Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • గరుడాస్త్రం - ఎపిసోడ్ 8 | Garudashram - Episode 8 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    గరుడాస్త్రం - ఎపిసోడ్ 8

    రచన : గన్నవరపు నరసింహ మూర్తి 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఆ మర్నాడే వాళ్ళ మొదటి రాత్రి.. అంతా తెలుపు మయం..

    తెల్లటి మేను, తెల్లటి చీర, తెల్లటి మల్లెదండ, తెల్లటి వదనంపై ఎర్రటి తిలకం.. తెలుపు దుప్పట్ల మంచం.. మత్తు కలిగించే పరిమళం.. ఎప్పుడు ఎక్కువగా మాట్లాడే ప్రణవి ఆరోజు మౌనం దాల్చింది. తెల్లటి పాల గ్లాసుతో దేవకన్యలా లోపలి కొచ్చి మంచం మీద కూర్చొంది.. అప్పట్నుంచీ నోటితో కాకుండా కళ్ళతోటే మాట్లాడుతోంది. ఇద్దరూ కొద్ది సేపటి తరువాత డాబా మీదకు వెళ్ళారు. ఊరంతా నిశ్శబ్దం గా ఉంది. డాబా అంతా పండు వెన్నెల పరుచుకొని ఉంది. కొబ్బరాకుల సందుల్లోంచి వెన్నెల కిరణాలు ఆమె మీద పడి మెరిసిపోతునాయి.

    అలా పౌర్ణమి రాత్రి నిండు ఆకాశం కింద వెన్నెల పడుతుంటే ఆ నిశ్శబ్ద నీరవంలో ఒకరి పక్కన ఇంకొకరు; మత్తుగా ఉంది ఇద్దరికీ.. ఆమె అతనికి దగ్గరికి జరగగానే ఒళ్ళంతా పులకరింత; ఆమె ఒంపు సొంపులు అతన్ని తాకుతూ, ఆమె పరిమళం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ అతన్ని ఆనంద పరవశుణ్ణి చేస్తున్నాయి ..

    అతని కెందుకో ఇది కలా నిజమా అని అనిపిస్తోంది. అతను ప్రణవితో వివాహం అంటే నమ్మలేకపోతునాడు. పోతపోసిన అందాల రాశి తన స్వంతమైందంటే ఆశ్చర్యపోతునాడు. ఇవే మీ తెలియని ప్రణవి మాత్రం అతని గుండెల మీద తల పెట్టి నిద్రపోసాగింది.

    ఆమెను అలా చూస్తుంటే శ్రీహర్షకు “తెల్లవారనీకూ ఈ రేయినీ” అనీ చంద్రుణ్ణి వేడుకోవా లనిపించింది..

    ప్రణవి ఉచ్ఛాస నిశ్వాసాలు చందన పరిమళం వెదజల్లుతూ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆమెను అలా చూస్తుంటే అతనికి జయదేవుడి అష్టపదులు, కావ్య నాయికలు గుర్తుకు రాసాగాయి.

    ఆమె పరిమళం ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అతనిలో కవిత్వం ఉప్పొంగి మోహన రాగం ఆలపించే సాగింది.

    “గగనాంగనాలింగనోత్సాహియై

    జగమెల్ల పులకించె  సుమగుచ్ఛమై

    గంగా తరంగాల సంగీతమై

    కమనీయ రమణీయ యువగీతమై

    మలయాద్రి పవనాల అలాపనై

    మధుమాస యామిని ఉద్దీపనై”

    శారద యామిని భారంగా గడుస్తోంది, ఆ రాత్రి ఆ జంట జాగారం చేసింది. తెల్లవారు  ఝామున వారి తనువులు అలసి సొలసి విశ్రమించాయి.


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/oUAyJBMW8iA

    16 min
  • గరుడాస్త్రం - ఎపిసోడ్ 7 | Garudashram - Episode 7 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    గరుడాస్త్రం - ఎపిసోడ్ 7

    రచన : గన్నవరపు నరసింహ మూర్తి

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఇంటికి వెళ్ళగానే అతని తల్లి సుశీల చాలా సంతోషించి దిష్టి తీసింది. స్నానం తరువాత  టిఫిన్ ఇచ్చి కొడుకు యోగ క్షేమాలు అడిగింది. కరుణాకరం గారి కుటుంబం గురించి అన్నీ అడిగింది. తల్లికి చెబుతునాడే గాని  అతనికి విసుగ్గా వుంది.. ప్రయాణం లో అలసట వల్ల చిరాగ్గా ఉన్నాడని  ఆమె అనుకుంది.

    ఆ రాత్రి భోజనాల తరువాత డాబా మీదకు వెళ్ళాడు. మంచు పడుతోందని జలుబు చేస్తుందనీ సుశీల కొడుక్కి చెప్పింది.. అతను ఆమె మాటల్ని పట్టించుకోకుండా డాబా మీదకు ఎక్కాడు. కొబ్బరి చెట్ల ఆకుల్లోంచి పున్నమి వెన్నెల ముఖం మీద పడుతోంది.. పల్లె కావడం   వల్ల ఎనిమిదికే ఊరు నిద్రపోయింది.. అంతా నిశ్శబ్దం.. చాలా రోజుల తరువాత రణ గణ ధ్వనులకు దూరంగా ప్రశాంత వాతావరణాని కొచ్చాడు.. రేపట్నుంచీ ఎటువంటి ఆలోచనలూ పెట్టుకోకుండా పరీక్ష మీద దృష్టి కేంద్రీకరించాలి.. ఈ పరీక్షలో పాసై ఉద్యోగం వస్తేనే తన గమ్యం చేరుకునే అవకాశం కలుగుతుంది..

