Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • ఇచ్చిందే వస్తుంది | Icchinde Vasthundi | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    ఇచ్చిందే వస్తుంది

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    "నీ గడువు తీరిపోయింది. ఇక మాతో రావాలి. లేదా మరొకరి పేరు చెప్పాలి" చెప్పారు వాళ్లిద్దరూ.

    అరగంట క్రితం నా గదిలోకి వచ్చారు వాళ్ళు.

    చూస్తేనే భయం కలిగించేలా ఉన్నారు ఇద్దరూ.

    ఒకడి చేతిలో వేట కత్తి.

    మరొకడి చేతిలో పదునైన శూలం లాంటి ఆయుధం.

    అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను.

    రాత్రి పడుకోవడం ఆలస్యమైంది. అందుకే మంచి నిద్ర  పట్టేసింది.

    ఇంతలో వీళ్ళు బలంగా కుదుపుతూ లేపారు....

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/HNaT9phUC5c

    15 min
  • కొండచిలువ | Konda Chiluva | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com

    కొండచిలువ

    భాగవతుల భారతి

    ***********

    స్కానింగ్ యంత్రాలను దాటుకుని ఆడపిల్లగా పుట్టటమే సాహసం.

    అలాంటిది ఎన్నో రంగాలలో, ఆటంకాల ముళ్ళూ,అన్ని అడ్డంకులు దాటుకుంటూ, ఎదగటం,మాటలేనా!? అనుకుంటూ మనసులోనే ఆమెకు నమస్కారం చేసుకుంటూ ఉంటాను..

    ఆ సంఘటన మనసులో మెదిలినప్పుడల్లా...నా పిల్లలనూ అంత ధైర్యం ఉట్టిపడేలా పెంచాలని

    అనుకుంటూ ఉంటాను..

    ఆడది అబలకాదు సబల అని చెప్పటం కాదు, చేసి చూపిన ఆమె ఎవరు?

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/NTLPilEjBZk


    12 min
  • వనమాలి | Vanamali | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    వనమాలి

    రచన: అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము

    " రంగయ్యా, నీ కిదేమైనా బాగుందా? న్యాయంగా ఉందా?నలభై ఏళ్ళ నుంచి నీకు తోడుగా ఉన్న నన్ను అడ్డంగా నరుకుతుంటే చూస్తూ ఊరుకుంటావా?అసలు నన్ను

    చంపాలన్న ఆలోచన నీకెలా వచ్చిందయ్యా?".

    " లేదమ్మా, తల్లీ నన్ను అపార్థం చేసుకోక.వీల్లేని పరిస్థితుల్లోనే నిన్ను మట్టిపాలు చేయాల్సొచ్చింది."

    " మరి ఆ పని చేయిస్తున్నప్పుడు మన మధ్యన ఉన్న అనుబంధం మీకు గుర్తుకు రాలేదా?".

    " అమ్మా, నన్ను క్షమించు.నేను ముందు నరకయాతన పడ్డాను.నిజంగా నాకది ఇష్టం లేదు.కానీ చేయక తప్పలేదు."అన్నాడు రంగయ్య నీళ్ళు నిండిన కళ్ళతో.అతని

    గుండె బేజారయ్యింది.చివరకు కూడదీసుకుని " జరగరాని గోరం జరగిపోయింది తల్లీ .ఐతే నన్నిప్పుడేం చేయమంటావ్‌?" అన్నాడు.

    కల కరగింది.కళ్ళు తిరుగుతున్నాయి.రంగయ్య దిగ్గున లేచాడు.ఇంకా తెల్లారలేదు.

    మసక చీకటి గా ఉంది.ఎక్కడో కుక్కలు మొరుగుతున్నాయి.నాలుక దాహంతో పిడచ

    కట్టుకుపోయింది. లేచి కూజాలోని నీళ్ళు తాగి కూర్చున్నాడు.ఇంక ఎంతకీ నిద్ర పట్ట

    లేదు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/9oDtyOpXMVM

    12 min
  • జానకి విముక్తి | Janaki Vimukthi | Telugu Short Story | Penumaka Vasantha | manatelugukathalu.com

    జానకి విముక్తి

    పెనుమాక వసంత

    “ఒరే పెద్దోడా! హలో..” అని ఇటునుండి  నాగయ్య మాట్లాడుతున్నాడు.

