Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • ప్రేమ చేజారితే 8 | Prema Chejarithe 8 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
    ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 8

    రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)
    ఇంతలో డాక్టర్ వచ్చి కుమార్తో మీ అబ్బాయికి న్యూరలాజికల్గా(అంటే మెదడు కణాలలో) ఏ ఇబ్బందీ లేదు. కేవలం చూసిన విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. అసలేం జరిగిందో వివరంగా చెప్పండని అడగగా, కుమార్ జరిగిన విషయం చెప్పి, నిజానికి పడిపోయిన వాళ్ళమ్మకు పెద్దగా దెబ్బలేవీ తగలలేదనీ, కాకపోతే షాలిని అలా పడటంతో, ఆమె మెడకున్న ఎర్రని స్కార్ఫ్ తల చుట్టూ పడింది, పైనుండి దాన్ని చూసిన కుశాల్ రక్తమనుకుని భయంతో మూర్చపోయాడనుకుంటాను అని చెప్పాడు కుమార్.
    అదంతా విన్న డాక్టర్లు, అయితే సైకియాట్రిస్టైతేనే దీనికి తగిన ట్రీట్మెంట్ చేయగలడన్న నిర్ణయానికి వచ్చి కుమార్తో కుశాల్కు సైకియాట్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నామని చెప్తారు.
    డాక్టర్లు చెప్పింది విన్నాక, కుమార్ తమ కాలనీ హాస్పిటల్కే షిఫ్టయ్యి, అక్కడి సైకియాట్రిస్టుకే చూపించటానికి ఆ డాక్టర్ల దగ్గర అనుమతి తీస్కోని, కాలనీ హాస్పిటల్కు కుశాల్ను షిఫ్ట్ చేస్తాడు. అక్కడ సైకియాట్రిస్టైన నితిన్ను కలిసి జరిగిన విషయమంతా చెప్తాడు కుమార్.
    నితిన్ ఆ కాలనీవారి కోసం అక్కడే వుంటున్న సైకియాట్రిస్టు, ఆయనకు ఆ కాలనీ గురించి, ఆ కాలనీ వాసుల గురించి పూర్తిగా తెలుసు. వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ వల్ల పిల్లలకు ఎలాంటి మనస్తాపం కలుగకుండా వుండేందుకు గాను ముందునుంచే పిల్లల మానసిక స్థితిని పర్యవేక్షుస్తున్నాడు నితిన్.
    "కుశాల్ తన తల్లికి తనవల్లే ఏమో అయ్యిందనీ, ఇంక తనకు తల్లి దక్కదేమోనన్న షాక్కు లోనయ్యి, మూర్చనుండి లేవగానే మళ్ళీ అది గుర్తుకు వచ్చి మూర్చపోతున్నాడు, " అని చెప్తాడు నితిన్.
    మళ్ళీ తనే కుమార్తో, " షాలిని క్రింద పడినప్పుడు, కుశాల్ కానీ షాలినిని గురించి ఏమైనా గమనించి వుంటాడంటావా ?" అని అడిగాడు.
    దానికి కుమార్, "అదే నాకూ అర్థం కావటం లేదు, " అని అంటాడు నితిన్తో.
    ఆ విషయం గురించి నితిన్ బాగా ఆలోచించి, " 'కుశాల్కు షాలిని గురించి తెలిసినా, తెలియకపోయినా ఏ ఇబ్బంది కలగని విధంగా మనమొకటి చేయవచ్చు. అదేమంటే, కుశాల్ మెదడులో నుండి ఆ సంఘటనను మర్చిపోయేలా చేయటమే. దాని వల్ల అదంతా మర్చిపోయి మామూలుగా అవుతాడు, కాకపోతే మెదడులోని ఙ్ఞాపకం తీసేసేప్పుడు, అదొక్కటే తీసేయలేము, దానికి ముందు కొన్ని రోజుల ఙ్ఞాపకాలు కూడా మరిచిపోతాడు. అయినా ఆ ఙ్ఞాపకాలు పూర్తిగా చెరిగి పోవు సబ్ కాన్షియస్ లో అలానే వుంటాయి, మళ్ళీ అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు గుర్తుకు వచ్చే ప్రమాదమైతే వుంది, ' అని చెప్పి. 'అలాగే ఇప్పటి నుండి, కుశాల్ ఎప్పుడు తన తల్లి ప్రేమను కోల్పోతానేమోనన్న అభద్రతా భావానికి లోనయ్యి ఏదైనా ఆలోచించే ప్రయత్నం చేస్తాడో అప్పుడు తలనొప్పి వచ్చే ప్రమాదముంది. అప్పుడు కుశాల్కు అన్నీ చెప్పి కౌన్సెలింగ్ ఇవ్వక తప్పదు, ' " అని సైకియాట్రిస్ట్ నితిన్ అంటాడు కుమార్తో.
    దానికి కుమార్, "సరే"నని ఒప్పుకుంటాడు.
    నితిన్ తన హిప్నొటైజేషన్ టెక్కిక్తో కుశాల్ మెదడులోని 'షాలిని గుంతలో పడి బండ రాయిని గుద్దుకుని రక్తం చిందిన ఙ్ఞాపకాన్ని' మరిచి పోయేలా చేస్తాడు. దానితో పాటు ఇంకొన్ని రోజుల మామూలు ఙ్ఞాపకాలు కూడా మరిచిపోతాడు కుశాల్. ఆ ట్రీట్మెంట్ తర్వాత కుశాల్ మూర్చ నుండి బయటికొచ్చి, తను కొన్ని సంఘటనలు మర్చిపోయినట్టు తెలియక మామూలుగా మాట్లాడసాగాడు.
    అప్పటికి కానీ కుమార్ ఆందోళన తగ్గలేదు. తర్వాత ఆనందంగా, మనస్పూర్తిగా నితిన్కు కృతజ్ఞతలు తెలుపుతాడు కుమార్.
    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/XahrVAJ4MmI


