Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • అర్థాంగి | Arthangi | Telugu Short Story | Padmavathi Divakarla | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    అర్థాంగి

    రచన: పద్మావతి దివాకర్ల

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    పండుక్కి తన అక్క ఇంటికి వెళ్ళిన వెళ్ళిన విష్ణుమూర్తి పల్లెటూరి అమ్మాయైన మహాలక్ష్మి మీద మనసు పారేసుకున్నాడు. ముందునుండీ విష్ణుమూర్తికి పల్లెటూరి అమ్మాయిని చేసుకోవాలనే ఉంది. పట్నం అమ్మాయిలైతే తనతో ఓ ఆట ఆడుకుంటారని, వంటపని, ఇంటిపని ఏమాత్రం తెలియదని, వంటపనంతా తనపైనే పడుతుందని విష్ణుమూర్తికో బలమైన అభిప్రాయం ఉంది. అందుకే అందమైన, అమాయకమైన మహాలక్షి నవ్వుకి పడిపోయిన విష్ణుమూర్తి ఆమెని చూడగానే మనసు పారేసుకున్నాడు. అక్క సుబ్బలక్ష్మినడిగి ఆమె గురించి అంతా వివరంగా తెలుసుకున్నాడు.

    తమ్ముడి గురించి పూర్తిగా తెలిసిన సుబ్బలక్ష్మి రెండువైపులా నరుక్కొచ్చి ఆ పెళ్ళి సంబంధం కుదిర్చింది. అమాయకమైన అమ్మాయి భార్యగా లభించబోతున్నందుకు విష్ణుమూర్తి చాలా సంతోషించాడు. బాజాభజంత్రీలు మోగగా ఆమె మెళ్ళో తాళికట్టేసి బెంగుళూరులో కాపురం పెట్టాడు. అమాయకమైన మహాలక్ష్మి అంటే విష్ణుమూర్తికి ప్రాణం. ఆమె అమాయకత్వం వల్ల తనెన్ని ఇబ్బందుల పాలైనా ఆమెంటే వల్లమాలిన అభిమానం. మహాలక్ష్మికి బెంగుళూరులో అన్నీ వింతవింతగా కనిపించాయి. పెద్దపెద్ద ఫ్లాట్లు, మాల్స్ ఆమె మతి పోగొట్టాయి.

    “ఏమండీ! ఇవాళ బజారుకి వెళ్దామండీ, నేను కొన్ని చీరలు కొనుక్కోవాలండీ. నా వద్ద అన్నీ డెస్స్లే ఉన్నాయి, కానీ సరైన చీరలు లేవు." అని మహాలక్ష్మి అడిగేసరికి సరేనన్నాడు.

    "డ్రెస్‌లు ఈ ఊళ్ళో సౌకర్యంగా ఉంటాయి. పైగా నువ్వీ ఆకుపచ్చ డ్రెస్స్‌లో చాలా అందంగా ఉన్నావు. అయినా నువ్వు కోరుతున్నావు కనుక మంచి చీరలు కొందాం సరేనా!" అన్నాడు విష్ణుమూర్తి ఆమె వైపు మెచ్చుకోలుగా చూస్తూ.

    ఆ చూపులకి సిగ్గుపడింది మహాలక్షి."మరి, డ్రెస్‌లకి కొంగు ఉండదు కదండీ!" అంది మహాలక్ష్మి.

    "కొంగేంటీ?" అడిగాడు ఏమీ అర్థం కానట్లు.

    "మా అమ్మమ్మ చెప్పిందండీ, పెళ్ళైన తర్వాత భర్తని కొంగున కట్టుకోని తిప్పుకోవాలిట. లేకపోతే భర్తని అదుపులో ఉంచుకోవడం కష్టమట." అంది మహాలక్షి అమాయకంగా భర్త వైపు చూస్తూ.

    ఆమె అమాయకత్వానికి అబ్బుర పడ్డాడు విష్ణుమూర్తి. ఆమె అమాయకత్వం గురించి విష్ణుమూర్తికి ఏమైనా అనుమానముంటే ఈ దెబ్బతో అన్నీ పటాపంచలు అయిపోయాయి.ఆదివారం మహలక్ష్మిని సినిమాకి మల్టీప్లెక్స్‌కి తీసుకెళ్ళాడు. అక్కడ ఎస్కలేటర్‌ని చూసి భయపడిందామె. విష్ణుమూర్తి చిన్నగా నవ్వుకొని ఆమెని లిఫ్ట్ వద్దకు తీసుకెళ్ళాడు.

    అందులోకి వెళ్ళిన మహాలక్ష్మి ఆశ్చర్యంగా, "ఇదేమిటండీ ఇదో చిన్న గదిలా ఉంది." అంది.

    "దీన్ని లిఫ్ట్ అని అంటారు. సినిమా హాలు నాలుగవ అంతస్థులో ఉంది. మెట్లెక్కకుండా మనం ఇలా వెళ్ళిపోవచ్చు." అని ఆమెకి వివరించి మీట నొక్కాడు. లిఫ్ట్ అలా మీదకి వెళ్ళడం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. ఆ హాల్లో విష్ణుమూర్తి అభిమాన హీరో సినిమా 'రాజమండ్రి రాజయ్య' సినిమా అడుతోంది. హాల్లోకి వెళ్ళబోతూ పాప్‌కార్న్, రెండు కోకాకోలాలు తీసుకొని వెయ్యి రూపాయిలు ఇచ్చాడు. వెయ్యి రూపాయలు పుచ్చుకొని ఆ షాప్‌వాడు ఓ యాభై రూపాయలు చేతిలో పెట్టడం చూసి ఆశ్చర్యపోయింది మహాలక్ష్మి.

    "ఏమిటండీ! ఇంత డబ్బులు తీసుకున్నాడా ఈ జొన్నగింజల కోసం. మా ఊళ్ళో ఇరవై రూపాయలు ఇస్తే ఇంతకు రెండు రెట్లు వస్తుంది కదండీ!" అందామె విస్మయంగా.

    ఆమె అమాయకత్వానికి నవ్వాడు విష్ణుమూర్తి."ఇది బెంగుళూరు మహాలక్ష్మీ, ప్రతి విషయానికీ బెంగ పెట్టుకోకూడదు. సినిమా హాల్లో ధరలు ఇలాగే ఉంటాయి." అన్నాడు హాల్లోకి వెళ్తూ.

    సినిమాలో హీరో తెర మీద కనిపించినప్పుడల్లా ప్రేక్షకులు వేసే ఈలలు, చేసే గొల్లు చూసి ఆమె విస్తుపోయింది. ఇక్కడ సినిమా హాల్లో కూడా మన పల్లెటూళ్ళోలాగే ప్రవర్తించడం ఆమెకి చాలా వింతనిపించి భర్తతో ఆ విషయమే చెప్పింది.

