
Sign up to save your podcasts
Or


(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
పరివర్తన
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
తమది సామాన్యమైన కుటుంబం. నాన్న ఒక్కరిదే సంపాదన. తనూ, అమూల్య వారి సంతానం. డిగ్రీ పూర్తి అయింది తనకు. అమూల్య ఇంజనీరింగ్ చదువుతానని పట్టుబట్టి మరీ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయింది. దాని అదృష్టం ఉన్న ఊళ్లోనే సీట్ రావడం.
తనూ ‘ అమూ’ ఎంతో సన్నిహితంగా ఉంటారు. చెప్పాలంటే మంచి స్నేహితులులాగ. తనకి అమూల్య అంటే పంచ ప్రాణాలు. దానికీ అంతే. అమ్మా నాన్నా మాట వినని అది తను ఎంత చెపితే అంత. తనకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు.
అనుకోకుండా ఒక రోజున తెలుగు మాట్రిమోనీ లోని మీ అమ్మాయి సమీర ప్రొఫైల్ మాకు చాలా నచ్చింది, మా అబ్బాయి రిక్వైర్ మెంట్స్ కి బాగా కలసిందంటూ ఎవరో స్వర్ణలత అనే ఆవిడ ఫోన్ చేయడం, ఆ తరువాత పెళ్ళి చూపులూ అవీ చక చకా జరిగిపోయాయి. స్వర్ణలత కొడుకు ఐ. ఓ. సీ. ఎల్ లో కెమికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. పైగా స్తితిమంతులు. అమ్మా నాన్నకూ సంబంధం బాగా నచ్చడంతో ' ఏమ్మా 'మీరా', అదృష్టవంతురాలివి, సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది' నీకు ఆ అబ్బాయి నచ్చాడు కదూ అనేసరికి మౌనంగా తల ఊపింది.
బాంబే లో దివాకర్ తో తన వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడుస్తుందని ఊహలల్లుకుంది. కానీ అటువంటి ఊహలకు, సరదాలకు, ప్రేమావేశానికి అర్ధమేమిటో తెలియని తన భర్తత తో నిస్సారమైన సంసారం మొదలైపోయింది. తప్పతాగి ఎప్పుడో అర్ధరాత్రి గాని ఇల్లు చేరడు. ఎంతకీ ఇల్లు చేరని భర్తకోసం నిండుయవ్వనంలో ఉన్న తను ఎదురు చూస్తుంటే అత్తగారు మాత్రం బాగా అలంకరించుకుని మామగారితో పార్టీలకు ఫంక్షన్సుకూ వెళ్లిపోయేది. అత్తగారితో చెపితే ‘వాడంతే, సర్దుకుపోవాలంటూ’ చెప్పేదేకానీ, కొడుకుతో తాగుడు మానేయమని గానీ, భార్యను ప్రేమగా చూసుకోమని గానీ చెప్పకపోవడం తనకు ఆశ్చర్యరంగా అనిపించేది. పైగా అత్తగారి తృణీకార ధోరణి, నిరాదరణ, డబ్బుగల వాళ్లమనే అహం, ఆ ఇంట్లో తన స్తానమేమిటో అర్ధం అయ్యేది కాదు. అందరూ తనను దూరంగానే ఉంచేవారు. స్వర్ణలత లేడీస్ క్లబ్ సెక్రటరీ. తన కొడుక్కి ఒక మధ్యతరగతి అమ్మాయిని కోడలుగా చేసుకుందని మంచి మనసున్న వ్యక్తి అని బయట మెప్పు సంపాందించింది.
తన భర్త వ్యసనపరుడని, ములుకుల్లాంటి మాటలతో అత్తగారు, ఆడపడుచులు తనను గాయ పరుస్తున్నారన్న వాస్తవాన్ని అమ్మా, నాన్నకూ కనీసం తన ప్రియమైన చెల్లెలు 'అమూ' కి ఎందుకో చెప్పలేకపోయింది.
