Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • నాకేమవుతోంది ఎపిసోడ్ 8 | Nakemavuthondi Episode 8 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    నాకేమవుతోంది…? ఎపిసోడ్ 8

    రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ 

    గత ఎపిసోడ్ లో...

    రిసార్ట్ దగ్గరకు వెళ్లిన  ఉదయ్  - సీఐ మురళి, డిటెక్టివ్ పురంధర్ గారి అమ్మాయి ప్రవల్లిక లను కలుస్తాడు.

    పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఎస్సై రంగనాథాన్ని సస్పెండ్ చేస్తాడు ఎసిపి ప్రతాప్.

    రిసార్ట్ మేనేజర్ సందీప్ ని అదుపులోకి తీసుకుంటారు పోలీసులు.

    రెస్టారెంట్ లో ఉన్న రిసెప్షనిస్ట్, తరుణ్ ఇద్దరు అమ్మాయిలతో - ఒకరి తరువాత ఒకరితో రెస్టారెంట్ కి వచ్చినట్లు చెబుతాడు.

    వాళ్లిద్దరూ ప్రియ, హన్సికలని ఫోటోలు చూసి గుర్తు పడతాడు.

    ఇక ‘నాకేమవుతోంది…?’ ధారావాహిక ఎనిమిదవ భాగం చదవండి…

    "నన్ను వదిలి పెట్టండి..  నిజం చెప్పినందుకు అరెస్ట్ చేస్తారా.." అంటూ గొడవకు దిగాడు రెస్టారెంట్ రిసెప్షనిస్ట్. కానీ పోలీసులు అతనికి సమాధానం చెప్పకుండా జీప్ లో ఎక్కించుకొని స్టేషన్ కి  తీసుకొని వెళ్ళారు. మరికొద్ది సేపటికి ఎసిపి ప్రతాప్ ఆ రిసార్ట్ దగ్గరకు వచ్చాడు. రిసార్ట్ లో  ఉన్న వాళ్ళందరినీ ఒకచోట సమావేశపరిచాడు. తరుణ్, ప్రియ, హన్సికల ఫోటోలను వాళ్లకు చూపించి ఎవరైనా గుర్తుపడతారేమో అడిగాడు.

    తరుణ్, ప్రియా లను ఒక కాటేజ్ లోకి వెళుతూ ఉండగా చూసినట్లు కొందరు చెప్పారు. అలాగే వాళ్ళిద్దరూ రెస్టారెంట్ కు వచ్చినట్లు కూడా ఒకరిద్దరు చెప్పారు.. తరుణ్ ప్రియాలు ఉన్నారని చెబుతున్న కాటేజ్ లోకి ప్రతాప్ తో పాటు వెళ్లారు ఉదయ్, ప్రవల్లిక. ఆ గదిలో ఏ విధమైన వస్తువులు లేవు. ఆ చుట్టుపక్కల ఉన్న కాటేజీలు తనిఖీ చేశారు. ఖాళీగా ఉన్న ఒక కాటేజీలో నేల మీద ఏవో రక్తపు మరకలు చెరిపివేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఆ రూమ్ లో ఉన్న వేలిముద్రలను పోలీసులు సేకరించారు. తర్వాత ఎసిపి ప్రతాప్, స్టేషన్లో ఉన్న సిఐ మురళికి కాల్ చేశాడు.

    "ఇక్కడ ఒక గదిలో రక్తపు మరకలు ఉన్నాయి. కాబట్టి హత్య రిసార్ట్ లోనే జరిగినట్లు అనిపిస్తోంది. రిసార్ట్ మేనేజర్ ను సరైన పద్ధతిలో విచారించండి. ఇక్కడి దర్యాప్తు పూర్తి చేసుకొని నేను మరో గంటలో స్టేషన్కు వస్తాను. ఈ లోగా అతని చేత నిజం కక్కించండి.  అదుపులోకి తీసుకున్న రిసార్ట్ వాచ్మెన్ ని, ఇతర రిసార్ట్ సిబ్బందిని విడివిడిగా విచారిస్తే ఎవరో ఒకరు నిజం బయటపెడతారు" అని ఆదేశించాడు ప్రతాప్.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    13 min
  • ఓ సాంబయ్య కథ | O Sambaiah Katha | Telugu short Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

     ఓ సాంబయ్య కథ

    రచన : కొత్తపల్లి ఉదయబాబు

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    కార్తీక మాసం ప్రారంభం అయిన తరువాత మొదటి సోమవారం. తన కన్నా ముందే లేచి తలకు స్నానం చేసిన సాంబయ్య “ఆయమ్మా! నేను అలా శివాలయానికి వెళ్ళి వస్తాను. ఈవేళ మొదటి కార్తీక సోమవారమంటగా. ’’ అని అడిగాడు, వీధి అరుగుమీద కూర్చుని దూది వత్తులు చేసుకుంటున్న సరస్వతిని.

