
Sign up to save your podcasts
Or


ప్రాచ్య భారత దేశానికి మహా ఇతిహాస జాతీయ కావ్యాలైన రామాయణ, భారత, భాగవతాలు ఎట్లో, ప్రాచీన పాశ్చాత్య సంస్కృతికి మూల స్తంభమైన గ్రీకు నాగరికతకు వారి చరిత్రలు అయిన ఇలియడ్ మరియు ఒడిస్సీలు అలానే అని చెప్పవచ్చు.
మనకు వాల్మీకి, వ్యాసుడు ఎట్లనో వారికి హోమర్ అట్ల. అంతే కాదు ఆయా ఇతిహాస కావ్యాలలో కూడా దేశ, కాలములు వేరు అయినప్పటికీ కొన్ని పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.
రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ వచ్చిన తర్వాత మధ్యధరా సముద్ర ప్రాంతములో హోమర్ మహాకవి కృతమైన కావ్యాల సంఘటనలు జరిగినట్లు గా ఋజువులు లభించాయి.
అట్లనే మన దేశము లో కూడా రామాయణ, భారత ఘటనల గూర్చి లెజెండ్స్ (తర తరాల నుండి నమ్మబడు గాధలు) వుండనే వున్నాయి.
ఆయా గాధలను తులనాత్మక పరిశీలన చేసినప్పుడు, ఒక రాజు భార్యను మరొకరు అపహరించుకు పోవుట, భార్యను పోగొట్టుకున్న రాజు అటు పిమ్మట తన హిత, సన్నిహిత స్నేహితుల సహాయముతో ఆ అపహరించిన రాజుతో యుద్ధము చేసి, ఓడించి, సంహరించి, తన భార్యను తెచ్చుకొనుట అనేది ఇతివృత్తముగా వున్నాయి.
శ్రీమద్రామాయణంలో శ్రీరామచంద్రుని భార్యను రావణాసురుడు మోసముతో అపహరించి తీసుకొని పోతాడు. రాముడు వానర రాజు అయిన సుగ్రీవునితో స్నేహమొనరించి, అతని సైన్యము సహాయముతో లంకపై దాడి వెడలి, రావణుడిని జయించి, వధించి తన భార్యను వెనుకకు తెచ్చుకుంటాడు.
అదే మాదిరిగా హోమర్ చే గానం చేయబడిన గ్రీకు కావ్యమైన ఇలియడ్ నందు, మెనలాస్ అనే రాజు భార్య అయిన హెలెన్ ను పారిస్ అనే రాకుమారుడు అపహరించుకు పోతాడు. కాకపోతే ఇక్కడ తేడా ఏమిటంటే అపహరించుకు పోవుట అన్నది హెలెన్ యిష్ట ప్రకారము జరిగినది. మెనలాస్ తన హిత మరియు సన్నిహిత రాజుల తోడ్పాటుతో ఆ ట్రాయ్ రాకుమారుడి పైన యుద్ధానికి వెళతాడు, జయిస్తాడు, వధిస్తాడు, ఆపై తన భార్య హెలెన్ ను తెచ్చుకుంటాడు.
గమనించ దగ్గ విషయం ఏమిటంటే శ్రీమద్రామాయణం లోని యుద్ధ కాండము, మహా భారతములోని యుద్ధ పంచములతో పోల్చి చూసినప్పుడు ఇలియడ్ లోని ట్రోజన్ యుద్ధం ఏమాత్రం తక్కువ కాదు.
శ్రీమద్రామాయణం, భారతములను ఇలియడ్ తో పోల్చినప్పుడు, కొన్ని గమనార్హమైన విషయములు మనకు తెలియవచ్చు:
1 . వాల్మీకం లవకుశులచే గానం చేయబడినది. హోమర్ కావ్యాలు అయినా ఇలియడ్ మరియు "ది ఒడిస్సీ" అంధుడైన అతని చేతనే గానం చేయబడ్డాయి
2 . మహా భారతం లో ధృతరాష్ట్రునికి నూరుగురు పుత్రులు, అలాగే ట్రాయ్ రాజు అయిన ప్రియమ్ కు నూరుగురు పుత్రులు
౩. గాంధారి తన సుతుడైన సుయోధనుని ఆశీర్వదించ తలచి తన వద్దకు రమ్మనగా, శ్రీకృష్ణుని మాయోపాయము మరియు సుయోధనుని గ్రహపాటు వలన ఊరువులు బలహీనము అయినాయి మరియు మరణ కారకము అయినాయి. అలాగే గ్రీకు వీరుడు అయిన అకిలెస్ తల్లి తన కుమారుని మృత్యువు నుండి సంరక్షించుకోవాలనే ప్రయత్నంలో అతని ఎడమ కాలి మడమ మాత్రం తడపనందున అతని ప్రాణములు అక్కడే నిక్షిప్తమయ్యి ఉంటాయి. పారిస్ వేసిన ఈటె అచటనే గ్రుచ్చుకొని అకిలెస్ మరణానికి కారణమవుతుంది. పోలిక సుయోధనుడు గ్రహపాటుతో అయినా, ఈ అకిలెస్ మన మహా భారతం లో కర్ణుడి అంతటి వాడు.
ఇక “ది ఒడిస్సీ” కావ్యానికి వస్తే ట్రోజన్ యుద్ధము అయ్యాక మెనలాస్, అతని స్నేహితులైన ఒడిస్సియస్ (ఉలిస్సెస్) మొదలగు వారు విజయోత్సాహముతో వారి వారి దేశాలకు గృహోన్ముఖులవుతారు. హోమేరియం అయిన "ది ఒడిస్సీ" అనబడు ఉలిస్సెస్ చరిత్ర ప్రపంచ ట్రావెలాగ్ లలో ఒక స్థానం సంపాదించు కోవటమే కాక ఎన్నటికీ ఎంతో మందిని ఉత్సాహపరుస్తూ స్ఫూర్తివంతం చేస్తూ వుంది.
క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఒడిస్సియస్ ట్రోజన్ యుద్ధానంతరం గృహోన్ముఖుడై తన ఇంటికి చేరుటకు పడ్డ కష్ట నష్ట వ్యయ ప్రయాసలే, ఈ “ది ఒడిస్సీ" అనబడే గొప్ప గ్రీకు ట్రావెలాగ్.
ట్రోజన్ యుద్ధానికి వెళ్లిన భర్త ఉలిస్సెస్ ఏళ్ళు గడిచిన రానందున ఆయన భార్య మిగుల అందగత్తె అయిన పెనెలోప్ ఇరుగు పొరుగు రాజుల ఒత్తిడి వలన విసుగు చెంది తన ఎదిగిన కొడుకు అయిన తెలిమాకస్ ను భర్తను వెతుకుటకై పంపుతుంది. తన ద్వితీయ స్వయంవరాన్ని ప్రకటింప చేస్తుంది.
ఇది మన భారతంలోని
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
అందరికి నమస్కారము. ఈ వేదిక ద్వారా నేను, తెలుగులో ట్రావెలాగ్ సాహిత్యం అనే శీర్షిక పేరుతో మూడు వ్యాసాలు మీకు అందించ దలచుకున్నాను.
ట్రావెలాగ్ అంటే యాత్రావివరణము అని మనము తెనిగీకరించ వచ్చునేమో!. ఓ రచయిత ట్రావెలాగ్ ద్వారా తాను ప్రయాణించిన కొత్త ప్రదేశములు, ఆ ప్రదేశాలలో కొంత కాలము గడపటం వలన ప్రోదిచేసుకున్న అనుభవాలను పాఠకులకు తామే ఆ ప్రదేశాలలో సంచరించినంత అనుభూతిని అందిస్తాడు.
ఓ ట్రావెలాగ్ రాసేటప్పుడు రచయిత మిగిలిన విషయాలతో పాటు, అప్పటి దేశ కాలమాన పరిస్థితులు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కలిసిన వ్యక్తులు, వీటి ద్వారా ఆయన కొత్తగా నేర్చుకున్న విషయాలు కూడా పొందుపరచ గలిగితే అది పాఠకుడికి ఓ గొప్ప అనుభూతిని మిగుల్చుతుంది అనటం లో ఏమాత్రం సందేహం లేదు.