    16 min
  • నాకేమవుతోంది ఎపిసోడ్ 15 | Nakemavuthondi Episode 15 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    నాకేమవుతోంది…? ఎపిసోడ్ 15

    రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

    డాక్టర్ శ్రీనివాస్ భార్య శ్రీదేవి, "మరొక గ్లాస్ జ్యూస్ ఇవ్వనా?" అంది ప్రియా వంక చూస్తూ."ఇవ్వండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లు ఉన్నాను. బాగా నీరసంగా ఉంది" అంది ప్రియ."అలా అయితే మీరు కాసేపు రిలాక్స్ కండి. నేను ఓ గంటకి మిమ్మల్ని కలుస్తాను" అన్నాడు శ్రీనివాస్."అవసరం లేదు. నన్ను చెప్పనివ్వండి. నా ఆలోచనలన్నీ మీకు తెలియడం మంచిది" అంది ప్రియ."అయితే ఓ రెండు నిమిషాలు ఆగు. జ్యూస్ తీసుకొని వస్తాను" అంటూ లోపలికి వెళ్ళింది శ్రీదేవి."హాస్పిటల్లో ప్రమాదం ఉందని మీ ఇంట్లో ఉంచినట్లు చెప్పారు. ఏమిటా ప్రమాదం? నేను గతంలో కూడా రెండు మూడు సార్లు హాస్పిటల్ కి వచ్చాను కదా.." అంది ప్రియ."నీ జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనలకు, కేకేఆర్ హాస్పిటల్ అధినేత కనకారావు కు ఏదో తెలియని సంబంధం ఉందనిపిస్తోంది, ముందు చెప్పడం పూర్తి చేయి, దాన్నిబట్టి నేను ఒక అభిప్రాయానికి వస్తాను" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.ఇంతలో శ్రీదేవి ఒక గ్లాసులో జ్యూస్ తీసుకొని వచ్చి ప్రియ చేత తాగించింది. ఒంట్లోకి కాస్త శక్తి వచ్చినట్లు అయింది ప్రియా కి. డాక్టర్ శ్రీదేవికి థాంక్స్ చెప్పి చెప్పడం కొనసాగించింది.ఖచ్చితంగా హన్సికకు ఏదో ఆపద కలగబోతోందని నా సిక్స్త్ సెన్స్ చెబుతోందనిపించింది. గతంలో నా మీద మా మేనమామ అత్యాచార యత్నం చేసినట్లు, అది విఫలం కావడంతో హత్యా ప్రయత్నం చేసినట్లు నాకు భ్రమ కలిగింది. కానీ అదే విషయం నా స్నేహితురాలు భార్గవి విషయంలో నిజమైంది. తన మేనమామ ఆమెను హత్య చేశాడు. ఇప్పుడు తరుణ్ నన్ను చంపబోయినట్లు అనిపించింది. మరి హన్సిక భర్త చేతిలో చనిపోతుందా? ఆమె భర్త అమెరికాలో ఉన్నాడు కదా.. ఒకవేళ అతను ఇండియాకు ఏమైనా వచ్చాడా.. ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాను. మర్నాడు ఉదయం లేవగానే హన్సికకు ఫోన్ చేయడానికి ట్రై చేశాను. తన నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నేను, తరుణ్ రిసార్ట్ కి బయలుదేరాము. దారిలో మీరు పని చేసే కేకేఆర్ హాస్పిటల్ కనిపించింది. మీరు గుర్తుకు వచ్చారు. ఒకసారి మిమ్మల్ని కలుద్దామని అనిపించింది. కానీ తరుణ్ కి ఏమని చెప్పాలి.. 'నా మానసిక స్థితి గురించి అతనికి అనుమానాలు రేకెత్తించడం ఎందుకు..?' అనిపించింది.అర్థరాత్రి సమయంలో కిటికీ బయటనుండి హన్సిక నన్ను పిలిచినట్లు అనిపించింది.తరుణ్ మంచి నిద్రలో ఉన్నాడు.వెంటనే బయటకు వెళ్లాను. హన్సిక పక్క కాటేజ్ లోకి వెళ్లడం గమనించాను.వేగంగా ఆ కాటేజ్ ని సమీపించాను.తలుపు తట్టాను. చేతికి ఏదో తడిలా తగిలింది.టెన్షన్ లో నేను అది పట్టించుకోలేదు.ఒక యువకుడు తలుపు తీసాడు..ఇంత రాత్రి పూట పక్క కాటేజ్ వాళ్ళను డిస్టర్బ్ చేయడమేమిటని విసుక్కున్నాడు .నేను తిరిగి వచ్చేటప్పుడు తరుణ్ నాకోసం వెతుకుతూ కనిపించాడు.ఇందాక అతను నిద్ర నటించాడా..ఏమీ అర్థం కాలేదు.ఇప్పుడు నేను అతనికి కనిపిస్తే చంపేస్తాడా.,అప్పుడు చూసుకున్నాను నా చేతికి అంటిన రక్తపు మరకలను. వేగంగా కాటేజ్ లోని గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాను.
    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/4T4omxUVZTM




    10 min
  • మమతల మధువు ఎపిసోడ్ 6 | Mamathala Madhuvu Episode 6 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    మమతల మధువు ఎపిసోడ్ 6

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    “వాణ్ణి ఎందుకు కొట్టావ్?..” కోపంతో ఆదిత్యను అడిగాడు మాస్టారు.

