Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • సంపత్ సినిమా కథలు - 10 | Sampath Cinema Kathalu - 10 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సంపత్ సినిమా కథలు - 10

    రచన : S. సంపత్ కుమార్  

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    గత ఎపిసోడ్ లో

    లింగస్వామి, హాస్పిటల్ వెనుక గోడౌన్ లో మత్తు పదార్దాలు నిల్వ ఉంచినట్లు నారాయణకు  చెబుతాడు కిరణ్.

    డాక్టర్ సుజాతకు జరుగుతున్న విషయాలు చెబుతారు.

    ఆమెతో తన తండ్రికి ఫోన్ చేయిస్తాడు కిరణ్.

    లింగస్వామితో ఊటీకి వెళదామని చెబుతాడు రాజారావు.

    ఇక సంపత్ సినిమా కథలు ధారావాహిక పదవ భాగం చదవండి..

    పిచ్చి అవతారాన్ని ఒక రూములో కట్టేసి టైముకు  తిండి పెట్టీ అప్పుడప్పుడు రంగ భీమలకు కనపడేటట్టు చేస్తున్నాడు నారాయణ.

    “వీడు ఇంకా పిచ్చోడిలాగానే నటిస్తున్నాడు. వాడిని అలాగే నటించనీ. నీవు  మాత్రం ఏమీ తెలియనివాడిలా ఉండు” అని కిరణ్ చెప్పడం వలన నారాయణ కూడ అలాగే ఏమీ తెలియనివాడిలా ఉన్నాడు.

    నారాయణ, పిచ్చి అవతారం ఉన్న  రూములోకి వచ్చాడు.

    పిచ్చి అవతారం ఏమి తెలియనివాడిలా  " నాకు  ఇవ్వాల్సిన ఐదు కోట్లు ఎప్పుడూ ఇస్తావు " పిచ్చిగా నటిస్తూ అన్నాడు.

    "రెండు రోజులలో ఐదు కోట్లు ఇచ్చి నీ పిచ్చికి విముక్తి కలిగిస్తా పద " అంటూ హాస్పటలకు తీసుకెళ్ళాడు. కాని అంతకు ముందు లాగానే రంగ భీమలకు కనపడకుండా ఒక చోట హాస్పటలలో ఒక రూములో దాచాడు, రంగ భీమలకు వాడు ఇక్కడే ఉన్నాడు అని చూపించడానికి.

    హాస్పటల్ ఆవరణలో రంగ భీమ మాట్లాడుకుంటున్నారు.

    "మనకు ఆ నారాయణ ఉన్నప్పుడే ఆ పిచ్చి అవతారం కనపడుతున్నాడు. మళ్ళి తర్వాత కనపడటం లేదు" అన్నాడు రంగ.

    "అవును రా, మనం మనకు తెలియకుండానే మోస పోతున్నాం అనిపిస్తుంది."

    "లేదు.. ఏదో ప్లాన్ వేసి రేపు నారాయణ ఉన్నప్పుడు ఆ నరసింహను రమ్మని చెబుదాం "అంటూ నరసింహకి కాల్ చేసి రేపు రమ్మని చెప్పాడు రంగ.

    అంతలొ నారాయణ వచ్చి "ఏమి రా ఇద్దరి మధ్య  గుస గుసలు  భలే నడుస్తున్నాయి " అన్నాడు.

    "అబ్బే.. ఏమీ లేదు"

    "మీ గెస్ట్ హౌస్ లో మందు తాగుతుంటే ఆ దొంగ ఎవడో వచ్చి వంటి మీద ఉన్న బంగారం అంతా దోచుకెళ్లారు కదా.. అప్పటినుంచి మా ఆవిడతొ రోజూ గొడవ, ఇంట్లొ ప్రశాంతంగా ఉండకుండా పోతుందనే  బాధ భీమతో పంచుకుంటున్నా, ఇంతలో నీవు వచ్చావు."

    "అదా. నీకు శుభ వార్త చెబుతామని వచ్చాను. దొంగ తీసుకుని పోయిన బంగారం దొరికిందట. నాకు తెలిసిన పోలీస్ చెప్పాడు.. సొమ్ము ఇచ్చే ముందు మందు పార్టీ అడిగాడు.మన గెస్ట్ హౌస్ కి రమ్మన్నాను."

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/CNO7lEy_fwU

    14 min
  • సన్యాసం | Sanyasam | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సన్యాసం

    జీడిగుంట శ్రీనివాసరావు

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    యాగంటి గారి ప్రవచనలకి వెళ్తానని బయలుదేరుతున్న భర్త సుబ్బారావు వంక ఆశ్చర్యంగా చూసి, “మీకు భక్తి ఎప్పటినుంచి వచ్చింది?” అంది రమణి.

