Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • నాకేమవుతోంది ఎపిసోడ్ 13 | Nakemavuthondi Episode 13 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    నాకేమవుతోంది…? ఎపిసోడ్ 13

    రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ 

    ప్రవల్లిక, ప్రమీలతో మాట్లాడుతూ "ప్రియా కి ఏమీ జరగనందుకు సంతోషంగా ఉంది. మీరు చెప్పిన సంఘటనలకు, ప్రియా కనపడకుండా పోవడానికి ఏదో సంబంధం ఉన్నట్లు నాకనిపిస్తోంది. మీరు చెప్పడం పూర్తి చేయండి" అంది.

    తిరిగి చెప్పడం ప్రారంభించింది ప్రమీల.

    "ఆ డాక్టర్ ఆ రోజంతా ప్రియా కు వివిధ రకాల పరీక్షలు చేశాడు. ఎన్నో ప్రశ్నలు వేసి ప్రియా చెప్పిన సమాధానాలను నోట్ చేసుకున్నాడు. ఆరోజు సాయంత్రం ప్రియాను కాసేపు బయట కూర్చోమని చెప్పి మాతో మాట్లాడాడు. ఆయన ఉద్దేశం ప్రకారం జరిగిన సంఘటన కేవలం యాదృచ్ఛికం. భార్గవి మరణానికి దారి తీసిన పరిస్థితులు తనకు ఒకరోజు ముందే ఏర్పడడం అనుకోకుండా ఏర్పడ్డ సామీప్యత మాత్రమే. అంతేగాని జరగబోయే సంఘటన ప్రియాకు ముందుగా తెలిసిందని అనుకోవడానికి ఏ ఆధారము లేదు.

    ఇక లేని వ్యక్తిని ఊహించుకొని ప్రియా భయపడడం, ఇంటి నుండి పారిపోవడం ఖచ్చితంగా మానసిక లోపమే. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదని మీరు చెప్పారు కాబట్టి ఇది ప్రారంభ దశ అనుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ లేని టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తాను. రోజుకొక మాత్ర చొప్పున ఒక సంవత్సరం పాటు వాడమని మీ అమ్మాయికి చెప్పండి. అమ్మాయి హాస్టల్ లో ఉంటుంది కదా.. ఎవరైనా మాత్రలు వేసుకోవడం చూస్తారేమోనని భయంతో వాడడం మానవద్దని చెప్పండి. అంతగా ఎవరికైనా చెప్పాల్సివస్తే బలానికి వాడే విటమిన్ టాబ్లెట్ అని చెప్పమనండి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన ఏదైనా జరిగితే వెంటనే నా దగ్గరకు తీసుకొని రండి" అని చెప్పాడు ఆయన.

    డాక్టర్ దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాము. మా బావగారు ప్రియను తమ ఇంట్లోనే ఉంచుకుంటామని చెప్పారు. కానీ ప్రియ హాస్టల్ కి వెళ్తానని చెప్పింది. రెండు రోజులు అక్కడే ఉండి ప్రియను హాస్టల్లో దించి వచ్చాము. అప్పుడప్పుడు తన పెదనాన్న ఇంటికి వచ్చి వెళుతూ ఉండమని చెప్పాము.

    అలాగే అప్పుడప్పుడు మా బావ గారి ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేది ప్రియ. డాక్టర్ ఇచ్చిన మాత్రలను తూచా తప్పకుండా వాడుతోంది. మరొక్క ఆరు నెలలు గడిచాక మరొక సంఘటన జరిగింది. అది అంత తీవ్రమైనది కాదు. దాని గురించి మా వారు వివరంగా చెప్తారు" అంది ప్రమీల.

    ప్రభాకర్ రావు గొంతు సవరించుకొని చెప్పడం ప్రారంభించాడు.

    "మా వదినకు నీరసంగా ఉండడంతో అన్నయ్య ఆమెను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాడు. డాక్టర్లు ఆమెకు కొన్ని విటమిన్ టాబ్లెట్లు ప్రిస్క్రైబ్ చేశారు. అయితే ఆమె వాటిని రెగ్యులర్ గా వేసుకోక పోవడంతో అన్నయ్య ప్రతిరోజు ఆమెకు ఆ టాబ్లెట్స్ తీసి ఇచ్చి, మంచినీళ్లు ఇచ్చి, దగ్గరుండి మింగించేవాడు. ప్రియ, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు ఈ దృశ్యం చూసింది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/T6EmBGtzNSk


    15 min
  • ప్రేమ చేజారితే 5 | Prema Chejarithe 5 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 5

    రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి

    (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)