    మీద తెల్లటి ఆకాశం నిర్మలంగా ఉంది.. నక్షత్రాలు మెరుస్తూ ఆకాశానికి అందాన్నిస్తున్నాయి. ఆకాశంలో తెల్లటి కొంగలు ఎగురుతూ కనిపిస్తున్నాయి. దూరంగా ఏటి దగ్గర తోటల్లోంచి కోకిల కుహు కుహు నాదం అక్కడి నిశ్శబ్దన్ని భంగ పరుస్తోంది.. ఆ వెన్నెలను చూస్తూంటే అతనికి చక్రవాక పక్షి గుర్తు కొచ్చింది. దాన్నే వెన్నెల పులుగంటారనీ ఎక్కడో చదివాడు..

    కానీ ఆ పక్షినెప్పుడు చూడలేదు. వెన్నెట్లో విహరించే ఆ పక్షిని తలుచుకుంటే అతని శరీరం పులకరించసాగింది.. అలా అతని ఆలోచనలు మళ్ళీ ప్రణవి మీదకు మళ్ళాయి. ఒకసారి సముద్రపు ఒడ్డున వెన్నెల్లో ఆమెను 'వెన్నెల్లో ఆడపిల్ల' నీ చెబితే ఆమె ముఖంలో ఎంతో ఆనందం కనిపించింది.. అప్పుడు చిరునవ్వుతో తనను చూసిన ఆమె చూపు ఎన్నో రోజులు తనను వెంటాడింది.. తిలక్ అందమైన అమ్మాయిలకు ఎంత  అందమైన పేరు పెట్టాడు! వెన్నెల్లో ఆడపిల్ల.. మళ్ళీ ఆలోచనలు.. ఆమెతో గోదావరిలో పడవలో ప్రయాణం.

    తెల్లటి ఆకాశం; తెల్లటి తెరచాప ;తెల్లటి ప్రణవి.. పాపికొండల్లో తెల్లటి జలధార.. దాని కింద తెల్లటి దుస్తుల్లో ప్రణవి.

    ఆలోచనలు వెంటాడుతున్నాయి.. ఆమెకు దూరంగా వచ్చినా  ఆలోచనలు ఆమె వైపే వెళుతుండటం  అతనికి కోపం కలిగించ సాగింది..

    చదువు కొంటున్నప్పుడు నిద్ర ఎప్పుడు కనురెప్పల మీదే ఉండేది. తను వద్దనీ ఎంత మొత్తుకున్నా అది వినేది కాదు.. ఈ రోజు తనకి కావాలన్నా ఆ నిద్ర రావటం లేదు.. ఈ రోజు కూడా అది కనురెప్పల మీదే ఉంటూ వాటిని మూసుకోనివ్వటం లేదు.. “నిద్రా! నీకెందుకు నేనంటే అంత కోపం.. ”.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/ANAXFMYlUnA

    16 min
  • గరుడాస్త్రం - ఎపిసోడ్ 6 | Garudashram - Episode 6 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    గరుడాస్త్రం - ఎపిసోడ్ 6

    రచన : గన్నవరపు నరసింహ మూర్తి 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఇక గరుడాస్త్రం ఆరవ భాగం చదవండి..

    సాయంత్రం ఐదు గంటలైంది  - కాలేజీలో హైడ్రాలిక్ లేబొరేటరీలో శ్రీ హర్ష ప్రాజెక్ట్ విషయమై కొన్ని ప్రయోగాలు చేసి అప్పుడే బయటకు వచ్చాడు.

    కొద్ది సేపటికి ప్రణవి కారు వచ్చి అతని దగ్గర ఆగింది. శ్రీ హర్ష కారు ఎక్కగానే బయలుదేరింది. వాతావారణం ఆహ్లాదకరంగా ఉంది..

    ఇంకో రెండు నెలల్లో మీ చదువు పూర్తతుంది. తరువాత ఏం చెయ్యాలనుకుంటున్నారు?” శ్రీహర్షని అడిగింది ప్రణవి.

    “కాలేజీ స్టడీస్ అయితే పూర్తైంది. ఇప్పుడు మేము ప్రాజెక్టు వర్క్ చేస్తున్నాము. అది ఈ వారంతో పూర్తవుతుంది . ఆ తరువాత పరీక్షలు.. నాకైతే మిలట్రీలో చేరి దేశానికి సేవ చేయ్యాలనుంది. అంటే యుద్ధాలను చెయ్యడం కాదు.. రక్షణ శాఖకు శాస్త్రీయంగా ఉపయోగ పడాలని వుంది. అంటే సైంటిఫిక్ గా ఏదైనా చెయ్యాలనుంది..” అన్నాడు శ్రీ హర్ష

    "సైంటిఫిక్ గా అంటే ఎలా?” ప్రణవి ఆసక్తిగా అడిగింది.

