Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • ప్రేమ చేజారితే 4 | Prema Chejarithe 4 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 4

    రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి

    (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)

    గత భాగంలో   షాలినీని మెచ్చుకుంటూ రాఘవరావు షాలినితో మాట్లాడ్తుండగా మెట్లు దిగుతున్న శబ్దం వినిబడింది.   ఇక చదవండి...  మెట్లు దిగిన కుమార్, రాఘవరావు గదిలో కొచ్చి, "ఏంటి నాన్నా! ఏదో సంతోషంగా మాట్లాడ్తున్నారు, ఏంటి విషయం?" అని ఇద్దరినీ చూసి అడుగుతూ వచ్చి రాఘవరావు చెయ్యి పట్టుకుని ఆయన ప్రక్కనే మంచం మీద కూర్చున్నాడు.   "ఏమీ లేదురా, పెళ్ళి వయసుదాటాక పెళ్ళి చేస్కున్నా కూడా నాకు బంగారం లాంటి కోడలిని తెచ్చావు. షాలిని ఏ పనైనా విసుగుపడకుండా సంతోషంగా చేస్తుందని మెచ్చుకుంటున్నానంతే. మీ అమ్మకు నీ ఉన్నతిని కానీ, కోడలినీ, మనవడిని కానీ చూసే అదృష్టం లేకుండా పోయిందిరా. అది ఉన్నన్ని రోజులూ మనం ఏదో తిండికీ, బట్టకు లోటు లేకుండా వున్నామే కానీ మీ అమ్మకు ఏనాడూ ఒక నగా, నట్రా చేయించేంత స్థోమతలో నేను లేకపోయాను. ఏమో అది అంత తొందరపడి నీ ఉన్నతిని చూడకుండానే ఈ లోకం నుండి వెళ్ళి పోయింది," అంటూ కళ్ళు తుడుచుకున్నాడు రాఘవరావు.   "అవును నాన్నా, నాక్కూడా ఎప్పుడూ అదే లోటుగా అనిపిస్తుంది... పోనీలెండి, మిమ్మల్నైనా సంతోషపెట్టగలిగాను, నాకు ఆ ఆనందమన్నా మిగిలింది," అంటూ మనసులో షాలిని అసలు మీ కోడలే కాదని తెలిస్తే మీకు ఈ ఆనందం కూడా కలిగేది కాదేమో, అయితే నేను చేసింది మీకు ఆనందాన్ని కలిగించే మంచి పనే అని నాకిప్పుడు చాలా తృప్తిగా వుందనుకున్నాడు కుమార్.   తర్వాత షాలినికి, "డైనింగ్ టేబుల్ పైన బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టు," అని చెప్పి, రాఘవరావును పట్టుకుని చిన్నగా డైనింగ్ టేబుల్ దాకా నడిపించుకు తీస్కెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరగా కుర్చీలో కూర్చోబెట్టి ప్రక్కనే వున్న మరో కుర్చీలో తనూ కూర్చున్నాడు కుమార్.   రాఘవరావుకు టిఫిన్ మంచం దగ్గరికే తెచ్చివ్వచ్చు, కాకపోతే అలా అతనిని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీస్కెళ్ళి తన చేతులతో పెట్టటమనేది ఆయనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అలా చేస్తుంటాడు కుమార్. అమ్మెలాగూ లేదు, వున్న నాన్నను ఆనందంగా చూస్కోవాలనేదే కుమార్ కోరిక.   ఇంతలో షాలిని వేడి, వేడి ఉప్మా తీస్కొచ్చి టేబుల్ పైనున్న ఇద్దరి ప్లేట్లలో పెట్టింది. రాఘవరావు వణుకుతున్న చేతులతో తినటం కష్టమవుతుందని షాలిని తనే రాఘవరావుకు స్పూన్తో పెట్టబోతే, కుమార్ నేను తింటూ పెడ్తానని చెప్పి, షాలినిని నీవు కూడా తినమని చెప్పబోయి ఆపుకున్నాడు కుమార్.   షాలిని వారితో, " మీకు పండ్లరసం చేసి తీస్కొస్తాను," అని చెప్పి లోనికెళ్ళింది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/skT8rgfm65A

    10 min
  • బాబోయ్ మీకో దండం | Baboy Milo Dandam | Telugu Short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    బాబోయ్! మీకో దండం

    రచన : గన్నవరపు నరసింహ మూర్తి 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ముంబాయి- విశాఖపట్నం విమానం టేకాఫ్ అయిన ఇర‌వై నిముషాల త‌రువాత ఎమ‌ర్జ‌న్సీ లేండింగ్ చేస్తున్న‌ట్లు  పైలట్ ప్ర‌క‌టించాడు.

    పైల‌ట్ ప్ర‌క‌ట‌న విన్న త‌రువాత అందులో ఉన్న రెండు వంద‌ల మంది ప్ర‌యాణికుల‌కు మొద‌ట అత‌ను ఏం చెబుతునాడో అర్థం కాలేదు.