    షాలిని, ఆమె ఫ్రెండ్స్ ఇద్దరూ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. వాళ్ళు తమ ప్రాజెక్టు కోసం కొన్ని నెలలు కంప్యూటర్ కోర్సు చేయటానికని అక్కడ చేరారు. ఈ విషయాలు కుమార్ అడిగి తెలుసుకున్నాడనుకున్నారా?  కానే కాదు. కోర్సులో చేరిన మొదటిరోజు క్లాసులో లెక్షరర్ అందరి పరిచయాలు అడగగా, ఎవరికి వారు తమ గురించి తాము చెప్పినప్పుడు  తెలిసిన విషయాలు. కొన్ని విషయాలు కుమార్ కూడా తెలుసు కున్నాడు లెండి ప్రతిరోజూ షాలినిని గమనిస్తూ...   షాలిని రోజూ క్లాస్కి తెల్ల కైనటిక్ హోండాలో వచ్చేది. చూడ్డానికి బాగా డబ్బున్న అమ్మాయనిపించేది. అయినా కూడా నెమ్మదిగా, అణకువగా తన పనేదో తాను చేసుకుపోతూ వుండేది. ప్రక్కనున్న తనలాంటి అందమైన ఇద్దరమ్మాయిలలా కోతివేషాలు వేసేది కాదు, అందుకే స్పెషల్గా అనిపించేది కుమార్కు. క్లాసులో అడిగిన వాటికి సమాధానాలు చెప్పటమే కాక తనకు వచ్చే ఎన్నో సందేహాలను అడిగి మరీ నివృత్తి చేసుకునేది, వేరే ఎవరైనా తనని సందేహాలడిగితే తీర్చేది కూడా. అందుకే షాలిని మంచి తెలివైనదని కూడా అర్థమయ్యింది కుమార్కు. షాలిని కళ్ళు పెద్దగా చాలా అందంగా వుండేవి. అందుకే ఆ కళ్ళంటే కుమార్కి చాలా ఇష్టం.   అదే సమయంలోనే పెళ్ళి, పెళ్ళి సంబంధాలని రాఘవరావు అంటుండటంతో కుమార్ చేస్కుంటే షాలినిలాంటి అమ్మాయినే చేస్కోవాలని నిర్ణయించుకున్నాడు... తర్వాత, షాలినే ఎందుకు కాకూడదు అని కూడా అనుకున్నాడు. కానీ కుమార్ బుద్ది, కుమార్కు బుద్ధి చెప్పింది, అయినా  నీకేముందని ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందని చెప్పి తన తాహతును గుర్తు చేసింది.

    నిజానికి కుమార్ తనకున్న చిన్న ఉద్యోగం చూపి షాలినిలాంటి పెద్దింటి అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తే మాత్రం ఆమె అంగీకరిస్తుందా? పోనీ పోయి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి చెప్పినా వాళ్ళు  అంగీకరిస్తారా?!   అలా కాక షాలిని కూడా కుమార్ని ప్రేమిస్తూ వుండి వుంటే ఒక రకంగా పని సులువయ్యేది. కానీ షాలిని ఇంతవరకూ కుమార్ వైపు చూడను కూడా లేదు. ఒకవేళ షాలినిని ఈ కోర్సయిపోయేలోపల తనను ఇష్టపడేలా చేస్కోగల్గితే, అప్పుడు ఆమెతో పెళ్ళి గురించి ఆలోచించే అవకాశం వుండొచ్చనుకున్నాడు కుమార్.   అంతే అప్పటి నుండి కుమార్కు షాలిని ఆలోచనలే...   షాలినిని ఎలా పరిచయం చేస్కోవాలి... ఎలా వుంటే షాలిని తనని ఇష్టపడుతుంది... ఏమి చేస్తే షాలిని తనని చూసి మాట్లాడ్తుంది... ఇవే ఆలోచనలు...


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/oUqGffPe0UU

    11 min
  • మా ఊరి అంగడి | Ma Uri Angadi | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    మా ఊరి అంగడి

    రచన: లక్ష్మి మదన్ 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    బుధవారం వచ్చిందంటే చాలు మా ఊరు సందడి సందడిగా మారుతుంది. ఎందుకంటే ఆ రోజు అంగడి. మా ఊరి అంగడిలో ఆరోజు పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. గొర్రెలు, బర్రెల దగ్గర నుండి గోర్ల పెయింట్ వరకు అమ్మకానికి ఉంటాయి. కూరగాయలు, పండ్లు, బట్టలు, పక్క పిన్నిసులు, బొట్టు బిళ్ళలు, బొంబాయి బొట్టు, కుంకుమ, పసుపు, మొలదారాలు.. ఒక్కటేమిటి అక్కడ దొరకనిది లేదు.

    చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్లన్నిటికీ మా ఊరి అంగడి ఆధారం. ఏమి కొనుక్కొని పోవాలన్నా బుధవారం నాడు మాత్రమే వీలవుతుంది. అందుకని అంగడి కోసం తయారుగా ఉండేవారు. కొందరికి ఏమో స్వకార్యం స్వామి కార్యం అన్నట్లు కొనుగోలు చేయడంతో పాటు ఆటవిడుపు లాగా వేరే ఊరికి రావడం సంతోషంగా ఉండేది.

    ఇక కథలోకి పోదాం.

    సరోజనమ్మ పనులన్నీ తొందరగా ముగించుకొని అంగడికి పోవాలి అని అనుకుంటుంది. ఇంట్లో పనులు అంత తొందరగా తెములుతాయా! పిల్లలు స్కూల్కు పోవాలి, భర్త ఆఫీసుకు పోవాలి, ఇంట్లో ఉన్న పెద్దమనిషి అత్తకు మడివంటకి అన్ని సిద్ధం చేయాలి.. వ్యవసాయ ఆధారమైన ఇల్లు కాబట్టి వడ్ల పని బియ్యం పని ఉండనే ఉంటుంది.

