
Sign up to save your podcasts
Or


(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
పాత చింతకాయపచ్చడి లాంటి కథ
"హలో సుబ్రహ్మణ్యం బాగున్నావా.. పాత చింతకాయ పచ్చడి రుచి అదిరిపోద్ది. పంపమంటావా?”.
''ఎవరు మాట్లాడేది??”
"నేనురా.. రామచంద్రపురం నుండే శివరామకృష్ణయ్యని మాట్లాడుతున్నాను. మీ ఇంటి దగ్గర పని చేసే ఆ బాగా పొడవాటి కుర్రాడు పొడుగురాజును పంపు. వాడిని అటక ఎక్కించి, పచ్చడి జాడి దింపించి, పాత చింతకాయ పచ్చడి వాడి చేతికిచ్చి నీకు కూడా పంపుతాను."
"అరెరే.. వాడు నిన్ననే మానేశాడు రా''
"ఏడ్చావు.. ఆ సంగతి ముందుగానే చెప్పొచ్చు కదా. ఫోన్ పెట్టేయ్.. కాల్ వేస్ట్......"
"మరి పచ్చడి ఎప్పుడు పంపుతావ్. అసలు నాకు తెలియకుండా మీ ఇంట్లో ఆ పచ్చడి ఎలా ఉంది''
"ఆపు నీ వెధవ అనుమానం. నీకు తెలియకుండా ఉండబట్టే ఇన్నేళ్లు ఉంది. ఇదిగో ఎల్లుండి మా కొడుకులు, కోడలు, కూతుళ్లు, అల్లుళ్లు.. వాళ్ల వాళ్ల పిల్లలు అందరూ వస్తున్నారు. అందరం తిన్నాక మిగిలితే పంపుతాలే వింటున్నావా... '
"మళ్లీ ఏదో అరకాసులో తిరకాసు పెడుతున్నావు. వాళ్లంతా వచ్చి రెండు నెలలే కదా అయింది. మళ్ళీ ఎలా వస్తారు?".. అనుమానం తీరక అడిగాడు సుబ్రహ్మణ్యం.
"అదంతే.. నాకు చూడాలని ఉంది. పావులు కదుపుతున్నాను కదా.. వాళ్ళు వచ్చేస్తారు."
ఫోన్ పెట్టేసాడు శివరామకృష్ణయ్య.
********
"వెన్నెల్లో పిండారపోసినట్లు, ఆ పిండితో చేగోడీలు చేసుకుతిన్నట్టు నీ ముఖం ఎంత కరకరలాడుతుంది.. సారీ.. కళకళలాడుతుంది. బాగుందా నా కవిత్వం.. లే.. తెల్లవారబోతుంది.”
"కిర్రు కిర్రు కాలి చెప్పుల్లా
కిసుక్కున నవ్వే నీ నవ్వు శబ్దం
టెంక లేని తాటి పండులా
పళ్ళు లేని నీ నోటి అందo''
“వహ్వా.. భలే కుదిరిందోయ్ ప్రాస.. కాత్యాయనీ నేను ఎన్ని కవితలు చదివినా నీకు మెలుకువ రాదేమిటి?''.. భార్యను లేపుతూ అన్నాడు శివరామకృష్ణయ్య.
అతను యవ్వనంలో శ్రీకృష్ణదేవరాయలు అంత దిట్ట. అన్ని పత్రికలు అవి బ్రతికినన్నాళ్లు అతని కవిత్వాన్ని ప్రచురించాయి.. తన ఫోటోనే కాకుండా భార్య కాత్యాయని ఫోటోతో సహా. అతని కవిత్వ గంధం లో కాస్తంత సుగంధం ఆమెకు కూడా అంటుకుంది... అలా వాళ్ల కవిత్వాలు ఆ ఇద్దరు ఫోటోలతో సహా మారుమోగిపోయేవి అప్పట్లో.. ఇదంతా మూడు పుష్కరాలు నాటి మాట. ఇప్పుడు అతనికి తొమ్మిదిపదులు ఆమెకు పది తక్కువ.
"లేచావా కూర్చో.. మన వాళ్ళందరినీ నీకు మళ్ళీ చూడాలని ఉందా?" ప్రశ్నించాడు.
"మీకు మాత్రం ఉండదా.. మీ ఆశ కాకపోతే వాళ్లు మళ్లీ ఇప్పుడు ఎలా వస్తారు?''
"ముందు నువ్వు మంచం దిగు.. కొంపతీసి నడుంకాని పట్టేసిందా మళ్లీ?''
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
మమతల మధువు ఎపిసోడ్ 1
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి ధారావాహిక మమతల మధువు ప్రారంభం
“అమ్మా!.. నీవు వ్రాసిన వుత్తరం చేరిందని ఫోన్లో చెప్పాను. కానీ యీ నా పదిహేను నెలల జీవితాన్ని గురించి ఫోన్లో వివరంగా మాట్లాడలేక పోయానమ్మా!..” అందుకే యీ లేఖ వ్రాస్తున్నాను.