    “నాకు ఎన్నో ఏళ్ళ నుంచి గరుడపురాణం లో ఏముంటుంది, అందులో చెప్పినవి జరుగుతాయా అని అనుమానం. యిప్పుడు యాగంటి గారు ఎన్టీఆర్ స్టేడియం లో గరుడపురాణం చెపుతున్నారు. యిదే ఛాన్స్.. అందులో రహస్యాలు తెలుసుకుని జాగ్రత్తగా వుండటానికి” అన్నాడు సుబ్బారావు.

    “నా పుణ్యం పుచ్చింది కాబోలో.. మీకు యింత మంచి బుద్ది పుట్టింది, జాగ్రత్తగా వెళ్లి రండి” అంది రమణి.

    రాత్రి పది అయినా భర్త యింటికి రాకపోవడం తో కంగారుగా బయటకు వచ్చి రోడ్డు వైపు చూస్తో నుంచుంది. కార్లు వెళుతున్నాయి, వస్తున్నాయి కానీ మా కారు జాడ కనిపించలేదు. ఫోన్ తీసుకొని వెళ్తే డిస్టర్బ్ చేస్తారు అని ఫోన్ యింట్లో వదిలేసారు. ఏం మనిషో ఏమిటో అనుకుంటూ కారు లోపలికి రావడానికి  గేటు తీసి లోపలికి వచ్చింది.

    యింకో అరగంట తరువాత కారు హారన్ వినిపించడం తో తలుపు తీసి, “అమ్మయ్య, వచ్చారా? ఎందుకు యింత ఆలస్యం అయింది” అంది.

    కారులోనుంచి సంచి తీసి భార్య చేతికి యిచ్చి, “యిదిగో! రేపు ఉదయం మంచి టైం చూసి, సన్యాసం తీసుకుంటాను” అన్నాడు సుబ్బారావు.

    “సన్యాసం తీసుకునే వాళ్ళు ఈ సంచి నిండా కూరలు ఎందుకు తెచ్చారు?” అంది రమణి.

    “నీ కోసం, నాలుగు రోజులు సరిపోతాయి, తరువాత నువ్వే తెచ్చుకోగలవు” అన్నాడు.

    “ఒక్క రోజు ప్రవచనం వినగానే, సన్యాసం తీసుకోవాలి అనిపించిందా, ముందు చేతులు కడుక్కుని వచ్చి అన్నం తినండి, మీకిష్టమని కంది పచ్చడి, పచ్చిపులుసు చేసాను” అంది రమణి.

    “రేపు ఉదయం వరకు నీకిష్టమైనవి ఎన్నీ అయినా చేసి పెట్టు, తింటాను” అన్నాడు కంచం దగ్గరికి లాకుంటూ.

    ఉదయం లేవగానే బ్రష్ చేసుకుని తను వాడుతున్న మందులు అన్నీ తీసి సర్దుకుంటున్న భర్తని చూసి, “ఏమిటి ప్రొద్దున్నే మందులు చూసుకుంటున్నారు?” అంది రమణి.

    “సన్యసించినంత మాత్రనా షుగర్ కి, బీపీ కి మందులు వాడకపోతే, తపస్సు లేకుండానే స్వర్గానికి పోతాను, త్వరగా వెళ్లి సన్యాసి డ్రెస్ కొనుక్కోవాలి” అన్నాడు సుబ్బారావు.

    “అయితే నిజంగానే హిమాలయాలకు వెళ్తారా” అంది కాఫీ కప్ తీసుకొని వచ్చి.

    “సన్యాసులు అబద్దం చెప్పకూడదు, అది మొదటి నియమం” అన్నాడు.

    “అయితే వేడి వేడి కాఫీ వద్దా” అంది రమణి.

    “వద్దు, మానేసాను” అన్నాడు సుబ్బారావు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/XtOIRbqGSMs

    12 min
  • ది ట్రాప్ ఎపిసోడ్ 19 | The Trap Episode 19 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ది ట్రాప్ ఎపిసోడ్ 19

    రచన : పాండ్రంకి సుబ్రమణి 

    (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    గత ఎపిసోడ్ లో

    పరమేశ్వర్ అంటే తనకిష్టమని అతనితోనే చెబుతుంది వినోదిని.

    తనకు కూడా వినోదిని అంటే ఇష్టమని చెబుతాడు పరమేశ్వర్.

    ప్రభావతి పుట్టిన రోజు ఘనంగా జరుగుతుంది.