    ‘’అవును. వెళ్ళి రా బాబు. జాగ్రత్త. తొందరగా వచ్చేయ్” అన్న సరస్వతి, అరుగుమీద కూర్చునిపోయి ఎదురుగా ఉన్న డాబాకేసి చూసింది. అది మూడేళ్లక్రితం నరసయ్య ఇల్లు. ఈవేళ కొనుక్కుని ఉంటున్నవాళ్లది. హు.. ఆ దేవుడు ఎవరికి ఎపుడు ఎక్కడ ఎలా రాసిపెడతాడో? అనుకుంటూ గతంలోకి జారుకుంది.

    * * *

    "ఏరా ఇంతలేటయ్యింది... అయిందా అన్ని దేవుళ్ళకు మొక్కడం... అన్ని చెట్ల చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యడం? ఈ కార్తీకమాసం పీడ ఎప్పుడు వదులుతుందో గాని... చస్తున్నాను నీతో. " సాంబయ్య ను చూస్తూనే కయ్ మని లేచాడు కిరాణాకొట్టు నరసయ్య.

    "నీతో చెప్పే ఎల్లాగా.. అట్ఠా తిడతావేంది? ఈయేలా ఏమైందో తెలుసా... ఎవరో ఒకాయన.. మంచి రచయితంట.. మనూల్లో కమ్యూనిటీ హాల్లో సన్మానం సేత్తన్నారంట. హోటల్లో దిగినాడంటా... స్నానం సేసి ఊళ్ళో గుళ్ళు సూడ్డానికి బయల్దేరాడంట. దారిలో నన్ను ఆపి 'దగ్గర్లో గుళ్లు ఏమన్నా ఉన్నాయా' అని అడిగాడు. అతనికి అన్నీ చూపించాక నా గురించి అడిగాడు. నీదగ్గర పనిచేస్తున్నానని చెప్పాను. టీ తాపించాడు. అతన్ని పంపేసి వచ్చేసరికి రోజూకన్నా పది నిముసాలు లేటయ్యింది. అంతేగా. ఈ మాత్రం దానికే తిడతావే? ఇదుగో పెసాదం. "అని నరసయ్య చేతిలో పెట్టాడు సాంబయ్య.

    "ఈ ప్రసాదం తినందే గల్లా పెట్టి తెరవనని తెలుసు గదా. సరే వెళ్లి టిఫిన్ తిను. "అని పురమాయించాడు నరసయ్య.

    సాంబయ్య '' అత్తా, సాంబయ్య వచ్చాడు, టిఫిన్ పెట్టావా?'' అంటూ లోపలికి వెళ్ళాడు.

    ఇదంతా ఎదురింటి కిటికీలోంచి చూస్తున్న సరస్వతి సాంబయ్యకేసి జాలిగా చూసింది. ఆ జాలి బాధగా మారి గుండెల్లోకి దిగింది.

    సరస్వతి ముప్పై అయిదేళ్లు గా ఆ వూళ్ళో ఉంటోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పురుళ్ళు పోసే నర్సుగా పనిచేసి రిటైర్ అయింది. ఈవేళ ప్రభుత్వం చేపట్టిన పధకాలు, విధివిధానాలు అన్నీ మారిపోయాయి. గ్రామసేవికలు ఇంటింటికీ వచ్చి తమకు కేటాయించిన గ్రామంలో గర్భం ధరించిన స్త్రీల వివరాలు నమోదు చేసుకుని బిడ్డ ప్రసవించేవరకూ అనేక రకాలుగా వారిని సాకి, చక్కని బిడ్డను ప్రసవింపచేసి, ఆబిడ్డకు మూడు నెలలు వచ్చే వరకు అన్నివిధాలా సాకుతున్నారు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/9RiGh_h2D1w

    16 min
  • ది ట్రాప్ ఎపిసోడ్ 18 | The Trap Episode 18 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ది ట్రాప్ ఎపిసోడ్ 18

    రచన : పాండ్రంకి సుబ్రమణి 

    (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    గత ఎపిసోడ్ లో

    ప్రభావతి పుట్టిన రోజు సందర్భంగా ఆమె దగ్గరకు వెళతారు పరమేశ్వర్, కమలం.

    వినోదినిని కూడా తమతో తీసుకొని వెళతారు.

    కమలాన్ని  రాముకి పరిచయం చేస్తాడు భువనేశ్.

    వినోదినిని గుడికి తీసుకొని వెడతాడు పరమేశ్వర్.

