Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • వరూధిని | Varudhini | Telugu Short Story | Veluri Prameela Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వరూధిని

    రచన: వేలూరి ప్రమీలాశర్మ

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ట్రైన్ కదలడానికి ఇంక రెండు నిముషాలు మాత్రమే సమయముందనగా, రొప్పుతూ బోగీలోకి ఎక్కింది పాతిక సంవత్సరాల ఆ జవ్వని. నిమ్మపండు రంగు మేని ఛాయపై పసిడి అందం వెలవెలబోతోంది. నిగనిగలాడే నల్లని ఒత్తైన కురులు, గాలికి చెల్లాచెదురై భుజాలమీదుగా ఊయల లూగుతున్నాయి. ముడిపడిన ఆమె భ్రుకుటి, మన్మథుడు వలపు బాణాలు సంధించడానికి వంచిన విల్లును తలపిస్తున్నాయి. లేడి కళ్ళలాంటి చురుకైన ఆమె కళ్ళలో చిన్న బెరుకు.. ఆ వెంటనే తాను వెతుకుతున్నది కనిపించిన ఆనందంతో ఆ కళ్ళలో చిన్న మెరుపు. చూపుడువేలితో బెర్తు నంబర్లు వెతుకుతూ, మధ్య కూపే దగ్గర ఆగిన ఆమె, లగజ్ ని తనకు కేటాయించబడిన బెర్తు కిందకి తోసింది. అలసటకు నుదుటిపై పట్టిన స్వేదం, ముత్యపు చినుకై మెడ ఒంపులోకి జారింది.

    "ఎక్స్ క్యూజ్ మీ! మీ కాళ్ళు కొంచెం వెనక్కి తీసుకుంటారా?" ఎదురుగా ఉన్న బెర్తుపై కూర్చున్న వ్యక్తి, వాలుగా తన సీటు కిందకి చాచిన కాళ్ళను తియ్యమన్నట్టు అభ్యర్ధించింది.

    "ఓహ్! సారీ!" అంటూ కాళ్ళు వెనక్కి తీసుకుని, తిరిగి ఒడిలో పెట్టుకున్న ల్యాప్ టాప్ పై వర్కు చేసుకోవడంలో మునిగిపోయాడు ఆ వ్యక్తి.

    కిటికీ పక్కగా ఒదిగి కూర్చున్న ఆమె, ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోంది. చల్లగా వీస్తున్న గాలికి, మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఒక్క కుదుపుతో ట్రైను ఆగేసరికి ఉలిక్కిపడి లేచి, సర్దుకుని కూచుంది. అప్పుడు చూసింది.. ఎదురుగా కూచున్న అతని వైపు. పూర్తిగా నిమగ్నమై పని చేసుకుంటున్న అతను, చుట్టూ పరిసరాలను గమనించే స్థితిలో లేడు.

    పైనుంచి కిందవరకూ అతడినే పరిశీలనగా చూస్తున్న ఆమె, ఒకింత సంభ్రమానికి గురయ్యింది. అంతవరకూ మగవారిలో అంత అందంగా ఉన్నవారిని చూసి ఎరుగని ఆమె, రెప్ప వెయ్యకుండా అతడి వైపే చూస్తోంది. ఒత్తుగా పైకి దువ్విన క్రాఫు, సూదిగా మొనతేలిన ముక్కు, ఎర్రటి పెదవులపైకి సగం వరకూ కప్పినట్టు గుబురుగా పెరిగిన మీసకట్టు, నీట్ షేవ్ లో ఉన్న గెడ్డం, శంఖుపూల వలే ముచ్చటగా ఉన్న చెవులూ.. దర్పానికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు ఉంది అతని కనుముక్కు తీరు.

    మరులు రేకెత్తించే విశాలమైన ఛాతీపై గాలికి కదులుతున్న రింగు రింగుల జుత్తూ మనసులో అలజడి రేపుతుంటే.. నిగ్రహించుకోలేక గబుక్కున ముఖం పక్కకి తిప్పుకుంది. ఊ.. హూ! ఆమె వల్ల కాలేదు. 'ఎన్నడూ లేనిది ఎందుకింత పరితపిస్తున్నాను?' సమాధానం దొరకని ప్రశ్నతో వేసారిపోయింది. మనసు వద్దని వారిస్తున్నా, కళ్ళు అతడివైపే లాగుతున్నాయి. భారమైన ఉచ్ఛ్వాశ, నిశ్వాశాలతో బరువెక్కిన ఆమె పై ఎద మీద నిలువలేక, జారిన పమిటను సర్దుకునే ప్రయత్నం చెయ్యలేదు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    https://youtu.be/UQnrLxX0W8k


    9 min
  • అక్షరమే అండగా | Aksharame Andaga | Telugu Short Story | Pitta Gopi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    అక్షరమే అండగా

    రచన: పిట్ట గోపి

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    టెక్నాలజీ రాజ్యమేలే ఈ రోజుల్లో నాయుడు తోట గ్రామం ఇంకా పురాతన కాలంలోనే ఉంది. కారణం ఆ గ్రామ భూస్వామి తన స్వలాభం కోసం గ్రామస్తులు అందర్ని తన కింద పని చేయించుకోవటమే. అందులోను రామయ్య అనే  వ్యక్తి తనకు చదువు , ఆస్తిపాస్తులు లేకపోవటంతో భూస్వామి వద్ద పాలేరుగా పని చేస్తు కొడుకు,కూతుళ్ళను చూసుకుంటున్నాడు.