    ఇక ది ట్రాప్.. 19 వ భాగం చదవండి…

    ఎప్పుడో యెక్కడో వాల్మీకి మహర్షి ధ్యాన నిమగ్నుడై ఉన్నప్పుడు స్వఛ్ఛమైన మంచితనం గురించి యిలా అన్నాడట- “మంచి మనసు గల మనిషి ప్రక్కన కూర్చుని మాట్లాడితే చల్లగా పారే స్వఛ్ఛమైన సెలయేరు ప్రక్కన ఉన్నట్లుంటుంది! ”అని--  ఆ కోవన చూస్తే గుభాళించే మంచి మనసుల్ని పూలతీగలతో పోల్చవచ్చేమో-- తీగ తీగకూ మొగ్గ నిశ్శబ్దంగా నిండుగా తొడగుతూ అడుగడుగునా పుష్పిస్తూ బ్రతుకు బాటను చైత్రరథంలా మారుస్తుంది. జీవన సారాన్ని అమృత మయం చేస్తుంది.

    మొదట వేదమూర్తి దంపతులకు, ఇంటి పెద్దలు మంగళా దేవమ్మ వినాయకం దంపతులకు సంకటమైన పరిస్థితి యెదురైంది. దానిని దాటి ఎలా ముందుకు సాగాలో తెలియలేదు. వేదమూర్తి చిన్ననాటి నేస్తమూ ఫార్మా కంపెనీ ఓనర్ ఐన దివాకర్ తన కూతురు వినోదినిని తోటలోని పూల మొక్కలా వికసిస్తూ న్న విద్యావంతుడు పరమేశ్వర్ కి యివ్వడానికి కూతూహలం చూపించాడు. కాని పెద్దవాడు కామేశ్వరరావు సంగతి యెత్తనే లేదు. ఇకపోతే పెళ్ళీడుకొచ్చిన వాళ్ళ వదిన కూతురు తులసి పెళ్ళి సంగతి యెత్తుతారని ఆశించారు అప్పుడా యిప్పుడా అని, వేదమూర్తి దంపతులిద్దరూ— కాని ఎవరూ తులసి ఉనికే యెత్తలేదు. తులసి ఊసు దివాకర్ యెత్తుతాడని, అతణ్ణి మాటల్లోకి దింపుదామని భార్యాభర్తలిద్దరూ యెదురు చూసారు. కాని అలా యెదురు చూడటం అత్యాశవుతుందేమోనని జంకారు. కాని— ఆ సమస్యను కూడా దాటి విద్యావంతుడు ప్రభుత్వ ఉద్యోగి అయిన విశ్వం తన కూతురు వసంతను కామేశ్వరరావుకి యివ్వడానికి ముందుకొచ్చాడు. ఇది దైవ సంకల్పం కాదూ!

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/WeOJLhu01DM

    17 min
  • కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 13 | Kasthuri Ranga Ranga Episode 13 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కస్తూరి రంగ రంగా!! 13

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    గత ఎపిసోడ్ లో

    పున్నయ్యను బైక్ లో ఫాలో చేస్తాడు కస్తూరి రంగా.

    అతను తనకు మేనమామ అవుతాడని వసంత్ తో చెబుతాడు.

    పున్నయ్యకు భూషణ్ కుమార్ తో ఉన్న పరిచయం గురించి అతన్ని ప్రశ్నిస్తాడు.

    ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 13 చదవండి.

    "చూడు మామా!.. మనం విడిపోయి పదహారేళ్లకు పైమాట... అప్పటికి నీలో నాలో ఎంతో తేడా... నేను పోలీస్... పోలీస్!.. మరి నీవు ఎవరు?... ఏంచేస్తున్నావ్?..... చిరునవ్వుతో అడిగాడు కస్తూరి రంగ.

    "కాంట్రాక్టర్!..."

    "ఎక్కడ?..."

    "హైదరాబాద్లో..."

    "వుండేది?..."

    అక్కడే!..."

    "ఇక్కడికి ఎందుకొచ్చావ్?...".

    "కాంట్రాక్టు పని మీదనే..."

    "మొన్న ఆ మధ్యన రేపల్లెలో జరిగిన బాంబ్ బ్లాస్ట్... హైవేలో సయ్యద్ సార్ చిన్నకొడుకు సుల్తాన్ ఇతరులు... జీప్ బ్లాస్ట్ కు కారకులు ఎవరో నీకేమైనా తెలుసా మామా!..." అనునయంగా అడిగాడు రంగ.

    "సార్!.. నాకేం తెలీదు సార్... తెలీదు.." తొట్రుపాటుతో చెప్పాడు పున్నయ్య.

    "చూడు పున్నయ్య మామా!..." చిరునవ్వుతో రంగా…

    దీనంగా చెమట కారుతున్న ముఖంతో కస్తూరిరంగ ముఖంలోకి చూచాడు. పున్నయ్య.