    “అంటే జెట్ విమానాలు, విక్రాంత్, విరాట్ లాంటి నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్స్ ని అభివృద్ధి చెయ్యటం, అలాగే సబ్ మరైన్స్ కొత్తవి తయారు చెయ్యటం.. ఇలాంటి వన్నమాట.. అలాగే మిసైల్స్, గన్ షిప్స్.. ఇటువంటివి అభివృద్ధి చేస్తే దేశానికి రక్షణ శక్తి పెరుగుతుంది” అన్నాడు.

    “మీరు చెప్పినవన్నీ మానవ వినాశనానికి కారణం అవుతాయి కదా?”


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/yZavPLVKUqw

    16 min
  • గరుడాస్త్రం - ఎపిసోడ్ 5 | Garudashram - Episode 5 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    గరుడాస్త్రం - ఎపిసోడ్ 5

    రచన : గన్నవరపు నరసింహ మూర్తి 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఎప్పుడు లేనిది ఆ రోజు శ్రీ హర్ష పెళ్ళిని పూర్తిగా చూసాడు. ముందు ముహుర్త సమయానికి జీలకర్ర, బెల్లం పెట్టడం, ఆ తరువాత మాంగల్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠేబ.. ” అన్న మంత్రోచ్ఛరణతో మంగళ సూత్ర ధారణ, ఆ తరువాత తెల్లటి మధు పర్కాలతో  తెల్లటి తలంబ్రాలను వధూవరులు ఒకరి మీద ఒకరు పోసుకోవడం, ఆ తలంబ్రాలు పోస్తున్నప్పుడు ప్రణవి తన స్నేహితురాలికి సహాయం చేయడం..

    తదనంతరం అప్పగింతలు, తెల్లవారుతుండగా అరుంధతీ నక్షత్ర దర్శనం.. ఇలా మొత్తం పెళ్ళి తంతులన్నీ చాలా ఇష్టంగా అనుభవిస్తూ చూసాడు శ్రీ హర్ష. మొత్తం పెళ్ళిపందిరి అంతా ఒక మంగళకరమైన పవిత్ర పరిమళం వ్యాపించి ఒక పవిత్ర వాతావరణానికి అంకురార్పణ జరిగింది..

    తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు పిడికిట తలంబ్రాల పెళ్ళికూతురు.. అన్న అన్నమయ్య కీర్తన పందిరంతా మారుమ్రోగటం, తాళి కడుతున్నప్పుడు అలనాటి రామచంద్రుని.. అన్న పాట మధురంగా వినిపించటం.. ఆ సమయంలో అతన్ని ప్రణవి క్రీగంట చూసి నవ్వటం అన్నీ గుర్తుకొచ్చాయి శ్రీ హర్ష కి.

    ఏదైనా అతని జీవితంలో ఆ పెళ్ళి రోజు రాత్రి ఎన్నో మధురానుభూతులను మిగిల్చిందని చెప్పవచ్చు.

    ఆ మర్నాడు తొమ్మిది గంటలకు పెళ్ళి పెద్దలకు చెప్పి బయలుదేరడానికి సిద్ధ పడింది ప్రణవి. అప్పటికే అన్నీ సర్దుకొని సిద్ధంగా ఉన్నాడు హర్ష..

    ప్రణవి పెళ్ళికూతురుకి తను వెళ్ళిపోతానన్నా విషయం చెప్పగానే ప్రియంవద “అదేంటి ఈ రోజు ఉండి రేపు వెళ్ళొచ్చు కదా.. నిజంగా తోడి పెళ్ళికూతురిగా నువ్వు నా పక్కన కూర్చోవటం నాకు ఎంతో ఆనందం కలిగింది తెలుసా? ఇంకో విషయం చెప్పనా! మా శ్రీవారు నీ పక్కన కూర్చున్న ఆ సౌందర్యరాశి ఎవరనీ నీ గురించి అడిగారు తెలుసా.. నిజంగా నువ్వు నిన్న రాత్రి చాలా అందంగా కనిపించావు?” అంది ఆమె బుగ్గలు నొక్కుతూ

    “ఎలాగూ ఇంత దూరం వచ్చాను. పాపికొండలు చూసి వెళ్ళిపోతాము. అయినా రాత్రంతా పెళ్ళితంతుతో నీకు నిద్రలేదు. హాయిగా పడుకో. రేపట్నుంచీ నీకెలాగూ నిద్ర ఉండదు” అంది పకపకా నవ్వుతూ..

    ఆమె మాటలకు ప్రియంవద బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. “పోవే! చిన్నప్పటి చిలిపితనం నీ కింకా పోలేదు” అంది తను కూడా నవ్వుతూ..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/kfWmRneFZ-Y

    15 min
  • గరుడాస్త్రం - ఎపిసోడ్ 4 | Garudashram - Episode 4 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    గరుడాస్త్రం - ఎపిసోడ్ 4

    రచన : గన్నవరపు నరసింహ మూర్తి 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    జరిగిన కథ..

    శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.

    అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు.

    ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు. అయన శ్రీ హర్ష ను తన అవుట్ హౌస్ లో ఉండమంటాడు.

    కరుణాకరం గారి అమ్మాయి ప్రణవి తో పరిచయమవుతుంది.

    ప్రణవి, ల్యాబ్ దగ్గరకు వచ్చి శ్రీహర్షను కలుస్తుంది.