    “వాడు నన్ను.. మీరు చెప్పే పాఠాన్ని విననీకుండా నాకు చక్కలిగింతలు పెట్టాడు. మిమ్మల్ని రమణారెడ్డి అని ఎక్కిరించాడు. తప్పు అని చెప్పాను. వినలేదు. మళ్ళా అదేపనీ చేశాడు. స్కేలుతో కొట్టాను.” నిలబడి నిర్భయంగా జరిగిన యధార్థాన్ని చేతులు కట్టుకొని ఆదిత్య చెప్పాడు.

    అతనీలోని నిజాయితీకి.. ధైర్యానికి మాష్టారు ఆశ్చర్యపోయాడు. కొద్దిక్షణాల తర్వాత మాష్టారు..

    “ఆదిత్యా!.. వాడు తప్పు చేస్తే.. నాతో కదా నీవు చెప్పాలి. నీవు వాణ్ణి ఎలా కొడతావు?.. చూడు.. వాడి తలకు గాయం అయింది. వాళ్ళ అమ్మా నాన్నలు మీ యింటికి వచ్చి.. మీ అమ్మా నాన్నలతో.. గొడవపడితే.. వారికి నీవేం సమాధానం చెబుతావు." ఆవేశంగా అడిగాడు మాస్టారు.

    "యింతకు ముందు మీతో చెప్పిన నిజాన్నే వారికి చెబుతాను.” నిర్భయంగా ఆదిత్య యిచ్చిన జవాబు యిది.

    ఆదిత్య ధైర్యానికి.. బదులు పలకలేకపోయాడు.. మాస్టారు. ఆ యిద్దరినీ తన కుర్చీ వద్దకు పిలుచుకొని వచ్చాడు.

    "చూడండి.. ఆదిత్యా.. కాంతారావు.. మీరు యిలా గొడవలు పెట్టుకోకూడదు. కొట్టుకోకూడదు. అది తప్పు, అందరూ కలసి మెలసి అన్నదమ్ముల్లా వుండాలి. నేను చెప్పేది బాగా వినాలి. యిక మీదట యిలాంటి తప్పును ఎప్పుడూ

    చేయకూడదు. సరేనా!..” అనునయంగా ఆ యిరువురికి చెప్పాడు మాస్టారు.

    'సరే, అన్నట్లు యిరువురూ తలలు ఆడించారు. ప్రక్క గది కిటికీ గుండా జరిగిన సన్నివేశాన్ని చూచింది ప్రేమ. కాంతారావును కొట్టి.. బావ తప్పు చేశాడు అనుకొంది ఆ చిన్నారి.

    స్కూలు గంట కొట్టారు. అందరు పిల్లలు బయటికి వచ్చారు. ఆదిత్య వెళ్ళి ప్రేమ చేతిని పట్టుకొన్నాడు. ప్రేమ చేతిని విదిలించి దూరంగా పోతూ..

    "నీవు నాతో మాట్లాడకు. నీకు కోపం ఎక్కువ. యీ రోజు నీవు కాంతారావును స్కేలుతో కొట్టి తప్పు చేశావు. నేను అమ్మ నాన్న.. అత్తయ్య మామయ్యలతో చెబుతాను.” బుంగ మూతితో కోపంగా చెప్పింది ప్రేమ.

    ఆదిత్య ఆమెకు ఎదురుగా ముందుకు నడవనియ్యకుండా నిలబెట్టాడు.

    “నీకు నేను చేసింది తప్పుగా తోచిందా ప్రేమా..”

    “అవును.”

    "వాడు ఏం చేశాడో నీకు తెలుసా!..”.

    “తెలీదు.”

    “అయితే.. నాదే తప్పని నీవు ఎలా అంటావ్?..”

    “కాంతారావు తలపై నీవు కొట్టి రక్తం వచ్చింది.. కాబట్టి.. కళ్ళను పెద్దవిగా చేసి ఆదిత్య ముఖంలోకి చూస్తూ అంది ప్రేమ.

    “వాడు చేసిన తప్పు నీకు..”

    "ఏం చేశాడు?..”

    "నేను మాస్టారు చెప్పే పాఠం వింటుంటే.. నాకు చక్కలిగింత పెట్టాడు. మాస్టారుగారిని ఎక్కిరించాడు. తప్పు అని చెప్పాను. నా మాట వినలేదు. తిరిగి అదే తప్పు చేశాడు. అందుకే.. నాకు కోపం వచ్చింది.”


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/t0bV1BWguJo

    17 min
  • ప్రేమ చేజారితే 7 | Prema Chejarithe 7 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 7

    రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి

    (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)