    ఇక ది ట్రాప్. . 18 వ భాగం చదవండి…

    మరి కాసేపటికి దేవీ అర్చన ముగిసింది. ఇద్దరూ కలసి అందించిన మాల దేవి విగ్రహాన్ని అలంకరించింది. ఇద్దరూ గర్భ గుడి చుట్టూ ముమ్మార్లు ప్రదిక్షణ చేసి ఆనవాయితీ ప్రకారం ఇద్దరూ వెంటనే అక్కణ్ణించి కదలకుండా గుడి మెట్ల చప్టా పైన కూర్చున్నారు. అప్పుడతను చేతిలోని కుంకుమ ఆమెకు అందించాడు.

    ఆమె యేమీ అనకుండా కుంకుమ అందుకుంటూ-“ఇటు జరగండి—“ అంటూ కుంకుమ తీసి అతడి నుదట పెట్టింది-అరమోడ్పు కళ్ళతో స్వీకరిస్తూ-“థేంక్స్”అన్నాడు.

    చప్పున స్పందించిందామె-“ఇదెక్కడి ఫార్మాలిటీ పరమేశ్వర్! దీనికి కూడా థేంక్స్ చెప్తారేమిటి?”

    “జస్ట్ లైక్ దట్—చెప్పాలనిపించింది అంతే! ”

    దెన్-ఇటీజ్ ఓకే-అంటూ వినోదిని లేవబోయింది. అప్పుడతను ఆమెను ఆపాడు. “ఆగు! గుడి మెట్లు యేక్కేముందు చెప్పావుగా నాకు చెప్పడానికి ఇంకేదో మిగిలుందని. చెప్పి వెళ్లు. ఇప్పుడింటికి వెళితే అక్కడ ఒకటే రగలగా ఉంటుంది. వదిన పుట్టిన రోజు సంబరాలు ఆరంభమయి ఉంటాయి. ”

    ఔనంటూ ఆమె తలూపుతూ గుడి చప్టా పైనుండి లేవకుండా కూర్చుండిపోయింది. అలా రివ్వున కూర్చున్నప్పుడు ఆమె మెడ నుండి చీర కుచ్చెళ్ళ మడతల నుండి తెరల్లా లేచిన కమ్మటి సువాసనలు అతణ్ణి తాకాయి. అది ఉన్నపాటున చెప్పాలనిపించింది గాని;ఆగిపోయాడు. సిక్స్త్ సెన్సె పనిచేసినట్లుంది. ఇదికాదు దానికి సమయం! “ఇక నేను చెప్పేదా పరమేశ్వర్?”

    ఉఁ-అన్నాడతను. “నన్ను మీ యింటికి కోడలు పిల్లగా నాన్న పంపాలని అనుకోవడాని కి మీ నాన్నకూ మానాన్నకూ మధ్య అలనాడు అలరించిన చిన్ననాటి స్నేహం కారణం కావచ్చు... ”

    అతడు స్పందించాడు- “చాలా వరకు అదే కదా అసలు కారణం—“

    “చాలా వరకు కారణం అదే అన్నావు చూడూ—అది సబబే--కాని అది అసలు కారణం కాదు. ”

    మరి? అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసాడతను.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/1M7nxwTO6pY

    16 min
  • సంపత్ సినిమా కథలు - 9 | Sampath Cinema Kathalu - 9 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సంపత్ సినిమా కథలు - 9

    రచన : S. సంపత్ కుమార్  

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    గత ఎపిసోడ్ లో

    తను ఎలా ట్రాప్ చెయ్యబడ్డది గుర్తుకు చేసుకుంటాడు కిరణ్.

    లింగస్వామి నమ్మక ద్రోహం చేస్తున్న విషయం కిరణ్ కి చెబుతాడు పోలీస్ ఆఫీసర్ విక్రమ్.

    ఇక 'సంపత్ సినిమా కథలు’9 వ  భాగం చదవండి.

    తర్వాత తెలిసింది మీ లింగస్వామి అంకులే లారితో మన జీప్ ను  డీ  కొట్టించాడని. అప్పుడు నాకు దెబ్బలు బాగా తగిలినా ప్రాణాలకు ముప్పు రాలేదు.  ఇంకా నీవు మత్తులోనే ఉన్నావు. నీకు  చిన్న చిన్న దెబ్బలు తగిలినా బలమైన షాక్ తో కోమా లోకి వెళ్ళిపోయావు. అప్పుడు లింగస్వామి, అతని కొడుకు ఉదయ్ ఇంకా ఇద్దరు వచ్చి  నీవు తీసిన వీడియో సెల్ కోసం ప్యాకెట్లు అన్ని వెతికారు. కాని సెల్ దొరకలేదు. నా పాకెట్స్ కూడ సెల్ కోసం వెతికారు. ఇంకా జీప్ దగ్గర వెతికారు. బాగా దెబ్బలు తగిలినా నేను వాళ్ళను గమనిస్తున్నా. అయిన నాకు నోరు ఎండిపోవడం వలన మాటలు రావడం లేదు. తర్వాత నిన్ను, నన్ను ఒక హాస్పటల్ చేర్చారు. నేను కొద్దిగా కోలుకొన్నాక  లింగస్వామి వచ్చి "ఎలా ఉన్నారు సార్." అని అడిగాడు.