    "మన తెలుగు సినిమా అభిమానులు ఎక్కడున్నా ఒకటే మహలక్ష్మీ, అది అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా కూడా!" చెప్పాడు విష్ణుమూర్తి నవ్వుతూ.

    అతనికీ హీరో ఫైట్సు చేసినప్పుడల్లా ఈల వెయ్యాలని ఉన్నా సంస్కారం అడ్డువచ్చింది.సినిమా చూసిన తర్వాత విష్ణుమూర్తి ఆమెని డొమినోస్‌కి తీసుకెళ్ళి పిజ్జా ఆర్డరిచ్చాడు. ఓ అరగంట తర్వాత తన ముందు ఉన్న పదార్థం చూసి మహాలక్ష్మి ఆశ్చర్యానికి అంతులేదు.


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/N38_GLZNB9E



    9 min
  • ప్రేమ చేజారితే 9 | Prema Chejarithe 9 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 9

    రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)గత భాగంలో జరిగినది డాక్టర్ నితిన్ పిల్లలకు అర్థమయ్యే విధంగా కుశాల్, కుశాల్ క్లాస్మేట్లకు కౌన్సెలింగ్ కొనసాగిస్తుంటాడు .

    ఇక ఈ భాగం చదవండి... ఆరోజు ఉదయం కుశాల్ ఉలిక్కిపడి కలవరిస్తూ లేచాడు, మనసులో ఏవో తెలియని భావనలు, అదోమాదిరి అలజడి, విపరీతమైన బాధ... ఎవరో ఎక్కడినుండే పడ్తున్నట్టుగా, ఏదో లీలగా కనిపిస్తుంది, ఏంటా అని ఆలోచించే ప్రయత్నం చేస్తే చాలు తలనొప్పిగా అనిపిస్తోంది. ఎందుకలా అని ఆలోచించటానికి లేకుండా తలనొప్పి... అమ్మానాన్నలకు కూడా చెప్పాలనిపించలేదు. కుశాల్ ఎంత ప్రయత్నిస్తున్నా ఆలోచనలు కుదుటపడటం లేదు, ఇంకా తల నొప్పి పెరుగుతన్నట్టుగా అనిపించింది... కుశాల్‌కు స్కూల్‌కెళ్ళి డాక్టర్ నితిన్‌ని కలిస్తే బాగుంటుందనిపించి, వెంటనే రెడీ అయ్యి స్కూల్‌కు బయలుదేరాడు, షాలిని టిఫిన్ తినమని పిలుస్తున్నా వినకుండా, తినకుండా స్కూల్‌కు వెళ్ళి పోయాడు కుశాల్. అక్కడే వున్న కుమార్ షాలినీతో, "పర్వాలేదులే నేనీరోజు నానీ స్కూల్‌కు వెళ్తున్నాను, క్యారియర్ కట్టి వుంచు నేనే తీస్కెళ్తాను," అని చెప్పాడు. షాలిని,"అలాగే," అంది. కుశాల్ స్కూల్కెళ్ళగానే క్లాస్మేట్ 'హసీ' కనిపించి, "ఏంటి కుశాల్! అలా వున్నావు? మళ్ళీ తల నొస్తుందా? అయితే తొందరగా మన డాక్టర్ని కలవమని సలహా ఇచ్చి, బై చెప్పి", వెళ్ళి పోయింది. డాక్టర్ నితిన్ కుశాల్ వాళ్ళకు కౌన్సెలింగ్ మొదలెట్టినప్పటి నుండి స్కూల్‌కు అస్సోసియేట్గా వున్న హెల్త్ కేర్ యూనిట్లోనే ప్రతిరోజూ వచ్చి స్కూల్ టైమంతా అక్కడే వుంటున్నాడు. పిల్లలకు అక్కడ కౌన్సెలింగ్ ఇవ్వటమే కాక పూర్తిగా తను వాళ్ళను గమనిస్తున్నాడు కూడా. ఎవరైనా ఇతరులు నితిన్‌ని అర్జెంటుగా కన్సల్ట్ చేయాలంటే అక్కడికే వారిని రమ్మంటున్నాడు, లేకపోతే ఆన్లైన్లోనే వారికి కావాల్సిన సలహాలిస్తున్నాడు. కుశాల్ కూడా హసీకి బై చెప్పి స్కూల్లోని 'హెల్త్ కేర్ యూనిట్' దగ్గరకు వచ్చాడు. సైకియాట్రిస్ట్ నితిన్ అక్కడ కూర్చుని కనిపించాడు. ఇంకా ఉదయమే కావటాన ఫ్రెష్‌గా కనిపిస్తూ, ఇస్త్రీ చేయబడిన శుభ్రమైన లేత రంగు షర్ట్‌కు ముదురు రంగు పాంట్ వేసి, టక్ చేసి, టై, షూస్‌తో పైన డాక్టర్ కోట్తో చూస్తూనే డాక్టర్ లా ప్రశాంతంగా కనబడుతున్నాడు. అతని వయసు అరవై పైనే వున్నా అస్సలంత వయసున్నట్టే కనబడడు. మరి ఆయన మైండ్ స్పెషలిస్టు కదా, ఎప్పుడు, ఎలా ఆ మనసును ఆధీనంలో వుంచుకోవాలో, ఎలా దాన్ని ఆనందంగా వుంచాలో బాగా తెలిసిన వ్యక్తి. మనసు ఆనందంగా వుంటే శరీరంలో ఎంతో వయసు తగ్గినట్లు కనిపిస్తుందన్నదానికి ఆయనో నిలువెత్తు నిదర్శనం. సైకియాట్రిస్ట్ నితిన్ అప్పుడే వచ్చిన కుశాల్‌ని చూసి, "కమ్ నానీ" అంటూ పిలిచి కూర్చోమన్నాడు. (కుశాల్‌ను వాళ్ళ నాన్న పిలిచే పేరు 'నానీ' అని ముందు చెప్పాను గుర్తుంది కదా) ... నితిన్ కావాలనే కుశాల్‌ను ముద్దు పేరుతో పలకరించాడు. దానివల్ల దగ్గరితనం పెరిగి మనసులోనిది బయటపెడ్తాడనేమో. "ఏంటి ప్రాబ్లం నానీ?" అని అడిగి, "మళ్ళీ తనే అదే ప్రాబ్లమా" అని అడుగుతుండగానే ఒక ఇద్దరు జూనియర్ సైకియాట్రీ డాక్టర్లు వచ్చారు. వాళ్ళను కాన్ఫరెన్స్ రూమ్‌లో కూర్చోమన్నాడు నితిన్. వాళ్ళు వెళ్ళి పోయాక మళ్ళీ నానీ వంక చూసాడు, అప్పుడు నానీ "అవునని సమాధాన"మిచ్చాడు...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/hpahx8Z3Dok