    "నాకు... ఆ బ్లాస్ట్ లకు నీ ఫ్రెండ్ భూషణ్ కుమార్ కు సంబంధం వుందన్న అనుమానం. నీకు తెలిసిన నిజాలు చెబితే నీకు సన్మానం చేస్తా. అబద్ధం చెప్పావో... వసంత్!... ఏంచేస్తావో చెప్పు..." నవ్వుతూ అన్నాడు కస్తూరిరంగ.

    "మామా!..." వసంత్ పిలుపు.

    ఉలిక్కిపడి పున్నయ్య వసంత్ ముఖంలోకి దీనంగా చూచాడు.

    "వీరు నాకు అన్నయ్యగారు... కనుక మీరు నాకూ... అదే వరుస... మీ మాటలో తేడా వుంటే... మీ షేపే మారిపోద్ది మామ..." అనునయంగా చెప్పాడు వసంత్...

    రంగా చిరునవ్వుతో పున్నయ్య ముఖంలోకి చూచాడు…

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/qnPaXqJir0g

    21 min
  • మంచి మనసు Manchi Manasu | Telugu Short Story | Mukkamala Janakiram | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    మంచి మనసు

    రచన: ముక్కామల జానకిరామ్

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    సిరి ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. తెలివైన,మంచి మనసున్న అమ్మాయి కూడా. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ఇట్టే అప్పచెప్పేది. వీధిలో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తలలో నాలుకలా ఉండేది సిరి. అందుకే సిరి అంటే ఉపాధ్యాయులకే కాదు ఊరు వారందరికీ చాలా ఇష్టం.

    పెద్దలతో మర్యాదగా మాట్లాడేది. అమ్మా నాన్నలకు ఇంటి పనిలో సహాయం చేసేది. ఏ పని చెప్పినా చిటికెలో చేసి పెట్టేది సిరి.

    పాఠశాలకు వెళ్ళేటప్పుడు,వచ్చేటప్పుడు సిరికి దారి పొడవునా స్నేహితులే. అందరినీ మందలిస్తూ బాగోగులు తెలుసుకుంటూ పాఠశాలకు చేరుకునేది. చిన్న వయసులోనే ఇన్ని తెలివితేటలు ఉన్న సిరిని చూసి తల్లిదండ్రులు కూడా మురిసిపోయేవారు.

    ఒకరోజు సిరి అనారోగ్యానికి గురి కావడంతో మూడు రోజులు పాఠశాలకు వెళ్ళలేదు. సిరి కనిపించకపోవడంతో వీధిలోని బామ్మలంతా వాకబు చేస్తూ సిరి ఇంటికి చేరుకున్నారు. వారిని చూసి ఆశ్చర్యపోయిన సిరి వాళ్ళ నాన్న 'ఇలా వచ్చారు ఏంటి బామ్మా!' అని అడిగారు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/OIhUlcPlEak

    3 min
  • మోసపోయిన స్నేహితుడు | Mosapoyina Snehithudu | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    మోసపోయిన స్నేహితుడు

    రచన: కిడాల శివకృష్ణ

    (ఉత్తమ నవతరం రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మిత్రులు ఉన్నారు, ఈ ఇద్దరు మిత్రులలో ఒకరు ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన పేరు చంద్ర.

    ఇంకొకరు వ్యాపారాన్ని మొదలుపెట్టాలి అనే ఆలోచనతో ఉన్నాడు. ఈయన పేరు రవి.

    ఈ విషయాన్ని తన మిత్రుడైన చంద్రకు చెప్పాడు రవి.

    అప్పుడు చంద్ర సరే నేనుకూడా నీకు పెట్టుబడికి సాయంగా కొంత మొత్తంలో డబ్బును ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు ఎలాగో నీవు కూడా డబ్బును పెట్టుబడి పెట్టడానికి ముందు వస్తున్నావు కాబట్టి ఇద్దరం కలిసి పాట్నర్స్ గా ఉందామని రవి చెప్పాడు.

    అనుకున్న విధంగానే ఒకే వ్యాపారాన్ని ఇద్దరి పెట్టుబడులతో మొదలుపెట్టారు, కొన్నాళ్ళు సాఫీగానే నడిపారు ఇద్దరు మిత్రులు వ్యాపారాన్ని.

    చంద్ర ఎప్పుడో ఒక్కసారి మాత్రమే షాప్ ను చూడటానికి వచ్చే వాడు. రవి మాత్రం ఎప్పుడూ షాప్ ను చూసుకుంటూ వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. అయితే చంద్ర తన అవసరాల నిమిత్తం తన పెట్టుబడి మొత్తాన్ని తీసుకుని ఖర్చు చేసుకుంటూ ఉన్న పెట్టుబడి మొత్తాన్ని రవి దగ్గర నుండి తీసేసుకున్నాడు.