నాకు నీవు చిన్నతనంలో రోజూ చెప్పేదానివి.. 'అబద్ధం చెప్పకూడదు.. అన్యాయాన్ని చూస్తూ వూరుకోకూడదు, ఎదిరించాలి. ఆపదలోవున్న వారిని ఆదుకోవాలి. వున్నంతలో.. పేదవారికి దానం చేయాలి. మంచి మనిషిగా సంఘంలో బ్రతకాలి. కన్న తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలి. మనం చచ్చిపోయిన తర్వాత.. పదిమంది మనలను గురించి గొప్పగా చెప్పుకోవాలి' అని.
యీ మాటలను నీవు నాకు చిన్న తనంలో చెప్పేటప్పుడు వినడానికి బోరుగా తోచేది. కానీ.. ఎదిగే కొద్ది ఆ నీ మాటలు మామూలు మాటలు కావని.. జీవిత సత్యాలని, నీవు వాటన్నింటినీ నాలో చూడాలని కలలు కంటున్నావని నాకు అర్థం అయింది. నీ మాటల మీద నాకు నమ్మకం కలిగింది. నీ నుండి విన్న ఆ సత్య సూక్తులు నా గుండెనిండా నిండి వున్నాయమ్మా!..
వూహ తెలిసిన నాటి నుంచీ.. ఆచరణలో పెట్టేదానికి ప్రయత్నించాను. కానీ, అవి నేటి యీ సమాజంలో, ఆచరణకు అందని ఆశయాలుగా.. మన చుట్టూ వున్న చిత్రమైన వ్యక్తుల కారణంగా మారాయమ్మా!.. కానీ, వాటిని నేను నా మనోదర్పణం నుంచి చెరిపి వేయలేదమ్మా!..
అవమానాల పాలైనా ఆచరించే దానికి ప్రయత్నం చేస్నూనే వున్నానమ్మా!..
ఆ కారణంగా.. పదమూడేళ్ళ ప్రాయంలో.. పది సంవత్సరాల క్రిందట.. మీ అందరి దృష్టిలో నేరస్థుణ్ణి అయినాను. నీకు నాన్నకు తాతయ్యకు తలవంపులు కలిగించాను. ఫలితంగా మీరు అందరూ కలసి నాకు వేసిన శిక్ష.. నన్ను మీ నుంచి దూరంగా చదువు నెపంతో పంపివేయడం జరిగింది.
చిన్న వయస్సులో.. మీ అందరి మీద కోపం వుండేదమ్మా!.. కానీ ఎదిగేకొద్ది, మీరు నా పట్ల చేసింది కరక్టు అనిపించేది. నీవు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసికొనేవాణ్ణి. మంచి మనిషిగా ఎదిగి.. నీకు నాన్నకు తాతయ్యకు సంతోషాన్ని కలిగించాలనుకొనేవాణ్ణి.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/EYbxwE3bL4w
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ఊహా లోకం 2
రచన: లక్ష్మి మదన్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అలా ఇంటికి వెళ్లిన ప్రసాద్ తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే ప్రసాద్ అలా పడుకునేసరికి తల్లిదండ్రులు బాగా కంగారు పడి "ఏమై ఉంటుంది "అని దగ్గరికి వెళ్లి అడిగారు.
"బాబూ ప్రసాద్.. ఎందుకలా ఉన్నావు? ఏమైంది నాన్నా! బ్యాంకులో ఏమైనా సమస్యలు వచ్చాయా" అని అడిగారు.
"ఏమీ లేదమ్మా! కొంచెం తలనొప్పిగా ఉంది. నన్ను కాసేపు పడుకో నివ్వండి " అని చెప్పి కళ్ళు మూసుకొని పడుకున్నారు.
అలా రెండు మూడు సంవత్సరాలు బాధపడ్డాడు. తర్వాత ఇంట్లో పెళ్లి గురించి ఒత్తిడి తేవడం వల్ల వాళ్లు చూసిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి వ్యక్తిత్వం నచ్చడం వల్ల తొందరగానే తాను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి సుఖంగానే ఉన్నాడు. పిల్లలు పుట్టారు. వాళ్ళ చదువులు అవుతున్నాయి. అవన్నీ వందనే చూసుకుంటుంది. అలాగే ప్రసాద్ తల్లిదండ్రులను కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది కానీ..
ఆడవాళ్లకు ప్రసవం తర్వాత జరిగిన ప్రాబ్లంస్ వల్ల కొందరిలో ఒళ్ళు రావడం, ఇంకా ఇతరత్రా సమస్యలు రావడం జరుగుతుంది. ఇది తెలియని మగవాళ్ళు భార్య అందంగా లేదు మునుపటిలా.. అని సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. అలాగే జరిగింది వందన విషయంలో.
