Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • తనదాక వస్తే కానీ | Tanadaka Vasthe Kani | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    తనదాక వస్తే కానీ

    రచన: Ch. ప్రతాప్

    మధ్యాహ్నం పన్నెండు గంటలయ్యింది. కాలనీ.  అంతా కోవిడ్ ప్రభావంతో నిర్మానుష్యంగా వుంది. డెలివరీ అబ్బాయిలు సరుకులను మెయిన్ గేటు వద్దే వదిలి వెళిపోతున్నారు. వాటిని తీసుకోవడానికి ముఖాలకు మాస్కులు పెట్టుకొని వచ్చే కొద్ది మంది తప్ప ఇంకే విధమైన అలికిడి లేదు. వంట పూర్తవడంతో సోఫాలో రిలాక్స్ అయ్యి మొబైల్ లో వాట్సప్ మెస్సేజిల్ని చూస్తూ చేరగిలబడింది వనజ.

    మన కాలనీ లో ఫలానా బిల్డింగ్ లో ఫలానా ఫ్లాట్ లో ఒక ఆఫీసరు గారికి కోవిడ్ 19 వచ్చిందని, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారని,అందరూ ఈ సంఘటనతో జాగ్రత్త పడాలని కాలనీ అసోసియేషన్ సెక్రటరీ నుండి మెసేజి వచ్చింది. కోవిడ్ ప్రభావిత వ్యక్తి పేరు చూడగానే వనజ మనస్సు ఆనందంతో గంతులు వేసింది. ఆయన వనజ భర్త ఆఫీసులోనే పని చేస్తున్నారు. జూనియర్ అయినా త్వరగా ప్రమోషన్ వచ్చింది. వాళ్ళ పిల్లలు వనజ పిల్లల కంటే చదువుల్లో బాగా రాణిస్తున్నారు. అందుకే వాళ్ళ కుటుంబం అంటే వనజకు ఒళ్ళు మంట. ఏ మాత్రం అవకాశం వచ్చినా వారి కుటుంబంపై విద్వేషాగ్ని విరజిమ్మేందుకు సిద్ధంగా వుంటుంది. అదిగో.. ఈ మెస్సేజి రూపంలో వనజకు మరొక మంచి అవకాశం వచ్చింది. ఇక ఆ మెస్సేజికి మరి నాలుగు లైన్లు అదనంగా జోడించి కాలనీలో కాక, వారి ఆఫీసులో కోలీగ్స్ భార్యలకు ఫార్వర్డ్ చేసేసింది. పదవులు వస్తే చాలదని, బాధ్యతగా కూడా ప్రవర్తించాలని, ఆయనగారి బాధ్యతా రహిత ప్రవర్తన వలన ఈ కాలనీ లోని వందలాది మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయని ఇష్టం వచ్చినట్లుగా రాతలు రాసి అందరికీ పంపించింది. అంతే కాకుండా అజాగ్రత్తతో వుండి, కోవిడ్ నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారం తిరిగి వాళ్ళతో పాటు ఇతరుల జీవితాలను కూడా ఎలా ప్రమాదంలో పడేస్తున్నారో వివరిస్తూ ఇన్స్టాగ్రాం, ఫేస్ బుక్ లలో పోస్టులు పెట్టింది. కడుపులో వున్న ద్వేషం అంతా కక్కేసాక మనసు ఎంతో రిలీఫ్ గా అనిపించింది. సుష్టుగా భోజనం చేసి కంటికి నిండా నిద్రపోయింది.

    సాయంత్రం ఆరవుతుండగా వనజ భర్త రవి ఆఫీసు నుండి ఫోనొచ్చింది. రవి బాసు ఫోన్ చేసి హఠాత్తుగా రవికి 104 డిగ్రీల జ్వరం వచ్చిందని, దగ్గర్లో వున్న డాక్టరుకు చూపిస్తే కోవిడ్ లక్షణాలు వున్నాయని, అందుకే ప్రభుత్వాసుపత్రిలోని ఐసొలేషన్ వార్డుకు తరలించారని చావు కబురు చల్లగా అందించాడు. అంతే కాకుండా లంగ్ ఇన్ ఫెక్షన్ ఎక్కువగా వుండడం వలన ఊపిరి తీసుకోవడం కష్టంగా వున్నందున వెంటిలేటర్ పై వుంచారని, బ్రతికే అవకాశాలు ఎంత వున్నాయో చెప్పడం కష్టమని డాక్తర్లు అంటున్నారని చెప్పాడు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/ptZ683kFIvQ

    5 min
  • Marpu | మార్పు | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    మార్పు

    రచన : జీడిగుంట శ్రీనివాసరావు

    (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ప్రకాష్ ఒక బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్. నిజాయితీ కి పెట్టింది పేరు. లోన్ అప్లికేషన్ చూడగానే, లోను యిస్తే తిరిగి వస్తుందా, రాదా అని కచ్చితంగా చెప్పగలడని పై అధికారులలో యితనంటే అభిమానం.