    అలా గతం గుర్తొస్తుంటే, ఆలోచిస్తూ కూర్చున్న కుమార్కు రాఘవరావు గొంతు దగ్గుతూ షాలినీని పిలిచినట్టు వినబడి గతం తాలూకు ఙ్ఞాపకాల నుండి బయటపడి రాఘవరావు పడక గది వైపుకు కదిలాడు. వెళ్తూ షాలినీనడిగి మంచి నీళ్ళు తీస్కుని రాఘవరావు దగ్గరకు చేరాడు కుమార్.   "ఏంటి నాన్నా! ఏదో ఇబ్బంది పడ్తున్నారు," అని అడిగి, ‘దగ్గొస్తున్నట్టుంది నీళ్ళు త్రాగండ’ని రాఘవరావును లేపి మెల్లిగా నీళ్ళు త్రాగించాడు.   “ఏంటి నాన్నా!? ఏమాలోచిస్తున్నారు? నేను చాలా వయసయ్యాక పెళ్ళి చేస్కున్నానని షాలిని గురించి, కుశాల్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి... నేటి కాలంలో మహిళా సాధికారతంటూ, మేము మాత్రమే ఎప్పుడూ ఇంట్లోనే వుండి ఇంటిని చూస్కోవాలా అంటూ, సొంత తల్లులే పిల్లలను వేరే వారికి అప్పజెప్పి ఉద్యోగాలు చేయాలనుకునే కాలం. పెద్ద వారిని వృద్దాశ్రమాలలో, పిల్లలను హాస్టల్లల్లో వుంచుతూ తాము కూడా ఉద్యోగాలు చేసి ఏదైనా సాధించాల్సిందే అనుకునే కాలం. షాలినితో మనకు ఆ ఇబ్బందే లేదు, చూస్తున్నారు కదా కుశాల్ని, మిమ్మల్ని ఎంత బాగా చూస్కుంటుందో, ఆపైన నేనుండనే వున్నాను. మీరు నిశ్చింతగా పడుకోండి” అని చెప్పి కుమార్ ఆఫీసుకు వెళ్ళిపోయాడు.   తర్వాత షాలిని మద్యాహ్నము నాలుగింటికి స్కూలుకు వెళ్ళి కుశాల్ని ఇంటికి  తీస్కొచ్చింది. మళ్ళీ వాడికి స్నానం చేయించి, స్నాక్స్ తినిపించి, హోమ్ వర్కు చేయించి, మధ్య, మధ్యలో రాఘవరావుకు కావాల్సినవన్నీ చూస్కుంటూనే వుంది. ఇంతలో కుమార్ ఆఫీసు నుండి వచ్చాడు, అది చూసి కుశాల్ పరుగెత్తుకుంటూ కుమార్ దగ్గరకు వెళ్ళి లోపలికి వస్తున్న కుమార్ను పలకరిస్తూ, ఆ రోజు తాను చేసినవన్నీ ఏకధాటిన చెప్తూ లోపలికి తీస్కొచ్చాడు. అదంతా లోపలున్న రాఘవరావుకు వినిపిస్తుంటే, ఎంతో ఆనందపడిపోయాడు... కుటుంబము, పిల్లలు వుంటే ఆ ఆనందమే వేరు... ఇన్నాళ్ళూ, దీనికోసమేగా నా ఎదురు చూపు...  హమ్మయ్య! నాకింకే కోరికా లేదని మనస్పూర్తిగా అనుకున్నాడు రాఘవరావు.   కుమార్ వెళ్ళి ఫ్రెషప్ అయ్యివచ్చి, తండ్రి రాఘవరావుతో, కొడుకు కుశాల్తో కాసేపు గడిపాడు. తర్వాత రాత్రికి షాలిని చేసిన చపాతీలను, షాలిని, కుశాల్కు తినిపిస్తే, కుమార్, రాఘవరావుకు తినిపించి, తర్వాత తనూ తిన్నాడు. షాలిని, కుశాల్ని వాడి రూమ్కు తీస్కెళ్ళి కథలు చెప్తూ పడుకో బెట్టి, నిద్ర పోయాక తన రూమ్కు వెళ్ళి పోయింది. కుమార్ రాఘవరావుకు కాసేపు ఏదో చదివి వినిపిస్తూ, ఆయన నిద్రపోగానే తన రూమ్కెళ్ళి తన ఆఫీసు పనులన్నీ చూస్కోని ఎప్పటికో పడుకున్నాడు.   ఇది ఆ ఇంట్లో ప్రతిరోజూ జరిగే మామూలు దినచర్య. వారి జీవితం గత కొద్ది కాలంగా ఇలా ఆనందంగా గడిచి పోతోంది. అలాగే  కుశాల్ ముద్దు, ముద్దు మాటలతో, వాడు అడిగే ఎక్కడలేని డౌట్లతో గిర్రున కాలం తెలీకుండానే గడిచిపోసాగింది.   ఇప్పుడు కుశాల్కు ఏడేళ్ళు వచ్చాయి. 

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/XCr7uftsHr0

    14 min
  • దక్షిణ దేశ యాత్ర 3 | Dakshina Desa Yathra 3 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    దక్షిణ దేశ యాత్ర మూడవ భాగం

    రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఫళని: ఈ క్షేత్రం దిండిగల్‌ జిల్లా లోని మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆరు స్వామి క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ స్వామి వారిని దండాయుదపాణి అనే నామంతో పిలుస్తారు. ఈయనను ఫళనిమురుగా యని కూడా పిలుస్తారు. జ్ఞానఫలాన్ని ఇచ్చే వాడు కనుక ఫళనిస్వామి అయ్యాడు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది.

    స్వామి ఒక చేతిలో దండం పట్టుకుని, కౌపీనధారియై, వ్యుప్తకేశుడై నిలబడి, చిరునవ్వు లొలికిస్తూ ఉంటారు. దానికి అర్థం "నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో"- అని మనకి సందేశం ఇస్తున్నారు. అంటే ఫళని క్షేత్రం జ్ఞానము ను ఇచ్చే క్షేత్రము.

    స్వామి వారు కొండ పైన ఉన్నారు. చేరుకోవాలంటే రెండు మార్గాలు. ఒకటి కాలినడకన మెట్లు ఎక్కడం. రెండు- రోప్‌వే మీద రైలు.

    ---------------

    సుఛీంద్రము: నేరాన్ని ఋజువు చేసే శుచీంద్ర శివుడు.