    " మీరు కాల్ చేశాక నా వాళ్లతో వస్తే అప్పుడే మీకు ప్రమాదం జరిగింది. చుట్టు ప్రక్కల ఎవ్వరూ లేరు. అప్పుడు నేనే మిమ్మల్ని తెచ్చి హాస్పటల్ చేర్చి మీ డిపార్ట్మెంటు వాళ్లకి సమాచారం ఇచ్చాను" అన్నాడు.

    ‘అలాగా’ అని ‘థాంక్స్’  చెబుతూ, ‘మరి మా పాకెట్స్ ఎందుకు వెతికారు’ గా అడుగుదాం అనుకున్నా.  మళ్ళీ ‘ఇప్పుడు వద్దు, నిదానంగా విషయలు కాస్త అర్థం అయ్యాక తెలుసుకుందాం’ అనుకున్నా.

    ఇంతలో 'ఇంక కాస్త రెస్ట్ తీసుకోండి. మళ్ళీ వస్తా' అని చెప్పి లింగస్వామి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కొద్ది సేపు అయ్యాక కాస్త రిలాక్స్ అవుదామని బయటకు వచ్చా.

    లింగస్వామి నన్ను చూసి 'మీ డిపార్ట్మెంటుతో మాట్లాడినాను.

    కిరణ్ ను ఊటిలో ఉండే  మా హాస్పటల్ కు తీసుకెళ్లుతానని చెప్పాను. వాళ్లు సరే అన్నారు.' అన్నాడు.

    ‘మరి రాజరావుకి  కొడుకు ఆచూకీ దొరికిందని తెలుసా’ అన్నాను.

    'కోమాలో ఉన్న కొడుకును చూసి వాళ్ల నాన్న రాజరావు తట్టుకోలేడు. అక్కడ కోమా నుంచి బయటకు వచ్చాక ఆయనకు చెబుదాం. అలాగె మీరు చేసే ఎంక్వరీకి కూడా ఏ ఆటంకం ఉండదు' అన్నాడు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/3QJTSGTy7T4

    14 min
  • అతి తెలివి | Athi Thelivi | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    అతి తెలివి

    రచన : జీడిగుంట శ్రీనివాసరావు

    (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    శేఖర్ ది పెద్ద కుటుంబం. ఐదుగురు అన్నగార్లు,  ముగ్గురు బావమరుదులు, భార్య అప్పచెల్లెలు 5గురు, వీరు కాక వియ్యంకుడి సైడ్ ఆరుగురు. యింత మంది బలగం. అందరు కాకినాడ లోనే వుంటారు.

    శేఖర్ మొదటి కూతురు గర్భం తో పురుడికి వచ్చింది. ఉన్నంతలో బాగానే చూసుకుంటున్నాడు పిల్లని.

    అయితే ఏ పని చేసినా లాభం లేకుండా చేయకూడదు అని అతని సిద్ధాంతం.

    అందుకనే భార్య తో సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అతని భార్య కూడా అదే సిద్ధాంతం అనుసరిస్తుంది కాబట్టి ఒక మంచి రోజున శేఖర్ తన చుట్టాలందరికి ఫోన్ చేసి ‘మా అమ్మాయి మొదటి కాన్పు కి వచ్చింది. అంతా సవ్యంగా జరగాలని మీలాంటి పెద్దల ఆశ్వీర్వాదాలు తీసుకోవాలిని అనుకుంటోంది. కాబట్టి మీరు వీలుచూసుకుని ఏ రోజైన సాయంత్రం నాలుగు గంటలకు మా ఇంటికి వచ్చి దానిని దీవించండి’ అని చెప్పాడు.

    అతని భార్య కూడా తన వైపు చుట్టాలకి ఫోన్ చేసి చెప్పింది. శేఖర్ ప్రతీ రోజూ ఒక అర లీటర్ పాల ప్యాకెట్ తీసుకుని వచ్చి ఫ్రీజ్ లో పెట్టి ఎవరైనా వస్తే టీ ఇవ్వటానికి రెడీ గా వుంచేవాడు.

    అతని చుట్టాలందరు మర్యాదస్తులు,  అదికాక శేఖర్ కూతురు అంటే యిష్టం కూడా అవటం తో  రోజుకు ఒక కుటుంబం,  లేక రెండు కుటుంబాలు రావడం,  వట్టి చేతులతో వస్తే బాగుండదని,  చీర, జాకెట్, పళ్ళు, పసుపు కుంకుమ తీసుకుని వచ్చేవారు.