    రెండు మూడు పెద్ద బ్రాంచిలలో పని చేసినతరువాత, ప్రకాష్ ని మేనేజర్ గా ప్రమోషన్ యిచ్చి, ఒక పల్లెటూరు లో కొత్త బ్రాంచికి పంపించారు.

    ఇతను విజయవాడ నుంచి వెళ్లిపోతున్నాడని తెలిసి, ఇతని వలన ఉపకారం పొందిన పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ మేనేజర్లను ప్రకాష్ ఇంటికి పెద్ద బహుమతులు తో పంపించారు.

    తల్లిదండ్రుల నుంచి వచ్చిన నిజాయతీ వలన వాళ్లందరికీ, “నేను రూల్స్ ప్రకారం మాత్రమే పని చేశాను.  ప్రత్యేకంగా ఎవరికీ  రూల్స్ కి విరుద్ధంగా ఉపకారం చేయలేదు. నేను యిటువంటి బహుమతులు తీసుకోను”అని చెప్పి, వీళ్ళని పంపిన యాజమాన్యం కి ఫోన్ చేసి, “దయవుంచి నిజాయితీ గా వుంటే ఎటువంటి బహుమతులు, డబ్బులు ఎవరికీ ఇవ్వక్కరలేదు. అందుచేత మీరు పంపిన బహుమతులు నేను స్వీకరించలేను” అని చెప్పి పంపించేసాడు.

    తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని ఒక మంచిరోజున ఆ పల్లెటూరు బ్రాంచ్ లో జాయిన్ అయ్యాడు. పల్లెటూరు అయినా పంట పొలాలతో వున్న ఊరు. తన బ్యాంకు కాకుండా యింకో ప్రవేట్ బ్యాంకు కూడా వుంది ఆ ఊళ్ళో.

    ఒకసారి తనే స్టాఫ్ అందరిని పరిచయం చేసుకుని, తను పని చేసి వచ్చిన బ్రాంచిలు గురించి, తను పని చేసే విధానం, అలాగే స్టాఫ్ నుంచి నిజాయితీ గా కష్టపడే తత్వం ఆశిస్తానని చెప్పి వెళ్లి తన ఛాంబర్ లో కూర్చొని పని మొదలుపెట్టాడు ప్రకాష్.

    తన రూమ్ నుంచి చూస్తే బ్యాంకు స్టాఫ్ మొత్తం కనిపించే విధంగా తన సీట్ అమర్చుకున్నాడు.

    కొత్తగా వచ్చిన ప్రతీ వాడు మనకి నీతులు చెపుతారు అంటున్న క్యాషియర్ మూర్తి ని నోటితో హెచ్చరిక చేసాడు అసిస్టెంట్ మేనేజర్ రామారావు. కొత్త బ్రాంచ్ అవడం వలన కస్టమర్స్ ఎక్కువ రావడం లేదు. అకౌంట్స్ కూడా ఎక్కువ లేవు. దానితో ప్రకాష్, అసిస్టెంట్ మేనేజర్ రామారావు తప్ప అందరూ లంచ్ టైం అవగానే బ్యాంకు నుంచి వెళ్లిపోతున్నారు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/4Wbrnq_CtYI

    11 min
  • Badhyatha | బాధ్యత | Telugu Short Story | Hanumantha T | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    బాధ్యత

    రచన: T హనుమంత

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    “గుడ్ మార్నింగ్ వదినా” అంది రాధ.

    “హాయ్ రాధా! ఏమిటి ఈ మద్యన నువ్వు వాకింగ్ రావడం లేదు, ఏమైనా సమస్యనా?” అడిగింది సుధ.

    “ఏమని చెబుతానులే వదినా! స్కూల్ కి పిల్లలను రెడీ చేయాలి. తర్వాత టిఫిన్లు, మావయ్య గారికి ట్యాబ్లెట్లు, సౌకర్యాలు..ఇవన్నీ చేసేటప్పటికే పూర్తిగా అలసిపోతాను. ఇంకెక్కడి వాకింగ్ వదినా!” తన బాధ చెప్పుకుంది రాధ.

    “మరి మీ ఆయన సాయం తీసుకోకూడదా రాధా” అంది సుధ.

    “ఆయన పొద్దున 7 గంటలకు పోయినోడు రాత్రి 8 గంటలైనా ఇంటికి రాడు. పైగా హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ కూడా వచ్చింది” చెప్పింది రాధ.

    “సరే రాధా! ఈ రోజైనా నాతో పాటు వాకింగ్ వచ్చావు. సంతోషం”.

    “నిన్నటి నుండి పని మనిషి పనిలో చేరింది, ఇక అన్నీ ఆమే చూసుకుంటుంది. చాలా విసిగిపోయాను వదినా.. ఇటు పిల్లలు, అటు ఇంటిపనులు, పోటి పరీక్షలకు చదువు కొందామన్నా సమయమే దొరికేది కాదు. అన్నట్లు అక్కడ బెంచ్ పైన కూర్చొన్నది నిర్మల కదా!” అంది రాధ.

