
Sign up to save your podcasts
Or


"చిన్నీ ! నీ పెళ్ళికి చంద్రత్త వాళ్ళు రావట్లేదు, ఇందాక నువ్వు షాపింగ్ కి వెళ్ళినప్పుడు, మావ ఫోన్ చేశారు, చంద్రత్త కి ఒంట్లో బాగాలేదు అనిచెప్పి" అన్నారు నాన్న.
"నా పెళ్ళికి చంద్రత్త లేకపోతే, ఎలా ! అయినా క్రితం వారమే కదా, మీరు ఢిల్లీ కి ఎదో పని మీద వెళ్లి , అత్తా వాళ్ళను చూసొచ్చింది. అప్పుడు బాగానే వుంది కదా అత్తకి ?" అడిగాను నేను నాన్నని.
నా ప్రశ్న కు ఏమీ సమాధానం చెప్పకుండా, నాన్న అమ్మ వైపు చూసారు.
అమ్మ చెప్పింది, "అత్తకి, నెక్ పెయిన్ వల్ల, బాగా ఇబ్బందిగా ఉంది, చిన్నీ! మాట్లాడితే ఇంకా ఎక్కువ అవుతుందని, రెండు మూడు వారాలు రెస్ట్ అవసరం అని అక్కడ వాళ్ళ డాక్టర్ చెప్తున్నారు. నీ పెళ్లి అయ్యిన, నెల లోపల అందరం కలిసి కొండకి వెళదామనుకున్నాం కదా! ఆ ట్రిప్ కి జాయిన్ అవుతాం! అని అత్త నీకు చెప్పమంది " అని.
" అది వేరు, పెళ్లికి అత్త నా పక్కనే ఉండటం వేరు" అన్నాను నేను .
మా చంద్రత్త అంటే నాకు చాలా ఇష్టం.
మొన్న మొన్నటి దాకా, మా చంద్రత్త వాళ్ళు, మా ఇంటికి ఓ అరగంట దూరంలోనే, సీతమ్మధారలో వుండేవాళ్ళు. మావకి ప్రమోషన్ వచ్చి, ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఢిల్లీ షిఫ్ట్ అయిపోయారు, ఓ ఆర్నెల్ల క్రితం. విశాఖపట్నం లో వున్నా, భూప్రపంచంలో ఎక్కడున్నా సరే, రెండ్నెల్లకోసారి, తను, మా ఇంటికి రావాల్సిందే.
మావ సర్వీస్ ఎక్కువ శాతం విశాఖపట్టణం లోనే జరిగింది, కాబట్టి నేను మా అత్తను పెద్ద మిస్ అయ్యింది లేదు. వాళ్ళ ఇంటికెళ్తే, బాపు గారి సినిమా లో హీరోయిన్ ఇంటికెళ్ళిన ఫీలింగ్ వచ్చేది నాకు. అంత అద్భుతం గా ఉంటుంది తన ఇల్లంతా. ప్రతీ వస్తువూ, నాకు నచ్చిన పేస్టెల్ షేడ్స్ లో. ఇది గాక, మాట్లాడేటప్పుడు, మా అత్త, మంచి జోవియల్ గా ఉంటుంది, చుట్టూ వున్న వాళ్ళ మీద జోకులేసేస్తూ.
నాకు తెలుసు, చంద్రత్త పెళ్ళికి రాకపోవటం, మా అమ్మను గూడా ఎక్కువ బాధ పెడుతుంది. మా అమ్మా , చంద్రత్త గూడా చాలా మంచి ఫ్రెండ్సు. బయటికి షాపింగులు, గుళ్ళూ గట్రా అన్నీ ఇద్దరూ కలిసే చేసేవాళ్ళు. ఎక్కడున్నా ప్రతీ రోజూ టంచను గా ఫోన్ చేసి మరీ మాట్లాడుతుంది , మా అమ్మతో చంద్రత్త.
తమాషా ఏందంటే, అలాంటి చంద్రత్త, మా నాన్న ఒకరితో ఒకరు, ప్రశాంతంగా మాట్లాడుకోవడం, చాలా తక్కువ సార్లు చూసాన్నేను. ఆవిడ, నాన్న కంటే రెండేళ్లు చిన్నదయినా, తనకో పెద్దక్క ఫీలింగ్ ఉంటుందనుకుంటా.
మా ఇంటి కొచ్చినప్పుడల్లా, అన్నాచెల్లెళ్ళిద్దరూ, ఎదో ఒక విషయం మీద, నాలుగు విరుద్ధమైన అభిప్రాయాలతో వాదించుకుంటూ వుండే వాళ్ళు. మధ్యలో మా అమ్మ జోక్యం చేసుకునేది కాదు. నవ్వుతూ చూస్తూ వుండిపొయ్యేది.
ఇలా ఆలోచనల్లో ఉంటే, అమ్మ పిలవడంతో ఈ లోకంలోకొచ్చాను.
అమ్మ చెప్పింది " రేపు సాయత్రం కల్లా అన్నీ సర్దేయ్యాలి. ఎల్లుండి పొద్దున్నే, కల్యాణ మంటపం కి బయలు దేరాలి . నిన్న కొన్న చీరలన్నీ, కవర్లలోంచి తీసిపెట్టు, సూట్ కేసు లో సర్దుతాను" అని.
ఆ తర్వాత మూడు రోజులకి నా పెళ్లి జరిగి పొయ్యింది. రెండు వారాల్లోనే, ఎంవీపీ కాలనీ లో మా అత్త గారింటికి, కాపురానికి వెళ్లి పొయ్యాను, మా ఆయన అమెరికా లో ఉద్యోగస్తుడవ్వడం తో, వీసాలు లాంటి గొడవలుండడం తో.
వెళ్లిన ఒక వారానికి, వాళ్ళ ఇండియన్ ఆఫీస్ లో ఎదో పని ఉందని, మా ఆయన మద్రాసు వెళ్లడంతో, నాన్న, మా అత్తగారింటి కొచ్చారు, నన్ను ఇంటికి ఓ మూడు రోజులు, తీసుకెళదామని.
అప్పుడు నాన్న మాటల్లో తెల్సింది అత్త ఢిల్లీ నించి ఆ ముందు రోజు సాయంత్రమే, మా ఇంట్లో దిగిందని.
అడిగాన్నేను, " ఉంటుందా అత్త ఓ మూడు నాలుగు రోజులు? " అని ఆత్రుత గా.
" ఉంటుందేమో, ఒక వారం పది రోజులు", అన్నారాయన.
ఉత్సాహంగా ఇంటికెళ్ళాను, నాన్నతో బాటూ. ఇంటికెళ్తే, వరండాలో వాలు కుర్చీలో పడుకోనుంది అత్త, ఎదో పుస్తకం చదువుకుంటా. నన్ను చూడంగానే ఆమె కళ్ళలో ఓ చిన్న మెరుపు. మనిషి బాగా వీక్ గా కనపడుతోంది. నన్ను దగ్గరకి తీస్కొని చెప్పింది. "రావాలని చాలా ప్రయత్నించానే చిన్నీ, కనీసం పెళ్లి రోజుకైనా." అంటూ, తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూంటే.
