలలో వేషాలు వేస్తూ ఉంటాడు. ఈ మధ్య టివి. సీరియల్సు లో తండ్రి పాత్రలు కూడా వేస్తున్నాడు. చాలా క్రితమే పిన్ని చనిపోయినా, మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఒక్కడే హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఎందుకో సినిమా వాళ్ళు అంటే నాకు సదభిప్రాయం లేదు. అందులోనూ విలన్ వేషాలు వేసే వాళ్ళు అంటే, మరీ చెడ్డ అభిప్రాయం ఉంది. చిన్నాన్న తెచ్చే గిఫ్ట్ లు నాకు బాగా నచ్చటం వలన ఆయన పట్ల కొద్ది సాఫ్ట్ కార్నర్ ఉంది.
******
నేను బి.టెక్. మంచి మార్కులతో పాస్ కాగానే చిన్నాన్న మా ఊరు వచ్చి నాకు ఖరీదైన వాచీ, లాప్ టాప్ ఇచ్చారు. ఆరోజు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా, దగ్గరకు తీసుకుని కౌగలించుకున్నారు. ఆయన కళ్ళల్లో సన్నటి కన్నీటి పోర కదలాడడం నేను గమనించాను.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
From the publisher's feed