    అన్ని పనులు అయ్యాక భోజనం చేద్దామని అనుకున్నది కానీ పక్క ఊరి నుండి వచ్చే వరుసకు బంధువులైన తల్లి కూతుర్లు వస్తారని ఊహించి కాసేపు వాళ్ల కోసం ఎదురు చూద్దాం అనుకున్నది. ఇంతలో తల్లి కూతుర్లు రానే వచ్చారు.. కామాక్షమ్మ ,కాంతమ్మ. సినిమాల్లో సూర్యకాంతం, గిరిజ ఎలాగో వీళ్ళు అలా అన్నమాట. పరమగయ్యాళ్లు. వీళ్లకు వీరే సాటి. వీరి నోటికి జడిసి చాలామంది వీరికి దూరంగా ఉండేవాళ్ళు. కానీ ప్రేమస్తులు.

    హి హి అని నవ్వుకుంటూ ఇద్దరు లోపలికి వచ్చారు. ఈ ఊరు నుండి ఆ ఊరికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది, వస్తారు. కామాక్షమ్మ కి భర్త లేడు. కాంతమ్మ భర్తను వదిలేసింది. కాంతమ్మ వాళ్ల పెరట్లో పూసిన గన్నేరు పూలు, సబ్జా ఆకు కలిపి పెద్ద దండలుకొని నెత్తినిండా పెట్టుకుంది. సౌరంతో వేసుకున్న జడ చాలా పెద్దగా ఉంది. చక్కగా ఎక్కడికో టూర్ వెళ్లినట్టుగా తయారైంది. కానీ పాపం ఆ పల్లెటూరు నుండి వారం కి ఒకసారే కదా పట్టణానికి రావడం.. ఇదే వాళ్లకు ఒక వ్యాపకం ఒక ఆనందం, ఒక సరదా.

    "సరోజనా! ఓ సరోజనా! ఉన్నావే.. గిన్ని మంచినీళ్లు ఇయ్యి. ఎండల వడి వచ్చినం" అన్నది కామాక్షమ్మ.

    ఇద్దరూ భవంతిలో మొగురంని ఆనుకొని చతికిలబడి కూర్చున్నారు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/qhg8vrKfCRE

    8 min
  • కుక్క బుద్ధికి పిన్ను దెబ్బ | Kukka Buddhiki Pinnu Debba | Telugu Short Story | Damaraju Visalakshi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కుక్క బుద్ధికి పిన్ను దెబ్బ

    రచన: దామరాజు విశాలాక్షి

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    సినిమా మంచి రసవత్తరంగా ఉంది. అందులో లీనమై చూస్తోంది అలివేలు.

    అదే పనిగా పైపైన చేతులు వేస్తున్నారెవరో? ప్రక్కకి చూసింది. పగలుచూస్తే రాత్రి కలలోకి వచ్చేంత పరమ వికారి ఒకడు తన ప్రక్కసీట్లో..

    పళ్ళన్నీ ఇకిలించి ప్రక్కకి ముఖం తిప్పి వెకిలిగా నవ్వుతున్నాడు.

    “సరిగా కూర్చోండి” హెచ్చరించింది అలివేలు.

    "సరిగానే కూర్చునానే.. మీ ఒళ్ళో పడ్డానా?” వాడి వ్యంగ్యం..

    పది నిమిషాలు కాకుండావాడి పాపిష్టి చేతులు ప్రక్క టెముకలవరకూ వచ్చి తాకుతున్నాయి.

    పళ్ళు పటపట కొరుక్కుంది అలివేలు.

    వాడి కాలు తన కాలుని రాయడం మొదలుపెట్టింది. పాపం లేచి వెళదామనుకుంది.

    చేయిపట్టిలాగి కూర్చోపెట్టింది స్నేహితురాలు పంకజం.

    పాపం దుఃఖంముంచుకొస్తుంది. “పాపిష్టోడు చూడవే.. పాత తారుడబ్బాలా ముఖం వీడూను. నాకు వాడి కూతురు వయస్సుంటుంది.. నాతో పరాచికాలా?” ప్రక్కన కూర్చున్న పంకజంతో అంది గుసగుసగా అలిమేలు.

    పంకజం అంది “పది నిమిషాలు ఓపిక పట్టు” అని.

    ఒకపెద్ద పిన్ను ఇచ్చింది. పదిలంగా పర్స్ లోంచి తీసిఇచ్చింది..

    పళ్ళికిలించి పైన చేయివేసిన ప్రక్కసీటు పాపికి, అరచేతిలో దిగింది పిన్ను.. అరచేతిలోకి బాగా వెళ్ళిందో ఏమో !

    అమ్మో! అని పెద్దకేక పెట్టి లేచాడు. అందరూ వెనక్కి తిరిగి చూచారు విసుగ్గా..

    “ఏటా అరుపు? అంత నాగ అరవాలేటి..? ఆ సీను చూస్తే అంత భయమయితే కళ్ళుమూసుకో.. భలే ఓడివే, ..

    అంతపిరికోడివి సినిమా కెందుకొచ్చినావు? సాల్లే కూర్చో, .. ఇందాకటి నుండి సూత్తన్నా. సీట్లో సరిగా కూసోకుండా

    తెగ నులుసుకు పోతున్నాడు. ఎందుకలా నులుసుకు పోతన్నావు.. గమ్మునకూర్చో. మాటాడకు. మంచిసీను వత్తాఉంటే. మధ్యన నీ గోల” తిట్టాడు వెనక సీటతను..