    10 min
  • ఇల్లే బృందావనం | Ille Brundavanam | Telugu Short Story | Sripathi Lalitha | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఇల్లే బృందావనం

    రచన: శ్రీపతి లలిత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)"టిఫిన్ బాక్స్ పెట్టుకున్నావా ? నీకు ఇష్టమని మసాలా వడలు చేశాను. రెండు డబ్బాలు పెట్టాను. ఒకటి నువ్వు తిను వేరేది మీ ఫ్రెండ్స్ కి ఇవ్వు. జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి. ఆఫీస్ కి వెళ్ళాక మెసేజ్ పెట్టు. " లిఫ్ట్ దగ్గర నుంచుని చెప్తున్న మాలతిని చూసి నవ్వుతూ " అలాగే అమ్మామీరు లోపలికి వెళ్ళండి ఓకే, బై " లిఫ్ట్ రాగానే వెళ్ళింది ప్రియ.అవి హైటెక్ సిటీ దగ్గర ఒక గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్న ఫ్లాట్స్. ప్రియ, ప్రమోద్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. వాళ్ళకి ఒక పాప ఐరా, 5 ఏళ్ళు.ప్రియ వెళ్ళగానే లిఫ్ట్ నుంచి ఫ్లాట్ లోపలికి వస్తున్న మాలతి ని చూసి ఎదురు ఫ్లాట్‌లో ఉన్న ఆమె పలకరింపుగా నవ్వింది." నా పేరు స్వాతి, మేము కొత్తగా వచ్చాము ఆంటీ. ప్రియ ఆఫీసుకి వెళ్లిందా? " అంది. ""అవునమ్మా ? ప్రియ చెప్పింది మీరు ఈమధ్యే వచ్చారని. అలవాటు పడ్డారా ? "అడిగింది మాలతి."లోపలికి రండి ఆంటీ " పిలిచింది స్వాతి. " లేదమ్మా పొయ్యి మీద కూర పెట్టాను తరవాత వస్తానులే " అంటూ హడావిడిగా లోపలి వెళ్ళింది మాలతి.స్వాతి, ఆమె భర్త సంతోష్ కొత్తగా ఫ్లాట్ కొనుక్కొని వచ్చారు. వాళ్ళ అబ్బాయి చెన్నై లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. సంతోష్ కి సొంత బిజినెస్. స్వాతి ఇంట్లోనే ఉంటుంది.ఒక్క ప్రియా వాళ్ళ తోనే కొంచెం పరిచయం. ఒక్కతికి ఏమి తోచక ఎవరైనా కనిపిస్తే మాట్లాడుతుంది. మెయిన్ డోర్ దగ్గరికి వేసి కూర్చుంటుందికొద్దిగా మాటలు వినపడితే సందడిగా ఉంటుంది అని.ప్రియా వాళ్ళ అమ్మ నాన్న వచ్చినట్టున్నారు అనుకుంది.కొంచెం సేపటికి ప్రమోద్ కూడా బయటికి వచ్చాడు.కరెక్ట్ గా ప్రియా కి చెప్పినట్టే చెప్పింది. మాలతి."ఆఫీస్ కి చేరాక మెసేజ్ పెట్టు. టిఫిన్ బాక్స్ లో నువ్వు తీసుకోని మిగిలినవి ఫ్రెండ్స్ కి ఇవ్వు "అంటూ."గుర్తుంటే మెసేజ్ పెడతాను. అందరమూ కూర్చుని తినేప్పుడు అలా కుదరదు. " కోపంగా అంటూ వెళ్ళాడు ప్రమోద్."అల్లుడి పొగరు " అనుకుంది స్వాతి.సాయంత్రం ఐరా ని స్కూల్ బస్సు నుంచి తీసుకొని వచ్చారు మాలతి ఆమె భర్త మనోహర్.ఐరా ఆపకుండా ఒకటే కబుర్లు " తాతా, అమ్మా ". అంటూ.మరికాసేపటికి ప్రియ వచ్చింది. వాళ్ళు కూడా తలుపు దగ్గరికి వేసారేమో నవ్వులు కబుర్లు బాగా వినిపించాయి.అందరూ కూచుని భోజనం చేస్తున్నట్టున్నారు " అనుకుంది స్వాతి.స్వాతి భర్త పొద్దున్న వెళితే రాత్రి రావడం. ఇద్దరు కలిసి ఒకపూట కూడా భోజనం చేయరు.కలిసి తింటే ఒక ముద్దా ఎక్కువ కూడా తింటాము. కబుర్లు చెప్పుకుంటూ తింటే తిన్న తిండి ఒంటికి పడుతుంది.ఇలా ఒక్కతీ ఇంట్లో ఉండి చాల బోర్ గ ఉంటోంది. " నిట్టూరుస్తూ లోపలి వెళ్ళింది.ఆ తరువాత రోజు ఇదే తంతు.ఎంతైనా అమ్మ అమ్మే. ఆమె వచ్చాక ప్రియ మొహంలో సంతోషం కనిపిస్తోంది.రెండు రోజుల తరవాత ప్రియ స్వాతి దగ్గరికి వచ్చిందిస్వాతి గారు నాకు ఒక సహాయం కావాలి " అంది"తప్పకుండ ప్రియా ఏమిటి ? "అంది స్వాతి."ఇవాళ అమ్మ పుట్టిన రోజు ముందు చెపితే తనకు వద్దు అంటారు. నేను ఆన్లైన్ లో చీర, బొకే కేక్ బుక్ చేశాను. అవి మీరు తీసిపెట్టుకుంటారా ?నేను రాత్రి 10 తరవాత తీసుకుంటాను"అంది.
    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/kijM4j7Q19Q


    10 min
  • మయోంగ్ | Mayong | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
    మయోంగ్