    అయితే పదేళ్ళ కొడుకు వెంకన్న తెలివైనవాడనే విషయం అక్షర జ్ఞానం లేని రామయ్య కు తెలియదు.ఎంత చెప్పినా.. అర్థం చేసుకోడు. తన తండ్రి పాలేరుగా ఉండటం వెంకన్నకు నచ్చేది కాదు. పైగా బడికి పంపకుండా అప్పుడప్పుడు తనను కూడా పనిలోకి పంపేవాడు.దీంతో భూస్వామి పై వెంకన్నకు పగ.ఒకరోజు వెంకన్న  ఇంటివద్ద చదువుకుంటున్నాడు.

    “ఒరేయ్ రామయ్యా..!” అని అరుస్తు భూస్వామి వస్తాడు. “ఏంటయ్యా ఇలా వచ్చారు..”

    "ఇలా వచ్చానంటావేంట్రా..దొడ్లో పనులన్ని ఎక్కడివక్కడ ఉండిపోతేను” అంటాడు భూస్వామి.

    "అయ్యా! కూతురు ఆరోగ్యం బాలేదు. కొద్దిగా ఆలస్యం అవుతుందయ్యా.. వచ్చేస్తాను” అని బతిమాలుతాడు రామయ్య.

    ''ఆలస్యం అయితే ఈ ఎంకడిని అయినా పంపురా.. చిన్నప్పటినుండి చేస్తే పనిలో ఆరితేరుతాడు” అన్నాడు భూస్వామి.

    ''నేను వెళ్ళను చదువుకుంటాను” అన్నాడు వెంకన్న.

    ''ఒరేయ్ రామయ్యా.. మీకు చదువెందుకురా...చెప్పరా నీ కొడుక్కి”

    ''నాన్నా! మేము చదువుకుంటే..వీడంతటి వాళ్ళం అవుతాం. అందుకే మమ్మల్ని చదువుకోనీయట్లే..”  అన్నాడు వెంకన్న.

    ''రేయ్..రామయ్యా.. నన్ను అంత మాట అంటాడా నీ కొడుకు.. చెప్తా… అని వెళ్ళిపోతాడు భూస్వామి.

    "ఏరా ..పెద్దోళ్ళ పై అలా అరుస్తావా..”అని కోప్పడతాడు రామయ్య .

    ఇంతలో పాఠశాల ఉపాధ్యాయుడు సుందరం వచ్చి “రామయ్యా! నీ కొడుకుని బడికి పంపితే నిన్ను బాగా చూసుకుంటాడు” అన్నాడు.

    “అవున్రయ్య.. నన్ను చదివిస్తే.. భూస్వామి కంటే మంచిగా బతకగలం” అని నచ్చజెప్పుతాడు వెంకన్న.

    రామయ్య వినకుండా “నోర్మూసుకుని వెళ్ళి దొడ్లో పనులు చేసుకుని రా. లేకపోతే తిండిపెట్టేది లేదు” అన్నాడు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/KvocmfGhAGs

    6 min
  • ఆ ఇల్లు ఈ ఇల్లు | Aa Illu Ee Illu | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఆ ఇల్లు..ఈ ఇల్లు

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    పోర్టికోలో కారును నిలిపి ధర్మరాజు వరండాలో ప్రవేశించాడు. ముఖద్వారం దగ్గర వారి సతీమణి సిరి ఓరకంట వారిని చూస్తూ నిలబడి వుంది.

    ద్వారాన్ని సమీపించి ధర్మరాజు సిరి ముఖంలోకి చూచాడు. వ్యంగ్యంగా నవ్వుతూ సిరి.. ‘‘అయ్యగారి రాక ఎక్కడనుండి?..’’ అడిగింది.

    ‘‘మా అమ్మగారి ఇంటి దగ్గరనుంచి..’’

    ‘‘పొద్దున ఏడుగంటలకు వెళ్లారు.. ఇపుడు టైమ్‌ సాయంత్రం నాలుగు..’’

    ‘‘తెలుసు!..’’

    ‘‘ఇంతసేపు అక్కడ వెలగబెట్టిన రాచకార్యం ఏమిటో!..’’ హేళనగా అడిగింది సిరి.