    ఆ పల్లెటూరి ఆసామి అయితే, ప్రక్కకి తల త్రిప్పకుండా, ఫైట్స్ చూస్తూ మాట్లాడేస్తున్నాడు. పక్క సీటు వ్యక్తి లేచి వెళ్లి పోయాడు..

    హాలంతా చీకటి. చేతికి తడి తగిలింది.. కుర్చీ చేతిపై. ఇంటర్వెల్లో చూస్తే కుర్చీ చేతిపై రక్తం.. అతగాడు సీట్లో లేడు.

    “ఏ మేకో, గుచ్చిసినాదేమో?ఎర్రి కేకేసాడు.. ఇందాకటి బట్టి సూత్తన్నా. తెగ కుర్సీలో నులుసుకుపోతున్నాడు.

    ఇదుగో.. కుర్చీ మేకులు, బయట కొచ్చినాయి. మనల్ని సినిమా సూడనీయనేదురా బాబూ!” పల్లెటూరి ఆసామి స్వగతంలా చెప్తునే ఉన్నాడు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/oH-17ZnQ2Sg

    5 min
  • నాకు నీవు నీకు నేను | Naku Nivu Niku Nenu | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    నాకు నీవు నీకు నేను

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    అది విజయవాడ రైల్వేస్టేషన్‌. రైళ్లరాకపోకల సమయ ప్రసారం తెలుగు, ఇంగ్లీషు, హిందిలో క్రమంగా... అందరికీ అర్ధమయేలా ఒక భాష తరువాత మరో భాషలో జరుగుతూవుంది. ఆ గళం వినసొంపుగా వుంది...

    మాధవయ్య వారి సతీమణి అన్నపూర్ణమ్మలు సైకిల్‌ రిక్షాలో స్టేషన్‌ముందు దిగారు. ఉదయం ఆరుగంటల ప్రాంతం. పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో వారు చీరాల వెళ్లాలి.

    అన్నపూర్ణమ్మ దగ్గుతూ వుంది... ఒంట్లో జ్వరం... ఏవో రెండు మాత్రలు మింగి రిక్షా ఎక్కింది. ఇల్లు దగ్గరే అయినందున కాలుగంటలోపలే స్టేషన్‌కు చేరుకున్నారు. అది వారి పెద్దకుమారుడు సదాశివం ఇల్లు...

    రెండు చేసంచులు వారి లగేజీ. అలసటగా నీరసంగా ఉన్న అన్నపూర్ణమ్మను మెట్లపై కూర్చోబెట్టి... సంచులు ఆమెకు అందించి, టిక్కెట్‌ తీసుకొనేందుకు మాధవయ్య కౌంటర్‌ దగ్గరకు వెళ్లాడు...

    ******

    మాధవయ్యగారు రిటైర్డ్‌ హైస్కూలు హెడ్‌మాస్టర్‌. వారి రిటైర్‌మెంటు ఆరునెలల ముందు జరిగింది. వారికి ముగ్గురు కుమారులు ఒక కూతురు.

    పేర్లు సదాశివం, సాంబశివం, రామశివం... కుమార్తెల అందరికకన్నా పెద్దది. పేరు భారతి. యం.ఏ.బి.ఈడి., చదివి హైస్కూల్‌లో టీచరగా పనిచేస్తూవుంది. వారి భర్త పార్వతీశంగారు. వారు స్కూల్ మాస్టర్. వారి వివాహం జరిగి.. పన్నెండు సంవత్సరాలయింది. వారు విశాఖపట్నంలో వుంటున్నారు.

    సదాశివం ఇంజనీరు... సాంబశివం బ్యాంకు ఆఫీసర్‌... రామశివం అడ్వొకేట్‌...

    మాధవయ్యగారు ఉద్యోగపర్వంలో వుండగా పిల్లలనందరినీ పద్ధతిగా చదివించి ప్రయోజకులను చేశాడు. పెద్దకొడుకు సదాశివం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఇంజనీర్‌. తన మేమమామ కాంట్రాక్టర్‌ గోపాలయ్య కూతురు శాంతితో వివాహం జరిగింది.

    సాంబశివం విశాఖపట్నం ఆంధ్రాబ్యాంకులో ఆపీసరు. వీరిది లవ్‌మ్యారేజి. తల్లిదండ్రులకు సంబంధం లేదు. ఎంత ఘాటు ప్రేమయో!... క్రిస్టియన్‌ వనిత. అతను కుటుంబానికి దూరం.

    వారి చినమామగారు రామదొరై. సీనియరు లాయర్‌. ఉండేది చెన్నై. వారికి ఒక కూతురు సంధ్య. డాక్టర్‌ చదువుతూవుంది. రామశివానికి సంధ్యను వివాహం చేసుకొని జీవితంలో హాయిగా చెన్నైలోనే స్థిరపడి పోవాలనే ఆశ. ఆ కారణంగా మామగారి వద్దనే పనిచేస్తున్నాడు రామశివం...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/oav1x_nqS68

    24 min
  • ఆశపాశం | Asapasam | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఆశపాశం

    రచన: అల్లు సాయిరాం

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దు ప్రాంతం.