    రచన: మావూరు విజయలక్ష్మి

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    “మయోంగ్! ఓ అద్భుతం! ఓ రహస్యం! ఓ గగుర్బాటు! ఓ భయం! ఓ భీభత్సం! ఊహకందనిఊహాతీతశక్తి!”ఆ గడ్డ మీద ఎదో శక్తి ఉంది. అలాగని అదేదో దేవాలయం కాదు. అక్కడికెళితే ఏవో వింత వింత శబ్దాలు వినపడతాయి. అలాగని అదేదో ఘోస్ట్ విలేజ్ కాదు. చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతతలోనే ఒళ్ళు గగుర్పొడిచే భయముంది. నిశ్శబ్దం లోనే లీలగా భయంకర శబ్దాలు.... అవి మనకు కూడా వినిపిస్తుంటాయి. కాని ఆ శబ్డాలేంటో మాత్రం మనం చెప్పలేం. అసలా శబ్దాలుఎక్కడి నుంచి వస్తుంటాయో కూడా అర్థం కావు. అదే అద్భుత మాయాలోకం “మయోంగ్...”. అదేదో మరో లోకంలో లేదు ఈ భూమ్మీదే మన దేశంలోనే ఉంది. అసోం రాజధాని గౌహతి కి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది మయోంగ్. ఈ గ్రామానికి మయోంగ్ అన్న పేరు రావడానికి ఒక కారణం ఉంది. ఇక్కడి జనాలు మాయలు చేస్తారు. మంత్రాలు వేస్తారు. ఇంద్రజాలంలో ఆరి తేరిన వారు.అంతెందుకు ఇక్కడ అంతా మాయనే కాబట్టి ఈ ప్రాంతానికి మయోంగ్ అనే పేరు వచ్చింది. మయోంగ్ మారిగాన్ (మొరిగోన్) జిల్లాలో ఉంది. బ్రహ్మపుత్ర నది ఒడ్డున కొన్ని గ్రామాల సముదాయమే ఈ మయోంగ్. ఇక్కడ బ్లాక్ మేజిక్ తోఅందరినీ మాయ చేస్తారు. ఇంతలా ఇంద్రజాలం చేసే వారు ప్రపంచంలోనే ఎవరూ ఉండరేమో అనేది ఈ ప్రాంతీయుల గురించి ప్రపంచం చెప్పుకునే మాట. అందుకే మయోంగ్ ఒక పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. స్వదేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా ఎంతోమంది పర్యాటకులు మయోంగ్ మాయలు చూడ్డానికొస్తారు కూడా.చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ళ వరకు అందర్నీ విపరీతంగా ఆకట్టుకునే అద్భుత మాయాలోకం హేరీపోటర్. హేరీపోటర్ సినిమాలు చూస్తున్నప్పుడు వా...వ్..ఇలాంటి స్కూల్స్, ఇలాంటి ఊర్లు నిజంగా ఉంటే ఎంత బాగుంటుందో.... అనుకుంటాం. మరీ అచ్చంగా అలాగే కాకపోయినా ఆ హేరీపోటర్ మాయాలోకానికి చాలా దగ్గరగా కనిపించే ఒక మాయాలోకం, అద్భుత ప్రపంచం ఈ మయోంగ్.ఊరి పేరు వెనుక కథ.ఈ ప్రాంతం ఇప్పటిది కాదు పురాణకాలం నాటి ప్రదేశం. ద్వాపరయుగంలో తన క్రూరత్వంతో, మాయలు, మంత్రాలతో ఎంతోమంది సాధువులను, సజ్జనులనువణికించినవాడు, సత్యభామ, శ్రీకృష్ణుల చేతిలో హతమయినవాడు, ప్రస్తుతం మనం జరుపుకుంటున్న దీపావళి పండుగకు కథానాయకుడు అయిన నరకాసురుని రాజ్యానికి రాజధాని అయిన ప్రాగ్జోతిషపురమే ఈ అసోం. ఆ అసోంలో కొంతభాగమే ఈ మయోంగ్.ఈ ఊరికి మయోంగ్ అని పేరు రావడానికి చాలా కథలే చెప్తారు. ఈ ప్రాంతానికి మహాభారత కాలానికి సంబంధం ఉంది. పాండవులలో ఒకడైన భీముడి కుమారుడైనఘటోత్కచుడికి సంబంధించిన రాజ్యం, ఇప్పటి మాయోంగ్ ప్రాంతంలోనే ఉండేదట. ఘటోత్కచుడు పెనుమాయల్ని చిటికలో చిత్తుచిత్తు చేసే మాయగాడు. అలాంటిఘటోత్కచుడు తన సైనికులకు, తన అనుయాయులకు కూడా ఈ మయోంగ్ లోనే శిక్షణ ఇప్పించి, వారినా విద్యల్లో ఆరితేరేలా చేసేవాడట. పూర్వం ప్రపంచంలో ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి మర్మ విద్యలు, మాయా విద్యలు నేర్చుకోడానికి ఇక్కడికి వచ్చేవారట. అలా మహాభారతం కాలం నుంచి ఇప్పటి వరకు ఆ వంశస్తులు మాయలు చేస్తూనే ఉన్నారట.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/ABySoaX6Bzs


    10 min
  • తండ్రికి తగిన తనయ | Thandriki Thagina Thanaya | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)