    ‘‘అమ్మకు ఆరోగ్యం సరిగా లేదు. హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లవలసి వచ్చింది!..’’ సహనంతో జవాబిచ్చాడు ధర్మరాజు.

    ‘‘అమ్మ.. అమ్మ.. అమ్మ.. ఎందుకో అంత అమ్మ పిచ్చి.. తమ్ముడొకడున్నాడుగా.. ఆరడుగులు పైకెదిగి.. వారు ఏంచేస్తున్నట్టో..’’ వ్యంగ్యంగా అడిగింది సిరి.

    ‘‘రాఘవ వూర్లో లేడు..” ధర్మరాజులో సహనం సతమతమవుతోంది. కళ్లు ఎర్రబడ్డాయి. క్షణం సేపు భార్య ముఖంలోకి నిరసనగా చూచి తన గదిలోనికి వెళ్లిపోయాడు..

    పొరుగింటి శశమ్మ.. వరుసకు సిరికి పిన్ని.. రెండు ప్లాట్సుకు నడుమన ఐదు అడుగుల ఎత్తులోవున్న కాంపౌండు గోడను సమీపించింది.

    ‘‘ఏందే సిరీ!.. ఆయాసపడుతున్నావు?..’’ ఓ దీర్ఘం తీసింది.

    భర్త తనను నిర్లక్ష్యం చేసి లోనికి పోవడం సిరిమ్మగారి అవమానం..

    ‘‘ఏంవుందిలే పిన్నీ!.. ఎపుడూ వుండేదే..’’ విరక్తిగా అంది సిరి.

    ‘‘చాలా డల్‌గా వున్నావు ఏమయిందే?..’’ ప్రశ్న..

    యధార్థానికి ఆ భార్యా భర్తల సంభాషణను శశమ్మ గోడకింద చేరి అంతావిన్నది.

    ఆమెకు.. ధర్మరాజు తల్లి అన్నపూర్ణమ్మగారికి వైరం.. ఆ కారణంగా పూర్ణమ్మ సిరిని రెచ్చగొట్టి.. ఆ సిరి.. తను అత్తగారిని గురించి నాలుగు అవకతవక వాక్యాలు పలికితే.. సిరిని మెచ్చుకొంటూ.. అన్నపూర్ణమ్మను గురించి పాడుకొంటూ.. ఆనందించే గొప్పరకం శశమ్మగారు.

    ఇక.. సిరి పెద్ద అందగత్తేం కాదు. సిరి తండ్రి రాధాకృష్ణయ్య ధర్మరాజు తండ్రి వెంకటరాజు మంచి స్నేహితులు బావమరదుల వరుసైనవారు. ఒకే వయస్సువారు. వెంకటరాజుగారిని మాయదారి కరోనా కాటువేసింది సంవత్సరం క్రిందట..


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/Wts881JHIGc

    16 min
  • వీడిన మబ్బులు | Vidina Mabbulu | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వీడిన మబ్బులు

    రచన: కిడాల శివకృష్ణ

    (ఉత్తమ నవతరం రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    దశరథ్ కు ఉమ అంటే చాలా ఇష్టం, ఉమకు దశరథ్ అంటే అంతగా ప్రేమ లేదనే చెప్పాలి, ఎందుకంటే ఉమ కళ్యాణ్ ని ప్రేమిస్తుంది కాబట్టి.

    అయితే ఉన్న విషయం చెప్పకుండా ఉమ దశరథ్ తో ప్రతి రోజు చరవాణిలో మాట్లాడుతుంది, చరవాణిలో వర్తమానం పంపుతుంది. ఈ విధంగా ఉమ దశరథ్ తో మాట్లాడటం మరియు నమ్మించి మోసం చేయ తలచింది.

    ఈ విషయానంతటిని శ్యామ్ ఉమ ద్వారానే తెలుసుకున్నాడు. విషయాన్ని తెలుసుకున్న శ్యామ్ “నీవెందుకు ఇంకా దశరథ్ జీవితంతో ఆడుకుంటావు, నిజం చెప్పి దశరథ్ జీవితం నుంచి తప్పుకోవచ్చును కదా?” అన్నాడు.

    అప్పుడు ఉమ “నేను దశరథ్ కు నిజం చెప్పను. ఎందుకంటే వాడు నా వెంట కుక్కలా తిరుగుతున్నాడు. నా అవసరం తీరాక వాడిని వదిలేసి వెళ్ళిపోతాను” అని చెప్పింది.