    అర్ధం అయిన  త‌రువాత  ఎక్క‌డ దించేసాడో అనీ గాబ‌రా పడటం మొదలుపెట్టారు ;

    ఇంతలో నిలువెల్లా న‌ల్ల‌శాలువాలు, ముఖానికి ముసుగు,  చేతుల్లో ఏకె 47 తుపాకీలు ప‌ట్టుకున్న ఆరుగురు మ‌నుషులు  విమానం మధ్యలోకి వచ్చి "సైలెన్స్‌..ఎవ్వ‌రూ క‌ద‌లొద్దు. మేము కాశ్మీర్ తీవ్రవాదులం; ఈ విమానాన్ని హైజాక్ చేసాము.  కాశ్మీర్  జైల్లో నిర్భంధించిన పాతిక మంది మా కాశ్మీర్ తీవ్ర‌వాదుల్ని భార‌త ప్ర‌భుత్వం విడిచిపెడితేనే మీరు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌తారు.. అంత‌వ‌ర‌కూ నోరుముసూకొనీ కూర్చోండి".. అంటూ గ‌ట్టిగా మైకులో చెప్పారు.

    త‌రువాత అందులో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు పైల‌ట్లు ఉన్న కాక్‌పిట్‌లోకి వెళ్ళారు.

    అంద‌రూ అది ఎక్క‌డ దిగిందోన‌నీ ఆందోళనతో అద్దాల్లోంచి చూడ‌సాగారు. ఎదురుగా పెద్ద కొండ‌.. ఏదో బ్రిటిష్ కాలం నాటి పాత ఎయిర్ బేస్ లా ఉంది.

    దూరంగా వ‌రి చేలు,  కొబ్బ‌రి చెట్లు, డీజేల్లో పెద్ద సౌండ్‌తో అర్థం కాని తెలుగులో పాట‌లు వినిపిస్తూన్నాయంటే బ‌హుశా ఆంధ్ర‌లాగే ఉంది అన్న అభిప్రాయానికి వచ్చారు ;

    ఇంత‌లో ఒక ఉగ్ర‌వాది "24 గంట‌ల్లోగా ఆ టెర్ర‌రిస్టుల్ని జైలు నుంచి వ‌దిలెయ్యాల‌నీ,  లేక‌పోతే విమానాన్ని పేల్చేస్తామ‌నీ"  ఎవ‌రితోనో గ‌ట్టిగా మాట్లాడుతుండడం   వినిపించింది. బ‌హుశా కేంద్ర  ప్ర‌భుత్వ అధికారుల‌తో  మాట్లాడిన‌ట్లు ఉన్నాడు.

    ఆ త‌రువాత న‌ర‌కం మొద‌లైంది. బాత్‌రూమ్‌కి వెళ్ళాల‌న్నా  వాళ్ళ‌కి  చెప్పి వెళ్ళ‌వ‌ల‌సి వ‌స్తోంది. కాక‌పోతే టెర్ర‌రిస్టులు మంచి వాళ్ళ‌లా ఉన్నారు. అంద‌రికి ప్రతీ గంటకు  కాఫీలు ,  టీలు,  టిఫిన్లు వాళ్ల  సీట్ల ద‌గ్గ‌రికే  తెచ్చి ఇస్తున్నారు.

    అప్ప‌టికే చాలా మంది వాళ్ళిచ్చిన టిఫిన్లు తింటూ సెల్‌ఫోన్లో వాళ్ళ వాళ్ళ‌తో మాట్లాడుకుంటూ బిజీ అయిపోయారు.

    అలా ఒక రాత్రి గ‌డిచింది. హైజాక‌ర్లు గంట గంట‌కూ కేంద్ర ప్ర‌భుత్వ అధికారుల‌తో సెల్‌ఫోన్ల‌లో  బేరాలు సాగిస్తున్నారు.

    అప్పుడు ప్ర‌యాణికుల్లో ఒక‌త‌ను ``బాబూ! అంత‌సేపు సెల్లో మాట్లాడితే బోలెడు బిల్లుతో పాటు ఛార్జింగ్ అయిపోతుంది.

    ఛార్జింగ్ చేసుకోవ‌డానికి విమానంలో  బేట‌రీ కూడా అయిపోతున్నట్లుంది; కాబ‌ట్టి కొంచెం పొదుపుగా మాట్లాడండి” అన్నాడు..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/NJJ9nTrkZFg

    11 min
  • పరోపకారం ఇదం శరీరం | Paropakaram Idam Sariram | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    పరోపకారం ఇదం శరీరం

    రచన: Ch. ప్రతాప్

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఒక ఊరిలో ఒక బిచ్చగాడు నివసిస్తుండేవాడు. పొద్దస్తమానం ఆ ఊరి వీధుల్లో తిరుగుతూ, దేవాలయాల దగ్గర నిలబడి బిచ్చమెత్తుకుంటూ పొట్ట పోషించుకుంటుండేవాడు. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకొని దానిని అక్కడ ఖర్చు పెట్టేసుకొని, సాయంత్రాలు రిక్త హస్తాలతో ఇంటికి తిరిగి వెళ్ళేవాడు. వాడి భార్యకు బిచ్చగాడితో పడక, తాను జీవిస్తున్న ఈ జీవితం నచ్చక పిల్లల్ని తీసుకొని చాలా కాలం కిందనే తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏకాకి అయిన వాడు ఊరి చివర వున్న ఒక ఖాళీ స్థలంలో వేసుకున్న పూరిపాకలో ఏక్ నిరంజన్ లా నివసించసాగాడు.