    పాపం నెలలు పెరగటంతో ఆయాసం వలన విశ్రాంతి తీసుకుంటున్న కూతురిని బలవంతం చేసి,  వచ్చిన చుట్టాల చేతిలో నాలుగు అక్షింతలు యిచ్చి కూతురిని వారికి వంగి నమస్కరించమనే వాడు.

    పాపం ఆ పిల్ల అతి కష్టం మీద వంగి ‘నన్ను దీవించండి పెద్దనాన్న, పెద్దమ్మా’ అంటూ అడిగేది.

    ఆ పిల్ల పడే కష్టం చూసి,  వచ్చిన వారు, తీసుకువచ్చిన బట్టలు, పళ్ళు వాటిపైన వెయ్యి రూపాయలకి తక్కువ కాకుండా డబ్బు పెట్టి, ఆ నాలుగు అక్షింతలు వేసి దీవించేవారు.

    దీవెనలు అయినా అయిదు నిమిషాలకి, టీ వచ్చేది.  ఆ టీ తాగి బయట పడే వారు.

    ఒక్కొక్క రోజు ఒకరో ఇద్దరో వట్టి చేతులతో రావడం, వాళ్లకి దూరం నుంచే నమస్కారం పెట్టడం, వాళ్ళే వెళ్లి ఆ రెండు అక్షింతలు వేసి,  కాసేపు మాట్లాడి వెళ్లిపోవడం జరుగుతో వుండేది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/hKTRKpLSeXw


    3 min
  • కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 12 | Kasthuri Ranga Ranga Episode 12 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కస్తూరి రంగ రంగా!! 12

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    గత ఎపిసోడ్ లో

    రంగా పేరు ముందు ఉన్న కస్తూరి అనే పదం గురించి గురించి అడుగుతాడు వసంత్.

    క్లుప్తంగా చెబుతాడు రంగా.

    సయ్యద్ సర్ ను, పుండరీకయ్యను కలుస్తారు.

    ఖాజా గురించిన వివరాలు చెబుతాడు సయ్యద్.

    ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 12 చదవండి.

    "వసంత్!!..."

    "సార్!..."

    "వారితో మనం చేసిన సంభాషణ వల్ల నీకు ఏం అర్థం అయింది?..."

    "ఈ కేసు తాలూకు వ్యక్తులు అమెరికాలో కూడా వున్నట్టుగా అర్ధం అయింది బాస్..."

    బండి గతుకుల్లో పడింది. వూగింది.

    "సారీ బాస్..." అన్నాడు వసంత్,

    "ఓకే... ఓకే... వసంత్... చూచి అదే మిట్టపల్లాలు... తోలు..." క్షణం తర్వాత...

    "వసంత్..."

    "సార్!..."

    "ఒకవేళ అవసరం అయితే అమెరికా వెళ్లివస్తావా?..."

    వసంత్ మౌనం....

    "వసంత్!..."

    "సార్!..."

    "నేను అడిగింది వినపడలేదా!...".

    "పడింది సార్!... అది ఏం మామూలు ప్రశ్న కాదు సార్... అమెరికాలో నేను ఇన్విస్టిగేషన్!!..." దీనంగా లాగినట్టు చెప్పాడు.

    "యస్!..." ఒత్తి మరీ చెప్పాడు కస్తూరిరంగ.

    "సార్!!..." దీనంగా మెల్లగా పిలిచాడు వసంత్.

    "ఆ.. చెప్పు...".

    "ఆ కార్యం నా ఒక్కడినుంచి కాదు సార్!...”.

    "తోటే నేను వస్తే!..."

    "మీరు వస్తారా సార్..."

    "వస్తే!..."

    "రెండు వారాల్లో అమెరికాలో తేల్చాల్సిన లెక్కలనన్నింటినీ తేల్చేసి భారత్‌కు వచ్చేస్తామ్ సార్!..."

    "ఒకవేళ.... వసంత్..."

    “నీవు ఒక్కడివే వెళ్లవలసి వస్తే !..."

    "సార్!..."

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/MmhOypfAFo4

    14 min
  • పాణిగ్రహణం - 4 | PaniGrahanam - 4 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    పాణిగ్రహణం - 4

    రచన: భాగవతుల భారతి

    (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    గత ఎపిసోడ్ లో..

    సాగరమేఖలకు వివాహం జరుగుతుంది.

    కాపురానికి ఢిల్లీ వెళుతుంది.

    ఇద్దరు ఆడపిల్లల తరువాత ఒక అబ్బాయి పుడతాడు.

    కుటుంబ పోషణ లో భర్తకు చేదోడుగా ఉండటానికి తను కూడా ఉద్యోగంలో చేరుతుంది సాగరమేఖల.

    అభినందించక పోగా అనుమానిస్తాడు భర్త.

    ఇక పాణిగ్రహణం ఎపిసోడ్ 4 చదవండి.