    తండ్రికి తగిన తనయ

    రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    "ఏయ్! సుగుణా! ఆఫీసుకు టైమవుతోంది. బ్రేక్‌ఫాస్ట్ రెడీనా?" ఆఫీసుకు రెడీ అవుతూ అడిగాడు గోపాల్. " రెడీ. రండి." అంది సుగుణ.గోపాల్ డైనింగ్ హాల్లోకి రాగానే భర్తకు పెట్టి, తనూ తీసుకుంది సుగుణ. బ్రేక్‌ఫాస్ట్ పూర్తిచేసి హడావుడిగా ఆఫీసుకు వెళ్లాడు గోపాల్. ఆ తర్వాత మిగిలిన పనిని పూర్తి చేసి తమ ఊరిలో ఉన్న తల్లితండ్రులకు ఫోన్ చేసి వాళ్లతో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది సుగుణ. తరచూ వాళ్లకు ఫోన్ చేసి వాళ్ల యోగక్షేమాలను తెలుసుకోవడం సుగుణకు పరిపాటే. వాళ్లతో మాట్లాడి ఫోన్ పెట్టేయగానే తన తల్లి తండ్రులు, తన ఊరిని గురించిన ఆలోచనలతో గత స్మృతులలోకి వెళ్లింది సుగుణ.వెంకటాపురం గ్రామంలో రామయ్య తన భార్య జానకమ్మ, ఏకైక కూతురు సుగుణతో పెద్దలిచ్చిన విశాలమైన ఇంట్లో సంతోషంగా ఉంటున్నారు. ఉన్న ఎకరం పొలంలో కష్టపడి వ్యవసాయం చేస్తూ తనకున్నంతలో ఏలోటూ లేకుండా సుగుణను పెంచి పెద్దచేశారు రామయ్య గారు. ఆయన ఆ ఊరి ప్రెసిడెంటు కూడా కనుక ఊరి పెద్దగా ఉంటూ ఎవరికి ఏసాయం కావాల్సొచ్చినా లేదనకుండా చేసేవారు. అందరికీ ఆయనంటే చాలా గౌరవము, అభిమానము. పురాతనంగా ఉన్న ఆ ఊరి శివాలయాన్ని చుట్టుప్రక్కల గ్రామప్రజల నుంచి చందాలు ప్రోగుచేసి, తమ ఊరి వాళ్ల చేత కూడా చందాలు వేయించి, మిగిలింది తను వేసి దగ్గరుండి ఆలయపునరుధ్ధరణ చేశారు రామయ్య గారు. ఆయనమీద గౌరవంతో ఆ ఊరి ప్రజలు ఆయన్నే ఆలయ ట్రస్టీగా నియమించుకుని ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆలయ పూజారిని నియమించుకుని తన ఇంటిలో ఒక భాగాన్ని ఆదంపతులకు నివాసానికి ఉచితంగా ఇచ్చారు రామయ్య గారు. సుగుణ కూడా తన కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా మెలుగుతూ కష్టపడి చదివి మంచి మార్కులతో పదవతరగతి పాసయింది. ఆ ఊరి స్కూలులో అంతవరకే చదువు ఉన్నందున ఇంటరు చదువు కోసం ప్రక్క ఊరిలోని కాలేజీలో సుగుణను చేర్చారు రామయ్య గారు. కాలేజీకి ప్రతిరోజూ సుగుణ తన తోటి స్నేహితురాళ్లతో కలిసి నడిచి వెళ్లేది. తమ గ్రామం 'అందమైన పచ్చని ప్రకృతి ఒడిలో సేద తీరుతోందా?' అన్నట్లుగా ఎంత సుందరంగా, కనువిందు చేస్తూ ఉంటుందో? తమ ఊరిని దాటి ప్రక్క ఊరి కాలేజీకి వెళ్లాలంటే చుట్టుప్రక్కల అంతా చెట్టు చేమలు, దూరంగా ఎత్తైన కొండలను చూసుకుంటూ మధ్యలో గలగల పారే పెద్దకాలువ, దాని చుట్టూ ఆకు పచ్చనితివాచీ పరిచినట్టు కళకళలాడే మాగాణి పంటలు. ఆ కాలువ నుంచే ఆ పంటలకు నీరు అందేది. బల్లకట్టు ఎక్కి ఆ కాలువ దాటితే గాని కాలేజీకి, ఇతర గ్రామాలకు వెళ్లలేరు. బల్లకట్టుని నడిపేవాడికి నెలకు కొంత ధాన్యం ఇచ్చి ఆ కాలువను దాటి చుట్టుపక్కల గ్రామాల్లో తమ పనులను పూర్తిచేసుకుని తమగ్రామం వెంకటాపురం చేరుకొనేవారు ఆ ఊరి ప్రజలు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/5laDtmpd-RM


    15 min
  • పంచాంగ శ్రవణం | Panchanga Sravanam | Telugu Short Story | Jidigunta Srinivasa Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)


    పంచాంగ శ్రవణం

    రచన : జీడిగుంట శ్రీనివాసరావు(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)కాఫీ తాగుతో ఫోన్లో యూట్యూబ్ చూస్తున్న భర్త రవీందర్ తో “అలా ఉదయమే ఆ రాజకీయనాయకుల తిట్టుకోవడాలు చూడకపోతే, ఈ రోజు ఉగాది కదా.. టీవిలో పంచాంగశ్రవణం వస్తుంది. విని మీ రాశి కి, నా రాశి కి, పిల్లల రాశి కి ఈ ఏడాది ఎలా వుందో చూడండి” అంది రమణి పూజ చేసుకుంటో.పండగపూట ఎందుకొచ్చిన గొడవ అని, ఫోన్ పక్కన పడేసి టీవీ పెట్టాడు రవీందర్. ఏ ఛానల్ చూసినా పంచాంగశ్రవణం తో హడావిడి చేస్తున్నారు.

    భార్య వినమంది కదా అని ఒక ఛానల్ లో ప్రతిపక్ష నాయకుడి ఆఫీసులో జరుగుతున్న పంచాంగశ్రవణం పెట్టాడు.“అయ్యో రాత, అన్ని రాశులు గురించి చెప్పే పంచాంగశ్రవణం వినమంటే ఆ రాజకీయనాయకుడి జాతకం వింటున్నారేమిటండి, ఏమైనా అరిస్తే అసలే ఉగాది, సంవత్సరం అంతా అరవాలి, అంత ఓపిక లేదు నాకు. ఆర్డమైందా మీకు..” అంటూ పూజ గదిలో నుంచి అరుపులకి టీవీ ఛానల్ అదంతటికి అదే భక్తి టీవీ లోకి మారిపోయింది.నుదుట పెద్ద కుంకం బొట్టు, మెడ నిండా రుద్రాక్షలు, భారీ ఆకారం పంచాంగశ్రవణం చేస్తున్నారు. ఆయనని చూడగానే రవీందర్ కి భక్తిభావం కలిగింది.ఒక్కొక్క రాశి గురించి చెప్పటం మొదలుపెట్టారు శాస్త్రిగారు. భర్త రాశి చెప్పటానికి ముందే పూజ ముగించి, వచ్చి కూర్చుంది రమణి.“యిప్పుడు తులా రాశి వారి జాతకం” అన్నారు శాస్త్రి గారు గట్టిగా ఊపిరి తీసుకొని.“మీదే.. వినండి జాగ్రత్తగా. ఏ ఫోన్ వచ్చినా తీయద్దు” అంది రమణి.“తులారాశి లోని స్వాతి జాతకులకి ఈ సంవత్సరం అద్భుతంగా వుంటుంది, పట్టిందల్లా బంగారమే. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి” అన్నారు శాస్త్రి గారు.రవీందర్ ముసిముసి నవ్వులు నవ్వుతో “నాకు సంతానం కలుగుతుందిట” అన్నాడు. “బాగానే వుంది వరస, 70ఏళ్ళు పెట్టుకుని యింకా సంతానం అనగానే ఆ మురిసిపోవడం ఏమిటండి.. సిగ్గులేకుండా” అంది రమణి.“స్వాతి వారికి అన్నీ రోజులు బాగున్నాయి, అయితే ఆగష్టు లో జాగ్రత్తగా వుండాలి. పెద్ద ప్రమాదం పొంచి వుంది. రాహువు కాటు వేయడానికి సిద్ధంగా వుంటాడు. డిసెంబర్ లో కొడుకుకి పెళ్లి చేస్తారు” అని చెప్పిన శాస్త్రి గారి మాటలు విని, “మన అబ్బాయి పెళ్లి అయ్యింది గా, బహుశా ఆయనని పెళ్ళికి పిలవకపోవడం వలన తెలిసి వుండదు” అన్నాడు, మనసులో రాబోయే ఆగస్టు సంక్షోభమ్ గురించి ఆలోచిస్తో.“యిప్పుడు మకరరాశి వారికి.. ఈ సంవత్సరం వీళ్ళకి బాగా కలిసివస్తుంది. వివాహం జరుగుతుంది, ఉద్యోగం లో పెద్ద లాభం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది, కోర్టు కేసులు గెలుస్తారు” అని సెలవిస్తున్న టీవికి సెలవిచ్చింది రమణి.
    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/f_oxwRvE_gY