    “ ఆ నాన్నా! ఏంటి ఈ టైం లో కాల్ చేసావు?” అన్నాడు నాగయ్య పెద్దకొడుకు వాసు.

    “మీ అమ్మ వచ్చిందా నీ దగ్గరికి?”

    “రాలేదు నాన్నా! ఏం.. ఇంట్లో లేదా?” ఆదుర్దాగా అడిగాడు వాసు.

    “లేదురా!  సాయంత్రం నుండి కనపడటం లేదు. గుడికి వెళ్ళి వస్తుందని చూసా. ఇంకా రాలేదు. సర్లే రాలేదుగా అక్కడికి. ఉంటాను”

    “అమ్మ ను ఏవన్నా విసుక్కొన్నావా నాన్నా?” అన్న వాసు మాటకి “అబ్బే! నేను ఏమి అనలేదు . అక్కడికి వస్తే నాకు ఫోన్ చేయి” అని పెట్టేసాడు.

    “యేంటండి అత్తగారు ఇంట్లో లేరటనా”  అంటూ  భార్య సుమతి అడిగిన మాటకు అవునంటూ తల వూపాడు వాసు.

    “ఆమెకు చిన్న కొడుకు ఇష్టంగా. అక్కడికి వెళ్లి ఉంటుంది” అన్న భార్య మాటకు తల ఊపి లోపల ‘అమ్మకు అందరూ సమానమే’ అని చెప్పే ధైర్యం లేక ఊరుకున్నాడు.

    నాగయ్య, చిన్న కొడుకు గిరికి  కాల్ చేసాడు. గిరి కూడా “రాలేదు నాన్న!” అన్నాడు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/a8OFQYi8O6Y

    9 min
  • వ్యాపకం | Vyapakam | Telugu Short Story | Madduri Bindu Madhavi | manatelugukathalu.com
    "వ్యాపకం"

    రచన: ఎం బిందుమాధవి

    కార్ పూలింగ్ లో భాగంగా మిత్రుడు వసంత్ పిల్లలని తీసుకెళ్ళటానికి, వారి ఇంటికి వచ్చాడు వేణుమాధవ్.

    కాలింగ్ బెల్ చప్పుడుకి బయటికొచ్చిన చలపతి గారిని చూసి, "హలో అంకుల్ ఎప్పుడొచ్చారు. ఆంటీ కూడా వచ్చారా? ఒంట్లో బాగుంటున్నదా" అన్నాడు వసంత్, మాసిన గడ్డం, పంచతో ఉన్న ఆయన్ని వింతగా, ఆశ్చర్యంగా చూస్తూ.

    "నాకు తెలిసిన అంకులేనా ఈయన? అసలు పోలికే లేదు" అనుకున్నాడు మనసులో!

    "ఆ:( బానే ఉన్నానోయ్! మీరంతా బాగున్నారా? మొన్న శనివారం వచ్చాను" అన్నారు చలపతి గారు.

    వసంత్, వేణుమాధవ్ హైదరాబాద్ లో ఒకే చోట ఉండేవారు. చిన్నప్పటి నించి ఒకే చోట ఉండటంతో స్నేహం కూడా గాఢంగానే ఉన్నది. ఒకరి కుటుంబ సభ్యులు....వారి అలవాట్లు, నమ్మకాలు, అభిరుచులు మరొకరికి బాగా దగ్గరగా తెలుసు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/dQ8mj_52tCw


    15 min
  • నల్ల కుక్క | Nalla Kukka | Telugu Short Story | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com

    "నల్ల కుక్క"'

    రచన: వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు

    రంగాచార్యులు గారు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న కార్పొరేట్ కంపెనీ కి,  'జనరల్ మేనేజర్ గా' వ్యవహరిస్తున్నారు.