ప్రేమకోసం, ఆదరణకోసం తపించే మనసు ఏ అమావాస్యకో పున్నమికో చాచిన అతని చేతుల్లో ఆత్మాభిమానాన్ని విడిచి కరగిపోయేది. అతనిలో ఏమాత్రం ప్రేమరాహిత్యం ఉండేదికాదు. తాగుడుమైకంలో ఇంటికి చేరడం, తిండి తినేసి దుంగలా పక్కమీద చేరి నిద్రపోవడం, పొద్దుట లేవగానే ఆదరాబాదరా ఆఫీసుకి పరుగెత్తడం.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/pDAZ6BMpeYI
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
అనగనగా ఓ ప్రేమ కథ
రచన: N. ధనలక్ష్మి
(ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఊహ తెలిసినప్పటి నుంచి నేను కోరుకున్న నా ప్రేమ, నేను కోరుకున్న జీవితాన్ని ఈ రోజు అందుకుంటున్నా. ఇంకో గంటలో నా బావకి నేను సొంతం కాబోతున్నా.
‘ఐ లవ్ యూ’..
‘ఈ మాట నా నోట వినాలని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నావుగా.. నేను నీ సొంతం అయిన మరుక్షణం ఈ మాట చెపుతాను’ అంటూ అద్దంలో తనని తాను మరొకసారి చూసుకొని మురిసిపోతుంది రచన...
తలుపు చప్పుడు అవ్వడంతో వెళ్ళి తీసిన రచన మొహం పై ఏదో పడింది.. అంతే మరుక్షణం తన ఆర్తనాదాలు విని కళ్యాణమండపం నుండి రెస్ట్ రూం వైపుకి చేరుకున్నారు బంధుగణం..
‘అమ్మా.. మంట మంట... బావ.. బావ..’ అని ఏడుస్తున్న రచనను చూస్తూంటే అక్కడున్న వారికి కడుపు తరుక్కుపోతుంది..
రవి తనని తాను కంట్రోల్ చేసుకొని “రచనా! ఏమీ కాదు. భయపడకు” అంటూ తనని ఎత్తుకుని కార్లో కూర్చోపెట్టుకొని దగ్గర్లోనున్న హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాడు.
రచన మొహం ఓ పక్క కొంత భాగం కాలిపోయింది.
“అదృష్టం బాగుండి కళ్ళలో ఏమీ పడలేదు. మెడిసిన్స్ వాడుతూ తగిన స్కిన్ కేర్ తీసుకుంటే తను త్వరగా క్యూర్ అవుతుంది.. తను చాలా భయపడుతుంది..”
అని డాక్టర్స్ చెప్పి వెళ్ళి పోయారు...
ప్రాణాపాయం తప్పినందుకు అందరు సంతోషపడ్డారు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/QxKPGeoIQQw
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ఆ రోజు రాత్రి యేమి జరిగింది?
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఆ రోజు ఉద్యోగస్థులైన దంపతులు పార్థసారథి పరిమళం ఇద్దరూ ఆపీసుకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. కారణం-ముఖ్యమైన కుటుంబ విషయం చర్చించి మాట్లాడి తీర్మానించాలని పకడ్బందీగా సర్దుకుని హాలులో కూర్చున్నారు. ఇంద్రానగర్ లో ఉంటూన్న పెద్ద కూతురు మాలిని గురించి యెదురు చూసారు గాని, ఆమేదో యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ప్రతినిధులతో మాట్లాడాల్సి ఉందని, భర్త పరిపాలనా పర్యటనపై పొరుగూరు వెడళిపోవడాన బుజ్జిగాణ్ణి తనే కిడ్స్ ప్లేయింగ్ ప్రీ స్కూలు నుండి తీసుకు రావలసి ఉందని తనది యిప్పటికిప్పుడు కదల్లేని పరిస్థితంటూ తప్పుకుంది.
ఇక సీను కట్ చేసి చూస్తే వ్యవహారం మరీ అంత పెద్దదీ కాదు మరీ చిన్నదీ కాదు. చిన్నకూతురు సంకీర్తన పెళ్లి సంగతి తేల్చుకోవలసిన తరుణం ఆసన్న మైంది. నిజానికది ఆషా మాషీ సంగతేమీ కాదు. సంకీర్తన మామూలు స్థాయికి చెందిన అమ్మాయి కాదు. రేపు కాలం కలసి రావాలే గాని కంపెనీ డైరక్టర్ గా ఉంటూన్న తండ్రిగారికి సహితం మించిపోయే స్థాయికి చేరుకోగలదు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసుకి యెంపికై పూర్తి స్థాయిలో డెహరాడాన్ అకాడమీలో శిక్షణ తీసుకుని భారత రాజధాని ఢిల్లీ నగరం వెళ్ళబోతూంది. సెంట్రల్ రెవన్యూ డిపార్టుమెంటులో డైరక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించబోతూంది. అంచేత ఆమెను వెతుక్కుంటూ మండువా లోగిలిలో మూడు పెద్దింటి సంబంధాలు కాచుక్కూర్చున్నాయి. సంబంధం ఖాయం చేయడానికి ఫోన్లు వస్తూనే ఉన్నాయి.