ప్రపంచ సాహిత్యంలో మొదట యీ ట్రావెలాగ్ చేపట్టినది ఎవరు అన్న ప్రశ్న ఉదయిస్తే, నాకు మాత్రం ఆదికవి వాల్మీకి అనే స్ఫురిస్తుంది. ఆయన రచించిన మద్రామాయణం ఆది కావ్యం అంటారు మన పెద్దలు, కానీ నేను మాత్రం అది మన మొదటి ట్రావెలాగ్ కూడా అని అంటాను
రామాయణం అంటే రాముడు నడిచిన ఒక దారి అని అర్థం. నేనయితే రాముడు చేసిన ప్రయాణాన్ని రామాయణం అంటాను.
మనం జాగ్రత్తగా గమనిస్తే బాలకాండలో రాముడు తన తండ్రి ఇవ్వలేక ఇవ్వలేక ఇచ్చిన అనుమతితో విశ్వామిత్రుని వెంట ఆయన ఆశ్రమానికి వెళ్ళటం, అటు పిమ్మట మిథిలకు ప్రయాణించటం, సీతను వివాహమాడి తిరిగి అయోధ్యలో ప్రవేశించటం, మరలా పితృ వాక్య పరిపాలకుడై దండకారణ్యానికి వెళ్లి అక్కడ జీవనం గడపటం, పిమ్మట సీతాపహరణంతో వానరసేన సహాయం తీసుకొని నిర్మించిన వారధిని దాటి లంకకు పయనమవటం, అక్కడ రావణుడిని సంహరించి సీతాదేవి సమేతంగా అయోధ్యలో పునఃప్రవేశం చేయటంతో రామాయణం ముగుస్తుంది. ఇదంతా రాముడి ట్రావెలాగ్ అంటాను నేను.
రామాయణం లో అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్న సుందర కాండ కూడా హనుమంతుని సముద్రోల్లంఘనం, లంకలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు, రాముని క్షేమ సమాచారాలు చెప్పి సీతమ్మకి ఆయన చెప్పిన సాంత్వన వచనాలు మరియు రాముని చెంతకు ఆయన తిరుగు ప్రయాణం అంతయు హనుమంతుని ట్రావెలాగ్ అని అనుకోకుండా ఉండగలమా.
ఆ మాటకొస్తే ప్రతీ బయోగ్రఫీ ఒక మనిషి యీ భూమి మీద తాను చేసిన ప్రయాణం తాలూకు ట్రావెలాగ్ అని చెప్పవచ్చు.
మన తెలుగు సాహిత్యం లో ట్రావెలాగ్ అనే అంశం మీద మనం అవలోకనం చేసుకుంటే పంతొమ్మిదవ శతాబ్దం లో శ్రీ ఏనుగుల వీరాస్వామి గారు గ్రంధస్థం చేసిన కాశీయాత్ర చరిత్ర మన మొదట ట్రావెలాగ్ గా చెప్పబడుతుంది. రెండువందల ఏళ్ల క్రితం, కనీస ప్రయాణ సౌకర్యాలు లేని ఆ రోజులలో మద్రాసు నుండి కాశీ దాకా వెళ్లి వచ్చిన ఆయన యాత్రానుభవమే యీ కాశీయాత్ర చరిత్ర. ఈ రోజుకు కూడా తెలుగు ట్రావెలాగ్ సాహిత్యంలో కాశీయాత్ర చరిత్ర ఒక నిర్వచనీయము మరియు ప్రామాణికం.
ఇప్పటి ఆధునిక సాహిత్య కాలానికి వస్తే ఆంధ్ర విశ్వవిద్యాలయపు విశ్రాంత ప్రొఫెసర్ అయిన శ్రీ ఆదినారాయణ గారు రచించిన తెలుగు వారి ప్రయాణాలు నాకు చాలా ఇష్టమైన పుస్తకాలలో ఒకటి. ఆ పుస్తకం గురించి మరిన్ని ఆసక్తికర మాటలు వచ్చే భాగం లో పొందుపరుస్తాను.
-- మీ సుందరబాబు
హర్షణీయం వయస్సు రెండు మాసాలు. ఈ రెండు మాసాల్లోనే నేను, నా మిత్ర బృందం దాదాపు 1800 మంది అతిథులను, వారిచే 9000 దర్శనాలను మరియు పునర్దర్శనాలను సంపాదించుకున్నాము. మొదట మా గిరిగాడి సలహాకు నవ్వుకున్నాము, మా కథలను ఆడియో రూపంలో కూడా పెట్టమన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆశ్చర్యం గా మా కథలు ఆడియో రూపంలో రమారమి 5000 మార్లు దిగుమతి అయ్యాయి.
ఎంతో మంది స్నేహితులు, బంధువులు, సన్నిహితులు వారి సందేశాల ద్వారా ప్రోత్సహిస్తూ మా ఉత్సాహాన్ని ద్విగుణీకృతం కావిస్తున్నారు. మీ ప్రోత్సాహం ద్వారా మా ఉత్సాహాన్ని పెంపొందిస్తున్న మీ అందరికీ మా కృతజ్ఞతలు.
నాకు మరియు నా మిత్రులకు చిన్నప్పటినుండి తెలుగు భాష అంటే వల్లమాలిన ప్రేమ. నేను ఇదివరకే మీకు చెప్పినట్టు నా బాల్యం నుండి ఇప్పటివరకు నాతో ప్రయాణం చేసిన వ్యక్తులను గురించి, నా అనుభవాల గురుంచి అందరితో పంచుకుందామనే ఉద్దేశ్యం తో నేను తెలుగులో రాయటం మరియు నా మిత్రులు వాటిని చదివి ప్రోత్సహించి, వాటిని ఈ బ్లాగు రూపంలో ఆవిష్కరించమని ఆదేశించటం, నేను పాటించటం జరిగిపోయింది.
ఎప్పటిలాగే మా అనీల్గాడు నా బుర్రలో ఇంకో ఆలోచనకు బీజం వేసాడు. మనం ఈ బ్లాగ్ ద్వారా మనకు తెలిసిన మనలాగే తెలుగు అంటే వల్లమాలిన అభిమానం మరియు భాష మీద మనకు లేని పట్టు వున్న సాహితీ మిత్రులని వారి అనుభవాల ద్వారా లేక కథనాల ద్వారా ఎందుకు పరిచయం చేయ కూడదు అని. ఈ ఆలోచన సమంజసముగా ఉండటం తో మేము మా వాడికి గురుతుల్యులైన శ్రీ సుందర బాబు మాష్టారు గారిని సంప్రదించటం, ఆయనకూడా హర్షణీయానికి మొదట గెస్ట్ బ్లాగ్ రాయడానికి సుముఖతని వ్యక్తం చేయటం వెను వెంటనే జరిగిపోయాయి.
ఆయన పరిచయానికి వస్తే, నెల్లూరి వాస్తవ్యులైన శ్రీ సుందర బాబు గారు తన చిన్నతనం నుండి విపరీతమైన సాహితీ అభిలాష వున్న వ్యక్తి. పుస్తక పఠనం అనేది ఆయనకీ వ్యాపకం కాదు వ్యసనం. ఆయన మన వెంకటేశ్వర విశ్వ విద్యాలయము నుండి తెలుగు, చరిత్ర మరియు ఆంగ్ల శాఖలలో విడి విడి గా మాస్టర్ అఫ్ ఆర్ట్స్ ఆపైన మాస్టర్ అఫ్ ఎడ్యుకేషన్ లో పట్టా పుచ్చుకున్నారు. నలభై ఏళ్లకు పైగా ఉపాధ్యాయుడిగా మరియు ప్రధానోపాధ్యాయుడుగా సేవలు అందించిన ఆయన 1999 వ సంవత్సరములో పదవి విరమణ చేసి తన విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. ఆయనచే విద్యను భిక్షగా పొందిన వారు ఎందరో ఈనాడు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో ఉన్నత పదవులను అలంకరించి వున్నారు.