    ““అవును రాధా. తను కూడా డైలీ వస్తుంది పార్క్ కి. కానీ తొందరగా వెళ్తుంది. ఎందుకో నాక్కూడా తెలీదు” అంది సుధ.

    “తను భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంది వదిన, ఆమె భర్త R.M.P doctor. బాగా సంపాదిస్తారు ఇద్దరూ” చెప్పింది రాధ.

    “అవునా! కానీ నా ఫ్రెండ్ రాజు ఇంటికి పని చేయడానికి వెళ్తుంది అని విన్నానే” అంది సుధ.

    “ఏమో.. ఏ పుట్టలో ఏ పాముందో.. ఎందుకోసం వెళ్తుందో.. ఎవరికి తెలుసూ…” అంది  రాధ.

    “ఈ రోజుకి ఇక చాలు. ఇంటికి వెళ్దాము పద, అలాగే నిర్మల గురించి కూడా ఆరా తీస్తాను రాధ”.

    **

    “ఏమిటి వదినా అంత దిగులుగా ఉన్నావు?” అడిగింది రాధ.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/q865VCwPmbE


    4 min
  • పాణిగ్రహణం - 6 | PaniGrahanam - 6 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    పాణిగ్రహణం - 6

    రచన: భాగవతుల భారతి

    (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    చిన్నగదే ఐనా కొంతమంది ఆహూతులతో ఇద్దరు పత్రికా విలేఖరులతో కళకళ లాడుతోంది.

    'పాణిగ్రహణం కన్సల్టెన్సీ' అనే చిన్న బ్యానర్

    వెనకవైపు గోడకు తగిలించి ఉంది.

    వాటర్ బాటిల్స్, స్నాక్స్, టీ సర్వ్ చేయబడ్డాయి.

    "ఎందుకు పిలిచాడో? ఇదంతా ఏమిటో? "

    వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటున్నారు.

    "కాసేపట్లో అదే తెలుస్తుందిగా! వండుకున్నమ్మ తినక మానదుగా! కడుపుతో ఉన్నమ్మ కనక మానదుగా! " నవ్వులూ.

    గొంతువిప్పాడు విరూపాక్ష.

    "నా యింట్లో ఇంత చిన్న గదిలోకి నేను ఆహ్వానించగానే, మీమీ పనులు మానుకుని అమూల్యమైన సమయాన్ని నా కోసం కేటాయించి.... వచ్చిన శ్రేయోభిలాషులకు, పత్రికా విలేఖరులకు ముందుగా ధన్యవాదాలు... "

    "డియర్ ఫ్రెండ్స్...వెనకనున్న బ్యానర్ చూడగానే మీకు సగం అర్ధమయిపోయి ఉండాలి"

    "అంటే 'మ్యారేజ్ బ్యూరో' ఏదైనా పెడుతున్నావా? విరూ! మరి ఉద్యోగం?"

    "ఉద్యోగం దారిదానిదే! ఇది మ్యారేజి బ్యూరో కాదు. " అని క్షణం ఆగి....

    "మీ అందరికీ తెలుసు. ఇవాళా రేపూ వివాహ వ్యవస్థ ఎంత ఛిన్నాభిన్నమైపోతోందో? "

    "అవును విరూ! మా వాళ్ళలోనే మూడు విడాకుల కేసులు... "

    "నిజమే! పెళ్ళి పెళ్ళని శుభలేఖలు పంచి, లక్షలు పెట్టి, కల్యాణ మంటపాలు మాట్లాడి లక్షలు ఖర్చు చేసి పెళ్ళిళ్ళు చేసినంతసేపు పట్టట్లా ! ఇంటికివచ్చి కాళ్ళుకడుక్కున్నంత సేపట్లో, ఫోన్.... ఆ జంటకు విడాకులని... "

    "పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటేనే...  ఆ!... ఎందుకులే! వీళ్ళు కలిసిఉండేదా? పెట్టేదా? గిఫ్ట్, ప్రయాణం ఛార్జీలు దండగ... వాళ్ళు కలిసున్నారని తెలిసాక పోదాం, అనిపిస్తోంది" ఓ పెద్దాయన అన్నాడు.

    "శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యంభవతి శతమితిశతం దీర్ఘమాయుః " అని ఆశీర్వదించినంతసేపు పట్టట్లా. "

    "కారణం ఏమిటంటారూ?" విరూపాక్ష చర్చకు దిగాడు.

    "ఆ... ఆడవాళ్ళ చదువులూ, ఉద్యోగాలూ " ఆడవాళ్ల మీద ఉక్రోషంతో అన్నాడు ఓ పెద్దాయన.

    "మరి చదువుకోని వాళ్ళూ విడిపోయినట్లు విన్నానూ"

    "ఐతే! ఇగోలేమో! నేనూ అనే... కాన్సెప్ట్ " అన్నారు ఇంకొకరు.