    రాను రాను భిక్షాటన భరించరానిదిగా వాడికి తయారయ్యింది. తాను ఏ జన్మలో ఏ పాపం చేసాడో, ఈ జన్మలో బిచ్చం ఎత్తుకొని బతకాల్సి వస్తొంది. ఉదయం లేచింది మొదలు ఇష్టంగా దానం చేసే వాళ్ళు బహు తక్కువ. అధిక శాతం తిట్టుకుంటూ, చీదరించుకుంటూ, శాపనార్థాలు పెడుతూ బిచ్చం వేస్తుంటారు. ఎప్పటికి ఈ జన్మ మారుతుందా అని అనుకుంటూ వుంటాడు.

    ఒకసారి ఆ ఊరి రామాలయంలో ఒక తపసంపన్నుదైన సాధువు వచ్చారని, ప్రజల సమస్యలకు తన తప శక్తితో సూచనలు ఇవ్వడం లేదా వాటిని సత్వరమే పరిష్కరించడం చేస్తున్నారని విన్నాడు.

    ఆ సాధువు వేంచేసిన రామాలయానికి ఒక రోజు ఆ బిచ్చగాడు వెళ్ళాడు. ఎందరో ప్రజలు నిరాశ నిస్పృహలతో, దుఖంతో, కోపంతో, ఆవేశంతో ఆ సాధువుని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఆ సాధువు ఏం మంత్రం వేస్తున్నారోగాని, వారందరూ తమ సమస్యలను మర్చిపోయి, ఆనందంగా అక్కడి నుండి తిరిగి వెళ్లడం ఆ బిచ్చగాడు కళ్ళారా చూశాడు.

    ఆ సాధువు ప్రజలకు ఏ మాయ చేస్తున్నారో అర్ధం కావడం లేదు. కొండంత దుఖంతో వెళుతున్నవారు అంతే ఆనందంగా తిరిగి వస్తున్నారు.వాళ్ల చేతిలో డబ్బు లేక బంగారం లేక వెండి లేదా ఇతర విలువైన వస్తువులు లేవు. కాని ఆనందంగా ఎలా తిరిగీ రాగలుగుతున్నారు ? ఇవన్నీ ఆలోచించి, బిచ్చగాడు కూడా సాధువు వద్దకు వెళ్లి అక్కడ ఏమి జరుగుతుందో చూడాలని అనుకున్నాడు. తన లాంటి దుఃఖ: పీడితులైన వ్యక్తులకు కూడా ఆ సాధువు నుండి ఉపశమనం లభిస్తుందా అన్న విషయాన్ని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు.

    సాధువు ని కలవడానికి నడిచాడు. సాధువు ఉన్న చోట చాలా పొడవైన వరుస ఉంది, కాబట్టి బిచ్చగాడు కూడా వరుసలో వచ్చాడు. తన వంతు కోసం వరుస లో నిరీక్షించడం మొదలుపెట్టాడు. అతని వంతు వచ్చి సాధువు దగ్గరికి చేరుకున్నాడు.

    అతను సాధువు తో ఇలా అన్నాడు, “మహాశయా, నేను చాలా పేదవాడిని నాదనుకునే ఒక్క వస్తువు నా దగ్గర ఒక్కటి కూడా లేదు.. నా జీవితాన్ని నడపడానికి కూడా నేను ఇతరులను అడ్డుకోవాలి, ఫలితంగా వారి నుండి ఎన్నో చీదరింపులు, ఛీత్కారాలు ఎదుర్కోవలసి వస్తొంది. ఇప్పుడు మీరు చెప్పండి, నేను నా జీవితాన్ని ఎలా మెరుగ్గా జీవించగలను ?”

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/4d8st8RZOKQ

    6 min
  • పాణిగ్రహణం - 8 | PaniGrahanam - 8 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    పాణిగ్రహణం - 8

    రచన: భాగవతుల భారతి

    (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    "హలో! 'పాణిగ్రహణం కన్స్ ల్టెన్సీ'"

    "అవును.. మీరూ మేమూ చుట్టాలమే.. నేను సమీర్ తండ్రి ని"

    డైరెక్టు గా ఫోన్ చేస్తే.. వెటకారంగా ఉంటుంది. ‘మా విషయాల్లో మీకేంపనీ?’ అంటారు. అందుకే విరూపాక్ష, దీని గురించి వేరే వారిచేత చెప్పించాడు.. సమీర్ తల్లిదండ్రులు వచ్చారు ముగ్గులోకి..

    "సమస్య ఏంటి?"

    "రెండేళ్ళనుండి కోర్టులచుట్టూ తిరగలేక చస్తున్నామ్. కేసులు కోర్టుల్లో పడితే ఓ పట్టాన తెములుతాయా ? ఫీజు ఇచ్చుకుంటాం.. ఉపాయం చెబుదురూ! "

    "విషయం ఏంటిట? "

    గంటసేపు జరిగిందంతా చెప్పనిచ్చాడు.