పాత జ్ఞాపకాలనుండి బయటపడ్డ ప్రసాద్ ఇంట్లోకి వెళ్ళాడు. ఎప్పటిలాగే వందనం ఏదో ఒక పనిలో బిజీగా ఉంది. పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయారు.
మర్నాడు ఉదయాన్నే బ్యాంకుకు వెళ్లిపోయాడు ప్రసాద్. భార్య ఇచ్చిన టిఫిన్ బాక్స్ తీసుకొని గబగబా వెళ్ళిపోయాడు. బ్యాంకుకు వెళ్లిన ప్రసాద్ కి ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది.
ఇప్పుడు ప్రసాద్ మేనేజర్ కాబట్టి తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు. ఇంతలో తాను ప్రేమించిన సౌందర్య కనబడింది. ఒక్కసారి ఆశ్చర్యానికి లోనయ్యాడు ప్రసాద్. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఇది కలా! నిజమా ! అంటూ కళ్ళు నిలుముకుని మరీ చూశాడు. మొహం అంతా సంతోషంతో విప్పారిపోయింది.
పలకరిద్దామని గబగబా బయటకు వెళ్ళాడు. కానీ ఆవిడ త్వరగా బయటకు వెళ్ళిపోయింది. వెనకాలే గేటు వరకు వచ్చేసరికి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. ఒకింత నిరాశకు లోనైన ప్రసాద్ ఇలా జరిగిందేమిటా అని అనుకున్నాడు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/9qpgIhuYrlM
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ఎవరికి వారే
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
స్వార్ధంతో ధర్మాన్ని తప్పితే.. ఒకనాటికి కలలు కరిగి.. కష్టాలు.. కన్నీళ్లు.. తలవంపులు తప్పవు.
పరంధామయ్య, వారి అర్ధాంగి పార్వతమ్మ హైదారాబాద్ నుండి రాత్రి బస్సులో తమ స్వగ్రామానికి బయలుదేరారు.
ఆ ఇరువురి వదనాల్లో ఎంతో అప్రసన్నత.. మనస్సును వేధిస్తున్న జ్ఞాపకాలను మరచి నిద్రపోవాలని ఇరువురు కళ్ళు మూసుకొన్నారు. బస్సు బయలుదేరింది. క్రిందటి రోజున వారివురూ కలసి మాట్లాడుకొని వెంటనే వారి వూరికి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చిన కారణం గా వారు బస్సులో పయనించవలసి వచ్చింది.
రెండు.. వారాల క్రిందట వారు హైదరాబాదులోని తమ కొడుకులు గౌతమ్.. ఆనంద్ ల ఇంటికి..ఆనంద్ అతని భార్య అనారోగ్య కారణంగా వచ్చారు. కోడళ్ళ అభిమాన మాధుర్యాన్నిచవిచూచారు. ఆ ఇంట్లో వారికి కలిగిన చెడు అనుభవాలు.. వారిలోని సహనాన్ని హారతి కర్పూరం లా హరించిన కారణంగా.. ఆ రాత్రి పూట బస్సులో వారు ప్రయాణం చేయవలసి వచ్చింది.
నిద్ర పట్టని పార్వతమ్మమెల్లగా కళ్ళు తెరచి భర్తవైపుకు చూచింది.
పరంధామయ్యగారు కళ్లుమూసుకొని వున్నారు. “ఏమండీ!..” తన తలను వారి చెవి దగ్గరకు చేర్చి మెల్లగా పిలిచింది పార్వతమ్మ.
ఆ పిలుపును.. ఆలకించిన పరంధామయ్య కళ్లు తెరచి.. పార్వతమ్మ ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూచాడు. “మనం ఇకపై హైదరాబాదుకు రావలసిన అవసరం వుండకూడదు కదూ!..” దీనంగా పరంధామయ్య కళ్ళ ల్లోకి చూస్తూ అడిగింది పార్వతమ్మ.
“నాకు తెలిసినంత వరకూ యికపై మనకు అలాంటి అవసరం ఏమీ వుండదు పార్వతీ.. వారికి మనతో ఏదైనా అవసరం వుంటే.. వారే మనదగ్గరకు వస్తారేమో!” చిరునవ్వుతో చెప్పాడు పరంధామయ్య.
వారి నవ్వులో విరక్తి గోచరించింది పార్వతమ్మకు. కొన్ని క్షణాలు వారి ముఖంలోకి చూచి.. కళ్ళు మూసు కొంది. చెడు అనుభవాలతో అలసి పోయిన ఆమె మనస్సుకు ఆ నిశీధి పవనం కొంత హాయిని కలిగించిన కారణంగా భర్త భుజంపై తలనుంచి.. పార్వతమ్మ నిద్రకు వుపక్రమించింది.కానీ.. పరంధామయ్యకు ఆ యోగం ప్రాప్తించలేదు. ఇరవైయేడు నెలల క్రిందట జరిగిన వారి
షష్టి పూర్తి.. ఆరోజు మనస్సున ప్రతిబింబించింది.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/jU26sD3VUDY
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన: మద్దూరి బిందుమాధవి
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“అమ్మా! ఇవ్వాళ్ళ నా ప్రాజెక్ట్ లాంచింగ్. సెలవు పెట్టలేను.