    ఆ రోజు శుక్రవారం. ఎంతో నియమ నిష్టలతో, భక్తిశ్రద్ధలతో, దైవ పూజ జరిపి పలహారం చేసి, ఎంతో ప్రశాంతమైన మనసుతో ఇంటి బయట పెట్టి ఉన్న కారుని స్టార్ట్ చేశారు.

    ‘రెండు రోజుల్లో కంపెనీకి 'ఫారిన్ డెలిగేట్స్' తో 'బడ్జెట్ మీటింగ్ 'ఉంది. ఎన్నో విషయాలు స్టాఫ్ తో చర్చించి, తుది నిర్ణయాలు తీసుకోవాలి’ అన్న ఆలోచనలతో కార్ స్టార్ట్ చేశారు.

    అంతే! కారు కింద ఒక 'నల్ల కుక్క' అరుస్తూ అలాగే ఉంది. కానీ కదలడం లేదు. కోపంతో చిరాకుతో, ‘ఛి ఛి ఛి !’ అంటూ కసిరినా కదల్లేదు ఆ కుక్క. చిరాకుగా పక్కనే పడి ఉన్న రెండు రాళ్ళు తీసి దాని మీదికి విసిరేసరికి, అది భయం భయంగా కారు క్రింద నుంచి బయటకు వచ్చి, గట్టిగా అరుస్తూ ఆయన కాలు రక్కి పారిపోయింది.....

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/v_YWGPrv4no


    9 min
  • ఆనందాల హరివిల్లు | Ananadala Harivillu | Telugu Poem | A Annapurna | manatelugukathalu.com

    ఆనందాల హరివిల్లు

    రచన: ఏ.అన్నపూర్ణ.

    ఆమని అరుదెంచినవేళ వనమంతా మురిసింది…

    ఆమని అరుదెంచినవేళ వనమంతా మురిసింది…

    మోడువారిన చెట్లు పచ్చని చిగురులతో కళకళ లాడాయి....

    పుడమితల్లి పులకరించి పచ్చిక పాన్పు పరిచింది…

    పుడమితల్లి పులకరించి పచ్చిక పాన్పు పరిచింది…

    వనాలు సప్త వర్ణాల హరివిల్లు విరిశాయి…

    తరులన్నీ విరులతో సిగ్గుల పెళ్లికూతుళ్ళు అయ్యాయి…

    తరులన్నీ విరులతో సిగ్గుల పెళ్లికూతుళ్ళు అయ్యాయి…

    ఈ కవిత మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కవితను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/fZWE9L9xASg


    1 min
  • వీ లిసన్ యూ | We Listen To You | Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com

    వీ లిసన్ యూ…

    రచన: N. ధనలక్ష్మి

    “అదేంటి! సార్ నేను అన్ని రౌండ్స్ లో క్వాలిఫై అయ్యనుగా... మరెందుకు నాకు జాబ్ ఇవ్వడం కుదరదు అంటున్నారు…?”

    “సారీ .... మా కంపెనీ లో  పని చేయాలంటే అనుభవం ఉండాలి… పైగా నీకున్న అర్హతకి ఈ పోస్ట్ కరెక్ట్ కాదులే ఇంకో చోట  ప్రయత్నించు....”

    “బెటర్ లక్ నెక్స్ట్ టైం.....”

    “రేయ్! ఇంకా ఎన్ని రోజులు మాపై పడి తింటావు రా... నీ వయసు పిల్లలు రెండు చేతులారా సంపాదిస్తూ తల్లితండ్రిని చక్కగ చూసుకుంటూ పెళ్ళి చేసుకొని పిల్ల పాపలతో పచ్చగా ఉంటే నువ్వేమో ఇంకా ₹10 కూడా మా వద్ద చేయి చాపుతున్నావు..సిగ్గుగా లేదు రా? దానం కొద్దీ బిడ్డలు అంటారు.ఏ జన్మలో ఏ పాపం చేశానో నీ లాంటి బిడ్డ పుట్టాడు..”