    ఆకాశమంతా నిండుగా ప్రకాశిస్తూ, బహుశా డ్యూటీ దిగిపోయే గాభరాలో చకచకా  మబ్బుల చాటున పరుగెత్తుతున్న మూడోజామురాత్రి చంద్రుడ్ని, ఎంత తొందరగా తెల్లవారుతుందా అని  నిద్రపట్టక మంచం మీద పడుకుని చూస్తున్నాడు చంద్రయ్య.

    దీపం వెలుగులో గడియారం చూస్తే, టైం రెండున్నరయింది.  యింకా రెండున్నరేనా! టైం నాలుగున్నర అయితే కానీ కూరగాయలు బజారుకి తీసుకెళ్ళడానికి ఆ ఆటో రాజు ఆటో తీసుకునిరాడు అని నిట్టూరుస్తూ, తన మంచం ప్రక్కన రెండు బుట్టల్లో  మూటగట్టిన కూరగాయలు, పండ్లు చూస్తూ, యిరోజు సంతబజారులో కూరగాయలన్ని ఎలాగైనా తొందరగా అమ్మేయాలి అని ఆలోచించుకుంటూ పడుకున్నాడు.

    యిలా చిన్న కునుకు తీయడం, టైం అయిపోయిందని ఉలిక్కిపడి నిద్రలేవడం, టైం అవ్వలేదని నిట్టూర్చడం, బుట్టల్లో మూటగట్టిన కూరగాయలు, పండ్లు చూసుకోవడం, మళ్లీ పడుకోవడం, రాత్రంతా యిదే వరుస. ముందురోజు సాయంత్రం పొలంలోకి వెళ్లి, పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, యిలా ఎదుంటే అది బుట్టల్లో మూటగట్టి, దగ్గరున్న పట్టణం సంతబజారులో అమ్ముకుంటే, నాలుగు డబ్బులు వస్తాయి కదా అని  ఆశపడే రకం చంద్రయ్య.

    ఎప్పటిలా యింట్లో ఒక్కడే ఉంటే, టైం తో సంబంధం లేకుండా నిద్రలేచి, బుట్టలతో కూరగాయలు పట్టుకుని బస్టాండుకి వెళ్లి, ఆటో రాజు రాకపోతే, అవసరమైతే చీకటిలో సంతబజారుకి నడిచి వెళ్ళిపోతాడు. కానీ, తనకున్న ఒక్కగానొక్క మనవరాలైన గిరిజ పట్టణం నుంచి ముందురోజు  రాత్రి వచ్చింది. యిలా నిద్రల్లేకుండా ఆరోగ్యం పాడుచేసుకుంటాడని ఎప్పుడూ గిరిజ చంద్రయ్య మీద కోప్పడుతుంది.

    దురదృష్టవశాత్తు గిరిజ తన తల్లిదండ్రులని చిన్న వయసులోనే కోల్పోయింది. అప్పటినుంచి ప్రాణంగా చూసుకుంటూ, తన శక్తి మేరకు గిరిజని డిగ్రీ వరకు చదివించాడు చంద్రయ్య. పట్టణంలో ప్రైవేటు కంపేనీలో చిన్న ఉద్యోగావకాశం వస్తే, చంద్రయ్యని ఒంటరిగా వదిలి వెళ్లడానికి ఏమాత్రం యిష్టంలేని గిరిజ వద్దనుకుంది. నేను యింకెంత కాలం ఉంటానమ్మా! నాలుగు డబ్బులు వస్తే, నీ భవిష్యత్తు బాగుంటుంది తల్లీ! అయినా నేను రోజూ కూరగాయలు తీసుకుని పట్టణం సంతబజారుకి వస్తాను కదా, అక్కడినుంచి నిన్ను చూడడానికి వస్తాను అని గిరిజకి సర్దిచెప్పి ఉద్యోగం చెయ్యడానికి ఒప్పించాడు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/NQHzhs8pAac

    14 min
  • పాణిగ్రహణం - 9 | PaniGrahanam - 9 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    పాణిగ్రహణం - 9

    రచన: భాగవతుల భారతి

    (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    జరిగిన కథ..

    హంసమంజీర ఒక రచయిత్రి, కవయిత్రి. ఆమె చెల్లెలు సుగాత్రి.

    హంసమంజీర పెదనాన్న పిల్లలు విరూపాక్ష, సాగర మేఖల.

    సాగరమేఖల భర్తతో విడాకులు తీసుకున్న విషయం గుర్తుకొచ్చి బాధ పడతాడు విరూపాక్ష.

    గతం గుర్తుకొస్తుందతనికి.

    కుటుంబ పోషణ లో భర్తకు చేదోడుగా ఉండటానికి తను కూడా ఉద్యోగంలో చేరుతుంది సాగరమేఖల. అభినందించక పోగా అనుమానిస్తాడు భర్త. అవమాన భారంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది సాగరమేఖల. హాస్పిటల్ లో కోలుకుంటుంది. భర్తను, పిల్లల్ని వదిలి హైదరాబాద్ లో ఉద్యోగం చూసుకొని ఒంటరిగా ఉంటుంది ఆమె.