    "హలో!ఎక్కడున్నారు. "

    "మీరెవరు?"

    "నేను మీ ఆవిడ సాగరమేఖల పనిచేసే ఆఫీసులో పనిచేసే వాచ్ మెన్ ని, ఒక్కసారి ఆఫీసుకి రాగలరా!"

    "ఇప్పుడా? నేనెందుకు?"

    "మీ ఆవిడ.... ఆఫీసర్ తో నడిపే బాగోతం కళ్ళారా చూపిస్తా!"

    "నో! నేనునమ్మను"

    "నమ్మలేదుకాబట్టే చూపిస్తామనేది!...

    ఎందుకైనా మంచిది.... ఓ పెగ్గు వేసుకుని రండి. ఈ ఘోరం మీరు చూడలేరు. "

    ఫోన్ పెట్టేసి... ఎదురుగా ఉన్న క్లర్క్ సరోజ కి

    బొటనవేలు పైకెత్తి థమ్స్ అప్ లా చూపించినవ్వి, ఆమె ఇచ్చిన నోట్లు జేబులో కుక్కుకుంటూ నవ్వాడు.

    ఆడదానికి ఆడదేశత్రువు ఇంకోసారి బుుజువయింది.

    ఎక్కణ్ణించి ఊడిపడ్డాడో సాగరమేఖల

    మెుగుడు....

    అతను నిజంగానే తాగివచ్చాడు. అతను రావటం చూసి, తలుపులు తాళం తీసారు.

    ఆ తర్వాత అక్కడ జరిగిన బీభత్సకాండ... చూసేవాళ్ళకి, చూడవినోదం

    చెప్పుకునే వాళ్ళకి చెప్పవినోదం...

    నలుగురిలో ఇంత అవమానం జరిగాక... సాగరమేఖల ఆత్మహత్య కు పాల్పడింది.

    స్ప్రహ లేని స్థితిలో ఉన్న సాగరమేఖలను

    హాస్పటల్ కి తీసుకువచ్చాడు, విరూపాక్ష.

    'అనుమాస్పద ఆత్మహత్యా ప్రయత్నం, అపస్మారక స్థితిలో.... అతివ' పేపర్లోఘోష.

    పోలీసుకేసు అయింది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/vP8_QiLfixM



    9 min
  • వినిపించని రాగాలు 4 | Vinipinchani ragalu 4 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వినిపించని రాగాలు 4

    రచన : గొర్తి వాణిశ్రీనివాస్

    (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    గత ఎపిసోడ్ లో

    ప్రహరీ గోడకు ఆవలి వైపు ఉన్న చెట్టు ఆకతాయిలు చేరడానికి అవకాశంగా మారుతుంది.

    దాంతో ఆ చెట్టును కొట్టేస్తే బాగుంటుందని ఆవేశంలో అంటాడు మధు.

    వాచ్మెన్ ఆ చెట్టును నిజంగానే కొట్టెయ్యడంతో బాధ పడతాడు.

    ఉరికి వెళ్లిన మధు కుటుంబ సభ్యులు తిరిగి వస్తారు.

    ఇక వినిపించని రాగాలు 4 వ భాగం చదవండి…

    సత్య మాటలకి తత్తరపడ్డాడుమధు.

    భార్యకి భయపడేది ఒకే ఒక్క విషయంలో. అతనికి వచ్చే లేడీ ప్యాన్స్ రాసే ఉత్తరాల గురించి.

    ఎప్పుడో ఒకసారి అలా జరిగింది. జాతక ప్రభావం మనుషులపై ఎలా ఉంటుంది? ఉండబోతుంది ఇలాంటి విషయాలు ఒక ప్రముఖ వీక్లీ లో అచ్చు వేస్తామని అడిగారు.

    మధు అన్ని రాసుల వారి జాతక చక్రాల వారి గురించీ, జరగబోయే పరిణామాల గురించి  వాళ్ళకి రాసిచ్చాడు. అందులో కొన్ని అనుకూల ఫలితాలూ, కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అది చదివిన ఆడవాళ్లు వాళ్ళ సందేహ నివృత్తికై అదనపు సమాచారం కోరుతూ అతని అడ్రెస్ కి ఉత్తరాలు రాశారు. పత్రికవారు పాఠకుల ఒత్తిడి మేరకు అడ్రెస్ ఇచ్చి ప్రోత్సహించారుట.

    ఆ ఉత్తరాలను చదివిన సత్య అగ్గిమీద గుగ్గిలం అయ్యింది.

    'మా వారిని పర స్త్రీ వ్యామోహం కాస్త తగ్గించుకుంటే మంచిది' అని రాశారుకదా.