    “నీ కోసం నేను ఆగినా మా వాళ్ళు ఆగేలా లేరు.. వారిని కాదునుకొని నీతో రాలేను… అయినా వచ్చినా ఏమి పెట్టీ పోషిస్తావు? నిన్ను నువ్వే చూసుకోవడమే భారంగా ఉంటే... ఇంకా నన్ను ఏమి చూసుకుంటావని? సో.. ఈ క్షణం నుంచి నీతో ఉన్న అన్ని బంధాలను తెంచుకుంటున్నా. లెట్స్ బ్రేక్ అప్ అండ్ మూవ్ ఆన్..”....

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/nBsvhUQC4ZI



    21 min
  • గిల్లికజ్జాలు | Gilli kajjalu | Telugu Short Story | Dasu Radhika |manatelugukathalu.com

    గిల్లికజ్జాలు

    రచన: దాసు రాధిక

    "ఆరడుగుల అమితాబ్ బచ్చన్ లాంటి వాడ్ని చేసుకుందామనుకుంటే ఈ జన్మ కి దేవుడు అయిదడుగుల నాలుగు అంగుళాల బుల్లెట్ నిచ్చాడు...పొట్టివాడు గట్టివాడని సామెత అక్షరాల నిజం...అదే మీ నాన్న" అని కొడుకు తో ఇన్నాళ్టికి చెప్పుకునే అవకాశం దొరికినందుకు జానకి ఏ మాత్రం మొహమాటం లేకుండా తన భర్త సుబ్బు కి రకరకాల బిరుదులిస్తోంది...

    "నేనడిగిందేంటి, నువ్వు చెప్తోందెంటమ్మ??" అని యశ్వంత్ ప్రశ్నిచ్చాడు... "నీకు నాన్నే అని ఎలా తెలిసింది పెళ్లి చేసుకునేటప్పుడు?

    నాన్న, కాస్త టీవీ మ్యూట్ పెట్టి నేనడిగినదానికి నువ్వైనా చెప్పు, నీకు అమ్మే అని ఎలా తెలిసింది?"

    అందుకు సమాధానంగా జానకి

    "ఆయనేమ్ చెప్తారో నాకు తెలుసులే...నువ్వనుకుంటున్నట్లు మా కాలం లో పది సార్లు కలిసి తిరగటాలు అవి లేవు రా.. అక్కడికక్కడే మ్యాగీ టూ మినిట్ నూడిల్స్ లాగా, వన్ వర్డ్ ఆన్సర్ లాగా యెస్ ఆర్ నో చెప్పేయ్యాలి...జీవితాంతం కలిసి ఉండేందుకు నిర్ణయం తీసుకునేందుకు  ఇచ్చే సమయం రెండే నిమిషాలు..."....

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/ZJVjeJw55f8


    18 min
  • వధువులు కొరత | Vadhuvulu Koratha | Telugu Short Story | BVD Prasada Rao | manatelugukathalu.com

    వధువులు కొరత

    - బివిడి ప్రసాదరావు

    భర్త ఆఫీస్ కి వెళ్లేక.. పనులు చక్క బెట్టేక.. తీరికయ్యింది సావిత్రి.

    వెళ్లి.. సిట్ అవుట్ ఏరియాలో.. సోఫా కుర్చీలో కూర్చుంది.

    గుండెల నిండా గాలి పీల్చుకుంది.

    డైలీ చూస్తుంది.

    కొన్ని నిముషాల తర్వాత.. సెల్ ఫోన్ ధ్వని వినిపిస్తుంది.

    ఒంగి.. టీపాయ్ మీది ఆ ఫోన్ ని తీసుకుంది సావిత్రి.

    ఫోన్ స్క్రీన్ మీది నెంబరు చూసింది. కానీ ఎవరో.. ఎవరిదో.. తనకి తెలియని నెంబరు.

    "హలో" అంది సావిత్రి.

    "హలో" అంది ఫోన్ చేసిన మరకతం....

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/5RdlIOXTkzE


    8 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world