    ఈ విషయాన్ని శ్యామ్ దశరథ్ కు పూస గుచ్చినట్లు చెప్పినా కూడా ఉమ మైకంలో ఉన్న దశరథ్, శ్యామ్ మాటలను నమ్మలేదు. అంతే కాకుండా శ్యామ్ ని దుర్బాషలాడాడు. అయినప్పటికీ శ్యామ్ “నేను చెప్పేది నమ్మకపోయినా సరే.. కానీ నీవు ఉమ చరవాణిని మొత్తంగా పరిశీలించి చూస్తే అక్కడ నీకు నేను చెప్పింది నిజమేనని తెలుస్తుంది. అప్పుడు నాతో మాట్లాడు” అంటూ శ్యామ్ వెళ్ళిపోయాడు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/_QtaKc-Q76g

    3 min
  • దాంపత్య బంధపు కళ | Dampathya Bandhapu Kala | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    దాంపత్య బంధపు కళ

    రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

    (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ''నోరు ముయ్యి..''

    ''అదేమిటండీ'' భయపడింది ఆనందరావు భార్య అనసూయ.

    ''అవును.. నీలాంటి ఆడదాన్ని కట్టుకున్నందుకు నరకం అనుభవిస్తున్నాను. పిల్ల కళగా ఉంది చేసుకోరా అని మా పెద్దవాళ్ళు పెళ్లికి ముందు అంటే.. పుసుక్కున ఒప్పేసుకున్నాను. అప్పటి నుంచి నరకం అనుభవిస్తున్నాను నీతో. అన్ని కళలలో కాస్తో కూస్తో అనుభవం ఉన్న వాడిని.. పిసరంత కూడా ఆలోచించు కోలేక పోయాను.

    ఇలా కాదు.. పెళ్ళాడవలసిన ఆడదాని లో కాపురం చేసేవాడికి కావలసిన క్వాలిటీలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మగవాడికి ఆమెతో ముందుగా మూడు నెలలు టెంపరరీ కాపురం చేసే సరికొత్త రకం చట్టం ఈ మగాళ్లంతా కలిసి సాధిస్తేనే కానీ లాభం లేదు.

    మనిషిగ పుట్టిన తర్వాత ఏదో ఒక కళలోనైనా స్పెషాలిటీ ఉండాలి. అంతేకానీ ఆడదైనా మగ వాడైనా అడవిలో మానులా బతకకూడదు. అడవిలో మాను కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరికి ఏదో రూపంలో ఉపయోగిస్తూ ఉంటుంది. నీ ముఖాన ఆ అవకాశం కూడా లేదు.నూనె మడ్డిలా ఆ జిడ్డు ముఖం చూడు.. చి చి'.అంటూ ఆనందరావు భార్యకు నానా చివాట్లు పెట్టి వంటింట్లో నుంచి వరండాలోకి విసురుగా వచ్చాడు.

    వరండాలో పెద్దకొడుకు మురళి ఏదో పద్యం బట్టి పడుతున్నాడు. తన పక్కగా వచ్చి కూర్చున్న తండ్రిని చూసి మరీ బిగ్గరగా చదవటం మొద లు పెట్టాడు భయంతో.

    ''పద్యం వచ్చింది రా?'' ప్రశ్నించాడు కొడుకుని..

    ''వచ్చింది డాడీ.''

    ''సరే ఇంకేం చెప్పారు మీ కాన్వెంట్లో.'.

    ''రోజులాగే కథ చెప్పారు.''

    ''ఏమిటది?'

    'పాత కథ..రాజుగారు ఏడు చేపలు.''

    ''కొత్త కథలు ఈ మాస్టారులకు వస్తే కదా. రాజ గారు బూజు గారు..తప్పించి ఇంకొకటి రాదు. రేపు మీ కాన్వెంట్ కి వచ్చి మీ లేడీ టీచర్ తో కొత్త కథలు చెప్పమని.. చెప్తాలే. పడుకో.. 9 గంటలకు అవుతుంది.''

    తండ్రి మాటలతో మురళి మంచo ఎక్కి వెంటనే గాఢంగా నిద్రపోయాడు. మిగతా ఇద్దరు చిన్న పిల్లలు క్రింద చాప మీద నిద్రలో కమ్మని కలలు కంటున్నారు.

    సామాన్లన్నీ సరిది పాల గ్లాసుతో వచ్చిన అన సూయ భర్తకు అందించి.. ఇద్దరు చిన్న పిల్లల పక్కగా పడుకుంది.. చాప మీద.

    ఆనంద రావు మళ్ళీ సాధింపులు మొదలు పెట్టాడు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/khT_bVLPXDY

    15 min
  • కాలం తో పాటు | Kalamtho Patu | Telugu Short Story | Sita Mandalika | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కాలం తో పాటు

    రచన: సీత మండలీక

    (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    “ఈరమ్మా, ఈదినం చంద్రయ్య కొడుకు, బిడ్డ ని చూసుకుందికి వస్తాడట. స్వరూప ని మంచి బట్టలేసుకుని మంచిగా తయారవమను. వాళ్ళు వచ్చేక చాయ్ బిస్క్యూట్లు తయారుగుంచు” అని భార్యకి చెప్పి చేనుకి బయలు దేరేడు వెంకటయ్య.