కిచెన్ రిపేర్ పని వాళ్ళొస్తారు. పదింటికి వచ్చి మా ఇంట్లో ఉండి కాస్త ఆ పని చేయించగలవా” అని కూతురు కాంచన అభ్యర్ధన విని, గబ గబా పని తెముల్చుకునే కార్యక్రమంలో పడింది శకుంతల.
కాంచన తల్లి ఆ ఊళ్ళోనే ఉన్నా... కూతురి ఇంట్లో ఎవరూ ఉండరు... అందరూ ఉద్యోగాలకి పోతారనే కారణంతో ఎక్కువగా వాళ్ళింటికి వెళ్ళదు.
తన ఇంటి పని ముగించుకుని..ఓ మెతుకు నోట్లో వేసుకుని క్యాబ్ మాట్లాడుకుని కూతురింటికి జుబిలీ హిల్స్ వెళ్ళింది.
@@@@
పని వాళ్ళు వంటగదిలో పని చేసుకుంటున్నారు. తను టీవీ చూస్తూ కూర్చుంటే వాళ్ళు సరిగా చేస్తారో లేదో అనే అనుమానంతో అక్కడే పుస్తకం చదువుకుంటూ కూర్చుంది.
మధ్యాహ్నం దాకా పని చేసి, లంచ్ కి వెళ్ళొస్తాం అని వాళ్ళటు వెళ్ళాక అప్పటి దాకా ఏం పని చేశారో చూద్దామని అటు వెళ్ళింది.
వంటింట్లోనే పని చేస్తున్నారు కనుక అక్కడ టీ పెట్టుకునే వీలు ఉంటుందో లేదో అని తనింటినించే ఫ్లాస్కులో టీ పోసి తెచ్చుకుంది.
కప్పులో టీ పోసుకుని తాగుతూ అన్నీ పర్యవేక్షించింది.
ఫ్లాట్ కొనేటప్పుడు ఉన్న కప్ బోర్డ్స్ అన్నీ పీకేసి కొత్తగా మాడ్యులర్ కిచెన్ ఫిక్స్ చేస్తున్నారు.
అన్నీ తయారుగా (pre designed) ఉన్న కింది వైపు షెల్ఫులు, చిమ్నీ, పై వరసలో షెల్ఫులు కొంతవరకు బిగించారు. మిగిలినవి ఇవ్వాళ్ళ పూర్తి చేసి రేపు వచ్చి వాష్ బేసిన్, డిష్ వాషర్ బిగిస్తాము అని చెప్పారు.
@@@@
"అమ్మా వాళ్ళు పని చేస్తున్నారా? ఎంతవరకు అయింది.
నాకు ఇక్కడ పని అయిపోయేట్టుంది. వీలైనంత త్వరగా వచ్చేస్తాలే" అన్నది కాంచన.
అన్నట్టే సాయంత్రం 5.30 కల్లా కాంచన ఇంటికి వచ్చేసింది.
అప్పటికి మాడ్యులర్ కిచెన్ లో భాగమైన 'ఫేబర్' లేటెస్ట్ మోడల్ స్టవ్, చిమ్నీ బిగించే పని చూస్తున్నారు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/cp_2WnKtBUU
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
తల్లి ఐనా..
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"తీర్ధ యాత్రలకు తీసుకెళ్లు రా. చచ్చేలోగా కొన్ని దైవ దర్శనాలైనా కానిచ్చుకోనీయరా." అనసూయమ్మ మళ్లీ కదిపింది.
కొడుకు రాంలింగం మళ్లీ అవస్థయ్యాడు.
"తీసుకు వెళ్తాలే." మామూలుగా అనేసాడు ఎప్పటిలాగే.
"నువ్వు అచ్ఛం మీ నాన్న మచ్చే. ఆయన ఉన్న రోజుల్లో తెగ అడిగే దాన్ని ఒక మారైనా తీసుకు వెళ్లమని. అదిగో ఇదిగో అనే వారే తప్పా.. నా మాట కానిచ్చేవారు కాదు. నువ్వు అంతే లేరా. చచ్చేంత వరకు నేను ఇలానే మగ్గి పోవాలా." నొచ్చుకుంటుంది అనసూయమ్మ.
రాంలింగం ఏమీ మాట్లాడ లేదు. చుట్టూ చూస్తూ ఉండి పోయాడు. ఇక్కడికి ఉదయమే వచ్చాడు.
"ఈ మధ్య ఊరిలో చాలా మంది యాత్రలకు చక్కగా పోతున్నారు. తిరిగి ఎంచక్కా వచ్చేస్తున్నారు. నాకే తెగింపు రాకుంటుంది." అనసూయమ్మ మాట్లాడుతూనే ఉంది.