    "నేనడిగింది.. ఎందుకలా జరిగింది? భవిష్యత్తు లో ఆమె ఏంచేయాలనుకుంటోంది అనీ?"

    "మా పిల్లలు మాకేం చెప్పరు. మా పిల్లలే కాదు.. ఏ పిల్లలైనా అంతే ఉన్నారు.

    చదువులు వచ్చినాయ్. బయటి ప్రపంచం తెలీటల్లా.. సర్దుబాట్లు తెలీటల్లా.. లేక మనమే చెప్పట్లేదో!? చెప్పేంత టైం ఏదీ? వినేంత టైం ఎవరికీ? చదువూ!.. చదువూ!.. చదువూ!.. తర్వాత కెరీర్ ముఖ్యం అంటున్నారు."

    "మర్కట కిశోర న్యాయమా?

    మార్జాల కిశోర న్యాయమా?

    అన్నట్లుంది.. నేటిపిల్లలతో.. "

    "అంటే?"

    "మర్కటం అంటే కోతి.. మార్జాలం అంటే పిల్లి. కిశోరం అంటే పిల్ల.. కోతి చెట్ల మీంచి దూకేటప్పుడు.. కోతిపిల్ల.. కోతి పొట్టను గట్టిగా పట్టుకునే ఉంటుంది. పట్టుకోకపోతే పడిపోతుంది. అక్కడ భద్రత, బాధ్యత అంతా కోతిపిల్లదే. అదే పిల్లుల విషయంలో పిల్ల బాధ్యత తల్లిదే. నోటితో పట్టుకునే ఏడు సందులు తిప్పుతుందిట. కాబట్టీ మనం పిల్లల్ని పట్టుకోవాలో? మనల్ని వాళ్ళే పట్టుకోవాలో?.. "

    "సమస్యంతా అక్కడే వస్తోంది"

    వారంరోజులు సమీర్ ఫామిలీ తో టచ్ లోనే ఉండి.. మనస్థత్వాలూ.. మాటతీరూ పరిశీలన చేసి.. చర్చలు జరిపాక..

    "సమీర్ భార్య ఫోన్ నెంబర్ ఇవ్వండీ"

    వారం తర్వాత.. సమీర్ తండ్రి ఫోన్ చేసాడు."ఏం తేలింది?"

    "మీలోనే లోపం ఉన్నట్లు తేలింది. "

    "అదెలా?"

    "సమీర్ భార్యకి తండ్రిలేడు. ఏమిటో! ఈమధ్య తండ్రి లేని సంసారాలే ఎక్కువవుతున్నాయి. విడిపోతున్నారో.. దేవుడి దగ్గరకే పోతున్నారో గానీ, సింగిల్ పేరెంటెడ్.. కుటుంబాలు.. ప్చ్.. ఇక మీ విషయానికి వస్తే.. తల్లి ఆడపిల్లలిద్దరినీ కష్టపడి పెంచింది. చదువూ చెప్పించింది. ఇవన్నీ మీకు తెలుసు కదూ! "

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/7i-lMpkv-MY

    9 min
  • వినిపించని రాగాలు 8 | Vinipinchani ragalu 8 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వినిపించని రాగాలు 8

    రచన : గొర్తి వాణిశ్రీనివాస్

    (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    అర్ధరాత్రి.. హోటల్ నిర్మానుష్యంగా ఉంది. క్యారిడార్ లో ఎవరూ లేరు. ఒకరిద్దరు స్టాఫ్ వున్నా వాళ్ళు నిద్రలో జోగుతున్నారు. రిసెప్షన్ లో కూడా ఎవరూ లేరు. మెయిన్ గేటుకు చాలా దూరంగా ఉంది.

    నేను అక్కడికి పరిగెత్తాను. గేటు మూసి ఉంది. దానికి తాళం వేసి గూర్ఖా కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నాడు. గేటు పైకెక్కి దూకాను. కుక్కలు భౌ భౌ మన్నాయి అవేం పట్టించుకోకుండా అక్కడ్నించి పారిపోయాను. చిమ్మ చీకటి. ఎంతదూరం వెళ్ళానో తెలీదు.

    ఆ కంగారులో ఫోన్ తీసుకురావడం మర్చిపోయాను. నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పే అవకాశం లేదు. రోడ్డు పక్కన ఒక పార్క్ కనిపించింది. గేటు తీసుకుని అందులోకి వెళ్ళాను. ఆయాసంతో నిలబడలేక పోయాను. చెట్లకింద గట్టు మీద కూర్చున్నాను. మనసంతా వికలమైపోయింది. శరీరం నీరసించింది.

    అవమాన భారం దహించేస్తోంది. నమ్మకద్రోహం వెక్కిరిస్తోంది. ఇంత నయవంచనా? ఇన్ని ఎత్తులా? ఇన్ని వ్యూహాలా. పెద్దవాళ్ళని రిస్క్ లో పెట్టి ఈ పెళ్లి తెలివిగా జరిపించుకున్నాడు.

    ఎవరికీ వీసమెత్తు అనుమానం కూడా రాలేదు.

    వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఇందులో పాత్రధారులయ్యారా?. పెళ్లిలో అతని స్నేహితులు మాత్రమే ఉండేలా వ్యూహం రచించిన కుమార్ మనసులో ఇంత కుట్ర దాచుకుని నవ్వుతూ నటించాడా? మై గాడ్! ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో అర్ధంకాని పరిస్థితి.

    కుమార్ తన ప్రాణం కోసం నన్ను పావుగా వాడుకుంటున్నాడు. దీన్ని ప్రేమంటారా?

    శోభనం పెళ్లి కూతురు ముస్తాబులో నిర్మానుష్య ప్రదేశంలో వుండకూడని చోట, వుండకూడని పరిస్థితుల్లో అగమ్యగోచరంగా నేను. వంచించే మనుషులు చాలా జాగ్రత్తగా వుంటారన్నమాట. ఇతరులకి ఏమాత్రం అనుమానం రాకుండా.

    కీచురాళ్ల అరుపులు, పక్షుల రెక్కల చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. నా గుండె చప్పుడు నాకే వినబడుతోంది. విధి ఇంతలా నా జీవితంతో ఆడుకుంటుందని అనుకోలేదు.

    ఇది కుమార్ బుర్రలో పుట్టిన ఆలోచనా, లేక జాతకాల మధు వ్యూహ రచనా ఎంత ఆలోచించినా అర్ధంకాలేదు.

    ఎందుకంటే అప్పుడు కుమార్ ప్రేమతప్ప నాకు ఏవీ కంటికి కనిపించలేదు. అది మంచికో చెడుకోగానీ నా ఆశ, ధ్యాస కుమార్ అయ్యాడు.

    ఎవరో తాగుబోతులు వస్తున్నారు. నేను చెట్టు చాటుకి వెళ్లి దాక్కున్నాను. వెళ్ళేవాళ్ళు చెట్టుదగ్గర ఆగిపోయారు. నేను కనపడకపోయినా నానుంచి వచ్చే మల్లెపూలు, సెంటు వాసనకి ఆగి చుట్టూ చూసారు. నేను ఇంకా వెనక్కి వెళ్లి మరో పొదవెనక చేరాను. వాళ్ళు అదంతా తిరిగి చూశారు. కాసేపు చూసి ఎవరూ కనబడకపోవడంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. 

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/ve_LWZON2a8

    15 min
  • ఓం నమః శివాయ | Om Namassivaya | Telugu Prayer | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఓం నమః శివాయ 

    రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ 

    అతడే శివుడు

    ఆది మధ్యాంత రహితుడతడే
    అతడే ఆర్త త్రాణ పరాయణుడు
    ఓంకార రూపుడతడే

    అతడే హరుడు
    భవ భయ హరుడతడే
    అతడే  బంధ విమోచకుడు
    నటరాజు అతడే


    అతడే రుద్రుడు
    ప్రళయ కారకుడతడే
    అతడే సర్వ వ్యాపకుడు
    మహేశ్వరుడతడే


    అతడే కారకుడు
    కాలుడు అతడే
    అతడే లింగాకారుడు
    శితికంఠుడతడే

    అతడే అర్థ నారీశ్వరుడు
    అమృత హృదయుడు అతడే
    అతడే దేవ దేవుడు
    వసురూపుడతడే


    అతడే ఆది భిక్షువు
    మహాయోగి అతడే
    అతడే లోకేశ్వరుడు
    యతి రాజు అతడే

    ఓం నమః శివాయ

    ఈ శివ స్తుతి మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ శివ స్తుతిని యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/jvrLQJT_zUw

    1 min
  • మా ఇంటి కొన దర్వాజ | Ma Inti Kona Darwajaa | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    మా ఇంటి కొన దర్వాజ

    రచన: లక్ష్మి మదన్ 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    మా ఇంటి కొన దర్వాజ ఎంతో రాజసంగా ఉండేది. మహా రాణి లా ఠీవిగా అంత ఎత్తున నిలిచి ఉండేది. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళే వాళ్లంతా తనని దాటుకునే కదా వెళ్ళాలి. అందరూ తన అనుమతితో ఇంట్లోకి వెళుతున్నారని తలిచేది.. అయినా అది నిజమే కదా!

    ఇంటి వారిని మొత్తం తనే చూసుకునేది. ఇంట్లో అంతరంగిక విషయాలు బయటకు పొక్క కుండా ఒక హద్దులా ఉండేది. ఇక వీధిన వెళ్లే వాళ్లందరినీ గమనిస్తూ ఉండేది. వెళ్ళిన వాళ్ళు మళ్లీ ఇంటికి చేరుకున్నారా లేదా అని తపన. అందరి బాధ్యత తనదే అన్నట్లు చూసేది. వెళ్లే వాళ్ళు ఒక సారి మా దర్వాజను పలకరించి నట్లు చూసి వెళ్లే వాళ్ళు. మా వీధిలో బండ్లు, సైకిళ్ళు, ఎప్పుడో ఒక సారి స్కూటర్ లు వెళ్ళేవి.. ఎక్కువగా నడిచి వెళ్లే వారే. నడచి వెళ్లే వాళ్ళంటే బెంగ లేదు..వాహనాల పై పోయే వారంటేనే భయం. ఏం విపరీత పోకడలు పోతారో అని.