    రవి కూడా సరేలే వాడి డబ్బులే కదా వాడు ఖర్చు చేసుకోవడంలో తప్పులేదు నేను అడ్డు చెప్పడం సబబు కాదని అడిగినప్పుడు అడిగినంత ఇచ్చేశాడు. కొన్ని రోజులకు చంద్ర షాప్ దగ్గరికి వచ్చాడు. వచ్చి నా డబ్బులు నాకు ఇవ్వు అంటూ మాటలతో యుద్ధం చేశాడు.

    అయినప్పటికీ రవి తను ఇచ్చిన మొత్తానికి సంభంధించిన ఆధారాలను చూపించి “నీ పెట్టుబడి మొత్తాన్ని నీవు ఖర్చు చేశావు. నేను నీకు ఇచ్చాను” అంటూ ఆధారాలను చూపించి చెప్పాడు.

    అప్పుడు చంద్ర “నాకు అదంతా సంబంధం లేదు. నాకు ఇప్పుడు డబ్బులు కావాలి” అన్నాడు. సరే నా మిత్రుడే కదా డబ్బులు అడుగుతున్నాడు.. ఇప్పుడు ఇచ్చినా నేను తర్వాత అయినా సంపాదించుకుంటాను అనుకుని అడిగినంత డబ్బు ఇచ్చేశాడు రవి.

    ఇదిలా ఉండగా మరో రెండు నెలలకే చంద్ర నుంచి రవికి కాల్ వచ్చింది. “నేను పోలీస్ స్టేషన్లో నీమీద కేస్ పెట్టాను, నువ్వు నాకు డబ్బు ఇవ్వాల్సిందే. నేను మొదట్లో ఇచ్చిన డబ్బు మొత్తం..” అంటూ మాట్లాడసాగాడు చంద్ర.

    ఆ మాటలు విన్న రవికీ విషయం మొత్తం అర్థం అయిపోయింది. తన మిత్రుడే తనని మోసం చేశాడు. ఇంకా మోసం చేయాలి అనుకుంటున్నాడు అన్న విషయం. వెంటనే రవి తన మామగారి సహాయంతో పోలీస్ స్టేషన్లో ఆధారాలు చూయిస్తూ జరిగిన సంఘటనను పూస గుచ్చినట్లు వివరించాడు. అయినప్పటికీ 

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/QZMnHrEx7Jo


    5 min
  • ఆమ్లెట్ | Amlet | Telugu Short Story | Madduri Bindumadhavi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఆమ్లెట్

    రచన: మద్దూరి బిందుమాధవి

    (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఆ పూట గిరిజ తన షిఫ్ట్ అయ్యాక బట్టలు మార్చుకోవటానికి రూం లోకి వచ్చింది.

    బాగా అలసటగా ఉంది. నిన్న రాత్రి నించి ఈ రోజు ఉదయం వరకు తన అసలు డ్యూటీ. ఇవ్వాళ్ళ డబుల్ డ్యూటీ! కానీ అలసటకి కారణం మాత్రం అది కాదు.

    మనసంతా ఆందోళనగా ఉంది. మధ్యాహ్నం లంచ్ కూడా తినబుద్ధి కాలేదు.

    కడుపులో ఎవరో చెయ్యి పెట్టి తిప్పుతున్న భావన.

    ఇన్నాళ్ళ నించి హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నా ఇలాంటి దిగులు ఎప్పుడు కలగలేదు.

    ఎవరో తనని పిలుస్తున్నట్టు భావన! అది తన భావనే కానీ నిజం కాదని తెలుసు. అయినా గిరిజ తలతిప్పిచూస్తోంది.

    తప్పు చేశావన్నట్టు తనని ప్రశ్నిస్తున్న ఆలాపన!

    @@@@

    "గిరిజా...ఈ రోజు గైనిక్ వార్డ్ నర్స్ ముఖ్యమైన పని ఉందని వెళ్ళి పోయింది. అక్కడ ఎక్స్ట్రా డ్యూటీ చెయ్యాలి" అన్నది డాక్టర్ సరళ.

    "అలాగే మేడం" అన్నది గిరిజ యధాలాపంగా.

    లేబర్ రూం లో..గైనిక్ వార్డ్ లో డ్యూటీ కి ప్రత్యేకమైన పరిణతి.. శిక్షణ ఉండాలని డా. సరళ భావన. గిరిజ ఇంకా జూనియర్. అంత అనుభవం లేదు.