రాంలింగం ఆ సీరియస్ ను పల్చపర్చాలని మాట మార్చాడు.. "నువ్వా అక్కడికి రావు. నీ కోడలా ఇక్కడికి రాదు. నేనే అటు ఇటు తిరగాలి.. నలగాలి. ఛఛ." అనేసాడు తెగ దిగులుగా.
కొడుకు బేజారుకు.. అనసూయమ్మ ఉసూరుమంది.
"సర్లే. ఎప్పటికి ప్రాప్తమో. ఏదైనా రాసి పెట్టుకు పుట్టాలి." అనేసింది.
అనసూయమ్మకు ప్రస్తుతం ఆరవై యేళ్లు.
పదహారో యేటనే తనకు పెళ్లయ్యింది. అప్పటికి భర్త శివరాం వ్యవసాయ కూలి.
కష్టించి.. శ్రమకు తగ్గ ఫలితం చివరికి సాధించాడు శివరాం. ఉంటున్న ఊరి చివరన ఎకరం భూమిని కూడ తీసుకున్నాడు. ఊరిలో రెండు గదుల సొంత ఇంటిని కట్టు కున్నాడు.
శివరాం పొలంకి, ఇంటికి యజమాని అయ్యే సరికి.. ఇరవై యేళ్ల కొడుకు రాంలింగం అందుకు వచ్చేడు.
రాంలింగం డిగ్రీ చదివాడు. బ్యాంక్ పరీక్షల్లో పాసై.. పట్నంలోని ఓ బ్యాంక్ ఉద్యోగి అయ్యాడు.
ఉద్యోగంలో చేరిన యేడాది కాక మునుపే.. తల్లిదండ్రులతో.. "మీరు నాతో వచ్చేయండి. ఇంకేం కష్టపడ వద్దు." అన్నాడు.
"లేదురా. మా చిన్ననాటి నుండి ఇక్కడే ఉంటున్నాం. ఈ ఊరును వదులుకోలేం రా." అనేసారు ఇద్దరూ ఏక గొంతులా.
"సరే. మీ ఇష్టం కానీయండి." అనేసాడు రాంలింగం.
తర్వాత.. మరో యేడాది గడిచే లోపలే.. తమ బంధువు మూలంగా.. ఓ సంబంధం కలిసి రావడంతో.. రాంలింగంకు పెళ్లి చేసేసారు శివరాం దంపతులు.
కొత్త కాపురంతో రాంలింగం పట్నంలో హుషారయ్యి ఉన్నాడు.
ఆ కాల గమనంలో..
పాము కాటుతో శివరాం చనిపోయాడు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/nOwQMiL-5MQ
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ఊహా లోకం 1
రచన: లక్ష్మి మదన్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఊహా లోకం పెద్ద కథ మొదటి భాగం
వంటింట్లో నుండి కాఫీ తీసుకొని వచ్చి వరండాలో పేపర్ చదువుతూ కూర్చున్న ప్రసాద్ కి ఇచ్చింది వందన.
"ఏమండీ కాఫీ" అన్నది.
"అక్కడ పెట్టి వెళ్ళు" అన్నాడు చిరాగ్గా ప్రసాద్.
ఈ మధ్య వందనను చూసి ఊరికే చిరాకు పడుతున్నాడు.. దానికి కారణం లేకపోలేదు, పిల్లలు కొంచెం పెద్దవారై యిన కొద్దీ వందన లావుగా మారిపోయింది. పెళ్లయిన కొత్తలో ఎంతో సన్నగా ఉండేది. మరొక కారణం కూడా ఉంది ప్రసాద్ చిరాకుకి.. ఒకప్పుడు ప్రసాద్ ప్రేమించిన అమ్మాయి ఎంతో అందంగా ఉండేది. ‘ఆ అమ్మాయిని చేసుకుని ఉంటే ఇలా పిప్పళ్ళ బస్తాల మారిపోయేది కాదు’ అని ఎప్పుడూ మనసులో అనుకుంటూ ఉన్నాడు.
వందన బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళింది. పిల్లలను నిద్రలేపి వారిని స్కూలు పంపడానికి బాక్సులు రెడీ చేస్తుంది. ఆరోజు ప్రసాదుకు సెలవు కావడం వల్ల ఇంట్లోనే ఉన్నాడు. ఉద్యోగం చేస్తాడు. క్లర్క్ గా మొదలైన ఉద్యోగం ఇప్పుడు మేనేజర్ వరకు వెళ్ళింది. చక్కని ప్రతిభతో తన వృత్తిని నిర్వర్తిస్తున్నాడు ప్రసాద్. వందన కూడా ఉన్నంతలో సరిపెట్టుకొని కాపురాన్ని అందంగానే తీర్చిదిద్దుకుంటుంది. ఇంటికి ఎవరు వచ్చినా ఆదరించి మంచి పేరునే తీసుకొని వచ్చింది. మొదట్లో ప్రసాద్ ఆమెతో బాగానే ఉండేవాడు. తను ప్రేమించిన అమ్మాయి అప్పుడప్పుడు గుర్తు వచ్చినా వందన వ్యక్తిత్వాన్ని నచ్చి ప్రేమగానే చూసుకునేవాడు. కానీ ఆమె చాలా లావు అయిందని కారణంతో ఈమధ్య కొంచెం చిరాకు పడుతూ మధ్య మధ్యలో తను ప్రేమించిన అమ్మాయిని గుర్తు చేసుకుంటున్నాడు. అంతకుమించి అతనికి కూడా ఏ వ్యసనాలు లేవు.