చెప్పాను నేను, " మా ఆయన పని మీద మద్రాసు వెళ్ళారత్తా ! వీసా డాక్యుమెంట్లు అనిచెప్పి, సాయంత్రం ఎటూ ఫోన్ చేస్తారు నాకు . అప్పుడు చెప్పేస్తా, నువ్వున్న వారం రోజులు ఇక్కడే ఉండ
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
నిజామాబాద్ కి చెందిన నర్సింలూ కన్నా, నా సహోద్యోగి సీటెల్ లో ఒకప్పుడు. మనిషి చాల చలాకీగా, ఆరోగ్యంగా మరియు క్రీడాకారుల కుండే దేహదారుఢ్యంతో వుండే వాడు. కమా వాళ్ళు ఆడే సరదా క్రికెట్ కి, నాయకుడు కూడా. తనకి ఇద్దరు పిల్లలు - ఒక అమ్మాయీ మరియు ఒక అబ్బాయి. వాళ్ళ అమ్మాయి మా చిన్నదానికన్నా వయస్సులో రెండు నెలలు చిన్న మరియు మా పెద్దదానికంటే పొడవులో రెండు అంగుళాలు మిన్న. మేము సహోద్యోగులము మరియు మా చిన్నది, వాళ్ళ పాప సహాధ్యాయులు అవటం మూలాన మేము క్రమం తప్పకుండా వారాంతరాలలో కలిసే వాళ్ళము.
అట్టి నర్సింలు చెప్పా పెట్ట కుండా మా కంపెనీ కొలువు వదిలేసి, ఒక దేశీయ గుత్తేదారుని ద్వారా టి-మొబైల్ లో చేరిపోయాడు. అలా ఓ నాలుగు నెలలు గడిచాక, ఒక వారాంతరం రోజున తన స్నేహితుడు ఇండియానుండి వస్తుండటంతో, విమానాశ్రయానికి వెళ్లి, వాళ్ళను తీసుకొని వాళ్ళ ఇంటివద్ద దింపి వచ్చి, తన ఇంటికి వచ్చి పరుండి , ఇక లేవలేదు. మాసివ్ కార్డియాక్ అరెస్ట్ అని తర్వాత తెలిసింది మాకు.
ఇద్దరు పిలల్లు మరియు నర్సింలూ పార్థీవ శరీరంతో మిగిలిపోయింది తన భార్య. మంచి చెడులు చూసుకోవాల్సిన గుత్తేదారుడు పత్తా లేదు. తనకుండే స్నేహితులంతా మా కంపెనీ వారే, నాలాటి వారు. ముందు వాళ్ళ తలిదండ్రులతో నేనే మాటలాడినా, తన పార్థీవ శరీరాన్ని ఇండియా కి పంపిస్తాము అన్న వాళ్ళ ఆశల మీద నీళ్లు చిలకరించా, చాలా ఖర్చు మరియు మాకు అంత పలుకుబడి లేదు అన్న నెపం తో. అది వాళ్లకు చాలా ఘాతం లాగా తగిలింది. కష్టమైన అర్థం చేసుకొని సరే అన్నారు కొన్ని గంటల తరువాత.
తప్పు అన్ని తెలిసినా, కట్టటం ఉండదు అని తెలిసినా, తన క్రెడిట్ కార్డుతో, ప్రయాణానికి కావాల్సిన టికెట్స్ కొనేశాము. మా కొలీగ్స్ అందరం కూడబలుక్కుని ఓ ఇరవై ఆరువేల డాలర్స్ కూడవేసాము. ఎవరు ఎంత చిన్న మొత్తమిచ్చినా స్వీకరించాము. ఈ మనీ కలెక్షన్ అంతా మా ఇంకో సహోద్యోగి అయిన శశీ సుంకు చూసుకున్నాడు. తరువాత చాలా కష్టమైనది తన దహనం. చాలా మంది, ప్రతిరోజు పండగే చిత్రం చూసి, తండ్రి సమాధి ఎలా వుండబోతుందో చూపటం చూసి, చాల అతి అన్నారు. కానీ నేను వెళ్ళినప్పుడు ఆ దహనవాటిక వాళ్ళు, నా ముందర చాలా ప్యాకేజీలు పెట్టి ఒక్కో ప్యాకేజీ ఆవశ్యకతని వివరించారు. ఇరువది మంది దర్శనార్థం వస్తే ఇంత, ఏభై మందికైతే ఇంత, డ్రెస్సింగ్ చేస్తే ఇంత, రాళ్లు పెడితే ఇంత పెట్టకపోతే అంత అంటూ ఓ గంట. గీచి గీచి బేరాలాడి అతి తక్కువ డబ్బుకు ఒప్పించి వచ్చా. ఈ లోపు మా నర్సింలూ కూతురు, హర్ష మామా! నాన్న నన్ను ఈతకు తీసుకెళ్తానన్నారు, నువ్వన్నా తీసుకెళ్ళు, నాన్నని చూడనిస్తారటగా నేను ఏ డ్రెస్ వేసుకోను అంటూ చాలా అమాయకంగా అడిగేది, పిల్లలు ఎలా అడుగుతారో మరియు ఎలా వుంటారో అలా.
ఆ పక్కరోజు నేను మరియు ఇంకో సహోద్యోగి అయిన ప్రదీపు, నర్సింలూ ఒకటిన్నర సంవత్సరాల కొడుకుని తీసుకెళ్లి, శరీరాన్ని దహనపు గదిలోకి తీసుకెళ్లే స్విచ్ ని నొక్కించాము. బ్యాంకు అకౌంట్ ని మూసివేయించి, తన కారుని నేను తన తరుపున అమ్మి, అన్నీ డబ్బులు ఆ అమ్మాయి చేతిలో పెట్టి విమానమెక్కించాము. వాళ్ళ గుత్తేదారుని ఒక నక్షత్రకునిలా విసిగించి, వేధించి వాడి చేత నర్సింలూ కి రావాల్సిన డబ్బులన్నీ ఇండియా లోనే కక్కించాము. కానీ ఆ వెధవ, ఎచ్ 1 -బి ప్రాసెసింగ్ కింద మూడు వేల డాలర్లు పట్టుకొని మిగతా డబ్బులు ఇచ్చాడు. మాకు అర్థమైనది, అన్నీ బాగుంటేనే దేశం కానీ దేశం లో బతుకు బాగుంటుంది, ఎమన్నా తేడా వస్తే దిక్కులేని వాళ్లమవుతామని. కొలువు చేస్తే కనీసం కొంత పెద్ద కంపెనీలకన్నా చేయాలి కానీ చిన్న చిన్న దేశీయ గుత్తేదారుల దగ్గర చేయరాదని.
అప్పుడు నాన్న చనిపోయినప్పుడు అసలు బాధ కూడా తెలియని అమాయకురాలైన మా నర్సింలూ కూతురి, ఇప్పుడు, రాష్ట్రం లోనే 160 రాంక్ తెచ్చుకొని, మన గాంధీ మెడికల్ కాలేజీ లో రెండవ సంవత్సరం చదువుతున్నది, వాళ్ళ అమ్మకి, పైనున్న వాళ్ళ నాన్నకి గర్వకారణమై.