    “బిడ్డా, సాయంకాలం పిల్లగాడు నిన్ను చూసుకుందికి వస్తాడట. జరా ఇల్లు నీటుగుంచి మంచిగా తయారవు” అంది ఈరమ్మ.

    “అమ్మా, ఇప్పుడే కళ్యాణం చేసుకోను. నేను ఇంకా సదూకోవాల” చెప్పింది స్వరూప.

    “ఏం మాట్లాడుతున్నావ్ స్వరూపా.. కళ్యాణం ఇప్పుడే సేసుకోవా. నీ దోస్తులందరూ పెండ్లాడి బిడ్డలను కన్నారే” కోపంగా అంది ఈరమ్మ.

    “అమ్మా, పెద్ద చదువులు చదివి నౌకరీ చెయ్యాల” చెప్పింది స్వరూప.

    “ఏంటి కొత్త కొత్త మాటలు సెప్తున్నావు. చంద్రయ్య కి మస్తు చేనుంది. ఒక్కడే కొడుకు. నామాట విని కళ్యాణం చేసుకో బేటా”

    “అస్సలు బాగోడు ఆ క్రిష్నయ్య. నౌకరీ ఉన్న అబ్బాయి నే

    చేసుకుంటా”

    “నా మాట సమజ్హ్చేసుకో బిడ్డా” అని చాయ్ పత్తా తెచ్చుకుని ‘వస్తా’ అంటూ వీరమ్మ బయలు దేరింది.

    ***

    "మమత అపార్ట్మెంట్స్" ఎదురుగా ఉన్న పార్క్ లో రోజూ పిల్లలు ఆడుకోడానికి వెళ్తూ ఉంటారు. పెద్దలు కూడా తమ తమ వీలుని బట్టి కలుస్తూ ఉంటారు. ఆ రోజు డాక్టర్ శర్మిష్ట, నర్మద సాయంత్రం పార్క్ లో కలవాలని నిశ్చయించు కున్నారు. నర్మద ఉమెన్స్ కాలేజీ లో లెక్చరర్ ఆరేళ్లనించి అదే అపార్ట్మెంట్స్ లో ఉండడం శర్మిష్ట తో బాగా స్నేహం ఏర్పడింది. అదీ కాక ఇద్దరూ ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు.

    “హలో శర్మిష్ట.. ఎలా ఉన్నావు? మనం కలిసి చాలా రోజులయింది కదూ” అంది నర్మద

    “ఆ బాగానే ఉన్నాను నర్మదా.. ఈ మధ్య నైట్ డ్యూటీలు చెయ్యవలసి వస్తోంది. ఇక శని ఆది వారాలు అలసట, బద్దకం” అంది శర్మిష్ట.

    “అర్జెంటు గా పార్క్ లో కలుసుకొమ్మని కబురు చేసేవు. ఏమిటి విశేషం?” అడిగింది నర్మద.

    “ అదే నర్మదా.. మా ఇంట్లో నా పెళ్లి గురించి పెద్ద గొడవ అయిపోతోంది. నీకు తెలుసుకదా.. అశోక్, నేను ఈ ఏడాది పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామనుకుంటున్నాము. అమ్మ నాన్నకి ఈ పెళ్లి విషయం చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటె లాభం లేదని నేనే నిన్న నాన్నకి అన్ని విషయాలు చెప్పేను. ఆరు నెలలో పెళ్లి చేసుకుని ఒక ఏడాది ఎంజాయ్ చేసేక పీ. జీ. చేస్తామని. ” అంది శర్మిష్ట.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/8QUziRehDm4

    11 min
  • ఏం మిగిలింది | Em Migilindi | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఏం  మిగిలింది

    రచన : జీడిగుంట శ్రీనివాసరావు

    (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    “యిద్దరు కొడుకులూ ఇంజనీరింగ్ చదివి, అమెరికా వెళ్లిపోయారు. యిప్పుడు మనమిద్దరం మిగిలిపోయాము. ఒకరికి ఒకరు తోడుగా వుండాలిసింది పోయి మీరు నన్ను తిట్టా, నేను మిమ్మల్ని నాలుగు మాటలు అనటం ఎందుకండీ? వున్నన్నాళ్లు సుఖంగా వుండక..” అంది సులోచన.

    “నువ్వేగా మీ అన్నగారి కొడుకు అమెరికా వెళ్ళి బోలెడు డబ్బు సంపాదించి మీ అన్నయ్య కి పంపుతున్నాడని అన్నావు. మన పిల్లలని కూడా అమెరికా పంపాలిసిందే అని పంతం పట్టి పంపించావు.  అప్పటినుండి ఫోన్ టింగ్ అనగానే పిల్లలు ఏమైనా డబ్బు పంపించారని అనుకోవడం తప్పా, బ్యాంకు నుంచి ఒక్క మెసేజ్ రాలేదు. అదీ నీ పిల్లల ప్రేమ” అన్నాడు రాఘవ.