ఒక్కసారి గతంలోకి వెళ్లిపోయాడు ప్రసాద్. తన బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి తరచుగా బ్యాంకుకు వచ్చేది. ఆ అమ్మాయి ఏదో కంపెనీలో ఉద్యోగం చేసేది. దాని తాలూకు ట్రాన్సాక్షన్స్ కోసం బ్యాంకుకు ఎక్కువగా వచ్చేది.
ఒకరోజు క్యాజువల్ గా పని చేసుకుంటున్నాడు. తన కౌంటర్ దగ్గరికి వచ్చి ఒక అమ్మాయి..
"ఎక్స్క్యూజ్మీ సార్ కాస్త ఈ అమౌంట్ చెక్ చేస్తారా" అని అడిగింది.
తలెత్తి చూసిన ప్రసాద్ ఆమెను చూసి కళ్ళు తిప్పుకోలేక పోయాడు. సంస్కారం అడ్డొచ్చి తలదించుకున్నాడు కానీ వివరాలు చెప్పాలనే నెపంతో ఆమెను చూస్తూనే ఉన్నాడు. ఆమెకు ఇవ్వాల్సిన వివరాలు ఇచ్చి ఇంకా కొన్ని ఇవ్వకుండా కాసేపు వెయిట్ చేయించాడు, అమ్మాయిని ఎక్కువసేపు చూడొచ్చనే కారణంతో.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/-g4YiY5EUfc
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
నాకేమవుతోంది…? ఎపిసోడ్ 10
రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
స్టేషన్ నుండి బయటకు వచ్చి, తమ సెల్ ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నారు రంగనాథం, సందీప్ లు. అంతలో ఒక ఇన్నోవా కారు వాళ్ళ ముందు ఆగింది. అందులోంచి నలుగురు బలిష్ఠులైన వ్యక్తులు దిగి వాళ్ళిద్దరినీ బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు, ఇద్దరి ముఖాలనీ కర్చీఫ్ లతో అదిమి ఉంచారు. తియ్యటి వాసన వస్తూ ఉండగా ఆ ఇద్దరూ స్పృహ తప్పారు. రంగనాథానికి స్పృహ వచ్చేసరికి తనని ఒక గోడౌన్ లో బంధించినట్లు అర్థమయింది. అతన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి చేతులు కాళ్లు కట్టి పడేశారు. సందీప్ కోసం తల అటు ఇటు తిప్పి చూశాడు. అతను ఎక్కడా కనపడలేదు.
"ఎవరైనా ఉన్నారా?" అని గట్టిగా అరిచాడు.
సమాధానం లేదు..
“నేను మాజీ మినిస్టర్ కి బాగా కావలసిన వాడిని. నన్ను తక్కువ అంచనా వేయవద్దు. ఈపాటికి నా కోసం మా వాళ్లు వెతుకుతూ ఉంటారు” అంటూ కేకలు పెట్టాడు రంగనాథం.
మరో అరగంటకు ముఖానికి ముసుగు వేసుకున్న ఒక యువకుడు ఆ గోడౌన్ లోకి వచ్చాడు. అతని వెనుకే నలుగురు అనుచరులు వచ్చి, తిరిగి గోడౌన్ తలుపులు మూసివేశారు. అందరూ రంగనాథాన్ని సమీపించారు.
"ఎవరు మీరు? నన్ను ఎందుకు బంధించారు.." అంటూ కేకలు పెట్టాడు రంగనాథం.
"మన ట్రీట్మెంట్ ప్రారంభం కాకముందే గావు కేకలు పెడుతున్నాడు. వీడి నోట్లో గుడ్డలు కుక్కి అసలైన టార్చర్ అంటే ఏమిటో చూపించండి" అన్నాడు ఆ యువకుడు.
వెంటనే ఒక వ్యక్తి రంగనాథం నోట్లో గుడ్డలు కుక్కి నోటికి పెద్ద టేప్ అంటించాడు. మరో వ్యక్తి రంగనాథాన్ని కట్టి ఉన్న కుర్చీని బాగా వెనక్కి వాల్చాడు. మరో ఇద్దరు వ్యక్తులు అతని అరికాళ్ళ మీద లాఠీలతో బలంగా కొట్టడం ప్రారంభించారు. దెబ్బలను ఓర్చుకుంటూనే వేగంగా ఆలోచించాడు రంగనాథం.