కాని—వాళ్లిప్పుడు చర్చించబోయేది ఆ మూడు సంబంధాల విషయం కాదు. పార్థసారథి చిన్ననాటి నేస్తం రామగోపాలం కొడుకు సంబంధం గురించి. ఇక విషయానికి వస్తే మిత్రులిద్దరి మధ్యా పరస్పరావగాహన ఉన్నా అదీ అంత తేలికైన వ్యవహారం కాదేమో! ఎందుకంటే రామగోపాలానికి ముగ్గురు కొడుకులు. పోటీ పరీక్షలతో కసరత్తు చేస్తూ అహర్నిశలూ హోరాహోరీగా తిరుగూతూ ఎం దులోనూ కుదరలేకుండా పోతూన్న కామరాజుని భార్యాభర్తలెప్పుడో తెరవెనుక్కి సుతారంగా తోసేసారు. అతడెప్పుడు గట్టుకి
చేరుకుంటాడో ఇప్పటిప్పుడు తేల్చుకోలేని పరిస్థితి.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/65UsZQKqh3U
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కాకి కావాలి
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
సుబ్బారావు, వెంకటేష్, మూర్తి ముగ్గురు అన్నదమ్ములు. మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు.
సుబ్బారావు పెద్దవాడు అవడం తో పదిహేను సంవత్సరాల నుండి తల్లితండ్రుల తద్దినం పెడుతున్నాడు. మొదటిలో సెరమనీ కి అయ్యే ఖర్చు ముగ్గురన్నదమ్ములు సమంగా భరించేవాళ్ళు. అయితే ఏమైందో కానీ, సుబ్బారావు తమ్ముళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోకుండా ఖర్చు మొత్తం తనే భరించేవాడు.
అన్నగారింటికి వెళ్లి, తద్దినం పెట్టే వాడి తమ్ముళ్లలా వుండకుండా, ‘యిన్ని సంవత్సరాలనుండి అన్నగారు తల్లిదండ్రుల తద్దినం పెడుతున్నా, ఒక్కసారి కూడా కాకి పిండాన్ని కాకి వచ్చి తినలేదు’ అని తమలో తామే మాట్లాడుకోవడం, సుబ్బారావు భార్య విని, మొగుడికి చెప్పింది. ‘పదివేలు ఖర్చు పెట్టి యింత శ్రద్దగా మీరు మీ తల్లిదండ్రుల తిధి పెడుతున్నా, మీ తమ్ముళ్లు ఒక్క పైసా ఖర్చు పెట్టక సరికదా, మీరు తిధి పెట్టడం మీ తల్లిదండ్రులకి యిష్టం లేదని, అందుకే కాకి వచ్చి పిండం ముట్టడం లేదని అనుకుంటున్నారు’ అని చెప్పింది.
దానితో మనసు పాడైన సుబ్బారావు, తమ్ముళ్ళని పిలిచి “యిహనుంచి తల్లిదండ్రుల తిధి ఏడాది కి ఒకరి యింట్లో పెడదాము, దానివలన మీరు కూడా తల్లిదండ్రుల ఋణం తీర్చుకున్నట్టు అవుతుంది” అని అన్నాడు.
అన్నగారి మాటలకి తెల్లబోయిన వెంకటేష్, మూర్తి సరే అని ఒప్పుకున్నారు.
సంవత్సరం గడిచింది. రెండు రోజులలో తండ్రి తిధి వెంకటేష్ యింట్లో పెట్టాలి. వెంకటేష్ కి నిద్రపట్టడం లేదు, ఖర్చు పెట్టడానికి సిద్దమైనా, ఒకవేళ తిధి నాడు కాకి రాకుండా వుంటే ఎలా? నిన్నటి వరకు అన్నగారిని అక్షేపించినట్టు, యిప్పుడు తనని కూడా అనుకుంటారు అనుకుని, తమ్ముడు మూర్తి కి ఫోన్ చేసి, తన భయం చెప్పాడు.