    ఫోన్ రావడంతో గత కాలపు ఆలోచనలనుండి తేరుకుంటాడు విరూపాక్ష. ఫోన్ లో లక్ష్మణ అనే వ్యక్తికి అతని భార్య విడాకుల నోటిస్ పంపినట్లు విని బాధ పడతాడు. 'పాణిగ్రహణం కన్సల్టెన్సీ' పేరుతో ఒక సంస్థను ప్రారంభిస్తాడు విరూపాక్ష.

    మిత్రులను, పత్రికా విలేఖరులను ఆహ్వానించి సహకారం కోరుతాడు. భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ అభిప్రాయం బేధాలను సామరస్యంగా పరిష్కరించడమే ఈ కన్సల్టెన్సీ ఉద్దేశమని చెబుతాడు.

    ముందుగా సాగర మేఖల కాపురం సరిదిద్దాలనుకుంటాడు.

    ఆమె భర్తకు కాల్ చేసి సాగర మేఖలకు అతనంటే విముఖత లేదని చెబుతాడు.

    మొదట్లో అతను సరిగ్గా బదులివ్వక పోయినా విరూపాక్ష పట్టుదల వల్ల మెత్తబడతాడు.

    సాగర మేఖలలో కూడా మార్పు వచ్చి భర్త దగ్గరకు వెళ్తుంది.

    సమీర్ కాపురాన్ని కూడా అతని తండ్రి సహకారంతో సరిదిద్దుతాడు.

    తరువాత లక్ష్మణ్ సమస్య పైన దృష్టి సారిస్తాడు.

    ఇక పాణిగ్రహణం ధారావాహిక తొమ్మిదివ భాగం చదవండి.

    "హలో! విరూపాక్ష గారేనా?" ఫోన్ లో ఓ గొంతు బలహీనంగా అడిగింది.

    "అవును ! 'పాణిగ్రహణం 'కన్స ల్టెన్సీ'

    "మిమ్మల్ని ఓసారి కలవాలి"

    "రండి! మా అడ్రసు...."

    "మీ అడ్రస్ మాకు తెలుసండీ! కానీ నేను వచ్చే పరిస్థితిలో లేను. దయచేసి వీలుచూసుకుని మీరే రాగలరా!? ఈఊళ్ళోనే.... అడ్రసు... మీ బండి పెట్రోలు ఖర్చు నేను భరిస్తాను. " ఖళ్ళూ ఖళ్ళూ దగ్గుతూ ఫోన్ పెట్టేసాడు ఓ పెద్దాయన.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/UU20kGUIUKk

    12 min
  • వినిపించని రాగాలు 9 | Vinipinchani ragalu 9 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి

    వినిపించని రాగాలు 9

    రచన : గొర్తి వాణిశ్రీనివాస్

    (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    కుమార్ స్పృహతప్పి పడిపోయాడు. అందరం అవాక్కై చూస్తున్నాము. అతని స్నేహితుడు అక్కడ్నించి పారిపోయాడు. తెల్లవారిపోయింది. వాకింగ్ వ్యక్తి, నేనూ కలిసి కుమార్ ని ఆటోలో ఇంటికి తీసుకెళ్లాం.

    ఇంటిముందు ఆటో ఆగేసరికి అమ్మా నాన్నా బయట కొచ్చారు. నేను దిగాను.

    "ఏమ్మా, పొద్దున్నే ఆటోలో వచ్చాశారా? " అంటూ నాన్న ఆటో దగ్గరకి వచ్చారు.

    "ఇంకా అందులోనే కూర్చున్నారే. దిగండి అల్లుడుగారూ. " అని నాన్న ఆటోలోకి చూసారు. షాక్ అయ్యారు. రక్తం ఓడుతూ చలనరహితంగా కుమార్..

    కుమార్ అమ్మా నాన్నా కూడా బయటకు వచ్చి చూసి "మా కుమార్ కి ఏవైంది?" అంటూ పెద్దగా ఏడుపు మొదలు పెట్టారు.

    "ఉష్, గట్టిగా అరవకండి. ఇరుగుపొరుగు పోగవుతారు. అప్పుడు మీ పరువే పోతుంది" అన్నాడు నాతోపాటు వచ్చిన వ్యక్తి. అందరం కలిసి తోడుపట్టి కుమార్ ని వాళ్ళింట్లోకి తీసికెళ్లి పడుకోబెట్టాం.

    కుమార్ ని ఆ స్థితిలో చూసి కన్నీరు మున్నీరయ్యారు వాళ్ళ పేరెంట్స్. రెక్క తెగిన సీతాకోకలా ఉన్న నన్ను చూసి అమ్మా నాన్నా బావురుమన్నారు. జుట్టు రేగిపోయి, పూలదండ వాడి దారం వెళ్లాడుతూ, మురికి పట్టిన బట్టలు చూసి ఏదో పెద్ద ఘోరం జరిగివుంటుందని ఊహించారు. అమ్మ కాఫీ కలుపుకొచ్చి ఇచ్చింది.

    "కాసిని మంచినీళ్లు ఇవ్వమ్మా" అన్నాను. అమ్మ తెచ్చి ఇచ్చింది. నాతో వచ్చిన వ్యక్తి పార్క్ లో జరిగినదంతా వాళ్ళతో చెప్పాడు. విని నిర్ఘాంతపోయారు వాళ్ళు.