వీళ్లు కచ్చితంగా మఫ్టీలో ఉన్న పోలీసులే..
కానీ రికార్డుల్లో తనను వదిలి పెట్టేసినట్లు రాసుకొని ఉంటారు. వీళ్లు ఏం చేసినా తనకు దిక్కు లేదు. సందీప్ పక్కన లేడు అంటే అతన్ని వేరేచోట ఇలాగే టార్చర్ పెడుతూ ఉంటారు. ఇక రిసార్ట్ వాచ్మెన్ ఇతర సిబ్బందిని స్టేషన్లోనే చిత్రహింసలు పెడుతూ ఉంటారు. తను దెబ్బలకు ఓర్చుకున్నా వీళ్ళలో ఎవరో ఒకరు విషయం బయట పెట్టేస్తారు. అదేదో తనే చెబితే ఈ దెబ్బలన్నా తప్పుతాయి అనుకున్నాడు.
కానీ ఎలా చెప్పడం..? చేతులు కాళ్లు కట్టేసి ఉన్నారు. నోటికి ప్లాస్టర్ వేసి ఉన్నారు. తలను అటు ఇటు ఊపుతూ రెప్పల్ని ఆర్పుతూ కొట్టడం ఆపమని సైగ చేయడానికి ప్రయత్నించాడు. అంతలోనే అతనికి స్పృహ తప్పింది.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/6eRi5-J8G3U
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ది ట్రాప్ ఎపిసోడ్ 21
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“ఏమైనా చేస్తాను. నువ్వు నా భర్తతో నేను లేనప్పుడు నా గదిలో ఎన్నిసార్లు యేకాంతంగా గడిపావో సిసిటీయస్ కెమారాలో బంధించి ఉంచాను. వాటిని బట్టబయలు చేస్తాను. అడల్టరీ సెక్షన్ క్రింద కేను పెడతాను. ఇంకా ఇంకా మరేదైనా చేస్తాను. నలుగురికీ తెలిసేలా వార్త ఫ్లాష్ చేస్తాను. అప్పుడు మందాకిని గతేమవుతుందో ఆలోచించు”. వరూధిని బదులివ్వకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. నిదానంగా చూస్తూ గొణిగినట్లు అడిగింది- “మరి కోర్టులో కేసు పెడితే నీ భర్త భువనేశ్ కి మాత్రం అఫెక్ట్ కాదా? అడల్టరీలో ఇద్దరికీ భాగ ముంటుంది కదా! ” “ఏదైనా కానియ్యి. నేను ముందే చెప్పాగా ఈ విషయంలో నేను దేనికైనా తెగిస్తానని. చెవులొగ్గి వినడం లేదా! ఇక దీనికి బదులియ్యి- భువనేశ్ నాకు కావలసిన వాడయితే-- నీకు కావలసిన వాడు కాడా— నువ్వత ణ్ణి నగుబాటుకి లోను చేసే సాహసం చేస్తావా-- ” వరూధిని ఊపిరి తీసుకోవడానికి క్షణం పాటు ఆగి అంది-- “నువ్వు నన్ను యెమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు ప్రభా! ” “అలాగే అనుకో—నాకేమీ ఆక్షేపణ లేదు. తగిన ఆధారాలు సంపాదించి నాపైన కేసు కూడా పెట్టుకో—’ “మొత్తానికి నువ్వు నా స్నేహితురాలిగా సంభాషించడం లేదు ప్రభా! ” “ఔను. నాకు నువ్వంటే యిష్టం. నీ స్నేహమంటే యిష్టం. కాని దీనికన్నా నాకు నా కుటుంబం ముఖ్యం. నా భర్తకు వంశాంకురం ఉండటం మరీ ముఖ్యం”. వరూధిని కనుబొమలెగరేసి చూస్తూండిపోయింది. తన స్నేహితురాలు తనను దిగ్భంధించడానికి నిర్ణయించు కున్నదన్నది తెలుస్తూనే ఉంది. ఇక యింత దూరం వచ్చి ముంతలో యేముందని అడగడం దేనికి-- “సరే చెప్పు. నీకేమి కావాలి? ” “చెప్తాను. ఇరువురికీ- విన్ విన్ సిట్వేషన్ గా ఉండేలా చెప్తాను. ఐతే ఒక షరతుపైన. అదేమిటన్నట్టు కళ్ళెత్తి చూసింది వరూధిని. “నేను చెప్పినట్టు చేయాలి. అలా చేస్తే మన స్నేహం బంధాలు చిరస్థాయిగా నిలుస్తాయి”. ఆమె తలూపింది. నన్ను చూసి తలూపితే చాలదు. అదిగో అక్కడున్న మూలవిరాట్టు వేపు చూసి ఔనను”. వరూదిని అలాగే చేసింది. అప్పుడు ప్రభావతి వరూధిని చేతిని చేతులోకి తీసుకుంది. “మొదటిది- నువ్వు విదేశాలకు బయల్దేరే ముందు మందాకినిని మాకు అప్పచెప్పి వెళతావు. కొన్నాళ్ళ తరవాత అక్కడెక్కడో నువ్వు బిడ్డను కంటావు. ఆ తరవాత మరి కొన్నాళ్ళ తరవాత ఇక్కడకు వస్తావు. బిడ్డను మాకప్పగిస్తావు” ఈసారి సూటిగా చూసింది వరూధిని. “అప్పగించకపోతే? ”
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/Ci_bJ8v3PYI
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కస్తూరి రంగ రంగా!! 15
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఆరోజు పౌర్ణమి. పండువెన్నెల...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది.