    జనరల్ వార్డు డ్యూటీ తో పాటు పోస్ట్ ఆపరేషన్ వార్డులో రోగుల టెంపరేచర్ చూడటం..టైం ప్రకారం మందులుఇవ్వటం..డ్రెసింగ్ చెయ్యటం..ఆర్థో వార్డులో రోగులకి ఫిజియో థెరపీ చెయ్యటం... డాక్టర్ రౌండ్స్ కి వచ్చినప్పుడుసహాయకురాలుగా ఉండటం..చిన్న పిల్లల వార్డులో డ్యూటీ..ఇవే ఎక్కువగా గిరిజ దైనిందిన డ్యూటీలు.

    నర్స్ వృత్తి అంటే అత్యంత గౌరవం గిరిజకి.

    ఎంతో మంది శారీరక బాధలు దగ్గరనించి చూసి..వారి మానసిక సమస్యలు విని..ఊరట కలిగించటం అంటేభగవంతుడి సేవగా భావిస్తుంది.

    కుటుంబ సభ్యులకి కూడా చెప్పుకోలేని అనేక సమస్యలని, ఆర్ధిక బాధలని తమ పైన ఎంతో నమ్మకంతో తమ దగ్గరమాట్లాడే రోగులంటే గిరిజకి ఎంతో ప్రేమ.. ఆత్మీయత.

    రెండేళ్ళ నించి ఆ హాస్పిటల్లో పని చేస్తూ ఉన్నా..గిరిజకి ఈ రోజే గైనిక్ వార్డు డ్యూటీ పడింది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/TXMI2fKnibI

    9 min
  • క్రమవర్తనం | Kramavarthanam | TeluguArticle | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    క్రమవర్తనం

    సిహెచ్. సీఎస్. శర్మ

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    తల్లిదండ్రులు గురువులు పిల్లలకు చక్కటి ఆదర్శాలను నేర్పుతారు. ఎదిగే కొద్దీ కొందరు పిల్లలు ఆ నీతి వాక్యాలను గాలికి వదిలేస్తారు. వారి దృష్టిలో కాలగమనంలో ఆశయాలు ఆచరణకు అందనవిగా మారిపోతాయి.  కొందరి విషయంలో ఆశయాలు వారి క్రమవర్తన... తత్వ రీత్యా వారికి అనుకూలం. అవుతాయి.

    ప్రతి మనిషికి ఆశలు వుంటాయి. ఆశయాలూ వుంటాయి. తమ లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలను కుంటారు కొందరు. అంటే వారి చర్యల వలన ఇతరులకు కలిగే బాధలు వారికి లెక్కలేదు. వారి లక్ష్యసాధనే వారికి ముఖ్యం. యిది నేటి సభ్యసమాజంలో సిద్ధాంతంగా నమ్మి ఆచరించే విధానం. వీరు వారి జీవిత విధానాన్ని ఇలాగే సాగించి సాగించి... ఒక నాడు మట్టిలో కలిసిపోతారు. జనం, పోయిన వారిని గురించి వారికి బాధలేదు. ఆనందమేమో!...

    బహు కొద్దిమంది నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ... ఎన్నో కష్టాలను, కన్నీటినీ అనుభవిస్తూ... 'అంతా నీ నిర్ణయం' అని పై వాణ్ణి తలచుకొంటూ... బరువు బ్రతుకులను లాగి లాగి, కడకు కళ్ళు మూస్తారు. అన్ని వర్గాల వారిలోను... యీ రెండు తెగల వ్యక్తులు కొందరున్నారు. 'చెట్టు కొలది గాలి' అన్నట్లు వర్తిస్తున్నారు.

    ప్రతి తల్లిదండ్రులు సంతతి కలిగినప్పటినుంచి వారిని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి భావిలో ప్రయోజకులై తమకు ఆనందాన్ని... గౌరవాన్ని కలిగించి... తమకు వయస్సు మీరిన తర్వాత... అండదండలుగా సాయంగా నిలుస్తారని ఆశిస్తారు. బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి వారు చేసే ప్రతి పనిలో బిడ్డల యోగ క్షేమాలు దాగి ఉంటాయి. వారి మహత్తర ఆశయం తన బిడ్డలు భవిష్యత్తులో అన్ని విధాల బాగుండాలని.,వారు తమకంటే గొప్పవారు కావాలని.

    కానీ!... ఎందరో బిడ్డలు చదివి... విజ్ఞానాన్ని సంపాదించుకొని... ఉద్యోగాన్ని సాధించి... నచ్చిన సుందరాంగిని అర్ధాంగిగా చేసుకుని... తమ వర్తమానాన్ని కేవలం తమ స్వార్ధ పూరిత లక్ష్యసాధనలో గతాన్ని మరచి ముందుకు సాగుతున్నారు.