ఆయన వ్యక్తిగత గ్రంధాలయం లోనే తెలుగు మరియు ఆంగ్ల భాషలలో దాదాపుగా ఓ మూడు వేల పుస్తకాలు ఉంటాయి అని మా అనీల్గాడు నొక్కి వక్కాణించి చెబుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన చదువు చెప్పటం, చదువుకోవటం మరియు చదవటం లాటి వ్యసనాలను ఒక చక్ర భ్రమణం లాగ సాగిస్తూ తన జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్నారు.
ఈ గెస్ట్ బ్లాగ్ ద్వారా ఆయన మనకి తెలుగు సాహిత్యంలో ట్రావెలోగ్స్ అనే అంశం మీద మనకు మూడు వ్యాసాలు మూడు భాగాలుగా అందించబోతున్నారు. నేను ఈ భాగాలను భారతీయ కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి ఏడు గంటలకు ప్రచురించాలని అనుకుంటున్నాను.
చెన్నై లో నివసించే వాళ్ళము మేము 2009 వ సంవత్సరములో. పిల్లలిద్దరూ వెళ్ళాచ్చేరీ లోని నవదిశ మాంటిస్సోరి స్కూల్ లో ఏడూ మరియు ఐదవ తరగతుల్లో చేరారు. ఆరు నెలలు గడిచాకా మా చిన్నది వాళ్ళ తరగతిలో రెండు సమూహాలు ఉన్నాయనీ, ఆ రెండు సమూహాలకి ఎప్పుడూ పడదని, ఒకరు ఎడ్డెము అంటే ఇంకొకరు తెడ్డెమని చెప్పటం మొదలెట్టింది.
కొన్ని రోజుల తర్వాత యీ రెండు సమూహాల మధ్య తనే సమన్వయ కర్తనని, ఆ మరి కొన్ని రోజుల తర్వాత తాను లేక పోతే ఆ సమూహాలు కొట్టుకొనేస్తారు అని డప్పులు కొట్టుకోవటం మొదలెట్టింది. రోజు వినే వాడిని అడిగి తెలుసు కొనేవాడిని వాళ్ళ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తుందో అని, వీలైతే నాలుగు ఉచిత సలహాలు ఇస్తూ.
అప్పటికీ సుప్రియ నన్ను వారిస్తూనే ఉండేది , నీ వెధవ మానేజ్మెంట్ స్కిల్స్ తో దాన్ని చెడగొట్ట మాక అంటూ. ఐన మనం సుప్రియ మాట ఎప్పుడు వింటాం కనుక. అందులోను నేను నా కూతురి అంతర్జాతీయ విషయాలలో.
సరే ఒక సమయం లో మా చిన్నది జ్వరం వల్ల మూడు రోజులు బడికి వెళ్ల లేదు. దానికి, వాళ్ళ రెండు సమూహాలు ఏమయ్యాయో అన్న ఆందోళన, నాకేమో అది బడి నుండి మోసుకొచ్చే కబుర్లు లేక పొద్దుపోవటం లేదు. నాలుగో రోజు అది బడికెళ్తుంటే చెప్పా, “మీ రెండు సమూహాల మధ్య సమస్య తీరిపోయింది, ఆందోళన పడకు” అని. “సమస్యే లేదు, వాళ్ళే మన్నా నువ్వు, మీ స్నేహితుడు అనిల్ మామ అనుకున్నావా, తిట్టుకొని కొట్టుకొని తర్వాత రోజు ఒరే మామ అని పలకరిచ్చుకోవడానికి”, అంటూ వెళ్ళింది బడికి.
సాయంత్రం నేను ఆఫీస్ నుండి రాగానే చాలా గంభీరంగా పుస్తకాలు ముందేసుకుని భీకరంగా చదివేస్తుంది. ఏమ్మా! అంటే, ”నాకు ఎఫ్.ఏ పరీక్షలు నేను చదుకుంటుంటే కనపడటంలా”, అంటూ కయ్ అంది. నేనొదలనుగా, ఏరా! ఏమయ్యారు మీ రెండు సమూహాలు అనడిగా. అది నీరసంగా, “నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్పావ్ నాన్న వాళ్ళు కలిసిపోతారని, వాళ్ళు కలవటం, నన్నసలే పట్టించుకు పోవటం” అన్నీ జరిగి పోయాయని గుడ్లనిండా నీరు కుక్కుకుంటూ చెప్పింది.
దాన్నెందుకు లే ఇంకా గిల్లటం అని నేను బాగా చదుకో అమ్మ అంటూ ఫ్రెష్ అవుదామని వెళ్ళిపోయా అక్కడ నుండి. దానికి సందేహం వదలా, మా నాన్నకి ఇంత ఖచ్చితంగా ఎలా తెలిసింది అనీ. రాతిరికి బెడ్ టైం స్టోరీస్ అంటూ వచ్చింది, చిన్నగా మళ్ళి అడిగింది, “ఎలా కనుక్కున్నావు నాన్న” అని .
"సిన్నీ! ఇన్ని రోజులు వాళ్ళ ని కలవ కుండా ఆపింది నువ్వే నని , నువ్వు మూడు రోజులు బడికి వెళ్ళక పోతే వాళ్ళు కలిసిపోతారని", నాకు తెలుసు అని చెప్పా!. అంత ఖచ్చితంగా ఎలా ఊహించావ్ నాన్న అంది ఆశ్చర్యపోతూ.
ఎలా అంటే నువ్వు నా కూతురువి సిన్నీ!, నా నోట్లోంచి ఊడి పడ్డావ్ రా!. నీ నీవన్నీ నా బుద్ధులే నా పనులే అనగానే అది కూడా నన్ను హగ్ చేసుకొని ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేయదుగా అంది. నీకెలా తెలుసురా యీ సామెత అంటే సాయంత్రమే నాన్నమ్మ నిన్నూ నన్నూ కలిపి తిట్టింది నాన్నా! అన్నది. తిట్టనీయరా! ఎవరు తిట్టినా మనం చేలోనే మేసేద్దాం అని నిశ్చయించి హాయిగా గుర్రు కొట్టాం.
నా పెద్ద కూతురు అమృత, చిన్ననాటి నుండి తనలోని ఆలోచనలు చాలా స్పష్టంగ వ్యక్త పరిచేది. మా స్నేహితుడు గిరిగాడి భాషలో చెప్పాలంటే భావవ్యక్తీకరణ మరియు భావప్రకటన. తన మూడవ ఏటనే మేము తనని డెన్వర్ కి కొనిపోయాము.
దానికి అప్పుడు చేపలు అంటే చాల ఇష్టం, పెంచటం కాదు సుమా. ఒక రోజు మేము తనని తీసుకొని చైనీస్ మార్కెట్ కి వెళ్ళాము. అక్కడ మంచి మంచి తిలాపియా చేపల బ్రతికున్నవే దొరుకుతాయి. వాటిల్ని పెద్ద పెద్ద గాజు తొట్టెల్లో వేసి ఉంచి, మనం ఎన్నుకున్నవాటిని తీసి ముక్కలుగా కొట్టి ఇస్తారు. అమృత ఆ చేపల్ని తొట్టెల్లో ఈదుతూ ఉండగా దగ్గర నుండి బాగా చూసింది ఆ రోజు. నాన్నా అవి చూడు మూతి ఎలా తెరిచి ఎలా మూస్తున్నాయో అంటూ తన చేతులను వాటి మూతిలా పెట్టి, తెరుస్తూ మూస్తూ చూపిస్తూ వాటితో బాగా ఆడింది.