    "కొంత కారణం కావచ్చు... కానీ అన్నీ అలాగూ లేవు. "

    "మరి నువ్వేమంటావో అది చెప్పు విరూ!" చనువుగా అడిగింది పెద్దావిడ.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/as437GtERhk

    9 min
  • వినిపించని రాగాలు 6 | Vinipinchani ragalu 6 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వినిపించని రాగాలు 6

    రచన : గొర్తి వాణిశ్రీనివాస్

    (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    కొద్దిసేపటికి డాక్టర్ వచ్చాడు.

    అతని వెనకాల పీ జీ స్టూడెంట్స్ కొందరు వున్నారు. వాళ్ళ మెళ్ళో స్టెత్. చేతిలో ఫైల్స్ ఉన్నాయి. నర్స్ కుమార్ బ్రెయిన్ ఎక్సరే ఫిల్మ్ తెచ్చి ఇచ్చింది. డాక్టర్ పైకి పెట్టి చూపిస్తున్నాడు. స్టూడెంట్స్ ఎగబడి చూస్తున్నారు.

    "చిన్న మెదడుకి దెబ్బతగలటం వల్ల అది వెనక్కి ఒరిగి మెడుల్లా అబ్లంగేట పై పడటం వల్ల మెదడుకు చేరవేసే నరం కట్ అయింది. దానివల్ల ఒత్తిడి పెరిగి బి పీ ఇంక్రీజ్ అయింది” అంటూ మెడికల్ స్టూడెంట్స్ కి కేస్ వివరిస్తూ చికిత్సా విధానాన్ని ఎక్సప్లైన్ చేస్తున్నాడు.

    డాక్టర్ చెబుతుంటే స్టూడెంట్స్ చకచకా నోట్స్ రాసుకున్నారు.

    "డాక్టర్, అతనికి ఇప్పుడు ఎలాఉంది? ఏదైనా ఇంప్రూమెంట్ ఉందా?" అడిగాడు మధు.

    "మీరెవరు?" అన్నాడు డాక్టర్.

    "పేషేంట్ ఫ్రెండ్ ని. త్వరలోనే కొలుకుంటాడా? మళ్లీ మామూలు మనిషవటానికి ఎన్నాళ్ళు పడుతుంది?" అడిగాడు మధు.

    "తల వెనక ఏదో బలమైన దెబ్బ తగలటంవల్ల కోమాలోకి వెళ్ళాడు. ఆపరేషన్ చేశాం. పరిస్థితిని మరో నాలుగురోజులు చూసి మరొక ఆపరేషన్ చేయాల్సొస్తుంది. చూద్దాం. " చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. అతని వెనకాలే అందరూ వెళ్లిపోయారు.

    మధు రజిత వంక చూసాడు. ఆమె కుమార్ వంక చూస్తోంది. మధు కుర్చీలో కూర్చున్నాడు. రజిత కూడా వచ్చి కూర్చుంది.

    "తల వెనక దెబ్బ ఎలా తగిలింది? యాక్సిడెంట్ జరిగిందా?"

    " ఇనపరాడ్డుతో కొట్టడం వలన కోమాలోకి వెళ్ళిపోయాడు. "

    "ఓ మై గాడ్. ఎవరు కొట్టారు? ఎందుకు?"

    దీర్ఘంగా నిట్టూర్చింది రజిత. చెప్పడం మొదలుపెట్టింది.

    ****

    కుమార్ మా పక్కింటి అబ్బాయి. చిన్నప్పటినుంచీ కలిసి పెరిగాం. వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/Jl0JqfKsKNo

    17 min
  • కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 14 | Kasthuri Ranga Ranga Episode 14 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కస్తూరి రంగ రంగా!! 14

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ

    సయ్యద్ సార్ పెద్దకొడుకు ఇర్ఫాన్ దాదాపు రెండు నెలలుగా జీవితాన్ని పైలా పచ్చీస్ అన్ని విషయాల్లో పరమానందంగా ముంబైలో గడుపుతున్నాడు.

    రెండువారాలకోసారి అతని మేనమామ ఖాజా... అతనికి కావలసినంత డబ్బును భూషణ్ కుమార్ వద్దనుంచి వసూలుచేసి పంపేవాడు.

    కస్తూరి రంగ సయాన్లోని ఐ.జి. ఆఫీస్ కు వెళ్లి సక్సేనా ఐ.జి.ని కలుసుకొన్నాడు. ఇర్ఫాన్ ఫొటోను వారికి ఇచ్చి జరిగిన కథనంతా వివరంగా చెప్పాడు. ఐ.జి. సక్సేనా అంతా విన్నాడు. వారి శిష్యుల వివరాలన్నింటినీ నోట్ చేసుకొన్నాడు... కస్తూరిరంగ ఇచ్చిన ఇర్ఫాన్ ఫొటోను అన్ని స్టేషన్లకు పంపించే ఏర్పాట్లు చేశాడు ఐ.జి.సక్సేనా…

    "సార్... థాంక్యూ... ఎలాట్!!..." సంతోషంతో చెప్పాడు కస్తూరి రంగ.