మా అక్క కూతురి పెళ్లి గత నవంబరు నెలలో జరిగింది. ఆ పెళ్ళిలో నా చిన్ననాటి సహాధ్యాయిని నన్ను కలిసి, కిరణు ! నాకు నీ పిల్లల్ని చూపించు అని అడిగింది. నేను కాస్త దూరంలో వున్న నా కూతుర్లని పిలిచి, నా సహాధ్యాయిన్ని పరిచయం చేస్తూ, తాను నా చిన్ననాటి స్నేహితురాలు అని చెప్పా. తాను వెంటనే, చిన్ననాటి కాదు, నేను మీ నాన్నకి పుట్టినప్పటి నుండి స్నేహితురాలిని అని నన్ను సరి చేసింది. ఆ మాటతో నాలో ఎన్నో చిన్న నాటి జ్ఞాపకాలు పొలమారాయి. నిజమే తాను నాకన్నా పదిహేనురోజుల తర్వాత ఈ లోకం లోకి వచ్చింది. మా అమ్మకి వాళ్ళ అమ్మ, సొంత మేనమామ కూతురు. ఒకే ఈడు వారు, పైపెచ్చు మంచి స్నేహితురాళ్ళు. వాళ్ళ అమ్మకి మా అమ్మ ఒక మార్గదర్శి, చదువూ సంధ్యలలో. వాళ్ళ స్నేహం లో చాలా సౌలభ్యం ఉండేది వాళ్ళకి. ఒకళ్ళు ఎర్ర రాళ్ళ నెక్లెస్ చేయించుంటే, ఇంకొకళ్ళు వాటికి మాచింగ్ గాజులు చేయించుకునే వాళ్ళు, ఎంచక్కా వాళ్లకి ఓ సెట్ దొరికినట్టే. వాళ్ళ మధ్య ఎన్నో ఇచ్చి పుచ్చుకోవటాలు.
మేమూ పెరిగాం అలాగే. ఒకే సారి పుట్టామన్న అఫినిటీ ఎక్కువే మా మధ్య. ఆటలన్నీ కలిసే, ఏదన్న జట్లు జట్లుగా ఆడల్సి వస్తే మేమిద్దరం ఒకే జట్టు. తనుంటే అమ్మాయిల ఆటల్లోకి నాకు ప్రవేశం, నేనుంటే అబ్బాయిల ఆటల్లోకి తన ప్రవేశం. చాలా కస్టపడి చదివేది మొదటనుండి, నా మార్కులన్నీ తన తర్వాతే, ఎందుకంటే మనం మొదట నుండి ఆడుతూ పాడుతూ చదవాల్సొచ్చాయే. ఇద్దరం ఒకే సారి నాలుగు నుండి ఆరుకి ఎగిరేశాం, అప్పటికే చాలా ఎక్కువ చదివేశాం అనే ఉద్దేశ్యంతో. అలా ఎగరడానికి మేము అప్పట్లో ప్రవేశ పరీక్ష రాయాల్సొచ్చింది. ఆ ప్రవేశ పరీక్షకి వాళ్ళ నాన్నగారు వెళ్లి తన ఫీజు కట్టేశారు. మా నాన్న ఊర్లో లేకపోవటం తో నాకు కట్టలేక పోయారు, ఆఖరు తేదీ తప్పిపోయా నేను. తాను ఎక్కడ నాకంటే ముందుకెళ్ళి పోతుందని నేను నిద్రాహారాలు మానేస్తే మా నాన్న ఆ ప్రవేశ పరీక్ష సంచాలకుని కాళ్ళవేళ్ళ పడటం నాకు ఇప్పటికీ గుర్తు. అలా నేను కూడా ప్రవేశ పరీక్ష అర్హత సంపాదించు కున్నా.
అలా మేమిద్దరం ఎగిరి వెళ్లి వాళ్ళ అన్న, మా అక్క, మా పెద్దమ్మ మనవడు, మా పెద్దమ్మ మనవరాలు చదివే ఆరవ తరగతిలో పడ్డాము. అలా నా చదువులు నా బంధువర్గం పిల్లకాయలు మధ్యలో జరగటం ఒక తీపి అనుభవం. అలా ఎంత మంది పిల్లకాయలున్న, స్కూల్ కి వెళ్ళటం రావటం లో మేము ఎవరికోసం ఎదురు చూసే వాళ్ళం కాదు, మా ఇద్దరి పాటికి మేమె, మాకెవరితో పనిలేదు. మా స్నేహం నేను ఎనిమదవ తరగతి చదువుల కోసం నెల్లూరు కి వచ్చేయటం తో విరామం లో పడింది. కానీ సెలవలు వస్తే మా ఉప్పలపాటిలో తేలాల్సిందే. మా నెల్లూరి విషయాలు చిలవలు పలవలు గా చెప్పాల్సిందే.
అలా వుండే స్నేహం మరియు మా అమ్మల స్నేహం, నా స్నేహితురాలి పెద్దమ్మ కొడుకు మరియు మా మేనమామ కొడుకు ఐన వాళ్ళ బాడుగ అన్న నిర్వాకంతో తలకిందలయ్యింది. మా మేనమామ మేము పుట్టక ముందే చనిపోయారు. వాళ్లకు రావాల్సిన ఆస్తులు, పొలాలు అన్నీ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మా తాత మా అమ్మకి, పెద్దమ్మ లకి వాళ్ళ వాళ్ళ పెళ్లిళ్లలో ఏవైతే వాగ్దానం చేశారో ఆ ప్రకారం పంచేసేరు చాల స్పష్టం గా. ఇది జరిగిన చాలా సంవత్సరాలకి అంటే నేను సీనియర్ ఇంటర్ లో ఉండగా మా మేనమామ కొడుకు తన మేనమామల సహాయంతో మాకూ మా పెద్దమ్మలకి ఇచ్చిన పొలాలని మళ్ల కొట్టి మమ్మల్ని పొలాల్లోకి రాకుండా అడ్డు కున్నాడు అవన్నీ వాళ్ళ నాన్నవే అని. అవి పరిష్కరించుకోవడానికి మాకు చాలా సమయము, డబ్బులు, మనఃశాంతి ఖర్చు అయ్యాయి. అలా మా రెండు కుటుంబాలు వేరయ్యాయి.
మేము దాదాపు ఇరవై ఏళ్ల వరకూ ఒకరి ముఖాలు ఒకరం చూసుకోలేదు. ఈ మధ్య నాలుగైదు ఏళ్లలో కోపావేశాలు చల్లారి ఒకరినొకరం పలకరించుకుంటున్నాము. చాలా ఏళ్ల తర్వాత వాళ్ళ అమ్మ గారిని కలిసాను. ఆవిడ నన్ను దగ్గరకు తీసుకొని, "నీకు తెలీదురా! మీ అమ్మకి జ్వరం వచ్చినప్పుడో, లేక మీ అమ్మ ఎప్పుడన్నా నిన్ను నా దగ్గర వదిలి నెల్లూరు కి వెళ్ళినప్పుడో నా దగ్గరే పాలుతాగే వాడివి, దానికి ఒక్క చుక్క కూడా మిగిల్చేవాడివి కాదు. నువ్వు నా బిడ్డవురా" అంటూ ఏడ్చేసిందావిడ. మాట్లాడుతూ ఆవిడ ఓ ఎర్ర రాళ్ళ గాజు తెచ్చి నా చేతిలో పెట్టి చెప్పింది, అచ్చు ఇలాటి గాజు మీ అమ్మ దగ్గరే ఒకటి వుండాలిరా, ఇది మీ అమ్మదో లేక నాడో ఇప్పటికీ తెలీదురా, ఎందుకంటే అవి ఎప్పుడో కలిసిపోయాయి. ఇప్పుడు చెప్పటం కష్టం అని నిట్టూర్చింది. ఆవిడకి నేను చెప్పలేదు, ఆ గాజు మా అమ్మ తన కోడలికి ఇచ్చిందని, ఆవిడ అది పాత మోడల్ గా ఉందని దాన్ని కరిగించేసి కొత్త గాజులు చేయించుకున్నదని
మన పిచ్చి రాముడు గారు రాసిన, 'అమ్మ గురించి' చదవగానే, ఆయన్ని ఆయన ఒక అమాయకుడి గా చిత్రీకరించు కొని, వాళ్ళ అమ్మ గారు "నా పిచ్చి తండ్రి" అని ఎలా పిలుచుకునేదో, ఎలా కాపాడుకొని కడుపులో దాచుకొనేదో అని రాసిన విధానం నా మనస్సుకు చాలా హత్తుకున్నది.