    కన్యాకుమారి కి కేవలం 13 కి. మీ. ల దూరంలో ఈ ఆలయం కలదు. స్వయంభూ వెలసిన లింగ స్వరూపుడు. లింగం అడుగున బ్రహ్మ, మధ్యన విష్ణువు, పైన శివుడు ఉంటారు. శుచీద్రం దత్తాత్రేయ క్షేత్రం గా ప్రసిద్ది చెందినది.

    శంకర భగవత్పాదులు పరమశివుని తాండవ నృత్యాన్ని ప్రత్యక్షంగా ఇక్కడ చూశారట. పరమ శివులు ఆదిశంకరుల వారికి ప్రణవ మంత్రాన్ని ఉపదేశించిన స్థలం. దేవేంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుకే ' శుచీద్రం' అని పేరొచ్చింది.

    రామేశ్వరము: ఈ దేవాలయం ద్వీపము లో కలదు. భారతదేశం లోని ఆలయాలన్నింటి కంటే విశాలమైన ఆవరణ కలిగియుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.

    12 వ శతాబ్ది లో విస్తరించబడింది.

    ఈ పట్టణం ప్రదాన భూబాగం నుండి పంబన్‌ కాలువ ద్వారా వేరుచేయబడింది. శ్రీరాముడు నిర్మంచిన సేతువు ఇక్కడ ఉంది. లంకకు సముద్రమార్గము ఇదే. రావణాసురుని నిహతుని చేశాక రామనాథేశ్వర లింగం ఇక్కడ శ్రీరాములవారు ప్రతిష్టించారు. ఈ ప్రదేశము ప్రఖ్యాత తీర్థస్థలి యే కాకుండా ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం.

    కాశీ కి వెళ్ళిన వారు అక్కడి గంగను తీసుకు వచ్చి ఇక్కడ అభిషేకం చేస్తారు. మళ్ళీ ఇక్కడి ఇసుకను తీసుకు వెళ్ళి అక్కడ గంగ లో కలుపుతారు. ఇక్కడ శివ లింగం సైకతం. ' ఇక్కడ సముద్ర కెరటాలు, పక్షులు, బంగారు రంగులో మెరిసిపోయే ఇసుక తిన్నెలు, చిన్నచిన్న అంగళ్ళు, గవ్వలతో చేసిన వస్తువులు, గుర్రపుబళ్ళు, నీలిరంగులో మైమరపించే సముద్రము.. ఎన్నాళ్ళు చూసినా తనివితీరని తీరదు. చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కోటితీర్థాలు, రామపాదాలు, దనుష్కోటి, విభీషణాలయం మొదలగునవి చాలా ఉన్నాయి.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/ZrR329JjO0U

    13 min
  • నాకేమవుతోంది ఎపిసోడ్ 14 | Nakemavuthondi Episode 14 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    నాకేమవుతోంది…? ఎపిసోడ్ 14

    రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ 

    ఇద్దరు కానిస్టేబుల్స్ ని చేతిలో లాఠీలు పట్టుకొని రంగనాథం పక్కనే నిలబడమన్నాడు ఉదయ్.

    తరువాత రంగనాథంతో "ఆ లాఠీల అవసరం రాదని ఆశిస్తున్నాను. కానీ నీ బుద్ధి నాకు తెలుసు. ఏదో ఒకటి అరకొరగా చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు. చాల విషయాలు సందీప్ చెప్పేసాడు. ఆ విషయాలు నీ దగ్గర క్రాస్ చెక్ చేసుకోవడానికి అడుగుతున్నాం. అంతే.." అన్నాడు.

    "ఉదయ్ గారూ! నాకు తెలిసిన ప్రతి విషయం మీకు చెబుతాను" అంటూ చెప్పడం ప్రారంభించాడు రంగనాథం.

    "ఆ రోజు రిసార్ట్ దగ్గర పడిఉన్న శవాన్ని చూడటానికి వెళ్లాను. ఆ రిసార్ట్ మేనేజర్ సందీప్ నాకు ముందే తెలుసు. గతంలో ఒక చిన్న కేసులో అతనికి సహాయం చేసాను. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఈ కేసులో సహాయం అడగవద్దని, అతనికి ముందే చెప్పాను. అతనితో కలిసి ఆఫీస్ రూమ్ కి వెళ్ళాను.

    రికార్డ్ లు అస్తవ్యస్తంగా ఉన్నాయి.

    అదేమిటని అతన్ని నిలదీసాను.

    అంతలో నాకు మాజీ మినిష్టర్ కనకారావు పిఎ దగ్గర్నుండి కాల్ వచ్చింది.

    ఈ కేసు విషయంలో సందీప్ కి సహకరించమని కనకారావు మాటగా అతని పిఎ చెప్పాడు.

    ఇది మర్డర్ కేసని, ఏసిపి గారు నాకు కాల్ చేసి ముందుగా హెచ్చరించారని, ఏదైనా పొరపాటు జరిగితే నా ఉద్యోగం పోతుందని చెప్పాను. వినలేదతను.

    సిసి కెమెరా తాలూకు హార్డ్ డిస్క్ నీ, ఆఫీస్ రికార్డ్ లను ఎవరో ఎత్తుకుపోయినట్లు సందీప్ దగ్గర కంప్లైంట్ తీసుకొమ్మని చెప్పాడు.

    'ఆలా చేస్తే ఎవరూ నమ్మర'ని చెప్పాను నేను. 'నమ్మకాలతో అవసరం లేదనీ, రికార్డ్ లు మాయం కావడం ముఖ్యమ'ని చెప్పాడతను.

    అంతేకాదు.కనకారావు పలుకుబడితో నాకు ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పాడు అయన పిఎ. అన్నిటికంటే ముఖ్యం.. నాకు కోటి రూపాయలు అఫర్ చేసారు" చెప్పాడు రంగనాధం.