“నిజమే, ఈ హైదరాబాద్ లో కాకులు ఎక్కడివి రావడానికి, ఇన్నాళ్ళు అన్నయ్య ని ఆడిపోసుకున్నాము” అన్నాడు మూర్తి. చివరికి ఒక ఉపాయం అలోచించి, స్కూటర్ మీద అబిడ్స్ లో పక్షులు అమ్మే అతని దగ్గరికి వెళ్లి, ఒక కాకిని అద్దెకు తీసుకుని తిధి వరకు ఆ కాకికి గోడ మీద అన్నం ముద్ద పెట్టి అది తిని మళ్ళీ వచ్చేవిధంగా ట్రైనింగ్ యిచ్చే విధంగా ఒప్పించుకుని వచ్చారు.
ఒప్పుకున్న విధంగానే కాకి యజమాని వచ్చి ట్రయినింగ్ యివ్వడం, తను కూడా కడుపునిండా తినడం జరిగింది.
అనుకున్న రోజు వచ్చింది. తమ్ముడి ఇంటికి భార్య, పిల్లలతో చేరుకున్నాడు సుబ్బారావు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/747mHkFxF30
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
పెళ్ళి అయ్యేది
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కిరణ్మయి.. ఫోన్ కాల్ కి కనెక్టయ్యింది.
"హలో.. ఇటు రాజాకిరణ్.. అటు కిరణ్మయి."
"య. య. హలో." కిరణ్మయి మెత్తగా పలికింది.
"పెద్దల సూచన ప్రకారం.. మనం కలవాలి." రాజాకిరణ్ తన కాల్ కు కారణం
వెల్లడించాడు.
"య. య." కిరణ్మయి వాల్ క్లాక్ ను చూసింది. 9-58.
"నేను మీ పోర్షన్ ముందే ఉన్నాను." రాజాకిరణ్ మాట్లాడుతున్నాడు.
"అవునా. వచ్చేసారా." విస్మయంలో ఉంది కిరణ్మయి.
రాజాకిరణ్ సరళంగా మెసులుతున్నాడు.
"వస్తున్న. డోర్ తీస్తున్న." కిరణ్మయి కదిలింది.
"నోనో. ప్లీజ్. 10-02కు తీయండి." రాజాకిరణ్ గందికయ్యాడు.
కిరణ్మయి ఆగి పోయింది.
"మా పెద్దల సూచన. మనం సరిగ్గా 10-02కి చూసుకుంటే.. మంచిదట."
రాజాకిరణ్ చకచకా మాట్లాడేసాడు.
కిరణ్మయి చిన్నగా నవ్వుకుంది. వాల్ క్లాక్ ను చూస్తుంది.
09-59-31.
ఆ ఇద్దరూ ఇంకా కాల్ లోనే ఉన్నారు.
"థ్రిల్లింగ్ గా ఉంది." రాజాకిరణ్ కుతూహలంలో ఉన్నాడు. అతడు తన చేతి
వాచీలోకి గుచ్చి గుచ్చి చూసుకుంటున్నాడు.
"ఉ. య. నాక్కూడా." కిరణ్మయి బిడియమవుతుంది. ఆమె చూపులు వాల్
క్లాక్ మీద తచ్చాడుతున్నాయి.
10-00-01.
"మీరు.. ఫ్రెండ్స్ తో ఉంటున్నారని విన్నాను." రాజాకిరణ్ సంశయంతో
ఊగిసలాడుతున్నాడు. అతడి చూపులు మాత్రం మారడం లేదు.
"య. బట్.. ఫ్రెండ్స్ అనే కన్న.. కోమేట్స్ అంటే కరెక్ట్. రిక్వెస్ట్ తో.. వాళ్లను మరో
చోటుకు.. ఉదయం నైన్ థర్టీకే సాగనంపాను. మీరు 10కి వస్తారని తెల్పబడింది."
కిరణ్మయి తొట్రుబడుతుంది. ఆమె చూపులు 10-02కై ఆరాటపడుతున్నాయి.
ఇద్దరి మధ్య మాటలు ఆగాయి.
10-01-50.
"డోర్ దగ్గరకి వచ్చేయండి." రాజాకిరణ్ జల్దుకున్నాడు.