అలాగే ఉమ్మడి కుటుంబం లో పెరిగిన నాకు నా పిన్నమ్మతో అనుబంధం చాలా ఎక్కువ. ఎంత అంటే ఆవిడ జ్ఞాపకాలు అన్నిటా గుది గ్రుచ్చి, "మన జీవితాల్లో కథ నాయికా నాయకులు" అని ముచ్చటలు చెప్పుకునేంత.
నాకు ఆయన రాసిన "పిన్ని అనే వరలక్ష్మి గారు" గురించి ఆవిడ కథానాయకుడికి ఏవిధంగా పిన్ని వరస అవుతారో అని ఆవిడ వ్యక్తిత్వం దెబ్బ తినకుండా సున్నితం గా చెప్పిన విధానం ఇంకా నచ్చింది.
అందుకే ఆ కథని, మా హర్షాతిథ్యం లో మా ద్వితీయ కథలాగా పరిచయం చేయాలని ఆయన అనుమతితో ప్రయత్నించాము. ఈ ప్రయత్నం లో కొత్త తనము ఆ కథని శ్రవణ రూపం లో తీసుకొని రావటం. బహుశా మా ఈ ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము.
ఈ ప్రయత్నం వెనక మా స్వార్థం కూడా వుందండోయి, మంచి కథలకు మా హర్షాతిథ్యం ఒక వేదిక కావాలని.
ఆ రోజు, ఒంగోల్లో ఏదో పెళ్లి ఉందని, వారం రోజులు కని, మా ఆవిడ బయలు దేరుతూంటే, ఆవిణ్ణి, రైలు ఎక్కించి, ట్రంకు రోడ్డుకొచ్చాను.
మా రోజు వారీ సమావేశానికి నేను ఓ అరగంట లేటు.
అప్పటికే, మా వాళ్ళు, విశ్వనాధం, సుబ్బారాయుడు, వెంకటరామన్ సర్, ట్రంకు రోడ్డు, సదాశివ మెడికల్ హాల్ మెట్ల మీద, చేరి పోయి వున్నారు.
మా విశ్వనాధం ఎదో విషయం సీరియస్ గా చెపుతూంటే, వెంకట రామన్ గారు, సుబ్బారాయుడు ఆసక్తిగా వింటున్నారు.
నేను రావడం చూసి మా విశ్వనాథం సడన్ గా మాట్లాడ్డం ఆపేసాడు.
"ఏవయ్యింది" అడిగాన్నేను విశ్వనాధాన్ని.
సమాధానం లేదు మనిషి దగ్గర్నుంచి.
సుబ్బారాయుడి, వైపు చూసాడు విశ్వనాధం .
సుబ్బారాయుడు అన్నాడు, " ఏం లేదు గురూ, ఇప్పుడు విశ్వనాథం, జాతకాలు చూడ్డం నేర్చుకున్నాట్ట. దాని మీద ఒక చిన్న ఇంటరెస్టింగ్ డిస్కషన్."
"జాతకాలు నమ్మొచ్చేమో అన్న అనుమానం వుంది గానీ, జాతకం చెప్పే వాళ్ళను చూస్తే, అంత తొందరగా నమ్మాలనిపించదు నాకు, అన్నాను నేను, విశ్వనాధాన్ని చూస్తూ.
ఇంతలో వెంకటరామన్ గారు అందుకొని అన్నారు, "సుందరబాబు రాంగానే, చెప్పాలని, తహతహ లాడిపొయ్యావు గదా. చెప్పెయ్యరాదా !" అని విశ్వనాథం తో.
ఇంక లాభం లేదనుకున్నట్టున్నాడు, విశ్వనాధం చెప్పడం మొదలు పెట్టాడు.
" మొన్న మీ జాతకం వేసి స్టడీ చేసా సార్. దాని ప్రకారం, కొద్ది రోజుల్లో, ఎదో గొడవలో, మీరు కొంత సమయం జైలు లో ఉండాల్సి వస్తుందని, అనిపిస్తోంది. కాబట్టి, మీరు కొంచెం జాగర్తగా ఉంటే మంచిది ."
ఎటూ మీరు తేలిగ్గా తీసేస్తారు అని తెలుసు గాబట్టి, చెప్పినా ప్రయోజనం లేదని నేను, ఇలాంటి విషయాలు, అనిపిస్తే , చెప్పకుండా ఉండగూడదని, సుబ్బారాయుడు, తర్జన భర్జనలు పడుతున్నాం అరగంట నించి "
విశ్వనాథం చెప్పిందంతా విని, అడిగాన్నేను, "నువ్వు, ఇట్లా జాతకాలు చూడ్డం అని మొదలు పెట్టి ఎన్ని రోజులయ్యింది ?"
"నేర్చుకోడం ఓ సంవత్సరం నించి, ప్రెడిక్షన్స్ మొదలు పెట్టి, ఓ నెల రోజులయింది, మా మేన మావ ఒకాయన బాగా చెప్తాడు. ఆయన దగ్గర నేర్చుకుంటున్నా " అన్నాడు విశ్వనాథం.
కంటిన్యూ చేస్తూ చెప్పాడు,
"మొన్న మా పక్కింటాయన, ఎప్పుడో చిన్నప్పుడు, జరిగినవన్నీ కూడా, చాల కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేసాను" అని
"జరిగినవి, చెప్తే, ప్రెడిక్షన్, అనగూడదేమో, ప్రిపరేషన్ అనాలేమో " అన్నా , నేను అతని మొహంలోకి ఓరగా చూస్తూ.
సుబ్బారాయుడు గూడ ఒక కొంటె నవ్వుతో, విశ్వనాధం ఏవంటాడా అని, అతని వైపు చూసాడు.
మా వెంకట రామన్ గారు, ఇవన్నీ పట్టించుకోకుండా, మా సాయి కేఫ్, ప్రసాద్ పంపించే టీ కోసం రోడ్డు అవతలి వైపు చూస్తున్నారు.
విశ్వనాధం మొహం ఎర్రబడింది, "ఏమోనండి, నాకూ ఆయనకీ పరిచయం అయ్యి వారం రోజులు కూడా కాలేదు. ఆయన చిన్నతనం లో జరిగిన సంఘటనలు నాకు తెలిసే అవకాశం లేదు" అన్నాడతను
పక్క రోజు మధ్యాహ్నం, దర్గామిట్ట లో ఎదో పని చూసుకొని, ఇంటి కొచ్చా. ఇంటి తాళం తీసి లోపలికెళ్తుంటే, మా ఎదురింటాయన ఆదుర్దాగా వచ్చి, "సుందరబాబు గారూ, ఓ గంట క్రితం మీ గురించి ఒక పోలీసు వచ్చాడండి, కలుద్దామని" , అన్నాడు.
"దేని గురించిట ?' అడిగాన్నేను.
"విషయం అడిగినా , ఏం చెప్పలేదండి, మీ ఫోన్ నెంబర్ తీస్కొని వెళ్ళాడు. పేరు విష్ణు అని చెప్పి వెళ్ళాడు. వన్ టౌన్ స్టేషన్ నించి వచ్చాడట ." అన్నాడాయన .