    "ఎందుకు... మిస్టర్ కస్తూరి రంగ!.. ఇటీజ్ అవర్ డ్యూటీ... ఎస్.. ఇటీజ్ అవర్ డ్యూటీ..." చిరునవ్వుతో చెప్పాడు సక్సేనా…

    తర్వాత ఈమధ్య కాలంలో నలుగురు వ్యక్తులచేత బలాత్కరింపబడి (రేప్ ) చంపబడిన వుమెన్ వెటర్నరీ డాక్టర్ (6.12.2019) డాక్టర్ ప్రియాంకారెడ్డి కేసును గురించి... కరోనా బాధితులకు ట్రీట్మెంటు చేస్తూ తన ఆరోగ్యాన్ని కూడ లెక్క చేయక మరణించిన డాక్టర్ కె. రోజీ ఆంధ్రా (23 సం.లు) ను గురించి.. మరికొందరు ముఖ్యులను గురించి విచారించి.. వారికి తన సానుభూతి తెలియచేసారు ఐ.జి. సక్సేనా.

    "సార్!... ఒక సందేహం... మీరు బొమ్మలుకూడ బాగా వేస్తారని విన్నాను... నిజమేనా!...” అడిగాడు కస్తూరి రంగ.

    "అవును... మీ సందేహం ఏమిటి?..."

    "ముమ్మూర్తుల మనిషిని పోలిన మనిషి వుండగలరా!..."

    "వైనాట్... వుండవచ్చు... మన పెద్దలు అంటూంటారు కదా!... మనిషిని పోలిన మనుషులు ఏడుమంది వుంటారని!..." చిరునవ్వుతో చెప్పాడు ఐ.జి.

    క్షణం తర్వాత... "అవును మిస్టర్ కస్తూరి రంగా!.. మీకు ఆ సందేహం ఎందుకు కలిగింది.?..." అడిగాడు ఐ.జి సక్సేనా…

    "ఒక కేసులో నేను అలాంటి సమస్యను ఎదుర్కొనవలసి వుంటుంది సార్…

    "సో... నీవు కూడా డబుల్ యాక్షన్ చేయవలసి వస్తుందేమో! నీవు చేయగలవు. నా మిత్రుడు అనంత్ నాగ్ నీ గురించి అన్నీ వివరాలు చెప్పాడు..." నవ్వాడు సక్సేనా…

    "సార్... విత్ యువర్ కైండ్ పర్మిషన్... షల్ ఐ మేక్ ఎ మూవ్!.."

    "వాటీజ్ టైమ్?..." అడిగాడు ఐ.జి.సక్సేనా.

    వాచీని చూచి “వన్ థర్టీ సార్!..." రంగా జవాబు.

    "ఆ... నేను హైదరాబాద్ మీ ఆఫీసుకు వచ్చివుండి... ఈటైమ్ దాకా డిస్కస్ చేసి... నీవు నాతో ఇపుడు చెప్పిన మాటను నేను చెబుతే... దీనికి నీవేమంటావ్?... నన్ను పొమ్మంటావా?..." చిరునవ్వుతో అడిగాడు ఐ.జి.సక్సేనా.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/r1q1A5UP8es

    16 min
  • ది ట్రాప్ ఎపిసోడ్ 20 | The Trap Episode 20 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ది ట్రాప్ ఎపిసోడ్ 20

    రచన : పాండ్రంకి సుబ్రమణి 

    (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    గత ఎపిసోడ్ లో

    భువనేశ్వర్ కొలీగ్ రాము, కమలను ఇష్టపడుతున్నట్లు చెబుతాడు.

    పెళ్లి చూపులు ఏర్పాటవుతాయి.

    రాము ఇండియాకి తిరిగి వచ్చే షరతు మీద పెళ్ళికి ఒప్పకుంటుంది కమలం.

    ఇక ది ట్రాప్.. 20 వ భాగం చదవండి…

    అన్నమాట ప్రకారం రాము అమెరికాలోని తన కంపెనీకి ముందుమాటగా విషయం చెప్పి, పెద్దల సమక్షాన కమలతో నిశ్చితార్థం జరిగిన తరవాత మిగతా విషయాలు సరిచూసుకుని రావడానికి న్యూజెర్సీ వెళ్లిపోయాడు.

    ప్రొఫెషనల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా అతడి ముందున్న లక్ష్యం ఒక్కటే—తానుగా స్టార్టప్ ని ఆరంభించాలి. లేదా—స్కిల్స్ తో నడపబడుతూన్న భారతీయ స్టార్టప్ తో చేరిపోవాలి. అన్నాళ్ళూ తను సముపార్జించుకున్న అనుభవంతో అలవర్చుకున్న టెక్నికల్ స్కిల్స్ ని పూర్తి స్థాయిలో ఆపరేషన్ కి పెట్టాలి. ఎట్టి పరిస్థితిలోనూ కమల నిరుత్సాహానికి లోను కాకుండా చూసుకోవాలి. వేదమూర్తి కుటుంబానికి తను అన్నివిధాలా తగిన అల్లుడని నిరూపించుకోవాలి. అప్పుడప్పుడు అనుభవాలకన్నా రచించుకున్న పథకాల కన్నా ఉద్వేగాలే కదా మనిషిని ముందుకు నడిపిస్తాయి—నియంత్రిస్తాయి. ఇదే కదా జీవిత సత్యం--