    ఆయనకి ఆ వ్యామోహం నిజంగా ఉందా? ఉందని ఎలా తెలుసుకోవడం? ఒకవేళ ఉంటే దాన్ని ఎలా నియంత్రించాలో ఉపాయం చెప్పండి"అని ఒకళ్ళు..

    ఇంకోళ్లయితే ఏకంగా 'మా ఆయనకు వృత్తి వ్యాపారాలలో నష్టం వస్తుందని రాశారు. వృత్తిలోనా? లేక వ్యాపారంలోనా? మీరు సరిగ్గా చెప్పలేదు. మీ అడ్రెస్ చెబితే మీ ఇంటికొచ్చి మా సందేహానివృత్తి చేసుకుంటాం' అని.

    ఏదో ఉజ్జాయింపుగా అన్ని నక్షత్రాల వారికీ కలిపి చెప్పేస్తే వాటి గురించి ఉత్తరాలు రాసేవాళ్ళు ఎక్కువయ్యారు. అప్పటినుంచి ఆ పత్రిక్కి రాయడం మానేశాడు. అయినా ఉత్తరాల పరంపర కొన్నాళ్ళు కొనసాగింది. అందులో ఎక్కువమంది మహిళలే.

    అందులో అతని ప్రమేయం లేదని పూర్తిగా నిర్ధారణ చేసుకునేదాకా సత్య అతన్ని వదిలిపెట్టలేదు.

    "ఏంటి ఆ కాగితం?" అన్నాడు సందేహంగా సత్య మొహంలోకి చూస్తూ.

    "శ్రీవారికి ప్రేమలేఖ" అంది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/sgD2gAtuUZA

    17 min
  • దేవుడు కోటేసు | Devudu kotesu | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    దేవుడు కోటేసు

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ 

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ప్రతి మనిషిలో దైవత్వం వుంది. కొందరి విషయంలో అది నివురుగప్పిన నిప్పులా ఉంటూ  దానవతను గుర్తుచేస్తుంది. కొందరి విషయంలో ఆ గొప్ప గుణం సలక్షణంగా సాటివారికి సహాయపడుతుంది.  ఆ మహా గుణ సంపదకు భోగభాగ్యాలు పరిమితం కావు. మంచి మానవత్వం... అదే దైవత్వం."రంగా!..."

    మూసి ఉన్న తలుపును తట్టి పిలిచాడు కోటేసు. అతని ప్రక్కన భార్య లక్ష్మి ఉంది. పాతిక సంవత్సరాల తర్వాత కోటేసు తన ఊరికి భార్యతో కలిసి వచ్చాడు. తన పిన తండ్రి కొడుకు రంగను, తన ఊరిని, తన యజమాని రామచంద్ర రావు గారిని చూడాలని.

    కోటేసు రెండవ పిలుపు విని రంగా తలుపు తెరిచి వరండాలోకి వచ్చాడు రంగా కోటేసుకన్నా మూడు సంవత్సరాలు చిన్నవాడు ప్రస్తుతములో కోటేష్ వయస్సు అరవై సంవత్సరాలు అతని ఇల్లాలు లక్ష్మికి యాభై ఐదు సంవత్సరాలు.

    అన్నా వదినలను చూచి రంగా ఆశ్చర్యపోయాడు. చాలా కాలం తర్వాత వారిని చూసినందుకు రంగ తన కళ్ళనుతానేనమ్మలేకపోయాడు. కొద్ది క్షణాలు వారిని పరీక్షగా చూశాడు.

    "రంగా!... నేను కొటేసును." నవ్వుతూ చెప్పాడు కోటేసు.

    రంగా వదనంలో ఎంతో ఆనందం "అన్నా!..." అని చేతులు జాచి కౌగిలించుకున్నాడు కొటేసును.

    "ఇన్నేళ్ళుగా ఎక్కడ ఉన్నేవన్నా!..." అన్న గద్గద స్వరంతో అడిగాడు రంగ.

    "నన్ను... మీ వదినను ఎవరూ గుర్తించని చోట కాయకష్టం చేసుకుంటూ జీవితాన్ని లాక్కొచ్చాను ఇంతవరకూ!..." నవ్వుతూ చెప్పాడు కోటేసు.

    "మిమ్మల్ని చూచిన నాకు ఎంతో ఆనందంగా ఉందన్న. రండి...” లోనికి చూస్తూ "మంగా... మంగా!... ఎవరొచ్చారో చూడు." ఆనందంతో పలికాడు రంగ.

    మంగ వచ్చింది. వారిని చూసింది. ఆనందంగా కోటేసు ఇల్లాలు లక్ష్మి చేతులు పట్టుకుంది.

    "అక్కా!... బాగున్నావా !..." ఎంతో ఆప్యాయంగా అడిగింది మంగ.