"అలానే" కిరణ్మయి అప్పటికే డోర్ దరికి చేరిపోయి ఉంది.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/SWiToAnihq4
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
మనసు - మార్పు
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఆ రోజు ఆదివారం. సూరజ్, సౌజన్య, కమలమ్మ అందరూ మధ్యాహ్నం భోజనం చేస్తున్నపుడు ‘ఏమ్మా, నీకు ఇక్కడ ఎలా ఉంది, బోర్ కొట్టడం లేదుకదా’? అప్పుడే నీవు వచ్చి నెలరోజులు దాటిపోయింది కదూ’ అంటూ ఆప్యాయంగా అడుగుతున్న కొడుకు వైపే చూస్తూ 'ఏమిటో మీ ఉద్యోగాలూ మీరూనూ. శుక్రవారం రాత్రి వచ్చి సోమవారం తెల్లవారుఝామునే బయలదేరి వెళ్లిపోతావు. నీ భార్య ఆఫీస్ కు పొద్దున వెళ్లితే సాయంత్రం ఆరుగంటలకు గానీ రాదు. బోర్ గా ఉండక ఎలా ఉంటుంది? గుంటూర్ లో మీ తమ్ముడింట్లో ఎంత సందడో. సాయంత్రం అయిదు గంటలకల్లా వాడు బేంక్ నుండి వచ్చోస్తాడు. మీ మరదలు ఎప్పుడూ గిలకలా తిరుగుతూ ఏదో పనిచేస్తుంటే సందడిగా ఉంటుంది. పైగా వాళ్ల మూడేళ్ల పిల్లాడు రోహిత్ ముద్దు మాటలతో సమయం భలే గడచిపోతుంది”
“సరేలే అమ్మా, నీ చిన్న కొడుకు వేణు అదృష్టవంతుడు. మాకు ఉన్న టెన్షన్స్ వాడికి లేవు. ఏం చేస్తాం చెప్పు, కష్టపడుతున్నాం, తప్పదుకదా?”
“ఏరా సూరజ్, పెద్దదాన్ని, నీవు విల్లా కొంటున్నానవి నిన్న సాయంత్రం సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్న పద్మావతిగారు చెప్పారు. ఆవిడ అల్లుడు, నీవూ ఒకే ఆఫీస్ లో పనిచేసారుట కదా. ఆ శుభవార్తేదో నా చెవిని కూడా వేస్తే సంతోషించనా?” నిష్టూరం నిండిన గొంతుకతో ఠక్కున అనేసిన కమలమ్మ మాటలకు సూరజ్ నవ్వేస్తూ, “ఓసి పిచ్చి అమ్మా, నీకు చెప్పకుండా ఎలా దాచిపెడ్తాననుకున్నావు?
అవును, విల్లా కొనాలనుకుంటున్నాం. రెండు నెలల క్రితం బిల్డర్ కు ఒక ఇరవై లక్షలు అడ్వాన్స్ కట్టాం. మరో ఇరవై లక్షలు అడ్వాన్స్ పే చేసాక మా పేరు మీద బుక్ అవుతుంది. అప్పుడు నేనూ, సౌజన్యా కలసి మా జీతాల మీద బేంక్ లోన్ కి అప్లై చేయాలి. అడ్వాన్స్ పే మెంట్ పే చేయడం కోసం సౌజన్య నగలనను బేంక్ లో పెట్టి లోన్ తీసుకోవా లనుకుంటున్నాను. అడ్వాన్స్ పూర్తిగా కట్టేసాక, విల్లా మా పేరు మీద బుక్ అయ్యాక మీ అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాం. ఎందుకు దాస్తానమ్మా, డబ్బులకోసం కొంతం టెన్షన్ పడుతున్నాం, అందుకనే చెప్పలేదు నీకు.
మాకా సేవింగ్స్ లేవు. అడ్వాన్స్ పేమెంట్ కే అప్పులు చేయాల్సి వస్తోంది”.
“అదేమిటిరా, మరీ చోద్యం కాకపోతే? ఇద్దరూ లక్షలు లక్షలు సంపాదించుకుంటూ కూడా అప్పులేమిటిరా? ఈ మాటలు నాదగ్గరైతే అన్నావుగానీ మరెవరిదగ్గరైనా అంటే నవ్విపోతారు’”.