    మా అరుగుల మీద తీరిక వేళలో అమ్మలక్కలు కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళు. వారి ముచ్చట్లు అన్నీ విని తెగ మురిసి పోయేది. కష్టాలు చెప్పుకుంటే కన్నీరు కార్చేది. వాడ కట్టులో ఆడ పిల్లలు పెళ్లి చేసుకుని అత్త వారింటికి పోతుంటే ఎంత దుఖ పడేదని.  పిల్లలు ఆడుకుంటే పడతారని ఒకటే ఆరాటం ...అన్నీ తనకే కావాలి మరి.

    పాపం ! ఎండొచ్చినా వానొచ్చినా అట్లే నిలబడాలి. అయినా బాధ లేదు..ఇది నా బాధ్యత అనుకునేది. ఎప్పుడో పెళ్లిళ్లు లేదా ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు రంగులు వేస్తే..ఇక దాని ఆనందం చెప్పలేము. పట్టు బట్టలు పెట్టినట్లు పొంగి పోయి "శత మానం భవ" అని దీవెనలు ఇచ్చేది.  పచ్చని మామిడాకు తోరణం.. బంతి పూల దండలతో అలంకరిస్తే అబ్బ.. వాడ కట్టుకే నిండుదనం వచ్చేది పెళ్లి కూతురిలా!

    ఇక నేను బయటకి పోతుంటే ...జాగ్రత్త అని చెప్పినట్లే తోచేది. ఇంటికి రావడం ఆలస్య మైతే కోపంగా చూసేది...పాపం ఎంత సేపు ఎదురు చూసేదో.....మా నాన్న రాగానే నిశ్చింత గా ఉండేది...ఎందుకంటే అందరి కన్నా ఆలస్యంగా వచ్చి తలుపులు మూసే వారు....ఇక రాత్రి కొంచెం విశ్రాంతి...అయినా మధ్య మధ్యలో చూస్తూనే ఉండేది.. దొంగలో..కుక్కలో గోడ దూకుతారని!

    అలా అందరినీ కంటికి రెప్పలా చూసే మా కొన దర్వాజ ఇప్పుడు నిస్తేజంగా ఉంది...మేము ఎవ్వరము అక్కడ లేమని...ఒంటరిగా వదిలి వచ్చాము మేమంతా!  మేము ఎలా ఉన్నామో అని తపన. ఇక వాడ కట్టులో నడిచే జనం లేరు..అందరికీ కార్లు..బైక్ లు..ఇక మా దర్వాజ తో ఎవరు ముచ్చట పెడతారు... అది జాగ్రత్త లు చెప్తే ఎవరు వింటారు. మున్సిపాలిటీ వాళ్ళు వేసిన రోడ్డు తో అరుగులు కూరుకు పోయి..ఇప్పుడు అరుగులే లేవు. ముచ్చట పెట్టే నారీ మణులు లేనే లేరు...

    ఈ సారి మా ఊరు పోతే పలకరించి దాని కన్నీళ్లు తుడిచి వస్తాను...మాలో ఒకటిగా ఉండి పోయిన మా ఇంటి కొన దర్వాజా! నిన్ను మరచి పోలేదు మేము.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/-JeMFe3wCGg

    4 min
  • మమతల మధువు ఎపిసోడ్ 2 | Mamathala Madhuvu Episode 2 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    మమతల మధువు ఎపిసోడ్ 2

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఆదిత్య పంపిన ప్రేమ వుత్తరాలను, ఆది డైరీనీ.. సాంతం చదవటం పూర్తి చేసి.. గౌరీ వాల్ క్లాకు చూచింది. సమయం రాత్రి ఒంటిగంట.

    'పది వుత్తరాలను చదవడంలో మునిగిపోయాను. సమయం యింత గడిచిందన్న విషయమే తెలీలేదు. ప్రతి వుత్తరాన్ని ప్రేమ ఎంతో చక్కగా వ్రాసింది. తన బావకు తనమదిలో వున్న అభిప్రాయాన్ని నిగూఢంగా తెలియజేసింది. తను దూరంగా వున్నా.. వాడి వున్నతిని శ్రేయస్సును, యశస్సునూ కోరుతూ వుంది. యిలాంటి పిల్ల నాకు కోడలు కాబోతూ వుందంటే అది నా అదృష్టం..' సంతోషంతో మనస్సున అనుకొంది గౌరి.

    పుత్తరాలన్నింటినీ కవర్లో వుంచి టేబుల్ మీద పెట్టి.. లైట్ ఆర్పీ.. బెడ్లైట్ ఆన్ చేసి గౌరి పడుకొంది. మనస్సు నిండా ప్రేమ.. ఆదిత్యల గురించిన తలపులు.. వారి భావిజీవితాన్ని గురించి ఏవేవో మధురమైన వూహలు.. వారికి వివాహం జరిగినట్లు సంవత్సరం లోపల కవలపిల్లలు పుట్టినట్లు.. తన వారంతా ఎంతోఆనందిస్తూ వున్నట్లు.. చక్కటి వూహాజగత్తులో మురిసిపోతూ.. నిద్రమ్మ ఒడిలో ఒరిగిపోయింది గౌరి.