    12 min
  • మమతల మధువు ఎపిసోడ్ 8 | Mamathala Madhuvu Episode 8 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
    మమతల మధువు ఎపిసోడ్ 8

    రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
    అరగంటలో యీ వార్త ఆ వాడంతా వ్యాపించింది. వారి బంధువులు.... తెలిసిన వారు వీర గోవిందయ్య యింటికి చేరారు. గోపాల్... భీమారావులు వెళ్ళి చూచి వచ్చారు. ఆ సాయంత్రం... పాండూ మట్టిలో కలసిపోయాడు.భీమారావు మనుమడు ఆదిత్య పాండును కొట్టి చంపాడని... జనం తీర్మానించారు. యీ అవమానంతో గోపాల్ ఆదిత్యను ఆవేశంతో తిట్టాడు. కొట్టాడు. అన్నను ప్రక్కకు త్రోసి భవానీ... ఆదిత్యను తన యింటికి తీసుకొని వెళ్ళింది. వాడవారి మాటలను విన్న ప్రేమ, ఆదిత్యను చూచేదానికే భయపడింది. తన వల్ల పాండు చచ్చిపోయాడని ఆదిత్య కుమిలి కుమిలి... ఏడ్చాడు. యింట్లోనించి బయటికి వచ్చేదానికి బయపడ్డాడు.పాండూ మేనమామ పుల్లారావు... రౌడీ... త్రాగుబోతు. భీమారావు యింటికి వచ్చి... "నా అల్లుణ్ణి నీ మనవడు చంపాడు. మేము పోలీస్ కంప్లయింట్ యిస్తాం... కోర్టులో కేసు వేస్తాం... మీ వాడిని... జైలుకు పంపిస్తాం. నా సంగతి మీకు తెలవదు.” త్రాగిన మైకంలో నోటికొచ్చినట్లు వాగాడు.భీమారావు... డాక్టర్ వేణుమాధవు, మాస్టారు మాధవయ్యను. సబ్ ఇన్ స్పెక్టర్ జార్జిని వారి... ఆఫీస్ కు ఆహ్వానించాడు. ధర్మాధర్మాలను గురించి కొడుకు గోపాల్ సమక్షంలో వారితో చర్చించాడు. చివరిగా... “పాండూ చనిపోవడం మాకూ ఎంతో బాధగా వుంది. డాక్టర్ వేణుమాధవ్ గారి మాట ప్రకారం వాడికి గుండెలో యింతక ముందే సమస్య వున్నట్లు తెలిసింది. మాస్టర్ రామనాధంగారి మాట ప్రకారం... పాండుయే మొదట ఆదిని కొట్టాడన్నది నిజం. ఏది ఏమైనా... వీరగోవిందు తన కొడుకును కోల్పోయాడు. పోయిన వాడిని మనం తెచ్చియివ్వలేము. యధార్థానికి నా మనుమడి తప్పులేకపోయినా... తప్పును ఎదిరించిన కారణంగా యీనాడు వాణ్ణి అందరూ అసహ్యించుకొంటున్నారు. వాడూ... ఎప్పుడూ ఏడుస్తూనే వున్నాడు. తన వల్ల పాండు చనిపోయాడని బాధపడుతున్నాడు.వీర గోవిందు పేదవాడు. వాడికి నేను రెండు ఎకరాల భూమిని యివ్వదలచాను. యివిగో పత్రాలు, మీరు ముగ్గురూ మాకు వీరగోవిందుకు శ్రేయోభిలాషులు. యీ పత్రాలను వాడికి యివ్వండి. కోర్టుకేసు... అని, త్రాగి నా యింటికి వచ్చి ఆ పుల్లారావు వాగాడు. నేను సహనంతో అన్నీ విన్నాను. మీరు... గోవిందును కలసి... వివరంగా మాట్లాడి యీ పత్రాలు వాడికి యివ్వండి. ఆ రెండు ఎకరాల విలువ యిరవై లక్షలు. నేను మీకు చెప్పదలచుకొన్నది చెప్పాను. యిక మీరు మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి.” సవినయంగా చెప్పాడు భీమారావు.
    భీమారావు ఔదార్యాన్ని... నిర్ణయాన్ని ఆ ముగ్గురు మెచ్చుకొన్నారు. "మేము మీకు చెప్పేటంతటి వారముకాము” చేతులు జోడించారు. సబయిన్స్పెక్టర్ ఆ పత్రాలను చేతికి తీసుకొన్నాడు. ఆ ముగ్గురూ వీరగోవిందుయింటికి వెళ్ళారు.వారి మాటలను విని వీరగోవిందు ఒప్పుకొన్నా... త్రాగు బోతు పుల్లారావు నోరు విప్పి వాగసాగాడు. యిన్స్పెక్టర్... 'యింక ఒక్కమాట మాట్లాడితే... న్యూసెన్సు కేసు క్రింద అరస్టు చేసి, కటకటాల వెనక్కు త్రోసి ఎముకలు విరిచేస్తాను. జాగ్రర్త.' హెచ్చరించాడు. వారి మాటలకు భయపడి పుల్లారావు... పారిపోయాడు. వీరగోవిందు భూమి పత్రాలను తీసికొన్నాడు.ముగ్గురూ భీమారావుగారి వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పారు. భీమారావు చేతులను జోడించి వారికి కృతజ్ఞతలను తెలియజేశాడు. వారు వెళ్ళిపోయారు.కుర్చీలో కూర్చొని... మనుమడిని గురించి... అతని భవిష్యత్తును... ఎలా తీర్చిదిద్దాలా అనే విషయాన్ని గురించి ఆలోచించసాగాడు భీమారావు. చివరకు... ఒక నిర్ణయానికి వచ్చాడు.
    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/MAb_fMomMTo