“అమ్మా, నీ దగ్గర అబధ్దాలెందుకమ్మా'? అమ్మవి కాబట్టి అర్ధం చేసుకుంటావనే నిజం చెపుతున్నాను"
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/PEbZ379rAFY
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 1
రచన, కథా పఠనం: పెండేకంటి లావణ్య కుమారి
పెండేకంటి లావణ్యకుమారి గారి ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) ధారావాహిక ప్రారంభం
నమస్తే అండి! ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) అనే ధారావాహికను వ్రాసినది, చదువుతున్నది మీ లావణ్య కుమారి పెండేకంటి. సంగ్రహం: ప్రేమించిన వారికి ప్రేమ అందకుండా చేజారిపోతే, భవిష్యత్తు కాలంలోని వారయితే ఏం చేస్తారు అనే ఇతివృత్తంతో ఈ ధారావాహికను వ్రాసాను. ఇప్పుడైతే ప్రేమించిన వారు దక్కకపోయినా, తిరస్కరించినా కొందరు ఆత్మహత్యలు చేస్కుంటున్నారు, కొందరైతే ప్రేమను తిరస్కరించిన వారిని హత్యలు చేస్తున్నారు, ఇంకొందరైతే పిచ్చివాళ్ళై వాళ్ళనే తల్చుకుంటూ జీవిస్తున్నారు, మరికొందరు వారిని మర్చిపోయి వేరే వారిని పెళ్ళి చేస్కుని హాయిగా జీవిస్తున్నారు. అయితే పాతిక సంవత్సరాల తర్వాత కూడా మనుషులు ప్రేమించిన వారు దక్కకపోతే ఇలాగే వుంటారా? లేక వేరే ఏదైనా చేస్తారా? అనేదే ఈ సీరియల్లో మీరు చూడబోయేది. ఇలా జరుగవచ్చేమోనన్న ఆలోచనతో ఊహించి వ్రాసిన కథ అని గమనించగలరు. ఈ ధారావాహికంతా చూసాక ఇది ఆహ్వానించదగిన విషయమనిపిస్తే మీరూ దీని గురించి ఆలోచించండి, అలాకాక జరగకూడదనిపిస్తే దీన్నొక హెచ్చరికగా భావించి ఎవరూ అలాంటి ప్రయత్నాల జోలికి వెళ్ళకండి. ఇప్పుడిక సీరియల్ మొదటి భాగం చదువుతున్నాను. ------- ప్రేమ చేజారితే (భవిష్యత్ కాలంలో) - భాగం - 1 అది 2040 సంవత్సరం... అదో విలాసవంతమైన బంగ్లాల సమూహముండే పెద్ద కాలనీ. దాని పేరు 'ఆనందలోకం', ఆ పేరు వ్రాసి వుంచిన బోర్డు మీద దాని పేరు క్రింద 'ప్రయత్నంతో సాధ్యమే' అనే కాప్షన్ కూడా వుంది. ఆ కాలనీ అంతా డబ్బుంటే ఎన్ని హంగులతో వుండొచ్చో అన్ని హంగులతో దర్జాగా, సుందరంగా వుండి అందరికీ కనువిందు చేస్తుంటుంది.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/yGZLN8M6xkc
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
వాసంతసమీరం
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
సాయంత్రం వేళ పార్కులో కూర్చుని కాస్త దూరంగా ఆడుకుంటున్న పిల్లలని చూస్తోంది వాసంతి. బాంకు ఉద్యోగ బాధ్యతలతో నిత్యం ఒత్తిడికి గురవుతూ వారాంతంలో ఇలా దగ్గరగా ఉన్న పార్కుకు వచ్చి ప్రశాంతంగా కాసేపు గడపడం ఆమెకు అలవాటు. హఠాత్తుగా ఒక బంతి వచ్చి ఆమె దగ్గరగా పడడం, ఒక చిన్న పాప పరిగెత్తుకుంటూ రావడం రెప్పపాటులో జరిగింది. ముద్దులొలికే ఆ పాపకి సుమారు ఐదారు సం…వయస్సు ఉండచ్చేమో. బంతిని ఆ పాప చేతికిచ్చి " నీపేరేంటి పాపా"? అంది వాసంతి.
"సమీర " ముద్దుముద్దుగా చెప్పింది ఆపాప. 'ఎంత అందమైన పేరు' అని మనసులో అనుకుంది వాసంతి.
ఇంతలో 'సమీరా' అంటూ పిలుస్తూ ఒకతను వచ్చాడు. పాపని ఎత్తుకొని తీసుకుని వెళుతూ వాసంతిని చూశాడు. ఇద్దరి చూపులు కలిశాయి. అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది వాసంతికి. వెంటనే గుర్తుపట్టి " మీరు రమేష్ కదా!" అంది. "మీరు వాసంతి కదా!" అన్న అతని మాటలకు నవ్వుతూ "అవును. దా! కూర్చో. ఎలా ఉన్నావు?" అడిగింది వాసంతి.
