గల్ఫ్ దేశాలలోని ప్రముఖ తెలుగు సమాఖ్యలలో ఒకటి ఆంధ్ర కళావేదిక. దాదాపు దశాబ్ద కాలంగా, ఖతార్ దేశంలో ఉంటున్న తెలుగువారిని ఒక్క తాటి మీదకు తెచ్చేందుకు, మన సంస్కృతీ, సంప్రదాయాలను విదేశంలో పరిరక్షించుకునేందుకు, భావి తరాలకు భాషను పరిచయం చేసేందుకు… అన్నింటికీ మించి, అక్కడి తెలుగువారు ఏ కష్టంలో ఉన్నా సరే ఆదుకునేందుకు ఎంతో కృషి చేస్తోందీ సంస్థ. ఈ సంస్థ అధ్యక్షులు వెంకప్ప భాగవతుల గారితో మాట్లాడి, అక్కడ పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది టాల్ రేడియో. ఆ సంస్థ చేస్తున్న కృషి వింటే మీరూ ఎంతో ఆశ్చర్యపోతారు!
Andhra Kala Vedika is one of the prominent Telugu Cultural Associations working in Gulf region. It has been striving hard to unite Telugu people, preserve our traditions, introduce language to future generations… and most importantly, help Telugu people in need. Here is an interesting conversation with its present President Mr. Venkappa Bhagavatula whose insights would surprise you.