    23 min
  • కలసి ఉంటే కలదు సుఖము 1 | Kalasi Unte Kaladu Sukhamu | Telugu Web Series | K. Lakshmi Sailaja | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)


    కలసి ఉంటే కలదు సుఖము 1/3

    రచన, కథా పఠనం : కే. లక్ష్మీ శైలజ
    “హనుమావతీ, చింతకాయ తొక్కు పెట్టుకుందాము. రేపు మార్కెట్ కు పొయ్యొస్తారా? “సుభద్రమ్మ ఉసిరిక్కాయలు నూనె వేసి, పెద్ద ఇత్తడి గిన్నెలో మగ్గిస్తూ అంది. హనుమావతి మెంతిపొడి, ఆవపొడి, కారంపొడి, ఉప్పు, పసుపు తీసి పెడుతోంది, ఉసరిక పచ్చడి తయారు చేయడానికి. “అవును పిన్నమ్మా, వెళ్ళాలి. పిల్లలను బడికి పంపించి, నేను రాజ్యమ్మ పొయ్యొస్తాము. చింతకాయలు తీసుకుని వచ్చేటప్పుడు రిక్షా లో వస్తాములే. మగపిల్లలను పంపితే, మంచి కాయలు తేకుంటే మళ్ళీ మనకు బాధ. పచ్చిమిరపకాయలు కూడా తెస్తాము, ఒకటేసారి,” అనింది, హనుమావతి. ఉప్పును రోట్లో వేసి దంచుతూ. రాజ్యమ్మ సుభద్రమ్మ మూడవ కూతురు. పచ్చడికి తిరగమోత పెట్టడానికి, నూనె కూడా వేరేగిన్నెలో పోసి కాచి, అందులో ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి చిటపటా అన్నతరువాత పక్కన పెడుతూ పేలాలు వేయించుకోవాలి. వడ్లు తెమ్మని చెప్పాను. అంకాళయ్యవాళ్లు రేపు తీసుకొని వస్తున్నారు,” అన్నది సుభద్రమ్మ. సుభద్రమ్మ మరిది అంకాళయ్య, చిన్న సుభద్రమ్మలకు లకు పిల్లలు లేరు. అందుకని సుభద్రమ్మ, వెంకటసుబ్బయ్యల రెండో కూతురు ప్రమీలకు వాళ్ళు కన్యాదానం చేశారు. అప్పుడప్పుడూ ఇలా వీళ్ళింటికివచ్చి ఒక వారం ఉండి పోతారు. వాళ్ళ పొలం లో పండిన వడ్లు తెచ్చిస్తారు. “చెంచు వాళ్ళ పుల్లమ్మకు చెప్పి పెడతానులే పిన్నమ్మా, అటుకులు కూడా దంచి ఇస్తుంది,” అంటూ “మనం జాడీలన్నీ తుడిచి పెట్టుకోవాలి,” అంది హనుమావతి. “అవును. ఈ నెలంతా పనులు బాగా ఉంటాయి మనకు. పెద్దక్కయ్య సుబ్బమ్మ, చిన్నక్కయ్య ప్రమీల కూడా పిల్లలకు సంక్రాంతి సెలవులిస్తే వస్తారుకదా, ఒక పదిరోజుల తరువాత. అప్పుడు టమాటో పచ్చడి, పండుమిరప పచ్చడి కూడా పెట్టుకుందాం,” అంది సుభద్రమ్మ బాగా మగ్గిన ఉసిరిక్కాయలు పొయ్యి మీద నుంచి దించి పక్కన పెడుతూ. ఈ పచ్చళ్ళు ఆ కూతుళ్ళిద్దరికీ కూడా పెట్టి పంపాలి, వాళ్ళు వెళ్ళేటప్పుడు.
    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/e3hSVS-VPgM


    5 min
  • గరుడాస్త్రం - ఎపిసోడ్ 10 | Garudashram - Episode 10 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com


    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)