"వెళ్లి కలుస్తాలెండి. సాయంకా
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
ఈ మధ్య ఒక కథ చదివా, అది అచ్చు నా కథే, నా కథే కాదు మీ అందరి కథే. ఆ కథ ప్రేరణతోనే ఈ కథ చెబుతున్నా. నేను మరియు ఉషా, ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకూ క్లాస్ మేట్స్. బాగా తెల్లగా, చలాగ్గా అచ్చు మన హీరోయిన్ జయప్రదకు నకలుగా ఉంటుంది ఉష. స్కూల్ మరియు ట్యూషన్ లో పక్క పక్కనే కూర్చోవాల్సిందే. హోమ్ వర్క్ సబ్మిట్ చేసినా ఆ పిల్ల పలక మీద మన పలక లేక ఆ పిల్ల నోట్స్ మీద మన నోట్స్ ఉండాల్సిందే, పక్క వాళ్ళవి తోసేసి అయినా. స్కూల్ నుండి రావటం, స్నానం చేయటం, తెల్లగా పౌడర్ కొట్టడం, మా అక్కని మా అమ్మని ఒకటే ఊదరకొట్టటం నేను ఉష అంత తెల్లగా ఉన్నానా అని. మా అన్నలకి అక్కలకి ఒకటే నవ్వు నా ఉష పిచ్చికి. వచ్చిన బంధువులకి కూడా చెప్తారు, మా వాడికి ఒక ఫ్రెండ్ ఉంది, ఆ పిల్ల పేరు ఉష, ఆ పిల్ల కోసమే ఇప్పుడు వీడు టిన్నుల టిన్నులూ పౌడర్ ఖాళీ చేస్తాడు, అది వీడికంటే సంవత్సరం పెద్దది అని. అలా సాగి పోయింది నా ఉషాయణం.
ఆ తర్వాత నేను తంతే నెల్లూరులో గుంటబడి ఆ పిల్లేమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ల ఊరిలో. ఆ తర్వాత ఉషాని చూడనే లేదు. కానీ ఆ రూపం అలాగే నిలిచి పోయింది నా మదిలో. ఆఖరుకు పెళ్ళయాక కూడా సుప్రియతో మా ఉష అలాగా మా ఉష ఇలాగ అని ఒకటే ఊదరకొట్టేవాడిని. మా ఆవిడక్కూడా కోరిక అమాంతంగా పెరిగి పోయింది, ఆ ఉషా ఎలా ఉంటుందో చూద్దామని. మా అక్కలు, సుప్రియ మాంచి దోస్తులు. ఆఖరికి వాళ్ళందరూ నా చిన్నప్పటి లవ్ స్టోరీ ని చెప్పుకోవటం పడి పడి నవ్వటం, వాడి మొహంలే అని. ఐదేళ్ల క్రితం అనుకుంటా అందరం మా ఊరోళ్ళ పెళ్ళికి వెళ్ళాము, నేను మా అన్నలు, అక్కలు, సుప్రియ అందరం కలిసి. కొంచెం సేపటికి మా అక్కలు ముగ్గురు కట్టకలిసి వచ్చారు. ఒరే మాతో రా మేము నీకు ఒక్కర్ని చూపాలి అని. నువ్వూరా, సుప్రియా అంటూ తననీ లాక్కొచ్చారు. వాళ్ళ మొహంలో ఎదో అల్లరి నవ్వు. కానీ అది ఏంటో నేను పసికట్టలా. అందరం వెళ్ళాము.
అక్కడ గుమ్మడికాయలా ఒక ఆవిడ, మా వాళ్ళు ఇదిగో వీడే మీ కిరణు (మా వూళ్ళో నా పేరు కిరణ్ లే ఐదో క్లాస్ దాకా). ఆవిడేమో కిరణు, కిరణు అంటూ మాట్లాడేస్తూ వుంది. అయోమయంగానే మా బేబీ అక్కనడిగా, ఎవరే ఆవిడా అని. ఆవిడా ఏంట్రా మన ఉషారా అని, సుప్రియా వైపు చూసిఒక్క కిసుక్కు మంటూ నవ్వు నవ్వింది మా అక్క. మా ఆవిడకి నా మొహం చూసి ఒకటే వేళాకోళం. అంతే ఒక్క దెబ్బకి అక్కడ నుండి పారిపోయి నా సీట్ లో పడ్డా. అస్సలకి ఆ రూపం ఎక్కడా, ఇప్పుడు ఎక్కడా. సన్నగా మంట మెదలయ్యింది గుండెల్లో. అస్సలు చూడకుండా వున్నా బాగుండు, ఆ చిన్నప్పటి ఉష రూపమే మనస్సులో ఉండిపోయేది కదా అని. సో ఫ్రెండ్స్ ! ప్రతి వాళ్ళకి ఇష్టమైన స్టోరీస్ ఉంటాయి. అవి మనస్సులో వరకే ఉండాలి. అప్పటి వాళ్ళని కలుసు కొని, ఎలా వుంటారో చూద్దామనుకుంటే కొన్ని సార్లు నిరాశ తప్పదు. మార్పు తప్పదు, మనమూ మారలా?
నేను ఆ రోజు బడి నుండి వచ్చేసరికి ముసునూరి నుండి మా సీన మామ వచ్చున్నాడు. ఈ సీన మామ వస్తే ఆయన వెంట పడి వూరు మీద లేక పోతే గుంజి పళ్లకోసమో లేక టేకు పళ్ళ కోసమో మా ఊరి హై వే కి ఆనుకొని వున్న చిట్టడవుల వెంట పడి బలాదూర్ తిరగటం నాకు చాలా ఇష్టం.
అలా వూరి మీద పడి తిరిగే మా సీన మామని కనపడ్డోళ్లంతా ఆపి, అబ్బయ్య నువ్వు మా బాబయ్య కొడుకువి కదా, ఎప్పుడొచ్చినావు అంటూ తెగ పలకరిచ్చే వాళ్ళు. ఊర్లో పడి తిరిగే నాకు యింత గుర్తింపు ఎప్పుడొస్తాడబ్బా అని నాకు భలే దిగులేసి పోతావుండేది. కానీ ఈ సీన మామని బాబ మామ కొడుగ్గానే పలకరిస్తా ఉంటే, అబ్బో యీ గొప్ప యీయనది కాదులే వాళ్ళ నాన్నదిలే అని సర్ది చెప్పుకొని, మా బాబ మామ ముసునూరులో ఎదో గొప్ప పని చేస్తా ఉంటాడు అందుకే ఆయన ఫాలోయింగ్ ఈ ఊరి దాకా పాకిపోతా వుంది అనుకొనే వాడిని.
అలా ఆయనంటే పెద్ద హీరో వర్షిప్ వున్న నాకు అప్పటిలోనే హతాశుడనయ్యె వార్త. మా పెద్ద వాళ్ళు పెద్దగానూ, మా ఊర్లో వాళ్ళు గుస గుస గాను చెప్పుకుంటుండంగా తెలిసిందేమిటంటే మా బాబ మామ తన మస్తానమ్మని , పిల్లకాయల్ని వదిలేసి స్వాములోళ్ళ వెంట పడి ఎక్కడికో వెళ్లి పోయాడని. అయితే మా బాబ మామ హీరో కాదా, జనాలెందుకు మా సీన మామని చూసి మా బాబయ్య కొడుకువా అని తెగ పలకరిచ్చే వాళ్ళు అని మా అమ్మ నడిగా, ఆవిడ నవ్వి చెప్పింది, పల్లెటూరోళ్ల పలకరింపులు అంతేరా, దానికి నువ్వో లేక మీ అబ్బో హీరోలు కానక్కర్లా అని.
పాపం ఆ మస్తానక్క కి ఎన్ని కష్టాలో అని నిట్టూర్చేనోళ్లే ఎక్కువ,, సాయం చేసేటోళ్ళకన్నా.