    ఈ విధానంలో నడిచే వారి వలన వారి తల్లిదండ్రులకు అయిన వారికి ఎన్నో కష్టాలు నష్టాలు. వీడి గోడును వారు లెక్కచేయరు. ఇందులో మరో విశేషం!... జీవిత భాగస్వామి సలహాల ఆచరణ... ఆ ఇల్లాలు మంచి మనస్సు కలదై పుట్టింటి వారిని అత్త ఇంటి వారిని ఒకే రీతిగా చూసుకునే మనస్తత్వం కలిగినదైతే... వారి చర్యలలో మార్పు ఏర్పడదు. దీనికి విరుద్ధంగా అగ్నికి ఆజ్యం తోడైనట్లు భాగస్వామి భర్తతో కలిసిపోతే... అయ్యగారు ఆటబొమ్మగా మారి భార్యా విధేయుడనే సార్ధక నామధేయుడై... అయినవారికి దూరమై... కడకు ఒకనాడు ఊహించని చిక్కుల్లో పడిపోతాడు. వీరి వద్ద పెరిగే వీరి సంతతి చిన్న వయస్సు నుండే వికృతంగా తయారవుతారు.

    తల్లితండ్రులఅక్రమవర్తనం బిడ్డల పాలిట శాపంగా మారిపోతుంది. చేతులు కాలిన పిదప ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం?...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/VKQ2Y0XzmBM

    7 min
  • స్వామీజీ మందు | Swamiji Mandu | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    స్వామీజీ మందు

    రచన : జీడిగుంట శ్రీనివాసరావు

    (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    “ఏమండీ వదినగారూ.. ఎలా ఉన్నారు? ఒకసారి ఇటు వస్తారా” అన్నారు పక్కింటి పిన్ని గారు ఆమె గోడ వెనక నుంచి.

    “ఆ, వస్తున్నా వదిన గారూ!” అంటూ చేయి తుడుచు కుని సీతమ్మగారు “ఆ చెప్పండి వదిన గారు.. విశేషాలు ఏమిటి” అంది.

    “విశేషాలు ఏమున్నాయ్ వదిన గారూ! మీ అన్నయ్య గారు ఒక పని చేస్తారా.. పొద్దున్నే లేచి బజార్ వెళ్తే ఆయన ఫ్రెండ్ ఒకతను కనిపించి స్వామీజీ కనిపించాడు. తాను హిమాలయాల నుంచి హైదరాబాదు నడచి వచ్చాడుటా.. ఎందుకంటే కరోనా కి మంచి మందు పచ్చి కాకరకాయ కరకరా నమిలి మింగాలిట అని సెలవిచ్చాడు.

    దానితో ఈ పిచ్చ జనమంతా బజార్ వెళ్లి బుట్టలు బుట్టలు కాకరకాయలు కొనేశారు. ఈయనకి ఒక్క కాకరకాయ కూడా మిగలలేదు. దాంతో ఇంటికి వచ్చి ఒకటే చిందులు. ‘ఎలాగైనా సరే ఈ రోజు రెండు పచ్చి కాకర కాయలు నమలాలిసిందే.. లేదంటే నాకు కరోనా వచ్చేటట్లు ఉంది. అసలే నా ముందు వాడు తుమ్ములు తుమ్మాడు’ అని ఒకటే గొడవ పెడుతున్నారు.

    ఇంట్లో చూస్తే ఒక్క కాకరకాయ కూడా లేదు సీతమ్మ తల్లి..  మీ మీ ఇంట్లో రెండు కాకరకాయలు ఉంటే ఇస్తే ఆయన్ని శాంతింప చేస్తాను.” అన్నారు పక్కింటి పిన్ని గారు.

    “అలాగే వదినగారూ! ఈ విషయం మా ఆయన దాకా వచ్చినట్టు లేదు. కాకరకాయ కేమి భాగ్యo.. యిప్పుడే తెస్తాను వుండండి” అని సీతమ్మ గారు లోపలికి నడిచింది.

    తన శ్రీవారు లేచినట్లులేదు అనుకుంటూ ఫ్రీజ్ తీస్తోవుంటే ‘కర్ కర్ కర్’ అని చప్పుడు వచ్చింది. అప్పుడే ప్రిజ్ పాడైంది ఏమిటి అనుకుంటూ కూరల బాస్కెట్లో వున్న కాకరకాయలు బయటికి తీసి ఫ్రిజ్ తలుపు వేస్తోవుంటే మళ్ళీ ‘కర్ కర్’ చప్పుడు వస్తోంది. వున్న కాయలలో మంచివి ఒక పదికాయలు తీసి టేబుల్ మీద పెట్టి, మిగిలిన కాయలు పక్కింటి వదిన గారికి యిచ్చి,  లోపలకి వస్తోవుంటే, అప్పుడు కనిపించారు ఆయన చేతిలో రెండు పొడుగు కాకరకాయలు పట్టుకొని,  ఒకటి నములుతూ కనిపించారు. ఆయన పేరు రాఘవ రావు.