    తన బర్త్ డే షాపింగ్ కి అతన్ని తోడు రమ్మని కోరుతుంది.

    ముందుగా ఇద్దరూ బీచ్ లో కొంత సమయం గడుపుతారు.

    బర్త్ డే సందర్భంగా ఆమె ఇంటి డెకరేషన్ లో సహాయ పడతాడు.

    ఇక గరుడాస్త్రం నాలుగవ భాగం చదవండి..

    రెండు నెలల తరువాత ఒకరోజు శ్రీహర్ష కాలేజీ నుంచి ఇంటికి రాగానే కరుణాకరం గారు పిలుస్తున్నారని వాచ్ మేన్ చెప్పాడు. వెంటనే పుస్తకాలు గదిలో పడేసి అలాగే అతనికి దగ్గరికి వెళ్ళాడు.

    కరుణాకరం గారు తన ఆఫీసు రూమ్ లో కూర్చొని ఏవో ఫైల్స్ చూస్తున్నాడు. శ్రీ హర్షని చూడగానే కూర్చోమని కుర్చీ చూపించి, ఫైలు చదవడంలో నిమగ్నమయ్యాడు. కొద్ది సేపటికి అది పూర్తి కావడంతో ఫైలుని పక్కన పెట్టి  “ఏవయ్యా! కాలేజీ కి వెళ్ళావా?” అని అడిగాడు.

    “వెళ్ళాను సార్.. ఇప్పుడే వచ్చేను”.

    “ఇది ఫైనలియర్ కదా? ప్రాజెక్ట్ వర్క్ ఉంటుందా?” అని అడిగాడు కరుణాకరం.

    "ఫైనలియర్లో రెండు సెమిస్టర్స్ ఉంటాయి. ఆఖరి సెమిస్టర్లో ప్రాజెక్ట్ వర్క్ చెయ్యాలి. కానీ మేము టైము సరిపోలేదని ఇప్పుడే మొదలెట్టాము “. - అని చెప్పాడు హర్ష.

    “దసరా సెలవులు ఎప్పట్నుంచి?”

    “సార్! ఎల్లుండి నుంచే”

    “శలవులకి ఏమిటి నీ ప్రోగ్రాం?”

    “ మా ఊరు వెళ్లాలనుకుంటున్నాను. అమ్మ రమ్మనమని చెబుతోంది..... ”

    “అది సరే... నిన్నెందుకు రమ్మన్నానో తెలుసా? మా ఫ్రెండ్ కూతురి పెళ్ళి మళ్ళీ వారం కోనసీమలో జరగబోతోంది. నన్ను రమ్మనమని మరీ మరీ చెప్పాడు. కానీ ఆ సమయంలో నాకు ఢిల్లీలో అర్జెంట్ కేసు విషయమై సుప్రీం కోర్టుకి వెళ్ళవలసిన అవసరం పడింది. అందుకు నేను వెళ్ళడం కుదరదు. ప్రణవిని ఆ పెళ్ళికి పంపుతున్నాను; నేను మీ నాన్నకి అమ్మకి చెబుతానే తరువాత వెళుదువుగాని , నువ్వు ప్రణవికి తోడుగా వెళ్ళు, వంటరిగా దాన్ని పంపడం నా కిష్టం లేదు” అని చెప్పాడు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/cUkEMsmU4a4

    13 min
  • గరుడాస్త్రం - ఎపిసోడ్ 3 | Garudashram Episode 3 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    గరుడాస్త్రం - ఎపిసోడ్ 3

    రచన : గన్నవరపు నరసింహ మూర్తి 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    సాయంత్రం 4 గంటలకి ప్రాజెక్ట్ పని పూర్తి చేసి కాలేజీ మెయిన్ గేటు దగ్గరికి వచ్చాడు శ్రీహర్ష.. అప్పటికే చాలా మంది విద్యార్థునీ విద్యార్థులు ఇళ్ళకు వెళ్ళిపోతూ కనిపించారు. కొందరైతే హాస్టల్ వైపు వెళుతున్నారు.

    ఇంతలో అతని కెదురుగా కారు ఆగి తలుపు తెరుచుకుంది. డ్రైవింగ్ సీట్లో ప్రణవి..

    ఆమె శ్రీహర్షని చూస్తూ “ఎక్కండి” అంది. శ్రీహర్ష వెనక తలుపు తెరుచుకొని ఎక్కుతుంటే “ఏమండోయ్.. నేనేమైనా డ్రైవర్ని అనుకుంటున్నారా? ముందు కూర్చోండి” అంది నవ్వుతూ.

    శ్రీ హర్షకు తాను చేసిన తప్పేమిటో తెలిసి ముందుకొచ్చి కూర్చోగానే కారు కదిలింది. కాలేజీ రోడ్డంతా రద్దీగా ఉంది.. కారు గేటు దాటి రోడ్డు మార్గం పట్టింది.

    “ ఈ రోజు డ్రైవర్ రాలేదా?! అని అడిగాడు హర్ష.

    “వచ్చేడు. ఈ రోజు మార్కెటింగ్ కదా ఆలస్యమౌతుందనీ నేనే పంపించేసా” అంది ప్రణవి.. ఆమె దృష్టి రోడ్డు మీదే ఉండటం గమనించాడు హర్ష. కొద్ది సేపటికి రోడ్డు మార్కెట్ వైపు కాకుండా ఇంకో రోడ్డులో వెళ్ళటాన్ని గమనించాడు హర్ష.