ఆవిడ కి మా సీన మామ కాక ఇద్దరు ఆడ పిల్లలు, మా బాబ మామ మాయం చేయకుండా మిగిల్చిన రెండెకరాల తోట ఉండేది.
చదువాపేశాడు మా సీన మామ. ఆ తోటలో వేసిన తమల పాకులు, అరిటాకులు, నాలుగు గేదెల పాలు కావలికి వేయటం మొదలు పెట్టాడు. ఆయన తోట లో వేసినవే కాకుండా ఆ ఊరి తోటల్లోవి కూడా టోకున కొని అంగళ్ళకి, హోటళ్ల కి వేయటం మొదలెట్టాడు. నాలుగు డబ్బులు వెనశాడు, ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లిళ్లు చేసేసాడు. యిదంతా సినిమాలో చూపినట్టు ఓ మాంటేజ్ సాంగ్ అయ్యోలోపల జరిగిపోలా. కాలం కూడా దానికి దగ్గ కాలం తీసుకున్నది. ఇప్పుడు నాకు మా సీన మామ అసలు సిసలు హీరో.
ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇంతలో మా ముసునూరు కావలి లో కలిసిపోవడం తో ఆయనకున్న రెండెకరాలు, ఆయన కూడ బెట్టుకొని కొనుక్కున్న చుట్టు పక్కల వూర్ల పొలాలు బంగారమయ్యాయి. మా సీన మామ దశ మరియు దిశ లు మారి పోయినాయి. పిల్లకాయలు చదువులు కావలిలో, ఎక్కడికన్నా రావడానికి పోవడానికి ఒక కారు, మంచి యిల్లు కూడా కట్టుకున్నాడు ముసునూరు లోనే.
అబ్బా ఇక మా సీన మామ కు తిరుగు లేదు, ఎదురు లేదు అని నే సంబర పడిపోయా. ఆ సంబరం ఆయన కూడా కాస్త ఎక్కువే పడినట్టున్నాడు.
కాస్త సరదా పడదామని కాస్త పేకాట, ఆ పేకాట ఆడేటప్పుడు బోర్ కొట్టకుండా కాస్త మందు మొదలెట్టాడు. మా సీన మామ మొదట నుండి మొదలెట్టాక అంతు చూసే అలవాటు ఉందిగా, ఆ మందు అంతు చూసే పనిలో పడిపోయాడు, ప్రతీ రోజు. ఎంత పురోగమనం లో వెళ్ళాడో అంతకు రెట్టింపు తిరోగమనం మొదలయ్యింది. పులి మీద పుట్రలా ఈ ఆస్తి నాదంటూ మా బాబ మామ కూడా దిగి పోయాడు, తిరిగి తిరిగి వయస్సయ్యిపోయింది గా ఇల్లు గుర్తుకొచ్చిందాయనకు.
ఇక రామ రావణ యుద్ధమే ఇంట్లో ప్రతిరోజు; గొడవలు మధ్యస్థాలు మూడు పూవులు ఆరుకాయలుగా. ఈ గొడవల మధ్య మనఃశాంతి కరువయ్యి ఆ మస్తానక్క,, ఆవిడ పోయిన కొంత కాలానికి మా బాబ మామ ఇద్దరూ , పొయ్యారు. .చివరకు మేము విన్నది ఏమిటంటే ఓ రోజు మా సీన మామకి కావాల్సిన మందు తెచ్చి పెట్టి భార్య మరియు ఇద్దరు కూతుర్లు ఆయన ఆ మత్తులో ఉండగానే ఆస్తి కాగితాల మీద సంతకాలో లేక వేలి ముద్రలో తీసు కొని వెళ్లిపోయారని.
మా సీన మామ మరలా ముసునూరు లో ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడకే వచ్చాడు.
ఎదగటం కష్టం రా అబ్బయ్య, ఎదిగాక అక్కడే నిలబడటం ఇంకా కష్టం రా అబ్బయ్య అని పలవరించు కుంటూ.
దీనికి కొసమెరుపు ఏందంటే, ఈ కథంతా చెప్పి మా సుప్రియాను అడిగా, అయన భార్య పిల్లలు చేసింది తప్పు గదా అని. "తప్పేమి తప్పు, తమరి బొంద , అసలు గవర్నమెంటు వాళ్ళే ఒక చట్టం తీసుక రావాలి, ఇట్టా మొగుడు తాగి తందనాలాడితే,
ఆస్తి అంతా వూడబెరికి, పెళ్ళాం పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యేటేటట్టుగా " అంది మా సుప్రియ.
నవ భారత నారీ జయహో.
నాకు ఐదేళ్ల వయస్సులో మా ఉలవపాళ్ళలో, మామిడేళ్ల కిష్ట, అక్కిశెట్టి శేషగిరి మరియు మా వూరి పూజారి కొడుకైన స్వామి అనే ముగ్గురు స్నేహితులు వుండేవాళ్ళు. మా ఆటలు, పాటలు మరియు తిరుగుళ్ళు అన్నీ కలిసే ఉండేవి. వీటిల్తో పాటు మాకు ఇంకో ముఖ్యమైన రోజువారీ, లేక రోజుకు పలుమార్లు వుండే కార్యక్రమం ఉండేది. అదేమిటంటే తిన్నది అరిగాక, వూరికి వెనకాల వుండే చెరువు దగ్గరకో, లేక వూరికి ముందు వుండే వాగు దగ్గరకో వెళ్లి అరగక మిగిలినదాన్ని దించుకొని రావటం.
మా నలుగురి మధ్య వుండే ఒప్పందమేమిటంటే, మాలో ఎవరికీ ఆ అవసరముంటే, మిగతా ముగ్గురుకి అవసరమున్న లేకున్నా చచ్చినట్టు తోడు రావాల్సిందే. అలా అవసరం లేకుండా తోడుగా వచ్చినప్పుడు, ఆ కూర్చొనుండే వాడిని, అయ్యిందా లేదా, లేక ఇంకా ఎంత సేపురా అంటూ విసిగిస్తూ, మధ్య మధ్యలో, మా వూరి రాజకీయాల గురుంచో లేక మా వూరి సమస్యలకి పరిషారాలేమున్నాయబ్బా అనే చర్చలతో కాలక్షేపం చేసే వాళ్ళము. నాకైతే ఎక్కువగా మా వాగువైపుకి వెళ్ళటమే ఇష్టం ఈ కార్యక్రమానికి, ఎందుకంటే అక్కడ ఎక్కువగా పిచ్చి తులసి మొక్కలు పెరిగేవి, వాటి వాసనల మధ్య మా సువాసనలు మర్చిపోవొచ్చు, ఎంతైనా మనం నీటు గాళ్ళమే మొదటనుండి. అబ్బా! స్నేహితుల మధ్య ఎన్నో మంచి జ్ఞాపకాలుంటే, ఈ హర్షా గాడేందిరా నాయనా, ఎంత సేపు ఇలాటి విషయాలే రాస్తాడు అని తిట్టుకుంటున్నారా, మంచి వాటికందరూ వస్తారు, ఇటువంటి వాటికి తోడు వచ్చేవారే అసలు స్నేహితులు అని చెప్పటం నా ఉద్దేశ్యం.