    "బాగున్నాను మంగా!..." నవ్వుతో చెప్పింది లక్ష్మి

    నలుగురూ ఇంట్లోకి నడిచారు. ఆ నాలుగు హృదయాల్లో ఒకరి పట్ల ఒకరికి ఎంతో ప్రేమాభిమానాలు. అది మానవతావాదానికి నిదర్శనం.

    ***

    అన్నదమ్ములు కోటేసు, రంగా చెరువు కట్ట మీది మర్రిచెట్టు క్రింద కూర్చుని తమ గతాన్ని తలపోసుకుంటున్నారు.

    "రంగా !..." మన అయ్యగారు బాగున్నారా!..." శూన్యంలోకి చూస్తూ అడిగాడు కోటేసు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/-JhSfFtMDAM


    15 min
  • ఆజన్మాంతపు కృతజ్ఞత | Ajanmanthapu Kruthajnatha | Telugu short Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఆజన్మాంతపు కృతజ్ఞత

    రచన : కొత్తపల్లి ఉదయబాబు

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    సమయం మధ్యాహ్నం 12 గంటలు అయింది.

    ఉదయం 6 గంటలకు మా ఊళ్లో బస్సు ఎక్కిన వాడిని బస్టాండ్ లో దిగి రిక్షా కట్టించుకుని రూమ్ కి వచ్చేసాను.

    రేపే బిఈడి పరీక్షలు ప్రారంభం. మా రూమ్మేట్స్ ఐదుగురిలో ముగ్గురు వాళ్ల వాళ్ల స్థానాల్లో కూర్చుని సీరియస్ గా చదువుకుంటున్నారు.

    "వావ్. వచ్చేసాడు మన హీరో. ప్రిపరేషన్ హాలిడేస్ లో అన్ని సబ్జెక్టులు బాగా చదివేసి ఉంటావు. మన అయిదుగురిలో నీదే ఫస్ట్ మార్క్." అన్నాడు వెంకటరత్నం.

    నాకు ఒళ్ళు మండింది."భూషణం రాలేదా ఇంకా?" అడిగాను.

    "అతని ఊరి మీదుగానే కదా నీ బస్ వచ్చేది..... మీ ఇద్దరు కలిసి వస్తారు అనుకుంటున్నాం" అన్నాడు నటరాజ్.

    "సరే మీ చదువు ఎందుకులే పాడు చేసుకుంటారు కానీ బాగా చదవండి." అనే బట్టలు మార్చుకుని కాళ్లు చేతులు కడుక్కుని వచ్చి నేను తెచ్చిన బ్రీఫ్ కేస్ ముందు కూర్చున్నాను.

    అంతలోనే భూషణం కూడా రిక్షా దిగి లోపలికి వచ్చాడు.

    వస్తూనే" గురువుగారు.. మీరు ఒకసారి నాతో ఇలా పెరట్లోకి రండి. మీతో ఒక మాట మాట్లాడాలి." అన్నాడు.

    మిగతా ముగ్గురు తనని పలకరించలేదు. అతనితో పాటు పెరట్లోకి వెళ్లా. చాలా ఆందోళనగా కనిపించాడు.

    "ఏమైందండీ"అన్నాను.

    "గురువుగారు. ఈ నెలరోజుల ప్రిపరేషన్ హాలిడేస్ లో ఒక్కరోజు పుస్తకం తీస్తే ఒట్టు. నేను పరీక్ష పేపర్ మీద ఒక్క అక్షరం కూడా పెట్టలేను. కానీ నేను పరీక్ష పాస్ అవ్వకపోతే మా నాన్నగారు నా భార్యని నా పిల్లలిద్దరిని నాతో సహా ఇంట్లో నుంచి గెంటేస్తాడు. నన్ను ఎలాగైనా ఈ పరీక్ష మీరే పాస్ చేయించాలి. మీరు ఏం సలహా ఇచ్చినా పాటిస్తాను. నా పిల్లల మీద ఒట్టు" అతని కళ్ళల్లో కన్నీళ్లు ఒక్కటే తక్కువ.

    రోలు వెళ్లి మద్దెలతో మొర పెట్టుకున్నట్టు అతను చెప్పిన మాట విని నేను నివ్వెర పోయాను.

    ఎందుకంటే ప్రిపరేషన్ హాలిడేస్ కి పుస్తకాలన్నీ సర్దుకుని బ్రీఫ్ కేసులో పెట్టుకుని ఎలా వెళ్లానో నెల రోజుల తర్వాత నేనూ అలాగే తిరిగి వచ్చాను. దానికి కారణం నేను ఇంటికి వెళ్లిననాడే, కడుపులో కంతి తో పాటు గర్భసంచిని కూడా తీసేసి, పెద్ద ఆపరేషన్ జరిగిన అమ్మని ఆ రోజే నాన్నగారు వైజాగ్ నుంచి తీసుకొచ్చారు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/cEuS5BRlwbk

    16 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world