    “మీకు పెన్షన్ వస్తోంది. యింకా పిల్లలు డబ్బు మీద ఆశ ఎందుకండీ, వాళ్ళు అక్కడ సుఖం గా వుంటే చాలు” అంది.

    “పిచ్చదానా , సుఖం దూరం గా వెళ్ళిపోతే దొరకదే, వచ్చిన డబ్బుతో సంతోషం గా వుంటే, మన దేశం లో లేని సుఖం ఎక్కడా లేదు. అయినా నీతో వాదించి లాభం లేదులే.

    ఎలాగో వచ్చే నెలలో కొడుకు దగ్గరికి వెళ్తున్నావుగా.. ఆ సుఖం హాయిగా అనుభవించి రా” అన్నాడు రాఘవ.

    “మిమ్మల్ని కూడా రమ్మన్నాడుగా, మీరే ‘ఆ విమానం లో గంటల తరబడి కూర్చోలేను’ అని  తప్పించుకున్నారు కానీ ‘అయ్యో పాపం.. నేను వెళ్లకపోతే అది ఒక్కత్తి ఎలా వెళ్తుంది’ అన్న ఆలోచన లేదు మీకు. యిటు పెళ్ళాం మీద ప్రేమ లేదు, అటు కొడుకుల మీద ప్రేమ లేదు” అంది సులోచన.

    అమెరికా నుంచి పెద్ద కొడుకు శ్రీధర్ వాళ్ళమ్మకి ఫోన్ చేసి వచ్చేప్పుడు కావలిసిన ఊరగాయల లిస్ట్ చెప్పేయటం, యీవిడ గారు నా వెంటపడి ‘గాజువాక లో ఎవరో బ్రాహ్మణ కుటుంబం పచ్చళ్ళు బాగా పెడతారని అన్నారు, వెళ్ళి తీసుకుని రండి’ అని నన్ను చంపడం.. అనుకున్నాడు రాఘవ.

    చిన్న కొడుకు వెంకటేష్ డైరెక్టుగా తండ్రికే ఫోన్ చేసి, వచ్చే అప్పుడు అమెరికా కరెంటు కి పనికి వచ్చే మిక్సీ, మీకు ఫిల్టర్ కాఫీ కోసం పెద్ద సైజ్ కాఫీ ఫిల్టర్ తీసుకుని రండి అని చెప్పటం తో బజార్ అంతా తిరిగి కొడుకు చెప్పినవి కొనుక్కుని వచ్చాడు.

    “నాన్నగారూ! మీరు కూడా అమ్మతో రావచ్చుగా, అందరం కలిసి టూర్ కి వెళ్ళచ్చు” అన్నారు కొడుకులు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/e8wKS-JHmy8

    10 min
  • మమతల మధువు ఎపిసోడ్ 4 | Mamathala Madhuvu Episode 4 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    మమతల మధువు ఎపిసోడ్ 4

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఎదురుగా రామకోటి ఆనంద్ నిలబడి వున్నారు. వారిని చూచి నవ్వుతూ..

    “రండి..” అన్నాడు భీమారావు.

    ముగ్గురూ లోనికి నడిచారు. సోఫాలను సమీపించారు. ఆనంద్ను పరీక్షగా చూస్తూ..

    “కూర్చో బాబు.” ప్రీతిగా పలికాడు భీమారావు.

    ఆనంద్ సోఫాలో కూర్చున్నాడు.

    ఎదుటి సోఫాలో కూర్చుంటూ భీమారావు.. “రామా!.. కూర్చో.” అన్నాడు.

    రామకోటి భీమారావు ప్రక్కన సోఫాలో కూర్చున్నాడు.

    “టిఫిన్ చేశారా!..”

    చేశామన్నట్లు తల పంకించాడు ఆనంద్.

    “అమ్మ బాగుంది కదూ!..”

    “బాగుందండి.” ఎంతో వీనయం నిండి వుంది ఆనంద్ ఆ పలుకుల్లో.

    “నేనెవరో నీకు తెలుసా!..” భీమారావుగారి గంభీరమైన ప్రశ్న.

    “తెలీదండి.”

    “నేను మీ శ్రేయోభిలాషిని.”

    “యీ ఒక్క మాటే అమ్మ చెప్పింది.” చెప్పి, తలదించుకొన్నాడు ఆనంద్.

    భీమారావు రామకోటి ముఖంలోకి, గోపాల్ ముఖంలోకి మార్చిమార్చి చూచాడు. కొద్దిక్షణాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి. సుదీర్ఘమైన నిట్టూర్పును విడచి..

    “ఎంతవరకూ చదువుకొన్నావు బాబు?..” అడిగాడు భీమారావు.

    "బి.యి. మెకానికల్. నేనేదో గొప్ప తెలివికలవాడినని గోల్డ్ మెడల్ యిచ్చారు.”

    విరక్తిగా నవ్వాడు ఆనంద్.