ఆ రోజు రాత్రి మేము మాంచి నిద్రలో ఉండగా పెద్దగా ఏడుస్తూ లేచింది. ఎంతకూ ఏడుపు మానలేదు. కాస్త కుదుట పడ్డాక, ఏమ్మా! అంటే, ఒక పెద్ద చేప వచ్చింది, నన్ను నువ్వు తిన్నావు కదా ఇప్పుడు నేను నిన్ను తినేస్తా అంటుంది, అంటూ మళ్ళీ ఏడుపు. నేను తెగ సంతోషపడ్డా ! కల ఎంత బాగా చెప్పింది అని మరియు ఈ దెబ్బ కన్నా తన చేపల పిచ్చి వొదులుతుందని. కానీ నా ఆనందం ఎక్కువ కాలం నిలవలా. దొంగది కల కలే, తినటం తినటమే అని తేల్చింది.
అలాగే నిద్ర పోయే సమయంలో తనకి ఆవూ-పులి కథ చెప్పాల్సిందే. మళ్ళీ ఒకరోజు ఏడుస్తూ నిద్ర లేచింది, కాస్త సముదాయించి, ఏమ్మా అననడిగితే , నాన్నా! బుజ్జి దూడకి బాయి ఇచ్చి పులి దగ్గర కు వెళ్ళింది ఆవు. అప్పుడు, అప్పుడు, అంటూ ఏడుపు మళ్ళీ. బెక్కుతూ! చెప్పింది పులి ఆవుని తినేసిందని. నాకు మళ్ళీ తెగ ఆనంద మేసింది ఆహా నా కూతురు చాలా ప్రాక్టికల్ అమ్మాయని.
అలా పెద్ద దాన్ని పెంచుతూ, చిన్నదాన్ని కూడా నాలుగేళ్ల దాన్ని చేసేసరికి, మేము ఇండియా వచ్చెయ్యల్సి వచ్చింది. మా చిన్న దాని భావప్రకటన ఇంకో మెట్టు పైనే. వచ్చిన కొత్తల్లో తానూ, తనకన్నా ఎనిమి నెలల చిన్నదైన మా అన్న కూతురు, ఇంటి బయట ఆడుకుంటూ వున్నారు. అక్కడే మేస్తున్న ఒక కోడిపిల్లని, మా అన్న కూతురికి చూపిస్తూ దీన్నే చికెన్ అంటారు, దాని లెగ్ పీస్ ఉంటుంది చూడు, యమ్మీ యమ్మీ గా అంటూ చెప్పటం మొదలెట్టింది.
అది విని, ఆ భావ ప్రకటనకు ఈ సారి నాకు భయం వేసింది . దీన్ని వొదిలేస్తే ఇప్పుడే ఆ కోడి బతికుండగానే, దీనికి ఎక్కడ ఆహార మైపోతుందో అని. చాలా గట్టిగా నిశ్చయించుకున్నా, అసలుకే నా పిల్ల పీచులు ఆడ నలుసులు, వీళ్ళని కాస్త ఈ మాంసాహార హింసకు దూరంగా పెంచాలని.
ఒక పధకం ప్రకారం, ఇంట్లోకి తెచ్చిన కూరగాయల్ని తాకమనే వాడిని, వాళ్ళు హాయిగా తాకే వారు వంకాయలు, బెండకాయలు, సొరకాయ, బీరకాయలు అంటూ పేరు పేరునా. చికెన్ లేక మటన్ తెచ్చినప్పుడు తాకమనే వాడిని, ఛీ యాక్! అంటూ పారి పోయే వారు. సాయంత్రం నేను ఇంటికొచ్చే సరికి షరా మామూలే, యమ్మీ యమ్మీ !అంటూ, చికెన్ తింటూ. ఏరా! అంటే, మేము కట్ చేయ లేదుగా, మేము తాక లేదుగా, మమ్మీ ఏ కదా నోట్లో పెట్టింది అంటూ.
అలా నా ప్రయత్నాలకు సుప్రియానే దగ్గరుండి గండి కొట్టిచ్చింది. ఆ తర్వాత నేను సీటెల్ కి వెళ్లాల్సొచ్చింది ఆరునెలలకు ఒక్కడినే. రోజు ఫోన్ చేసే వాడిని ఇంటికి . ఒక రోజు చిన్నది నాన్నా! నాన్నా! ఇంతకు ముందు నిన్ను అనుకుంటే, నీ మొహం నా కళ్ళ ముందుకొచ్చేది, కానీ ఇప్పుడు రావటం లేదు నాన్నా, అని మళ్ళీ తన భావ ప్రకటనతో భయ పెట్టింది.
ఇక లాభం లేదని వెంటనే వాళ్ళని సీటెల్ కి రప్పించుకున్నా. అంతకు ముందు, ఎప్పుడన్నా అమ్మంటే ఆమూకి ఎందుకిష్టం అంటే, ఆమూకి బువ్వ పెడుతుంది కాబట్టి అని చెప్పేది, నాన్నంటే ఎందుకిష్టం అంటే, ఆఫీసుకెళ్లి ఆమూకి డబ్బులు తెస్తాడు కాబట్టి అని చెప్పేది. ఈ సారి మాత్రం అమెరికా కి తీసుకొచ్చాడు అని ప్రకటించటం మెదలెట్టింది నా కూతురు.
వాళ్ళచే మాంసాహారం మానిపించాలని ఇప్పటికీ పట్టు వొదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే వున్నా. ఇప్పుడైతే భావ ప్రకటనే కాదు యుద్ధ ప్రకటనే నా మీద అమ్మా కూతుర్లు. నువ్వు బాగా నలభై ఏళ్ళు దేశంలో వున్న అడ్డమైన వన్నీ తిని మమ్మల్ని మానమంటావ్, మాక్కూడా నీలా తిని తిని విసుగొస్తే మానేస్తామని. నా భావప్రకటన వీళ్ళ ముందర బాధాప్రకటనే.
మేము డెన్వర్ లో వున్నరోజులు అవి. ఒకరోజు నేను ఆఫీసులో ఉండగా అమృత వాళ్ళ ఉపాధ్యాయురాలి నుండి ఫోన్ వచ్చింది, వచ్చి వెంటనే కలవమని. ఆవిడని అడిగాను నేను మరుసటి రోజు వచ్చి కలవవచ్చా అని, దానికావిడ ఈరోజే వచ్చి కలిస్తే మంచిదని చెప్పటం తో ఆఫీసు నుండి బయలుదేరాను. దారిలో ఎన్నో ఆలోచనలు, అమృతాని ఉదయమేమన్నా అరిచానా? అదేమన్నా బడికి వెళ్లి మా నాన్న అరిచాడు ఈరోజు అని వాళ్ళ ఉపాధ్యాయురాలికి చెప్పిందా అని?
సుప్రియాకి కూడా ఫోన్ చేసి అడిగాను, తనేమన్న అన్నదా అమృతాని ఈరోజు కానీ లేక గత రోజుల క్రితం గాని అని? అసలే ఈ అమెరికాలో తలితండ్రులు 911 దెబ్బ, పిల్లలకి హడిలి పోయేకాలం. సుప్రియా అటువంటిదేమీ లేదని చెప్పినా మనసేమో పరి విధాలుగా పోతున్నది. అసలే నాకు మరియు మా అమ్మకి ఏమన్నా సమస్య వస్తే పరిష్కారమేమిటి అన్న ఆలోచన కాక, పుట్టు లెత్తమంటే పూర్వోత్తరాలు ఎత్తిన మాయిన, మూల కారణాలు శోధించటం అలవాటు. దేశం కానీ దేశం లో ఏమన్నా విరుద్ధం గా జరగబోతుందా అన్న భయంతోనే, బిక్కు బిక్కుమని అమృతా వాళ్ళ క్లాస్ రూమ్ కి వెళ్ళా.
పిల్లలందరూ ఎదో యాక్టీవిటీ లో నిమగ్నమై వున్నారు, మా అమృతా మాత్రం వాళ్ళ క్లాస్ రూమ్ కార్నర్లో వున్న ఒక పార్టిషన్ చేయబడ్డ ప్రదేశంలో ఒక్కటే కూర్చొని వుంది. నాకర్థమయ్యింది మా అమృతాకి వాళ్ళ ఉపాధ్యాయురాలు టైం అవుట్ ఇచ్చిందని. నాకు చెప్పొద్దూ అదొక్కటే అలా ఐసోలేటెడ్ గా ఎదో ముద్దాయిల కూర్చొని ఉంటే తెగ నవ్వు వచ్చేసింది. వాళ్ళ ఉపాధ్యాయురాలు మాత్రం లేని గాంభీర్యాన్ని మొహంమీదకు తెచ్చుకొని నన్ను ఆసీనుడవ్వమని చెప్పారు.