    ఆశ్చర్యపోయాడు ఉదయ్.

    'అంటే.. ఈ కేసులో పెద్దల ప్రమేయం ఖచ్చితంగా ఉందన్నమాట' అనుకున్నాడు.

    "అసలు హన్సిక ని హత్య చేసిందెవరు? ఎందుకోసం ఆ హత్య జరిగింది? చనిపోయింది ప్రియా అని ఇంటరాగేషన్ లో సందీప్ ఎందుకు చెప్పాడు? ప్రియ ఆ రాత్రి పూట అక్కడినుంచి ఎందుకు మాయం అయింది? నీకు కోటి రూపాయలు అఫర్ చెయ్యడం ఆశ్చర్యంగా ఉంది. ఈ కేసులో కనకారావు పాత్ర ఎంత?" వరుసగా ప్రశ్నలు సంధించాడు ఉదయ్.

    "శవాన్ని చూడడానికి వెళ్ళినప్పటినుండే నేను ఈ కేస్ లో ఇన్వాల్వ్ అయ్యాను. అంతకు ముందు జరిగిన విషయాలు నాకు తెలియవు. పెద్దలతో వ్యవహారం కాబట్టి వీలయినంత తక్కువ తెలుసుకుంటే మంచిదని, అవసరమయితే మరికొంత మొత్తం ఇప్పిస్తానని చెప్పాడు కనకారావు పిఎ.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/uboTowPi3vc


    16 min
  • చరిత్రలో నీకో పేజీ | Charithralo Niko Peji | Telugu Short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

    చరిత్రలో నీకో పేజీ

    రచన: పిట్ట గోపి

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ముప్పై ఏళ్ళ ఒక ప్రభుత్వ ఉపాద్యాయుడు గురవయ్య మాష్టారు పరిక్ష పేపర్లతో ఎప్పటిలాగే తరగతి గదిలోకి ప్రవేశించగానే విద్యార్థులు అందరూ లేచి నమస్కరిస్తారు.

    మాష్టారు వాళ్ళని కూర్చోమని చెప్పి

    "ఒరేయ్ పిల్లలు.. నిన్న పెట్టిన పరిక్షలో కొందరికే మంచి మార్కులు వచ్చాయి. అందరికీ వచ్చినప్పుడే కదరా నేను ఆనందంగా ఉండేది" అంటూ.. పరీక్ష పేపర్లు ను చూస్తూ..

    “శ్రావణి”.. అని పిలువగా ఆమె వస్తుంది.

    "అబ్బా.. ! చూడండిరా.. రోజు అల్లరి చేస్తుంది కానీ తనవే అందరి కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. అలా ఉండాలి రా పిల్లలు అంటే..”

    "ఆ నెక్ట్స్.. రవి..”

    రవి వస్తాడు.

    "ఒరేయ్ రవి.. ఎందుకు నీ మార్కులు తగ్గాయి.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివితే మంచి మార్కులు వస్తాయి” అంటూ రవి చేతిని తన బెత్తం తో దూరంగా పెట్టి దెబ్బలు తినటానికి రెడీ అయ్యాక చాలా దెబ్బలు కొడతాడు.

    తర్వాత తలదించుకుని రవి తన సీట్లో కూర్చుంటాడు.

    గతంలో కంటే కూడా రవి నిబద్ధత ను చూస్తాడు మాష్టారు.

    "ఆ నెక్ట్స్.. మధు..”

    మధు వస్తాడు.

    “ఒరేయ్ మధు.. రవి కంటే రెండు మార్కులు తక్కువ వచ్చాయి. పర్వాలేదు కానీ.. ఇంకా బాగా చదవాలి " అని రెండు దెబ్బలు కొట్టగానే మాష్టారు వైపు కోపంతో చూస్తాడు.

    అలా చూస్తూనే చఠుక్కున బయటకు వెళ్తాడు. మాష్టారు తో పాటు పిల్లలు అందరూ ఆశ్చర్యపోతారు.

    ఇంతలో బయట ఏవో కేకలు వినపడుతూ.. అవి కాస్తా దగ్గర అవుతుంటాయి.

    మధు తన తల్లిదండ్రులను తీసుకుని వస్తాడు. మధు తల్లి చేతిలో కత్తి ఉంది.

    మధు తండ్రి కోపంతో "ఏరా.. నా కొడుకు మీద చెయ్యి వేస్తావా.. ఎంత ధైర్యం రా నీకు".. అంటూ మీద పడతాడు.

    గురవయ్య మాష్టారు కొంచెం భయపడుతూ

    "మరెప్పుడు కొట్టనండి..” అని ప్రాధేయపడతాడు, వెనక్కి తగ్గుతాడు.

    అయినా ఆగకుండా మధు తల్లి చేతిలో కత్తి తీసుకుని చూపిస్తూ.. "ఇంకోసారి నా కొడుకు జోలికి వస్తే.. నరుకుతా " అని అంటూ.. మధుని తీసుకుని వెళ్ళిపోతారు. కానీ.. మాష్టారు బాధతో కూలబడగా.. విద్యార్థుల సవర్యలతో కోలుకుంటాడు.

    కొన్ని సంవత్సరాలు గడిచాక..