    “ఎక్కడయినా పని చేస్తున్నావా?..”

    "విజయవాడలో ఓ సి.ఐ. పైపుల కంపెనీ ఫ్యాక్టరీలో ఆరునెలలుగా

    పనిచేస్తున్నాను.”

    "జీతం ఎంత యిస్తున్నారు?..”

    “పదివేలు.”

    భీమారావు సెల్ చేతికి తీసికొని ఎదో నెంబర్కి నొక్కాడు.

    “గుడ్ యీవినింగ్ సార్!..”

    “బాలప్పా!.. ఎలా వున్నావ్?”

    “బాగున్నాను సార్.”

    “నేను చెప్పేది జాగ్రత్తగా విను.”

    “చెప్పండి సార్..”

    "నీవు మన ఆఫీసు దగ్గిరలో ఒక మంచిని యింటిని చూడు.”

    “ఎంత బాడుగలో సార్!..”

    “ఎంతయినా ఫరవాలేదు. కారు పార్కింగ్ వుండాలి.”

    “సరే సార్..”

    “నాకు యింటిని గురించి ఎప్పుడు చెబుతావు?..”

    “ఒక్క వారంలోగా సార్.”

    "అలాగే. మంచి యింటిని చూడు.”

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/SPBKejBQ5DU

    14 min
  • జీవిత చదరంగం | Jeevitha Chadarangam | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    జీవిత చదరంగం

    రచన: యశోద పులుగుర్త

    (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    శ్రీధర్ కి ప్రగతి నగర్, నిజాంపేట్ రోడ్ లో మూడువందల గజాల స్థలం.. ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం కొని పెట్టినది అలాగే ఉంచేసాడు. శ్రీధర్ పెద్ద అన్నయ్య వేణుగోపాల్ అప్పట్లో తను కొనుక్కుంటూ శ్రీధర్ చేత కూడా కొనిపించాడు. అప్పట్లో శ్రీధర్ 'గురుగాం సిటీ' లో 'ఆదిదాస్ కంపెనీ హెడ్ ఆఫీస్' లో అకౌంట్స్ మేనేజర్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఇరవై సంవత్సరాలు అక్కడే పనిచేసి రెండు సంవత్సరాల క్రితం హైద్రాబాద్ వచ్చేసాడు. హైద్రాబాద్ లో 'బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్' లో ఇన్ వెస్ట్ మెంట్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు.

    శ్రీధర్ ఒక్కగానొక్క కొడుకు ఆదిత్య ఐ. ఐ. టి ఖర్గ్ పూర్ లో చదువు పూర్తి అయిన వెంటనే హైద్రాబాద్ 'ఎమ్ జాన్' కంపెనీ లో పోస్టింగ్ రావడం తో కుటుంబం అంతా 'గురుగాం' నుండి హైద్రాబాద్ వచ్చేసారు.

    తను ఎప్పుడో కొన్న స్థలం ఇప్పుడు బాగా డెవలప్ అయి చుట్టుపక్కల అనేక భవంతులు, అపార్ట్ మెంట్ లు వెలిసాయి. అక్కడ ఇల్లు కట్టుకుంటే కొడుక్కి ఆఫీస్ కూడా దగ్గర అవుతుందన్న ఉద్దేశంతో సొంత ఇంటి నిర్మాణం కోసం ప్లేన్ చేస్తున్నాడు. పైగా శ్రీధర్ పెద్ద అన్నయ్య వేణు అక్కడ ఇల్లు కట్టేసుకున్నాడు. తమ్ముడిని కూడా కట్టుకోమని ప్రోత్సహిస్తున్నాడు.

    తను కొన్న స్థలంలో సదుపాయంగా ఉండేటట్లు డూప్లెక్స్ ఇల్లు కట్టాలన్న ఉద్దేశ్యంతో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేట్ ఆఫీస్ కు ప్లేన్ అప్రూవల్ మొదలైన ఫార్మాల్టీస్ నిమిత్తమై వారం రోజులనుండి నుండి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఆఫీస్ అంతా వచ్చీ పోయే జనంతో కిట కిటలాడిపోతోంది.

    తన పని ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. ఆ రోజు తను వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో తన ముందు నుండి ఒక నలభై అయిదు సంవత్సరాల యువతి నడుచుకుంటూ లోపలకు వెళ్లడం చూసాడు.

    ఆమెను ఎప్పుడో ఎక్కడో చూసినట్లు చటుక్కున మనసుకి అనిపించినా పెద్దగా ఆలోచించకుండా మామూలుగానే తీసుకున్నాడు. అనేకమంది వస్తున్నారు వెడుతున్నారు. ఆ జన ప్రవాహంలో ఎవరు ఏమిటోనని ఆలోచించే ధ్యాసే ఉండడం లేదు. మరో గంట తరువాత మళ్లీ ఆ యువతే బయటకు వస్తూ ఏదో ఫైల్ తీసుకుని రిజిస్ట్రార్ కేబిన్ వైపు వెడుతూ, మధ్యలో ఆగి ఎవరితోనో మాట్లాడుతున్నపుడు ఆమెను పరీక్షగా చూసే అవకాశం కలిగింది.