"బానే ఉన్నాను. నీవెలా ఉన్నావు?" అంటూ పాపని ఒళ్లోకూర్చొపెట్టుకుని కూర్చున్నాడు రమేష్. అతని పలకరింపుకు జవాబుగా చిరునవ్వు నవ్వింది వాసంతి.
"నా కూతురు సమీర" అని పాపను చూపించి "నమస్కారం పెట్టు" అన్న తండ్రి మాటలకు "నమస్తే ఆంటి" అంది సమీర. ముద్దులొలికే ఆ పాప మాటలకు ముచ్చటేసి పాపను దగ్గరకు తీసుకుంది వాసంతి. ఈ ఊరిలో తను లెక్చరర్ గా పనిచేస్తున్నట్లు చెపుతూ 'నీ గురించి చెప్పు?' అన్నాడు రమేష్.
"నేను బాంకులో ఉద్యోగం చేస్తూ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడే ఇల్లు అద్దెకు తీసుకున్నాను" అంది వాసంతి.
"మీ వారు ఏంచేస్తున్నారు? అన్న అతని మాటలకు అడ్డొస్తూ ' నేను పెళ్లి చేసుకోలేదు' అని దూరంగా ఎటో చూస్తూ గంభీరంగా జవాబిచ్చింది వాసంతి. ఒక్క క్షణం ఆమెని నిశితంగా పరిశీలించిన రమేష్ వెంటనే వాతావరణాన్ని తేలిక పరుస్తూ కాసేపు ఏదో మాటలను చెప్పి సరదాగా ఆమెని నవ్వించాడు. పాపని తీసుకుని వెళుతూ ఒకరోజున వాసంతిని తన ఇంటికి రమ్మని చెప్పి అడ్రస్ ఇచ్చి వెళ్లాడు రమేష్. వాళ్లు వెళ్లిన వైపే చూస్తూ తను కూడా లేచి ఇంటికి వెళ్లింది వాసంతి.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/RHFASuVJmMg
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
బుజ్జిబాబు.. పెళ్లిపందిరి.. గారెముక్కలు
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
బుజ్జిబాబుకు పెళ్లి కాలేదు. సంబంధాలు వస్తున్నాయి. అందుకు ఏమీ లోటు లేదు.
బుజ్జిబాబు అనాకారి కాదు. పెద్ద అందగాడు కాకపోయినా ఓ పిసరంత అందగాడే !
అయితే అతను ఏ అమ్మాయి నైనా హ్యాపీగా పెళ్లి చేసుకోవడం విషయంలో అతనికి ఓ పెద్ద సమస్య వచ్చి పడింది.... అది సమస్య కాదు ధర్మసందేహం.... ధర్మసందేహమూ కాదు... అనుమానం...
అనుమానము కూడా కాదు... ఆవకాయ జాడీలో అరటిపండు లాంటి ఆదోరకమైన సమస్య.
సరే... ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఆ రోజు ఉదయం బుజ్జిబాబు... ఆయాసపడుతూ తన గురువు త్రిలోకచంద్రంగారి ఇంటికి వచ్చాడు. విషయం అంతా ఆయనకు చెప్పి అక్కడున్న గ్లాసుడు నీళ్ళు గబగబా తాగేశాడు.
గురువుగారు పకపకా నవ్వేశారు.
"ఒరేయ్ బుజ్జిబాబు... ప్రపంచంలో అందరూ... నీలాగే ఆలోచిస్తే... ఈ సృష్టి చక్రం తిరగదురా. నీది అనవసరపు భయం. పనికిరాని ఆందోళన.
ఏదైనా సమస్య గురించి.. ఎక్కువగా ఆలోచిస్తే ఇట్లాగే ఉంటుంది. మరీ ఇంత పిరికి తనం పనికి రాదు సుమీ.. సరే.. వచ్చి.. ' గురువుగారు ఈ విషయంలో మీ సలహా ఇవ్వండి.. నాకు ధైర్యం చెప్పండి '.. అని అడిగావు కనుక... నాకు తోచిన సలహా ఇవ్వాలి. కానీ నీ మనసును బట్టి నీకు సలహా ఇవ్వకూడదు. ప్రాక్టికల్ గా చూపించాలి. అప్పుడే నీకు ధైర్యం వస్తుంది. సరే బయలు దేరు మనం ఇద్దరం నా మోపెడ్ మీద నాలుగు చోట్లకి వెళ్ళాలి..." అంటూ శిష్యుడు బుజ్జిబాబుని వెనుక సీటు మీద కూర్చోబెట్టుకుని తనే డ్రైవ్ చేస్తూ బయలు దేరారు.. గురువు త్రిలోకచంద్రoగారు.