    కాలింగ్ బెల్ మ్రోగడంతో.. తొట్రుపాటున మోల్కొంది గౌరి. అప్రయత్నంగా ఆమె చూపులు ఆందోళనతో గోడ గడియారాన్ని చూచాయి. గంట నాలుగు. వేగంగా వెళ్ళి ఆత్రుతతో తలుపు తెరిచింది. ఎదురు గుండా భీమారావుగారు నిలబడివున్నారు.

    “అమ్మా.!.. భయపడ్డావా?..” గౌరీ ముఖంలోకి నిశితంగా చూస్తూ అడిగాడు.

    “లేదు మామయ్యా!.. వారు వచ్చారనుకొన్నాను.” సిగ్గుతో తలదించుకొంది గౌరి.

    “యీ సాయంత్రానికి వాడు వస్తాడమ్మా!.. యిప్పుడు నేను వైజాగ్ బయలుదేరుతున్నాను. నీతో చెప్పి వెళ్ళేదానికి నిన్ను లేపాను.”

    "యిప్పుడే బయలుదేరుతున్నారా!..”

    “అవునమ్మా!.. వెళ్ళాలి. బయలుదేరుతున్నాను.”

    భీమారావుగారి పలుకుల్లో ఎంతో గంభీర్యం నిండి వుంది.

    క్షణం సేపు వారి ముఖంలోకి చూచి.. “అలాగే మామయ్యా!.. వెళ్ళిరండి. జాగ్రత్త.” అంది గౌరి.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/QcU8lJS0T1s

    16 min
  • సంఘం చెక్కిన చిత్తరువు | Sangham Chekkina Chittaruvu | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సంఘం చెక్కిన చిత్తరువు

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఆశతోనే కలిగేది జననం. ఆశతోనే సాగేను జీవితం. పొద్దు తిరిగిన వయస్సులో వుండవలసిన ఆశ ఎవరికైనా ఒక్కటే.. ఆత్మీయుల సన్నిధి.. ఆత్మానందం.. శాంతి.

    అది అనాధల ఆశ్రమం. నిర్వాహకురాలు ‘పావని మాత’. అందరూ ఆమెను ఆ పేరుతొ పిలుస్తారు. కానీ ఆమె అవివాహిత. ఆశ్రమవాసులు ఆమెను అలా గౌరవంగా పిలుస్తారు. ఆశ్రమానికి ‘మాతా శరణాలయం’ అని పేరు.

    బాంబే నుంచి వచ్చి.. ఐదేళ్ళ క్రిందట ఆ ఆశ్ర మాన్ని స్థాపించింది. ఆ భవన నిర్మాణానికి పది హేను లక్షలు ఖర్చు పెట్టింది. నాలుగు ఎకరాల స్థలంలో భవంతి.. ముప్పై గదులతో రెండు అంతస్తులతో ఆ ప్లాట్ నైరుతీ భాగంలో ఆ భవన నిర్మాణం జరిగింది.

    సహృదయులైన.. కొందరు పావనిని కలసి.. విరాళాలను యిచ్చారు. మూడు సంవత్సరాల క్రిందట.. ప్రాధమిక విద్యా కేంద్రాన్ని కూడా ఆ ఆవరణలో నిర్మించింది. దాదాపు నూటయాభైమంది పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారు.

    ఆశ్రమం చుట్టూ రకరకాల చెట్లు, పూలమొక్కలు నాటించి.. ఆశ్రమ వాసులను ఎంత ఆదరాభిమానాలతో చూచుకొంటుందో.. అదే రీతిగా వాటి సంరక్షణను చేస్తూవుంది పావని. ఆశ్రమవాసులు రెండువందల మంది మాత ఆధ్వర్యాన అన్ని పనులు నిర్వర్తిస్తూ ఆనందగా వుంటారు.

    అక్కడ ఉన్నవారికి.. వారి గత జీవిత చేదు జ్ఞాపకాలు తప్ప.. వేరే చింతలూ లేవు.

    మాయదారి మనస్సు గతాన్ని మరువలేదుగా!.. ఈ సమస్య అక్కడవున్న వారికే కాదు, పావనికీ వుంది. మనస్సుకు మరిచే గుణం వుంటే.. మనస్సుల్లో ఎలాంటి అలజడి వుండదుగా!.. కాని అలాంటి శక్తీ.. మనస్సుకు లేదే!..

    &&&&&

    “సార్!.. నమస్కారం!.. ”

    “ఎవరండీ మీరు?.. ”

    “నేను మాతా ఆశ్రమం నుంచి వచ్చాను. నాపేరు రాంబంటు. మా మాత పావనిగారి ఆరోగ్యం మూడు రోజులుగా సరిగా లేదు. హాస్పిటల్ కు వెళదామంటే వారు నిరాకరిస్తున్నారు. మీరు వచ్చి మా మాతను చూడాలి సార్ !.. ” కన్నీటితో కోరాడు రాంబంటు.

    “మీ మాత పెరేమిటీ?.. ” ఆశ్చర్యంతో అడిగాడు డాక్టర్ శ్రీరామ్.