    ఒక్క క్షణం సాలోచనగా చెంపలు నిమురుకుంటూ ఆమె వైపే చూస్తూ ఆలోచిస్తున్నాడు. పింక్ కలర్ ప్యూర్ సిల్క్ చీర కి సన్నని జరీ అంచు, కాంట్రాస్ట్ బ్లౌజ్, జారుముడి, చెవులకు చిన్న చిన్న స్టడ్స్, మెడలో సన్నని ముత్యాల దండతో ఎంతో హుందాగా అందంగా ఉంది. ముఖాన బొట్టులేదు. ఎవరబ్బా ఈవిడ, ఎక్కడో, ఎప్పుడో చూసిన జ్నాపకాలు కందిరీగల్లా ముసురుకుంటుంటే ఆలోచనలలో పడ్డాడు గానీ గుర్తుకు రావడంలేదు.


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/rycUEJFOb9I

    19 min
  • దక్షిణ దేశ యాత్ర 2 | Dakshina Desa Yathra 2 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    దక్షిణ దేశ యాత్ర రెండవ భాగం

    రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఐదవరోజు కుంబకోణం నుంచి ఉదయం 6. 30కి బయలుదేరాము. మధురై కి పయనం.

    జంబుకేశ్వరలింగం- (జల లింగం):

    జంబుకేశ్వరఆలయం, తిరువానైకల్‌

    భారత దేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి ( తిరుచ్చి) జిల్లాలో ఉన్న ప్రసిద్ద శివాలయం. తొలిచోళులలో ఒకరైన కోచెంగల్‌ చోళన్‌ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీరంగం ద్వీపంలో ఉంది. మహాదేవుని ఆజ్ఞ మేరకు అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరి గా జన్మించారు.

    సాక్షాత్తు అమ్మ వారు పూజ చేసిన లింగం. జంబు( నేరేడు) వృక్షాలు అధికంగా ఉండటం వలన జంబుకేశ్వరుడనే పేరు వచ్చింది. పంచభూత క్షేత్రాలలో రెండవది.

    ఇక్కడ పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. తిరుచ్చికి 11 కి. మీ. దూరంలో ఉంటుంది ఈ ఆలయం.

    ----------

    అలగర్‌ కోయిల్‌ :

    మధురై కి ఓ ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన చెట్లనడుమ ఓ కొండ ప్రక్కన ఉన్న ఆలయమే అళగర్‌ కోయిల్‌. 108 వైష్ణవ క్షేత్రాలలో ప్రముఖమైనది. ఈ క్షేత్రాన్ని

    దక్షిణ తిరుపతి గా అభివర్ణిస్తారు. మధుర లోని మీనాక్షి అమ్మవారికి సోదరునిగా భావిస్తారు. అమ్మవారి కళ్యాణము సుందరేశునితో ఈ స్వామి వారే జరిపించారని కథనం.

    అందుకే అమ్మ వారి కళ్యాణ ఉత్సవాలప్పుడు స్వామి వారి ఉత్సవ విగ్రహం ఇక్కడ నుంచి తీసుకెళతారు. ఈ ఆలయాన్ని నమ్ముకుని వందల ఏళ్ళుగా జీవిస్తున్న

    వేలాది మంది ఉన్నారు.

    స్వామి వారితో పాటుగా వారి సతీమణి సుందరవల్లీ తాయారు వారి ఆలయం కూడా ఉంది. వివాహం కాని స్త్రీలు ఈ అమ్మవారిని దర్శిస్తే ఫలితం దక్కుతుందని చెబుతారు. అందుకే ఈమెకు కళ్యాణవల్లీ తాయారు అన్న పేరు కూడా వచ్చింది.

    ----------------

    పళమూడిర్చోలై: అలగర్‌కోయిల్‌ కొండలలోని, బాగా లోపల ఉన్న ఈ ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆరు దివ్య క్షేత్రలలో ఒకటి- ఆఖరిది.

    ఇక్కడ స్వామివారు చిన్నపిల్లవాని రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారు చిన్నతనంలో ఆడుకునేవారని చెబుతూంటారు. ఇక్క వల్లీ మాత కూడా ఉంది. ఇది స్వామివారు భక్తురాలిని పరీక్షించిన ప్రాంతము. భక్తురాలికి జ్ఞానబిక్ష ప్రసాదించిన క్షేత్రం.

    ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఏవనగా పళని, తిరుత్తణి, స్వామిమలై, పళముదిర్చోలై, తిరుప్పరంకుండ్రం,

    తిరుచెందూర్‌.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/suHzKzLW5UI



    11 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world