    ‘అయ్యో లేవటం అయింది.. నమలడం కూడా మొదలుపెట్టేశారా!’  అనుకున్నాను.

    “యిటువంటి సలహాలు మీ దగ్గరికి ముందే వస్తాయని తెలుసు. కర్ కర్  అని వినిపిస్తే ప్రిజ్  ప్రాబ్లెమ్ అనుకున్నాను. ఆ కర కర మీరా” అంటుండగానే,  రాఘవరావు ఒక్కసారిగా బళ్ళు మంటూ వామిటింగ్ చేసుకున్నాడు  .

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/KxZ_xC80UjE

    12 min
  • లీలా మానస నిగ్రహ | Leela Manasa Nigraha | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లీలా మానస నిగ్రహ

    రచన: వసుంధర 

    (ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత)

    నేను మాలతిఅత్త ఇల్లు చేరేసరికి రాత్రి పదయింది. అత్త, బావ మానస్, మానస్ భార్య

    లీల నన్ను సాదరంగా ఆహ్వానించారు. అతిథులకని అన్ని సదుపాయాలూ ఉన్న గది

    నాకిచ్చారు. తలుపులేసుకుని పడుకుంటే మంచి నిద్ర పట్టింది. మర్నాడుదయం

    మెలకువొచ్చేసరికి- ఇంట్లోవాళ్లు లేచి తిరుగుతున్న హడావుడి తెలుస్తోంది. త్వరగా

    తెమిలి- తలుపు తియ్యబోయి ఆగిపోయాను.

    “ఉద్యోగం చేస్తున్నావ్ సరే! అంతమాత్రాన ఆడదానివి కాకుండా పోతావా? కనీసం కాఫీ

    ఐనా సరిగ్గా పెట్టివ్వలేవా?” అరిచాడు మానస్ బావ.

    బావ నెమ్మదస్థుడు. మర్యాదస్థుడు. సంస్కారి. అలాంటి వాడు సంసారి కాగానే ఇంత

    గట్టిగా భార్యమీద అరవడమా- పెళ్లామని లోకువా?

    లీలమీద జాలిపడేదాన్నే. కానీ అంతలోనే- అరవలేదు కానీ దురుసుగా, మోటుగా లీల

    గొంతు- “ఉద్యోగం పురుష లక్షణం. ఉద్యోగస్థురాల్ని కాబట్టి, నేను పెట్టే కాఫీ మగాళ్ల

    కాఫీలాగే ఉంటుంది”

    నేను లేచానని తెలియక వాళ్లు నిస్సంకోచంగా గొడవ పడుతున్నారనుకుందుకు లేదు.

    తర్వాత నన్ను చూసి కూడా, వాళ్లిద్దరూ నా ఊహకందని కుసంస్కారంతో నిస్సంకోచంగా

    వాగ్యుద్ధం కొనసాగించారు.

    వాళ్లది ప్రేమ వివాహం. ఎంతో అన్యోన్యంగా ఉన్నారనుకున్నాను. ఏమయింది వాళ్ల

    ప్రేమకి?

    -----

    ప్రేమే దైవం అంటారు. దైవానికి లాగే ప్రేమకూ ఎన్నో రూపాలు. దైవభక్తుల్లో కొందరిలాగే

    ప్రేమభక్తుల్లో కొందరు ఇతర రూపాలవారిని ద్వేషిస్తారు, వారితో కలహిస్తారు.

    బిడ్డను కనాలంటే తల్లి నవమాసాలు కడుపులో మోయాలి. ప్రాణం పోతోందనిపించే

    పురిటినొప్పులు భరించాలి. ఆ పుట్టిన బిడ్డపై తల్లికుండేది పగ కాదు, ప్రేమ! అది అన్ని

    ప్రేమల్లోకీ ప్రత్యేకం.

    తల్లిప్రేమను ప్రశంసిస్తూ ఎన్నో కథలొచ్చాయి. పాటలొచ్చాయి. ఇంకా వస్తున్నాయి. కానీ

    ఏనుగు ప్రత్యేకత కళ్లతో చూడాలి కానీ, చేతులతో తడిమితే అవగాహనకు రాదుకదా!

    తల్లిప్రేమ కూడా అనుభవైకవేద్యం.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/ow9cugMuprU


    14 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world