    “పావనీ మాత.. ” చెప్పాడు రాంబంటు.

    శ్రీరాం.. కొన్ని క్షణాలు ఆలోచించాడు. మనస్సులో ఏదో సందేహం.. అనుమానం.. ఆవేదన.. నిట్టూర్చి.. “పదండి.. ” కుర్ఛీ నుండి లేచాడు శ్రీరామ్.

    రాంబంటు ముందు.. వెనుక శ్రీరామ్ బయలు దేరారు. తన కార్లో అరగంటలో ఆశ్రమాన్ని చేరారు.

    వారంరోజుల క్రిందట ఆవూరికి.. డి. ఎం. ఓ. గా శ్రీరాం వచ్చాడు ప్రభుత్వ హాస్పిటల్ కు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/YLVlgMUoSwU

    16 min
  • కుక్క తెలివి | Kukka Thelivi | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com

    కుక్క తెలివి

    రచన: Ch. ప్రతాప్

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఒక అడవిలో ఒక కుందేలు వుండేది. దానికి గంపెడు పిల్లలు వున్నాయి. ప్రతి రోజు ఉదయం వాటికి తిండి కోసం కుందేలు బయటకు వెళ్ళేది. బయలుదేరేముందు దాని పిల్లలకు జాగ్రత్తగా వుండమని ఎన్నో సూచనలు చేసేది. ఎవరు పిలిచినా బయటకు రావొద్దని గట్టిగా నిర్దేశించింది. అయితే ఇల్లు విడిచి వెళ్ళినప్పటి నుండి తిరిగి వచ్చే వరకు తన పిల్లలు ఎలా వున్నాయో అని ఆ కుందేలు ఆందోళన పడుతూ వుండేది.

    అదే అడవిలో ఒక బలిష్టమైన అడవి కుక్క వుండేది. ఒకరోజు ఆ కుక్క తిండి కోసం వెదుకుతూ కుందేలు ఇంటివైపు వచ్చింది. ఆ ఇంట్లో ఆడుతూ పాడుతూ సందడి చేస్తూ ఆడుకుంటున్న కుందేలు పిల్లలు దానికి కనిపించాయి. మొదట్లో వాటిని ఒక్కొక్కటిగా తినేయాలని కుక్కకు ఆశ పుట్టింది. అయితే వాటి అమాయకత్వం, చిలిపితనం, అన్ని పిల్లలు కలిసి మెలిసి ఆడుకుంటుండడం చూసిన ఆ కుక్క కు వాటిపై జాలి వేసింది. ఏ మృగమో లేక, వేటగాడో వచ్చి వాటిని వేటాడి తీసుకుపోవచ్చునన్న ఆలోచనతో ఈ ఇంటి బయట ఆ పిల్లలకు కాపలాగా వుండసాగింది.

    సాయంత్రం తల్లి కుందేలు వచ్చేక కుక్క తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయేది.

    ఒక రోజు కాస్త ముందుగా ఇంటికి వచ్చిన కుందేలు ఇంటి బయట కూర్చున్న కుక్కను చుసి భయపడింది. తన పిల్లలను చంపడానికే కుక్క వచ్చిందన్న భయంతో నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ దాని దగ్గరకు వెళ్ళింది కుందేలు.

    తనను చూసి భయపడుతున్న కుందేలును చూసి కుక్క "ఏం భయపడవద్దు. నీ పిల్లలను చంపడానికి రాలేదు. పైపెచ్చు వాటిని ఆ జంతువు తినకుండా రోజూ కాపాడుతున్నాను. ఈ పిల్లలు నాకు పిల్లలే " అని చెప్పింది.

    ఆ మాటలకు కుందేలుకు కొండంత ధైర్యం వచ్చింది. తేలికైన మనసుతో కుక్క పక్కన కూర్చోని తాను తెచ్చిన ఆహారంలో కొంత భాగం పెట్టింది. అలా ఆనాటి నుండి కుక్క, కుందేలు మంచి స్నేహితులయ్యారు.

    కుందేలు కుటుంబం పై ఒక నక్క కళ్ళు పడ్డాయి. దాదాపుగా అప్పుడే ఎదుగుతున్న ఎనిమిది కుందేలు పిల్లలు. ఒక నెల రోజుల వరకు తన తిండికి ఏమీ ఢోకా ఉండదు. అయితే ఆ ఇంటికి కుక్క కాపలా వున్నంత కాలం తన పాచికలు అక్కడ పారవు. అందుకే కుందేలు పిల్లల్ని తినేందుకు ఒక పథకం వేసింది. దాని ప్రకారంగా ముందుగా కుక్కతో స్నేహం చేసింది. ప్రతీ రోజు పొద్దునే కుక్క దగ్గరకు వచ్చి మంచి మంచి కబుర్లు చెప్పసాగింది. అడవిలో తనకు అడపా దడపా దొరికే ఆహారాన్ని కూడా కొంచెం కొంచెంగా కుక్కతో కలిసి పంచుకో సాగింది. అలా నక్క , కుక్క కొద్ది రోజులలోనే మంచి స్నేహితులయ్యారు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/SXIEg6gcjcM

    6 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world