    "భగవంతుడా, కుమార్ కి ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టించావు. ఆడపిల్ల విషయంలో చేయకూడని పని ఎందుకు చేశాడు" అని వాళ్ళమ్మ ఏడ్చింది. నాన్న డాక్టర్ కి ఫోన్ చేస్తే వచ్చాడు. ప్రధమ చికిత్స చేసి కుమార్ ని

    "ఇంకా కొన ఊపిరి ఉంది. వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేయండి. "అన్నాడు.

    నేను వెంటనే స్నానం చేసి బట్టలు మార్చుకుని బయలుదేరాను. నాన్న నన్ను రావద్దన్నారు. అమ్మ కూడా వెళ్ళద్దంది. అమ్మా నేనూ ఇంట్లోనే ఉన్నాం. వాళ్లంతా కుమార్ ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లారు.

    పార్క్ లో నన్ను రక్షించిన వ్యక్తితో అమ్మ "మీరు గనక లేకపోతే ఈరోజు నా కూతురు ఏమైపోయేదో. దేవుడల్లే వచ్చి రక్షించారు. మీరుణం తీర్చుకోలేం" అంది చేతులు జోడిస్తూ”.

    " నాదేముందమ్మా, అమ్మాయి జీవితం పెద్ద ప్రమాదంలో ఉంది. రక్షించాల్సిన భర్తే దారుణం చెయ్యబోయాడంటే అది మామూలు విషయం కాదు. దీని వెనక ఎవరో వున్నారు. అమ్మాయిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. " అని చెప్పి వెళ్లిపోయారు. అమ్మ భయపడిపోయింది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/skOKB-hw5kg


    17 min
  • గోవిందా గోవింద | Govinda Govinda | Telugu Short Story | Dasu Radhika | manatelugukathalu.com

    గోవిందా గోవింద 

    రచన: దాసు రాధిక

    (ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    కవిత మొహమంతా ముచ్చమటలు పట్టాయి.. కంగారుగా తుడుచుకొని ఎదురు గా అల్మారా లో కనిపించిన చీర, మ్యాచింగ్ బ్లౌసు దొరక లేదు, దొరికిందే వేసుకుని లల్లీ గది నిండా పరిచిన బొమ్మలను తీసి బుట్ట లో సర్ది పెట్టింది.. స్నానం హాయిగా చేసిన తృప్తి కలగ లేదు కవిత కు.. రోజూ కూడా అంతే.. ఎవరైనా తన కూతురిని కాసేపు కనిపెట్టు కుంటే తప్ప అది కుదరదు..

    ఈ రోజు అయితే బాత్రూమ్ లోకి అడుగు పెట్టగానే ఆ వెధవ వాచ్మాన్ చూసే పిచ్చి చూపే గుర్తొచ్చింది.. నిజంగానే ఎక్కడి నుంచో చూస్తు ఉన్నాడేమో అని భయం వేసింది తనకు.. దాంతో చెమటలు పట్టేశాయి..

    ఏం ఖర్మ రా బాబు.. ఇలాంటి రోజు కూడా వస్తుందని కలలో కూడా ఊహించ లేదు..

    సంవత్సరం అయింది ఆ ఇంట్లోకి మారి.. రెండు నెలల క్రితం మేడ మీద ఇంకో అంతస్తు కట్టాలనే ఉద్దేశంతో పని మొదలైంది.. అప్పుడే వీరయ్య ని వాచ్మాన్ గా పెట్టి వెళ్ళాడు ఇల్లు గల ఆయన భూషణం గారు..

    "ఒక్క ఆరు నెలలు ఓపిక పడితే అయిపోతుంది" అన్నాడు ప్రకాష్ కవిత తో.. ఇప్పటికి రెండు నెలల అయింది.. చుక్కలు కనిపిస్తున్నాయి కవిత కు..

    ఇల్లంతా దుమ్ము, ధూళి.. ఇల్లు రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది.. కొత్త గా ఈ పని కోసమే కొన్న రోబో ను కవిత బాగా వాడుతున్నది.. కాని నెత్తి మీదే అవడం తో చాలా కష్టంగా ఉంది..

    ప్రకాష్ వారం లో రెండు రోజులు- శనాదివారాలు- ఇంట్లో ఉంటేనే దుమ్ము వల్ల ఎలర్జీ వచ్చి ఎప్పుడూ జలుబు, దగ్గు తో బాధ పడుతూ ఉన్నాడు..

    ఆ పై ఇద్దరు పిల్లలు.. బాబీ ఇంకా మూడింటి దాకా బడి లో ఉండి ఒక సందు అవతల ఉన్న స్కూల్ నుంచి ఆటో ఎక్కి వస్తాడు..లల్లీ అయితే పూర్తిగా అదే గాలి, దుమ్ము లో ఉంటోంది కవిత తో పాటు..

    వీరయ్య ఇంటికి ముందు వైపు న ఉన్న గేటు దగ్గరే వేళ్లాడుతూ ఉండే వాడు..

    గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ కి గేట్ కీ మధ్యలో కొంచెం స్థలం ఉంది.. అక్కడ తను ఇంట్లో ఉన్న రోజు కాసేపు ప్రకాష్ షటిల్ ఆడాల్సినదే కవిత తో.. లల్లీ పడుకున్న సమయంలో..