సమయం... రాత్రి ఎనిమిదిగంటలు... ఎనిమిదీ ఏభై అయిదుకు...07032 హైదరాబాద్ డక్కన్--ముంబై సి.యస్.యం.టి. కోవిడ్ స్పెషల్ ట్రైన్ బయలు దేరుతుంది. ప్రయాణీకులు స్టేషన్ చేరుతున్నారు. రైల్వే స్టేషన్ ముందు టాక్సీ వచ్చి ఆగింది. దాని నుండి నలుగురు పాతిక సంవత్సరాల లోపు యువతులు... మువ్వ దిగారు. స్టేషన్లోకి వెళ్లపోయారు. ఆటోలో పీర్ దిగాడు. అతనూ స్టేషన్లోకి వెళ్లాడు... మరో టాక్సీ వచ్చింది. మూగచాన్ టీ బాయ్ దిగాడు. వెనక సీట్లో మారు వేషాల్లో వున్న సుగంధి... యాదగిరీలు, ఎ.డి.యస్.పీలు దిగి వారిరువురూ స్టేషన్లో ప్రవేశించారు... కొంతమంది ఆడ మగ పోలీసులు కూడా మఫ్టీలో స్టేషన్లో ప్రవేశించారు.
ఖాజా పోలీసులను గమనించి వేగంగా మెట్లు ఎక్కి పారిపోవాలని ప్రయ త్నించాడు. మెట్లపై వున్న పోలీసులు అతన్ని పట్టుకొన్నారు. చేతులకు బేడీలు వేసి లాక్కొని వెళ్లిపోయారు.
ఆడ పోలీసులు... వారి వెనుక మగపోలీసులు... మువ్వ, ఆమెతో వున్న నలుగురు యువతులతో...
"గలాభా చేయకుండా మాతో రండి..." అని చెప్పడంతో భయపడిన ఆ యువతులు... మువ్వా మౌనంగా వారి వెనకాలే నడిచారు.
అందరూ స్టేషన్ బయటకు వచ్చారు. పోలీసులు వారిని పోలీస్ వ్యాన్ ఎక్కించారు. వ్యాన్ వెళ్లిపోయింది.
ఆరోజు ఉదయం... దుర్గాదేవి... తన పెద్దకుమారుడు భూషణ్ కుమార్ నకు గోపాలయ్య కుమార్తె కస్తూరికి సాంప్రదాయ బద్ధంగా తన స్వగృహంలో వారికి ఎంతో ముఖ్యులైన హితుల సమక్షంలో నిశ్చితార్థాన్ని జరిపించింది.
వివాహాన్ని రేపల్లెలో జరపాలనే నిర్ణయంతో ఒక వారం రోజులుగా ఆ ఇంటి ప్రాంతాన్నంతా బాగుచేయించడం ప్రారంభించారు. శుభలేఖలను ముద్రించి రెండు రోజులుగా బంధువులకు హితులకు ఆప్తులకు పంచడం జరిగింది. ఆ శుభలేఖలను చూచి ఐ.జి. అనంత్ నాగ్ కస్తూరి రంగాకు ఫోన్ చేశాడు.విషయాన్ని చెప్పాడు.
"కస్తూరి రంగా!... భూషణ్ కుమార్ వివాహం వచ్చే శుక్రవారం... రేపల్లెవాసి కీర్తిశేషులు గోపాలయ్యగారి కుమార్తె కస్తూరిగారితో.. వివాహం జరగబోయేది రేపల్లెలో... కస్తూరి స్వస్థలంలో... అంటే... టుడే మండే... ఆన్ ఫ్రైడే అంటే ఐదవరోజు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. వివాహానంతరం... ఫారిన్ ట్రిప్ ఫర్ హనీమూన్... వివాహ ఆహ్వాన పత్రిక ఇస్తూ భూషణ్ కుమార్ చెప్పాడు..." వ్యంగ్యంగా నవ్వుతూ చెప్పాడు. ఐ.జి. అనంత్ నాగ్. వివాహపత్రికను రంగా సెల్ వాట్సాప్ కు పంపాడు. విషయాన్ని వసంత్కు వివరించాడు రంగ.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/oOGEBS71dUc
From the publisher's feed