    గరుడాస్త్రం - ఎపిసోడ్ 10

    రచన : గన్నవరపు నరసింహ మూర్తి

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    "మిస్టర్ భరద్వాజ! ఈ మిసైల్ ప్రాజెక్ట్ కి ఇంఛార్జి మీరేనా?” అని అడిగాడు. “యస్.. నేనే ఇంఛార్జిని.. ” “మరి ఈ డ్రాయింగ్ ఆ పాకిస్థాన్ గూఢచారి ఇమ్రాన్ చేతికి ఎలా వెళ్ళింది. ? ”“మిస్టర్ పరీక్షిత్! ఈ ప్రాజెక్ట్ కి ఇంఛార్జీని నేనే అయినా ఆ డిజైన్ వింగ్ కి టీమ్ లీడర్ శ్రీహర్ష.. నిజం చెప్పాలంటే ఆ డిజైన్ కాని, డ్రాయింగ్ కానీ నా వరకు రాలేదు. మా టార్గెట్ ప్రకారం ఆ డిజైన్ ఈ నెలాఖరుకి ఎప్రూవ్ చేయబడి హెడ్ క్వార్టర్స్ కి పంపాలి. ఈ రోజు ఇంకా ఐదవ తారీఖు. పదవ తేదీకి నా దగ్గరికి వస్తే నేను స్క్రూటినీ , వెరిఫై చేసి డైరెక్టర్ గారికి ఎప్రూవల్ నిమత్తం పంపిస్తాము. కానీ ఇంతవరకు నా దగ్గర కది రాలేదు” అన్నాడు భరద్వాజ. “మిస్టర్ శ్రీహర్ష! మీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భరద్వాజ చెప్పినది నిజమేనా? ” పరీక్షిత్ కంఠంలోంచి బులెట్స్ లా వస్తున్నాయి ప్రశ్నలు.. ఒక్కసారి పోలీ స్టేషన్ మెట్లెక్కితే ఎంత పెద్ద అధికారి, వ్యక్తి అయినా అందరి లాగే సమాధానాలు చెప్పక తప్పదు. పోలీసుస్టేషన్ అనేసరికి ఎంత ధైర్యవంతుని కైనా తడబాటు కలుగుతుంది. సైకలాజికల్ గా డౌన్ అవుతాడు. శ్రీహర్ష కూడా అదే స్థితిలో ఉన్నాడు. “భరద్వాజ సర్ చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం. ఆ డ్రాయింగు గానీ, డిజైన్లు కానీ అతనికి పంపలేదు. అవి ఇంకా మా ఆధీనంలోనే ఉన్నాయి. అందుకు మేమే బాధ్యులం తప్ప అతను కాదు.. ఇందులో అతనికే సంబంధం లేదు” అని నిర్ద్వందంగా చెప్పాడు శ్రీహర్ష. ఆ తరువాత కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రక్షణ శాఖకి సంబంధించిన గరుడ మిసైల్ డ్రాయింగు పాకిస్థాన్ గూడాచారి దగ్గర దొరకిందనీ దానికి ఆ డిజైన్ చేస్తున్న బృందానికి నాయకత్వం వహిస్తున్న శ్రీహర్ష బాధ్యుడనీ, అతని అలసత్వం వల్లే ఆ డ్రాయింగు పాకిస్థాన్ తీవ్రదాదుల చేతుల్లోకి వెళ్ళిందన్న అభియోగంతో శ్రీహర్షని అరెస్ట్ చేసినట్టు సీఐడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వార్త దేశంలో పెను సంచలనం కలిగించింది. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్‌లు.. పేపర్లలో హెడ్ లైన్స్.. కొన్ని ఛానళ్ళైతే 'ఎవరీ శ్రీహర్ష' అంటూ శ్రీహర్ష మీద కథనాలు ప్రసారం చేసాయి. అతని బాధ్యతా రాహిత్యం వల్లే డ్రాయింగ్ తీవ్రవాదుల చేతికి చిక్కిందని ఆరోపిస్తూ కథనాలు వండి వార్చేయి .. ఈ వార్త తెలిసి ప్రణవి దిగ్ర్భాంతికి లోనైంది. ఎంతో దేశభక్తి, నిజాయితీ కలిగిన తన భర్త శ్రీహర్ష మీద ఆరోపణలు వచ్చి అరెస్ట్ కావడం ఆమె జీర్ణించుకోలేకపోయింది.. ఆమె ఆ విషయాన్ని నమ్మలేకపోతోంది. ఎందుకిలా జరిగింది? డ్యూటీలో సిన్సియారిటీకి, డిసిప్లిన్ కి మారు పేరైన శ్రీహర్ష మీద ఎందుకింత తీవ్ర ఆరోపణలు వచ్చాయో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. ఈ వార్త తెలిసి ఆమె తండ్రి కరుణాకరం, తల్లి సుశీల వచ్చారు. కూతుర్ని ఓదార్చారు.. వాళ్ళని చూడగానే ప్రణవికి దుఃఖం ముందుకు వచ్చింది. కొద్ది సేపటికి తేరుకొని “డాడీ! శ్రీహర్ష ఇటువంటి పనులు ఎప్పుడూ చెయ్యడు. ఎవరో నమ్మకద్రోహం చేసారు ;అసలు ఏం జరిగిందో నేను లాకప్పుకి వెళ్ళి కనుక్కొంటాను” అని చెప్పింది.
    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/x6su9wo9Pms


    14 min
  • గరుడాస్త్రం - ఎపిసోడ్ 9 | Garudashram - Episode 9 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    గరుడాస్త్రం - ఎపిసోడ్ 9

    రచన : గన్నవరపు నరసింహ మూర్తి

    (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

    ఇలా సాఫీగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో ఓ అనుకోని సంఘటన ఓ కుదుపు కుదిపింది. ఒకరోజు శ్రీహర్ష ఆఫీసులో వున్నప్పుడు డైరెక్టర్ గారు పిలుస్తునారు అంటూ అటెండర్ చెప్పాడు .ఎప్పుడూ తనని పిలవని డైరెక్టర్ ఈ రోజెందుకు పిలిచారో నని ఆలోచిస్తూ రెండవ అంతస్తులో ఉన్న అతని ఛాంబర్ కి వెళ్ళాడు. ఐదు నిముషాలు బయట వేచి ఉన్న తర్వాత అతన్ని లోపలికి రమ్మని పిలుపొచ్చింది.శ్రీహర్ష లోపలికి వెళ్లాడు. చాలా విశాలంగా, ఆధునాతనంగా ఉందా గది. ఎదురుగా విశాలమైన టేబుల్ ముందు డైరెక్టర్, అతని కెదురుగా ఒక పొడవైన వ్యక్తి కూర్చొన్నారు.శ్రీహర్షని చూడగానే డైరెక్టర్ వేదవ్యాస్ “కమిన్” అని చెప్పి ఎదురుగా కుర్చీలో కూర్చోమని చెప్పాడు.కొద్దిసేపు అక్కడ సూదిమొన పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం.“మిస్టర్ శ్రీహర్ష మీరు ఈ కేంద్రంలో చేరి ఎన్నాళ్ళైంది” అని అతనడిగాడు. “సార్! రెండు సంవత్సరాలైంది.” “ప్రస్తుతం మీ ఎసైన్మెంట్ ఏమిటి?” “సార్ మేము గరుడ మిసైల్ ని డిజైన్ చేస్తున్నాము”“ఓకే! అది పూర్తైందా?”“95%” అయింది.. ఇంకా డిజైన్స్ ఫైనలైజ్ కావాలి. ఆ పనిలోనే ఉన్నాము”“ఓకే..” అంటూ అతను ఒక డ్రాయింగుని శ్రీహర్షకి చూపించాడు.అది తాము డిజైన్ చేస్తున్న గరుడ మిసైల్ దే.. అది అతని చేతిలోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఎందుకంటే ఆ డ్రాయింగ్ లను తాము బయటకు పంపలేదు. ఎవ్వరికి తెలియదు కూడా.అందుకే దాన్ని చూడగానే శ్రీహర్షకు ఆశ్చర్యం కలిగింది.“ఈ డ్రాయింగ్ దేనికి సంబంధించినది” అని అడిగాడు.. మెల్లగా అతని స్వరంలో మార్పుని గమనించసాగాడు శ్రీహర్ష..“సార్! ఇది మేము డిజైన్ చేస్తున్న గరుడ మిసైల్ ది. కానీ అది ఎవ్వరికీ తెలియదు. ఇంకా అది ఫైనల్త్జ్ కాలేదు” అని చెప్పాడు హర్ష.“మరి ఇది బయటకు ఎలా వచ్చింది”?అతని స్వరం గంభీరంగా ఉంది. ప్రశ్నిస్తున్నాట్లు గా ఉంది.అతని ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు శ్రీ హర్షకు. “తెలియదు” అన్నాడు మెల్లగా.. ఆ మాట చెబుతున్నప్పుడు అతని గొంతు తడి ఆరిపోయింది. “మిస్టర్ హర్ష! ఈ డ్రాయింగ్స్ ఎవరి ఆధీనంలో ఉంటాయి?”
    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video linkhttps://youtu.be/3KCSK2wF3eA


    16 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world