నేనుఆసీనుడను అవ్వగానే చెప్పారు ఆవిడ, మీ అమృత మీద తన సహాధ్యాయిని వాళ్ళ నాన్న గారు వచ్చి ఒక ఫిర్యాదు చేసి వెళ్లారు, ఆ ఫిర్యాదు చాలా గంభీరమైనది అని. ఇంతకీ ఏమిటంటే ఆ ఫిర్యాదు, అమృత తన సహాధ్యాయినితో చాలా వర్ణవిచక్షణ బహిర్గత మయ్యేలా ప్రవర్తించిందని. అసలు అమృత అలా ఎలా ప్రవర్తించిందనేది ఆవిడకి అర్థం కానీ విషయమని, దాని గురుంచే మాటలాడడానికే నన్ను పిలిపించానని చెప్పారావిడ.
దేవుడా, ముక్కు పచ్చలారని ఐదేళ్ల అమృత మీద ఈ నింద ఏమిటి అని అనుకుంటూ, వివరాలు అడిగిన నాకు, "అమృత నిన్న ఉదయం బడికి రాగానే, ఆ అమ్మాయి దగ్గరకెళ్ళి తనని స్నిఫ్ చేసి, యు అర్ స్టింకీ, బెటర్ టేక్ యువర్ బాత్", అని అన్నదని చెప్పింది. అది ఆ అమ్మాయి, నల్లనయ్య అయిన వాళ్ళ నాన్నగారికి చెప్పటం, ఆయన ఈరోజు అమృత వాళ్ళ ఉపాధ్యాయురాలిని కలవటం మరియు ఫిర్యాదు చేసెయ్యటం జరిగిపోయాయట.
నాకర్థమయ్యింది ఈ సమస్యకి మూల కారణం నేనేనని. అవి చలికాలం కావటంతో అమృత స్నానం చేయడానికి ప్రతీ రోజు మమ్మల్ని విసిగించేది. రోజూ ఎదో ఒక విధం గా తన చేత స్నానం చేయించటం మాకు గగనమయ్యేది. తనని స్నానం చేయించడానికి నేను అమృత దగ్గరకెళ్ళి తమాషాగా తన చేతులు లేక ముఖాన్ని స్నిఫ్ చేసినట్టు నటించి, "అబ్బే అమృత స్నానం చేయలేదు, అమృత ఈజ్ స్టింకీ, అమృత బెటర్ టేక్ హర్ బాత్" అంటూ ఏడిపిస్తే చేయించుకునేది స్నానం.
నా ఈ ఎదవ పదజాలం చిన్నదైన అమృత ఆ పిల్ల దగ్గర అనుకరించి సమస్యలో పడిపోయింది. నేను ఈ విషయమంతా వాళ్ళ ఉపాధ్యాయురాలికి వివరించి, తన తప్పేమీ లేదని, కావాలంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారిని కలిసి నేను క్షమాపణ చెప్తానని చెప్పాక విషయం సద్దుమణిగింది. ఆ తర్వాత రోజు నేను ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారి కలిసి, నా క్షమాపణలు వేడుకున్నా. ఆయనకూడా నవ్వేసి, నాకేమీ అర్థం కాకుండా, "యు బెట్ మాన్, హా హా హా" అంటూ వెళ్ళిపోయాడు.
ఇలా మన అనాలోచిత పనులు మన పిల్లల్ని ఎలాటి సమస్యల్లో పడవేస్తాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ తర్వాత మాకు అమెరికాలో ఉన్నంత వరకూ ఎలాటి సమస్యా ఉత్పన్నం కాలేదు. అలా అమెరికాలో ఉండగా అమెరికనుల మనోభావాలు గౌరవించాము.
నా కథలు ఎక్కువగా నా బాల్యము, స్నేహితులు మరియు కుటుంబము ఇతివృత్తము గా సాగుతుంటాయి. ఈ మధ్య ఎక్కువగా కాలేజీ స్నేహితుల గురించే సాగ దీసి మిమ్మల్ని విసిగించాను. ఈ సారి మార్పుగా నా చిన్న నాటి స్నేహితుడి గురుంచి రాయాలనుకుంటున్నాను. వాడు ప్రస్తుతము అమెరికా సంయుక్త రాష్ట్రము లోని ఉత్తర కరోలినా లో ఉద్యోగపర్వం వెలగపెడుతున్నాడు
పేరు దాడి ప్రతాప్. ఏ కొత్త విషయం కనిపించినా నేర్చుకోవడానికి వాటి మీదకి దాడి చేసేస్తాడు. మా అమ్మ, మా పెద్దమ్మ కూతురైన మా బాడుగ అక్క మరియు ప్రతాప్ వాళ్ళ అమ్మ గార్లు కావలిలో పి.యూ.సి చదివారు. వాళ్ళ అమ్మగారిది అల్లూరు. అప్పట్లో కావలి చదువులకు చాలా ప్రసిద్ధి. విశ్వోదయ లాటి బడులతో, జవహరి భారతి లాటి కళాశాలలో చదవడానికి చుట్టుపక్కల వున్న ఊర్ల నుండి కావలి చేరుకొనే వారు.
మా అమ్మ వాళ్ళు ఒకప్పుడు సహాధ్యాయులైనా నేను వాడిని తొలిసారి చూసింది మాత్రం, నేను రాజుపాలెంలో బస్సు ఎక్కి ఉలవపాళ్లకు వెళ్తుండగా వాడు అదే బస్సులో నెల్లూరు నుండి కమ్మపాలెం వస్తున్నాడు. ఆ ప్రయాణమప్పటికి మేము చాలా పిల్ల పీసులం అయినా మా అమ్మ వాళ్ళు మమ్మల్ని వాళ్లకు రక్షణగా తీసుకెళ్తున్నారు. వాళ్ళు వాళ్ళ ఊరిలో దిగుతూ మాకు సీట్ ఇవ్వటం నాకు ఇంకా గుర్తు.
ఆ తరువాత మా నాన్న మరియు వాళ్ళ నాన్న కలిసి రైల్వే గుత్తే దారులుగా అవతారమెత్తారు. మా నాన్న చేసే రైల్వే పనులను పర్యవేక్షణ చేసే ఇంజనీర్ ప్రతాప్ వాళ్ళ ఇంట్లో బాడుగకు ఉండే వారు, అలా ఆ ఇంజినీరు, ప్రతాప్ వాళ్ళ నాన్న మరియు మా నాన్న పార్టనర్స్ గా అవతారమెత్తారు. అలా మా అమ్మ వాళ్ళ స్నేహాలు మరలా పునరుజ్జీవనం చెందాయి.
ఒక రోజు మా పేద పుత్తేడు జిల్లా పరిషత్ పాఠశాలలో నా మానాన నేను మా లెక్కల అయ్యోరి చేతిలో వొంగో పెట్టిచ్చుకుని గుద్దులు గుద్దిచ్చుకుంటుండగా మా వోడు ఎక్స్-క్యూస్ మీ అంటూ ఎంట్రీ ఇచ్చాడు. మా అయ్యోరు మహా గట్టివారు, నువ్వు ఎంత పీక్కున్నా నేను వీడిని తప్ప వోల్ తరగతిని వదులుతాను అని వాడిని తరిమేయ్యటం తో మా వోడు బడి వదిలిన దాకా నాకోసం బయట కాసుక్కూర్చోని వున్నాడు. నీ పాసుగూలా ఇలా చెప్పా పెట్టకుండా నెల్లూరి నుండి వచ్చెయ్యటమేనా, ముందే చెబితే మా అయ్యోరి చేతిలో పడకుండా మా ఏర్పాటులేదో చేసుకునే వాడిని కదా అనుకుంటూ ఇంటి దారి పట్టాము.