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/CgRr3EePwag

    6 min
  • మమతల మధువు ఎపిసోడ్ 5 | Mamathala Madhuvu Episode 5 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    మమతల మధువు ఎపిసోడ్ 5

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ 

    ఏ విషయాన్ని గురించి నాన్నగారు నన్ను యీ రీతిగా ఓదార్చారు. ఆఫీస్ వ్యవహారాలా, ఆ వైజాగ్ ఆఫీస్లో ఎలాంటి సమస్యలూ లేవే.. కారణం ఎంతోఅనుభవంగల రామకోటి అంకుల్.. ఆ ఆఫీసు సమర్థవంతంగా నడుపుతున్నాడు. యికపోతే.. నాన్నగారు తనకు యిచ్చిన ఆ సందేశం ఏ విషయానికి సంబంధించింది అయ్యివుంటుంది?.. శాంతి విషయమా!.. శారతి ఎవరు అన్న విషయం నాన్నగారికి తెలియదే.. ఒకవేళ ఆ విషయం రామకోటి అంకుల్కు తెలిసి.. వారు నాన్నగారికి చెప్పి వుంటారా!.. వారిరువురి సంబంధం.. కృష్ణార్జునుల బంధం. అంకుల్ తనకితెలిసిన ఏ విషయాన్నీ నాన్నగారికి తెలియజేయకుండా వుండరు. కారణం.. రామకోటి తన తండ్రిగారి పెద్ద అక్క కుమారుడు. జీవితంలో ఎన్నో కష్టాలు పడి.. పట్టుదల, తీవ్రమైన కృషితో ఒక్కొక్క మెట్టు ఎక్కి వున్నతీకి వచ్చిన నాన్నగారంటే.. బంధువుల కందరికీ ఆదర్శం. సంవత్సరం క్రిందటి వరకూ రామకోటి విజయవాడ బ్రాంచ్ లో వుండేవాడు. వైజాగ్లో.. బిజినెస్ బాగా పెరిగినందున నాన్నగారు.. వారిని వైజాగ్ మార్చారు.

    తన సందేహాన్ని తీర్చగలవాడు ఒక్కడే.. మురారి. గోపాల్ మురారికి ఫోన్ చేశాడు. రామకోటి తన్ను కలవలేదని చెప్పాడు మురారి. ప్రశాంతతారహితంగా అదే ఆలోచనలో వుండిపోయాడు గోపాల్. నిద్రపట్టలేదు.

    ***

    గోపాల్ ఆఫీస్లో తన రూమ్ లో కూర్చొని వున్నాడు. అకౌంట్సు సత్యారావు తలుపు తట్టాడు.

    “కమిన్..”

    మేనేజర్ సత్యారావు లోన ప్రవేశించి విష్ చేశాడు. గోపాల్ సత్యాకు విష్ చేసి..

    "ఏమిటి సత్యా!..”

    “సార్!.. స్పేర్ పార్టు బిల్సు మీద మీరు సంతకం చేస్తే నేను చెక్కులు వ్రాస్తాను.” ఫైల్ను అందించాడు సత్యా.

    బిల్స్ ని చెక్ చేసి.. అన్నింటి మీదా సంతకం చేసి ఫయిల్ను సత్యాకు అందించాడు గోపాల్.

    "థ్యాంక్యూ సార్.” చెప్పి సత్యా వెళ్ళిపోయాడు. సెల్ మ్రోగింది. కాల్ చేసింది మురారి

    “చెప్పు మురారి.”

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/3xDw5yBZVHw

    18 min
  • వార ఫలాల వింత గోల | Vara Falala Vintha Gola | Telugu Short Story | Penumaka Vasantha | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వార ఫలాల వింత గోల

    రచన: పెనుమాక వసంత

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    "ఏమండీ, కాఫీ ఇటు దక్షిణపు దిక్కులో పెట్టాను, తీసుకోండి" అంది సుజాత.

    "ఎందుకే ఈమూల పెట్టమని రాశారా.. ఈవారం నీ వార రాశి ఫలంలో?" అన్నాడు సుబ్బారావు చిరాగ్గా.

    "అవునండీ, ఈ వారం ఉత్తరపు దిక్కున వస్తువులు పెట్టటం కాని నన్ను ఆవైపు తిరగటం కాని చేయవద్దన్నారు నా మేష రాశిలో."

    "నీ మొహం మండా, నాకు నా సింహ రాశిలో దక్షిణ దిక్కున పెట్టిన కాఫీ తాగవద్దన్నారని ఉందే! ఉత్తరపు దిక్కున పెట్టు" అన్నాడు సుబ్బారావు.

    "కానీ నేను ఆ పని చేయలేను" అని సుజాత, "చేయాల్సిందే" అని సుబ్బారావు.. వాదనలలో ఉండగా గేమ్ ఆడుకుంటూ ఉన్న వాళ్ల అబ్బాయి సాయి వచ్చి "మళ్ళీ మొదలెట్టారేమి? ఖర్మరా బాబు" అనుకొంటూ వచ్చి కాఫీ కప్ ను ఉత్తరదిక్కులో పెట్టి వెళ్ళాడు, తన గేమ్ కు వీళ్ళు అంతరాయం కలిగిస్తున్నారని.

    "ఏమండీ! మార్కెట్ కు వెళ్తున్నారా? వెళ్తే ఓన్లీ పసుపుపచ్చ పూలు, పసుపుపచ్చ కూరగాయలు తెండి" అంది సుజాత. "నాకు ఈ వారం ఎటూ తిరగ వద్దన్నారే! అందుకని ఈ వారం ఎక్కడకీ వెళ్లక ఇంట్లోనే ఉంటా." అన్నాడు సుబ్బారావు.

    "అయ్యో! కూరలు ఎలాగండీ" అంది సుజాత.

    "నీ పుత్ర రత్నం ఉన్నాడుగా.. ఎప్పుడూ అమ్మా అమ్మా అంటూ నీ కొంగు పట్టుకు తిరుగుతాడుగా వాడ్ని పంపు" అన్నాడు సుబ్బారావు విసుగ్గా.