    వీరయ్య దూరంగా నిలబడి చూస్తుండేవాడు.. కవిత ఆట లో అతను వచ్చాక చాలా మార్పు వచ్చింది..ఏకాగ్రత కోల్పోయింది.. వీరయ్య చూపు కవిత కు అతను వచ్చిన రోజు నుండి నచ్చ లేదు.. ప్రకాష్ కి చాలా సార్లు చెప్పింది కాని ప్రకాష్ పట్టించుకోలేదు..

    వీరయ్య ప్రవర్తన ప్రకాష్ ఉన్నప్పుడు ఒక లాగా, లేనప్పుడు మరో లాగా ఉండేదని కవిత అభిప్రాయం..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/Bypucd-REP8

    20 min
  • కళ్యాణం – కమనీయం | Kalyanam Kamaniyam | Telugu Short Story | Damaraju Visalakshi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కళ్యాణం – కమనీయం

    రచన: దామరాజు విశాలాక్షి

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    పెళ్ళి సంబంధం కోసం, వచ్చిన, కామేశం కళ్యాణి లను చూసి ఖంగు తిన్నది శ్రీ విద్య..

    తనను చూసి కూడా ఏమీ తెలియనట్లు, ఎవరో.. అన్నట్లు మాట్లాడుతున్న వారిని చూస్తే ఒళ్ళు మండుతున్నా భరించింది కూతురికోసం.. చక్కగా పలహారాలవీ తిని, ‘ఇక మేము వెళ్తామండీ.. ఫోన్చేస్తాము ఇంటికెళ్ళి’ అన్న కామేశంతో, ఇక ఊరుకోలేక, అంది విద్య..

    “అవసరం లేదులెండి.. పలహారాలవి అయ్యాయిగదా! ప్రశాంతంగా ఉండండి. మా అమ్మాయి ఈ పెళ్లికి ఏమంత సుముఖంగా లేదు. ”

    శ్రీవిద్య మాటకి ఉలిక్కిపడి, సూటిగా తలెత్తి చూసిన కామేశం, ఆలోచించే లోపల అంది విద్య. “పర్లేదులెండి, కొడుకు పెళ్లిచూపుల పేరుతో, మీరిద్దరేగాక, మీ కోడుకుతో సహా మరి కొందరిళ్ళల్లో తిని వెళ్ళొచ్చుగదా?.. ”

    విద్య అంటుంటే,

    “ఏమిటి నాన్నా। ఈమె వెటకారంగా మాటాడుతోంది? మేనర్స్ తెలీదా ? మీరే కదా.. వాళ్ళు పెళ్ళిచూపులకు రమ్మని కబుర్లు పెడుతున్నారన్నారు.. వీలుకాకపోయినా పర్మిషన్పెట్టి వచ్చాను” అన్నాడు ఆవేశంగా అబ్బాయి.

    “అంత ఆవేశపడకు బాబూ ! అనుభవజ్ఞులైన మీ అమ్మానాన్న అన్నీ, నేర్పిస్తారు. అన్నట్టు నీతోపాటు పెళ్లి చూపులకు రాడానికి, నీకు అత్తకూతురో, మామకూతురో, పక్కింటి అమ్మాయో లేరా? లేకపోయినా పర్వాలేదులే! మీనాన్న ఎవరినో తీసుకొస్తారు” అంది శ్రీవిద్య.

    “ఈమేమిటి, నాన్నా! ఇంత అసహ్యంగా అలా మాటాడుతోంది?” అంటున్న కృష్ణతో..

    “మొదట నువ్వు ఇలాగే అంటావు. నాలుగు రోజులుపోతే, నీకే బాగుంటుంది. మీనాన్ననడుగు, నేర్పుతాడు. లేదా మీ అమ్మనడిగితే సలహాలు చెప్తుంది” అంది శ్రీవిద్య.. చురచురలాడుతూ వాళ్లనిచూసి..

    ఆమె అలాగనగానే, “మాటాడుతుంది.. ఆమె తీరే అంత! పద౦డి పద౦డి.. ” అని అబ్బాయి తండ్రి కామేశ్వరరావు అన్నాడు.

    “ఆవిడ గారు ముందునుంచే ఇంతే।.. వీళ్ళని తెలిస్తే రాకపోదుము” అని తల్లి కళ్యాణి అంది.

    “మీ సంబంధమని తెలిస్తే, ముందే రానిచ్చేదాన్ని కాదు. ఇంత సేపూ నేనెవరో తెలియనట్లు ఎంచక్కా నటించారు? అయినా ! నటన మీకలవాటేగా.. ?” కోపంగా అంది శ్రీవిద్య.. కామేశం, కళ్యాణిలను ఆసహ్యంగా చూస్తూ..

    “చాలు.. ఇక పదండి” అని విస విసా వెళ్లి పోయాడు కామేశం కొడుకు కృష్ణ..

    వెనక్కి తిరిగి చూడకుండా కొడుకును అనుసరించారు కామేశం, కళ్యాణి.. అయోమయంగా చూస్తున్న పెళ్లి కూతురు, ఆమె తండ్రీ, అడుగుతున్నా వినిపించుకోకుండా.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/3_vLiDJ6vec

    9 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world