నా కన్నా వాడు రెండేళ్లు పెద్ద, కానీ ఆ కిలోగ్రాములు ఈ కిలోగ్రాములు అని ఆంగ్ల మాధ్యమం లో చదివి నా కోసం ఆగిపోయాడు. ఇద్దరం ఇప్పుడు ఒకటే తరగతి కాకపోతే వాడు ఎల్.సి.ఎం మరియు జి.సి.డి అంటాడు నేను క.సా.గు మరియు గ.సా.ప్ర అంటా అంతే తేడా.
అలా వచ్చిన వాడు ఓ వారం వుండిపోయాడు మా ఉప్పలపాటిలో. మా స్నేహితులకి వాడు చెప్పే నెల్లూరు కథలు చాలా నచ్చేశాయి, మాటి మాటికీ వాడనే మా నెల్లూరులో ఐతేనా అంటూ చెప్పటం. రాత్రి అయితే వాడు కథా, మాటలు, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహించి చెప్పే ఎక్సార్సిస్ట్ కథలు, నేను మరియు నా స్నేహితుల మందరిమి ఆరు బయట మంచాలు వేసుకొని కెవ్వు కెవ్వు మంటూ వినటం, మా పెద్దోళ్ల చేత తిట్లు తినటం ఆ దిక్కుమాలిన కథలు వినటం ఎందుకు మమ్మల్ని మీరు ఉత్సలకు పోవడానికి కూడా లేపటం ఎందుకు అని.
మా వాడైతే ఆ సినిమాని థియేటర్ లో ఒంటరిగా చూస్తామని పందెం కట్టి గుండె ఆగి చచ్చిపోయినోళ్లు బొచ్చెడు మంది అని చెప్పే వాడు. మా పల్లెలో కేవలం ఆదివారాలు మాత్రమే ఇళ్లల్లో దోసెలు చేసే వారు. మా అమ్మ చేసిన ఎర్ర కారమేసుకొని హా! హా! అంటూ ఓ పది అయినా లాగించేసే వాళ్ళం. మా వాడిది చాలా ఇంజనీరింగ్ బుర్ర లే, మేము ఇటుక రాళ్లనే బస్సులుగా భావించి తోసుకుంటూ ఆడుతుంటే వాడు వాటికి ఇసుకతో రాంపులు మరియు సొరంగాలు తయారు చేసే వాడు.
నేను కూడా వీడి వెంట పడి నెల్లూరు వెళ్లే వాడిని. మాకు ఉప్పలపాటిలో బ్రేక్ ఫాస్ట్ రోజూ సద్దెన్నం మరియు ఆదివారం మాత్రమే దోసెలు. నెల్లూరులో ఎక్కడ బడితే అక్కడ దోశె అంగడులే, రూపాయికి పది దోసెలు. ఇద్దరం వాళ్ళ ఇంట్లో రూపాయ తీసుకొని అంగడికి వెళ్లే వాళ్ళం, నాకేమో అక్కడ అందరి ముందు తినటం కొత్తగా మరియు సిగ్గుగా ఉండేది, మా వాడేమో ఇక్కడే తింటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ అడగొచ్చు అని అక్కడే తినిపిచ్చే వాడు. ఆపమ్ అనే పేరు విన్నది నేను అక్కడే.
వీడికి మేము ఆరు ఏడూ తరగతుల్లో ఉండగానే క్రికెట్ పిచ్చి చాలా ముదిరి ఉండేది. పుర చేయి వాటం. దారిలో నడుస్తూ నడుస్తూ ఎడం చేతిని గిర్రున బౌలింగ్ చేసిన ఆక్షన్ లో, లేక పోతే ముందుకి రెండడుగులు గెంతి చేత
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
నేను మన సూరి కథ రాశాక, ఇప్పుడల్లా అనారోగ్యాల మీద రాయకూడదు అని అనుకున్నా, కానీ ఆ నియమం వెంటనే పక్కన పెట్టి ఈ కథ రాస్తున్నా. ఎందుకు రాశానో ఈ కథ చివరలో రెండు మాటలుగా చెప్పాలనుకున్నా.
నేను 2012 న ఉద్యోగ నిమిత్తం చెన్నై నుండి హైద్రాబాదుకు బదిలీ అయ్యాను. ఇంకా విద్యాసంవత్సరం పూర్తి కాకపోవటంతో కుటుంబం చెన్నై లోనే ఉండిపోయింది. నా మకాం మా అన్న దగ్గర. ఏవో సెలవులు ఉండటంతో సుప్రియ, పిల్లలు మరియు అమ్మ కూడా హైదరాబాద్ వచ్చి వున్నారు.
ఒక శనివారం ఉదయం లేచి, మా అన్నా వాళ్ళ బాల్కనీలో వేప చెట్టు నీడలో కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా, అమ్మ నాకు తేనీరు ఇచ్చి, నన్ను ఒక్కసారి డాక్టర్ కి చూపించరా అని అడిగారు. నాకైతే ఒక్కసారి చాలా సిగ్గుగా అనిపించింది, ఎంత నలతగా వున్నా, డాక్టర్ దగ్గరకి ఎంతో బలవంతం చేస్తే కానీ రాని అమ్మ, తనకై తాను వచ్చి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళరా అని అడిగేదాకా నేను స్పృహలో లేనా అని.
తాను కొంత కాలం నుండి మతిమరుపుతో బాధపడుతూ వున్నారు. ఉదాహరణకు అందరం భోజనాలకు కూర్చున్నాక, తనకు పెరుగు కావాలంటే, నాకు అది అందించరా అనే వారు, అది అంటే ఏమిటి దానికి పేరు లేదా అంటే, ఎంతో ఆలోచించి మరలా అది ఇవ్వరా అనే వారు పెరుగు చూపిస్తూ, పెరుగు పేరు స్ఫురించక. అలా తాను మనుషులు మరియు వస్తువుల పేరుల కోసం తడుముకోవటమా చాలా ఎక్కువగా జరిగేది అప్పట్లో.
మా అమ్మకి మొదటి నుండి జ్ఞాపశక్తి అమోఘం. అప్పటికప్పుడు కనీసం ఒక శత పద్యాలు చెప్పగలరు, వేమన, భాస్కర, సుమతి శతకాలు నుండి మరియు భర్తృహరి సుభాషితాలు, చాటువులు మొదలగు వాటినుండి. తెలుగు పదహేళిలు, పద వినోదాలు పూర్తి చేయాలంటే నేను మా అమ్మ సహాయం తీసుకోవాల్సిందే.
నేను ఎప్పటికప్పుడు నా కథలలో మా అనీల్గాడి ప్రసక్తి తీసుకు రాకూడదు అని అనుకున్నా వాడు నాకు తెలియకుండానే వచ్చేస్తుంటాడు. వెంటనే వాడికి చేశా, ఇలా ఉందిరా అమ్మకి, ఒక మంచి డాక్టర్ పేరు చెప్పు, నేను వెంటనే తీసుకెళ్లాలి అని.
వాడు పదినిమిషాలు అయ్యాక చెప్పాడు, అమిత్ అని మా ఇంటి దగ్గర ఒక యూ.కే నుండి తిరుగు ముఖం పట్టిన డాక్టర్ వున్నాడు, చాలా మంచి డాక్టర్, వెళ్లి చూపించు అని. ప్రస్తుతం అదే డాక్టర్ మా వాడికి చాలా చెడ్డ అయి యున్నాడు అది వేరే విషయం. మా వాడికి ఏదొచ్చినా పట్టలేమని మీకిప్పటికే అర్థమయ్యుండాలి.