    'అబ్బా! మళ్ళీ వాదనలు మొదలెట్టారు ఈ మమ్మీ, డాడి.. ఎప్పుడూ ఈ రాశి, ఆ రాశి అని ఒకటే గోల! చస్తున్నా వీళ్ళతో..' అనుకుంటూ సాయి బయటికి వచ్చి "ఏది డాడి, స్కూటర్ కీస్ ఇవ్వు.. కూరలు తెస్తాను" అన్నాడు.

    "అక్కడ ఉంది తీసుకో, కాని నన్ను ఆకుపచ్చ కూరలు తినమన్నారు. నాకు అవి తీసుకురా" అన్నాడు సుబ్బారావు.

    "నన్ను పసుపు పచ్చ కూరలు తినమన్నారురా.. అవి తీసుకురా నాకు" అంది సుజాత.

    "పసుపురంగులో ఎండుగడ్డి ఉంటుంది, అది తీసుకురా మీ అమ్మకు, బలం కూడా..." అన్నాడు వెటకారంగా సుబ్బారావు.


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/a9rkoXWZt3A

    10 min
  • మా అమ్మ నేర్పింది | Ma Amma Nerpindi | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    మా అమ్మ నేర్పింది

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ‘అమ్మ.. నాన్నా.. దేవుడు.. ’ పదాలు మనకు నేర్పేది మన మాతృమూర్తి. మన అభివృద్ధి.. ఉన్నతి.. ఆ తల్లి పలికే ప్రతి మాట అంతరార్ధం. ఆ తల్లి తన జీవితాంతం మన మేలు కోరుకొంటుంది. తల్లిని ప్రత్యక్ష దైవంగా భావించడం మానవత్వం.

    “శివా.. ” ధర్మా పిలుపు విని వెనక్కు తిరిగి చూచాడు శివ. వారివురి పూర్తి పేరులు శివకుమార్, ధర్మారావు. ఇరువురు బంధువులు. వీరు చిన్నతనం నుండి ఒకే ప్రైమరీ, హైస్కూల్లో చదువుకున్నారు. ప్రస్తుతం వారు ప్లస్ టూ, సెకండ్ ఇయర్లలో వున్నారు. వీరిరువురికీ ఇంటా బయటా మరో పేరు వుంది కృష్ణా ర్జునులని. శివ క్రీడాభిమాని, ధర్మా సాహిత్యాభి మాని. కాబట్టి స్కూల్లో వీరికి ప్రత్యేక గుర్తింపు వుంది.

    “ఈ వారం సారస్వత సంఘ ఉపన్యాసానికి టాపిక్ (విషయం) ఏమిటో తెలుసా శివా”.. అడిగాడు ధర్మ.

    “తెలుసు.. ” ప్రతాప్ చెప్పాడు. “ఈ దేశం కోరే భావి భారత పౌరులు”.

    విరక్తిగా నవ్వాడు శివ.

    “ఎందుకురా.. అంత విరక్తిగా నవ్వుతావ్!.. ” ఆశ్చర్యంగా శివ ముఖంలోకి చూస్తూ అడిగాడు ధర్మ.

    “పరీక్షలు పదిరోజుల్లో వున్నాయ్. బాగా చదివి గట్టు దాటాలి. మన అమ్మా నాన్నలు మనమీద ఎన్నో ఆసలు పెట్టుకొని వున్నారు. బాగా వ్రాసి పాసై వారిని సంతోషపెట్టాలి. మన భవిష్యత్ ఎలావుందో!.. ” సీరియస్ గా చెప్పాడు శివా.

    “డోంట్ వర్రీ డియర్.. నీకు తోడుగా నీ ఈ ధర్మా ఉన్నాడుగా.. ” చిరునవ్వుతో అనునయంగా చెప్పాడు ధర్మా.

    శివా చేతిని తన చేతిలోనికి తీసుకొని “శివా.. నీవూ మాట్లాడి తీరాలి.. ”

    శివా ధర్మా ముఖంలోకి చూచి తల ఆడించాడు. ఇరువురూ మౌనంగా క్లాస్ రూమ్ లోకి ప్రవేశించారు.

    *****

    ఆ మరుదినం సాయంత్రం గంట నాలుగున్నర సమయం. స్కూలు మధ్యన వున్న స్టేజి పై హెడ్మాస్టర్ వరదరాజులు గారు, తెలుగు పండిట్ విద్వాన్ నారాయణ గారు, ఇంగ్లీష్, సైన్సు మాస్టర్ సీతాపతి గారు సుఖాసీనులై వున్నారు. స్కూలు పిల్లలంతా వేదిక ముందు శ్రద్దగా కూర్చొని వున్నారు.

    పేర్లు ఇచ్చిన విద్యార్ధులు ఒకొక్కరుగా వచ్చి మాట్లాడి వెళుతున్నారు. సైన్సు మాస్టార్ ధర్మ పేరును మైక్ లో చెప్పారు. ధర్మ స్టేజి పైకి వచ్చాడు.

    “పూజ్యులు, గౌరవనీయులైన హెడ్ మాస్టర్ గారికి, తెలుగు మాస్టారు గారికి, సైన్సు మాస్టారు గారికి సవినయంగా నా వంద నాలు సమర్పిస్తున్నాను. ” వినయంగా చేతులు జోడించాడు. విద్యార్ధుల వైపుకు తిరిగి “మీకందరకీ నా శుభాశీస్సులు. ఈనాటి చర్చనీయాంశం ‘ఈ దేశం కోరే భావి భారత పౌరులు’.


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/YpT3tZMsOxc

    15 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world