    “మనం వెళుతోంది షాపింగ్ కి కదా.. ఇటెక్కడికి తీసికెళుతునారు?” అని అడిగాడామెను..

    “చాలా రోజులైంది బీచ్ కెళ్ళి..కాసేపు బీచ్ కెళ్ళి కూర్చొని వెళదాం”.

    “అప్పుడాలస్యం అవుతుంది కదా.. నాన్నగారు గాభరా పడతారేమో? అందులో డ్రైవర్ కూడా లేడు” అన్నాడు హర్ష.

    "డ్రైవర్ లేకపోతే ఏం? మీరు లేరా? ” అంది హర్షని క్రీగంట    చూస్తూ.

    “మీరెప్పుడూ సూటిగా మాట్లాడరు.. మీ మాటల్లో వ్యంగ్యం, హాస్యం తొణికిసలాడుతుంటుంది” అన్నాడు హర్ష నవ్వుతూ.

    తాను కూడా నవ్వుతూ “ఏం మీకు హాస్యం ఇష్ట ఉండదా?” అంది.

    “హాస్యమంటే ఇష్టం లేని వారెవరుంటారు చెప్పండి.. అయినా హాస్యంగా ఆహ్లాదకరంగా స్పాంటేనియస్ గా మాట్లాడటం అందరికీ సాధ్యపడదు. అదొక కళ.. అలా మాట్లాడే వారు ఎప్పుడూ వత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉంటారని మా లెక్చరర్ గారు చెప్పేవారు..” అన్నాడు హర్ష.

    “అబ్బో! నన్ను మీ పొగడ్తలతో మునగ చెట్టెక్కిస్తున్నారే.. ఈ వయసులో కొంచెం వ్యంగ్యంగా మాట్లాడటం సహజం.. మా క్లాస్ మేట్స్ చాలా మంది నాలాగే మాట్లాడతారు. వాళ్ళ వల్లే నాకిలా మాట్లాడటం అలవాటైంది.. అయినా ఏదైనా మితిమీరకుండా ఉంటే మంచిది.. ఏమంటారు?”

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/YTK8UV6cZ_A

    19 min
  • గరుడాస్త్రం - ఎపిసోడ్ 2 | Garudashram Episode 2 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    గరుడాస్త్రం - ఎపిసోడ్ 2

    రచన : గన్నవరపు నరసింహ మూర్తి 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    జరిగిన కథ....

    శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.

    అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు.

    ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు.

    అయన శ్రీ హర్ష ను తన అవుట్ హౌస్ లో ఉండమంటాడు.

    కరుణాకరం గారి అమ్మాయి ప్రణవి తో పరిచయమవుతుంది.

    గరుడాస్త్రం ధారావాహిక మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇక గరుడాస్త్రం రెండవ భాగం చదవండి...

    ఆ తరువాత శ్రీ హర్ష అవుట్ హౌస్ లోపలి కెళ్ళాడు. అతని సామానంతా అందులో నీటుగా సర్దబడి ఉంది. యజమానురాలి ఆర్డర్స్ ని  ఆ వాచ్ మేన్ వెంకన్న తూచ తప్పకుండా పాటించి అద్భుతంగా సర్దినట్లున్నాడు..

    శ్రీహర్ష లోపలికెళ్ళి సోఫాలో కూర్చొని ఆలోచించసాగేడు.. ముఖ్యంగా ఆ ఇంటిలోని కరుణాకరం గారు, అతని కూతురు ప్రణవి. వాళ్ళ మర్యాదని, మంచితనాన్ని చూస్తుంటే అతని కంట నీరు చెమ్మగిల్లుతోంది..

    ఒంటి గంట ప్రాంతంలో అతను భోజనం కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ప్రణవి హల్లో అతని కోసం ఎదురు చూస్తోంది. శ్రీహర్షని చూడగానే “రండి “అంటూ డైనింగ్ హాలు వైపు నడిచింది.

    వాళ్ళిదర్నీ చూడగానే వంటావిడ ఇద్దరికీ డైనింగ్ టేబుల్ మీద వడ్డించటం మొదలు పెట్టింది. గోంగూర పచ్చడి, వంకాయ, బంగాళా దుంపల వేపుడు, టమోటా పప్పు, సాంబారు ఘుమ   ఘుమ   వాసనలతో వంటకాలన్నీ ఊరిస్తున్నాయి.. - ముఖ్యంగా సాంబారు వాసన అతనికి తన అమ్మ చేసే పులుసుని గుర్తుకు తెచ్చింది.

    “ఏంటలా ఆలోచిస్తున్నారు. తినండి” అంది ప్రణవి.

    “నేను బయటతినేద్దామనుకున్నాను కదండి.. - మీరు నన్ను బాగా మొహమాట పెట్టేస్తున్నారు”, అన్నాడు హర్ష.