సరే అని మా అమ్మని, వాడు చెప్పిన అప్పటి చాలా మంచి డాక్టర్ అయిన అమిత్ దగ్గరకు హుటా హుటిన తీసుకెళ్లిపోయాను. ఆయన బి.పి వగైరాలు చూసి, ఆవిడ రిఫ్లెక్స్ లు టెస్ట్ చేసి, పలు ప్రశ్నలు సంధించి, ఇదంతా వయసుతో వచ్చిన మతిమరుపు అని తేల్చేసి, కొన్ని ఆయన పెట్టిన షాపులోనే దొరికే మందులు రాసి, ఎందుకైనా మంచిదని సి.టి స్కాన్ చేయించమని చెప్పి, అది కూకట్పల్లి లోని భద్రం డయాగ్నోస్టిక్స్ లోనే చేయించమని పదే పదే చెప్పి పంపాడు.
అబ్బా ఈరోజు చాలా కష్టపడ్డావురా, ఇప్పటికి ఇంటికెళ్లి నువ్వు రెస్ట్ తీసుకున్నాక రేపు స్కాన్ తీయించుకకుందామని మా అమ్మ స్కాన్ ని ఎగ్గొట్టాలని చూసినా, నేను వినకుండా నేరుగా భద్రానికి తీసుకెళ్లిపోయా మా అమ్మని. స్కాన్ ఫలితం వెంటనే ఇచ్చేసారు. ఫ్రంటల్ టెంపోరల్ రీజియన్ లో ఓ కార్క్ బాల్ సైజు లో ట్యూమర్ కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఆ స్కాన్లో. అటు పిమ్మట తనని కలిసిన మాతో చెప్పారు అమిత్, సర్జరీ వెంటనే చేయించమని, ఎస్.ఆర్ నగర్ లో ఒక న్యూరోసర్జన్ కి కూడా రెఫర్ చేసేశాడు.
అప్పుడు మొదలయ్యింది మా అసలు కష్టమైన సంధికాలం. అభిప్రాయం, రెండవ అభిప్రాయం, రెండవ అభిప్రాయం మీద మరల అభిప్రాయాల పేరున ఎక్కని హాస్పిటల్ గుమ్మం లేదు. ఇక్కడ వింత ఏమిటంటే కొందరు డాక్టర్స్, అడ్మిట్ కానిదే అభిప్రాయం కూడా చెప్పము అనటం. మెడ్విన్ లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్ మరునాడే అని చెప్పటం తో మేము సన్నిద్ధంగా లేము అని, మా రిస్క్ మీదే డిశ్చార్జ్ అవుతున్నామని రాసిచ్చి మరీ పారిపోయి వచ్చాము కూడా.
యశోదలో పని చేసే ఇద్దరు డాక్టర్ దంపతులు మా స్నేహితుడైన నరేంద్రుడి అపార్ట్మెంట్ నివాసులవ్వటంతో,
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
ఆ మధ్య ఒకసారి మా అనీల్గాడు నాతో సంభాషిస్తూ, రాసే కొద్దీ నీ కథలు మెరుగుపడుతున్నాయి. అలాగే నీ పాత్రలతో సహజీవనం చేస్తూ నువ్వు కూడా వ్యక్తిగా మెరుగు పడాలని ఆశిస్తున్నా అన్నాడు. ఇదే మాట మా సీనియర్ బాలాజీ కూడా అన్నాడు మా వాడంతా కరుగ్గా కాదు, కాస్త మెతగ్గా, ఈ కథలు నీ వ్యక్తిత్వాన్ని ఇంకాస్త మెరుగు పరుస్తాయని.
కానీ వరుసగా ఈ మధ్య నా కథలు చదివిన మా అనీల్గాడు, ఈ మధ్య కథల్లో వినయం పేరుతో నువ్వు పడే స్వీయ-జాలితో చస్తున్నామురా బాబు, అంత ఆత్మ విశ్వాసం లోపిస్తూ నువ్వు రాసే కథలు ఒక కంపెనీ లో లీడర్షిప్ పోసిషన్ లో వున్నా నీకున్నూ మరియు నీ చుట్టూ పక్కల వారికిన్ను అంతగా శోభించవు అని మరలా నాకు హిత బోధ చేశాడు. నాకు వాడి హితబోధ చాలా నిజమనిపించి నా ముందు కథ అయిన "గడ్డు కాలం లో నాతో నేను" ను నేను చాలా ధనావేశంగా ముగించా.
లక్ష్మి లేకపోవటం నిజం, మన (కాని) సత్యం లేక అందగాడు మరియు ధవళ వర్ణము వాడు మా పెద్దనాన్న లాటి కథలు రాసినప్పుడు లేక నా కథలు నేనే చదివినప్పుడు మనసంతా చాల స్తబ్దుగా అయిపోతుంది, ఇలా జరిగి ఉండకూడదు అనే బలమైన భావన. టైం మెషిన్ లో వెనక్కి ప్రయాణించి అంతా రీసెట్ చేసుకోవాలనే తలంపు. అలా కాలాన్ని వెనక్కి మళ్లించాలి అనే ఆలోచనే నా అపరిపక్వ మనస్తత్వాన్ని తెలియజేస్తుందేమో కదా.
కొన్ని నిజ జీవిత పాత్రలగురుంచి రాసేటప్పుడు వాళ్ళ గురించి రాసే హక్కు లేక అర్హత నాకేముంది అనే ప్రశ్న కూడా మనసుని తొలుస్తుంది. నా కథల ద్వారా నేను ఎదో మంచి చెబుదాము లేక సందేశాన్ని ఇద్దామని అనుకోవటం లేదు. నిజ జీవితంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో నా కథలలో పాత్రలు కూడా అలానే వుండాలను కుంటాను.
నేను నా జీవితం నూటికి నూరు శాతం కథానాయకుల గుణగణాలతో బ్రతికిన లేక బ్రతుకుతున్న వారిని, అలాగే నూటికి నూరు శాతం ప్రతినాయకులు గుణగణాలతో బ్రతికిన వారిని చూడ లేదు. నాతో వున్నవారు లేక నా చుట్టూ పక్కల వున్నవారు, తమ తమ సహజ సిద్దమైన మానుష ప్రవర్తన కలిగి వున్న వారే.
పరిస్థితుల ప్రభావం తో కొట్టుకు పోతున్నవారే ఎక్కువ మంది, వారిలో చాలా మంది మనం ఊహించిన దానికంటే కరుణాత్మకంగా ప్రవర్తించి ఉండవచ్చు, అదే వారు మనం ఊహించని దానికంటే కఠినాత్మకంగాను కనపడి ఉండవచ్చు మరొక సమయాన.
చాలా మంది మాకు యండమూరి వీరేంద్రనాథ్ కథలు చాలా ఇష్టమంటారు. ఆయన రాసిన నవలలో వెన్నెల్లో ఆడపిల్ల కానీ, ఆనందోబ్రహ్మ అనే నవల కానీ ఇష్టమని ఏభై శాతానికి పైనే చెప్పటం మనం వింటాము. ఆయన ఆ పుస్తకాలలో రాసిన ఆ వెన్నెల్లో ఆడపిల్ల, రేవంత్ లేక సోమయాజి, మందాకినీ లాటి పాత్రలులా బలమైన వ్యక్తిత్వమున్న పాత్రలు మనకి నిజ జీవితంలో తారస పడవు, తారస పడాలని కోరుకోవటం అసహజమే అవుతుంది.
నాకు మట్టుకు ఆయన రాసిన వెన్నెల్లో గోదావరి అనే పుస్తకనుంటే చాలా ఇష్టం. ఆ పుస్తకాన్ని ఆయన ఆనందరావు, తరళ, ప్రమథ్వర , గోపిచంద్ మరియు తరళ వాళ్ళ నాన్నగారుల పాత్రలతో జరిగిన ఒకే కథని ఒక్కొక్కరి కోణంలో చెప్పటం అనే ప్రయోగం చేశారు అని గుర్తు. చదివి చాలా రోజులయ్యింది. మరల చదవకుండానే యిక్కడ ఏమాత్రం సందేహం లేనివాడిగా రాసేస్తున్నా. ఒక్కో పాత్ర తన కోణం నుండి అదే కథ చెబుతుంది, వాళ్ళు చేసిందే సత్యం మిగతా వాళ్లంతా అసత్యాలు గా కనపడతారు.