శిష్యుడిని ముందుగా తన అన్నగారు కొడుకు చక్రి ఇంటికి తీసుకెళ్లారు...
చక్రి ఇద్దర్నీ లోపలకు ఆహ్వానించి కూర్చోమని మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. వెంటనే తన భార్య మండోదరి ని బయటకు పిలిచి.. 'వచ్చిన వాళ్లను పలకరించడం నీకు చాతకరాదా.. బుద్ధిజ్ఞానం లేదా.. గడ్డి తింటున్నావా?? మంచి నీళ్లు ఇవ్వడం తెలియదా' అంటూ గట్టిగా అరిచాడు. ఆమె భయపడి ప్రశాంతంగా తల కిందకు దించి మౌనంగా ఎందుకన్నా ఉండిపోయింది. చక్రి మళ్లీ ఆమెను తిట్టడం మొదలెట్టాడు..
''ఆ మౌనం ఏమిటి.. కాపురం చేయడం రాకపోతే ఎందులో అయినా దూకి చావు.. ఛీ ఎదవ పెళ్ళాం... ఎదవ పెళ్లి చేసుకున్నాను..."
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/1nDY5w2wJa0
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ఙ్ఞానమ్మ
రచన: భాగవతుల భారతి
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
'అమ్మగారు' వెళ్ళి పోయింది. ఆశ్రమమంతా విషాదం అలుముకుంది. కన్నీటి వీడ్కోలు చెబుతోంది. ఆశ్రమంలో చిన్నాపెద్దా... అమ్మగారి గురించి కథలుకథలుగా చెప్పుకుంటున్నారు.
స్వర్ణ వదనం వివర్ణమైంది... తనకు ఇప్పుడు 50 సంవత్సరాలు..
తను చిన్నప్పుడు ఎప్పుడు ఈ ఆశ్రమానికి తీసుకురాబడిందో తెలీదు. ఎవరో తనని వాకిట్లో వదిలేసి వెళ్ళారట. అమ్మగారు తన చేతులతో పెంచింది. అమ్మగారు తెల్లని చీరెలాంటి బట్టను తలమీద ముసుగులా వేసుకునేది. నందివర్ధనం పువ్వును గుర్తుకు తెచ్చేది.
తను విన్న కథ ప్రకారం ఆలోచిస్తోంది, స్వర్ణ.
'అమ్మగారి' పేరు ఙ్ఞానప్రసూనాంబట. అందరూ పేరుమరిచిపోయారు. 'అమ్మగారు' గానే పిలువబడింది. బాల్యవివాహం పేరుతో అమ్మగారికి ఎనిమిదేళ్ళ వయసులోనే, యాభై ఏళ్ళ రెండో పెళ్ళి వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేసారుట.
అప్పుడు ఆమెపేరు... 'ఏమే! ఒసేవ్' ట.
అత్తగారింట్లో అదేపేరు. అక్కడ ఆమెపేరు అందరూ మరిచిపోయారు. ఈమె యుక్తవయసు వచ్చి, సంసారం గురించి కలలు కనే వయసులో తన భర్త మొదటి సంబంధం పిల్లలతో 'అమ్మా' అని పిలిపించుకుందామని ప్రయత్నించినా
ఈమెను 'సవతి తల్లి'అనే మిషతో గొడవలతో, దూరంగాఉంచేసారు.
భర్తతో ఒక్క పిల్లనో, పిల్లవాడినో కని 'అమ్మా' అనిపిలిపించుకోవాలని తపన పడింది. కానీ అప్పటికే క్షయ రోగం ముదిరిపోయి, అతనికి సేవలుచేయటానికే సమయం వెచ్చించింది. ఈమెకు ఇరవై ఏళ్ళు వచ్చేసరికి, భర్తపోయాడు. కాపురం చేయకుండానే 'విధవ' అనే ముద్రతో పుట్టింటికి చేరింది.
ఆ రోజుల్లో ఆచారం ప్రకారం శిరోముండనం చేయించి, తెల్లచీర ముసుగుతో తిరిగే 'ఙ్ఞానమ్మ', ఊరిలో అందరికీ వంటలక్క. ఏ ఇంట్లో ఏ కార్యం జరిగినా వంటకు సాయం వెళ్ళేది. తలలో నాలుకలా మెలిగేది.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/L15dvc_x8yY
From the publisher's feed