మా యీ ఒప్పందం చాలా సౌలభ్యం గా ఉండేది మా ముగ్గురుకీ, ఒక్క స్వామి గాడితో తప్ప. ఎందుకంటే వాళ్ళ నాన్న గారు, మా వూరి మూడు గుళ్ళల్లో ఒక్కటైన మాలక్ష్మమ్మ గుడిని, ఆ వయస్సులోనే వాడికి రాసిచ్చేశారు, మిగతా రెండు గుళ్ళని, ఒకటి ఆయనకోసం మరియు ఇంకొకటి ఇంకా చేతికి అందిరాని స్వామీ గాడి తమ్ముడికోసం అట్టిపెట్టుకొని. ఈ మూడు గుళ్ళకి పూజ, పునస్కారాలు చూసుకుంటూనే ఆయన మా వూరికి దగ్గరలోని, చెక్ పోస్ట్ లో కూడా పని చేసేవారు. మా స్వామి సాయంత్రాలపూట మాలక్ష్మమ్మ గుడి తెరిచి, వాడి నోటికి తిరిగిన మంత్రాలు చదువుతూ దీపారాధన చేసి, వచ్చినోళ్లకు పెట్టీ పెట్టనట్టుగా కాస్త చక్కెర వాళ్ళ చేతులకు రాసి, కొంత సేపయ్యాక గుడి మూసి వచ్చేవాడు. ఇవే కాక మళ్ళీ మిగతా గుడులలో వాళ్ళ నాన్న దగ్గర అప్పుడప్పుడూ అప్రెంటిస్ గా కూడా పనిచేసేవాడు. ఈ కార్యక్రమాలతో తీరిక లేకా మాకు చాలా సార్లు అందుబాటులో ఉండేవాడు కాదు వాడు. మాకు వాడి మీద ఈ విషయం లోనే ఫిర్యాదు.
మా పల్లెల్లో రెండు మూడు కుటుంబాలకు కలిపి ఉమ్మడి బావులుండేవి. ఈ కుటుంబాల చావిడీలు మధ్య వుండే గోడలు, ఈ బావుల దగ్గర మాత్రమే ఓపెన్ గా ఉండేవి. అటుపక్కనుండి ఆవల కుటుంబాలు, ఇటుపక్కనుండి ఈవల కుటుంబాలు, కావలసిన నీళ్లను తోడుకొనే వారు. ఒక్కోసారి ఆవల కుటుంబాలకి సన్నిహితమైన మరికొన్ని కుటుంబాలు, ఈవల కుటుంబాలకి సన్నిహితమైన కొని కుటుంబాలు కలిపి ఇటువంటి బావులని వాడుకొనే వారు. అలాగే ఒక వీధిలోంచి ఇంకో వీధిలోకి, వెళ్ళటం ప్రమాదకరమైనా, దగ్గరి దారి అవటం తో ఈ బావులని దాటి వెళ్లే వారు కొందరు. అలా మా స్వామీ గాడికి, వాళ్ళ చావిడీలో వుండే బావిని దాటి వెళ్ళటం, మాలక్ష్మమ్మ గుడికి చాలా దగ్గర దారి అవటం తో వాడు వాళ్ళ అమ్మగారు గమనించనప్పుడల్లా, బావిని దాటి వెళ్ళేవాడు.
ఒకరోజు సాయంత్రం అలా వాడు దీపం పెట్టాలని, బావి దాటుతూ, కాలు జారి ఆ బావిలో పడిపోయాడు. బావి కూడా సగం నీళ్లతో అయినా లోతుగానే వుంది. పడ్డవాడు సాయం కోసం అరుస్తూనే వున్నాడు. చాలా సేపటికి వాడి అరుపులు విని అక్కడ జనం పోగయ్యారు. వెంటనే ఈత వచ్చిన వాళ్ళు బావిలో దిగి వాడికి తాడు కట్టి బయటకి లాగారు. బయటకొచ్చిన వాళ్ళు ఆశ్చర్యంగా అడిగారు వాడిని, అలా ఎలా ఒక ఈత వచ్చిన వాడిలా, బావి మధ్యలో చేతులాడిస్తూ తేలి వున్నావురా నువ్వు అని. దానికి మావాడు, నన్ను మాలక్షవ్వ కిందనుండి పైకి నెడుతూనే వుంది నేను బావిలో పడ్డప్పటి నుండి అని చెప్పాడు.
అదే మాలక్షవ్వ అప్పటికి కొన్ని నెలల క్రితం, మా వెంటపడి చెరువుకి వచ్చి, మేము మా ఆటల్లో పడి, తనని గమనించుకోక పోవటం వలన, చనిపోయిన మా లక్ష్మిని ఎందుకు పైకి నెట్టలేదో.
హర్షణీయం మొదలు పెట్టి 3 మాసాలు అయ్యింది. ఈ కొద్దికాలంలోనే ఐదు వేల మంది పాఠకులు మా బ్లాగ్ ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా 'హర్షాతిధ్యం' అనే కొత్త శీర్షిక మేము మొదలుపెడ్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశ్యం, తెలుగు బ్లాగ్ ప్రపంచంలో వుండే చక్కటి కథల్ని, హర్షణీయం పాఠకులకు ప్రతి నెలా మొదటి వారంలో పరిచయం చెయ్యడం.
ఈ శీర్షికన, మా ప్రథమ అతిధి గా విచ్చేసిన , శ్రీయుతులు బులుసు సుబ్రహ్మణ్యం గారి మా హార్దిక స్వాగతం. ఆయన రాసిన ' వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి' అనే హాస్య రచన తెలుగు బ్లాగ్ ప్రపంచపు అభిమానులకు సుపరిచితం. ఆ రచనతో, మా 'హర్షాతిధ్యం' ను మొదలు పెట్టడం జరుగుతోంది.
పైకి ఒక చక్కటి హాస్య రచన అనిపించినా , కథ లోపలి పొరల్లో, ప్రతి మనిషి తన జీవితంలోని వేర్వేరు దశల్లో, తనకొక ప్రత్యేకమైన గుర్తింపు కోసం పడే సంఘర్షణను దాచివుంచడంలో రచయిత అత్యుత్తమ ప్రతిభ పాటవాలు మనకు దర్శితం అవుతాయి.
రచయిత పరిచయం :
పేరు: డాక్టర్ బులుసు సుబ్రహ్మణ్యం
విద్య : డాక్టరేట్ ఇన్ కెమిస్ట్రీ
స్వస్థలం : భీమవరం , పశ్చిమ గోదావరి జిల్లా , ఆంధ్ర ప్రదేశ్
నివాసం: హైదరాబాద్ , తెలంగాణ.
ఉద్యోగం: Rtd. Sr. సైంటిస్ట్
శైలి : హ్యూమనిజం తో కూడిన హ్యూమరిజం
బ్లాగ్ యుఆర్ఎల్ : https://bulususubrahmanyam.blogspot.com
పుస్తక ప్రచురణ : 'బులుసు సుబ్రహ్మణ్యం కథలు' : https://kinige.com/book/Bulusu+Subrahmanyam+Kathalu
శ్రీ సుబ్రహ్మణ్యం గారు తెలుగు బ్లాగ్ ప్రపంచంలో సుప్రసిద్ధులు. దాదాపు పదేళ్లుగా ఆయన రచనా వ్యాసంగం కొనసాగుతోంది. ఆరోగ్యకరమైన హాస్యాన్ని, దైనందిన జీవితంలో జరిగే సంఘటనల్లోనుంచి, పుట్టించడం లో వీరిది అందెవేసిన చెయ్యి. మా హర్షణీయం లో , 'హర్షాతిధ్యం' శీర్షిక పై వచ్చే మొదటి రచన, వీరిదవ్వడం మాకెంతో హర్షణీయం, గర్వకారణం.