    ఇక మరొక ముఖ్యమైన విషయం యేమంటే రాము అలా న్యూజెర్సీ చేరుకున్న మూడు రోజుల తరవాత వాళ్ళకు అనుకూలమైన శుభముహూర్తం చూసి కామేశ్వరరావుకీ వసంతకీ—పరమేశ్వర్ కీ వినోదినికీ అమ్మవారి గుడి ప్రాంగణాన నిశ్చి తార్థం జరిగింది. దాదాపు అంతటా ఊరంతా చెప్పుకునేలా కళ్యాణోత్సవంలా జరిగింది. అప్పుడు మరొక సంఘటన-- అందరూ దాదాపు పూర్తిగా మరచిపోయారనుకున్న పవన్ ప్రేమ వ్యవహారాన్ని తానుగా గుర్తు పెట్టుకుని పరమేశ్వర్ తమ్ముడికి చెప్పాడు. “ఒరేయ్ తమ్ముడూ—నీ విషయమూ ప్రణీత విషయమూ నేను మరచిపోయాననుకునేవురోయ్—“

    చిన్నన్నయ్య నోట ఆ మాట విన్నంతనే పవన్ ఎమోషనల్ జెర్కింగ్ కి లోనయాడు. కళ్ళు పెద్దవి చేసుకుని అన్నాడు- “అందరితో బాటు నువ్వు కూడా మమ్మల్ని మరచిపోయావేమోనని భయపడ్డాననుకో— విషయాన్ని యెలా కదపాలో తెలియక తెగ డీలాపడి పోయాననుకో-  చాలా థేంక్సురా అన్నయ్యా-- “

    “ఓయ్! అన్నదమ్ముల మధ్య పెద్ద పెద్ద మాటలెందుకురా! కొన్ని విషయాలు బాహాటంగా డప్పులా చప్పుడు చేస్తూ జరగాలి. మరికొన్నేమో గుట్టుగా పట్టుదలతో చాకచక్యంతో జరగాలి. పూనుకున్న పనులు పూర్తి అయేంత వరకూ బయట ఏదీ పొక్కకూడదు. ఇప్పుడు అసలు సంగతి విను- మన కిరాణా షాపుని విస్తరించడానికి కావలసిన యేర్పాట్లు దాదాపు పూర్తయాయి. మనూరి ఫైనాన్స్ కంపెనీ నుండి రెండు మూడు రోజుల్లో లోన్ సాంక్షన్ అవుతుంది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/7Q8kKF8gsio

    22 min
  • Paganu Champina Sahasam | పగను చంపిన సాహసం | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    పగను చంపిన సాహసం

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    పెద్దలు ధైర్యే లక్ష్మి సాహసం అన్నారు. సాహసం అనేది కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలను రూపుమాపుతుంది. సాహసం సదా విజయానికి మూలం. పెద్దలు తమ పిల్లలకు పిరికితనాన్నినూరిపోయకుండా ధైర్య సాహసాలను చిన్న వయస్సు నుంచీ నేర్పాలి....

    "గుడ్ మార్నింగ్ ప్రాణనాథా"

    ఆరు గంటలకు లేచి, స్నానం చేసి, దీపారాధన చేసి, పాలు కాచి, నైవేద్యం పెట్టి, కాఫీ కలిపి ప్లాస్క్ లో పోసి, భర్త శ్రీహరిని లేపేటందుకు పడక గదిలోకి వచ్చింది సుధ. మంచం పై బోర్లా పడుకుని ఉన్నాడు శ్రీహరి. భార్య పలుకులను విన్నాడు. కళ్ళు తెరిచి... తన చేతితో సుధచేతిని పట్టుకొని మంచం మీదికి లాగాడు. సుధ మంచం పై కూర్చుంది. తన చేతులతో సుధ నడుమును చుట్టేశాడు.

    "నేను స్నానం చేశాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మీరూ లేచి స్నానం చేయండి. తన చేతులతో అతని చేతులను నవ్వుతూ విడదీసింది. మంచం దిగి నిలబడింది సుధ.

    "ఆదివారం స్పెషల్ కావాలి సుధా!..." ఓరకంట సుధ ముఖంలోకి చూసాడు శ్రీహరి.

    "ఆఁ... అదంతా రాత్రికి ఇప్పుడు కాదు. లేచి త్వరగా స్నానం చేయండి. నన్ను ఈరోజు గండిపేట గోల్కొండకు తీసుకుని వెళతానని మాట ఇచ్చారు. మరిచారా!..." చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ సత్యభామలా చూస్తూ పలికింది సుధ.

    "ఓ... ఆ మాటే మరిచాను డియర్!... సారీ... అర్థగంటలో రెడీ అవుతాను. టిఫిన్ దార్లో చేద్దాం." లేచి వేగంగా బాత్రూం వైపుకు వెళ్ళాడు శ్రీహరి.