    “మీకింకా మొహం మాటం పోయినట్లు లేదు. అలా ఆలోచిస్తే మీరు అన్నం మనస్పూర్తిగా తినలేరు. అయినా మిమ్మల్ని భోజనం ఇక్కడే చెయ్యిమనీ నాన్నగారు చెప్పి మరీ వెళ్ళారు. ఇంకేం ఆలోచించకుండా తినండి” అంది తను కలుపుకుంటూ.. -

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/6yNd62wCJug


    12 min
  • గరుడాస్త్రం - ఎపిసోడ్ 1 | Garudashram Episode 1 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    గరుడాస్త్రం - ఎపిసోడ్ 1

    రచన : గన్నవరపు నరసింహ మూర్తి 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    గ్రీష్మం!

    ఎండ మండిపోతోంది. ఆ సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు ఆగింది. శ్రీ హర్ష బస్సు దిగి బయట కొచ్చి ఆటో కోసం చూసాడు. ఆటో స్టాండ్ దూరంగా ఉంది... రోడ్డంతా ట్రాఫిక్ మయం కావడంతో మెల్లగా అటు ఇటు చూస్తూ అవతలికి వెళ్ళాడు. ఆటో స్టాండంతా చాలా రద్దీగా ఉంది... ఒక ఖాళీ ఆటో వెళుతుంటే దాన్ని పిలిచి ఎడ్రస్ చెప్పాడు. ఆటో వాడు మూడు వందలిమ్మన్నాడు.

    మూడు వందలనగానే హర్షకి చెమటలు పట్టాయి. తను 90 కిలోమీటర్లు బస్సులో వస్తే 80 రూపాయలు బస్సు ఛార్జీ. కానీ ఇక్కడ 6 కిలోమీటర్లకు మూడువందలా? అని అతనికి ఆశ్చర్యం కలిగింది. కొద్దిసేపు అక్కడే నిలబడి రెండు మూడు ఆటోలను మాట్లాడేడు. అందరూ 250, 300 చెప్పడంతో ఇంక ఆటో ఆలోచనకి స్వస్తి చెప్పి నడకకి పని చెప్పాడు.

    అప్పుడు సమయం 11 గంటలైంది. సూర్యుడు నెత్తిన మండిపోతుంటే ఒకటే ఉక్కబోత. జేబులో రూమాలు తీసి ముఖం కడుక్కొని బేగులో మంచినీళ్ళ సీసా తీసి నీళ్ళు తాగి మళ్ళీ నడవడం మొదలు పెట్టాడు. రెండు కిలోమీటర్లు వెళ్ళిన తరువాత ఒక చెట్టు కనిపిస్తే అక్కడ కాసేపు నిలబడ్డాడు.

    ఒక్కసారిగా ఎండ  లోంచి చల్లటి నీడలోకి వెళ్ళగానే అతనికి హాయిగా అనిపించింది. మళ్ళీ ముఖం తుడుచుకొని జేబులోని ఎడ్రస్ కాగితం తీసి చూసాడు. లాయర్ కరుణాకరం, పన్నీరు వీధి... ఆర్టీసీ కాంప్లెక్స్ కి 6 కిలోమీటర్లు అని వ్రాసి ఉంది. ఆ కాగితాన్ని జేబులో పెట్టుకొని మళ్ళీ నడవటం మొదలు పెట్టాడు.. రోడ్లన్నీ వాహనాల రొదతో నిండి పోయి కనిపించాయి. కనుచూపు మేరలో మనిషి కనిపించటం లేదు. అన్నీ వేగంగా వస్తున్న వాహనాలే...

    వాటిని చూస్తూంటే అతనికి తన కాలేజీ రోజులు గుర్తుకు వచ్చాయి. తను ఇంజనీరింగ్ లో చేరినపుడు ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు. ఇప్పుడు సాఫ్టవేర్ రంగం అభివృద్ధి చెందటంతో యువత, ఉద్యోగాలు, కార్లు పట్నాల్లో పెరిగాయి. ఆలోచిస్తూ నడుస్తుండగానే అతను 6 కిలోమీటర్ల దూరం వచ్చేసాడు..

    పక్కనే సూపర్ బజార్ కనిపిస్తోంది. ఎడ్రస్ ప్రకారం కరుణాకరం గారిల్లు సూపర్ బజార్ ఎదురుగా... సూపర్ బజార్ దగ్గరకు వెళ్ళి ఎదురుగా చూసాడు.. - ఎదురుగా మూడంతస్తుల బిల్డింగ్ అత్యంత సుందరంగా ఉంది. ఎదురుగుండా పెద్ద గేటు... గేటు రెండు తలుపుల మీద రెండు నెమళ్ళు అందంగా కనిపిస్తున్నాయి. గేటు పక్కనే కరుణాకరం, అడ్వకేట్ అన్న బోర్డు కనిపించింది.. - వెంటనే రోడ్డు దాటి ఇంటి దగ్గరకు వెళ్ళాడు. ఇంటి మొదటి అంతస్తు దగ్గర ప్రణవి నిలయం అని వ్రాసి ఉంది...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/SWl5TCmzF-w

    14 min
  • నాకేమవుతోంది ఎపిసోడ్ 16 | Nakemavuthondi Episode 16 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి

    నాకేమవుతోంది…? ఎపిసోడ్ 16

    రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
    డాక్టర్ శ్రీనివాస్ తనకు తెలిసిన విషయాలు చెప్పడం ప్రారంభించాడు. "తనకు సంబంధించిన వారి ప్రమేయం ఉన్న విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవడం, కనకరావుకి అనుమానాన్ని కలిగించింది.ఒక దశలో అతనివల్ల చనిపోయిన స్త్రీ తాలూకు ఆత్మ నిన్ను ఆవహించిందేమోనని అనుమాన పడ్డాడు. అలాంటిదేమీ లేదని నేను నమ్మకంగా చెప్పాను. అయినా నిన్ను హాస్పిటల్ లో కొద్ది రోజులు ఉంచితే వాస్తవాలు తెలుస్తాయని భావించాడు. నీకు తెలిసిన వారికి హాని కలిగించి, ఆ విషయం నీకు ముందుగా తెలుస్తుందేమో చూడాలనుకున్నాడు.స్నేహితుడి గదిలో ఉన్న తరుణ్ కి తప్పించుకోవడానికి సహాయం చేసినట్లు నటించి తన ఆధీనంలో ఉంచుకోవాలనుకున్నాడు. అతనికి హాని కలిగిస్తే, ఆ విషయం ముందుగా నీకు తెలుస్తుందేమో తెలుసుకోవాలనుకున్నాడు. కానీ తరుణ్ తప్పించుకోవడానికి అంగీకరించ లేదు. దాంతో ఆ ఉపాయం ఫలించలేదు. ఢిల్లీ నుండి తన మాట వినే డాక్టర్లను పిలిపించి నీ మెదడు మీద ప్రయోగాలు చేయించాలనుకున్నాడు.నీ కోసం పోలీసులు ఖచ్చితంగా హాస్పిటల్ లో గాలిస్తారని, విషయం సద్దుమణిగేదాకా నిన్ను మా ఇంట్లో ఉంచుకుంటానని చెప్పి ఇక్కడికి తీసుకోని వచ్చాను. నువ్వు కోలుకున్నాక నీ ఇష్టప్రకారం చేయాలనుకున్నాను." చెప్పాడు శ్రీనివాస్.కొంతసేపు మాట పెగల్లేదు ప్రియకు.డాక్టర్ శ్రీదేవి ప్రియా భుజంపైన మృదువుగా తడుతూ "రిలాక్స్ ప్రియా..భయపడకు. నీకేమీ కాదు. నువ్వు ఇక్కడ క్షేమంగా ఉంటావు. మాకు రిస్క్ వచ్చినా సరే.. నిన్ను క్షేమంగా ఉంచడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తాం." అంది.కొంతసేపటికి తేరుకున్న ప్రియా "ఆ కనకారావు ఎంత దుర్మార్గుడు.. నాకు అతనితో ఏ విరోధం లేకున్నా నాకు, నా వాళ్లకు హాని చెయ్యాలని చూస్తున్నాడు.అతన్ని జైలుకు పంపే ఆధారాలు నాకు కలగానో భ్రమగానో వస్తే బాగుండునని ఇప్పుడు అనిపిస్తోంది" అంది ఆవేశంగా.ఇంతలో డాక్టర్ శ్రీనివాస్ ఫోన్ మోగింది.అటువైపునుండి కనకారావు పిఎ..ఆ విషయం తన భార్య డాక్టర్ శ్రీదేవికి సైగ చేసి చూపించి కాల్ లిఫ్ట్ చేసాడు."చెప్పండి సార్! ఏమిటి విశేషాలు?" అడిగాడు శ్రీనివాస్."ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది?" అడిగాడు అతను."ఇంకా పూర్తిగా కోలుకోలేదు సార్! మరో రెండు మూడు రోజులకు నార్మల్ అవుతుంది" చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్."నార్మల్ కావాల్సిన అవసరం మనకు లేదు. స్పృహ లోకి వచ్చి ఉంటే చాలు" అన్నాడు పిఏ."కానీ పూర్తిగా కోలుకోకుండా మనం ఏమైనా ప్రశ్నలు వేస్తే ఆ అమ్మాయి మానసిక పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. మరొక రెండు రోజులు ఓపిక పడదాం" చెప్పాడు శ్రీనివాస్."ఆ అమ్మాయికి ఏమైతే మనకేం? అలా ఆలోచిస్తూ కూర్చుంటే పనులు జరగవు. ఢిల్లీ నుంచి ప్రముఖ హిప్నాటిస్టు, మరో ప్రముఖ సైకియాట్రిస్ట్ రేపు వస్తున్నారు. వాళ్లను కనకారావు గెస్ట్ హౌస్ లో దించుతున్నాము. మీరు కూడా ఆ అమ్మాయిని తీసుకొని గెస్ట్ హౌస్ కి రండి. అక్కడ వాళ్లు 'ఆ అమ్మాయి మీద వేరెవరి ప్రభావమైన ఉందా' అనే కోణంలో పరిశీలిస్తారు. కనకారావు కారణంగా చనిపోయిన వారి ఆత్మ ఏమైనా ఆ అమ్మాయి మీద ప్రభావం చూపిస్తోందా అనే విషయం గమనిస్తారు. అలాంటిదేమీ లేని పక్షంలో జరగబోయేవి తెలుసుకొనే అతీంద్రియ శక్తి ఆ అమ్మాయికి ఉందా అని పరిశీలిస్తారు. అలాంటి శక్తి ఏమైనా ఉంటే ఆ అమ్మాయికి, ఆమె భర్తకు కనకారావు కంపెనీలలో మంచి ఉద్యోగం ఇచ్చి తన దగ్గరే ఉంచుకుంటారు.
    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/NwhF8aSw4Ug