మేము మా బ్లాగ్ లో ఆయన రచనను ప్రచురిస్తామని అడగడమే తరువాయి, వారు మా అభ్యర్ధన ను మన్నించడం జరిగింది. వారి రచనలన్నీ మాకు ప్రియాలైనా, వారు వారి పేరు మీద వేసుకున్న వ్యంగాస్త్రం, 'వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి' అనే రచన మా ఉద్దేశ్యంలో వారి కథా శిల్ప చాతుర్యానికి అత్యుత్తమ ఉదాహరణ.
మరోసారి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ , వారికి సదా ఆ వేంకటేశుని అనుగ్రహ ప్రాప్తి కలగాలని ప్రార్థిస్తున్నాం. ఆయన చేసిన చేస్తున్న, రచనల సమాహారం, ఆయన బ్లాగ్ యుఆర్ఎల్ లో ( https://bulususubrahmanyam.blogspot.com/) పొందుపరచడం జరిగింది. ప్రతి తెలుగు హాస్య ప్రియుడికి, ఆ బ్లాగ్ సందర్శన ఒక గొప్ప అనుభూతి మిగులుస్తుందనడం లో సందేహం లేదు.
నాకు మా నెల్లూరులోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి లోనే దొరికిన మరో స్నేహ సుమనుడు లక్ష్మిపతి రాజు. సూటిగా సుత్తిలేకుండా మాటలాడటం వీడి నైజం. అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని ఆశించి భంగపడతాడు. అలా భంగపడినప్పుడు ఒక అపరిచితుడిలా వీడికి తెలియకుండానే గోదావరి జిల్లా వెటకారపు రాజు బయటకొచ్చేస్తాడు వీడి నుండి. అందుకే వీడు మా బడి యొక్క యాంగ్రీ బాయ్.
మా బడికి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో వుండే నవాబ్ పేట నుండి సైకిల్ తొక్కు కుంటూ వచ్చే అలసట వలన కలిగే చిరాకుతో కోపమే లక్షణంగా వుండే వాడు. కానీ వాడి మనసు వెన్న. మల్లిగాడు, రమణగాడుల రాజకీయ చదరంగంలో దొర్లుడు పుచ్చకాయనయ్యే నాకు పతీ స్నేహం ఒక ఒయాసిస్సు మరియు రక్షణ. వీడు అంత దూరంలో వుండే బడిలోనే చేరటం ఎందుకు అనేగా మీ ప్రశ్న, దానికి ఒకటో కారణం వాళ్ళ నాన్నగారు మా బడికి పక్కనే వున్న పాత పెద్ద ఆసుపత్రిలో సంచాలకుడి గా పని చేసేవారు, రెండో కారణం మా బడి యొక్క ప్రాశస్త్యం. వీడు మా లంచ్ బ్రేక్ లో వాళ్ళ నాన్న గారి దగ్గరకు వెళ్లే వాడు భోజనానికి.
నోట్స్ మర్చిపోయాయనురా పతీ! సైకిల్ ఇవ్వు అంటే పంక్చర్ చేయను అనే కండిషన్ మీద సైకిల్ నాకు మాత్రమే ఇచ్చేవాడు, ఇంకెవ్వరు అరిచి గగ్గోలు పెట్టిన మన వాడి సమాధానం నో వే అనే. ఇక మా రమణ ఎల్.ఏ పీరియడ్ లో అసాధారణ దంచుడుకి నేను పతి వెనక వరసలో కూర్చొని తెగ ఎంజాయ్ చేసే వాళ్ళము. మన ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గారున్నారు చూడండి అని రమణ మా కళ్ళముందర ఆవిడని ఆవిష్కరించడానికి ప్రయత్నము చేయగానే, పెద్ద ఈడు వెళ్లి చూసొచ్చాడురా అని పతీ గాడి కామెంట్స్ కి నాకు నవ్వు ఆగేది కాదు. ఏ మాటకామాట ఉపన్యాసాలు మా రమణుడు దంచేసే వాడు
మా టీచర్ బొద్దింకల్లో శ్వాసకోశాలు వుండవు, వాటికి బదులు మాల్ఫీజియన్ నాళాలు వుండును అని చెబుతుంటే, పక్క పక్కన నేల మీద కూర్చున్న నేను మా పతీ, బొద్దింకల్లో మాల్ఫీజియన్ మా సైన్స్ టీచర్ మెజీషియన్ లాటి మీమ్స్ వేసుకొని మా ఇద్దరికే సాధ్యమైన వెధవ నవ్వులు నవ్వుకొని వాళ్ళం. నిజంగానే మా సైన్స్ టీచర్ మమ్మల్ని తన బోధనాపటిమతో మంత్ర ముగ్ధులను కావించెడిది.
ఒక రోజు బాడుగ సైకిల్ తీసుకొని మా సంతపేట నుండి నవాబ్ పేటలో వాళ్ళింటికి వెళ్ళిపోయా. వాడికో ప్రొజెక్టర్ ఉండేది. నాకు ఆ ప్రొజెక్టర్ తో వాడి దగ్గర వుండే రీల్ ప్లే చేసి చూడాలని కోరిక. వాడికి ఆ రీల్స్ సార్ట్ చేయాటానికి ఓపిక లేదు. అయినా బతిమలాడి ఒక రీల్ ని ఓపిగ్గా చుట్టి ప్లే చేసాము. అలా స్క్రీన్ మీద మేము ప్రాజెక్ట్ చేసిన బొమ్మలు లైవ్ లాగ కదులుతుంటే ఆ ఆనందమే వేరు. వాడికి వాళ్ళ ఇంట్లో చాలా మంచి గ్రంధాలయం ఉండటం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. చదవటం అంటే తరగతి పుస్తకాలని కాదు, వాటికి ఆవల మంచి పుస్తకాలను చదివే అభిరుచి మరియు వాళ్ళకోసం ఒక లైబరీ ని ఏర్పాటుచేసిన తలితండ్రులను కలిగిన పతి ధన్యుడు. మార్కులను చూసి స్నేహం చేసే మాలాటి వారికి వాడో కనువిప్పు.
తర్వాత వాళ్ళ అమ్మగారు ప్రేమతో పెట్టిన భోజనం నేను మరవలేనిది. అసలు గోదావరి వాళ్ళ ఆతిథ్యమే వేరబ్బా. మాగాయ గురించి పుస్తకాలలో చదవటమే కానీ రుచి చూసింది ప్రధమంగా అక్కడే. అటుపిమ్మట ఆ భుక్తాయాసాన్ని తీర్చుకోవడానికి అర్జెంటు గా సైకిల్ తొక్కేయాలిని అని నిర్ణయించుకొని, వాళ్ళ నాన్న గారి సలహాతో, మా లీలమహల్ లో బడ్ స్పెన్సర్ మరియు ఇంకో బక్కాయన నటించిన, "హూ ఫైన్డ్స్ ఏ ఫ్రెండ్ ఫైన్డ్స్ ఏ ట్రెషర్" అనే సినిమాకి వెళ్ళాము.
నేను చూసిన మొదటి ఆంగ్ల సినిమా. మా పతీగాడు ఆరోజు ఆ సినిమాలో నాకు అనువాదకుడిగా మారిపోయాడు. చాలా నచ్చింది నాకు ఆ సినిమా. వాడిని ఆ రోజు చాలా దగ్గరగా చూసాక పతి దొరికాడు నాకు ఇక నిధి దొరికింది అనే భావన మరియు నిశ్చింత కలిగింది.
అప్పటి వరకు ఎంతో అద్భుతముగా జరి
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
From the publisher's feed

52 Listeners