    సుధ హాల్లోకి వచ్చి టీవీని ఆన్ చేసి సోఫాలో కూర్చుంది. శ్రీహరి స్నానం చేసి హాల్లోకి వచ్చాడు. ప్లాస్క్ లోని కాఫీని కప్పులో పోసి శ్రీహరికి అందించింది సుధ.

    ఇరువురు చక్కగా తయారై కార్లు కూర్చున్నారు‌ ఇరవై నిమిషాల్లో ఒక హోటల్ ముందు కారును పార్కు చేశాడు శ్రీహరి. ఇరువురూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేశారు.

    కారు ఎక్కి గోల్కొండకు చేరారు.శ్రీహరి, సుధ అన్నాచెల్లెళ్ల పిల్లలు. వారిరువురి వయస్సులో ఆరేళ్లు తేడా. సుధ మంచి అందగత్తె. ఎం ఏ వరకు చదివింది. శ్రీహరి సబ్ రిజిస్ట్రార్. మూడు నెలల క్రిందట వారి వివాహం జరిగింది. మంచి అన్యోన్యమైన దాంపత్యం.

    శ్రీహరి... సుధలు ఆ కోటలో ప్రవేశించారు. అన్ని ప్రాంతాలు తిరిగి చూశారు. సుధ గోల్కొండను చూడడం అదే మొదటిసారి. ఆనందంగా ఫోటోలు తీసుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని సమయాన్ని ఎంతో ఆనందంగా గడిపారు. అక్కడి నుంచి బయలుదేరి గండిపేట ప్రాంతానికి చేరారు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/9Ovnm_LroUM

    11 min
  • Ee Rakthapu Sindhuram | ఈ రక్తపు సింధూరం | Telugu Short Story | C. Jagapathi Babu | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఈ రక్తపు సింధూరం

    రచన: C. జగపతి బాబు

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల..

    ఇక్కడ ఆరవ తరగతి నుంచి, పదవ తరగతి పిల్లలు సుమారు వెయ్యి మంది దాకా ఈ పాఠశాలలో చదువుతుంటారు.

    ఈరోజు ఆగస్టు 15.

    అన్నీ బాగుంటే ఇప్పటికే త్రివర్ణ పతాకం గాల్లో రెపరెపలాడుతుండాలి. కానీ గుర్తు తెలియని ఎవ్వరో ముగ్గురు వ్యక్తులు మూడో అంతస్తు పైనుంచి దూకి చచ్చారు.

    ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ముగ్గురూ మూడు మతాల వారు అని వారు ధరించిన దుస్తులు వలన తెలుస్తోంది. ఒకరిది కాషాయం. మరొకరిది ఆకుపచ్చ. ఇంకొకరిది తెలుపు. అందులోనా వాళ్లు పండు ముసలి వాళ్లు.

    ఇక్కడ అందరి వాదన.. కొడుకులకు బరువైతే ఇంట్లో నుంచి గెంటేశారు. దిక్కు తోచక ఇక్కడ చస్తే కనీసం పోలీసులు కొడుకులకు బుద్ధి చెప్తారని చచ్చారు.. అనుకుంటున్నారు.

    కానీ కథ వేరే ఉంది! కసాయి వాడికి కూడా కన్నీళ్లు తెప్పించేలా ఉంది..!

    కూయ్! కూయ్! అని ఒక అంబులెన్స్ మరియు పోలీస్ సైరన్ తో ఒక జీపు అతి వేగంగా స్కూల్ గేట్ దగ్గరకు వచ్చి ఆగాయి. ఆ జీపులో నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ దిగి అంబులెన్స్ ని అక్కడికి రమ్మన్నట్లు కళ్ళతోనే సైగ చేసి చకచకా అడగులు వేస్తున్నాడు.

    కంగారుగా ఒక వ్యక్తి హెచ్ఎం సార్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, మెల్లగా ఇలా చెప్తున్నాడు "సార్.. పోలీసులు వస్తున్నట్టున్నారు. ఫార్మాలిటీస్.. తొక్క.. తోటకూరని దిక్కుమాలిన ప్రశ్నలు వేసి సాయంత్రం దాకా సమయం సరి చేస్తారు. అది ఏమి కుదరదని త్వరగా డెడ్ బాడీస్ తీసుకు వెళ్ళమని చెప్పండి. అసలే ఈరోజు ఆగస్టు 15. ఈ దరిద్రం లేకుంటే ఈపాటికే ఇక్కడ అందరం సంతోషంగా జెండా పండుగ జరుపుకునే వాళ్ళం" అని చెప్తుండగానే అతని చెంప చెళ్లుమంది. ఆ వ్యక్తి తల పైకి ఎత్తి చూసాడు. ఎదురుగా ఎస్సై. ఆ వ్యక్తి తన చెంపను రుద్దుకుంటూ "సార్, అది కాదు.." అని ఇంకేదో చెప్తుండేలోపే "నేను ఇక్కడికి వచ్చింది నీ యదవ సోది వినడానికి కాదు. ఈ సంఘటన ఎలా జరిగింది?" అన్నారు ఎస్ఐ గారు.