ఇంత సుత్తి ఎందుకురా అంటే, నిజ జీవితం కూడా అంతే, మనం ఏ విషయాన్ని అయినా మన కోణం లోనే చూస్తాము, మన కోణమే భలమని నమ్ముతాము. అలా నమ్మలేక పోతే మనం మనలేము. మనకి మనమే అసత్యంగా కనపడటం కన్నా మిక్కిలి బాధాకరం ఈ లోకంలో లేదు. ఒక్కోసారి మనతో మనమే ఓ నలభై లేక ఏభై ఏళ్ళు గడిపినా మనకి మనమే అర్థం కాము, ఇక ఇతురులనేమి అర్థం చేసుకోకగలం. ఆలా కాకుండా ప్రతీ విషయాన్ని ఇతరుల కోణం లో చూసే వారిని మనం ఋషులని అనాలేమో, వాళ్ళ మనుగడ పురాణ కాలాలలోనే, నిజ జీవితంలో అలాటివారి మనుగడ ఓ మిధ్య.
నాకు ఓ మహా చెడ్డ వ్యక్తిత్వ లోపం వుంది, నేను ఇతరుల మాటలను బట్టి మరియు చేతలను బట్టి, వెంటనే వారి కోణంలో చూడకుండా అపార్థం చేసుకోవటంలో ఘనుడను. పైగా వారు నేను అనుకున్నట్టు గా ప్రవర్తించలేదని గింజుకోవటం. మనమనుకున్నట్టు బతకడానికి వా
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
చాలా పెద్ద కథని ఒక్క మాటలో చెప్పాలంటే నాకు గత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, ఆయుర్వేదము మరియు హోమియో వైద్యాలమీద నమ్మకం సడలింది. అదిగో మీకు వెంటనే కోపం వస్తుంది కదా! అయితే వినండి, నాకూ ఆయుధముంది, ఇది నా అభిప్రాయం మాత్రమే అని బుకాయించే ఆయుధము. సహజంగా నా అభిప్రాయాలు చివరకు తప్పని తేలుతుంటాయి, ఆ చివర ఎప్పుడు అని తెలుసుకోవాలంటే మీకు ఓపిక అనే గొప్ప గుణం ఉండాలి.
నేను గత మూడు సంవత్సరాలుగా ఎక్కువ ప్రయాణిస్తూ, మరియు యింటికి అర్థరాత్రి లేక అపరాత్రికి చేరుతూ, అప్పుడు ఏది పడితే అది మెసవుతూ, సరిగా ద్రవ పదార్థాలు మరియు పీచు పదార్థాలు తినక, ఫిస్టులా మరియు ఫిషర్ లని కలిపి తెచ్చుకున్న. గత సెప్టెంబర్ లో రెండవ అభిప్రాయము లేకుండా మరియు తీసుకోకుండా మరియు స్నేహితులెవ్వరికీ చెప్పకుండా కేవలం నా సతి మాత్రమే తోడురాగా శస్త్ర చికిత్సా బల్ల మీద పడుకునేశా.
శస్త్ర చికిత్స అనంతరం నా శరీరం లో సెటన్ అనే సైతానుని కూడా మూడు నెలలు భరించా. ఈ సెటన్ అన్నది ఒక దారపు ఉంగరం, అది ఫిస్టులాని సహజంగా కత్తి అవసరం లేకుండా కోసుకొని దానికై అదే బయట పడిపోతుంది అని మా వైద్యుడు ధృవీకరించాడు కూడా. కానీ దానికి నా శరీరమంటే మిక్కిలి ప్రీతీ అయ్యి, ఈ హర్షా గాడిని కోసి నేను బాధించలేను అని నా శరీరం లోనే ఉండి పోయింది.
దానికున్న జాలి మా వైద్యులుంగారికి లేదు కదా మరలా నన్ను డిసెంబర్ మాసంలో కోసిన దగ్గర మరలా కోసి సెటన్ బయటకి తీసి, ఇలా నూరుమందిలో పదిమందికి జరుగుతుంది, నీ మొహం చూసే అనుకున్న నువ్వు ఆ పదిమందిలో ఒకడివి అని చెప్పి, నొప్పి తగ్గక పోతే అప్పుడప్పుడు వచ్చి కనపడు అని చెప్పాడు.
ఆ ముక్క నేను శస్త్ర చికిత్సా బెంచి మీద పడుకోక ముందే చెప్పాలి అని అనుకొని ఆ నొప్పి తగ్గడానికి ఇంకో మూడు వారాలు మంచమెక్కా నేను. కానీ నాకు గత నాలుగు నెలలుగా హీల్ కావటం లేదు, నేను కూడా శపధం చేశా సుప్రియా దగ్గర లాక్ డౌన్ ఎత్తేసినా నేను నన్ను కోసిన వైద్యుడిని చూడను అని.
మా అనీల్గాడు కాల్ చేసి కనుక్కుంటాడు ఎలా ఉందిరా, తగ్గిందా లేదా అని. వాడు చేసినప్పుడల్లా నేను కళ్ళ నీళ్లు పెట్టుకుంటా. ఇక వాడు నా బాధ చూడలేక ఎలాగూ బాధ పడుతున్నావు కదా, నిన్ను కోసినోడిని చూడనంటున్నావు కదా , ఏమీ మందులు వాడకుండా ఏడ్చే బదులు నాకు తెలిసిన ఒక హోమియో వైద్యుడున్నాడు, ఆయన్ని కలిసి ఆయనిచ్చే ఆ నాలుగు తీపి గోళీలు నములుతూ కూడా నీ ఇప్పుడేడిచే ఏడుపు ఏడ్చుకోవచ్చు అని సలహా పడేశాడు. సలహాతోనే ఆగకుండా ఆ హోమియో ఆయనతో మాటలాడి ఈ లాక్ డౌన్ లో కూడా నన్ను చూసే ఏర్పాటు చేసాడు.
చెప్పొద్దూ మొదట దర్శనం లో ఆయన నన్ను ప్రొఫైలింగ్ చేసి పడేశాడు ఓ గంట కూర్చో పెట్టి. చలి అంటే ఇష్టమా లేక వేడి అంటే ఇష్టమా అన్నదానికి చలి ఉండటం వలన నాకు అమెరికా అంటే ఎంత ఇష్టమో కథలు కథలు గా చెప్పా. చిన్నప్పుడేదన్న నీకు బాధ కలిగే సంఘటన గురుంచి చెప్పమంటే మా లక్ష్మి కథ చెప్పేశా, చురుగ్గా వుండే వాడివా అంటే మా అమ్మ తప్పిపోయిన కథ చెప్పా,.
పరీక్షలంటే టెన్షనా అంటే అసలు టెన్షన్ ఎందుకు మొదలయ్యింది అని నాది మరియు అనీల్గాడి ఇంటర్మీడియట్ సోది కథ చెప్పేశా, నీ స్నేహితులు నీ గురుంచి ఏమనుకుంటారు అంటే నీలో నువ్వు అన్నిటికీ పీక్కుంటావెందుకురా అంటారని చెప్పా.
ఎవరన్నా బాధ పెడితే గుర్తు పెట్టుకంటావా అని అడిగితే ఎప్పుడో ఇరవై ఏళ్ళక్రితం మన గోపీ గాడు నాకు టైం ఉంటే మా యింటికి ఫోన్ చేసుకోకుండా నీకెందుకు చేస్తానురా అని అన్నాడని గుర్తుపెట్టుకొని వాడి మీద కథ రాసేసాను అని చెప్పా, చిన్నప్పుడు ఇంట్లో నిన్నెవరన్నా అన్నిటికీ సప్రేస్స్ చేశారా అంటే రామలక్ష్మణులేమో అలా సుందోపసుందులేమో ఇలా అనే కథ చెప్పా, పెద్దయ్యాక సప్రెస్ చేశారా అంటే గడ్డు కాలంలో నాతో నేను కథ చెప్పా.
From the publisher's feed

52 Listeners