    15 min
  • మమతల మధువు ఎపిసోడ్ 7 | Mamathala Madhuvu Episode 7 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)


    మమతల మధువు ఎపిసోడ్ 7

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    “ఆదీ!.."తండ్రి పిలుపు విన్న ఆది పరుగున వరండాలోకి వచ్చాడు."ఏం నాన్నా!...""నీకు మన వీరగోవిందయ్య తెలుసుగా!...”"పాండూ నాన్నగారు. తెలుసు నాన్నా.”"ఆ గోవిందు మన దగ్గర ఆరు నెలల క్రిందట యిరవై వేలు అప్పుగా తీసికొన్నాడు. పోయిన వారమే యిస్తానన్నాడు. నేను మద్రాస్ వెళ్ళానుగా!... అందువల్ల మన యింటికి రాలేదేమో. తాతయ్యకూ యివ్వలేదట. నీవు వెళ్ళి... మా నాన్నగారు డబ్బును తీసికొని రమ్మన్నారని చెప్పిరా!... సరేనా!...”“అలాగే నాన్నా!...” వీధిలోకి పరుగెత్తాడు ఆది.ఐదు నిముషాల్లో వీరగోవిందయ్య యింటిని సమీపించాడు.ఆ సమయంలో... యిరువురి వ్యక్తులతో గోవిందయ్య వసారాలో కూర్చొని, ఏదో వ్యాపార విషయం మాట్లాడుతున్నాడు. ఆది వీరగోవిందయ్యకు కనుపించాడు, తన్ను పిలుస్తాడని అనుకొన్నాడు. అతను పిలవలేదు. 'ఏదో ముఖ్యమైన విషయంగా వుంది. అందుకే నన్ను చూచీ చూడనట్లు వాడితో మాట్లాడుతున్నాడు. కాసేపు ఆగుదాం.' అనుకొని పావుగంటసేపు వారికి దూరంగా నిలబడ్డాడు ఆది.ఆ ముగ్గురి మధ్యనా చర్చ ముగియలేదు. అరగంట అయింది. యిక లాభంలేదని... ఆదిత్య గోవిందును సమీపించాడు.గోవిందయ్య ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని వున్నాడు. ఆ యిద్దరూ నులక మంచంలో కూర్చొని వున్నారు.
    “పన్నిండు వేలకు ఒక్క పైసా తగ్గించను.” ఖచ్చితంగా చెప్పాడు గోవిందయ్య. వారిరువురూ మంచం నుంచి లేచారు. “మేము ఫయనల్గా చెబుతున్నాము. పదివేలకు తీసుకొంటాము.” ఆ యిరువురిలో ఒకతను చెప్పాడు.“పది వేలకు యివ్వను.” గోవిందయ్య ఖచ్చితంగా చెప్పాడు.వారు... "మా సొమ్ము మీకు ప్రాప్తం లేదు.” ఏదో గొణుగుతూ ఆ యిద్దరూ వెళ్ళిపోయారు.గోవిందయ్య ఆదిని చూచాడు. “ఏరా!... ఎందుకు వచ్చావ్?...” కోపంగా అడిగాడు."మాకు యివ్వవలసిన యిరవై వేలు తీసుకొని మా యింటికి రండి. మా నాన్నగారు చెప్పమన్నారు.”"డబ్బు యిప్పుడు నా దగ్గర లేదు. పదిరోజుల తర్వాత యిస్తానని చెప్పు మీ నాన్నకు.”“వారం రోజుల క్రిందటే... మా నాన్నకు యిస్తానని చెప్పారట కదా!...”“చెప్పాను.”“అయితే... యివ్వండి.” నిక్కచ్చిగా అడిగాడు ఆది.“ఒకసారి చెబితే నీకు అర్థం కాదంట్రా!... పోరాపో నేను యివ్వను. పోయి నీ అబ్బకు చెప్పు.” అవేశంగా అన్నాడు గోవిందయ్య.‘అబ్బ, అన్న మాటకు ఆదికి కోపం వచ్చింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. “మాట తప్పిన మనిషి... మనిషి కాదు జంతువు.” ఆవేశంతో అన్నాడు ఆది."ఏందీ... ఏం కూశావురా!... నేను జంతువునా!...” కోపంతో ఆది చెంపపై కొట్టాడు గోవిందయ్య.ఆదిత్య కళ్ళలో నీళ్ళు నిండాయి. ఆది ఆగ్రహం హద్దులు దాటింది. చుట్టూ కలయ చూచాడు. ప్రక్కనే రాళ్ళగుట్టు వుంది. వేగంగా నడిచి వంగీ ఒక రాయికి చేతికి తీసుకొన్నాడు. గోవిందయ్య వైపుకు విసిరాడు, తన యింటి వైపుకు పరుగు తీశాడు.ఆ రాయి గోవిందయ్య తలకు తగిలింది. చర్మం చిట్లింది. రక్తం... తాకి రక్తాన్ని చూచి 'అమ్మా' అంటూ కుర్చీలో కూలపడ్డాడు.
    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.


    16 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world