    ఆ వ్యక్తి “మాకు తెలియకనే కదా!,మిమ్మల్ని రమ్మంది." అన్నాడు. వెంటనే మళ్ళీ ఎస్సై గారు తన ఇంకొక చెంప చెళ్లుమనిపించాడు. తిరిగి ఆ వ్యక్తి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడలేదు. అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

    "హెచ్ఎం గారు.. మీరైనా చెప్పండి. ఇక్కడ ఈ సంఘటన ఎలా జరిగింది?" అన్నారు ఎస్ఐ గారు దూరంగా రక్తపు మడుగులో పడి ఉన్న మూడు శవాలను చూస్తూ...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/nynXDCeut9M


    31 min
  • Amma Chettu | అమ్మ చెట్టు | Telugu Short Story | Sujatha Thimmana | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    అమ్మ చెట్టు

    రచన: సుజాత తిమ్మన

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    పని ముగించుకొని మంచం మీద వాలాను. అమ్మ ఒడిలో ఒదిగి పడుకున్న భావన..

    అవును మరి, ఈ మంచం ఒకప్పటి అమ్మ నాటిన చెట్టు కదూ!

    మంచం ఏంటి.? చెట్టు ఏంటి? అనుకుంటున్నారా!

    అమ్మ తన చిన్నతనంలో చింత పిక్కలాట ఆడుకుంటూ..

    ఓ గింజని తన చిన్ని చేతులతో ( అప్పుడు తనకి అయిదేళ్ళట )వాళ్ళ ఇంటి పెరడులో నాటిందట.

    రోజు ఉదయం లేచింది మొదలు నీళ్ళు పోస్తూ,. మొక్క ఎప్పుడు వస్తుంది అనుకుంటూ చూసేదట. ఓ ఉదయం నేలని చీల్చుకుంటూ...ఓ చిన్ని మొలక కనిపించగానే... ఎగిరెగిరి గంతులు వేసిందట ఆనందంతో. ప్రతి రోజు ఆ మొక్కతో మాట్లాడుతూ.... తనతో పాటే.. మొక్కని ఏంతో ప్రేమతో పెంచుకుందిట.

    పెరటినిండా ఇంకా ఎన్నో చెట్లు, జామ, సపోటా, దానిమ్మ, నిమ్మ, డబ్బపండు, మామిడి ఇలా పండ్ల చెట్లే కాదు... మల్లె పందిరి చుట్టూ గులాబి పూవులు... కనకాంబరాలు... మందార... నందివర్ధం... సంపెంగ... ఇలా రకరకాల పూల చెట్లు ఎన్ని ఉన్నా... తన చేతులతో పెట్టిన గింజ మొలకెత్తింది అనే పిచ్చి ప్రేమని పెంచుకుందిట. పెళ్లి అయి అత్తవారింటికి వెళ్ళాలిసి వచ్చినప్పుడు ఆ చెట్టును వదిలి వెళ్లనని గోల గోలగా ఏడిచిందిట. తాతగారు ఈ గోల పడలేక ఆ ఇంటిని అమ్మకి కానుకగా ఇచ్చేసారుట..అప్పటి నుంచి అమ్మ కాపురం కూడా ఆ ఇంట్లోనే.

    నాన్నగారు ఈమె పిచ్చితనం చూసి ముసి ముసిగా నవ్వుకునే వారు.గంటల తరబడి ఆ చెట్టు దగ్గరే పనులు చేసుకుంటూ, పని అయినాక రేడియో పెట్టుకుని పాటలు వింటూ తనూ పాడుకుంటూ ఏంతో ఉత్సాహంగా ఉండేది.

    నన్ను తమ్ముడిని కుడా ఆ చెట్టు నీడలో కూర్చోబెట్టి చదువుకోమనేది. చింత చెట్టు కదూ! ఎంచక్కగా చింత చిగురుతో రకరకాలుగా వంటలు చేసి పెట్టేది. చింతకాయలతో పచ్చడి మా కొక్కళ్లకె కాదు... మా చుట్టాలందరికి ఇచ్చేది.

    చింతపండు సంవత్సరానికి సరిపడా మాకు ఉంచి మిగిలినది అందరికి పంచేది. ఆ చెట్టు కొమ్మకి తాడు కట్టుకొని మా స్నేహుతులం అందరమూ ఎంచక్కా ఉయ్యాలలూగే వాళ్ళం. ఇలా అమ్మతో పాటే మేము కూడా ఆ చింత చెట్టు తో మమకారం పెంచుకున్నాము.

    పెరిగి పెద్దవాళ్ళం అయ్యాము. ఇల్లు పాతబడి పోయినా అమ్మ మాత్రం మరమత్తులు చేయించేది కాని, మార్చటానికి వీలు లేదు అని గట్టిగా చెప్పేసింది.

    నా వివాహం జరిగి నేను ఆ చెట్టుని, ఇంటిని, ఆ వీధిని,ఆ ఊరిని, వదిలి ఈ పట్నం వచ్చి చేరాను, శ్రీవారి ఉద్యోగ రిత్యా…

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/_29oHYwLUU0

    9 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world